సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరనున్నారు. ఆయన కాలులో వున్న ఇంప్లాంట్‌ను తొలగించేందుకు వైద్యులు శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2016 లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగినపుడు వైద్యులు ఇంప్లాంట్‌ను అమర్చారని, దీన్ని తొలగించాల్సి అవసరం ఉందని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారని ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల సలహా మేరకు రేపు (నవంబర్ 22) కమల్ హాసన్ ఇందుకోసం ఆసుపత్రిలో చేరనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కోలుకునేందుకు కొన్ని వారాలు పాటు విరామం తీసుకోవాల్సి వుంటుందని మహేంద్రన్ వెల్లడించారు.
ఆసుపత్రిలో కమల్, రేపు సర్జరీ
Published Thu, Nov 21 2019 12:29 PM | Last Updated on Thu, Nov 21 2019 12:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment