సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఏ కట్టడాన్నీ కూల్చొద్దు
చట్టవిరుద్ధ కూలి్చవేతలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం
నిందితుల ఇళ్ల జోలికి వెళ్లొద్దు
అక్టోబర్ 1 దాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి: సుప్రీం
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించొచ్చు
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ ఒకటో తేదీదాకా నిందితులతో సహా ఎవరి ఇళ్లనూ కూల్చవద్దని ఆదేశించింది. అయితే రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే స్థలాలు, తదితర ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను నిరభ్యంతరంగా తొలగించవచ్చని తెలిపింది.
తమ ఆదేశాలు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు వర్తించవని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచి్చంది. చట్టవిరుద్ధంగా ఒక్క కూలి్చవేత చోటుచేసుకున్నా.. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దనే ధర్మాసనం ఆదేశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు.
చట్టబద్ధ సంస్థల చేతులను ఇలా కట్టేయలేరని అన్నారు. అయినా ధర్మాసనం తమ ఆదేశాలపై వెనక్కి తగ్గలేదు. కూల్చివేతలు రెండు వారాలు ఆపితే ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించింది. 15 రోజుల్లో ఏమీ జరిగిపోదని పేర్కొంది. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తి పాత్ర పోషించలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అధికారవర్గాలను కూలి్చవేతలు ఆపివేయమని తాను కోరలేనని తుషార్ మెహతా నివేదించగా.. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142 కింద సంక్రమించిన ప్రత్యేక అధికారాల మేరకు.. కూలి్చవేతలు నిలిపివేయమని ఆదేశాలు జారీచేశామని తెలిపింది.
పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూలి్చవేస్తున్నారని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. కూలి్చవేతలపై తప్పుడు అభిప్రాయాన్ని వ్యాప్తిలోకి తెచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘తాను ఒక నిర్దిష్ట మతానికి చెందినందువల్లే తన నిర్మాణాలను కూలి్చవేశారని ఒకరు పిటిషన్ వేశారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూల్చివేతకు దిగిన ఒక్క సంఘటనను ధర్మాసనం దృష్టికి తెమ్మనండి. ప్రభావిత పక్షాలేవీ కోర్టును ఆశ్రయించలేదు. ఎందుకంటే తమకు నోటీసులు అందాయని, తమవి అక్రమ కట్టడాలని వారికి తెలుసు’ అని తుషార్ మెహతా వాదించారు.
బుల్డోజర్లు ఆగవని ఎలా అంటారు?
సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా కూలి్చవేతలను నిలిపివేయాలని, ఈ అంశంలో మార్గదర్శకాలు జారీచేస్తామని సుప్రీంకోర్టు చెప్పినా.. కొందరు ధిక్కార ప్రకటనలు చేయడం పట్ల జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అయినా బుల్డోజర్లు ఆగవని, స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందనే దాన్ని బట్టే ఇది నిర్ణయమవుతుందని ప్రకటనలు చేశారు. వీటిపై ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తున్నాం. కూలి్చవేతలపై మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాక.. బుల్డోజర్ల సంస్కృతిని గొప్పగా, ఘనతగా చెప్పుకోవడాన్ని ఎలా నిరోధించాలనే విషయంలో మీరు మాకు సహాయపడండి’ అని తుషార్ మెహతాకు సూచించింది. నిందితుడు అయినంత మాత్రాన ఇళ్లు కూల్చేస్తారా? ఒకవేళ అతను దోషిగా తేలినా సరే.. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూలి్చవేతలకు దిగలేరు. ఇదెక్కడి బుల్డోజర్ న్యాయమని సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment