sanjay singh
-
మీది శీష్ మహల్.. మీది రాజమహల్
న్యూఢిల్లీ: అద్దాల మేడ(శీష్ మహల్)లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివసించారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ రాజ మహల్లో విలాస జీవితం గడుపుతున్నారని ఆప్ నేతలు మండిపడ్డారు. ఈ బంగ్లాల వ్యవహారంలో బుధవారం ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. ప్రజల సొమ్ముతో అద్దాల మేడలో కేజ్రీవాల్ ఖరీదైన ఏర్పాట్లు చేసుకున్నారని బీజేపీ విమర్శిస్తున్న నేపథ్యంలో నిజానిజాలను ప్రజలకు తెలియజేయడానికి ఆప్ అగ్రనేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తమ అనుచరులతో కలిసి మీడియాను వెంటబెట్టుకొని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని ఈ బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలిపారు. బీజేపీ అబద్ధాలు బయటపడ్డాయని చెప్పారు. శీష్ మహల్ లోపల ఏముందో చూసేందుకు బీజేపీ నాయకులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బంగారు మరుగుదొడ్డి, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ ఎక్కడున్నాయో చూపించాలని నిలదీశారు. ప్రధాని మోదీ అధికార నివాసం ఒక రాజమహల్ అని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. దీని కోసం రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ రాజ మహల్లోకి మీడియాను అనుమతించే దమ్ముందా? అని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ప్రధాని నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్ సమీపంలో బైఠాయించారు. మరోవైపు బీజేపీ నాయకులు ఢిల్లీ సీఎం ఆతిశీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఏబీ 17 మథుర రోడ్‌లోని బంగ్లాను మీడియాకు చూపించారు. ఇప్పటికే అధికారిక బంగ్లాను కేటాయించగా, మరో బంగ్లా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. బంగ్లాల సందర్శన పేరిట ఆప్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. -
ఎంపీ సంజయ్ సింగ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. కోర్టు నోటీసులు
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్ తగిలింది. క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో తన ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ సింగ్‌పై గోవా సీఎం ప్రమాద్ సావంత్ సతీమణి రూ.100కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు సంబంధించి గోవా కోర్టు సంజయ్ సింగ్‌కు నోటీసులు పంపించింది. పరువు నష్టం దావా కేసుపై జనవరి 10లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్ ఉత్తర గోవాలోని బిచోలిమ్‌లోని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టులో కేసు వేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి గిరిరాజ్ పాయ్ వెర్నేకర్ తెలిపారు. తాత్కాలిక సివిల్ జడ్జి ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లు వెర్నేకర్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీ మీడియా సమావేశంలో సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై సులక్షణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. పరువుకు భంగం కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంజయ్ సింగ్ తనకు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తన గురించి సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. -
కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది. -
కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం!
ఛండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.‘ఆప్ హర్యానా చీఫ్‌గా నేను 90 అసెంబ్లీ స్థానాలకు పోటీకి సిద్ధమవుతున్నాను. పొత్తు గురించి పార్టీ హైకమాండ్ నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈరోజు నిర్ణయం రాకపోతే, సాయంత్రంలోగా మొత్తం 90 స్థానాలకు మా జాబితాను విడుదల చేస్తాం’ అని గుప్తా తెలిపారు.కాగా హర్యాలో పోటీకి ఆప్ పూర్తిగా సిద్దంగా ఉందని పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొలిక్కివచ్చిందని, పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తుపై కొనసాగుతున్న తరుణంలో.. పార్టీ తరపున చర్చలకు నాయకత్వం వహిస్తున్న ఆప్ ఎంపీ రాఘవ్ మాట్లాడుతూ.. పొత్తుపై సానుకూల ఫలితం వస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ఇరు పార్టీలకు ప్రయోజనం కలిగించేలా పొత్తు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారుఅక్టోబర్ 5న జరిగే హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పలువురు చెబుతున్నా కార్యాచరణలో అది సాధ్యమయ్యేలా లేదని సమాచారం. కొన్ని సీట్లపై ఆప్ పట్టుబడుతుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని తెలుస్తోంది. 20 స్ధానాలు కావాలని ఆప్ డిమాండ్ చేస్తుండగా సింగిల్ డిజిట్ స్ధానాలనే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుండటంతో చర్చలు ఓ కొలిక్కిరావడం లేదని తెలిసింది. -
కేజ్రీవాల్ ప్రాణాలతో బీజేపీ చెలగాటం: ఆప్ ఎంపీ సంజయ్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ బరువు 8. 5 కేజీలు తగ్గారని, అదేవిధంగా ఆయన షుగర్ లెవల్స్ 5 సార్లు 50 ఎంజీ/డీఎల్ కిందికి పడిపోయాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ జైలులో తీవ్రమైన అనారోగ్యంతో బాధపెట్టాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇలా చేయటం అత్యంత ఆందోళనకరమైన విషయమని అన్నారు.‘‘మార్చి 21 తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్ట్ చేసేనాటికి ఆయన బరువు 70 కేజీలు, కానీ, ప్రస్తుతం కేజ్రీవాల్ బరువు 61. 5 కేజీలకు పడిపోయింది. అంటే 8. 5 కేజీల బరువు తగ్గారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బీజేపీ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ను చిత్రహింసలకు గురిచేసి.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా కేజ్రీవాల్‌ను బాధ పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా బరువు తగ్గటంపై ఎటువంటి పరీక్షలు నిర్వహించటం లేదు. బరువు తగ్గటం, షుగర్ లేవల్స్ పడిపోవటం కేజ్రీవాల్ తీవ్ర అనారోగ్యానికి సంకేతాలు. ఇప్పటికే ఐదుసార్లు షుగర్ లేవల్స్ లెవల్స్ పడిపోయాయి. 50 ఎంజీ/డీఎల్ కంటే కిందికి పడిపోతే ఆరోగ్యం క్షీణించి కోమాకు వెళ్తారు. కేజ్రీవాల్‌పైనే ఎందుకు ఇలా చేస్తున్నారు?’అని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయటంతో కేజ్రీవాల్ ఏప్రిల్1 నుంచి తిహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ అరెస్ట్ కేసులో శుక్రవారం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజారు చేసింది. అయినా కూడా కేజ్రీవాల్ తిహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. లిక్కర్ కేసులో ఆయన్ను దర్యాప్తు కోసం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఈనెల 21వ తేదీ నుంచి మంత్రి ఆతిశి కొనసాగిస్తున్న నిరాహార దీక్ష అర్ధంతరంగా ముగిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మంత్రి ఆతిశి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆతిశి దాదాపు ఐదు రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా అందాల్సిన నీటిని హరియాణా నుంచి విడుదల చేయించాలంటూ ప్రధానికి ఆప్ ఎంపీలు లేఖ రాస్తారన్నారు. -
క్షీణించిన మంత్రి అతిశీ ఆరోగ్యం.. నిరసన దీక్ష విరమణ
ఢిల్లీ: ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఆప్ జలవనరుల శాఖ మంత్రి అతిశీ విరమించారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అదే విధంగా హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను అందించాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.‘‘మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె బీపీ లెవల్స్ పడిపోయాయి. ఎల్ఎన్జేపీ ఆస్పత్రి వైద్యులు వెంటనే ఆమెను ఆస్పత్రితలో చేరి చికిత్స తీసుకోవాలన్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను కేటాయించాలని ఆమె గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎల్ఎన్జేపీ ఆస్పత్రి ఐసీయూలో జాయిన్ అయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు.తీవ్ర నీటీ సంక్షోభ సమయంలో హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి అతిశీ జూన్ 21 నుంచి నిరవధిక నిరాహారాదీక్ష చేపట్టారు. మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించటంతో దీక్ష విరమించి హాస్పిటల్లో చేరారు. -
ఢిల్లీలో ఆప్ జలదీక్ష
న్యూఢిల్లీ: నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసుల కష్టాలు తీర్చాలంటూ ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సింగ్ శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. యమునా నది అదనపు జలాలను హరియాణా తక్షణం ఢిల్లీకి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్‌ఘాట్‌లో గాం«దీజీకి నివాళులరి్పంచి దీక్ష మొదలెట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. ‘‘ఆతిశి తపస్సు విజయవంతమవుతుంది. గొంతెండుతున్న వారి దప్పిక తీర్చడం మన సంప్రదాయం. తీవ్రమైన ఎండకాలంలో పొరుగురాష్ట్రాలు నీళ్లిచ్చి ఆదుకోవాలి. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నీటిని విడుదలచేయకుండా ఆపి ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టుకునేలా చేయాలని మోదీ సర్కారు కుట్ర పన్నింది’’ అని అందులో కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నీటి సమస్యపై మోదీకి లేఖ రాశా. హరియాణా ప్రభుత్వాన్ని వేడుకున్నా. ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, మహిళల నీటి సమస్యలు చూడలేక నీటి సత్యాగ్రహానికి సిద్ధపడ్డా’’ అని ఆతిశి ప్రకటించారు. రోజూ 613 లక్షల గ్యాలెన్ల నీటిని విడుదలచేసే హరియాణా గత రెండు వారాలుగా కేవలం 513 లక్షల గ్యాలెన్ల నీటినే రోజూ విడుదలచేస్తోంది. గత రెండు రోజులుగా మరో 120 లక్షల గ్యాలెన్ల మేర కోత పెట్టింది.విమర్శించిన బీజేపీ దీక్షను రాజకీయ నాటకంగా బీజేపీ అభివరి్ణంచింది. ‘‘ఆతిశి విఫల మంత్రి. నీటి కష్టాలు తప్పవని ఫిబ్రవరిలోనే సూచనలు కనిపించినా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఎగువ హిమాచల్ ప్రదేశ్ నుంచో, ఆప్ పాలిత పంజాబ్ నుంచి ఎందుకు నీళ్లు అడగటం లేదు? ఢిల్లీ నీటి ట్యాంకర్ మాఫియాతో ఆప్ నేతలకు సంబంధముంది’’ అని ఆరోపించింది.నా భర్త ఏమన్నా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదా: సునీతా కేజ్రీవాల్తన భర్త ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అన్నట్లుగా ఈడీ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆయన బెయిల్‌ను హైకోర్టులో సవాలు చేపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బెయిల్ ఉత్తర్వు వెబ్సైట్లో అప్లోడ్ కూడా కాకముందే తెల్లవారుజామునే ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని ఆక్షేపించారు. కేజ్రీవాల్ ఏమైనా ఉగ్రవాదా?’’ అంటూ దీక్షా స్థలి వద్ద మండిపడ్డారు. -
ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్: సాక్షితో ఎంపీ సంజయ్ సింగ్
సాక్షి, ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలో ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఫలితాలు సాధించబోతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయన బుధవారం సాక్షి టీవీతో మాట్లాడారు.‘‘ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి బీజేపీ హింసిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మేము జైలు అంశాన్ని ప్రచారం చేస్తున్నాం. ‘జైలు కా జవాబ్ ఓటు సే’అనే నినాదంతో ఎన్నికల్లో దిగాం. ఆప్‌కు ఓటేస్తే దేశవ్యాప్తంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రైతులకు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధర ఇస్తాం. పంజాబ్‌కు బీజేపీలో అవకాశం ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తుంది.ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బయటపడతాం. బీజేపీకి చందాలు ఇచ్చిన వ్యక్తులు ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఈడీ బీజేపీ నాయకులపై ఎందుకు సోదాలు చేయడం లేదు. మమ్మల్ని బలవంతంగా జైల్లో పెట్టారు. ఇదే అంశాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తే, సానుభూతి కోసమని ఎలా అంటారు?. కేజ్రీవాల్ దేశం కోసం పని చేస్తే, మోదీ తన దోస్తుల కోసం పనిచేస్తున్నారు. దేశంలో ఉన్న ఎయిర్‌పోర్టులు, పోర్టులు తన దోస్తులకు కట్టబెట్టారు’’ అని సంజయ సింగ్ మడ్డారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో తీహర్ జైలులో కస్టడీలో ఉన్న సంజయ్ సింగ్ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
తమ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి నిజమేనని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అంగీకరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతి మాలివాల్‌పై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ దాడిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, తగిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ సంజయ్ సింగ్ వెల్లడించారు.అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎంపీ స్వాతి మలివాల్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రాయింగ్ రూమ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎదురు చూస్తున్న సమయంలో బిభవ్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని సంజయ్ సింగ్ అన్నారు. బిభవ్ కుమార్‌పై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆప్ ఎంపీ ఎంపీ స్వాతి మలివాల్ స్థానాన్ని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన తనపై దాడిచేసినట్లు బిభవ్‌పై స్వాతి మలివాల్ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దాడి వ్యవహారం మరింత చర్చకు దారి తీసింది. మరోవైపు బీజేపీ.. ఆప్‌పై విమర్శలు చేస్తోంది. ఈ తరుణంలో అప్ ఎంపీ సంజయ్ సింగ్ దాడిని ఖండించారు. -
డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021 నుంచి ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్‌కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్‌లో నేను రిలాక్స్‌గా ఉన్నాను. అని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్‌తో పాటు ఆర్యన్ కూడా సోషల్‌మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆర్యన్ ఎలాంటి తప్పు చేయలేదని గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్లో అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు. తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్‌కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, ఆర్యన్ ఖాన్‌తో సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరుగురికి ఎన్‌సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్‌కు క్లీన్ చిట్ దక్కింది. -
‘ఉగ్రవాదిని కాదు.. నేను అరవింద్ కేజ్రీవాల్‌ని’
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశానికి, ఢిల్లీ ప్రజలకు కోసం ఒక కుమారుడుగా, సోదరుడుగా పనిచేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. తీహార్ జైలు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని మీడియాకు సంజయ్ సింగ్ వెల్లడించారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్. నేను ఉగ్రవాదిని కాదు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేను పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌ను తీహార్ జైల్లో గ్లాస్ గోడ ద్వారా కలిశాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్‌పై ఎంత ద్వేషం పెంచుకున్నారో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. 24 గంటలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ‘జైలులో ఉన్నది సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఓ మట్టి మనిషి.. అయన్ను ఎంత విచ్ఛినం చేయాలని చూసినా అంతే బలంగా తిరిగి వస్తారు. తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ కలసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇది మనందరికీ చాలా ఉద్వేగభరితమైన విషయం. ప్రధాని మోదీ, బీజేపీకి సిగ్గు చేటు’ అని సంజయ్ సింగ్ అన్నారు. ‘ప్రధాని మోదీ సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల పథకం ఉత్తమమైనది అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోదీ సుప్రీ కోర్టు తీర్పును అవమానించారు. మోదీ సుప్రీం కోర్టుక, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. -
AAP MP Sanjay Singh: తీహార్ జైల్లో కేజ్రీవాల్ హక్కులకు భంగం
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కుటుంబసభ్యులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేందుకు అధికారులు అనుతి వ్వడం లేదని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగిస్తూ ఆయన్ను మానసికంగా దెబ్బకొట్టేందుకు జరుగుతున్న ప్రయత్న మిదని అన్నారు. సాధారణ ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగానే కుటుంబసభ్యులను కేజ్రీవాల్ కలుసుకునేందుకు అవకా శమిస్తున్నారన్నారు. కరడుగట్టిన నేరగాళ్లకూ వ్యక్తిగత సమావేశాలకు అనుమతులున్నాయన్నారు. సీఎంగా ఎన్నికైన వ్యక్తిని సాధారణ ఖైదీగా చూస్తున్నారన్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అమానవీయమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఇలా జరుగుతోందని ఆయన విమర్శించారు. జైలులోని ఓ గదిలో ఇనుప మెష్‌కు ఒక వైపు ఖైదీ, మరోవైపు సందర్శకులుంటారు. ఇలా ఇద్దరూ ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే ఏర్పాటు పేరే ‘ములాఖత్ జంగ్లా’. -
కేజ్రీవాల్‌ను సునీత కలిస్తే తప్పేంటి?: సంజయ్ సింగ్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మానీలాండరింగ్ అభియోగాల కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వకపోవటంపై ఆప్ నేత సింజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జైలు కిటికీ వద్దనే కలవడాకి అనుమతించటం చాలా అమానవీయమని అన్నారు. సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘భయంకరమైన నేరాలకు పాల్పడినవారిని సైతం తమ బ్యారక్‌లలో సమావేశాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. మూడుసార్లు సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌ను మాత్రం జైలు రూం గ్లాస్ కిటికీ వద్ద కలవమనటం సరికాదు. ఎందుకు ఇంత అమానవీయం?. సునితా కేజ్రీవాల్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగా సమావేశం అవుతానని అప్పీల్ కూడా చేసుకున్నారు. తీహార్ జైలు అధికారులు రూంలో వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం జైలు రూం కిటికీ వద్ద కలవడానికే మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇది సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అవమానించటమే కాకుండా నైతిక విలువలను ఉల్లంఘించటం’ అని తీహార్ జైలు అధికారులపై సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి సమావేశం కావడాన్ని సంజయ్ సింగ్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రద్దు చేసుకున్నారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ ఆరోపణలపై సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘నితీష్- మమత.. నింగి-నేల’ ఆప్ నేత ఎందుకన్నారు?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది, బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్- మమతలను నింగి-నేలతో పోల్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్ సాగిస్తున్న ప్రచారం గురించి కూడా సంజయ్ సింగ్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 23 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోందని, కార్యకర్తలంతా పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కుమార్ నిష్క్రమణ అనూహ్యమని, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన హఠాత్తుగా ఎన్డీఏలో చేరారన్నారు. ఈ విధంగా పార్టీలు మారితే స్వల్పకాలంలో అధికారాన్ని, ప్రయోజనాన్ని పొందవచ్చని, తరచూ పార్టీలు మారితే చరిత్ర హీనులవుతారని ఆరోపించారు. ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి, ఇప్పుడు దానికి నితీష్ తలొగ్గుతారని తాను భావించలేదన్నారు. ఇక మమతా బెనర్జీ విషయాని కొస్తే ఆమె బీజేపీకి వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారని సంజయ్ సింగ్ అన్నారు. అందుకే మమతకు నితీష్ కుమార్‌కు మధ్య నింగికి నేలకు ఉన్నంత తేడా ఉన్నదన్నారు. మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుండగా, నితీష్ కుమార్ బీజేపీకి సాగిలపడ్డారని ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో ఇండియా కూటమికి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక బీజేపీ సీనియర్ కుట్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అవకతవకల కేసులో బీజేపీ సీనియర్ నేత ఒకరు కుట్ర పన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవ్‌పై ఒత్తిడి చేసి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా చేశారని శుక్రవారం ఢిల్లీలో పత్రికాసమావేశంలో సంజయ్ చెప్పారు. ఇదే కేసులో చాలా వారాలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండి సంజయ్ రెండు రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలైన సంగతి విదితమే. ‘‘ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై బీజేపీ ఒత్తిడి చేసింది. అందుకు ఆయన ఒప్పకోలేదు. దీంతో ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌ను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్‌చేశారు. పలుమార్లు అధికారులు ప్రశ్నించడంతో మాగుంట రాఘవ్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఇలా పెద్ద కుట్రలో భాగమయ్యారు. ఢిల్లీ సీఎంను కటకటాల వెనక్కి పంపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది’ అని సంజయ్ అన్నారు. -
కేజ్రీవాల్ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్: సంజయ్ సింగ్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కుట్ర చేసి సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని అన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఇదే సమయంలో లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు. కాగా, సంజయ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి మనీ ట్రయల్ ఆధారాలు లేవు. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్‌కు కుట్రలు చేశారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆప్‌ను నాశనం చేయాలని బీజేపీ చూస్తోంది. బీజేపీతో కలిస్తే ఎలాంటి కేసులు ఉండవు. అలాగే, కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు మాగుంట శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ ఇచ్చారు. బీజేపీతో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగింది. ఆయన ఇప్పుడు మోదీ ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు’ అని కామెంట్స్ చేశారు. #WATCH | Delhi: Aam Aadmi Party MP Sanjay Singh says, "There is one person, Magunta Reddy, who gave 3 statements, his son Raghav Magunta gave 7 statements. On 16th September, when he (Magunta Reddy) was first asked by ED whether he knew Arvind Kejriwal, he told the truth and said… pic.twitter.com/YzyPrZxYAQ — ANI (@ANI) April 5, 2024 ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఆర్నెల్ల పాటు తీహార్ జైల్లో ఉన్న సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన గురువారం రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ దుమ్మెత్తిపోశారు. మోదీ సర్కారు ఎంతగా వేధించినా ఆప్ బెదరబోదు. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరు. రెండు కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సీఎంగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన, సిసోడియా, జైన్ త్వరలోనే విడుదలవుతారు’ అని అన్నారు. -
AAP MP Sanjay Singh: బీజేపీకి గట్టిగా బదులిస్తాం
న్యూఢిల్లీ: విపక్షాలపై తీవ్ర నిర్బంధ చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచి్చందని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆర్నెల్ల పాటు తిహార్ జైల్లో గడిపిన ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన గురువారం రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట రాగా ఓపెన్ టాప్ కార్లో ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు. మోదీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘మోదీ సర్కారు ఎంతగా వేధించినా ఆప్ బెదరబోదు. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరు. 2 కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సీఎంగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన, సిసోడియా, జైన్ త్వరలోనే విడుదలవుతారు’’ అని అన్నారు. అవినీతి ఆరోపణలపై విపక్ష పాలిత రాష్ట్రాల పోలీసులు మోదీ ఇంటి తలుపు తడితే విచారణకు ఆయన సహకరిస్తారా అని సంజయ్ ప్రశ్నించారు. -
లిక్కర్ కేసు: తీహార్ జైలు నుంచి ‘ఆప్’ ఎంపీ రిలీజ్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం(ఏప్రిల్ 3) రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే సంజయ్‌సింగ్‌కు ఆప్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆరు నెలల తర్వాత విడుదలైన తమ నేతపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి సంజయ్‌సింగ్ మాట్లాడారు. ‘ఇది మనం వేడుక చేసుకునే టైమ్ కాదు. పోరాడాల్సిన సమయం. మన నేతలు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారంతా జైలు తాళాలు బద్దలు కొట్టుకుని బయటికి వస్తారని నాకు నమ్మకం ఉంది’అని సంజయ్‌సింగ్ అన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే సంజయ్ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ను కలిశారు. #WATCH | After spending six months in jail, AAP MP Sanjay Singh walks out of Delhi's Tihar Jail. He was greeted by party leaders and workers on his release. pic.twitter.com/dTybWdb7C4 — ANI (@ANI) April 3, 2024 ఇదీ చదవండి.. సంజయ్ సింగ్ రాక.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు -
సంజయ్‌సింగ్‌కు బెయిల్.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు !
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలు జైలులో మగ్గుతున్న ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి సంజయ్ సింగ్ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లిక్కర్ కేసులో గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ బుధవారం(ఏప్రిల్ 2) సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని తమ పార్టీకి ‘మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హోప్’గా ఆప్ నేతలు అభివర్ణిస్తున్నారు. ఆప్ సీనియర్ నేత అయిన సంజయ్‌సింగ్‌కు మంచి ఎన్నికల వ్యూహకర్తగా, వక్తగా పేరుంది. పకడ్బందీ ఎన్నికల వ్యూహాలు రచించి పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మార్చి ఎన్నికల్లో విజయాలు సాధించడంలో సంజయ్సింగ్ది అందె వేసిన చేయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆప్ సాధించిన అన్ని విజయాల్లో సంజయ్‌సింగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ కీలక పాత్ర పోషించాయి. దీంతో ప్రస్తుతం పార్టీ కీలక నేతలు జైలులో ఉన్న వేళ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సంజయ్ సింగ్ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లగలరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీహార్ జైలు కీలక ప్రకటన -
Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిమాణం.
-
లిక్కర్ కేసు: ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంలో బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ సింగ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో జైలు పాలైన సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ విచారణ ముగిసే వరకు ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం సిండికేట్‌కు సంబంధించి లంచంగా తీసుకున్నారని ఆరోపిస్తున్న ఈ కేసులో సంజయ్ సింగ్ వద్ద ఒక్క పైసా కూడా లభించనప్పుడు.. 6 నెలలుగా జైలులో ఎలా ఉంచుతారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ప్రశ్నించింది. ఆప్ ఎంపీపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా సంజయ్ సింగ్ పాల్గొనవచ్చని పేర్కొంది. కాగా లిక్కర్ కేసులో సంజయ్ సింగ్‌ను ఆప్ గతేడాది అక్టోబర్‌లో అరెస్ట్ చేసింది. గత ఆరు నెలలుగా సంజయ్‌సింగ్ తీహార్ జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలో తన రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా సంజయ్ సింగ్‌కు బెయిల్ ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ పేర్కొంది. అనంతరం సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్త, జస్టిస్ పిబి.వరాలే ధర్మసనం బెయిల్ ఉత్తర్వులను జారీ చేసింది. చదవండి: ‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్ ఫైర్ -
కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్
అహ్మదాబాద్: ప్రధాని మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోదీ డిగ్రీపై దూషణపూర్వక, వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌కు కింది కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హస్ముఖ్ సుతార్ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. ఇద్దరు నేతలు తమ వాదనలను ట్రయల్ కోర్టు ముందే వినిపించాలని సూచించింది. ప్రధాని డిగ్రీపై తమ వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ సెషన్స్‌కోర్టులో కాకుండా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టడాన్ని తొలుత సెషన్స్ కోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు. కేజ్రీవాల్ రివిజన్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తోసిపుచ్చడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు సూచనలతో హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. కాసేపటికే -
ఆప్ నేత సంజయ్ సింగ్‌కు చుక్కెదురు
ఢిల్లీ: ఆప్ నేత సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించారు. సంజయ్ సింగ్ వ్యవహారం ప్రివిలేజెస్ కమిటీ వద్ద ఉందని ధంఖర్ తెలిపారు. సంజయ్ సింగ్‌పై ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ విచారిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్‌ను రాజ్యసభ ఎంపీగా ఆప్ మరోసారి నామినేట్ చేసింది. సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్, చార్టర్డ్ అకౌంటెంట్ నరైన్ దాస్ గుప్తాను రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు, ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏడు రోజుల మధ్యంతర బెయిల్‌ను కోరుతూ సంజయ్ సింగ్ ఫిబ్రవరి 1న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే.. పార్లమెంటుకు ప్రమాణం చేయడానికి మాత్రమే కోర్టు అనుమతినిచ్చింది. మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌ను గతేడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. డిసెంబర్ 22, 2023న బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత జనవరి 3న ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా.. కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. బయటకు వస్తే కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపింది. ఇదీ చదవండి: రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష -
ఆప్ నేతకు తొలగిన అడ్డంకి.. ప్రమాణ స్వీకారానికి అనుమతి
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్డంకి తొలగింది. సంజయ్ సింగ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి శనివారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేయటానికి సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని.. ప్రత్యేక న్యాయముర్తి ఎం.కే నాగ్‌పాల్ అనుమతి ఇచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని కోర్టు పొడగించింది. సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలను ఫిబ్రవరి 17 తమ ముందు ప్రవేశపెట్టాలని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఎంపీగా సంజయ్ సింగ్ పదవి కాలం జనవరి 27న ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్‌ను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్ గవర్నర్ పదవికి బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా