Undergo Surgery
-
శరద్‌పవార్‌కు అనారోగ్యం, కార్యక్రమాలన్నీ రద్దు
-
శరద్‌పవార్‌కు అనారోగ్యం, కార్యక్రమాలన్నీ రద్దు
సాక్షి, ముంబై: ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ (80) అనారోగ్యానికి గురయ్యారు. శరద్ పవార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, శస్త్రచికిత్స నిమిత్తం బుధవారం ఆసుపత్రిలో చేరనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. హోం మంత్రి అమిత్ షాతో శరద్ పవార్ రహస్య మంతనాలు జరిపారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో ఆయన అనారోగ్యం వార్త శ్రేణుల్లో ఆందోళన నింపింది. ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ శరద్‌పవార్ అనారోగ్యం వివరాలపై సోమవారం ట్వీట్ చేశారు. ఆదివారం సాయంత్రం కడుపునొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా, పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టుగా తేలిందన్నారు. దీంతో తదుపరి సమాచారం అందించేంత వరకు ఆయన కార్యక్రమాలన్నీ రద్దైనట్టు మాలిక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బ్లడ్ థిన్నర్ (రక్తం గడ్డ కట్టకుండా వుండే) మందులు వాడుతున్న నేపథ్యంలో 2021, మార్చి 31న ఆసుపత్రిలో చేరతారని, ఎండోస్కోపీ, అనంతరం శస్త్రచికిత్స జరగనుందని వెల్లడించారు. అటు తన ఆరోగ్యంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మహారాష్ట్ర నవనిర్మాన్ సేన నాయకుడు రాజ్ ఠాక్రే , ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన ఆరోగ్యంపై ఆరాతీశారని శరద్ పవార్ ట్వీట్‌చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. హోం మంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య కీలక భేటీ జరిగిందంటూ మీడియాలో వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఎన్సీపీ ఖండించింది. అలాంటిదేమీలేదని, ఇదంతా బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమని కొట్టి పారేసింది. అటు ఈ వ్యవహారంపై అమిత్ షాను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనాన్ని ఆశ్రయించారు. ప్రతి విషయాన్నీ బహిర్గతం చేయ లేమంటూ వ్యాఖ్యానించారు. కాగా పవార్ గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. Received a phone call from Shri @drharshvardhan ji to check about my health. Appreciate him checking on my health and well-being. — Sharad Pawar (@PawarSpeaks) March 29, 2021 Kind attention Our party president Sharad Pawar saheb was feeling a little uneasy due to a pain in his abdomen last evening and was therefore taken to Breach Candy Hospital for a check up. Upon diagnosis it came to light that he has a problem in his Gall Bladder. — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) March 29, 2021 -
ఆసుపత్రిలో కమల్, రేపు సర్జరీ
సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరనున్నారు. ఆయన కాలులో వున్న ఇంప్లాంట్‌ను తొలగించేందుకు వైద్యులు శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2016 లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగినపుడు వైద్యులు ఇంప్లాంట్‌ను అమర్చారని, దీన్ని తొలగించాల్సి అవసరం ఉందని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారని ఎంఎన్ఎం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల సలహా మేరకు రేపు (నవంబర్ 22) కమల్ హాసన్ ఇందుకోసం ఆసుపత్రిలో చేరనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కోలుకునేందుకు కొన్ని వారాలు పాటు విరామం తీసుకోవాల్సి వుంటుందని మహేంద్రన్ వెల్లడించారు. -
అజిత్‌కు వైద్యుల హెచ్చరిక
ప్రముఖ నటుడు అజిత్‌కు వైద్యులు తీవ్రంగా హెచ్చరించారని కోలీవుడ్ కోడై కూస్తోంది. వైద్యులు హెచ్చరించేంత తప్పు అజిత్ ఏమి చేశారని ఆశ్చర్యపోతున్నారా? అజిత్ కార్ రేస్‌లో గాయపడిన సమయంలో ఆయన వెన్నెముకకు ఐదుసార్లు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తరువాత షూటింగ్లో పోరాట దృశ్యంలో రిస్క్ తీసుకుని నటించినప్పుడు మరోసారి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వైద్యులు అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అయినా అజిత్ తాత్కాలికంగా వైద్యం చేయించుకుని ఆరంభం చిత్రాన్ని పూర్తి చేశారు. తరువాత ఆపరేషన్ చేయించుకుంటానన్న అజిత్ వైద్యుల సూచన పక్కనపెట్టి వీరం చిత్రం షూటింగ్లో పాల్గొన్నారు. ఆ చిత్రం పూర్తి అయిన నేపథ్యంలో మళ్లీ తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. నటుడు సూర్య ఈ చిత్రంలో నటించాల్సి ఉండగా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో మనస్పర్థల కారణంగా ఆయన వైదొలిగారు. ఇప్పుడీ చిత్రంలో అజిత్ నటించడానికి రెడీ అవుతున్నారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండటంతో అజిత్ వైద్యులను సంప్రదించారు. దీంతో వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని లేని పక్షంలో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. అయినా దర్శకుడు గౌతమ్‌మీనన్ కిచ్చిన కాల్షీట్స్ విషయంలో మాట తప్పడం ఇష్టంలేని అజిత్ శస్త్ర చికిత్సను సెప్టెంబర్ నెలకు వాయిదా వేసుకుని కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.