సర్కారు బడి కూల్చివేతకు బీజేపీ యత్నాలు: ఆప్‌ | BJP plans demolish school close to its central office | Sakshi
Sakshi News home page

సర్కారు బడి కూల్చివేతకు బీజేపీ యత్నాలు: ఆప్‌

Published Sat, Apr 8 2023 4:48 AM | Last Updated on Sat, Apr 8 2023 4:48 AM

BJP plans demolish school close to its central office - Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌లో కొత్తగా నిర్మించే పార్టీ కేంద్ర కార్యాలయం కోసం బీజేపీ ప్రభుత్వ పాఠశాలను కబ్జా చేస్తోందని ఆప్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు.

పార్టీ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న పాఠశాల స్థలాన్ని ఇప్పటికే కొంత ఆక్రమించిన బీజేపీ..ఇప్పుడు అభివృద్ధి పేరుతో భవనాన్ని సైతం కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆప్‌ అలా జరగనీయబోదని సంజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. స్కూలు భవనాన్ని కూలగొడితే 350 మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఒక్క స్కూల్‌ను కూడా ధ్వంసం కానివ్వమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement