residence
-
అంగ్ సాన్ సూకీ ఇంటి కథ
యాంగూన్: తమ దేశంలో ప్రజాస్వామ్యం, పౌర ప్రభుత్వం సాధన కోసం పోరాడి ఏళ్లకు ఏళ్లు గృహనిర్బంధంలో గడిపిన మయన్మార్ నాయకురాలు అంగ్ సాన్ సూకీకి చెందిన నివాసం మూడోసారి వేలంలో వెళ్లింది. అయినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గత వేలంపాటతో పోలిస్తే ఆసారి కాస్తంత తక్కువగా రూ.1,231 కోట్లకు ఎవరైనా దీనిని కొనుగోలు చేయొచ్చని కామాయుత్ జిల్లా కోర్టు అధికారిణి వేలంపాటను మొదలెట్టినా ఎవ్వరూ ముందుకు రాలేదు. మూడేళ్లుగా సైనిక ప్రభుత్వం దిగ్భందంలో దేశం కల్లోలితంగా మారిన కారణంగా అనిశ్చితిలో ఇంతటి డబ్బు కుమ్మరించేందుకు ఎవరూ సాహసించట్లేరని మీడియాలో వార్తలొచ్చాయి.ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం యాంగూన్ సిటీలోని బహాన్ టౌన్షిప్లో ఇన్యా సరస్సు ఒడ్డున చుట్టూ పచ్చికతో తెలుపు వర్ణంలో హుందాగా కనిపించే ఈ ‘54 యూనివర్సిటీ అవెన్యూ’భవనానికి ఘన చరిత్రే ఉంది. 1953లో ఆంగ్ సాంగ్ సూకీ తన సోదరులు, తల్లితో కలిసి ఈ విల్లాలోకి మకాం మార్చారు. అప్పట్నుంచీ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ఇంట్లో ఎవరూ లేరు. సైనిక పాలన అంతానికి పోరాటం ఇక్కడే మొదలెట్టారు. అహింసా ఉద్యమానికి ఇక్కడి నుంచే ఎన్నో వ్యూహరచనలు చేశారు. తదనంతర కాలంలో సైనిక ప్రభుత్వం సూకీని ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంచింది. ఏకంగా 15 సంవత్సరాలకుపైగా ఆమె ఈ ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉండిపోయారు. తర్వాత సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి సాధారణ ఎన్నికలు నిర్వహించాక అంగ్ సాన్ ఘన విజయం సాధించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. సూకీ ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగినప్పుడూ ఈ ఇంట్లోనే ఉన్నారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్సహా ఎందరో ప్రపంచ నేతలు అంగ్‌సాన్‌ను ఈ ఇంట్లోనే భేటీ అయ్యారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడూ ఆమె ఈ ఇంట్లోనే ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిౖకైన అంగ్ ప్రభుత్వాన్ని జుంటా సైన్యం 2021 ఫిబ్రవరిలో కూలదోసింది. ఆంగ్ ప్రభుత్వ పాలనలో పలు రకాల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఈమెపై ఎన్నో రకాల కేసులు నమోదుచేసి ఏకంగా 27 సంవత్సరాల కారాగార శిక్ష విధించడం తెల్సిందే.కోర్టులో వారసత్వ పోరురెండెకరాల స్థలంలో నిర్మించిన ఈ విల్లాపై వారసత్వంగా తనకూ హక్కు ఉంటుందని అంగ్‌సాన్ సూకీ అన్నయ్య అంగ్ సాన్ హో 2000 సంవత్సరంలో కోర్టుకెక్కారు. తన వాటా దక్కేలా చేయాలని యాంగూన్ హైకోర్టులో దావా వేశారు. అయితే ఈ దావా వెనుక జుంటా సైనికపాలకుల కుట్ర దాగుందని మీడియాలో వార్తలొచ్చాయి. హో ద్వారా సగం వాటా కొనేసి తర్వాత పూర్తి హక్కును దక్కించుకుని చిట్టచివరకు సూకీ జ్ఞాపకాలు జనం మదిలో లేకుండా దీనిని కూల్చేయాలని సైన్యం కుట్ర పన్నిందని అమెరికా మీడియాలో అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఈ భవనాన్ని జాతీయ స్మారకంగా మార్చాలని విపక్ష ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్ ఆఫ్ మయన్మార్’ డిమాండ్ చేసింది. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. చట్టప్రకారం అన్నా చెల్లెళ్లకు సమాన వాటా ఉంటుందని ఇంటిని వేలంవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో గత ఏడాది మార్చి 20న తొలిసారి, ఆగస్ట్ 15న రెండోసారి వేలంవేసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. -
ముద్రగడ నివాసంపై దాడి ఘటన.. పోలీసుల తీరు వివాదాస్పదం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ, కాపు నాయకులు ఖండించారు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం? -
చంద్రబాబు అధికార నివాసంగా కరకట్ట..
సాక్షి, విజయవాడ: కరకట్ట నివాసాన్ని సీఎం చంద్రబాబు అధికార నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు గృహాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే కరకట్ట నివాసంపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇది అక్రమ నిర్మాణం అంటూ గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అదే అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణ నది కరకట్ట లోపల ఈ నివాసాన్ని లింగమనేని రమేష్ నుంచి చంద్రబాబు తీసుకున్నారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..కాగా, చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారనే ఆరోపణలున్నాయి. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో గత కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలోనూ, సీఎం హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు.ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్.. చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చేరనే విమర్శలు ఉన్నాయి. -
అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు
-
ప్రధాని మా ఇంటికి వస్తే తప్పేముంది: సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణపతి పూజ కోసం తన నివాసానికి రావడంలో తప్పేముందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ప్రశ్నించారు. ప్రధాని రాకలో తప్పేమీ లేదన్నారు. ఇలాంటి అంశాల్లో రాజకీయవర్గాలు పరిణితిని కనబర్చాలని పేర్కొన్నారు. సీజేఐ నివాసానికి ప్రధాని వెళ్లడం తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఆస్కారం కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించిన విషయం తెలిసిందే. ‘గణపతి పూజ నిమిత్తం ప్రధాని మోదీ నా నివాసానికి వచ్చారు. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య జరిగే సమావేశాల్లో ఇదో భాగమే. రాష్ట్రపతి భవన్‌లోనూ, గణతంత్ర దినోత్సవం.. ఇలా పలు సందర్భాల్లో కలుస్తుంటాం. ప్రధాని, మంత్రులతో మాట్లాడతాం. మా మధ్య సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కేసుల ప్రస్తావన రాదు. సామాజిక స్థితిగతులు, ప్రజల జీవితాలపై చర్చ జరగుతుంది’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు నిర్వహించిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. రెండు ప్రధాన వ్యవస్థల మధ్య సుహుృద్భావ చర్చలుగా తమ భేటీలను చూడాలని పేర్కొన్నారు. -
ఆయన మా ఇంటికి వస్తారనుకోలేదు.. సంతోషంలో హీరోయిన్ (ఫోటోలు)
-
సమస్యలకు నిలయంగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
-
4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 4న (శుక్రవారం) సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇకపై కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండనున్నారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్‌కు వివిధ పనులు నిర్వహణకు ఎంతో అనువుగా ఉండనున్నదని తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయనున్నారని, ఆయన కొత్త ఇంటి కోసం వెదుకులాట జరుగుతోందని పార్టీ ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉండే ఇంటికోసం వెదికారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున కేజ్రీవాల్ తన సమయాన్ని, వనరులను ఉపయోగించుకునేందుకు అనువుగా ఉండే ఇంటి కోసం వెదికారు. మాజీ సీఎం కేజ్రీవాల్‌కు ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్మికులు, వివిధ సామాజిక, రాజకీయ ప్రముఖులు వసతి కల్పించేందుకు ముందుకువచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. డిఫెన్స్ కాలనీ, పితంపురా, జోర్‌బాగ్, చాణక్యపురి, గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, హౌస్ ఖాస్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో అరవింద్ కేజ్రీవాల్‌కు వసతి కల్పిస్తామంటూ అనేక ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలను కలిసే సౌలభ్యం ఉండే అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు.కేజ్రీవాల్ జాతీయ పార్టీ అధినేత పదవిలో ఉన్నందున ఆయనకు అధికారిక నివాసం కల్పించాలని పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేజ్రీవాల్ తన భార్య, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని కౌశాంబిలో ఉన్నారు. 2013లో తొలిసారిగా ఢిల్లీ సీఎం అయ్యాక తిలక్ లేన్‌లోని బంగ్లాలో నివాసమున్నారు. 2015లో రెండోసారి ఢిల్లీ సీఎం అయిన తర్వాత నుంచి ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు -
అమరావతి.. అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి/తాడేపల్లి/తాడికొండ: భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైకోర్టు, సచివాలయం పరిసర ప్రాంతాల చుట్టూ నీరు చేరింది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల నివాస భవనాల లోపలికి నీరు ప్రవహించింది. ఇతర ప్రభుత్వ భవనాలు సైతం జలమయమయ్యాయి. రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. సీడ్ యాకిŠస్స్ రోడ్డుపైన వరద నీరు భారీగా ప్రవహించింది. రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు సైతం నీటమునిగాయి. రహదారులు నీటితో నిండిపోయి నదుల్ని తలపిస్తుండటంతో రాజధాని ప్రాంతానికి రెండు రోజులుగా ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉధృత రూపం దాలి్చన కొండవీటి వాగు.. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్‌లోని ఉండవల్లి అవుట్‌పాల్ స్లూయిజ్‌ల ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. రాజధాని అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. ఈ వాగు రాజధాని ప్రాంతంలో 31.15 కి.మీల పొడవునా ప్రవహిస్తోంది. 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కొండవీటి వాగును పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. వాగు కట్టలను బలోపేతం చేసి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.కాని ఒక్క అడుగు కూడా ముందుకుపడకపోవడంతో కొండవీటి వాగు సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. తుళ్లూరు మండలంలోని కోటేళ్లవాగు, అయ్యన్నవాగు, నక్కవాగు, పాలవాగుల ద్వారా వచ్చే వరద ఉధృతి కూడా కొండవీటి వాగులో ప్రవహించాల్సిన పరిస్థితి రావడంతో రాజధానికి నీటి గండం తప్పడం లేదు. ముంపు ప్రాంతమైన అమరావతిలో రాజధాని వద్దని శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్ రావు కమిటీలు మొత్తుకున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. పైగా ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతులను భయపెట్టి, బెదిరించి సేకరించారు. ఇలా నిరి్మంచిన రాజధాని నిర్మాణాలు ఇప్పుడు రెండు రోజులపాటు కురిసిన వర్షాలకే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సారపాక వాగు కల్లోలంకృష్ణా నది వరద నీరు రాజధాని ప్రాంతంలోని సారపాక వాగులోకి ప్రవహిస్తుండడంతో కలకలం రేగింది. వరద నీరు సారపాక వాగు గుండా బయటకుపోయేందుకు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద గతంలో పైపులైను వేశారు. ఆదివారం అందులో నుంచి రాజధాని గ్రామాల్లోకి నీరు రావడాన్ని స్థానికులు గమనించి ఆపేందుకు ప్రయతి్నంచారు. అయినా కుదరకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే రాకపోవడంతో గ్రావెల్, ఇసుక, బూడిదను తీసుకువచ్చి తూముల వద్ద వేయడంతో ప్రవాహం కొంచెం ఆగింది. స్థానికులు దీన్ని గుర్తించకపోతే వెంకటపాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాలు ముంపునకు గురయ్యేవి.కొట్టుకుపోయిన కొండవీటి వాగు గేట్లుసాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు కృష్ణా నదిలో కలిసేచోట ఉన్న గేట్లలో రెండు గేట్లు ఆదివారం రాత్రి కొట్టుకుపోయినట్టు సమాచారం. ప్రకాశం బ్యారేజీ వద్ద కొండవీటి వాగు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద 17.5 అడుగుల నీటిమట్టం వస్తేనే తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది.కాగా.. కృష్ణా నదిలో భారీగా వస్తున్న వరద నీరు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం సంపులో చేరడం.. వాగుకు పైనుంచి వచ్చే వరద నీరు సంపు వరకు రాకపోవడంతో గంటగంటకు కొండవీటి నీటిమట్టం పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి గుహల వద్ద కొండవీటి వాగు 8 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండగా.. రాత్రికి 11 అడుగులకు చేరింది.మరో రెండు అడుగులు పెరిగితే ఉండవల్లిలో కొంత భాగం, పెనుమాకలో పంట పొలాలు, టిడ్కో నివాసాలు మునిగిపోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సీఆర్డీఏ కమిషనర్, ఇరిగేషన్ అధికారులు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద సిబ్బందితో సమీక్షిస్తున్నారు.కృష్ణా నది నుంచి కొండవీటి వాగులోకి నీరు రాకుండా ఇసుక బస్తాలు వేయించడంతోపాటు ఎత్తిపోతల పథకం వద్ద నీటి సంపులో పేరుకుపోయిన తూటికాడను తొలగించే పనులు చేపట్టారు.రైతు కష్టం ‘కృష్ణా’ర్పణంసాక్షి, అమరావతి: రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వాణిజ్య, ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కృష్ణా నదీపరివాహాక ప్రాంతంలో మాగాణి, మెట్ట అనే తేడా లేకుండా వాణిజ్య, ఆహారపంటలు దెబ్బతిన్నాయి. 2.30 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంటఆదివారం సాయంత్రానికి అందిన ప్రాథమిక అంచనాల ప్రకారం 2.75 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 50వేలకు పైగా ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అత్యధికంగా 2.30 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. ఆ తర్వాత 40 వేల ఎకరాల్లో పత్తి, 12వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికంగా 2.30 లక్షల ఎకరాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఆ తర్వాత గోదావరి డెల్టా పరిధిలో 25వేల ఎకరాలు, ఉత్తరాంధ్రలో 1500 ఎకరాల్లో పంటలు మునిగినట్టు లెక్కతేల్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో 20వేల ఎకరాలు, కర్నూలు జిల్లాలో 15వేల ఎకరాలు, నంద్యాలలో 10వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురైన పంట పొలాల్లో 60 నుంచి 70 శాతం పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 30–40శాతం పంటలు ముంపు నుంచి తేరుకునే అవకాశాలు ఉన్నప్పటికీ దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్ పఠాన్‌కి భారీ విందు..!
ప్రముఖ సంగీత విద్యాంసుడు, గాయకుడు అద్నాని ఇంట మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, అతని భార్య సఫా మీర్జాకి భారీగా విందు ఇచ్చారు. ఆ విందులోని వంటకాల జాబితా వింటే వామ్మో అనాల్సిందే!. అంతలా విందు ఏర్పాటు చేశారు గాయకుడు అద్నాని, ఆయన భార్య రోయా సమీఖాన్. ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆ విందులో డజనుకు పైగా రకరకాల రెసిపీలు ఉన్నాయంటూ వాటి వివరాలను కూడా వెల్లడించాడు. పాయా నుంచి మసాలాలు, క్రీము కొల్లాజెన్‌తో తయారు చేసిన మటన్ సూప్, సీక్ కబాబ్‌లు తోపాటు తమ కుటుంబ మూలాలను ప్రతిబింబించే మాంసాహారాలకు రెసిపీలు ఆ కూడా ఉన్నాయి. అలాగే ఉత్తర భారతీయ వంటకాలకు సంబంధించిన నాన్లు, కడాయి మటన్, బటర్ చికెన్, చనా, లసూని పాలక్‌లు తదితర రెసీపీలు కూడా ఉన్నాయి. తాను ఇలాంటి భారీ విందు కోసం అని ముందు రోజు ఏమి తినకుండా ఉంటానని చెబుతున్నాడు ఇర్ఫాన్. ఈ చక్కటి డిన్నర్లో మనసుకి హత్తుకునే సంభాషణలు, నోటికి రుచికరమైన ఆహారంతో చక్కగా సాగిపోతుంది కాలం అంటూ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో రాసుకొచ్చాడు ఇర్ఫాన్. గతంలో అద్నాన్ సమీ కూడా తనకు వండటం అంటే ఎంతో ఇష్టం చెప్పారు. ముఖ్యంగా పాయా, బిర్యానీ, పపఉలు వంటి వంటకాలు చేయడం ఇష్టమని చెప్పారు కూడా. ఈ ఇద్దరు స్నేహితులు వీడియోలో ఈ రుచికరమైన వంటకాలు ఎలా చేతితో తయారు చేశారో వివరిస్తూ జోక్‌లు వేసుకుంటూ కనిపించారుడ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: అక్షయ్ కుమార్ పేరెంటింగ్ స్టైల్!..తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!) -
స్వగ్రామానికి అమర జవాను మృతదేహం
రెండు రోజల్లో ఇంటికి వస్తానని చెప్పిన ఆ జవాను ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడు. ఈ విషయం తెలియని అతని తల్లి కొడుకు రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో అతని మృతదేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు ఇంటికి తీసుకురావడంతో, ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది.జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను కబీర్ సింగ్ ఉయికే అమరుడయ్యాడు. అతని మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకురాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కబీర్ సింగ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో వస్తానని చెప్పిన కుమారుడు ఇలా విగతజీవిగా వస్తాడని అనుకోలేదని అన్నారు.జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం చాలా కాలంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూన్ 11న సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో కబీర్ సింగ్ ఉయికే తీవ్రంగా గాయపడి అమరుడయ్యారు.సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులు కబీర్ మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకువచ్చారు. కబీర్ తల్లిని డీఐజీ నీతూ ఓదార్చారు. కథువా ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఒక సీఆర్పీఎఫ్ జవాను వీరమరణం పొందారు. కాగా కథువాలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు. #WATCH | CRPF jawan Kabir Das Uikey's mother, Indravati Uikey says, "Before the incident, he spoke to me around 2 pm. He was supposed to return home on soon." pic.twitter.com/O5k04CwAVx— ANI (@ANI) June 13, 2024 -
35 ఏళ్లుగా అద్దె కుప్పమే
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ ప్రజలు 35 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబును వారి సొంత మనిషిలా ఆదరిస్తూ, ఆయన్ని గెలిపిస్తున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం ఆ నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికీ అదేదో అద్దె ఇంటిలానో, తనకు పట్టని ప్రాంతంలాగానో వ్యవహరిస్తున్నారు తప్పితే, ఆ నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండాలని, అక్కడ తనకంటూ ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఎప్పుడూ భావించలేదు. చంద్రబాబునాయుడు 1983 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆ నియోజకవర్గాన్ని ఓ ఓట్ల యంత్రంగానే చూసి, ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినప్పటికీ, అక్కడి ప్రజలు మాత్రం చంద్రబాబును ఆదరిస్తూనే వచ్చారు. అయినా చంద్రబాబు ఆ ప్రాంతంపై శీతకన్నే వేశారు. ఆ ప్రాంతం తనను ఆదరిస్తున్నందుకు గుర్తుగా అయినా ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు. 1984లో టీడీపీలో చేరగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో స్థలం కొని, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ ఆయన సొంతిల్లు కట్టుకోలేదు. తాను రాజధానిని నిర్మిస్తానని గొప్పలు చెప్పుకొన్న అమరావతిలోనూ కట్టుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉండగానే హైదరాబాద్‌లోనే మరో అత్యాధునిక భవంతిని నిర్మించుకున్నారు. అటు సొంత నియోజకవర్గం కుప్పంని, ఇటు ఆయన రోజూ చెప్పే అమరావతి పైనా ఆయనకు ఓట్ల యావే తప్ప వాటిపై ప్రేమ లేదన్న విషయాన్ని బయటపెట్టుకున్నారు. ఆయన సొంతింటితోపాటు ఆస్థిపాస్తులు చాలావరకు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కుప్పం ప్రజలకూ తొలిసారి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయి. దీంతో కుప్పం ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది. దీంతోపాటు సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదా అని అందరూ ఎండగట్టడం ప్రారంభించారు. దీంతో 2022లో అక్కడ స్థలాన్ని కొని, ఇల్లు కడుతున్నట్లు చంద్రబాబు హడావుడి చేశారు. అక్కడ తాను ఇల్లు కట్టుకుంటున్నట్లు శుక్రవారం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనూ పేర్కొన్నారు. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలో వ్యవసాయేతర భూమి 95.23 సెంట్లు ఉందని, దాని విలువ రూ.77.33 లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అక్కడే ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభమై సంవత్సరంన్నర అవుతోంది. సాధారణంగా ఒక సొంతింటి నిర్మాణం కొన్ని నెలల్లో పూర్తవుతుంది. కానీ, చంద్రబాబు ఇంటి నిర్మాణం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. పూర్తి చేస్తారో లేదో కూడా తెలియదు. భారీగా పెరిగిన ఆస్తులు అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో భారీగా ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు, కేసులు ఉన్న చంద్రబాబు.. అధికారంలో లేకున్నా ఆదాయానికి లోటు లేదన్న విషయాన్ని ఆయన ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల విలువలు చెబుతున్నాయి. తనపై ఉన్న కేసులు, తన ఆస్థిపాస్తుల వివరాలను అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం గత ఐదేళ్లలో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తుల విలువ 40 శాతం పెరిగింది. 2014లో రూ.176 కోట్లున్న వారి ఆస్తుల విలువ 2019 ఎన్నికల అఫిడవిట్లో రూ.700 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం వారిద్దరి ఆస్తుల విలువ రూ.936.58 కోట్లుగా అఫిడవిట్లో తెలిపారు. రూ.121.41 కోట్ల చరాస్తులు, రూ.815.17 కోట్ల స్థిరాస్తులు చూపించారు. భువనేశ్వరికి హెరిటేజ్ ఫుడ్స్‌లో ఉన్న షేర్ల విలువే రూ.763 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ఆమెకు రూ.1.84 కోట్ల విలువైన బంగారం, 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు తన కొడుకు లోకేశ్‌తో ఉమ్మడిగా ఉన్న ఇంటి ప్రస్తుత విలువ రూ.70.20 కోట్లుగా చూపించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దీని విలువ రూ.2 కోట్లకుపైనే ఉంటుంది. నారావారిపల్లె శేషాపురంలో ఉన్న ఇల్లు విలువ రూ.43.66 లక్షలుగా చూపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది కూడా సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. తన చేతిలో రూ.11,560 నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 2,45,378, ఒక అంబాసిడర్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. 24 క్రిమినల్ కేసులు.. అందులో 8 అవినీతి కేసులే తాను 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అందులో 8 కేసులు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కూడినవి. ఆయన అరెస్టయి జైల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అందులో ఒకటి. ఉచిత ఇసుక పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, మద్యం డిçస్టలరీలు, బ్రాండ్లకు అక్రమంగా అనుమతులివ్వడం, రాజధాని ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ కాంట్రాక్టు జారీలో అక్రమాలు, రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులు తనపై విచారణలో ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో తెలిపారు. -
పెరూ అధ్యక్షురాలి ఇంట్లో ‘రోలెక్స్’ల కోసం సోదాలు!
లీమా: రోలెక్స్ గేట్ వ్యవహారం పెరూను కుదిపేస్తోంది. అధ్యక్షురాలు డినా బొలార్టీ వద్ద 10కి పైగా అతి ఖరీదైన లెక్స్ గడియారాలున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. వాటికోసం కోర్టు ఆదేశాలతో లిమాలోని ఆమె నివాసంలో పోలీసులు సోదా లు నిర్వహించారు! సోదాలను టీవీ చానల్లో ప్రసారం చేశారు. వాచ్‌లు దొరికాయో లేదో వెల్లడించలేదు. తనవద్ద 18 ఏళ్ల వయసులో సొంత డబ్బులతో కొనుక్కున్న ఒకే రోలెక్స్ ఉందని డినా అంటున్నారు. -
పొత్తుల తక్కెడ.. బాబుతో పవన్ తాడోపేడో? (ఫొటోలు)
-
Christmas At PM Modi House Pics: క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
అత్యధికంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నది అక్కడే.. కొనడం కష్టమే!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా ఇళ్ల ధరలు పెరుగుతున్న నగరాల జాబితాలో భారత్‌కు చెందిన నగరాలు ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ (Knight Frank) విడుదల చేసిన ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరం ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో నాలుగో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 6.5 శాతం పెరుగుదలతో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో ఉన్న 22వ ర్యాంక్ నుంచి ఈసారి 18 స్థానాలు ఎగబాకింది. అలాగే న్యూ ఢిల్లీ, బెంగళూరు నగరాలు కూడా తమ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో మెరుగుదలను నమోదు చేశాయి. న్యూ ఢిల్లీ ఎన్సీఆర్ 4.1 శాతం వృద్ధితో ఏడాది క్రితం 36వ ర్యాంక్ నుంచి ఈ ఏడాది 10వ స్థానానికి ఎగబాకిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. బెంగళూరు ర్యాంక్ గతేడాది 27 నుంచి ఈ ఏడాది 2.2 శాతం వృద్ధితో 17కి పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 12 నెలల కాలంలో 46 మార్కెట్లలో వార్షిక ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో సగటు పెరుగుదల 2.1 శాతంగా నమోదైంది. ఇది గతేడాది మూడో త్రైమాసికం నుంచి నమోదైన అత్యంత బలమైన వృద్ధి రేటు. మొత్తంగా 67 శాతం నగరాలలో ఇళ్ల ధరలు పెరుగుదలను నమోదు చేసినట్లుగా నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. టాప్‌లో మనీలా ఫిలిప్పైన్స్ దేశ రాజధాని మనీలా 21.2 శాతం వార్షిక ధరల పెరుగుదలతో ఈ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బలమైన దేశ, విదేశీ పెట్టుబడులు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గత ఎనిమిది త్రైమాసికాల నుంచి వరుసగా అగ్రస్థానంలో ఉంటూ వస్తున్న దుబాయ్ ఈసారి టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. ఈ ఏడాది కేవలం 15.9 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. ఇక ఈ జాబితాలో శాన్ఫ్రాన్సిస్కో అట్టడుగున నిలిచింది. -
మూడో జాబితాపై ముమ్మర కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాపై రాష్ట్ర బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. శనివారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే చర్చ జరిగినట్టు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని సీట్లపై చర్చలో భాగంగా.. సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ విక్రమ్‌గౌడ్, ముషీరాబాద్ నుంచి గోపాల్‌రెడ్డి/ బండారు విజయలక్షి, అంబర్‌పేట నుంచి బండారు విజయలక్షి / ఎన్.గౌతమ్‌రావు, సికింద్రాబాద్ నుంచి బండ కార్తీకరెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఆకుల రాజేందర్, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వాలను పరిశీలించినట్టు సమాచారం. ఎల్బీనగర్ సీటు కోసం సామ రంగారెడ్డి, వంగ మధుసూదన్‌రెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి ఆశలు పెట్టుకోగా.. ఉప్పల్ నుంచి ఎనీ్వఎస్‌ఎస్ ప్రభాకర్‌తో పాటు వీరేందర్‌గౌడ్, మేడ్చల్ నుంచి విక్రమ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ రెండో జాబితా కూడా వెలువడిన నేపథ్యంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టల్లోని అసంతృప్తులను చేర్చుకుని, టికెట్ ఇచ్చే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే జాబితా విడుదల ఆదివారంగానీ, సోమవారంగానీ బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి మూడో జాబితా ముసాయిదాను పార్టీ పెద్దలకు అందజేయనున్నట్టు తెలిసింది. వచ్చే నెల 1న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ జాబితాపై చర్చించి.. సుమారు 40– 45 మంది పేర్లతో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ రోజున ఆలస్యమైతే రెండో తేదీన విడుదల చేయవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన సీట్లలో పదిచోట్ల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, వాటి విషయాన్ని చివర్లో తేల్చాలని భావిస్తున్నట్టు సమాచారం. జనసేనకు కేటాయించే సీట్లపైనా చర్చించారని, ఈ విషయంలో పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైందని తెలిసింది. -
ఒక దేశం-ఒకే ఎన్నికపై కసరత్తులు వేగవంతం
-
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్..
ముంబయి: శివసేన చీఫ్(యూబీటీ), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఓ పాము అలజడి సృష్టించింది. ముంబయిలోని తూర్పు బాంధ్రా కాలానగర్‌లో ఉన్న థాక్రే ఇంట్లోకి ఆదివారం ఓ పాము దూరింది. విషయం గమనించి స్నేక్ క్యాచ్ర్కు ఫోన్ చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన స్నేక్ క్యాచర్ బృందాలు.. పామును పట్టుకున్నారు. కోబ్రా జాతికి చెందిన విషపూరిత పాముగా గుర్తించారు. मातोश्री में निकला सांप, पानी की टांकी के पीछे से सांप को किया गया रेस्क्यू । उद्धव ठाकरे ने किया सर्प मित्रो का शुक्रिया @IndiaTVHindi @indiatvnews pic.twitter.com/byAiNqS6yu — Namrata Dubey (@namrata_INDIATV) August 7, 2023 దాదాపు నాలుగు అడుగుల మేర పాము ఉందని చెప్పారు. పామును చూడటానికి ఉద్ధవ్ థాక్రే ఇంటి బయటకు వచ్చారు. పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ బృందాలు.. దానిని సమీప అడవిలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఈయనే..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం భారత్‌లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతంలో ఉంది. బరోడా గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ (Laxmi Vilas Palace) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది ఇంగ్లండ్ రాజ కుటుంబీల నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే చాలా రెట్లు పెద్దది. 500 ఎకరాల విస్తీర్ణం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా రాజ కుటుంబానికి చెందిన నివాసం. ఈ ప్యాలెస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దపు ఇండో-సార్సెనిక్ కాలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఇదే అతి పెద్దది. ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. ఆకట్టుకునే కళాకృతులు గుజరాత్‌లోని ఈ రాజ యుగం నాటి ప్యాలెస్‌లో విస్తృతమైన ఇంటీరియర్ డిజైన్లు ఆకట్టుకుంటాయి. మొజాయిక్లు, షాన్డిలియర్లు, కళాకృతులు, ఆయుధాలు, కళాకృతులు ఆకర్షిస్తాయి. అప్పటి బరోడా మహారాజు ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మను ప్రత్యేకంగా నియమించి పెయింటింగ్‌లు వేయించారు. విశాలమైన పార్క్ లాంటి మైదానాలు ఇందులో ఉన్నాయి. ఇందులో గోల్ఫ్ కోర్స్ కూడా ఉండటం విశేషం. ఈయనే యజమాని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ ( HRH Samarjitsinh Gaekwad). రంజిత్‌సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ గైక్వాడ్, శుభంగినీరాజేల ఏకైక కుమారుడు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన ఈయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నారు. సమర్జిత్సిన్హ్ తన తండ్రి మరణం తర్వాత 2012లో మహారాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఈ వేడుక లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో 2012 జూన్ 22న అట్టహాసంగా జరిగింది. 2013లో తన మామ సంగ్రామ్‌సింగ్ గైక్వాడ్‌తో పాత వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకుని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు యజమాని అయ్యారు. రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తి సంక్రమించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో 17 దేవాలయాలను నిర్వహించే దేవాలయాల ట్రస్టు సమర్జిత్సిన్హ్ ఆధీనంలో ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఈయన 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. సమర్జిత్సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. -
Delhi: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ సంచారం కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీలోని మోదీ నివాసంపై ఓ డ్రోన్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నో ఫ్లయింగ్ జోన్లో డ్రోన్ సంచరించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రధానికి భద్రతా కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రోన్ సంచరించేప్పుడు ప్రధాని మోదీ ఇంట్లోనే ఉన్నారని భద్రతా సిబ్బంది తెలిపారు. ప్రధాని నివాసంపై పలుమార్లు డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు ఎస్పీజీ నుంచి సమాచారం అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం డ్రోన్ ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డ్రోన్‌ను స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. కాగా పీఎం మోదీ నివాసం నో ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్ కిందకు వస్తుందన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మోదీ అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ -
పొద్దుపోయేదాకా బీజేపీ మేధోమథనం
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట బుధవారం అర్ధరాత్రి ఈ సమావేశం జరగ్గా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్ నేతలు కొందరు హాజరయ్యారు. ప్రధాని మోదీ ఇటీవలె అమెరికా, ఈజిప్ట్ పర్యటన ముగించుకుని వచ్చారు. అప్పటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. తాజాగా బీజేపీ కార్యకర్తలను సైతం ఉద్దేశించి ప్రసంగించారాయన. అదే సమయంలో జులై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలంతా అర్ధరాత్రి సమావేశమై చర్చించడం గమనార్హం. బీజేపీ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో.. అభ్యర్థుల జాబితా తయారు, బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన గురించి ప్రధానంగా చర్చించినట్లు భోగట్టా. ఎన్నికల అంశంతో పాటు ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపాలని కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అందునా తాజాగా ప్రధాని గళం వినిపించిన యూనిఫామ్ సివిల్‌కోడ్‌ను మేనిఫెస్టోలో కొనసాగించే అంశాన్ని సైతం లేవనెత్తినట్లు ఓ బీజేపీ కీలక నేత చెబుతున్నారు. ఈ భేటీ ఆధారంగా.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం వీలైనంత త్వరలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఔ ఐదు రాష్ట్రాలపై మేదోమధనం సార్వత్రిక ఎన్నికలతో పాటు రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం మేదో మధనం చేసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలలో బిజీగా ఉండడంతో నిర్ణయాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి పొద్దు పోయే వరకు ప్రధాని నివాసంలో భేటీలో కీలకంగా చర్చించారు. ప్రధానంగా తెలంగాణ సహా పలు ఎన్నికల రాష్ట్రాలలో పార్టీ నాయకత్వంలో సంస్థాగత మార్పులకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న కసరత్తు ఓ కొలిక్కిరాగా.. ఏ క్షణమైనా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. పార్టీలో, క్యాబినెట్లో మార్పుల చేర్పులపై, విపక్ష కూటమి బలపడుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణ పై చర్చించినట్లు సమాచారం. -
ప్రపంచంలో ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు - అడుగడుగునా రాజసం (ఫోటోలు)
-
12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలో అతిపెద్ద ప్యాలెస్!
World's Largest Private Palace in India: ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెస్ ఎక్కడ ఉంది అంటే చాలా మంది ప్యారిస్లోనో లేదా వేరే ఇతర దేశాల్లోనో ఉంటుందనుకుంటారు. కానీ ప్రపంచంలోనే చాలా పెద్దదైన ప్రైవేట్ ప్యాలెస్ భారతదేశంలోనే ఉంది. అదే 'లక్ష్మీ విలాస్ ప్యాలెస్' (Laxmi Vilas Palace). ఈ ప్యాలెస్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉందని నివేదిలకు చెబుతున్నాయి. దీని నిర్మాణకి ఏకంగా 12 సంవత్సరాల సమయం పట్టినట్లు సమాచారం. 1890లో మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి అయిన ఖర్చు అప్పట్లో రూ. 27,00,000 అని చెబుతున్నారు. ఈ మహల్ విలువ వేలకోట్లలో ఉంటుంది. వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ప్యాలెస్ ఇప్పటికి కూడా అతి పెద్ద ప్రైవేట్ ప్యాలెస్‌గా కీర్తి పొందింది. దీని నిర్మాణ సమయంలో ఎలివేటర్లు వంటి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కట్టుదిట్టం చేశారు. అత్యంత అందమైన ఈ భవనం మేజర్ చార్లెస్ మాంట్ అనే వాస్తు శిల్పి సారథ్యంలో పురుడు పోసుకుంది. దీని లోపల భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్‌ను గుర్తు చేస్తుంది. (ఇదీ చదవండి: వందల కోట్లు సామ్రాజ్యం సృష్టించిన కూలీ కొడుకు - ఎవరీ ముస్తఫా?) ప్రస్తుతం ఈ ప్యాలెస్ రాజకుటుంబానికి హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. ఈయన రాధికారాజే గైక్వాడ్‌ను వివాహం చేసుకున్నారు. హోసింగ్.కామ్ ప్రకారం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం 3,04,92,000 చదరపు అడుగులు, బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులు అని తెలుస్తోంది. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులు కావడం విశేషం. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) 170 గదులతో కూడిన ఈ ప్యాలెస్ లోపల గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. దర్బార్ హాల్ వెనీషియన్ మొజాయిక్ ఫ్లోర్, వెలుపల నీటి ఫౌంటైన్లతో కూడిన విశాలమైన తోట ఉంది. అంతే కాకుండా ఇందులో పాత ఆయుధాలు, శిల్పాలతో మ్యూజియం ఉంది. ఇందులో ప్రేమ్ రోగ్, దిల్ హి తో హై, సర్దార్ గబ్బర్ సింగ్, గ్రాండ్ మస్తీ వంటి అనేక సినిమా షూటింగులు జరిగాయి. -
రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి..
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన చేస్తున్న తెలిసిందే. ఇటీవలే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు కూడా. ఆయనతో చర్చల అనంతరం రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారు. ఐతే ఆందోళన మాత్రం విరమించడం లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దానికోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించానని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ఈ ఆహ్వానాన్ని రెజ్లర్లు కూడా మన్నించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ని అరెస్టు చేయడం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు నిర్వహించి కొత్త చీఫ్ ఎన్నుకోవాలని డిమాండ్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. అలాగే క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా తాము ఎవర్నీ రక్షించాలనుకోవడం లేదని రెజ్లర్లకు ఈ సందర్భంగా తెలిపారు. The government is willing to have a discussion with the wrestlers on their issues. I have once again invited the wrestlers for the same. — Anurag Thakur (@ianuragthakur) June 6, 2023 ఇదిలా ఉండగా గత శనివారం అమిత్ షాతో రెజ్లర్ల సమావేశం అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ అమిత్ షాతో సమావేశం అనంతరం తిరిగి విధుల్లో చేరడం కాస్త చర్చనీయాంశంగా మారింది. కానీ రెజ్లర్లు మాత్రం న్యాయం కోసం జరిగే పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు ఒలింపిక్స్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పునియా అమిత్ షాతో జరిగిన భేటీ గురించి మాట్లాడుతూ..ఆయనతో జరిగిన సమావేశం గురించి మాట్లాడవద్దని ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని అమిత్‌షా తెలిపారు. ఐతే నిరసన ఉద్యమం మాత్రం ఆగిపోలేదని, అది కొనసాగడమే గాక ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై వ్యూహ రచన చేస్తున్నామని పునియా చెప్పారు. ప్రభుత్వ ప్రతిస్పందనతో తాము సంతృప్తి చెందలేదని తేల్చి చెప్పారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు. కాగా, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఒక మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. అతడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి సత్వర చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. VIDEO | Wrestler Sakshi Malik arrives at Union Minister Anurag Thakur's residence in Delhi. pic.twitter.com/htPQYKWjOR — Press Trust of India (@PTI_News) June 7, 2023 (చదవండి: అమిత్ షా ఇంటి వద్ద మణిపూర్ మహిళలు నిరసన) -
అమిత్ షా ఇంటి వద్ద మహిళలు నిరసన!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వెలుపల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద మణిపూర్‌లోని కుకి తెగకు చెందని మహిళలు నిరసన చేపట్టారు. గతకొద్దిరోజులుగా మణిపూర్ హింసాత్మక అల్లరులతో అట్టుడుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ మహిళలు కేంద్రహోంమంత్రి ఇంటి వద్ద ఇలా తమ నిరసనను తెలిపారు. శాంతి పునురుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినప్పటికీ మణిపూర్‌లో మా సంఘంపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆ మహిళలు చెబుతున్నారు. అక్కడ మా జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. మాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే మాకు సహాయం చేయలగలరని ఆ మహిళలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మణిపూర్‌లో భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భద్రతా సిబ్బంది మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు సైన్యం తెలిపింది. కొన్ని రోజుల తర్వాత అక్కడ జరిగిన ఆపరేషన్‌లో చాలా మంది తిరుగుబాటుదారులు మరణించారు. అంతేగాదు జూన్ 05 నుంచి 6 వరకు రాత్రి భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య అడపాదడపా కాల్పులు జరిగాయని భారత సైన్యం ట్విట్టర్లో పేర్కొంది. నిజానికి అక్కడ గిరిజన సముహాలు మెజారిటీ మెయిటీ కమ్యూనిటీతో ఆర్థిక ప్రయోజనాలు, తెగలకు ఇచ్చిన కోటాల విషయంలో ఘర్షణ పడటంతో మొదలైంది ఈ జాతి హింస. గిరిజన సంఘాలు తమ ప్రయోజనాలను మెయిటీలకు పొడిగించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కాగా, మణిపూర్‌లో శాంతి, శ్రేయస్సుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలు జరిగినా కఠినంగా వ్యవహరించాలని భద్రతా బలగాలకు హోంమంత్రి సూచించారు. (చదవండి: 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు శుభవార్త) -
ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..
పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు పాక్ ప్రభుత్వం గట్టి వ్యూహమే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులగా ఖాన్ అరెస్టు కోసం ఆయన నివాసం వద్ద పెద్ద హైడ్రామానే సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి పోలీసులు ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. అదీ కూడా ఖాన్ అవినీతి కేసు విషయమై విచారణ నిమిత్తం కోర్టుకి వెళ్లగానే ఆయన ఇంట్లోకి పోలీసులు చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయన భార్య బుష్రా బేగం ఒక్కరే ఇంట్లో ఉన్నట్ల సమాచారం. ఈ మేరకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా.. నా భార్య బుష్రా బేగం ఒంటరిగా ఉన్న జమాన్పార్క్లోని నా ఇంటిపై పంజాబ్పోలీసులు దాడికి పాల్పడ్డారు. అసలు ఇది ఏ చట్టం ప్రకార ఇలా చేస్తున్నారో చెప్పండని అని నిలదీశారు. పరారీలో ఉన్న నవాజ్ షరీఫను క్విడ్ ప్రోకోగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు లండన్ ప్లాన్‌లో భాగంగా ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాగా ఖాన్ని అరెస్టు చేసేందుకు ఆయన మద్దతుదారులు పోలీసులు మధ్య చాలా రోజులపాటు జరిగిన ప్రతిష్టంభన, తీవ్రమైన ఘర్షణలను అన్నింటిని పక్కన పెట్టి ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుక సంబధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Worst kind of torture in Zaman Park right now. If something happens, will you paint it as accident again!? #چلو_چلو_عمران_کے_ساتھ pic.twitter.com/5S45UDVvMZ — PTI (@PTIofficial) March 18, 2023 (చదవండి: నన్ను అపహరించి, చంపేయడమే వారి ముఖ్య ఉద్దేశ్యం) -
బైడెన్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు.. అధ్యక్షుడి మెడకు రహస్య ఫైళ్ల వ్యవహారం
వాషింగ్టన్: రహస్య ఫైళ్ల వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చుట్టుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫైళ్లు బయటపడడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయన నివాసంలో తాజాగా చేపట్టిన సోదాల్లో మరో ఆరు ఫైళ్లు లభ్యం కావడం కలకలం రేపుతోంది. విల్మింగ్టన్లోని బైడెన్ ప్రైవేట్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏకంగా 13 గంటలపాలు సోదాలు చేపట్టారు. మొత్తం ఆరు ఫైళ్లు లభ్యమయ్యాయి. ఎఫ్‌బీఐ అధికారులు వీటిని ఉన్నతాధికారులకు నివేదించారు. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన న్యాయ బృందాలతోపాటు శ్వేతసౌధం అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్ గానీ, ఆయన భార్య గానీ ఇంట్లో లేరని తెలిసింది. సోదాల్లో ఫైళ్లతో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలు కూడా లభించినట్లు సమాచారం. ఆరు ఫైళ్లు లభ్యం కాగా, ఇందులో కొన్ని బైడెన్ సెనేటర్‌గా ఉన్నప్పటివి, మరికొన్ని ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలానికి సంబంధించినవని ఆయన వ్యక్తిగత అటార్నీ బాబ్ బోయర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నాకు ఎలాంటి విచారం లేదు: బైడెన్ గత ఏడాది నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలో బైడెన్‌కు చెందిన పెన్ బైడెన్ సెంటర్లో, డిసెంబర్ 20న వాషింగ్టన్ ఇంట్లోని గ్యారేజీలో, ఈ ఏడాది జనవరి 12న అదే ఇంట్లో మరోసారి రహస్య దస్త్రాలు బయటపడడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన వాటిని నేషనల్ ఆర్కైవ్స్ అందజేశారు. నిజానికి పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అధ్యక్షుడిని అభిశంసించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ చట్టం ప్రకారం.. పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు పంపించాలి. ఇదిలా ఉండగా, తన నివాసాల్లో జరుగుతున్న సోదాలపై బైడెన్ స్పందించారు. ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు. అయితే, బైడెన్ తీరుపై రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహస్య పత్రాల విషయంలో బైడెన్ ఇక తప్పించుకోలేరని చెబుతున్నారు. ఆయన కుటుంబంతోపాటు కుమారుడు హంటర్ బైడెన్ అక్రమ వ్యాపారాలపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. బైడెన్ నివాసాల్లో రహస్య పత్రాలు బయటపడడంపై కాంగ్రెస్ విచారణ చేపడుతుందని స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్‌కు సన్ స్ట్రోక్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి అధికారమే అండగా ఆయన కుమారుడు హంటర్ బైడెన్ చెలరేగిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాకు ప్రత్యర్థి దేశాలుగా భావించే చైనా, రష్యాలో హంటర్ బైడెన్‌కు వ్యాపారాలున్నాయి. ఆయా దేశాల్లో పలు కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టి, భారీగా ఆర్జించినట్లు సమాచారం. అంతేకాకుండా రష్యా నుంచి హంటర్ లక్షలాది డాలర్లు ముడుపులుగా స్వీకరించాడని సాక్షాత్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు హంటర్ బైడెన్‌కు చెందినవిగా భావిస్తున్న ల్యాప్‌టాప్‌ల్లో ఆయన మత్తు మందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియోలు, మెయిళ్లు బయటపడడం సంచలనం సృష్టించింది. 2019 డిసెంబర్లో ఎఫ్‌బీఐ ఆ ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుంది. అందులోని వివరాలను న్యూయార్క్ పోస్టు పత్రిక ప్రచురించింది. -
పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్.. ఆనందంతో ఆహ్వానించిన..
సాక్షి, చెన్నై: డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరితో సీఎం ఎంకే స్టాలిన్ వారసుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ భేటీ అయ్యారు. మదురైలో తన పెద్దనాన్న అళగిరి ఆశీస్సులను అందుకున్నారు. డీఎంకే దివంగత అధినేత కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి అన్న విషయం తెలిసిందే. దక్షిణ తమిళనాడు డీఎంకే కింగ్ మేకర్‌గా ఒకప్పుడు ఎదిగిన ఆయన ప్రస్తుతం రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌తో ఏర్పడ్డ వైరమే కారణం అనేది జగమెరిగిన సత్యం. అనేక సందర్భాల్లో స్టాలిన్‌కు వ్యతిరేకంగా అళగిరి వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి రావడంతో అళగిరి మౌనంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మదురై పర్యటనకు వెళ్లిన మంత్రి ఉదయ నిధి స్టాలిన్ తన పెద్దనాన్నను కలిశారు. అళగిరి, ఆయన సతీమణి కాంతి అళగిరి ఆనందంతో ఉదయనిధిని ఆహ్వానించిచారు. ఈసందర్భంగా పెద్ద నాన్న అళగిరి శాలువతో సత్కరించి ఉదయ నిధికి ఆశీస్సులు అందించారు. అళగిరి మాట్లాడుతూ తాను డీఎంకేలో లేనని, తమ్ముడి కొడుకు తమ ఇంటికి రావడం ఆనందం కలిగించిందన్నారు. తమ్ముడు సీఎంగా ఉండడం, కుమారుడు మంత్రి కావడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు. డీఎంకే లోకి మళ్లీ వస్తారా? అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం అక్కడే అడగండి అని దాట వేశారు. చదవండి: (విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్..104 సార్లు ఫెయిల్..105వ సారి శభాష్ అనిపించుకున్నాడు) -
Dubai: ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం
దుబాయ్: ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్.. మరో ఘనతను దక్కించుకోబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనానికి దుబాయ్ వేదిక కాబోతోంది. దుబాయ్ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్ బే’లో వంద ఫ్లోర్లతో నిర్మించిన ఈ హైపర్‌టవర్ గిన్నిస్ రికార్డు ఘనతను సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. అంతకు ముందు ఈ రికార్డు న్యూయార్క్ నగరం(అమెరికా) మాన్‌హట్టన్ 57వ స్ట్రీట్‌లోని సెంట్రల్ పార్క్ టవర్ పేరిట ఉంది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక.. ఎత్తు 472 మీటర్ల రికార్డును సైతం దుబాయ్ హైపర్‌టవర్ అధిగమించనుంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. సెంట్రల్ పార్క్ టవర్ దుబాయ్‌లో ఈ హైపర్‌టవర్‌ను ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నట్లు నిర్మాణ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్‌మేకర్ కంపెనీ ‘జాకోబ్ అండ్ కో’ సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మించాయి. దీంతో.. ఈ భవనానికి బుర్జ్ బింఘట్టి జాకోబ్ అండ్ కో రెసిడెన్సీగా నామకరణం చేశారు. అగ్రభాగాలు.. డైమండ్ ఆకారంలో ఉండడం ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత కాగా, రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ ఆకాశ హర్మ్యం. పూర్తిగా డబుల్, త్రిబుల్ బెడ్ రూంలతో పాటు ప్రత్యేకమైన సదుపాయాలెన్నింటినో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. చివరి ఐదు ఫ్లోర్లలో అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌజ్‌లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ భవనం ప్రారంభ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదీ చదవండి: మొట్టమొదటి ఆకాశ హార్మ్యం ఏది? ఎవరు కట్టారో తెలుసా? -
నానక్‌రామ్‌గూడలోని స్వగృహంలో కృష్ణ పార్థీవదేహం
-
వీధిన పడ్డ మాజీ ఎంపీ శశికళ పుష్ప!
సాక్షి, చెన్నై: మాజీ ఎంపీ శశికళ పుష్పకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను ఢిల్లీ రోడ్లపై అధికారులు పడేశారు. ఆమె ప్రభుత్వ క్వార్టర్స్‌ను ఖాళీ చేయకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. 2011–14లో తూత్తుకుడి కార్పొరేషన్ మేయర్ పదవితో శశికళ పుష్ప రాజకీయ తెర మీదకు వచ్చారు. ఆమెకు దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పెద్ద పీట వేశారు. ఆ తదుపరి రాజ్యసభ సీటు కూడా అప్పగించారు. ఈ సమయంలో ఢిల్లీలో ఆమె సాగించిన కొన్ని వ్యవహారాలను జయలలితకు ఆగ్రహాన్ని తెప్పించాయి. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివతో కలిసి ఆమె ఫొటోలు వైరల్ కావడంతో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. అయినా, ఆ పదవిలో ఐదేళ్లు కొనసాగారు. ఇటీవల ఆమె పదవీ కాలం ముగిసింది. బీజేపీలో చేరిన ఆమెకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కూడా దక్కింది. ఈ పరిస్థితుల్లో పదవీ కాలం ముగిసి రెండేళ్లు అవుతున్నా, ప్రభుత్వ గృహాన్ని ఖాళీ చేయక పోవడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు కన్నెర్ర చేశాయి. ఢిల్లీ నార్త్ అవెన్యూలోని శశికళ పుష్ప గృహాన్ని అధికారులు శుక్రవారం బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఆమె గృహంలో ఉన్న అన్ని వస్తువులను రోడ్డు పక్కన పడేశారు. ఆ సమయంలో శశికళ పుష్ప ఢిల్లీలో లేరు. -
సూట్ కేసులతో పరుగులు... ఇవి రాజపక్సవేనా?
Suitcases Loaded On Sri Lanka Navy Ship: శ్రీలంక రాజధాని కొలంబోలో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆందోళనకారులు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టారు కూడా. ఈ మేరకు వారంతా ఆయన కార్యాలయం, అధికార నివాసం రెండింటిని ఆక్రమించారు. ఈ నేపథ్యంలో గోటబయ పరారయ్యరంటూ పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన పెద్ద పెద్ద సూట్‌కేసులు తీసుకుని శ్రీలంక నేవీ ఓడలో పారిపోయారంటూ.. వార్తలు గుప్పుమన్నాయి. అందుకు సంబంధించిన పోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులు పెద్ద పెద్ద సూట్‌కేసులతో ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు అనే నేవీ ఓడలో తీసుకువెళ్తున్నట్లు వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ విషయమై కొలంబో పోర్ట్‌లోని అధికారిని ప్రశ్నించగా...ఆయన కూడా ఒక బృందం పెద్ద పెద్ద సూట్‌కేసులతో గజబాహు అనే ఓడ ఎక్కి వెళ్లినట్లు తెలిపారు. అంతేకాదు ఈ విషయాన్ని శ్రీలంక స్థానిక మీడియా వెల్లడించింది కూడా. ఐతే అతనితోపాటు ఎవరెవరు వెళ్లారు, ఎలా వెళ్లాడనేది వివరణ ఇవ్వలేదు. మరోవైపు శ్రీలంక రక్షణ శాఖ ఆయన్ని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు పేర్కొంది. పైగా శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థలు అధ్యక్క్షుడు పరారయ్యడంటూ... విమానాశ్రయంలోని లంక అధ్యక్షుడు గోటబయ కాన్వాయ్‌ని చూపిస్తూ... వార్తలు ప్రసారం చేశాయి. కానీ లంక అధ్యక్షుడు గోటబయ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారో లేదా అనేది స్పష్టం కాలేదు. Lmao people actually made the president pack his suitcase and run for his life😂😂 #GoHomeGota #අරගලයටජය #GoHomeRanil pic.twitter.com/gw7Zkr1I5a — ♡ Sanda ♡ (@TachyonJaneesha) July 9, 2022 (చదవండి: ఇంటి నుంచి పరారైన శ్రీలంక అధ్యక్షుడు!) -
కొలంబోలో రణరంగం
కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం, ఆహార కొరతతో అల్లాడిపోతున్న శ్రీలంకలో శనివారం సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన అధ్యక్షుడు గొటబయా రాజపక్స, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనం రణరంగం సృష్టించారు. ‘దేశమంతా కొలంబో’కు అంటూ ఉద్యమ నాయకులు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా వేలాది మంది నిరసనకారులు గొటబయా రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించారు. పరిస్థితిని ముందే గ్రహించిన ఆయన శుక్రవారమే తన నివాసం నుంచి పరారయ్యారు. ప్రధాని విక్రమసింఘే నివాసానికి జనం నిప్పుపెట్టారు. ప్రజాగ్రహాన్ని గుర్తించిన విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రజల భద్రత కోసం, ప్రతిపక్ష నాయకుల సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రధాని విక్రమసింఘే ట్విట్టర్లో స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై, పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకొనేదాకా విక్రమసింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని, ఈ తర్వాతే రాజీనామా చేస్తారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఈ ఏడాది మే నెలలో గొటబయా రాజపక్స సోదరుడు మహిందా రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో విక్రమసింఘే నూతన ప్రధానిగా నియమితులైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబయా కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న పదవి నుంచి వైదొలుగుతానని స్పీకర్‌కు సమాచారమిచ్చారు. జనం అధీనంలోకి ప్రెసిడెంట్ హౌస్ సెంట్రల్ కొలంబోలో హై సెక్యూరిటీ కలిగిన ఫోర్ట్ ఏరియాలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అధికారిక నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, జవాన్లు మోహరించారు. దేశంలో సంక్షోభాన్ని పరిష్కరించలేని అధ్యక్షుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. శ్రీలంక జాతీయ జెండాలను చేబూని బారికేడ్లను ధ్వంసం చేస్తూ ముందుకు పరుగులు తీశారు. అధ్యక్షుడు దిగిపోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి రణరంగాన్ని తలపించింది జనాన్ని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో కనీసం 45 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రులను నేషనల్ హాస్పిటల్‌కు తరలించారు. అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాన్ని నిరసనకారులు స్వా«ధీనం చేసుకున్నారు. గోడలు ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఆ ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. అక్కడున్న స్విమ్మింగ్ పూల్‌లో కొందరు ఈత కొట్టి సేద తీరడం గమనార్హం. మరికొందరు లోపల వంటలు చేసుకొని, ఆరగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కొలంబోలో ప్రధానమంత్రి విక్రమసింఘే ప్రైవేట్ నివాసాన్ని సైతం జనం చుట్టుముట్టారు. విధ్వంసం సృష్టించారు. నివాసానికి నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని కొలంబోకు రైళ్లను నడపాలని ఒత్తిడి చేస్తూ నిరసనకారులు గాల్లే, కాండీ, మతారా తదితర ప్రాంతాల్లో రైల్వే అధికారులతో ఘర్షణకు దిగారు. అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రభుత్వం ప్రెసిడెంట్ హౌస్‌ను నిరసనకారులు చుట్టుముట్టినట్లు సమాచారం అందుకున్న ప్రధాని విక్రమసింఘే వెంటనే అన్ని పార్టీలతో అత్యవసర భేటీ నిర్వహించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్ మహిందా యాపా అబేయవర్దనే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు గొటబయా రాజపక్స తప్పుకోవాలని, అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులు తేల్చిచెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తక్షణమే రాజీనామా చేయండి అని విక్రమసింఘే, గొటబయాకు స్పీకర్ అబేయవర్దనే సూచించారు. తాత్కాలిక అధ్యక్షుడిని నియమించడానికి, కొత్త ప్రధాని నేతృత్వంలో మధ్యంతర అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏడు రోజుల్లోగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొద్ది కాలంలోపే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలు అంగీకరించాక రాజీనామా చేస్తానంటూ ప్రధాని ప్రకటన విడుదల చేశారు. గొటబయాకు సొంత పార్టీ ఎంపీల లేఖ గొటబయా రాజపక్సకు చెందిన శ్రీలంక పొడుజనా పెరమునా పార్టీ ఎంపీలు ఆయనను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. పదవి నుంచి తప్పుకోవాలని, అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రభుత్వాన్ని లేఖలో కోరారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కొలంబోలో కర్ఫ్యూ విధించాలని పోలీసులు తొలుత నిర్ణయించారు. పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. గొటబయా ఎక్కడున్నారు? నిరసనకారుల ముట్టడిని ముందే గ్రహించిన అధ్యక్షుడు గొటబయా శుక్రవారమే శ్రీలంక నావికాదళానికి చెందిన నౌకలో సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు ఓ వార్తా చానల్ ప్రకటించింది. కొలంబో పోర్టు నుంచి రెండు నౌకల్లో లగేజీతో సహా కొందరు ప్రముఖులు వెళ్లిపోయినట్లు హార్బర్ మాస్టర్ చెప్పారు. వారు ఎవరన్నది తాను బయటపెట్టలేనని అన్నారు. అలాగే వీఐపీ వాహన శ్రేణి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. గొటబయా ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో తలదాచుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. (చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్) -
జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
-
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం జరిగింది. న్యూఢిల్లీలోని ఆమె నివాసంలోకి చొరబడ్డ దుండగులు సుమారు రూ.1.41 కోట్ల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఫిబ్రవి 23న జరగగా,హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు దీన్ని గోప్యంగా ఉంచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోసం స్పెషల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సోనమ్ ఇంట్లో పనిచేస్తున్న 25మంది ఉద్యోగులతో పాటు 9మంది కేర్‌టేకర్స్, డ్రైవర్లు, తోటమాలి, ఇతర పనివాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీని సైతం పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఇంట్లో సోనమ్ భర్త ఆనంద్ అహుజా పేరేంట్స్‌తో పాటు అతని నానామ్మ సరళ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. దొంగతనం అనంతరం ఒక రోజు అల్మారాలోని నగలు, డబ్బు తనిఖీ చేసినప్పుడు చోరీ జరిగిందన్న విషయం తెలిసిందని ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు గర్భవతిగా ఉన్న సోనమ్ ప్రస్తుతం తల్లి దగ్గర ఉంటున్నట్లు తెలుస్తుంది. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సోనమ్ ఇటీవలె బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఢిల్లీ: మాజీ ఎంపీ నివాసంలో కిడ్నాప్ కలకలం
-
మాజీ ఎంపీ నివాసంలో కిడ్నాప్ కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సౌత్ అవెన్యూలోని ఆయన నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, మహబూబ్‌నగర్‌కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పీఏ రాజు మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్‌భవన్‌కు కాషాయం రంగు సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అపహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిపై మున్నూరు రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లనున్న సీఎం జగన్
-
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు ఇంటి వద్ద అపరిచితుడి కలకలం
జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నివాసం వద్ద బుధవారం ఉదయం కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు నేరుగా దోవల్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కారులో వేగంగా దూసుకొచ్చినప్పటికీ.. గేట్ వద్దే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తన శరీరంలో ఎవరో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారని, అందుకే తనకు తెలియకుండానే అలా వచ్చేశాని తొలుత ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అప్రమత్తమై.. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అతని వాలకానికి, సమాధానాలకు పొంతన లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించారు. ప్రాథమిక విచారణలో అతను మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి అని, కర్ణాటకవాసిగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అజిత్ దోవల్ నివాసం ఢిల్లీ 5, జన్‌పథ్‌లో ఉంది. ఐబీ మాజీ చీఫ్, పైగా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు కావడంతో.. ఆయన నివాసం వద్ద జెడ్ ఫ్లస్ కేటగిరీ కింద భారీగా సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది మోహరింపు ఉంటుంది. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యాతో ఆయన నివాసానికి నేమ్ ప్లేట్ కూడా ఉండదు. అయినప్పటికీ ఆ వ్యక్తి సరాసరి దోవల్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బుధవారం ఉదయం 7:30-8 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆ అపరిచితుడి ఐడెంటిటీని గుర్తించే పనిలో ఉన్నారు. -
కేక్ కట్ చేసిన సీఎం జగన్
-
మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. సీఎంను కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కట్‌చేసి సజ్జల రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
Viral Video: అపార్ట్మెంట్లో మంటలు
-
అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!
ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మన పక్కింటి వాళ్ల ఇల్లు కాలిపోతే రక్షించటానికి ఎంత మంది ముందుకొస్తారు చెప్పండి. అసలు ముందు సహాయం చేయడానికి ఎవ్వరైన వస్తున్నారో లేదో చూసి చేస్తాం లేదంటే లేదు అన్నట్టుగా ఉండిపోతారు. కానీ ఇక్కడొక అపార్ట్మెంట్ వాసులు తమ పక్కవాళ్ల ఖాళీ అపార్ట్మెంట్ బాల్కనీలో మంటలు చెలరేగుతాయి. (చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!) అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేంత వరకు వేచి ఉండకుండా అక్కడ ఉన్న ఇరుగు పొరుగ తమ వంతు ప్రయత్నంగా బకెట్ వాటర్‌తో ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నంలో వారు సఫలం అయ్యారు. అగ్నిమాపక వాహనం రాక మునుపే ఆ మంటలను అదుపులోకి తీసుకువచ్చేశారు. అయితే ఈ ఘటన జూలై 7, 2020న రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగింది. అయితే ప్రస్తతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు మనమంత ఇలానే కలిసి ఉండాలి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: 30 ఏళ్లుగా టాయిలెట్ నీటినే తాగారా!) -
కుమ్ముకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు.. పరిస్థితి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కేటీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. డ్రగ్స్ పరీక్షకు సిద్ధమని మంత్రి కేటీఆర్ ప్రకటించగా దానిపై సోమవారం నాటకీయ పరిణామాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. వీరి మధ్య ఈ వివాదం కొనసాగుతుండగా తాజాగా ఆ రెండు పార్టీ కార్యకర్తల మధ్య వివాదం ఏర్పడింది. చదవండి: డ్రగ్స్ వార్.. మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా స్వీకరణ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఇది గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల కార్యకర్తలు బహాబాహీకి దిగారు. రేవంత్‌రెడ్డి వర్గీయులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు పట్టుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలవారిని వారిస్తున్నా వారు రెచ్చిపోయారు. చివరకు పోలీసులు అతికష్టంగా ఇరు వర్గాలను చెదరగొట్టారు. చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు!
న్యూఢిల్లీ: మధ్యాదాయ వర్గాల్లో 60 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో ఇళ్ల ధరలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. నైట్‌ఫ్రాంక్ నిర్వహించి న ఒక సర్వేలో ఈ విషయం తెలిసింది. 30 శాతం మంది 9 శాతం వరకు ధరలు పెరుగుతాయని భావిస్తుంటే.. 25 శాతం మంది 10–19 శాతం మధ్య ధరలు పెరగొచ్చని చెప్పారు. రేట్ల పెరుగుదల 20 శాతం కంటే ఎక్కువే ఉండొచ్చని 6 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు దారులపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని ‘గ్లోబల్ బయ్యర్ సర్వే’లో భాగంగా నైట్‌ఫ్రాంక్ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లోనూ 550మందికిపైగా అభిప్రాయాలు తెలుసుకుంది. రెండు భాగాలుగా నిర్వహించిన సర్వేలో అధిక ఆదాయం కలిగిన వారి నుంచి, మధ్యస్థ ఆదాయం కలిగిన వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. నివేదికలో ప్రస్తావించిన అంశాలు ♦ 26 శాతం మంది భారతీయులు కరోనా వచ్చిన తర్వాత తమ నివాసాలను మార్చేశారు. మరింత విశాల స్థలం కోసం ఈ పనిచేశారు. ♦ వచ్చే 12 నెలల్లో తమ నివాసాలను మార్చాలనుకుంటున్న వారు 32 శాతం మంది ఉన్నారు. ♦ ఇళ్లు మారిపోవాలనుకుంటన్న వారిలో 87 శాతం మంది ప్రస్తుత పట్టణాల మధ్యలో ఉండడం కంటే.. పట్టణ పొరుగు ప్రాంతాల్లో ఉండేందుకు సుముఖత చూపిస్తున్నారు. ♦ 13 శాతం మంది అయితే ఇతర పట్టణాలకు మారిపోయే ఆలోచనలో ఉన్నారు. ♦ అన్ని నియంత్రణలు ఎత్తివేస్తే తిరిగి కార్యాలయాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో సగానికిపైనే చెప్పారు. ♦ 47 శాతం మంది వారంలో 2–4 రోజులు కార్యాలయాల నుంచి పనిచేయవచ్చని చెప్పారు. ♦ భవిష్యత్తులో పని విధానం అన్నది వాణిజ్య భవనాలే కాకుండా నివాస భవనాలపైనా గణనీయమైన ప్రభావం చూపిస్తుందని ఈ సర్వే నివేదిక తేల్చింది. చదవండి : కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్‌కే జై కొడుతున్నారు -
తెలంగాణ: పులి గర్జిస్తోంది
సాక్షి, హైదరాబాద్: అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పెద్దపులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో చేపడుతున్న అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చర్యలతో రెండుమూడేళ్లుగా వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 40 దాకా (ఎనిమిది పులి పిల్లలను కలుపుకుని) పులులు ఉండొచ్చునని అంచనా. గడ్డిభూముల పెంపకంతో శాకాహార జంతువుల సంఖ్య బాగా పెరగడం కూడా దీనికి కలిసొస్తోంది. రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)ల విస్తీర్ణం పెద్దగా ఉండడంతో పులుల సంఖ్య వృద్ధికి అనుకూల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక పులి స్వేచ్ఛగా తిరిగి, జీవనాన్ని సాగించేందుకు 50 చదరపు కి.మీ. అడవి అవసరమవుతుంది. దీన్నిబట్టి రాష్ట్రంలోని ఏటీఆర్, కేటీఆర్‌లో కలిపి దాదాపు 5 వేల చ.కి.మీ. ఉండడంతో వంద దాకా పులులు జీవించేందుకు, స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో 3 అభయారణ్యాలు దేశవ్యాప్తంగా 54 టైగర్ రిజర్వ్‌లుండగా, వాటిలో 2 వేల చ.కి.మీ.పైబడి అటవీ వైశాల్యమున్న నాలుగైదు అభయారణ్యాల్లో మూడు ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నాయి. ఏటీఆర్‌లో 30దాకా (ఐదు పులికూనలతో సహా) పులులుండగా.. కేటీఆర్‌లో పదిదాకా (మూడు పిల్లలు కలిపి) పులులున్నట్టు అంచనా. ఏపీలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్)లో 60దాకా పులులుండొచ్చని చెబుతున్నారు. తెలంగాణలో 30 ఏళ్లుగా పులులు కనిపించకుండా పోయిన ప్రదేశాలు, కొత్త ప్రాంతాల్లోనూ అవి కనిపిస్తుండడం, వాటి పాదమూద్ర లు రికార్డవడం ముఖ్యమైన పరిణామంగా అటవీ అధికారులు పేర్కొంటున్నారు. పొరుగున మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో అక్కడ చోటు సరిపోక, సానుకూల వాతావరణం లేక తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేట కు తగినసంఖ్యలో జంతువులు, నీటివనరులు వంటివి ఉండడంతో ఇక్కడకు తరలివస్తున్నాయి. కోవిడ్ నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకోవాలి కోవిడ్ సంక్షోభం మనందరికీ ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులను గౌరవించాలని, కాపాడుకోవాలని నొక్కి చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని 3 టైగర్ రిజర్వ్‌లు నదుల ఒడ్డునే ఉండడంతో పాటు ఈ అడవుల్లోంచే అత్యధిక వాటా నీరు నదుల్లోకి చేరుతోంది. దీంతో ఈ అభయారణ్యాల్లోని పులులను పరిరక్షించుకోవాల్సిన అవసరముంది. పులుల ఆవాసాల ద్వారా పర్యావరణపరంగా అందుబాటులోకి వచ్చే సేవలను (ఎకోలాజికల్ సర్వీసెస్ ద్వారా) డబ్బుపరంగా లెక్కిస్తే ఒక్కో పులి రూ.250 కోట్ల విలువ చేస్తుంది. – ఇమ్రాన్ సిద్దిఖీ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పులితోనే జీవవైవిధ్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక పులి మీద అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివి ఆధారపడి ఉన్నందున పులుల మనుగడ అనేది మానవాళి కొనసాగేందుకు కూడా ప్రధానమన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. రాష్ట్రంలో వంద పులులు స్చేచ్ఛగా జీవనం సాగించేందుకు, ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన పరిస్థితులున్నాయి. 2018 టైగర్ సెన్సెస్ ప్రకారం ఇక్కడ ఏటీఆర్, కేటీఆర్‌లలో కలుపుకుని 26 పులులున్నట్లుగా వెల్లడైంది. – శంకరన్, వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పులికూనల సంఖ్యా పెరుగుతోంది గతంతో పోలిస్తే ఏటీఆర్‌లో పులుల సంఖ్య పెరిగేందుకు అన్ని సానుకూల పరిస్థితులున్నాయి. ఇటీవల కెమెరా ట్రాప్‌లకు చిక్కడంతో పాటు, రాత్రిళ్లు అడవిలో రోడ్లు దాటుతూ కనిపిస్తున్నట్లు ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు. పులుల అభయారణ్యాల విస్తీర్ణం ఎక్కువగా ఉండడం పెద్దపులులు స్థిరనివాసం ఏర్పరుచుకునేందుకు దోహదం చేస్తున్నాయి. పులులతో పాటు పులికూనలు, పిల్లల సంఖ్య కూడా పెరగడం శుభపరిణామం. – కృష్ణాగౌడ్, డీఎఫ్‌వో, నాగర్‌కర్నూల్ జిల్లా -
నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి
‘‘ఇది చాలా క్లిష్టమైన సమయం. ఎవరికి తోచిన సహాయం వారు చేయాల్సిన సమయం’’ అంటున్నారు కమల్‌హాసన్. కరోనా బాధితులకు చికిత్స అందించడానికి వీలుగా తన ఇంటిని ఆస్పత్రిగా మార్చాలనుకుంటున్నారు కమల్. ‘‘ప్రభుత్వం అనుమతిస్తే నా ఇంటిని తాత్కాలికంగా ఆస్పత్రిగా మార్చుతాను. నా ‘మక్కళ్ నీది మయమ్’ (కమల్ రాజకీయ పార్టీ)లో ఉన్న డాక్టర్లతో రోగులకు వైద్యం చేయిస్తాను’’ అన్నారు కమల్. -
అంబానీ ఇంట్లో అనుమానాస్పద మృతి
