మతంతో సంబంధం లేదు.. ఆ నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు | Public Safety Paramount, Temple Dargah On Road Must Go: Supreme Court | Sakshi
Sakshi News home page

గుడి, మసీదు, దర్గా.. రోడ్లపై ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు

Published Tue, Oct 1 2024 2:35 PM | Last Updated on Tue, Oct 1 2024 3:05 PM

Public Safety Paramount, Temple Dargah On Road Must Go: Supreme Court

న్యూఢిల్లీ: రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మత విశ్వాసాల కంటే ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాల్లో బుల్డోజర్‌ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌ మంగళవారం విచారణ జరపింది.

ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌ లౌకిక (సెక్యూలర్) దేశమని..  మతాలతో సంబంధం లేకుండా ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్‌తో చర్యలు అందరికీ ఒక్కటేనని  పేర్కొంది. మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని తెలిపిన ధర్మాసనం.. వీటికి ఆన్‌లైన్ పోర్టల్ కూడా ఉండాలని తెలిపింది. వాటిలో డిజటలైజ్‌ రికార్డులు అందుబాటులో ఉంచడం ప్రజలు అన్నీ తెలుసుకోగలరని వెల్లడించింది.

గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వాల తరపున సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరయ్యారు.  క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండటమే బుల్డోజర్ చర్యను ఎదుర్కోవడానికి కారణమా అని ధర్మాసనం ఆయన్ను అడగ్గా.. ‘కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ముందే చట్టాన్ని అతిక్రమంచి ఉంటేనే చర్యలు తీసుకొంటాం’ అని తెలిపారు.

అలాగే ఒకటీ రెండు సంఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కోరారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఉదంతాల ఆధారంగా కోర్టు ఆదేశాలు జారీ చేడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. 

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ..‘ మనది సెక్యూలర్‌ దేశం. మా మార్గదర్శకాలు మతం, జాతి, వర్గాలకు అతీతంగా ఉంటాయి. అందరికీ వర్తిస్తాయి. ఇక ఆక్రమణల విషయానికి వస్తే మేము ఇప్పటికే చెప్పాం. రోడ్డు, ఫుట్‌పాత్‌, జలాశయం, రైలు పట్టాపై ఏదైనా మత సంబంధమైన నిర్మాణం ఉంటే అది దర్గా, గుడి, మసీదు, గురుద్వారా ఏదైనా..  ప్రజలకు ఆటంకంగా మారకూడదు. అక్రమ నిర్మాణాల విషయంలో మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటే చట్టం వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించింది.  
చదవండి:MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్

యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఏదైనా నేరంలో ఉండటమే వ్యక్తి ఇంటిపై బుల్డోజర్‌ చర్యలు తీసుకోవడానికి ఆధారమా..?  అని ఆయన్ను బెంచ్‌ ప్రశ్నించింది. దీనికి మెహతా స్పందిస్తూ.. ‘‘కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ఇది ముందే జరిగిఉంటేనే చర్యలు తీసుకొంటాం’’ అని పేర్కొన్నారు.  

ఇక యూన్‌ రిపోర్టర్‌ సీనియర్‌ న్యాయవాది వ్రిందా గ్రోవర్‌ ఇళ్ల లభ్యతపై వాదనలు వినిపించగా.. దీనికి సొలిసిటర్‌ జనరల్‌ మెహతా అభ్యంతరం చేశారు.‘ఈ విషయాన్ని అంతర్జాతీయకరించాల్సిన అవసరం లేదని, మన రాజ్యాంగానికి, దేశ న్యాయస్థానాలకు తగినంత శక్తి ఉందన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ ఏజెన్సీ జోక్యం అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.

పిటిషనర్లలో ఒకరి తరఫు సీనియర్ న్యాయవాది సియు సింగ్ వాదిస్తూ.. బుల్డోజర్ చర్యను నేరాల నిర్మూలన చర్యగా ఉపయోగించకూడదనేది తన ఏకైక ఉద్దేశమని అన్నారు. మైనారిటీలపై బుల్‌డోజర్‌ చర్య చాలా తక్కువగా ఉంటుందని మెహతా అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘వారు ఒకరు ఇద్దరు లేరని.. 4.45 లక్షలు ఉన్నారని తెలిపింది.

చివరగా.. కూల్చివేతలకున ఏరారోపణలు ఆధారం కూకూడదని, పౌర నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రమే కూల్చివేతలు జరగాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న గతంలో జారీ చేసిన మధ్యంతరు ఉత్తర్వులను పొడిగించింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement