రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేను.. | Shruti Haasan Opinion on Political Entry in Future | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేను

Published Wed, Jan 22 2020 8:01 AM | Last Updated on Wed, Jan 22 2020 8:01 AM

Shruti Haasan Opinion on Political Entry in Future - Sakshi

సినిమా: రాజకీయాల్లోకి వస్తానని కచ్చితంగా చెప్పలేనని నటి శ్రుతిహాసన్‌ ఆసక్తికరమైన చర్చకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో పడి కొంత కాలం నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ సమయంలో ఖాళీగా మాత్రం లేనని, తనకు ఇష్టమైన సంగీత ఆల్బమ్స్‌ రూపొందిస్తూ బిజీగానే ఉన్నానని చెప్పు కొచ్చింది. అయితే ప్రేమ బ్రేకప్‌ అవ్వడంతో ఇటీవల మళ్లీ నటనపై దృష్టి సారించింది. అంతే కాదు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించేస్తోంది కూడా. ముఖ్యంగా తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా లాభం అనే చిత్రంలో నటిస్తోంది. ఎస్‌పీ.జననాథన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. తెలుగులో రవితేజకు జంటగా క్రాక్‌ అనే చిత్రంలో నటిస్తోంది.

ఇక హిందీలో కాజోల్‌తో కలిసి ఒక  వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. మరిన్ని చిత్రాల్లో నటించే విషయమై కథలు వింటున్నట్లు చెప్పింది. మొత్తం మీద నటిగా ఇప్పుడు బిజీగా ఉంది. ఇటీవల మధురైలో ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్‌ మీడియాతో ముచ్చటించింది. ముఖ్యంగా తన తండ్రి రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎప్పుడూ తన తండ్రికి మద్దతు ఉంటుందని చెప్పింది. అయితే తనకు రాజకీయ పరిజ్ఞానం లేదని చెప్పింది. రాజకీయాల్లోకి వస్తానా? అన్నది చెప్పలేనని అంది. తాను ఇతరుల పనితో పోల్చుకోవడానికి ఇష్టపడనని చెప్పింది. భగవంతుడి దయ వల్ల తాను ఏం సాధించగలనో ఆ పనే చెస్తానని పేర్కొంది. ఇక తన తండ్రి గురించి చెప్పాలంటే ఆయనకు చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ అని తెలిపింది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పింది. కమల్‌హాసన్, రజనీకాంత్‌ కలుస్తారా? అన్న ప్రశ్నకు చెప్పలేనని తెలిపింది. రాజకీయాలపై తనకంత పరిజ్ఞానం లేదని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement