bulldozer
-
‘బుల్డోజర్ సిద్దంగా ఉంది’.. సీఎం యోగీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో నిలిచారు. సోమవారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర నిధులను కొల్లగొట్టిందని ఆరోపించారు. కేంద్రం నిధులను రికవరీ చేయడానికి ‘బుల్డోజర్ సిద్ధంగా ఉంది’ అని హెచ్చరించారు. అయితే బుల్డోజర్ చర్య చట్టరిత్యా ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన కొన్ని రోజులకే సీఎం ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో జార్ఖండ్‌లోని సహజ వనరులను, ప్రధాని నరేంద్ర మోదీ అందించిన కేంద్ర నిధులను కొల్లగొట్టింది. ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్ వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ఇది 'బేటీ, మటీ, రోటీ' (కుమార్తె, భూమి, రొట్టె)కి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇప్పుడు దోచుకున్న నిధులను తిరిగి పొందేందుకు బుల్డోజర్ సిద్ధంగా ఉంది’ అని జమ్తారాలో ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. .జార్ఖండ్‌లో ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగియగా.. రెండో విడత ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా యూపీలో వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఆస్తులను కూల్చివేస్తున్న యోగీ ఆదిత్యనాథ్ ‘బుల్డోజర్ బాబా’గా పేరొందారుఇక బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో అధికారులు న్యాయ ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని ధర్మాసనం తెలిపింది. నిందితులను దోషిగా చిత్రీకరించలేమని, దాని ఆధారంగా వాళ్ల ప్రాపర్టీలను నాశనం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. బుల్డోజర్తో ఇంటిని కూల్చేసి మహిళలు, చిన్నారులు, వృద్ధులను రాత్రికి రాత్రి నిరాశ్రయులు చేసే దృశ్యం భయంకరమైనదని అభివర్ణించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తులు కూల్చడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలపై అనుసరించాల్సిన ప్రక్రియపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అధికారాలను వినియోగించి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. -
బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం
తలదాచుకోవడానికి ఒక సొంత గూడు సమకూర్చుకోవాలని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కలలు కంటుంది. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. ఇల్లు అంటే ఒక కుటుంబమంతటి ఆశల కలబోత. ఇల్లు జీవితానికి స్థిరత్వాన్ని, భద్రతను ఇస్తుంది. మనుషులకు సంతృప్తి, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని అందిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితానికి రక్షణ)లో పౌరులు ఒక గూడు కలిగి ఉండే హక్కు కూడా ఒక భాగమే. ఏదైనా కేసులో ఒక వ్యక్తి నిందితుడు లేదా దోషి అయితే.. అతడి కుటుంబం నివసిస్తున్న ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేయవచ్చా? వారికి నిలువ నీడ లేకుండా చేయొచ్చా? ఒక్కరు నేరం చేస్తే అతడి కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలా? అనేది చాలా ముఖ్యమైన విషయం. న్యాయ వ్యవస్థ అధికారాలను కార్యనిర్వాహక వ్యవస్థ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. బుల్డోజర్ న్యాయం ఎంతమాత్రం సరైంది కాదు. ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడు లేదా దోషి అయినంత మాత్రాన అతడి ఇంటిని కూల్చివేయడం చట్టబద్ధ పాలనా సూత్రాలకు వ్యతిరేకం. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనధికారికంగా అమలవుతున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ చర్యలు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని, ఒక వ్యక్తి నేరాన్ని నిర్ధారించే బాధ్యత న్యాయవ్యవస్థపైనే ఉందని వెల్లడించింది. ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే జరిమానా తప్పదని, దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని న్యాయస్థానం వదిలిపెట్టబోదని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకించడంతోపాటు ఇలాంటి కూల్చివేతల విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. బుల్డోజర్ న్యాయం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ అక్టోబర్ 1న తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుపై బుధవారం జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. 95 పేజీల తీర్పు వెలువరించింది. ఒకరు నేరానికి పాల్పడితే అతడి కుటుంబాన్ని శిక్షించడాన్ని రాజ్యాంగం గానీ, నేర న్యాయ వ్యవస్థ గానీ అనుమతించబోవని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కొన్ని కేసుల్లో స్థానిక మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తున్నారని, అయితే, కొన్ని సందర్భాల్లో అవి నిందితులవి అయి ఉంటున్నాయని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. తప్పనిసరిగా కూల్చివేయాల్సి వస్తే అదే చివరి మార్గం తప్ప మరో మార్గం లేదని నిరూపించాలని పేర్కొంది. అనివార్యంగా నేలమట్టం చేయాల్సిన ఇళ్ల విషయంలోనూ ‘రూల్ ఆఫ్ లా’ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అది ప్రభుత్వ అధికారుల విధి కాదు నిందితుడి నేరం రుజువు కాక ముందే అతడిని శిక్షించే విధానాన్ని న్యాయవ్యవస్థ హర్షించదని, రాత్రిపూట మహిళలను, పిల్లలను వీధుల్లో నిలబడేలా చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉద్ఘాటించింది. ఏదైనా కేసులో ఒక వ్యక్తిని దోషిగా తేల్చడం, జరిమానా లేదా శిక్ష కింద అతడికి ఇంటిని కూల్చడం ప్రభుత్వ అధికా రుల విధి కాదని వెల్లడించింది. ముందస్తుగా షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటినీ కూల్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి దేశం మొత్తానికి వర్తిస్తాయని పేర్కొంది. అయితే.. రహదారులు, నదీ తీరాల్లోని నిర్మాణాలు, అక్రమ భవనాలు లేదా నిర్మాణాలపై తీసుకునే చర్యలకు ఈ మార్గదర్శకాలు వర్తించబోవని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది. ఒక్కరు చేసే నేరానికి కుటుంబమంతటికీ శిక్షా? → నిందితుడి నేరం రుజువు కాకముందే అతడిని శిక్షించవద్దు → మహిళలు, పిల్లలను రాత్రిపూట రోడ్డున పడేయొద్దు → ముందస్తు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటినీ కూల్చడానికి వీల్లేదు. → నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇచ్చి తీరాలి→ మార్గదర్శకాలు పాటించకపోతే అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవు→ సుప్రీంకోర్టు కీలక తీర్పు → కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు → ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించకూడదు. అధికారులు నోటీసు ఇచ్చాక 15 రోజుల్లోగా లేదా స్థానిక మున్సిపల్ చట్టాలు నిర్దేశించిన సమయంలోగా స్పందించాల్సి ఉంటుంది. నోటీసు అందుకున్న వ్యక్తి వివరణ ఇవ్వాలి. → ఇంటి సొంతదారు/అందులో ఉంటున్న వ్యక్తికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా నోటీసు పంపించాలి. అదనంగా నోటీసు కాపీని ఇంటి బయట స్పష్టంగా కనిపించేలా అతికించాలి. భవనాన్ని ఎందుకు కూల్చుతున్నారో ఆ నోటీసులో వివరించాలి. కూల్చివేత చర్యను నిరోధించడానికి ఏం చేయవచ్చో కూడా అదే నోటీసులో చెప్పాలి. → నోటీసు జారీ చేయడానికి, రిజిస్టర్డ్ పోస్టులో పంపడానికి, ప్రతిస్పందనను స్వీకరించడానికి, షోకాజ్ నోటీసుల వివరాలు, ఇతర ఉత్తర్వుల కోసం పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు మూడు నెలల్లోగా ఒక డిజిటల్ పోర్టల్ సిద్ధం చేసుకోవాలి. → ప్రజల వినతులు తెలుసుకోవడానికి, తుది ఉత్తర్వులు జారీ చేయడానికి ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. → అనధికారిక కట్టడాన్ని తొలగించడానికి లేదా పూర్తిగా కూల్చివేయడానికి 15 రోజుల సమయం ఇవ్వాలి. → ఇళ్ల కూల్చివేత వీడియోను చిత్రీకరించాలి. వీడియో రికార్డ్‌ను భద్రపర్చాలి. → సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దోషిగా తేలితే జరిమానా లేదా చట్ట ప్రకారం శిక్ష తప్పదు. → కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటిని కూల్చివేసినట్లు తేలితే సంబంధిత అధికారులు అందుకు బాధ్యత వహించాలి. ఆ ఇంటిని వారి సొంత ఖర్చులతోనే మళ్లీ నిర్మించాల్సి ఉంటుంది. అదనంగా డ్యామేజీ ఖర్చులు చెల్లించాలి. → ఏదైనా ఆస్తిపై బుల్డోజర్ చర్య తీసుకునే ముందు, వ్యక్తిగతంగా విచారించడానికి ఆ ఆస్తి యజమానికి అవకాశం కలి్పంచాలి. అంతేకాదు.. ఉత్తర్వులపై అధికారులు మౌఖిక సమాచారం ఇవ్వాలి. → బుల్డోజర్ చర్యపై నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనేది జిల్లా మేజి్రస్టేట్(డీఎం) చూడాలి. నిబంధనలు పాటించకుండా ఇళ్లు, భవనాలను కూల్చివేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి. → చట్టం ప్రకారం పౌరులందరినీ సమానంగా చూడాలి. ఇంటిని కూల్చడమనేది ప్రాథమిక హక్కుకు విరుద్ధం. ఒక నిర్మాణాన్ని కూల్చివేయాలంటే నిందితుడి నేపథ్యాన్ని, అతని సామాజికవర్గాన్ని పట్టించుకోవద్దు. → సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తెలియజేస్తూ జిల్లా మేజి్రస్టేట్లు, స్థానిక అధికారులకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సర్క్యులర్లు జారీ చేయాలి. Supreme Court says it has dealt with the separation of powers as well as how executive and judicial wings work in their respective spheres. Adjudicatory functions are entrusted to the judiciary and the executive cannot replace the judiciary in performing its core function, says…— ANI (@ANI) November 13, 2024 -
కూల్చివేత బాధితులు కోర్టుకు రావొచ్చు
న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసినా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ అధికారులు దీన్ని ఉల్లంఘించారని, ఈ మూడు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. పిటిషనర్‌కు కూల్చివేత బాధితుడు కాదని, ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటితో ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం పేర్కొంది. తేనెతుట్టను కదల్చాలని తాము అనుకోవడం లేదని, కూల్చివేత బాధితులు ఎవరైనా ఉంటే కోర్టుకు రావొచ్చని స్పష్టం చేసింది. నిందితులు అయినంత మాత్రాన వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూల్చవద్దని సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయానికి బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. దీనిపై తాముదేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు జారీచేస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. అది గుడి అయినా, మసీదు అయినా కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కూల్చివేత చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాన్పూర్, హరిద్వార్, జైపూర్లలో అధికారులు కూల్చివేతలకు దిగారని, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఒకచోట అయితే ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కూల్చివేతకు పాల్పడ్డారని తెలిపారు. ఫుట్‌పాత్ ఆక్రమణనను మాత్రమే తొలగించారని, పిటిషనర్‌కు నేరుగా దీనితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకు వాస్తవాలు తెలియవని ఉత్తరప్రదేశ్ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషనర్ సుప్రీంకోర్టుకు వచ్చారని అన్నారు. ఈ కూల్చివేతలతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి... పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పైన పేర్కొన్న మూడు ఘటనల్లో ఇద్దరు జైళ్లో ఉన్నారని పిటిషనర్ తెలుపగా.. వారి కుటుంబీకులు కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం బదులిచి్చంది. -
సీఎం యోగి ‘ఆపరేషన్ బుల్డోజర్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయంటూ పరోక్షంగా సీఎం యోగి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. యూపీలో బుల్దోజర్ చర్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకూ ఎలాంటి కూల్చివేతలకు ఉపక్రమించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, వాటిని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. ‘‘వారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని అతిక్రమించి రిస్క్ చేయాలనుకుంటున్నారా?’’అని ఘాటుగా స్పందించింది.ఉత్తరప్రదేశ్ బహ్రైచ్‌లో ‘ఆపరేషన్ బుల్డోజర్’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం(అక్టోబర్22న) విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా బహ్రైచ్ బాధితుల తరుఫున సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదించారు. స్థానిక అధికారులు అక్టోబర్ 13న బహ్రైచ్‌లో ఆపరేషన్ బుల్డోజర్పై నోటీసులు జారీ చేశారు. అనంతరం జరిగిన బుల్డోజర్ చర్యల కారణంగా మత ఘర్షణలు జరిగాయని, ఓ వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ విన్నవించారు.అనంతరం,జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ చర్యను పరోక్షంగా హెచ్చరించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించాలనుకుంటే అది ప్రభుత్వ నిర్ణయం.అయితే, కూల్చివేతలను ఎదుర్కొంటున్న నిర్మాణాలు చట్ట విరుద్ధమైతే, తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది.బహ్రైచ్‌లో ప్రభుత్వ బుల్డోజర్ చర్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టనుంది. విచారణ నేపథ్యంలో ఎలాంటి బుల్డోజర్ చర్యలరకు ఉపక్రమించొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
మతంతో సంబంధం లేదు.. ఆ నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మత విశ్వాసాల కంటే ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాల్లో బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ మంగళవారం విచారణ జరపింది.ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లౌకిక (సెక్యూలర్) దేశమని.. మతాలతో సంబంధం లేకుండా ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్తో చర్యలు అందరికీ ఒక్కటేనని పేర్కొంది. మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని తెలిపిన ధర్మాసనం.. వీటికి ఆన్లైన్ పోర్టల్ కూడా ఉండాలని తెలిపింది. వాటిలో డిజటలైజ్ రికార్డులు అందుబాటులో ఉంచడం ప్రజలు అన్నీ తెలుసుకోగలరని వెల్లడించింది.గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండటమే బుల్డోజర్ చర్యను ఎదుర్కోవడానికి కారణమా అని ధర్మాసనం ఆయన్ను అడగ్గా.. ‘కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ముందే చట్టాన్ని అతిక్రమంచి ఉంటేనే చర్యలు తీసుకొంటాం’ అని తెలిపారు.అలాగే ఒకటీ రెండు సంఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కోరారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఉదంతాల ఆధారంగా కోర్టు ఆదేశాలు జారీ చేడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ..‘ మనది సెక్యూలర్ దేశం. మా మార్గదర్శకాలు మతం, జాతి, వర్గాలకు అతీతంగా ఉంటాయి. అందరికీ వర్తిస్తాయి. ఇక ఆక్రమణల విషయానికి వస్తే మేము ఇప్పటికే చెప్పాం. రోడ్డు, ఫుట్‌పాత్, జలాశయం, రైలు పట్టాపై ఏదైనా మత సంబంధమైన నిర్మాణం ఉంటే అది దర్గా, గుడి, మసీదు, గురుద్వారా ఏదైనా.. ప్రజలకు ఆటంకంగా మారకూడదు. అక్రమ నిర్మాణాల విషయంలో మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటే చట్టం వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించింది. చదవండి:MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఏదైనా నేరంలో ఉండటమే వ్యక్తి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడానికి ఆధారమా..? అని ఆయన్ను బెంచ్ ప్రశ్నించింది. దీనికి మెహతా స్పందిస్తూ.. ‘‘కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ఇది ముందే జరిగిఉంటేనే చర్యలు తీసుకొంటాం’’ అని పేర్కొన్నారు. ఇక యూన్ రిపోర్టర్ సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ ఇళ్ల లభ్యతపై వాదనలు వినిపించగా.. దీనికి సొలిసిటర్ జనరల్ మెహతా అభ్యంతరం చేశారు.‘ఈ విషయాన్ని అంతర్జాతీయకరించాల్సిన అవసరం లేదని, మన రాజ్యాంగానికి, దేశ న్యాయస్థానాలకు తగినంత శక్తి ఉందన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ ఏజెన్సీ జోక్యం అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.పిటిషనర్లలో ఒకరి తరఫు సీనియర్ న్యాయవాది సియు సింగ్ వాదిస్తూ.. బుల్డోజర్ చర్యను నేరాల నిర్మూలన చర్యగా ఉపయోగించకూడదనేది తన ఏకైక ఉద్దేశమని అన్నారు. మైనారిటీలపై బుల్డోజర్ చర్య చాలా తక్కువగా ఉంటుందని మెహతా అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘వారు ఒకరు ఇద్దరు లేరని.. 4.45 లక్షలు ఉన్నారని తెలిపింది.చివరగా.. కూల్చివేతలకున ఏరారోపణలు ఆధారం కూకూడదని, పౌర నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రమే కూల్చివేతలు జరగాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న గతంలో జారీ చేసిన మధ్యంతరు ఉత్తర్వులను పొడిగించింది -
సరైన దిశలో తొలి అడుగు
కోర్టు నోరు విప్పిందంటే న్యాయం నిలబడుతుందని సామాన్యులకు ఆశ. దేశంలో చట్టాలను తుంగలో తొక్కుతున్న బుల్డోజర్ సంస్కృతిపై మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కాసింతైనా సంతోషం కలిగిస్తున్నది అందుకే. అనేక రాష్ట్రాలలో క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును ఎదుర్కొంటున్న నిందితులు, వారి కుటుంబ సభ్యుల ప్రైవేట్ గృహాలు, ఆస్తు లపై బుల్డోజర్లను నడిపిస్తూ... ‘దాన్ని ఘనకార్యంగా పేర్కొంటూ, సమర్థించుకుంటున్న’ వైఖరి పాలకుల సాక్షిగా పెచ్చుమీరుతోంది. ఈ పరిస్థితుల్లో తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 1 దాకా దేశవ్యాప్తంగా ఈ అడ్డగోలు కూల్చివేతలన్నిటికీ సుప్రీమ్ కోర్ట్ అడ్డుకట్ట వేయడం విశేషం. అదే సమ యంలో నీటి వసతులు, రైల్వే లైన్లకు అడ్డుగానూ, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ స్థలాల్లోనూ సాగిన దురా క్రమణలనూ, అనధికారిక నిర్మాణాలనూ కూల్చేందుకు అభ్యంతరం లేదని సుప్రీమ్ పేర్కొంది. అలాగే, కూల్చివేతలపై దేశవ్యాప్తంగా అమలయ్యేలా నిర్ణీత మార్గదర్శకాల్ని రూపొందించాలన్న కోర్ట్ ప్రతిపాదన హర్షణీయం. ఇన్నాళ్ళ తరువాత ఇప్పటికైనా ఇది సరైన దిశలో సరైన అడుగు.యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్‌లో 2017లో ఈ బుల్డోజర్ న్యాయానికి బీజం పడింది. ఆ తరువాత ఇది అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలకు పాకింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఇప్పటికి 4.5 లక్షల దాకా గృహాలు ఇలా నేలమట్టమయ్యాయని అంచనా. ఇకపై చట్టవిరుద్ధంగా ఒక్క కూల్చివేత జరిగినా అది పూర్తిగా రాజ్యాంగ విధానానికే విరుద్ధమని కోర్ట్ పేర్కొనడం గమనార్హం. నిజానికి, గతంలోనూ కోర్టులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, వాటి ఆదేశాలను ధిక్కరిస్తూ అనేకచోట్ల కూల్చివేతలు యథేచ్ఛగా సాగాయి. అసలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితుల మీదకు బుల్డోజర్ను నడిపిస్తున్న తీరుపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తప్పు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, నోటీసులైనా ఇవ్వకుండా, నిర్ణీత ప్రక్రియ ఏదీ పాటించకుండా వారికి శిక్షగా బుల్డోజర్ను ఉపయోగించడమేమిటనే ధర్మబద్ధమైన ప్రశ్నలు వినిపిస్తూ వచ్చాయి. పైపెచ్చు, ముస్లిమ్‌ల ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు సాగించడమనేది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలనా విధానంగా తయారవడం ఆందోళన రేపింది. ఈ పరిస్థితుల్లో జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీమ్ కోర్ట్ డివిజన్ బెంచ్ ఈ పద్ధతిని తప్పుబట్టింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రానో, లేదంటే దోషి అయినంత మాత్రానో వారి ఇంటిని కూల్చేయవచ్చా? అందుకు చట్టం అనుమతిస్తుందా? లేదు కదా! ఆ మాటే సుప్రీమ్ అంటోంది. పైగా ఇంట్లో ఎవరో ఒకరు నేరం చేస్తే, కూల్చివేతలతో ఆ కుటుంబం మొత్తానికీ శిక్ష విధించడం ఏ రకంగా సబబు? ప్రభుత్వ పాలన నిర్వహించే కార్యనిర్వాహక వ్యవస్థే జడ్జిగా మారి, శిక్షించవచ్చా? ఆక్రమణలనూ, అనధికారిక నిర్మాణాలనూ తొలగించేందుకు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక చట్టాలు అనుమతిస్తున్నాయి. కానీ, వాటిని ప్రతిపక్షాల పీక నొక్కేందుకూ, నిర్ణీత వర్గాలపై ప్రతీకారేచ్ఛకూ సాధనంగా మార్చుకోవడంతోనే అసలు సమస్య. గొంతు విప్పిన భార తీయ ముస్లిమ్‌లపై ఉద్దేశపూర్వకంగా సాగుతున్న దాడిలో భాగమే ఈ కూల్చివేతలని చివరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం పేర్కొనే పరిస్థితి వచ్చిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ బుల్డోజర్ న్యాయం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో సాగుతున్నా, అన్ని చోట్లా ఒక అంశం మాత్రం సర్వసాధారణం. అది ఏమిటంటే – గతంలో కోర్టులిచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా, నిర్ణీత ప్రక్రియ అంటూ లేకుండానే ఈ కూల్చివేతలు కొనసాగడం! దురాక్రమణ లకు వ్యతిరేకంగా ఉద్యమం అంటూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ లాంటి చోట్ల ఇటీవలి కూల్చివేతల్లోనూ చట్ట ఉల్లంఘన నిర్భీతిగా సాగింది. గుజరాత్, అస్సామ్, త్రిపురల్లో సైతం కూల్చివేతల పర్వానికి కట్టడి లేకుండా పోయింది. అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోందనే భావన కల్పిస్తూ, రాజకీయ లబ్ధి పొందడం అధికార పార్టీల వ్యూహం. దానిలోని మతపరమైన కోణాన్ని కప్పిపుచ్చడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. ఈ బుల్డోజర్సంస్కృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం జోక్యానికి ఇంతకాలం పట్టడం విచారకరమే. అయితే, ఇప్పుడిక పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘విశాఖ’ మార్గదర్శకాలు చేసినట్టుగానే దీనిపైనా అఖిల భారత స్థాయిలో కోర్టు మార్గదర్శకాలు ఇవ్వనుండడం ఒకింత ఊరట. అనధికారిక నిర్మాణాల గుర్తింపు, నోటీసులివ్వడం, వాదనలు వినడం, అనంతరం చట్టబద్ధంగా కూల్చివేతలు జరపడం... ఈ ప్రక్రియ అంతటికీ దేశవ్యాప్తంగా ఒకే విధమైన నియమావళి ఉండడం కచ్చితంగా మంచిదే. ఇటీవలి కూల్చివేతల డేటాను నిశితంగా సమీక్షిస్తే అనేక లోపాలు కనిపిస్తాయి. అందుకే, ఈ అంశంపై సంబంధిత వర్గాల నుంచి సూచనలు కోరుతున్న కోర్ట్ రేపు మార్గదర్శకాల రూపకల్పనలోనూ జాగ్రత్తగా వ్యవహరించడం కీలకం. మత ఘర్షణలు, ఆ వెంటనే సాగే కూల్చి వేతల మధ్య సంబంధాన్ని కప్పిపుచ్చేందుకు పాలకులు ఎత్తులు వేయడం తరచూ చూస్తున్నాం. ఆ పన్నాగాలు పారనివ్వకుండా మార్గదర్శకాల తయారీ అవసరం. అలాగే, ఎప్పుడో నోటీసులు ఇచ్చా మని మభ్యపెట్టేందుకు వెనకటి తేదీలతో కాగితాలు చూపించి, పాలనా యంత్రాంగం ఇష్టారీతిన సాగించే కూల్చివేతలకు చెక్ పెట్టాలి. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగే ఏ చర్యలనూ అనుమతించని రీతిలో నియమావళిని కట్టుదిట్టంగా రూపొందించాలి. ఆదేశాల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించి, కోర్టు ధిక్కారం కింద కఠిన చర్యలు చేపట్టాలి. ప్రజలెనుకున్న పాలకులు తామే జడ్జీలుగా, తామే శిక్షలు అమలు చేసేవారిగా ప్రవర్తిస్తే అది పౌరుల ప్రాథమికహక్కులకే భంగకరం. -
బుల్డోజర్లకు బ్రేక్
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ ఒకటో తేదీదాకా నిందితులతో సహా ఎవరి ఇళ్లనూ కూల్చవద్దని ఆదేశించింది. అయితే రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే స్థలాలు, తదితర ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను నిరభ్యంతరంగా తొలగించవచ్చని తెలిపింది. తమ ఆదేశాలు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు వర్తించవని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచి్చంది. చట్టవిరుద్ధంగా ఒక్క కూలి్చవేత చోటుచేసుకున్నా.. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దనే ధర్మాసనం ఆదేశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థల చేతులను ఇలా కట్టేయలేరని అన్నారు. అయినా ధర్మాసనం తమ ఆదేశాలపై వెనక్కి తగ్గలేదు. కూల్చివేతలు రెండు వారాలు ఆపితే ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించింది. 15 రోజుల్లో ఏమీ జరిగిపోదని పేర్కొంది. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తి పాత్ర పోషించలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అధికారవర్గాలను కూలి్చవేతలు ఆపివేయమని తాను కోరలేనని తుషార్ మెహతా నివేదించగా.. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142 కింద సంక్రమించిన ప్రత్యేక అధికారాల మేరకు.. కూలి్చవేతలు నిలిపివేయమని ఆదేశాలు జారీచేశామని తెలిపింది. పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూలి్చవేస్తున్నారని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. కూలి్చవేతలపై తప్పుడు అభిప్రాయాన్ని వ్యాప్తిలోకి తెచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘తాను ఒక నిర్దిష్ట మతానికి చెందినందువల్లే తన నిర్మాణాలను కూలి్చవేశారని ఒకరు పిటిషన్ వేశారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూల్చివేతకు దిగిన ఒక్క సంఘటనను ధర్మాసనం దృష్టికి తెమ్మనండి. ప్రభావిత పక్షాలేవీ కోర్టును ఆశ్రయించలేదు. ఎందుకంటే తమకు నోటీసులు అందాయని, తమవి అక్రమ కట్టడాలని వారికి తెలుసు’ అని తుషార్ మెహతా వాదించారు. బుల్డోజర్లు ఆగవని ఎలా అంటారు? సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా కూలి్చవేతలను నిలిపివేయాలని, ఈ అంశంలో మార్గదర్శకాలు జారీచేస్తామని సుప్రీంకోర్టు చెప్పినా.. కొందరు ధిక్కార ప్రకటనలు చేయడం పట్ల జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అయినా బుల్డోజర్లు ఆగవని, స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందనే దాన్ని బట్టే ఇది నిర్ణయమవుతుందని ప్రకటనలు చేశారు. వీటిపై ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తున్నాం. కూలి్చవేతలపై మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాక.. బుల్డోజర్ల సంస్కృతిని గొప్పగా, ఘనతగా చెప్పుకోవడాన్ని ఎలా నిరోధించాలనే విషయంలో మీరు మాకు సహాయపడండి’ అని తుషార్ మెహతాకు సూచించింది. నిందితుడు అయినంత మాత్రాన ఇళ్లు కూల్చేస్తారా? ఒకవేళ అతను దోషిగా తేలినా సరే.. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూలి్చవేతలకు దిగలేరు. ఇదెక్కడి బుల్డోజర్ న్యాయమని సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుల్డోజర్ యాక్షన్‌పై స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాలను ఆదేశించింది.దేశంలోని ప్రేవేటు స్థలాల్లో అనధికారిక బుల్డోజర్ చర్యను అక్టోబర్ 1 వరకు నిలిపివేయాలని తెలిపింది. అయితే ఈ తీర్పు వల్ల ఇప్పటికే కూల్చివేసేందుకు ప్రక్రియ పూర్తయిన పనులు ప్రభావితం కావచ్చని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేయగా.. దీనిని న్యాయస్థానం తోసిపుచ్చింది. తదుపరి విచారణ వరకు కూల్చివేతలు ఆపడం వల్ల.. స్వర్గమేమి ఊడిపడదంటూ (పెద్ద నష్టం ఏం జరగదని) జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, చెరువులు, ఇతర వాటిపై ఎలాంటి అనధికార నిర్మాణాలకు తమ ఆదేశాలు వర్తించవని కోర్టు పేర్కొంది. వీటిని ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది.‘తదుపరి తేదీ వరకు ఈ కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూదు. అయితే బహిరంగ వీధులు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక నిర్మాణాలపై చర్యలకు ఈ ఉత్తర్వులు వర్తించవు’ అని కోర్టు స్పష్టం చేసింది.కాగా వివిధ నేరాలకు పాల్పడిన నిందితుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చివేతలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు వివిధ రాష్ట్రాలు చేపట్టిన ‘బుల్డోజర్ చర్యల’పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కూల్చివేత డ్రైవ్‌లను సవాలు చేస్తూ దాఖలైన వరుస పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజా ఉత్తర్వులు వెలువరించింది.అయితే దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది. వరుసగా జమ్మూ కశ్మీర్, హర్యానా మహారాష్ట్ర, జార్ఖండ్‌కు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈసీకి నోటీసీలు ఇస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ రాష్ట్రాల్లో చాలా చోట్ల బీజేపీ అధికారంలో ఉంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సీయూ సింగ్ వాదనలు వినిపించారు. -
‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై అఖిలేశ్‌కు సీఎం యోగి కౌంటర్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన ‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. బుల్డోజర్ పేరుతో అఖిలేశ్ యాదవ్ బెదిరింపులను బుధవారం యోగి తోసిపుచ్చారు. బుల్డోజర్ను నడపడానికి ధైర్యం, తెలివి దృఢ సంకల్పం అవసరమని అన్నారు. ఎవరుపడితే వాళ్లు నడపలేరని, ముఖ్యంగా బుల్డోజర్ నడిపే శక్తి అఖిలేశ్ యాదవ్‌కు లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని సీఎం యోగి మాట్లాడారు. ‘‘బుల్డోజర్ను నడపడానికి అందరికీ చేతులు సరిపోవు. వాటిని నడపాలంటే.. హృదయం, మనస్సు రెండూ అవసరం. బుల్డోజర్ లాంటి సామర్థ్యం, దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే వాటిని ఆపరేట్ చేయగలరు. అల్లరిమూకల ముందు మాట్లాడేవారు కనీసం బుల్డోజర్ ముందు నిలబడలేరు’’ అని అన్నారు. ఇప్పటిదాకా ‘టిపు’గా ఉన్న అఖిలేశ్ యాదవ్ కొత్తగా సుల్తాన్‌లా మారడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇక.. ‘టిపు’ అనేది అఖిలేశ్ యాదవ్ నిక్ నేమ్‌గా తెలుస్తోంది.#WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath speaks at the distribution of jobs appointment letters, he says, "...Not everyone's hands can fit on a bulldozer...Iske liye dil aur dimaag dodo chahiye. Bulldozer jaise shamta aur pratigya jismein ho wahi bulldozer chala sakta… pic.twitter.com/VpbzY8BQV9— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 4, 2024ఇదిలా ఉండగా.. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ.. తాము 2027లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని బుల్డోజర్లను సీఎం యోగి సొంత నియోజకర్గమైన గోరఖ్‌పూర్‌కు పంపిస్తామని అన్నారు. -
సాక్షి కార్టూన్: 04-09-2024
-
ఇదెక్కడి బుల్డోజర్ న్యాయం?
సాక్షి, న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓ వ్యక్తి నిందితుడు అయినంత మాత్రాన∙అతడి ఇల్లు కూల్చేస్తారా? అని నిలదీసింది. పలు రాష్ట్రాల్లోని బుల్డోజర్ సంస్కృతిపై అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులైన వారి ఇళ్లను కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యలు పరిష్కరించడానికి బుల్డోజర్ న్యాయం సరికాదని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంది. ‘నిందితుడైనంత మాత్రాన అతని ఇల్లు కూల్చేస్తారా? ఒకవేళ అతన్ని దోషిగా న్యాయస్థానం తేలి్చనా.. ఇల్లు కూల్చడానికి వీల్లేదు. దానికి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పలు రాష్ట్రాల్లో ఇళ్ల కూలి్చవేతపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనా«థన్ల ధర్మాసనం విచారించింది. ‘‘ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఇల్లు ఎందుకు కూల్చివేయాలి. దోషి అయినప్పటికీ ఇల్లు కూలి్చవేయలేం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. దీంతోపాటు అనధికార నిర్మాణాలను, ఆక్రమణలను కోర్టు రక్షించదని, అయితే వీటికి కొన్ని మార్గదర్శకాలు అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు అందజేయాలని ఇరుపక్షాలను ధర్మాసనం కోరింది. ఆయా ప్రతిపాదనలు సీనియర్ న్యాయవాది నచికేత జోషికి సమరి్పంచాలని, వాటిని క్రోడీకరించి కోర్టుకు అందజేయాలని సూచించింది. నిందితుల స్థిరాస్తుల ధ్వంసాన్ని అడ్డుకోవడానికి తాము అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపింది. రోడ్లను ఆక్రమిస్తే గుడులైనా వదలం.. ఏదైనా నేరంలో ప్రమేయం ఉన్నంత మాత్రాన.. అతని స్థిరాస్తి కూల్చివేతకు అది భూమిక కాబోదని ఇదివరకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు. మున్సిపల్ నిబంధనలను లేదా అక్కడి ప్రాధికార సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తేనే.. కూలి్చవేతలు ఉంటాయని అందులో స్పష్టం చేశామని యూపీ తరఫున హాజరైన మెహతా తెలిపారు. యజమాని క్రిమినల్ కేసుల్లో నిందితుడనే కారణంతో ఏ స్థిరాస్తిని కూలి్చవేయబోమన్నారు. ‘మీరు ఇదే వాదనకు కట్టుబడి ఉన్నామంటే.. మేము దీన్ని రికార్డు చేసుకుంటాం. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేస్తాం. రహదారులపై ఎలాంటి ఆక్రమ నిర్మాణాన్ని, ఆక్రమణలనూ మేము రక్షించబోవడం లేదు. రహదారులపై గుడులున్నా వదిలిపెట్టబోం’ అని ధర్మాసనం పేర్కొంది. ‘కూ లి్చవేతలు చట్టానికి లోబడి ఉండాలి. కానీ చట్టాన్ని అతిక్రమించి జరగడమే చూస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 17కు వాయిదా వేసింది. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. అక్రమ కట్టడాలపై బుల్డోజర్
దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందడానికి కారణమైన ని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం బుల్డోజర్ చర్యను ప్రారంభించింది. కాలువలు, డ్రైనేజీలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసే పనులు చేపట్టారు.కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ ప్రాంతంలో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడాలను, పాత్‌వేలను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు. డ్రైనేజీలోకి నీరు వెళ్లకుండా రహదారులపై అడ్డుగా నిర్మించిన సిమెంట్ బ్లాక్స్‌ను పొక్లెయిన్లతో సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ బుల్డోజర్ చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లో రావూస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు.#WATCH | Earth movers put into action to remove encroachment over drains in Delhi's Old Rajinder Nagar after the incident of death of 3 UPSC aspirants due to drowning in an IAS coaching institute pic.twitter.com/NR6sjw5a7b— ANI (@ANI) July 29, 2024 -
పూజా ఖేద్కర్ ఇంటిపై బుల్డోజర్ చర్య
ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. అధికార దుర్వినియోగం, అధికారులపై బెదిరింపులు, సివిల్స్ ఎంపిక విషయంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించడం, వయసు వ్యత్యాసం, ఫేక్ అడ్రస్.. ఇలా ప్రతిచోటా అధికారులను మభ్యపెట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.తాజాగా పూజా ఖేద్కర్ కుటుంబానికి చెందిన పుణెలోని నివాసంపై అధికారులు బల్డోజర్ చర్య పేపట్టారు. ఆమె నివాసం ఇంటికి ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలను పుణె మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్తో కూల్చేసింది. ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌ను ఆక్రమించి చెట్లు, పూల మొక్కలు పెంచారు. దీనిపై దీనికి సంబంధించి పీఎంసీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అధికారులు వెల్లడించారు. #WATCH | Maharashtra: Action being taken against illegal encroachment at IAS trainee Pooja Khedkar's Pune residence. pic.twitter.com/xvBQhxxtIO— ANI (@ANI) July 17, 2024 కాగా పుణెలో అదనపు కలెక్టర్‌గా శిక్షణా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే ఐఏఎస్‌లకు ఈ సౌకర్యాలు ఉండవు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్కు బదిలీ చేసింది. మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 ఏప్రిల్‌లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు తప్పించుకు వచ్చారు. చివరికి ఆరోసారి పిలవగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది.ఇక తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పూజా ఖేడ్కర్ ఎంబీబీఎస్‌లో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. నాన్ క్రిమీలేయర్ ఓబీసీ ధ్రువీకరణపత్రంతో పుణెలోని ఓ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారని తెలిసింది. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. దీనిని మెడికల్ కాలేజీ కూడా ధ్రువీకరించింది.పూజాపై వివాదాలు ముదరడంతో ప్రభుత్వం ఆమెపై చర్యలు మొదలుపెట్టింది. ఆమెను శిక్షణ విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
టోల్ అడిగినందుకు బుల్డోజర్తో విధ్వంసం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్లు దూకుడు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని హపూర్ జిల్లాలో మంగళవారం(జూన్11)బుల్డోజర్ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పిల్కువా ప్రాంతం ఛాజార్సి టోల్ బూత్ వద్ద ఉదయం 8.30 గంటలకు ఒక బుల్డోజర్ వచ్చి ఆగింది. టోల్ ప్లాజా సిబ్బంది బుల్డోజర్ డ్రైవర్‌ను టోల్ ఛార్జీలు చెల్లించాలని అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన బుల్డోజర్ డ్రైవర్ టోల్ ప్లాజాకు చెందిన రెండు బూత్‌లతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. బుల్డోజర్ వి ధ్వంసాన్ని టోల్‌ప్లాజా సిబ్బంది వీడియో తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బుల్డోజర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. బుల్డోజర్ను స్వాధీనం చేసుకున్నారు. -
CM Yogi Adityanath Birthday: యోగి ఆదిత్యనాథ్‌కు ఆ పేరెలా వచ్చిందంటే..
జూన్ 5.. అంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు. నేటితో ఆయనకు 52 ఏళ్లు నిండాయి. దేశంలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా యోగి ఆదిత్యనాథ్‌కు పేరుంది. అభిమానులు ఆయనను యోగి బాబా, బుల్డోజర్ బాబా అని కూడా పిలుస్తారు. యోగి ఆదిత్యనాథ్ రెండుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో పాటు ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఉన్నారు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలో జన్మించారు. యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్. యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఫారెస్ట్ రేంజర్. సీఎం యోగి గణితంలో బీఎస్సీ పట్టా పొందారు. 1990లో ఏబీవీపీలో చేరారు. 1993లో గోరఖ్‌నాథ్ పీఠానికి చెందిన మహంత్ అద్వైత్నాథ్తో పరిచయం ఏర్పడింది. 1994లో అజయ్ సింగ్ బిష్త్ సన్యాసం స్వీకరించారు. నాథ్ శాఖకు చెందిన సాధువుగా మారారు. ఆ తర్వాత ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్‌గా మారింది. 1994లో అద్వైత నాథ్ తన వారసునిగా యోగి ఆదిత్యనాథ్‌ను ప్రకటించారు.యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా 1998లో గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ టికెట్‌పై తన 26 ఏళ్ల వయసులో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014లలో గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మహంత్ అద్వైత్నాథ్ 2014లో కన్నుమూశారు. అనంతరం యోగి గోరఖ్‌నాథ్ పీఠానికి అధ్యక్షులయ్యారు.2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితాలు వెలువడే సమయంలో యోగి ఆదిత్యనాథ్ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బీజేపీ నేతలు ఎన్నికల ఫలితాల విడుదల వరకూ ఆగాలని ఆయనను కోరారు. ఆ సమయంలో మనోజ్ సిన్హా, కేశవ్ మౌర్య సహా పలువురు బీజేపీ నేతలు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యనాథ్‌ను ఢిల్లీకి పిలిపించి, యూపీలో అధికారం చేపట్టాలని కోరింది.యోగి సీఎం పదవి చేపట్టగానే ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న శాంతిభద్రతలు. దీనికి పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ఆయన పోలీసు అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. యోగి నాయకత్వంలో 2022లో కూడా యూపీలో బీజేపీ విజయం సాధించింది. సీఎం యోగి బుల్డోజర్లతో నేరస్తుల ఇళ్లపై దండెత్తాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. అందుకే ఆయనకు బుల్డోజర్ బాబా అనే పేరు వచ్చిందంటారు. -
యూపీ సీఎం బాటలో ఎంపీ సీఎం.. నిందితుని ఇంటిపైకి బుల్డోజర్!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర పాలనలో అనుసరిస్తున్న విధానాలను ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఫాలో చేస్తున్నారు. ఇందు తాజాగా ఒక ఉదాహరణ మన ముందుకొచ్చింది.మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో మైనర్ బాలిక హత్యకేసులో ప్రధాన నిందితుని ఇంటిపైకి ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్ దూసుకెళ్లింది. నిందితుని ఇంటిని బుల్డోజర్ సాయంతో పూర్తి స్థాయిలో కూల్చివేశారు. ఈ ఉదంతం బిర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని దామోహ్ మేట్లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తన స్నేహితునితో కలిసి మేటీ గ్రామానికి చెందిన మైనర్ బాలికను హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ఒక నర్సరీలో పడేశారు. స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనికి ముందు ఆ బాలిక అమ్మమ్మ మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఒక బావిలో లభ్యమైంది. ఈ కేసులో ఆ బాలిక (మృతురాలు) కోర్టులో మే 17న సాక్ష్యం చెప్పాల్సి ఉండగా, ఇంతలోనే హత్యకు గురయ్యింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనాభివృద్ధి మండలి నిందితులను ఉరితీయాలని, వారి ఇంటిని బుల్డోజర్తో కూల్చివేయాలని డిమాండ్ చేసింది.ఈ నేపధ్యంలో నిందితుని తండ్రి యశ్వంత్‌కు చెందిన ఇంటిని అధికారులు కూల్చివేశారని తహసీల్దార్ రాజు నామ్‌దేవ్ తెలిపారు. ఆ ఇంటిని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారని ఆయన పేర్కొన్నారు. మైనర్ బాలికను వేధించడం, హత్య చేయడం లాంటి దారుణమైన నేరాలకు పాల్పడిన నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని నామ్‌దేవ్ తెలిపారు. -
Narendra Modi: ప్రతిపక్షాలు గెలిస్తే అయోధ్యపైకి బుల్డోజర్లే
బారాబంకీ/ఫతేపూర్/హమీర్పూర్: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తాయని, బాలరాముడు మళ్లీ టెంట్‌లోకి వెళ్లాల్సి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బుల్డోజర్లను ఎక్కడికి పంపించాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ రెండు పారీ్టలకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో దశ పోలింగ్ జరుగుతున్నకొద్దీ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పేకమేడలా కూలిపోతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము హ్యాట్రిక్ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో పేదలకు, యువతకు, మహిళలకు, రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ, ఫతేపూర్, హమీర్‌పూర్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జూన్ 4వ తేదీ ఇక ఎంతోదూరంలో లేదని, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న సంగతి కేవలం మనకే కాదు, మొత్తం ప్రపంచానికి తెలుసని స్పష్టంచేశారు. ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగాల్లోని విశేషాలివీ.. ఎన్నుకోవాల్సిన ఏకైక పార్టీ బీజేపీ ‘‘దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అంకితమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. మనకు మంచి చేసే ఎంపీలు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి. కేవలం మోదీని దూషిస్తూ ఐదేళ్లు కాలం గడిపే ఎంపీలు మనకు అవసరమా? 100సీసీ ఇంజన్‌తో 1,000 సీసీ వేగం సాధ్యమా? బలమైన ప్రభుత్వమే అత్యంత వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదు. అలాంటి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. నిజంగా దేశ ప్రగతిని కోరుకుంటే మనం ఎన్నుకోవాల్సిన ఎకైక పార్టీ బీజేపీ. అయోధ్య రామమందిరంపై సమాజ్‌వాదీ పార్టీ పెద్దలు అనుచితంగా మాట్లాడారు. రామాలయం విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తిరగదోడాలని కాంగ్రెస్ భావిస్తోంది. వారికి సొంత కుటుంబ ప్రయోజనాలు, రాజకీయ అధికారమే ముఖ్యం. కాంగ్రెస్–సమాజ్‌వాదీ పారీ్టలకు అధికారం అప్పగిస్తే అయోధ్యలో అలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారు. రామ్‌లల్లా మళ్లీ టెంట్‌లోకి పంపిస్తారు. ఆ రెండు పారీ్టలకు ఓటు బ్యాంకు కంటే ఏదీ ఎక్కువ కాదు. రిజర్వేషన్లపై ప్రతిపక్ష నేతలు దారుణంగా మాట్లాడుతున్నారు. మొత్తం రిజర్వేషన్లను ముస్లింలకే ఇవ్వాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి(లాలూ ప్రసాద్ యాదవ్) అన్నారు. అంటే దళితులు, గిరిజనులు, ఓబీసీలకు అన్యాయం చేయాలా? వారు ఉన్నత స్థాయికి చేరుకోవద్దా?’’ అని మోదీ ప్రశ్నించారు. -
ఎన్నికల గుర్తుల్లో బుల్డోజర్ను ఎందుకు తొలగించారు?
దేశంలో లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఇదిలావుండగా ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఎన్నికల గుర్తుల జాబితా నుంచి బుల్డోజర్ చిహ్నాన్ని తొలగించింది. అయితే దీని వెనుక గల నిర్దిష్ట కారణాన్ని ఎన్నికల సంఘం వెల్లడించలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బుల్డోజర్ ఒక ప్రత్యేక వర్గానికి గుర్తింపుగా మారిందనే భావన అందరిలో ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే దానిని తొలగించాల్సి వచ్చిందని తెలుస్తోంది. కాస్మోటిక్స్, పిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో సహా పలు వస్తువులను ఎన్నికల గుర్తుల జాబితాలో చేర్చారు. ఈ జాబితాను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇందులో 190 ఎన్నికల గుర్తులు ఉన్నాయి. వీటిలో బూట్లు, చెప్పులు, సాక్స్‌లు కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్, ముత్యాల హారం, చెవిపోగులు, ఉంగరం మొదలైనవాటిని జోడించారు. ఎన్నికల చిహ్నాల జాబితాలో ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఆపిల్, ఫ్రూట్ బాస్కెట్, బిస్కెట్లు, బ్రెడ్, కేక్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, కొబ్బరి, అల్లం, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఐస్‌క్రీం, జాక్‌ఫ్రూట్, లేడీఫింగర్, నూడుల్స్, వేరుశెనగ, బఠానీలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో వాల్నట్, పుచ్చకాయను కూడా చేర్చారు. అలాగే బేబీ వాకర్, క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్, కలర్ ట్రే బ్రష్, హ్యాండ్ కార్ట్, స్కూల్ బ్యాగ్, టోఫీలు, లూడో, లంచ్ బాక్స్, పెన్ స్టాండ్, పెన్సిల్ బాక్స్, షార్పనర్లు కూడా ఎన్నికల గుర్తుల జాబితాలో ఉన్నాయి. హార్మోనియం, సితార్, ఫ్లూట్, వయోలిన్ కూడా ఈ జాబితాలో కనిపిస్తాయి. కొన్ని ఎన్నికల చిహ్నాలు వాడుకలో లేకుండా పోయాయి. వీటిలో హ్యాండ్ మిల్లు, డోలీ, టైప్‌రైటర్, మంచం, బావి, టార్చ్, స్లేట్, టెలిఫోన్, రోకలి, బ్లాక్ బోర్డు, చిమ్నీ, పెన్ నిబ్, గ్రామోఫోన్, లెటర్ బాక్స్ మొదలైనవి ఉన్నాయి. ఎన్నికల గుర్తులకు సంబంధించిన ఆధునిక పరికరాల జాబితాలో ఎయిర్ కండీషనర్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, మౌస్, కాలిక్యులేటర్, సీసీ కెమెరా, డ్రిల్ మెషిన్, వాక్యూమ్ క్లీనర్, పెన్ డ్రైవ్, బ్రెడ్ టోస్టర్, రిమోట్, స్పానర్, స్టెప్లర్, స్టెతస్కోప్, ఎక్స్టెన్షన్ బోర్డ్, మైక్ , మిక్సర్, స్విచ్ బోర్డ్, సిరంజి, ఫ్రైయింగ్ పాన్, హెడ్ఫోన్లు, హెల్మెట్, రోబోట్, రూమ్ కూలర్, హీటర్ మొదలైనవి ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల చిహ్నాలలో అల్మారా, ఆటో రిక్షా, బెలూన్, బ్యాట్, బ్యాట్, బెల్ట్, బెంచ్, సైకిల్ పంప్, బైనాక్యులర్స్, సెయిలింగ్ బోట్, బాక్స్, ఇటుకలు, బ్రీఫ్‌కేస్, బ్రష్, బకెట్, డీజిల్ పంప్, డిష్ యాంటెన్నా, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ , ప్రెస్, కెటిల్, కిచెన్ సింక్, పాన్, పెట్రోల్ పంప్, ఫోన్ ఛార్జర్, ప్రెజర్ కుక్కర్, పంచింగ్ మెషిన్, కత్తెర, కుట్టు మిషన్, నీటి పాత్ర, సబ్బు డిష్, సోఫా, ఊయల, టేబుల్, టెలివిజన్, ట్యూబ్ లైట్ మొదలైనవి కూడా ఉన్నాయి. -
అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను కూలి్చవేస్తున్నారని, ప్రభుత్వ నిర్వాకం వల్ల నేరగాళ్లు మాత్రం నిక్షేపంగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో తన సోదరుడు రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల మొర ఆలకించే తీరిక పాలకులకు లేదా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులపైకి జీపులు నడిపించి చంపిన నాయకుల ఇళ్లపైకి, మహిళలను వేధించిన దుర్మార్గుల ఇళ్లపైకి, ప్రశ్నాపత్రాలను లీక్ చేసినవారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం లేదని ధ్వజత్తారు. అమాయకుల ఇళ్లు మాత్రమే బల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, రైతులకు అన్యాయం జరుగుతుండడం వల్లే యాత్రలో ‘న్యాయ్’ పదాన్ని చేర్చామన్నారు. ఆదివారం ఆగ్రాలో యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆ పిల్లలు రీల్స్ చూడరు: రాహుల్ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఇక యువత రోజుకు 12 గంటలు మొబైల్ ఫోన్లు చూడక ఏం చేస్తారని రాహుల్ ప్రశ్నించారు. ఆయన శనివారం యూపీలోని సంభాల్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారని యువతను ప్రశ్నించగా 12 గంటలని బదులిచ్చారు. దాంతో రాహుల్ ఈ మేరకు స్పందించారు. సంపన్నులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఫోన్లలో రీల్స్ చూడరని, రోజంతా డబ్బులు లెక్కపెట్టుకొనే పనిలోనే ఉంటారని అన్నారు. శనివారం యూపీలోని మొరాదాబాద్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్, ప్రియాంక -
‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్
మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న బుల్డోజర్ చర్యను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండించింది. బుల్డోజర్ చర్యలు ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్‌గా తయారైందని కోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇల్లును ప్రభుత్వ అధికారులు కూల్చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తప్పు పట్టింది. సరైన విధానాలు అమలు పర్చకుండా నిందితుడి ఇంటిని కూల్చివేయటం సరికాదని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు రాహుల్ లాంగ్రీ.. ఓ వ్యక్తి వద్ద ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిపై బెదింపులకు పాల్పడగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ లాంగ్రీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో తాజాగా రాహుల్ లాంగ్రీ ఇంటిపై ప్రభుత్వ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టి.. అతని ఇంటిని కూల్చేశారు. దీంతో రాహుల్ లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారుల బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా రాధా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తమ ఇంటి పాత యజమాని అధికారులు నోటీసులు పంపారు. తమ వివరణ వినకుండా ఉజ్జయినిలోని తమ ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారని లాంగ్రీ భార్య పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇల్లు అక్రమంగా కట్టింది కాదని.. ఆ ఇంటికి బ్యాంక్‌లో లోన్ కూడా తీసుకున్నామని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇండోర్ బెంచ్ ప్రభుత్వ అధికారుల చేపట్టిన బుల్డోజర్ చర్యలను తప్పుపడుతూ.. నష్టపరిహారంగా లాంగ్రీ భార్య, తల్లికి చెరో రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక..ఈ కేసులో మరింత నష్టం పరిహారం పొందేందుకు పిటిషన్‌దారులు సివిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిహార్‌లో మోదీని ఎదుర్కొంటాం: తేజస్వీ యాదవ్ -
ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్
ముంబై: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా రోడ్డు) మహారాష్ట్ర సర్కార్ బుల్డోజర్ చర్యకు దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేసింది. మీరా రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్‌లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి ఊరేగింపు నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్రలో చేపట్టిన ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్డులో కార్లు, బైక్‌లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు. చదవండి: Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు ఈ ర్యాలీలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్ నిందితుల స్థలాల వద్ద బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. కాగా బుల్డోజర్ యాక్షన్ అనేది ముందుగా ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రారంభించింది. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వంటి వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాలను బుల్డోజర్తో కూల్చివేస్తూ వస్తుంది. తరువాత ఇదే పద్దతిని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుసరిస్తన్నాయి. తాజాగా రాజస్థాన్‌కు బుల్డోజర్ యాక్షన్ వ్యాపించింది. -
ముగ్గురి ప్రాణాలు కాపాడాడు.. ప్రభుత్వం అతని ఇంటిని బుల్డోజర్తో..
చండీగఢ్: నూహ్ జిల్లాలో అల్లర్లు జరిగిన రోజున హిసార్ కు చెందిన రవీందర్ ఫోగట్ తోపాటు అతని స్నేహితులకు ఆశ్రయమిచ్చినందుకు అనీష్ అనే వ్యక్తి ఇంటిని బుల్డోజర్లతో కూల్చేసింది హర్యానా ప్రభుత్వం. అల్లర్లతో అనీష్ కు సంబంధం లేకపోయినా అల్లరిమూకకు ఆశ్రయమిచ్చాడన్న కారణంతో అతని ఇంటిని కూలదోసింది ప్రభుత్వం. నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ బ్రీజ్ మండల్ జలాభిషేక యాటర్ పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక అల్లరి మూక వారిపై రాళ్ల దాడి చేయడంతో భారీ విధ్వాంసానికి తెరలేచింది. ఈ అల్లర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయాల పాలయ్యారు. దాడులు ప్రతిదాడులతో మూడు రోజుల పాటు ఆ ప్రాంతం అట్టుడికింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే నెపంతో అక్కడి ప్రభుత్వం ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లను ఆస్తులను ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే రవీంద్ర ఫోగట్, అతడి స్నేహితులు అల్లర్ల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అనీష్ ఇంటిలోకి చొరబడ్డారు. వారికి ఆశ్రయమిచ్చాడన్న నెపంతో ప్రభుత్వం అనీష్ ఇంటిని బుల్డోజర్తో కూల్చేసింది. ఏ నేపథ్యంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ ట్రీట్మెంట్లో బుల్డోజర్లు ఒక భాగమంతే అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. రవీంద్ర ఫోగట్ తాను ఒక కాంట్రాక్టరునని అల్లరి మూకల దాడి నేపథ్యంలో ఆ రోజున ప్రాణాలు కాపాడుకునే క్రమంలో వారు అనీష్ ఇంటిలో ఆశ్రమ పొందినట్లు చెప్పారు. తన కారు పూర్తిగా ధ్వంసమైందని.. కొద్దిసేపటికి పరిస్థితి సద్దుమణిగాక అనీష్ తన కారులో PWD గెస్ట్ హౌస్ వద్ద తనను డ్రాప్ చేసినట్లు తెలిపారు. తాను చెయ్యని తప్పుకు అనీష్ తన ఇంటిని కోల్పోయాడని వ్యాఖ్యానించారు. ఈ విధంగా అకారణంగా బుల్డోజర్ విధ్వాంసాలకు గురైన వారి సంఖ్య నూహ్ జిల్లాలో అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ కూల్చివేతలపై సీరియస్ అయ్యింది. ఈ సందర్బంగా హైకోర్టు "అధికారం అవినీతికి కారణమైతే సంపూర్ణ అధికారం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందంటూ" లార్డ్ ఆక్టన్ మాటలను కూడా గుర్తు చేసింది. ఇది కూడా చదవండి: నల్లగా ఉంటే భర్త కాకుండా పోతాడా? ఉన్నా భర్తే కదా.. -
Nuh violence: బుల్డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్..
చండీగఢ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగిన తర్వాత అక్కడి ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్‌కు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ చర్యలను నిలిపివేయాలని హర్యానా, పంజాబ్ హైకోర్టులు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. దీంతో బుల్డోజర్తో బవనాల కూల్చివేత చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కూల్చివేత చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్కట సంబంధిత అధికారులను ఆదేశించారు. హర్యానాలో మతపరమైన ఘర్షణలు చెలరేగిన అనంతరం ఈ వ్యవహారాన్ని కోర్టు సుమోటుగా తీసుకుని విచారణ చేపట్టింది. బుల్డోజర్ యాక్షన్‌లో ఇప్పటివరకు 350 గుడిసెలు, 50 సిమెంట్ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే.. ప్రభుత్వ చర్య రాజకీయంగా విమర్శలకు దారితీసింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తాము అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే నాలుగు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. విశ్వ హిందూ పరిషత్ రథయాత్రపై కొందరు అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడంతో హర్యానాలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో స్థానిక దేవాలయంలో ప్రాణాలు కాపాడుకున్నారు. అదే రోజు రాత్రి స్థానికంగా మసీదు దగ్దం కావడం అల్లర్ల తీవ్రతను మరింత పెంచింది. ఇదీ చదవండి: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్.. -
హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్ విధ్వంస ప్రక్రియ
చండీగఢ్: నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. హర్యానాలో మతపరమైన అల్లర్లకు కారణమైన వారికి సంబంధించిన ఇళ్లను బుల్డోజర్తో కూలదోసేందుకు ఉపక్రమించింది హర్యానా పోలీసు శాఖ. ఇప్పటికే మూడు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆదివారం ఈ కార్యక్రమం నాలుగోరోజుకి చేరుకుంది. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. ఇందులో భాగంగా అల్లర్లకు ప్రధాన కారణమైన సహారా హోటల్‌ను కూడా కూల్చివేశారు అధికారులు. జులై 31న విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపుపై కొంతమంది సహారా హోటల్ పైభాగం నుండి రాళ్లు రువ్వడంతో ఈ వివాదం పురుడు పోసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో దగ్గర్లోని దేవాలయంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. అదేరోజు రాత్రి ఆ ప్రాంతంలోని మసీదు దగ్ధం కాగా అక్కడి నుండి గురుగ్రామ్ వరకు వందల కొద్దీ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అల్లర్లలో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారితో సహా ఆరుగురు మరణించగా వందల సంఖ్యలో సామన్యులు గాయపడ్డారు. అల్లర్లకు పాల్పడిన వారిలో చాలామంది అరెస్టులకు భయపడి వేరే ప్రాంతాలకు పారిపోయారు. దీంతో పోలీసులు నిందితులకు సంబంధించిన ఆస్తులను లక్ష్యం చేసుకుని అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. #WATCH | Haryana | A hotel-cum-restaurant being demolished in Nuh. District administration says that it was built illegally and hooligans had pelted stones from here during the recent violence. pic.twitter.com/rVhJG4ruTm — ANI (@ANI) August 6, 2023 ఇది కూడా చదవండి: అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్ -
హరియాణాలో ఆగని బుల్డోజర్ డ్రైవ్
గురుగ్రామ్: హరియాణాలోని నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు మరో వర్గం వ్యక్తులు చేసిన రాళ్లదాడి తదనంతర ఘటనల్లో పాల్గొన్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో సమాధానం చెబుతోంది. నూహ్ అల్లర్ల సంబంధ సీసీటీవీ వీడియోలో పోలీసులు గుర్తించిన నిందితులకు చెందిన దుకాణాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టంచేశారు. మూడో రోజైన శనివారం సైతం ఈ బుల్డోజర్ డ్రైవ్ కొనసాగింది. అయితే, నల్హార్ వైద్య కళాశాలకు చెందిన 2.6 ఎకరాల భూమిలో కట్టిన అక్రమ నిర్మాణాలనే తాము కూల్చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. నూహ్ అల్లర్ల నిందితులను లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అయితే నూహ్ జిల్లాలో పరిస్థితి కాస్తంత అదుపులోకి వచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలదాకా కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ధీరేంద్ర చెప్పారు. భయంతో తరలిపోతున్న వలసకార్మికుల్లో భరోసా కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. డెప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ సెక్టార్ 58, 70 సమీపంలోని పలు మురికివాడల్లో పర్యటించి వలసకార్మికులతో మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా పనులకు వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. -
హర్యానా ఘర్షణలు.. నుహ్ జిల్లాలో బుల్డోజర్ చర్యకు దిగిన ప్రభుత్వం
చండీగఢ్: మత ఘర్షణలతో హర్యానా రాష్ట్రం అట్టుడుకుతోంది. నాలుగు రోజుల క్రితం చెలరేగిన అల్లర్లతో నూహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నూహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ చర్చ చేపట్టింది. హింసాకాండకు గురైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని టౌరు ఏరియాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివసిస్తున్న వసలదారుల గుడిసెలను అధికారులు కూల్చివేశారు. కాగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింసలో బయటి వ్యక్తులు(చొరబాటుదారులు) పాల్గొన్నారని పోలీసులతోపాటు సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ సైతం ఆరోపించారు. ఈ క్రమంలో అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలుగా భావించి బుల్డోజర్ యాక్షన్‌కు దిగినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం ఖట్టరే ఈ కూల్చివేతలకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో అస్సాంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ శరణార్థులు.. ఇటీవల హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో నివసిస్తున్నారు. నూహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్‌పూర్ రహదారి మార్గంలో వార్డు నంబర్ వన్‌లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించి, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. చదవండి: హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు -
యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత..
భోపాల్: యోగీ ఆదిత్యనాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తి ఇంటిని రాష్ట్ర అధికారులు కూల్చి వేశారు. గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రభుత్వం స్బందించింది. వీడియోలో ఓ వ్యక్తి కింద కూర్చున్న గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి వెళ్లింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని ప్రవేశ్ శుక్లాగా గుర్తించి అరెస్టు చేశారు. #WATCH | Sidhi viral video | Accused Pravesh Shukla's illegal encroachment being bulldozed by the Administration. He was arrested last night.#MadhyaPradesh pic.twitter.com/kBMUuLtrjK — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 5, 2023 నిందితుని అరెస్టు చేసిన అనంతరం.. అక్రమంగా ఆక్రమించాడనే ఆరోపణలతో అధికారులు అతని ఇంటిని బుల్ డోజర్‌తో కూల్చివేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. నిందితుడు పాల్పడిన ఘటన అమానవీయమని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఇలాంటివారికి సాధారణ శిక్ష సరిపోదని చెప్పారు. ఇదీ చదవండి: Delhi Court Firing: లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం -
వార్‌జోన్‌ను తలపించిన ప్రమాద స్థలం..
బాలాసోర్/హౌరా: మూడు రైలు ప్రమాదాల బాధితుల సహాయార్థం 200 అంబులెన్సులు, పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మొబైల్ హెల్త్ యూనిట్స్ మోహరించారు. 1,200 మంది అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సిబ్బంది అలుపు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒకబోగీపై మరో బోగీ పడటంతో భూమిలోకి కూరుకుపోయిన బోగీలను తీసేందుకు క్రేన్స్, బుల్డోజర్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ భారీ కోచ్‌లను తొలగించడానికి అవి పనికి రాలేదు. కోల్‌కతా నుంచి ప్రత్యేక క్రేన్లు తెప్పిస్తే తప్ప.. పైన పడ్డ బోగీలను తీయలేమని, అప్పుడే కింది వాగన్లను తొలగించడానికి వీలవుతుందని సిబ్బంది తెలిపారు. ‘బోగీలు నేలకు అతుక్కుపోయాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి గుర్తించలేనంత వికృతంగా శవాలు మారిపోయాయి. వర్ణించలేనంత భయంకరంగా అక్కడి దృశ్యాలున్నాయి’ అని ప్రయాణికుల్లో ఒకరు మీడియాతో పంచుకున్నారు. కంపార్ట్మెంట్ నుంచి విసిరేసినట్టుగా.. ‘రైల్వే ట్రాక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నుజ్జునుజ్జయిన బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని ఒకదాని మీదకు ఒకటి ఎక్కాయి. కొన్నయితే.. తాబేలు తరహాలో నేలకు అతుక్కుపోయాయి’ అని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన బ్రెహంపూర్ వాసి పీయూష్ పోద్దార్ వివరించారు. ఆయన ఉద్యోగం కోసం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ‘ఉన్నట్టుండి రైలు పట్టాలు తప్పడంతో బోగీ ఒకవైపు పడిపోయింది. చాలామందిమి కంపార్టుమెంట్ బయట విసిరేసినట్టుగా పడ్డాం. ప్రమాదం నుంచి ఎలాగోలా పాక్కుంటూ బయటికి వచ్చేసరికే ఎక్కడ చూసినా శవాలే కనిపించాయి’ అని పోద్దార్ తెలిపారు. అదృష్టవశాత్తూ పోద్దార్ ఫోన్ సురక్షితంగా ఉండటంతో బంధువులకు ఫోన్ చేశాడు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ ఆయన.. ముందు ఇంటికి చేరుకుని, ఆ తరువాతే చికిత్స చేయించుకుంటానంటున్నాడు. స్థానికుల సహాయం.. ‘‘పెద్దపెద్దగా అరుపులు వినిపించడంతో ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాం. రైలు పట్టాలు తప్పి, బోగీలు పక్కకు పడి కనిపించాయి. బోగీలు నుజ్జయిపోయి ఇనుము కుప్పగా కనబడింది’’ అని ఆ పక్కనే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తెలిపారు. వెంటనే.. బాధితులను బయటికి లాగడం, మంచి నీటిని అందించడం, రక్తం కారుతున్నవారికి బ్యాండేజ్ కట్టడం వంటి సాయం చేశామని కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్న 45 ఏళ్ల ఫోర్‌మెన్ దీపక్ బేరా తెలిపారు. యుద్ధ వాతావరణం.. క్షతగాత్రులను బాలాసోర్, సోరో, భద్రక్, జాజ్‌పూర్, కటక్‌లోని ఎస్సీబీ మెడికల్‌కాలేజీ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భువనేశ్వర్ ఎయిమ్స్ డాక్టర్ల బృందాలను బాలాసోర్, కటక్ ఆస్పత్రులకు పంపించామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. బాధితుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను తాము అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. బెడ్లు, స్ట్రెచర్లు, ఆస్పత్రి కారిడార్లు.. ఎక్కడ చూసినా గాయాలతో రక్తమోడుతున్న బాధితులతో బాలాసోర్ జిల్లా ఆస్పత్రి మొత్తం వార్‌జోన్‌ను తలపించింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 526 మందిని చేర్చారు. బాధితులంతా పలు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో భాషాపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. శవాల గుట్టలతో... ప్రమాదం కారణంగా అనేక రైళ్లు రద్దవ్వడం, కొన్ని రైళ్లు దారి మళ్లించడంతో బాధితుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. దీంతో మృతదేహాల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. తెల్లటి వస్త్రాలు చుట్టిన శవాల గుట్టలతో ఆస్పత్రి ఆవరణ నిండిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆపై చీకటి! రైలు ప్రమాద బాధితుల అనుభవాలు కోల్‌కతా: మరికొద్ది సేపట్లో తమ రైలు బాలాసోర్‌కు చేరుకుంటుందనగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించిందనీ, బెర్త్‌లపై నుంచి తాము కిందపడిపోవడం, బోగీలో అంధకారం అలుముకుందని బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుప్రయాణికులు కొందరు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించారు. ఒడిశాలో ప్రమాద ఘటనలో బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే, పట్టాలు తప్పని 17 బోగీలతో 635 ప్రయాణికులతో ఈ రైలు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హౌరాకు చేరుకుంది. అందులో క్షతగాత్రులైన సుమారు 50 మంది ప్రయాణికులకు సహాయక సిబ్బంది వైద్య చికిత్సలు అందించారు. క్షతగాత్రుల్లో అయిదుగురిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు అందరికీ ఆహారం అందించారు. ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు పీటీఐతో తమ అనుభవాలను పంచుకున్నారు. షెడూŠయ్ల్కు మూడుగంటలు ఆలస్యంగా బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరినట్లు మిజాన్ ఉల్ హక్ చెప్పారు. ‘బాలాసోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉందనగా రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. బోగీ అటూఇటూ కదలడం మొదలైంది. అప్పర్ బెర్త్ నుంచి కిందపడిపోయా. కంపార్ట్మెంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. చీకట్లు అలుముకున్నాయి’అని హక్ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన హక్ కర్ణాటకలో జీవనోపాధి నిమిత్తం వెళ్లారు. దెబ్బతిన్న కోచ్ నుంచి అతికష్టమ్మీద బయటపడ గలిగినట్లు హక్ చెప్పారు. అప్పటికే చాలా మంది తీవ్ర గాయాలతో ప్రయాణికులు ధ్వంసమైన బోగీల్లో పడి ఉన్నారని చెప్పారు. బెంగళూరుకు చెందిన రేఖ కోల్‌కతా సందర్శనకు ఇదే రైలులో వస్తున్నారు. ‘ప్రమాదం కారణంగా అంతటా గందరగోళంగా మారింది. మా బోగీ నుంచి దిగి బయటకు వచ్చాము. ఆ చీకట్లోనే పక్కనే ఉన్న పొలాల్లో కూర్చున్నాం. హౌరా ఎక్స్‌ప్రెస్ ఉదయం తిరిగి బయలుదేరే వరకు అక్కడే ఉండిపోయాం’అని రేఖ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన మరో ప్రయాణికుడు కూడా బెంగళూరు నుంచి వస్తున్నారు. ఈయనకు చాతీ, కాలు, తల భాగాలకు గాయాలయ్యాయి. కంపార్టుమెంట్ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకామని ఆయన అన్నారు. -
కారులో వెళ్తూ బుల్డోజర్ను ఢీకొట్టిన మాజీ మంత్రి.. అక్కడికక్కడే..
