tamil Bigg Boss
-
టాలీవుడ్ సెన్సేషనల్ నటి రెండో పెళ్లి.. ఎప్పుడంటే?
టాలీవుడ్ నటి పావని రెడ్డి (Pavani Reddy) చాలాకాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది. ఇప్పుడు ఆ ప్రేమను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానోచ్ అంటూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. కొరియోగ్రాఫర్ ఆమిర్‌తో ఏప్రిల్ 20న పెళ్లి జరగనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు స్పెషల్ వీడియో షేర్ చేసింది. అందులో ఒకరికొకరు తోడుంటామని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నారు. ఈ వీడియోకు కలిసి జీవిద్దామని క్యాప్షన్ ఇచ్చింది. తెలుగు, తమిళంలో సినిమాలుకాగా పావని రెడ్డి.. తెలుగులో సీరియల్స్‌తో పాటు డబుల్ ట్రబుల్, డ్రీమ్, గౌరవం, లజ్జ చిత్రాలు చేసింది. తెలుగులో పెద్దగా గుర్తింపు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. అక్కడ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో టాలీవుడ్‌లోనూ యాక్ట్ చేసింది. అలా ప్రేమకు రెయిన్‌చెక్, మళ్లీ మొదలైంది, చారి 111 చిత్రాల్లో మెరిసింది. 2013లో తెలుగు నటుడు ప్రదీప్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సడన్‌గా ఏమైందో ఏమో కానీ 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిగ్‌బాస్ షోలో మొదలైన పరిచయం..భార్య మరొకరితో చనువుగా ఉన్న ఫోటో చూసే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ప్రచారం జరిగింది. ఈ ఘటనతో చాలారోజులపాటు పావని పేరు మీడియాలో మార్మోగిపోయింది. ఈ విషాదం తర్వాత పావని.. నిర్మాత ఆనంద్జాయ్ను పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే అది నిజం కాదని ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు. తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న పావని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఆమిర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసే ఉంటున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా అతడితో రెండో పెళ్లికి సిద్ధమైంది. View this post on Instagram A post shared by Pavni (@pavani9_reddy)చదవండి: నా భార్య చనిపోయేవరకు వీల్‌చైర్‌లోనే.. అదే చివరిమాట.. : చిన్నా -
Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు..
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) ముగిసింది. తమిళంలో ఎనిమిదో సీజన్, హిందీలో పద్దెనిమిదో సీజన్ విజయవంతంగా పూర్తయింది. జనవరి 19న ఈ రెండు భాషల్లో గ్రాండ్ ఫినాలే జరిగింది. తమిళ బిగ్‌బాస్ విషయానికి వస్తే యూట్యూబర్ ముత్తుకుమారన్ (Muthukumaran) విజేతగా నిలిచాడు. ఇతడు రూ.41 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. సౌందర్య ఫస్ట్ రన్నరప్‌గా, వీజే విశాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.హిందీ రియాలిటీ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra) బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచాడు. గ్రాండ్ ఫినాలే స్టేజీపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కరణ్‌ను విజేతగా ప్రకటించాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్‌గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కరణ్ ఇంతకుముందు ఖత్రోన్ కె ఖిలాడీ 14వ సీజన్ విజేతగా అవతరించాడు. ఇతడు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పరి హూన్ మే, బడే అచ్చే లగ్తే హా, సాసురల్ సిమర్ కా, విరుద్ధ్ వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
యోగా ట్రైనర్‌ను పెళ్లాడిన నటి.. ఫోటోలు వైరల్
తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ రమ్య పాండియన్ ప్రియుడిని పెళ్లాడింది. బెంగళూరుకు చెందిన యోగా నిపుణుడు లోవల్ ధావన్‌తో కలిసి ఏడడుగులు వేసింది. ఈ పెళ్లి వేడుకకు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ వేదికగా నిలిచింది. ఈ ప్రేమజంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి చేసుకున్న లొకేషన్ కూడా అదిరిందని కామెంట్లు చేస్తున్నారు.అలా మొదలైందిగతేడాది బెంగళూరులో యోగా శిక్షణ కార్యక్రమంలో రమ్య, లోవల్ ధావన్‌ల మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఈ జంటను పెద్దలు ఆశీర్వదించడంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రులు, సెలబ్రిటీల కోసం చెన్నైలో నవంబర్ 15న రిసెప్షన్ ఏర్పాటు చేశారు.సినిమా నుంచి బుల్లితెరకుకాగా రమ్య పాండియన్.. డమ్మీ టపాసు, జోకర్, రామే ఆండాళుమ్ రావణే ఆండాళుమ్ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. కూకు విత్ కోమలి షోతో పాపులర్ అయింది. ఈ షోలో మొదటి సీజన్లో పాల్గొన్న ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. అలాగే తమిళ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో టాప్ 5లో చోటు దక్కించుకుంది. తర్వాత బిగ్‌బాస్ అల్టిమేట్ షోలో పాల్గొనగా సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది
తమిళ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి అని న్యూస్. గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తోనే ఏడడుగులు వేయనుందని అందరూ అనుకున్నారు. కానీ ఇది నిజం కాదని స్వయంగా ఇప్పుడు ఈమెనే తేల్చేసింది. ఎందుకంటే ఇదంతా తమ కొత్త మూవీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్. దీంతో అందరూ ఫూల్ అయ్యారని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రాకింగ్ రాకేష్, సుజాత దంపతులు)రెండు మూడు రోజుల క్రితం రాబర్ట్‌కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఫొటోని నటి వనితా విజయ్ కుమార్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అక్టోబరు 5వ తేదీని గుర్తుంచుకోండి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అందరూ నాలుగో పెళ్లికి రెడీ అయిందని ఫిక్స్ అయ్యారు. రాబర్ట్‌తో ఈమె రిలేషన్లో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. దీంతో అందరూ పెళ్లి వార్త నిజమే అనుకున్నారు. కానీ ఇదంతా 'మిసెస్ & మిస్టర్' కోసమని ఇప్పుడు బయటపెట్టారు.ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్, రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వనితనే దర్శకత్వం వహించింది. ఈమె కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరించింది. ఇలానే గతంలో తెలుగులో నరేశ్-పవిత్ర కూడా తొలుత పెళ్లి అన్నట్లు హడావుడి చేశారు. తీరా చూస్తే 'మళ్లీ పెళ్లి' సినిమా కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఐడియానే వనిత కాపీ కొట్టేశారా అనిపించింది. కాగా వనిత విజయ్‌కుమార్ తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్, బిగ్‌బాస్ అల్టిమేట్ మొదటి (ఓటీటీ) సీజన్లో పాల్గొంది.(ఇదీ చదవండి: పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ) View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
బిగ్‌బాస్ షోలో ప్రముఖ కమెడియన్?
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో బిగ్‌బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. కొందరిని ఆల్రెడీ ఫైనలైజ్ చేయగా మరికొందరికి ఇంకా ఏ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరోవైపు షోలోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..తాజాగా ఆ జాబితాలో సీనియర్ నటుడు, కమెడియన్ సెంథిల్ పేరు వినిపిస్తోంది. కేవలం తమిళంలోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ ఈయనకు గుర్తింపు ఉంది. ఎక్కువగా పాపులర్ కమెడియన్ గౌండమణితో కలిసి వెండితెరపై నవ్వులు పూయించేవాడు.సెంథిల్ జర్నీ..సెంథిల్ 1970వ దశకంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్నాచితకా పాత్రలే చేసేవాడు. ఎప్పుడైతే కమెడియన్ గౌండమణితో కలిసి నటించడం మొదలుపెట్టాడో అప్పుడు తన దశ తిరిగిపోయింది. వీరి కాంబినేషన్లో వచ్చిన కరగట్టకరన్, మన్నన్, చిన్నతంబి, ఇండియన్.. వంటి ఎన్నో చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. తెలుగులో తొలి ముద్దు, మనీ మనీ మోర్ మనీ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసిన ఈయనను సినీప్రియులు ఎంతగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. అలాంటి ఈయన ఇప్పుడు బిగ్‌బాస్‌కు రాబోతున్నాడని వార్తలు వస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి అతడి ఎంట్రీ నిజమేనా? కాదా? అనేది తెలియాలంటే అక్టోబర్‌లో తమిళ బిగ్‌బాస్ 8 ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ షోలో 'మహారాజ' నటి ఎంట్రీ?
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మొదటినుంచీ ప్రచారం జరుగుతున్నట్లే ఈసారి కమల్ హాసన్ స్థానంలోకి విజయ్ సేతుపతి హోస్ట్‌గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో షో ప్రారంభం అవుతుండటంతో ఈసారి హౌస్‌లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఆ జాబితాలో.. విజయ్ సేతుపతితో కలిసి మహారాజ మూవీలో యాక్ట్ చేసిన సచన నమిదాస్ పేరు కూడా ఉంది. ఈ ప్రచారంపై నటి ఇంతవరకు స్పందించలేదు. కాగా మహారాజ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన సచన.. ప్రస్తుతం 1947 మూవీతో పాటు శివకార్తికేయన్ 23వ సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రియురాలితో సింపుల్‌గా నటుడి ఎంగేజ్మెంట్
తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు ప్రదీప్ ఆంటోని పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రియురాలితో ఏడడుగులు వేయనున్నాడు. ఈ మేరకు ఆదివారం (జూన్ 16న) అతడి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రదీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా ప్రదీప్ ఆంటోని తమిళ బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో పాపులర్ అయ్యాడు. ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అయితే ఆ ధోరణి చాలామందికి నచ్చేది కాదు. తన కుళ్లు జోకులు కూడా బిగ్‌బాస్ హౌస్‌లో కొందరు ఇష్టపడలేదు. అసభ్య జోకులు వేస్తున్నాడని, బూతులు మాట్లాడుతున్నాడని, తన ప్రవర్తన బాగోలేదని మాయ, పూర్ణిమ, జోవిక, నిక్సెన్, కూల్ సురేశ్, శరవణ విక్రమ్, అక్షయ వంటి పలువురు కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ హాసన్ రెడ్ కార్డు చూపించి తనను బయటకు పంపించేశారు. సినిమాల విషయానికి వస్తే దాదా, అరువి, వాళ్ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. Got engaged, yesterday 🙏 #FamilyMan#EnakulaamNadakathuNuNinaichen #ParavaillaPonnuKudukurangaEnnaNambi#90sKidsSaadhanaigal pic.twitter.com/vyg0DuCnaQ— Pradeep Antony (@TheDhaadiBoy) June 17, 2024 చదవండి: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్ -
రెండేళ్లుగా సహజీవనం.. రెండోపెళ్లికి నటి రెడీ..
పావనిరెడ్డి.. చూడగానే క్యూట్‌గా అనిపించే ఈ బ్యూటీ మొదట్లో సీరియల్స్ చేసింది. తర్వాత తెలుగు వెండితెరపై మెరిసింది. ది ఎండ్, డబుల్ ట్రబుల్, డ్రీమ్, లజ్జ అనే చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ కూడా సీరియల్స్‌తోనే తన కెరీర్ మొదలుపెట్టింది. 2013లో తెలుగు నటుడు ప్రదీప్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ బాగానే ఉంటున్నారనుకున్న తరుణంలో 2017లో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భర్త పోవడంతో.. నటి మరొకరితో చనువుగా ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టడంతోనే అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని వార్తలు వెలువడ్డాయి. తర్వాత ఈమె పూర్తిగా చెన్నైలోనే సెటిలైపోయింది. అక్కడ ఆనంద్ జాయ్ అనే నిర్మాతను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ కొన్నాళ్లకే అందులో నిజం లేదని తేలిపోయింది. అనంతరం తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొంది. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ ఆమిర్.. పావనికి ప్రపోజ్ చేశాడు. అప్పటినుంచి వీరి మధ్య లవ్ జర్నీ మొదలైంది. ఇన్నాళ్లకు పెళ్లికి రెడీ.. బీబీ జోడీ రెండో సీజన్లో జంటగా పార్టిసిపేట్ చేయడమే కాక ట్రోఫీ గెలిచారు. రెండేళ్లుగా సహజీవనం కూడా చేస్తున్నారు. ఇన్నాళ్లకు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు. జంటగా ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ చేసిన వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. పావని పుట్టినరోజైన నవంబర్ 9న వివాహం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపోతే పావని ఇటీవలే చారి 111 సినిమాలో నటించింది. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాటర్స్ అనే తెలుగు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. చదవండి: మొదటి భార్యకు విడాకులు.. ఈ తాగుబోతును పదేళ్లు భరించింది -
కమల్ హాసన్ గొప్ప మనసు.. అందరికీ విందు భోజనం!
చాలామంది నటీనటులు వెండితెరే కావాలంటారు. బుల్లితెర తారలు కూడా ఎప్పటికైనా వెండితెర మీద వాలిపోవాలని, అక్కడే సెటిల్ కావాలని తహతహలాడుతుంటారు. కానీ కొందరు మాత్రం వెండితెర, బుల్లితెర రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాంటివారిలో నాగార్జున, కమల్ హాసన్, కిచ్చా సుదీప్, సల్మాన్ ఖాన్.. ఇలా కొందరు స్టార్ హీరోలున్నారు. వీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ షూటింగ్ షెడ్యూల్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సరే బిగ్‌బాస్ రియాలిటీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా బిగ్‌బాస్ షోను నడిపిస్తున్నారు. అలా వీరు బుల్లితెర అభిమానులకూ మరింత దగ్గరయ్యారు. బిగ్‌బాస్ పూర్తి.. కమల్ లంచ్ ట్రీట్ జనవరి 14న తమిళ బిగ్‌బాస్ ఏడో సీజన్‌కు శుభం కార్డు పడింది. ఈ షోలో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన వీజే అర్చన విజేతగా అవతరించింది. ఇకపోతే ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరికీ లంచ్ ఏర్పాటు చేశాడు కమల్. అలాగే బిగ్‌బాస్ టీమ్ మెంబర్స్‌కు సైతం విందు పార్టీ ఇచ్చాడు. సంక్రాంతి పండగపూట అందరికీ రకరకాల వెరైటీలను వడ్డించి కడుపునిండా భోజనం పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు.. ఎంతైనా కమల్ ఆలోచనలే వేరు.. మీరు గ్రేట్ సర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏయే సినిమాలున్నాయ్? సినిమాల విషయానికి వస్తే కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, బాబీ సింహా, వివేక్ సహా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో త్రిష, దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కమల్.. రంగరాజ శక్తివేల్ నాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హెచ్ వినోద్ డైరెక్షన్‌లోనూ ఓ మూవీ చేయనున్నాడు. స్టంట్ డైరెక్టర్ అన్బైరవ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలోనూ కమల్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. చదవండి: గుంటూరు కారం టీమ్‌కు పార్టీ ఇచ్చిన మహేశ్‌బాబు.. -
మరోసారి తెరపైకి నిర్మాత రవీందర్.. ఈసారి ఏకంగా ఆక్సిజన్‌తో!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు. పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఇటీవలే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. అయితే ప్రస్తుతం జైలు నుంచి విడుదలైన రవీందర్ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు. తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై రివ్యూలు ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన యూట్యూబ్‌లో వీడియో చూస్తే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా వీడియోలో ఏకంగా ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకుని మరీ కనిపించారు. అంతే కాకుండా అనారోగ్యంతోనే బిగ్‌బాస్ ఎపిసోడ్‌పై తన రివ్యూ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ మీ పట్టుదల సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్.. బిగ్‌బాస్ రివ్యూలు ఎప్పుడైన ఇవ్వొచ్చు అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే మొహానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వెల్లడించారు. వారం రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకున్నట్లు రవీందర్ పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్స్ ఆరోగ్యం సహకరించనప్పుడు వీడియోలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించిన రవీందర్ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. -
తెలుగు స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం.. ప్రెగ్నెన్సీ టెస్ట్.. ఇంకా..
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. ఈ షోని ఆరాధించే అభిమానులతో పాటు తిట్టిపోసే జనాలు సైతం ఉన్నారు. అయితే ఎంత తిట్టుకున్నా ఆ మ్యూజిక్ రాగానే చాలామంది టీవీలకు అతుక్కుపోయి మరీ బిగ్‌బాస్ చూస్తుంటారు. అదే ఈ షో ప్రత్యేకత! ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీలు ఇంట్లో ఎలా ఉంటారో చూపించాలన్నదే దీని కాన్సెప్ట్. వారికి ఇచ్చే ఛాలెంజ్‌లు, టాస్కులు అదనం.. దీని ద్వారా చూసే జనాలకు కాలక్షేపం.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు కాసుల వర్షం. కానీ షో ముగిసిన తర్వాత నెమ్మదిగా జనాలు వారిని మర్చిపోతుంటారు. అటు కంటెస్టెంట్లు కూడా బోలెడంత నెగెటివిటీతో బయటకు వస్తారు. పైగా ఛాన్సులు, ఫేమ్ అందుకోవడం అందని ద్రాక్షగా మారుతూ ఉంటుంది. టైటిల్ గెలిచామన్న సంతృప్తి తప్ప ఏదో కోల్పోయామన్న లోటు మాత్రం అలాగే ఉండిపోతుంది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడే అంత క్రేజ్! బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్, నాలుగో సీజన్ తర్వాత మళ్లీ ఏడో సీజన్‌కు ఆ స్థాయిలో క్రేజ్ వచ్చింది. కంటెస్టెంట్ల కోసం అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధాలే చేశారు. అంతిమంగా ఈ పోరులో రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. బిగ్‌బాస్ షో అనేది వ్యక్తిత్వ, మానసిక వికాస కేంద్రం అని అప్పట్లో బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ బిందుమాధవి తండ్రి అన్నాడు. అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి, తప్పొప్పులు సరిదిద్దుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదన్నాడు. కానీ ఇక్కడే ప్రశాంత్‌ను తప్పుదారి పట్టించాడు శివాజీ. హౌస్‌లో ప్రశాంత్ తప్పు చేయబోయిన ప్రతిసారి శివాజీ అడ్డుకున్నాడు. అతడిని మాట్లాడనీయకుండా చేశాడు. టైటిల్ విజేత అరెస్ట్ అప్పుడే కనక శివాజీ అడ్డుపడకపోయుంటే ప్రశాంత్ స్వభావం అందరికీ తెలిసేది, తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చి ఉండేది. హౌస్‌లో ఉన్ననాళ్లూ మాస్క్ వేసుకుని నటించాడన్న మాట వచ్చుండేదే కాదు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే (డిసెంబర్ 17) రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఎంత ఉద్రిక్త వాతావరణం నెలకొందో అందరకీ తెలిసిందే! ప్రశాంత్‌ను వెనక గేటు నుంచి వెళ్లిపోమన్నా ముందు నుంచే వెళ్తానన్నాడు. పోనీ, కారు ఆపకుండా వెళ్లిపోమని చెప్పినా లెక్క చేయలేదు. రైతుబిడ్డ అనే సింపతీ వాడాలనుకున్నాడు. పైగా అంతమంది అభిమానులు కనిపించడంతో మళ్లీ అదే స్టూడియో దగ్గరకు వచ్చాడు. దీంతో అక్కడ చెలరేగిన అలజడి అంతా ఇంతా కాదు. చివరకు ఏమైంది? పోలీసుల మాటల్ని బేఖాతరు చేసినందుకు అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. టైటిల్ గెలిచిన ఒక్కరోజులోనే ప్రశాంత్ అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో వల్ల ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ మరోవైపు తమిళంలో రన్ అవుతున్న బిగ్‌బాస్ ఏడో సీజన్ సైతం తరచూ వార్తల్లో ఉంటోంది. ఈ షోలో సీనియర్ హీరోయిన్ విచిత్ర పాల్గొంది. ఓ ఎపిసోడ్లో ఆమె ఇండస్ట్రీని వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. తెలుగులో ఓ స్టార్ హీరో పెట్టిన టార్చర్ వల్లే సినిమాలు వదిలేశానంది. ఆ హీరో తన గదికి రమ్మని పిలిస్తే వెళ్లలేదని.. దీంతో తనను షూటింగ్‌లోనూ చాలా ఇబ్బంది పెట్టారని చెప్పింది. తనను సెట్స్‌లోనూ అసభ్యంగా తాకాడని.. ఆ విషయం చెప్పినందుకు తన చెంపే పగలగొట్టారని వాపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ హీరో బాలకృష్ణయే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. Actor Who Harassed : #Balayya (Balakrishna) Telugu Film Name : Bhalevadivi Basu (2001 Release) Stunt Director : A.Vijay Nadigar Sangam Head Who Refused Action: Radha Ravi #Vichithra #MeToo pic.twitter.com/9rrxagpUwV — Analyst (@BoAnalyst) November 22, 2023 పారిపోయేందుకు యత్నం ఇక ఇదే హస్‌లోని కంటెస్టెంట్ కూల్ సురేశ్ ఓ రోజు బిగ్‌బాస్ ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గోడ ఎక్కి పారిపోవడానికి యత్నించగా అది చూసిన ఓ కంటెస్టెంట్ పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని కిందకు దింపాడు. ఇదిలా ఉంటే హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య వార్, బయట అభిమానుల మధ్య వార్ సహజమే! కానీ లోపల కంటెస్టెంట్లు ఏదో అనుకున్నారని వారి కుటుంబసభ్యులపైనే దాడి జరిగింది. నటి వనితా విజయ్‌కుమార్ కూతురు జోవిక బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. ఆమె ప్రదీప్ ఆంటోని అనే కంటెస్టెంట్‌పై తీవ్ర విమర్శలు చేసింది. #CoolSuresh try to escape .this week no elimination cool suresh self eviction. pic.twitter.com/hZqh8RDuwP — Jin (@Jin49486319) December 13, 2023 జోవిక ఆరోపణలు.. ప్రదీప్‌కు రెడ్ కార్డ్ ఆయన ఎప్పుడూ వాష్ రూమ్ వద్దే ఉంటున్నాడు.. ఆయన వల్ల ఇక్కడ ఉన్న అమ్మాయిలకు భద్రత లేదని జోవిక ఆరోపించింది. దీంతో కమల్ అతడికి రెడ్ కార్డ్ జారీ చేసి షో మధ్యలోనే అర్థాంతరంగా ఎలిమినేట్ చేశాడు. దీనివల్ల జోవికపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరగ్గా దాన్ని తిప్పికొడుతూ వచ్చింది వనిత. ఓ రోజు బిగ్‌బాస్ షో గురించి రివ్యూ చెప్పి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోని అభిమానే తనపై దాడి చేశాడని వనిత ఆరోపించింది. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) షో మధ్యలో కంటెస్టెంట్ అరెస్ట్ కన్నడ బిగ్‌బాస్ 10వ సీజన్లో ఓ కంటెస్టెంట్‌ను షో మధ్యలో నుంచే పోలీసులు తీసుకెళ్లిపోయారు. వర్తూర్ సంతోష్ పులి గోరును మెడలో ధరించి దర్జా ప్రదర్శించాడు. దీంతో అటవీ అధికారులు అది నిజమైనదా? కాదా అని సెట్స్‌కు వెళ్లి మరీ పరీశిలించారు. అది నిజమైన పులి గోరేనని తేలడంతో అతడిని వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇకపోతే బిగ్‌బాస్ షోలోకి యూట్యూబర్లు, సింగర్లు, డ్యాన్సర్లు, నటీనటులు వెళ్తుంటారు. కానీ తొలిసారి ఓ ఎమ్మెల్యే హౌస్‌లో అడుగుపెట్టాడు. హౌస్‌లోకి ఎమ్మెల్యే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్లను మోటివేట్ చేశాడు. కంటెస్టెంట్‌గా కాకుండా అతిథిగా షోకి వెళ్లి వచ్చాడు. ఇక ఇదే షోలో ఓ శునకం ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. సదరు ఛానల్ కూడా 777 చార్లీ సినిమాతో ఆకట్టుకున్న చార్లీ అనే శునకం మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లనుందని ప్రకటించింది. కానీ పలు కారణాల రీత్యా ఇది కార్యరూపం దాల్చలేదు. ಕಲರ್ಫುಲ್ ಮನೆಗೆ ತಾಳ್ಮೆಯ ಬಿಳುಪು; ಎಂಟ್ರೀ ಕೊಟ್ರು ಎಮ್.ಎಲ್.ಎ ಪ್ರದೀಪು! ಬಿಗ್ ಬಾಸ್ | ಪ್ರತಿ ರಾತ್ರಿ 9:30 #BBK10 #HappyBiggBoss #KichchaSudeep #ColorsKannada #ಬಣ್ಣಹೊಸದಾಗಿದೆ #ಬಂಧಬಿಗಿಯಾಗಿದೆ pic.twitter.com/9FB9d1eVrd — Colors Kannada (@ColorsKannada) October 9, 2023 ప్రెగ్నెన్సీ టెస్ట్ బిగ్‌బాస్ షోలో దంపతులు పార్టిసిపేట్ చేయడం చూశాం. తెలుగులోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. కానీ తొలిసారి ఓ మహిళకు హౌస్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో అంకితా లోఖండే- విక్కీ జైన్ కలిసి పాల్గొన్నారు. హౌస్‌లోకి వెళ్లిన నెల రోజుల తర్వాత తనకు ఇంకా పీరియడ్స్ రాకపోవడంతో అయోమయానికి లోనైంది అంకిత. దీంతో ఆమెకు రక్త, మూత్ర పరీక్షలు చేశారు. అయితే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. ఇలా ఈ ఏడాది ఏదో భాషలో ఏదో ఒక వార్తతో బిగ్‌బాస్ షో ట్రెండ్ అవుతూనే వచ్చింది. చదవండి: బుల్లితెర జంట విడాకులు? ఇద్దరి తప్పు.. ఏడుస్తూ ఉండలేం కదా! -
తెలుగు స్టార్ హీరో టార్చర్.. సినిమా ఇండస్ట్రీనే వదిలేశా..: నటి
సీనియర్ నటి విచిత్ర తమిళంలో అనేక సినిమాలు చేసింది. సహాయ నటిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టి బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఈ నటి ఇటీవలే తమిళ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొంది. 21 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె బిగ్‌బాస్ షోలో ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. సినిమాలు మానేయడానికి కారణమిదే 'అది 2000వ సంవత్సరం.. ఓ దివంగత నటుడు (పేరు చెప్పడం ఇష్టం లేదు) నాకు తెలుగులో ఓ హీరోతో కలిసి నటించే సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ మూవీ షూటింగ్ కేరళలోని మలంపుళలో జరిగింది. అక్కడే నా భర్త పరిచయమయ్యాడు. అక్కడే నా జీవితంలోనే అత్యంత దారుణమైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. పెళ్లి చేసుకున్నాకే సినిమాలకు గుడ్‌బై చెప్పానని చాలామంది అనుకుంటున్నారు. కానీ అసలు కారణం అది కాదు. షూటింగ్లో నేను పడ్డ బాధ, నరకం వల్లే ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయాను. అది ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. తెలుగు హీరో తన గదిలోకి రమ్మన్నాడు ఒక తెలుగు హీరోను, నన్ను 3 స్టార్ హోటల్లో ఉండమన్నారు. ఆ హోటల్ జనరల్ మేనేజరే తర్వాత నా భర్తగా మారాడు. ఓ రోజు పార్టీ జరుగుతోంది.. అక్కడే ఆ ఫేమస్ హీరోను కలిశాను. అతడు నా పేరు కూడా అడగలేదు, కానీ డైరెక్ట్‌గా గదికి వచ్చేయమన్నాడు. నేను షాకయ్యాను. అతడి మాటను పట్టించుకోకుండా వెళ్లి నా గదిలో నేను పడుకున్నాను. ఆ తర్వాతి రోజు నుంచి షూటింగ్లో సమస్యలు చుట్టుముట్టాయి. తమిళ ఇండస్ట్రీలో ఇటువంటి సమస్యలు నాకు ఎప్పుడూ ఎదురవలేదు. తాగి వచ్చి న్యూసెన్స్ ఆ హీరో రోజూ తాగి వచ్చి నా గది తలుపు తట్టేవాడు. ఆ గండం నుంచి ఎలా బయటపడాలా అని భయపడిపోయాను. నా రూమ్‌లో ఉన్న ఫోన్‌కు ఎవరి దగ్గరి నుంచి కాల్స్ రాకుండా చూడమని హోటల్ సిబ్బందిని వేడుకున్నాను. హోటల్ మేనేజర్ పరిస్థితి అర్థం చేసుకుని చిత్రయూనిట్‌కు తెలియకుండా రోజుకో గదికి షిఫ్ట్ చేశాడు. నేను పాత రూమ్‌లో ఉన్నాననుకుని అతడు తాగి డోర్ తట్టేవాడు. ఒకరోజు అతడికి సహనం నశించి నాకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఓరోజు అడవిలో షూటింగ్ జరుగుతుండగా అతడు నన్ను అసభ్యంగా తాకాడు. అసభ్యంగా తాకాడు.. డైరెక్టర్ రెండో టేక్ తీసుకున్నాడు.. మళ్లీ అలాగే నన్ను అసభ్యంగా తడిమాడు. మూడోసారి కూడా అంతే.. ఇక నా వల్ల కాక అతడి చేయి పట్టుకుని లాగి స్టంట్ మాస్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. అతడిని ప్రశ్నించాల్సింది పోయి ఆ స్టంట్ మాస్టర్ రివర్స్‌లో నా చెంప చెళ్లుమనిపించాడు. అందరూ చూస్తూ నిల్చున్నారే తప్ప ఎవరూ మాట్లాడలేదు. కోపం, ఆవేశం, బాధ.. ఏమీ చేయలేకపోయాను. చెంప మీద దెబ్బ తాలూకు అచ్చులతో యూనియన్ దగ్గరకు వెళ్తే ఈ సంఘటనను మర్చిపోమన్నారు. నీకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని చోట ఎందుకు పని చేస్తున్నావు? అని హోటల్ మేనేజర్ అన్నాడు. అతడు నాకోసం కోర్టులో సాక్షిగా నిలబడ్డాడు.. చాలా పోరాడాడు. నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు ముగ్గురు అందమైన పిల్లల్ని ఇచ్చాడు' అని చెప్పుకొచ్చింది విచిత్ర. Actor Who Harassed : #Balayya (Balakrishna) Telugu Film Name : Bhalevadivi Basu (2001 Release) Stunt Director : A.Vijay Nadigar Sangam Head Who Refused Action: Radha Ravi #Vichithra #MeToo pic.twitter.com/9rrxagpUwV — Analyst (@BoAnalyst) November 22, 2023 చదవండి: త్రిషకు క్షమాపణ చెప్పను.. నేను మాట్లాడితే అగ్నిగోళం బద్దలవుతుంది: మన్సూర్ -
బిగ్‌బాస్ 7: సడన్‌గా హౌస్‌లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్!
బిగ్‌బాస్ షో.. లోనికి వెళ్లడమే కంటెస్టెంట్ల చేతిలో ఉంటుంది. బయటకు రావడమనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. వారి ఆట నచ్చినంతవరకు కంటెస్టెంట్లను ముందుకు నడిపిస్తూ ఉంటారు. నచ్చని మరుక్షణం ఓట్లు వేయడం మానేసి ఎలిమినేట్ చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం బిగ్‌బాస్ స్వయంగా కంటెస్టెంట్లను అవతలకు పంపించి వేస్తూ ఉంటాడు. ఒక షో.. రెండు ఇళ్లు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, హౌస్‌లో ఉండలేకపోతున్నామని పోరు పెడితే ఉన్నపళంగా గేట్లు ఎత్తి వెళ్లిపోమంటాడు. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా తమిళ బిగ్‌బాస్ 7వ సీజన్లోనూ ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1వ తేదీన తమిళ బిగ్‌బాస్ 7 ప్రారంభమైంది. ఈ షోలో రెండు హౌస్‌లు ఉన్నాయి. ఒకటి పెద్దది, రెండవది చిన్న ఇల్లు. నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లను చిన్న ఇంట్లో పెట్టి వారితో పనులు చేయిస్తారు. చిన్న ఇంట్లో ఉన్నవారు ఏ టాస్కుల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు. ఆరోగ్యం సహకరించడం లేదంటూ.. రచయిత, నటుడు బావ చెల్లదురై గతవారం నామినేషన్లో ఉండటంతో తనకు కూడా వంట చేయడం, క్లీనింగ్ వంటి పనులు తప్పలేదు. ఈ క్రమంలో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. ఇదే విషయాన్ని బిగ్‌బాస్‌కు చెప్తూ తనను పంపించేయమని వేడుకున్నాడు చెల్లదురై. తన శారీరక, మానసిక ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోతానని మొర పెట్టుకున్నాడు. తండ్రిలా చూసుకున్నారు, కానీ.. బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పమని బిగ్‌బాస్ అన్నప్పటికీ తాను వెళ్లిపోవాలన్న మాటకే కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. 'నేను ఇక్కడ ఇండలేను. ఇంకా ఆలోచించడానికేం లేదు. కంటెస్టెంట్లు నన్ను తండ్రిలా చూసుకున్నారు. కానీ నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. ప్లీజ్, వెళ్లిపోతాను' అని అభ్యర్థించాడు. దీంతో బిగ్‌బాస్ తన కోరిక మేరకు బావ చెల్లదురైని ఇంటి నుంచి పంపించేశాడు. Bava Chelladurai walks out of the show.#BiggBossTamil7 pic.twitter.com/FmVG8sdHM4 — Bigg Boss Follower (@BBFollower7) October 9, 2023 చదవండి: బతుకమ్మ ఆడిన హీరోయిన్స్.. నెట్టింట వీడియో వైరల్ -
దుబాయ్‌లో మరో అమ్మాయితో భర్త ఎఫైర్.. మోసం చేశాడన్న నటి
ప్రేమ, పెళ్లి అనేది నమ్మకం అనే పునాదులపైనే నిలబడుతుంది. కానీ తన భర్త తానే సర్వస్వం అని నటిస్తూనే మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నాడని వాపోయింది నటి సంయుక్త. ఈ బ్యూటీ తమిళ బిగ్‌బాస్ 4వ సీజన్లో పాల్గొంది. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో వారసుడు, తుగ్లక్, దర్బార్ వంటి పలు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. ప్రేమ పెళ్లి.. దుబాయ్‌లో మరో అమ్మాయితో 'నా భర్త దుబాయ్‌లో వ్యాపారం చేస్తుంటాడు. కరోనా సమయంలో అతడి గురించి నాకు భయంకరమైన నిజం తెలిసింది. నాలుగేళ్లుగా అతడు మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్న విషయం తెలిసింది. అప్పుడు నా మనసు ముక్కలైంది. అసలేం చేయాలో కూడా తోచలేదు. లాక్డౌన్ వల్ల ఎక్కడికీ వెళ్లలేకపోయాను. అప్పుడే నాకు యాంకర్ భావన పరిచయమైంది. నేను ఉంటున్న అపార్ట్మెంట్లోనే తను కూడా ఉంటుంది. కలిసినప్పుడల్లా హాయ్, బై.. ఇంతే మాట్లాడుకునేవాళ్లం. తర్వాత కలిసి వాకింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టాం. ఒకరోజు తను నా భర్త, కుటుంబం గురించి అడిగింది. అప్పుడే నా గుండెల్లో ఉన్న బాధనంతా ఒక్కసారిగా కన్నీటిరూపంలో తన్నుకుంటూ వచ్చింది. బిగ్‌బాస్‌కు ట్రై చేయొచ్చుగా అని సలహా నా మనసులో ఉన్న బాధనంతా తనతో చెప్పుకున్నాను. అప్పటికి తనింకా నాకంత క్లోజ్ ఏమీ అవలేదు. అయినా నా తరపున నిలబడింది. నన్ను ఓదార్చింది. లాక్డౌన్ కావడంతో ఇంటిదగ్గరే కలిసి వర్కవుట్ చేసేవాళ్లం. అలా చాలా క్లోజ్ అయిపోయాం. మేలో నా 8వ వివాహ వార్షికోత్సవం వచ్చింది. నా బతుకు ఇలా అయిపోయిందేంటని ఒక్కదాన్ని ఎంతలా ఏడ్చానో! నాకు ఓ కొడుకు ఉన్నాడు. ఇల్లు గడవాలంటే సంపాదన అవసరం. అందుకే నాకేదైనా పని దొరుకుతుందేమో చూడమని భావనకు చెప్పాను. తను నీకేది నచ్చితే అదే చేయాలంది. బిగ్‌బాస్ షోకి ట్రై చేయవచ్చు కదా అని సలహా ఇచ్చింది. అంతేకాదు, బిగ్‌బాస్ షోకి నన్ను రిఫర్ చేసింది కూడా! విడాకులిస్తానంటే రావట్లేదు సంయుక్త ఎవరనేది ఈ ప్రపంచానికి తెలిసిందంటే అది భావన వల్లే! తన వల్లే నేను ఇక్కడిదాకా వచ్చాను. ఇప్పటికీ నా కొడుకు నాన్న ఎక్కడ? అని అడుగుతుంటాడు. తను బయట దేశంలో పని చేస్తున్నాడు, ఇండియాకు రాలేడు అని సర్ది చెప్తూ వస్తున్నాను. ఆయన మాకు ఎందుకింత అన్యాయం చేశాడో తెలియడం లేదు. తనకు విడాకులిచ్చేందుకు ఎప్పుడో సిద్ధమయ్యాను. కానీ తను ఇండియాకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే ఇంకా విడాకుల ప్రక్రియ పూర్తి కాలేదు' అని చెప్తూ ఎమోషనలైంది. కాగా సంయుక్త ఎంటర్ప్రెన్యూర్ కార్తీక్ శంకర్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఒక బాబు రేయాన్ ఉన్నాడు. బిగ్‌బాస్ తర్వాత తను మోడల్, నటిగా కెరీర్లో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Samyuktha Shan (@samyuktha_shan) చదవండి: కట్టప్పనే మించిపోయావ్, నీకన్నా పాము నయం.. గడగడలాడించిన గీతూ.. షాకైన రతిక -
నటుడు మోసం చేశాడు, డిప్రెషన్‌తో చనిపోదామనుకున్నా: లాయర్
తమిళ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, రాజకీయ నాయయకుడు ఆర్ విక్రమన్‌కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అతడు తనను మోసం చేశాడంటూ విక్రమన్ మాజీ ప్రేయసి, దళితుల కార్యకర్త, న్యాయవాది కిరుబ మునుసామి సంచలన ఆరోపణలు చేస్తోంది. తనపై వేదింపులకు సైతం పాల్పడ్డాడని పేర్కొంది. ప్రస్తుతం విక్రమన్ విడుదలై చిరుదైగల్ కచ్చి(వీసీకే) పార్టీలో ఉండగా.. సదరు పార్టీ తనకు జరిగిన అన్యాయంపై స్పందించి ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తోంది. నేను అమాయకుడిని తాజాగా ఈ ఆరోపణలపై విక్రమన్ స్పందించాడు. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే ఈ కథలో రెండు కోణాలున్నాయన్నాడు. ఈ పూర్తి గొడవలో అసలైన బాధితుడిని తానేనన్నాడు. తన రాజకీయ, నట జీవితాన్ని దెబ్బ తీసేందుకే ఆమె ఇలా ఆరోపణలు గుప్పిస్తోంది. తనతో పెళ్లికి నిరాకరించానన్న కోపంతోనే ఇదంతా చేస్తోందంటూ వాట్సప్ చాట్ స్క్రీన్షాట్లు, కిరుబ రాసిన లేఖల ఫోటోలు ట్విటర్లో షేర్ చేశాడు. నిజంగా వేధిస్తే ఆ లేఖ అర్థమేంటి? '1. కిరుబ పీహెచ్డీ చదవడానికి యూకే వెళ్లినప్పుడు రాసిన ఉత్తరం. ఇది 2022 జూన్ 15న రాసింది. నేను నిజంగా వేధించేవాడినైతే.. ఎవరూ ఇలా లేఖ రాయరు. 2. నా కోసం కొన్న వస్తువులకు నేను కిరుబాకు డబ్బు చెల్లించిన సాక్ష్యాలు. తను నాకు ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేస్తానని చెప్పాను. అన్నట్లుగానే అదే మాట మీద నిలబడ్డాను.. నాపై చేసిన ప్రతి ఆరోపణను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకమీదట నా గురించి ఏ తప్పుడు ఆరోపణలు చేసినా వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. చట్టప్రకారమే వాటి సంగతి తేలుస్తాను' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు విక్రమాన్. అసలేం జరిగిందంటే? విక్రమన్, కిరుబ ముసుసామి ప్రేమించుకున్నారు. ఏమైందే ఏమో కానీ కొంతకాలంగా వీరు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా ఆదివారం నాడు కిరుబ.. విక్రమన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. '2013 నుంచే విక్రమన్ నాకు తెలుసు. ఓ కార్యక్రమానికి నేను గెస్ట్‌గా వెళ్లాను. అందులో విక్రమన్ కూడా పాల్గొన్నాడు. అలా మా పరిచయం మొదలైంది. 2020 ఆగస్టులో లండన్‌కు వెళ్లినప్పుడు అతడు ఎయిర్పోర్ట్ వరకు వచ్చి మరీ వీడ్కోలు పలికాడు. అక్కడికి వెళ్లిన రెండు నెలలకే నాతో రొమాంటిక్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు. కులం పేరిట దూషణలు తనకు వీసీకే పార్టీ నుంచి పిలుపొచ్చిందని అబద్ధం చెప్పాడు. కేవలం తనకున్న కోరిక వల్ల ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటినుంచి తన రాజకీయ కెరీర్‌కు సపోర్ట్‌గా ఉండమని కోరాడు. ఏదైనా అడ్డు చెప్పానంటే చాలు.. కులం పేరుతో దూషించేవాడు. కులపిచ్చి ఉన్న వ్యక్తితో దూరంగా ఉండటం నయం అనుకున్న ప్రతిసారి క్షమించమని ఏడ్చేవాడు. మాట్లాడమని బతిమాలేవాడు. మారతాడనుకుని ఛాన్స్ ఇచ్చిన మొదట్లో బాగానే ఉండేవాడు. కానీ కొంతకాలానికే ఎప్పటిలానే దూషించడం, ఏడ్చి సానుభూతి సాధించడం జరిగేది. మేనేజర్‌తో ఎఫైర్.. అడ్డంగా దొరిగాక తనతో రెండేళ్లు రిలేషన్లో ఉన్న తర్వాత అతడితో విడిపోవాలని నిశ్చయించుకున్నాను. నేను అతడికి ఇచ్చిన డబ్బును తిరిగివ్వమన్నాను. అప్పుడు నన్ను బ్లాక్ చేశాడు. 3 నెలలపాటు ప్రయత్నించాను, పట్టించుకోలేదు. తీరా బిగ్‌బాస్ షోలోకి వెళ్లేముందు తనే క్షమాపణలు అడిగాడు. ఎప్పటిలా కలిసుందాం అన్నాడు. మళ్లీ రొమాంటిక్‌గా చాట్ చేశాడు. బిగ్‌బాస్ నుంచి వచ్చాక కూడా నాతో బానే ఉన్నాడు. అయితే అతడి మేనేజర్‌తో పెట్టుకున్న ఎఫైర్ నాకు తెలిసింది. ఓసారి వాళ్లిద్దరూ నాకు అడ్డంగా దొరికిపోయారు. అప్పుడు అతడు నిజం అంగీకరించాడు. చనిపోదామనకున్నా ఏడాదిన్నరకాలంగా తనతో రిలేషన్లో ఉన్నానని ఒప్పుకున్నాడు. అతడి మాజీ ప్రేమికులు, స్నేహితులు దాదాపు 15 మందిని కలిశాను. తను చాలా దారుణంగా ప్రవర్తిస్తాడని చెప్పారు. నమ్మడం, మోసపోవడం, తిట్లు తినడం, కుంగిపోవడం.. ఇదే పనైపోయింది. ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు లోనై చనిపోదామనుకున్నాను. దీని నుంచి బయటపడేందుకు ఏడాది కాలంగా థెరపీ తీసుకుంటున్నాను అంటూ వాట్సాప్ స్క్రీన్షాట్లు షేర్ చేసింది. After having undergone a great deal of agony over the past few months & a huge disappointment, I'm writing in public. I've known @RVikraman since 2013 when he participated in an event in which I was a guest. When I left for London in Aug 2020, he voluntarily came to send me off. pic.twitter.com/AA2rTxagZm — Kiruba Munusamy (@kirubamunusamy) July 16, 2023 I deny the allegations made against me by Ms. Kiruba Munusamy in entirety. A coin has two sides likewise this story also has two sides. "There is only one victim in this issue and it is me rather than the person making the accusations against me". We were acquaintances till… pic.twitter.com/IGCFE0PrBl — Vikraman R (@RVikraman) July 17, 2023 చదవండి: ఈ వారం ఏయే సినిమాలు రిలీజవుతున్నాయంటే? అద్దె ఇంట్లో నుంచి గెంటివేత..రూ.5 జీతం నుంచి లక్షలు తీసుకునే స్టార్ హీరోయిన్గా... కలిసిరాని రెండు పెళ్లిళ్లు! -
గర్భం దాల్చా.. అంతలోనే బ్రేకప్.. సీక్రెట్‌గా పెళ్లి!: నటి
సోషల్ మీడియా వచ్చాక నెటిజన్లే సెలబ్రిటీల పెళ్లిళ్లు చేస్తున్నారు. నచ్చకపోతే నెట్టింట్లోనే విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. కాలక్షేపం కోసం లేనిపోని పుకార్లు సృష్టిస్తూ.. మరికొన్నిసార్లు సెలబ్రిటీలనే విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారు. అలా ఎంతో మంది తారల రియల్ లైఫ్‌లో పెళ్లి జరగకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎన్నోసార్లు పెళ్లి జరిపించేశారు. తాజాగా ఈ ధోరణిపై సెటైర్ వేసింది తమిళ నటి పావని. బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది పావని రెడ్డి. తర్వాత తమిళ బిగ్‌బాస్ 5వ సీజన్లో నటించింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ఆమిర్.. పావనిని చూడగానే ప్రేమలో పడ్డాడు. తనకు ప్రపోజ్ కూడా చేశాడు, కానీ పావని లైట్ తీసుకుంది. ఈ విషయం పక్కన పెడితే బిగ్‌బాస్ జోడీ డ్యాన్స్ షోలో వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమిర్‌కు దగ్గరైంది నటి. ఈ షోలో విజేతలుగా నిలిచిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ జోడీగా ఉండబోతున్నామని ప్రకటించింది. తునివు(తెగింపు) సినిమాలో వీరు ప్రేమపక్షులుగానూ నటించారు. ప్రస్తుతం ఈ జంట చెన్నైలో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు పెళ్లెప్పుడు? అంటూ వీరి వెంటపడుతున్నారు. తాజాగా ఓ అభిమాని మీ ఇద్దరికీ పెళ్లైపోయింది.. కానీ ఎందుకు దాచిపెడుతున్నారు, బయటకు చెప్పొచ్చుగా అని అడిగింది. దీనికి పావని స్పందిస్తూ.. పోయిన నెలలో నేను గర్భవతి అన్నారు. ఆ తర్వాత మేము బ్రేకప్ చెప్పుకున్నామన్నారు. ఇప్పుడేమో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామంటున్నారు. మరి నెక్స్ట్ ఏం కహానీ చెప్పబోతున్నారేంటి? అంటూ తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది. -
బిగ్‌బాస్ షో హోస్ట్‌గా స్టార్ హీరో, ప్రోమో రిలీజ్!
తమిళ బిగ్‌బాస్ షో హోస్ట్‌గా విశ్వ నటుడు కమల్ హాసన్ తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. మొదట్లో రమ్యకృష్ణను హోస్ట్‌గా నిలబెడతారనుకున్నారు. కానీ, బిగ్‌బాస్ అల్టిమేట్ షోలో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్ కారణంగా షో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో కోలీవుడ్ యంగ్ హీరోను సంప్రదించగా అతడు ఓకే చెప్పినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇది నిజమేనని వెల్లడించింది బిగ్‌బాస్ టీమ్. బిగ్‌బాస్ ఓటీటీకి హీరో శింబు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేసింది. మరి శింబు హోస్ట్‌గా బుల్లితెరపై అదరగొడతాడా? కంటెస్టెంట్ల లెక్కలు సరిచేస్తాడా? అభిమానులను ఎంటర్టైన్ చేస్తాడా? అనేది చూడాలి! #STRtheHostOfBBUltimate 💥 pic.twitter.com/GWozob5Kwu — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) February 24, 2022 -
Kamal Haasan: బిగ్‌బాస్ షో నుంచి తప్పుకుంటున్నా
తమిళ ‘బిగ్‌బాస్’ షో హోస్ట్‌గా కమల్ హాసన్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఓ లేఖను విడుదల చేశారు కమల్. ‘‘కరోనా, లాక్డౌన్ పరిస్థితులు ‘విక్రమ్’ సినిమాపై ప్రభావం చూపాయి. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయాం. దీంతో నేను హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్‌బాస్’ షో, ‘విక్రమ్’ సినిమా డేట్స్ క్లాష్ అయ్యాయి. ఈ కారణంగా నా మనసుకు ఎంతో దగ్గరైన ‘బిగ్‌బాస్’ హోస్ట్‌గా తప్పుకోక తప్పడం లేదు. షో యాజమాన్యంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న ‘విక్రమ్’ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా ‘బిగ్‌బాస్’ లో కమల్‌హాసన్ ప్లేన్‌ను ఎవరు రీప్లేస్ చేస్తారనే విషయంపై కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. కమల్‌కు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ‘బిగ్‌బాస్’ షోకి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు. -
బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
Actress Sanam Shetty Shocking Comments on Bigg Boss: బిగ్‌బాస్ రియాలిటీ షోతో రాత్రికి రాత్రే పాపులారిటీ వస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని వాళ్లు సైతం బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా లైమ్లైట్లెకి వస్తారు. కానీ బిగ్‌బాస్ షో ముగిశాక మాత్రం ఆ ఎఫెక్ట్ అంతగా కనపడదు. ఈ షో వల్ల పెద్దగా ప్రయోజనం లేదని షో నుంచి బయటకు వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు చెప్పే మాట. తాజాగా హీరోయిన్, తమిళ బిగ్‌బాస్ సీజన్-4 ఫేమ్ సనమ్ శెట్టి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వల్ల తనకు సినిమా అవకాశాలు ఏం పెరగలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. షో అనంతరం వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సనమ్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక 25కి పైగా సినిమాల్లో నటించిన ఈమె తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొంది. -
మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా...రమ్యకృష్ణ
కమల్‌హాసన్ కరోనాతో క్వారంటైన్లో ఉంటున్నందున ఆయన హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ పరిస్థితి ఏంటి? అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక హోస్ట్ లిస్ట్‌లో కమల్ కుమార్తె శ్రుతీహాసన్, రమ్యకృష్ణల పేర్లు వినిపించాయి. అయితే శ్రుతి తన సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ‘బిగ్ బాస్’కి డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి అట. అందుకే నిర్వాహకులు రమ్యకృష్ణను ఖరారు చేశారు. గతంలో తెలుగు ‘బిగ్ బాస్ 3’ అప్పుడు హోస్ట్ నాగార్జున కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటే, ఆ స్థానంలో రమ్యకృష్ణ కొన్నాళ్ల పాటు షోను నడిపారు. ఇప్పుడు ఆమె తమిళ ‘బిగ్ బాస్’కి హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. రమ్యకృష్ణను స్వాగతిస్తూ.. కమల్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. -
బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. వీకెండ్ ఎపిసోడ్స్‌కి భారీ ప్లాన్!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్.. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు, తమిళంలో ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తోంది. తెలుగు షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా ఉన్నారు. అయితే ఇటీవల కరోనా బారిన ఆయన.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 5కి కొత్త హోస్ట్‌ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కమల్ ప్లేస్‌లో తాత్కాలికంగా శ్రుతి హాసన్‌ని హోస్ట్‌గా తీసుకొస్తారనే వార్తలు వినిపించాయి. కానీ కోలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమిళ బిగ్‌బాస్‌ను శ్రుతిహాసన్ హోస్ట్ చేయడం లేదట. కమల్ ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తమిళంలో హోస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగులో రమ్యకృష్ణకు బిగ్ బాస్ కార్యక్రమం హోస్ట్ చేసిన అనుభవం ఉంది. నాగార్జున తన 60వ బర్త్ డే సందర్భంగా విహార యాత్ర కోసం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన క్రమంలో బిగ్‌బాస్ నాల్గో సీజన్లో హోస్ట్‌గా రమ్యకృష్ణ రంగ ప్రవేశం చేశారు. రెండు రోజులపాటు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అందుకే తమిళ బిగ్‌బాస్‌కి కూడా రమృకృష్ణనే తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ విషయంపై రమ్యకృష్ణను సంప్రదించగా, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ వీకెండ్లో ఆమెనే షోకు హోస్ట్‌గా వస్తుందని తమిళ జనాలు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో మరికొన్ని గంటల్లో తేలుతుంది. -
బిగ్ బాస్‌కి హోస్ట్‌గా శ్రుతీహాసన్!
తమిళ ‘బిగ్ బాస్’ షోకి హీరోయిన్ శ్రుతీహాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ 5వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి నటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్‌తో కమల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాత ఎవరు ఉంటారనే చర్చ జరుగుతోంది. కమల్ స్థానంలో ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌ను తీసుకోవాలని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు అనుకున్నారట. శ్రుతీని సంప్రదించారని కూడా టాక్. ఆమె కూడా షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపించినట్లు భోగట్టా. కాగా ‘బిగ్ బాస్’ తాత్కాలిక వ్యాఖ్యాత లిస్టులో హీరో సూర్య, నటి రమ్యకృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఓ వార్త వినిపిస్తోంది. మరి కమల్ ‘బిగ్ బాస్’కి వచ్చేవరకూ ఎవరు హోస్ట్ చేస్తారనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
బిగ్‌బాస్ షో.. అవి నిజాలే కావు: నటి కస్తూరి
బిగ్‌బాస్ షోకు యమ క్రేజ్ ఉంది కాబట్టే ఈ షో అనేక భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తోంది. ఈ మధ్యే తమిళంలోనూ ఐదో సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 'గృహలక్ష్మీ' సీరియల్ ఫేమ్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి కస్తూరి శంకర్.. తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో ఇప్పటివరకు తాను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని, తనలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ట్వీట్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు చూశామని, మరికొందరు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. 'గతంలో మీరు బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ చివరికి మీకన్నా మిగతావాళ్లే ఎంతో నయం అనిపించింది' అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. 'మీరు చూసినదాన్ని బట్టి ఎవ్వరినీ జడ్జ్ చేయకండి.. వారు చూపించేది కచ్చితంగా నిజాలే కానక్కర్లేవు' అని చెప్పుకొచ్చింది. హౌస్‌లో అంతమందికి ఒక్క కుక్కర్లోనే వంట చేశారా? అని ఓ వ్యక్తి అనుమానం వ్యక్తం చేయగా.. మాకు కొంత ఫుడ్ పంపిస్తారని, కాకపోతే కంటెస్టెంట్లు తగ్గేకొద్దీ వంటసరుకుల మోతాదు కూడా తగ్గిపోతూ ఉంటుందని తెలిపింది. అలాగే ఎంతో త్వరగా హౌస్ నుంచి బయటకు వచ్చేసినందుకు ప్రతిరోజు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటానంది కస్తూరి. Raise your hand if you are like me and haven't watched a single episode of #BiggBossTamil5 till date. Hugs ! Consolation hugs to those who never managed to watch a single full episode. #StarVijayTV #companyArtists #100naal_velaivaipputhittam — Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021 Don't judge based on what you get to see- The narrative they show is not necessarily the truth — Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021 I know !!! I thank god everyday that i escaped early and have done genuine work since then ! — Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021 -
బిగ్‌బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..
Tamil Bigg Boss Seanson 5 Namitha Marimuthu Heart Touching Story: బిగ్‌బాస్.. ఈ రియాలిటీ షోను జెన్యూన్‌గా ఆదరించే వాళ్ల శాతం తక్కువే కావొచ్చు. చాలామందికి ఈ రియాలిటీ షో మీద సదాభిప్రాయం లేకపోయి ఉండొచ్చు. సెలబ్రిటీలు-నాన్ సెలబ్రిటీలను ఓ హౌజ్‌లో టాస్క్‌లు-గేమ్‌ల పేరుతో చేసే గారడీ అని, వాళ్లు పంచేవి ఫేక్ ఎమోషన్స్ అని ఫీలవుతుంటారు. ఇలా ఎవరి అభిప్రాయలు వాళ్లవి. కానీ, తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 5లో గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 5.. 18 మంది కంటెస్టెంట్లతో అక్టోబర్ 3న ప్రారంభమైంది. సీనియర్ హీరో కమల్ హాసన్ ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కంటెస్టెంట్లో ట్రాన్స్‌జెండర్ నమిత మారిముత్తు పాల్గొంటోంది. మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ 2020 విన్నర్, మోడల్ కమ్ నటి అయిన నమిత.. ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌కు ప్రత్యేక ఆకర్షణ కావడం విశేషం. ఇక ‘ఒరు కథై సొల్లాటుమా’ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్ ఒక్కొక్కరు ఒక్కో కథను చెప్పుకుంటూ వచ్చారు. తన వంతు వచ్చేసరికి భావోద్వేగంగా నమిత చెప్పిన కథ తోటి హౌజ్ మేట్స్‌నే కాదు.. షోను తిలకించిన వాళ్లెందరినో కదిలించింది. కొందరి వల్ల సొసైటీలో తనలాంటి వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి.. సమాజం తమను అంగీకరించకపోవడం గురించి ఒక ప్రతినిధిగా దాదాపు అర్థగంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది నమిత. #NamithaMarimuthu 😟😟 Paavam la 😐 First time... BB la oru life story paarthu tears😪 Life is not easy for them😔 Hope this society atleast give comfortable space for them to live like us 💫❤#BBTamilSeason5 #BiggBossTamil5 — Yuna ᴹᴵ (@Yuna_Chillz) October 7, 2021 ఇది కదా చర్చించాల్సింది! సొసైటీలో తనకు ఎదురైన అనుభవాలు, అవమానాల్నే కథగా అల్లిన నమిత.. ఆ కథను ఆద్యంతం భావోద్వేగాలతో చెబుతూ పోయారు. ‘మన సమాజం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఇదే సమాజంలో మా స్థానం ఎక్కడ? మమ్మల్ని ఎందుకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు, అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?. మానసికంగా, శారీరకంగా మమ్మల్ని చంపేస్తున్నారు. అందుకే రోడ్ల మీద అడుక్కుని బతకాల్సి వస్తోంది. Thalaivar Kalaignar Karunanidhi will be Remembered Forever for such Works.. Proud 😍🔥#KalaignarForever #NamithaMarimuthu #BiggBoss5Tamil pic.twitter.com/An4Du5FGXu — நிதன் சிற்றரசு (@Srinileaks) October 8, 2021 మమ్మల్ని మనుషుల్లాగే చూడడం లేదంటూ.. కన్నీళ్లతో మాట్లాడింది నమిత. అంతేకాదు కొందరి వల్ల తనలాంటి వాళ్లకు చెడ్డ పేరు వస్తోందని, అలాంటి ప్రచారం చేసేవాళ్లతో సహా సంఘంలోని అందరిలోనూ తమపట్ల మార్పు రావాలంటూ, తనలా అందరూ రాణిస్తే సంతోషిస్తానని చివర్లో కోరుకుందామె. ఇక స్టార్ విజయ్ ఛానెల్ వాళ్లు కూడా సింగిల్ కట్ లేకుండా, ఎడిట్ చేయకుండా!, బీప్ లేకుండా ఆ అరగంట సీక్వెన్స్‌ను టెలికాస్ట్ చేయడం విశేషం!. అంతకు ముందు ఇదే హౌజ్‌లో ఇసయ్వాణి, చిన్నపొన్నులు సైతం పేదరికంలో తాము పడ్డ కష్టాల్ని పంచుకోగా.. ఆ రియల్ ఎమోషన్స్ సైతం చాలామందిని కదిలించాయి. ట్విటర్లో నమిత.. బిగ్‌బాస్ హౌజ్ వేదికగా కోట్ల మందికి తన గా(వ్య)థను పంచిన నమితను అభినందించని వాళ్లంటూ లేరు. అందుకే రాత్రి నుంచే ఆమెకు మద్దతుగా #NamithaMarimuthu హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో కడదాకా ఉంటుందో లేదో తెలియదుగానీ నమిత కథ మాత్రం.. ఓ బర్నింగ్ ఇష్యూను ఓ బుల్లితెర పాపులర్ షో ద్వారా సాధారణ ప్రజల ముందుకు తీసుకురావడం ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు తెలుగు బిగ్‌బాస్ 5 సీజన్లోనూ సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ ఇదే తరహా ఎమోషన్స్‌ను పంచిన విషయం తెలిసిందే. కంటెంట్ తక్కువతో కలర్ఫుల్గా షోలను నడిపించేవాళ్లు.. తమిళ, తెలుగు బిగ్‌బాస్ హౌజ్‌ల నుంచి చాలా నేర్చుకోవాలనే సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పడు. The pain in #NamithaMarimuthu’s story.💔 Not an ordinary struggle mentally and physically. Jus to hear only was so #exhausing. Can’t imagine what she must have gone through. More power to her and many more achievers from #LGBTQ.#BiggBossTamil #BiggBossTamil5 pic.twitter.com/FaZqJpgRrd — Ajay Ashok🅰️🅰️ (@AjayAsho) October 7, 2021 Her story says how we failed as a society 😭😭 #NamithaMarimuthu #BiggBossTamil5 pic.twitter.com/BY8pGKRxkm — Charan (@Charan_Soz) October 7, 2021 #BiggBossTamil5 She won 17❤️ from #BiggBoss house Million ❤️❤️❤️ from outside the house 🏠#NamithaMarimuthu pic.twitter.com/VQ6gcHzndE — Stay Positive37 (@helothamizha) October 7, 2021 Nameetha Marimuththu She is an icon to showcase the world -People Themselves are more beautiful - She spoke louder her inner feelings and respect @vijaytelevision for not editing her speech ♥️ She is the way beautiful - She is #NamithaMarimuthu #transgenderpride pic.twitter.com/M3NPwIaokl — Bigg Boss Tamil Season 5 (@biggbosstamil_5) October 7, 2021 చదవండి: తెలుగు బిగ్‌బాస్.. ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ -
బిగ్‌బాస్ కంటెస్టెంట్: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి
Bigg Boss Tamil 5 contestant Pavani Reddy: తమిళ బిగ్‌బాస్ సీజన్5 మొదలైంది. కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ బిగ్‌బాస్ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. అక్టోబర్ 3న ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో మొత్తంగా 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అయితే వారిలో మన తెలుగమ్మాయి పావని రెడ్డి సైతం ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో మోడలింగ్ చేసిన పావని రెడ్డి తర్వాత రెట్టా వాల్ కురువి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. చదవండి: భార్యను మూడోసారి పెళ్లి చేసుకున్న హిందీ నటుడు తెలుగులో అగ్నిపూలు, నా పేరు మీనాక్షి వంటి హిట్ సీరియల్స్‌లో నటించిన ఆమె ఆ తర్వాత ఆమె ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. అయితే ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో తిరిగి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.అక్కడ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. చిన్న తంబి, రసంతి సీరియల్స్ ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరైంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2013లో నటుడు ప్రదీప్ కుమార్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే అతను 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరోకరితో చనువుగా ఉన్న ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగునాట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి చెన్నైలోనే సెటిల్ అయిపోయింది. భర్త చనిపోయిన సుమారు మూడేళ్లకు 2020లో ఆనంద్ జాయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. మొత్తానికి తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో పావని రెడ్డి ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. చదవండి: Bigg Boss Tamil 5: బిగ్‌బాస్‌లో పాల్గొన్న 18 మంది కంటెస్టెంట్లు వీళ్లే.. -
తమిళ బిగ్‌బాస్: బరిలో ట్రాన్స్‌జెండర్, ఫేమస్ యాంకర్, సింగర్స్
తమిళంలో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తాజాగా ఐదో సీజన్లోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ బిగ్‌బాస్ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. బుల్లితెరతో పాటు వెండితెర స్టార్లను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెల్కమ్ చెప్పాడు. అక్టోబర్ 3న ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో మొత్తంగా 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో సింగర్లు, నటులు, కళాకారులు, యాంకర్లు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. మరి వారెవరో చదివేద్దాం... అక్షర రెడ్డి: నటి, మోడల్ అక్షర రెడ్డి మిస్ గ్లోబ్ 2019 అవార్డు అందుకుంది . ఇంతకుముందు విల్లా టు విలేజ్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. తనలోని యాక్టింగ్ టాలెంట్‌ను బయటపెడుతూ.. మలేషియన్ మూవీ కసు మెలా కసు చిత్రంలో తొలిసారి నటించింది. అభినయ్ వాడి: లెజెండరీ నటుడు జెమిని గణేశన్- సావిత్రి గణేశన్‌ల మనవడే అభినయ్. ఇతడు జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు. ప్రస్తుతం అతడు యువతరానికి టెన్నిస్‌లో శిక్షణ ఇస్తున్నాడు. అయితే పేదరైతులకు ఏదైనా సాయం చేయాలన్నది ఆయన అభిలాష. ఇక అభినయ్ రామానుజన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అభినయ్ ఫ్యాషన్ డిజైనర్ అపర్ణను వివాహం చేసుకోగా వీరికి స్వస్తిక అనే కూతురు ఉంది. మధుమిత రఘునాధన్: శ్రీలంకన్ తమిళ ఫ్యామిలీకి చెందిన మధుమిత రంఘునాధన్ జెర్మనీలో సెటిల్ అయింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు పూర్తి చేసిన మధుమితకు మోడలింగ్ అంటే మక్కువ ఎక్కువ. ఎలాగైనా సినీరంగంలో రాణించాలని కలలు కంటోంది మధుమిత. బిగ్‌బాస్ ద్వారా తన కలను నిజం చేసుకోవాలని ఆశపడుతోందీ మోడల్. రాజు జయమోహన్: తిరునల్వేలికి చెందిన రాజు నటుడు మాత్రమే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా! ఇతడు ప్రముఖ డైరెక్టర్ కె.భాగ్యరాజ్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. కనా కానుమ్ కలంగళ్ సీరియల్‌తో నటనా రంగంలోకి ప్రవేశించిన అతడు తర్వాత పలు షోలలోనూ పాల్గొన్నాడు. బుల్లితెరపై సత్తా చూపిన ఇతడు నట్పున ఎన్నాను తెరియుమా అనే చిత్రంతో వెండితెరపైనా లక్ పరీక్షించుకున్నాడు. చిన్న పొన్ను: చిన్న పొన్ను ప్లేబ్యాక్ సింగర్. 13 ఏళ్లకే తన గాత్రంతో మ్యాజిక్ చేయడం మొదలు పెట్టింది చిన్న పొన్ను. ఈమె సూపర్ స్టార్ రజనీకాంత్, హీరోయిన్లు జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమాలో తొలిసారి పాట పాడింది. ఫోక్ సాంగ్స్ ఇప్పటికీ మార్మోగిపోవడానికి చిన్న పొన్నులాంటి ఫోక్ ఆర్టిస్ట్‌లే కారణం. పావని రెడ్డి: మొదట్లో మోడలింగ్ చేసిన పావని రెడ్డి తర్వాత యాక్టింగ్‌నే తన కెరీర్‌గా స్థిరపరుచుకుంది. రెట్టా వాల్ కురువి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.చిన్న తంబి, రసంతి సీరియల్స్ ద్వారా అభిమానులకు ఆమె మరింత దగ్గరైంది. పలు భాషల్లోని సినిమాల్లోనూ పావని నటించి మెప్పించింది. ఇమ్మన్ అన్నాచి: ఇమ్మాని అన్నాచి నటుడు మాత్రమే కాదు పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే మరికొన్ని షోలకు జడ్జిగానూ పని చేశాడు. సొలుంగన్నే సొల్లుంగ, గల్లపెట్టి వంటి పలు షోలు అతడికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. తనకున్న పాపులారిటీతో రాజకీయాల్లోకి సైతం ప్రవేశించాడు. చెన్నై కాదల్ చిత్రంతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు. ఇసాయివాణి: ఈమె పూర్తి పేరు గానా ఇసాయివాణి. 2020వ సంవత్సరంలో ఆమె బీబీ 100 ఉమెన్ అవార్డు అందుకుంది. ఆరేళ్లకే పాటలు పాడటం మొదలు పెట్టిన ఆమె 10వేలకు పైగా షోలలో పాల్గొని తన గాత్రంతో ఎంతోమందిని మంత్రముగ్ధులను చేసింది. అభిషేక్ రాజా: నటుడు, రచయిత, వీడియో జాకీ, క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అభిషేక్ రాజా సోషల్ మీడియా సెన్సేషన్ కూడా! సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంలో దిట్ట అయిన అభిషేక్ ఇమైక్కా నొడిగల్ అనే సినిమాలోనూ ఓ పాత్రలో నటించాడు. సిబీ భువన్ చంద్రన్: ఇతడు నటుడు. యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భువన చంద్రన్ రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేశాడు. కానీ సినిమాలపై ఉన్న మోజుతో భారత్‌కు తిరిగి వచ్చేశాడు. వంజాగర్ ఉలగం చిత్రంలో తొలిసారి నటించాడు. మాస్టర్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. నమిత మరిముతు: ట్రాన్స్‌జెండర్ నమిత మరిముతు పాపులర్ మోడల్. మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ 2020 పేజెంట్ అవార్డు అందుకున్న నమిత నటిగానూ రాణిస్తోంది. వరుణ్ ఇషారి కమలకన్నన్: ప్రముఖ నటుడు ఇషారి వేలన్ మనవడే వరుణ్ ఇషారి. ఇతడు నిర్మాత ఇషారి గణేశ్‌కు బంధువు కూడా అవుతాడు. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు పార్కర్ స్పోర్స్ట్లోనూ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. థలైవా సినిమాలో అతడు పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ప్రియాంక దేశ్‌పాండే: తమిళ బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్లలో ప్రియాంక దేశ్‌పాండే ఒకరు. కింగ్స్ ఆఫ్ డ్యాన్స్, స్టార్ట్ మ్యూజిక్, సూపర్ సింగర్ 4,5,6,7,8 సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించింది. కలక్క పోవద్దు యారు షోకు సహజడ్జిగానూ పనిచేసింది. సురుతి: ఇంజనీరింగ్ అభ్యసించిన సురుతి మోడలింగ్ అంటే ఇంట్రస్ట్. దీంతో మోడలింగ్‌లో అడుగు పెట్టిన ఆమె నాలుగేళ్లుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈమె జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కూడా! లిక్కీ బెర్రీ: లిక్కీ బెర్రీ సింగర్, డాక్టర్, పాటల రచయిత, కాస్మొటాలజిస్ట్. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమె ర్యాపర్‌గా రాణిస్తోంది. తమరై సెల్వి: తమరై సెల్వి జానపద కళాకారిణి. ఈమె వందలాది షోలలో పాల్గొని ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. నదియా చాంగ్: నదియా చాంగ్ ఫేమస్ మోడల్. మలేషియన్ ఇండియన్ మోడల్ పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. మిసెస్ మలేషియా వరల్డ్ 2016 బ్యూటీ పేజెంట్ ఫైనలిస్టుగానూ సత్తా చాటింది. నిరూప్ నందకుమార్: ఇతడు ఎంటర్ప్రెన్యూర్. బెంగళూరులో స్వంతంగా వ్యాపారం నడుపుతున్న నిరూప్‌కు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్. బిగ్‌బాస్ షో ద్వారానైనా నటుడిగా ఛాన్స్ వస్తే బాగుండనుకుంటున్నాడు నిరూప్. -
బిగ్‌బాస్ ఐదో సీజన్: టాప్ కంటెస్టెంట్లు వీళ్లేనా!
గొడవలకు అడ్డా, కొట్లాటలకు కేరాఫ్, పోటీల హోరు, మాటల జోరు, ఎండ్లెస్ ఎమోషన్స్.. ఇవన్నీ పుష్కలంగా లభించేది ఒక్క బిగ్‌బాస్ షోలోనే. ఇవి మాత్రమేనా.. స్టార్ల అందచందాలు, వారి హంగామా, ఆటపాటలు, సీక్రెట్లు, రిలేషన్లు, అబ్బో.. ఇలా చాలానే ఉంటాయి. ఓ పక్క వివాదాల్లో నానుతూనే మరో పక్క వినోదం పంచే బిగ్‌బాస్ షోను బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఆరాధిస్తారు. ఈ బిగ్‌బాస్ షో తెలుగు, తమిళ భాషల్లో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఐదో సీజన్ కోసం కంటెస్టెంట్ల వేట ప్రారంభించారు నిర్వాహకులు. ఈ క్రమంలో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్ కోసం నిర్వాహకులు ఎవరెవరిని సంప్రదించారన్న లిస్టు ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం.. కూకూ విత్ కోమలి షో కంటెస్టెంట్లు దర్శ్ గుప్తా, పవిత్ర లక్ష్మి, శివానీ, అశ్విన్‌తో సంప్రదింపులు జరిపారట. ఇక నాల్గో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇవ్వాల్సిన నటుడు అజీమ్ వ్యక్తిగత కారణాల వల్ల హౌస్‌లో అడుగు పెట్టలేదు. దీంతో ఈసారి అతడికి ఛాన్సిద్దాం అనుకుంటున్నారు. ఈసారి గ్లామర్ డోసు పెంచడం కోసం లక్ష్మీ రాయ్, పూనమ్ భజ్వా, కిరణ్‌ను హౌస్‌లోకి దించాలని చూస్తున్నారట. 'పాండియన్ స్టోరీస్' ఫేమ్ హేమను కూడా షోలో పాల్గొనమని కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీనియర్ నటి రాధ, హీరో సిద్ధార్థ్‌ను కూడా ఐదో సీజన్‌కు పట్టుకురావాలని చూస్తున్నారట. కానీ వాళ్లు తప్పకుండా ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తారని భావిస్తున్నారు అభిమానులు. టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డికి కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొనమని ఆహ్వానం పంపారట. మరి ఈ ఆఫర్‌కు శ్రీరెడ్డి ఒప్పుకుంటుందా? తిరస్కరిస్తుందా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. చదవండి: ఏకధాటిగా 21 గంటలు పని చేశా.. అయినా ఫ్రెష్‌గా ఉన్నా: మోనాల్ అండాలు దాచి ఉంచా, పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్ భామ -
అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్: అవాక్కైన బిగ్‌బాస్ కంటెస్టెంట్
తెలుగు బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు రన్నర్‌ను, కానీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న విన్నర్‌ను అని చెప్పుకుంటాడు అఖిల్ సార్థక్. ప్రస్తుతం అతడు తెలుగు అబ్బాయి - గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోమశేఖర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా అతడి ఫొటో ఫ్రేమ్‌ను ప్రత్యేక కానుకగా పంపించాడు. ఈ విషయాన్ని అతడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో అభిమానులతో పంచుకున్నాడు. "హలో రాక్‌స్టార్, హ్యాపీ బర్త్‌డే. మనిద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయి. అందుకే ఇలా కనెక్ట్ అయిపోయాం. మా అమ్మది తమిళ్. అలా నాకు ఆ భాష కాస్తోకూస్తో అర్థమవుతుంది, కానీ మాట్లాడలేను. నేను తమిళ బిగ్‌బాస్ షో చూశాను. ఇద్దరం బిగ్‌బాస్ 4 నుంచి వచ్చినవాళ్లమే. లవ్ యూ రాక్‌స్టార్" అంటూ వీడియో సందేశం పంపాడు. ఇక అతడు పంపిన గిఫ్ట్ చూసి సోమశేఖర్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. "ఓ మై గాడ్, చాలా బాగుంది బ్రదర్" అంటూ త్వరలోనే కలుద్దామని చెప్పుకొచ్చాడు. సోమశేఖర్ విషయానికొస్తే.. బాక్సింగ్ మ్యాచ్‌లో గోల్డ్ మెడల్, తమిళనాడు స్టేట్ లెవల్ మువైతాయ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 'అజగియ తమిళ్ మ్యాగన్' టీవీ షోలో తళుక్కున మెరిశాడు. బైకులను అమితంగా ప్రేమించే ఇతడు ఈ మధ్యే కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొని అందరి ఆదరాభిమానాలను అందుకున్నాడు. గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న ఇతడు నాలుగో రన్నరప్‌గా నిలిచాడు. చదవండి: అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్ ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు -
లక్కీ చాన్స్ కొట్టేసిన ‘బిగ్‌బాస్’ భామ
బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొన్న నటీనటులకు ఆ తర్వాత మంచి పబ్లిసిటీతో పాటు సినీ అవకాశాలు వరుస కడుతూ ఉంటాయి. అలాంటి అవకాశాలే ఇప్పుడు నటి రమ్య పాండియన్‌కు వరుస కడుతున్నాయి. తమిళ బిగ్‌బాస్ సీజన్ ఫోర్లో పాల్గొన్న ఈ నటి ప్రతి వారం ట్రెండింగ్ స్టార్‌గా వార్తల్లో నిలిచారు. దీంతో ఆమె సింగపెణ్ అనే బిరుదు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి సినీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఒకటి 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించే అవకాశం. ఈ చిత్రాన్ని నవ దర్శకుడు అరిసిల్ మూర్తి తెరకెక్కించనున్నారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో వెంటనే కాల్ సీట్లు కేటాయించినట్లు రమ్య పాండియన్ తెలిపారు. త్వరలో సెట్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు సాంకేతికవర్గం ఎంపిక ముమ్మరంగా జరుగుతోంది. పూర్తి వివరాలను చిత్ర వర్గాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
బిగ్‌బాస్: అతడికి ఊడిగం చేస్తున్నావా?
స్టార్ హీరో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్ నాల్గో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నో రోజులుగా అయినవారికి దూరంగా ఉంటున్న హౌస్మేట్స్ కోసం బిగ్‌బాస్ వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను లోనికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కంటెస్టెంటు శివానీ తల్లి అఖిల నారాయణన్ మంగళవారం హౌస్‌లో అడుగు పెట్టింది. ఆమెను చూడగానే శివానీ కన్నీటి పర్యంతం అయింది. ఆమె కంటినీరు తుడిచి ఓదార్చిన అఖిల కూతురిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడింది. ఆమె మీద ఉన్న కోపాన్నంతా ప్రదర్శిస్తూ చీవాట్లు పెట్టింది. అసలు నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అని నిలదీసింది. బాలాజీని అంటి పెట్టుకుని ఉండటం తప్ప నువ్వు సొంతంగా గేమ్ ఆడుతున్న దాఖలాలే లేవని ఘాటుగా రియాక్ట్ అయింది. (చదవండి: ఒక్క సినిమాకు రూ.135 కోట్లు తీసుకోనున్న హీరో?!) 'నువ్వేమైనా బాలాజీకి ఊడిగం చేస్తున్నావా?, నిన్ను చూస్తుంటే కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఈ ఇంట్లో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నేను ఇచ్చిన క్రిస్మస్ బహుమతులను బాలాజీకే ఎందుకిచ్చావు? అతడేం మాట్లాడినా ఎందుకు సపోర్ట్ చేస్తావు? ఇది జోడీ నంబర్ 1 కాదు, బిగ్‌బాస్ షో' అని హెచ్చరించింది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో నీ ప్రవర్తన వల్ల మేము గర్వపడటం కాదు కదా! ట్రోల్ అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్రస్థాయిలో ఆమెపై ఫైర్ అవడమే కాదు ఏకంగా దూషణలకు కూడా దిగడతో శివానీ మరింత దుఃఖించింది. ఇది ఆమె అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. శివానీ తన ఆటపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఆమె తల్లి అంత సీరియస్ అయినప్పటికీ నోటికొచ్చినట్లు తిట్టడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడుతున్నారు. తమిళ దర్శకుడు సీఎస్ అముధాన్ సైతం అఖిల ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని చెప్పుకొచ్చారు. ఇక శివానీని కించపరిచేలా మాట్లాడినందుకు ఆమె తల్లిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదని వెనకేసుకొస్తున్నారు. మరోవైపు ఇదంతా తనవల్లే జరిగిందని బాలాజీ హౌస్మేట్స్ దగ్గర వాపోయాడు. (చదవండి:బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం) According to #Shivani mom This is This is Right wrong 🤧 pic.twitter.com/6oD8NuZ6zp — HBD Taetae 😻|| Lekha💜 || 레카 💜 (@LekhaOffl) December 29, 2020 Ok. Just happened to watch the Big Boss episode. That was clearly normalising extremely toxic parental abuse. No..No come on that’s not acceptable content at all. — CS Amudhan (@csamudhan) December 29, 2020 -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం
తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంటు లోస్లియా ఇంట విషాదం నెలకొంది. ఆమె ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తండ్రి మారియనేసన్ హఠాన్మరణం చెందారు. కెనడాలో ఆదివారం ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడవడంతో ఆమె పుట్టెడు శోఖంలో మునిగిపోయారు. మారియనేసన్ మృతి పట్ల సినీ ప్రముఖులు, ఆమె స్నేహితులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రీలంకకు చెందిన న్యూస్ రీడర్ లోస్లియా బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాక ఎనలేని పాపులారిటీ సంపాదించుకున్నారు. (చదవండి: బ్రో.. అతడో తాగుబోతు.. వదిలెయ్!) పదేళ్లుగా కెనడాలో స్థిరపడిన మారియనేసన్ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తన కూతురిని కలిసేందుకు హౌస్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో తండ్రిని చూసి ఆమె భావోద్వేగానికి లోనైన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక తన ఆటతో విశేషంగా అభిమానులను సంపాదించుకున్న లోస్లియా టాప్ 3లోనూ చోటు దక్కించుకున్నారు. బిగ్‌బాస్ తర్వాత ఆమె నటనా రంగంలోకి అడుగు పెట్టారు. క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న "ఫ్రెండ్షిప్" సినిమాలో నటిస్తున్నారు. (చదవండి: ప్యాంటులో మాస్క్ పెట్టుకుంటావా?: సల్మాన్ ఫైర్) Popular #BiggBossTamil3 Contestant / Tamil Actress #Losliya 's father #Mariyanesan passed away, due to heart attack.. Condolences to family and friends.. May his soul RIP! pic.twitter.com/0ZF0ezo0Fl — Ramesh Bala (@rameshlaus) November 16, 2020 -
బిగ్‌బాస్–4కు రెడీ అవుతున్న కమల్
టీవీ ప్రేక్షకులను విపరీతంగా అలరించిన బుల్లితెర కార్యక్రమాల్లో బిగ్‌బాస్ రియాల్టీ షో మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఎవరూ కాదనలేని అంశం. విశ్వనటుడుడ కమల్ హాసన్ వ్యాఖ్యాతగా అలరించిన ఈ రియాల్టీ షో విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. షో నాలుగో సీజన్ ప్రసారం ఇప్పటికే మొదలై ఉండాల్సింది. కరోనాతో ఈ ఏడాది షో ఉంటుందా ? లేదా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. అయితే షో నిర్వాహకులు బిగ్‌బాస్ అభిమానులకు శుభవార్త అందించారు. నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోందని చెప్పేశారు. దీనికి వ్యాఖ్యాతగా కమలహాసన్ వ్యవహరించనున్నారు. ప్రభుత్వ నిబంధనలతో పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ సారి షోలో నటి సునైనా, రమ్య పాండియన్, అతుల్యా రవి, కిరణ్, విద్యుల్లేఖ రామన్, కోమలి చిత్ర ప్రేమ్ శివంగి, ఇర్ఫాన్ ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేయబోతున్నారట. అధికారిక ప్రకటన త్వరలో అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ చివరి వారంలో ప్రసారం అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం. -
నవ వధువుల కనిపిస్తోన్న నటి!
ముంబై: నటి, ప్రముఖ మోడల్ మీరా మిథున్ తన ఫోటోలతో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోన్నారు. మిథున్ ఒక ఫోటో షూట్ కోసం సంప్రదాయ చీర కట్టులో ఫోజులిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మిథున్ ప్రతి రోజు తనకు సంబంధిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. తాజాగా జరిగిన ఫోటో షూట్లో ఆమె కంజీవరం చీర కట్టుకొని, నగలు ధరించి సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించారు. ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ఆమె కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మిథున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనితో పాటు బోల్డ్‌గా కనిపించే మరికొన్ని ఫోటోలను కూడా మిథున్ ఒకేసారి తన అకౌంట్లో షేర్ చేశారు. (సోదరి కోసం విమానం.. ఖండించిన అక్షయ్) View this post on Instagram Life is a series of thousands of miracles 🤩 @makeup_artistry_by_jayanthi @vikram.vickykapoor @ankaleshwargaddam_official A post shared by Meera Mitun (@meeramitun) on May 31, 2020 at 6:45am PDT View this post on Instagram En Nenjil Aanantha koothachu 🤫@vikram.vickykapoor @makeup_artistry_by_jayanthi @ankaleshwargaddam_official A post shared by Meera Mitun (@meeramitun) on May 30, 2020 at 6:57am PDT మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మిథున్ తరువాత సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్‌గా నటించారు. 2017లో ‘8తొట్టకల్’ సినిమాలో మొదటిసారి నటించారు. అయితే తమిళ్ బిగ్‌బాస్3 లో పాల్గొన్న మిథున్ అనేక వివాదాలతో పాపులర్ అయ్యారు. View this post on Instagram I am bringing sexy back 😉 A post shared by Meera Mitun (@meeramitun) on May 6, 2020 at 6:07am PDT -
హర్భజన్ సినిమాలో యాక్షన్ కింగ్
తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్.. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పి సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. పలు యాడ్ ఫిల్స్మ్ కోసం కెమెరా ముందుకొచ్చిన హర్భజన్ సింగ్.. ఈసారి ‘ఫ్రెండ్ షిప్’ అనే తమిళ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. తమిళ బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్టో స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఫ్రెండ్ షిప్’ను పలు భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సినిమా చిత్రీకరణ వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమైంది. -
బిగ్‌బాస్ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు!
సాక్షి, చెన్నై: బిగ్‌బాస్ నిర్వాహకులతో తమకు పారితోషికం సమస్య తలెత్తలేదని అందులో పాల్గొని బయటకు వచ్చిన నటి మీరా విుథున్, సాక్ష్మీ అగర్వాల్ పేర్కొన్నారు. తమిళ బిగ్ బాస్ హౌస్ గురించి పెద్ద చర్చే జరుగుతున్న విషయం తెలిసిందే. కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 3 సీజన్ గత రెండు సీజన్ల కంటే కాస్త ఎక్కువగానే వివాదాలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోనూ, బయట వివాదాస్పదంగా మారింది. ఇటీవల ప్రముఖ దర్శకుడు అమీర్ బిగ్‌బాస్ రియాలిటీషోపై తీవ్రంగానే విమర్శించారు. ఆ గేమ్ షో ప్రేక్షకులను బానిసలుగా మార్చేస్తుందని, అందులో పాల్గొన్న దర్శకుడు చేరన్ను చూస్తే జాలేస్తోందని, బిగ్‌బాస్ తలుపులు బద్దలు కొట్టి ఆయన్ని బయటకు తీసుకురావాలనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న నటులు లోపల, బయట వివాదాలను సృష్టిస్తున్నారు. హాస్యనటి మధుమిత హౌస్ సభ్యులు తనను అవమానించారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కలకలం సృష్టించింది. ఆ చర్యతో బయటకు పంపబడిన ఆమె బయటకు వచ్చిన తరువాత తనకు రావలసిన పారితోషికం వెంటనే చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బిగ్‌బాస్ నిర్వాహకులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొనడం, ఆ సంస్థ నిర్వాహకుడు ఆమెపై పోలీసులకు పిర్యాదు చేయడం, అది అసత్యపు ఫిర్యాదు అని మధుమిత స్పందించడం వంటి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మధుమిత ఎందుకలా చేసిందో తెలియదు.. కాగా మధుమితతో పాటు బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొని నామినేట్ అయిన నటి మీరావిుథున్ ఆమె వ్యవహారం గురించి స్పందిస్తూ తనకు పారితోషికం విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకంతో ఎలాంటి సమస్య తలెత్తలేదని పేర్కొంది. నటి మధుమిత వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యను ఎదుర్కొందో తెలియదని అంది. తన వరకూ బిగ్‌బాస్ సంస్థతో సత్సంబంధాలే ఉన్నాయని, తమని మర్యాదగానే చూసుకున్నారని చెప్పింది. వంద రోజుల తరువాతనే.. మరో సటి సాక్షీఅగర్వాల్ స్పందిస్తూ సభ్యులెవరైనా మధ్యలో బయటకు వచ్చేస్తే ఒప్పందం ప్రకారం మిగిలిన పారితోషికాన్ని వంద రోజులు పూర్తి అయిన తరువాతనే అందించనున్నట్లు పేర్కొనబడిందని చెప్పింది. అందుకే తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని అంది. అలాంటిది నటి మధుమిత ఎందుకలా ప్రవర్తించిందో తెలియదని, ఆమెకు సంబంధించిన ఒప్పందంలో ఏం ఉందో కూడా తనకు తెలియదని సాక్షీ అగర్వాల్ పేర్కొంది. -
బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం
తమిళసినిమా (చెన్నై) : తమిళ బిగ్‌బాస్ హౌస్ లో హాస్య నటి మధు మిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళంలో ఒరుకల్ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్ సీజన్ 3లో పోటీ చేస్తున్నారు. 50 రోజులకు పైగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న మధుమిత, కెప్టెన్ బాధ్యతలను నిర్వహిస్తున్న తరుణంలో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమెను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపేశారు. తమిళ బిగ్‌బాస్ సీజన్‌కు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన పాల్గొన్న గత రెండు సీజన్లలో కూడా వివాదాస్పద ఘటనలు జరిగాయి. అయితే హౌస్ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధుమిత పేర్కొంది. -
బిగ్‌బాస్ హౌస్‌లోకి పోలీసులు
తమిళనాడు, పెరంబూరు: బిగ్‌బాస్ హౌస్‌లోకి మరోసారి పోలీసులు ప్రవేశించారు. దీంతో ఆ హౌస్‌లో కలకలం రేగింది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. రియాలిటీ షో తొలి సీజన్లోనే నటి ఓవియా, నటుడు ఆరవ్ ప్రేమ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. ఆరవ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న మనస్థాపంతో ఓవియా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందనే ప్రచారం హోరెత్తింది. ఓవియను అంబులెన్స్‌లో ఆస్పత్రికి కూడా తీసుకెళ్లారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ తరువాత గత ఏడాది జరిగిన సీజన్– 2లోనూ నటుడు దాడి బాలాజీ, భార్య వివాదం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్– 3లో పాల్గొన్న నటి వనితావిజయకుమార్ తన కూతురిని కిడ్నాప్ చేసిందన్న ఆరోపణతో హైదరాబాద్ పోలీసులు, చెన్నై పోలీసులు విచారణలో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో నటి వనితావిజయకుమార్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆమె కూతురు వాగ్మూలంతో వనితా విజయకుమార్ అరెస్ట్ నుంచి తప్పించుకుంది. తాజాగా నటి మీరా మిథున్ డబ్బు మోసం కేసులో పోలీసులు బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. ఈ గేమ్ షోలో పాల్గొన్న నటి మీరా మిథున్ ఇటీవల దక్షిణ భారత అందాల పోటీలను నిర్వహించతలపెట్టి పోలీస్కేసుల వరకూ వెళ్లి వివాదాల నటిగా పేరు తెచ్చుకుంది. తరువాత ఈ అమ్మడు ఒక వ్యక్తికి అందాల పోటీలకు డిజైనర్‌గా అవకాశం ఇస్తానని చెప్పి రూ.50 వేలు అతని నుంచి తీసుకుందట. డిౖజైనింగ్ పని ఇవ్వలేదు, తీసుకున్న డబ్బు ఇవ్వలేదంటూ ఆ వ్యక్తి తేనంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. దీంతో నటి మీరా మిథున్ పోలీసులు తను అరెస్ట్ చేయకుండా చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకుంది. అందులో తాను మోసం చేశానన్న ఆరోపణలో నిజం లేదని, ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నానని, బయటకు రాగానే తనపై కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని, పోలీసుల విచారణకు సహకరిస్తానని పేర్కొంది. దీంతో ఈ అమ్మడికి ముందస్తు బెయిల్‌ను కోర్టు మంజూరు చేయడంతో ఊపిరి పీల్చుకుంది. అటాంటిది గురువారం అనూహ్యంగా పోలీసులు నటి మీరామిథున్‌ను విచారించడానికి బిగ్‌బాస్ హైస్‌లోకి ప్రవేశించారు. దీంతో నటి మీరామిథున్ అరెస్ట్ అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆమెను అరెస్ట్ చేసే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్దారించలేదు. మొత్తం మీద బిగ్‌బాస్ హౌస్‌లో మరోసారి కలకలానికి దారి తీసింది ఈ సంఘటన. -
బిగ్‌బాస్.. సోషల్ మీడియాలో లోస్లియా ఫీవర్
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరికి ఎప్పుడు ఎలా క్రేజ్ వస్తుందో చెప్పలేము. సమయాన్ని, సందర్భాన్ని బట్టి పరిస్థితులు మారడం, దానికి తగ్గట్టే కంటెస్టెంట్స్ కూడా ప్రవర్తించటంతో ఎవరికి ఎప్పుడు ఫాలోయింగ్ పెరుగుతుందో చెప్పడం కష్టం. అయితే తమిళ నాట ప్రస్తుతం బిగ్‌బాస్ ఫీవర్ మొదలైంది. ఇలా షో మొదలైన కొద్దిరోజులకే లోస్లియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. తన మాట తీరు, చలాకీ తనం, పాటలు పాడుతూ కంటెస్టెంట్లతో పాటు, ప్రేక్షకులను కూడా అలరించడంతో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. గత సీజన్లో ఓవియాకు ఎంతటి క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇంతటి అనతికాలంలోనే లోస్లియాకు అలాంటి క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం లోస్లియా గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారట. శ్రీలంక చెందిన లోస్లియా మరియనేసన్ అక్కడి న్యూస్ ఛానల్లో యాంకర్ పనిచేస్తుంది. లోసియా తన ఆటపాటలతో హౌస్‌లో సందడి వాతావరణం తీసుకురాగా.. ఆడియెన్స్ సైతం ఆమెను ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం లోస్లియా పేరిట సోషల్ మీడియాలో ఆర్మీ కూడా ఏర్పాటైంది. ఇక ఆమె పాడిన పాటలు, చేసిన డ్యాన్సులు టిక్‌టాక్, హలో యాప్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. మరి లోస్లియాకు వచ్చిన ఈ క్రేజ్ ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. తమిళనాట బిగ్‌బాస్ హవా మొదలవ్వగా.. తెలుగులో బిగ్‌బాస్ మూడో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా 14 మంది కంటెస్టెంట్లతో.. వందరోజుల పాటు ఈ షో కొనసాగనుంది. ఉదయభాను, శ్రీ ముఖి, వరుణ్ సందేశ్, తరుణ్ ఇంకా యూట్యూబ్ స్టార్లు ఇలా ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఎవరెవరు ఈసారి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. #BiggBossTamil3 season 3 Exclusive .#bb3 #update .#Losliya anthem sing by #kavinarmy ... #LosliyaArmy .. . 💠 Follow 💠Like 💠 Comment 💠Share pic.twitter.com/zbp6Jq8vy8 — N🐨🐨 (@Nivedita_3) 4 July 2019 Cute thalaivi #Losliya pic.twitter.com/5AHzVBrBxT — Vijay fans Hosur (@Hosurvijayfans) 26 June 2019 #Losliya Dances For #Thalapathy Song 😍@VijayFansTrends @Troll_Cinema pic.twitter.com/kJbZv5FAWA — Losliya Mariyanesan (@losliyamariya6) 4 July 2019 ➡Fully Expression queen #Losliya Angel ......#losliya_army #LoTuS GoLD AzM pic.twitter.com/VilJ0PJF5d — 🍁Lotus Gold AzM🍂 (@LotusGold1) 1 July 2019 Her smile 😍😍😍😍💓💓💓 Lovely los ❤️queen of my 💓 heart#losliya_army #Losliya pic.twitter.com/Di5tWumBd3 — 🔱Praveen ⚜️ (@PraveenStark3) 3 July 2019 Wowww.. #Losliya 😍😍😍 awesome to watch❤️ she is sweet and energetic! 💕#LosliyaArmy#BiggBossTamil3 #BiggBossTamil pic.twitter.com/5EmEip6j2g — Losliya ARMY (@LosliyaArmyFc) 28 June 2019 Nice song selection Cute edit ❤👌#Losliya #losliya_army #BiggBossTamil3 #BiggBossTamil pic.twitter.com/ukwHfETdVr — Losliya Mariya Fandom (@IamLosliya) 25 June 2019 Losliya 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 Phaaaaaa sema voice😍😍😍😍 My favourite song ❤❤❤😘😘😘#Losliya #Losiliya #LosliyaArmy @HandsomeboyKD pic.twitter.com/h41lqGfhyQ — Muthu$iva (@MuthuSiva_Off03) 30 June 2019 -
బిగ్‌బాస్ హౌస్‌లోకి వనిత కూతురు
సాక్షి, చెన్నై : తల్లిదండ్రుల విభేదాల మధ్య నలిగిపోయిన నటి వనిత కుమార్తె జెనితరాజన్ ఎట్టకేలకు తండ్రి చెంతకే చేరినట్లు సమాచారం. దివంగత సీనియర్ నటి మంజుల, నటుడు విజయకుమార్ కుమార్తె వనిత, ఆమె మాజీ భర్త ఆనంద్‌రాజ్ మధ్య గత కొన్ని నెలలుగా న్యాయ పోరు నేపథ్యంలో గత నాలుగు రోజులుగా చెన్నైలో హైడ్రామా నడిచింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యక్షురాలు వసుంధర శ్రీనివాస్, తెలంగాణ, తమిళనాడు పోలీసులు బిగ్‌బాస్ హౌస్ వేదికగా బుధవారం సాయంత్రం వరకు జరిపిన చర్చల్లో చివరకు చిన్నారి జెనితరాజన్ తండ్రి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. కూతురు తన వద్దే ఉందని అంగీకరించిన వనిత వనిత 2007లో ఆనందరాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి జెనిత రాజన్ అనే కూతురు ఉంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసార జీవితంలో మనస్పర్థల కారణంగా 2012లో దంపతులు విడిపోయారు. 2015లో చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి విడాకులను మంజూరు చేసింది. కూతురి సంరక్షణ బాధ్యతలను తండ్రికే అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆనంద్‌రాజ్ తన కూతురితో సహా హైదరాబాద్‌లో నివశిస్తున్నాడు. గత ఫిబ్రవరిలో వనిత హైదరాబాద్‌కు వెళ్లి పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న కూతురిని తీసుకెళ్లిపోయింది. దీంతో ఆనంద్‌రాజ్ హైదరాబాద్ పోలీసులకు తన కూతురిని వనిత కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనిత కోసం గాలిస్తున్నారు. అయితే ఆమెకు చెన్నైలో స్థిర నివాసం లేకపోవడంతో ఆమెను కనిపెట్టి విచారించడం కష్టతరంగా మారింది. బిగ్‌బాస్ 3 సెట్లోకి పోలీసులు.. ఏ క్షణమైనా వనిత అరెస్ట్! బిగ్‌బాస్ హౌస్‌లో వనిత ఈ పరిస్థితుల్లో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో నటి వనిత ఆచూకీని తెలిపింది. బిగ్‌బాస్ సీజన్–3లో వనిత పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియన్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వసుంధర శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసు బృందం తెలంగాణ హోంమినిస్టర్ ఆదేశాల మేరకు బుధవారం చెన్నైకి వచ్చారు. చెన్నై పోలీసుల సహకారంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. వనితను ఆమె కూతురు జెనిత రాజన్ గురించి విచారించగా ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. మరోసారి విచారించిన వసుంధర శ్రీనివాస్ సాయంత్రం 5 గంటలలోపే జెనిత రాజన్ గురించిన సమాచారం అందించాలని హెచ్చరించారు. దీంతో వనిత తన కూతురిని బిగ్‌బాస్ హౌస్‌కు రప్పించారు. అయితే జెనితారాజన్ తన తల్లి, ఆమె తరఫు న్యాయవాది చెప్పినట్లుగా అమ్మతోనే ఉంటానని చెప్పింది. ఇదిలా ఉండగా తండ్రి ఆనందరాజ్.. వనిత తన కూతురిని కిడ్నాప్ చేసిందని, న్యాయస్థానం ఆదేశాలతోనే తాను తన కూతురి సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల సమయంలో కూతురిపై వనితకు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని, ఏదో దురుద్ధేశంతోనే తను తన కూతురిని కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. తన కూతురి ఇష్టాఇష్టాలు, తనకేం కావాలో, తన అవసరాలేంటో ఇంతకాలంగా పోషిస్తున్న తనకే తెలుసని, బిడ్డను తీసుకొచ్చి ఎక్కడో పరాయి పెంపకంలో ఉంచి బిగ్‌బాస్ రియాలిటీ గేమ్‌షోలో 100 రోజులు పాల్గొనడానికి సిద్ధం అయిన వనితలో తల్లి ప్రేమ ఎక్కడుందని ఆనంద్‌రాజ్ ప్రశ్నించారు. విచారణలో చివరికి తనకు బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోనే ముఖ్యం అని, కూతురు జెనితరాజన్ను తండ్రికే అప్పగించడానికి నటి వనిత అంగీకరించినట్లు తెలిసింది. బిగ్‌బాస్ హౌస్ నియమ నిభంధనలకు వ్యతిరేకంగా నటి వనిత తన కూతురును హౌస్‌లోకి తీసుకురావడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ వ్యవహారం ఆ హౌస్‌లో కలకలానికి దారి తీసింది. -
ఏ క్షణమైనా వనిత అరెస్ట్!
సాక్షి, చెన్నై : సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ల పెద్ద కుమార్తె వనిత వివాదం మరింత ముదురుతోంది. గత పదేళ్లుగా వనిత ఏదో ఒక వివాదంతో వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. కొంత కాలం పాటు తండ్రితో గొడవపడిని వనిత, భర్తనుంచి విడిపోయిన తరువాత కూతురి విషయంలో అతనితో గొడవపడుతున్నారు. ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా ఉన్న వనితను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు చెన్నైకి చేరుకున్నారు. 2007 ఆనంద్‌రాజ్‌ను వివాహం చేసుకున్న వనిత 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కూతురు జోవిత సంరక్షణ బాధ్యతల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వనిత తన కూతరిని చెన్నై తీసుకెళ్లి దాచిపెట్టినట్టుగా ఆనంద్ రాజ్ తెలంగాణ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఈ మేరకు వనితపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన విచారణ జరిపిన పోలీసులలు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ ఉన్న ఈవీపీ ఫిలిం సిటీ ప్రాంతానికి చెందిన నజ్రత్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించిన తెలంగాణ పోలీసులు వనిత అరెస్ట్‌కు సహకరించవలసిందిగా కోరారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సెట్లో ఉన్న వనితను తెలంగాణ పోలీసులు ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. -
నన్ను అలా వాడుకుంటున్నారు!
సినిమా: నా పేరును ప్రచారానికి వాడుకుంటున్నారని నటి ఓవియ ఆరోపిస్తోంది. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్ అమ్మడీమె. ఆ చిత్రం సక్సెస్‌తో వరుసగా పలు చిత్రాల అవకాశాలు టపటపా వచ్చేసినా వాటిలో ఏవీ పెద్దగా విజయం సాధించకపోవడంతో మంచి మార్కెట్‌ను సంపాదించుకోలేకపోయింది. అయితే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో–1లో పాల్గొన్న ఓవియకు పిచ్చ పిచ్చగా క్రేజ్ వచ్చేసింది. అంతే ఆ తరువాత సినిమా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కలవాని 2, 9 ఎంఎల్, కాంచన–3 చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడితో చిన్న ఇంటర్వ్యూ. ప్ర: ఓవియ ఎలాంటి అమ్మాయి? జ: చిన్న తనం నుంచి చాలా స్వేచ్ఛగా ఉండాలని అనుకునే అమ్మాయిని నేను. ఎవరిని ఎలాంటి సహాయం అడగను. నా చేతి కర్చులకు కూడా నేను సంపాదించుకునేదాన్ని. అలా ఆ వయసులో డబ్బు ఎలా సంపాదించాలన్న ఆలోచిస్తున్న సమయంలోనే మోడలింగ్ రంగంలో అవకాశం వచ్చింది. మోడలింగ్ నుంచే చిన్న చిన్న వాణిజ్య ప్రకటనల్లో నటించడం ప్రారంభించాను. ఆ సంపాదన నా పాకెట్ మనీకి సరిపోయేది. అలా నా మోడలింగ్ ఫొటోలను చూసిన దర్శకుడు సర్గుణం కలవాని చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం కల్పించారు. ఆ చిత్రంతో హెలెన్ అయిన నేను ఓవియగా మారాను. ప్ర: మీ జీవితాన్ని బిగ్‌బాస్ గేమ్ షోకు ముందు, ఆ తరువాత అని విడదీసి చూడవచ్చా? జ: చాలా మంది నేను రాత్రికి రాత్తే నటిగా పాపులర్ అయ్యాననుకుంటున్నారు. అది ఒక రకంగా నిజమే అయినా బిగ్‌బాస్ గేమ్ షో తరువాతనే నాకింత పేరు వచ్చింది. అయితే చాలా కష్టాలు, శ్రమ తరువాతనే నేనీ స్థాయికి చేరుకున్నాను. చాలా ఏళ్ల క్రితమే నటిగా పరిచయం అయ్యాను. అయితే మొదట్లో ఇంత పేరు రాలేదు. చాలా కాలం పోరాడాను. బిగ్‌బాస్ గేమ్ షో పూర్తి అయ్యి ఏడాది గడిచినా ప్రేక్షకులు నన్ను మరచిపోకపోవడం సంతోషంగా ఉంది. వెండితెర, బుల్లితెర ప్రేక్షకులు తనను వారి కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావిస్తున్నారు. ఇది నేను జీవితంలో మరచిపోలేని అనుభవం. అయితే కొందరు తన అభిమానుల్ని తప్పుదారి పటిస్తున్నారు. నేను చిన్న పాత్రల్లో నటించిన చిత్రాలకు కూడా నా పేరును ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇదే వేదనకు గురిచేస్తోంది. ప్ర: హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించాలన్న ఆశ ఉందా? జ: కచ్చితంగా ఉంది. అయితే నయనతార నటించిన అరమ్ లాంటి కథా చిత్రాలు కాకుండా, నేను నేనుగా ఉండే చిత్రాలనే నా అభిమానులు కోరుకుంటారు. కాబట్టి నేను చేసే చిత్రాలు భిన్నంగా ఉండాలి. సందేశాలిచ్చేవిగా ఉండరాదు. ప్ర: న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుపుకుంటారు? జ: నేనెప్పుడూ స్నేహితురాళ్లతోనే జరుపుకుంటాను. అదే విధంగా ఈ సారి కూడా. అయితే ఆ తరువాత నాకు నచ్చిన ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. అది హిమాలయాలు కూడా కావచ్చు. -
తమిళ బిగ్‌బాస్‌లో తెలుగు హీరో
ఇప్పటికే తెలుగు బిగ్ బాస్‌లో సందడి చేసిన టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌లో అడుగు పెడుతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ద్విభాష చిత్రం ‘నోటా’ ప్రమోషన్ కోసం విజయ్ తమిళ బిగ్‌బాస్ షోకు వెళ్లాడు. లోకనాయకుడు కమల్ హాసన్ అక్కడి బిగ్‌బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోకు వెళ్లి.. అక్కడ స్టేజ్ పై తన సినిమాను ప్రమోట్ చేసుకునే అవకాశం విజయ్ దేవరకొండకే దక్కింది. అక్టోబర్ 5న విడుదల కానున్న ‘నోటా’ సినిమాను తమిళ బిగ్‌బాస్ లో ప్రమోట్ చేసుకున్నాడు ఈ సెన్సెషన్ స్టార్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
ప్రేమికులను విడదీసిన బిగ్‌బాస్
చెన్నై : తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లానే తమిళ బిగ్‌బాస్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ బిగ్‌బాస్ మెహతా - ప్రాచీ అనే ప్రేమ జంటను విడదీసి, మెహతా - యషికా అనే మరో నూతన ప్రేమ జంటను తయారు చేసింది. ఆసక్తికరమైన ఈ ఎపిసోడ్ నిన్న ప్రసారం అయ్యింది. నిన్నటి ఎపిసోడ్లో మెహతా, యషికాను ప్రేమిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే మెహతా బిగ్‌బాస్ హౌస్‌కు రాకమునుపే ప్రాచీ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ షోకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి చెప్తూ తాను ప్రాచీని బాగా మిస్ అవుతున్నానని తెలిపాడు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మెహతా, హౌస్‌లో మరో కంటెస్టెంట్ అయిన యషికాకి దగ్గరయ్యాడు. నిన్నటి ఎపిసోడ్లో మెహతా, యషికాను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు మెహతా ఇలా చెప్పడంతో యషికా అభిమానులు ప్రాచీకి తమ సానుభూతిని తెలుపుతూ సోషల్‌మీడియాలో మెసెజ్‌ల మీద మెసెజ్‌లు పెడుతున్నారంట. దాంతో ప్రాచీ, మెహతాతో తన బంధం గురించి క్లారిటీ ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను షేర్ చేసింది. ఈ లేఖలో ప్రాచీ ‘నేను ఎంతో ప్రేమించిన వ్యక్తిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాను. మేమిద్దరం కలిసి మా భవిష్యత్ గురించి, బిగ్‌బాస్ షో గురించి ఎన్నో ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం పబ్లిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం మెహతా యషికాని ప్రేమిస్తున్నాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం నన్ను బాధపెట్టింది. అయితే ఇప్పుడు నేను మెహతాతో బ్రేకప్ చేసుకుంటున్నాను. అతను హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ విషయం గురించి అతనితో మాట్లాడతాను. ఇప్పుడు మీ అందరికి నా విన్నపం ఒక్కటే.. ఇక మెహతా గురించి నన్ను అడగడం ఆపేయండి’ అంటూ నెటిజన్లను కోరారు. గతంలో కమల్‌హసన్ మెహతా, యషికాల బంధం గురించి అడగ్గా మెహతా అలాంటిది ఏం లేదని చెప్పడంతో, యషికా కన్నీళ్లు పెట్టిన సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్: ప్రపోజ్ చేసిన కంటెస్టెంట్!
చెన్నై: తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లానే తమిళ బిగ్‌బాస్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ సామ్రాట్-తేజస్వీ, తనీష్-దీప్తి సునయనల బంధం స్నేహమా లేక అంతకు మించా అనే విషయం అర్థం కాలేదు. వాళ్లేమో స్నేహమే అంతకు మించి ఏమిలేదని చెబుతున్నారు. కానీ వారి ప్రవర్తన అలా అనిపించడం లేదు. ఇక తమిళ బిగ్‌బాస్‌లో యషికా-మెహతాల మధ్య బంధం మాత్రం ఈ రెండు జోడిలను మించింది. శుక్రవారం ఎపిసోడ్లో హౌస్‌కు అతిథులుగా వచ్చిన తొలి సీజన్ కంటెస్టెంట్స్ హరీష్ కల్యాణ్, రైజా విల్సన్‌లు వారి బంధంపై ఓ క్లారిటీ తీసుకొచ్చారు. వారి డెబ్యూ చిత్రం ‘ప్యార్ ప్రేమా కాదల్’ ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన ఈ మాజీ కంటెస్టెంట్స్ హౌస్‌మేట్స్‌ను యషికా-మెహతాల బంధం స్నేహానికి మించి ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా అని ప్రశ్నించారు. దీనికి కంటెస్టెంట్స్ అంతా అంగీకరించగా.. మెహతా మాత్రం తప్పుబట్టాడు. దీంతో ఒక్కసారిగా యషికా గుండె బద్దలైంది. ఆరోజంతా ఆమె ఏడుస్తూ బాధపడింది. ఇక ఈ వ్యవహారంపై హోస్ట్ కమల్ హాసన్ శనివారం ఆరాతీశాడు. తొలుత మెహతాను ప్రశ్నించగా.. తనకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని, తాను ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉన్నానని తెలిపాడు. ఆమె బయట నాకోసం వేచిచూస్తోందని ఆమెను బాధపెట్టే పని తను చేయనని సమాధానమిచ్చాడు. ఇక 19 ఏళ్ల యషిక మాట్లాడుతూ.. 50 రోజులుగా కలిసి ఉండటంతో అతని ప్రేమలో పడిపోయానని, కానీ అతని పరిస్థితి అర్థం చేసుకున్నానని తెలిపింది. అతని పరిస్థితిని గౌరవిస్తానని, కానీ తన వైఖరిని మాత్రం మార్చుకోలేనని పేర్కొంది. ఆమె నిజాయితికి కమల్ మురిసిపోయి ప్రశంసించాడు. ఇలాంటి సమయాల్లో అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని సూచించాడు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక గత సీజన్లో ఓవియా సైతం ఇలానే ప్రేమ వ్యవహారాలతో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. -
కమల్‌హాసన్‌పై కేసు
చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. కమల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్–2 రియాలిటీ షోలో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. లూయిసల్ రమేశ్ అనే లాయరు ఈ కేసు వేశారు. జయను ‘నియంత’తో పోల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో కావాలనే అమ్మపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. జయను కించపరుస్తూ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌లో నిర్వహించే టాస్కుల్లో భాగంగా ఒకరు డిక్టేటర్లా వ్యవహరించాల్సి వచ్చింది. వారాంతంలో ఆ టాస్క్‌పై చర్చ జరిపే క్రమంలో ‘రాష్ట్రాన్ని నియంతలా పాలించిన వారికి ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలుసు కదా’అని కమల్ వ్యాఖ్యానించారు. -
తమిళ బిగ్‌బాస్ షోపై భగ్గుమన్న హిందూ సంఘాలు
-
బిగ్‌బాస్ షోను వెంటనే నిషేధించాలి!
సాక్షి, చెన్నై : తమిళ బిగ్‌బాస్ షోపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ.. అశ్లీలకరంగా నడుస్తున్న ఈ షోను వెంటనే నిషేధించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్‌కు, ఈ షోను ప్రసారం చేస్తున్న విజయ్ టీవీకి వ్యతిరేకంగా గురువారం చెన్నైలో ధర్నా నిర్వహించాయి. ఈ సందర్బంగా హిందూ సంఘాల కార్యకర్తలు విజయ్ టీవీని ముట్టడించేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసుల అడ్డుకున్నారు. విజయ్ టీవీకి, కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా హిందూత్వ శ్రేణులు నినాదాలు చేశాయి. తమిళనాడులో బిగ్‌బాస్ షోను నిషేధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హిందూ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. బిగ్‌బాస్ షో పూర్తిగా అశ్లీలకరంగా నడుస్తోందని, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తోందని రోజురోజుకు తమిళనాడులో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. -
కాస్త వినిపించుకోండి!
అబ్బా.. ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ అదే పదే పదే చెప్తున్నారు అని హీరోయిన్ రాయ్‌లక్ష్మీ చిరాకు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. కమల్‌హాసన్ హోస్ట్‌గా చేస్తోన్న తమిళ బిగ్‌బాస్ సెకండ్ సీజన్లో రాయ్‌లక్ష్మీ ఒక పార్టిస్పెంట్ అంటూ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పి అలసిపోయాను. కాస్త విని పించుకోండి. తమిళ బిగ్‌బాస్ సెకండ్ షోలో నేను పార్టిస్పేట్ చేయడం లేదు. అనవసరంగా నా పేరును గెస్ చేస్తూ అమాయకులైన వీక్షకులను కొందరు ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని కాస్త షూటుగానే రెస్పాండ్ అయ్యారు రాయ్‌లక్ష్మీ. ప్రస్తుతం తమిళంలో ఒకటి, మలయాళంలో రెండు ప్రాజెక్ట్‌లు రాయ్‌లక్ష్మీ చేతిలో ఉన్నాయి. -
‘అందుకే ఓవియా నచ్చింది’
తమిళసినిమా: నటి ఓవియ తనకు నచ్చడానికి కారణం అదే అంటున్నాడు నటుడు ఆరవ్. వీరిద్దరి గురించి ఆ మధ్య పెద్ద చర్చే జరిగిందన్నది తెలిసిన విషయమే. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న వారి లో ఆరమ్, ఓవియ కూడా ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరి మధ్య ఆ గే మ్ షోలోనే ప్రేమ వ్యవహారం సాగిందని, అయితే ఓవియ పెళ్లి ప్రపోజల్ చేయగా ఆరవ్ రివర్స్ గేర్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతే కాదు ఆరమ్ తన ప్రేమను నిరాకరించడంతో మానసిక వేదనకు గురైన ఓవియ ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు ప్రచారం హోరెత్తింది. దీంతో నటి ఓవియ మళ్లీ మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టింది. అనంతరం ఆరవ్, ఓవియ సహజంగానే మసులుకోవడం మొదలెట్టారు. నటి ఓవియ ఆ గేమ్ షోలో గెలవకపోయినా, అంత కంటే ఎక్కువే ప్రాచుర్యం పొందింది. దీంతో కొత్తగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అంతే కాదు వాణిజ్య ప్రకటనలు తలుపు తడుతున్నా యి. మొత్తం మీద ఓవియ సెలబ్రిటీ నటి అయిపోయింది. అప్పుడు తన ప్రేమను నిరాకరించిన ఆరవ్ ఇప్పుడు ఓవియానే తనకు ఇష్టమైన నటి తను అని అంటున్నాడు. ఈయన ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో ఓవియ తనకు నచ్చడానికి కారణం ఏమంటంటే యథార్థంగా ఉండడం ప్రపంచంలోనే కష్టమైన విషయం అన్నారు. నిజజీవితంలోనూ ఏదో విధంగా నటిస్తూనే ఉంటామన్నారు. అయితే నటి ఓవియ ఎప్పుడూ తనలాగే ఉంటుందని అందుకే ఆమె తనతో పాటు అందరికీ నచ్చుతుందని పేర్కొన్నాడు. -
డాక్టర్ ఎస్ అనిత ఎంబీబీఎస్
బయోపిక్ ట్రెండ్స్ నడుస్తున్న ఈ తరుణంలో కోలీవుడ్‌లో మరో బయోపిక్కు రంగం సిద్దమైంది. అయితే ఈ బయోపిక్ ఏ క్రీడాకారుడో లేక సెలబ్రిటీ జీవిత కథాంశంగానో తెరకెక్కడం లేదు. డాక్టర్ కావాలని కన్న కలలను నీట్ పరీక్ష నీరుగార్చడంతో ఆత్మహత్య చేసుకున్న ఓ సాధారణ యువతి జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఎస్ అనిత అనే ఓ తమిళ యువతి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీట్ పరీక్షలో అర్హత సాధించలేకపోయింది. దీంతో నీట్ పరీక్ష రద్దు చేయాలని ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోనే కాక పలు రాష్ట్రాల్లోను ఆందోళనలు జరిగాయి. అనిత జీవితం ఆధారంగానే తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె పాత్రలో తమిళ బిగ్‌బాస్ ఫేమ్ జూలీ నటిస్తున్నారు. ఆర్జే పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘డాక్టర్ ఎస్. అనిత ఎంబీబీఎస్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల కాగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. -
తమిళ ‘బిగ్‌బాస్’ విజేత ఎవరంటే..?
చెన్నై: తమిళంలో ఆసక్తికరంగా సాగిన సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ముగిసింది. నటుడు ఆరవ్ విజేతగా నిలిచాడు. ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫైనల్లో అతడిని కార్యక్రమ వ్యాఖ్యాత కమల్‌హాసన్ విజేతగా ప్రకటించారు. అతడికి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్ బాస్’ ట్రోఫీని అందజేశారు. ఫైనల్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్, నిర్మాత దిల్‌రాజు అతిథులుగా హాజరయ్యారు. వీక్షకుల నుంచి ఈ షోకు మొత్తం 76.7 కోట్ల ఓట్లు వచ్చినట్టు కమల్‌హాసన్ వెల్లడించారు. స్టార్ విజయ్ చానల్లో 100 రోజులపాటు కొనసాగిన తమిళ బిగ్‌బాస్ షోలో చివరికి హౌస్‌లో ఆరావ్, హరీశ్ కళ్యాణ్, స్నేహన్, గణేశ్ వెంకట్రామన్ మిగిలారు. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను గతవారం వీరంతా కలబోసుకున్నారు. అయితే గణేశ్ వెంకట్రామన్ విజేతగా నిలుస్తాడని సోషల్ మీడియాతో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆరావ్ ‘బిగ్‌బాస్’ అయ్యాడు. షో నుంచి అనూహ్యంగా బయటికెళ్లిన నటి ఓవియ మిగతా పోటీదారులతో కలిసి ఫైనల్ ఎపిసోడ్‌కు రావడం విశేషం. ‘నువ్వు కొంచెం బరువు తగ్గినట్టుగా కనిపిస్తున్నావ’ని ఆరవ్తో ఓవియ మాట కలిపింది. ప్రత్యేక ఆకర్షణ అదే... బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఓవియ, ఆరవ్ మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి కారణంగా బిగ్‌బాస్ టీఆర్పీ రేటు బాగా పెరిగింది. ఓవియ అనుహ్యంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయడం పెద్ద సంచలనానికే దారి తీసింది. ఆమెకు అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. జూన్ 25న 19 మంది పోటీదారులతో ప్రారంభమైన ’బిగ్‌బాస్’ సెప్టెంబర్ 30న ముగిసింది. రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని కమల్‌హాసన్ ప్రకటించడంతో రెండో సీజన్‌కు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. కాగా, బిగ్‌బాస్ వేదికపైనే కమల్‌తో భారతీయుడు సీక్వెల్ చేయనున్నట్టు దర్శకుడు శంకర్ ప్రకటించారు. -
బిగ్ బాస్‌కు షాక్ : వందకోట్లకు పరువు నష్టం దావా
కోలీవుడ్ లో బిగ్ బాస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థల నుంచి వ్యతిరేకతతో పాటు, కేసులను కూడా ఎదుర్కొంటున్న ఈ షో. తాజాగా మరో వివాదానికి కారణమైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్‌హాసన్, పార్టిసిపెంట్ గాయత్రి రఘురామ్‌పై వంద కోట్లకు పరువు నష్టం దావా దాఖలైంది. షోలో భాగంగా పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్.. మరో పార్టిసిపెంట్ను అలగాజన ప్రవర్తన (మురికివాడలో ఉండే వ్యక్తి) అని తిట్టడంపై పుతియ తమిళగమ్ సంఘం సభ్యులు ఫైర్ అయ్యారు. ఈ మాటలతో సమాజంలో ఉన్న పేద వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. కమల్ హాసన్, ఈ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పకపోవడంపై కూడా వారు ఘాటుగా స్పందించారు. కమల్ ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఆయన సరిగా స్పందించలేదని ఆరోపించారు. వారం రోజుల్లోగా కమల్, గాయత్రిలు క్షమాపణ చెప్పక పోతే వంద కోట్లు పరువు నష్టం కింద ఇవ్వాలని పుతియ తమిళగమ్ సంఘం నేత డాక్టర్ క్రిష్ణస్వామి డిమాండ్ చేశారు.