Makkal Needhi Maiam
-
రాజ్యసభకు కమల్ హాసన్?
చెన్నై, సాక్షి: సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే చర్చ తమిళనాట జోరుగా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించిన ఆయన.. డీఎంకే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లను కూటమి కైవసరం చేసుకుంది. దీంతో ఆయన్ను పెద్దల సభకు నామినేట్ చేయాలని డీఎంకే భావిస్తోందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ నుంచి ఆరు సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన కమల్‌ను రాజ్యసభకు పంపే యోచనలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారట. తాజాగా.. బుధవారం తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(MNM) ప్రతినిధి మురళి అప్పాస్.. తమ పార్టీకి ఓ రాజ్యసభ సీటు దక్కబోతుందనే విషయాన్ని ధృవీకరించారు. అయితే అది ఎవరనేది పార్టీ అధ్యక్షుడు కమల్ హాసనే నిర్ణయిస్తారని తెలిపారాయన. శేఖర్‌బాబుతో కమల్ జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించేందుకు నిరాకరించారు.2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్ఎంఎం పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. -
రెండు రోజుల్లో శుభవార్త వింటారు: కమల్ హాసన్
చెన్నై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో శుభవార్త చెప్తానని ప్రకటించారు నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎమ్ఎన్ఎమ్) పార్టీ అధినేత కమల్ హాసన్. పార్లమెంట్ ఎన్నికల కోసం సద్ధమవుతున్నామని.. తమకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో పొత్తుకు సంబంధించి నిర్ణయం ప్రకటిస్తామని కమల్ హాసన్ వెల్లడించారు. తన తదుపరి చిత్రం ‘థగ్ లైఫ్’ షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన కమల్ సోమవారం చెన్నై తిరిగొచ్చారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీతో కమల్ ఎమ్ఎన్ఎమ్ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో డీఎంకే నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్‌తో పోత్తుపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అంతేగాక సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వివాదాస్ప వ్యాఖ్యలకు మద్దతుగా కమల్ హాసన్ నిలిచారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకే చిన్న పిల్లావాడిని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఇక 2018లో కమల్ హాసన్ ఎమ్ఎన్ఎమ్ పార్టీని స్థాపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అనంతరం గత ఏడాది జరిగిన ఈరోడ్ ఉప ఎన్నికల్లో డీఎంకే నిలబెట్టిన అభ్యర్థికి ఎమ్ఎన్ఎమ్ మద్దతు ఇచ్చింది. చదవండి: యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్ఎస్ఎస్పీ’ -
రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొనున్న కమల్ హాసన్
న్యూఢిల్లీ: రాజకీయవేత్త తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ శనివారం రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల తోపాటు పార్లమెంటేరియన్లు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ముక్కల్ నీది మయ్యం(ఎంకెఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ తదితరులు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక కమల్ హాసన్ కూడా రాహుల్ తనను యాత్రలో పాల్గొనమని ఆహ్వానించారని, డిసెంబర్ 24న ఢిల్లీలో జరిగే భారత్ జోడో యాత్రోల పాల్గొంటానని చెప్పారు కూడా. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ యాత్రలో సుమారు 40 వేల నుంచి 50 వేల మంది దాక పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి అన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని బదర్పూర్ సరిహద్దులోకి ప్రవేశించనున్న ఈ యాత్రలో వివిధ రంగాలకు చెందిన ప్రజలు చేరతారు. ఆపోలా ఆస్పత్రి మీదుగా వెళ్లి.. ఆ తర్వాత భోజన విరామం తీసుకుని యాత్ర తిరిగి ప్రారంభిస్తామని చౌదరి చెప్పారు. ఆ తదనంతరం నిజాముద్దీన్ వైపు వెళ్లి, ఎర్రకోట వైపు వెళ్లే ముందు ఇండియా గేట్ సర్కిల్ ఐటీఓ ఢిల్లీ కాంట్ దర్యాగంజ్వైపు యాత్ర సాగనుందని వెల్లడించారు. అక్కడ రాహుల్, యాత్రలో పాల్గొన్న మరికొందరు నేతలు కారులో రాజ్‌ఘాట్, వీర్బూమి, శాంతివన్లను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని చెప్పారు. జనవరి 3న ఉత్తరప్రదేశ్ నుంచి యాత్ర పునః ప్రారంభమవుతుందని, మళ్లీ రెండోవ దశలో హర్యానాకు, ఆపై పంజాబ్ నుంచి కాశ్మీర్‌వైపు యాత్ర సాగనుందని వివరించారు. కాగా సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో పర్యటించింది. (చదవండి: టీవీ మెకానిక్ కూతురు..తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా) -
తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. డీఎంకేతో కమల్ దోస్తీ?
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూటమితో కలిసి ముందుకు సాగాలని మక్కల్ నీది మయ్యం వర్గాలు భావిస్తున్నాయి. అధికార డీఎంకేతో జత కట్టాలంటూ.. పార్టీ అధినేత కమల్‌కు వివిధ జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు సూచించారు. వివరాలు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను మక్కల్ నీది మయ్యం ఒంటరిగానే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవడంతో పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఆపార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం చెన్నైలో జరిగింది. పార్టీ పరంగా ఉన్న 85 జిల్లాల కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, పార్టీ ఉపాధ్యక్షులు మౌర్య, తంగవేలు, కార్యదర్శి సెంథిల్ అర్ముగం, శివ ఇలంగో, స్నేహన్, మూకాంబీకై, మురళీ అబ్బాస్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధినేత, నటుడు కమల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కూటమి కోసం పట్టు.. లోక్‌సభ ఎన్నికలను ఈ సారి బలమైన కూటమితో కలిసి ఎదుర్కొంద్దామని, గతంలో చేసిన తప్పులు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడికి నేతలు విజ్ఞప్తి చేశారు. డీఎంకేతో జత కట్టే విధంగా, మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయడానికి సంబంధించిన వివరాలను కొందరు నేతలు అందజేసినట్లు సమాచారం. ఎక్కువమంది మంది డీఎంకే కూటమితో ఎన్నికలను ఎదుర్కొంద్దామని, ఇందుకు సంబంధించిన నిర్ణయం ముందే తీసుకోవాలని కమల్‌ను కోరారు. చివర్లో కమల్ ప్రసంగిస్తూ, కూటమి గురించి పట్టించుకోవద్దని, ఈ వ్యవహారంపై తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. ఎవరితో కలిసి వెళ్లాలి..? అనే విషయాన్ని పక్కన పెట్టి, ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. అలాగే చెన్నైలో మక్కల్ నీది మయ్యం కోసం భారీ కల్యాణ వేదికను నిర్మించను న్నట్లు ఈసందర్భంగా కమల్ ప్రకటించారు. -
వరుస ఎదురుదెబ్బలు.. తలపట్టుకుంటున్న కమల్‌హాసన్
సాక్షి, చెన్నై: వరుస ఎదురుదెబ్బలు మక్కల్‌నీది మయ్యం వర్గాల్ని డీలా పడేలా చేశాయి. ఆ పార్టీకి ఏకంగా కొన్ని జిల్లాల్లో కార్యదర్శులే కరువయ్యారు. దీంతో ఈ పదవుల భర్తీ కోసం పార్టీ పరంగా ప్రకటన ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వ నటుడు కమలహాసన్ మక్కల్ నీది మయ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో ఎదుర్కొన్న తొలి లోక్‌సభ ఎన్నికల్లో దక్కిన ఓటు బ్యాంక్ ఆ పార్టీలో కొంత మేరకు ఉత్సాహాన్ని నింపాయి. ఆ తదుపరి స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిల పడ్డారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. పార్టీ అధ్యక్షుడు కమల్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీలోని ముఖ్యులందరూ గుడ్ బై చెప్పడం మొదలెట్టేశారు. అనేకమంది జిల్లాల పార్టీకార్యదర్శులు ఇతరపార్టీల్లోకి వెళ్లి పోయారు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ కమల్ పార్టీకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతం పార్టీ బలోపేతం దిశగా కమల్ మళ్లీ అడుగులు వేస్తున్నారు. ప్రజలు ఏదో ఒక రోజు తమకు పట్టం కడుతారనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానం అనేక జిల్లాల్లో పార్టీ కార్యదర్శులుగా వ్యవహరించేందుకు స్థానికంగా ఉండే ముఖ్యులు ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇప్పటికే జేబులకు పడ్డ చిల్లుతో సతమతం అవుతున్న నేతలకు తమకు పదవులు వద్దు బాబోయ్ అని దాట వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి సేవల్ని అందిస్తున్న కార్యకర్తల్ని ఆ పదవులకు ఎంపిక చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకు కోసం దరఖాస్తులు చేసుకోవాలని మక్కల్ నీది మయ్య పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం కాంచీపురం, చెంగల్పట్టు, దిండుగల్, తంజావూరు, తిరువారూర్, తెన్కాశి, విరుదునగర్, తూత్తుకుడి, తదితర 15 జిల్లాలకు కార్యదర్శులు కావాలంటూ.. ప్రకటన ఇచ్చుకో వాల్సిన దుస్థితి ఏర్పడడం గమనార్హం. పార్టీకి సేవల్ని అందించే కార్యకర్తలు, కమల్ మీద నమ్మకం కల్గిన వాళ్లు దరఖాస్తులు చేసుకోవచ్చంటూ ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రకటించడం విశేషం. చదవండి: Roja Selvamani: ఆ రోజున రోజాకు అభినందన సభ.. ఎందుకంటే ? -
Tamil Nadu: పార్టీ బలోపేతానికి కమల్ హాసన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: మక్కల్ నీది మయ్యంను బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర పర్యటనకు విశ్వనటుడు కమల్ సిద్ధమవుతున్నారు. ఇందుకు తగ్గ రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా విశ్వనటుడు కమల హాసన్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యం ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా తమకంటూ ఓటు బ్యాంక్ ఉందని కమల్ చాటుకున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. కమలహాసన్ సైతం ఓటమి పాలయ్యారు. అలాగే, ఇటీవలి నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి నిరాశే మిగిలింది. దీంతో పార్టీని సంస్థాగత స్థాయి నుంచి బలోపేతం చేసి, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల్ నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్నారు. కమల్ తన పర్యటనలో ప్రజాగళాన్ని తన గళంగా వినిపించే విధంగా ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాలు, పట్ట ణాలు, నగరాల్లోని పార్టీ వర్గాల ద్వారా స్థానిక సమస్యలపై అధ్యయానికి నిర్ణయించారు. దీంతో రేషన్ దుకాణాలు, గ్రామీణ ప్రజలు ఏకమయ్యే రచ్చ బండల వద్దకు చేరుకుని స్థానిక సమస్యలను తెలుసుకునే పనిలో మక్కల్ నీది మయ్యం వర్గా లు నిమగ్నమయ్యాయి. ఇప్పటి నుంచే ప్రజల్లో మమేకమయ్యే విధంగా కమల్ కార్యక్రమాలు ఉంటాయని, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి బలమైన పార్టీగా తీర్చిదిద్దుతామని నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
నేనున్నా లేకున్నా, మరో 50 ఏళ్లు కొనసాగాలి: కమల్ హాసన్
సాక్షి, చెన్నై: తాను సొమ్ము చేసుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ చేయడానికే వచ్చానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, విశ్వనటుడు కమల్ హాసన్ తెలిపారు. తనను అడ్డం పెట్టుకుని గల్లాపెట్టె నింపుకునే యత్నం చేసిన వారందర్నీ బయటకు పంపించినట్టు పేర్కొన్నారు. మక్కల్ నీది మయ్యం ఏర్పాటు చేసి సోమవారంతో ఐదేళ్లయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నై ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుక నిరాడంబరంగా జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కమల్ ప్రసంగించారు. తన జీవితం ప్రజల కోసమేనని, ఆ దిశగా రామేశ్వరంలో పార్టీ ఆవిర్భావ వేడుక జరిగిందని గుర్తు చేశారు. ఈసమయంలో తన వెన్నంటి ఉన్న వాళ్లు ఇప్పుడు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కొందరు వ్యాపార దృక్పథంతో పార్టీలోకి వచ్చారని, మరి కొందరు తనను అడ్డం పెట్టుకుని వారి గల్లాపెట్టె నింపుకునే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు నినాదంతోనే తన పయనం కొనసాగుతుందన్నారు. చదవండి: (తొలిసారి విదేశీ పర్యటనకు సీఎం స్టాలిన్.. అందుకోసమేనా..?) ప్రజా సేవే లక్ష్యం .. బహుళ అంతస్తుల భవనాల్లో కూర్చుని పంచాయితీలతో, బెదిరింపులతో ఆస్తులను కూడ బెట్టుకునే కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని పరోక్షంగా డీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో తన కన్నా కోటీశ్వరుడు మరొకరు ఉండరని భావిస్తున్నానని పేర్కొన్నారు. నిజాయితీతో ప్రజా సేవ చేయడమే తన లక్ష్యం, ఆశయం అని వ్యాఖ్యానించారు. తనను కొందరు నాన్న..అని మరికొందరు..తాతా...అని ఇంకొందరు బిగ్ బాస్ అని పిలుస్తూ, వారి ప్రేమను చాటుకుంటున్నారని వివరించారు. చిన్న తనం నుంచి ఇప్పటి వరకు తన మీద ఉంచిన అభిమానం, ప్రేమ రాష్ట్ర ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. అందుకే మార్పు నినాదంతోప్రజల జీవితాల మెరుగు కోసం తాప త్రయ పడుతున్నానని తెలిపారు. ఆవిర్భావ వేడుకలు తాను ఉన్నా లేకున్నా, మరో 50 ఏళ్లు కొనసాగాలని ఆంక్షించారు. అనంతరం సచివాలయంలో సీఎస్ ఇరై అన్భును కమల్ కలిశారు. గ్రామ పంచాయతీల తరహాలో నగర సభలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరాల్లోని ప్రజలు వారి సమస్యల్ని ఈ సభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించాలని విన్నవించారు. -
పనిచేస్తారా? తప్పుకుంటారా.. పార్టీ శ్రేణులకు కమల్ వార్నింగ్!
‘‘పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. ఇందుకోసం ప్రతిఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. అప్పుడే స్థానిక ఎన్నికల్లో సత్తాచాటగలం. గెలుపుగుర్రాలను గుర్తించి.. ప్రోత్సహించాలి అలా పనిచేయలేని వారు గౌరవంగా తప్పుకోండి..’’ అంటూ ఎంఎన్ఎం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ తేల్చిచెప్పారు. సాక్షి, చెన్నై: ‘పరాచకాలొద్దు..పనిచేయండి..లేదా తప్పుకోండి’ అని పార్టీ జిల్లా కార్యదర్శులను మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్ హెచ్చరించారు. లక్ష్యాల సాధనకు వారికి 70 రోజుల గడువు కూడా విధించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమరం కోసం కమల్ ఈమేరకు కసరత్తు ప్రారంభించారు. రాజకీయ అరంగేట్రం చేసి, తొలిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టినా.. కమల్‌హాసన్ బోణి కొట్టలేక పోయారు. అయితే కనీస ఓట్ల శాతాన్ని మాత్రం తన పార్టీ ఖాతాల్లో వేసుకోగలిగారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించినా ఎక్కడా గెలుపు మాత్రం దక్కలేదు. చదవండి: వైరల్ : పండిత్ రవిశంకర్‌తో రజనీకాంత్.. ఫోటో వైరల్ కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి స్వయంగా తాను పోటీ చేసి.. చివరి రౌండ్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. పార్టీ అధ్యక్షుడే ఓడిపోవడంతో ప్రధాన కార్యదర్శి సహా పార్టీ కీలక పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బాధ్యతలను కమల్‌హాసనే మోస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను చాలెంజ్‌గా తీసుకున్న కమల్.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. చదవండి: కోపంతో చేతిలోని ఫోన్ విసిరిన మంత్రి కొప్పుల ఈశ్వర్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం.. ఇందుకు సంబంధించి గత వారం పార్టీ కార్యదర్శులతో సమావేశమైనారు. పార్టీ నిర్వహణపై అలసత్వం, అలక్ష్యం వద్దు, సీరియస్‌గా తీసుకోండని జిల్లా కార్యదర్శులకు హితవు వలికినట్లు సమాచారం. అంతేగాక పార్టీ బలోపేతానికి 70 రోజులు గడువు విధిస్తూ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి పార్టీ నిర్వాహకుడు ఒకరు సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గడువు విధించిన మాట నిజమే, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే ఆయన లక్ష్యమని వెల్లడించారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో సరైన అర్హత కలిగిన కొత్త వారిని నియమించాలి. పార్టీ శాఖలు ఏర్పడని గ్రామాలు, ఊర్లు లేవనే స్థితికి రావాలి. ఈ పనులన్నీ 70 రోజుల్లోగా పూర్తి చేయాలి. గడువులోగా ఈ పనులన్నీ పూర్తి చేయని పక్షంలో ఎవరికి వారు బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి. ఈ ఉత్తర్వులు వెలువడి ఇప్పటికే పదిరోజులు పూర్తయ్యింది. పార్టీ కార్యక్రమాలు కూడా వేగం పుంజుకున్నాయి. ఒక్కో జిల్లా కార్యదర్శి పరి«ధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి. ఇలా 114 జిల్లా కార్యదర్శులు పార్టీ బలోపేతం కోసం వారికి అప్పగించిన పనులు కిందిస్థాయి కార్యకర్తల సహకారంతో గడువులోగా పూర్తి చేయాల్సి ఉంది. 20 రోజులకు ఒకసారి తాము పూర్తి చేసిన పనుల వివరాలపై పార్టీ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాలి. ఈమేరకు సర్క్యులర్, వీడియో కాన్ఫరెన్స్, ప్రత్యక్ష సమావేశాల ద్వారా కమల్‌హాసన్ సదరు ఆదేశాలను జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని సమాయుత్తం చేయడం ఎంతో అవసరమని కమల్ పట్టుదలను ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
సినీ నటిని పెళ్లాడబోతున్న 'బిగ్‌బాస్' ఫేం స్నేహన్
చెన్నై: సినీ గీత రచయిత, నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శి స్నేహన్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. 700 పైగా చిత్రాలకు 2,500కు పైగా పాటలను రాసిన రచయిత స్నేహన్. ప్రస్తుతం ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నటి కన్నిక రవిని స్నేహన్ వివాహం చేసుకోబోతున్నారు. పెద్దల సమ్మతితో ఈ నెల 29న నటుడు కమలహాసన్ సమక్షంలో చెన్నైలో వివాహం చేసుకుంటు న్నారు. స్నేహన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినట్లు తెలిపారు. -
కమల్‌కు గుడ్ బై.. డీఎంకేలో చేరిన మహేంద్రన్
సాక్షి, చెన్నై : మక్కల్ నీది మయ్యం నుంచి బయటకు వచ్చిన మహేంద్రన్ గురువారం డీఎంకేలో చేరారు. మక్కల్ నీది మయ్యం ఆవిర్భావానికి ముందు నుంచి మహేంద్రన్ నటుడు కమల్ వెన్నంటి ఉంటూ ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. తొలుత కోయంబత్తూరు లోక్‌సభ ఎన్నికల్లో, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సింగానల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కమల్‌కు దూరమై ఆ పార్టీని వీడారు. పొత్తు విషయంగా కమల్ చేసిన తప్పును ఎత్తి చూపుతూ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో డీఎంకేలో చేరాలని నిర్ణయించుకుని గురువారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్ నేతలు టీఆర్ బాలు, కేఎన్ నెహ్రూ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు అనేక మంది నేతలు డీఎంకేలో చేరారు. ఆయనకు స్టాలిన్ సభ్యత్వ కార్డును అందజేశారు. -
ప్రాణమున్నంత కాలం రాజకీయాల్లోనే
సాక్షి, చెన్నై: ప్రాణం ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగుతానని విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కమల్ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యంకు ఎదురైన పరాజయం గురించి తెలిసిందే. కమలహాసన్ సైతం ఓటమి పాలయ్యారు. ఈ పరిణామాలు మక్కల్ నీది మయ్యంలో చిచ్చు రగిల్చింది. ప్రధానంగా కూటమి విషయంలో కమల్ తప్పటడుగు వేశారంటూ ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు విమర్శలు గుప్పించడమే కాదు, పార్టీని వీడే పనిలో పడ్డారు. అగ్ర నేతలు ఒకరి తర్వాత మరొకరు బయటకు వెళ్తుండటంతో మక్కల్ నీది మయ్యం గుడారం త్వరలో ఖాళీ కావడం తథ్యం అన్న సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, కమల్ రాజకీయాల నుంచి వైదొలగేనా అన్న చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో సోమవారం కమల్ ఓ ట్విట్ చేశారు. ప్రాణం ఉన్నంత వరకు తాను రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. మక్కల్ నీది మయ్యం నుంచి ఎందరు బయటకు వెళ్లినా, తాను మాత్రం రాజకీయ పయనాన్ని వీడబోనని స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటు సమయంలో నోరు మెదపని వాళ్లు ఇప్పుడు కుంటి సాకులు చెప్పడం శోచనీయమని విమర్శించారు. పూర్వ కాలంలో వ్యాపారులు ఓ చోట పని ముగించుకుని మరో చోటకు వెళ్లడం జరుగుతూ వచ్చేదని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఇక్కడ వ్యాపారం లేని దృష్ట్యా, మరో చోటకు వెళ్తున్నట్టుందని బయటకు వెళ్లిన వారిని ఉద్దేశించి విమర్శించారు. ఎంత మంది బయటకు వెళ్లినా, తాను మాత్రం రాజకీయ పయనాన్ని కొనసాగిస్తానని, కేడర్ అథైర్య పడ వద్దు అని, మరింత ఉత్సాహంగా పనిచేద్దామని, మరింత బలాన్ని పంజుకునే రీతిలో శ్రమిద్దామని పిలుపునిచ్చారు. -
కమల్ హాసన్ పార్టీకి మరో ఎదురుదెబ్బ
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కమల్ హాసన్ హాసన్ మక్కల్ నీధి మయ్యమ్(ఎంఎన్ఎం)పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడుతో సహా కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లోకి సీకే కుమారవేల్ చేరారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలకంగా ఉన్న సీకే కుమారవేల్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహత్మక బృందం తప్పుడు విధానాలను అవలంభించిందని ఆయన ఆరోపించారు. ‘‘వ్యక్తిపూజకు ఆస్కారం లేదు. లౌకికవాద ప్రజాస్వామ్య రాజకీయాల్లో నేను ప్రయాణించాలనుకుంటున్నా.. మేము చరిత్రను సృష్టించాల్సింది. కానీ, చరిత్రను చదువుతున్నాం’’ అని కమల్‌కు కుమార్వేల్ చురకలంటించారు. ఎంఎన్ఎం ఉపాధ్యాక్షుడు ఆర్ మహేంద్రన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబులు రాజీనామా చేయగా.. చెన్నైలోని ఓ స్థానం నుంచి పోటీచేసిన పర్యావరణ కార్యకర్త పద్మ ప్రియ సైతం వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. అలాగే నిన్న(బుధవారం ) మరో నేత ఎం మురుగానందమ్ రాజీనామా చేశారు. కాగా మే 2న తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి కమల్పా ర్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరుగురు పార్టీని వీడారు. తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాల్లో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. కోయంబత్తూరు దక్షిణ నుంచి పోటీచేసిన ఆయన కూడా ఓటమిపాలయ్యారు. చదవండి: కులం పేరుతో అవమానం.. ఖండించిన కమల్ హాసన్ కేరళ సీఎంగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం -
కమల్ హాసన్ పార్టీకి బీటలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు కమల్‌హాసన్ అధ్యక్షుడుగా ఉన్న మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చవిచూసిన ఘోర పరాజయం ఆ పార్టీ బీటలు వారేలా చేసింది. ఉపాధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా చేసింది. తాజా ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను 154 స్థానాల్లో పోటీచేసిన ఎంఎన్ఎం మిగిలి న స్థానాలను కూటమి పార్టీలకు కేటాయించింది. ఇండియ జననాయక కట్చి కూటమికి సారథ్యం వహిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్దిగా కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌హాసన్ బీజేపీ అభ్యర్ది చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతోపాటు ఆ పార్టీ అభ్యర్దులెవరూ గెలవలేదు. ఈ ఓటమిపై కమల్ వైఖరి ఎలా ఉన్నా పార్టీ శ్రేణు లు మాత్రం జీర్ణించుకోలేక పోయాయి. పార్టీ అధ్యక్షుడైన కమల్ సైతం ఓటమిపాలు కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అనేక నియోజకవర్గాల్లో మక్కల్ నీది మయ్యం నాలుగో స్థానంలో నిలిచింది. ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషించుకునేందుకు కమల్ పార్టీ కార్యవర్గంతో ఈనెల 6వ తేదీ న సమావేశంకాగా, కార్యనిర్వాహక వర్గంలోని డాక్టర్ ఆర్ మహేంద్రన్ (ఉపాధ్యక్షుడు) సహా 10 మంది రాజీనామా లేఖలను కమల్‌కు సమర్పించా రు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోవడాన్ని నిరసి స్తూ ఉపాధ్యక్ష పదవితోపాటూ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు మహేంద్రన్ మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో కమల్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మహేంద్రన్ ఒక ద్రోహి అని దుయ్యబట్టారు. ‘ఓటమికి భయపడి పారిపోయే పిరికిపందలను పెద్దగా పట్టించుకోను. నా లక్ష్యంలో మార్పు లేదు, మాతృభూమి, ప్రజల కోసం ముందుకు సాగుతాం’అని స్పష్టం చేశారు. పరాజయ భారాన్ని మోయలేక రాజకీయా ల నుం చి కమల్ నిష్క్రమిస్తారని మక్కల్ నీది మయ్యం నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
Kamal Haasan: ఒంటరిగా పోటీ చేసుంటే బాగుండేది!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్‌ను అంతర్మథనంలో పడేసింది. కనీసం మూడోస్థానం కూడా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మంగళవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, అందుబాటులో ఉన్న అభ్యర్థులతో సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీకి వచ్చిన ఓట్లు, ఓటమికి గల కారణాలపై చర్చించారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసుంటే బాగుండేదని పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రణాళిక పార్టీలో సమూల మార్పులు, క్షేత్రస్థాయి నుంచి బలోపేతానికి కృషి చేద్దామని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక, కొత్త నిర్ణయాలు, మార్పులతో ముందుకు సాగుదామని, త్వరలో అన్ని వివరాలు ప్రకటిస్తానని కమల్ నేతల వద్ద పేర్కొన్నారు. ఈ సమావేశంపై మక్కల్ నీదిమయ్యం ఉపాధ్యక్షుడు పొన్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి కారణాలపై విశ్లేషించుకున్నామని తెలిపారు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ఉంటే కనీసం మూడో స్థానం దక్కి ఉండేదన్న అభిప్రాయాన్ని సమావేశం ముందు పలువురు ఉంచినట్టు పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్ -
షాకింగ్: ఓటమిపాలైన కమల్ హాసన్
చెన్నె: అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఓడిపోయాడు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ (బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ కమల్‌హాసన్ ఓడిపోయారని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్‌పై కమల్‌హాసన్ పరాజయం పొందాడు. కాగా కమల్‌మాసన్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడింది. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయన ఓడిపోవడం షాకింగ్‌కు గురి చేసే అంశం. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారం సొంతం చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కన్నా అధిక స్థానాలు డీఎంకే సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కానున్నారు. చదవండి: ఫ్యాన్ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ -
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: దారుణంగా కమల్ పార్టీ పరిస్థితి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ సునామి సృష్టిస్తోంది. అధికార అన్నాడీఎంకే రెండంకెలకే పరిమితమైంది. డీఎంకే 125 స్థానాల్లో.. అన్నాడీఎంకే 77 స్థానాల్లో.. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన పార్టీలేవీ కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా లేవు. ఇక, లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ కేవలం ఒకస్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అది కూడా కమల్ హాసన్ పోటీ చేస్తున్న కోయంబత్తూర్ సౌత్‌లోనే. అక్కడ కూడా పోటాపోటీగా ఉంది. కమల్ 15 వేల పైచిలుకు ఓట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ జయకుమార్ 12 వేల పైచిలుకు ఓట్లు.. మూడో స్థానంలో బీజేపీకి చెందిన వాసంతి శ్రీనివాసన్ 11 వేల పైచిలుకు ఓట్లను సొంతం చేసుకున్నారు. దాదాపు రెండు వేలపై చిలుకు ఓట్ల మెజార్టీలో కమల్ ఉన్నారు. అయితే ఈ మెజార్టీ అలానే కొనసాగుతుందా లేక, తారుమారు అవుతుందా అన్నది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. కాగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్ కే అర్జున్ విజయం సాధించారు. పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. ఇక 2019 జనరల్ ఎలక్షన్లో ఎంఎన్ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. -
మరో వివాదంలో కమల్: వైరల్ పిక్
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్, కమల్ హాసన్‌ను మరో వివాదంలో ఇరుక్కున్నారు. పోలింగ్ రోజు (మంగళవారం) కమల్‌హాసన్ ఒక రిపోర్టర్‌పై దాడి చేశారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. రిపోర్టర్‌ను కొట్టానికి ప్రయత్నించారంటూ కోయంబత్తూర్ ప్రెస్ క్లబ్ ఈ ఘటనను ఖండించింది. సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ పోస్ట్‌లో కమల్‌పై ఆరోపణలు గుప్పించింది. ఈ సందర్భంగా రిపోర్టర్‌ను కొట్టడానికి కమల్ తన వాకింగ్ స్టిక్ పైకి లేపిన చిత్రం వైరల్ అవుతోంది. దీంతో వివాదం రగిలింది. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కమల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తోంది. వీడియోను చిత్రీకరించవద్దని డిమాండ్ చేస్తూ కమల్ అడ్డుకున్నాడని రిపోర్టర్‌ను తన వాకింగ్ స్టిక్ తో కొట్టడానికి ప్రయత్నించాడని క్లబ్ ఆరోపించింది. అదృష్టవశాత్తూ అతడు గాయపడకపోయినా, కర్ర అంచు అనుకోకుండా జర్నలిస్టు మెడకు తగిలి ఉంటేపరిస్థితి దారుణంగా ఉండేదని ఆరోపించింది. ఈ ఘటన తమను, తమ పాత్రికేయ బృందాన్ని షాక్‌కు గురి చేసిందని తెలిపింది. అంతేకాదు దీనికి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా హెచ్చరించడం గమనార్హం. అటు న్యూస్ జర్నలిస్ట్ దాడి ఘటనను ఖండించిన కాంగ్రెస్ అభ్యర్థి మయూరా జయకుమార్, బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్ కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై అటు కమల్ గానీ, ఎంఎన్ఎం గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. இன்று கோவையில் #SunTV செய்தியாளர் மோகனை, மக்கள் நீதி மைய தலைவர் #கமலஹாசன் தாக்கியதாக தகவல் அறிந்தேன் சம்பவத்தை கண்டிக்கின்றேன் உடனடியாக கமலஹாசன் நடந்த சம்பவத்திற்கு மன்னிப்பு கோர வேண்டும் pic.twitter.com/gRgvr5tOWu — Mayura Jayakumar (@MayuraSJ) April 7, 2021 இன்று காலை கோவை ஜிசிடி கல்லூரி வளாகத்தில் திரு கமலஹாசன் அவர்கள் சன் நியூஸ் பத்திரிக்கையாளர் திரு மோகன் அவர்களை தனது கைத்தடியால் தாக்கியதாக கேள்விப்பட்டேன். இது மிகவும் வருத்தத்தை அளிக்கின்றது. — Vanathi Srinivasan (@VanathiBJP) April 7, 2021 -
వైరల్: ఆగ్రహంతో ‘టార్చ్‌లైట్’ విసిరిన కమల్ హాసన్
చెన్నె: రాజకీయాలు అంటే ఆషామాషీ కాదు. ఎంతో ఓపిక.. సహనం ఎంతో ఉండాలి. క్షణికావేశాలకు గురయితే పతనమే. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ అసహనానికి గురయ్యారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించారు. ఈ సందర్భంగా తన పార్టీ గుర్తుగా ఉన్న ‘టార్చ్‌లైట్’ను విసిరేశారు. కాన్వాయ్‌లో ఉండగా ఏదో విషయమై అసంతృప్తికి గురయి టార్చ్‌లైట్ విసిరివేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దక్షిణ కోయంబత్తూరు నుంచి అసెంబ్లీకి కమల్ హాసన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ ఆ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. కాన్వాయ్‌లో వెళ్తూ అభివాదం చేస్తున్నాడు. ఈ క్రమంలో మాట్లాడుతుండగా కమల్ మైక్రోఫోన్ పని చేయలేదు. ప్రజలకు ఆయన మాటలు వినకపోవడం గమనించి వాహనంలో ఉన్న వారిని అడిగారు. ‘ఏమైంది?’ అని.. ఎంతకీ మైక్రోఫోన్ సరిగా పని చేయకపోవడంతో కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఎడమ చేతిలో ఉన్న తన పార్టీ గుర్తు ‘టార్చ్‌లైట్’ను వాహసంలోపలికి విసిరేశారు. వాహనంలో ఉన్న వ్యక్తిపై పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రోల్ చేస్తూ కమల్ అంత కోపం వద్దు.. అంటూ హితవు పలుకుతున్నారు. -
రాజాకీయాలు అంటే మురికిగుంట : కమల్ హాసన్
సాక్షి, చెన్నై: తనతో పాటు మక్కల్ నీది మయ్యంలోని ప్రతి ఒక్కరం పారిశుధ్య కార్మికులం అని, రాజకీయాల్లోని మురికిని కడిగేందుకే రంగంలోకి దిగినట్టు పార్టీ నేత కమలహాసన్ తెలిపారు. మంగళవారం చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న మక్కల్ నీది మయ్యం అభ్యర్థి, ఐఏఎస్ సంతోష్‌బాబుకు మద్దతుగా రోడ్‌షోను కమల్ నిర్వహించారు. వేళచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఓటర్లతో మాట్లాడారు. రాజకీయాల్లో మురికిని కడిగేందుకే వచ్చా రాజకీయాలు అంటే మురికిగుంట అని పెద్దలు చెప్పే వారని గుర్తుచేశారు. అందుకే అనేక మంది చదువుకున్న పెద్దలు ఈ మురికిగుంటలో దిగేందుకు వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. రాజకీయాలను అసహ్యించుకున్నారని తెలిపారు. ఈ మురికి అలాగే వదలివేయడంతో మరింత దుర్వాసన భరితంగా రాజకీయాలు మారినట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గుంటను ఎవరో ఒకరు శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించే తాను రంగంలోకి దిగినట్టు తెలిపారు. రాజకీయం అనే మురికిగుంటను శుభ్రం చేయడానికి తనతో పాటు మక్కల్ నీది మయ్యం వర్గాలు అందరూ పారిశుధ్యకార్మికులుగా మారామని అన్నారు. రాజకీయం అనే మురికిని ఇకనైనా శుభ్రం చేయకుంటే, భావితరాలు ఈ తరం వారిని దుమ్మెత్తిపోస్తాయని పేర్కొన్నారు. జనం హితాన్ని కాంక్షించేందుకు వచ్చిన ఈ పారిశుధ్యకార్మికుల్ని ఆదరించాలని విన్నవించారు. తమను చూసి ఇతర పార్టీలు భయపడుతున్నాయని, అందుకే ఇరకాటంలో పెట్టే పరిస్థితుల్ని కల్పిస్తున్నా యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, తమకు ప్రజల మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. కమల్ పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో మంగళవారం నటి సుహాసిని సుడిగాలి ప్రచారం చేశారు. అవినీతిశక్తులకు వ్యతిరేకంగా కమల్ ఉద్యమిస్తున్నారని, ఆ శక్తుల్ని అంతం చేయడానికి మక్కల్ నీది మయ్యంకు అండగా, మద్దతుగా ఓట్లు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. చదవండి: రైల్వేశాఖ కీలక నిర్ణయం: రైళ్లలో సెల్ ఛార్జింగ్ బంద్ -
కమల్ హాసన్‌పై గౌతమి ఫైర్
తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సవాళ్లు.. ప్రతి సవాళ్లకు దిగుతున్నాయి. ముఖ్యంగా సీఎం ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మధ్య మాటల తూటాలను పేలుతున్నాయి. మహిళలను అవమానించిన డీఎంకే నేతలకు బుద్ధి చెప్పాలని ఎడపాడి పిలుపునిస్తే.. అవినీతి అన్నాడీఎంకేను ఓడించాలని స్టాలిన్ కోరుతున్నారు. అమ్మ పాలన కొనసాగాలంటే రెండాకులకే ఓటెయ్యాలని పళనిస్వామి విన్నవిస్తుంటే.. ఉదయ సూర్యుడిని గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇస్తున్నారు. మరోవైపు మక్కల్ నీది మయ్యం తరఫున కమల్‌హాసన్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో నేతలు తీవ్రస్థాయిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పరస్పరం ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మహిళా ద్రోహి డీఎంకేకు బుద్ధి చెప్పండి : ఎడపాడి మహిళలను కించపరుస్తూ దుర్భాషలాడిన డీఎంకే నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముఖ్య మంత్రి ఎడపాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. సోమవారం చెన్నై మైలాపూర్, అశోక్‌నగర్, టీ నగర్ నియోజకవర్గాల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారు. చెన్నై మేయర్‌గా, మంత్రిగా ఏళ్ల తరబడి పనిచేసిన స్టాలిన్ ప్రజల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళలను చులకనగా చూసే డీఎంకేను ఓడించాలని కోరారు. రెండాకులకు ఓటేసి గెలిపిస్తే ఇంటి వద్దకే రేషన్ సరుకులు చేరుస్తామని హామీ ఇచ్చారు. అమ్మ జయలలిత ఆశయాలను నెరవేర్చేలా పాలన సాగిస్తామన్నారు. ఆరు నెలల వంట గ్యాస్ ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. మనీ కోసమే ‘మణి’ల ఆరాటం : స్టాలిన్ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ముగ్గురు ‘మణి’లు మనీ కోసం ప్రజలను యథేచ్ఛగా దోచుకున్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఎడపాడి పళనిస్వామి కేబినెట్లోని మంత్రులు వేలుమణి, తంగమణి, కేసీ వీరమణి ప్రజాధనం లూటీ చేశారని మండిపడ్డారు. కేసీ వీరమణి, అతని బినామీల ఇళ్లపై నాలుగేళ్ల క్రితం ఐటీ దాడులు జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఉదయ సూర్యుడికి ఓటేసి డీఎంకేను గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. డీఎంకే నేత, ఎంపీ కనిమోళి తిరుచెందూరులో ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్నాడీఎంకేకు తగిన గుణపాఠం నేర్పా లని పిలుపునిచ్చారు. అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కమల్ మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గ ప్రజలతో ఆన్లైన్లో ముచ్చటించారు. రమ్య అనే అభిమాని మిమ్మల్ని నేరుగా చూడాలని ఉందన్నారు. ఆదివారం రాత్రి కామరాజపురంలో ప్రచారానికి వచ్చిన కమల్ ప్రసంగం మధ్యలో ఆమె పేరును పేర్కొంటూ ఆహ్వానించారు. ప్రచార వాహనం వద్దకు వచ్చిన నిండు గర్భిణి అయిన రమ్యకు డైరీలో ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆనందపరిచారు. కమల్‌పై గౌతమి ఫైర్ కమల్‌కు హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించిన గౌతమి.. కొన్నేళ్లపాటు ఆయనకు సన్నిహితరాలిగా మెలిగారు. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. ఈ క్రమంలో కమల్‌పై గౌతమి పలు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానని కమల్ చెబుతున్నారని, అయితే ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారో.. లేదో మే 2న తెలిసిపోతుందని చెప్పారు. మార్కెటింగ్ మాయాజాలంలో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. -
100 రోజుల్లో చేసి చూపిస్తా: కమల్
సాక్షి, చెన్నై: పదేళ్లలో చేయలేని పనుల్ని వందరోజుల్లో చేసి చూపిస్తానని మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ ధీమా వ్యక్తం చేశారు. భారత దేశానికే కోయంబత్తూరును ఆదర్శనగరంగా మార్చేస్తానని హామీ ఇచ్చారు. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో పోటీచేస్తున్న కమల్ ఆదివారం నియోజకవర్గంలో ఆగమేఘాలపై ప్రచారం చేశారు. రోడ్‌షో ద్వారా ప్రధాన మార్గాలు, చిన్న చిన్న వీధుల్లో సైతం దూసుకెళ్లారు. సినీ తరహా డైలాగులతో, రాజకీయఅంశాలతో, ప్రజాకర్షణ లక్ష్యంగా, ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ తాము ప్రకటించిన మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకుసాగారు. పదేళ్లల్లో ఈ పాలకులు చేయలేని పనుల్ని వంద రోజుల్లో చేసి చూపిస్తానని ప్రకటించారు. ప్రజలు తనకు అండగా ఉంటే చాలు అని, మార్పు నినాదంతో రాష్ట్రం రూపురేఖల్ని మార్చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన సవాల్ విషయంగా కమల్ స్పందిస్తూ, తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన వానతీ శ్రీనివాసన్ ఓ డమ్మీ అంటూ, ఈ విషయంగా ప్రధాని మోదీతో చర్చించేందుకు సైతం సిద్ధం అని పేర్కొన్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ, కమల్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: యాక్సిడెంటల్ హోం మినిస్టర్ -
ఫ్యాన్స్ అత్యుత్సాహం: ఆస్పత్రిలో కమల్!
చెన్నై: అభిమానుల ప్రేమకు హద్దూ అదుపూ ఉండదు. అభిమాన తార కళ్లముందు కనిపిస్తే చాలు.. వారి ఆనందం వర్ణించ వశం కాదు. సెలబ్రిటీలతో సెల్ఫీ దిగాలని, వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వాలని, కుదిరితే కబుర్లు కూడా చెప్పాలని తహతహలాడిపోతుంటారు. కానీ వీరి అత్యుత్సాహం కొన్నిసార్లు హీరోలకు తలనొప్పిగా మారుతుంది. ఇదిగో ఇలాంటి అనుభవమే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌కు ఎదురైంది. తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ నుంచి ప్రచారం స్పీడు పెంచాడు కమల్. తను పోటీ చేస్తున్న కోయంబత్తూర్‌లో వరుస ప్రచారాలు చేపడుతూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో శనివారం నాడు మార్నింగ్ వాక్కు వెళ్లి అక్కడి స్థానికులను పలకరించాడాయన. ఈ విషయం తెలిసిన అభిమానులు హీరోను చుట్టుముట్టారు. సెల్ఫీలంటూ ఎగబడ్డారు. అందరితో ఓపికగా సెల్ఫీలు దిగుతుండగా చిన్న తోపులాట జరిగి ఓ వ్యక్తి కమల్ కుడి కాలిని తొక్కాడట. ఈ ఏడాది ప్రారంభంలో అదే కాలికి శస్త్రచికిత్స జరగడంతో కమల్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి కాలికి ఎక్స్‌రే తీశారు. అనంతరం అతడిని పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చదవండి: కమల్ కారుపై దాడి; చితక్కొట్టిన కార్యకర్తలు కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్ -
కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్
సాక్షి, చెన్నై: అవినీతికి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్‌పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వం మాస్క్‌లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్‌కు చెందిన అనితా టెక్స్కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థపై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ.80కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. చదవండి: ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ -
కమల్ మేనిఫెస్టో: నిరుద్యోగులు, గృహిణిలపై వరాల జల్లులు
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పదేళ్ల ప్రణాళికతో మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ప్రకటించారు. అధికారంలోకి వస్తే, నీట్ పరీక్షకు బదులుగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిల బస్తో సీట్ నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామ ప్రగతికి స్మార్ట్ విలేజ్ పథకం, ఆర్మీ తరహాలో ప్రజా క్యాంటీన్ల ద్వారా అన్ని రకాల వస్తువుల్ని చౌక ధరకే అందించనున్నామని ప్రకటించారు. మక్కల్ నీది మయ్యం, ఎస్ఎంకే, ఐజేకేలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేతల కమల్ పోటీలో ఉన్నారు. ఈ దృష్ట్యా, కోయంబత్తూరు వేదికగా శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం కమల్ విడుదల చేశారు. ఇందులో తమిళనాడు సమగ్రాభివృద్ధి, అప్పు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెరుగు, విద్య, వైద్య పథకాలతో ప్రజాకర్షణ అంశాలను పొందుపరిచారు. పార్టీ ఉపాధ్యక్షులు మహేంద్రన్, పొన్రాజ్లతో కలిసి మేనిఫెస్టోను కమల్ ఆవిష్కరించారు. ప్రజల్ని బానిసలుగా, పేదలుగా మార్చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పార్టీలకు విశ్రాంతి ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో కొన్ని.. ∙రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ పదేళ్ల ప్రణాళిక ∙రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ∙అన్ని రంగాల్లోనూ తమిళనాడు అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక ప్రగతి రానున్న పదేళ్లలో పది నుంచి 20 శాతం మేరకు వృద్ధి లక్ష్యంగా కార్యాచరణ ∙వ్యక్తి ఆదాయం సంవత్సరానికి 7 నుంచి పది లక్షల వరకు పెంపు ∙నదీ జలాల అనుసంధానం, జల అభివృద్ధి, వాటర్ మెనేజ్మెంట్బోర్డు, అందరికీ స్వచ్ఛమైన శుద్ధీకరించిన నీళ్లు ∙వ్యవసాయ రంగంలో హరిత విప్లవం లక్ష్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, రైతుల హక్కుల పరిరక్షణ ∙జాలర్లకు జీవనాధారం, భద్రత లక్ష్యంగా చర్యలు ∙ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు. నీట్‌కు బదులు రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిలబస్‌తో సిట్ పరీక్ష. అందరికీ వైద్యం, విద్య, ఉన్నత విద్యకు చర్యలు ∙గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ స్మార్ట్ విలేజ్ పథకం ∙ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం, అర్హులకు ఉద్యోగాలు, పారిశ్రామిక ప్రగతి, వృద్ధులకు భద్రత, అనాథలకు ఆపన్న హస్తం, రాజకీయ న్యాయం, సమష్టి నాయకత్వంఅభివృద్ధి చెందిన చిన్న దేశాలకు దీటుగా తమిళనాడును తీర్చిదిద్దడం లక్ష్యంగా పథకాలు అమలు. ∙గృహిణులకు జీతాలు (ఇది ఉచితం కాదు –వారికి వృత్తిపరంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం) ∙విద్యుత్, రవాణా సంస్థల బలోపేతం. ఈ సంస్థల్లో ఉద్యోగులకు వాటా. ∙ప్రజలు చౌక ధరకే అన్ని వస్తువుల్ని కొనుగొలు చేసుకునే రీతిలో ఆర్మీ క్యాంటీన్ల తరహాలో మక్కల్ క్యాంటీన్ల ఏర్పాటును మేనిఫెస్టోలో పొందుపరిచారు. సీపీఎం, టీఎంసీలు కూడా.. డీఎంకే కూటమిలోని సీపీఎం, అన్నాడీఎంకే కూటమిలోని తమాకా కూడా మేనిఫెస్టోలను శుక్రవారం ప్రకటించారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి బాలకృష్ణన్, సీనియర్ నేత టీకే రంగరాజన్ ఆవిష్కరించిన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యనిషేధం, ఖాళీగా ఉన్న 4.5 లక్షల ఉద్యోగాల భర్తీ, శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం అంశాలను ఇందులో పొందుపరిచారు. టీఎంసీ నేత జీకే వాసన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రభుత్వ పాఠశాలల ప్రగతి, ఫీజుల తగ్గింపు, వైద్య, వ్యవసాయ రంగాల బలోపేతం, ఆలయాలన్నీ భక్తులకు అప్పగింత, -
తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ తొలిసారి ప్రజల ముందుకు ఓటు కోసం వస్తున్నారు..
-
పది చదవని హీరో కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
చెన్నె: సినిమాలతో అశేష జనాన్ని అలరించి లక్షలాది అభిమానం సొంతం చేసుకున్న తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ తొలిసారి ప్రజల ముందుకు ఓటు కోసం వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి ఈసారి పోటీ చేయనుంది. ఈ సందర్భంగా కమల్ కోయంబత్తూర్ దక్షిణం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేసిన అనంతరం ఆయన హాట్ టాపిక్ అయ్యారు. నామినేషన్ పత్రాల్లో సమర్పించిన ఆస్తుల వివరాలు చర్చకు దారి తీశాయి. మొత్తం ఆస్తులు రూ.176.93 కోట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో కమల్ ప్రకటించారు. వాటిలో స్థిరాస్తులు రూ.131.84 కోట్లుగా, చరాస్థులు రూ.45.09 కోట్లుగా తెలిపారు. దీంతోపాటు లండన్‌లో రూ.2.50 వేల డాలర్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల లగ్జరీ కారు, రూ.కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉందని అఫిడవిట్లో పొందుపర్చారు. ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రూ.49.5 కోట్లు అప్పు ఉందని తెలిపారు. అయితే కమల్ మాత్రం పదో తరగతి కూడా చదవలేదు. తాను 8వ తరగతి వరకు చదువుకున్నట్టు తెలిపారు. రూ.17.79 కోట్ల విలువైన వ్యవసాయ భూములు (37.59 ఎకరాలు), చెన్నెలో రూ.92.05 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. చెన్నెలో ఉన్న రెండు నివాసాలు విలువ రూ.19.5 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో కమల్‌హాసన్ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. మూడో కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కమల్‌హాసన్ ఎలాంటి ప్రభావం చూపిస్తారోనని దక్షిణ భారతదేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. చదవండి: ఎన్నికల వేళ బీజేపీ షాకిచ్చిన తమిళనాడు సీఎం -
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్..
-
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్.. ప్రధాన కారణం అదేనట
చెన్నై: తమిళనాట రాజకీయ వాతావరణం క్రమంగా హీటెక్కుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా కమల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తొలుత కమల్ చెన్నై, అలందూర్ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికి చివరకు కోయంబత్తూరు నుంచి బరిలో దిగేందకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలనుకున్నారు. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆశపడ్డారు. కాకపోతే నేను ఆయన కలను నిజం చేయలేకపోయాను. అందుకే మా పార్టీలోకి ఎక్కువ మంది ఐఏఎస్ అధికారులను ఆహ్వానించాను. వారికే సీట్లు కేటాయించాను. ఇది నాకు ఎంతో గర్వకారణం’’ అన్నారు. ఇక కమల్ నేడు ప్రకటించిన రెండో జాబితాలో డాక్టర్ సుభా చార్లేస్ ‘కన్యాకుమారి), డాక్టర్ ఆర్ మహేంద్రన్ (సింగనల్లూర్), డాక్టర్ సంతోష్ బాబు (వెలాచేరి), మరియు పాజా కరుపయ్య (టి నగర్) నుంచి పోటీ చేయనున్నారు. అలందూర్ స్థానాన్ని శరద్ బాబుకు కేటాయించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్ కే అర్జున్ విజయం సాధించారు. తాజాగా పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. అయితే దీనిపై ఏఐడీఏంకే కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక 2019 జనరల్ ఎలక్షన్లో ఎంఎన్ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చదవండి: మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు -
బీజేపీ బీ–టీం నేను కాదు.. ఆ పార్టీనే: కమల్
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్సే కాదు, నామ రూపాలు లేకుండా చేయడానికి బీజేపీ ఆదేశాల మేరకు డీఎంకే కుట్ర పన్నిందని మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ ఆరోపించారు. బీజేపీకి బీ–టీం తాను కాదని, డీఎంకే అని పేర్కొన్నారు. కొళత్తూరులో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో డీఎంకేపై కమల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మక్కల్ నీది మయ్యం నిజాయితీ పరుల గుడారంగా మారినట్టు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో, మార్పు లక్ష్యంగా తనతో చేతులు కలిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలు దొందుదొందే అని, ఈ రెండు పారీ్టలు ఇక్కడి పేద ప్రజల్ని మరింత పేదరికంలోకి నెట్టారని, రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినట్టు ధ్వజమెత్తారు. ఈ ప్రజలు జీవన స్థితి పెంపు, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే మార్పు పయనంలో ఉన్న తనను కొనేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “కమల్ నాట్ ఫర్‌సేల్, తమిళనాడు నాట్ ఫర్ సేల్ అంటూ ఓటు కూడా నాట్ ఫర్ సేల్ అని అవినీతిపరులకు బుద్ధి చెప్పే రీతిలో తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాకు కాషాయం రంగు.. అవినీతిరహిత పాలన, ప్రజా సంక్షేమం, మార్పు నినాదంతో తాను ముందుకు సాగుతుంటే, తనకు కాషాయం రంగు పులిమేయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు చేస్తున్న డీఎంకే వాళ్లే బీజేపీ వ్యూహాలను తమిళనాడులో రహస్యంగా అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ పార్టీ రంగు ప్రస్తుతం బయటపడుతోందని, మరి కొద్ది రోజుల్లో బీజేపీతో వారికి ఉన్న రహస్య ఒప్పందం బయటపడడం ఖాయం అని వ్యాఖ్యానించారు. అందుకే సీట్ల పంపకాల పేరిట కాంగ్రెస్‌ను కూటమి నుంచి సాగనంపే ప్రయత్నాల్లో డీఎంకే ఉన్నట్టు ఆరోపించారు. దేశంలోనే కాంగ్రెస్‌ను నామ రూపాలు లేకుండా చేయాలన్న కాంక్షతో ఉన్న కేంద్రం, తాజాగా తమిళనాడులో డీఎంకే ద్వారా వ్యూహాలకు పదును పెట్టినట్టు పేర్కొన్నారు. డీఎంకే కుట్రలను పరిగణించి కాంగ్రెస్ మేల్కుంటే మంచిదని, లేని పక్షంలో తీవ్ర నష్టం ఆ పారీ్టకే అని హెచ్చరించారు. మక్కల్ నీది మయ్యం ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయం అని, అన్నాడీఎంకే అసంతృప్తి వాదులు, డీఎంకే వ్యతిరేకులు ఎన్నికల సమయానికి తన వెన్నంటి పెద్ద ఎత్తున రావడం ఖాయమని, తద్వారా వచ్చే ఓట్లతో అధికార పీఠాన్ని మక్కల్ నీది మయ్యం కైవసం చేసుకుని తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
కమల్ ఎన్నికల ఎజెండా.. మహిళా సంక్షేమానికి పెద్దపీట
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్ హాసన్ బుధవారం తన పార్టీ ఎన్నికల ఎజెండాను వెల్లడించారు. మహిళల సంక్షేమానికి తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. మహిళ రక్షణ కోసం 181 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే గ్రామీణ బ్యాంక్‌లను మహిళా పథకాల ఆధ్వర్యంలో నిర్వహించేలా కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తాని ఎంఎన్ఎం పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించింది. ఆయన బుధవారం రాత్రి ఓ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కమల్ హాసన్ ఇటీవల తనకు మద్దతు పలకాలని పలువురు సినీ ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే. ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌తో పాటు ఇందిరా జననయాగ కట్చీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి తాను మూడో కూటమిని తయారు చేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అదే విధంగా ఆ కూటమి సీఎం అభ్యర్థిని తనే అని వెల్లడించారు. ఇక 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ! -
మూడో కూటమి.. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి: కమల్
చెన్నె: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రకటన వెలువడిన తెల్లారే మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్ హాసన్ రాజకీయ దూకుడు పెంచారు. ఈ సందర్భంగా తమిళనాడులో కొత్త పొత్తు ఏర్పాటుచేశారు. తనతో కలిసి వచ్చే వారిని కలుపేసుకుని వెళ్తానని ఈ సందర్భంగా కమల్ ప్రకటించాడు. ఎంఎన్ఎం పార్టీ 2018లో స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం కమల్ హాసన్ రాజకీయాల్లోకి దిగారు. అవినీతి రహిత తమిళనాడును మార్చేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కమల్ పార్టీ స్థాపించిన అనంతరం తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కమల్ రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తన స్నేహితుడు అగ్ర నటుడు రజనీకాంత్‌ను కలిసిన విషయం తెలిసిందే. తనకు మద్దతు పలకాలని కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై రజనీ ఇప్పటివరకు ఏం స్పందించలేదు. తాజాగా కమల్ ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌ను కలిశారు. ఇందిరా జననయాగ కట్చీ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి తాను మూడో కూటమిని తయారుచేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అయితే మూడో కూటమి సీఎం అభ్యర్థిని తానేనని కమల్ స్పష్టం చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని.. మార్చి 7వ తేదీకి తొలి విడతగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తానని కమల్ హాసన్ వివరించారు. మంచి పనుల కోసం తాను తగ్గడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. దీనర్థం కుదిరితే అన్నాడీఎంకే, డీఎంకే, శశికళతో కూడా కలిసేందుకు సిద్ధమని పరోక్షంగా కమల్ చెప్పారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కమల్ హాసన్ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. -
రజనీ.. రండి కలిసి పనిచేద్దాం: కమల్
సాక్షి, చెన్నై: రండి కలిసి పనిచేద్దాం అని పరోక్షంగా తలైవా రజనీకాంత్‌కు మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్ పిలుపునిచ్చారు. శనివారం చెన్నై పోయెస్ గార్డెన్లో దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కమల్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆదివారం చెన్నైలో కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం కట్చి నాలుగో వసంతం వేడుక జరిగింది. ఇందులో పార్టీ నేతలతో మాట్లాడే సమయంలో తలైవాకు పరోక్షంగా కమల్ పిలుపునిచ్చారు. రండి కలిసి పనిచేద్దాం అని పిలుపునిస్తూ వ్యాఖ్యలు చేశారు. తలైవాగా పిలవబడే నాయకుడు రోజూ వారి రాజకీయ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారని, రండి కలిసి పనిచేద్దాం అని కమల్ పిలుపునివ్వడం గమనార్హం. చదవండి: అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక -
అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక
చెన్నై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా అగ్ర నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ ఇద్దరూ సమావేశమయ్యారు. వీరిద్దరూ శనివారం భేటీ కావడంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న కమల్‌హాసన్‌కు రాజకీయంగా సహకరించేందుకు రజనీకాంత్ రాబోతున్నారని తెలుస్తోంది. చెన్నెలోని పోయెస్‌గార్డెన్‌లో రజనీకాంత్ నివాసానికి శనివారం మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, సినీ నటుడు కమలహాసన్ వెళ్లారు. రజనీకాంత్‌తో కొన్ని నిమిషాల పాటు సమావేశమయ్యారు. అయితే వీరి ఇరువురు ఏం మాట్లాడుకున్నారో తెలియడం లేదు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో రజనీకాంత్‌ను పరామర్శించేందుకు కమల్ వచ్చాడని అధికారికంగా తెలుస్తోంది. కాకపోతే దానితోపాటు రాజకీయంగా కూడా చర్చించేందుకు కమల్ వచ్చాడని సమాచారం. 2018లో కమల్‌హాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి రజనీకాంత్ మద్దతు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీతో కమల్‌కు ఒప్పందం జరిగిందని.. ఇక రజనీకాంత్ మద్దతు ఇస్తే రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు కావొచ్చని కమల్ హాసన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్‌తో సమావేశమైనట్లు తమిళ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకేతో పాటు ఇటీవల జైలు నుంచి వచ్చిన శశికళ రావడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తాజాగా రజనీ, కమల్ భేటితో మరింత ఉత్కంఠగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతోందననే ఆసక్తిగా మారింది. మూడోసారి అధికారంలోకి రావాలని అన్నాడీఎంకే భావిస్తుండగా.. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావాలని డీఎంకే తీవ్రంగా శ్రమిస్తుండగా.. బీజేపీ మాత్రం తొలిసారిగా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రస్తుత అధికార పార్టీకి అండగా నిలుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎన్నికల వరకు వేచి చూడాలి. #MakkalNeedhiMaiam President #Kamalhassan sir visited the residence of #Rajinikanth sir at Poes Garden and had met him. The meeting between them took place for nearly 20 minutes. pic.twitter.com/BSfGMeH73q — Yuvraaj (@proyuvraaj) February 20, 2021 -
నేనే సీఎం అభ్యర్థి: కమల్ హాసన్
సాక్షి, చెన్నై: మూడో కూటమి ఏర్పాటైతే తానే సీఎం అభ్యర్థి అని మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమల్‌హాసన్ అన్నారు. జనవరిలో పొత్తు ప్రకటన ఉంటుందన్నారు. మూడో విడత ఎన్నికల ప్రచారానికి తిరుచ్చి నుంచి ఆదివారం కమలహాసన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో తిరుచ్చి వెళ్లిన ఆయన అక్కడ సుడిగాలి పర్యటన చేశారు. మహిళా సంఘాలు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు ఇలా అన్ని వర్గాలను కలుసుకున్నారు. సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. సోమవారం కమల్ మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. జనవరిలో పొత్తు ప్రకటన.. రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షం తదుపరి మూడో పక్షంగా మక్కల్ నీది మయ్యం అవతరించిందని తెలిపారు. ప్రజలు తమను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. జనవరిలో పొత్తు ప్రకటన అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మూడో కూటమి ఏర్పాటైన పక్షంలో ఆ కూటమి సీఎం అభ్యర్థిగా తానే ఉంటానని పేర్కొన్నారు. రజనీకాంత్ ఆరోగ్యం తనకు ముఖ్యమన్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ద్రవిడ పార్టీయే అని స్పష్టం చేశారు. తమిళం మాట్లాడే వాళ్లందరూ ద్రవిడులేనని అన్నారు. అవసరం అయితే కలైంజర్ కరుణానిధి పేరును కొన్ని చోట్ల ప్రస్తావిస్తా మన్నారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగుతోందన్నారు. దివంగత నేత ఎంజీఆర్ తరహాలో అవినీతి రాయుళ్లపై కొరడా ఝుళిపించేందుకు ఈ పాలకులు సిద్ధమా..? అని ప్రశ్నించారు. ఏఏ పనులకు ఏ మేరకు లంచం ముట్ట చెప్పాల్సి ఉందో ఓ చిట్టాను కమల్ ప్రకటించారు. తనను రెండేళ్ల క్రితమే రోడ్డున పడేయడానికి ఈ పాలకులు ప్రయత్నించారని, వాటన్నింటిని ఎదుర్కొన్న తాను మున్ముందు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు. -
కమల్‌హాసన్‌కు అరుణాచలం ఝలక్
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు కమల్‌హాసన్‌కు రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది. మక్కల్ నీది మయ్యం ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఝలక్ ఇచ్చారు. కమల్‌తో పాటు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏ అరుణాచలం ఎంఎన్ఎంను వీడి బీజేపీలో చేరారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతునివ్వాలని కోరితే కమల్ తిరస్కరించారని, అందుకే పార్టీని వీడినట్లు అరుణాచలం చెప్పారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం అరుణాచలం మీడియాతో మాట్లాడుతూ ఎంతో దూరదృష్టితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు పలుకుదామని ఉన్నతస్థాయి పార్టీ సమావేశంలో కమల్‌ను కోరానని అన్నారు. అయితే రైతు సంక్షేమాన్ని విస్మరించి పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగా ఆయన వ్యవహరించడం వల్లనే కమలదళంలో చేరానని చెప్పారు. కమల్ పార్టీ పెట్టిన నాటి నుంచి మక్కల్ నీది మయ్యం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అరుణాచలం ఆ పార్టీని వీడడం గమనార్హం. కమల్‌పై ఫిర్యాదు: చెన్నైలో కమల్ ఇటీవల నిర్వహించిన పార్టీ మహిళా విభాగం సమావేశంలో హిందువుల దేవుళ్లను అసభ్యంగా విమర్శించి మహిళల మనోభావాలను గాయపరిచిన కమల్‌హాసన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెన్నై ఆర్కే నగర్ పోలీసులకు సెల్వం అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశాడు. ప్రజలను హింసాత్మక ధోరణివైపు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. -
ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్
సాక్షి, వేలూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పును తీసుకురావాలని సినీ నటుడు, మక్కల్ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ తెలిపారు. మంగళవారం తిరువణ్ణామలై జిల్లాలో కమల్‌హాసన్ ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నాలుగు ప్రాంతాల్లో ప్రజలను ఆయన సందర్శించారు. ప్రజలకు అభివాదం మాత్రం చేస్తూ ఎటువంటి ప్రచారం చేయకుండా వెళ్లారు. అనంతరం ప్రయివేటు కల్యాణ మండపంలో ఆయన అభిమానులు, కార్యకర్తలతో చర్చించారు. రాజకీయల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చదవండి: రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా! మక్కల్ నీది మయం అధికారానికి వచ్చిన వెంటనే సెయ్యారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని, నిరుపేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో అధికంగా గ్రామీణ కళాకారులున్నారని, వారి కష్టాలు తనకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని ప్రకటించారు. చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై! -
రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!
సాక్షి, చెన్నై: రజనీకాంత్ కోరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంచీపురం జిల్లాల్లో పర్యటించారు. పార్టీని స్థాపించినా సీఎం అభ్యర్థిగా ఉండనని రజనీకాంత్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనే కోరితే మీరు సిద్ధమేనా అన్న ప్రశ్నకు రజనీ తనను ప్రకటిస్తే అంగీకరిస్తానని బదులిచ్చారు. డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపే ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ఎందుకు చూపడం లేదని విమర్శించారు.రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం రూ.2,500 ఇస్తోందని.. తాను డబ్బులు కన్నా ప్రజలను విశ్వసిస్తానని చెప్పారు. చిన కాంచీపురంలోని చేనేత కార్మికులను కలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. -
నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్
సాక్షి, చెన్నై: దివంగత ఎంజీఆర్ కలను సాకారం చేస్తే, ఆయనకు తానే రాజకీయ వారసుడ్ని అని మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తిరునల్వేలి, కన్యాకుమారిలో కమల్ పర్యటించారు. విద్యార్థులు, యువ సమూహం, మహిళాలోకంతో సమావేశం అయ్యారు. మీడియాతో కమల్ మాట్లాడుతూ రజనీ సిద్ధాంతాలు వేరు, తన సిద్ధాంతాలు వేరని, అయితే, తామిద్దరం మంచి మిత్రులం అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తమ సిద్ధాంతాలు ఒకే రకంగా ఉంటాయా అన్నది రజనీ చేయబోయే వ్యాఖ్యలు, నిర్ణయాలపై ఆధారపడి ఉందన్నారు. మార్పు జరుగుతుందని ఆశిద్దామని, ఆయనతో రహస్యాలు ఏవీలేవు అని, బహిరంగంగానే రజనీకి తాను ఆహ్వానం పలికేశానని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బహిరంగంగానే మళ్లీ పిలుస్తున్నానని, తన కూటమిలోకి రావాలంటూ చమత్కరించారు. టార్చ్‌లైట్ చిహ్నం కోసం ప్రయ త్నాలు చేస్తున్నారని, దక్కుతుందని భావిద్దామన్నారు. మక్కల్ నీది మయ్యం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అన్నది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ, అందుకు తగ్గ పరిస్థితుల కోసం వేచి చూద్దామన్నారు. ఎంజీఆర్ కలను సాకారం చేయగలిగితే, ఆయనకు తానే వారసుడ్ని అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వదులుకోను.. టార్చ్‌లైట్ చిహ్నం కోసం మక్కల్ నీది మయ్యం ఈసీని అభ్యర్థించేందుకు సిద్ధమైంది. ఈ చిహ్నంను వదులుకునే ప్రసక్తే లేదని ఎంజీఆర్ మక్కల్ కట్చి నేత విశ్వనాథన్ తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ కన్నా ముందే, తాము సంఘంగా ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేశామని, ఇప్పుడు రాజకీయపార్టీగా నమోదు చేసుకున్నామని గుర్తు చేశారు. తమకు టార్చ్‌లైట్ చిహ్నంను ఎన్నికల కమిషన్ కేటాయించిందని, కమల్ వచ్చి అభ్యర్థించినా, ఆ చిహ్నంను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఆశ.. స్టార్లు అందరూ రాజకీయపార్టీలపై దృష్టిపెట్టడంతో నటుడు పార్థిబన్లోనూ ఆశలు చిగురించినట్టున్నాయి. పుదుచ్చేరిలో జరిగిన ఒత్త సెరుప్పు చిత్ర అవార్డు కార్యక్రమంలో పార్థిబన్ తన మదిలో మాటను బయటపెట్టారు. అందరూ రాజకీయపార్టీలు పెట్టేస్తున్నారని, విజయ్ కూడా పెట్టేస్తాడేమో అని పేర్కొంటూ, తాను ఓ రాజకీయపార్టీ పెట్టా లన్న ఆశతో ఉన్నట్టు, భవిష్యత్తులో ఇది జరుగుతుందేమో ఆ పార్టీకి పుదియపాదై అని పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో చప్పట్లు మార్మో గాయి. చివరకు దీనిని సీరియస్‌గా తీసుకోకూడదని, కేవలం కామెడీ అంటూ ముగించారు. తన కుమార్తె రాజకీయాల్లోకి వస్తే, ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తానంటూ నటుడు సత్యరాజ్ ఓ మీడి యా ప్రశ్నకు సమాధానం ఇవ్వడం గమనార్హం. -
'అధికారంలోకి వస్తే మధురై రెండో రాజధాని'
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమలహాసన్ ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం అనే విషయం త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కమల్ మదురై వేదికగా ఆదివారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రెండో రోజు అలగర్ కోయిల్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సభలకు పోలీసులు అనుమతి ఇవ్వని దృష్ట్యా ప్రచారం రోడ్ షో రూపంలో సాగించాల్సిన పరిస్థితి. అలాగే ప్రైవేటు స్థలాల్లో విద్యార్థులు, యువతతో చర్చకార్యక్రమాలు, వ్యాపారులు, రైతులతో సమావేశాలతో ముందుకెళుతున్నారు. మదురై పర్యటనతో తేని, దిండుగల్ వైపుగా ప్రచారానికి వెళ్తూ మీడియాతో కమల్ మాట్లాడారు. చదవండి: (గర్భగుడిలో గుప్తనిధి.. రంగంలోకి అధికారులు..) పోటీ తథ్యం.... అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పోటీ చేస్తుందని, తాను కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. నిజాయితీ, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళతామని తెలిపారు. రాష్ట్రంలో మూడో ఫ్రంట్ సాధ్యమేనని, త్వరలో ఇందుకు తగ్గ ప్రకటన వెలువడుతుందన్నారు. రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూద్దామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రజనీని తాను తప్పకుండా కలుస్తానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మార్పు నినాదంతో మక్కల్ నీది మయ్యం ముందుకు సాగుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే మదురై కేంద్రంగా రెండో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనుమతులు ఇవ్వడం లేదని పేర్కొంటూ, తాము చట్టానికి, నిబంధనలకు కట్టుబడి ప్రచారం చేసుకుంటున్నామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలను గెలిచి ఊపు మీదున్న హైదరాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం పార్టీ మక్కల్ నీది మయ్యంతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వెలువడటం గమనార్హం. -
పొత్తులు కొన్నిసార్లే కలిసి వస్తాయి: కమల్
సాక్షి, చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారానికి పలు పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమల్‌హాసన్ తన పార్టీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను సోమవారం మధురైలో లాంచ్ చేశారు. ఈ క్రమంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని.. అయితే ఏ నియోజకవర్గం నుంచి దిగుతాననే విషయాన్ని త్వరలో ప్రకటిస్తానని అన్నారు. చదవండి: కమల్‌తో అసద్.. దోస్తీ! సూపర్ స్టార్ రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘పొత్తులు కొన్ని సార్లు విడిపోతాయి. మరికొన్ని సార్లు కొత్తవి పుట్టుకువస్తాయి. ప్రస్తుతానికి రజనీకాంత్ పార్టీతో పొత్తు విషయం గురించి నిర్ణయం తీసుకోలేదని’ అన్నారు. ఇక కమల్ హాసన్ పాల్గొన్న ర్యాలీపై పలు విమర్శలు వస్తున్నాయి. ఆయన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ర్యాలీలో పాల్గొన్న క్రమంలో మాస్క్ కూడా ధరించలేదని చర్చించుకుంటున్నారు. ఇక కమల్ ర్యాలీలో భారీగా పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలు భౌతికదూరం పాటించకుండా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్ #WATCH | Tamil Nadu: Actor & Makkal Needhi Maiam (MNM) chief Kamal Haasan holds a roadshow in Virudhunagar town pic.twitter.com/c4egrkBOb0 — ANI (@ANI) December 15, 2020 -
అదే మీ చేతిలోని బ్రహ్మాస్త్రం: కమల్
చెన్నై: మరో ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికల నగారా మోగనుంది. పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగనున్న నటుడు, మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ ఓటర్లును ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఓటరు ఐడీ మన చేతిలోని బ్రహ్మాస్త్రం అన్నారు. అర్హులైన వారంతా ఓటరు ఐడీలకోసం సైన్ అప్ చేసుకోవాలని కోరారు. రెండున్నర నిమిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కమల్ ప్రజలను ఉద్దేశిస్తూ.. ‘ఓటరుగా ఉండటం అనేది 18 ఏళ్లు నిండిన వారికి దక్కిన అరుదైన గౌరవం. ఓటరు ఐడి అనేది పెద్ద ఆయుధం. తన బాధ్యతలను సరిగా నిర్వర్తించని సమాజం.. హక్కులను ఆటోమెటిక్‌గా కోల్పోతుంది. మార్పు రావాలని ఉపన్యాసాలు దంచేవారు.. సిస్టం సరిగ్గా పని చేయడం లేదని విమర్శించే వారు.. ప్రజా ప్రతినిధులంతా దొంగలు అని తిట్టే వారికి ఓటరు ఐడీ ఉండదు. 2021 ఎన్నికల్లో దీన్ని మీ ఆయుధంగా వాడుకోండి. నేను మారతాను.. నేను ఓటేస్తాను అని ప్రతిజ్ఞ చేయండి’ అని కోరారు కమల్. (చదవండి: ఇలాగైతే పార్టీ ఎత్తేస్తా.. కమల్‌హాసన్ హెచ్చరిక..!) ஒன்று கூடுவோம் வென்று காட்டுவோம்#iWillCHANGE_iWillVOTE#என்ஓட்டு_என்பெருமை pic.twitter.com/xvggdOfl6V — Kamal Haasan (@ikamalhaasan) November 20, 2020 వచ్చే ఏడాది మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు లెజండరీ నాయకులైన జయలలిత, కరుణానిధిలను కోల్పోయిన తర్వాత తమిళనాడులో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్ 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2018, ఫిబ్రవరిలో కమల్ మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోల బరిలో నిలిచిన కమల్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే సంపాదించింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ ‘జీవనాధారం, ఉద్యోగాలు, తాగునీరు’ అజెండాతో ప్రజల మధ్యకు వెళ్లనుంది. వచ్చే నెల నుంచి కమల్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానికి గురించి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అనారోగ్యం కారణంగా రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ గురించి పునరాలోచిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. -
నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి
‘‘ఇది చాలా క్లిష్టమైన సమయం. ఎవరికి తోచిన సహాయం వారు చేయాల్సిన సమయం’’ అంటున్నారు కమల్‌హాసన్. కరోనా బాధితులకు చికిత్స అందించడానికి వీలుగా తన ఇంటిని ఆస్పత్రిగా మార్చాలనుకుంటున్నారు కమల్. ‘‘ప్రభుత్వం అనుమతిస్తే నా ఇంటిని తాత్కాలికంగా ఆస్పత్రిగా మార్చుతాను. నా ‘మక్కళ్ నీది మయమ్’ (కమల్ రాజకీయ పార్టీ)లో ఉన్న డాక్టర్లతో రోగులకు వైద్యం చేయిస్తాను’’ అన్నారు కమల్. -
నా ఇంటినే ఆస్పత్రిగా మారుస్తా
సాక్షి చెన్నై: ప్రజలకు వైద్యసేవలందించడానికి తన ఇంటినే ఆస్పత్రిగా మారుస్తానని ప్రముఖ నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో కమల్ స్పందించారు. ఆయన ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటినే వైద్యశాలగా మార్చాలన్న నిర్ణయానికి వచ్చారు. దీని గురించి కమల్‌హాసన్ బుధవారం తన ట్విటర్లో పేర్కొన్నారు. (ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు!) ఈ కష్టకాలంలో పేదలకు వైద్య సేవలందించడానికి మక్కళ్ నీది మయ్యంకు చెందిన వైద్యులను పిలిపించి తాను నివశించడానికి నిర్మించుకున్న భవనాన్ని తాత్కాలిక వైద్యశాలగా మార్చాలని భావిస్తున్నానన్నారు. అందుకు ప్రభుత్వం అనుమతిస్తే తన భవనాన్ని వైద్యశాలగా మార్చడానికి సిద్ధం అని పేర్కొన్నారు. కాగా సినిమాలు రద్దు కావడంతో దక్షిణ భారత సినీ సమాఖ్య (ఫెఫ్సీ)కు చెందిన కార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ సమాఖ్య అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. కమల్ కూడా రూ.10 లక్షలను ఫెఫ్సీకి అందించారు. (డేంజర్ బెల్స్!) -
కస్సుబుస్సంటున్న ఖుష్బు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రానికే పరిమతం కాలేదు. తమిళనాడుకు సైతం గెలుపోటముల ఫలితాల సెగలు తాకాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యల కలకలం సృష్టించాయి. కేజ్రీవాల్‌ను ఆదర్శంగా తీసుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్ సమాయత్తం అవుతున్నారు. ఈమేరకు పరోక్షంగా ట్వీట్ కూడా చేశారు. (చదవండి: చిదంబరంజీ.. మన దుకాణం మూసేద్దాం..!) గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో కమల్ పార్టీ 4 శాతం ఓట్లను సాధించింది. కనీసం ఒక్కసీటును కూడా గెలవకున్నా ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపోటములను శాసించగలిగింది. 11 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడో అతిపెద్దపార్టీగా గుర్తింపుపొందింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఆప్ సాధించిన విజయాలను తలచుకుంటూ కమల్‌హాసన్ జోరుపెంచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీజేపీని మట్టికరిపించి ఆప్ ఆమోఘ విజయం సాధించడం కమల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే ఉత్సాహంతో 2021 అసెంబ్లీ ఎన్నికలను ఢీకొనాలని ఆయన ఆశిస్తున్నారు. మొత్తం 234 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించారు. ఇటీవల క్షేత్రస్థాయి నియామకాలతో పార్టీని బలోపేతం చేశారు. ఈనెల 21న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున ఎన్నికల బృందాన్ని ప్రకటిస్తారు. ఆ తరువాత నుంచి ఎన్నికల ప్రచార పర్యటనల్లోకి దిగుతారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పనులను ప్రారంభించనున్నారు. అలాగే మొత్తం 234 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు సన్నద్దులు అవుతున్నారు. అరవింద్ కేజ్రీవాలను అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయాన్ని అందుకునేందుకు మీరు మార్గం చూపారు. పార్టీ స్థాపనకు ముందుగానే కేజ్రీవాల్‌ను కలిసిన కమల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన బాణీని ఆచరణలో పెట్టి గెలుపు గుర్రం ఎక్కాలని తహతహలాడుతున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ ఆమోఘ విజయం సాధించింది, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు చోటుచేసుకోవాలని ఆశిస్తున్నట్లు మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్ తెలిపారు. ఢిల్లీ నుంచి మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న కమల్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఫలితాలతో అక్కడి ప్రజలకు మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీని మట్టికరిపించి ఆప్ ఘనవిజయం సాధించింది, అవే పరిణామాలు దేశవ్యాప్తంగా జరగాలని ఆశిస్తున్నారా అనే ప్రశ్నకు ‘ఖచ్చితంగా’ తమిళనాడులో కూడా జరగాలని కోరుకుంటున్నానని బదులిచ్చారు. రజనీతో రాజీ యత్నాలు.. కమల్ రాజకీయాల్లోకి దిగి పార్టీని స్థాపించారు. రాజకీయ ప్రవేశం చేసిన రజనీకాంత్ పార్టీని స్థాపించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయితే తరచూ రాజకీయపరిణామాలపై స్పందిస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. వెండితెరపైనే కాదు రాజకీయతెరపై కూడా వారిద్దరివి భిన్నధృవాలుగా సాగుతున్నాయి. సిద్ధాంతపరంగా చాలా తేడాలున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించడం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. పౌరసత్వ చట్టంపై కమల్ విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రజనీ పరోక్ష మద్దతుదారుగా వ్యవహరిస్తుండగా, కమల్ తీవ్రవ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాబోయే ఎన్నికల్లో కమల్, రజనీ ఏకం కావాలనే అభిప్రాయం ఇటీవల బయలుదేరింది. సిద్ధాంతాలపరంగా ఎంతమాత్రం పొసగని రజనీ, కమల్ ఎలా ఎకం అవుతారనే వాదన కూడా వినిపిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకేలను ధీటుగా ఎదుర్కొని అధికారంలోకి రావాలంటే ఇద్దరూ ఏకమై ఎన్నికల బరిలో దిగకతప్పదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ దశలో కొందరు రజనీ, కమల్ మధ్య రాజకీయ రాజీకి ప్రయత్నాలు ప్రారంభించారు. ఖుష్బు కస్సుబుస్సు.. కాంగ్రెస్ పార్టీతీరు ఏమాత్రం బాగోలేదు, అందుకే ఢిల్లీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి, నటి ఖుష్బు ట్విటర్ ద్వారా విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఏదో మాయాజాలం జరుగుతుందని ఎంతమాత్రం ఎదురుచూడలేదు, కాంగ్రెస్ పార్టీ మరలా పతనమైంది. మేము ప్రజలనాడికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామా, సరైన మార్గంలో పయనిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే లేదనే బదులువస్తోంది. పార్టీకి పునర్వైభవం కోసం ఇప్పటి నుంచే శ్రమించాలి, ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ చేయలేము. క్షేత్రస్థాయి ఉంచి అధిష్టానం వరకు అనేక విషయాలపై సంస్కరించాలి. నీవు కోరే మార్పును నీతోనే ప్రారంభించు అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలు ఇపుడు అనుసరణీయం. భయాల నుంచి బయటకు రావాలి అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు. చిదంబరం వ్యాఖ్యల చిచ్చు.. బీజేపీ ఓటమికి కారణమైన ఆప్‌ను అభినందిస్తున్నానని చిందబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి కారణమైనాయి. కాంగ్రెస్‌పార్టీ ఘోరపరాజయానికి చింతించకుండా ఆమ్ ఆద్మీపార్టీ గెలుపును అభినందించడమా అంటూ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరంపై మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు షర్మిష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి కారణాలపై విశ్లేషించుకోవాల్సిన తరుణంలో చిదంబరం మాటలు ఏమిటని నిలదీశారు. పార్టీ నేతలు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. -
రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేను..
సినిమా: రాజకీయాల్లోకి వస్తానని కచ్చితంగా చెప్పలేనని నటి శ్రుతిహాసన్ ఆసక్తికరమైన చర్చకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో పడి కొంత కాలం నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ సమయంలో ఖాళీగా మాత్రం లేనని, తనకు ఇష్టమైన సంగీత ఆల్బమ్స్ రూపొందిస్తూ బిజీగానే ఉన్నానని చెప్పు కొచ్చింది. అయితే ప్రేమ బ్రేకప్ అవ్వడంతో ఇటీవల మళ్లీ నటనపై దృష్టి సారించింది. అంతే కాదు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించేస్తోంది కూడా. ముఖ్యంగా తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా లాభం అనే చిత్రంలో నటిస్తోంది. ఎస్పీ.జననాథన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. తెలుగులో రవితేజకు జంటగా క్రాక్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక హిందీలో కాజోల్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మరిన్ని చిత్రాల్లో నటించే విషయమై కథలు వింటున్నట్లు చెప్పింది. మొత్తం మీద నటిగా ఇప్పుడు బిజీగా ఉంది. ఇటీవల మధురైలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్ మీడియాతో ముచ్చటించింది. ముఖ్యంగా తన తండ్రి రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎప్పుడూ తన తండ్రికి మద్దతు ఉంటుందని చెప్పింది. అయితే తనకు రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పింది. రాజకీయాల్లోకి వస్తానా? అన్నది చెప్పలేనని అంది. తాను ఇతరుల పనితో పోల్చుకోవడానికి ఇష్టపడనని చెప్పింది. భగవంతుడి దయ వల్ల తాను ఏం సాధించగలనో ఆ పనే చెస్తానని పేర్కొంది. ఇక తన తండ్రి గురించి చెప్పాలంటే ఆయనకు చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ అని తెలిపింది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పింది. కమల్‌హాసన్, రజనీకాంత్ కలుస్తారా? అన్న ప్రశ్నకు చెప్పలేనని తెలిపింది. రాజకీయాలపై తనకంత పరిజ్ఞానం లేదని పేర్కొంది. -
కమల్‌కు ‘గౌతమి’తో చెక్
సాక్షి, చెన్నై: సినీ నటి గౌతమి ద్వారా మక్కల్ నీది మయ్యం నేత కమల్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహ రచన చేసింది. తమపై ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న కమల్ వ్యాఖ్యలపై ప్రతి దాడికి గౌతమి ద్వారా తూటాల్ని పేల్చేందుకు కసరత్తులు సాగుతున్నాయి. ఆమెకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టి, ఆమె సేవల్ని వినియోగించుకునేందుకు తగ్గ పరిశీలన జరుగుతోంది. ఇక, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపిక నిమిత్తం ఈనెల 5న కమలనాథుల వద్ద ఢిల్లీ పెద్ద అభిప్రాయ సేకరణ సాగనుంది. విశ్వనటుడు కమల్, నటి గౌతమిల సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిప్రాయబేధాలతో ప్రస్తుతం ఈ ఇద్దరు వేర్వేరుగా ఉన్నారు. కమల్ మక్కల్ నీది మయ్యం ఏర్పాటుతో రాజకీయ పయనంలో బిజీ అయ్యారు. ఇక, గౌతమి టీవీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అంటూ ముందుకు సాగుతూ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చకు దారి తీసింది. అప్పటి నుంచి ఆమె బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. బీజేపీ నేతృత్వంలో జరిగిన పలు కార్యక్రమాల్లోనూ ఆమె భాగస్వామ్యం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా బీజేపీపై కమల్ వ్యాఖ్యల తూటాల్ని , విమర్శల స్వరాన్ని పెంచి ఉండడంతో ఆయనకు సరిగ్గా సమాధానం అన్నది గౌతమి మాత్రమే ఇవ్వగలరన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చారు. దీంతో ఆమెకు తగ్గ పదవి ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో ఆమె సేవల్ని వినియోగించుకోవచ్చన్న సూచన రాష్ట్ర పార్టీ నుంచి బీజేపీ అధిష్టానానికి చేరింది. ఈ దృష్ట్యా, గౌతమికి అధికార ప్రతినిధి పదవి అప్పగించేందుకు తగ్గ పరిశీలన సాగుతున్నట్టు సమాచారం. చక్కటి వాక్ చాతుర్యం, సందర్భానుచిత వ్యాఖ్యలు చేయడంలో గౌతమి నేర్పరి కావడంతో ఆ పదవికి ఆమె అన్ని రకాల అర్హురాలే అన్న చర్చ కమలాలయంలో సాగుతోంది. ఇక, రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత సమరం ముగిసిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, పార్టీ అధ్యక్ష ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఢిల్లీ నుంచి పెద్దలు 5న చెన్నైకు రానున్నారు. ఇక్కడి నేతల అభిప్రాయాల్ని స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గౌతమి తన వంతు సేవలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు కొందరికి మంగళవారం కానుకల్ని అందించారు. -
ఆసుపత్రిలో కమల్, రేపు సర్జరీ
సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరనున్నారు. ఆయన కాలులో వున్న ఇంప్లాంట్‌ను తొలగించేందుకు వైద్యులు శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2016 లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగినపుడు వైద్యులు ఇంప్లాంట్‌ను అమర్చారని, దీన్ని తొలగించాల్సి అవసరం ఉందని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారని ఎంఎన్ఎం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల సలహా మేరకు రేపు (నవంబర్ 22) కమల్ హాసన్ ఇందుకోసం ఆసుపత్రిలో చేరనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కోలుకునేందుకు కొన్ని వారాలు పాటు విరామం తీసుకోవాల్సి వుంటుందని మహేంద్రన్ వెల్లడించారు. -
సెలూన్ షాప్‌లో పనిచేశా..
చెన్నై, పెరంబూరు: మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొనడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అంతేతప్పా తనకు వేరే దారి లేక కాదని నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ పేర్కొన్నారు. గురువారం ఈయన 65వ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు భారీ ఎత్తన జరిగాయి. సాధారణంగా కమల్‌హాసన్ తన పుట్టిన రోజు వేడుకలను దూరంగా ఉంటారు. కానీ ఈ సారి అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య సొంత ఊరు పరమకుడిలో జరుపుకున్నారు. బుధవారం రాత్రి పరమకుడి చేరుకున్న కమల్ తాజ్హోటల్లో బసచేశారు. గురువారం ఉదయం తెళిచెందూర్కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన తన తండ్రి శ్రీనివాసన్ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఉపాధి మైదానంలో పలువురు శిక్షకులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రపోరాటం జరిగినప్పుడు తన తండ్రి ఆ పోరాటంలో పాలు పంచుకున్నారని తెలిపారు. ఆయన అప్పుడే ఇలాంటి పోరాటం మళ్లీ జరిగితే ఏం చేస్తావు అని తనను అడిగారన్నారు. కాగా ఇప్పుడు అలా మళ్లీ పోరాటం చేయాల్సిన పరిస్థితి నరెలకొనడంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చాననీ, వేరే పని లేక కాదనీ అన్నారు. సెలూన్ షాప్‌లో పని చేశా తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదని చెప్పారు. తానిక్కడ నెలకొల్పిన ప్రతిభా ప్రోత్సాహ శిక్షణ కేంద్రం స్థానిక యువత కోసమేనన్నారు. ఇలాంటి శిక్షణా కేంద్రాలను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు పీహెచ్డీ చేసిన వారు పారిశుద్ధ్య పనికి దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. ఉద్యోగాల కోసం వలస పోకూడదన్నది తన భావన అని అన్నారు. 61 లక్షల విద్యార్థులు ప్రాథమిక విద్యను అభ్యసించగా ఆ తరువాత అది 58 లక్షలకు తగ్గిపోయిందన్నారు. అదే ఎస్ఎస్ఎల్సీకి వచ్చే సరికి 11 లక్షలకు పడిపోయిందన్నారు. డిగ్రీకి వచ్చే సరికి ఆ సంఖ్య 5 లక్షలకు పడిపోయిందన్నారు. మరో విషయం ఏమిటంటే తాను గొప్ప కోసం చెపుతున్నానని భావించరాదనీ, ఆరంభంలో తాను నెలన్నర పాటు సెలూన్ షాప్‌లో పని చేసినట్లు తెలిపారు. ఆ తరువాత తాను ఉన్నత కుటుంబానికి చెందిన వాడినని తెలిసి ఆ షాప్ యజమాని మా ఇంట్లో తన గురించి చెప్పారన్నారు, దీంతో తానాపనిని మానేయాల్సి వచ్చిందనీ చెప్పారు. ప్రస్తుతం సైనికుల దళంలో చేరి ప్రాణాలర్పిస్తున్న వారి సంఖ్య కంటే ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య అధికం అవుతోందని కమలహాసన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కమలహాసన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు నటి శ్రుతీహాసన్, అక్షర హాసన్, సోదరి నళిని, సోదరుడు చారుహాసన్, నటి సుహాసిని పాల్గొన్నారు. కాగా కమలహాసన్ కుటుంబానికి సన్నిహితుడైన నటుడు ప్రభు తదితర సినీ ప్రముఖులు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కమల్‌ను రాష్ట్రపతిగా చూడాలన్నది ఆశ.. ఈ సందర్భంగా నటుడు ప్రభు మాట్లాడుతూ.. తన తండ్రికి కమలహాసన్ అంటే ఎనలేని ప్రేమ అని పేర్కొన్నారు. తన సినిమాకు చెందిన సాంకేతిక పరిజ్ఞానానంతా నేర్చుకుని తనను మించిపోయారని నాన్న చెప్పేవారని అన్నారు. తమ కుటుంబ మాదిరిగానే కమలహాసన్ కుటుంబం చాలా పెద్దదన్నారు. వారందరిని ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కమలహాసన్‌ను రాష్ట్రపతిగా చూడాలన్నది తన కోరిక అని నటుడు ప్రభు పేర్కొన్నారు. -
కమల్ హాసన్‌ను కలిసిన సింధు
చెన్నై: ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం ఇకపై పరిమిత సంఖ్యలోనే టోర్నీల్లోనే ఆడతానని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించాలంటే ఫిట్‌గా ఉండాలని, అందుకోసం ప్రతీ టోర్నీ ఆడకుండా కొన్ని టోర్నీల్లోనే ఆడతానని ఆమె తెలిపింది. చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ‘ఇది ఒలింపిక్ ఏడాది. దీని ముందు జరిగే ప్రతీ టోర్నమెంట్ ముఖ్యమైనదే. అయితే గాయాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండేందుకు కొన్ని టోర్నీలే ఆడతా. ఎప్పుడైతే మనం మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటామో అప్పుడే మనం ఆడే టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేయగలం. కోట్లాది భారతీయుల దీవెనలు, మద్దతుతో ఈసారి పసిడి గెలవడానికి ప్రయత్నిస్తా’ అని అన్నారు. అయితే గత ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం ప్రకారం... సింగిల్స్‌లో టాప్–15లో ఉన్న క్రీడాకారులు, డబుల్స్‌లో టాప్–10 ఉన్న జోడీలు ప్రతి ఏడాది 15 వరల్డ్ టూర్లలో కనీసం 12 టోర్నీలు ఆడాలి. లేకపోతే పెనాల్టీ ఎదురుకోవల్సి వస్తుంది. కమల్ హాసన్‌ను కలిసిన సింధు విఖ్యాత నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎమ్ఎన్ఎమ్) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను సింధు ఇక్కడి ఎమ్ఎన్ఎమ్ పార్టీ ఆఫీసులో కలిసింది. అయితే ఇది రాజకీయ భేటీ కాదని కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. ఇటీవలే ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు పసిడి గెలవడం దేశమంతా గర్వించదగ్గ అంశం అని ఆమె ఘనతను కొనియాడారు. చెన్నైలో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా సింధుని కోరానని ఆయన తెలిపారు. కమల్ హాసన్ తన అభిమాన నటుడని, అతనో సూపర్ స్టార్ అని సింధు వ్యాఖ్యానించింది. -
మరో ఉద్యమం తప్పదు.. కమల్ హెచ్చరికలు
సాక్షి, చెన్నై: ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం మండిపడ్డారు. తాజాగా మరో తమిళ నేత, మక్కళ్‌నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘ఒక దేశం ఒకే భాష అనే విధానం సరైనది కాదు. భారత్ ప్రజాస్వామ్య దేశం కావున ఒక దేశం అనేక భాషలు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. దేశ జాతీయ గీతం బెంగాళీ భాషలో ఉన్నా.. అది దేశ ఐక్యతను అన్ని రాష్ట్రాలను సంస్కృతిని గౌరవిస్తుంది. కావున దానిని మేమంతా గౌరవిస్తాం. రాష్ట్రాల సంస్కృతి జోలికి కేంద్రం రావడం సరికాదు. గతంలో జల్లికట్టు ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతంగా చేశామో దేశమంతా చూసింది. తమిళ భాష జోలికి వస్తే దానికి కంటే మరింత ఎక్కువగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ కమల్ హసన్ హెచ్చరించారు. కాగా హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో భారత్ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందని, దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే అని అభిప్రాయపడ్డారు. షా వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. Now you are constrained to prove to us that India will continue to be a free country. You must consult the people before you make a new law or a new scheme. pic.twitter.com/u0De38bzk0 — Kamal Haasan (@ikamalhaasan) 16 September 2019 -
కమల్ కొత్త పుంతలు
పెరంబూరు: మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తాజాగా ప్రచారానికి కొత్త పుంతలు తొక్కనున్నారు. ఈయన తమ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి కృతనిశ్చయుడవుతున్నారు. ఇంతకు ముందు గ్రామసభల పేరుతో ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకం అయ్యారు. ప్రజల సమస్యలను తెలుచుకునే ప్రయత్నం చేశారు. వారికి మక్కళ్‌నీది మయ్యం పార్టీ విధి విధానాలను తెలియజేయడంలో కొంత వరకూ సఫలం అయ్యారనే చెప్పవచ్చు. అందుకు ఉదాహరణ గత పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఓటు శాతాన్ని సాధించడమే కాక మక్కళ్ నీదిమయ్యం పార్టీ మరింత బలోపేతం చేసి రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గత మేలో గ్రామసభలను నిర్వహించాలని భావించినా ఎన్నికల కారణంగా వాయిదా వేసి జూన్ చివరలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలను నిర్వహించారు. ఈ సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. అదే విధంగా మరోసారి గ్రామసభలను నిర్వహించడానికి కమలహాసన్ సిద్ధం అయ్యారు. ఈ విషయమై ఇటీవల పార్టీ నిర్వాహకులకు, కార్యకర్తలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశాలను చేశారు. తాము చేసిన తీర్మానాలను, వాటి ఆవశ్యగతలను వివరించారు. కాగా గురువారం నుంచి ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ఈ సారి గ్రామసభలకు బదులుగా ప్రాంతసభల పేరుతో నిర్వహించనున్నారు. అయితే ఈ సారి కమలహసన్ ప్రచారంలో కొత్తపుంతలు తొక్కనున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 డివిజన్లను ఏర్పాటు చేసి డివిజన్‌కు ఇద్దరు చొప్పున 16 మంది కార్యదర్శులను నియమించనున్నారు. అలాగే 8 మందితో ఒక కమిటీని, 4 రాష్ట్ర కార్యదర్శులను నియమించి కొత్త ప్రచార వ్యూహంతో పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంత సభల్లో పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలందరూ విరివిగా పాల్గొనాలని కమలహాసన్ బుధవారం ఆదేశాలను జారీ చేశారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంత సభలను మక్కళ్ నీది మయ్యం పార్టీ నిర్వహించనుంది. -
ఆర్టికల్ 370 రద్దుపై కమల్‌హాసన్ కామెంట్
సాక్షి, చెన్నై : జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఏ రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లుగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370, 35ఏలకు ఓ ప్రత్యేకత ఉన్నదని, వాటిలో మార్పులు చేయాలనుకుంటే, ముందుగా చర్చల ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలన్నారు. (చదవండి : మోదీ వల్లే కశ్మీర్ సమస్యకు పరిష్కారం!!) జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన తీర్మానం, బిల్లులను కేంద్రం సోమవారమే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది. (చదవండి : జన గణ మన కశ్మీరం) సరిహద్దుల మార్పులకు సంబంధించి ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’ని కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశ పెట్టగా, ఓటింగ్ అనంతరం సభ ఈ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. జమ్మూ కశ్మీర్లో ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)లతోపాటు ప్రధాన విపక్ష పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు కేంద్రం చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. -
కమల ప్రక్షాళన
సాక్షి, చెన్నై: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు అనుగుణంగా అడుగుల వేగాన్ని పెంచేందుకు మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పార్టీ కార్యవర్గాల్లో సమూల మార్పుల దిశగా ముందుకు సాగే పనిలో పడ్డారు. గ్రామస్థాయి నుంచి బలోపేతం లక్ష్యంగా కమిటీల విస్తృత ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశ్వనటుడు కమల్ మక్కల్ నీది మయ్యంను ప్రకటించి ఏడాదిన్నర కాలం అవుతోంది. ఆపార్టీ పురుడు పోసుకున్న ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒంటరినే బరిలో అభ్యర్థులను కమల్ నిలబెట్టారు. టార్చ్‌లైట్ చిహ్నంతో రాష్ట్రవ్యాప్తంగా ముందుకు సాగిన కమల్‌కు కనీస ఓటు బ్యాంక్‌తో కొంత మేరకు వెలుగును రాబట్టుకోగలిగారు. డిపాజిట్లు గల్లంతైనా ఓటు బ్యాంక్ అన్నది తనకు ఉందని చాటుకున్నారు. కొన్ని చోట్ల ఆశాజనకంగా ఓట్లు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న కాంక్షతో ముందుకు సాగుతున్నారు. అందుకే రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సలహాలకు అనుగుణంగా ముందుకు సాగేందుకు సిద్ధమైనట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆయన వ్యూహాలకు అనుగుణంగా అడుగుల వేగాన్ని పెంచేందుకు నిర్ణయించిన కమల్ముందుగా పార్టీలో ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర స్థాయి కమిటీ జోలికి వెళ్లకుండా ముందుగా గ్రామస్థాయి నుంచి బలోపేతానికి సిద్ధమయ్యారు. ఇందు కోసం జిల్లాల వారీగా కార్యవర్గాల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. జిల్లాల వారీగా.. చెన్నైలో జరిగిన పార్టీ కార్యవర్గం భేటీ మేరకు కొత్త వ్యూహాలకు పదునుపెట్టే పనిలో కమల్ నిమగ్నమయ్యారు. ప్రశాంత్ కిషోర్ రచించి ఇచ్చినట్టుగా పేర్కొంటున్న అంశాల మేరకు కొత్త మార్పులతో కార్యవర్గాల ఏర్పాటుకు కమల్‌హాసన్ సిద్ధమయ్యారు. ఆమేరకు జిల్లా స్థాయిలో ఒక అధ్యక్షుడు, ముగ్గురు కార్యదర్శులు, ఆరుగురు సంయుక్త కార్యదర్శులు, ఒక ఇన్చార్జ్, నలుగురు సభ్యులతో పదిహేను మందితో కార్యవర్గాల ఏర్పాటుకు ఆయన నిర్ణయించారు. ఆ మేరకు ఇక, ఆయా జిల్లాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి కార్యవర్గాలను ప్రకటించబోతున్టు్ట సమాచారం. కార్యవర్గ రూపు రేఖలు, గ్రామ స్థాయి నుంచి చేపట్టాల్సిన కార్యక్రమాల మీద దృష్టి పెట్టి, ఇక, విస్తృతంగా దూసుకెళ్లేందుకు నిర్ణయించారు -
రాజకీయంగా కలుస్తారా?
తమిళసినిమా: రాజకీయంగా కమలహాసన్, రజనీకాంత్ కలుస్తారా? ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న వాడి వేడి చర్చల్లో ఇది ఒకటి. సినీరంగంలో కమలహాసన్, రజనీకాంత్ దిగ్గజాలు. అంతే కాదు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆరంభకాలంలో కమలహాసన్, రజనీకాంత్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. కాగా చాలా కాలం నుంచి రాజకీయాల్లోకి వస్తానంటూ చెబుతూ వస్తున్న రజనీకాంత్ ఇప్పటికీ మాట మార్చలేదు. రాజకీయాల్లోకి వస్తాననే చెబుతున్నారు. అయితే గత ఏడాది మాత్రం బహిరంగరంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అది జరిగి కూడా ఏడాది దాటిపోయింది. అయితే జూన్‌లో రజనీకాంత్ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణన్ చెబుతున్నారు. ఇక కమలహాసన్ విషయానికి వస్తే అనూహ్యంగా రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి, వెనువెంటనే ఆ దిశగా అడుగులు వేసి మక్కళ్ నీది మయ్యం పేరుతో పార్టీని ప్రారంభించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతే కాదు పార్టీ బలోపేతం కాకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను పొందారు. కొన్నిస్థానాల్లో అయితే లక్షకు పైగా ఓట్లను రాబట్టగలిగారు. అదే ఉత్సాహంతో పార్టీని మరింత పటిష్టం చేసి రానున్న శాసనసభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. నటుడు రజనీకాంత్ పార్టీని ప్రారంభించి శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో కమలహాసన్, రజనీకాంత్ కలిసి పోటీ చేస్తారా? అలా చేస్తే విజయం సాధించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కూడా కమలహాసన్‌తో తనకున్న స్నేహాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేయవద్దని ఆ రకమైన ప్రసారాలకు నటుడు రజనీకాంత్ ఫుల్స్టాప్ పెట్టారు. అంతే కాదు లోక్‌సభ ఎన్నికల్లో మక్కళ్ నీది మయ్యం మంచి ఫలితాలను సాధించిందని కమలహాసన్‌ను అభినందిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో వీరి మైత్రి రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే రాజకీయంగా వీరిద్దరి దృక్పథాలు వేర్వేరన్నది గమనార్హం. మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ తమ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు నటుడు రజనీకాంత్‌కు మధ్య మితృత్వం పటిష్టంగా ఉందన్నారు. అయితే కమలహాసన్, రజనీకాంత్‌ల మధ్య పొత్తు కాలమే నిర్ణయించాలన్నారు. అదేవిధంగా పొత్తు విషయంలో తమ పార్టీ ప్రత్యేకతకు భంగం కలగరాదన్న విషయంలో తాము దృఢంగా ఉన్నామన్నారు. కాబట్టి పొత్తుల విషయంలో తాము తొందర పడదలచుకోలేదన్నారు. జాతీయ పార్టీల విషయంలో తన అభిప్రాయం ఇదేనని మహేంద్రన్ పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. శాసనసభ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో! -
కమల్ పార్టీకి 3.72% ఓట్లు
చెన్నై: 17వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన కొత్త పార్టీల్లో కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పట్టణ ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపినట్లు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అర్థం అవుతుంది. తమిళనాడులోని 11 లోక్‌సభ స్థానాల్లో ఎంఎన్ఎం అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి కమల్ నిరాకరించినప్పటికీ ఎంఎన్ఎం పార్టీకి 3.72 శాతం ఓట్లు లభించాయి. ‘కొన్ని ప్రాంతాల్లో మా అభ్యర్థులు 12 శాతం ఓట్లు సాధించారు. ఇంత తక్కువకాలంలో అన్నిచోట్ల బరిలోకి దిగి ఈ ఫలితాలు సాధించడం మంచి ఆరంభమే’ అని కమల్‌హాసన్ హర్షం వ్యక్తం చేశారు. దేశమంతా నరేంద్ర మోదీ ప్రభావం ఉన్నప్పటికీ తమిళ ఓటర్లు మాత్రం తమ రాష్ట్ర పార్టీలకే పట్టంకట్టడం గర్వంగా ఉందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, తాము చాలా దూరం ప్రయాణించాల్సివుందని చెప్పారు. అతి తక్కువ సమయం ఉండటంతో ఈ ఎన్నికల్లో అనుకున్నవిధంగా రాణించలేకపోయామని అంగీకరించారు. తమ అంకితభావం చూసి ఏమీ ఆశించకుండా ప్రజలు తమకు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అత్యధిక ఓట్లు సాధించిన తమ అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో విజేతలుగా నిలుస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి పట్టం కట్టిన రాష్ట్రాలతో సమానంగా తమిళనాడును చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి కమల్‌హాసన్ విజ్ఞప్తి చేశారు. -
నాలో మరో కోణం చూస్తారు..జాగ్రత్త!
సాక్షి, చెన్నై : తనలోని ఒక కోణాన్నే చూశారని, మరో కోణాన్ని మీరు చూడలేదంటూ నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తన పార్టీ నిర్వాహకులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మక్కళ్ నీది మయ్యం పార్టీ విజం సాధించకపోయినా, కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మక్కళ్‌నీది మయ్యం పార్టీ 14,74,916 ఓట్లను దక్కించుకుంది. అదే విధంగా కోవై, ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, మధురై స్థానాల్లో లక్షకు పైగా ఓట్లను రాబట్టుకుంది. కాగా 11 స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓట్ల శాతం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను ఉత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లాల కార్యదర్శులు, నిర్వాహకులకు విందునిచ్చారు. ఈ విందులో సుమారు 400 మంది పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో పలు విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనం ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. విజయం సాధించామనే భావించాలి. పార్టీని ప్రారంభించిన 14 నెలల్లోనే ఎన్నికలకు వెళ్లిన తాము మంచి ఫలితాలనే పొందామని అన్నారు. అయితే డెల్టా జిల్లాలు, ఉత్తరాది జిల్లాల్లో తక్కువ ఓట్లనే రాబట్టగలిగామని, కాగా ఎన్నికలు ముగిశాయి కదా, తదుపరి ఎన్నికల సమయానికే ప్రజల వద్దకు వెళ్లవచ్చు అని ఎవరూ భావించరాదన్నారు. ప్రతి ఒక్కరు ఆయా ప్రాంతాల్లో ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేసిన వారికి రానున్న శాసనసభ ఎన్నికల్లో అవకాశం ఉంటుందని చెప్పారు. కఠిన చర్యలుంటాయి ఈ ఎన్నికల్లో కఠినంగా శ్రమించింది ఎవరూ? విశ్రాంతి పొందింది ఎవరూ? సరిగా పని చేయనివారెవరూ? వివరాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. అలాంటి వారు ఇకపై కూడా ఇలానే పని చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనలోని ఒక కోణాన్నే చూశారని, మరో కోణాన్ని మీరు చూడలేదని అన్నారు. ఆ కోణం తన, పర భేదాలను చూడదని అన్నారు. మనకిప్పుడు బాధ్యత పెరిగిందన్నారు. 14 నెలలోనే ప్రజలు మనకు ఇన్ని ఓట్లు వేసి ఆదరించారని, అందుకు తగ్గట్టుగానే మనం కూడా నడుచుకోవాలన్నారు. లేకుంటే పార్టీ నుంచి తొలగించడానికి కూడా వెనుకాడనని అన్నారు. అందరికీ ఉంటుంది విందు ప్రధాన నిర్వాహకులకే విందా? అని ఎవరూ భావించరాదని, తాను త్వరలోనే అన్ని జిల్లాలకు పర్యటించనున్నాని, అప్పుడు సమావేశాలతో పాటు విందు ఉంటుందని కమలహాసన్ పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా తాను వస్తానని కమల్ హాసన్ చెప్పారు. -
మోదీ ప్రమాణ స్వీకారం.. కమల్‌కు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : రెండో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాటు పూర్తి కావోస్తున్నాయి.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురికి మోదీ ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగా తాజాగా సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు ఆహ్వానం పంపారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోదీ, కమల్‌ను ఆహ్వానించారు. మే 30న రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిభవన్‌లో మోదీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మోదీతో ప్రమాణం చేయిస్తారు. నాథూరామ్ గాడ్సే మొట్టమొదటి హిందూ ఉగ్రవాది అని ఎన్నికల వేళ కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై బీజేపీ నేతలు సర్వత్రా విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కమల్‌ను మోదీ ఆహ్వానించడం విశేషం. అయితే కమల్ ఈ ఆహ్వానంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 352 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించింది. బీజేపీయే సొంతంగా 303 స్థానాల్లో విజయం సాధించింది. -
ఇప్పుడు ఓడినా.. భవిష్యత్‌లో గెలుస్తాం
చెన్నై: హీరో కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. తమిళనాడు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కమల్ బొక్క బోర్లా పడ్డారు. ఆ పార్టీని ప్రజలు తిస్కరించారు. అయితే పార్టీ ఘోర పరాజయంపై కమల్ పెదవి విప్పారు. శుక్రవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రెండో సారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు దేశంలో ఓ భాగమే.. గుర్తించండి ‘పార్టీని స్థాపించిన 14 నెలల్లో పోరాడి ఈ స్థాయికి వెళ్లగలగటం మాకు బలాన్నిచ్చింది. ఇప్పుడు ఓడిపోవచ్చు.. కానీ భవిష్యత్‌లో గెలుస్తాం. బీజేపీ పాలిత ప్రాంతాల్లోగా బీజేపేతర ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పాటు పడాలి. మీరు విజయం సాధించిన రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు ప్రాధాన్యత ఇవ్వాలి. తమిళనాడు కూడా దేశంలో ఒక రాష్ట్రమే అని గుర్తించాలి. అన్ని రాష్ట్రాలపై ప్రేమను సమానంగానే పంచాలి. ఓటమిపై సమీక్షించుకుని, భవిష్యత్‌లో ప్రజల పక్షాన ప్రతి పోరాటానికి ముందుంటాను’అని కమల్ పేర్కొన్నారు. నిరాశలో కమల్ ఫ్యాన్స్ ఫిబ్రవరి 21న ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీని కమల్ స్థాపించారు. దక్షిణాదిలో ఆరు రాష్ట్రాలకు గుర్తుగా ఆరు చేతులతో పార్టీ జెండాను తయారుచేసారు.అంతేకాదు ఈ ఎన్నికల్లో తమిళనాడులో దాదాపు అన్ని స్థానాల్లో తన పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల సంఘం కమల్ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. కానీ ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడమే కాకుండా అసలు ప్రభావమే చూపించలేక పోవడాన్ని కమల్ హాసన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఇంకో చెప్పు కోసం ఎదురుచూస్తున్నా!
సాక్షి, చెన్నై : ఇంకో చెప్పు కోసం ఎదురు చూస్తున్నానని నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు. ఈయన ఇటీవల హిందూ మతస్తుడైన గాడ్సేనే తొలి తీవ్రవాది అని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కేసులు, కోర్టు వరకు వెళ్లింది. కాగా, ఎన్నికల ప్రచారంలో కొందరు దుండగులు కోడిగుడ్లు, టమాటాలు కమల్‌హాసన్‌పై విసిరారు. ఒక వ్యక్తి చెప్పును కూడా విసిరాడు. ఈ ఉదంతం అనంతరం ఆదివారం ఉదయం నటుడు కమల్ హాసన్ ఒత్త చెరుప్పు సైజ్–7 (ఒక చెప్పు సైజ్ 7) అనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం పేరులో చెప్పు ఉండటంతో కమల్‌హాసన్ తనపై చెప్పు దాడిని ప్రస్తావించేలా ఈ వేదికపై చిత్ర దర్శక, కథానాయకుడు పార్తిపన్ తనకు గాంధీజీ జీవిత చరిత్ర పుస్తకాన్ని కానుకగా అదించారన్నారు. నిజానికి గాంధీజీ జీవిత చరిత్రను తాను చాలా సార్లు చదివానని చెప్పారు. గాంధీజీ సూపర్ స్టార్ అని, ఆయనే తన హీరో అని పేర్కొన్నారు. హీరోను విలన్‌గా, విలన్‌ను హీరోగా చూడలేమన్నారు. అదేవిధంగా విలన్‌ను హీరోగా అంగీకరించలేమన్నారు. ఒకసారి గాంధీజీ రైలులో ప్రయాణం చేస్తుండగా ఒక చెప్పు కనిపించకుండా పోయిందని, దాన్ని తీసుకున్నవారికి ఉపయోగపడాలని రెండో చెప్పును విసిరేశారన్న విషయాన్ని ఆయన జీవిత కథలో చదివానని తెలిపారు. అలా గాంధీ విసిరిన ఒక చెప్పు తనకు లభించిందని, రెండో చెప్పు కోసం ఎదురు చూస్తున్నానని కమల్‌హాసన్ పేర్కొన్నారు. హే రామ్ చిత్రంలో ఆయన చెప్పులు తీసుకొని వస్తానన్నారు. అందుకోసం తాను పరిశోధన చేసినప్పుడు గాంధీజీ వాడిన కళ్లజోడు, చెప్పులు కనిపించకుండా పోయినట్లు తెలిసిందన్నారు. ఆ విషయాన్ని ఈ ఒత్త చెరుప్పు చిత్రంలో చర్చించకుండా ఉండరని భావిస్తున్నానన్నారు. అందుకే చిత్ర వర్గాలు భయపడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు. అయితే, భయపడాల్సిన అవసరం లేదని, అది గర్వపడే విషయమేనని కమల్‌హాసన్ పేర్కొన్నారు. -
ప్రతి మతంలోనూ ఉగ్రవాదులున్నారు
సాక్షి, చెన్నై: ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారనీ, తాము పవిత్రులమని ఎవ్వరూ చెప్పుకోలేరని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ శుక్రవారం అన్నారు. అరెస్టుకు తాను భయపడటం లేదనీ, కానీ తనను అరెస్టు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేనుద్దేశిస్తూ కమల్ దేశంలో తొలి తీవ్రవాది హిందువేననడం వివాదమైంది. శుక్రవారం కోయంబత్తూరులోని సులూరులో కమల్ ప్రచారం చేయాల్సి ఉండగా, ఆదివారం నాటి వ్యాఖ్యల కారణంగా ఆయనకు ప్రచారానికి అనుమతి లభించలేదు. దీంతో కమల్ ట్విట్టర్ ద్వారా ప్రజలను ఓట్లు అడిగారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడం అరవకురిచ్చిలోనే తొలిసారి కాదనీ, లోక్‌సభ ప్రచారం సమయంలో చెన్నైలోనే ఇదే మాట అన్నా అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదని కమల్ చెప్పారు. -
వృథా చర్చలేల?!
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ ‘స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని వ్యాఖ్యానించి పెద్ద దుమారం రేపారు. ‘ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేద’ని కూడా ఆయన సెలవిచ్చారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఏదో ప్రయోజనం, పర మార్థం లేకుండా ఏదీ మాట్లాడరు. కమల్ కాకలు తీరిన రాజకీయ నాయకుడు కాకపోవచ్చు. ఈమధ్యకాలంలోనే ఆయన పూర్తి స్థాయి రాజకీయ నేత అవతారం ఎత్తి ఉండొచ్చు. కానీ ఆయనకు రాజకీయాలు బాగానే ఒంటబట్టాయని ఈ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. అయితే వాటికి అవస రమైన లౌక్యం ఆయనకు ఇంకా పూర్తిగా పట్టుబడినట్టు లేదు. అందుకే ‘ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి’ ఇలా అనడం లేదని తనకుతానే సంశయాన్ని రేకెత్తించారు. సహజంగానే కమల్‌హాసన్ వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రకటనలు వెలువడ్డాయి. బీజేపీ ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేస్తే, ఢిల్లీ హైకోర్టులో ఆ పార్టీకి చెందిన నాయకుడొకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వేరేచోట ‘ఒక హిందువు ఉగ్రవాద చర్యలో పాల్గొన్న ఘటన చరిత్రలో ఒక్కసారైనా ఉందా?’ అని అడగటాన్ని దృష్టిలో పెట్టుకుని కమల్ ఈ మాట అన్నారు. మాకు ఏ మతమూ లేదని చెప్పుకునే వారి సంఖ్య ప్రపంచంలో అత్యల్పం గనుక పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మత విశ్వాసాన్ని అనుసరించే కుటుంబాల్లోనే జన్మిస్తారు. ఎదిగాక ఆ విశ్వాసా లను వారు అనుసరించవచ్చు. నిరాకరించవచ్చు. ఆ విశ్వాసాలను భక్తిశ్రద్ధలతో అనుసరిస్తున్నా మని అనుకుంటూ అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడేవారు గతంలోనూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. అయితే అలాంటివారిని వారు పుట్టిన మతంతో గుర్తించడం అసమంజసం. ఉగ్రవాదులు తమది ఫలానా మతం అని చెబుతుండవచ్చు. ఆ మతాన్ని ఉద్ధరించడానికే తాము ఇలాంటి చర్య లకు పాల్పడుతున్నట్టు వారు అడపా దడపా ప్రకటనలు చేస్తుండవచ్చు. కానీ వారిని నెత్తిన పెట్టు కుని, సొంతం చేసుకోవాలని ఏ మతమూ తహతహలాడిన దాఖలా లేదు. పైగా వారి చర్యలు తమ మత విశ్వాసాలకు విరుద్ధమని అనేక సందర్భాల్లో ఎందరో మతాచార్యులు చెప్పారు. కనుక ‘ఒక హిందువు ఉగ్రవాద చర్యలో పాల్గొన్న ఘటన ఉందా’ అని మోదీ అడగడమైనా, అందుకు కమల్ ‘స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువు’ అని చెప్పడమైనా అసమంజసం. ఎన్నికల్లో చర్చించడానికి బోలెడు అంశాలున్నాయి. అందరూ సమష్టిగా కృషి చేస్తే తప్ప పరిష్కారంకాని జటి లమైన సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి ఒక అశాస్త్రీయ భావనను ఈడ్చుకొచ్చి దానిచుట్టూ చర్చ జరిగేలా చేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి ఒరిగేదేమీ ఉండదు. మహాత్మా గాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సే గురించి, అతడు ఆ చర్యకు పాల్పడ్డం వెనకగల కారణాల గురించి ‘గాంధీజీస్ మర్డర్ అండ్ ఆఫ్టర్’ అనే గ్రంథంలో అతడి సోదరుడు గోపాల్ గాడ్సే రాశాడు. ఆ పుస్తకం చివర నాథూరాం వీలునామాను అనుబంధంగా ఇచ్చారు. దాని ప్రకారం గాంధీజీపై తనకెంతో గౌరవాభిమానాలున్నా ఆయన ముస్లిం అనుకూల వైఖరి తనకు ఆగ్రహం తెప్పించిందని నాథూరాం చెప్పడాన్ని చూడొచ్చు. దేశ విభజనకు కారణం కావడమేకాక, ఇలా ముస్లింలపట్ల సానుకూల దృక్పథం ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయానని కూడా అందులో చెప్పాడు. గాంధీజీపై ఇలాంటి అభిప్రాయాలు నాథూరాంలో ఏర్పడటానికి కారణం అతను పుట్టిన మతం కాదు. ఆ మత విశ్వాసాలు కాదు. ఆ పేరిట వెలసిన సంస్థల్లో అతను చురుగ్గా పనిచేశాడు. భిన్న అంశాలపై ఆ సంస్థల వైఖరులు, ఆచరణ అతన్ని రూపొందించాయి. ఆ ఘటన జరిగేనాటికి నాథూరాం చర్యను ఉగ్రవాదంగా పరిగణించాలన్న స్పృహ ఉండకపోవచ్చు. కానీ ఇప్పటి అర్ధంతో అది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అవుతుందనడంలో సందేహం లేదు. అతగాడు హిందువుల కోసం ఏదో చేస్తున్నానని అనుకునే ఆ పని చేసినా వారెవరూ అతన్ని సొంతం చేసుకోలేదు. నెత్తిన పెట్టుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు జోరుగా చెలరేగడం మొదలుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. అంతకుముందు ఉగ్రవాద ఘటనలున్నా అవి చెదురుమదురుగా జరిగినవే. 2001లో అమెరికాలో అల్‌కాయిదా నేతృత్వంలో సాగిన మారణకాండ, పెను విధ్వంసం తర్వాత నుంచి ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక పద్ధతి ప్రకారం ఉగ్రవాదులు పంజా విసురుతూనే ఉన్నారు. పలు ఇస్లామిక్ దేశాల్లో అమెరికా, దాని మిత్ర రాజ్యాలు రకరకాల పేర్లతో సాగించిన, ఇప్పటికీ సాగిస్తున్న దౌష్ట్యం అల్‌కాయిదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల పుట్టుకకు కారణం. ఆ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఆయా దేశాల్లో విధ్వంసానికి పాల్పడుతూ, అందుకు మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయి. కానీ ఇంతవరకూ ఉగ్రవాదికి, ఉగ్రవాదానికి నిర్దిష్టమైన, ప్రపంచంలో అందరికీ ఆమోదయోగ్య మైన నిర్వచనాలు లేవు. అలాగే మతానికీ, ఉగ్రవాదానికీ మధ్య ప్రగాఢమైన అనుబంధం ఉన్నదని తేల్చి చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. 1980–2003 మధ్య జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 315 ఘటనలు తీసుకుని అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ పాపే ఈ దాడులకూ, ఇస్లామిక్ మతతత్వానికి మధ్య సంబంధం లేదని వివరించారు. అమెరికా రచయిత మైకేల్ షిహాన్ సైతం ఇలాగే చెప్పారు. ఉగ్రవాద బృందాలన్నీ తమ రాజకీయ లక్ష్యాలను కప్పెట్టి, ప్రజామోదం పొంద డం కోసం మతాన్ని, సంస్కృతిని అడ్డుపెట్టుకుంటాయన్నారు. ఉగ్రవాదులు ఏ పేరు చెప్పుకున్నా వారు మొత్తం మానవాళికే శత్రువులు. వారిని మతకోణంలో చూసి, దాని ఆధారంగా వారిపై అభి మానాన్ని లేదా శత్రుత్వాన్ని ఏర్పరచుకోవటం అసమంజసం. మన రాజకీయ నాయకులు ఈ సత్యాన్ని గ్రహించి వ్యర్థమైన చర్చలకు ఇకనైనా ముగింపు పలకాలి. -
కమల్ హాసన్‌పై కేసు నమోదు
చెన్నై: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌పై అరవకురిచి పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో మొదటి తీవ్రవాది హిందువే అంటూ కమల్ హాసన్ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. దీంతో హిందువుల మనోభావాలను కించపరిచారంటూ కరూర్ జిల్లా పోలీసులకు రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమల్ హాసన్‌పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే
సాక్షి, చెన్నై/అరవకురిచ్చి: భారతదేశంలో తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే అని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారంలో కమల్ మాట్లాడారు. ‘స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని అన్నారు. అతనితోనే తీవ్రవాదం ప్రారంభమైందన్నారు. తనకు తాను గాంధీ మనవడిగా కమల్ అభివర్ణించుకున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. మహాత్ముని విగ్రహం ముందు నిల్చుని మాట్లాడుతున్నానని అన్నారు. దేశంలో సమానత్వాన్ని కోరుకునే గొప్ప భారతీయుల్లో తానూ ఒకడినన్నారు. జాతీయ జెండాలోని 3 రంగులు విభిన్న విశ్వాసాలకు ప్రతీకలని, ఇవి ఎప్పటికీ చెక్కుచెదరవన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. కమల్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంను బీజేపీ కోరింది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమల్ విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర్యరాజన్ ఆరోపించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఉన్నారు కాబట్టే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ సైతం కమల్ వ్యాఖ్యలను ఖండించారు. కళకు, ఉగ్రవాదానికి మతం ఉండదని తెలుపుతూ వివేక్ సోమవారం ట్వీట్ చేశారు. గాడ్సేని తీవ్రవాదిగా పోలిస్తే సరిపోయేదని.. అతని మతాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఏకీభవించిన నేతలు.. కమల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్, ద్రవిడార్ కజగం (డీకే) పార్టీలు మద్దతు తెలిపాయి. గాడ్సేకి ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇచ్చిందని డీకే అధినేత కె.వీరమణి వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి కూడా కమల్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ను ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బెయిల్‌పై బయట ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. -
కమల్ నాలుక కట్ చేయాలి: మంత్రి
సాక్షి, చెన్నై: మక్కల్ నీధి మయ్యమ్ అధినేత కమల్‌హాసన్ హిందూ ఉగ్రవాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర భారత్ లో మొట్టమొదటి హిందూ ఉగ్రవాది నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యలు చేసిన కమల్‌హాసన్ నాలుకను కత్తిరించాలని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల ఓట్ల కోసమే కమల్‌హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓ వ్యక్తి కారణంగా మొత్తం మతాన్ని నిందించలేమన్నారు. ఎన్నికల సంఘం కమల్‌హాసన్‌పై చర్యలు తీసుకుని, ఆయన పార్టీపై నిషేధం విధించాలని రాజేంద్ర బాలాజీ డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను ప్రస్తావిస్తూ దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై భగ్గుమన్న బీజేపీ కమల్‌పై చర్యలు తీసుకునే విధంగా ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఇదివరకే ప్రకటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా కమల్ కామెంట్స్‌ను తప్పుపట్టారు. -
హిందూ ఉగ్రవాదంపై కమల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : హిందూ ఉగ్రవాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించారు. మహాత్మగాంధీని హత్యచేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని కమల్‌హాసన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవక్కురిచ్చిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరక్కురిచ్చిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను ఈ వాఖ్యలు చేయడం లేదని వివరించారు. ‘గాంధీ విగ్రహం ముందు నిలబడి ఒక చెబుతున్నా..దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే. మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారని ఈ మాట చెప్పడం లేదు. ఎక్కడైనా ఇదే మాట చెబుతా’అని కమల్‌హాసన్ గాడ్సేపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలులతో పాటు పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. -
ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం : కమల్ హాసన్
పెరంబూరు: రాష్ట్రంలోని 4 స్థానాల్లో శాసనసభ ఉప ఎన్నికలు మే 19వ తేదీన జరగనున్నాయి. దీంతో ఈ స్థానాల్లో కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ పోటీ చేయనుంది. అరవకురిచ్చి, సూళూర్, ఒట్టపిడారం, తిరుప్పరకుండ్రం మొదలగు 4 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారితో పాటు దినకరన్ అమ్మా మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ, కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ, సీమాన్ నామ్ తమిళర్ పార్టీల తరఫున అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. దీంతో పంచముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే మక్కళ్ నీది మయ్యం పార్టీ మినహా ఇతర పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దీంతో కమలహాసన్ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడించనున్నారు. అదేవిధంగా ఆ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీని గురించి మక్కళ్ నీది మయ్యం పార్టీ ప్రదాన కార్యాలయం ఒక ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. అందులో.. జరగనున్న నాలుగు శాసనసభ ఉప ఎన్నికల్లోనూ కచ్చితంగా తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను శనివారం వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్లను సోమవారం దాఖలు చేస్తారని తెలిపారు. ఈ నాలుగు శాసనసభ ఎన్నికలు తమకు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. అందువల్ల 40 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు ఎలాగైతే కష్టపడి ప్రచారం చేశామో ఆదే స్థాయిలో ఈ నాలుగు శాసనసభ స్థానాల ఎన్నికలకు ప్రచారానికి కమలహాసన్ సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల సరళిపై సమీక్ష జరిగిన లోక్‌సభ ఎన్నికలపై అభ్యర్థులను కార్యాలయానికి పిలిపించి ఓటింగ్ సరళి, గెలుపు, ఇతర సమస్యలు వంటి విషయాల గురించి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఇది జరగనున్న శాసనసభ ఎన్నికల్లోనూ తమకు ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా ఇకపై జరిగే ఎన్నికల్లోనూ మక్కళ్ నీది మయ్యం పార్టీ పోటీ చేస్తుందని, అందుకు తమ పార్టీ వ్యూహం వేరుగా ఉంటుందని పార్టీ నిర్వాహకులు తెలిపారు. -
కమలహాసన్పై ఫిర్యాదు
తమిళనాడు, పెరంబూరు: మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్పై అన్నాడీఎంకే తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలిపి వారి తరఫున రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాలక పక్షం అన్నాడీఎంకే, ప్రతిపక్షం డీఎంకే నాయకులపై అవినీతి ఆరోపణలను గుప్పించారు. కాగా మంగళవారంతో ప్రచారం ముగియడంతో ఆయన అదే రోజు పలు ప్రముఖ దినపత్రికలకు ఫుల్‌పేజీలతో కూడిన ప్రకటనలను ఇచ్చా రు. అయితే ఆ ప్రకటనల్లో తూత్తుకుడి సం ఘటనకు సంబంధించిన ఫొటోలను పొం దుపరచడంతో అన్నాడీఎంకే పార్టీ వారు అభ్యంతరం తెలిపారు. ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లవుతుందని ఆ సంఘానికి కమలహాసన్పై ఫిర్యాదు చేశారు. -
నాన్నకే ఓటేస్తానని ఎందుకన్నానంటే..
పెరంబూరు: నటుడు కమలహాసన్‌కు నేను వీరాభిమానిని. అయితే నా ఓటు మాత్రం ఆయనకు వేయను. నేనే కాదు నా కుటుంబం అంతా తిరుమావళవన్‌కే ఓటు వేస్తాం అని మణిరత్నం అనే కమలహాసన్ అభిమాని అన్నారు. ఇతనెవరో కాదు నీట్లో సీటు లభించక ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని అనిత సోదరుడు. మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ సభలు, సమావేశాలతో బిజీగా ఉన్న కమలహాసన్ తాజాగా సామాజక మాధ్యమాలను ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆయన శనివారం యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేశారు. అందులో డీఎంకే, అన్నాడీఎంకే నేతలను తీవ్రంగా విమర్శంచారు. ముఖ్యంగా మొత్తం రాజకీయం నీట్ పేరుతో ఒక యువతిని హత్య చేశారే, ఆమె తల్లిదండ్రులను అడగండి ఓటు ఎవరికి వేయాలన్నది అని పేర్కొన్నారు ఆ వీడియోకు చాలా మంది స్పందిస్తున్నారు. అలా స్పందించిన వారిలో అనిత సోదరుడు మణిరత్నం కూడా ఉన్నాడు. అతను తన ఫేస్బుక్లో పేర్కొంటూ ప్రియమైన అన్న కమలహాసన్‌కు నేను నిజమైన అభిమానిని.నటనలోనే కాదు నిజజీవితంలోనూ సంప్రదాయాలను బ్రేక్ చేయాలనే కళాకారుడాయన. ఇతరులేమనుకుంటే ఏమిటీ తానుకున్నది చేసే వ్యక్తి కమలహాసన్. తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చారు. ఆయనను చూసే నేను 18 సార్లు రక్తదానం చేశాను. అవయవదానం కూడా చేశాను. కొత్తగా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా సంతోషమే. అన్న కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీకి నా శుభాకాంక్షలు. కమలహాసన్ చెప్పినట్లు ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో మేము తెలివిగానే ఉన్నాం. మా కుటుంబం మొత్తం తిరుమావళవన్‌కే ఓటు వేస్తాం, అనిత మరణించినప్పుడు ఆయన ఈ విషయాన్ని వదిలి పెట్టకూడదు అన్ని గట్టిగా మాట్లాడారు. అదే తిరుమావళవన్ మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయన డీఎంకే కూటమికి చెందిన వారు. నీట్ రద్దు వ్యవహారంపై డీఎంకే పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న జాతీయ పార్టీ కాంగ్రేస్ నీట్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చింది. కాబట్టి తమ కుటుంబం మొత్తం తిరుమావళవన్‌కే ఓటు వేస్తామని అన్నారు. అతని తండ్రి షణ్ముగం కూడా కమలహాసన్ వ్యాఖ్యలను అన్ని పార్టీల వారు విమర్శిస్తున్నారనీ, అయితే ఆయన మాటల్లోనూ వాస్తవం ఉందనీ అన్నాడు. కానీ తమ ఓట్లు మాత్రం తిరుమావళవన్‌కే వేస్తామని అన్నాడు. నాన్నకే ఓటేస్తానని ఎందుకన్నానంటే కాగా కమలహాసన్‌కు మద్దతుగా ఆమె కూతురు,నటి శ్రుతీహాసన్ ఓట్లు అడిగే పనిలో పడ్డారు. అయితే ఆమె ప్రత్యక్షంగా ప్రజల ముందుకు వెళ్లకుండా సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు. శ్రుతీహాసన్ ఇటీవల తన ట్విట్టర్లో నా తండ్రిని చూస్తుంటే గర్వంగా ఉంది. మెరుగైన భవిష్యత్ కోసం, సమాజం కోసం మీ దష్టిలో ఒక విజన్ ఉంది. దాన్ని మీ ప్రయత్నం,ఆసక్తి, నిజాయితీ ద్వారా సాధించగలుగుతారు.మార్పు కోసం నా ఓటు మీకే అని పేర్కొన్నారు. కాగా శ్రుతి ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న ఆమె అభిమానులు చాలా మంది స్పందిస్తున్నారు.అందులో ఒకరు నా ఓటు మీకే అని ఎలా చెప్పగలుగుతున్నారు? తండ్రి అనే బంధం కాకుండా, ఏ అభ్యర్థి సరైన వారు అన్నది ఎలా నిర్ణయించుకోవాలి,మీ తండ్రి సహా అని శ్రుతిహాసన్‌ను ప్రశ్నించారు.అందుకు శ్రుతిహాసన్ బదులిస్తూ కరెక్ట్‌గా చెప్పాలంటే నా తండ్రి అని ఓటు వేయమని కోరడం లేదు. ఆయన మార్పు కోసం పని పోరాడుతున్నారనే నా ఓటు మీకే అని చెప్పానని పేర్కొన్నారు. -
సిగరెట్ కాల్చడం మానేయండి: కమల్
చెన్నై, పెరంబూరు: మాది బీ టీమా? అని మండిపడ్డారు మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్. అసలు సంగతేమిటంటే ఈయన పార్టీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు, రాష్ట్రంలో జరగనున్న 18 శాసనసభ ఉప ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పనిలో పనిగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలను ఏకి పారేస్తున్నారు. దీంతో ఆ డ్రావిడ పార్టీలు కమలహాసన్ పార్టీపైనా ఎదురు దాడికి సిద్ధం అయ్యారు. కమలహాసన్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కమలహాసన్ మండిపడ్డారు. ఈయన మీడియాకిచ్చిన భేటీలో తన పార్టీని బీ టీమ్ అంటున్న ఇదే కూటములు ఢిల్లీలో ఏ ప్రధాని త్రాసు బరువు తగ్గుతుందో అ పక్కకు గుర్రాన్ని అమ్మబోతారు చూడండి అని అన్నారు. ప్రధానమంత్రి పదవికి ఇతరుల అవసరం ఏర్పడితే వీళ్లు గుర్రం బేరానికి పాల్పడతారని అన్నారు. స్థానిక అన్నాశాలలోని బ్రిడ్జి సమీపంలో గుర్రాన్ని పట్టుకుని ఒక శిల ఉంటుంది. అదే డీఎంకే అని అన్నారు. చేరకూడని వంచకుల కూటమిలో తన కమ్యునిస్ట్ సోదరులు చేరారని అన్నారు. రాజకీయాలు ఇలా ఉండకూడదన్న భావంతోనే తాను వచ్చానని అన్నారు. రాజకీయాల్లో ఒక పార్టీ మంచి చేస్తే దాన్ని తుడిచేయడానికి మరో పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. మంచి పథకాలను అమలు పరచనీయని సంస్కృతి మారాలన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే రెండు పార్టీలు మారతాయన్న నమ్మకమే పోయిందని అన్నారు. ఇక ఆ పార్టీలకు కాలం చెల్లిందని అన్నారు. తాము ఇంకో వందేళ్లు ఉంటామని వారు చెప్పుకోవచ్చునని, వారు మరో నూరేళ్లు ఉండరాదన్నదే తమ ప్రయత్నం అని కమలహాసన్ అన్నారు. వైదొలుగుతున్న నిర్వాహకులు ఇదిలాఉండగా మక్కళ్ నీది మయ్యం పార్టీ నుంచి నిర్వాహకుల తొలగింపులు, వైదొలగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కమలహాసన్ ఒక పక్క ఓట్లను రాబట్టుకునే కార్యక్రమలను చేస్తుంటే అసంతృప్తులు దూరం కావడం పార్టీని ఇబ్బంది పెట్టే చర్యే అవుతుంది. తిరునెల్వేలి జిల్లాకు చెందిన ముఖ్య నిర్వాహకులిద్దరు తాజాగా మక్కళ్ నీది మయ్యం పార్టీని వీడారు. ఆ మధ్య తిరునెల్వేలి జిల్లా పార్టీ నిర్వాహకుడు సెంథిల్‌కుమార్, జిల్లా పశ్చిమ నిర్వాహకుడు కరుణాకరరాజా కమల్ పార్టీ నుంచి వైదొలిగారు. వారు మంగళవారం పార్టీని వీడుతున్నట్లు లేఖ రాసిన కొద్ది సేపటికే వారిని తొలగిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రకటించింది. దీనంతటికీ కారణం నెల్లై పార్లమెంట్ స్థానానికి మక్కళ్ నీది మయ్యం తరఫున వెన్నిమలై అనే అభ్యర్థిని ఎంపిక చేశారు. ఆయన చెన్నైలో వ్యాపారస్తుడు. నెల్లైలో ఈయనకు ఎవరితోనూ సంబంధాలు లేవట. అదే విధంగా అక్కడి నిర్వాహకులతో సంప్రదించకుండా వారిని కలుపుకుపోకుండా, చెన్నై నుంచి కొందరిని వెంటేసుకుని ప్రచారం చేసుకుంటున్నారట. ఈ అసంతృప్తే సెంథిల్‌కుమార్, కరుణాకరరాజులు వైదొలగడానికి ప్రధాన కారణం. పొగ తాగడం మానేయండి రాష్ట్ర పొగ నియంత్రణ కమిటీ అధికారులు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు ఒక లేఖ రాశారు. అందులో ఆ కమిటీ అధికారి సిరిల్ అలెగ్జెండర్ పేర్కొంటూ తమ కమిటీ సభ్యులు పొగ నియంత్రణలో తీవ్రంగా పని చేస్తున్నారన్నారు. ఇటీవల పాండిచ్చేరిలో కమల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభను నిర్వహించారన్నారు. ఆ సమయంలో వేదిక వెనుక భాగాన ఒక స్త్రీ సిగరెట్ కాల్చడం తమ అధికారుల కంట పడిందన్నారు. అంతేగాకుండా మీ పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు పలువురు పొగ తాగుతున్న దృశ్యాల వీడియో తమకు అందిందని పేర్కొన్నారు. ఆ ప్రాంతం పొగ తాగే జోన్ కాదని, అది జనసంచారం ఉండే ప్రాతం అని వివరించారు. మీరు సినిమాల్లో పొగ తాగే సన్నివేశాలను ఎలా నిషేధించేవారో, అదే విధంగా ప్రస్తుత ప్రచారాల్లోనూ మక్కల్ నీది మయ్యం కార్యకర్తలు పొగ తాగడాన్ని కట్టడి చేయాలని కోరారు. ఇక ఇంతకుముందు పొగ తాగిన వారిపై ఎలాంటి చర్చలు తీసుకున్నారో వివరణను తమ కమిటీకి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
ఇంటి వద్దకే రేషన్
సాక్షి, చెన్నై: ఇంటి వద్దకే రేషన్ నిత్యవసర వస్తువులు దరి చేరుస్తామన్న హామీతో విశ్వనటుడు కమల్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు, వ్యవసాయం, పేదరిక నిర్మూలనకు పెద్ద పీట వేసే రీతిలో మేనిఫెస్టో ద్వారా హామీలు గుప్పించారు. ఇక, పార్టీలో ముఖ్యులుగా ఉన్న మహేంద్రన్‌కు కోయంబత్తూరు, స్నేహన్‌కు శివగంగై సీటును కట్టబెట్టారు. విశ్వనటుడు కమల్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యం పురుడు పోసుకుని ఏడాది అవుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికలు రావడంతో అదృష్ట్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. లోక్‌సభతో పాటుగా, ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిర్ణయించారు. ఇండియ కుడియరసు కట్చి నేత షేకూ తమిళరసన్ తనతో జత కట్టడంతో సత్తా చాటుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. గత వారం 21 మందితో తొలి జాబితాను ప్రకటించిన కమల్, మరెవరైనా తనతో కలిసి వస్తారా? అన్న ఎదురుచూపుల్లో పడ్డారు. అందుకే మిగిలిన స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. కలిసి వచ్చే వాళ్లు లేని దృష్ట్యా, ఆదివారం రాత్రి కోయంబత్తూరు వేదికగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఎన్నికల కమిషన్ తమకు కేటాయించిన బ్యాటరీ టార్చ్ ద్వారా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతూ, రెండో జాబితాను, ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 18 అసెంబ్లీ ఉప ఎన్నికల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమల్, మిగిలిన లోక్‌సభ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. అయితే, తాను మాత్రం పోటీకి దూరం అని ప్రకటించారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగించాల్సి ఉన్న దృష్ట్యా, ఈ సారి ఎన్నికలకు తాను దూరం అని వివరణ ఇచ్చుకున్నారు. ఇక, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మహేంద్రన్‌కు కోయంబత్తూరు, కీలక నేతగా ఉన్న స్నేహన్‌కు శివగంగై కట్టబెట్టారు. అలాగే, పొల్లాచ్చిలో యువతుల మీద సాగిన లైంగిక దాడుల్ని వెలుగులోకి తీసుకురావడంలో తీవ్రంగా శ్రమించిన సామాజిక కార్యకర్త మూకాంబికై రత్నంకు పొల్లాచ్చి లోక్‌సభ సీటును అప్పగించారు. తృణముల్‌తో పొత్తు లోక్‌సభ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్‌తో మక్కల్ నీది మయ్యం పొత్తు అని ఆ పార్టీ నేత కమల్ ప్రకటించారు. సోమవారం పశ్చిమ బెంగాళ్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కమల్ భేటీ అయ్యారు. గంట పాటుగా ఈ భేటీ సాగింది. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో తృణముల్ కాంగ్రెస్‌తో కలిసి తాము పనిచేస్తున్నామని కమల్ ప్రకటించారు. తృణముల్‌తో తమ పొత్తు అని, అండమాన్ లోక్‌సభకు పోటీ చేస్తున్న తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు లక్ష్యంగా మక్కల్ నీది మయ్యం పనిచేస్తుందన్నారు. మేనిఫెస్టో ముఖ్యాంశాలు తాగునీరు కొనుగోలుకు స్వస్తి పలికి. ఇంటింటా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. దారిద్య్రరేఖకు దిగువ ఉన్న 60 లక్షల కుటుంబాల్లో పేదరికం తొలగించడం. ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం కేటాయింపు. సమాన వేతనాలు. ప్రైవేటు సంస్థల్లో మహిళలకు 25 శాతం ఉద్యోగాలు కేటాయిస్తే ప్రత్యేక రాయితీలు. గుడిసెల రహితంగా తమిళనాడు లక్ష్యం వ్యవసాయంకు పెద్ద పీట, మహిళా రైతులకు ప్రోత్సాహకాలు. ఆర్థికంగా బలోపేతం. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాష్ట్ర గవర్నర్‌ను అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ద్వారానే ఎన్నుకోవడం హైకోర్టులో తమిళం అధికారిక భాషగా తీసుకొస్తాం రేషన్ షాపులకు ఇక వెళ్లాల్సిన పని లేదు. నేరుగా ఇళ్ల వద్దకే నిత్యవసర వస్తువుల్ని దరి చేరుస్తాం. దేశంలో సుప్రీంకోర్టు శాఖలు ఆరు డివిజన్లలో ఏర్పాటు. బలమైన సంస్థగా లోకా యుక్తా రూపకల్పన గతంలో అమలు చేసి, ప్రస్తుతం పాలకులు మరిచిన సమత్తువ పురం ఏర్పాటు, గ్రీన్ హౌస్‌ల నిర్మాణం వేగవంతం. విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేయడంతో పాటుగా ప్రజల్లో ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతామ న్నహామీలను కమల్ గుప్పించారు. -
మంచోళ్లకే టికెట్లు
మంచి పేరున్నోళ్లకే పార్టీ టికెట్ ఇవ్వడానికి మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ నిర్ణయించుకున్నారు. ఏడాది క్రితం అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి, వెనువెంటనే పార్టీని ప్రారంభించి ప్రజల్లోకి వచ్చిన నటుడు కమలహాసన్. అవినీతిని, నిరుద్యోగాన్ని రూపు మాపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లిన కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ ఆ దిశగా పునాదులను గట్టిగానే వేసుకుంది. ఇతర పార్టీ నాయకులకు భిన్నంగా తన ప్రత్యేకతను చాటు కుంటున్న కమలహాసన్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. అదీ ఒంటరి పోరుకు దిగుతూ 40 స్థానాల్లో అభ్యర్థులను దించడానికి రెడీ అయ్యారు. గత నెల 28వ తేదీన అభ్యర్థులకు దరఖాస్తుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కమలహాసన్ ఈ నెల 6, 7 తేదీల్లో వారి నుంచి దరఖాస్తులను పొందారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 1137 దరఖాస్తులు వచ్చాయి. కాగా స్థానిక ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వయంగా అందుకున్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. సోమవారం నుంచి అభ్యర్థులతో కమలహాసన్ ముఖాముఖి చర్చ జరుపుతున్నారు. ఆయనతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు డా.మహేంద్రన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పార్టీ కార్యదర్శి అరుణాచలం, కార్టూనిస్ట్ మదన్, నటి కోవైసరళ, మరికొందరు సామాజిక వేత్తలు ఇందులో పాల్గొన్నారు. తొలిరోజున తిరుచ్చి, తిరువణ్ణామలై, విళుపురం, ఆరణి, చిదంబరం, పుదుచ్చేరి, శ్రీపెరంబుత్తూర్, తిరువళ్లూర్, అరక్కోణం, ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, మధ్య చెన్నై మొదలగు 12 స్థానాలకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులను ఆహ్వానించారు. ఈ నియోజక వర్గాల నుంచి సుమారు 100 మంది ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకూ ఈ సమావేశం జరిగింది. ఈ ముఖాముఖి చర్చలో ఏడాదిగా సభ్యులుగా ఉన్న వారు పార్టీ కోసం ఏమేమి కార్యక్రమాలు చేశారు. సభ్యులు కాని వారు ఆయా ప్రాంతాల్లో ప్రజల అవసరాలేమిటీ? ప్రజల మధ్య వారికి ఉన్న పేరు, ప్రజల్లో మక్కళ్ నీది మయ్యం పార్టీకి ఎలాంటి ఆదరణ ఉంది? పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహం అవలంభిచనున్నారు? లాంటి అంశాల గురించి ప్రశ్నలు అడిగారు. ముఖాముఖి చర్చలో పాల్గొన్న వారందరికీ కమలహాసన్ రాజకీయ చట్టం గురించిన పుస్తకాన్ని అందించారు. అయితే ఇక్కడ ఇతర పార్టీల వారి మాదిరిగా ఎన్నికల్లో ఎంత ఖర్చు చేస్తారు? అని కమలహాసన్ ప్రశ్నించకపోవడం విశేషం. నియోజకవర్గాల వారిగా ఈ నెల 15వ తేదీ వరకూ ఈ ముఖాముఖి చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సత్ప్రవర్తులకే పార్టీ టికెట్ ఎలాంటి నేర చరిత్ర లేనివారికి, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించిన వారికీ, ఆయా ప్రాంతాల్లో మంచి పేరు ఉన్నవారికే, అదే విధంగా విద్యావంతులు, వయస్సు వంటివాటిని పరిగణలోకి తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని పార్టీ నిర్వాహకులు తెలిపారు. దీని గురించి సుదీర్ఘంగా చర్చించి నామినేషన్ దాఖలు చేయాల్సిన తేదీకి ఒక్క రోజు ముందు ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారట. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడటంలో కమలహాసన్ తాను నటిస్తున్న ఇండియన్–2 చిత్ర షూటింగ్‌ను వాయిదా వేసుకుని పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారట. -
వెండి తెర నాయకుడిగా
సాక్షి వెబ్ ప్రత్యేకం : స్వాతి ముత్యం లాంటి స్వచ్చమైన నటనైనా.. సాగర సంగమంలాంటి విషాదమైనా.. విచిత్ర సోదరుల్లాంటి ప్రయోగానికైనా తన నటనతో ప్రాణం పోసే నటుడు కమల్‌హాసన్. రీల్ లైఫ్‌లో నాయకుడు, క్షత్రియ పుత్రుడు లాంటి సినిమాల్లో తన చుట్టూ ఉన్న జనం కోసం పోరాడిన కమల్.. రియల్ లైఫ్‌లోనూ జనం తరపున నిలబడేందుకు సిద్దమయ్యారు. మరి ఈ దశావతార పురుషుడు.. రాజకీయ చదరంగంలో నిలదొక్కుకునేందుకు రెడీ అయ్యారు. తన ప్రత్యర్థులకు చెక్ పెట్టి.. రియల్ లైఫ్‌లోనూ ‘నాయకుడు’గా ప్రజల ముందుకొస్తున్నారు కమల్ హాసన్. చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా జాతీయ స్థాయిలోనే గాక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది యూనివర్సల్ హీరోగా కీర్తి గడించారు కమల్ హాసన్. తన సినిమాలతో, నటనతో అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకుని.. నటుడు, దర్శకుడు, నిర్మాత, డ్యాన్సర్, సింగర్‌గా అనేక విభాగాల్లో తనదైన ముద్రను వేశారు. బుల్లితెరపైనా బిగ్‌బాస్ షోతో.. తన చతురతను ప్రదర్శించారు. రాజకీయ రంగంలో మార్పులు తెచ్చి, ప్రజలు మెచ్చే పాలనను అందించేందుకు అడుగులు వేస్తున్నారు. జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించడానికి, రాజకీయ అవినీతిని రూపుమాపేందుకు రాజకీయ పార్టీని స్థాపించారు. నాస్తికత్వ భావనలు కల కమల్ హాసన్ బ్రాహ్మణ సమాజానికి చెందినవారు. దేవుడి ఉనికి ప్రశ్నిస్తూ.. సెక్యులర్ భావజాలం ఉన్న కమల్ హాసన్.. మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి.. రాజకీయం అరంగేట్రం చేశారు. కాంగ్రెస్, డీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ విధానాలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ.. ముక్కు సూటిగా వ్యవహరించడం కమల్ శైలి. కుటుంబ నేపథ్యం శ్రీనివాసన్-రాజ్యలక్ష్మీ దంపతులకు 1954 నవంబర్ 7న రామనాథపురంలోని పరమక్కుడిలో కమల్ హాసన్ జన్మించారు. కమల్ హాసన్.. బాల నటుడిగా ‘కలత్తూర్ కన్నమ్మ’తో సినీ రంగంలోకి ప్రవేశించారు. తన సినిమాల్లోని వివాదాలతో ఆయన కంటతడి పెట్టిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. నాటి క్షత్రియ పుత్రుడు సినిమా నుంచి మొన్నటి విశ్వరూపం వరకు వివాదాలతో సహవాసం చేశారు. సినిమాల్లోని కథ, పాటలు, మాటలు ఇలా ఏదో ఒకటి ఏదో ఒక వర్గాన్ని వెలేత్తి చూపడంతో వివాదాలు రాజుకునేవి. ప్రభుత్వాలు కూడా కక్ష కట్టేవి. కమల్ తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ప్రపంచ ఖ్యాతీ గడించిన భరతనాట్య కళాకారిణి వాణీ గణపతిని 1978లో వివాహామాడి 1988లో విడాకులు తీసుకున్నారు కమల్. అటుపై 1988లో సినీ నటి సారికను వివాహం చేసుకుని 2004లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి శ్రుతీ హాసన్, అక్షర హాసన్‌లు జన్మించారు. అటుపై మళ్లీ నటి గౌతమితో కొంతకాలం సహజీవనం చేశారు. కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్.. అక్షర హాసన్‌లు బాగానే రాణిస్తూ ఉన్నారు. అయితే వీరు సోషల్ మీడియాలోని కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. స్వతంత్ర భావాలు కలిగిన కమల్.. తన కూతుళ్లను కూడా అదే విధంగా పెంచానని.. తమకు కుల, మత, ప్రాంత బేధాలు ఉండవని చెబుతారు. - బండ కళ్యాణ్ -
కమల్ పార్టీ గుర్తు ‘టార్చ్‌లైట్’
చెన్నై: సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించింది. కమల్ ఎన్నికల కమిషన్(ఈసీ)కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలి పారు. ‘మా పార్టీకి టార్చ్‌లైట్‌ను గుర్తుగా కేటాయించినందుకు ఈసీకి ధన్యవాదాలు. తగిన గుర్తే లభించింది. తమిళనాడులో, భారత రాజకీయ చరిత్రలో మక్కల్ నీది మయ్యమ్ టార్చ్‌బేరర్‌గా మారనుంది’ అని ట్వీట్ చేశారు. గతేడాది ఎంఎన్ం పార్టీని స్థాపించిన కమల్‌హాసన్ ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తమ పార్టీ త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని, అభ్యర్థుల ఎంపికలో యువతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తామని ఆయన గత నెలలో చెప్పారు. -
కమల్ పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఎంఎన్ఎంకు ‘బ్యాటరీ టార్చ్’ గుర్తును కేటాయిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా కమల్ హాసన్ అభిమానులతో, కార్యకర్తలతో పంచుకున్నారు. ఎంఎన్ఎంకు బ్యాటరీ టార్చ్ గుర్తు కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడులో, దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి ఎంఎన్ఎం ‘టార్చ్ బేరర్’గా నిలువబోతుందని పేర్కొన్నారు. కాగా, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ హాసన్ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ, అన్నాడీఎంకేలతో తొలి నుంచి విబేధిస్తూ వస్తున్న కమల్ కాంగ్రెస్ దిశగా అడుగులు వేశారు. కమల్‌తో జత కలిసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సైతం సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అళగిరి.. కమల్‌తో చర్చలు జరిపారు. అయితే ఇటీవల కాంగ్రెస్, డీఎంకేలు కూటమిగా బరిలో దిగనున్నట్టు ప్రకటించాయి. అందులోని డీఎంకేతో కమల్‌కు పొసగకపోవడంతో ఆ కూటమిలో చేరే అవకాశం లేకుండాపోయింది. MNM thanks the Election commision for granting us the "Battery Torch" symbol for the forthcoming elections. So appropriate. @maiamofficial will endeavour to be the “Torch-Bearer” for a new era in TN and Indian politics. — Kamal Haasan (@ikamalhaasan) March 10, 2019 -
ఎంఎన్ఎం పార్టీలో చేరిన నటి కోవై సరళ
సాక్షి, చెన్నై : ప్రముఖ హాస్య నటి కోవై సరళ శుక్రవారం కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమల్ హాసన్ ఇవాళ కోవై సరళను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. కోవై సరళకు పార్టీ సభ్యత్వాన్ని అందించిన కమల్ హాసన్ ఆమె సేవలు అవసరమని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమవుతున్న కమల్ హాసన్‌కు కోవై సరళ పార్టీలో చేరిక కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో కొంత బలాన్నిస్తుంది. కొంతకాలంగా రాజకీయాలలో చేరికపై కోవై సరళ దూరంగా ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో చిరకాల మిత్రుడు, సహ నటుడు కమల్ హాసన్‌కు మద్దతు తెలపటంతో పాటు పార్టీలో చేరటం మక్కల్ నీది మయ్యం పార్టీకి కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ సందర్బంగా కోవై సరళ మాట్లాడుతూ ఎంఎన్ఎం పార్టీ కోసం కమల్ సూచనల మేరకు పని చేసేందుకు సిద్దమని అన్నారు. హాస్య నటిగా దక్షిణాన గుర్తింపు పొందిన కోవై సరళ మంచి వక్త కూడా. ఇకపై రానున్న ఎన్నికల ప్రచారంలో కోవై సరళ వ్యంగ్యాస్త్రాలు ఎలా పేలనున్నాయో చూడాలి మరి. -
కేజ్రీవాల్ బాటలో కమల్
తమిళసినిమా: మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పయనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కమలహాసన్ గత ఏడాది పార్టీని ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు. గ్రామసభలు, సమావేశాలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా కళాశాలల్లోని కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మక్కళ్ నీది మయ్యం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాననే సంతృప్తితో కమలహాసన్ ఉన్నారు. అదే నమ్మకంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోరుకే సిద్ధం అయ్యారు. ఇకపోతే కమలహాసన్ తన ప్రచార అస్త్రాలుగా మొదట్లో అన్నాడీఎంకే ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగారు. ఆ తరువాత డీఎంకే, బీజేపీ పార్టీలను వదలలేదు. ఇలా అవినీతిపై పోరాటం చేయడంలో కమల్ ప్రజాధరణను చూరగొన్నారనే వార్తలు రావడంతో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. కమలహాసన్ కాంగ్రెస్ పార్టీని మాత్రం విమర్శించడంలేదు. ఆమ్‌ఆద్మి పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మొదట్లో ప్రజా సంఘాలను ఏర్పాటు చేసుకుని, ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఏడాదిలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. అలా ఎంజీఆర్, ఎన్టీఆర్ తరువాత అతికొద్దికాలంలోనే ముఖ్యమంత్రి అయిన పట్టికలో కేజ్రీవాల్ చేరారు. ఈయన కూడా అవినీతినే ఆయుధంగా ఎంచుకున్నారు. అవినీతి రహిత పాలను అందిస్తానని ప్రజల్లోకి వెళ్లి వారిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు కమలహాసన్ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడులో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదీగాక కేజ్రీవాల్‌తో కమలహాసన్ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఆయన్ని పలుమార్లు కమల్ కలిసి చర్చించారు. ఒక దశలో మక్కళ్ నీది మయ్యం పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో కూటమి పెట్టుకుంటుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి పొత్తు ఏమీ లేదని, మక్కళ్ నీది మయ్యం ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ నిర్వాహకులు వెల్లడించారు. కేజ్రీవాల్ ప్రచారం అయితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచార మోతకు రాజకీయ నాయకులు సిద్ధం అవుతున్నారు. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే పార్టీల కూటమి జాతీయ నాయకులతో ప్రచారానికి సిద్ధం అవుతుంటే, డీఎంకే, కాంగ్రెస్ మిత్ర పక్షాలు తాము మాత్రం తక్కువా అన్నట్టుగా జాతీయ నాయకులను తమిళనాడులో దించబోతున్నారు. అన్నాడీఎంకే పా ర్టీ సారథ్యంలో బుధవారం వండలూర్‌లో జరగను న్న ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోది పా ల్గొననున్నారు. 13న జరగనున్న డీఎంకే ప్రచార సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రానున్నారు. ఆ తరువాత సోనియాగాంధీ కూడా రానున్నారు. మక్కళ్ నీది మయ్యం పార్టీ ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాల్గొంటారని ఆ పార్టీ నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం మీద అన్నాడీఎంకే, బీజేపీల కూటమి, డీఎంకే, కాంగ్రెస్ పార్టీల కూటములను మక్కళ్ నీది మయ్యం పార్టీ ఢీకొని ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం కమలహాసన్ పార్టీ అభ్యర్థులకు దరఖాస్తుల అందించే పనిలో ఉన్నారు. రేపు, ఎల్లుండి అభ్యర్థు నుంచి దరఖాస్తులను పార్టీ కార్యాలయంలో ఆయనే స్వయంగా స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని సమాచారం. -
కూటమి పార్టీలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై : తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రాబల్యం పెరుగుతున్నందునే తమను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో భాగంగానే తమ పార్టీని బీజేపీ బీ టీమ్‌గా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని, తమది తమిళనాడు ఏ టీమ్ అని కమల్ హాసన్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం విజయం సాధించే పార్టీవైపే మహాకూటమిలోని పార్టీలు పరుగులు తీస్తాయని, ఇలాంటి సమయంలో బేరసారాలకు తావులేకుండా తమ పార్టీ నిలకడగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఒక్కడినే లోక్‌సభ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోలేనని, ప్రజలు విరాళాలతో ముందుకు రావాలని, ఇది మెరుగైన భవిష్యత్‌కు పెట్టుబడిగా భావించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. -
పొత్తుల కోసం కమల్ కసరత్తు..!
సాక్షి, చెన్నై: మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ సైతం కొత్త కూటమి కసరత్తుల మీద దృష్టి పెట్టారు. ఏకాభిప్రాయం ఉన్న పార్టీలు వస్తే కలిసి పనిచేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. కమల్‌హాసన్ తనది ఒంటరి పయనం అని ఇప్పటికే స్పష్టం చేశారు. 40 స్థానాలకు అభ్యర్థులను ఆదివారం ప్రకటించవచ్చన్న చర్చ కూడా ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో కమల్ సైతం పొత్తు కసరత్తుల మీద దృష్టి పెట్టినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తన నేతృత్వంలో కాకుండా, ఏకాభిప్రాయం, తమిళనాడు సంక్షేమం, అభివృద్ధి మీద చిత్తశుద్ధి, మార్పును ఆశించే వాళ్లు తనతో కలిసి వస్తే కూటమిగా ముందుకు సాగడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా కమల్ స్పందించడం గమనార్హం. ఆదివారం చెన్నై విమానాశ్రయంలో మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. మూడో కూటమి కాదని, ఏకాభిప్రాయం కల్గిన వాళ్లు, తమిళనాడు సంక్షేమాన్ని ఆకాంక్షించే వాళ్లతో కలిసి పనిచేయడానికి రెడీగానే ఉన్నామన్నారు. ఏకాభిప్రాయం కల్గిన పార్టీలు తమిళనాట ఉన్నాయని, వాళ్లతో చర్చకు సిద్ధమే అన్నట్టుగా çకమల్ స్పందించారు. ఈ వ్యాఖ్యలతో పచ్చముత్తు పారివేందర్ నేతృత్వంలోనే ఐజేకేతో పాటుగా మరికొన్ని పార్టీల నేతలు కమల్‌తో పొత్తు చర్చల్లో ఉన్నట్టు సమాచారం. కమల్‌తో ఓ ప్రైవేట్ హోటల్లో పచ్చముత్తు పారివేందర్ భేటీ అయినట్టుగా ప్రచారం ఊపందుకుంది. డీఎంకే, అన్నాడీఎంకేలు విస్మరించిన పార్టీలు కమల్‌హాసన్ పక్షాన చేరవచ్చన్న చర్చ జోరందుకుంది. ఇక, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్‌తో కలిసి పనిచేయడానికి ఎస్డీపీఐ సిద్ధం కావడం విశేషం. -
కశ్మీర్‌పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: పుల్వామా దాడిని అఖండ భారతా వని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అమరజవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ సమయంలోనే కశ్మీర్‌పై కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సినీ హీరో, మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పుల్వామా ఘటన చాలా బాధాకరం. ఇంత విధ్వంసకాండ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో ప్రజాభిప్రాయం ఎందుకు సేకరించడం లేదు. అక్కడి ప్రజలు కోరుకున్నట్లుగా చేయాలి’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా కశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. కమల్ వ్యాఖ్యలతో ఇంటాబయటా రచ్చ జరగడంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. కమల్ వ్యాఖ్యలను కావాలని కొందరు వక్రీకరించారని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆరోపించింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని పేర్కొంది. సీఆర్పీఎఫ్ బలగాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. (కాపీ కొడతారా! సిగ్గు లేదా: కమల్ ఫైర్) -
కాపీ కొడతారా! సిగ్గు లేదా: కమల్ ఫైర్
సాక్షి, చెన్నై: డీఎంకేను, ఆపార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ను గురి పెట్టి మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ ఆదివారం పరోక్షంగా తీవ్రంగానే విరుచుకుపడ్డారు. గ్రామ సభలను ఉద్దేశించి సిగ్గు లేదా అని మండిపడ్డారు. చొక్కాలు చింపుకుని నిలబడను అంటూ అసెంబ్లీలో సాగిన పరిణామాల్ని గుర్తు చేస్తూ స్టాలిన్‌కు చురకలు అంటించారు. అలాగే, పరోక్షంగా రజనీని కూడా టార్గెట్ చేసే రీతిలో కమల్ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. ఇటీవల కాలంగా డీఎంకేను టార్గెట్ చేసి మక్కల్ నీది మయ్యం కమల్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం డైరెక్ట్ అటాక్ అన్నట్టుగా తీవ్రంగానే విరుచుకు పడే పనిలో పడ్డారు. డీఎంకే నిర్వహిస్తున్న గ్రామసభలను ఉద్దేశించి సిగ్గు లేదా, తననే కాపీ కొడతారా అని తీవ్రంగా మండిపడ్డారు. అడయార్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి కమల్ హాజరయ్యారు. కమల్ మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రాకూడదని తాను చెప్పనని వ్యాఖ్యానించారు. తమిళం అన్నది చిరునామా అని, అర్హత కాదని వ్యాఖ్యానించారు. ఏమి చేశాం అన్నది అర్హతగా అభివర్ణించారు. సినిమాల్లోనూ ఉంటారు... రాజకీయాల్లోనూ ఉంటారు...ఇదేం తీరు అని ప్రశ్నించే వాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. నాలుగు సినిమాలు చేయాల్సిన చోట ఓ సినిమా చేస్తున్నానని, అది కూడా నిధుల కోసం అంటూ, తనను ఉద్దేశించి విమర్శలు గుప్పించే వారి మీద ఈసందర్భంగా పరుష పదజాలం ఉపయోగించారు. అతి పెద్ద పార్టీగా చెప్పుకుంటున్న వాళ్లకు గ్రామసభల గురించి ఇన్నాళ్లు తెలియదా అని ప్రశ్నించారు. చిన్న బిడ్డగా ఉన్న తన పార్టీ కార్యక్రమాన్ని కాపీ కొట్టేందుకు సిగ్గు లేదా అని డీఎంకే గ్రామ సభలను ఉద్దేశించి విరుచుకు పడ్డారు. చొక్కా చింపుకోను: రాజకీయాలోకి వచ్చా, నా భాగస్వామ్యం ఏమిటో చెప్పా...ఇక, మీ భాగస్వామ్యం అందించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను మాత్రం చొక్కా చింపుకుని నిలబడనని, మరో చొక్కాను అసెంబ్లీలోనే మార్చుకునే వాడ్ని అని గతంలో అసెంబ్లీ వేదిగా స్టాలిన్ చొక్కా చిరగడం, వివాదం రేగడాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఎవరు ఉన్నా, తమిళనాడుకు జరిగేది ఏమీ లేదని, అందుకే ఢిల్లీలో నేనూ ఉండాలని సంకల్పించినట్టు పేర్కొన్నారు. మీసం మెలేయడం, తొడలు కొట్టడం గౌరవం కాదు అని పేర్కొంటూ, గ్రామసభల్ని కాపీ కొట్టడం కన్నా సిగ్గు మాలిన పని మరొకటి లేదని విరుచుకు పడ్డారు. ఇక, పార్టీ ప్రకటించి, రాజకీయ కార్యక్రమాల్లోకి రాను అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ పరోక్షంగా రజనీని టార్గెట్ చేసినట్టుగా కమల్ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.