'ప్రభుత్వ భూముల్లో ఎవర్నీ ఉండనీయం'
హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించుకోవాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. క్రమబద్దీకరించుకోకుంటే ఖాళీ చేయిస్తామన్నారు. ఏప్రిల్ తర్వాత ప్రభుత్వ భూముల్లో ఎవర్నీ ఉండనీయబోమని హెచ్చరించారు.
125 గజాలలోపు నివాసం ఉంటున్న పేదలకు ఉచితం క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 125 - 250 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్కు 50 శాతం రాయితీ... 250 - 500 గజాలలోపు భూముల రిజిస్ట్రేషన్కు 75 శాతం రాయతీ... 500 నుంచి ఆపై బడిన నివాస స్థలాలకు 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించి భూమిని క్రమబద్ధీకరణ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది.