న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్డంకి తొలగింది. సంజయ్ సింగ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి శనివారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేయటానికి సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని.. ప్రత్యేక న్యాయముర్తి ఎం.కే నాగ్‌పాల్ అనుమతి ఇచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
అదేవిధంగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని కోర్టు పొడగించింది. సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలను ఫిబ్రవరి 17 తమ ముందు ప్రవేశపెట్టాలని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఎంపీగా సంజయ్ సింగ్ పదవి కాలం జనవరి 27న ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్‌ను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: పంజాబ్ గవర్నర్ పదవికి బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment