
'బీజేపీ ఓటమితో దేశం పటాసులు కాలుస్తుంది'
బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఆమ్ ఆద్మీ పార్టీ జోస్యం చెప్పింది. ఆ ఓటమిని చూసి జనాలంతా పటాసులు కాలుస్తారని పేర్కొంది.
లక్నో: బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఆమ్ ఆద్మీ పార్టీ జోస్యం చెప్పింది. ఆ ఓటమిని చూసి జనాలంతా పటాసులు కాలుస్తారని పేర్కొంది. ఆప్ అధికారి ప్రతినిధి సంజయ్ సింగ్ బీహార్ ఎన్నికలపై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీహార్ ఓడిపోయే సమయం వచ్చిందని అన్నారు. ఈ ఓటమితో దేశం మొత్తం మతాబులు కాల్చి పండుగ చేసుకుంటుందని తీవ్రంగా విమర్శించారు.
దేశంలో మతవిద్వేషాలు ఎన్డీయే హయాంలో పెచ్చరిల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయని, మిగిలిన ఎన్నికల్లో మతం పేరిట చీలికలు తీసుకొచ్చే కుట్రలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేస్తున్నారని ఆరోపించారు.