
సాక్షి, తాడేపల్లి: సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. సీఎంను కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి పాల్గొన్నారు.
చదవండి: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కట్‌చేసి సజ్జల రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment