
చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. కమల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్–2 రియాలిటీ షోలో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. లూయిసల్ రమేశ్ అనే లాయరు ఈ కేసు వేశారు. జయను ‘నియంత’తో పోల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో కావాలనే అమ్మపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. జయను కించపరుస్తూ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌లో నిర్వహించే టాస్కుల్లో భాగంగా ఒకరు డిక్టేటర్‌లా వ్యవహరించాల్సి వచ్చింది. వారాంతంలో ఆ టాస్క్‌పై చర్చ జరిపే క్రమంలో ‘రాష్ట్రాన్ని నియంతలా పాలించిన వారికి ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలుసు కదా’అని కమల్ వ్యాఖ్యానించారు.