సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్‌దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. ‘‘తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన అందిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమం పథకాలు అందించిన ఘనత జగన్‌దే. అవినీతికి తావులేకుండా, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం’’ అని సజ్జల పేర్కొన్నారు.
‘‘తండ్రికి మించిన తనయుడుగా జగన్ పేరు తెచ్చుకున్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారు. అన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు. జగన్ పాలన పారదర్శకంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం మారీచశక్తులు మళ్లీ ఏకం అయ్యాయి. గతంలో మోసం తప్ప ప్రజలకు ఇంకేమీ చేయలేదు. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు చూశానని లోకేష్ అంటున్నారు. మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనపడలేదా?. అధికారంలో ఉన్న మిమ్మల్ని ప్రజలు ఈడ్చి కొట్టారు. అయినాసరే మళ్ళీ ప్రజలను నమ్మించేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు.
సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో సీఎం జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి
ఇదీ చదవండి: జయహో జననేతా..ఏ దైవం పంపించాడో!
Comments
Please login to add a commentAdd a comment