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కమాండో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అంబానీ సెక్యూరిటీ కోసం నియమించిన ఆయన అనూహ్యంగా శవమై తేలారు. దక్షిణ ముంబైలోని వ్యాపారవేత్త విలాసవంతమైన ‘ఆంటాలియా’ నివాసంలో కానిస్టేబుల్ బొతారా డి రాంభాయ్ తుపాకీతో తనని తాను కాల్చుకుని బుధవారం రాత్రి చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేక అతని చేతిలోని ఆయుధం ప్రమాదవశాత్తూ పేలి చనిపోయాడా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నామన్నారు. మృతుడిని గుజరాత్‌లోని జునాగడ్ జిల్లాకు చెందిన రాంభాయ్గా గుర్తించారు. అతను 2014లో సీఆర్పీఎఫ్లో చేరాడు. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా అంబానీకి 'జెడ్ +' కేటగిరీ కింద సెక్యూరిటీ కల్పిస్తోంది సీఆర్పీఎఫ్. అంబానీ భార్య నీతా అంబానీకి కూడా 'వై' కేటగిరీ కల్పిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ముకేశ్ అంబానీ సెక్యూరిటీ బృందంలో రాంభాయ్ని సీఆర్పీఎఫ్ నియమించింది. అయితే అనూహ్యంగా రాంభాయ్ శవంగా మారడం ఆందోళన రేపింది. అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తి సమాచారం అందాల్సి వుంది. -
ఆ ఇంటి విలువ రూ 130 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీ పూర్వీకులకు సంబంధించిన ఇంటి విలువను రూ 130 కోట్లుగా ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. 1970లో కాంగ్రెస్ నేతకు రష్ధీ తండ్రి ఈ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడగా ఇరు పక్షాల మధ్య నెలకొన్న వివాదంతో ఆ ఒప్పందం నిలిచిపోయింది. ఈ వివాదం సర్వోన్నత న్యాయస్ధానానికి చేరగా 2012లో కాంగ్రెస్ మాజీ నేత భికురాం జైన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఉత్తర్వులు వెలువడిన నాటికి మార్కెట్ రేటు ప్రకారం ఆ ఇంటిని జైన్‌కు అప్పగించాలని రష్ధీ వారసులను కోర్టు ఆదేశించింది. ఈ ఆస్తి మార్కెట్ విలువను నిర్ధారించాలని సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టును కోరింది. రూ 130 కోట్లకు తమ ఇంటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారు సిద్ధంగా ఉన్నారని రష్ధీ వారసులు తెలపడంతో ఇంటి మార్కెట్ ధరను ఢిల్లీ హైకోర్టు రూ 130 కోట్లుగా నిర్ధారించింది. ఈ ధరకు ఇంటిని కొనుగోలు చేసేందుకు జైన్లు సిద్ధంగా లేకుంటే ఆరు నెలల్లోగా ఇతరులకు రష్ధీ వారసులు తమ ఇంటిని విక్రయించవచ్చని జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా తెలిపారు. రూ 130 కోట్లకు ఇంటిని నిర్ధేశిత గడువులోగా రష్ధీలు అమ్మలేని పక్షంలో డిసెంబర్ 4, 2012లో సర్కిల్ రేట్లకు అనుగుణంగా రూ 75 కోట్లకు జైన్లు ఆ ఇంటిని కొనుగోలు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక రూ 75 కోట్లకు ఇంటిని జైన్లు కొనేందుకు సుముఖత చూపనిపక్షంలో 1970లో ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం నుంచి రష్ధీలు వైదొలగవచ్చని కోర్టు తెలిపింది. కాగా 1970లో ఈ ఇంటిని రష్ధీ తండ్రి అనీస్ అహ్మద్ రష్దీ రూ 3.75 లక్షలకు విక్రయించేందుకు భికు రామ్ జైన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. జైన్ అడ్వాన్స్‌గా రూ 50,000ను అనీస్ రష్ధీకి చెల్లించి మిగిలిన మొత్తం ఇంటి యజమాని ఆదాయ పన్ను అధికారుల నుంచి ట్యాక్స్ క్లియరెన్స్ పత్రాలు రాగానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఒప్పందంలోని అంశాలకు కట్టుబడలేదని ఇరు కుటుంబాలు ఫిర్యాదు చేసుకోవడంతో వివాదం నెలకొంది. ఇక అప్పటి నుంచి ఇరు కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడంతో వివాదం వాయిదాల పర్వానికి దారితీసింది. -
చంద్రబాబు నివాసం వద్ద నిరసన జ్వాలలు
-
వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్....
సాక్షి ప్రతినిధి కడప: టీడీపీ నేత రాజ్యసభ సభ్యులు ఎంపీ సీఎం రమేష్ నివాసం గృహం, సమీప బంధువులు, ప్రధాన అనుచరుల ఇళ్లల్లో శుక్రవారం ఐటీ అధికారులు సో దాలు చేశారు. ఈవార్త జిల్లాలో దావానంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆదా యపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేసి మూడు సూట్కేసులల్లో విలువైన పత్రాలు, డ్యాకుమెంట్లు తీసుకెళ్లారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇంటిలో శుక్రవారం తిరుపతి నుంచి వచ్చిన 8 మంది ఐటీ (ఇన్‌కం ట్యాక్స్) అధికారులు తనిఖీలు చేశారు. సాయంత్రం 5.30 గంటల వరకూ అధికారుల తనిఖీలు కొనసాగాయి. కాగా ‘గుమ్మడి కాయల దొంగ’ అంటే భుజాలు తడుముకున్నట్లుగా టీడీపీ నేతలు శైలి కన్పించింది. ఐటీ అధికారుల తనిఖీలు చేయడాన్ని రాజకీయ రంగు పులిమి నిరసనలు, నినాదాలు చేపట్టారు. ఓవైపు అధికారులు వారి పని వారుచేస్తుండగా మరోవైపు టీడీపీ శ్రేణులు ఆం దోళనలు కొనసాగించాయి. ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, బీటెక్ రవీ, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పోట్లదుర్తి చేరుకొని హంగామా సృష్టించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన పాటించారు. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మీడియా ఎదుట ఆగ్రహం ప్రదర్శించారు. రిత్విక్ కన్స్ట్రక్షన్స్.... రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ రమేష్‌నాయుడు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్కు వేల కోట్లు కాంట్రాక్టు పనులు వచ్చి చేరిపోయాయి. అప్పటి వరకు అరకొర పనులకే పరిమితమైన ఆ సంస్థ రాష్ట్రంలో దాదాపుగా రూ.3,658కోట్లు పనులు చేసినట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు కల్పతరువుగా నిలిచాయి. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, ఆర్టీపీపీ, వంశధార, కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ టన్నెల్ ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. బీఎన్ఎస్ఎస్లో అతి తక్కువగా నిలిచిపోయిన పనులు రివైజ్డ్ రేట్లు వేయించుకొని అత్యధికంగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్లు, హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 రూ.1000 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు రూ.195 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ 34వ ఫ్యాకేజీ రూ.234కోట్లు, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో రూ.350కోట్లు, వెలిగొండ టన్నల్ రూ.270 కోట్లు, తెలుగుగంగ లైనింగ్ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్లు, వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ఫ్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్లు పనులు దక్కినట్లు కాంట్రాక్టు వర్గాలు వివరిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో దాదాపు రూ.3,658 కోట్లు పైబడిన కాంట్రాక్టులను ఆ సంస్థ కొనసాగిస్తున్నట్లు పలువురు ధ్రువీకరిస్తున్నారు. ఈమొత్తం వ్యవహారంలో ఆదాయ వ్యవహారాలు చెల్లించడంలో లోటుపాట్లు ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించి దాడులకు పాల్పడినట్లు పలువురు వెల్లడిస్తున్నారు. ఇదివరకే టీడీపీ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజలరెడ్డి సైతం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు సైతం చేశారు. ఈనేపథ్యంలో ఐటీ విభాగం ప్రత్యక్ష తనిఖీలు చేయడంపై పోట్లదుర్తి వాసులు ‘తేలు కుట్టిన దొంగల్లా’ వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగా అంటున్నారు. -
మోదీ నివాసం వద్ద యూఎఫ్ఓ...?
న్యూఢిల్లీ : ఇన్నాళ్లు అమెరికాలో మాత్రమే కనిపించిన యూఎఫ్ఓ (ఎగిరే సాసర్ లాంటి వస్తువు)లు ఇప్పుడు భారతదేశంలో కూడా కనిపిస్తున్నాయి. అది కూడా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర. వివరాల ప్రకారం...ఈ నెల 7 న న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసమైన ‘లోక్ కళ్యాణ్ మార్గ్’ వద్ద ఆకాశంలో ఒక గుర్తు తెలియని వస్తువు తిరగడం చూసామని సీనియర్ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే ఆ వస్తువెంటో తెలుసుకుందామని ప్రయత్నించామని కానీ దాని గురించి ఎటువంటి సమాచారం దొరకలేదని తెలిపారు. దాంతో భద్రతా అధికారులు ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన నివేదికలో ‘అంతా సవ్యంగానే ఉంద’ని తెలిపారన్నారు. ఈ విషయం గురించి ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర పథక్ ‘ప్రధాని నివాసం వద్ద ఏదో గుర్తుతెలియని వస్తువు ఆకాశంలో చక్కర్లు కొట్టడం అయితే వాస్తమే. కానీ తర్వాత జరిపిన భద్రతా తనిఖీల్లో ప్రమాదకరమైనదేది మా దృష్టికి రాలేద’ని తెలిపారు. అంతేకాక భద్రతా కారణాల దృష్ట్యా అది యూఎఫ్ఓనా లేకా మరేదైన వస్తువా అనే విషయం గురించి మాత్రం తాము బయటకు వెల్లడించలేమని తెలిపారు. ఇలా గుర్తు తెలియని..అనుమానాస్పద వస్తువులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్ 17 రాత్రి 10 గంటల ప్రాంతంలో డ్రోన్లాంటి వస్తువేదో పార్లమెంట్ భవనం చుట్టూ చక్కర్లు కొట్టినట్లు ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చింది. కానీ ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) రాడార్‌లో మాత్రం అటువంటిదేమి రికార్డవ్వలేదని సెక్యూరిటి అధికారులు తెలిపారు. -
అనిల్ కపూర్ నివాసానికి ప్రముఖులు
-
అమెజాన్ బాస్ కొత్త ఇల్లు ఖరీదెంతో తెలిస్తే...
వాషింగ్టన్: అమెజాన్ వ్యవస్థాపకుడు , టెక్ బిలియనీర్ జెఫ్ బెజోస్ అద్భుతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు. అమెరికా రాజధాని వాషింగ్ టన్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. పోష్ ఏరియా కలోరమా జిల్లాలోని ఐదు బ్లాక్స్ ప్రాంతంలో ఈ కొత్త నివాసం ఉండనుంది. నగరంలోని అతి పెద్ద ప్రైవేట్ రెసిడెన్సీలో సుమారు రూ. 1.57కోట్లు ( 23 మిలియన్ డాలర్లు) విలువ చేసే ఇంటికి యజమాని అయ్యారు. 27,000 చదరపు అడుగుల (2,500 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉన్న ఇంటిని కొనుగోలుచేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అంతేకాదు 7,000 చదరపు అడుగుల అధికారిక తోట ఇందులో ఉందని బెజోస్ సొంతమైన వాషింగ్టన్ పోస్ట్ గురువారం నివేదించింది. అదీ మొత్తం నగదు రూపంలో చెల్లించినట్టు తెలిపింది. ఇందులో బరాక్ ఒబామా , మిచెల్ ఒబామా నివాసంతో పాటు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్ నివాసం కూడా ఇక్కడే. అయితే సియాటెల్ లోని బెజోస్ ఇల్లు ప్రధాన నివాసంగా ఉన్నప్పటికీ, భార్య, నలుగురు పిల్లలు తో విజిటింగ్స్, ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ వాషింగ్టన్ కొత్త ఇంటిని ఉపయోగించనున్నారని నివేదించింది. మరోవైపు న్యూ యార్క్ టైమ్స్ ప్రకారం, బెజోస్ కొత్త ఇంటికి సమీపంలోని కుష్నెర్ ట్రంప్ ఇల్లు విస్తీర్ణం 6.870 చదరపు అడుగులు (630 చదరపు మీటర్లు) మాత్రమే. అయితే దీన్ని ఎంబసీగా కానీ, ప్రయివేటు స్కూలుకోసం విక్రయించాలని రియల్టర్లు అనుకున్నారట. ప్రస్తుతం బెజోస్ సొంతం చేసుకున్న ఈ నివాసం ఒకపుడు టెక్స్ టైల్ మ్యూజియంగా విలసిల్లింది. అనంతరం దీన్ని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ కి తరలించారు. 2013 వాషింగ్టన్ పోస్ట్ పత్రికను జెఫ్ బెజోస్ కొనుగోలుచేశారు. బెజోస్ సంపదను 70 మిలియన్ల డాలర్లుగా అంచనావేసిన ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల జాబితాల్లో చేర్చిన సంగతి తెలిసిందే. -
ఏపీలో ప్రారంభమైన ప్రజాసాధికార సర్వే
-
హత్యాచారం చేసి.. వంటపాత్రలో కుక్కి
సేలం : తమిళనాడులోని సేలం జిల్లాలో 16 ఏళ్ల బాలుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతునులిమి చంపాడు. మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో దాచాడు. చిన్నారి ఇంటి పక్కనే నివసించే నిందితుడు శనివారం పాపకు మిఠాయి ఆశచూపి తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పాప ఎవరికైనా చెబుతుందేమోననే భయంతో గొంతు పిసికి చంపి, వంటపాత్రలో దాచాడు. పాప కనిపించడం లేదని ఆమె తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపను ఇంటిపక్కన ఉండే అబ్బాయి తీసుకెళ్లినట్లు విచారణలో స్థానికులు చెప్పారు. ఇంట్లో శవం దొరకడంతో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. కోర్టు అతనికి కస్టడీ విధించింది. -
మంత్రి పత్తిపాటి నివాసం ముట్టడి
చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని మంత్రి పత్తిపాటి పుల్లారావు నివాసాన్ని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కౌలు రైతులు శనివారం ముట్టడించారు. వందలాదిగా వచ్చిన రైతులు మంత్రి నివాసం ముందు బైఠాయించారు. కౌలు రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని కోరారు. మంత్రి తన నివాసంలో లేకపోవడంతో విషయం తెలుసుకున్న ఆయన ఆందోళన చేస్తున్న రైతులతో ఫోన్లో మాట్లాడారు. సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. -
డిప్యూటీ సీఎం ఇంటిముందు చెత్తవేసి మరీ...
ఢిల్లీ: ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన సెగ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి తీవ్రంగా తాకుతోంది. వేతనాలు రెగ్యులర్‌గా చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆందోళన ఉధృతరూపం దాలుస్తోంది. తమ డిమాండ్ల సాధనకు వినూత్న రూపంలో ఆందోళనకు దిగారు. నిన్నముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఆందోళనకారులు తమ పోరాట వేదికను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటికి మార్చారు. చెత్తా చెదారాన్ని మనీష్ ఇంటి లోపలకి విసిరేసి.... నిరసన తెలిపారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఆందోళకారులకు మధ్య తోపులాట జరిగింది. మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తుతోంది. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఏడెనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే.... బతికేదెలా అని ప్రశ్నించారు. తమను పస్తులు ఉంచుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తిట్టిపోశారు. డిమాండ్లు సాధించే వరకు పోరాటాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు. అటు కార్మికులు చేస్తున్న సమ్మెపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
డిప్యూటీ సీఎం ఇంటి ముందు చెత్తవేసి మరీ...
-
కలాం నివాసాన్ని విఙ్ఞాన కేంద్రంగా చేయాలన్న ఆప్
ఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఢిల్లీలో నివసించిన ఇంటిని విఙ్ఞాన కేంద్రంగా మార్చాలని ఆప్ డిమాండ్ చేసింది. రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన అనంతరం కలాం 10 రాజాజీ మార్గ్‌లో నివాసమున్నారు. అయితే ప్రస్తుతం ఈ నివాసాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు కేటాయించారు. దీనిపై ఆప్ నేత, ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. హుటాహుటిన ఆ ఇంటిని ఓ మంత్రికి కేటాయించాల్సిన అవసరం ఏముందనీ.. కలాం నివాసమున్న ఇంటిని ఆయన స్మారకార్ధం విఙ్ఞాన కేంద్రంగా మార్చాలని అన్నారు. తమిళనాడులోని రామేశ్వరానికి మాత్రమే కలాంను పరిమితం చేసేలా ఆయనకు సంబంధించిన వస్తువులు, పుస్తకాలు, ఇతర కలాం ఙ్ఞాపకాలను అక్కడికి తరలించడం సరికాదని మిశ్రా అభిప్రాయపడ్డారు. కలాం నివాసాన్ని ఆయన గౌరవార్థం ఢిల్లీలో పర్యాటక స్థలంగా మార్చాలని ఆప్ భావిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. -
అక్రమభవనానికి సీఎం చంద్రబాబు రాజముద్ర
-
బాబు అద్దె ఇంటికి రూ.అరకోటి
ఇప్పటికే అదే ఇంటికి రూ.81.10 లక్షలు ఖర్చు హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 24లోని అద్దె ఇంటికి రూ.అరకోటికి పైగా కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుదీకరణ పనులకోసం రూ.35 లక్షలు, అద్దె ఇంటిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో పనులకోసం రూ.20.85 లక్షలు కేటాయించారు. జూబ్లీహిల్స్ అద్దె ఇంటికోసం మొత్తం రూ.55.85 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ ఆదేశాలిచ్చారు. ఇంతకుముందే ఈ ఇంటికి రూ.81.10 లక్షలు ఖర్చు చేశారు. సీఎం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 24లోని అద్దె ఇంటికి గత ఏప్రిల్‌లో మారారు. -
పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి
కలెక్టర్ కిషన్ సుబేదారి : ఆహార భద్రత (రేషన్) కార్డుతో పాటు సామాజిక పింఛన్లు, ఫాస్ట్ పథకం కింద ఆర్థిక సాయం కోసం ఈనెల 15వ తేదీలోగా దరఖా స్తు చేసుకోవాలని కలెక్టర్ జి.కిషన్ సూచించా రు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు, సామాజిక పింఛన్లు పొందుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక ఫారాలు ఉండవని, తెల్లకాగితంపై పూర్తి వివరాలు, ఏ పథకం కింద ఇస్తున్నారో రాస్తే సరిపోతుందని తెలిపారు. సెలవు దినాల్లోనూ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తారని వివరించారు. ఆహార భద్రత కార్డు, పింఛన్లకు గ్రామాల్లోనే.. ఆహార భద్రత (రేషన్) కార్డుతోపాటు సామాజిక పింఛన్ల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారి గ్రామాల్లోనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కిషన్ సూచించారు. ఆహార భద్రత కార్డు, పింఛన్ల కోసం గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు అందజేయాలని, వచ్చిన దరఖాస్తులను ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తారని తెలిపారు. ఇక విద్యార్థులు ఫాస్ట్ పథకం కింద ఆర్థిక సాయం, కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, ఆహార భద్రత కార్డు, సామాజిక పింఛన్ల కోసం వరంగల్ నగర ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, డీఆర్వో వీఎల్.సురేంద్రకరణ్, సమాచార పౌర సం బంధాల శాఖ ఏడీ డీఎస్.జగన్, డీడీ బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లు మారనున్న సిఎం చంద్రబాబు
-
అటు కోలాహలం.. ఇటు నైరాశ్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఆదివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఘోరంగా ఓడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. బాణసంచా కాలుస్తూ సంబరాలు.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు వార్తలు వెలువడుతుండడంతో ఒక్కరొక్కరుగా బీజేపీ కార్యకర్తలంతా అశోకారోడ్డు లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఫలితాలు వస్తున్న కొద్దీ కోలాహలం పెరుగుతూ వచ్చింది. డప్పు చప్పుళ్ల మధ్య నత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచా కాలుస్తూ సంతోషంగా గడిపారు. వచ్చిపోయే నేతలకు శుభాకాంక్షలు చెబుతూ బీజేపీ కార్యకర్తలు సందడి చేశారు. బీజేపీకి అనుకూల ఫలితాలు వెలువడడంతో కేంద్ర బీజేపీ కార్యాలయం వద్ద మీడియా కోలాహలం మరింత పెరిగింది. విజయాన్ని అందరితో పంచుకునేందుకు కేంద్ర కార్యాలయానికి వచ్చిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రాకతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులతోపాటు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ సైతం సంబరాల్లో పాల్గొన్నారు. చీపుర్లు చూపుతూ నృత్యాలు.. ఆమ్ఆద్మీ పార్టీ అనూహ్య విజయం ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ ఎన్నికల గుర్తు అయిన చీపుళ్లను పెకైత్తి చూపుతూ హనుమాన్రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదుట నృత్యాలు చేశారు. వందల సంఖ్యలో యువత ఆమ్ఆద్మీ పార్టీ టోపీలు ధరించి అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా అక్కడే గడిపారు. పార్టీ ఫలితాలు తెలుసుకుంటూ కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. షీలాదీక్షిత్‌పై కేజ్రీవాల్ వేల మెజార్టీతో ఉన్నారని చెప్పిన ప్రతిమారు చప్పట్లు, కేకలతో ఆనందం వ్యక్తం చేశారు. 25 వేల పైన ఓట్లతో కే జ్రీవాల్ గెలుపొందడంతోపాటు మొత్తం 28 స్థానాలు ఆప్ గెలుచుకోవడంపై ఆ పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మానుష్యంగా కాంగ్రెస్ కార్యాలయాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం మొదలైన గంట నుంచే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, డీడీయూ మార్గ్‌లోని డీపీసీసీ కార్యాలయం, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాస పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. 2008లో 43 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం ఏడు స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు పనిచేసిన షీలాదీక్షిత్ సైతం ఓటమి పాలుకావడం పార్టీ శ్రేణులకు మింగుడు పడటంలేదు.