
కమల్‌హాసన్
‘‘ఇది చాలా క్లిష్టమైన సమయం. ఎవరికి తోచిన సహాయం వారు చేయాల్సిన సమయం’’ అంటున్నారు కమల్‌హాసన్. కరోనా బాధితులకు చికిత్స అందించడానికి వీలుగా తన ఇంటిని ఆస్పత్రిగా మార్చాలనుకుంటున్నారు కమల్. ‘‘ప్రభుత్వం అనుమతిస్తే నా ఇంటిని తాత్కాలికంగా ఆస్పత్రిగా మార్చుతాను. నా ‘మక్కళ్ నీది మయమ్’ (కమల్ రాజకీయ పార్టీ)లో ఉన్న డాక్టర్లతో రోగులకు వైద్యం చేయిస్తాను’’ అన్నారు కమల్.