బిగ్‌బాస్‌ షోలో 'మహారాజ' నటి ఎంట్రీ? | Bigg Boss Tamil 8: Is Actress Sachana Namidass to Participate in BB Show? | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టనున్న 'మహారాజ' నటి

Sep 18 2024 5:53 PM | Updated on Sep 18 2024 6:11 PM

Bigg Boss Tamil 8: Is Actress Sachana Namidass to Participate in BB Show?

తమిళ బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మొదటినుంచీ ప్రచారం జరుగుతున్నట్లే ఈసారి కమల్‌ హాసన్‌ స్థానంలోకి విజయ్‌ సేతుపతి హోస్ట్‌గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌ టీమ్‌ అధికారికంగా వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో షో ప్రారంభం అవుతుండటంతో ఈసారి హౌస్‌లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి పేర్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఆ జాబితాలో.. విజయ్‌ సేతుపతితో కలిసి మహారాజ మూవీలో యాక్ట్‌ చేసిన సచన నమిదాస్‌ పేరు కూడా ఉంది. ఈ ప్రచారంపై నటి ఇంతవరకు స్పందించలేదు. కాగా మహారాజ చిత్రంతో కెరీర్‌ ప్రారంభించిన సచన.. ప్రస్తుతం 1947 మూవీతో పాటు శివకార్తికేయన్‌ 23వ సినిమాలోనూ యాక్ట్‌ చేస్తోంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement