Central Office
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరిన బీజేవైఎం కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిని బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు.కాగా, చంద్రబాబు సర్కార్ వంద రోజుల వైఫల్యాలు, విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకాలపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని కప్పి పుచ్చేందుకు కూటమి నేతలు డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఇదీ చదవండి: ‘ఏపీలో రౌడీ రాజ్యం.. పరాకాష్టకు కూటమి అరాచకాలు’ -
వివరణ ఇవ్వండి
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తమ పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేతకు పాల్పడిన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. కూల్చివేతలకు బాధ్యులైన సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌లకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసేందుకు మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్సార్సీపీ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్టప్రకారం నడుచుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌లను ఆదేశిస్తూ గత నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఆదేశాలను వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లవారుజామున వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు. దీంతో సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నిర్మల్‌కుమార్‌లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది నన్నపనేని శ్రీహరి అధికారుల వ్యవహారశైలిని.. కోర్టు ధిక్కారాన్ని న్యాయమూర్తికి వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులుగా ఉన్న అధికారులిద్దరికీ నోటీసులు జారీ చేశారు. -
Tadepalli: ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని, అంతే తప్ప ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని జగన్ అంటున్నారు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదు. తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారు. ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారు. జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదన్నారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని ఉమ్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: YSRCPకి 13 ఏళ్లు పూర్తి.. విశ్వసనీయతకు ప్రతీక పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ‘‘జగన్ అంటేనే విశ్వసనీయత. చెప్పిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేదిన ఘనత జగన్‌ది అని కొనియాడారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, జగన్ లాంటి సీఎం మాకూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. చరిత్ర సృష్టించటం జగన్‌కే సాధ్యం.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్‌ని ఓడించి తీరుతాం. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ ఐదేళ్లలో ఎన్నో మేళ్లు చేసినందునే ధైర్యంగా ఓటు అడగుతున్నాం. అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు. వారికి అండగా నిలవాలంటే మళ్లీ జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు. -
పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్‌దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. ‘‘తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన అందిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమం పథకాలు అందించిన ఘనత జగన్‌దే. అవినీతికి తావులేకుండా, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘తండ్రికి మించిన తనయుడుగా జగన్ పేరు తెచ్చుకున్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారు. అన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు. జగన్ పాలన పారదర్శకంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం మారీచశక్తులు మళ్లీ ఏకం అయ్యాయి. గతంలో మోసం తప్ప ప్రజలకు ఇంకేమీ చేయలేదు. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు చూశానని లోకేష్ అంటున్నారు. మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనపడలేదా?. అధికారంలో ఉన్న మిమ్మల్ని ప్రజలు ఈడ్చి కొట్టారు. అయినాసరే మళ్ళీ ప్రజలను నమ్మించేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో సీఎం జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఇదీ చదవండి: జయహో జననేతా..ఏ దైవం పంపించాడో! -
పూలే బాటలో సీఎం జగన్: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతీరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, తెలుగు, సంస్కృత అకాడమి ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పూలే బాటలో నడుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, పూలే ఆశించిన సామాజిక సాధికారత సీఎం జగన్ సాధించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు అణగదొక్కాలనుకున్నారని, బలహీన వర్గాల గుండె చప్పుడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ సీఎం జగన్‌కు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. -
‘దేశభక్తి కలిగిన పార్టీ వైఎస్సార్సీపీ’
సాక్షి, గుంటూరు: దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, దేశంలోని ప్రతి పౌరుడూ సైనికుల్లా దేశభక్తి కలిగి ఉండాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగరేశారాయన. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి రాజకీయ పార్టీ కూడా దేశభక్తితో ఉండాలన్నారు. కానీ, దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కుయుక్తులు, కుతంత్రాలతో పనిచేస్తున్నాయన్నారు. అయితే దేశభక్తి కలిగిన పార్టీ వైఎస్సార్సీపీ అని, దేశ సమగ్రత, సౌరభౌమత్వాన్ని సీఎం జగన్ కాపాడుతున్నారు. దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో ఇటు అసెంబ్లీలోనైనా, పార్లమెంటులోనైనా వైఎస్సార్సీపీ ముందు ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: పేదలు గెలిచి, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం: సీఎం జగన్ -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పోతుల సునీత. పలువురు నాయకులు పూల మాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్‌పై వైఎస్సార్సీపీ నాయకుడు పెరికె వరప్రసాద్ రచించిన పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన నాడు తీవ్ర కుల వివక్షను ఎదుర్కొని నిల్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటి సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు అహర్నిశలు కృషి చేశారు ఏ కులంలో జన్మించినా ప్రతి ఒక్కరికీ సమాజంలో బతికే అవకాశం ఉందన్న ఆయన, ఆ సమ సమాజ నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఏర్పడేందుకు ఎంతో చొరవ చూపారు. మన దేశం సమైక్యంగా ముందుకు సాగడంలో, నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రధాన కారణం. అంతటి మహనీయుడైన అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలని సీఎం వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. ఆ దిశలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతే కాకుండా బీసీలు, మైనారిటీలతో పాటు, అగ్రకులాల్లోని పేదల కోసం ఆయన పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందాలని ఆశించారో.. నేడు సీఎం జగన్ సరిగ్గా అదే బాటలో నడుస్తూ.. ఆ మహనీయుని ఆశయాలు నిలబెడుతున్నారు. అదే గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం చంద్రబాబు నిత్యం రాజ్యాంగం అపహస్యం పాలయ్యేలా.. దళితులు, అణగారిన వర్గాల వారు అవమానాలకు గురయ్యేలా వ్యవహరించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ వారిపై తనకున్న అక్కసును కూడా చంద్రబాబు వెళ్లగక్కారు. ఇంకా బీసీల తోకలు కత్తిరిస్తామంటూ వారినీ అవమానించారు. అందుకే గత ఎన్నికల్లో ఆ వర్గాలన్నీ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాయి. ఇక నారా లోకేష్ కూడా తండ్రి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి అని తెలిసి కూడా.. ‘దళితులు ఏం పీకుతారు?’ అని నిన్న వ్యాఖ్యానించిన లోకేష్ తన కండకావరాన్ని ప్రదర్శించారు. అందుకే చంద్రబాబు మాదిరిగా, లోకేష్‌కు కూడా ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. దళితులకు సమాన హక్కులు, సాధికారతకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యం: బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. సమాజంలో దళితులకు సమాన హక్కులు, సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్, వారి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. సీఎం జగన్ దళితులకు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. నిజానికి దళితులు జాతి సంపద. తన పాలనలో దళితులను తీవ్రంగా అవమానించి, వారి కోసం ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు, ఈరోజు తన స్వార్థం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారు. కడుపు నిండా కత్తులు పెట్టుకుని దళితులను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్ భారతీయులంతా గర్వించదగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయులంతా గర్వించతగిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విరాజిల్లడానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. జాతి యావత్తూ పవిత్ర గ్రంధంగా భావించే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్, సమసమాజ స్థాపనకు ఎంతో దోహదం చేశారు అంబేద్కర్ ఆశయాలు, ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోంద చదవండి: బీఆర్ అంబేడ్కర్ జయంతి.. సీఎం జగన్ ట్వీట్ -
టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు
సాక్షి, విజయవాడ: అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు వెళ్లారు. అంతేకాదు టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ మంగళవారం నోటీసులు కూడా అందించారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న.. వార్తా కథనాలపై సీఐడీ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆ పత్రిక ఎడిటర్, నిర్వహణ ఎవరంటూ సీఐడీ ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి లాయర్ చేతికి నోటీసులు అందించారు సీఐడీ అధికారులు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై చైతన్య రథం ప్రతిక తప్పుడు కథనాలు ప్రచురించింది. ఎన్నికల కమిషన్‌కి బుగ్గన సమర్పించిన అఫిడవిట్లో స్థిర, చర ఆస్తులపైనా తప్పుడు రాతలు రాసింది. దీంతో ఆయన పత్రికపై ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది సీఐడీ. -
సర్కారు బడి కూల్చివేతకు బీజేపీ యత్నాలు: ఆప్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో కొత్తగా నిర్మించే పార్టీ కేంద్ర కార్యాలయం కోసం బీజేపీ ప్రభుత్వ పాఠశాలను కబ్జా చేస్తోందని ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న పాఠశాల స్థలాన్ని ఇప్పటికే కొంత ఆక్రమించిన బీజేపీ..ఇప్పుడు అభివృద్ధి పేరుతో భవనాన్ని సైతం కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆప్ అలా జరగనీయబోదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. స్కూలు భవనాన్ని కూలగొడితే 350 మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఒక్క స్కూల్‌ను కూడా ధ్వంసం కానివ్వమన్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ బర్త్‌డే వేడుకలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వమత ప్రార్థనలతో సీఎం పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 500 కిలోల కేక్‌ను పార్టీ నేతలు కట్ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీపార్వతి కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్పా, మాధవ్, గురుమూర్తి, మాధవి, సంజీవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీధర్, ఆర్. కృష్ణయ్య, ఏపీ భవన్ ఉద్యోగులు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చదవండి: ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌గా -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఎంపీ నందిగం సురేష్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. చదవండి: మార్గనిర్దేశకుడు వైఎస్సార్.. ఆ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలుగా.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పాలకుడు ఎలా ఉండాలో చూపిన నాయకుడు వైఎస్సార్ అని, తండ్రి స్ఫూర్తితో సీఎం జగన్ ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన నడుస్తోందన్నారు. పేదల జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు తెచ్చారన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నామన్నారు. కాగా, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా చలువ పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసి గణనాథుని ప్రతిష్టించిన భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి జోగిరమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి గణేషుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. చదవండి: వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి? కాగా, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
సాక్షి, అమరావతి: అంబేద్కర్ ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తూ అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. చదవండి: రాజ్యాంగానికి ప్రతిరూపం అంబేడ్కర్: సీఎం జగన్ కార్యక్రమానికి మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నిన్నటి మంత్రి వర్గ విస్తరణలో అంబేద్కర్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్ తూచ తప్పకుండా పాటించారని, మహనీయుడు అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే స్పూర్తిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పలువురు వక్తలు అన్నారు. -
వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమైన పునాది: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విజయసాయిరెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై వారితో చర్చించి పలు సూచనలు చేశారు. వారికి దిశానిర్దేశం చేశారు. చదవండి: ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ జీవనాడి: సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికల నాటికంటే వైఎస్సార్సీపీకి మరింతగా ఆదరణ పెరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైఎస్సార్సీపీని గెలిపించారు. సీఎం వైఎస్ జగన్ విధానాలతో ప్రజలలో పెరిగిన విశ్వాసమే కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది. పార్టీ అనుబంధ సంఘాలు మరింత బలంగా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని.. దీన్ని తిప్పికొట్టాలని’’ విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ భేటీలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇన్చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, చల్లా మధుసూదన్‌రెడ్డి, గౌతంరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నివాళర్పించారు. (చదవండి: AP Formation Day: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్) ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మహనీయుడి స్పూర్తి కొనసాగాలనే సీఎం జగన్.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్నారన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని టీడీపీ ప్రభుత్వం జరపలేదని.. అప్పట్లో వేడుకలు జరపకుండా ఇప్పుడు అచ్చెన్నాయుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి ఉత్సవాలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి ఉత్సవాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. గణపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై చవితి ఉత్సవాలు ప్రారంభం.. విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విఘ్నేశ్వర పూజ అనంతరం కలశస్థాపన, విశేషపపత్రి పూజ నిర్వహించారు. రెండో రోజు మండప పూజ, గణపతి హోమం, తీర్థ ప్రసాదాల వితరణ చేయనున్నారు. మూడో రోజు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. ఇవీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు -
వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల
సాక్షి, అమరావతి: పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, జూపూడి ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగిందన్నారు. నాన్న వేసిన అడుగుకి పదడుగులు వైఎస్ జగన్ వేశారన్నారు. వైఎస్సార్ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా వైఎస్ జగన్ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ను బలోపేతం చేస్తూ ఆయన అడుగులో అడుగు వేద్దామని పిలుపునిచ్చారు. తండ్రి బాటలో సీఎం జగన్: లక్ష్మీపార్వతి పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్సార్ మరణించినా.. ఆయన జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయన్నారు. తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారన్నారు. లోకేష్ అసమర్థుడని.. ఎప్పటికీ నాయకుడు కాలేడని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రెండేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, సీఎం జగన్ చేస్తున్న మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంచి చేస్తున్నాం కాబట్టే.. మొన్నటి ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీకి పట్టం గట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ వర్థంతి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ వర్థంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, సుధాకర్‌బాబు, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి పాల్గొన్నారు. మహనీయుల స్ఫూర్తితో.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో.. సమ సమాజం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. మహనీయుల స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కుబడి మాటలు కాకుండా ఆచరణాత్మకంగా సీఎం చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికీ మేలు జరిగేలా సీఎం అడుగులు వేస్తున్నారన్నారు. అన్ని వర్గాలకూ పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని సజ్జల అన్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
సాక్షి, తాడేపల్లి: కరోనా నియంత్రణ, వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒకవైపు కర్ఫ్యూను అమలు చేస్తూ.. మరోవైపు వ్యాక్సినేషన్, పేద, మధ్యతరగతి ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తూ కరోనాపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కోవిడ్ బారిన పడిన రోగులకు, ప్రజలకు స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అండగా నిలుస్తూ క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఈ సేవలను మరింతగా క్షేత్ర స్థాయిలో విస్తరింపజేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలను భాగస్వామ్యం చేస్తూ, ముఖ్యంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ప్రజలంతా పాటించేలా వారిని చైతన్యవంతం చేయడంతో పాటు రోగులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ కోవిడ్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సేవలు వారికి ఉచితంగా అందేలా కృషి చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్థానికంగా కోవిడ్ సెంటర్లు లేని పక్షంలో అధికారులతో మాట్లాడి తక్షణమే వాటిని ఏర్పాటు చేయించాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా సేవలకు, 9143 54 1234; 9143 64 1234 వాట్సాప్ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు తమతమ నియోజకవర్గాల్లో కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, అందులో రెండు ఫోన్ నెంబర్లు కేటాయించి, ప్రజలు, ముఖ్యంగా కరోనా రోగులకు సహాయపడుతూ మీరు చేస్తున్న కార్యక్రమాలతో పాటు మీ సలహాలు సూచనలను పార్టీ స్టేట్ కంట్రోల్ సెంటర్ వాట్సాప్ ద్వారా పంపించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. చదవండి: సీఎం జగన్ మరో చరిత్రాత్మక నిర్ణయం పకడ్బందీగా కోవిడ్ కర్ఫ్యూ .. గడప దాటని జనం -
ప్రభంజనం: వైఎస్సార్సీపీ సంబరాలు..
సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమానులు అఖండ విజయం సాధించడంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాత్రి సంబరాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి నృత్యాలు చేశారు. ‘వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జగన్’ నినాదాలు మిన్నంటగా తాడేపల్లి ప్రాంతమంతా మార్మోగింది. ఆనందోత్సాహాల మధ్య ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ ‘వైఎస్సార్సీపీ’ జిందాబాద్ అంటూ నినదించారు. సంతోషంతో పూలు జల్లుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బాణసంచా మోతలతో తాడేపల్లి ప్రాంతం దద్ధరిల్లింది. పురపాలక ఎన్నికల్లోనూ ఇదే ప్రభంజనం: మంత్రి బొత్స మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తిన విజయ ప్రభంజనమే త్వరలో జరిగే పురపాలక ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నూరు శాతం స్థానాల్లో విజయ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం, మూడో విడత ఎన్నికల్లో 90 శాతం వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించడం ఆనంద దాయకమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలు ఈ ఫలితాలు ఇస్తున్నారన్నారు. కుప్పంలో ఎవరికి ఎక్కువ స్థానాలొచ్చాయో చంద్రబాబుకు తెలియదా అని బొత్స ప్రశ్నించారు. ముందే ఊహించాం: కన్నబాబు మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కుప్పంలో వచ్చిన ఫలితాలు తమకేమీ ఆశ్చర్యం అనిపించలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలుతుందని ముందే ఊహించామని చెప్పారు. కుప్పం అయినా ఇచ్ఛాపురం అయినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ అని, ఏపీలో కాకపోయినా.. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో పోటీచేసే అవకాశం చంద్రబాబుకు ఉంటుందన్నారు. చంద్రబాబు ఇక పక్క రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి పోటీ చేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి వేడుకలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి నారుమల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఆ ఘనత సీఎం జగన్‌దే: లేళ్ల అప్పిరెడ్డి పూజ కార్యక్రమం అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగడం లేదన్నారు. ఇచ్చిన హామీలన్ని ఏడాదిలోపు పూర్తి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తలపెట్టే విఘ్నాలు తొలగిపోయేలా సీఎం జగన్‌కు వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
వైఎస్సార్ సీపీ ప్రజల పక్షం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నో పోరాటలు చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకుడిగా ఎదిగారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయనతో పాటు లక్ష్మీపార్వతి, ఎంవీఎస్ నాగిరెడ్డి కేక్ కట్ చేసి శుభాభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. (పదో వసంతంలోకి వైఎస్సార్ సీపీ, సీఎం జగన్ ట్వీట్) ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షమని తెలిపారు. ప్రజలతో మమేకమైన రాజకీయాలే తమకు తెలుసునని పేర్కొన్నారు. అవినీతిరహిత సమాజం కోసం పాటు పడుతున్నామని చెప్పారు. చంద్రబాబు డ్రామాలు.. టీడీపీని డ్రామాల పార్టీగా సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని మండిపడ్డారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమాలను మాచర్ల ఎందుకు వెళ్ళారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో అంబటి, మస్తఫాను హత్య చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా సంయమనంతో వ్యవహరించామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. (విశాఖలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు) ఒక ఉద్యమంలా మొదలై.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ పార్టీ ఒక ఉద్యమంలా మొదలై అధికారంలోకి వచ్చిందని సజ్జల తెలిపారు. 2009లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో వందలాది గుండెలు ఆగిపోయాయన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రంలో చీకటి అలుముకుందన్నారు. ఆయన మరణం తర్వాత ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నో లక్షల మంది పార్టీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి అడుగులు వేశారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ 51 శాతం ఓట్లు సాధించారని తెలిపారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఆరు నెలలోనే ఇచ్చిన హామీలను 80 శాతం నెరవేర్చారని పేర్కొన్నారు. ప్రతి పథకాన్ని పేదలకు చేరుస్తున్నారని వెల్లడించారు. ప్రజలు పెట్టుకున్న ఆశలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.