
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వమత ప్రార్థనలతో సీఎం పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 500 కిలోల కేక్‌ను పార్టీ నేతలు కట్ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీపార్వతి కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హాజరయ్యారు.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్పా, మాధవ్, గురుమూర్తి, మాధవి, సంజీవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీధర్, ఆర్. కృష్ణయ్య, ఏపీ భవన్ ఉద్యోగులు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
చదవండి: ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌గా
Comments
Please login to add a commentAdd a comment