government lands
-
డ్రైనేజీ భూముల్లో టీడీపీ గద్దలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇసుక, బుసక, గ్రావెల్, గ్రానైట్‌తోపాటు పచ్చ నేతల కన్ను ఇప్పుడు ప్రభుత్వ భూములపై పడింది. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని డ్రైనేజీ (ప్రభుత్వ) భూములపై పచ్చనేతతోపాటు ఒక మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, ఇన్నాళ్లూ ఆ భూములను కాపుకాసిన విశ్రాంత అధికారి కన్నూ పడింది. తలో ఇంత పంచుకున్నారు. ఎటువంటి పట్టాలు పొందే అవకాశం లేని ఆ ప్రభుత్వ భూములను ఏకంగా అమ్మకానికి పెట్టారు. అగ్రిమెంట్ల మీదనే ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు అమ్మారు. వీటిలో ఎక్కువ భూములను మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దొరకబుచ్చుకున్నారు. ఆ భూముల్లో రొయ్యల చెరువుల సాగుకు సిద్ధమయ్యారు. వేటపాలెం మండలం సంతరావూరు బ్రిడ్జి సమీపంలో ప్రధాన రహదారికి పక్కనే రొంపేరు డ్రైన్, ముసలమ్మ మురుగు నీటి కాలువల మధ్య 50 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. డ్రైన్స్ నిర్మాణంలో భాగంగా వాటిని పూర్వం ప్రభుత్వం కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం వరకు వేటపాలెం ప్రాంతంలో ఉన్న కుమ్మరులు (శాలివాహనులు) కుండలు, ఇతరత్రామట్టి పాత్రలు తయారు చేసేందుకు ఆ భూముల్లో ఉన్న బంకమట్టిని తీసుకువెళ్లేవారు. అప్పట్లో ఆ భూముల ఆక్రమణకు కొందరు నేతలు ప్రయత్నించగా కుమ్మరులు అడ్డుకున్నారు. ఆ తర్వాత మట్టి పాత్రలకు డిమాండ్ పడిపోయి తయారీ నిలిచి పోవడంతో కుమ్మరులు వాటిని వదిలేశారు. దీంతో ఆ భూములపై అక్రమార్కుల కన్నుపడింది.వాలిపోయిన పచ్చ మూకలుఇప్పుడు వాటిని పరిరక్షించే వాళ్లు లేకపోవడంతో పచ్చ మూకలు వాలిపోయాయి. చీరాల ప్రాంతానికి చెందిన టీడీపీ నేత అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, మరికొందరు ఆ భూములను ఆక్రమించారు. 10 మంది కలిసి 15 ఎకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేసేవారు. ఇంకొందరు కొన్ని భూములు వారివంటూ హద్దులు గీసుకున్నారు. వేటపాలేనికి చెందిన డ్రైనేజీ విభాగం విశ్రాంత అధికారి సైతం కొంత మేర ఆక్రమించారు. వాస్తవానికి డ్రైనేజీ, డొంక, శ్మశాన తదితర పోరంబోకు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వదు. ఇక్కడ కూడా ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని సమాచారం. కానీ టీడీపీ నేతల అనుచరులు ఇప్పటికే సుమారు 18 ఎకరాలు ఆక్రమించడంతో పాటు, అప్పటికే ఆక్రమించిన వారి వద్ద భూములను కూడా ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు కొన్నారు. ఇలా ఇప్పటివరకూ 30 ఎకరాలకుపైగా డ్రైనేజీ భూములు విక్రయాలు జరిగినట్లు సమాచారం. డ్రైనేజీ విభాగం రిటైర్డ్ అధికారి సైతం కొన్ని భూములను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. వీటన్నింటినీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడొకరు కొంటున్నారు. ఈ భూముల ఆక్రమణ, అమ్మకాలను అడ్డుకోవాల్సిన డ్రైనేజీ విభాగం అధికారులు కూడా కబ్జాదారులతో కుమ్మక్కైపోయారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారి ఉంటాయని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, డ్రైనేజీ భూములను కొందరు సాగు చేసుకుంటున్న విషయం తన దృష్టిలో ఉందని, ఆక్రమణలు విషయం తన దృష్టికి రాలేదని మురుగునీటిపారుదల శాఖ డీఈ వెంకట సుబ్బారావు చెప్పారు. విచారణ జరిపి క్రయవిక్రయాలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఆ భూములు ఇవ్వండి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ)లకు గతంలో కేటాయించిన భూము ల్లో.. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్నవాటిని తిరిగి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. మొత్తంగా 10 వేల ఎకరాలకుపైగానే నిరుపయోగంగా ఉన్నాయని ఇప్పటికే గుర్తించింది. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ భూములను ప్రభుత్వ ధర తీసుకుని తమకు అప్పగించాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని రెవెన్యూ వర్గాల సమాచారం. మిధాని, డీఆర్డీవో, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీహెచ్ఈఎల్, హెచ్ఏ ఎల్, ఈసీఐఎల్, డీఆర్డీఎల్ వంటి సంస్థల భూములు ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణా రాష్ట్రంలో కూడా ఇలాంటి డిమాండ్ ఉందని, దీంతో ఈ డిమాండ్ల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశముందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. దశాబ్దాల కింద కేటాయింపు.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కోసం దశాబ్దాల క్రితం పెద్ద సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ భూములను కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర అంగీకారంతోపాటు నిబంధనలకు అనుగుణంగా అప్పగించిన ఈ భూములను ఆయా సంస్థలు తమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. అయితే ఆ సంస్థలు ఏ మేరకు భూములను వినియోగించుకుంటున్నాయన్న దానిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ఇటీవల వివరాలు సేకరించింది.రాష్ట్రంలోని 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మొత్తం 8,900 ఎకరాలు కేటాయించగా.. అందులో 2,300 ఎకరాలు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయని, మిగతా భూములను నిరుపయోగంగా వదిలేశారని తేలింది. వీటితోపాటు ఇప్పటికే మూతపడిన సిమెంట్ కార్పొరేషన్, డ్రగ్స్ లిమిటెడ్, హెచ్‌ఎంటీల పరిధిలో మరో 3,300 ఎకరాల వరకు భూమి ఉందని రెవెన్యూ శాఖ గుర్తించింది. రూ.45 వేల కోట్ల విలువతో.. హైదరాబాద్ నగరానికి శివార్లలో, ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ నిరుపయోగ భూముల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.45 వేల కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఈ భూములను ప్రభుత్వ ధరకు తిరిగి తీసుకోవడం ద్వారా... పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య అవసరాలకు, వేలం వేసి నిధుల సమీకరణ చేసుకోవడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వానికి ఇచి్చన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.ఆ నివేదిక ప్రకారం... ప్రభుత్వ ధరతో ఆ భూములను తిరిగి తీసుకోవాలంటే రూ.8 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేసినట్టు సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించిందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే కోరినా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన నిరుపయోగ భూములను ఇవ్వాలని గత బీఆర్ఎస్ సర్కారు కూడా కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2022లో కేంద్రానికి లేఖ రాశారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర పీఎస్‌యూల భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మవద్దని... రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు. కానీ కేంద్రం అప్పట్లో సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఎలా స్పందిస్తున్నదని తేలాల్సి ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బుల్డోజర్లకు బ్రేక్
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ ఒకటో తేదీదాకా నిందితులతో సహా ఎవరి ఇళ్లనూ కూల్చవద్దని ఆదేశించింది. అయితే రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే స్థలాలు, తదితర ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను నిరభ్యంతరంగా తొలగించవచ్చని తెలిపింది. తమ ఆదేశాలు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు వర్తించవని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచి్చంది. చట్టవిరుద్ధంగా ఒక్క కూలి్చవేత చోటుచేసుకున్నా.. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దనే ధర్మాసనం ఆదేశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థల చేతులను ఇలా కట్టేయలేరని అన్నారు. అయినా ధర్మాసనం తమ ఆదేశాలపై వెనక్కి తగ్గలేదు. కూల్చివేతలు రెండు వారాలు ఆపితే ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించింది. 15 రోజుల్లో ఏమీ జరిగిపోదని పేర్కొంది. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తి పాత్ర పోషించలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అధికారవర్గాలను కూలి్చవేతలు ఆపివేయమని తాను కోరలేనని తుషార్ మెహతా నివేదించగా.. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142 కింద సంక్రమించిన ప్రత్యేక అధికారాల మేరకు.. కూలి్చవేతలు నిలిపివేయమని ఆదేశాలు జారీచేశామని తెలిపింది. పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూలి్చవేస్తున్నారని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. కూలి్చవేతలపై తప్పుడు అభిప్రాయాన్ని వ్యాప్తిలోకి తెచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘తాను ఒక నిర్దిష్ట మతానికి చెందినందువల్లే తన నిర్మాణాలను కూలి్చవేశారని ఒకరు పిటిషన్ వేశారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూల్చివేతకు దిగిన ఒక్క సంఘటనను ధర్మాసనం దృష్టికి తెమ్మనండి. ప్రభావిత పక్షాలేవీ కోర్టును ఆశ్రయించలేదు. ఎందుకంటే తమకు నోటీసులు అందాయని, తమవి అక్రమ కట్టడాలని వారికి తెలుసు’ అని తుషార్ మెహతా వాదించారు. బుల్డోజర్లు ఆగవని ఎలా అంటారు? సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా కూలి్చవేతలను నిలిపివేయాలని, ఈ అంశంలో మార్గదర్శకాలు జారీచేస్తామని సుప్రీంకోర్టు చెప్పినా.. కొందరు ధిక్కార ప్రకటనలు చేయడం పట్ల జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అయినా బుల్డోజర్లు ఆగవని, స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందనే దాన్ని బట్టే ఇది నిర్ణయమవుతుందని ప్రకటనలు చేశారు. వీటిపై ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తున్నాం. కూలి్చవేతలపై మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాక.. బుల్డోజర్ల సంస్కృతిని గొప్పగా, ఘనతగా చెప్పుకోవడాన్ని ఎలా నిరోధించాలనే విషయంలో మీరు మాకు సహాయపడండి’ అని తుషార్ మెహతాకు సూచించింది. నిందితుడు అయినంత మాత్రాన ఇళ్లు కూల్చేస్తారా? ఒకవేళ అతను దోషిగా తేలినా సరే.. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూలి్చవేతలకు దిగలేరు. ఇదెక్కడి బుల్డోజర్ న్యాయమని సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
ఆక్రమిస్తే చర్యలు తప్పవు
సాక్షి ప్రతినిధి, వరంగల్: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ప్రభుత్వ వైఖరి ఒకేలా ఉంటుందని, ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడం కోసం అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్‌లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.పోచమ్మకుంట మోడల్ గ్రేవ్ యార్డ్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని పార్కు స్థలాల ఆక్రమణ, రీజనల్ సైన్స్ సెంటర్ భూమి ఆక్రమణ, నాలాల ఆక్రమణలపై మంత్రి ఆరా తీశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి పురోగతిపైనా కలెక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నామని, స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. నాలాలపై ఎలాంటి నిర్మాణాలున్నా.. ఉపేక్షించవద్దని, నాలాలపై నిరుపేదలున్నట్లయితే వారికి సరైన చోట నివాస సదుపాయం కలి్పంచాలని సూచించారు.వరంగల్ ఎంజీఎంలో కొందరు వైద్యులు పేషెంట్లకు మందులివ్వకుండా ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండటం పట్ల మున్సిపల్ అధికారులపైనా మంత్రి సీరియస్ అయ్యారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో తమ ప్రభుత్వం హామీ ఇచి్చందని, అర్హులైన జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పారు.వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో పార్కుస్థలాలు చాలాచోట్ల కబ్జాకు గురయ్యా యని, ఇక్కడ కూడా వాడ్రా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. సమావేశంలో పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద తదితరులు పాల్గొన్నారు. -
రూ.10 వేల కోట్ల రుణంపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్‌లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ సంస్థల షరతులు అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. -
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్‌ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.రావిర్యాల టు ఆమన్‌గల్ వయా ఫ్యూచర్ సిటీసుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్ఆర్ఆర్ లో ని ఆమన్‌గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.916 ఎకరాల భూసమీకరణ..గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే. -
‘సార్.. మా చెరువూ తప్పిపోయింది!’
సాక్షి, హైదరాబాద్: కబ్జాకు ఏ చెరువూ కాదు అనర్హం అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఓ మోస్తరు వాన కురిసినా కాలనీలను వరద ముంచెత్తుతోంది. రోడ్లే చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇక భారీ వర్షం అంటే నగరజీవి బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంటోంది. చెరువులు, కుంటల్లాంటి జలవనరులు, నాలాలు ఆక్రమణలకు గురి కావడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు సామాన్య ప్రజలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చెరువుల్లో ఆక్రమణలపై కొరడా ఝళిపిస్తుండటంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతంలో చెరువుల ఆక్రమణపై హైడ్రాతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేస్తున్నారు. మా చెరువేదీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలతో సహా.. ‘తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్‌నగర్‌లో రికార్డుల ప్రకారం 8 ఎకరాల విస్తీర్ణంలో తుమ్మల చెరువు ఉండాలి. కానీ ప్రస్తుతం దాని అలుగు మాత్రమే కనిపిస్తోంది కానీ చెరువు కనిపించట్లేదు..’అని బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న జలవనరుల పరిరక్షణ కోసం.. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించిన ఈ ఏజెన్సీ 43.94 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలకు సంబంధించి ఈ విభాగానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా వివిధ విభాగాలకు చేసే ఫిర్యాదులకు బాధితులు, ప్రజలు.. పలు పత్రాలు, ఫొటోలు, ఆడియో, వీడియో సీడీల్లాంటివి జత చేస్తుంటారు. కానీ హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులు మాత్రం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ తరహా శాటిలైట్ ఫొటోలను జత చేసి మరీ ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. కాగా ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను హైడ్రా, ఇతర విభాగాలు గోప్యంగా ఉంచుతున్నాయి. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్న వారిలో బాధితులతో పాటు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఉంటున్నట్లు సమాచారం. మాదాపూర్ ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నట్టుగా చెబుతున్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్–కన్వెన్షన్‌పై.. ‘జనం కోసం’అనే సంస్థతో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కూల్చివేత తర్వాతే హైడ్రాకు లెక్కకుమిక్కిలిగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి ఫిర్యాదునూ వివిధ కోణాల్లో పరిశీలించి, రికార్డులు తనిఖీ చేసిన తర్వాతే హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తోంది. అన్ని అనుమతులతో దర్జాగా..! ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో.. అలాగే నాలాలపై నిర్మించిన కట్టడాల్లో రెండు రకాలైనవి ఉంటున్నాయి. కొన్నింటిని అసలు అనుమతులే తీసుకోకుండా నిర్మించేయగా.. మరికొన్నింటికి అవసరమైన అన్ని అనుమతులూ ఉండటం గమనార్హం. ఇరిగేషన్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తదితర శాఖల నుంచి అనుమతులు తీసుకుని మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా.. ఇతర విభాగాలు రోడ్లు, డ్రైనేజీలు వంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక చోట్ల లేఔట్లు, వెంచర్లు, అపార్ట్మెంట్లు కూడా యథేచ్ఛగా వెలిశాయి. ఈ క్రమంలో రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ! ఏదైనా భవనం నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఆద్యంతం పరిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణంలో నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించారని నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ‘నివాసానికి యోగ్యం’అంటూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే రాజధానిలోని చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో నిర్మితమవుతున్న కొన్ని భవనాలకు పనులు పూర్తి కాకుండానే ఓసీలు జారీ అయిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. దీనికి ఆ విభాగం అధికారుల అవినీతే కారణమనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు వాటిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇవ్వడాన్ని గుర్తించిన హైడ్రా అధికారులు వాటిని రద్దు చేయాల్సిందిగా కోరుతూ హెచ్ఎండీఏకు లేఖ రాశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టనున్నారు. ఆ అధికారుల గుండెల్లో రైళ్లు ప్రస్తుతానికి ఆయా నిర్మాణాల కూల్చివేతల పైనే హైడ్రా దృష్టి పెడుతోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల కబ్జాల నిరోధం, విపత్తు స్పందన.. తదితర లక్ష్యాలతో ఏర్పాటు అయిన హైడ్రా జలవనరుల పరిరక్షణకే పెద్దపీట వేసి ముందుకు వెళ్తోంది. అయితే ఈ విభాగానికి ప్రత్యేక పోలీసుస్టేషన్ మంజూరైన తరువాత మరో అడుగు ముందుకు వేయనుంది. ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రతి విభాగం, ఆయా అధికారుల పైనా విచారణ జరిపి, సంబంధిత శాఖలకు నివేదికలు ఇవ్వడంతో పాటు చర్యలకు సిఫారసు చేయనుంది. దీంతో ప్రస్తుతం ఆయా విభాగాలకు చెందిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 10 వేలకు మిగిలింది 3,900 ఎకరాలే...నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ‘గ్రేటర్’తో పాటు చుట్టుపక్కల ఉన్న 56 చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసింది. 1979–2023 మధ్య 44 ఏళ్లలో అవి ఏ స్థాయిలో కబ్జాలకు గురయ్యాయో తేల్చింది. అప్పట్లో 10416.8 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ జలవనరులు గత ఏడాది నాటికి 3,974.1 ఎకరాలకు పడిపోయాయి. ఇలా మొత్తమ్మీద 61 శాతం మాయమై కేవలం 39 శాతం మిగిలినట్లు ఎన్ఆర్ఎస్సీ లెక్కకట్టింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్ని మార్చాలని కోరుతూ హైడ్రాకు నివేదిక సమర్పించింది. చెక్కు చెదరని హకీంపేట.. విస్తరించిన చెన్నపురంరాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న డిఫెన్స్ ఏరియా హకీంపేటలోని 18 ఎకరాల చెరువు మాత్రం ఇప్పటికీ అలాగే ఉందని ఎన్ఆర్ఎస్సీ సర్వే వెల్లడించింది. అలాగే ఈ సర్వేలో వెలుగులోకి వచ్చిన మరో ఆసక్తికర అంశం చెన్నపురం చెరువుకు సంబంధించింది. సికింద్రాబాద్ చంద్రపురికాలనీలో ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 44 ఏళ్లల్లో పెరిగింది. 1979లో ఇది 16 ఎకరాల్లో విస్తరించి ఉండగా..2023 నాటికి 15 శాతం పెరిగి 18.2 ఎకరాలకు చేరింది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన హైడ్రా..చెరువు విస్తీర్ణం అలా పెరగడానికి కారణాలను విశ్లేషించాలని నిర్ణయించింది.ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లూ వర్తించవు.. మూడు దశల్లో కార్యాచరణ అమలుహైడ్రా పరిధిలో ఉన్న ప్రతి చెరువు, కుంట పూర్వాపరాలు అధ్యయనం చేస్తున్నాం. కూల్చివేతలు అనేవి చట్ట ప్రకారం జరుగుతాయి. ఇలాంటి చర్యలు తీసుకునే ముందు ఆద్యంతం పరిశీలిస్తాం. నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు పూడ్చే ట్రాక్టర్లు, టిప్పర్లను కూడా భవిష్యత్తులో సీజ్ చేయనున్నాం. చెరువు, కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పార్కు స్థలాలకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లు వర్తించవు. చెరువులు, కుంటలు, నాలాలు తదితరాల పరిరక్షణ కోసం హైడ్రా మూడు దశల్లో కార్యాచరణ అమలు చేస్తోంది. మొదటి దశలో ఇకపై ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఒక్క చదరపు అడుగు కూడా ఆక్రమణ కాకుండా చూస్తోంది. రెండో దశలో ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో అనుమతి ఉన్నా, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాం. మూడో దశలో ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న మాదిరిగా చెరువుల పునరుద్ధరణ చేపడతాం. నగరంలో ఉన్నవి అన్నీ గొలుసుకట్టు చెరువులే. ఒకటి అలుగు పారితే ఆ నీరు నాలాలు, వాగుల ద్వారా మరో దాంట్లోకి వెళ్లాలి. ఆ పరిస్థితిని మళ్లీ తీసుకురావడానికి కృషి చేస్తాం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు, లేఔట్లలో ప్రజలు ఫ్లాట్లు, స్థలాలు ఖరీదు చేయొద్దు. త్వరలో ఈ వివరాలను వెబ్సైట్లో పెడతాం. ఇప్పటికే ఇలా ఖరీదు చేసి నష్టపోయిన వాళ్లు ఉంటే బిల్డర్‌పై కేసు పెట్టండి.– ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ -
Telangana: బోగస్ కృష్ణ‘పట్టా’!
తిరుమలగిరి (సాగర్) మండలంలోని గోడుమడకకు చెందిన ఈయన పేరు బారు శివయ్య. ఆయనకు చింతలపాలెం రెవెన్యూ శివార్లలోని సర్వే నంబర్ 14లో 4.30 గుంటల భూమి ఉంది. తాతల కాలం నుంచీ వారే ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. నేటికీ రికార్డుల్లో పేరు లేకపోవడంతో పట్టాదారు పాసుపుస్తకం అందలేదు. కానీ కొందరు ఈ భూమికి సంబంధించి అక్రమంగా పట్టాలను చేయించుకుని రైతుబంధు, రైతుబీమా పథకాలు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. భూమి తమ స్వాదీనం (కబ్జా)లో ఉన్నా.. తమకు పాస్ పుస్తకం లేక ప్రభుత్వ పథకాలు అందడం లేదని శివయ్య వాపోయారు...ఈయన ఒక్కరి భూమే కాదు. కేవలం ప్రైవేటు వ్యక్తుల అదీనంలోని స్థలాలే కాదు.. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కూడా అక్రమార్కులు చెరబట్టారు. భూమిని ఏళ్లకేళ్లుగా సాగుచేసుకుంటున్నవారు పట్టాలు లేక, హక్కుల్లేక ప్రభుత్వ పథకాలకు దూరమైతే... కొందరు అవే భూములపై నకిలీ పట్టాలు సృష్టించి, ప్రభుత్వం నుంచి రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల సొమ్మును కాజేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రభుత్వ భూములకే బోగస్ పట్టాలు సృష్టించేశారు. కృష్ణపట్టె ప్రాంతమైన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో తాజాగా బయటపడిన బాగోతమిది. అక్రమార్కులు ఈ మండలంలో 3,900 ఎకరాలకు బోగస్ పట్టాలు సృష్టించినట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. తద్వారా ఏటా రూ.3.5 కోట్ల చొప్పున గత పదేళ్లలో రూ.35 కోట్లకుపైగా రైతుబంధు రూపంలోనే పొందినట్టు అధికారులు భావిస్తున్నారు. బోగస్ పట్టాలతో రైతుబీమా, బ్యాంకుల్లో రుణాలు పొందినట్టు తేల్చారు. సమీపంలోని దామరచర్ల మండలంలోనూ వేల ఎకరాల ప్రభుత్వ భూములు బోగస్ పట్టాలతో కబ్జా అయినట్టు రెవెన్యూ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ముడుపులకు అలవాటుపడిన అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ అక్రమాలు సాగాయని అంటున్నారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండసాక్షి ప్రతినిధి, నల్లగొండ: ధరణి సమస్యలతో రైతులు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో పరిష్కార మార్గాలపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా లోని తిరుమలగిరి (సాగర్) మండలంలో నెలకొన్న పరిస్థితిని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ప్రభుత్వం తిరుమలగిరి (సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. భూముల సమస్య లపై విచారణ చేపట్టింది. అధికారులు ప్రాథమిక విచారణలోనే 3,900 ఎకరాలకు కొందరు బోగస్ పట్టాలు సృష్టించినట్టు గుర్తించారు. మండలంలోని చింతలపాలెం గ్రామంలోని 12, 222, 158, 162, 223 సర్వే నంబర్లలో, తిమ్మాయి పాలెం గ్రామంలోని 38, 39, 60, 70, 74 సర్వే నంబర్లలో అక్రమ పట్టాలు ఉన్నట్టు తేల్చారు. వీటితోపాటు తునికినూతల గ్రామంలో సర్వే నంబర్ 45, నెల్లికల్ గ్రామంలో 424 సర్వే నంబర్, జమ్మలకోట గ్రామంలో 28 సర్వేనంబర్లలో అక్రమంగా పట్టాలు పొందినట్టు గుర్తించారు. చింతలపాలెం, తిమ్మాయిపల్లి రెండు గ్రామాల్లోనే 2,800 ఎకరా లకు నకిలీ పట్టాలు సృష్టించినట్టు తేలడం గమనార్హం. ప్రభుత్వ భూములనూ బోగస్ పట్టాలతో చెరబట్టినట్టు గుర్తించారు. దీంతో ఈ అక్రమాలను పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 14 రెవెన్యూ, సర్వే బృందాల ఆధ్వర్యంలో 80 మందికిపైగా సిబ్బంది తో క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టింది. నకిలీ స్వాతంత్య్ర సమరయోధుల పేరిట పట్టాలు దామరచర్ల మండలంలోని సర్వే నంబర్లు 686, 691, 1100, 735, 655, 621, 690, 714తోపాటు మరో 33 సర్వే నంబర్లలో 4,542 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై కబ్జాదారు ల కన్ను పడింది. దీంతో భూబకాసురులకు.. స్వాతంత్య్ర సమరయోధులు గుర్తుకొచ్చారు. నకిలీ సమర యో ధులను సృష్టించి, తమ చేతివాటం ప్రదర్శించి, అధికారులను మచి్చక చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను దోచేశారు. వాటిపైనే ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది.60 ఏళ్లుగా సేద్యం చేస్తున్నా.. హక్కులు తొలగించారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మా గ్రామం ముంపునకు గురికావడంతో చిన్నాయిపా లెం తండాలో పునరావా సం కల్పించారు. 1962లో అప్పటి ప్రభుత్వం పట్టాలు అందజేసింది. 60 ఏళ్లుగా అక్కడే సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నాం. ధరణికి ముందు వరకు బ్యాంకులో రుణాలు పొందాం. 2016 భూప్రక్షాళన సమయంలో మా భూములను పార్ట్–బీలో చేర్చడంతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు. అప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. బ్యాంకు రుణం తీసుకునే అవకాశం లేకుండాపోయింది. – రమావత్ హనుమ, చెన్నాయపాలెంమొత్తం రీసర్వే.. అక్రమ పట్టాల తొలగింపే లక్ష్యం తిరుమలగిరి సాగర్ మండలంలోని అన్ని భూములపై రీసర్వే చేస్తున్నాం. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. 100 ఎకరాల భూమి ఉంటే రికార్డుల్లో 200 ఎకరాలకు పేర్లు ఉన్నాయి. భూమి స్వా«దీనంలో ఉన్న వారి పేర్లు ధరణిలో లేవు. ధరణిలో పేర్లు ఉన్నవారి స్వాదీనంలో భూములు లేవు. ఎవాక్యూ ప్రాపర్టీని కబ్జా చేసి పట్టాలు సృష్టించారు. అటవీ భూముల హద్దుల సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ తేల్చి.. అర్హులకు పట్టాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఈ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మండలంలోని ప్రతి సర్వే నంబరులోనూ విస్తృత సర్వే చేస్తున్నాం. ఆ భూమి ఎవరిదని తేల్చి, నకిలీ పట్టాలను రద్దు చేసి.. కబ్జాలో ఉన్న అసలైన అర్హుల పేరిట పట్టాలు ఇచ్చి, న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాం. – నారాయణరెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ -
‘అసైన్డ్’ ఆక్రమణ.. బడుగుల భూముల్లో వాలిన పచ్చ గద్దలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రాజధాని పేరిట చంద్రబాబు సొంత సంస్థానాన్ని సృష్టించుకున్నారు. స్వతంత్య్ర దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని భూదోపిడీకి బాటలు వేశారు. ఆధునిక జమీందారులా మారిపోయి బడుగుల భూములకు ఎసరు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్ భూములను లాక్కున్నారు. రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములను చెరబట్టారు. ప్రైవేట్ భూములను హస్తగతం చేసుకున్నారు. అధికారం అండతో భూ దందాలకు మార్గదర్శిగా నిలిచారు. 2014 – 19 మధ్య అధికారంలో ఉండగా భూసమీకరణ ప్యాకేజీ మార్కెట్ విలువ ప్రకారం ఏకంగా రూ.5,500 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టడం దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీగా రికార్డులకు ఎక్కింది. చంద్రబాబు బృందం అరాచకాలు సీఐడీ విచారణలో పూర్తి ఆధారాలతో నిగ్గు తేలాయి. దీనిపై సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.బెదిరించి లాక్కుని తాపీగా ప్యాకేజీ..అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్దలు పక్కా వ్యూహం రచించారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమంటూ బెదిరించి 814 మంది బినామీల ముసుగులో కాజేశారు. అనంతరం అసైన్డ్ భూములకు ప్యాకేజీని ప్రకటించడం వారి కుతంత్రానికి నిదర్శనంగా నిలుస్తోంది. భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015 జనవరి 1న టీడీపీ సర్కారు జీవో నంబరు 1 జారీ చేసింది. ఆ జీవోలో ప్రైవేట్ భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను హడలగొట్టారు. దీంతో గత్యంతరం లేక కారు చౌకగా ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్ డీడ్ల ద్వారా విక్రయించే పరిస్థితి కల్పించారు. ఆ తరువాత అసైన్డ్ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న తాపీగా జీవో నంబరు 41 జారీ చేశారు. అప్పటికే అసైన్డ్ భూములు టీడీపీ పెద్దల బినామీల పరం కావడంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా స్కెచ్ వేశారు.ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతర్ చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఆ తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం. ఈమేరకు నాటి కలెక్టర్, సీఆర్డీయే, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తమ అభ్యంతరాలను జీవో 41 నోట్ ఫైళ్లలో ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వెల్లడించారు. వీటిని లెక్క చేయకుండా బినామీల ద్వారా హస్తగతం చేసుకున్న భూములకు చంద్రబాబు ప్యాకేజీని ప్రకటించారు.అసైన్డ్ భూ దోపిడీదారులు..ఏ–1: చంద్రబాబు నాయుడుఏ–2 : పొంగూరు నారాయణఏ–3 : అన్నే సుధీర్‌బాబు (అప్పటి తుళ్లూరు మండల తహసీల్దార్)ఏ–4 : కేపీవీ అంజనీకుమార్ (ఎండీ, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్)1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలుచంద్రబాబు బృందం అమరావతి పరిధిలో ఏకంగా 1,100 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టింది. మొత్తం 1,336 మంది బినామీల పేరిట ఆ భూములను హస్తగతం చేసుకున్నారు. భూ సమీకరణ ప్యాకేజీ ప్రకారం ఆ భూముల విలువ ఏకంగా రూ.5,500 కోట్లు కావడం చంద్రబాబు భారీ భూదోపిడీకి నిదర్శనం.కోర్టును మోసం చేసి మరీ...అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. ఈ కుట్రను అమలు చేసేందుకు రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు. 1954 తరువాత భూ పంపిణీ రికార్డులేవీ లేవంటూ మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు. వాస్తవానికి 1954 తరువాత పలుదఫాలు పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ జరిగింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004–05లో అసైన్డ్ భూములను పంపిణీ చేశారు. అమరావతి అసైన్డ్ భూములలో 1954 తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నట్లు రుజువు చేసే రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఉన్నట్లు వెల్లడైంది. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం బట్టబయలైంది.ఉన్నతాధికారుల వాంగ్మూలంటీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు చేసినట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్‌గా పరిగణించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఏ 1 బాబు, ఏ 2 నారాయణఅమరావతి భూ దోపిడీ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. -
518 ఎకరాలు.. హాంఫట్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 11 గ్రామాల పరిధిలో.. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది. అత్య ధికంగా బ్యాతోల్‌లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్కల్లో 57 కాశీపూర్‌లో 41 ఎకరాలు, ఉత్తర్‌పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్‌లో మార్చేసి.. అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్భూములను ధరణి పోర్టల్‌లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్. -
కొన్నారు.. తిన్నారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల ఏర్పాటు సమాచారం ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులకు ముందే తెలియడం సహజం. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా, ఏదైనా భారీ ప్రాజెక్టు/ సంస్థ రాబోతుందంటే చాలు చకాచకా పావులు కదపడం, ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న భూముల్ని గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరకు కుటుంబసభ్యులు, బినామీల పేరిట కొనేయడం, సదరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చగానే ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించేసి కోట్లకు పడగలెత్తడం.. విషయం తెలిసిన రైతులు లబోదిబోమనడం.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విషయంలోనూ ఇదే జరిగింది. ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఇప్పటి ఓ మంత్రి సైతం ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం గమనార్హం. భూదాన్ భూములకూ కొందరు ఎసరు పెట్టడం కొసమెరుపు. కుటుంబసభ్యులు, బినామీల పేరిట దందా 2017లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడంతో దేశవిదేశాలకు చెందిన 500కు పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమిని ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్నారనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందే తెలియడంతో బినామీలను, కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. ఓ మాజీ ఐపీఎస్ రైతుల్ని బెదిరించి..! ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను బినామీల పేర్లపై కొనుగోలు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో భాగంగా ఎకరా రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల లోపే కొనుగోలు చేశారు. ఆయా గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూములను విక్రయించడానికి స్థానిక రైతులు కొందరు నిరాకరించినా, బినామీల ద్వారా రైతులను బెదిరింపులకు గురి చేసి భూములు అమ్మేలా ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి ఫార్మాసిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బినామీల పేరిట ఉన్న 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ఎకరం రూ.12.50 లక్షల చొప్పున ఫార్మాసిటీకి ఇచ్చేయడం గమనార్హం. కురి్మద్ద, తాడిపర్తి, నానక్‌నగర్ గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని ఫార్మాసిటీకి ఇచ్చేసి నష్ట పరిహారం కింద రూ.కోట్లు సంపాదించారు. కేసీఆర్ సర్కార్‌లో చక్రం తిప్పిన కీలక అధికారులు కొందరు కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని దాదాపు 300 ఎకరాలకు పైగా పట్టాభూమిని ఫార్మాసిటీకి తీసుకోవాలని రియల్ వ్యాపారులే స్వయంగా ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు ఇవ్వడం గమనార్హం. కాగా తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, అధిక ధరలకు ఫార్మాసిటీకి అప్పగించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లపై మీర్ఖాన్పేటలోని హెచ్ఎండీఏ వెంచర్లో అదనంగా ఎకరాల కొద్దీ ప్లాట్లు మంజూరు అయ్యాయి. భూదాన్ భూమిని కొల్లగొట్టిన నేతలు తాడిపర్తి రెవెన్యూ సర్వే నంబర్ 104లో 468.34 ఎకరాల భూమి ఉంది. దాని యజమానులు అప్పట్లో 250 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారు. సదరు భూమిని తమ పేరున రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా 16/11/2005 లోనే భూదాన్‌బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకు పహణీల్లోనూ నమోదు చేశారు. అయితే ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎంపీ ఈ భూములను తమ బినామీ పేరున కొట్టేశారు. అంతేకాదు కొండలు, గుట్టలతో కూడిన ఈ భూమి సాగులో ఉన్నట్లు చూపించారు. భూ సేకరణలో భాగంగా ఈ భూములను ఫార్మాసిటీకి అప్పగించి ఎకరానికి రూ.16 లక్షల చొప్పున నష్టపరిహారం పొందారు. ఇలా ప్రభుత్వం నుంచి రూ.40 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతేకాదు మీర్ఖాన్పేటలో ఎకరానికి 121 గజాల ఇంటి స్థలాన్ని కూడా పొందారు. ఈ భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన వారిలో స్థానికులు కాకుండా అంతా ఇతర ప్రాంతాలకు చెందిన నేతల బినామీలే ఉండటం గమనార్హం. ఈ అంశంపై తాడిపర్తి గ్రామస్తులు అప్పటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పట్లో ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన ఓ అధికారి భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఖజానాను భారీగా కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి పరిధిలో మాజీ సీఎస్ కొనుగోళ్లు మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ తన భార్య పేరున యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249, 260లలో 25.19 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ పక్కనే సర్వే నంబర్ 244 నుంచి 269 వరకు ఉన్న 125 ఎకరాలు తన కుటుంబ సన్నిహితులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట కొనుగోలు చేయించారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా (2016 నుంచి 2018 వరకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు సీఎస్‌గా పని చేశారు) ఉన్నారు. సాగుకు యోగ్యం లేని ఈ భూములకు రైతుబంధు పథకం కింద రూ.14 లక్షల వరకు లబ్ధి పొందినట్లు మాజీ సీఎస్‌పై ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ భూముల కొనుగోలుపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ బుధవారం యాచారం తహశీల్దార్ కార్యా లయానికి చేరుకుని పలు రికార్డులను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా తాను నిబంధనల ప్రకారమే భూములు కొన్నానని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని సోమేష్ చెబుతున్నారు. మాజీ ఐపీఎస్ భూములు ఇచ్చింది వాస్తవమే ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్తి గ్రామాల్లో దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించాడు. ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో నక్కర్తమేడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన 200 ఎకరాలకు పైగా భూమిని ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ఇచ్చేశాడు. ఆ అధికారి కొత్తపల్లి గ్రామంలో కూడా వందలాది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. – పాశ్ఛ భాషా, మాజీ సర్పంచ్ నక్కర్తమేడిపల్లి -
ప్రభుత్వ భూముల్లో..పేదలపై పెత్తనం
ప్రభుత్వ భూముల్లో పెత్తందారులు పెత్తనం చెలాయిస్తున్నారు. అసైన్డ్ పట్టాలిచ్చారంటూ స్థానికులు, అధికారులను నమ్మించి దర్జాగా అనుభవిస్తున్నారు. పక్కనే ఉన్న మిగులు భూముల్లో దళితులు ఆటస్థలం కోసం చదును చేసుకుంటే వారిపై దౌర్జన్యానికి దిగారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియో జకవర్గం, బాలాయపల్లి మండల పరిధిలోని రామాపురంలో వెలుగుచూసిన టీడీపీ నేతల ఆక్రమణ పర్వంపై ‘సాక్షి’ ఫోకస్.. సాక్షి, తిరుపతి: రామాపురం పరిధిలో సర్వే నంబర్ 177లో 348.98 ఎకరాల మేతపోరంబోకు భూమి ఉంది. అదేవిధంగా సర్వే నంబర్ 189లో 37.7 ఎకరాల చెరువు పోరంబోకు, సర్వే నంబర్ 178/1, 179, 180లో ప్రభుత్వ, చెరువు పోరంబోకు భూమి ఉంది. కోట్ల రూపాయల విలువచేసే ఈ భూములపై టీడీపీ నేతల కన్నుపడింది. రామాపురం మారుమూల గ్రామం కావడంతో అప్పట్లో అధికారుల రాకపోకలు పెద్దగా ఉండేవి కావు. ఇదేఅదునుగా టీడీపీ నేతలు కొద్దికొద్దిగా ఆక్రమించుకోవడం ప్రారంభించారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు అదే గ్రామ పరిధిలోని దళిత, గిరిజనులు ఆ భూములవైపు వెళ్లకుండా అడ్డుకుంటూ వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ పథకం కింద స్థానిక దిళత, గిరిజనులను జాబితాలో చేర్చినట్లు సమాచారం. అయితే పెత్తందారులు వారి పేర్లను తొలగించినట్లు స్థానికులు ఆరోపించారు. పెత్తందార్లను ఎదిరిస్తే సాంఘిక బహిష్కరణే! పెత్తందారులంతా ఏకమై రామాపురం పరిధిలో ఉన్న ప్రభుత్వ, చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరెవరు ఎంతెంత ఆక్రమించుకోవాలో మాట్లాడుకున్నారు. పేరు, పలుకుబడి ఉన్న వారు ఆరు ఎకరాల చొప్పున ఆక్రమించుకుంటే.. వారితో ఉన్న మరికొందరు 1, 2, 3 ఎకరాల చొప్పున ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న భూమిలో నిమ్మచెట్లు సాగుచేశారు. పదేళ్ల క్రితం పెట్టిన చెట్లు కావడంతో ప్రస్తుతం పెద్దవయ్యాయి. అక్రమణదారులకు స్థానిక అధికారులు పూర్తిసహాయ సహకారాలు అందిస్తున్నట్టు దళిత, గిరిజనులు ఆరోపిస్తున్నారు. వారిని కాదని ఎదురు తిరిగితే సాంఘిక బహిష్కరణకు గురికాక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆట స్థలం ఏర్పాటు చేసుకుంటే దౌర్జన్యం స్థానిక యువకులు కొందరు బీడుగా ఉన్న ప్రభుత్వ భూమి రెండెకరాల్లో క్రికెట్ ఆడుకునేందుకు ఆటస్థలంగా తీర్చుకున్నారు. జీరి్ణంచుకోలేని పెత్తందారులు స్థానిక రెవెన్యూ అధికారులను రెచ్చగొట్టి యువకులపైకి పంపారు. ఆటస్థలాన్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా దళిత, గిరిజనులు కొందరు బీడుగా ఉన్న భూమిలో నిమ్మచెట్లు పెట్టడంతో.. పెత్తందారులు అధికారుల సహకారంతో ఆ చెట్లను పీకించేశారు. సర్వే నంబర్ 177లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొందరు ఏకమై ఇటీవల తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడం గమనార్హం. -
కొత్త ఇండస్ట్రీ వస్తుంటే ‘ఈనాడు’ ఏడుపు!
సాక్షి, అమరావతి: వేలాది మందికి ఉపాధి కల్పించేలా ఒక కొత్త పరిశ్రమ వస్తుంటే ‘ఈనాడు’కు ఏడుపు ముంచుకొస్తోంది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ మైలేజీ ఇంకా పెరిగిపోతోందోనని ఆందోళన చెందుతోంది. ఉన్నవి లేనివి అన్నీ కలిపి.. టన్నులకొద్దీ బురదజల్లుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతోంది. ఏదైనా ఇండస్ట్రీ రాకపోతే ఏడవడం మామూలే అనుకుంటే.. ఎంతో మందికి ఉపకరించే పరిశ్రమ మన రాష్ట్రంలో వెలుస్తోందంటే ఎందుకు ఏడుస్తున్నట్లు? ఎవరి కోసం ఏడుస్తున్నట్లో ఇట్టే అర్థమవుతోంది. ఇండస్ట్రియల్ హబ్ పేరుతో షిర్డిసాయి ఎలక్ట్రికల్ అనుబంధ కంపెనీ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా రావూరు, చేవూరు గ్రామాల్లోని 4,827.04 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టేస్తోందని మంగళవారం ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కింది. షిర్డి సాయి ఏ విధంగా చిన్న సంస్థ? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ)కు అర్హత సాధించిన కంపెనీ. ఆర్థిక స్థితిగతులు, కంపెనీ పనితీరు, సామర్థ్యం చూశాకే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఇలాంటి కంపెనీని పట్టుకుని ‘ఈనాడు’ విషం కక్కడం దుర్మార్గం. కేవలం కడపకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చెందిన సంస్థ కావడమే పాపమైపోయింది. విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను ఎంవీవీఎస్ మూర్తి ఆక్రమించినప్పుడు ఏనాడైనా ఈనాడు ఇలాంటి కథనం రాసిందా? ‘షిర్డిసాయికి 4,827 ఎకరాలు’ శీర్షికన ప్రచురించిన ఈనాడు కథనంలో అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : సీఎంకు సన్నిహితుడైన వ్యక్తికి చెందినది.. వాస్తవం : ఈ కంపెనీ కోసం ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు చాలా ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుతం పరిశ్రమల కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్న ప్రస్తుత వాతావరణంలో ఇలాంటి కంపెనీలు వస్తున్నాయంటే రెడ్ కార్పెట్ పరుస్తారు. అలాంటివేమీ అవసరం లేకుండానే వెనకబడ్డ రామాయపట్నం లాంటి ప్రాంతంలో కంపెనీ పెట్టడానికి ముందుకొచ్చింది. గతంలో కియా సంస్థకు ఇచ్చిన స్థాయిలో కూడా ఇండోసోల్‌కు రాయితీలు ఇవ్వలేదు. భూమి, కరెంట్, ఎస్జీఎస్టీ, మౌలిక సౌకర్యాల విషయంలోనూ కియా కంటే తక్కువ ప్రోత్సాహకాలే ఇచ్చారు. ఈ స్థాయిలో ఏ కంపెనీ వచ్చినా ఏ ప్రభుత్వమైనా సహకరిస్తుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుండటం. ఆరోపణ: హైదరాబాద్‌లో రిజిస్టరైన కంపెనీ వాస్తవం : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోనే రిజిస్టర్ అయి ఉండక్కర్లేదు. ఉదాహరణకు కియా పరిశ్రమనే తీసుకుంటే ఆ సంస్థ మన రాష్ట్రానికి చెందిందా? కియా కోసం యూనిట్ రూ.3 చొప్పున 100 శాతం విద్యుత్‌ను 20 ఏళ్ల పాటు ఇస్తుంది. ఇండోసోల్‌కు మాత్రం 7 సంవత్సరాల పాటు యూనిట్‌కు రూ.4.5 చొప్పున, ఆ తర్వాత 8 సంవత్సరాలకు యూనిట్‌కు రూ.4.5 చొప్పున 40% విద్యుత్‌ను మాత్రమే కేటాయించారు. సొంత విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు (క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను) స్థలం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం ఇండోసాల్ తన సొంత ఖర్చుతో 7.2 గిగా వాట్స్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించింది. కియాకు ఎకరా రూ.6 లక్షలతో మాత్రమే సేకరించే అవకాశం ఇచ్చింది. పైగా భూమిని చదును చేసే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఆరోపణ: అప్పనంగా భూములు కట్టబెట్టేస్తోంది.. వాస్తవం : ఈనాడు చెబుతున్నట్టుగా 4,827 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం లేదు. పైగా అవి ప్రభుత్వ భూములు కావు. రామాయపట్నంలో ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డ్ ద్వారా భూ సేకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం అమల్లో విధానం ప్రకారం భూసేకరణ కయ్యే వ్యయాన్ని పూర్తిగా మార్కెట్ ధర ప్రకారం ఇండోసోల్ కంపెనీయే భరిస్తుంది. అంతే గానీ భూమి కొనుగోలు కోసం ఇండోసోల్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీ ఇవ్వలేదు. ఆరోపణ: కలెక్టర్ లేఖ ఆధారంగా భూ సేకరణ వాస్తవం : దేశంలోనే అతి పెద్ద పీవీ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ కోసం ఈ భూమిని సేకరిస్తున్నారు. ఈ యూనిట్ మొదటి దశకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అర్హత సాధించింది. దాని ప్రకారం జాతీయ ప్రాముఖ్యతను కలిగిన ప్రాజెక్టు కోసం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భూసేకరణ జరుగుతోంది. ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమైన భాగాలపై ఆధార పడటాన్ని తగ్గించడం, గ్రామీణ విద్యుదీకరణ కోసం అవసరమైన విధానాలను కేంద్రం రూపొందించింది. ఇండ్రస్టియల్ కారిడార్లు, హబ్‌ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మేరకు అధిక జీతంతో కూడిన ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ అవసరాలను తీర్చడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో భాగం. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా, కేబినెట్ ఆమోదంతో ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు భూ సేకరణ కోసం చర్యలు చేపట్టింది. ఆరోపణ: ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగించలేదు.. వాస్తవం : రాష్ట్రంలోని ప్రముఖ విద్యుత్ ఉప కరణాల తయారీ కంపెనీ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇప్పటికే షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 2,500 మందికి పైగా ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఇడిఎ) ద్వారా సమీకృత సోలార్ మాడ్యూల్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) బిడ్డింగ్‌లో రిలయన్స్, అదానీలతో పోటీ పడి ఎల్–1గా నిలిచి రూ.1875 కోట్ల రాయితీలను దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్ల వ్యవధిలో దశల వారీగా ప్రత్యక్షంగా 11,500 మందికి, పరోక్షంగా దాదాపు 10,000 –11,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా 11,500 మందికి ఉపాధి కల్పిస్తుండటంతో రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు జాగ్రత్తగా పరిశీలించాకే ప్రోత్సాహకాలను వర్తింప చేసింది. -
ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్నా
రాయచోటి: ప్రజా సేవే ధ్యేయంగా తాను పనిచేస్తానని, ప్రజల వద్ద తలదించుకునే పనిని ఎప్పుడూ చేయనని, ఆరోజు వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. సాక్ష్యాధారాలు లేకుండా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాయచోటిలో మంగళవారం తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ భూముల విలువ బాగా పెరిగి, భూ దందాలపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అంతకు ముందే తాను ప్రభుత్వ భూములు కాపాడాలని అధికారులకు సూచించానన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో జరిగింది తప్పేనని, ఈ స్థలం కబ్జాకు గురైందన్న విషయం పత్రికల ద్వారానే తనకు తెలిసిందని అన్నారు. రిజిస్ట్రేషన్లను ఎక్కడైనా చేసుకోవచ్చన్న చట్టం వల్ల రాయచోటికి సంబంధించిన 938 రిజిస్ట్రేషన్లు ఇతర ప్రాంతాల్లో జరిగాయని చెప్పారు. వీటిలో 275 రిజెక్ట్ అయ్యాయన్నారు. ఇలా వేరే ప్రాంతాల్లో ఎందుకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో వాటిని చేయించుకున్న వారికే ఎరుక అన్నారు. లక్కిరెడ్డిపల్లె ఎస్సీల భూ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యేపైన కూడా తాను వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని అన్నారు. ఆ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరానన్నారు. -
సర్కారీ జాగా.. వేశాడు పాగా.. నాడు రామోజీ.. నేడు అధికారపార్టీ నేత
సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేసిన చందంగా ప్రజాప్రతినిధే సర్కారు భూమిని కబ్జా చేశాడు. పట్టా భూమి కొనుగోలు చేసి..పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో పాగా వేశాడు. రూ.2 కోట్ల విలువైన ఈ భూమికి ఏకంగా ప్రహరీ కూడా ఏర్పాటు చేసి.. తన ఆధీనంలోకి తీసుకున్నాడు. పలుకుబడి కలిగిన ఆ ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం తెలిసినా రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లేందుకు సాహసించడంలేదు. శంషాబాద్ మండలం పాల్మాకుల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 13లో 32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 28 ఎకరాలను పేద రైతులకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అక్రమంగా నిర్మించిన ప్రహరీ నాలుగు ఎకరాలు మాత్రం ఖాళీగానే ఉంది. ఈ భూమిని ఆనుకుని పట్టా (సర్వేనం.28) భూములున్నాయి. ఈ భూమిలో కొంత మేర కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి కన్ను పక్కనే ఉన్న సర్కారు భూమిపై పడింది. పట్టా భూమి చుట్టూ ప్రహరీ నిర్మించిన ఆయన పనిలో పనిగా హద్దు రాళ్లను తొలగించి సర్కారు భూమిని కూడా తన ఖాతాలో కలిపేసుకున్నాడు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.రెండు కోట్లు ఉంది. ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో పెద్ద గుట్ట కూడా ఉంది. ఈ బండరాళ్లను పగలగొట్టి గ్రానైట్ రాళ్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్రమణలను అడ్డుకుంటాం ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేయగా మిగిలిన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైన విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఆర్ఐని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతాం. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలితే..స్వా«దీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు నాటుతాం. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, శంషాబాద్ నాడు రామోజీ.. నేడు అధికారపార్టీ నేత సర్వే నంబరు 13 సర్కారు భూముల పక్కనే మార్గదర్శి చిట్‌ఫండ్ యజమాని రామోజీరావు భూములు ఉన్నాయి. నాలుగు ఎకరాలను తన భూమిలో కలిపేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. 2011లో ‘సాక్షి’ ఈ భూ కబ్జాపై వరస కథనాలు ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జాను నిర్దారించారు. దీంతో ఆక్రమణదారులు అప్పట్లో ఈ నాలుగు ఎకరాలను వదిలేసి లోపలి వైపు కడీలు పాతారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ సర్కారు భూమిపై ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి కన్నుపడింది. చదవండి: ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు -
అమరావతిని మరో హైదరాబాద్ చేస్తారా?
ఏయూక్యాంపస్: రైతుల పేరుతో చేపట్టిన బూటకపు పాదయాత్రను అడ్డుకుంటామని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఆచార్యులు, ఉద్యోగులు, పరిశోధకులు నినదించారు. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి ఎంతో నష్టపోయామన్నారు. టీడీపీ నాయకులు అమరావతిని మరో హైదరాబాద్‌గా మార్చాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు వంతపాడటం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమేనని చెప్పారు. విశాఖపట్నంలోని ఏయూలో జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద బుధవారం వారు సమావేశమయ్యారు. మూడు రాజధానులకే తమ మద్దతని చెప్పారు. ఈ సందర్భంగా వర్సిటీ విద్య విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్‌రాజు విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది రియల్టర్లు, పెట్టుబడిదారులు చేస్తున్న ఈ యాత్రను తాము అడ్డుకుంటామన్నారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యపడుతుందన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. ఏయూ ఉద్యోగ సంఘం నాయకుడు డాక్టర్ జి.రవికుమార్ మాట్లాడుతూ పారిశ్రామిక, ఐటీ, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో విరాజిల్లుతున్న విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. ఉత్తరాంధ్ర విద్యార్థులకు మెరుగైన అవకాశాలు రావడానికి మూడు రాజధానుల నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం కేవలం తాత్కాలికంగా పెట్టుబడిదారులు నడిపిస్తున్న ఉద్యమంగా కనిపిస్తోందన్నారు. విద్యార్థి జేఏసీ కన్వీనర్ బి.కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని కోరారు. తద్వారా ఉత్తరాంధ్ర వలసలు తగ్గి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీన్ని అడ్డుకునే విధంగా బూటకపు పాదయాత్రలు చేయడం సరికాదని చెప్పారు. టీడీపీ నాయకులు ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి వారి మనోభావాలను గౌరవించకపోవడం విచారకరమన్నారు. వారు వెంటనే స్పష్టమైన వైఖరి తెలిపాలని కోరారు. విశాఖ జిల్లాలోకి పాదయాత్రను ఎట్టిపరిస్థితుల్లోను అడుగు పెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ నెల 17న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద, 19వ తేదీన ఎన్ఏడీ కూడలి వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. డాక్టర్ ఎం.కళ్యాణ్, డాక్టర్ శాంతారావు, మురళి, విద్యార్థులు సాయికృష్ణ, భరత్, నవీన్‌దాస్, బాలాజీ, శివ, పృధ్వీ, మాధవ్‌రెడ్డి, రామ్‌కుమార్‌రెడ్డి, జగన్, సోమశేఖర్ పాల్గొన్నారు. -
కరకట్ట ఆక్రమణలైనా కూల్చాల్సిందే
సాక్షి, అమరావతి: కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని కరకట్టపై అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చి వేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు, చెరువులు, నీటి కుంటలు, ఇతర నీటి వనరులు, శ్మశానాలు తదితరాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను కూడా కూల్చి వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. 30–40 సంవత్సరాల క్రితమే భూములను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను సైతం తొలగించాలంది. తమకు ఎవరైనా ఒక్కటేనని, ఈ విషయంలో నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, నీటి వనరులు తదితరాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల సంగతి తేలుస్తామన్న హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా మలిచిన విషయం తెలిసిందే. ఈ తరహా ఆక్రమణలన్నింటిపై దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ ఈ సుమోటో పిల్‌కు జత చేసిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం.. వీటిపై మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమించుకుని కరకట్ట వద్ద నిర్మాణాలు చేపట్టారని, వాటికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ నిర్మాణాల సంగతి కూడా చూస్తామని, తమకు ఎవరైనా ఒకటేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ) పోతిరెడ్డి సుభాష్ రెడ్డి స్పందిస్తూ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని 30–40 ఏళ్ల క్రితమే చేపట్టిన నిర్మాణాల సంగతి ఏమిటని అడిగారు. అలాంటి నిర్మాణాలను సైతం కూల్చి వేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని వ్యాజ్యాల్లో ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేస్తామంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించాల్సిందేనని, ప్రభుత్వం తీసుకొచ్చిన క్రమబద్దీకరణ పథకం ద్వారా క్రమబద్దీకరణ చేసుకున్న వారు మినహా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న మిగిలిన వారంతా ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ సమయంలో న్యాయవాది యలమంజుల బాలాజీ జోక్యం చేసుకుంటూ, వినుకొండలో మునిసిపాలిటీయే డిగ్రీ కాలేజీ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదిని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ..ఇలా కుమ్మక్కవుతారు తామిచ్చిన ఆదేశాల ప్రకారం ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు మొదలు పెట్టగానే, కొందరు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేస్తారని, తామిచ్చిన ఉత్తర్వుల సంగతి సింగిల్ జడ్జికి చెప్పకుండా స్టే ఉత్తర్వులు పొందుతారని ధర్మాసనం తెలిపింది. అధికారులు సైతం తమ ఉత్తర్వుల సంగతిని సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురారని, ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల సంగతి తెలియని సింగిల్ జడ్జి.. పిటిషనర్లకు అనుకూలంగా స్టే ఉత్తర్వులు ఇస్తారని వివరించింది. ఇలా పిటిషనర్లు, రెవిన్యూ అధికారులు కలిసి కుమ్మక్కవుతారని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ఆక్రమించుకోమని చెప్పిందా? గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుని 30–40 ఏళ్ల క్రితమే నిర్మాణాలు చేపట్టారని, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇస్తే అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా ఆ నిర్మాణాలను కూల్చేస్తారని న్యాయవాది విద్యావతి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కూల్చి వేతలకు ముందు అధికారులు తప్పక వాదనలు వినిపించుకునే అవకాశం ఇస్తారని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తమ జీవనాధారాన్ని కూడా చూడాలని, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును పరిగణనలోకి తీసుకోవాలని విద్యావతి కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజ్యాంగం ప్రభుత్వ భూములను ఆక్రమించుకోమని చెప్పిందా? అని ప్రశ్నించింది. రెవిన్యూ అధికారుల వల్లే ఆ పరిస్థితి ప్రభుత్వ న్యాయవాది సుభాష్ స్పందిస్తూ.. దాదాపు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో రెవిన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని తెలిపింది. రెవిన్యూ అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని స్పష్టం చేసింది. ఈ సమయంలో ఓ న్యాయవాది స్పందిస్తూ, గుంటూరులో శ్మశాన వాటికను ఆక్రమించుకుని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. శ్మశానంలో షాపింగ్ కాంప్లెక్సా అంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కాగా, వివిధ రకాల ఆక్రమణలపై దాఖలైన 55 పిటిషన్లకు సంబంధించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా వ్యాజ్యాలను ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, శ్మశానాల ఆక్రమణ, తదితర అంశాల వారీగా ధర్మాసనం విభజించింది. వీటిపై తదుపరి విచారణ నిమిత్తం కొన్నింటిని బుధవారం, మరి కొన్నింటిని గురువారానికి, ఇంకొన్నింటిని సోమవారానికి వాయిదా వేసింది. -
ఆ ఐఏఎస్ ఆఫీసర్.. అవినీతికి కేరాఫ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అవినీతి, వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసిన వ్యవహారంలో గుజరాత్లో కలెక్టర్‌గా పనిచేస్తున్న కంకిపాటి రాజేష్ సీబీఐ అధికారులకు దొరికిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పుట్టి పెరిగిన రాజేష్ 2011లో ఐఏఎస్ సాధించారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయన భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. మైనింగ్ లీజులు, తుపాకీలకు లైసెన్సులు ఇవ్వడం, బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు సొంతం చేసుకోవడం, భూములను కబ్జా చేసినవారికి వాటిని క్రమబద్ధీకరించడం, ఖరీదైన బట్టల రూపంలో లంచాలు వసూలు చేయడం.. ఇలా అవినీతిలో కూరుకుపోయి భారీగా ఆస్తులు పోగేశారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన సీబీఐ రాజేష్ అవినీతి గుట్టును రట్టు చేసింది. ఏకకాలంలో సీబీఐ సోదాలు ప్రస్తుతం కంకిపాటి రాజేష్ గుజరాత్ సాధారణ పరిపాలన శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు. కలెక్టర్‌గా ఉన్నప్పుడు పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్టు వచ్చిన ఫిర్యాదులపై సీబీఐ ఏడాదిపాటు లోతైన విచారణ చేసి ఆయన అక్రమాస్తుల గుట్టును బయటపెట్టింది. కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని గురువారం కేసు నమోదు చేసింది. రాజమహేంద్రవరం శివారు లాలాచెరువు, అహ్మదాబాద్, సురేంద్రనగర్, తదితర ప్రాంతాల్లో ఉన్న రాజేష్ నివాసాలు, కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రాజేష్ అక్రమాలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. లాకర్లలో ఇప్పటివరకు గుర్తించిన పత్రాల ప్రకారం ఆస్తుల మార్కెట్ విలువ రూ.300 కోట్ల పైనే ఉంటుందని తేల్చారు. ఇళ్లు, భూమి సహా ఎనిమిది రకాల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. దీంతో రాజేష్‌తోపాటు ఆయనకు సహాయం అందిస్తున్న వ్యాపారవేత్త రఫీక్ మెమను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరిపై సాక్ష్యాలను నాశనం చేయడం, నేరపూరిత కుట్రకు పాల్పడటం వంటి అభియోగాలు నమోదు చేసింది. వారిద్దరిని సీబీఐ కోర్టులో హాజరుపర్చింది. విచారణకు 10 రోజులు తమకు అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి చేయగా కోర్టు ఒక రోజు మాత్రమే అవకాశం ఇచ్చింది. తవ్వే కొద్దీ బయటపడుతున్న అక్రమాలు.. రాజేష్ అక్రమాల పుట్ట తవ్వే కొద్దీ బయటపడుతోంది. సురేంద్రనగర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ‘జిల్లా కలెక్టర్ ఫండ్’, ‘సుజలాం.. సుఫలాం’ కోసం పలువురు ఇచ్చిన చెక్కులను కూడా మార్చేసి అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. ప్రభుత్వ ఖాతాల్లో ఈ నగదును జమ చేస్తానని నమ్మబలికి స్వాహా చేసినట్టు సీబీఐ నిగ్గు తేల్చింది. రాజేష్ అక్రమాలకు మధ్యవర్తిగా సూరత్‌కు చెందిన బట్టల వ్యాపారి రఫీక్ మెమన్వ్యవహరించారు. ఆయుధాల లైసెన్సులు, మైనింగ్ లీజుల కోసం తనను సంప్రదించేవారితో రాజేష్ తాను అడిగినంత మొత్తాన్ని రఫీక్‌కు చెల్లించమని చెప్పేవాడని సీబీఐ పేర్కొంది. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు స్వాధీనం, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడం ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు సీబీఐ తేల్చింది. సీబీఐతోపాటు గుజరాత్ అవినీతి నిరోధక శాఖ కూడా విచారణ చేపట్టి కేంద్రానికి నివేదిక పంపాయి. ఆ రాష్ట్ర మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే తనేజా ప్రాథమిక విచారణలోనూ ఈ అవినీతి బండారం బయటపడటంతో గుజరాత్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. -
ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పలు అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టతనిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ముందే సబ్ డివిజన్ తప్పనిసరి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారు దానికి ముందే సర్వే నెంబర్‌ను సబ్ డివిజన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తై రికార్డుల్లో సర్వే నెంబర్లు, పేర్లన్నీ ఆ ప్రకారం ఉన్నట్లు నిర్థారించుకున్న తర్వాతే మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తహశీల్దార్లకు సూచించారు. పాస్బుక్ల జారీ కూడా మ్యుటేషన్ సమయంలోనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మ్యుటేషన్‌తోపాటు పాస్‌బుక్ కోసం దరఖాస్తు స్వీకరించి రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై.. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యుటేషన్ చేయరాదని సూచించారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో చేయాల్సి వచ్చినప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అది కూడా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తహశీల్దార్లకు ఉన్న ఈ అధికారాన్ని జేసీలకు బదలాయించారు. వారసత్వ వివాదాలకు సంబంధించి మ్యుటేషన్ల విషయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను తహశీల్దార్ అదే సమయంలో ఇవ్వాలని నిర్దేశించారు. మ్యుటేషన్ చేసుకునే సమయంలోనే ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను దరఖాస్తుదారుడు ఇచ్చినప్పుడు మళ్లీ ఆ కుటుంబం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చుక్కల భూములు, అసైన్డ్ మ్యుటేషన్‌పై స్పష్టత చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి 12 సంవత్సరాలు దాటి సంబంధిత భూములు దరఖాస్తు చేసుకున్న వారి స్వాధీనంలోనే ఉన్నట్లు రికార్డుల ప్రకారం నిర్థారణ అయితే వాటికి మ్యుటేషన్ చేయవచ్చని సూచించారు. తీర్పులు వెలువడిన కేసులు, కోర్టు ద్వారా వేలం పాట నిర్వహించిన ఆస్తులను కొనుగోలు చేసిన వారికి వెంటనే యాజమాన్య హక్కులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసైన్డ్ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వ్యక్తులే మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే చేయాలని, మూడో వ్యక్తి ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరించాలని స్పష్టం చేశారు. భూముల రీ సర్వే పూర్తయిన చోట సర్వే పూర్తయినట్లు జారీ చేసే 13 నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే అప్పటివరకు ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్దేశించారు. మ్యుటేషన్ దరఖాస్తులను చిన్న కారణాలతో తిరస్కరించకూడదని, ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు చూపాలని, ఇంకా ఏ డాక్యుమెంట్లు కావాలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. మ్యుటేషన్ కోసం వచ్చే దరఖాస్తుల్లో 45 శాతం తిరస్కారానికి గురవుతుండడంతో పలు అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. -
వివాదాస్పద 6 ఎకరాల స్థలానికి హెచ్ఎండీఏ ఎల్పీ.. ఇదో అంతుచిక్కని ప్రశ్న!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న వక్ఫ్ భూమికి ఏకంగా హెచ్ఎండీఏ లే అవుట్ పర్మిషన్ (ఎల్పీ) ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన ధరణి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో పొందుపర్చిన ఈ భూముల వివరాలను కనీసం పరిశీలించకుండా ఏకపక్షంగా అనుమతులు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాస్‌బుక్‌ను రద్దు చేసినా.. మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని ఔటర్‌ను ఆనుకుని సుమారు 500 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. 1962 నుంచి ఇప్పటి వరకు పహానీల్లో పట్టాదారు కాలంలో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్‌సాబ్ దర్గా పేరిట నమోదైంది. దీన్ని వక్ఫ్ భూమిగా పేర్కొంటూ 2008లో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూమిని సాగు చేసుకుంటున్న కొందరు రైతులు గెజిట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో విధించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లోనే ఉంది. అనంతరం వక్ఫ్‌భూముల రిజిస్టేషన్లు సైతం నిలిచిపోయాయి.కానీ సర్వే నంబర్ 82/అ/1/1లో 11.17 ఎకరాలు ఉండగా, ఇందులో ఆరు ఎకరాలకు 2018లో ఒకరి పేరిట (ఖాతా నంబర్ 429 టీ 0516090202) పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయడం.. ఒకే భూమికి రెండుసార్లు ఓఆర్సీ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో పాటు రిజిస్ట్రేషన్లు నిషేధం ఉన్న సమయంలో కొత్త పట్టాదారు పాస్‌బుక్ ఎలా ఇచ్చారని స్థాని కులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. రికార్డుల్లో పొరపాటున పట్టాదారుగా నమోదైందని పేర్కొంటూ, సదరు పాసుపుస్తకాన్ని రద్దు చేస్తూ 2021 జనవరి 5న ఎండార్స్మెంట్ జారీ చేశారు. వివాదాస్పదమని తేలినా.. పట్టాదారు పాస్‌బుక్‌ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ సదరు వ్యక్తి నుంచి ఈ భూమిని నగరానికి చెందిన ఇద్దరు రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ మేరకు 20 ఏప్రిల్ 2021న మహేశ్వరం రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్ రిజిస్ట్రర్ చేయించేందుకు యత్నించగా ఇది నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద స్థలమని తేలింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెండింగ్‌లో పెడుతూ ఇదే అంశాన్ని సంబంధిత డాక్యుమెంట్‌పై కూడా రాసి పెట్టారు. ఇటు ధరణి, అటు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్లలో నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమికి హెచ్ఎండీఏ అధికారులు తాజాగా ఎల్పీ నంబర్ ఎలా జారీ చేశారనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఫైనల్ లే అవుట్ అప్రూవల్ జారీ చేయాల్సిందిగా సదరు రియల్టర్లు ప్రస్తుతం తుక్కుగూడ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం. చాలాసార్లు ఫిర్యాదు చేశాం వక్ఫ్‌బోర్డుకు చెందిన భూమిని అమ్మడం, కొనడం నేరం. కొంతమంది రియల్టర్లు దీన్ని ఆక్రమించి, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. హెచ్ఎండీఏ అధికారులు లేఅవుట్ పర్మిషన్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. తప్పుడు రికార్డులు సృష్టించి, అధికారులను తప్పుదోవ పట్టించి భూమిని అమ్మేందుకు యత్నిస్తున్న వారిపై.. రికార్డులు పరిశీలించకుండా అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – ఎ.శ్రీనివాస్‌గౌడ్, రావిర్యాల అది ముమ్మాటికీ వక్ఫ్ భూమే.. కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 82లోని భూమి వక్ఫ్‌బోర్డుకు చెందినదే. కొంతమంది రియల్టర్లు ఇటీవల ఆ భూమిని చదును చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపి పనులు నిలుపుదల చేయించాం. భూమికి సంబంధించిన డాక్యు మెంట్లు ఉంటే చూపించాలని కోరాం. ఇప్పటి వరకు రాలేదు. ఈ భూమికి హెచ్ఎండీఏ ఎల్పీ నంబర్ జారీ చేసిన విషయం తెలియదు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి ఎల్పీ నంబర్ ఎలా ఇచ్చారనేదీ అర్థం కావడం లేదు. – జ్యోతి, తహసీల్దార్, మహేశ్వరం -
సర్కారు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. భూములను విక్రయించడానికి వీల్లేదని చట్టంలో ఎక్కడా లేదని, ఈ నేపథ్యంలో తాము వేలం ప్రక్రియను నిలిపి వేయలేమని స్పష్టం చేసింది. అయితే టెండర్లు, ఈ వేలం లాంటి పారదర్శక పద్ధతుల్లో భూములను వేలం వేయాలని తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి శుక్లా దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేసింది. కోకాపేట, ఖానామెట్‌లో ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి కాపాడలేకపోతున్నామని పేర్కొంటూ ప్రభుత్వం వేలం వేయడాన్ని విజయశాంతి సవాల్ చేశారు. అయితే ఏ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను విక్రయించరాదో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. భూముల విక్రయ నిషేధానికి ఎలాంటి చట్టం లేనప్పుడు తాము భూముల వేలాన్ని నిలిపివేస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేయగలమని ప్రశ్నించింది. -
ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు మరోమారు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
-
అనంతపురంలో టీడీపీ నేతల భూ కుంభకోణం
సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సైనికుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి టీడీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ భూ బాగోతం రాచానపల్లి, ఇటుకలపల్లి, కురుగుంట గ్రామాల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై అనంతపురం ఆర్డీవో మధుసూదన్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రూ.100 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. అక్రమార్కులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. మాజీ సైనికుల పేరుతో వంద కోట్ల రూపాయల విలువైన భూములు స్వాహా చేసిన టీడీపీ నేతల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అనంతపురం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలతో.. మాజీ సైనికుల పేర్లతో భూమి పట్టాలు పొంది.. ఆ వెంటనే విక్రయించి సొమ్ము చేసుకున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని.. లోతుగా విచారిస్తే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు ఏవిధంగా స్వాహా చేశారో తెలుస్తుందని స్థానికులు కోరుతున్నారు. చదవండిః కన్నయ్య కుమార్‌పై దాడికి యత్నం -
మౌలిక అభివృద్ధికి ఖర్చు పెట్టిందెంతో కేటీఆర్ చెప్పాలి?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూములను అమ్మి సేకరించిన నిధుల్లో రాష్ట్ర మౌలిక అభివృద్ధికి ఖర్చు పెట్టిందెంతో మంత్రి కేటీఆర్ వివరించాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్డిమాండ్చేశారు. హైదరబాద్చుట్టూ 344 క.మీ రీజినల్రింగ్రోడ్అలైన్మెంట్లో రింగు తిప్పుతున్నది భూ మాఫియా పెద్దలేనని ఆదివారం ఒక ప్రకనటలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇచ్చిన ప్రాజెక్టులు, రింగ్‌రోడ్డుకు అవసరమైన భూమి కంటే ఎన్నో రెట్లు రైతుల నుండి ఎందుకు సేకరించారని నిలదీశారు. తాము కొన్న భూముల జోలికి పోకుండా చూసుకుంటూ, రైతుల నుండి ఎక్కువ భూమి తమ అధీనంలోకి తీసుకోవడానికి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మల్లన్నసాగర్, కాళేశ్వరం కాలువ పనుల్లో వేల ఎకరాల భూమి కోల్పోయిన ప్రజలకు పరిహారం అందలేదని, ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్ ప్రభుత్వం నిర్భందంతో అణిచివేస్తున్నదని చెరుకు సుధాకర్ఆరోపించారు. -
విశాఖ కలెక్టర్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు విశాఖ జిల్లా కలెక్టర్ జనవరి 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సబ్బవరంలోని 255, 272, 277 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిలో కె.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అధికారులతో కుమ్మక్కై నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఎస్.చినవెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన సీజే ధర్మాసనం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని పిటిషనర్ న్యాయవాది ఎన్.హెచ్.అక్బర్ తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కలెక్టర్‌పై మండిపడింది. -
హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న భూ మంత్రగాళ్లు
‘శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో సర్వే నంబర్ 2,5,6లలోని ఫిరంగి నాలాలో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. చారిత్రక ఫిరంగి నాలాను అపర్ణ, సుమధుర కన్స్ట్రక్షన్ సంస్థలు ధ్వంసం చేసి భారీ నిర్మాణాలు చేపడుతున్నాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వీటిని ఆపాలని కోరుతూ ఎంపీటీసీ మాజీ సభ్యుడు నరేందర్ రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సహా సీఎల్పీ నేత భట్టివిక్రమార్కలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు’ ‘కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 19, 20లలో నివాస గృహాల మధ్య ఎలాంటి అనుమతుల్లేకుండా గోదాములు, ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తున్నారు. పాటు కాల్వను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండటంతో వర్షపు నీరు నిలిచిపోయి మహిళా సమాఖ్య భవనం దెబ్బతిందని, ఈ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్థానికుడు శివకుమార్ ఇటీవల మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం’ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ యంత్రాంగం ఒకవైపు అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తుంటే.. మరో వైపు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం, నాలాలపై నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. పాత పంచాయతీల నుంచి అనుమతులు తీసుకుని, కొత్తగా నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. వీటిని గుర్తించి అడ్డుకుంటున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. వాటి జోలికి వెళ్లొద్ధంటూ హుకుం జారీ చేస్తున్నా.. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే శివారు జిల్లాల్లో వందకుపైగా నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు తెలిసింది. అయినా అక్రమ వెంచర్లు, భవన నిర్మాణాలు ఆగకపోగా.. మరిన్ని వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వీటి వెనుక బడా కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు ఉండటమే కా రణమని టాస్క్‌ఫోర్స్ బృందాలు అభిప్రాయపడుతున్నాయి. 16 మున్సిపాలిటీల పరిధిలో.. ► రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాలుగు వేలకుపైగా వెంచర్లు ఉన్నట్లు సమాచారం. 16 మున్సిపాలిటీల పరిధిలో 1397 లే అవుట్లు ఉండగా, వీటిలో 380 లేఅవుట్లకు మాత్రమే హెచ్ఎండీ అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి ఎలాంటి అనుమతులు లేవు. వీటిలో రెండు వేలకుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ► వీటిలో ఎక్కువగా మణికొండ, నార్సింగి, తుర్కయాంజాల్, హయత్‌నగర్, మీర్పేట్, బడంగ్ పేట్ మున్సిపాలిటీల పరిధిలోనే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఏటా 12 వేల నిర్మాణాలకు, హెచ్ఎండీఏ ఏటా నాలుగు వేల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాయి. జీ+పోర్కు అనుమతులు తీసుకుని, అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ► ఇలా వీటి పరిధిలో అయిదు వేలకుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కొనుగోలుదారులంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను డిసెంబర్ 31లోగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ పనుల్లో వేగం పెంచారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులకు అండగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు కూల్చివేతలను ఆపాల్సిందిగా కోరుతూ క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. మచ్చుకు కొన్ని కూల్చివేతలు.. ► మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్ నంబర్– 2లో అనుమతించిన దానికన్నా అదనంగా నిర్మించిన అంతస్తులను కూల్చివేశారు. పైపులైన్ రోడ్డులో అయిదు అంతస్తులకు అనుమతి పొంది ఆరు అంతస్తులు నిర్మిస్తుండగా, అధికారులు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. ► నార్సింగ్ పరిధిలోని పంచవటి లక్ష్మీసాయి లేఅవుట్లో రహదారిని ఆక్రమించి నిర్మించిన ప్రహరీ సహా బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్‌లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ► శంషాబాద్ మున్సిపాలిటీ సహా ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ 111 జీఓ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ► తొండుపల్లి, ఊట్పల్లి, రాళ్లగూడ, గొల్లపల్లిల్లో భారీ నిర్మాణాలు, గోదాములు నిర్మించారు. కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే 146 అక్రమ నిర్మాణాలు గుర్తించి, ఆ మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు నివేదించారు. ► ఇబ్రహీంపట్నం శేరిగూడలోని వార్డు నంబర్ 14, 16లలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను అధికారులు కూల్చివేశారు. ► శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మిస్తున్న ఓ నిర్మాణంతో పాటు అదే కాలనీలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న మరికొన్ని భవనాలకు నాలుగు రోజుల క్రితం అధికారులు నోటీసులు జారీ చేశారు. ► కొందుర్గు గ్రామ పంచాయతీ పరిధిలో 23 అక్రమ నిర్మాణాలతో పాటు మరో 11 అక్రమ వెంచర్లను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పంచాయతీ కార్యదర్శిపై జిల్లా అధికారులు వేటువేశారు. ► ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ వెంచర్లో ప్రజావసరాలకోసం వదిలిన పార్కు స్థలాల స్థిరాస్తి వ్యాపారులు ఆ తర్వాత ఆ çస్థలాన్ని 44 ప్లాట్లు చేసి 12 మందికి విక్రయించినట్లు అధికారులు గుర్తించి, ఆయా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాల్సిందిగా కలెక్టర్ అమయ్‌కుమార్ సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ► పెద్ద అంబర్పేట్ సర్వే నంబర్ 47, 48లలో ప్రహరీ సహా పసుమాములలోని సర్వే నంబర్ 91(పి), 96(పి)లలో అనుమతి లేని వెంచర్లో నిర్మిస్తున్న ప్రహరీలను కూల్చివేశారు. -
ప్రభుత్వ భూముల మ్యుటేషన్.. 11 మంది వీఆర్వోల సస్పెన్షన్
మార్కాపురం(ప్రకాశం జిల్లా): నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను మ్యుటేషన్ చేశారన్న ఆరోపణలపై ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని 11 మంది వీఆర్వోలు, ఓ విలేజ్ సర్వేయర్‌ను సస్పెండ్ చేయడంతోపాటు తహసీల్దార్ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత తహసీల్దార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 17 గ్రామాల్లో మొత్తం 378.89 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పలువురికి మ్యుటేషన్ చేసినట్లు గుర్తించామన్నారు. సస్పెండ్ అయిన వారిలో మార్కాపురం–2, 3 వీఆర్వోలు ఎస్.శ్రీనివాసరెడ్డి, కె.రాజశేఖరరెడ్డి, గజ్జలకొండ–1, 2 వీఆర్వోలు జి.శ్రీనివాసరెడ్డి, వై.గోవిందరెడ్డి, పెద్దయాచవరం వీఆర్వో ఎస్కే కాశింవలి, నాయుడుపల్లి వీఆర్వో వై.కాశీశ్వరరెడ్డి, ఇడుపూరు వీఆర్వో వీవీ కాశిరెడ్డి, కోలభీమునిపాడు, జమ్మనపల్లి వీఆర్వో ఐ.చలమారెడ్డి, చింతగుంట్ల, బడేకాన్‌పేట వీఆర్వో మస్తాన్‌వలి, కొండేపల్లి, కృష్ణాపురం వీఆర్వో రామచంద్రారావు, భూపతిపల్లి, బొందలపాడు వీఆర్వో పి.మల్లిఖార్జున, చింతగుంట్ల విలేజ్ సర్వేయర్ ఎం.విష్ణుప్రసన్నకుమార్‌లు ఉన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పి.నాగరాజును రిమూవ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. విశ్రాంత తహసీల్దార్ విద్యాసాగరుడుపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏఆర్ఐ గోపి, మార్కాపురం–4 వీఆర్వో కోటయ్య, రాయవరం–1 వీఆర్వో జి.సుబ్బారెడ్డిని సస్పెండ్ చేశారు. -
మళ్లీ వేలానికి వేళాయె
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో నిరుపయోగంగా ఉన్న మరో 117.29 ఎకరాల ప్రభుత్వ భూములను ఈ– వేలం పద్ధతిలో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 41/14లోని 22.79 ఎకరాల విస్తీర్ణంలోని 9 ప్లాట్లను విక్రయిస్తారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా గండిపేట మం డలం పుప్పాలగూడలో 325, 326, 327, 328 సర్వే నంబర్లలోని 94.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మరో 26 ప్లాట్లను కూడా వేలం వేస్తారు. ఖానామెట్ భూములకు సెప్టెంబర్ 27న, పుప్పాలగూడ భూ ములకు ఆ మరుసటి రోజు ఈ– వేలం నిర్వహిస్తారు. ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపే వారికి వేలం విధానంపై అవగా హన కల్పించేందుకు వచ్చే నెల 9న బషీర్‌బాగ్‌లోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో ప్రి బిడ్ సమావేశం నిర్వహిస్తారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న ఖానా మెట్, పుప్పాలగూడ భూములకు ఇప్పటికే లే ఔట్ ఖరారు చేయగా, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 24 వరకు ఆయా ప్లాట్లను నేరుగా సందర్శించే వీలు కల్పించారు. వచ్చే నెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ఈఎండీ చెల్లించి వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా వేలంలో పాల్గొనవచ్చని టీఎస్ఐఐసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ) ఈ వేలం ప్రక్రియను నిర్వహిస్తుంది. గణనీయంగా పెరిగిన అప్సెట్ ధర ఈ ఏడాది జూలైలో కోకాపేట, ఖానామెట్ భూములకు నిర్వహించిన వేలంలో ఎకరా అప్సెట్ (కనీస) ధర రూ.25 కోట్లుగా, ఈఎండీని రూ.5 కోట్లుగా నిర్ణయించిన టీఎస్ఐఐసీ.. ప్రస్తుత వేలంలో ఖానామెట్ భూముల కనీస ధరను రూ.40 కోట్లకు పెంచింది. పుప్పాలగూడ భూముల అప్సెట్ ధరను రూ.35 కోట్లకు పెంచింది. జూలైలో జరిగిన వేలం పాటలో కోకాపేట భూములు ఎకరం సగటున రూ.40.05 కోట్లు, ఖానామెట్ భూములు రూ.48.92 కోట్లు పలకడంతో, ఈసారి అప్సెట్ ధరను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నిర్ణయించిన కనీస ధర ప్రకారం ప్లాట్లన్నీ అమ్ముడుబోయిన పక్షంలో ఖానా మెట్ భూములకు రూ.911.6 కోట్లు, పుప్పాలగూడ భూములకు రూ.3,307.5 కోట్లు కలిపి మొత్తంగా రూ.4,219.10 కోట్లు వస్తా యని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే వేలంలో భూములకు అధిక ధర లభిస్తే అదనంగా మరో రూ.2 వేల కోట్లు వచ్చే అవకాశముందని, అదే జరిగితే రూ.6 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు సమకూరే అవకాశముం దని టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. గత జూలైలో 64.85 ఎకరాల వేలం రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఖానామెట్‌లలోని 64.85 ఎకరాల విస్తీర్ణంలోని 13 ప్లాట్లకు గత జూలైలో రాష్ట్ర ప్రభుత్వం వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. కళ్లు చెదిరే ధరలతో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా సంస్థలు ఈ భూములను దక్కించుకున్నాయి. కోకాపేటతో పోలిస్తే ఖానా మెట్ భూములకు ఎక్కువ ధర వస్తుంద ని అధికారులు ముందస్తు అంచనా వేయ గా, అదే రీతిలో వేలంలో బిడ్డర్లు భూము లు దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. -
ఆక్రమణలపై కొరడా: పీలేరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
సాక్షి, చిత్తూరు: పీలేరులో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. శనివారం అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. తిరుపతి రోడ్డులో కబ్జాదారులు భారీ ఎత్తున భవనాలు నిర్మించారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ జాహ్నవి నేతృత్వంలో ఉదయం నుంచి పోలీసుల బలగాల సమక్షంలో భవనాల కూల్చివేత చేపట్టారు. ఇప్పటికే 10 భవనాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. -
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు ప్రభుత్వ భూముల సేకరణ
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికాబద్ధమైన ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల (ఎంఐజీ లేఅవుట్లు) నిర్మాణానికి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి భూములను గుర్తించి ముందస్తుగా మునిసిపల్ శాఖకు అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. విధివిధానాలను ఖరారు చేస్తూ మంగళవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ సంస్థలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు ప్రజోపయోగం కోసం గతంలో సేకరించి అందుకు ఉపయోగించకుండా ఉన్న భూములను సేకరించాలని ఆదేశించారు. స్మార్ట్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ఉపయోగపడే ఇలాంటి భూములను క్రమబద్ధీకరించి మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు నేరుగా ఇచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అలాంటి భూముల వివరాలను సీసీఎల్ఏకు పంపాలని కలెక్టర్లకు సూచించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం మాత్రమే కలెక్టర్లకు ఈ అధికారాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేవదాయ, వక్ఫ్, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంబంధిత భూములు, పర్యావరణ సున్నితమైన భూములను ఈ సేకరణ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. చెరువు, కాలువ కట్టలు, నీటి వనరులున్న భూములు, అడవులతో నిండిన కొండ ప్రాంతాలతోపాటు అభ్యంతరకరమైన ప్రభుత్వ పోరంబోకు, కమ్యూనిటీ పోరంబోకు భూములను సైతం సేకరించవద్దని ఆదేశించారు. మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా, అన్ని సౌకర్యాలతో కూడిన నివాస స్థలాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనుంది. -
వాళ్లకి హెచ్చరిక.. అడుగు జాగా కూడా వదలం
కబ్జా.. కబ్జా.. కబ్జా.. మేడ్చల్ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఈ పదం వింటూనే ఉన్నారు. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు.. బాధితుల నుంచి లెక్కకుమించిన వినతులు.. నిత్యం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కబ్జాదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ స్థలాలను హ్యాపీగా కబ్జా చేసేసి.. అక్రమంగా నిర్మాణాలు చేసేసి.. పేద, మధ్యతరగతి ప్రజలకు అంటగడుతూ కోట్లకు పడగెత్తుతున్నారు. పల్లె, పట్టణ ప్రగతి, సమీక్ష, సమావేశాలతో అధికారులు బిజీగా ఉండటంతో ఇదే అదనుగా పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై యంత్రాంగం సీరియస్ గా దృష్టి సారించింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సాక్షి,సిటీబ్యూరో: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అలాంటి వారిపై చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎల్ఆర్ఎస్లో భాగంగా అందిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తెప్పించుకున్న యంత్రాంగం ఇంకా అదనపు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అక్రమ కట్టడాలు, లేఅవుట్లు, రోడ్లు, పార్కులను కబ్జా చేసి నిర్మిస్తున్న భవనాలు, బహుళ అంతస్తులు, ఇండిపెండెంట్ ఇళ్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు ఉద్యోగులు, సిబ్బంది తీరుపై సీరియస్‌గా ఉన్న యంత్రాంగం ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.. బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడ్చల్, జవహర్‌నగర్, నిజాంపేట్, కొంపల్లి, దుండిగల్, తూముకుంట, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఈ కట్టడాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా పడుతున్న గండిని నివారించి.. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగం దృష్టిసారిస్తోంది. కొంతమంది ఉద్యోగులు, సిబ్బందికి అక్రమ కట్టడాల పర్వాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ అక్రమ కట్టడాలపై ఇన్చార్జ్ కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతుండటంతో.. చర్యలకు ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లను వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గుర్తించిన అక్రమ కట్టడాలివే.. మేడ్చల్ జిల్లాలో పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో గుర్తించిన అక్రమ కట్టడాలు, లేఅవుట్లు, 3,643 ఉండగా, ఘట్కేసర్ మండలంలో 656, దుండిగల్‌లో 1,950, కీసరలో 650, శామీర్‌పేట్‌లో 191, మేడ్చల్ మండలంలో 196 ఉన్నట్లు తెలుస్తోంది. నాగారం పట్టణంలో 12 అక్రమ లేఅవుట్లు ఉండగా, దమ్మాయిగూడలో 7, మేడ్చల్‌లో 10, నిజాంపేట్‌లో 20, కొంపల్లిలో 11, దుండిగల్‌లో 12, తూముకుంటలో 15, పోచారంలో 12, ఘట్కేసర్లో 8 ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ఇటీవల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సమాచారం ద్వారా బయటపడినట్లు తెలుస్తోంది. మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో ఇలా.. మేడ్చల్ జిల్లా పరిధిలోని జీహెచ్ఎంసీ మున్సిపల్ సర్కిళ్లలోని పార్కులు, రోడ్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. ఉప్పల్ సర్కిల్లో 1,989 చదరపు గజాల స్థలం, కాప్రా సర్కిల్లో 194 చదరపు గజాల స్థలం, మల్కాజిగిరి సర్కిల్లో 36 చదరపు గజాలు, మూసాపేట్లో 20, కూకట్‌పల్లిలో 455, కుత్బుల్లాపూర్‌లో 62, గాజులరామారంలో 198, అల్వాల్ సర్కిల్లో 155 చదరపు గజాల స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన యంత్రాంగం ఆక్రమణలపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
భూ వేలాన్ని ఆపలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట, ఖానామెట్‌లోని ప్రభుత్వ భూముల్ని వేలం వేయడాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో తుది విచారణకు లోబడి ఆ వేలం ప్రక్రియ ఉంటుందన్న ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అటువంటి ఆదేశాలు ఇస్తే కొనేవారు భయపడతారని, అలాగే తక్కువ ధరను కోట్ చేస్తారని, తర్వాత ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ భూములను వేలం వేయాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ ఎం.విజయశాంతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఆక్రమణల నుంచి కాపాడలేక, నిధులను సమకూర్చుకునేందుకు ఈ భూముల్ని వేలం వేస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ప్రభుత్వమే కాపాడలేకపోతే ఎలా ? ‘ఆక్రమణదారుల నుంచి కాపాడలేక ప్రభుత్వ భూముల్ని వేలం ద్వారా విక్రయిస్తున్నామని ప్రభుత్వం పేర్కొనడం ఆశ్చర్యకరం. ప్రభుత్వమే తన భూముల్ని కాపాడుకోలేకపోతే ఇక ప్రజల భూముల్ని ఏం కాపాడుతుంది. భూముల్ని కాపాడేందుకు వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయండి. ప్రతి జిల్లాకు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఒకవైపు చెబుతున్నారు. మరోవైపు ఉన్న భూముల్ని వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తానిచ్చిన ఆదేశాల అమలులో పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వేలం ప్రక్రియను ఎలా సమర్థించుకుంటుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి’అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 8కు వాయిదా వేసింది. -
ప్రభుత్వ భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలి
పీలేరు (చిత్తూరు జిల్లా): పీలేరు మండలంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పీలేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. పీలేరు మండలంలోని గూడరేవుపల్లె, దొడ్డిపల్లె, ఎర్రగుంట్లపల్లె, కాకులారంపల్లె, ముడుపులవేముల, బోడుమల్లువారిపల్లె పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లు వేసి అమాయకులైన ప్రజలకు విక్రయించారని పేర్కొన్నారు. 2009–2014 మధ్య అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో, 2014–2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా ఉన్న నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా 2019–21 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ప్లాట్లు వేసి అమ్ముకున్నారని టీడీపీ నాయకులు అభియోగాలు మోపినందున అన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న రియల్టర్లు, ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కట్టడాలు తక్షణమే తొలగించాలన్నారు. పీలేరు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారుకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులచే సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. -
అమ్మో.. కొమ్మాలపాటి.. రత్నాలచెరువులో వెంచర్లు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాలచెరువును కొల్లగొట్టిన వైనం ఇది. సాగుచేసుకోమని పేదలకు ఇచ్చిన ఈ చెరువు భూమి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఈ భూముల్ని కొని వెంచర్‌వేసి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సుమారు రూ.70 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. పట్టణంలోని 134 సర్వే నంబర్లో 94 ఎకరాల విస్తీర్ణంలో రత్నాలచెరువు ఉంది. కొన్నేళ్లుగా పేదలు కొందరు గుడిసెలు వేసుకుని నివసించసాగారు. ఇదే ఆక్రమణదారులకు అడ్డాగా మారింది. పేదల పేరుతో పెద్దలు సుమారు 24 ఎకరాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు గ్రామంలో 2004కు ముందు పొలాలు కొని అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెంచర్ వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్లాట్లు వాయిదాల పద్ధతిలో విక్రయించారు. వాయిదాలు కట్టిన వందలాది మందికి ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయకుండా తిప్పుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అదే వెంచర్‌కు దగ్గరలో ఉన్న రత్నాలచెరువుపై ఆయన కన్నుపడింది. ఈ చెరువు భూమిని సాగుచేసుకునేందుకు ప్రభుత్వం కొంతమంది ఎస్సీలకు పట్టాలిచ్చింది. పట్టాలు ఇచ్చిన భూమిని విక్రయించకూడదని నిబంధన విధించింది. అయినా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి ఎస్సీల వద్ద నుంచి 7.5 ఎకరాలను రూ.35 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూమిలో ప్లాట్లు వేసి ప్రజలకు విక్రయించారు. రిజిస్ట్రేషన్లు చేసి రూ.70 కోట్ల మేర సొమ్ము చేసుకున్నారు. ఈ భూమిని తనకే ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి గత టీడీపీ ప్రభుత్వ పాలనలో మంత్రి లోకేశ్ రత్నాలచెరువు భూమి మొత్తాన్ని ఐటీ కంపెనీల పేరుతో తమ అనుచరులకు కట్టపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అప్పటి ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రం ఇచ్చారు. చెరువులో తాను కొనుగోలు చేసిన 7.5 ఎకరాలను తనకు వదిలిపెట్టాలని కోరారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తన వద్ద ప్లాట్లు కొన్నవారు తనను డబ్బులు తిరిగి ఇవ్వమంటారనే ఆందోళనతోనే ఆయన ఈ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికీ ఆ భూమిలో కొంత కొమ్మాలపాటి చేతుల్లోనే ఉంది. రత్నాలచెరువు నకిలీ దస్తావేజుల అక్రమాలపై అధికారులు విచారణ జరుపుతుండడంతో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ చెరువు భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
కబ్జాలను అడ్డుకుంటే కక్ష సాధింపా?
సాక్షి, అమరావతి: కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్ర యత్నిస్తుంటే కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విశాఖలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదని చెప్పే దమ్ము, ధైర్యం టీడీపీకి ఉందా? అని ప్రశ్నిం చారు. చంద్రబాబు పాలనలో రూ.వేలకోట్ల విలువై న భూములను కాజేశారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలకు చెందిన గీతం సంస్థ, తాజాగా పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములను ఆక్రమించుకో లేదని టీడీపీ చెప్పగలదా? అని ప్రశ్నించారు. అంబటి ఇంకా ఏమన్నారంటే.. కబ్జా నిజమని మీ మంత్రే చెప్పలేదా? టీడీపీ హయాంలోనే వారు నమ్మే ఓ పత్రిక విశాఖ భూ కుంభకోణంపై అనేక కథనాలు వెలువరించింది. నాడు చంద్రబాబు హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు దీనిపై స్పందిస్తూ... ‘విశాఖలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అండదండలతో భూదందా యథేచ్ఛగా సాగుతోంది. భూ బకాసురులు విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. భూ దోపిడీదారులను తన్నడానికి విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మంత్రి పదవినైనా వదులుకోడానికి సిద్ధపడే ఈ నిజాన్ని నిర్భయంగా చెబుతున్నా’ అని ప్రకటించారు. 379 గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులు గల్లంతయ్యాయని అప్పుడు జిల్లా కలెక్టరే చెప్పారు. వాళ్ల ప్రభుత్వంలో వారే లక్ష ఎకరాలకు సంబంధించిన ఎఫ్‌ఎంబీలు గల్లంతు చేశారు. ఇది టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న వ్యక్తే చెప్పారు. విశాఖను కాజేసిన చంద్రబాబు విశాఖలో భీమిలి, హైవే పక్కన, కసింకోట, గాజువాక, ఎస్.రాయవరం ప్రాంతాల్లో వక్ఫ్ భూములను కాజేసిన చరిత్ర టీడీపీదే. పెందుర్తి, ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో కబ్జాకు స్కెచ్ వేశారు. ఆ భూములు తమవి కావని శ్రీనివాస్ చెబుతుంటే చంద్రబాబుకు బాధ ఎందుకు? గతేడాదిగా 250 భూ ఆక్రమణల పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి దాదాపు 430.80 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.4,291 కోట్లు. టీడీపీ నేత శ్రీనివాస్ ఆక్రమణల విలువ రూ.791 కోట్లు. మొత్తం కలిపి రూ.5,082 కోట్ల విలువైన భూములను కాపాడి వెలికితీశారు. విశాఖ కబ్జా నగరంగా ఉండాలా? లేక మహానగరంగా తీర్చిదిద్దాలో చంద్రబాబు జవాబు చెప్పాలి. -
హెల్త్ హబ్‌ల కోసం భూముల గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రధాన నగరాల్లో 16 హెల్త్‌హబ్‌లు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు స్థలాల కోసం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం జగన్‌కు ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చారు. అనంతపురంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో 30 ఎకరాలు.. సుమారు రూ.24 కోట్లు అవుతుందని, అదే కాకినాడలో 30 ఎకరాలు రూ.27 కోట్లు అవుతుందని తేల్చారు. గుంటూరు జిల్లాలో ఒకచోట 16.54 ఎకరాలు, మరో చోట 22 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 20 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూములను గుర్తించారు. ఇక కర్నూలు జిల్లాలో ఒక చోట 58.44 ఎకరాలు, మరోచోట 52.45 ఎకరాల ప్రభుత్వ భూములు హెల్త్‌సిటీకి అనువుగా ఉన్నాయని నిర్ధారించారు. శ్రీకాకుళం జిల్లాలో 30 ఎకరాల ప్రైవేటు స్థలం గుర్తించగా.. దీని విలువ రూ.15 కోట్లు ఉంటుందని తేలడంతో మరో చోట 10 ఎకరాల ప్రభుత్వ భూమిని చూశారు. విశాఖలో 30 ఎకరాలు, విజయనగరంలో 74.80 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకచోట 32 ఎకరాలు, మరోచోట 50 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఇవి రెండూ ఏలూరు కార్పొరేషన్‌కు సమీపంలో ఉన్నవే. పైన పేర్కొన్న అన్ని స్థలాలూ ఆయా జిల్లాల కార్పొరేషన్లకు అత్యంత సమీపంలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములే గుర్తించినట్లు తెలిపారు. -
కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖపట్నంలో భూకబ్జాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబసభ్యుల చెరలో ఉన్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారని మంత్రులు, ప్రజాప్రతినిధులు సోమవారం ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు. ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలేదిలేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. కబ్జాకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన భూముల విలువే రూ.వెయ్యికోట్లని ఎమ్మెల్యే అమర్నాథ్ తెలిపారు. మరోవైపు తాను భూములు ఆక్రమించలేదన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. తన తమ్ముడి ఆక్రమణలపై మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అడ్డూఅదుపు లేకుండా ప్రభుత్వ భూముల కబ్జా విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆనాడు టీడీపీ ప్రభుత్వమే సిట్ వేసిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోందన్నారు. ఆనాడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని టీడీపీ నేతలు ఆక్రమించారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎక్కువమంది టీడీపీ నేతలు ఆక్రమణదారులు కావటంతో అప్పటి ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందన్నారు. విశాఖలో టీడీపీ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా సాగాయన్నారు. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. విశాఖలో టీడీపీ నేతలు ఆక్రమించినవి ప్రభుత్వ భూములని రికార్డులే చెబుతున్నాయని గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వం వాటిని న్యాయబద్ధంగా తన ఆధీనంలోకి తీసుకుంటోందన్నారు. టీడీపీ నేతల ఘనకార్యాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆక్రమిత భూముల గురించి టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని చెప్పారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటే అది కక్షపూరితం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ట్రస్టీగా ప్రజల ఆస్తులను కాపాడటంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అధికారులు నిగ్గు తేల్చారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అండదండలతో విశాఖ కేంద్రంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలు, భూకుంభకోణాలకు పాల్పడ్డారని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆధీనంలో ప్రభుత్వ భూములున్నట్లు అధికారులు నిగ్గుతేల్చారని, వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, అధికారులకు ఉందని చెప్పారు. విశాఖలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి షెడ్లను కూల్చేశారని కొందరు టీడీపీ నేతలు ఆక్రమణదారులకు వత్తాసుపలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న రూ.4,776 కోట్ల విలువైన సుమారు 430 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి మంచి సంకల్పంతో చేపట్టిన ఆక్రమిత భూముల స్వాధీన మహాయజ్ఞానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు భూకుంభకోణాలపై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని గుర్తుచేశారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఎస్టేట్, ఈనాం భూములను టీడీపీకి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్త కె.కె రాజు, పార్టీ నాయకుడు అక్కరమాని వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. కబ్జాకు సూత్రధారి చంద్రబాబే.. విశాఖలో భూదోపిడీ, ప్రభుత్వ భూముల కబ్జాకు సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన 40 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు. రుషికొండలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లాంటి వారు ఇప్పుడు తమ సహచరుల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించుకున్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందే తప్ప దీన్లో కక్షసాధింపు ఏమీ లేదన్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో విశాఖలో లక్ష ఎకరాలకు సంబంధించిన రికార్డులు పోయాయని చెబుతున్నారని, అసలు అప్పుడు గాలులే తప్ప లాకర్లలో ఉన్న భూరికార్డులు తడిసిపోయే విధంగా వర్షం పడలేదని చెప్పారు. అప్పటి భూరికార్డులు ఎలా మాయమయ్యాయో చంద్రబాబుకే తెలియాలన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి రాత్రిబంవళ్లు పనిచేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేను ఎక్కడా ఆక్రమించలేదు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గంలో అధికారులు స్వాధీనం చేసుకున్న ఆక్రమిత భూములు తనవి కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖపట్నంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను భూములు ఆక్రమించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పారు. గాజువాక నియోజకవర్గంలోని సర్వే నం.33/4లో తన స్థలం పక్కన ఉన్న రాస్తా తనకు మాత్రమే పనికొస్తుందని, అది ఎవరికీ ఉపయోగపడదని, దాన్ని తనకు అప్పగిస్తే.. బదులుగా ఎక్కడైనా స్థలం ఇస్తానని గతంలోనే దరఖాస్తు చేసుకున్నానని, అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించకపోతే.. ఆ భూముల్ని మీరెలా వినియోగించుకుంటారని మీడియా ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. సర్వే నం.33/2లో తన స్థలం పక్కన చెరువు బంద ఉందని, దాన్ని తాను ఆక్రమించకుండానే ఆక్రమించేసినట్లు చూపించారని చెప్పారు. చట్టం ప్రకారం కుటుంబ భూముల్లో తన వాటా 1/7 మాత్రమేనన్నారు. తుంగ్లాం రెవెన్యూ గ్రామం పరిధిలో తన సోదరుడు పల్లా శంకరరావు పేరుతో ఉన్న ఆక్రమిత భూముల స్వాధీనంపై మాత్రం పల్లా శ్రీనివాసరావు నోరు మెదపకుండానే మీడియా సమావేశం ముగించేశారు. -
టీడీపీ కబ్జాపై కొరడా!
అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. ప్రహరీలు కట్టేసుకున్నారు. కబ్జాదారుల్లో ఎక్కువ మంది టీడీపీ నేతలే కావటంతో అప్పటి ప్రభుత్వం అవేమీ చూడనట్లే నటించింది. దీంతో వారు చెలరేగిపోయారు. కానీ ప్రభుత్వం మారింది. సర్కారు భూముల్ని తిరిగి స్వా«దీనం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఏడాదిగా కొరడా ఝుళిపిస్తోంది. ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ... దాదాపు రూ.4,300 కోట్ల విలువైన భూముల్ని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. దీంతో ఉత్తరాంధ్ర టీడీపీ త్రయం అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు విషప్రచారానికీ వెనకాడటం లేదు. దీనికి తోడు ఎల్లో మాఫియా... రోజుకో రకం అసత్య ప్రచారాలకు దిగుతోంది. సాక్షి, విశాఖపట్నం: ఇవి ప్రభుత్వ భూములు. ఎందుకంటే రికార్డులు అబద్ధాలు చెప్పవు!. అందుకే వాటిని ప్రభుత్వం తిరిగి తన అదీనంలోకి తీసుకుంటోంది. మరి ఇప్పటిదాకా ఇవి ఎవరి అదీనంలో ఉన్నాయి? ఆ ప్రశ్నకు జవాబు తెలిస్తే... టీడీపీ నేతలు ఎంతటి ఘనులో అర్థమయిపోతుంది. తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఎంతటి అర్థం లేనివో, ఎందుకింత కడుపుమంటతో రగిలిపోతున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే గాజువాక నియోజకవర్గంలో మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువుల కబ్జాలో ఉన్న రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని రెవెన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ భూముల్ని పల్లా సోదరుడు శంకరరావు, ఇతర బంధువులు ఆక్రమించుకోవటమే కాక... వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేసి కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో వీటిని తిరిగి స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించారు. పల్లా భూకబ్జాలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గాజువాక మండలం తుంగ్లాం రెవెన్యూ పరిధిలోని ఆటోనగర్ ఎఫ్ బ్లాక్‌లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు నెలన్నరపాటు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ అనంతరం పల్లా సోదరుడు శంకరరావు గాజువాక మండలం తుంగ్లాం, జగ్గరాజుపేట, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో 38.45 ఎకరాలను కబ్జాచేసినట్లు గుర్తించారు. 15 ఏళ్లకు పైగా ప్రభుత్వ భూములను ఆధీనంలో ఉంచుకుని వీటిని హెచ్‌పీసీఎల్, ఎల్అండ్టీ, మరికొన్ని ప్రైవేటు కంపెనీలకు లీజులకిచ్చి భారీగా ఆర్జించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు నివేదిక అందటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో పి.కిశోర్, గాజువాక తహసీల్దార్ లోకేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు ఆదివారం ఆక్రమిత భూముల స్వా«దీన ప్రక్రియను చేపట్టారు. శంకరరావుకు నోటీసులిచ్చిన అనంతరం నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. పల్లా అనుచరులు అక్కడికి వచ్చి కొంత హడావుడి చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపు చేశారు. గతంలో ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది(ఫైల్) 430.81 ఎకరాలు.. రూ.4,291.41 కోట్లు విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణపై జిల్లా రెవిన్యూ అధికారులు ఏడాదికాలంగా చర్యలు చేపట్టారు. కబ్జాదారులు ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం మేరకు.. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేసి రికార్డుల పరంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ.4,291.41 కోట్లు విలువ చేసే 430.81 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క విశాఖ రూరల్ మండలంలోనే అత్యధికంగా రూ.1,691 కోట్ల విలువైన భూముల్ని స్వా«దీనం చేసుకున్నారంటే కబ్జాదారులు ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థంచేసుకోవచ్చు. అక్కడితో ఆగకుండా పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు. స్వా«దీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల చేతుల్లో ఉన్నవే. తమ భూబాగోతం బయటపడటంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. అచ్చెన్న, అయ్యన్న, బండారు ఏకంగా ఆక్రమణలు తొలగిస్తున్న అధికారుల్ని కూడా తిడుతూ శాపనార్థాలు పెట్టారు. ఐఎఎస్‌లు, రెవిన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు, పోలీసులపై నోటిదురుసుతనం ప్రదర్శించారు. టీడీపీ నేతల కబ్జా చెర నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న కొన్ని భూముల వివరాలు చూస్తే... – టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి గీతం విద్యాసంస్థల పేరుతో రుషికొండ, ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్ 15, 16, 17, 18, 19, 20, 55, 61లో ఉన్న 18.53 ఎకరాల్ని ఆక్రమించి దాని చుట్టూ ప్రహరీ నిర్మించేశారు. అదేవిధంగా రుషికొండలో సర్వే నం. 34, 35, 37, 38లో 20 ఎకరా>ల్లో గార్డెనింగ్, గ్రావెల్ బండ్‌తో పాటు వివిధ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిని గుర్తించిన అధికారులు 2020 అక్టోబర్ 24న అక్రమ నిర్మాణాల్ని తొలగించి.. స్వా«దీనం చేసుకున్నారు. – ఆనందపురం–శొంఠ్యాం సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు సహా పలువురు టీడీపీ నేతలు టైటిల్ డీడ్ నం.1180లో ఆక్రమించుకున్న రూ.256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూముల్ని గతేడాది నవంబర్‌లో స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో సుమారు 60 ఎకరాల భూమిని ఆక్రమించేసుకోగా.. గతేడాది డిసెంబర్లో రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. – టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించిన రుషికొండ బీచ్‌రోడ్డులో సర్వే నం.21లో సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువర్గం పేరుతో గాజువాక నియోజకవర్గంలో మూడు రెవిన్యూ గ్రామాల పరిధిలోని సుమారు రూ.669.26 కోట్లు విలువ చేసే 38.45 ఎకరాల్ని ఆదివారం రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. – టీడీపీ హయాంలో ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్‌గా మార్చి.. దర్జాగా కబ్జా చేసిన విశ్వనాధ విద్యాసంస్థల నుంచి ఆనందపురంలో సర్వే నంబర్ 122, 123లోని రూ.15 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమిని గతేడాది నవంబర్‌లో రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. -
విశాఖలో టీడీపీ నేతల భుకబ్జాలు
-
Palla Srinivasa Rao: కబ్జాచేసి.. లీజుకిచ్చి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ భూములను చెరబట్టిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భూ దందాలు, ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ హయాంలో ఏకంగా 56 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పల్లా అండ్ కో కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో నిగ్గు తేలింది. వ్యవసాయ, వ్యవసాయేతర, పారిశ్రామిక భూములు, రోడ్లు, చెరువులు.. ఇలా కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా గాజువాక పరిసర ప్రాంతాల్లో కనిపించి న భూములన్నింటినీ పల్లా మింగేశారు. సాక్షి వరుస కథనాలతో.. పల్లా కుటుంబం భూ దందాలు, అక్రమాలను ‘సాక్షి’ వరుస కథనాలతో ఏప్రిల్‌లోనే వెలుగులోకి తేవడంతో స్పందించిన జిల్లా అధికార యంత్రాం గం విచారణ చేపట్టింది. జాయింట్ కలెక్టర్ (ఆర్బీ అండ్ ఆర్) ఆదేశాల మేరకు గాజువాక తహసీల్దార్ ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు సమగ్ర విచారణ జరిపా రు. రెవెన్యూ అధికారులు దాదాపు నెలన్నర పాటు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం భూ కబ్జాలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఖాళీ స్థలాలతో పాటు రోడ్లు, చెరువులను సైతం ఆక్రమించినట్లు విచారణలో స్పష్టమైంది. గాజువాక మండలం తుంగ్లాంలో వివిధ సర్వే నంబర్లలో 56.07 ఎకరాలు కబ్జా చేసినట్లు గుర్తించారు. కబ్జా భూములను లీజుకిచ్చి.. పల్లా కుటుంబ సభ్యులు రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లీజులకు ఇచ్చి నట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. హెచ్‌పీసీఎల్, ఎల్ అండ్ టీ లాంటి బడా సంస్థలతో పాటు చిన్న ప్రైవేట్ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులకు విచారణ నివేదిక పల్లా కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలపై గాజువాక తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది స్పష్టమైన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించా రు. సర్వే నెంబర్ల ప్రకారం ఆ స్థలం ఏ విభాగం కిందకు వస్తుంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి, ఎవరి ఆధీనంలో ఉంది? అనే విషయాలతో సమగ్ర నివేదిక రూపొందించారు. పల్లా భూ కబ్జాల బాగోతం.. ► తుంగ్లాం సర్వే నంబర్ 9/6లో ఉన్న 56 సెంట్ల పోరంబోకు స్థలం పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకరరావు ఆక్రమణలోనే ఉందని అధికారులు నిర్ధారించారు. ► సర్వే నంబర్ 10/2లో 36 సెంట్ల పోరంబోకు భూమిని పల్లా శంకరరావు కబ్జా చేశారు. ఈ స్థలంలో ఏసీసీ షెడ్లు వేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ► సర్వే నంబర్ 14/1లో 14.5 ఎకరాల భూమిని పల్లా శంకరరావు ఆక్రమించినట్లు నిర్ధారించారు. ఇందులో 1.75 ఎకరాలను హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇవ్వడంతో గోడౌన్ నిర్మించినట్లు గుర్తించారు. మరో 10 సెంట్ల స్థలంలో జూబ్లీ ఇంజనీరింగ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షెడ్డు ఉంది. ► సర్వే నంబర్ 14/2లో 28 సెంట్ల రైత్వారీ భూమి పల్లా కబ్జాలో ఉన్నట్లు తేల్చారు. ► సర్వే నంబర్ 28లో ఉన్న 40 ఎకరాల చెరువు పల్లా శంకరరావు ఆధీనంలో ఉన్నట్లు తేల్చారు. ఇందులో 92 సెంట్లలో కాంపౌండ్ వాల్‌తో షెడ్డు ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ స్థలాన్ని ఏపీఐఐసీ నుంచి సేకరించగా రైల్వే శాఖకు అప్పగించినట్లు ఉంది. ► సర్వే నంబర్ 33/4లో 13 సెంట్ల పోరంబోకు స్థలాన్ని పల్లా కబ్జా చేశారు. ఆ స్థలంలో హెచ్‌పీసీఎల్ గోడౌన్ ఉంది. ► సర్వే నంబర్ 34/2లో ఉన్న 24 సెంట్ల పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చారు. సదరు సంస్థ ఈ స్థలంలో షెడ్డు నిర్మించింది. -
టీడీపీ నేతల ఆక్రమణలకు చెక్
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలు ఆక్రమించిన ప్రభుత్వ భూములకు విముక్తి లభించింది. చిత్తూరు జిల్లాలో ఏళ్ల తరబడి టీడీపీ నేతల కబంధహస్తాల్లో ఉన్న 2,887.73 ఎకరాలను ప్రభుత్వ భూములుగా చిత్తూరు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు ధ్రువీకరించారు. అలానే జిల్లాలోని 78 గ్రామాల్లో 538.29 ఎకరాల భూమికి సంబంధించిన అక్రమ డీకేటీ పట్టాలను రద్దు చేశారు. ఈ రెండేళ్ల కాలంలో అక్రమార్కుల చెర నుంచి కోట్లాది రూపాయల విలువైన 3,426 ఎకరాల ప్రభుత్వ భూములకు విముక్తి లభించింది. జిల్లాలో చంద్రబాబు సొంత తమ్ముడి మొదలు.. నాటి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మండల, గ్రామ స్థాయి కార్యకర్తల వరకూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. వాటిలో ముఖ్యంగా శ్రీకాళహస్తి, సత్యవేడు, పీలేరు, తిరుపతి పరిధిలోనే అధికంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అల్లుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అనుచరులు, లోకేశ్ అనుచరులు ప్రభుత్వ, పోరంబోకు, అటవీ భూములను విచ్చలవిడిగా ఆక్రమించారు. నాటి రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ దురాక్రమణలకు ఒడిగట్టారు. ఈ ఆక్రమణలను పలుమార్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. సోత్రియ భూములే వారి టార్గెట్ సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్సార్ హయాంలో వందలాది ఎకరాల్లో శ్రీసిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. అక్కడ భారీ పరిశ్రమల ఏర్పాటుతో నియోజకవర్గ పరిధిలోని భూముల ధరలు రూ.కోట్లకు చేరాయి. వైఎస్సార్ మరణానంతరం సత్యవేడు పరిధిలోని ప్రభుత్వ, పోరంబోకు, కాలువ, అటవీ భూములను ఆక్రమించుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా విలువైన సోత్రియ భూములను టార్గెట్ చేశారు. 1956లో ఈ భూములు మద్రాస్ రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా పొన్నేరు తాలూకాలో ఉండేవి. 1960లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్ కింద అప్పట్లో ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చంద్రబాబు సీఎం అయ్యాక ఆ భూములపై టీడీపీ నేతల కన్నుపడింది. ఆ భూములను సోమయాజులు నుంచి చెంగమనాయుడు కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు. అనంతరం చెంగమనాయుడు రక్తసంబంధీకుడు కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ముఖ్య నాయకులు 17 మంది రంగంలోకి దిగారు. వారిలో ఓ పారిశ్రామికవేత్త కూడా ఉన్నాడు. సోత్రియ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను సేకరించారు. వాటికి రైత్వారీ పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. రైత్వారీ పట్టా వీలు కాకపోవటంతో డూప్లికేట్ పట్టాలు సృష్టించి చెన్నైలోని ఓ బ్యాంక్‌లో ఆ భూములను తాకట్టు పెట్టి రూ.15 కోట్లు తీసుకున్నట్టు తెలిసింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని వైఎస్ జగన్ సీఎం అయ్యాక అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో జేసీ మార్కండేయులు శాటిలైట్ ద్వారా సోత్రియ భూములను సర్వే చేసి వాటిని ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఆక్రమణకు గురైన 3,426 ఎకరాల ప్రభుత్వ, అటవీ, పోరంబోకు తదితర భూములను ప్రభుత్వ భూములుగా ధ్రువీకరించాం. వీటిని ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తాం. ఈ భూముల్లో 1052 ఎకరాల సోత్రియ భూములను ఏపీఐఐసీకి కేటాయించనున్నాం. – మార్కండేయులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు. -
Government Land: పొరపాటున పట్టాలిచ్చారనడం సరికాదు
టీ.నగర్: చెంగల్పట్టు సమీపాన 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పట్టా చేసి అందజేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అందులో చెంగల్పట్టు సమీపాన కరుంగుళిపల్లం అనే గ్రామంలోని 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 53 మందికి పట్టా చేసి అందజేశారని, ఈ స్థలం అపహరణ గురించి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయగా, ఈ కేసును స్థల అపహరణ కేసులను విచారించే ప్రత్యేక విభాగానికి పంపకుండా తిరుపోరూరు పోలీసు స్టేషన్‌కు పంపినట్లు తెలిపారు. వందల కోట్ల రూపాయిలు విలువచేసే ఈ స్థలం వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే శివానందం, న్యాయవాదులు ఉన్నారని, అందుచేత తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని, తనకు భద్రత కల్పించేందుకు పోలీసులకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్, రామ్మూర్తి సమక్షంలో మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది 105 ఎకరాల స్థలానికి పొరపాటున ప్రభుత్వ అధికారులు పట్టాలు అందజేశారని, ఈ పట్టాలను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వాదనను న్యాయమూర్తులు నిరాకరించారు. 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పొరపాటున అధికారులు పట్టా చేసి ఇచ్చారనడం సమంజసం కాదని, సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యవహారంలో అధికారులు ప్రాథమిక విచారణ జరిపి నివేదిక దాఖలు చేయాలంటూ విచారణను జూన్ పదో తేదీకి వాయిదా వేశారు. చదవండి: ఆక్సిజన్ అందక 13 మంది మృతి -
విశాఖ భూముల టెండర్ల ప్రక్రియ కొనసాగించవచ్చు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల వేలం విషయంలో టెండర్ల ప్రక్రియను కొనసాగించవచ్చని, అయితే టెండర్లను మాత్రం ఖరారు చేయవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్, ఎన్బీసీసీ సీఎండీ, ఏపీఐఐసీ ఎండీ తదితరులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్నంలో భూముల వేలాన్ని అడ్డుకోవాలని కోరుతూ విజయవాడకు చెందిన కన్నెగంటి హిమబిందు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
అచ్చెన్నా.. ఇదేందన్నా!
రాజకీయం అండగా అక్రమాలు.. కండబలంతో దౌర్జన్యాలు.. బెదిరించి అధికారుల్ని లోబరుచుకోవడం.. రికార్డులు మాయం చేయడం.. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం.. వాటిని చూపించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం.. ఆ భూముల్లో నిర్మించిన గోదాములను ప్రభుత్వ సంస్థకే లీజుకివ్వడం.. అక్రమంగా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం.. ఇవీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబ వ్యవహారాలు. కాలువను, గోర్జి భూమిని కూడా ఆక్రమించేశారంటే వీరి తెగింపును అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ప్రభుత్వ భూముల్ని కూడా తమపేరుతో రిజిస్టర్ చేసేసుకున్నారు. పాత రికార్డులు కనిపించకుండా చేసేశారు. వీటిగురించి తెలిసినా ప్రస్తావించేందుకు కూడా ఎవరూ సాహసించరు. ఎవరైనా సాహసిస్తే.. బెదిరించో, దండించో నోరు మూయిస్తారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ అవినీతికి అంతే లేకుండాపోయింది. అచ్చెన్నాయుడు అన్నదమ్ములు వ్యూహాత్మకంగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎర్రన్నాయుడు ఉన్నంతకాలం ఆయన అండతో, ఆయన తర్వాత అచ్చెన్నాయుడు అండతో సోదరుడు కింజరాపు హరిప్రసాద్ చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. నీరు చెట్టు పనుల్లో కోట్లు తినేశారు. రోడ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో తన స్వగ్రామమైన నిమ్మాడ సమీపంలోని పెద్దబమ్మిడి గ్రామంలో గోడౌన్ల ద్వారా గత 12 ఏళ్లలో రూ.47 కోట్లకుపైగా అక్రమార్జనకు పాల్పడ్డారు. అక్రమార్జనకు వేదికైన గోడౌన్లను ఏకంగా ప్రభుత్వ భూమిలోనే నిర్మించారు. సర్వే నంబరు 95, 96లో గోడౌన్, సర్వే నంబరు 106లో భవాని గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ నిర్మించారు. ప్రభుత్వ భూమి, గోర్జి (పొలాలకు వెళ్లే దారి), సాగునీటి కాలువలు సుమారు 3.15 ఎకరాలు ఆక్రమించి ఈ నిర్మాణాలు చేశారు. ఆక్రమిత భూమిలో నిర్మించిన గోడౌన్లను చూపించి వివిధ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారు. ఆక్రమించిన భూములివే.. సర్వే నంబర్ 95–08లో 1.20 ఎకరాల నీటి కాలువ, సర్వే నంబర్ 95–11లో 51 సెంట్లు గోర్జి పోరంబోకు, సర్వే నంబర్ 96–6లో 11 సెంట్ల ప్రభుత్వ కాలువ భూమి, సర్వే నంబర్ 96–10లో 58 సెంట్ల ప్రభుత్వ గోర్జి భూమి, సర్వే నంబర్ 95–3లో 15 సెంట్ల ప్రభుత్వ కాలువ భూమి, సర్వే నంబర్ 96–3 లోగల 21 సెంట్లు ప్రభుత్వ గోర్జి భూమి, సర్వే నంబర్106–6పీలో 18 సెంట్లు, సర్వే నంబర్ 95–08పీలో 2 సెంట్లు, సర్వే నంబర్ 96–3పీలో గల 12 సెంట్లు, సర్వే నంబర్ 96–10పీలో 7 సెంట్లు.. మొత్తం 3.15 సెంట్లను కలిపేసుకుని గోడౌన్లను నిర్మించారు. ఈ భూములను ఆక్రమించడమే కాకుండా తన సోదరులు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, ప్రభాకర్‌ల భాగస్వామ్యంతో కోటబొమ్మాళి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూములు చూపించి 2009లో కోటబొమ్మాళి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి (పీఏసీఎస్‌కు) చైర్మన్‌గా ఉన్న కింజరాపు హరిప్రసాద్ కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ భూములనే చూపించి కొన్ని జాతీయ బ్యాంకుల్లో కూడా రుణాలు తీసుకున్నారు. రికార్డులు మాయం 1989 నుంచి 2006 వరకు కోటబొమ్మాళి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన భూముల క్రయవిక్రయాల జాబితాల్లో లభించిన ఈసీల ప్రకారం పరిశీలిస్తే.. కింజరాపు హరిప్రసాద్ తన అన్నదమ్ముల సాయంతో సుమారు 7.86 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీన్లో 3.15 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఈ ఆక్రమణల పర్వంలో రెవెన్యూ రికార్డుల్ని మాయం చేశారు. రెవెన్యూ శాఖలో అతి కీలకమైన ఎస్ఎల్ఆర్ రికార్డుల్ని కూడా కనిపించకుండా చేశారు. ఇరిగేషన్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, వివిధ బ్యాంకులను మోసం చేశారు. ఈ క్రమంలో అధికారులను కూడా భయపెట్టారు. గోడౌన్ల ముసుగులో అవినీతి హరిప్రసాద్ 2003లో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్లు నిర్మించారు. వీటిని 2004కి 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి, 2014కి 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి విస్తరించారు. 2007 నుంచి 2019 వరకు 12 ఏళ్లలో ఈ గోడౌన్ల నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారు. టీడీపీ అధికారంలో ఉన్నంతవరకు జిల్లా పౌరసరఫరాల సంస్థ ఈ గోడౌన్లను లీజుకు తీసుకుని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వచేసేది. ఒక అక్నాలెడ్జ్మెంట్ (ఏసీకే.. అనగా 580 బియ్యం బస్తాలు)కి రెండు క్వింటాళ్ల వరకు మిల్లర్ల నుంచి అనధికారికంగా తరుగు కింద తీసుకునేవారు. వాస్తవంగా ప్రభుత్వమే 1.5 శాతం తరుగు అవకాశం ఇస్తుంది. ఈ లెక్కన మిల్లర్ల దగ్గర తీసుకున్నదంతా అదనమే. మిల్లర్లు తమ గోడౌన్లో ధాన్యం బస్తాలు నిల్వ చేయాలంటే అనధికారికంగా అడ్వాన్సు పేరిట రూ.ఐదువేలు వసూలు చేసేవారు. గోడౌన్ ఫార్మాలిటీ కింద ఒక బస్తాకి రూ.1.60 పైసలు తీసుకునేవారు. వాస్తవానికి ప్రభుత్వమే బస్తాకి రూ.3.50 పైసలు అద్దె చెల్లిస్తుంది. హ్యాండ్లింగ్ కోసం రెండేళ్లకొకసారి టెండర్లు పిలవాల్సి ఉన్నా.. ఎప్పుడూ ఏకపక్షంగానే టెండర్ కొట్టేసేవారు. హ్యాండ్లింగ్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ మిల్లర్ల దగ్గరి నుంచి అనధికారికంగా వసూలు చేసేవారు. ఇవికాకండా వే బ్రిడ్జి కోసమని ఒక ఏసీకేకి రూ.250 వసూలు చేసేవారు. ఇలా అన్ని రకాలుగా సంవత్సరానికి 3 కోట్ల 96 లక్షల 60 వేల రూపాయల మేర అక్రమంగా ఆర్జించారు. ఈ రకంగా 12 సంవత్సరాలకు కలిపి 47 కోట్ల 59 లక్షల 20 వేల రూపాయల మేర కింజరాపు కుటుంబం అడ్డగోలుగా వెనకేసుకుంది. 1.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గోడౌన్లు ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.5 వంతున ఎఫ్‌సీఐ లీజులో ఉన్నాయి. నా దగ్గర ఆధారాలున్నాయి 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన కింజరాపు కుటుంబసభ్యులకు అప్పట్లో కేవలం రెండెకరాల పొలం మాత్రమే ఉండేది. ఇప్పుడు వేలకోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. నిమ్మాడ గోడౌన్ నిర్మాణంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఆ భూమిని సొంతగా రిజిస్ట్రేషన్ చేసుకుని రెవెన్యూ రికార్డులను మాయం చేశారు. ప్రభుత్వ భూముల రికార్డులను మాయం చేసి వివిధ బ్యాంకుల్లో కోట్ల రూపాయల రుణాలు కాజేశారు. ప్రధాన కారకుడైన హరిప్రసాద్‌కు సోదరులు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, ప్రభాకర్ అండగా ఉండటంతో కొన్ని దశాబ్దాలుగా లెక్కలేని అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డులు మాయం చేసి బ్యాంకుల్లో కోట్ల రూపాయలు దోచుకోవడం, గోడౌన్ నిర్వహణలో అక్రమ వసూళ్లకు సంబంధించి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. – దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడిలో గోడౌన్ నిర్మాణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగినట్లు ఫిర్యాదు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇదే గోడౌన్లో ఏడాది కిందట మండల సర్వేయర్లతో సర్వే చేయించాం. అప్పట్లో ప్రైవేట్ ల్యాండ్ అని నివేదిక ఇచ్చారు. – రమేష్‌బాబు, తహసీల్దారు, కోటబొమ్మాళి భౌతికంగా ఉన్న పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేస్తాం భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో భౌతికంగా ఉన్న పత్రాల మేరకు రిజిస్ట్రేషన్లు చేస్తాం. కొన్ని సర్వే నంబర్లకు ఆనుకుని ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే నంబర్లు ఉన్నప్పుడు అవి కూడా ప్రైవేటు భూమి యజమాని పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. – జి.రాజు, సబ్‌రిజిస్ట్రార్, కోటబొమ్మాళి -
భూ రికార్డుల స్వచ్ఛీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కు పత్రాలు (ఆర్వోఆర్–అడంగల్) తప్పుల తడకగా.. అస్తవ్యస్తంగా తయారయ్యాయి. భూ రికార్డులను నవీకరించి నిర్వహించడానికి వీలుగా 2014లో అప్పటి ప్రభుత్వం ‘వెబ్‌ల్యాండ్’ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. అది కాస్తా తప్పుల తడకగా.. లోపభూయిష్టంగా తయారైంది. ఫలితంగా భూ యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే దుస్థితి దాపురించింది. వెబ్‌ల్యాండ్ రికార్డులు సక్రమంగా లేకపోవడంవల్లే భూ వివాదాలు పెరిగి ఘర్షణలకు దారి తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో హత్యలకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని వివాదాల విషయంలో ఇరువర్గాలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న దృష్టాంతాలు లక్షల్లో ఉన్నాయి. అందువల్లే భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, పట్టణ, గ్రామీణ ఆస్తులను రీసర్వే చేసి ప్రతి సబ్ డివిజన్‌కు సరిహద్దు రాళ్లు నాటాలని నిర్ణయించింది. తద్వారా ల్యాండ్ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని పక్కాగా చేపడుతోంది. ప్రైవేట్ భూములు ప్రభుత్వ ఖాతాలో.. అనేకచోట్ల ప్రైవేట్ భూములు ప్రభుత్వ ఖాతాల్లోనూ, ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోను అడంగల్‌లో నమోదై ఉన్నాయి. కొందరు కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది, రిటైర్డు ఉద్యోగులు ముడుపులు తీసుకుని తప్పుడు రికార్డులు సృష్టించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు కూడా ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించారు. ఇప్పటికీ చాలా భూములు రెవెన్యూ రికార్డుల్లో అన్ నోన్ (ఎవరివో తెలియవు) అనే ఖాతాలోనే ఉన్నాయి. తప్పుల సవరణ కోసం... 2020 జూన్ 1 నుంచి 2021 జనవరి 29వ తేదీ వరకూ 8 నెలల్లో భూ యాజమాన్య పత్రం (ఆర్వోఆర్/అడంగల్)లో తప్పుల సవరణ కోసం 4,17,650 వినతులు వచ్చాయి. వెబ్‌ల్యాండ్ ఎంత అస్తవ్యస్తంగా.. తప్పుల తడకగా ఉందనేది ఈ గణాంకాలే చెబుతున్నాయి. వాటిలో.. 2,04,577 తప్పులను అధికారులు సరిదిద్దారు. 43,047 అర్జీలు పెండింగ్‌లో ఉండగా.. 1,70,026 అర్జీలను వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. అందుకే స్వచ్ఛీకరణ దశాబ్దాల తరబడి సబ్ డివిజన్ కాకపోవడం, కిందిస్థాయిలో జరిగిన అక్రమాలు వంటి కారణాల వల్ల అడంగల్‌లోనూ, వెబ్‌ల్యాండ్ అడంగల్‌లోనూ కొన్ని తప్పులు ఉన్న మాట వాస్తవమేనని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు అంగీకరించారు. ఈ తప్పులను సరిదిద్ది ప్రక్షాళన చేయడం కోసమే ప్రభుత్వం రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. -
విశాఖ భూ కుంభకోణంపై ‘సిట్’ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: విశాఖ, పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గడువును ప్రభుత్వం వచ్చే నెల 28 వరకూ పొడిగించింది. జిల్లాలో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేశారని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని, రికార్డులు మాయం చేశారంటూ వచ్చిన అభియోగాలపై లోతైన దర్యాప్తు నిమిత్తం 2019 నవంబర్ 17న ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతేడాది ఫిబ్రవరి 12న సిట్ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. కరోనా, లాక్డౌన్ కారణంగా తమ బృందం గతేడాది మార్చి 15వ తేదీ వరకే పని చేసిందని, అనంతరం గతేడాది జూన్ 10 నుంచే పని ప్రారంభించిందని సిట్ చైర్మన్ ప్రభుత్వానికి నివేదించారు. మిగిలిన రికార్డులను పరిశీలించి, నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని సిట్ చైర్మన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిట్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. -
8,289 ఎకరాలు.. 789 కేసులు
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ సహా శివారు (మేడ్చల్ జిల్లా)లో సుమారు 8,289.62 ఎకరాల ప్రభుత్వ భూములు వివిధ కోర్టు వివాదాల్లో మగ్గుతున్నాయి. వీటి విలువ రూ.35 వేల కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఆయా కోర్టుల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసుల సంఖ్య 789 ఉండగా.. అత్యధికంగా హైకోర్టులో 545 కేసులు ఉన్నాయి. వివిధ కోర్టుల్లో మొత్తం భూముల్లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 831.62 ఎకరాలు. వీటిలో వివిధ కోర్టుల్లో 83 కేసులు నడుస్తున్నాయి. నగర శివారులోని మేడ్చల్ జిల్లాలో వివాదాలకు సంబంధించిన భూములు 7,458 ఎకరాలు ఉన్నాయి. వీటిలో వివిధ కోర్టుల్లో 706 కేసులు కొనసాగుతున్నాయి. వివాదాల్లో ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని భూముల విలువ రూ. 9489.16 కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే శివారు (మేడ్చల్ జిల్లా)లో వివాదాస్పద భూములు 7,458 ఎకరాలకు సంబంధించి రూ.26 వేల కోట్లకుపైగా ఉంటుందని పేర్కొంటున్నారు. వివాదాస్పద భూములన్నీ అధికంగా పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు సంబంధించినవి ఉన్నట్లుగా భావిస్తున్నారు. భూవివాదాల సమాచారాన్ని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించారు. దీంతో భూవివాదాలకు సంబంధించిన కోర్టు కేసుల స్టేటస్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం సత్వర పరిష్కరానికి చొరవ చూపాలని ఆదేశించినట్లు సమాచారం. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులు పలు కోర్టుల్లో ఏళ్ల తరబడి నడుస్తుండటంతో ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించలేకపోతున్నామన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు సమన్వయంతో పని చేసి భూ వివాదాల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూముల జాబితా సిద్ధం చేసి కేసుల పరిష్కారానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. -
పీలా చెరలో రూ. 300 కోట్లు ప్రభుత్వ భూమి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర పరిసరాల్లో భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే ఈ డ్రైవ్‌లో టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు చేసిన భూకబ్జాలు, చేసిన అక్రమ నిర్మాణాలే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గతంలో ‘గీతం’, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువుల ఆక్రమణలు బయటపడగా.. తాజాగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా భూ కబ్జాకు పాల్పడి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు నిర్ధారించి చర్యలు చేపట్టారు. భీమన్నదొరపాలెంలో.. ఆనందపురం మండలంలోని భీమన్నదొరపాలెం పరిధి సర్వే నంబర్ 156లో పీలా ఆక్రమణలో ఉన్న సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆదివారం విశాఖ ఆర్డీవో పెంచల కిషోర్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం ఆ భూమి విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఆ భూమిని ఆనుకొని ఉన్న డీ పట్టా భూములను కొనుగోలు చేయడంతో పాటు మరో 100 ఎకరాల వరకు ఆక్రమించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు రెవిన్యూ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. డీ పట్టా భూములపై కన్ను పీలా గోవిందు తండ్రి మహాలక్ష్మి నాయుడు టీడీపీ నాయకుడే. ఆయన పెందుర్తి మండలాధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచే భీమన్నదొరపాలెంలో డీ పట్టా భూములపై కన్నేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ఆ భూములను సక్రమం చేసుకునేందుకు గోవిందు 2014 సంవత్సరంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. విశాఖలో భూఆక్రమణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలోనూ ఈ అక్రమాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిగాక ఆనందపురం మండలంలోనే రామవరం గ్రామంలో 99.89 ఎకరాల ప్రభుత్వ భూమి చేతులు మారిన వ్యవహారంలో గోవిందుతో పాటు మరో 11 మందిపై పోలీసులు గతంలో క్రిమినల్ కేసు నమోదు చేశారు. బొత్స బంధువుల అక్రమ నిర్మాణం తొలగింపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బంధువులకు చెందిన రేకుల షెడ్డును ఆదివారం రెవెన్యూ అధికారులు తొలగించారు. విశాఖ శివారు రుషికొండ పరిధిలో సర్వే నంబర్ 19లో ఏడు సెంట్ల విస్తీర్ణంలో ఒక షెడ్డు, రెండు సెంట్ల విస్తీర్ణంలో మరొక రేకుల షెడ్డు గెడ్డ పోరంబోకు భూమిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేశారు. అయితే ఆ నిర్మాణాల్లో రెండు సెంట్ల విస్తీర్ణంలో ఉన్నది మాత్రమే తమ బంధువులకు చెందినదని మంత్రి బొత్స ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు. విశాఖలో అక్రమ నిర్మాణాలు ఏవైనా తొలగించాలని, తన బంధువులదైనా ఉపేక్షించవద్దని తాను ఆదివారం స్వయంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వెలగపూడి కబ్జా పర్వం ఎమ్మెల్యే వెలగపూడి రుషికొండ ప్రధాన రహదారిని ఆనుకొనే కబ్జా పర్వం నడిపించారు. జీవీఎంసీ 8వ వార్డు పరిధిలో సర్వే నంబర్ 21లోని సుమారు రూ.2 కోట్ల విలువైన 6 సెంట్ల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలగపూడి ఆక్రమించారు. అందులో రేకుల షెడ్డు, ప్రహరీ నిర్మించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది గెడ్డ పోరంబోకు స్థలంగా గుర్తించిన అధికారులు ఆదివారం ఉదయం ఆయా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అది ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. -
సముద్ర తీరాల్లో టూరిజం రిసార్ట్స్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు సముద్ర తీరం వెంబడి పెద్దఎత్తున రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను కోరామన్నారు. పర్యాటక రంగానికి మన రాష్ట్రం పర్యాయ పదం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త టూరిజం పాలసీ రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని, అందువల్ల ఈ రంగంలో ఉన్న టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజం అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రదేశాలు, సదుపాయాలు వంటివన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నామని వివరించారు. 12 ప్రాంతాల్లో స్టార్ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేస్తున్నామని, వాటర్ టూరిజం, ఎకో టూరిజం, బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తెలుగు వంటకాలకు గుర్తింపు కోసం ఫుడ్ ఫెస్టివల్ తెలుగు వంటకాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని, శాఖాహార, మాంసాహార వంటకాలను ప్రజలకు పరిచయం చేస్తామని చెప్పారు. పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలో 9 కంట్రోల్ రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. -
విశాఖలో ఆక్రమణలపై ఉక్కుపాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన ప్రభుత్వ భూముల్ని అధికారులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణల్ని గుర్తించిన జిల్లా రెవిన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాల్ని తొలగించింది. ఏకంగా 66.5 ఎకరాల ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంది. మరోవైపు లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ప్రభుత్వ స్థలాల్లో తిష్టవేసిన వారిపైనా అధికారులు చర్యలు చేపట్టారు. గంటా బంధువు చెరలోని భూమి స్వాధీనం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తోడల్లుడు.. ప్రత్యూష అసోసియేట్స్ ప్రతినిధి, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్‌రావు ఆక్రమణలో ఉన్న భూముల్ని ఆర్డీవో పెంచల్ కిషోర్ నేతృత్వంలో అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖ రూరల్ మండలం అడవివరం – శొంఠ్యాం రోడ్డులో ఉన్న విజయరామపురం అగ్రహారం గ్రామంలో టైటిల్ డీడ్ నం.1180లో మొత్తం 124 ఎకరాల భూమి ఉంది. ఇందులో 64 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4.86 ఎకరాలు పరుచూరి భాస్కర్‌రావుకు చెందినవని తేలింది. ఈ భూమి సహా ఇతర ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న మొత్తం 64 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమిత భూముల్లో ఉన్న రక్షణ గోడలు, షెడ్లు, గేట్లు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మార్కెట్ ధర ప్రకారం ఈ భూముల మొత్తం విలువ సుమారు రూ.256 కోట్లు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ని సీజ్ చేస్తున్న వీఎంఆర్డీఏ అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆధీనంలో... ఆనందపురం మండలంలోని వేములవలస, ఆనందపురం గ్రామాల సరిహద్దులో ప్రభుత్వ భూముల్లోని కొంత జిరాయితీ భూమిని విశ్వనాథ ఎడ్యుకేషనల్ సంస్థ 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ని ఏర్పాటు చేసింది. ఆ స్కూల్‌ని ఆనుకొని ఉన్న ఆనందపురం సర్వే నంబరు 283–3 లోని 1.68 ఎకరాల గయాళు భూమిని, వేములవలస సర్వే నంబరు 123 లో 34 సెంట్లు, 122–1, 122–2, 122–3లలో 76 సెంట్లు వాగు పోరంబోకుని సంబంధిత యాజమాన్యం కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా క్రీడా ప్రాంగణంతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టింది.. శనివారం ఈ నిర్మాణాల ప్రహరీ గోడలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని, హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలం మార్కెట్ విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్‌లీజ్‌కు.. లీజు గడువు ముగిసినా ఖాళీ చెయ్యకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న సిరిపురంలోని ఫ్యూజన్ çఫుడ్స్ అండ్ రెస్టారెంట్‌ను విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్ధ (వీఎంఆర్డిఏ) ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకుంది. టీడీపీ నాయకుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన టి.హర్షవర్ధన్ ప్రసాద్.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్ పద్ధతిలో వీఎంఆర్డీఏ కి చెందిన 10,842 చదరపు అడుగుల స్ధలాన్ని లీజుకు తీసుకున్నారు. 2015లో ఏటా రూ.33 వేల చొప్పున చెల్లించేలా ఫ్యూజన్ ఫుడ్స్ పేరుతో తొమ్మిదేళ్ల లీజుకు తీసుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీవో నం.56 ప్రకారం మూడేళ్లు మాత్రమే లీజుకి ఇవ్వాల్సి ఉండగా.. అప్పటి వుడా అధికారులు టీడీపీ ప్రభుత్వ ఒత్తిడితో ఏకంగా తొమ్మిదేళ్లకు రాసిచ్చేశారు. ఇదిలావుండగా ఈ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా శ్రీ కన్య కంఫర్ట్స్ అనే సంస్థకు సబ్ లీజుకు ఇచ్చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన లీజు కారణంగా వీఎంఆర్డీఏకి ప్రతి నెలా లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని భావించిన కమిషనర్ పి.కోటేశ్వరరావు చర్యలకు ఆదేశించారు. ఆదివారం ఉదయం వీఎంఆర్డీఏ కార్యదర్శి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు. ఆక్రమణలపై చర్యలు కొనసాగిస్తాం ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు గుర్తిస్తున్నాం. సర్వే నంబర్లు, పాత రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో భూముల పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఎక్కడ ఆక్రమణలుంటే అక్కడ భూములు స్వాధీనం చేసుకునేందుకు, ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాపాడేందుకు దీనిని ప్రత్యేక డ్రైవ్‌లా ఇకముందు కూడా కొనసాగిస్తాం. –– ఆర్డీవో పెంచల్ కిశోర్ -
విశాఖపట్నం: 70 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న బడాబాబులు
-
విశాఖలో భారీగా ప్రభుత్వ భూమి స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అడవివరం నుంచి శోత్యాం వెళ్లే మార్గంలో రామ అగ్రహారం వద్ద దాదాపు 110 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి మొక్కలను పెంచుతున్నారు. ఇందులో పది ఎకరాల భూమిని మినహాయిస్తే మిగతా భూమి అంతా ప్రభుత్వానిది. టీడీపీ హయాంలో కొందరు బడా బాబులు ఈ భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి ప్రహరీ గోడను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 ఎకరాల ఖరీదైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం) -
ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక నగరం ముంబైతోపాటు ఉప నగరాలలో, శివారు ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, ఇతర ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించాలని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయం తీసుకుంది. మూడు సంవత్సరాల కాలవ్యవధి కోసం సంబంధిత కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వనుంది. సుమారు 400పైగా సెక్క్యురిటీ గార్డులతో కూడిన బృందాన్ని రంగంలోకి దించనుంది. అందుకు ఎమ్మెమ్మార్డీయే సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేయనుందని అథారిటీ వర్గాలు తెలిపాయి. (మహారాష్ట్రలో జైళ్లు ఫుల్) 4,350 చదరపు కిలోమీటర్లు.. ఎమ్మెమ్మార్డీయే పరిధి సుమారు 4,350 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో ముంబై, థానే, నవీముంబై, కల్యాణ్–డోంబివలి, ఉల్లాస్‌నగర్, మీరా–భాయందర్, భివండీ, వసయి–విరార్ తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే అంబర్నాథ్, బద్లాపూర్, మాథేరాన్, కర్జత్, ఖోపోలి, పన్వేల్, పేణ్, ఉరణ్, అలీబాగ్ తదితర మున్సిపాలిటీలు, వీటి పరిధిలోని కొన్ని గ్రామాలున్నాయి. ముంబైలో బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్ (బీకేసీ), వడాల, ఓషివరా, గోరాయి తదితర ప్రాంతాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు విలువచేసే సొంత స్థలాలున్నాయి. వీటిపై నియంత్రణ లేకపోవడంవల్ల ఈ స్థలాలన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేక రోజురోజుకు అక్రమణ పెరిగిపోతూనే ఉంది. అందుకు ప్రధాన కారణం ట్రాఫిక్ వ్యవస్థపై ఎమ్మెమ్మార్డీయే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడమే. నగరంతోపాటు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా అక్కడక్కడ ఫ్లై ఓవర్లు, మెట్రో–2, 3, 4, 5 ప్రాజెక్టులున్నాయి. అథారిటీ అధికారులెవరు సొంత స్థలాలపై దృష్టి సారించడం లేదు. దీంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారు. అక్రమణలను తొలగించాలంటే ఎమ్మెమ్మార్డీయే చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. తమ స్థలాలు సొంతం చేసుకునేందుకు బలవంతంగా అక్రమణలు తొలగిస్తే కోర్టులు, స్టే ఆర్డర్లు, పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు, బాధితుల నుంచి దాడులు, ఆందోళనలు, రాస్తారోకోలు ఇలా అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేగాకుండా అక్రమణల కారణంగా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతోంది. ఆలస్యంగానైన కళ్లు తెరిచిన అథారిటీ ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించి కనీసం మిగిలిన స్థలాలను కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. చదవండి: ముంబైలో బైడెన్ బంధువులు..! -
సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబబే
సాక్షి, అమరావతి: విశాఖపట్నం గీతం విద్యాసంస్థలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరపడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వ భూముల్లో తాము చేపట్టిన నిర్మాణాల నుంచి తమను ఖాళీ చేయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న గీతం అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సబబుగానే ఉన్నాయని, అందులో ఏ రకంగానూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి కట్టడాలు, కూల్చివేతలు వద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు గీతం ప్రయోజనాలను కాపాడేలా ఉన్నాయని, అలాంటప్పుడు ఆ ఉత్తర్వులు ఎలా తప్పవుతాయని ప్రశ్నించింది. తదుపరి ఏం ఉత్తర్వులు కావాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లాలని గీతం యాజమాన్యానికి స్పష్టం చేసింది. గీతం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తూ జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ, రిషికొండ, యందాడ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూమిని పెద్దమొత్తంలో ఆక్రమించిన గీతం యాజమాన్యం పలు నిర్మాణాలు చేపట్టింది. కొన్నింటిని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీనిపై గీతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. తదుపరి ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని రెవెన్యూ అధికారులను, కూల్చివేసినచోట ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గీతం యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలపై గీతం యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై మంగళవారం జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మీకు అనుకూలంగా ఇచ్చినా అభ్యంతరమా?: గీతం తరఫు న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చి తమ నిర్మాణాలను కూల్చేశారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. సింగిల్ జడ్జి మీకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు కదా, మీకు అభ్యంతరం ఏముంది అని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి కేవలం తదుపరి కూల్చివేతలు వద్దని మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారని రుద్రప్రసాద్ చెప్పగా, అంతకు మించిన సానుకూల ఉత్తర్వులు ఏం ఇవ్వగలమని మళ్లీ ప్రశ్నించింది. తమ నిర్మాణాల నుంచి తమను ఖాళీచేయించేందుకు ప్రయత్నిస్తూ థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ఆ దిశగా చర్యలు తీసుకోకుండా అధికారులను నియంత్రిస్తూ ఆదేశాలివ్వాలని రుద్రప్రసాద్ కోరారు. ధర్మాసనం అందుకు నిరాకరించింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. తదుపరి ఏం ఆదేశాలు కావాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ అప్పీల్‌పై విచారణ జరపాలంటే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్‌ను కొట్టేయించుకురావాలని తెలిపింది. సింగిల్ జడ్జి మంచి ఉత్తర్వులిస్తే, దానిపై అభ్యంతరం చెబుతూ అప్పీల్ దాఖలు చేయడం ఏమిటని నిలదీసింది. తాము ఈ అప్పీల్‌ను విచారించబోమని తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ భూమిలో కట్టిన అక్రమ కట్టడాలనే కూల్చివేశామని చెప్పారు. తమ భూమిని తాము స్వాధీనం చేసుకోవడాన్ని గీతం తప్పుపడుతోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. -
టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం
సాక్షి , విశాఖపట్నం/కొమ్మాది: గీతం విద్యా సంస్థల అక్రమాలపై విశాఖ జిల్లా రెవిన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత టీడీపీ ప్రభుత్వం అండతో అడ్డగోలుగా ఎండాడ, రుషికొండ పరిసర ప్రాంతాల భూముల్ని ఆక్రమించుకున్న ‘గీతం’కు చెక్ పెట్టడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. భూముల్ని ఆక్రమించి గీతం విశ్వవిద్యాలయం నిర్మించిన రక్షణ గోడ, గ్రావెల్ బండ్, గార్డెనింగ్ తదితర అక్రమ నిర్మాణాల్ని శనివారం రెవిన్యూ అధికారులు తొలగించారు. ఆర్డీవో పెంచల్ కిశోర్, నార్త్ ఏసీపీ రవిశంకర్ రెడ్డి, రెవిన్యూ సిబ్బంది, పోలీసులు గీతం క్యాంపస్‌కు తెల్లవారుజామున 4 గంటలకు చేరుకుని ఉదయం 11.30 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. 40.51 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించి, అందులో 38.53 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్ 15, 16, 17, 18, 19, 20, 55, 61లోని 18.53 ఎకరాలు, రుషికొండలో సర్వే నంబర్ 34, 35, 37, 38లో 20 ఎకరాల భూమి ఉంది. కోర్టు కేసుల పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన భూముల్లోని అక్రమ నిర్మాణాల్ని కూలగొట్టారు. స్వాధీనం చేసుకున్న భూముల్లో ప్రభుత్వ భూములుగా బోర్డులు పెట్టారు. టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం ► రుషికొండ, ఎండాడలో సర్వే నంబర్ 17/1, 5, 17/7 నుంచి 28 వరకు 71.15 ఎకరాలను భూమిలేని నిరుపేదలకు ఇచ్చారు. గీతం విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ భూములు ఇవ్వాలని 1981లో అప్పటి ప్రభుత్వాన్ని గీతం యజమాని, టీడీపీ నేత, బాలకృష్ణ వియ్యంకుడు దివంగత ఎంవీఎస్ మూర్తి కోరారు. ► ఈ భూములపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఆ«ధీన పత్రాలు దక్కించుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధన విధిస్తూ ఆ స్థలాన్ని విద్యా సంస్థకు అప్పగించింది. ఆ తర్వాత ఈ సంస్థ కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంది. ► గీతం సంస్థ నిబంధనలకు విరుద్ధంగా 14 ఎకరాల్లో మాత్రమే శాశ్వత నిర్మాణాలు చేపట్టి, మిగిలిన 57.15 ఎకరాల్ని 15 ఏళ్లుగా ఖాళీగా ఉంచింది. 1996లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ► 1998 జూన్ 12న అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.34,94,200 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించేలా చక్రం తిప్పి.. కారుచౌకగా ఆ భూముల్లో 49 ఎకరాలను గీతంకు అడ్డగోలుగా కట్టబెట్టేసింది. మిగిలిన 8.15 ఎకరాల భూమి కూడా ప్రస్తుతం ‘గీతం’ ఆధీనంలోనే ఉంది. పక్కనున్న 40 ఎకరాలపై కన్ను ► 71.15 ఎకరాలను తన చేతుల్లో ఉంచుకున్నది చాలక, పక్కనే ఉన్న 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిపై ‘గీతం’ కన్ను పడింది. క్రమక్రమంగా ఆక్రమణల పర్వానికి తెరతీసింది. ► అధికారులు ఆక్రమణలను గుర్తించిన ప్రతిసారీ.. కోర్టుకు వెళ్లి రిట్ పిటిషన్ దాఖలు చేయడం గీతం యాజమాన్యానికి పరిపాటిగా మారింది. ► సర్వే నంబర్ 15, 37, 38(పీ), 15(పీ)లోని 35 ఎకరాల భూమిని ప్రభుత్వం వీఎంఆర్డీఏ, ఇగ్నో, సోషల్ వెల్ఫేర్, ఐటీడీఏ, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, ఆదాయపు పన్ను శాఖ తదితర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల కోసం కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. గీతం సంస్థ దీనిపై కూడా కోర్టుకు వెళ్లింది. ► మార్కెట్ ధర ప్రకారం ఈ భూమిని కొనుగోలు చేయొచ్చని ప్రభుత్వం సూచించినా, గీతం యాజమాన్యం స్పందించలేదు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఐదు నెలల క్రితమే నోటీసులు గీతం క్యాంపస్ పరిధిలో 40.51 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించాం. వారు బదలాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నా, ప్రభుత్వం ఆమోదించ లేదు. ఖాళీగా ఉన్న స్థలాల్ని ముందుగా స్వాధీనం చేసుకున్నాం. 5 నెలల క్రితమే ఆక్రమణలపై యాజమాన్యం సమక్షంలో సర్వే నిర్వహించి, మార్కింగ్ చేసి, నోటీసులిచ్చాం. ఆక్రమించిన భూముల్లో శాశ్వత భవనాలు కూడా ఉన్నాయి. వీటికి కూడా మార్కింగ్ చేశాం. త్వరలో ఆ ప్రాంతాల్నీ స్వాధీనం చేసుకుంటాం. – పెంచల్ కిశోర్, ఆర్డీవో -
ప్రభుత్వ భూములపై టీడీపీ నేతల కన్ను
వరికుంటపాడు: ఐదు సంవత్సరాలపాటు అధికారం చేతిలో ఉందని టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఇష్టారీతిగా ప్రవర్తించారు. రూ.కోట్ల విలువైన భూమిని ఆక్రమించి సాగుకు అనువుగా తీర్చిదిద్దారు. కొందరు నాయకులు ఇంకా అదే పంథాను కొనసాగిస్తున్నారు. వరికుంటపాడు మండలంలో కబ్జాపర్వం కొనసాగుతోంది ♦మండలంలోని బొంగరాలపాడులోని సర్వే నంబర్ 45లో 1,250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ♦ఇందులో కొంత భూమిపై కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ♦మరికొంత భూమి ఖాళీగా ఉంది. వాటిని తమకు పంపిణీ చేయాలని 20 ఏళ్లపాటు మండలంలోని తూర్పురొంపిదొడ్ల గ్రామానికి చెందిన ఎస్టీ, ఎస్సీలతోపాటు ఇతర కులాలకు చెందిన పేదలు అధికారులకు అర్జీలిచ్చినా పట్టించుకోలేదు. ♦2009లో సదరు భూములను పేదలకు పంపిణీ చేయాలని అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నిర్ణయించారు. ♦అర్హుల జాబితాను రూపొందించాలని అధికారులను కోరారు. ఆ తర్వాత పలు పరిణామాలతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ♦2010 సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీలో ఈ భూమి పేదలకు పంపిణీ చేయాలని చంద్రశేఖర్‌రెడ్డి పట్టుబట్టినా, ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీలు కాలేదు. ♦2014 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు భూ పంపిణీ ఆగిపోయింది. ♦గత ప్రభుత్వ హయాంలోనే కొంతమేర భూమి ఆక్రమణకు గురైంది. ఇటీవలి కాలంలో మరింత ఆక్రమించారు. ♦ఆక్రమిత భూముల విలువ రూ.80 కోట్ల ఉంటుందని అంచనా. తాజాగా.. ♦కొండాపురం మండలం కోవివారిపల్లికి చెందిన కొందరు వ్యక్తులు సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పిచ్చిమొక్కలు, పొదలు తొలగించారు. ♦దీంతో తూర్పురొంపిదొడ్ల గ్రామస్తులు నెలరోజుల క్రితం వరికుంటపాడు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ♦వారు ప్రభుత్వ భూమిలోకి ఎవరూ ప్రవేశించకూడదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ♦అయినా లెక్క చేయకుండా ట్రాక్టర్ల ద్వారా భూమిని దుక్కి చేశారు. ♦ఆక్రమణదారులు మినుము సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారని తూర్పురొంపిదొడ్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం బొంగరాలపాడులోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా దుక్కులు దున్నుతున్నట్లు తెలిసింది. ఈ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. హెచ్చరికలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – చొప్పా రవీంద్రబాబు, తహసీల్దార్, వరికుంటపాడు -
భూముల వేలం నిలిపివేతకు ‘నో’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం అవసరమైన నిధులను సమీకరించే నిమిత్తం ప్రభుత్వ భూములను విక్రయించేందుకు ఈనెల 28న జరగనున్న తొలిదశ ఆన్లైన్ వేలం ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ఈ దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. అయితే, ఈ భూముల విక్రయాలు మాత్రం ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తలపెట్టిన భూముల విక్రయాన్ని అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త సురేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ ముసుగులో ‘పిల్’లు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అణగారిన వర్గాలు, కోర్టులను ఆశ్రయించలేని పేదలు, తదితరుల కోసం ఉద్దేశించిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) నేడు తీవ్రస్థాయిలో దుర్వినియోగమవుతోందని వివరించారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల ముసుగులో ‘పిల్’లు దాఖలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ భూముల విక్రయాన్ని అడ్డుకోవాలంటూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించే దాఖలు చేశారని వివరించారు. పిల్‌ను దుర్వినియోగం చేయడమంటే, అది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. భూములమ్మే అధికారం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వ భూములను విక్రయించడం ఇదేమీ మొదటిసారి కాదని, గత ప్రభుత్వాలు కూడా విక్రయించాయని ధర్మాసనం దృష్టికి పొన్నవోలు తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములను విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. విక్రయించరాదని ఎక్కడా నిషేధం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, లాక్డౌన్ సమయంలో ఏ రకమైన వేలం ప్రక్రియలు చేపట్టరాదని హైకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది కదా అని గుర్తుచేసింది. వేలం విషయంలో ప్రభుత్వాన్ని నియంత్రించలేదని సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయినా.. పేద రాష్ట్రంగానే ఎందుకుంది? అందరి వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించింది. అయితే.. భూముల విక్రయాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో ధర్మాసనం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో మంచి సారవంతమైన భూములున్నాయి.. మంచి పంటలు పండుతాయి.. ఇక్కడ ప్రజలు సంపన్నులు.. అయినప్పటికీ పేద రాష్ట్రంగానే ఎందుకుంది’ అని వ్యాఖ్యానించింది. దీనికి సుధాకర్‌రెడ్డి బదులిస్తూ.. రాష్ట్ర విభజన తరువాతే ఏపీ ఆర్థికంగా బాగా నష్టపోయిందని, పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ విధాన నిర్ణయాన్ని ఇలా రాజకీయ కారణాలతో సవాలు చేస్తూ ఉంటే తాము చేసేది ఏముంటుందని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తాము రాజకీయాల జోలికి వెళ్లడంలేదంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. గతంలో లాగా జేబులు నింపుకోవడానికి అమ్మడంలేదు.. డబ్బు కోసం ఇలా ప్రభుత్వ భూములను అమ్మడం సబబేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో లాగా జేబులు నింపుకోవడానికి భూములు అమ్మడంలేదని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల కోసం భూములు అమ్ముతున్నామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు జోక్యం చేసుకుంటూ.. గుంటూరులో మార్కెట్ స్థలాన్ని అమ్మేస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి అభ్యంతరం తెలిపారు. అక్కడ ఇప్పుడు మార్కెట్ లేదని, మరోచోట మార్కెట్ నిర్మించామని, చక్కగా అక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. ఈనెల 28న ఆన్లైన్ వేలం ఉందని, అందువల్ల వేలాన్ని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని పొన్నవోలు అభ్యర్ధించారు. -
అందమైన హైదరాబాద్‌ను నరకంగా మార్చేస్తారా..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలను రక్షించలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను అడ్డుకోలేకపోతున్నారని, జీతాలు తీసుకుని నిద్రపోతున్నారంటూ ఘాటువ్యాఖ్యలు చేసింది. మార్చి 24న జరిగే విచారణకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లు హైకోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈలోగా అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలను వివరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా ఐదేళ్లకోసారి వాటిని క్రమబద్ధీకరణకు జీవో జారీ చేయడం సరైంది కాదంది. సుందరమైన హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడుకోకపోతే ముంబై, పట్నా తరహాలో నరకప్రాయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలో అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ శివారి మరొకరు వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపారు. చెరువులు, కుంటలు, పార్కులు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు అడ్డుకోకుండా నిద్రపోతున్నారా అని వ్యాఖ్యానించిం ది. జీహెచ్ఎంసీలో ఆక్రమణలను అడ్డుకునేందుకు ప్రత్యేక విభాగం ఉందా అని ప్రశ్నించింది. అధికారులు తమ విధుల్ని నిర్వహించకపోతే హైకోర్టే ఆ పనులు చేయాల్సివస్తుందని తేల్చిచెప్పింది. -
ప్రభుత్వ భూ అక్రమ వ్యవహారంలో కొత్త కోణం
నారాయణపేట జిల్లా ఊట్కూరులో ప్రభుత్వ భూ బదలాయింపు వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. 21.81 ఎకరాల సర్కారు స్థలాన్ని తమ కుటుంబీకులు, బంధువుల పేరు మీద పట్టా చేసి అడ్డంగా దొరికిపోయిన ఓ వీఆర్వో, ముగ్గురు వీఆర్ఏలను కాపాడేందుకు ఓ అధికారి వారితో డీల్ కుదుర్చుకున్నారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందుకోసం సదరు అధికారి ఓ ఉద్యోగిని మధ్యవర్తిగా నియమించుకున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్యవర్తి సదరు అధికారికి, ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఉద్యోగుల మధ్య ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే మండలంలో చర్చనీయాంశమైన భూ అక్రమ వ్యవహారాన్ని సదరు అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, మహబూబ్‌నగర్: భూ అక్రమ బదలాయింపుపై ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించడం.. దీనిపై కలెక్టర్ హరిచందన దాసరి ప్రత్యేక దృష్టి సారించడంతో తనను నమ్ముకున్న ఉద్యోగులను కాపాడేందుకు ఓ అధికారి తర్జనభర్జన పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తనకున్న అధికారంతో వీఆర్ఏలు రాజప్ప, భీంరావు, బాపూర్ వీఆర్ఏ జ్యోతిను సస్పెండ్ చేసిన తహసీల్దార్ దానయ్య.. తన పరిధిలో లేకపోవడంతో వీఆర్వో భూమయ్యను సస్పెండ్ చేయలేదు. కానీ.. వీఆర్వోపై నివేదిక సిద్ధం చేసి ఆర్డీఓకు పంపాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం వరకూ సదరు తహసీల్దార్ నివేదికను సిద్ధం చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. భూమయ్యపై నివేదిక పంపించాల్సిన తహసీల్దార్ ఇంత వరకు తనకు పంపలేదని.. అందుకే సస్పెండ్ చేయలేదని నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. ఇక్కడా అదే తీరు.. కేవలం 21.81 ఎకరాలే కాదూ.. అదే మండలంలోని బాపూర్‌లో అన్యాక్రాంతమైన సుమారు 75 ఎకరాల ప్రభుత్వ స్థలం విషయంలోనూ సదరు అధికారి అదే తీరుగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. రెవెన్యూ ఉద్యోగి ఒకరు బాపూర్‌లో ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట అక్రమ పట్టాలు చేశారంటూ గ్రామానికి చెందిన రాఘవారెడ్డి అనే రైతు పలువురు గ్రామస్తులతో కలిసి జూన్ 11, 2018లోనే అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంత వరకు ఆ భూములకు సంబంధించిన విచారణలో ఎలాంటి పురోగతి లేదు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసలు ఆ గ్రామంలో భూ అక్రమాలపై విచారణ జరిగిందా? లేదా? జరిగితే అధికారుల విచారణలో ఏం తేలింది? విచారణాధికారులు ఉన్నతాధికారులకు ఏం నివేదిక ఇచ్చారు? అనే ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి. మరోవైపు 75 ఎకరాల ప్రభుత్వ భూమి ఇతరుల పేరిట పట్టా అయినట్లు గ్రామస్తులు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో గ్రామస్తులు నిజం చెబుతున్నారా? లేక గతంలో విచారణ చేపట్టిన అధికారులు తమ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారా? అనేది జిల్లా కలెక్టర్ దృష్టిసారిస్తేనే నిగ్గు తేలుతుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. పునర్విచారణ చేపడితేనే తప్ప సదరు అవినీతి అధికారి బండారం బయటపడని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ హరిచందన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ జోరుగా జరుగుతోంది. -
భూ మాయకు అడ్డుకట్ట!
కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తికి ఐదు ఎకరాలుండగా రాత్రికి రాత్రే అతడి పేరుతో 30 ఎకరాలను వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించారు. సదరు భూమిపై బ్యాంకులో రుణం తీసుకున్న రెండు రోజులకే ఆ భూమిని వెబ్ ల్యాండ్‌లో ఆయన పేరుతో లేకుండా ప్రభుత్వ ఖాతాలోకి మార్చేశారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వెబ్‌ల్యాండ్ పేరుతో గతంలో జరిగిన భూ మోసాలను వెలికి తీయడంపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ భూములను పరిరక్షించే దిశగా రికార్డుల స్వచ్ఛీకరణ, ఆటోమేటిక్ మ్యుటేషన్లకు నిబంధనలు రూపొందించింది. సర్వే నంబర్లవారీగా వెబ్‌ల్యాండ్ రికార్డులు తనిఖీ చేసి ఆర్ఎస్ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్) ఆధారంగా లావాదేవీలను తనిఖీ చేయనున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రే వెబ్‌ల్యాండ్‌లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో నమోదు చేశారనే విమర్శలున్నాయి. కొంతమంది బడా నాయకులు రెవెన్యూ సిబ్బందిని ముడుపులతో సంతృప్తిపరిచి ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున తమ పేర్లతో, బినామీల పేర్లతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పేరుతో ఉండాలంటే తప్పకుండా దరఖాస్తు పట్టా (డీకేటీ) ఇచ్చి ఉండాలి. లేదంటే భూమి కేటాయించి ఉండాలి. ఇందుకు భిన్నంగా లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. రిటైర్డ్ అధికారుల కీలక పాత్ర కొందరు రిటైర్డు తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. పదవీ విరమణ/బదిలీకి ముందు భారీగా వసూళ్లు చేసి వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో నమోదు చేశారు. కొందరైతే విచారణ జరిపినా బయటకు రాకుండా ఏకంగా రికార్డులు మాయం చేశారు. చాలా జిల్లాల్లో డీకేటీ రిజిస్టర్లు, భూ అనుభవ రికార్డు (అడంగల్), భూ యాజమాన్య హక్కుల పుస్తకం (1బి) పాతవి మాయం కావడం ఇందుకు నిదర్శనమని ఉన్నతాధికారులు అంగీకరిస్తున్నారు. విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఎక్కువగా బంజరు భూములు ఉండటమే ఇందుకు కారణం. ఆర్ఎస్సార్తో సరిపోల్చాలి.. రెవెన్యూ శాఖ అత్యంత ప్రామాణికంగా పరిగణించే బ్రిటిష్ కాలం నాటి ఆర్ఎస్ఆర్తో సరిపోల్చి సర్వే నంబర్లవారీగా డీకేటీ రిజిస్టర్, అడంగల్, 1 బి రికార్డులు, వెబ్‌ల్యాండ్‌ను పరిశీలిస్తే మోసాలు కచ్చితంగా వెలుగులోకి వస్తాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘ఉదాహరణకు ఓ గ్రామంలోని 102 సర్వే నంబరులో 30 ఎకరాలు ఆర్‌ఎస్‌ఆర్‌లో ప్రభుత్వ భూమి అని ఉందనుకుందాం. తర్వాత ప్రభుత్వం అది ఎవరికైనా అసైన్మెంట్ (డీకేటీ) పట్టా కింద ఇచ్చి ఉంటే డీకేటీ రిజిస్టర్లో ఉంటుంది. ఒకవేళ డీకేటీ ఇచ్చినట్లు నమోదు కాకుండా ఈ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఇతరుల పేరుతో ఉంటే అక్రమ మ్యుటేషన్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది’ అని రాష్ట్ర భూ పరిపాలన సంయుక్త కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ‘డీకేటీ పట్టాలు ఎప్పుడు ఎవరికి ఇచ్చారనే వివరాలు కలెక్టరేట్లలో ఉంటాయి. వీటి ఆధారంగా తనిఖీలు చేస్తే అక్రమాలు బయటకు వస్తాయి. అయితే అక్కడ కూడా రికార్డులు గల్లంతైతే మోసాలను వెలికి తీయడం కష్టం’ అని భూ వ్యవహారాలపై అనుభవజ్ఞుడైన ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి పేర్కొన్నారు. ఆటోమేటిక్ మ్యుటేషన్ అంటే...? ఏదైనా ఓ భూమిని కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆ సమాచారం సబ్ రిజిస్ట్రార్ నుంచి సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి అందుతుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువు ఇచ్చి ఆమేరకు భూముల రికార్డులను రెవెన్యూ అధికారులు సవరిస్తారు. కొనుగోలుదారుడు తన పేరుతో భూ రికార్డులను మార్చుకునేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. -
ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ
ఇబ్రహీంపట్నం: నగరానికి సమీపం లోని ఇబ్రహీంపట్నంలో అతి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల గుప్పిట్లోకి వెళ్తున్నాయని, దీనిపై సీబీసీఐడీతో విచారణ జరి పించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసి ప్లాట్లు చేస్తున్న విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తుంటే..మన రాష్ట్రంలో ఆర్టీసీని కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవకుంటే మంత్రులకు పదవులుండవని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించడాన్ని ఖండించారు. నిజామాబాద్‌లో ఎంపీ స్థానానికి ఆయన కూతురు కవిత ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయలేదని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. -
ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు శుభవార్త
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు ఒక చక్కని శుభవార్త అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్ చెప్పారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇళ్ల స్థలాల పంపిణీ, భూసేకరణ తదితర అంశాలను అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేదలకు సూచించారు. దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండేవారు 100 చదరపు గజాలలోపు నివాసం ఉంటే వాటిని క్రమబద్దీకరణకు రూ. 1 చెల్లించాలన్నారు. 300 చదరపు గజాల కంటే ఎక్కవ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్న వారికి తమ నివాస స్థలాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరను చెల్లించి తమ స్థలాలను క్రమబద్దీకరించుకోవచ్చన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న పేదలు వారి ఇంటి క్రమబద్దీకరణ కోసం తహసీల్దార్, గ్రామ సచివాలయాల్లో తమ దరఖాస్తులు దాఖలు చేయాలన్నారు. దీనికి సంబంధించి ఈనెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఈ సదవకాశాన్ని పేదలందరు వినియోగించుకునేలా రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి 120 రోజుల్లోగా నిబంధనల మేరకు అర్హత కల్గిన పేదల స్థలాలను క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాలో 2,71లక్షల మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్హులుగా గుర్తించామన్నారు. ఇందుకోసం 4,497 ఎకరాలు భూమి అవసరమని, ప్రస్తుతం 2,132 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. మిగిలిన ప్రవేటు భూమిని త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఇళ్ల స్తలాల పంపిణీకి సంబందించి ఈనెల 16వ తేదీన అన్ని మండలాల్లోను సోషల్ అడిట్ నిర్వహించి లబి్ధదారుల జాబితాపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, సబ్–కలెక్టర్లు స్వప్నిల్ దినకర్, హెచ్.ఎం. ధ్యానచంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి, ఆర్డీఓలు ఖాజావలి, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
బోనులో భూమి!
సాక్షి, సిటీబ్యూరో: రెవెన్యూ విభాగం నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకంతో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. వివాదాల్లో చిక్కుకొని కోర్టుకు ఎక్కుతున్నాయి. అవసరమైన ఆధారాలు, సమగ్ర వాదనలు లేక వీటికి సంబంధించిన కేసులు ఏళ్లుగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్ని కేసులకు అయితే ఏళ్ల తరబడి కౌంటర్ కూడా దాఖలు చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో పలు కేసుల్లో ప్రతికూల తీర్పులు తప్పడం లేదు. మరోవైపు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ రెవెన్యూ అధికారుల ఉదాసీన వైఖరితో ప్రతివాదులు పైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇదీ హైదరాబాద్ జిల్లాలో వివాదాల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూముల కేసుల పరిస్థితి. కోర్టు కేసులకు సంబంధించి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక న్యాయ విభాగమూ ఉంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్ధాయి అధికారి పర్యవేక్షణలో ఈ విభాగం కేసుల పరిశీలన, కౌంటర్ దాఖలు, సమగ్ర వాదనలకు సరిపడా సమాచారం ప్రభుత్వ న్యాయవాదులకు అందిస్తోంది. అయినప్పటికీ కేసుల పరిష్కారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా రెండేళ్లలో మరో 20శాతం కేసులు పెరగడం గమనార్హం. 58శాతం వివాదాల్లోనే... నగరంలో సుమారు రూ.1805 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీలో చదరపు గజం భూమి విలువ సుమారు రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో ప్రభుత్వానికి దాదాపు 4,36,471.2 చదరపు గజాల స్థలాలున్నాయి. చదరపు గజానికి రూ.70వేల చొప్పున లెక్కిస్తే... వీటి విలువ రూ.3,055 కోట్లకు పైనే ఉంటుంది. అందులో సుమారు 58శాతం అంటే 2,57,972 చదరపు గజాల స్థలం కోర్టు వివాదాల్లో చిక్కుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని విలువ రూ.1,805 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. యోగితా హయాంలో కదిలిక... కలెక్టర్ యోగితారాణా హయాంలో ప్రభుత్వ భూముల కోర్టు కేసులపై కదలిక వచ్చినా.. ఆమె బదిలీతో మళ్లీ కథే పునరావృతమవుతోంది. వాస్తవానికి గతేడాది జనవరిలో సర్కార్ స్థలాలను నిగ్గు తేల్చేందుకు యోగితారాణా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై సమగ్ర అధ్యయనం చేసి కౌంటర్ దాఖలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మండలానికి టాప్ టెన్ చొప్పున కేసులను ఎంపిక చేసి సంబంధిత డిప్యూటీ తహసీల్దార్లతో అంతర్గత సమీక్షలు నిర్వహించారు. ప్రతి కేసును సమగ్రంగా అధ్యయనం చేసి ఆధారాలపై నివేదికలను రూపొందించారు. తొలివిడతగా అత్యంత విలువైన భూములకు సంబంధించిన సుమారు 70 కేసులను ఎంపిక చేసి యోగితారాణా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌తో సమావేశమై చర్చించారు. కొంతకాలం కేసుల్లో పురోగతి కనిపించినప్పటికీ...ఆ తర్వాత కదలిక లేకుండా పోయింది. పెండింగ్ కేసులు ఇలా... జిల్లా రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలాలకు సంబంధించి సుమారు 2,023 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక రికార్డులు తెలియజేస్తున్నాయి. సివిల్ కోర్టులో 329, హైకోర్టులో 1,669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తమ్మీద 2,832 కేసులకు గాను 120 కేసుల్లో ప్రభుత్వానికి ప్రతికూల తీర్పులు రాగా... 213 కేసుల్లో అనుకూల తీర్పులు వచ్చాయి. మరో 179 కేసుల్లో ప్రతివాదులు కేసులను ఉపసంహరించుకున్నారు. 199 కేసుల్లో కోర్టు పలు డైరెక్షన్స్ ఇవ్వడంతో సమస్య సమసిపోయింది. కాగా సుమారు 290 ఫిర్యాదులు కొన్ని కేసులతో ముడిపడి ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం మొత్తం 1,733 కేసులుగా నిర్ధారించింది. వీటిలో 646 కేసులపై కౌంటర్లు దాఖలు చేయగా, 992 కేసులకు దాఖలు చేయలేదు. 81 కేసుల సంబంధించి ఇతర ప్రభుత్వ విభాగాలు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. మరో 14 కేసులకు మాత్రం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. -
ప్రభుత్వ భూములపై కన్నేసిన ల్యాండ్ మాఫియా
-
స్వప్నం నిజమయ్యేలా
సాక్షి, మచిలీపట్నం : అర్హులైన నిరుపేదలకు వచ్చే ఉగాది కల్లా ఇంటి జాగా కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం సాకారం చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. ఇళ్ల స్థలాలకు అనువైన భూముల అన్వేషణ సాగిస్తోంది. మరో వైపు అందిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించేందుకు గ్రామ, వార్డు వలంటీర్లతో సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇంకా దరఖాస్తు చేయకుండా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారితో కూడా దరఖాస్తులు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భూముల గుర్తింపునకు కసరత్తు ఇళ్ల స్థలాల కోసం ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల ఆధారంగా అవసరమైన భూములను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. గడిచిన రెండు నెలలుగా నిర్వహిస్తున్న స్పందనతో పాటు ప్రజాసాధిరాక సర్వే, సోషియో ఎకనామిక్ సెన్సెస్, టోల్ ఫ్రీ నంబరు 1100 ద్వారా జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల 850 దరఖాస్తులు అందినట్టుగా లెక్క తేల్చారు. ఆ మేరకు వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలంటే కనీసం 2,550 ఎకరాల భూములు అవసరమవుతాయని అంచనా వేశారు. కాగా ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు అనువైన ప్రభుత్వ భూములు జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాలున్నట్టుగా గుర్తించారు. మరో 1550 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. ఇందుకోసం రూ.1500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి క్షేత్రస్థాయి సర్వే ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల నియమితులైన గ్రామ, వార్డు వలంటీర్లతో క్షేత్ర స్థాయి పరిశీలన చేపడుతున్నారు. 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఈ దరఖాస్తుదారులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు అర్హులా? కాదా? వారిలో ఎవరికైనా ఇళ్ల స్థలం ఉంటి గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారా? లేక కనీసం ఇంటి స్థలం కూడా లేని పరిస్థితి నెలకొందా? అని గుర్తిస్తారు. తమకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఇంకా ఎవరైనా ఇళ్ల స్థలాలు, గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోని వారెవరైనా ఉన్నారా? గుర్తిస్తారు. తమ వెంట తీసుకెళ్లే ఖాళీ దరఖాస్తులతో వారి వివరాలను నింపి వాటిని తహసీల్దార్ కార్యాలయంలో నవరత్నాల వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. 31వ తేదీ వరకు ఈ సర్వే జరుగనుంది. సర్వేలో అదనంగా అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకొని అర్హుల తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఆ మేరకు అవసరమైన భూములపై ఒక అంచనాకొస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను మినహాయించి ఇంకా ఎంత సేకరించాల్సి ఉంటుందో అంచనా వేస్తారు. ఆ మేరకు భూసేకరణకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. తొలి విడతలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తారు. -
సొంతింటి కోసం వడివడిగా..
అర్హులైన పేదలకు స్థలం ఇచ్చి.. పక్కా ఇంటిని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. భూ అన్వేషణ ప్రకియను వేగవంతంగా చేపడుతోంది. నివాస యోగ్యమైన భూములను గుర్తిస్తోంది. గ్రామాల వారీగా ఉన్న రికార్డులను పరిగణనలోకి తీసుకుని సర్వే చేస్తోంది. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం 40 శాతం గ్రామాల్లో ప్రక్రియను ముగించి రికార్డులను సిద్ధం చేసింది. రెండు నెలల వ్యవధిలో మిగిలిన గ్రామాల్లోనూ దీనిని పూర్తి చేయనుంది. సాక్షి, నెల్లూరు: ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అధికారంలోకి వచ్చాక అర్హులకు ఇంటి పట్టాలను అందజేస్తామని ప్రకటించింది. పూర్తి హక్కులు ఉండేలా ఇంటి పట్టాలను మహిళల పేరుపై రిజిస్ట్రేషన్ చేసిస్తామని హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం జిల్లాలో పంపిణీ చేసేందుకు అనువుగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియను నిర్వహిస్తోంది. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలతో జేసీ నుంచి తహసీల్దార్ వరకు అందరూ భూ సేకరణపై దృష్టి పెట్టారు. జిల్లాలోని 940 పంచాయతీల పరిధిలో ఇంటి స్థలాలు కోరుతూ అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దీంతో పాటు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలోనూ ఇంటి స్థలాలను కోరుతూ జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో అర్జీలు వస్తున్నాయి. వచ్చే ఉగాదిన మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మండలాలను యూనిట్‌గా.. మండలాలను యూనిట్‌గా గ్రామ రికార్డులను పరిగణనలోకి తీసుకొని తొలుత ప్రభుత్వ భూమిని గుర్తిస్తున్నారు. ఇందులో నివాసయోగ్యమైన భూమి ఎంత ఉంది.. అందుబాటులో ఉన్న సౌకర్యాలను అంచనా వేస్తున్నారు. ప్రతి గ్రామంలో సాధారణంగా కొంత ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఇందులో 60 శాతం భూమి నివాసయోగ్యమైంది కాకుండా ఉంది. ఈ క్రమంలో గత నెల్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి భూముల వివరాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో భూ ఆన్వేషణ ప్రక్రియ ఇప్పటి వరకు 40 శాతం పూర్తయింది. 446 గ్రామాల్లో 2,360 ఎకరాల గుర్తింపు ఇప్పటి వరకు జిల్లాలోని 446 గ్రామాల్లో 2360 ఎకరాలను గుర్తించారు. పూర్తి నివాసయోగ్యమైన భూమిగా అధికారులు గుర్తించి వాటిని అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు వీలుగా నివేదికలను సిద్ధం చేశారు. మూడు నెలల నుంచి జిల్లాలోని పేదల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి వారికి రసీదును అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 70 వేలకు పైగా దరఖాస్తులను స్వీకరించారు. భూమిని పంపిణీ చేసేంత వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రకియ కొనసాగనుంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటి వరకు 940 గ్రామ పంచాయితీల్లో భూములను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో ఇబ్బందులు, తదితర కారణాలతో అన్ని చోట్ల ప్రకియ పూర్తిగా కొలిక్కిరాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జేసీ వెట్రిసెల్వి, ఇతర అధికారులు కూడా పర్యటనలకు వెళ్లి ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నా, రాళ్ల గుట్టలు, గతంలో గ్రావెల్ కోసం తవ్విన గుంతలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం సిద్ధమైన 446 గ్రామాల్లో వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో వీఆర్వోలు, వలంటీర్లు క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అధికారులు స్వీకరించిన దరఖాస్తులను గ్రామాల వారీగా పంపి పరిశీలనను పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సగటున ఎకరా భూమిలో రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి 45 మందికి ప్లాట్లుగా పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
సంకటంలో ‘భూ బాబులు’
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాస్‌పుస్తకాల జారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ మెలిక పెట్టడం బడాబాబులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇబ్బడిముబ్బడిగా భూములు కొనుగోలు చేసినవారిని ఈ నిర్ణయం ఇరకాటంలోకి నెట్టింది. ఆధార్ నంబర్‌ను ఇస్తే ఎక్కడ తమ భూముల చిట్టా బయటపడుతుందోననే ఆందోళన వారిలో నెలకొంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వివాదరహిత భూములకు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి సదరు రైతులకు పాస్‌బుక్కులను అందజేసింది. అయితే, వీటి ముద్రణ సమయంలోనే పట్టాదారు ఆధార్ నంబర్‌ను సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆధార్ సమాచారం ఇవ్వకపోతే పాస్‌బుక్కును ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లెక్కతేల్చిన 4,56,155 మందిలో ఆధార్ నంబర్‌ను సమర్పించిన 1,88,994 మందికి పాస్‌పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆధార్ నంబర్ ఇవ్వని 2,67,161 మంది పట్టాదార్ల పాస్ బుక్కులను పెండింగ్‌లో పెట్టింది. భూ రికార్డులు సవ్యంగానే ఉన్నప్పటికీ, ఆధార్ నంబర్ ఇవ్వని కారణంగానే వీటిని పక్కనపెట్టింది. పార్ట్–బీలో 69 లక్షల ఎకరాలు భూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను వేర్వేరుగా వర్గీకరించిన సర్కారు.. వ్యవసాయేతర, అభ్యంతరకర భూములను పార్ట్–బీ కేటగిరీగా పరిగణించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్ట్–బీ కింద 69,85,478 ఎకరాలున్నట్లు లెక్క తేల్చింది. ఇందులో ప్రభుత్వ భూములు ముఖ్యంగా అటవీ, నాలా, ప్రభుత్వ ఆస్తులు కూడా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 1.59 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా.. ఇందులో 1.53 కోట్ల ఎకరాల విస్తీర్ణంలోని భూములకు పాస్‌పుస్తకాలను ముద్రించి పంపించినట్లు రెవెన్యూశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, క్లియర్ టైటిల్‌గా తేల్చినప్పటికీ ఇంకా 5,72,498 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన డిజిటల్ సంతకాలు నమోదు చేయకపోవడంతో పాస్‌పుస్తకాల ముద్రణకు పంపలేదని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రవాస భారతీయులకు పాస్ పుస్తకాలు అందుకోవడం తలనొప్పిగా మారింది. అక్కడే స్థిరపడ్డవారు ఇక్కడ ఆధార్ కార్డు తీసుకోవడం చట్టరీత్యానేరం. ఒకవేళ తీసుకున్నట్లు తెలిస్తే.. ఆదేశ పౌరసత్వం కూడా రద్దు కావడమేగాకుండా కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాస్ బుక్కుకు విధిగా ఆధార్‌ను జోడించాలనే నిబంధన విధించడం వారికి చిక్కుముడిగా మారింది. ఈ వ్యవహారంపై స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. గుట్టు బయట పడుతుందనే? ప్రతి క్రయ విక్రయానికి ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ఎక్కడ భూమి కొనుగోలు చేసినా క్షణాల్లో తెలిసిపోతుంది. అలాగే రెవెన్యూ రికార్డుల నవీకరణ సమయంలో సేకరించే ఆధార్‌తో తమ భూ చరిత్ర తెలిసిపోతుందని గుబులు బడాబాబుల్లో కనిపిస్తోంది. ఆధార్ వివరాలను ఇవ్వండి మహాప్రభో అని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నా వారు పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యంగా వందలాది ఎకరాలు కొనుగోలు చేసిన పెద్దలు.. సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తామనే భయంతో వివరాలు ఇచ్చేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మొత్తం 10,823 గ్రామాల్లో 2.38 కోట్ల ఎకరాల భూముల రికార్డులను పరిశీలించి.. 2.28 కోట్ల ఎకరాల భూములు వివాదరహితంగా తేల్చింది. 9.92 లక్షల ఎకరాల మేర భూముల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. వాటిని వివాదాస్పద భూముల జాబితా (పార్ట్–బీ)లో చేర్చింది. ఈ క్రమంలోనే సర్వే నంబర్ల వారీగా రికార్డులను రూపొందించింది. 1,86,84,158 సర్వేనంబర్లలోని భూములు క్లియర్‌గా గుర్తించిన సర్కారు.. 9,13,656 సర్వేనంబర్ల పరిధిలోని భూములను వివాదాస్పదంగా పరిగణించింది. -
భూమంతర్ ఖాళీ!
సాక్షి, అమరావతి: పెద్ద చేపలు చిన్న చేపల్ని తింటుంటే తిమింగలాలు పెద్ద చేపలను మింగేస్తున్న చందంగా చంద్రబాబు సర్కారులో భూదందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. చట్టాలను ఏమార్చి, నిబంధనలకు పాతరేసి తెలుగుదేశం పార్టీ ‘కీలక’ నేతలు భూములను చెరపట్టి కోట్ల రూపాయలు దండుకున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో అధికార పార్టీ చోటామోటా నేతలు ప్రభుత్వ భూములను కైవసం చేసుకుంటే.. పట్టణాలు, నగరాల్లో విలువైన ప్రభుత్వ భూములనే కాకుండా కొన్ని ప్రైవేటు ఆస్తులను కూడా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాహా చేశారు. గత నాలుగేళ్లలో వేల కోట్ల రూపాయల విలువైన సర్కారు భూములు మాయమయ్యాయి. దీంతోపేదలకు నివాస స్థలాలు ఇవ్వడానికి, వారి ఇళ్ల నిర్మాణానికి చాలా చోట్ల స్థలాలే లేని దుస్థితి ఏర్పడింది. తూర్పూరబట్టిన మాజీ సీఎస్‌లు పేదలు, సన్న చిన్నకారు రైతుల నుంచి లాక్కున్న భూమిని అస్మదీయ పారిశ్రామికవేత్తలకు కారుచౌకగా కట్టబెట్టారు. సాఫ్ట్వేర్ సంస్థల ఏర్పాటు ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని భూదళారీగా మార్చేశారని తీవ్ర విమర్శలున్నాయి. ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు, కేంద్ర భూసేకరణ చట్టం–2013లోని రైతుల హక్కులను చట్టబండలుగా మార్చుతూ తెచ్చిన ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం– 2018 ఈ విమర్శలకు బలం చేకూర్చుతుండటం గమనార్హం. చంద్రబాబు అండ్ కో బినామీ పేర్లతో భారీ వాటాలు పొందుతున్నారని ఆయన ప్రభుత్వంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం బహిరంగంగా విమర్శించడం గమనార్హం. ధర నిర్ణయంలో ఇష్టారాజ్యం రాజధాని కోసమంటూ అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి సేకరించిన భూమిని కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన ధరలో పదో వంతు కంటే తక్కువ మొత్తానికే కొన్ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కి ఎకరా రూ.4 కోట్లకు ఇచ్చి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి మాత్రం ఎకరా రూ.12 లక్షలతోనే 12 ఎకరాలను కేటాయించింది. విద్యార్థుల నుంచి లక్షల రూపాయల్లో వార్షిక ఫీజులు గుంజుతున్న ఎస్ఆర్ఎం, విట్, అమృత తదితర కార్పొరేట్ విద్యాసంస్థలకు కూడా నామమాత్రపు ధరకే భూములు ఇవ్వడం గమనార్హం. ఇలా రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 46 ప్రైవేటు సంస్థలకు 1260 ఎకరాలుపైగా ప్రభుత్వం కట్టబెట్టింది. అంతూ పొంతూ ఏదీ? - విశాఖ నగరంలో రూ.400 కోట్ల విలువైన భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు రూ.13 కోట్లకే ధారాదత్తం చేశారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణకు బంధువైన రామారావు కుటుంబానికి చెందిన విశాఖపట్నం బాట్లింగ్ కంపెనీ (వీబీసీ) ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో రూ.250 కోట్ల విలువైన 498.98 ఎకరాలను రూ.4.98 కోట్లకే కట్టబెట్టారు. ఇది చాలదన్నట్లు విశాఖ జిల్లాలో యారాడ సమీపంలో అత్యంత విలువైన 34 ఎకరాల భూమిని బాలకృష్ణ చిన్నల్లుడికి చెందిన ‘గీతం యూనివర్సిటీ’కి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. - తిరుపతి (కరకంబాడి)లో మంగళ్ ఇండస్ట్రీస్‌కు భూమి కేటాయించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ‘గల్లా’ కుటుంబం పెట్టుకున్న అర్జీ గల్లా అరుణకుమారి మంత్రిగా ఉండగానే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. ఆమె కుటుంబానికి చెందిన ‘అమరరాజా బ్యాటరీస్’కు సమీపంలోనే భారీగా భూములున్నందున ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సర్కారు భావించింది. అయితే చంద్రబాబు సర్కారు రాగానే ఆగమేఘాలపై ఈ ఫైలును తెప్పించుకుని మంగళ్ ఇండస్ట్రీస్‌కు భూమిని కేటాయించేశారు. - భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ప్రభుత్వం 2600 ఎకరాలు సేకరించింది. విమానాశ్రయ నిర్మాణ టెండరు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు రావడంతో వాటాలు రావనే ఉద్దేశంతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు టెండరునే రద్దు చేసింది. - అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే పేరుతో 26,890 ఎకరాలను కొత్త భూసేకరణ చట్టం ద్వారా లాక్కోవాలని చూస్తున్నారు. రోడ్డుకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ భూమిని సేకరించి రోడ్డు వెంబడి విలువైన భూమిలో వాటా పొందాలన్నదే దురాలోచన. - విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వేలాది ఎకరాలను ఫుడ్ పార్కులు, పారిశ్రామిక పార్కులకు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాలను విండ్‌పవర్ సంస్థలకు అడ్డగోలుగా ఇచ్చేశారు. ఎక్కడా పరిశ్రమలు వచ్చిన జాడ లేకపోయినా ఇంకా పది లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకును సేకరించాలని ప్రభుత్వం తహతహలాడుతోంది. -
ఉత్తుత్తి ‘సిట్’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం దర్యాప్తు పెద్ద ఫార్సుగా ముగిసింది. ప్రతిపక్షం సహా అన్ని వర్గాల నుంచి ఈ భూదందాపై తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటి నుంచి గట్టెక్కేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేయడం మొక్కుబడి తంతేనని తేలిపోయింది. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే తమ పునాదులు ఎక్కడ కదులుతాయనే భయంతో ‘సిట్’కు ఎలాంటి న్యాయపరమైన అధికారాలు ఇవ్వలేదని స్పష్టమైంది. తమకు పరిమితులు విధించారని ప్రత్యేక దర్యాప్తు బృందమే ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొనడం ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములను రాష్ట్ర కేబినెట్లో ఓ మంత్రి దోచేశారని, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారని, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని కేబినెట్లోని మరో మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా.. ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన పెద్దలు వేల ఎకరాలను కాజేశారన్న వార్తలు పతాక శీర్షికలెక్కాయి. ఈ నేపథ్యంలో డిప్యూటి ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వయంగా గత ఏడాది జూన్ 15న ప్రజా విచారణను చేపట్టారు. అయితే, ఇది కొనసాగితే తమతో పాటు కేబినెట్లో సదరు మంత్రి భూ దాహం, ఆక్రమణలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది. ఇది 2017 జూన్ నుంచి జనవరి 2018 వరకు విచారణ చేపట్టి ఈ ఏడాది జనవరిలో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, ‘సిట్’కు న్యాయపరమైన ఎటువంటి అధికారాలు ఇవ్వలేదని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ ప్రకారం ఏ ప్రాంతాన్నైనా తనిఖీలు చేసే అధికారంగానీ, రికార్డులను స్వాధీనం చేసుకోవడంగానీ.. ప్రైవేట్ వ్యక్తులను విచారణకు పిలిచే అధికారాలు కానీ ఇవ్వలేదని.. కొన్ని పరిమితులను విధించారని ‘సిట్’ ఆ నివేదికలోనే స్పష్టం చేసింది. దీన్నిబట్టి చూస్తే విశాఖ భూకుంభకోణంపై ‘సిట్’ విచారణ ఓ పెద్ద ఫార్సుగా మారిందని అధికార వర్గాలే పేర్కొన్నాయి. కేబినెట్ మంత్రిపై మరో కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలను వదిలేసి, ‘ముఖ్య’నేత సూచనలతో గతంలోనే భూ కుంభకోణం జరిగిందనే రీతిలోను ‘సిట్’ నివేదికను రూపొందించింది. 2015లో 18 ఎంట్రీలు ట్యాంపరింగ్ 2015లోనే విశాఖ రూరల్ పరిధిలోని ప్రభుత్వ రికార్డుల్లో 18 ఎంట్రీలు టాంపరింగ్ అయినట్లు గుర్తించినప్పటికీ 2017 వరకు జిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలను తీసుకోలేదని ‘సిట్’ తన నివేదికలో పేర్కొంది. అలాగే, 1995, 2005, 2007, 2013, 2015 సంవత్సరాల్లో ప్రభుత్వ రికార్డులు టాంపరింగ్ జరిగినట్లు ‘సిట్’ దర్యాప్తుల్లో తేలినట్లు పేర్కొన్నారు. అయితే, జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అందులో ప్రస్తావించారు. ప్రైవేట్ భూమి టైటిల్ నుంచి 1బి రిజిస్టర్లోను, వెబ్ ల్యాండ్లోను ఇతర ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద మార్చేసినట్లు ‘సిట్’ తన నివేదికలో స్పష్టంచేసింది. అయితే, ఇలా ఎవరు చేశారనే దానికి ఆధారాల్లేవని తెలిపింది. అలాగే, ప్రభుత్వ భూముల టైటిల్‌ను ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదకు మార్చేశారని, అలాంటి వారిపై క్రిమినల్, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ‘సిట్’ సిఫార్సు చేసింది. ఐఏఎస్‌లు, కలెక్టర్లు, జేసీల పాత్రపై అనుమానాలు ఇదిలా ఉంటే.. ఈ భూబాగోతం వ్యవహారంలో పలువురు ఐఏఎస్‌లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్ పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయని ‘సిట్’ పేర్కొంది. భూ ఆక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్‌కు సంబంధించి మొత్తం 2,875 దరఖాస్తులు వచ్చాయని.. ఇందులో ప్రజల నుంచి వచ్చినవి 333. 113 అంశాలపై వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన 11 దరఖాస్తులు ‘సిట్’ పరిధిలోకి రాగా.. మిగతా 2,531 దరఖాస్తులు ‘సిట్’ పరిధిలోకి రాలేదని, వీటిని జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములను విక్రయించేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీచేసిన 68 కేసులను కూడా ‘సిట్’ గుర్తించింది. ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వోద్యోగుల దాసోహం విశాఖ జిల్లాల్లోని 40 మండలాలకు చెందిన 1,494 కేసులు రెండు ప్రైవేట్ పార్టీల మధ్య భూ వివాదాలకు సంబంధించినవని, వీటిలోని 763 కేసుల్లో పరిపాలనపరమైన వైఫల్యాలున్నాయని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పక్కదారి పట్టించి ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కలిగించారని, 618 కేసులు ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉందని గుర్తించినట్లు ‘సిట్’ తన నివేదికలో స్పష్టంచేసింది. చాలా కేసుల్లో రికార్డులు లభ్యం కాకపోవడం, అధికారులు బదిలీ కావడం, రికార్డులను ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు తరలింపులో ఆ రికార్డులు మాయం కావడం, లింక్‌లు మిస్ కావడంతో ‘సిట్’ ఏమీ చేయలేకపోయిందని నివేదికలో వివరించారు. 1,225.92 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 4,318 చదరపు మీటర్లు, 7,136 చదరపు అడుగుల స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని.. 751.19 ఎకరాల అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైందని, అలాగే.. 109 కేసుల్లో పట్టాదారు పుస్తకాల్లో అక్రమాలు జరిగాయని ‘సిట్’ స్పష్టం చేసింది. ఇవీ ‘సిట్’ సిఫార్సులు.. – భూ ఆక్రమణలు, అక్రమాలకు సంబంధించి విశాఖ జిల్లాలో గతంలో పనిచేసిన ముగ్గురు జిల్లా కలెక్టర్లు, అలాగే.. గతంలో పనిచేసిన నలుగురు జిల్లా జాయింట్ కలెక్టర్లు, ముగ్గురు జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు, పది మంది ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్, పలువురు తహసీల్దార్లపైన, అలాగే ఓ మాజీ మంత్రితో పాటు అతని నలుగురు అనుచరులపైన క్రిమినల్, క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలి. – 50 కేసులకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – 49 కేసులకు సంబంధించిన ప్రభుత్వ అధికారులపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – 134 కేసులకు సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. – 20 కేసులకు సంబంధించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా పేర్కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – వెబ్‌ల్యాండ్‌లో 34 కేసులకు సంబంధించి ప్రభుత్వ భూమిగా ఉంటే రికార్డుల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లుగా పేర్కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – 29 కేసులకు చెందిన రిజిస్ట్రేషన్ డీడ్స్‌ను రద్దు చేయాలి. – గతంలో మూసివేసిన క్రిమినల్ కేసులను పునరుద్ధరించాలి. – విశాఖ జిల్లాలో రెవెన్యూ, సర్వే రికార్డులు మాయమైన తరహాలోనే ఇతర జిల్లాల్లో పరిస్థితులు కూడా ఇలాగే ఉండి ఉంటాయని.. వీటిని సరిచేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. -
అధికారం అండగా కబ్జా కాండ
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం.. మళ్లీ తర్వాత గెలుస్తామో, లేదో.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ద్వితీయ శ్రేణి నాయకులు, వారి అనుచరులు రాష్ట్రంలో ఖాళీగా కనిపించిన ప్రతి భూమినీ కబ్జా చేశారు. శ్మశానాలు, చెరువులు, గిరిజనుల భూములు, దళితుల భూములు, దేవుడి భూములు, ప్రభుత్వ భూములు.. ఇలా ఏదైనా కాదేదీ కబ్జాకు అనర్హం అనే రీతిలో చెలరేగిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ పెద్దలు, అధికారుల అండతో రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కబ్జా కాండ సాగించారు. వేలాది ఎకరాల భూములను చెరపట్టారు.. వాటికి తమ పేర్లు, బినామీల పేర్లతో దొంగ పత్రాలు సృష్టించారు.. వాటిని బ్యాంకుల్లో పెట్టి వందల కోట్ల రూపాయలను రుణాలుగా పొందారు. తిరిగి చెల్లించకుండా బ్యాంకులను నిండా ముంచారు. రాష్ట్ర విభజనతో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన రాష్ట్రాన్ని కబ్జాంధ్రప్రదేశ్గా మార్చేశారు. రాష్ట్రంలో పచ్చ నేతల భూదందాలను సాక్షి క్షేత్రస్థాయిలో పరిశీలించగా విస్మయపరిచే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. వాస్తవానికి వీటికి నాలుగింతలపైనే భూములు కబ్జాకు గురయ్యాయని బాధితులు, ప్రజలు చెబుతున్నారు.. రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో కొట్టేసిన భూములు, విశాఖలో రికార్డులు ట్యాంపరింగ్ చేసి నొక్కేసిన భూములు వీటికి అదనం... కబ్జా అన్న పదానికి అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పర్యాయపదంగా మారిపోయారు.రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. అధికారమే అండగా కార్యకర్త స్థాయి మొదలుకొని ‘ముఖ్య’నేత వరకు భూ దోపిడీలకు పాల్పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు పంపిణీనే లక్ష్యంగా అందినకాడికి ఆరగిస్తున్నారు. రాజధాని అమరావతి సాక్షిగా మొదలైన భూముల వేట.. జిల్లాల్లోని శ్మశానాల వరకు సాగింది. ఏ మాత్రం పాపభీతి లేకుండా దేవుడి భూములనూ చెరబట్టారు. చెరువులను సైతం మింగేసి.. మిగిలిన భూ ఆకలిని తీర్చుకోవడానికి దళితులకు చెందిన అసైన్డ్ భూములపై పడ్డారు. మాది ప్రభుత్వం.. మరి ప్రభుత్వ భూములు మావి కాకుండా పోతాయా? అన్నట్లు చెలరేగిపోయారు. అంతటితో ఆగకుండా అవే కబ్జా భూములను బినామీల ద్వారా బ్యాంకుల్లో పెట్టి కోట్లాది రూపాయలు రుణాలుగా పొందారు. ఇలా ఒకటా రెండా.. రాష్ట్రంలో పచ్చ నేతల విపరీత చర్యలు ప్రజలకు తీవ్ర వేదన మిగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న కబ్జాకాండపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... 1 సిక్కోలు గ్రానైట్ కొండను తవ్వేసిన ‘కళా’ బంధువు శ్రీకాకుళం జిల్లాలో మంత్రి కిమిడి కళా వెంకట్రావు బంధువుల చేతిలో ఒక గ్రానైట్ కొండే చిక్కుకుంది. వంగర మండలంలో మడ్డువలస సాగునీటి ప్రాజెక్టుకు ఆనుకొని ఇది ఉంది. కళా వెంకట్రావు మరదలు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏడాదిన్నర క్రితం ఈ కొండ ప్రాంతంలో అక్రమంగా కొంతమంది తవ్వకాలు చేపట్టారు. కిమిడి కుటుంబానికి సమీప బంధువైన కిమిడి సీతబాబు ఈ తవ్వకాల వెనుక ఉన్నట్టు విమర్శలున్నాయి. వాస్తవానికి వంగర మండలం పటువర్థనం గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కొండను వారు గ్రానైట్ తవ్వకాల కోసం లీజుకు తీసుకున్నారు. కానీ అక్కడకాకుండా మడ్డువలస గ్రామానికి, ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న పాండవుల కొండపై తవ్వకాలు మొదలెట్టారు. సుమారు ఐదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ కొండ ప్రాంతంలో తవ్వకాల గురించి ‘సాక్షి’ 2016 నవంబర్లోనే కథనాలు రాసింది. దీంతో మైనింగ్ అధికారులు స్పందించి ఆ క్వారీని సీజ్ చేశారు. కానీ కొండ మాత్రం కిమిడి కుటుంబీకుల గుప్పెట్లోనే ఉంది. ఇక్కడున్న గ్రానైట్ విలువ దాదాపు రూ.10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మరో విషయం ఏమిటంటే.. ఈ కొండను సీజ్ చేసిన సమయంలో 60 వరకూ గ్రానైట్ బండలు ఉండేవి. ప్రస్తుతం రెండు, మూడు మాత్రమే ఉన్నాయంటే మిగతావన్నీ ఏమైపోయాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దాదాపు రూ.9 కోట్ల వరకూ పరిహారం కాజేశారు. దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమికి దొడ్డిదారిలో పట్టాలు సృష్టించి మార్గం సుగమం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో గొర్లె విజయ్‌కుమార్, గొర్లె లక్ష్మణరావు, కలిశెట్టి సహదేవుడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎచ్చెర్ల మండలంలోనే ఎస్ఎం పురం కొండ ప్రాంతంలో శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ దంపతుల కుమారుడు అవినాష్ రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి రంగం సిద్ధం చేశాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ మొత్తం 38 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉంది. వాటి విలువ సుమారు రూ.2 కోట్ల వరకూ ఉంటుంది. 2 తూర్పుగోదావరి హద్దే లేని పచ్చ నేతల భూదందా తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు భూ కబ్జాలతో రెచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. కాకినాడకు సమీపంలోని తూరంగిలో సర్వే నంబర్ 231లో తన బంధువుల పేరిట ఉన్న 47 ఎకరాలను ఆనుకుని ఉన్న రూ.5 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆకుల గోపయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ అనకాపల్లి సెటిల్మెంట్ కోర్టు ద్వారా న్యాయపరంగా కొనుగోలు చేసిన స్థలం తనదేనంటూ ఎమ్మెల్యే తన స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు అధికారాన్ని అడ్డుపెట్టి చేయని ప్రయత్నం లేదు. అదే సంస్థకు చెందిన 230/2 సర్వే నంబర్లోని మరో స్థలాన్ని కూడా సర్వే నంబర్లు మార్చి అనుచరుల పేరిట కట్టబెట్టేశారు. ఇక.. మహాలక్ష్మినగర్ ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారి స్థలం తనదంటూ అల్లరి మూకలతో వెళ్లి పొక్లెయిన్‌తో తవ్వించేసిన వ్యవహారంపై ఎమ్మెల్యే వనమాడి సోదరుడు సత్యనారాయణ, ఆయన కుమారుడు, కార్పొరేటర్ వనమాడి ఉమాశంకర్‌పై కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో పోలీసు కేసు కూడా నమోదవగా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో కేసును నీరుగార్చేశారు. ఇక కొవ్వూరు రోడ్డులోని మూడెకరాల అసైన్డ్ భూమి విషయంలో కూడా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి ఎకరం స్థలాన్ని స్వాహా చేసి ఇళ్ల స్థలాలుగా అమ్మేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిధిలో ఉన్న కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామికి చెందిన 3.73 ఎకరాల భూమి సైతం ఆక్రమణల జాబితాలో చేరిపోయింది. అలాగే కడియం మండలం వేమగిరి పంచాయితీ పరిధిలో 172 సర్వే నెంబర్లో 80 సెంట్ల ప్రభుత్వ భూమిని తన సొంత భూమిగా చెప్పుకుని అధికార పార్టీ నేత ఒకరు గ్రావెల్ తవ్వకాలు సాగించారు. ఇక తుని నియోజకవర్గం తొండంగి మండలం పి.అగ్రహారంలో ఉత్తరాది మఠం రామచంద్రస్వామికి 410 ఎకరాల భూమి ఉంది. అప్పట్లో సాగు చేసుకోవడానికి స్థానిక రైతులకు మఠం లీజుకు ఇచ్చింది. ఈ భూములపై టీడీపీ నాయకుల దృష్టి పడింది. దీంతో రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి రైతులకు చెందిన భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట నమోదు చేసేసుకున్నారు. తొండంగి మండలం పి.అగ్రహారం పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 31, 32, 33 నుంచి 59 వరకు ఉన్న 410 ఎకరాల్లో సుమారు 80 ఎకరాలను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు, అన్నవరం దేవస్థానం ధర్మకర్త యడ్ల భేతాళుడు, టీడీపీ వాణిజ్య విభాగం మండల ఉపాధ్యక్షుడు సిద్దా ముత్యాలు కుటుంబ సభ్యుల పేర్లతో ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం భూముల విలువ రూ.25 కోట్ల పైనే ఉంటుంది. సర్వే నంబర్ 33/1, 33/2లో సిద్ధా ముత్యాలు భార్య గంగా భవాని 16.50 ఎకరాలు, సర్వే నంబర్ 33/3, 33/4లో సిద్ధా అచ్చియ్యమ్మ 42 ఎకరాలు, సిద్ధా ముత్యాలు ఏడెకరాలు కబ్జా చేశారు. సర్వే నంబర్ 33/1, 31/591లో యడ్ల భేతాళుడు 8 ఎకరాలు, యడ్ల శ్రీనివాసరావు 4, గెడ్డం శ్రీకాంత్ 6 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. 3 విజయ నగరం భూబకాసురులు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడి నుంచి అందరూ భూములు ఆక్రమించడంలో ఆరితేరిపోయారు. విజయనగరం, పూసపాటిరేగ, సాలూరు, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి ప్రాంతాల్లో పేదల భూములు, గిరిజనుల భూములతోపాటు చేపల చెరువులు, కొండలు కూడా ఆక్రమించేశారు. వాటిలో తోటలు వేసి దర్జాగా సాగుచేసుకుంటున్నారు. విజయనగరం పట్టణ శివారు ప్రాంతం బొబ్బాదిపేట మండల పరిధిలో సర్వే నెంబర్ 4/3లోని 5 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా లే అవుట్ వేశారు. ఈ ప్రాంతం విజయనగరం మున్సిపాలిటీలో విలీనమై.. ప్రస్తుతం 26వ వార్డు పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో గజం స్థలం ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతోంది. ఇప్పటికీ లేఅవుట్‌ను క్రమబద్ధీకరించుకోని స్థల యజమానులు అడ్డదారిలో అమ్మకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం అధికార పార్టీకి చెందిన స్థానిక కౌన్సిలర్‌తో బేరం కుదుర్చుకున్నారు. లేఅవుట్ పక్కగుండా వెళ్లే 60 అడుగుల ఎర్రవాని చెరువు కాలువలో సింహభాగం ఆక్రమించేశారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ యంత్రాంగం, మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్‌కి వెళ్లి వచ్చేందుకు రెండు రహదారులను నిర్మించేస్తున్నారు. ఎర్రవాని చెరువు ఆయకట్టు రైతులు ప్రతిఘటించటంతో స్థానిక కౌన్సిలర్ రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్థానికులు కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేస్తే రెవెన్యూ యంత్రాంగం వచ్చి లేఅవుట్‌కు సరిహద్దులు వేసి వెళ్లగా వాటిని అక్రమార్కులు యథేచ్చగా మార్చేసి విక్రయాలకు సిద్ధమవుతున్నారు. పార్వతీపురంలో వరహాలగెడ్డ పోరంబోకు సుమారు రెండెకరాలను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించాడు. గెడ్డ ప్రవాహ దిశను మార్చి రూ.2 కోట్లు విలువ చేసే స్థలాన్ని రియల్ ఎస్టేట్‌లో కలుపుకున్నాడు. అలాగే పార్వతీపురం నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాలగెడ్డను ఆక్రమించి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ నివాస గృహాన్ని నిర్మిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. సుమారు 20 సెంట్ల వరకు గెడ్డను ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారు. అలాగే, ఎమ్మెల్సీ సోదరుడు ద్వారపురెడ్డి రామ్మోహనరావు కూడా వరహాలగెడ్డలో సగం వరకు మట్టిని పోసి గెడ్డను చిన్న పిల్లకాలువలా తయారుచేశారు. చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో సర్వే నంబర్ 383లో ఆరెకరాల ప్రభుత్వ భూమిని ఆ గ్రామ టీడీపీ ఎంపీటీసీ భర్త కెల్ల రామారావు తన ఆధీనంలో ఉంచుకుని సాగు చేసుకుంటున్నాడు. నెల్లిమర్లలో మండలపరిషత్ కార్యాలయాన్ని ఆనుకుని సర్వే నంబర్ 75లో 2.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ రూ.10 కోట్ల పైమాటే. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న మాన్సాస్ ట్రస్టు ఈ భూమిని ఆక్రమించుకుని బోర్డులు సైతం ఏర్పాటు చేసింది. అలాగే నెల్లిమర్ల మండలం మల్యాడలో అదే గ్రామానికి చెందిన గేదెల సత్యం అనే టీడీపీ నేత ఏకంగా 1.65 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఆక్రమిత భూమి విలువ రూ.35 లక్షల పైనే. అలాగే పూసపాటిరేగ మండలం కొల్లాయివలసలో సుమారు 24 ఎకరాల డీపట్టా భూమిని విశాఖకు చెందిన చిట్టిరాజుతోపాటు టీడీపీ ప్రజాప్రతినిధి దర్జాగా ఆక్రమించుకున్నారు. పెదబత్తివలస రెవెన్యూ పరిధిలో దాదాపు 150 ఎకరాల డీ పట్టా భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేశారు. పెదబత్తివలస పరిధిలోని సర్వే నెంబర్ 1లో ఉప్పులాపుకొండ పరిధిలో గతంలో దళితులకు ఇచ్చిన సుమారు రూ.4 కోట్లు విలువైన 8 ఎకరాల డీ పట్టా భూమి వలిరెడ్డి శ్రీరాములు నాయుడు పేరుకు మారింది. నిరుపేదలకు ఇచ్చిన 18.50 ఎకరాల ప్రభుత్వ డీపట్టా భూములను జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు కాజేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూసపాటిరేగ మండలం కొల్లాయివలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 12914పిలో 20 సెంట్లు, 12913సిలో 15.03 ఎకరాలు, 1303పిలో 0.30 సెంట్లు, 1236పిలో 3 ఎకరాలు ఆయన కబంధ హస్తాల్లో చిక్కుకోగా, ఆక్రమించిన భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట కొబ్బరి, జామి తోటలును వేసి ఫలసాయం కూడా పొందుతున్నారు. పూసపాటిరేగ ఎంపీపీగా ఆయనే కొనసాగుతుండటంతో రెవెన్యూ అధికారులు సైతం ఆయన ఆక్రమించిన భూముల వైపు కనీసం కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేకపోతున్నారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, ఆయన సోదరుడు ఏపీ భంజ్‌దేవ్ 40 ఎకరాల ప్రభుత్వ, గ్రామదేవత భూముల్లో చేపల చెరువు ఏర్పాటు చేశారు. ఆర్పీ భంజ్‌దేవ్ 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపలచెరువు సాగుచేస్తున్నట్టు రెవెన్యూ రికార్డులే ఉన్నాయి. ఆర్పీ భంజ్‌దేవ్ విశ్వనాథపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 142లో 15 ఎకరాల భూమిలో చేపల చెరువు నిర్మాణానికి దరఖాస్తు చేస్తే, భంజ్‌దేవ్ తమ్ముడైన ఏపీ భంజ్‌దేవ్ కూడా అదే సర్వే నంబర్ భూమిలో మరో 10 ఎకరాల 46 సెంట్ల భూమిలో చేపల చెరువుకు దరఖాస్తు చేశారు. 2015 నుంచి చేపలసాగు చేస్తున్నారు. అయితే ఆ రెండు సర్వే నంబర్లలోని 25 ఎకరాల భూమి ప్రభుత్వానిదని రెవెన్యూ వెబ్‌ల్యాండ్ స్పష్టం చేస్తోంది. ఏపీ భంజ్‌దేవ్ సర్వే నంబర్ 121లో 6 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఆ భూమి గ్రామదేవతకు చెందిన భూమిగా రెవెన్యూ అడంగల్‌లో నమోదై ఉండడం గమనార్హం. 4 విశాఖపట్నం కబ్జారాయుళ్ల ఖిల్లా.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రశాంతతకు నిలయమైన విశాఖ జిల్లా కబ్జారాయుళ్ల ఖిల్లాగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార టీడీపీ నేతలు జిల్లాను చెరపట్టారు. ప్రభుత్వ, రెవెన్యూ, దేవాదాయ, ఇనాం, వక్ఫ్, అనాధీనం, అటవీ, ఎసైన్డ్ భూములే కాదు.. చివరకు ప్రైవేటు భూములను కూడా లిటిగేషన్లో పెట్టి మరీ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను, బలహీనవర్గాల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను, జాతీయ రహదారికి ఇచ్చిన భూములను కుదవపెట్టి వందల కోట్ల రుణాలు కొల్లగొట్టి ఆపై బ్యాంకులకు ఎగనామం పెట్టారు. గత మూడేళ్లుగా ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన కథనాల నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ దర్యాప్తు నివేదిక మాత్రం ఇంతవరకు వెలుగు చూడలేదు. అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆయన కుటుంబ సభ్యులకు భూముల రికార్డుల ట్యాంపరింగ్‌లో సహకరించిన తహశీల్దార్లు బీవీ రామారావు, శంకర్రావులతోపాటు ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ గణేశ్వరరావులపై కేసులు నమోదయ్యాయి. ఈ రికార్డుల ట్యాంపరింగ్ కుంభకోణంలో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు తప్పించుకోగా మిగిలినవారంతా కటకటాలపాలయ్యారు. విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితుల పేరిట జిల్లాలో గత పదిహేనేళ్లలో పంపిణీ చేసిన 312 ఎకరాల్లో సుమారు 250 ఎకరాలను నకిలీ ఎన్వోసీలను అడ్డం పెట్టుకుని అనర్హులకు కేటాయింపులు జరిపారు. పేదలకు ఎసైన్ చేసిన భూముల్లో పెందుర్తి మండలం ముదపాక, నక్కపల్లి మండలం పెదగొడ్డుపల్లిలో 700 ఎకరాలను చంద్రబాబు తనయుడు నారా లోకేశ్.. ఒక జిల్లా మంత్రి తనయుడు, ఓ ఎమ్మెల్యేతో కలిసి కాజేసేందుకు పక్కా స్కెచ్ వేసి సర్వే చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముదపాకలో 350 ఎకరాల భూములకు చెందిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌ను ఎకరాకు రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చి కాజేసేందుకు యత్నించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువైన పరుచూరి భాస్కరరావు పద్మనాభం మండలం కృష్ణాపురంలో 20 ఎకరాల డీపట్టా భూములతోపాటు ఆనందపురంలో 11.34 ఎకరాల ప్రభుత్వ భూములను చక్కబెట్టేశారు. గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ భీమిలిలో ఎస్సీలకు ఇచ్చిన 50 ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేశాడు. మరో అనుచరుడు ఎన్.స్వామి సర్వే నెం.294లో 3.76 ఎకరాలు, సర్వే నెం.294/2లో 4.40 ఎకరాలు ఆక్రమించుకుని షెడ్లు వేయిస్తున్నాడు. పద్మనాభం మండల టీడీపీ అధ్యక్షుడు సూరిశెట్టి అప్పారావు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి 130 ఎకరాల ఇనాం భూములను స్వాహా చేసేశాడు. అనకాపల్లి ఆవకండంలో 55 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీని వెనుక అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఉన్నారని చెబుతున్నారు. అనకాపల్లి మండలం శారదా కాలనీలో చిన్నంనాయుడు అనే దివ్యాంగుడికి చెందిన 1.12 ఎకరాల స్థలాన్ని వివాదంలో పడేశారు. న్యాయం చేయాలని కోరితే రూ.8 కోట్ల విలువైన ఆ భూమిని కేవలం రూ.1.50 కోట్లకు సొంతం చేసుకున్నారు. కనీసం ఆ మొత్తం కూడా ఇవ్వకుండా బా«ధితుడ్ని మూడేళ్లుగా తిప్పించుకోవడంతోపాటు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. భీమిలి బీచ్ రోడ్లో రామానాయుడు స్టూడియో దిగువన మాజీ సైనికులకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే మీసాల గీత భర్త శ్రీనివాసరావు, మంత్రి గంటా అల్లుడి పేర్లతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. 5 పశ్చిమ గోదావరి ఖాళీ జాగా కనిపిస్తే.. పశ్చిమ గోదావరిలో ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇసుక, మట్టి దందాల్లో రాష్ట్రంలోనే ఆరితేరిన అధికార పార్టీ నేతలు ఖాళీ స్థలాలను కూడా వదలడం లేదు. ఎమ్మెల్యేలు మొదలుకుని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీడీపీ గ్రామ అధ్యక్షులు, సర్పంచ్‌లు, చివరకు జన్మభూమి కమిటీ సభ్యులు కూడా తమ పదవులను అడ్డుపెట్టుకుని అధికారం అండతో భూములను ఆక్రమించేస్తున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కన్ను ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం చెరువుపై పడింది. పోలవరం కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టితో ఈ చెరువును పూడ్చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఎకరాల 76 సెంట్ల వ్యవసాయ భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని ఒక పేద దళిత వ్యవసాయ కూలీ కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటికే ఈ పొలాన్ని సాగు చేసుకుంటున్న రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి వేధించారు. బినామీ పేర్లతో ఉన్నా ఇప్పటికీ ఎమ్మెల్యే చేతిలోనే ఈ భూమి ఉంది. చింతలపూడి మండలంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దెందులూరుకు చెందిన ఒక సామాజికవర్గం వారి బినామీ పేర్లతో 125 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో కొంత అటవీ శాఖ భూమిని కూడా కలిపేసుకున్నారు. ఏలూరు శివారులోని వెంకటాపురం వార్డు సభ్యుడు సుంకరవారితోటలోని చెరువు భూమిని కబ్జా చేశారు. విశాలమైన చెరువు గట్టును ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నారు. ఏలూరు వినాయక్‌నగర్‌లో కామన్సైట్ను ఆక్రమించి భవనాలు నిర్మించి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీ ఎంపీటీసీ స్థానిక కొత్తూరు ఇందిరా కాలనీ, సుందరయ్య కాలనీల్లో ఖాళీ భూములను ఆక్రమించారు. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఒక్కొక్క ప్లాట్‌ను రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలకు అమ్ముకున్నారు. శనివారపుపేట శ్రీరామ్‌నగర్ 9, 10, 11 రోడ్డుల్లో రెవెన్యూ పోరంబోకు భూములను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. తంగెళ్లమూడి బీడీ కాలనీ, నల్లగట్టు ప్రాంతాల్లో రెవెన్యూ భూములను గ్రామ టీడీపీ నాయకులు ముక్కలు చేసుకుని పంచేసుకున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడొకరు కలసి ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి భూమిని కబ్జా చేశారు. ఏలూరు శివారులో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. 6 కృష్ణా శ్మశాన వాటికలూ మాయం కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతలు శ్మశాన వాటికలనూ వదల్లేదు. జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం బైపాస్ రోడ్డులో గోపాల్‌నగర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 185లో 10.84 ఎకరాల్లో హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. గతంలోనూ శ్మశాన వాటికను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకోగా ఇటీవల రోడ్డు పక్కన ఉన్న విలువైన స్థలంలో ప్లాట్లు వేసి ముఖ్యమంత్రి అనుచరుడు, టీడీపీ ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం స్పందించి దీనిపై విచారణకు ఆదేశించారు. అనంతరం ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం అలానే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.36 కోట్లు ఉంది. కృష్ణా – పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులోకి రెండు జిల్లాల నుంచి చేరే నీరు సముద్రంలోకి వెళ్లడానికి ఏకైక మార్గం ఉప్పుటేరు. గతంలో కలిదిండి మండలంలో ఉప్పుటేరు సమీపంలో సర్వే నెంబర్ 42లో ఉన్న డ్రెయినేజీ భూములను సమీప రైతులకు లీజు పద్ధతిలో ఇరిగేషన్ శాఖ అధికారులు కేటాయించేవారు. అయితే ఉప్పుటేరులో డ్రెజ్జింగ్ పనులు చేసే క్రమంలో స్థలం అవసరం కావడంతో భూములను లీజుకు ఇవ్వలేదు. అయితే టీడీపీ నేత నంబూరి లచ్చిరాజు అనే వ్యక్తి ఈ భూముల్లో 9 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నాడు. ఈ తొమ్మిది ఎకరాల విలువ దాదాపు రూ. 2 కోట్లు ఉంటుంది. హనుమాన్ జంక్షన్ రూరల్ మండలంలోని కోడూరుపాడులో సర్వేనెంబర్ 133లో 44.60 ఎకరాల్లో పెద్దికుంట చెరువు ఉండగా, అందులో 40 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైంది. దీన్ని గ్రామానికి చెందిన టీడీపీ నేత షేక్ ఖలీషా ఆక్రమించుకున్నాడని గ్రామస్తులు అంటున్నారు. అతనికి మంత్రులు, ఎమ్మెల్యే అండగా ఉండడంతో అధికారులు సైతం నోరు మెదపడం లేదు. సదరు నాయకుడు చెరువు భూమిని ఆక్రమించి పక్కాభవనం నిర్మించినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. బెజవాడలో బొండా మాయాజాలం విజయవాడ సింగ్‌నగర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు కేసీరెడ్డి సూర్యనారాయణ కుటుంబానికి 5.16 ఎకరాల భూమి ఉంది. దీని విలువ రూ.50 కోట్లు. కాగా, టీడీపీ కార్పొరేటర్ గండూరి మహేష్ ఓ వ్యక్తికి రుణం ఇప్పిస్తానని చెప్పి సంతకాలు సేకరించారు. అలా సేకరించిన సంతకాలతో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని ఏకంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు భార్య సుజాత పేర రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇందులో కార్పొరేటర్ గండూరు మహేష్, ఎమ్మెల్యే అనుచరుడు మాగంటి బాబు పాత్ర ఉన్నట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ భూకబ్జా వ్యవహారంలో ఎమ్మెల్యే సతీమణి బొండా సుజాతను ఏ8గా చేర్చి సీఐడీ కేసు నమోదు చేసింది. 7 గుంటూరు కన్నుపడితే కబ్జానే.. గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల అండతో కనిపించిన స్థలాన్నల్లా కబ్జా చేసేస్తున్నారు. గుంటూరు నడిబొడ్డున నగరపాలక సంస్థకు చెందిన అతి విలువైన స్థలాన్ని ఆక్రమించి అధికార టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించింది. 1999లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అప్పట్లో అరండల్‌పేటలోని పిచుకులగుంట పక్కన టీఎస్ నంబర్ 826లో నగరపాలక సంస్థకు చెందిన వెయ్యి గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. కొన్నాళ్లు తర్వాత దీనిపక్కనే ఉన్న సర్వే నంబర్ 12/3లో మరో 1637 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించి చుట్టు ప్రహరీ నిర్మించారు. మార్కెట్ ధర ప్రకారం.. టీడీపీ కార్యాలయం కోసం ఆక్రమించిన స్థలం విలువ సుమారుగా రూ.40 కోట్లు. రేపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుచరుడు సురేంద్రబాబు ప్రభుత్వ భూమిని తన సొంత భూమిగా 1బీ అడంగళ్లులో నమోదు చేయించుకున్నారు. నిజాంపట్నం మండలం దిండి, కేసనవారిపాలెం, జంపనివారిపాలెం, యామినేనివారిపాలెం, పరిశావారిపాలెం, నర్రా వారిపాలెం, నక్షత్రనగరం గ్రామాల పరిధిలోని 875 సర్వే నంబర్లో 416.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని చెరపట్టి తమకు అనుకూలురైన టీడీపీ నేతలు, కార్యకర్తల పేరిట రికార్డుల్లో నమోదుచేశారు. చింతలరేవులో 583 సర్వే నంబర్లో ఉన్న 15.13 ఎకరాల అటవీ భూమిని అధికార పార్టీకి చెందిన ఆరుగురికి అక్కడి తహసీల్దారు రాసిచ్చేశారు. ’సాక్షి’లో 2014, డిసెంబర్ 3న అక్రమ పట్టాలు పొందిన అంశంపై వచ్చిన కథనంతో ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగం తప్పును సరిచేసుకుంటూ అక్రమంగా అటవీ భూములకు ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా సత్తెనపల్లిలో వడ్డవల్లి రఘురామ్‌నగర్‌లోని వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన సర్వీసుదారుల మాన్యం భూమి 25 సెంట్లలో అధికార పార్టీ ముఖ్యనేతకు ఓ కాంట్రాక్టర్ విలాసవంతమైన ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ఇది సర్వీసుదారుల మాన్యం అని తెలిసినా అధికారులు ఎవరూ అడ్డు చెప్పలేని దుస్థితి. వ్యవసాయ అనుబంధ పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అప్పట్లో సంగం డెయిరీని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన పది ఎకరాల భూమిని ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అప్పగించి సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెదకాకాని మండలం నంబూరులో సర్వే నంబర్ 274లోని 3.89 ఎకరాల భూమి (వాగు పోరంబోకు)ని ఎమ్మెల్యే అనుచరుడు కట్టాపుల్లయ్య చౌదరి ముగ్గురు పేర్లతో జీపీ విక్రయం జరిపి సొంతం చేసుకున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి నేత నుంచి ఎమ్మెల్యే, మంత్రులు సైతం తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించినా అధికారులు అడ్డుచెప్పలేని పరిస్థితి. ప్రైవేటు భూములను ఆక్రమించారంటూ బాధితులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అడంగళ్‌లో పేర్లు మార్చడం, తర్వాత తమ అనుచరులతో భూమిలోకి దిగి చుట్టూ ఫెన్సింగ్‌లు వేయడం, అడ్డుకోవాలని వచ్చే బాధితులను పోలీసుల ద్వారా నిలువరించడం జిల్లాలో నిత్యం జరుగుతున్నదే. తమ భూమిని ఆక్రమించారని బాధితులు కోర్టులకు వెళ్లినా వారికి ఉన్నది ఉన్నట్లుగా రికార్డులు చూపే అధికారే కరువయ్యారు. 8 ప్రకాశం అన్నదాతల భూములు పచ్చ నేతల పాలు ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భూములపై అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలుతున్నారు. అధికారమే అండగా అక్రమంగా భూములను వశం చేసుకుంటున్నారు. కొందరు నేతలు ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జా చేస్తే.. మరికొందరు పేద రైతుల భూములనూ వదలడం లేదు. అధికారులను మచ్చిక చేసుకుని కబ్జా చేసిన భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో బాధితులు తమ భూములు కోల్పోయి లబోదిబోమంటున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలం నర్సింగాపురం రెవెన్యూ పరిధిలోని వెల్లంపల్లిలో 118 ఎకరాల రైతుల భూములను అధికార పార్టీ నేతలు తమ వశం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. వెల్లంపల్లి పరిధిలో 110, 11డి10, 11డి 5, 1డి7, 11డి9, 1సీడీ, 16,171, 173, 18, 1818, 1853, 1856, 1డీ2, 21, 211, 2111, 213బీ, 22, 221, 238, 232, 25, 2635, 2642, 264, 3, 301, 3010బీ, 305, 306, 31, 32, 34, 35, 351, 36, 85 సర్వే నెంబర్ల పరిధిలో 118 ఎకరాల శోత్రియం భూములు ఉన్నాయి. ఈ భూములు పి.లక్ష్మీనర్సింహారావు స్వాధీనంలో ఉన్నాయి. ఈ భూముల్లో 90 ఎకరాల భూములను 1980–90 మధ్య లేళ్లపల్లి, వెల్లంపల్లి గ్రామాలకు చెందిన 70 మంది రైతులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి నుంచి ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం లక్ష్మీనర్సింహారావు కోడలు రమణకుమారి ఆ భూములు తమవేనని, ఆన్లైన్ చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగింది. రైతుల పేరు మీద ఉన్న భూములను రమణ కుమారి పేరుమీద ఆన్లైన్ చేసేందుకు తొలుత రెవెన్యూ అధికారులు నిరాకరించారు. ఆ తర్వాత మొత్తం 118 ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత రూ.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భూములను తన పేర మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పథకం ప్రకారం ముందు రమణ కుమారి పేరున ఆన్లైన్లో నమోదు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు తొలుత త్రిపురాంతకం రెవెన్యూ అధికారులు సహకరించక పోవడంతో ఏకంగా రెవెన్యూ శాఖా మంత్రి పేషీ నుంచి జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు ఫోన్ చేయించారు. ఒక దశలో రెవెన్యూ మంత్రి కలెక్టర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు తహశీల్దార్ జైపాల్ 118 ఎకరాల భూమిని రమణ కుమారి పేరున ఆన్లైన్ చేశారు. ఆ తర్వాత ఈ భూములను పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద మీరం గ్రామానికి చెందిన సత్య కంపెనీ అధినేత వీరసత్యకు విజయవాడలో రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు తహశీల్దార్ కార్యాలయంతోపాటు జిల్లా కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల వద్ద గతంలో ఆందోళనలు సైతం నిర్వహించారు. ఆన్లైన్, రిజిస్ట్రేషన్ చేయడంపై బాధితులు తహశీల్దార్‌ను నిలదీయగా కలెక్టర్, ఆర్డీవోల ఒత్తిడి మేరకే తాను ఆన్లైన్ చేయాల్సి వచ్చిందని తహసీల్దార్ వారికి చెప్పారు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీ అధికార పార్టీ మంత్రి, ముఖ్యనేతకు బినామీగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీ.. భూములను ఆన్లైన్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. 9 నెల్లూరు అడ్డగోలుగా భూదందాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ భూములు, తీర ప్రాంతాలు, సీజేఎఫ్ భూములను అందిన మేరకు ఆక్రమించి రెవెన్యూ యంత్రాంగం సహకారంతో వాటికి పట్టాలు సృష్టిస్తున్నారు. కొందరు భూములను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటుండగా మరికొందరు సాగు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలో జలవనరుల శాఖకు చెందిన పదుల సంఖ్యలో స్థలాలు అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే స్వయంగా రంగంలోకి దిగి భూములు ఆక్రమించి పట్టాలు సృష్టించగా మరికొన్ని చోట్ల మంత్రుల అనుచర గణం భూదందా సాగిస్తోంది. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 21 ఎకరాల నిషేధిత ప్రభుత్వ భూమిని తన తండ్రి, అత్త పేరుతో నమోదు చేసేందుకు రికార్డులు సిద్ధం చేయించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ కోట్ల రూపాయల్లో ఉంది. ఎమ్మెల్యే పోలంరెడ్డి ఆక్రమణ ఇలా.. కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం కమ్మపాళెం పంచాయతీ బొడ్డువారిపాళెం మజరాలోని పైడేరు కట్ట పక్కన దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ నిషిద్ధ భూమి ఉంది. ఇందులో 20.76 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. సర్వే నంబర్ 664–2ఏలో 1.51 , 658–2ఏలో .500 , 651–1లో 7, 656–1ఏలో 1.55 , 664–2బీలో 0.40 సెంట్లు, 656–1బీలో 0.93, 664–1లో 1.90, 657–2లో 2.07, 656–3లో 2.13, 656–2లో 2.57 ఎకరాల నిషేధిత భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ నిషేధిత భూమిని కబ్జా చేసింది సాక్షాత్తూ కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి పోలంరెడ్డి వెంకురెడ్డి, అత్త కోటంరెడ్డి పద్మావతి. ఆక్రమణ చేసిన భూమిలో 664–2ఏలో 1.51, 658–2ఏలో .500 , 651–1లో 7, 656–1ఏలో 1.55 ఎకరాల భూమి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి వెంకురెడ్డి పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అలాగే 664–2బీలో 0.40 సెంట్లు, 656–1బీలో 0.93, 664–1లో 1.90, 657–2లో 2.07, 656–3లో 2.13, 656–2లో 2.57 ఎకరాల భూమి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అత్త కోటంరెడ్డి పద్మావతమ్మ (భార్య పోలంరెడ్డి అరుణ తల్లి) పేరిట రెవెన్యూ రికార్డు 1బీలో నమోదు చేసి ఉంది. నిషేధిత భూమిని ఇరువురూ కొనుగోలు చేసినట్లుగా తహశీల్దార్ వెంకటేశ్వర్లు ధ్రువీకరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 18న 1బీలో పొందుపరిచారు. భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను కూడా మంజూరు చేశారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. అలాగే ఆలూరు మండలం ఇసుకపల్లి పంచాయితీలోని పట్టపుపాలెంలో ఉన్న లబ్బీపాలెంలో టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సోదరులు 30 ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమించి ఆక్వా సాగు చేశారు. అలాగే జిల్లాలోని సూళ్లూరుపేట, కావలి, ఉదయగిరి, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో టీడీపీ నేతలు, వారి అనుచరులు కనిపించిన ఖాళీ స్థలాలను ఆక్రమించి పట్టాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో దళితులకు కేటాయించిన 93,500 ఎకరాల సీజేఎఫ్ భూముల్లో 30 శాతానికిపైగా అధికార పార్టీ నేతల అధీనంలోనే ఉన్నాయి. 10 కర్నూలు యథేచ్ఛగా భూకబ్జాలు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో సర్వే నంబర్ 452, 106, 35, 114 సర్వే నంబర్లలోని 14 ఎకరాల ప్రభుత్వ భూములను గోనెగండ్ల మండల టీడీపీ మాజీ కన్వీనర్ టి.నాగేశ్వరరావు అలియాస్ టి.నాగేష్‌నాయుడు సహకార బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాన్ని పొందాడు. ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా తెలుసుకొని కేసు నమోదు చేశారు. ఎమ్మిగనూరు షరాఫ్‌బజార్‌లో ఐదు దశాబ్దాల నాటి పోతురాజుస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి పట్టణ నడిబొడ్డున ఆదోని – కర్నూలు నాలుగు లైన్ల బైపాస్ రోడ్డుకు ఇరువైపులా 6.83 ఎకరాల భూమి ఉంది. ఇందులో 0.95 ఎకరాలు బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ శాఖ స్వాధీనం చేసుకొని అందుకు పరిహారం కూడా అందజేసింది. దేవాలయానికి సంబంధించిన పరిహారం కావడంతో కోర్టులో డిపాజిట్ చేశారు. ప్రస్తుతం సర్వే నెం.4401లో 2.53 ఎకరాలు, 4403లో 3.35 ఎకరాల దేవాలయ భూమి మిగిలి ఉంది. ఈ భూమిని బారికి హనుమంతు, బారికి గోపాల్, బారికి భూపాల్, చిన్న గోపాల్ అనే వ్యక్తులు మూకుమ్మడిగా పవన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ తరఫున మేనేజింగ్ పార్టనర్ అయిన కేఈ ప్రతాప్‌కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్లకు పట్టాదారు టైటిల్ డీడీ, రెవెన్యూ అడంగల్, నాన్ అసైన్మెంట్ ల్యాండ్ ధ్రువీకరణలను తీసుకునే రిజిస్ట్రేషన్ అధికారులు దేవదాయ భూమి రిజిస్ట్రేషన్‌లో మాత్రం ఇవేమీ లేకుండానే పనికానిచ్చేశారు. అది కూడా దేవదాయ భూమిపై హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు నడుస్తుండగా చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్లు చేయించడం గమనార్హం. ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటే పోతే కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఎక్కడ ఖాళీ స్థలాలు, బీడు భూములు ఉంటే అక్కడ ఆక్రమించేశారు. మాన్యం, పోరంబోకు, అసైన్మెంట్, వక్ఫ్ భూములు, ప్రభుత్వ ఇలా ఏ భూమి కనిపించినా తమ జెండా పాతేశారు. జిల్లావ్యాప్తంగా 1000 ఎకరాల భూములు టీడీపీ నాయకుల అక్రమణలో ఉన్నాయని అంచనా. వీటి విలువ సుమారుగా రూ.500 కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 11 ‘అనంత’ ఆక్రమణలు అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. ఈ భూములను కొందరు అధికార పార్టీ నేతలు తమ బంధువుల పేరుతో నకిలీ పట్టాలు సృష్టించి స్వాహా చేస్తే, కొందరు కార్యకర్తల పేర్లతో వందల, వేల ఎకరాల భూమిని రాయించుకున్నారు. ఈ మొత్తం భూముల విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుందని అంచనా. ‘అనంత’లో ఆక్రమణలను పరిశీలిస్తే.. శింగనమల నియోజకవర్గంలోని ఆకులేడు, తరిమెల, కొరిపల్లి, జూలా కాలవలో మొత్తం 37 సర్వే నెంబర్లలో 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు నకిలీ పట్టాలు సృష్టించి కబ్జా చేశారు. ఇదే తరహాలో ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కూడేరు, కమ్మూరు, మరుట్ల, గుటుకూరు, జల్లిపల్లి గ్రామాల్లో 500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అనంతపురం కార్పొరేషన్ చుట్టూ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం ఉంది. ఎక్కడ చూసినా సెంటు రూ.6–రూ.10 లక్షల వరకు ఉంది. అంటే ఈ లెక్కన ఎకరా కనీసం రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. సోములదొడ్డి సమీపంలో 2013లో పేదలకు పట్టాలిచ్చిన 4.90 ఎకరాల భూమిలో మంత్రి పరిటాల సునీత అనుచరుడు పామురాయి వెంకటేశ్, పరిటాల పేరుతో ఏకంగా జెండాలు పాతారు. నిత్యం ఏదో ఒకచోట కబ్జా రాయుళ్లు విరుచుకుపడుతున్నా అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. రెవెన్యూ అధికారులు ధిక్కార స్వరం వినిపించకుండా మౌనంగా ఉండిపోతున్నారు. అధికారులు అనధికారికంగా అనుమతి ఇచ్చిన తర్వాత వారికి కొంత ముట్టజెప్పి స్వాహాకు దిగుతున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు అధికారుల కబ్జాలకు రూట్‌మ్యాప్ ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 12 తిరుపతి రూ.1,962 కోట్ల మఠం భూముల హాంఫట్ తిరుపతి రూరల్ మండలం అవిలాల సర్వే నెంబర్ 13లో 109 ఎకరాల భూమి హథీరాంజీ మఠానికి చెందిన పట్టా భూమిగా రికార్డుల్లో ఉంది. ఓ వైపు తిరుపతికి, మరోవైపు పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారికి అనుకుని ఉంది. ఇక్కడ అంకణం రూ.1.50 లక్షకు పైగానే పలుకుతుంది. అంటే ఈ భూమి విలువ ప్రస్తుతం 1,962 కోట్లు. అత్యంత విలువైన ఈ భూములను కళాపోషకుడు అయిన ఓ ఎంపీ బంధువులు, వేదాంతపురంకు చెందిన టీడీపీ నాయకుడు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన ప్రణాళిక సంఘం సభ్యుడు చెరపట్టారు. ఎవరికి అనుకూలంగా ఉన్న చోట వారు అక్రమ లేఅవుట్లను వేసుకున్నారు. అంకణాల చొప్పున అమ్మేసుకుని కోట్లకు పడగలెత్తారు. మఠానికి చెందిన కొందరు సిబ్బంది అక్రమార్కులకు అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో జేసీగా పనిచేసినప్పుడు ఈ భూముల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిన ప్రస్తుత కలెక్టర్ ప్రద్యుమ్న ఇప్పుడు చర్యలకు వెనుకాడుతున్నారు. 13 వైఎస్సార్ అగస్త్యేశ్వరుని ఆస్తులకు ఎసరు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో అగస్త్యేశ్వరుని ఆస్తులకు అధికార పార్టీ నాయకులు ఎసరు పెట్టారు. పట్టణంలోని వినాయకనగర్‌లో సర్వే నంబర్ 450ఏబీ, 451ఏబీ, 452ఏబీలలో మొత్తం 25 సెంట్ల స్థలం దేవదాయ శాఖకు చెందింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. ఈ 25 సెంట్ల స్థలం దాదాపు రూ.3 కోట్లు చేస్తోంది. ఇందులో 6.25 సెంట్లను అధికార పార్టీకి చెందిన పట్టుపోగుల పుల్లయ్య ఆక్రమించి భారీ భవనం నిర్మించుకున్నాడు. ఈయన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయుడు. తమ స్థలంలో గృహాలు నిర్మించుకోవడంతో దేవదాయశాఖ ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. ట్రిబ్యునల్ దేవాలయ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. అయినా ఇప్పటివరకు దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ భూమిలో 13 మంది ఆక్రమణలకు పాల్పడగా, రాజకీయ అండ లేని సి.లక్ష్మీనారాయణమ్మ, వి.చిన్నపుల్లయ్యకు చెందిన గృహాలను మాత్రమే దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని అధికార పార్టీకి చెందినవారిని వదిలేశారు. -
రిజిస్ట్రేషన్ల మోత
వెంకటగిరి రాజావీధి తదితర ప్రాంతాల్లో చదరపు గజం స్థలం గరిష్టంగా రూ.9500 ఉండగా తాజాగా భూముల విలువ పెంపుతో రూ.10,000 దాటనుంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.1600 మించని చదరపు గజం విలువ తాజా పెంపుతో రూ.1700 పై చిలుకుగా మారనుంది. గతంలో కట్టడాల రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగుకు రూ.900 ఉండగా తాజాగా రూ.950కి చేరనుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ పరిధిలోని సర్వేనంబర్లు, డి నంబర్ల ఆధారంగా భూములు, స్థలాల ప్రభుత్వ మార్కెట్ విలువలను సమీక్షిస్తున్నారు. వెంకటగిరి (నెల్లూరు): భూముల విలువ పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో పట్టణ ప్రజలకు మరోసారి భూముల రిజిస్ట్రేషన్ చార్జీల షాక్ తగలనుంది. వెంకటగిరి ప్రాంతంలో మన్నవరం భెల్ పరిశ్రమ ఏర్పాటుతో పెరిగిన రియల్‌భూమ్ ఆ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో పూర్తిగా పడిపోయింది. రెండేళ్ల క్రితం పెద్దనోట్ల రద్దు ప్రభావం, ఆదాయపన్ను శాఖ నోటీసులతో భూముల క్రయ విక్రయాలు పూర్తిగా మందగించాయి. ఇప్పుడిప్పుడే రియల్ఎస్టేట్ రంగం కోలుకుంటున్న తరుణంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెంపు కలకలం రేపుతోంది. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే పట్టణ రేపటి నుంచి స్థిరాస్తి విలువలు పెంపు నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని పట్టణాల పరిధిలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్థిరాస్తి విలువలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థిరాస్తి విలువ 0– నుంచి 5 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన స్థిరాస్తి విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లో పెంచడం లేదన్నారు. మిగిలిన నెల్లూరు నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పెంచుతున్నట్లు తెలిపారు. అందు కోసం కావాల్సిన వాటిని తయారు చేసే పనిలో సబ్రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం -
వెబ్‌ల్యాండు.. అక్రమాలకు సులువుగనుండు
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో వెబ్‌ల్యాండ్ పేరుతో జరుగుతున్న మోసాల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వెబ్‌ల్యాండ్‌లో మార్పు చేర్పులు చేయాలంటే పాస్వర్డ్ ఉండాలి. తహసీల్దార్ల వద్ద మాత్రమే ఉండాల్సిన ఆ రహస్య పాస్వర్డ్ చాలా మండలాల్లో మీసేవ కేంద్రాల దగ్గర, కంప్యూటర్ ఆపరేటర్ల వద్ద, మాజీ రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నాయి. దీంతో వారు డబ్బు తీసుకుని రాత్రికి రాత్రే ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరుతో నమోదు చేస్తున్నారు. ఏదైనా సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తి పేరుతో మార్చితే ఆ సమాచారం వెంటనే సంబంధిత అధికారులకు ఎస్సెమ్మెస్ రూపంలో వెళ్లాలి. అయితే ఇలా మార్చిన వారు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి మెసేజులు వెళ్లకుండా చేస్తున్నారని తెలిసింది. తహసీల్దార్ల పాత్రపై ఆరోపణలు.. అక్రమాల్లో కొందరు తహసీల్దార్లకు కూడా పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వెబ్‌ల్యాండ్‌లో ప్రైవేటు వ్యక్తుల పేరుతో చేరిపోయాయి. ఇందుకోసం కొందరు రిటైర్డు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రస్తుత రెవెన్యూ అధికారులు రికార్డులను కూడా తారుమారు చేశారని తెలుస్తోంది. ‘12 – 13 ఏళ్ల అడంగళ్లను కూడా మార్చి వేశారు. ఇంత దారుణంగా పకడ్బందీగా చేస్తే ఎవరు మాత్రం పట్టుకోగలరు. గతంలో అనంపురం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల కుంభకోణం జరిగింది. ఇప్పుడు వెబ్‌ల్యాండ్ కుంభకోణం. పాసు పుస్తకాలు నకిలీవి ముద్రించాలంటే చాలా కష్టం. వెబ్‌ల్యాండ్‌లో తప్పులు చేయడం చాలా సులభం. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి పట్టుబట్టి వెబ్‌ల్యాండ్ అమల్లోకి తెచ్చేలా చేశారు. ఇప్పుడు ఇదే అక్రమాలకు సులువైన మార్గంగా తయారైంది. ’ అని ఓ జిల్లా జాయింట్ కలెక్టరు ఆవేదన వ్యక్తం చేశారు. - నెల్లూరు జిల్లా మర్రిపాడులో పదెకరాల ప్రభుత్వ భూమి రాత్రికి రాత్రే ఒక తెలుగుదేశం నాయకుడి పేరుతో వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కిపోయింది. వెంటనే ఆ నాయకుడు మీసేవ నుంచి భూ అనుభవపత్రం (అడంగల్), భూ యాజమాన్య హక్కు పత్రం (1–బి) డౌన్లోడ్ చేసుకుని బ్యాంకులో రుణం తీసుకున్నారు. - గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో ప్రభుత్వ భూమినే ఓ వ్యక్తి ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకి ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వ భూమిని వెబ్‌ల్యాండ్‌లో తనపేరుతో నమోదు చేయించుకుని రికార్డులు మార్పించారు. పూలింగ్ కింద ఇచ్చిన భూమికి ప్రతిగా సీఆర్డీఏ ప్లాటు కేటాయించే సమయంలో ఫిర్యాదు రావడంతో విచారణ చేస్తే వాస్తవం బయటపడింది. ఫిర్యాదు అందకపోతే ప్రభుత్వ భూమికే ఆ వ్యక్తి సీఆర్డీఏ నుంచి ప్లాటు పొందేవారు. - చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుదిపుట్లలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తి పేరుతో ఆన్లైన్లో నమోదైంది. ఆ భూమిపై ఆ వ్యక్తి బ్యాంకులో రుణం తీసుకున్న తర్వాత విచారణ మొదలైంది. -
సర్కారు భూములు స్వాహా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలో లక్షల కోట్ల విలువైన లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. సాక్షాత్తూ అధికార పార్టీ నాయకులే రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, సర్కారు భూములను స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను బినామీ పేర్లతో మింగేస్తున్నారు. ఖాళీ భూములు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతు న్నారు. డీకేటీ పట్టాలు ఇవ్వని భూములను కూడా ఎప్పుడో 1954కు ముందే ఇచ్చినట్లు దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు. పాత రికార్డులను మార్చేసి, కొత్త రికార్డులు తయారు చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన అధికారులను వాడుకుని, పాత తేదీలతో సంతకాలు చేయించి బినామీలు, బంధువుల పేర్లతో గుట్టుగా సర్కారు భూములు కొట్టేస్తున్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రెవెన్యూ శాఖ వెబ్సైట్ వెబ్‌ల్యాండ్‌లో రాత్రికి రాత్రే పేర్లు మారిపోతున్నాయి. అసైన్డ్ భూముల అనుభవదారులుగా అసైనీల బదులు ఇతరుల పేర్లు దర్శనమిస్తున్నాయి. గ్రామకంఠాలను అమ్ముకున్నారు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అన్ని జిల్లాల్లోనూ సర్కారు భూములు పరాధీనమైపోయాయి. రూ.లక్షల కోట్ల విలువైన లక్షలాది ఎకరాలను సొంత ఖాతాల్లో వేసుకున్నారు. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం వంటి నగరాల్లో ప్రజల ఉమ్మడి అవసరాల కోసం బ్రిటిష్ వారు కేటాయించిన గ్రామకంఠం భూములను సైతం అధికార పార్టీ నాయకులు ఆక్రమించి, అమ్ముకుని రూ.వందల కోట్లు వెనకేసుకున్నారు. తిరుపతిలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబం రూ.1,000 కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూములను రికార్డులు మార్చేసి సొంతం చేసుకుంది. రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖపట్నం నడిబొడ్డున దసపల్లా హిల్స్‌లో అత్యంత విలువైన సర్కారు భూమిని నకిలీ పత్రాలతో అధికార పార్టీ నేతలు ఆక్రమించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. పీఓటీ చట్టాన్ని తుంగలో తొక్కి... బదలాయింపు నిషేధ(పీఓటీ) చట్టాన్ని తుంగలో తొక్కి పేదలకు చెందిన అసైన్డ్ భూములను అధికార పార్టీ నేతలు పట్టా భూములుగా మార్చుకున్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో అంచనాలకు అందని స్థాయిలో భూకుంభకోణాలు జరిగాయి. ఒక్క విశాఖ జిల్లాలోనే రికార్డుల మార్పిడి, ట్యాంపరింగ్ ద్వారా రూ.లక్ష కోట్ల విలువైన భూకుంభకోణం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అప్పట్లో స్వయంగా విశాఖ జిల్లా కలెక్టరే ధ్రువీకరించారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వ పెద్దల బండారం బయటపడుతుందనే భయంతో హడావుడిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)ను నియమించి, తూతూమంత్రంగా దర్యాప్తును ముగించి సర్దుబాటు చేశారనే ఆరోపణలున్నాయి. రాయలసీమకు చెందిన ఇద్దరు మంత్రులు, ఒక ముఖ్యనేత అనంతపురం–బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో అత్యంత విలువైన 1,000 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో కొట్టేశారు. 1,400 ఎకరాల అసైన్డ్ భూములను అగ్రిమెంట్ల రూపంలో దూరపు బంధువుల (బినామీలు) పేర్లతో నామమాత్రపు ధరతో కొనుగోలు చేసి, వెబ్‌ల్యాండ్‌లో తమ పేర్లు ఎక్కించుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి ఏకంగా 300 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, బినామీల పేర్లతో రికార్డులు మార్పించేశాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి తోటలు పెంచుతున్నాడు. ఇదే జిల్లాలో ఒక అధికారి రికార్డులు ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించుకుని చుట్టూ కోటలా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించుకున్నాడు. ఆయన అండతోనే ఒక ప్రజాప్రతినిధి బంధువుల పేర్లతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను సొంతం చేసుకున్నాడు. అందువల్లే ఆ అధికారి సస్పెన్షన్‌ను ఎత్తివేయించి పోస్టింగ్ ఇప్పించారనే విమర్శలు ఉన్నాయి. అసైన్డ్ భూములతో బేరం ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను అసైనీలు సాగు చేసుకోవాలే తప్ప విక్రయించడానికి వీల్లేదు. అయితే, అధికార పార్టీ నాయకులు అసైన్డ్ భూములను కారుచౌకగా పీఓటీ చట్టానికి విరుద్ధంగా కొనుగోలు చేశారు. ఆ భూములను భూసమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చారు. పరిహారం కింద ప్రభుత్వం నుంచి అత్యంత విలువైన ఫ్లాట్లు పొందారు. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) పరిధిలో ఒక మంత్రి బినామీ పేర్లతో కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను వుడాకు అప్పగించారు. పరిహారం కింద రూ.600 కోట్ల విలువైన స్థలాలను చట్టబద్ధంగా సొంతం చేసుకునేందుకు పావులు కదిపారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ‘గీతం’కు అనుచిత ప్రయోజనం విశాఖ జిల్లాలోని రుషికొండలో ప్రభుత్వ సంస్థలకు 55 ఎకరాలు కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు గత ఏడాది ఏప్రిల్ 5న ఏకంగా జీవోఎంఎస్ నంబరు 165ను జారీ చేసింది. రూ.వందల కోట్ల విలువైన ఈ భూమిని ముఖ్యమంత్రి సమీప బంధువు, విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి చెందిన సంస్థకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ భూమి ఎంవీవీఎస్ మూర్తికి చెందిన ‘గీతం’ సంస్థ ఆక్రమణలోనే ఉండడం గమనార్హం. అక్రమార్కులకే పరిహారం రాజధాని అమరావతి పరిధిలోని రెండు గ్రామాల్లో భూసమీకరణ కింద తీసుకున్న అసైన్డ్ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ రెవెన్యూ శాఖ గతనెల 18వ తేదీన జీవో జారీ చేయడం అక్రమాలకు పరాకాష్టగా చెప్పొచ్చు. రాజధాని నిర్మాణం లేదా ఇతర అవసరాలకు భూసమీకరణ కింద ప్రభుత్వం ఈ భూములను తీసుకున్నప్పటికీ వాస్తవ అసైనీలకే పరిహారం, ప్లాట్లు, కౌలు, ప్యాకేజీలు ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా అక్రమంగా వీటిని పొందిన వారికే ఆయా ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఈ భూములన్నీ రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల బినామీలవి కావడం వల్లే ప్రభుత్వం ఈ జీవో ఇచ్చిందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అడ్డగోలుగా భూసంతర్పణలు టీడీపీ ముఖ్యనేతల బంధువులకు, బాగా కావాల్సిన వారికి ప్రభుత్వం విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టింది. - ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ మిత్రుడు శ్రీధర్‌కు చెందిన ఈ–సెంట్రిక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖపట్నంలో రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాలను రూ.25 కోట్లకే అప్పగిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. - తిరుపతిలో కలిసిపోయిన కరకంబాడిలో (కడప–తిరుపతి రహదారికి ఆనుకుని) రూ.50 కోట్ల విలువైన 25 ఎకరాలను కేవలం రూ.4.88 కోట్లకే మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబానికి చెందిన మంగళ్ ఇండస్ట్రీస్‌కు కట్టబెడుతూ 2015 నవంబరు 12న ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గల్లా అరుణకుమారి మంత్రిగా ఉన్నప్పుడు ఈ భూమి కోసం ప్రయత్నించారు. అయితే, అప్పుడు కాని పని టీడీపీ అధికారంలోకి రాగానే జరిగిపోయింది. - కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వీబీసీ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌కు రూ.478.93 కోట్ల విలువైన 478.93 ఎకరాల భూమిని కేవలం రూ.4.78 కోట్లకే ప్రభుత్వం రాసిచ్చేసింది. వీబీసీ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సంస్థ సీఎం చంద్రబాబు బంధువైన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కుటుంబానిది కావడం గమనార్హం. - రాజధాని అమరావతి ప్రాంతంలో వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)కు 200 ఎకరాలు, మాతా అమృతానందమయి విశ్వవిద్యాలయానికి 200 ఎకరాలు, ఎస్ఆర్ యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు 150 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ ఎకరా ధర రూ.5 కోట్లు పలుకుతుండగా, ప్రభుత్వం మాత్రం ఎకరా రూ. 50 లక్షల చొప్పున ఇచ్చేయడం గమనార్హం. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసే విద్యా, వైద్య సంస్థలకు నామమాత్రపు ధరకు భూములు ఎందుకు కట్టబెట్టారనే ప్రశ్నకు సర్కారు వద్ద సమాధానం లేదు. అనధికారిక వాటాలు ఉన్నందువల్లే ప్రభుత్వ పెద్దలు అప్పనంగా భూములు కట్టబెట్టారనేది బహిరంగ రహస్యమే. -
పంచని పుస్తకాల్లో తప్పులెన్నో!
సాక్షి, హైదరాబాద్: కొత్త పాస్ పుస్తకాల పంపిణీ తప్పుల తడకని తేలిపోయింది. ముద్రణ సమయంలోనే 3 లక్షల పాస్ పుస్తకాల్లో తప్పులున్నాయని గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పేరు తప్పుల నుంచి ఆధార్ నంబర్ల వరకు, విస్తీర్ణంతోపాటు ఫొటోలు కూడా తప్పులు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేయలేదు. ఇది ఒక ఎత్తయితే పంపిణీ చేసిన పుస్తకాల్లో కూడా అదే స్థాయిలో తప్పులు వస్తుండటం మరింత గందరగోళానికి దారితీస్తోంది. అయితే పాస్ పుస్తకాల్లో తప్పులకు క్షేత్రస్థాయిలో జరిగిన నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అడ్డగోలుగా రికార్డులు సరిచేయడం, ఎలాంటి పరిశీలన లేకుండా ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాల వివరాలను ముద్రణకు పంపడమే ఇంతటి గందరగోళానికి కారణమైందని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ పుస్తకాలన్నింటినీ మళ్లీ ముద్రించేందుకు సిద్ధమయ్యారు. 14 రకాల తప్పులు పంపిణీ చేయకుండా నిలిపివేసిన పుస్తకాల్లో మొత్తం 14 రకాల తప్పులున్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో రైతుకు అత్యంత కీలకమైన భూమి విస్తీర్ణం నమోదులోనే ఎక్కువ పుస్తకాల్లో తప్పులు వచ్చాయి. మొత్తం 93 వేల పుస్తకాల్లో రైతుకు ఉన్న భూమి కన్నా ఎక్కువో, తక్కువో నమోదయ్యాయి. వీటికితోడు పట్టాదారుకు బదులు వేరొకరి ఫొటో ఉన్న 37 వేలకు పైగా పుస్తకాలను అధికారులు గుర్తించారు. వాటిని నిలిపివేశారు. చనిపోయిన వారి పేర్ల మీద, పాత పట్టాదారుల పేర్లతో, ఆధార్ తప్పులతో, పట్టాదారు పేరు, తండ్రి పేర్లలో తప్పులతో వేల సంఖ్యలో పుస్తకాలను ముద్రించారు. నాలా భూములకు, ప్రభుత్వ భూములకు కూడా పాస్ పుస్తకాలను సిద్ధం చేశారు. ఒక్కో రైతుకు ఒక ఖాతా ఉండాల్సి ఉండగా, ఒకే ఖాతా నంబర్‌ను ఇద్దరు, ముగ్గురు రైతులకు వచ్చేలా దాదాపు 34 వేల పుస్తకాలు ముద్రించారంటే రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వే నంబర్లలో తప్పులు, అసైన్డ్ భూములకు, అటవీ శాఖతో వివాదాలున్న భూములకు కూడా పాస్ పుస్తకాలు ముద్రించడం గమనార్హం. పంపిణీ చేసిన వాటిలోనూ.. పంపిణీ చేసిన 39 లక్షల పుస్తకాల్లోనూ అదే స్థాయిలో తప్పులు రావడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. భూ విస్తీర్ణం, పట్టాదారు పేర్లు, ఫొటోలు, ఆధార్ నంబర్లలో వచ్చిన తప్పులును రైతులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమకున్న భూమి మొత్తం పుస్తకాల్లో రాకపోవడంతో ఉన్న భూమి ఎటుపోతుందోననే భయం వారిలో వ్యక్తమవుతోంది. చాలా పుస్తకాల్లో కొనుగోలు చేసిన భూములు కూడా ఆనువంశికంగా వచ్చినట్లు నమోదైంది. ఇవి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయోననే సందేహాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ తప్పులను సరిచేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ‘తప్పులను రికార్డు చేసి వెళ్లిపోండి.. మేం కొత్త పుస్తకాలకు పంపిస్తాం. కానీ అవి ఎప్పుడు వస్తాయో చెప్పలేం’అంటూ క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది చెబుతున్న మాటలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా పాస్‌పుస్తకాల పంపిణీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చొరవ తీసుకుని నిశిత దృష్టితో ఈ అంశాన్ని పరిష్కరించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. విషయం సీఎం దృష్టికి ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలో అసలు ఎన్ని కొత్త పాస్‌పుస్తకాలను ముద్రించారు? అందులో పంపిణీ చేసినవి ఎన్ని? పంపిణీ చేయకుండా నిలిపివేసినవి ఎన్ని? పంపిణీ ఎందుకు చేయలేదనే వివరాలను జిల్లాల వారీ గణాంకాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 49.94 లక్షల కొత్త పాస్ పుస్తకాలను ముద్రించామని, అందులో 39.47 లక్షల పుస్తకాలను ఈనెల 23 నాటికి పంపిణీ చేశామని, 3.07 లక్షల పుస్తకాల్లో తప్పులున్నందున వాటిని నిలిపివేశామని తెలిపారు. పంపిణీ చేసిన పాస్ పుస్తకాల్లోనూ పెద్ద సంఖ్యలో తప్పులు వచ్చాయన్న సమాచారంతో సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరిచేయాలని ఆదేశించారు. -
అడిగిన వెంటనే పరిశ్రమలకు భూములు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అడిగిన వెంటనే భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కోరగానే ప్రభుత్వ భూములను అప్పగించాలన్నారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసిన తక్షణమే వారికి ఏపీఐఐసీ భూములు కేటాయించాలని, ఏమాత్రం జాప్యం చేయరాదని పేర్కొన్నారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసం వద్దనున్న గ్రీవెన్స్ హాల్లో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ఫలితాలు సాధించిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే 2029 కంటే ముందే మన రాష్ట్రం తిరుగులేని శక్తిగా ఆవిష్కృతమవుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వంద శాతం డిజిటల్ లిటరసీ సాధించాలని సూచించారు. ‘‘పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు వచ్చి మనల్ని భూములు, సౌకర్యాలు అడగడం కాదు. మనమే వారి వద్దకు వెళ్లి మేం ఇవి ఇస్తాం, మీరు పరిశ్రమలు పెట్టండి అని పిలవాలి’’ అంటూ ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విడుదలలో జాప్యం చేయరాదన్నారు. చంద్రబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘‘రాష్ట్రంలో లక్ష హోటల్ గదుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలి. హోటల్ గదులు మనం నిర్మించాలి. నిర్వహణ బాధ్యతలను ప్రముఖ సంస్థలకు అప్పగించాలి. మనం కష్టపడి రూపొందించిన ఈ–ప్రగతి, ఫైబర్ నెట్ లాంటి వాటిని మేధో హక్కుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరిపాలనపై ప్రజల సంతృప్త స్థాయిని ప్రస్తుతం ఉన్న 75 శాతం నుంచి 80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు, ఎయిర్‌స్ట్రిప్, పరిశ్రమ కోసం 5,000 ఎకరాలు సేకరించాలి. విజయవాడ శివారులోని జక్కంపూడిలో 106 ఎకరాలు, నున్నలో 70 ఎకరాలు, త్రిలోచనపురంలో 40 ఎకరాలను సేకరించండి. టౌన్‌షిప్‌లు నిర్మిద్దాం. గోదావరి జిల్లాలోని తిమ్మాపురంలో ఎకనామిక్ సిటీ నిర్మిద్దాం. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి వెంటనే భూసేకరణకు వెళ్లండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణపై దృష్టి పెట్టండి. కేవలం పథకాలను అమలు చేస్తే సరిపోదు. వాటి గురించి ప్రజలకు తెలియజేయాలి. ఇందుకోసం డబ్బు ఖర్చు అవుతుందని వెనుకడుగు వేయాల్సిన పనిలేదు. 200 గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ 2019 మార్చి నాటికి 19 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆ తరువాత మరో 20 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దేవాదాయ స్థలాలను వేలం వేసి, పేదలకు ఇవ్వాలి. భవిష్యత్‌లో ఎండోమెంట్ భూములను కాపాడలేం. ఇప్పుడే పేదలకు పంపిణీ చేస్తే బాగుంటుంది. పట్టణాల్లో పేదలు ప్రైవేట్ స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి 200 గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి గృహాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. క్రీడలు నిరంతర ప్రక్రియగా ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలి. నిరుద్యోగ భృతిని వచ్చే నెల నుంచి అందించాలని నిర్ణయించాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. చెరువులను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి ప్రయోజనార్థం చెరువు భూమిని వేస్ట్‌ల్యాండ్‌గా మార్చడం సరికాదేమో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సూచించారు. అయితే గత ఏడాది మా జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అర్బన్ హౌసింగ్‌పై చర్చ జరుగుతున్నప్పుడు లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని మునిసిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి కరికాలవలవన్ చెప్పగా మంత్రి ఈ వ్యాఖ్యాలు చేశారు. దీనిపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. 2016–17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గృహాలను జిల్లాకు కేటాయించలేదన్నారు. మద్యం బెల్ట్ షాపులను నియంత్రించాలి రాష్ట్రంలో మద్యం బెల్ట్ దుకాణాలు ఇంకా కొనసాగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు నొక్కి చెప్పారు. బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించేందుకు ఎక్సైజ్, పోలీసు అధికారులతోపాటు కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ల సదస్సులో, తర్వాత శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమీక్షలోనూ సాంబశివరావు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆధార్ డేటా వాడితే క్రిమినల్ చర్యలు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) డేటాను బహిర్గతపరచడం చట్టరీత్యా తీవ్ర నేరమని ఆధార్ అథారిటీ ఛైర్మన్ జె.సత్యనారాయణ తెలిపారు. ‘‘ఆధార్‌కు సంబంధించిన డేటా ఎక్కడైనా వెబ్సైట్లలో ఉంటే వెంటనే తొలగించండి. ఆధార్ వివరాలు వెబ్సైట్లో ప్రదర్శించినా, బహిరంగ పరిచినా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని కలెక్టర్ల సదస్సులో సత్యనారాయణ స్పష్టం చేశారు. -
హెచ్ఎండీఏపై కాసుల వర్షం
సాక్షి, హైదరాబాద్ : అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)తో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)పై కాసుల వర్షం కురిసింది. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు సోమవారంతో ముగిసింది. ఇప్పటివరకు ఏకంగా రూ.928 కోట్ల ఆదాయం వచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో రూ.695 కోట్లు, నాలాల ఫీజు రూపంలో రూ.233 కోట్లు హెచ్ఎండీఏ ఖజానాలో వచ్చి చేరాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ అయిన వారిలో మరో 18,500 మంది ఫీజు కట్టాల్సి ఉండటం, పరిశీలనలో ఉన్న వందల సంఖ్యలో దరఖాస్తులు క్లియర్ అయితే మరో రూ.150 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సహకారంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణ, ఆమోదం అంతా పారదర్శకంగా జరిగిందని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు. మరో రూ.150 కోట్లు వచ్చే అవకాశం... హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2015 నవంబర్‌లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. మళ్లీ 2016 డిసెంబర్లో 20 శాతం అధిక రుసుముతో క్రమబద్ధీకరించుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఇలా పాతవి, కొత్తవి కలిపి మొత్తం దరఖాస్తులు 1,75,612కు చేరాయి. టైటిల్ క్లియరెన్స్, టెక్నికల్ స్క్రూటిని, సైట్ ఇన్స్పెక్షన్, ఫైనల్ ప్రాసెసింగ్ ఇష్యూ... ఇలా నాలుగు దశల్లో లక్ష దరఖాస్తులను ఆమోదించారు. ప్రభుత్వ భూములు, సీలింగ్, శిఖం, మాస్టర్ ప్లాన్ రోడ్స్ తదితర స్థలాల్లో ఉన్నాయనే వివిధ కారణాలతో 75,612 దరఖాస్తులను తిరస్కరించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు సోమవారం చివరి రోజు కావడంతో చాలా మంది ఫీజు చెల్లించారు. అయితే హెచ్ఎండీఏకు మరో రూ.150 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పెంచే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
అధికారులేం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో దాదాపు 2 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించి, వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు పొందిన వ్యవహారంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతుంటే అధికారులేం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణలో తేలిన అంశాలతో సమగ్ర నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా, నెన్నల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి భారీగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి రామ్మోహనరావు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి ‘సాక్షి’లో వచ్చిన కథనాలను జత చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జోగాపూర్, గొల్లపల్లి, మైలారం, ఘనాపూర్, నెన్నెల తదితర గ్రామాల్లో దాదాపు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాసు పుస్తకాలు సృష్టించి గ్రామీణ బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని తెలిపారు. నెన్నెల మండలం ఎంపీపీ భర్త గడ్డం భీమా గౌడ్ 32 ఎకరాలు ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. భూముల విలువ రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. -
ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు
జవహర్‌నగర్ : ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కాప్రా తహసీల్దార్ గౌతమ్‌కుమార్ అన్నారు. గురువారం జవహర్‌నగర్‌లోని మోహన్‌రావుకాలనీ, వెంకటేశ్వరకాలనీ ప్రాంతాలలోని సర్వే నం.606 పార్ట్‌లో 4 రూంలు, 8 బేస్మెంట్లను తొలగించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ... భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పేదల నివాస స్థలాలకు హక్కులను కల్పించడమే కాకుండా ప్రభుత్వ స్థలాలను కాపాడడమే తమ లక్ష్యమన్నారు. కొందరు కబ్జాదారులు అయాయక ప్రజలకు ప్రభుత్వ స్థలాలను కట్టబెడుతున్నారని అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇళ్లులేని నిరుపేదల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను నిర్మిస్తోందని, ఇళ్లు లేని వారు ఇళ్ల కోసం మీసేవలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మండల సర్వేయర్ యాదగిరి, వీఆర్ఓలు వెంకటేష్, స్వాతిలతో పాటు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూములకు ‘భూధార్’
సాక్షి, అమరావతి: పౌరులకు ఆధార్ నంబర్ కేటాయిస్తున్నట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా పొలాలు, స్థలాలకు ‘భూధార్’ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్యను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూముల లావాదేవీల్లో అక్రమాలను నిరోధించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి స్థిరాస్తికి దీన్ని వర్తింపచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి 4.19 కోట్ల స్థిరాస్తులకు భూధార్ నంబర్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూధార్ అమలు తీరు, ఉపయోగాలపై బుధవారం నిర్వహించిన సమీక్షలో అధికారులు పవర్‌పాయింట్ ద్వారా రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి వివరించారు. ప్రభుత్వ భూములకు రెండు సున్నాలు ప్రభుత్వ భూములు, స్థలాలకు మొదట రెండు సున్నాలతో నంబరు కేటాయిస్తారు. జియోట్యాగింగ్ చేయడం వల్ల భూదార్ నంబరు నొక్కగానే ఆ భూమి ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. అందులోనే భూ యజమాని పేరు, భూమి విస్తీర్ణం, ఏ తరహా భూమి, మార్కెట్ విలువతోపాటు 20 అంశాలు కనిపిస్తాయి. ఈ భూమిని ఎవరైనా కొనుగోలు చేస్తే ఆటో మ్యుటేషన్ అయిపోతుంది. రుణాలు తీసుకున్నా అందులోనే డేటా కనిపిస్తుంది. క్రయ విక్రయాలకు కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు (క్రయ విక్రయ లావాదేవీలు), దస్తావేజు నకళ్లు లాంటివి తీసుకోవాల్సిన పని ఉండదు. జగ్గయ్యపేట, ఉయ్యూరులో పైలెట్ ప్రాజెక్టు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని 24 గ్రామాలు, ఉయ్యూరు మున్సిపాలిటీలో ఇప్పటికే చేపట్టిన భూధార్ పైలట్ ప్రాజెక్టును ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భూములు, స్థలాలు, ఇళ్లకు భూధార్ నంబరు కేటాయించి డిజిటలైజ్ చేస్తే తప్పుడు, డబుల్ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత రుణాలు పొందేందుకు ఆస్కారం ఉండదని అధికారులు పేర్కొన్నారు. 4.19 కోట్ల ఆస్తులకు భూధార్ ఈ ఏడాది అక్టోబరు నెలాఖరుకల్లా రాష్ట్రంలో 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 50 లక్షల పట్టణ ఆస్తులు, 85 లక్షల గ్రామీణ ఆస్తులు కలిపి మొత్తం 4.19 కోట్ల స్థిరాస్తులకు భూధార్ నంబరు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా భూసేవ పేరుతో భూధార్ కార్యక్రమం చేపడుతున్నట్లు కేఈ కృష్ణమూర్తి వివరించారు. రైతుల సమయం, డబ్బు ఆదా చేయాలనే ఆటోమ్యుటేషన్కు శ్రీకారం చుట్టామని చెప్పారు. భూధార్ ఇలా - భూధార్ విధానంలో ప్రతి స్థిరాస్తికి 11 అంకెలతో కూడిన నంబరు కేటాయిస్తారు. - ఇందులో మొదటి రెండు అంకెలు రాష్ట్రానికి సంబంధించిన సెన్సెస్ కోడ్ కాగా తర్వాత తొమ్మిది అంకెలు ఉంటాయి. - ఒకవేళ ఈ ప్రాజెక్టును దేశమంతా చేపడితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు మొదటి రెండు అంకెలు రాష్ట్ర సెన్సెస్ కోడ్ (28) కోసం కేటాయిస్తారు. - తప్పులు దొర్లకుండా జాగ్రత్తల్లో భాగంగా తొలుత 28కి బదులు 99తో ఆరంభించి 11 అంకెల తాత్కాలిక నంబరు ఇస్తారు. - భూ వివరాలను సమగ్రంగా విశ్లేషించి అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత రాష్ట్ర సెన్సస్ కోడ్ 28తో ప్రారంభమయ్యే శాశ్వత భూధార్ నంబరు కేటాయిస్తారు. -
చట్టానికి గంతలు.. రోడ్లపైనే భవంతులు
వశక్తినగర్ రోడ్డులోని అయ్యప్పనగర్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనమిది. టీడీపీ నేత అండదండలతో నిర్మిస్తున్న ఈ భవనం రెండో అంతస్తుపైన టీడీఆర్ పేరుతో ఇంతకుముందు పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. అయితే టీడీఆర్ అర్హత లేదు.. అనుమతులూ లేవన్న కారణంతో సీసీపీ ఆదేశాల మేరకు పెంట్‌హౌస్ నిర్మాణాన్ని ఇంతకుముందు టౌన్ ప్లానింగ్ అధికారులు కూలగొట్టారు.. పెంట్హౌసే అక్రమమంటే.. ఇప్పుడు ఏకంగా మూడో అంతస్తే నిర్మించేస్తున్నారు....మహా విశాఖ నగరంలో భవన నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలకు ఇదో మచ్చుతునక మాత్రమే.. నగరం మొత్తం తరచి చూస్తే ఇటువంటివి వందలు, వేలల్లోనే ఉంటాయి. ప్రభుత్వ స్థలాల్లో కట్టేస్తున్నవి కొన్నయితే.. నిబంధనలు మీరి నిర్మిస్తున్నవి ఇంకొన్ని.. నిబంధనలు పాటించని నిర్మాణాల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అడపాదడపా దాడులు చేసి అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నా.. కొద్దిరోజుల్లోనే మళ్లీ కట్టేస్తున్నారు.. ‘వారు కూల్చేస్తారు..మేం కట్టేస్తాం’.. అన్నట్లు అక్రమార్కులు దర్జా వెలగబెడుతున్నారు. ఇక ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాల విషయంలో అధికారులు కళ్లకు గంతలు కట్టేసుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: చేతిలో అధికారం.. అడుగులకు మడుగులొత్తే అధికారుల అండదండలు.. అధికార టీడీపీ నేతలు రెచ్చిపోవడానికి ఇంకేం కావాలి. ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కాజేస్తున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా భారీ భవంతులు నిర్మించేస్తున్నారు. ఒకటి రెండుసార్లు కూలగొట్టినా దర్జాగా అంతస్తు మీద అంతస్తులు నిర్మించేస్తున్నారు. అడిగే వారు లేరన్న ధీమాతో నిబంధనలకు పాతరేస్తున్నారు. పేదల విషయంలో నిబంధనలను వల్లె వేసి, రోడ్డున పడేసే అధికారు అధికార పార్టీ నేతల వద్దకొచ్చేసరికి నీరుగారిపోతున్నారు. కోట్ల విలువ చేసే స్థలాలు, రోడ్లు, ప్రజోపయోగ స్థలాల్లో నిర్మిస్తున్న అక్రమ భవనాలు అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులవైతే వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పైగా ముందే వారితో మాట్లాడుకుంటే మామూళ్లు కూడా ముడతాయన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు గానీ, అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్కాడ్ గానీ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా మధురవాడ, కొమ్మాది, సాగర్ నగర్, పీఎంపాలెం తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. తాము తీసుకుంటున్న ముడుపులు కింది నుంచి పై స్థాయి వరకు వాటాలు వేసుకుంటామని ఇటీవల అవినీతి నిరోధక శాఖకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్న ఓ ఉద్యోగి అధికారుల విచారణలో వెల్లడించడం చూస్తే.. ఇక అక్రమాలు అడ్డుకట్ట పడటం కల్లేనన్న భావన వ్యక్తమవుతోంది. ఉల్లంఘనలివే.. ♦ జీవీఎంసీ 4వ వార్డు జేఎన్ఎన్యూఆర్ఎం కొమ్మాది కాలనీకి కనెక్టవిటీ రోడ్డుపైనే అడ్డగోలుగా నిర్మిస్తున్న భవనాన్ని గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు అసిస్టెంట్ సిటీ ప్లానర్స్(ఏసీపీ) మూడుసార్లు తొలగించారు. అయినా అక్కడే అదే భవనం అధికార పార్టీ మాజీ కార్పోరేటర్ అండతో నిర్మాణం పూర్తి చేసుకుంది. దీని పక్కనే మరో భవనాన్ని మంత్రి గంటా వద్ద పనిచేశానంటూ ఓ ఉద్యోగి నిర్మించేస్తున్నాడు. తలాతోకా లేని ఓ ప్రొసీడింగ్ ఆర్డర్ పట్టుకుని ఇంత దందా చేస్తున్నారు. అది తప్పు అని తెలిసినా మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడి భరించలేకపోతున్నామంటూ అధికారులు వారి అక్రమాలకు కొమ్ము కాస్తున్నారు. ♦ మరో టీడీపీ మహిళా నేత 5వ వార్డులో మాస్టర్ ప్లాన్ రోడ్డునే ఆక్రమించి భవనం నిర్మిస్తున్నారు. జెడ్సీ నుంచి అందరికీ ఇందులో పాత్ర ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. చర్యలు చేపడతామని చెప్పి నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో వారు లబ్ధిదారులని బుకాయిస్తున్నారు. ఇదే వాస్తవమైతే 5వ వార్డు సుద్ద గెడ్డ వద్ద నిలువ నీడలేని రజకులు సుమారు 50 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ♦ 5వ వార్డు శివశక్తినగర్ రోడ్డులోని అయ్యప్పనగర్ కాలనీ వద్ద టీడీపీ నాయకుడి ప్రోద్బలంతో అతని బంధువు రెండో అంతస్తుపై టీడీఆర్ సాకుతో పెంట్ హౌస్ నిర్మించాడు. టీడీఆర్ లేదని.. ఆ నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని సీసీపీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొన్ని రోజుల క్రితం దాన్ని పాక్షికంగా కూల్చేశారు. శ్లాబుకు జీవీఎంసీ అధికారులు పెట్టిన కన్నాలు అలా ఉండగానే పనులు చకచకా జరిగిపోతున్నాయి. అక్కడి జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నాయకులు అండ ఉండడంతో ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు దాని వైపు చూడటం మానేశారు. ♦ కొమ్మాది సర్వే నెంబరు. 153/3లో జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి స్థలం ఇచ్చినందుకు 2009లో ఆరుగురికి 60 గజాలు చొప్పున స్థలం ఇచ్చినట్టు ప్రొసీడింగ్ ఆర్డర్ చూపుతున్నారు. ఇది వాస్తవం అయితే ఇన్నిసార్లు జీవీఎంసీ అధికారులు ఎందుకు ఇక్కడ మొదట నిర్మించిన భవనాన్ని అడ్డుకొని పాక్షికంగా కూలగొట్టారన్నది ప్రశ్న. సరిగ్గా అదే ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు చకచకా సాగిపోతున్నాయి. అప్పుటి అక్రమం.. ఇప్పుడు సక్రమం ఎలా అయిపోయిందన్న దానికి సమాధానం లేదు. ప్రొసీడింగ్ ఆర్డర్లో పేర్కొన్న ఏ ఒక్కరూ ప్రస్తతం ఇక్కడ లేరు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయన్న ♦ ♦ ఆరోపణలు బలంగా విన్పిస్తు న్నాయి. ♦ ఇక స్వతంత్రనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఒక భవన నిర్మాణం జరుగుతోంది. దీనికి తూర్పు ఎమ్మెల్యే అండదండలు, వార్డు అధ్యక్షుడి సిఫార్సు ఉందని సిబ్బందే సెలవిస్తున్నారు. ఇలా అన్ని చోట్లా కుమ్మక్కు వ్యవహారాలే సాగుతున్నాయి. నిర్మాణాల ముసుగులో కోట్లాది రూపాయలు చేతులు మారుతూనే ఉన్నాయి. ♦ విచారణ జరిపిస్తాం వీటిపై డీసీసీపీ ఏ.ప్రభాకరరావును వివరణ కోరగా.. 4, 5 డివిజన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.