
ఎఫ్‌టీఎల్‌కు 200 మీటర్ల పరిధిలోని సర్వే నంబర్ల వివరాలు కోరిన సర్కారు
ప్రభుత్వ భూములను ఆనుకొని ఉన్న సర్వే నంబర్లు కూడా
మున్సిపల్, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రెవెన్యూ,ఇరిగేషన్ శాఖలకు ఆదేశం
ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ల శాఖను అనుసంధానం చేస్తున్న సీజీజీ
సాక్షి, హైదరాబాద్: చెరువులు, కుంటల పూర్తి నీటిమట్టం స్థాయి (ఎఫ్‌టీఎల్) నుంచి 200 మీటర్ల లోపు ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలతోపాటు ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న సర్వే నంబర్లను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు పంపాలని వివిధ శాఖలు, సంస్థల అధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వీసీలు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, డీటీసీపీలు తమ పరిధిలోని నీటి వనరుల ఎఫ్‌టీఎల్ నుంచి 200 మీటర్ల లోపు ఉన్న సర్వే నంబర్లను పంపించాల్సి ఉంటుందని పేర్కొంది.
ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న భూముల సర్వే నంబర్లలో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ శాఖల పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీకి పంపుతారు. డీటీసీపీ ఈ ప్రక్రియను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇదీ ప్రక్రియ..
⇒ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఫీజుల చెల్లింపు ప్రక్రియ జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌తో రిజిస్ట్రేషన్‌ల శాఖ సర్వర్‌ను అనుసంధానం చేస్తోంది. ఈ అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీజీజీకి సర్వే నంబర్ల వివరాలను అందిస్తే, ఆన్‌లైన్‌లో వాటిని అందుబాటులో ఉంచనుంది. తదనుగుణంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను మున్సిపల్ లేదా పంచాయతీ రాజ్ , నీటిపారుదల, రెవెన్యూ శాఖలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి.
⇒ ఆ తర్వాత ఆన్‌లైన్‌లోనే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ణయించబడుతుంది.
⇒ ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, గతంలో చెల్లించిన మొత్తం ఫీజు నుంచి 10 శాతం ప్రాసెసింగ్ చార్జీలను మినహాయించుకుంటారు.
⇒ వెంచర్‌లోని 10 శాతం ప్లాట్లను 2020 ఆగస్టు 26కు ముందు విక్రయించి ఉంటే, మిగతా ప్లాట్ల క్రమబధ్ధీకరణ కోసం.. విక్రయించిన ప్లాట్ల వివరాలను ఈసీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.
⇒ లేఅవుట్ క్రమబధ్ధీకరణ చార్జీలు, ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించిన తర్వాత తాత్కాలిక ఫీజు నిర్ణయమవుతుందని ప్రభుత్వం తెలిపింది.
⇒ సబ్–రిజి్రస్టార్ సంబంధిత ప్లాట్‌ను నమోదు చేసి, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు వివరాలు, సేకరించిన చార్జీలను ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌కు ప్రాసెసింగ్ కోసం పంపితే క్రమబధ్ధీకరణ చార్జీలు ఆన్‌లైన్‌లోనే నిర్ణయమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment