defaming
-
కమల్‌హాసన్‌పై కేసు
చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. కమల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్–2 రియాలిటీ షోలో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. లూయిసల్ రమేశ్ అనే లాయరు ఈ కేసు వేశారు. జయను ‘నియంత’తో పోల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో కావాలనే అమ్మపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. జయను కించపరుస్తూ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌లో నిర్వహించే టాస్కుల్లో భాగంగా ఒకరు డిక్టేటర్లా వ్యవహరించాల్సి వచ్చింది. వారాంతంలో ఆ టాస్క్‌పై చర్చ జరిపే క్రమంలో ‘రాష్ట్రాన్ని నియంతలా పాలించిన వారికి ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలుసు కదా’అని కమల్ వ్యాఖ్యానించారు. -
‘సోషల్ మీడియాలో మమ్మల్ని కించపరిచే పోస్ట్‌లు’
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పార్లమెంట్ సభ్యుల్ని కించపరుస్తూ అనేక పోస్టులు వస్తున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ కోరారు. ఆయన గురువారం రాజ్యసభ జీరో ఆవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. సామాజిక మాధ్యమాలు విస్తృతం అవడంతో ఎంపీలను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ రాజకీయ ప్రత్యర్థులు తమను అవమానిస్తున్నారని ఎంపీ నరేష్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ఎదుర్కొవడానికి చట్టాల్లో మార్పులు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంపీల జీతభత్యాలపై ప్రజల్లో లేనిపోని అపోహాలు సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులు కల్పిస్తున్నారని నరేష్ అగర్వాల్ ఆరోపించారు. ఎంపీలకు అన్ని సౌకర్యాలు, వారికి జీతాలు అంత పెంచారు...ఇంత పెంచారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దీనివల్ల తాము ప్రజల్లోకి వెళ్లినప్పుడు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇటువంటి పోస్టులను ఎదుర్కొవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విధివిధానాల్ని రూపొందించాలని అన్నారు. కాగా, నరేష్ అగర్వాల్ వాఖ్యలు సభలో కాసేపు నవ్వులు విరిసాయి. మరోవైపు ఈ అంశంపై ఎంపీ నరేష్ అగర్వాల్‌కు కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా మద్దతు తెలిపారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ మాట్లాడుతూ..తాను కూడా సోషల్‌మీడియా బాధితుడినే అంటూ వాఖ్యానించారు. నరేష్ అగర్వాల్ వాఖ్యలపై పార్లమెంట్వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. ఈ అంశంపై ఏం చేయాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని, త్వరలో దీనిపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సభలో ప్రకటించారు. -
'మన శాశ్వత సభ్యత్వానికి గండికొడుతున్నారు'
లక్నో: కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే అసహనం అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటుందని, దీని వల్ల దేశ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ లక్నోలో అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అనేక దేశాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్నా, కాంగ్రెస్ రాజకీయ విధానాలు ఆ అవకాశాలకు గండి కొట్టేవిలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో కంటే ఇప్పుడు దేశంలో అసహనం ఎక్కువగా ఉందా అని షానవాజ్ ప్రశ్నించారు. అసహనం అంశాన్ని పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని అసహన ఆరోపణలతో భంగపరచలేరని షానవాజ్ స్పష్టం చేశారు.