ఢిల్లీ సీఎం అడ్డగింత.. ఆప్‌ ఆగ్రహం | Delhi CM not allowed' to meet detained activist Sonam Wangchuk | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సీఎంను అడ్డుకున్న పోలీసులు.. ఆప్‌ మండిపాటు

Published Tue, Oct 1 2024 4:49 PM | Last Updated on Tue, Oct 1 2024 5:47 PM

Delhi CM not allowed' to meet detained activist Sonam Wangchuk

ఢిల్లీ: పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌, ఆయన మద్దతుదారులను సోమవారం సింగు సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోనమ్‌ వాంగ్‌చుక్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంపై ఆప్‌ వర్గాలు భగ్గుమన్నాయి. 

‘‘ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు సోనమ్‌ వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్న బవానా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎంను పోలీసు అధికారులు అడ్డుకున్నారు’’ అని  ఆప్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.దీంతో అక్కడ  ఉద్రిక్తత  పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో పోలీసులు ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న బవానా పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న వాంచుక్ మద్దతుదారులను ఢిల్లీ సరిహద్దుల్లోని  ఇతర పోలీస్ స్టేషన్లలో ఉంచారు.

 

సోనమ్‌ వాంగ్‌చుక్‌ లడఖ్ నుంచి దాదాపు 120 మంది మద్దతుదారులతో  లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్‌ చేపట్టారు. దీంతో పోలీసులు.. సోనమ్‌ వాంగత్‌చుక్‌, ఆయన మద్దతుదారులను సోమవారం అర్థరాత్రి సింగు సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సింగు సరిహద్దుల్లో సెక్షన్‌ 163 విధించినట్లు ప్రకటించారు. నెల క్రితం లేహ్ నుంచి ప్రారంభమైన ‘‘ ఢిల్లీ చలో పాదయాత్ర’’కు వాంగ్‌చుక్ నాయకత్వం వహిస్తున్నారు.

ఇక.. ఇప్పటికే సోనమ్‌ వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకోవటాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను నిర్భందించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

చదవండి: గుడి, మసీదు, దర్గా.. రోడ్లపై ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement