అజిత్‌కు వైద్యుల హెచ్చరిక
అజిత్‌కు వైద్యుల హెచ్చరిక
Published Fri, Feb 14 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
ప్రముఖ నటుడు అజిత్‌కు వైద్యులు తీవ్రంగా హెచ్చరించారని కోలీవుడ్ కోడై కూస్తోంది. వైద్యులు హెచ్చరించేంత తప్పు అజిత్ ఏమి చేశారని ఆశ్చర్యపోతున్నారా? అజిత్ కార్ రేస్‌లో గాయపడిన సమయంలో ఆయన వెన్నెముకకు ఐదుసార్లు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తరువాత షూటింగ్‌లో పోరాట దృశ్యంలో రిస్క్ తీసుకుని నటించినప్పుడు మరోసారి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వైద్యులు అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అయినా అజిత్ తాత్కాలికంగా వైద్యం చేయించుకుని ఆరంభం చిత్రాన్ని పూర్తి చేశారు. తరువాత ఆపరేషన్ చేయించుకుంటానన్న అజిత్ వైద్యుల సూచన పక్కనపెట్టి వీరం చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు.
ఆ చిత్రం పూర్తి అయిన నేపథ్యంలో మళ్లీ తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. నటుడు సూర్య ఈ చిత్రంలో నటించాల్సి ఉండగా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో మనస్పర్థల కారణంగా ఆయన వైదొలిగారు. ఇప్పుడీ చిత్రంలో అజిత్ నటించడానికి రెడీ అవుతున్నారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండటంతో అజిత్ వైద్యులను సంప్రదించారు. దీంతో వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని లేని పక్షంలో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. అయినా దర్శకుడు గౌతమ్‌మీనన్ కిచ్చిన కాల్‌షీట్స్ విషయంలో మాట తప్పడం ఇష్టంలేని అజిత్ శస్త్ర చికిత్సను సెప్టెంబర్ నెలకు వాయిదా వేసుకుని కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
Advertisement
Advertisement