గాంధీనగర్: గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత వల్లభ్‌బాయ్ వఘాసియా(69) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్డోజర్ను ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. కారును ఆయనే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వఘాసియాతో పాటు కారులో ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో అమ్రేలి జిల్లా సావర్‌కుంద్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విజయ్‌రూపానీ మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వఘాసియా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సావర్‌కుంద్ల నియోజకవర్గం నుంచి 2012లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వఘాసియా మృతి పట్ల సావర్‌కుంద్ల ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే మహేష్ కశ్వాలా విచారం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఒక మాస్ లీడర్‌ను కోల్పోయామన్నారు. చదవండి: సంపు క్లీన్ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి.. -
‘అమర్త్యసేన్ ఇంటిని కూలుస్తామంటే ఊరుకోం’
కోల్‌కతా: బుల్డోజర్ రాజకీయం పశ్చిమ బెంగాల్‌కు చేరింది. ఆర్థికవేత్త.. నోబెల్ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్(89) ఇంటిని బుల్డోజర్లతో కూల్చేస్తామంటూ విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. అయితే.. ఆ నోటీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే ఘాటుగా స్పందించారు. అలాంటి ప్రయత్నమే జరిగితే.. అడ్డుకునే యత్నంలో బుల్డోజర్ ముందుర ముందు తానే కూర్చుంటానంటూ ప్రకటించారామె. సేన్‌పై ప్రతీరోజూ దాడి జరుగుతోంది. కానీ, వాళ్లు(కేంద్రాన్ని ఉద్దేశించి..) మాత్రం వేడుక చూస్తున్నారు. ఆయన ఇంటిని ఎలా కూలుస్తారో నేనూ చూస్తా. అదే ప్రయత్నం జరిగితే.. అక్కడికి వెళ్తా. ధర్నాతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే మొదటి వ్యక్తిని నేనే అవుతా. బుల్డోజరా? మానవత్వమా? ఏది శక్తివంతమైందో తేల్చుకుంటా.. అని ఆమె వ్యాఖ్యానించారు. 👉 శాంతినికేతన్లో అమర్త్య సేన్ కుటుంబ సభ్యులుగా తరతరాలుగా ఉంటున్న నివాసం ‘ప్రతీచి’ ఉంది. ఆయన కుటుంబం తరతరాలుగా నివసిస్తోంది. అంతేకాదు.. ఆ ఇల్లు సేన్ తండ్రి అశుతోష్ పేరు మీదే ఉండేది. సేన్ తల్లిదండ్రులు మరణించాక.. అది ఆయన పేరు మీదకు బదిలీ అయ్యింది. అయితే.. అందులో అక్రమంగా కొంత స్థలాన్ని ఆక్రమించారని విశ్వభారతి యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. 👉 ఈ ఏడాది జవనరిలో ప్రతీచికి చెందిన 6,600కు పైగా గజాల స్థలానికి చెందిన అధికారిక పత్రాలను స్వయంగా సీఎం మమతా బెనర్జీనే శాంతినికేతన్లో సేన్‌ను కలసి అందించారు. అంతేకాదు.. ఆ స్థలం సేన్ కుటుంబానికే చెందుతుందని దీదీ కరాకండిగా చెబుతున్నారు. 👉 600 గజాల యూనివర్సిటీ జాగానే ఆయన ఆక్రమించారనేది విశ్వ భారతి యూనివర్సిటీ వాదన. ఈ మేరకు మే 6వ తేదీలోగా ఖాళీ చేయాలని, లేకుంటే బలవంతంగా ఖాళీ చేయించి ఆక్రమిత ప్రదేశంలో ఉన్న కట్టడాల్ని కూల్చేస్తామని విశ్వ-భారతి ఆయనకు హెచ్చరికలు జారీ చేసింది. 👉 ఆపై ఆయన్ని వివరణలు కోరుతూ.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి వరుసగా మూడుసార్లు నోటీసులు అంటించింది. దీంతో ఆయన స్పందించారు. 👉 అది తమ వారసత్వ నివాసమని, అందులో ఎలాంటి ఆక్రమిత స్థలం లేదని అమెరికా ఉన్న అమర్త్య సేన్ సైతం యూనివర్సిటీకి తాజాగా బదులు లేఖ రాశారు. 1943 నుంచి ఆ ప్రాంతం మా కుటుంబంతోనే ఉంది. ఆపై చుట్టుపక్కల కొంత స్థలం కొనుగోలు చేశాం. నా తల్లిదండ్రుల మరణానంతరం అది నా పేరు మీదకు వచ్చింది. జూన్‌లో నేను శాంతినికేతన్‌కు వస్తా. పూర్తి వివరాలు సమర్పిస్తా అని లేఖలో(మెయిల్) యూనివర్సిటీకి తెలియజేశారు. 👉 మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతీచి కేర్‌టేకర్ గీతికాంతా మజుందార్.. కోర్టుకు ఆశ్రయించారు. దీంతో.. జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. భీర్బూమ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయి. దీంతో అక్కడ పోలీసుల పహారా ఉంటోంది. కాబట్టి, కూల్చివేతకు తాము అనుమతించబోమని జిల్లా అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ యూనివర్సిటీ మాత్రం స్థలాన్ని స్వాధీనం చేసుకుని తీరతామని అంటోంది. 👉 కానీ, సేన్ వివరణ తీసుకున్నాక కూడా తాజాగా.. మే 6వ తేదీలోపు ఖాళీ చేయాలనే డెడ్‌లైన్ విధించింది యూనివర్సిటీ. లేకుంటే బలవంతంగా ఖాళీ చేయించి.. బుల్డోజర్లతో కూల్చేస్తామని హెచ్చరించింది. 👉 తాజాగా సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై.. వర్సిటీకి చెందిన ఉన్నతాధికారులు స్పందించడం లేదు. అయితే.. ప్రతీచి ప్లాట్‌లో ఆక్రమించుకున్న భాగాన్ని మాత్రం స్వాధీనపర్చుకుని తీరతామని ఓ యూనివర్సిటీ అధికారి పేర్కొన్నారు. ప్రతీచికి వాయవ్యంలో మూలన 600 గజాలను ఆక్రమించుకున్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కాబట్టి, ఆ స్థలానికి గనుక స్వాధీనం చేసుకోవాలనుకుంటే.. బౌండరీ ఫెన్సింగ్‌ను పగలకొట్టి అక్కడ ఇనుప కంచె వేయాలనుకుంటున్నాం అని ఓ అధికారి పేర్కొన్నారు. 👉 ఈ వ్యవహారంలో విశ్వభారతి తీరుపై మేధావులు మండిపడుతున్నారు. ఇది పూర్తి రాజకీయ వ్యవహారం. సేన్‌ను వేధించడానికి బీజేపీ విశ్వభారతి యూనివర్సిటీని ఓ పావుగా వాడుకుంటోంది. ఈ క్రమంలోనే.. ఆయన నివాసం ప్రతీచి ముందర డ్రామా నడిపించేందుకు సిద్ధమైంది. బుల్డోజర్ రాజకీయాలు సరికాదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ చదవండి: చిన్నమ్మా.. ఎవరీ జ్యోతిష్కుడు? -
ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 36 మందిని బలిగొన్న ఆలయ ప్రాంగణంలోకి బుల్డోజర్లు ప్రవేశించాయి. సోమవారం ఉదయం బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ప్రమాదానికి కారణమైన అక్రమ కట్టడాన్ని కూల్చివేతను అధికారులు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కూల్చివేతను ఎవరూ అడ్డుకోకుండా కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు ఇండోర్ మున్సిపల్ అధికారులు సోమవారం రంగంలోకి దిగారు. కూల్చివేతలకు ఆటంకాలు ఎదురుకాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు.. సుమారు నాలుగు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్‌సిబ్బంది అక్కడ మోహరించారు. జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా, ఇండోర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు దగ్గరుండి ఆ కూల్చివేతలను పర్యవేక్షించారు. #WATCH | Madhya Pradesh: Indore municipality deploys bulldozer & demolishes illegal structure at Indore temple where 36 people died after the stepwell collapse there last week. pic.twitter.com/gpRJB6zWhN — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 3, 2023 ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు.. ఆలయంలో మెట్లబావిని మూసేస్తూ కాంక్రీట్స్లాబ్వేయగా.. శ్రీరామ నవమి నాడు ఆ స్లాబ్ ఉన్న ప్రాంతంలోనే యాగం చేయడం, భక్తుల బరువును మోయలేక ఆ పైకప్పు కూలిపోయి భక్తులు బావిలో పడిపోయి మరణించడం తెలిసిందే. స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో.. అది అక్రమ కట్టడం అని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కిందటి ఏడాది ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు పంపింది. అంతేకాదు.. ఆ పైభాగానికి కూల్చివేసేందుకు మార్క్ కూడా చేసింది. కానీ, ఆ సమయంలో మతపరమైన మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఆలయ ట్రస్ట్ నిరసన వ్యక్తం చేయడంతో.. అధికారులు వెనక్కి తగ్గారు. ఒకవేళ అధికారులు ఆనాడే దూకుడుగా స్పందించి ఉంటే.. నేడు పదుల సంఖ్యలో ప్రాణాలు పోయి ఉండేవి కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.. ఇండోర్ స్నేహ్ నగర్లో పూర్తిగా ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలోనే ఆ ఆలయం నడుస్తోంది. రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న మెట్ల బావిని కేవలం నాలుగు ఐరన్ గ్రిడ్స్‌తో.. పైన సన్నని కాంక్రీట్ లేయర్, టైల్స్‌తో కప్పేసి పూజల కోసం ట్రస్ట్ నిర్వాహకులు వినియోగిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ అక్రమ కట్టడంతో పాటు చుట్టుపక్కల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సైతం కూల్చేస్తున్నారు అధికారులు. మరోవైపు.. ఇండోర్ ఆలయ ప్రమాద ఘటనతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మేల్కొంది. రాష్ట్రంలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ఆలయ కట్టడాలను, బావుల్ని గుర్తించి.. తక్షణమే వాటిని మరమ్మత్తులు చేపట్టాలని, అలాగే ఆలయాల ప్రాంగణంలో అక్రమ కట్టడాలు ఉంటే గుర్తించి తక్షణమే వాటిని తొలగించడం లేదంటే పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదివారం ప్రత్యేక సమావేశంలో ఆదేశించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. -
ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుల నివాసాలు బుల్డోజర్లతో కూల్చివేత
లక్నో: మాఫియాపై మరోసారి ఉక్కుపాదం మోపారు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసుతో సంబంధం ఉన్న నిందితుల నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, పోలీసులు మొత్తం 20 మంది నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రత్యక్ష సాక్షి. గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్, అతని భార్య, కొడుకుతో పాటు బీఎస్పీ నేత శైష్ఠ పర్వీన్ ఈ కేసులో ప్రధాన నిందితులు. అయితే ప్రస్తుతం జైలులో ఉన్న అతిఖ్.. ఉమేశ్ పాల్‌ను కోర్టులో వాంగ్మూలం ఇవ్వకుండా హత్య చేయించాడు. పట్టపగలే తన ఇంటిముందే ఉమేష్ పాల్‌ను దుండగులు కాల్పిచంపడం ప్రయాగ్‌రాజ్‌లో కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 20 మంది నిందితులను గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లో వారి ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేత దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి యోగి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Bulldozers demolishing properties of accused in Prayagraj case, who are close aides of gangster Atique Ahmed. #UmeshPal#Pragraj#AtiqueAhmed#प्रयागराज#उमेशपाल_हत्याकांड#YogiAdityanath Yogi Baba Supremacy🔥 pic.twitter.com/EX2KP9tsfS — Sumit Singh Chandel (@Real_Sumit1) March 1, 2023 ఇటీవల అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ గురించి మాట్లాడుతూ.. మాఫియాను మట్టికరిపిస్తామని యోగి అదిత్యనాథ్ హెచ్చరించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎస్పీ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. నేరస్థులను మీరు ప్రోత్సహించి, వారికి మూలమాలలు వేసి సత్కరించి.. నేరం జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వాన్ని నిందించడమేంటని మండిపడ్డారు. అయితే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలసీపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే? -
‘బుల్డోజర్ న్యాయం’ ఎన్నాళ్లు?
బుల్డోజర్లే సర్వరోగ, సర్వ సమస్యల నివారిణిగా భావించటం ఎంత ప్రమాదకరమో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కనీసం ఇప్పటికైనా అర్థమైవుండాలి. ఆ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా మడౌలీలో ‘ఆక్రమణలు’ తొలగించే పేరిట సోమవారం బుల్డోజర్లు వీరంగం వేస్తుండగా హఠాత్తుగా ఒక గుడిసెలో మంటలు ఎగసి తల్లీకూతుళ్లిద్దరు సజీవదహనమయ్యారు. బాధితుల బంధువులు చెబుతున్నట్టు ఇవి దారుణ హత్యలా, అధికారులంటున్నట్టు ఆత్మహత్యలా అనేది తేలడానికి కొంత సమయం పడుతుంది. కానీ ప్రభుత్వ చర్య ఏదైనా చట్టాలకు అనుగుణంగానే ఉండాలని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం చెప్పి చాన్నాళ్లవుతున్నా ఆ రాష్ట్రంలో బుల్డోజర్ల వినియోగం ఆగలేదని తాజా ఉదంతం నిరూపిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్తను కించపరిచారని ఆరోపిస్తూ నిరుడు జూన్‌లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా ప్రయాగ్‌రాజ్, షహ్రాన్‌పూర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాక ఆ నిరసనలకు సూత్రధారులుగా భావిస్తున్నవారి ఇళ్లను బుల్డోజర్లు పంపి నేలమట్టం చేశారు. నిజానికి ఇది యూపీకే పరిమితమై లేదు. బీజేపీ సర్కారుండే మధ్యప్రదేశ్‌లో నిరుడు ఏప్రిల్‌లో మతపరమైన ఘర్షణలు జరిగాక 16 ఇళ్లనూ, 29 దుకాణాలనూ అధికారులు కూల్చేశారు. అదే నెలలో బీజేపీ అధీనంలోని అప్పటి ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మత ఘర్షణలు జరిగిన జహంగీర్‌పురిలో ఇదే పద్ధతిలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేశారు. నిజానికి చట్టబద్ధ పాలన అనే భావన రాజ్యాంగంలో లిఖితపూర్వకంగా ఎక్కడా ఉండదు. కానీ అది సవరణకు వీలుకాని రాజ్యాంగ మౌలిక నిర్మాణ స్వరూపమని నిపుణులంటారు. ప్రజాస్వామ్యంలో సాధారణ పౌరులు మొదలుకొని అత్యున్నత స్థానాల్లో ఉండేవారి వరకూ అందరూ చట్టానికి లోబడి వ్యవహరించాల్సినవారే. కానీ ఈ ‘బుల్డోజర్ న్యాయం’ అన్ని చట్టాలనూ, నిబంధనలనూ బేఖాతరు చేస్తోంది. సాధారణంగా అయితే అక్రమమని తేలిన నిర్మాణాలను గుర్తించాక వాటి యజమానులకు అధికారులు ముందుగా నోటీసులివ్వాలి. వారినుంచి సంజాయిషీలు తీసుకున్నాక అవసరమైన వ్యవధినిచ్చి నిర్మాణాలు తొలగించాలి. కానీ ఈ ఉదంతాలన్నిటా జరుగుతున్నది వేరు. ఏదైనా ఘర్షణల్లో నిందితులుగా గుర్తించినవారి ఇళ్లనూ, దుకాణాలనూ ఒక పద్ధతి ప్రకారం కూల్చేస్తున్నారు. నామమాత్రంగా నోటీసులిచ్చి కనీసం వారి సామాన్లు తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. మడౌలీ ఉదంతమే తీసుకుంటే గత నెల 14న కిషన్ గోపాల్ దీక్షిత్ అనే ఆసామి ఇంటితోపాటు మరికొన్ని ఇళ్లను చెప్పాపెట్టకుండా వచ్చిన అధికారులు కూల్చేశారు. వేరే ఆశ్రయం పొందటం అసాధ్యం కావటంతో కూల్చినచోటే దీక్షిత్ కుటుంబం చిన్న గుడిసె వేసుకుని ఉంటోంది. సరిగ్గా నెల తర్వాత మళ్లీ వచ్చిన అధికారులు ఆ గుడిసెవైపు బుల్డోజర్ను గురిపెట్టారు. తామంతా గుడిసెలో ఉండగానే భయభ్రాంతుల్ని చేసి పంపేయటానికి బుల్డోజర్ను ప్రయోగించారని, దానికి లొంగకపోవటంతో గుడిసెకు నిప్పంటించమని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశించారని బాధితుడు శివం దీక్షిత్ అంటున్నాడు. తానూ, తండ్రి స్వల్పగాయాలతో తప్పించుకున్నా తల్లి, 21 ఏళ్ల సోదరి సజీవదహనమయ్యారని చెబుతున్నాడు. బుల్డోజర్ల ప్రయోగం మొదలెట్టినప్పుడు రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ఎక్కువ సందర్భాల్లో ఒక మతంవారినే దృష్టిలో పెట్టుకుని ఈ కూల్చివేతలు జరగటం అందుకు కారణం కావొచ్చు. కానీ ఇలాంటి ధోరణి చివరకు అరాచకానికి దారితీస్తుందని చాలామంది హెచ్చరించారు. విచక్షణ మరిచి సమస్య ఉన్నచోటికల్లా బుల్డోజర్లు వెళ్లడం మొదలైతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించటం కష్టం. ఆమధ్య ఒక ఉదంతంలో రాళ్లు విసిరాడని ఆరోపణలొచ్చిన యువకుడు రెండు చేతులూ లేని వికలాంగుడు. అతని దుకాణాన్ని అధికారులు కూల్చేశారు. ఈ మాదిరి ఘటనల్లో అధికారులు తమ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందా? మడౌలీ ఉదంతంలో తల్లీకూతుళ్లు సజీవదహనమయ్యారని తెలియగానే సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌తో సహా అధికారులంతా పరారయ్యారు. వారు అక్కడే ఉంటే ఏం జరిగేదో! దోషులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చేసిన ప్రకటనకు పెద్దగా విలువుండదు. బుల్డోజర్లను ఇష్టానుసారం వినియోగించే స్వేచ్ఛ ప్రభుత్వమే ఇచ్చినప్పుడు ఇలాంటి విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేముంది? ఈ ఉదంతాల్లో చివరకు దోషులుగా తేల్చేదెవరిని? శిక్షించేదెవరిని? నేరారోపణలు చేయటం, దాన్ని న్యాయస్థానాల్లో నిరూపించటం, తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు శిక్షించటం అనే ప్రక్రియలుంటాయి. ఈ మూడు పాత్రలనూ ఒకరే పోషించాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్యం మంటగలుస్తుంది. సాధారణ ప్రజానీకం సైతం ఈ ధోరణినే అనుసరించే ప్రమాదం ఉంటుంది. ఏతావాతా ఈ మాదిరి చర్యలు ఒకరకమైన అరాచకానికి దారితీస్తాయి. బుల్డోజర్ల గురించి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనప్పుడు అసలు కారణాలు దాచి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలుండటంవల్లే కూల్చామని యూపీ సంజాయిషీ ఇస్తోంది. ఒక ప్రభుత్వం తన చర్యల ఆంతర్యాన్ని తానే చెప్పుకోలేని దుఃస్థితిలో ఉండటం అధికార యంత్రాంగానికి నైతికబలం ఇవ్వగలదా? రెండు నిండు ప్రాణాలు బలిగొన్న మడౌలీ ఉదంతానికి మూలం ఎక్కడుందో ఇప్పటికైనా ఆదిత్యనాథ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరెక్కడా ఇలాంటి ఉదంతాలు పునరావృతం కానీయకుండా, చట్టవిరుద్ధతకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి. -
'బీజేపీలోకి వస్తారా? లేక బుల్డోజర్లు తీసుకురమ్మంటారా?'
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా బీజేపీలోకి రావాలని, లేదంటే బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన బహిరంగంగా బెదిరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'మీరందరు బీజేపీలో చేరండి. నెమ్మదిగా అధికార పార్టీలోకి రండి. మధ్యప్రదేశ్‌లో 2023లో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయి.' అని బీజేపీ మంత్రి అన్నారు. రాఘోగఢ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈమేరకు మాట్లాడారు. राघोगढ़ में कांग्रेसियों से बोले पंचायत मंत्री महेंद्र सिंह सिसोदिया "भाजपा में आ जाओ नहीं तो 2023 के बाद बुलडोजर तैयार है" मंत्री जी,आपका बुल डोजर अंग्रेजों से बड़ा नहीं है,हम उनसे लड़े हैं.@OfficeOfKNath pic.twitter.com/t0ZvVtd8Oh — KK Mishra (@KKMishraINC) January 19, 2023 బీజేపీ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన మతిస్తిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియక ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడింది. బీజేపీకి ప్రజలే తగిన రీతిలో బుద్ది చెబుతారని పేర్కొంది. ఎలాంటి భాష ఉపయోగించాలో మంత్రి నేర్చుకోవాలని హితవు పలికింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ సంస్కృతి విపరీతంగా పెరిగింది. నేరస్థులు, నిందితుల ఇళ్లు, ఆస్తులను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. మధ్యప్రదేశ్‌లో కూడా ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వీటిని బహిరంగంగా సమర్థిస్తున్నారు. చదవండి: సచిన్ పైలట్‌ను కరోనాతో పోల్చిన రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ -
ఉగ్రవాది ఇంటిగోడ బుల్డోజర్తో కూల్చివేత.. వీడియో వైరల్..
శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది అక్రమంగా నిర్మించిన ఇంటిగోడను జమ్ముకశ్మీర్ అధికారులు కూల్చివేశారు. జేసీబీతో ప్రహరీని నేలమట్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదిని గులాం నబీ ఖాన్‌గా గుర్తించారు. ఈ ప్రహరీని గోడను అక్రమంగా నిర్మించాడని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమమించుకున్నాడని అధికారులు చెప్పారు. అందుకే చర్యలు చేపట్టి గోడను కూల్చివేసినట్లు వివరించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. Jammu and Kashmir Administration demolishes property of Hizbul Mujahideen terrorist commander Gulam nabi Khan @ Amir Khan, in Anantnag's Pahalgam. 🧐🧐👇 pic.twitter.com/TofBRReHlZ — Naren Mukherjee (@NMukherjee6) December 31, 2022 చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం -
‘బుల్డోజర్లతో కూల్చమని ఏ చట్టం చెప్తోంది?’
గువాహతి: నేరస్తుల ఇళ్లను, వాళ్లకు సంబంధించిన ఇతర స్థిర ఆస్తులను బుల్డోజర్లతో నేలమట్టం చేసే సంస్కృతిపై గువాహతి(అస్సాం) హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు కేసు దర్యాప్తులో ఉండగా.. నిందితులపై అలాంటి చర్యలు తీసుకోమని ఏ చట్టం చెబుతోందని గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడి పోలీస్ శాఖను నిలదీసింది ఉన్నత న్యాయస్థానం. పోలీస్ స్టేషన్‌కు తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన ఐదుగురి ఇళ్లను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది గువాహతి హైకోర్టు. చీఫ్ జస్టిస్ ఆర్ఎం ఛాయతో పాటు జస్టిస్ సౌమిత్రి సాయికియా నేృతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. అయితే గురువారం విచారణ సమయంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఏ చట్టం ఇలా బుల్డోజర్లతో ఇళ్లు కూల్చమని చెబుతోంది’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘ కేసు దర్యాప్తులో ఉండగా.. పోలీసులు ఎటువంటి ఆదేశాలు లేకుండా ఒక వ్యక్తి ఆస్తులపై బుల్డోజర్ ప్రయోగించవచ్చని మీరు (ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ఏదైనా చట్టంలో చూపిస్తారా?’’ అని ప్రశ్నించింది. మెకాలే తీసుకొచ్చిన నేర విచారణ చట్టంలోనూ దాని ప్రస్తావన లేదు కదా! అని నిలదీసింది. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరపున న్యాయవాది వివరణ ఇచ్చే యత్నం చేస్తుండగా.. సీజే ఛాయ కలుగజేసుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఒక ఎస్పీనే కావొచ్చు. కానీ, అధికారి అలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు అసలు?. ప్రజాస్వామిక పద్ధతిలో ఉన్నాం మనం. సెర్చ్ వారెంట్ జారీ చేయకుండా అలా చేయడం ఏంటి?. పోలీస్ విభాగానికి పెద్ద అయినంత మాత్రాన.. ఎవరి ఇల్లు అయినా పడగొడతారా?.. ఇలాంటి చర్యలకు అనుమతి ఇస్తే.. దేశంలో ఎవరూ భద్రంగా ఉండరు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు.. హిందీ సినిమాల్లోనూ ఇలాంటివి చూడలేదని వ్యాఖ్యానించారాయన. సినిమాల్లోనూ ఇలాంటి కూల్చివేత సీన్లు చూపించేప్పుడు సెర్చ్ వారెంట్ అనేది చూపిస్తారు. కానీ, ఇక్కడ అలాంటిదేం జరగలేదు. మీ కథలేమైనా ఉంటే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టికి ఇవ్వండి.. ఆయన వాటిని సినిమాలుగా తీస్తాడేమో అంటూ సీజే చురకలంటించారు. కూల్చేసిన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఓ తుపాకీని కోర్టులో సమర్పించగా.. ఇది పోలీసుల పని అయ్యి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. ‘‘ఈ విషయాన్ని డీజీపీకి తెలియజేయండి, లేకుంటే ఈ సమస్య పరిష్కారం కాదు. దయచేసి అర్థం చేసుకోండి.. ఇది మీరు శాంతిభద్రతలను నియంత్రించే పద్ధతి కాదు. మీరు ఒకరు చేసిన ఏ నేరానికి అయినా విచారణ చేయవచ్చు. ఒకరి ఇంటిని కూల్చేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? అని బెంచ్ ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేస్తూ.. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ స్పందన కోరింది. నాగావ్ జిల్లా బటద్రవ పోలీస్ స్టేషన్లో సఫికుల్ ఇస్లాం(39) అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. అయితే.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ముస్లింలు మే 21వ తేదీన పోలీస్ స్టేషన్‌కు నిప్పటించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ మరుసటి రోజే ఇళ్లను కూల్చేశారు. స్థానిక ఎస్పీ ఆ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాల సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా తాము ఆ పని చేయాల్సి వచ్చిందని అధికారులు గతంలో వివరణ ఇచ్చుకున్నారు. -
రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ప్రైవేటు ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రోగి ప్రాణాలు కోల్పోయాడని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో తాజాగా సదరు ఆసుపత్రికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి భవనాన్ని అనుమతులు లేకుండా నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. శుక్రవారం నాటికి భవనాన్ని ఖాళీ చేయాలని లేదంటే బుల్డోజర్తో కూల్చివేస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డెంగ్యూ రోగి చనిపోయిన కేసు ప్రాథమిక విచారణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడటంతో గత వారమే ఆసుపత్రిని సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో రోగులు లేరు. అయితే గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆసుపత్రి అధికారులు సమాధానం ఇవ్వలేదని తేలింది. ఈ ఏడాది ప్రారంభంలో కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు డెంగ్యూ రోగి మరణం అనంతరం ప్రయాగ్‌రాజ్ పోలీసులు నకిలీ ప్లేట్లెట్స్ సరఫరా చేసే ముఠాను ఛేదించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఎస్పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. నిందితుల నుంచి కొన్ని నకిలీ ప్లేట్లెట్ పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చదవండి: ‘ఏయ్ ఐటమ్. ఎక్కడికి వెళ్తున్నవ్’.. పోకిరికి బుద్ధి చెప్పిన కోర్టు In UP's Prayagraj, the development authority has issued demolition notice to the the hospital where a dengue patient died during treatment. Family of the deceased had alleged that the patient was given Mosambi juice in the drip instead of platelets. pic.twitter.com/T5a34EtIyY — Piyush Rai (@Benarasiyaa) October 25, 2022 -
నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో..
బెంగళూరులో భార్యభర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుగుపొరుగు వారు, పోలీసులు అప్రమత్తతో వ్యవహరించి వాళ్లను నిప్పంటించుకోకుండా ఆపగలిగారు. మహిళ చేతిలోనుంచి అగ్గిపెట్టె లాక్కుని బకెట్లతో నీళ్లు పోశారు. భర్తను కూడా పోలీసులు పట్టుకుని ఆపారు. అనంతరం భార్యాభర్తలపై ట్యాంకర్‌తో నీళ్లు పోశారు. క్షణం ఆలస్యమైన వారు అగ్నికి ఆహుతయ్యుండేవారు. VIDEO : #Bengaluru में घर तोड़ने पर खुद को आग लगाने लगे पति-पत्नि pic.twitter.com/Tp3L2QJDIh — NDTV India (@ndtvindia) October 12, 2022 ఏం జరిగిందంటే? బెంగళూరులో డ్రైనేజీని బ్లాక్ చేసేలా ఉన్న అక్రమ నిర్మాణాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ పురంలోని ఎస్ఆర్ లేఅవుట్లో మురికి కాలువ పక్కనే నిర్మించిన అక్రమ నివాసాన్ని కూల్చేందుకు బుల్డోజర్తో వెళ్లారు. అయితే ఈ ఇంటి యజమానులపైన భార్యాభర్తలు దీన్ని అడ్డుకున్నారు. బుల్డోజర్కు ఎదురుగా నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమది అక్రమ నిర్మాణం కాదని, అన్ని పత్రాలు ఉన్నాయని భార్యాభర్తలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఇది కచ్చితంగే అక్రమంగా కట్టిందే అని పేర్కొన్నారు. మురుగు, వర్షం నీరును బ్లాక్ చేసేలా డ్రైనేజీ కాలువపై దీన్ని నిర్మించారని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
అంబులెన్సులా మారిన బుల్డోజర్.. వీడియో వైరల్
భోపాల్: బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడ్ని మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కిందపడిన అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. అయితే 30 నిమిషాలు గడిచినా అక్కడికి అంబులెన్స్ రాలేదు. యువకుడికి మాత్రం తీవ్ర రక్తస్రావమవుతోంది. దీంతో చలించిపోయిన ఓ వ్యక్తి.. అతడ్ని బుల్‌జోడర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఈ ఘటన జరిగింది. రోడ్డుప్రమాదం తన షాపు ముందే జరిగిందని, యువకుడికి రక్తస్రావం కావడం చూసి బాధతో జేసీబీలో అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నట్లు దాని యజమాని పుష్పేంద్ర తెలిపాడు. కాగా.. గాయపడిన యువకుడ్ని మహేశ్ బుర్మాగా గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లాక వైద్యులు అతనికి వెంటనే చికిత్స అందించారు. అతని కాలికి ఫ్రాక్చర్ అయిందని గుర్తించి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి సిఫారసు చేశారు. అయితే యువకుడ్ని జేసీబీలో ఆస్పత్రికి తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. साइकिल, ठेले, कंधे के बाद अब मरीज सीधे जेसीबी में! कटनी का मामला है लोगों का कहना है कि एंबुलेंस सेवा को कॉल किया था लेकिन मिली नहीं. @ndtv @ndtvindia pic.twitter.com/CfxRlNfXEM — Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2022 చదవండి: నా శాఖలో అందరూ దొంగలే.. బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్.. -
బుల్డోజర్ యాక్షన్.. బీజేపీ నేత కట్టడాల కూల్చివేత
నొయిడా: బుల్డోజర్ చర్యలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటిదాకా కమ్యూనల్‌కు సంబంధించిన కోణంలోనే ఇంతదాకా ఈ తరహా ప్రతిచర్యలు చూశాం. అయితే తాజాగా నోయిడాలో బుల్డోజర్తో అక్రమ కట్టడాలను కూల్చేయడం, అందునా ఆ కట్టడాలు బీజేపీ నేతవి కావడం, ఆదేశాలకు సీఎం యోగి స్వయంగా ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. యూపీ, నొయిడా అధికారులు బీజేపీ యువనేత శ్రీకాంత్ త్యాగికి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు దిగినందుకు ఆదివారం అతనిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద నేరారోపణలు నమోదు చేశారు. ఇవాళ నొయిడా సెక్టార్-93లోని గ్రాండ్ ఒమాక్సే హౌజింగ్ సొసైటీ వద్ద అతని ఇంటి ఆవరణలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు సంబంధిత అధికారులు. Residents of Grand Omaxe in Noida's Sec 93 celebrate after the demolition of illegal construction by #ShrikantTyagi.#ITVideo #Noida | @arvindojha @Akshita_N pic.twitter.com/E1JWw2GfvG — IndiaToday (@IndiaToday) August 8, 2022 ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళతో శ్రీకాంత్ దారుణంగా వ్యవహరించాడు. ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు. ఆ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ లోపు శ్రీకాంత్ అనుచరులు మరోసారి హౌజింగ్ సొసైటీ దగ్గరకు చేరి.. ఆమె అడ్రస్ కావాలంటూ వీరంగం సృష్టించారు. దీంతో వాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ అధికారులు, నోయిడా పోలీసులు సంబంధిత స్థలానికి చేరుకుని త్యాగికి చెందిన అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కట్టడాలను కూల్చేశారు. ఆ సమయంలో స్థానికుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. సొసైటీకి సంబంధించిన స్థలంలో త్యాగి నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణం. బుల్డోజర్ డ్రైవర్‌ను కీర్తిస్తూ నినాదాలు చేశారు వాళ్లంతా. Shrikant Tyagi- the National Executive Member Kisan Morcha & National Co-Coordinator - Yuva Kisan Samiti allegedly caught on camera for threatening a woman resident of Grand Omaxe sector 93B #Noida. pic.twitter.com/QTwAgK94dd — Utkarsh Singh (@utkarshs88) August 5, 2022 త్యాగికి దెబ్బలు ఇక్కడితోనే ఆగిపోలేదు. నోయిడాలోని భంగెల్ మార్కెట్లో ఉన్న అతని కార్యాలయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు జరిగాయి.అక్కడ అతనికి 15 షాపులు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని దుర్వినియోగం చేసినందుకు సైతం కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. పదిహేను బృందాలు అతని కోసం గాలింపు చేపట్టాయి. చివరిసారిగా హరిద్వారా్-రిషికేష్ మధ్య అతని సిగ్నల్‌ను పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అతని ఆచూకీ తెలిపిన వాళ్లకు 25వేల రూపాయల రివార్డు ప్రకటించారు పోలీసులు. బీజేపీ కిసాన్ మోర్చా నేతగా చెప్పుకుంటున్న శ్రీకాంత్ త్యాగి.. గతంలో బీజేపీ పెద్దలతో కలిసి వ్యక్తిగతంగా ఫొటోలు కూడా దిగాడు. అంతేకాదు ఆ ట్యాగ్‌తోనే దందాలు సైతం నడిపిస్తున్నాడు. ఆగష్టు 5వ తేదీన అతను గ్రాండ్ ఓమాక్సే సొసైటీలో ఓ మహిళతో వాగ్వాదానికి దిగి.. దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. గతంలోనూ నోయిడా అథారిటీ అతనికి అక్రమ కట్టడాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది. అయితే.. బీజేపీ నేత కావడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వివాద నేపథ్యంలో అతను తమ పార్టీ సభ్యుడు కాదంటూ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
యూపీలో అనూహ్య పరిణామం.. బీజేపీ కార్యకర్త ఇంటిపైకి బుల్డోజర్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాని బుల్డోజర్లతో కూల్చివేశారు అధికారులు. నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఈ ఇంటికి సోమవారం ఉదయం పోలీసు బృందాలతో వెళ్లారు. అనంతరం త్యాగి ఇంటి ముందు భాగాన్ని కూలగొట్టారు. #WATCH | Uttar Pradesh: Illegal construction at the residence of #ShrikantTyagi, at Grand Omaxe in Noida's Sector 93, demolished by the Noida administration. Tyagi, in a viral video, was seen abusing and assaulting a woman here in the residential society. pic.twitter.com/xThZ2wF3gS — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022 శ్రీకాంత్ త్యాగి ఇదే హౌసింగ్ సొసైటిలోని ఓ మహిళపై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పొరుగింటి మహిళను కొట్టడమే గాక దుర్భాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. శ్రీకాంత్ త్యాగి ఇంటిముందు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హౌసింగ్ సొసైటీ సంఘం 2019లోనే ఫిర్యాదు చేసింది. నోయిడా అధికారులు 2020లోనే త్యాగికి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు నేరుగా బుల్డోజర్లతో వెళ్లి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. అయితే యూపీలో ఇప్పటివరకు విపక్షాలకు చెందినవారినే లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్లతో ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపణలొచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీ కార్యకర్త ఇంటిపైకే అధికారులు బుల్డోజర్ తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. చదవండి: ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళా భక్తులు మృతి.. -
Agnipath Protests: పేద యువతను నిందించగలమా?
అగ్నిపథ్ పథకంపై రాజకీయ దుమారం ఇక చాలంటూ... ‘ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన పథకాలకు రాజకీయరంగు పులమటం దేశ దౌర్భాగ్యం. ఇప్పుడు బాధాకరంగా తోచినా దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నాయనీ, దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకో వాల’నీ ప్రధాని మోదీ వివరించారు. ఈ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని సైనికాధికార్లు స్పష్టం చేశారు. సైన్యం దేశ రక్షణ లక్ష్యంతో పని చేస్తుందనీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాదనీ సూటిగా చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయంగా ప్రశ్నించటం సహజమే అని మరోసారి నిరూపించాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించిన వాటినే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించటం అవకాశవాదం. నిజానికీ పథకం 1989 నుంచి పెండింగులో ఉన్నదని అధికారికంగా చెప్పారు. బీజేపీ కూడా ఇలాగే వ్యవహరించింది కదా. దేశభక్తి పేరిట రాజకీయం తగదు. కపట రాజకీయాలకు దేశభక్తి ముసుగు పరిపాటి అయింది. అధికార పార్టీల ఈ అవకాశవాదాన్ని స్వతంత్ర మేధావులు ఎత్తిచూపాలి; ప్రజలు తిరస్కరించాలి. రైళ్ళు, బస్సుల వంటి ప్రజల ఆస్తుల ధ్వంసం; ప్రయాణికుల పార్సెళ్ల దహనం... రేపు సైన్యంలో చేరాలనుకుంటున్న యువతరం చేయాల్సిన పనులేనా ఇవని వారిని మాత్రమే నిందిస్తే లాభం లేదు. కలుషిత రాజకీయాల పర్యవసానమే ఇది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? సెల్ టవర్సుని ధ్వంసం చేసే నక్సల్స్‌కీ, వివిధ పార్టీలు ప్రోత్సహిస్తున్న అరాచకత్వానికీ తేడా ఏముంది? కొన్ని అగ్రవర్ణ మూకలు గుజరాత్లో తమకు రిజర్వేషన్లు కావాలని చేసిన హింసాకాండ సందర్భంగా అన్ని పార్టీలు పాటించిన మౌనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరిట విధ్వంసం తాజా ఉదాహరణ! ఆందోళనంటే ఇలా, అలా చేయకపోతే ప్రభుత్వాలు స్పందించవు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. గోరక్షణ పేరుతో మానవ హత్యలను ప్రోత్సహిస్తున్న వాతావరణంలో... కేవలం ఆ నిరుద్యోగ పేద యువకులు భవిష్యత్ పట్ల ఉన్న భయంతో పాల్పడిన హింసను నిందించగలమా? కఠినంగా శిక్షించాలని, వారికి ఆర్మీలో ఉద్యోగాలివ్వడం అసాధ్యమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరో ఏదో తప్పు చేశారని చెప్పి, మర్నాడే బుల్డోజర్లతో వారి ఇళ్లను యూపీలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూల్చి వేసింది. తెలంగాణను నిందిస్తూ, ఇక్కడా బుల్డోజర్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. వారిని ఖండించకుండా కేంద్ర నాయకుల పరోక్ష మద్దతు! యధా రాజా తథా ప్రజా! మన దేశరక్షణను మన అవసరాలకూ వనరులకూ తగిన రీతిలో నిర్వహించుకోవాలి. అమెరికాలో ఇజ్రాయెల్‌లోనూ ఇలాగే చేస్తున్నారంటూ... ప్రభుత్వమూ, జాతీయవాద అధికార పార్టీ అగ్నిపథ్‌ను సమర్థించటం విడ్డూరం. టెక్నాలజీ అవసరమే కానీ మానవ వనరులే ప్రధానంగా ఉన్న మన దేశానికి ఆయా విధానాల్ని తగిన రీతిలో అన్వయించుకోవడం అవసరమనేది గుర్తించాలి. దేశరక్షణ కేవలం భారీ డిఫెన్స్ బడ్జెట్‌తో పటిష్టం కాజాలదు. బడ్జెట్, టెక్నాలజీ... రెండిటా నంబర్‌వన్ అయిన అమెరికా సైన్యం వియత్నాం, ఆఫ్గానిస్తాన్‌లో అధర్మ యుద్ధాల్లో ఘోర పరాజయం పొందింది. విదేశీ వ్యవహారాల్లో శాంతి లక్ష్యం, సరైన దౌత్యం లేకపోతే ఎవరికైనా అంతే. ఈ అన్ని సంగతులనూ దృష్టిలో పెట్టుకుని అన్ని పక్షాలూ అగ్నిపథ్ ఉచితానుచితాలను ఆలోచించాలి. (క్లిక్: కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు మాటేంటి?) - డాక్టర్ ఎం. బాపూజీ సీఎస్ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త -
బుల్డోజర్ని నడుపతూ వచ్చిన వరుడు! ఫోటో వైరల్
ఇటీవలకాలంలో యువత పెళ్లితంతును చాలా వెరైటీగా చేసుకుంటున్నారు. ఎవరూ చేసుకోని విధంగా, ఊహించని విధంగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం యువత కొత్తట్రెండ్ సృష్టిస్తున్నారనే చెప్పాలి. ఇటీవలే ఒక వధువు కళ్యాణ మండపానికి ట్రాక్టర్ పై వచ్చి షాకిచ్చింది. ఆ ఘటన మరువుక మునుపే ఇక్కడో పెళ్లికొడుకు బుల్డోజర్ పై వచ్చి సందడి చేశాడు. వివరాల్లోకెళ్తే...పెళ్లి చేసుకునేందుకు వరుడు పెళ్లి కూతురు ఇంటికి మంచి కారులోనో లేదంటే మంచి ఖరీదైన బైక్‌లోనో రావడం జరుగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక యవకుడు తన పెళ్లిని అందరూ గుర్తించుకునేలా ప్రత్యేకంగా ఉండాలని ఏకంగా బుల్డోజర్ పై డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. దీంతో పెళ్లికూతురి గ్రామంలోని వాళ్లంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత అందరూ ఆ వరుడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ మేరకు వరుడు మాట్లాడుతూ...తాను తన పెళ్లిని గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుకోవాలనే ఇలా చేశానని అన్నాడు. పైగా గ్రామమంతా పండుగా వాతావరణం చోటు చేసుకుందంటూ తెగ సంబరపడిపోయాడు. ప్రస్తుతం పెళ్లికొడుకు బుల్డోజర్పై వచ్చిన ఫోటో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది (చదవండి: సినిమాలో హీరో మాదిరి కింద పడేశాడు!) -
యూపీలో బుల్డోజర్ల చర్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. కట్టడాల కూల్చివేతలకు ముందు నిర్ణీత విధానాన్ని అనుసరించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతా చట్టం ప్రకారం జరగాలని పేర్కొంది. బుల్డోజర్ల చర్యపై మూడు రోజుల్లో అఫిడవిట్‌ను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా నూపుర్ శర్మవ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన హింసాకాండ అల్లర్ల కేసుల్లో నిందితుల ఇళ్ళను కూల్చేయడాన్ని ఆపాలంటూ జమియత్ ఉలమా-ఇ-హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో హింసాత్మక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను ఇకపై కూల్చివేయకుండా ఉండేలా ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఓ మత వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని యోగీ సర్కార్ వ్యవహరిస్తున్నట్టు పిటిషనర్ ఆరోపణలు చేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు ప్రారంభించారని ఆరోపించారు. ఏ మత వర్గాన్ని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని యోగి ఆదిత్యనాథ్ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది. కూల్చివేత సమయంలో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. అలాగే బుల్డోజర్ల చర్యకు ముందు నోటీసులు అందించలేదనే ఆరోపణను కొట్టిపారేస్తూ.. ప్రయాగ్ రాజ్, కాన్పూర్‌లో కూల్చివేతలకు ముందు నిబంధనల మేరకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పింది. ఈ మేరకు యూపీ సర్కారు తరఫున అడ్వొకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వానికి తన అభ్యంతరాలను దాఖలు చేయడానికి సమయం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అదే సమయంలో పిటిషనర్లకు భద్రత కల్పించాల్సిన భాద్యత తమపై ఉందని, వారు కూడా సమాజంలో భాగమేనని తెలిపింది. చట్టం ప్రకారం మాత్రమే కూల్చివేతలు జరగాలని, ప్రతికారాత్మకంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. చదవండి: చిన్న వయసుసులోనే గుండెపోటు మరణాలు.. ఎందుకు? -
Sakshi Cartoon: బుల్డోజర్ సంస్కృతిని అడ్డుకోండి..
బుల్డోజర్ సంస్కృతిని అడ్డుకోండి.. ‘సుప్రీం’కు న్యాయ నిపుణులు లేఖ -
ప్రయాగ్‌రాజ్ అల్లర్లు: బుల్డోజర్లను దించేసిన యోగి
ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బుల్డోజర్లు రంకెలేశాయి. తాజా ప్రయాగ్‌రాజ్ అల్లర్లకు పాల్పడిన నిందితుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు అక్కడి అధికారులు. నూపుర్ కామెంట్లకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కాస్త హింసకు దారి తీశాయి. ప్రయాగ్‌రాజ్ అల్లర్లకు సంబంధించిన కేసులో మాస్టర్ మైండ్‌గా జావేద్ అహ్మద్ ఇంటిని కూడా ప్రభుత్వం కూల్చేవేతకు దిగింది. లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ మళ్లీ యాక్షన్ లోకి దిగింది. తాజా సహ్రాన్‌పూర్ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఇళ్లను ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్లతో కూల్చివేశారు స్థానిక అధికారులు. ఇవాళ ప్రయాగ్ రాజ్ లో అల్లర్లకు బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టారు. శుక్రవారం ప్రయాగ్ రాజ్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా జావెద్ అహ్మద్ ఉన్నాడు. తాజాగా అతని ఇంటిని కూల్చేశారు ప్రయాగ్ రాజ్ అధికారులు. కరెయిలి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసుల పహారాలో జావేద్ ఇంటిని నేలమట్టం అయ్యింది. ఆ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంతకు ముందు పోలీసులు బుల్డోజర్లతో రావడంతో జావేద్ ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. అయినా భారీ బందోబస్తు మధ్య నిమిషాల్లోనే ఇంటిని కూల్చేశారు స్థానిక అధికారులు. ఇదిలా ఉంటే.. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఉద్యమకారుడైన జావేద్ అహ్మద్.. అక్రమంగా ఆ ఇంటిని నిర్మించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ గత నెలలోనే నోటీసు కూడా జారీ చేసింది. దాన్నొక అక్రమ భవనంగా ప్రకటిస్తూ.. మే 25న పీడీఏ జావేద్ అహ్మద్‌కు ఓ కాపీ కూడా పంపింది. తాజాగా రెండోసారి నోటీసులు పంపించారు. శనివారం ఉదయం 11 గంటలలోగా ఇల్లు ఖాళీ చేయాలని.. లేకుంటే కూల్చివేత తప్పదని నోటీసులో పేర్కొన్నారు. అయినా జావేద్ భార్య, పిల్లలు ఇల్లు ఖాళీ చేయలేదు. దీంతో జావేద్ ఇంటికి వచ్చిన అధికారులు.. మొదట సామాగ్రిని బయటకు తెచ్చారు. తర్వాత బుల్డోజర్ తో ఇంటిని నేలమట్టం చేశారు. తమ తండ్రిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, ఇప్పుడు ఇంటిని కూల్చేశారని జావేద్ కూతురు అఫ్రీన్ ఫాతిమా ప్రభుత్వ తీరుపై మండిపడుతోంది. యూపీలో అల్లర్లకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని గతంలోనే సీఎం యోగీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జరిగిన అల్లర్ల కేసులో మాస్టర్ మైండ్ గా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగింది. నిందితుల ఇళ్లను కూల్చివేయాలని ఆదేశించింది. ప్రయాగ్ రాజ్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 306 మందిని పోలీసులు గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లో 91 మంది, అంబేద్కర్‌నగర్‌లో 34, సహ్రాన్‌పూర్‌లో 71 మంది, హాథ్రస్లో 51 మంది, మురాదాబాద్‌లో 31 మందిని అరెస్ట్ చేశారు. #WATCH | Uttar Pradesh: Demolition drive at the "illegally constructed" residence of Prayagraj violence accused Javed Ahmed continues in Prayagraj. pic.twitter.com/s4etc8Vz25 — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2022 Lucknow, UP | 306 people arrested related to incidents of June 10. 13 injured cops are getting treatment. The situation is normal across the state. Social media is being monitored as well: Prashant Kumar, ADG, Law&Order, UP Police pic.twitter.com/oc4ZThhLjz — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2022 -
Sakshi Cartoon: ‘బుల్డోజర్’కా డబుల్ ఇంజన్?
‘బుల్డోజర్’కా డబుల్ ఇంజన్? -
షాహీన్ బాగ్‌లో బుల్డోజర్లు.. స్థానికుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మళ్లీ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా భారీగా ఆందోళనలు నిర్వహించి వార్తల్లో నిలిచిన షాహీన్ బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం బుల్డోజర్లు, జేసీబీలను అధికారులు షాహీన్బాగ్కు తరలించారు. అయితే ఈ కూల్చివేత డ్రైవ్‌ను అడ్డుకొని స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో షాహిన్ బాగ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక నివాసితులతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకున్నారు. బుల్డోజర్లను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆందోళన కారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి వెనక్కి పంపారు. చదవండి: ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్ #WATCH | Delhi: AAP MLA Amanatullah Khan join the protest at Shaheen Bagh amid the anti-encroachment drive here. pic.twitter.com/4MJVGoku39 — ANI (@ANI) May 9, 2022 ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను ఇప్పటికే తొలగించామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగాశాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే బుల్డోజర్ల చర్య తీసుకున్నారని బీజేపీపై మండిపడ్డారు. కాగా కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జహంగిర్‌పురిలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. Delhi | Locals sit on roads and stop bulldozers that have been brought for the anti-encroachment drive in the Shaheen Bagh area. pic.twitter.com/EQJOWBzAxS — ANI (@ANI) May 9, 2022 -
Sakshi Cartoon: బుల్డోజర్ను వాడటం నిజమే కానీ
బుల్డోజర్ను వాడటం నిజమే కాని వాడింది మనవాళ్లు కాద్సార్! -
Sakshi Cartoon: బుల్డోజర్ అంటే భయపడుతున్న ప్రతిపక్షాలు-బీజేపీ
బుల్డోజర్ అంటే భయపడుతున్న ప్రతిపక్షాలు-బీజేపీ -
బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని
అహ్మదాబాద్: జేసీబీ బుల్డోజర్.. ప్రస్తుతం భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. శ్రీరామ నవమి, హానుమాన్ శోభాయాత్రల సందర్భంగా చెలరేగిన మత ఘర్షణల అనంతరం.. ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. అల్లర్లకు కారణమైన వాళ్లకు చెందిన ఇళ్లను, దుకాణాలను, ఇతర కట్టడాలను.. అక్రమ కట్టాలుగా నిర్ధారించుకుని ప్రభుత్వాలు జేసీబీ బుల్డోజర్లతోనే కూల్చేస్తున్నాయి. ఈ క్రమంలో.. రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. బుల్డోజర్ ట్రెండ్‌లోకి వచ్చేశారు. ఎలాగంటారా?.. గుజరాత్ వడోదరా హలోల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ జేసీబీ ఫ్యాక్టరీని ఆయన సందర్శించాడు. #WATCH UK PM Boris Johnson along with Gujarat CM Bhupendra Patel visits JCB factory at Halol GIDC, Panchmahal in Gujarat (Source: UK Pool) pic.twitter.com/Wki9PKAsDA — ANI (@ANI) April 21, 2022 జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించిన బోరిస్.. హుషారుగా జేసీబీ బుల్డోజర్ ఎక్కి పరిశీలించి కాసేపు సందడి చేశారు. ఆ సమయంలో ఆయన వెంట.. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు. ఇంకేం.. యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1947 నుంచి 2022 వరకు బోరిస్ కవర్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఎందుకంటే.. అంతకు ముందు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి.. చరఖా తిప్పారు. From Gandhi's Charkha to Modi's JCB - Boris Johnson covered the history of India from 1947 to 2022, in a day. pic.twitter.com/1N0Fcku3iT — PuNsTeR™ (@Pun_Starr) April 21, 2022 #WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on 'charkha' pic.twitter.com/6RTCpyce3k — ANI (@ANI) April 21, 2022 మహాత్ముడి రచనల్లో ఒకటైన, ప్రచురణకాని గైడ్ టు లండన్‌ను బోరిస్ కానుకగా అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గుజరాత్లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని బోరిస్.. రేపు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్తారు. आज जेसीबी तेरा भाई चलाएगा 😎 pic.twitter.com/DIacyWBEy4 — Desi Boy 🇮🇳⚙️ (@Desi_b_o_y) April 21, 2022 #JCBKIKHUDAI .. Boris Johnson pic.twitter.com/Qu31P72iQg — Er R K DAHARWAL आर के डहरवालرکدہاروال (@DaharwalK) April 21, 2022 JCB share price pic.twitter.com/RXrJ6AsRbw — Armoured_assault (@Vivek_707) April 21, 2022 -
జహంగీర్‌పురి కూల్చివేతలు.. సారీ చెప్పిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి కూల్చివేతల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ కూల్చివేతలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నాయి. విపక్షాల నిరసన కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నివాసం వద్ద యువజన కాంగ్రెస్ గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, ఎంపీ శక్తి సింగ్ గోహిల్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి, ఉపాధ్యక్షుడు అభిషేక్ దత్తో సహా 15 మందితో కూడిన బృందం జహంగీర్‌పురి బాధితులను కలిసింది. ‘మేము బాధితులను కలిసేందుకు జహంగీర్‌పురికి వచ్చాము. పోలీసులు సహకరించారు. దీన్ని మతం కోణంలో చూడకూడదని ప్రజలకు చెప్పేందుకు ఇక్కడికి వచ్చామ’ని మీడియాతో అజయ్ మాకెన్ చెప్పారు. కూల్చివేతల సమయంలో అక్కడ లేనందుకు క్షమాపణ చెబుతూ మాకెన్ ట్వీట్ చేశారు. (క్లిక్: ఇంత జరుగుతున్నా కేజ్రీవాల్ ఎక్కడ..) విభజన రాజకీయాలు చేయం: మమత ఇక ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘మేము బుల్డోజ్ చేయకూడదనుకుంటున్నాము. ప్రజలను విభజించాలని కోరుకోవడం లేదు. ప్రజలను ఏకం చేయాలనుకుంటున్నాం. ఐకమత్యమే మా ప్రధాన బలం. ఐక్యంగా ఉంటేనే సాంస్కృతికంగా ఎంతో దృఢంగా ఉంటా’మని ఏఎన్ఐతో అన్నారు. మతం ఆధారంగా బుల్డోజర్లు: తేజశ్వి యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... ‘సుప్రీంకోర్టు జోక్యం తర్వాత కూడా జహంగీర్‌పురిలో కూల్చివేతలు కొనసాగాయి. మనదేశంలోకి చైనా చొచ్చుకుని వస్తున్నా చర్యలు శూన్యం. అయితే మతం ఆధారంగా బుల్డోజర్లు నడుపుతున్నార’ని ఆయన వ్యాఖ్యానించారు. (క్లిక్: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్) ఆ ఆరోపణలు సరికాదు: తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందనే ఆరోపణ సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లు జమియత్ ఉలమా-ఐ-హింద్ దాఖలు చేసిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఉత్తర ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జహంగీర్‌పురిలో కూల్చివేతలు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
మత ఘర్షణలకు.. కూల్చివేతకు సంబంధమే లేదు!
ఢిల్లీ: జహంగీర్‌పురి కూల్చివేత ఉద్రిక్తతలపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ స్పందించారు. తాజాగా జరిగిన మత ఘర్షణలకు, ఇవాళ(బుధవారం) చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అంటున్నారు. కోర్టు ఆదేశించినా.. రెండు గంటలపాటు కూల్చివేతలు కొనసాగించడంపై ఆయన్ని మీడియా ప్రశ్నించింది. న్యాయవ్యవస్థపై తమకు వంద శాతం గౌరవం ఉందని, తామేమీ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని వెల్లడించారాయన. అయితే కోర్టు ఆదేశాల కాపీ అందలేదు కాబట్టే తమ చర్యలు కొనసాగించామని, అందాక పనుల్ని వెంటనే ఆపేశామని మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వెల్లడించారు. కేవలం ఆ ఏరియా మాత్రమే కాదు.. ఢిల్లీ మొత్తానికి మేం అక్రమ కట్టడాల విషయంలో హెచ్చరికలు జారీ చేయాలనుకుంటున్నాం. దయచేసి మీ అంతట మీరే తొలగించాలని, ఒకవేళ తొలగించకపోతే తరువాతి వంతు మీదే వస్తుందని ఎప్పుడో చెప్పామని మేయర్ గుర్తుచేశారు. పైగా ఇవాళ తొలగించిన వాటిలో తాత్కాలికమైన దుకాణాలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారాయన.‘‘ప్రజల మద్దతుతోనే ఈ కూల్చివేతలు సాగాయి. రోడ్లు ఇప్పుడు క్లియర్ అయ్యాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది రోటీన్ చర్యలో భాగమే. దీనివెనుక ఎలాంటి ఎజెండా లేదు అని ప్రకటించారాయన. సంబంధిత వార్త: జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
Jahangirpuri Bulldozers: రెండు గంటల హైడ్రామా తర్వాతే..
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానికి చేరిన ‘బుల్డోజర్ ట్రీట్మెంట్’ రాజకీయాలు.. బుధవారం రసవత్తరంగా సాగాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో అక్రమ కట్టాల పేరిట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేత నిలిచిపోయింది. కానీ, అధికారులు మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు తమ పనిని కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10 గంటల సమయంలో.. ఎక్కడైతే హానుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో.. అదే ప్రాంతంలో అక్రమ కట్టాలంటూ కూల్చివేత పనులు మొదలుపెట్టారు అధికారులు. భద్రత కోసం సుమారు 400 మందిని పోలీస్ సిబ్బందిని వెంటపెట్టుకుని.. తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ నిర్మాణలంటూ కూల్చేసుకుంటూ పోయారు. ఈ క్రమంలో పిటిషనర్ సుప్రీం కోర్టును హుటాహుటిన ఆశ్రయించారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో మత ఘర్షణలను సాకుగా చూపిస్తూ ఒక వర్గం వాళ్ల కట్టడాలను కూల్చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కూల్చివేతను ఆపేయాలని ఆదేశించింది. కానీ.. కోర్టు ఆదేశాలు అందలేదని.. తమకింకా కోర్టు ఆదేశాలు అందలేదని చెబుతూ.. అధికారులు తమ పని చేసుకుంటూ ముందుకు పోయారు. అలా ఓ మసీదు గోడ, గేటును సైతం కూల్చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 12 గంటల ప్రాంతంలో సీపీఎం నేత బృందా కారత్.. కోర్టు ఫిజికల్ కాపీతో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత ఆపేయాలంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు బల్డోజర్‌కు ఎదురెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వీడియో సైతం ఒకటి బయటకు వచ్చింది. "The MCD is ignoring the Supreme Court's order staying the demolition. I am here to stop the demolitions and see to it that the court order is implemented": Brinda Karat, CPI(M) leader pic.twitter.com/x34D6oYzit — NDTV (@ndtv) April 20, 2022 స్పందించిన సీజే.. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషనర్ సైతం కూల్చివేత ఆగలేదనే విషయం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వాళ్లకు(ఢిల్లీ మున్సిపల్ అధికారులకు) అందలేదని, దయచేసి ఈ విషయం వాళ్లకు తెలియజేయాలని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. అంతేకాదు మీడియాలోనూ ఇది చూపిస్తున్నారని, ఇది సరైందని కాదని, ఆలస్యమైతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో.. సెక్రటరీ జనరల్ ద్వారా గానీ, సుప్రీం కోర్టు రిజిస్టర్ జనరల్ ద్వారాగానీ తక్షణమే మున్సిపల్ అధికారులతో మాట్లాడించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. న్యాయవాది దవే నుంచి సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు తీసుకుని.. సుప్రీం ఆదేశాల గురించి తెలియజేయాలని కోర్టు సిబ్బందిని ఆదేశించారు. అలా రెండు గంటల హైడ్రామా తర్వాత.. ఎట్టకేలకు ఢిల్లీ జహంగీర్‌పురి బుల్డోజర్ కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇక పిటిషన్‌పై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు.. గురువారం వాదనలు విననుంది. -
Sakshi Cartoon: ప్రజలపై కాద్సార్! సమస్యలపై నడపమంటున్నారు!
ప్రజలపై కాద్సార్! సమస్యలపై నడపమంటున్నారు! -
చైనా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
న్యూఢిల్లీ: చైనా, భారత్ మధ్య సరిహద్దుల్లో గాల్వన్ నదీలోయ సమీపంలో చైనా చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చైనా భారీ సంఖ్యలో బుల్డోజర్లను తీసుకువచ్చి ఏకంగా గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఒక జాతీయ మీడియా సంస్థ బయటపెట్టింది. భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతానికి అర కిలో మీటరు దూరంలోని ఈశాన్య లద్దాఖ్‌లో గాల్వన్ ప్రాంతంలో బుల్డోజర్లతో నదీ ప్రవాహాన్ని తగ్గించేందుకు, మళ్లించేందుకు చైనా యత్నించింది. (చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?) 5 కి.మీ. పైగా క్యూ కట్టిన చైనా వాహనాలు ఘర్షణలు జరిగిన ప్రాంతంలో చైనా తమ భూభాగం వైపు బుల్డోజర్లు, లారీలు, మిలటరీ రవాణా వాహనాలు 5 కి.మీ.ల పొడవునా నిలిపింది. కొందరు భారత్ సైనికులు గాల్వన్ నదిలో పడి కొట్టుకుపోవడం, పర్వతం నుంచి కింద పడడం వంటివి ఫొటోల ద్వారా వెలుగులోకి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెండు ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంది. అక్కడ్నుంచే పక్కాగా కుట్ర పన్ని మరీ ఇనుప రాడ్లతో భారతీయ సైనికులపై దాడి చేసినట్టు వెల్లడైంది. (భారత్‌పై మరోసారి విషం కక్కిన చైనా) రష్యా, చైనాలతో భారత్ త్రైపాక్షిక చర్చలు భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక వర్చువల్ చర్చలు 23న జరుగుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొననుండగా, చైనా, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యి, సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ చెప్పారు. కరోనా, ప్రపంచ భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. త్రైపాక్షిక అవగాహన ప్రకారం.. భారత్, చైనా బలగాల ఘర్షణలు ద్వైపాక్షిక అంశం అయినందున ఇది చర్చకు వచ్చే అవకాశం లేదన్నారు. -
హిందువుల బస్తీ నేలమట్టం చేసిన పాకిస్తాన్
-
పాక్ దుశ్చర్య: హిందువుల ఇళ్లు కూల్చివేత
పంజాబ్ (పాకిస్తాన్): మైనారిటీలపై వివక్ష చూపుతూ పాకిస్తాన్ సాగిస్తున్న ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావద్దని ప్రపంచ దేశాలు పిలుపునిస్తుంటే పాక్ మాత్రం తన సొంత గడ్డ మీద మైనారిటీ హిందువుల ఇళ్లను నేలమట్టం చేసి వికృతరూపాన్ని చాటుకుంది. ఇది ఆ దేశ మంత్రి ఆధ్వర్యంలోనే జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్పూర్లో మైనారిటీల నివాసాలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. నిలువనీడ లేకుండా చేయకండంటూ బాధితులు రోదిస్తూ అధికారుల కాళ్లావేళ్లా పడ్డా ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. (భారత్‌పై పాకిస్తాన్ తీవ్ర విమర్శలు) కళ్ల ముందు ఇల్లు కూలిపోతూ శిథిలాల దిబ్బగా మారుతుంటే హిందువులు గుండెలు పగిలేలా రోదించారు. ఈ కూల్చివేతల ఘోరం ఆ దేశ గృహనిర్మాణ మంత్రి తరీఖ్ బషీర్ పర్యవేక్షణలోనే జరిగింది. ఈ ఘటనలో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా మైనారిటీ హక్కులను కాలరాస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ దారుణానికి పాల్పడింది. ఇటీల ఇదే తరహా ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్‌లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు క్రైస్తవులకు చెందిన ఇళ్లు, స్మశానాన్ని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశాడు. (పాక్ జర్నలిస్ట్‌కు నగ్మా సపోర్ట్: నెటిజన్ల ఫైర్) -
సింగరేణి బుల్ డోజర్ దహనం
మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో సింగరేణి సంస్థకు చెందిన బుల్డోజర్ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. స్థానిక ఓపెన్‌కాస్ట్ గనిలో ఉన్న షావల్ డోజర్‌ను శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసి దుండగులు నిప్పంటించారు. డోజర్‌కు పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఈ మేరకు సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితమే జిల్లాలో మావోయిస్టులు ప్రాణహితపై వంతెన పనులు చేస్తున్న వాహనాలను తగులబెట్టిన విషయం విదితమే. అయితే, తాజా ఘటనలోనూ వారి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.