land survey
-
ఎఫ్టీఎల్ సమీప సర్వే నంబర్లివ్వండి
సాక్షి, హైదరాబాద్: చెరువులు, కుంటల పూర్తి నీటిమట్టం స్థాయి (ఎఫ్టీఎల్) నుంచి 200 మీటర్ల లోపు ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలతోపాటు ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న సర్వే నంబర్లను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు పంపాలని వివిధ శాఖలు, సంస్థల అధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వీసీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లు, డీటీసీపీలు తమ పరిధిలోని నీటి వనరుల ఎఫ్టీఎల్ నుంచి 200 మీటర్ల లోపు ఉన్న సర్వే నంబర్లను పంపించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న భూముల సర్వే నంబర్లలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ శాఖల పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీకి పంపుతారు. డీటీసీపీ ఈ ప్రక్రియను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదీ ప్రక్రియ.. ⇒ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఫీజుల చెల్లింపు ప్రక్రియ జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ను అనుసంధానం చేస్తోంది. ఈ అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీజీజీకి సర్వే నంబర్ల వివరాలను అందిస్తే, ఆన్లైన్లో వాటిని అందుబాటులో ఉంచనుంది. తదనుగుణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మున్సిపల్ లేదా పంచాయతీ రాజ్ , నీటిపారుదల, రెవెన్యూ శాఖలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి. ⇒ ఆ తర్వాత ఆన్లైన్లోనే ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ణయించబడుతుంది. ⇒ ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, గతంలో చెల్లించిన మొత్తం ఫీజు నుంచి 10 శాతం ప్రాసెసింగ్ చార్జీలను మినహాయించుకుంటారు. ⇒ వెంచర్‌లోని 10 శాతం ప్లాట్లను 2020 ఆగస్టు 26కు ముందు విక్రయించి ఉంటే, మిగతా ప్లాట్ల క్రమబధ్ధీకరణ కోసం.. విక్రయించిన ప్లాట్ల వివరాలను ఈసీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ⇒ లేఅవుట్ క్రమబధ్ధీకరణ చార్జీలు, ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించిన తర్వాత తాత్కాలిక ఫీజు నిర్ణయమవుతుందని ప్రభుత్వం తెలిపింది. ⇒ సబ్–రిజి్రస్టార్ సంబంధిత ప్లాట్‌ను నమోదు చేసి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు వివరాలు, సేకరించిన చార్జీలను ఎల్ఆర్ఎస్ పోర్టల్‌కు ప్రాసెసింగ్ కోసం పంపితే క్రమబధ్ధీకరణ చార్జీలు ఆన్లైన్లోనే నిర్ణయమవుతాయి. -
తెలంగాణలో భూముల సర్వే
-
భూముల లెక్కలు పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకు, భూవివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం విస్తృత స్థాయిలో భూముల సర్వే చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా రెవెన్యూ శాఖ పద్దుపై జరిగిన సమీక్ష సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు భూముల సర్వే ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే(Land digital survey)కు అనుమతివ్వాలని, నిధులు కేటాయిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 150 మండలాల్లోని ఒక్కో గ్రామంలో పైలట్ ప్రాజెక్టు(pilot survey) చేపడతామని కోరినట్టు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క... సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఆలోచన చేసినా.. రాష్ట్రంలో భూముల సర్వే చేపట్టాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఈ ప్రతిపాదన వచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో సర్వే కోసం నిధులు కేటాయించారు. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి. కానీ భూముల సర్వే ఆచరణలోకి రాలేదు. ఇటీవల భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల సర్వేకు మార్గం సుగమం అయినట్టేనని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు అవసరమైన నిధులు కోరామని, ప్రభుత్వం అంగీకరిస్తే భూముల పైలట్ సర్వే ప్రారంభం అమవుతుందని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. రూ.800 కోట్లపైనే అవసరం తెలంగాణలో భూముల సర్వే కోసం రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు అవసరమని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. గతంలో అంచనా వేసినప్పుడే రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసేందుకు రూ.560 కోట్లు కావాలని తేలిందని, ప్రస్తుతం అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో కచ్చితమైన సర్వే చేసేందుకు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే భూముల సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు చూపాల్సిన అవసరం లేదని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపి భూముల సర్వేకు సిద్ధమైతే కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులిస్తుందని చెబుతున్నారు.సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం... తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేను 3–6 నెలల్లో పూర్తి చేయవచ్చని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం భూముల సర్వే పెద్ద సమస్య కాబోదని భూచట్టాల నిపుణులు పేర్కొంటున్నారు. కానీ భూముల సర్వే తర్వాత సెటిల్మెంట్ అవసరమని, భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్శిల్ ఎవరిదో నిర్ధారణ చేయడమే అసలు సమస్య అని చెబుతున్నారు.ఇందుకు నిధులతో పనిలేదని రాజకీయ నిబద్ధత, ప్రజల భాగస్వామ్యంతోపాటు రెవెన్యూ శాఖకు అవసరమైన సిబ్బంది కావాలని పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గుజరాత్లో ప్రైవేటు సంస్థలతో భూముల సర్వే నిర్వహించినా.. ఇప్పటికీ సెటిల్మెంట్ సమస్యతో ఇబ్బందులు వస్తున్నాయని వివరిస్తున్నారు. అలా సర్వే పూర్తయిన తర్వాత సమస్యలు రాకుండా తెలంగాణలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈటీఎస్ విధానంలో... భూముల సర్వే కోసం రాష్ట్రంలో గతంలో చైన్, క్రాస్ టాప్ పద్ధతులను అనుసరించేవారు. గొలుసు పద్ధతిలో సర్వే నిర్వహించడం చాలా కష్టమన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే కోసం ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. మండల సర్వేయర్లు, రెవెన్యూ శాఖ ఇదే పద్ధతిలో అవసరమైన చోట భూముల సర్వే చేస్తున్నారు.అయితే ప్రస్తుతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) అందుబాటులోకి వచ్చాయని.. అన్నింటికంటే ఉత్తమమైన డ్రోన్ సర్వే కూడా చేయవచ్చని.. వీటితో మైదాన ప్రాంతాల్లో 99.9 శాతం కచ్చితత్వంతో సర్వే చేయవచ్చని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అత్యాధునిక ‘రియల్‌టైమ్ కైనమాటిక్’ పద్ధతిలో లైడార్ స్కానింగ్, మొబైల్ మ్యాపింగ్‌ల ద్వారా డ్రోన్ ఆధారిత ఏరియల్ సర్వే ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అయితే రెవెన్యూ శాఖ చేసిన భూముల సర్వే ప్రతిపాదనపై ప్రభుత్వం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. ఎన్నో ప్రయోజనాలు.. కొన్ని సమస్యలు.. రాష్ట్రంలో భూముల సర్వేతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఎప్పుడో నిజాం కాలంలో భూముల సర్వే జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు రీసర్వే జరగలేదు. నాటి రికార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో భూముల సర్వే జరిగితే రికార్డులు మరింత పకడ్బందీగా రూపొందుతాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. భూముల సర్వేతో దాదాపు అన్ని రకాల భూవివాదాలకు చెక్ పడుతుందని, ప్రతి భూకమతం హద్దులు పక్కాగా తేలుతాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు కూడా పక్కగా గుర్తించవచ్చని అంటున్నారు.సర్వే ద్వారా వ్యక్తులు, సంస్థల మధ్య ఉండే భూవివాదాలే కాకుండా.. ప్రభుత్వ శాఖల మధ్య ఉండే భూవివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఏ సర్వే నంబర్లో ఎవరికి ఎంత భూమి ఉందనే అంశం కూడా వెల్లడవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన భూభారతి చట్టంలో కూడా భూముల రీసర్వేకు అవకాశం కల్పించడంతోపాటు ప్రతి భూకమతానికి పక్కాగా భూదార్ నంబర్ ఇచ్చేలా నిబంధనలు పొందుపరిచారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ‘‘తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రైతుల భూమి ఒక సర్వే నంబర్లో ఉంటే.. వారి రికార్డుల్లో మరో సర్వే నంబర్ నమోదైంది. ఇలాంటి సమస్యలకు కూడా భూముల సర్వేతో పరిష్కారం లభించే అవకాశం ఉంది..’’ అని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. సిబ్బంది కొరతతో ఇబ్బంది భూముల సర్వేలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది కొరత భూముల సర్వేకు విఘాతంగా మారుతుందని.. కొన్ని సందర్భాల్లో రైతుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నాయి. భూవిస్తీర్ణంలో తేడాలు, కబ్జాలోని తేడాలను రైతులు అంగీకరించే పరిస్థితి ఉండదని.. ఇలాంటి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపి, పక్కాగా లెక్కలు తేల్చగలిగితేనే భూముల సర్వే వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. -
భూముల లెక్కలు పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకు, భూవివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం విస్తృత స్థాయిలో భూముల సర్వే చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా రెవెన్యూ శాఖ పద్దుపై జరిగిన సమీక్ష సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు భూముల సర్వే ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు అనుమతివ్వాలని, నిధులు కేటాయిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 150 మండలాల్లోని ఒక్కో గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపడతామని కోరినట్టు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క... సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఆలోచన చేసినా.. రాష్ట్రంలో భూముల సర్వే చేపట్టాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఈ ప్రతిపాదన వచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో సర్వే కోసం నిధులు కేటాయించారు. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి. కానీ భూముల సర్వే ఆచరణలోకి రాలేదు. ఇటీవల భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల సర్వేకు మార్గం సుగమం అయినట్టేనని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు అవసరమైన నిధులు కోరామని, ప్రభుత్వం అంగీకరిస్తే భూముల పైలట్ సర్వే ప్రారంభం అమవుతుందని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. రూ.800 కోట్లపైనే అవసరం తెలంగాణలో భూముల సర్వే కోసం రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు అవసరమని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. గతంలో అంచనా వేసినప్పుడే రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసేందుకు రూ.560 కోట్లు కావాలని తేలిందని, ప్రస్తుతం అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో కచి్చతమైన సర్వే చేసేందుకు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే భూముల సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు చూపాల్సిన అవసరం లేదని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపి భూముల సర్వేకు సిద్ధమైతే కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులిస్తుందని చెబుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం... తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేను 3–6 నెలల్లో పూర్తి చేయవచ్చని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం భూముల సర్వే పెద్ద సమస్య కాబోదని భూచట్టాల నిపుణులు పేర్కొంటున్నారు. కానీ భూముల సర్వే తర్వాత సెటిల్మెంట్ అవసరమని, భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్శిల్ ఎవరిదో నిర్ధారణ చేయడమే అసలు సమస్య అని చెబుతున్నారు. ఇందుకు నిధులతో పనిలేదని రాజకీయ నిబద్ధత, ప్రజల భాగస్వామ్యంతోపాటు రెవెన్యూ శాఖకు అవసరమైన సిబ్బంది కావాలని పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గుజరాత్లో ప్రైవేటు సంస్థలతో భూముల సర్వే నిర్వహించినా.. ఇప్పటికీ సెటిల్మెంట్ సమస్యతో ఇబ్బందులు వస్తున్నాయని వివరిస్తున్నారు. అలా సర్వే పూర్తయిన తర్వాత సమస్యలు రాకుండా తెలంగాణలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈటీఎస్ విధానంలో... భూముల సర్వే కోసం రాష్ట్రంలో గతంలో చైన్, క్రాస్ టాప్ పద్ధతులను అనుసరించేవారు. గొలుసు పద్ధతిలో సర్వే నిర్వహించడం చాలా కష్టమన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే కోసం ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. మండల సర్వేయర్లు, రెవెన్యూ శాఖ ఇదే పద్ధతిలో అవసరమైన చోట భూముల సర్వే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) అందుబాటులోకి వచ్చాయని.. అన్నింటికంటే ఉత్తమమైన డ్రోన్ సర్వే కూడా చేయవచ్చని.. వీటితో మైదాన ప్రాంతాల్లో 99.9 శాతం కచి్చతత్వంతో సర్వే చేయవచ్చని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అత్యాధునిక ‘రియల్‌టైమ్ కైనమాటిక్’ పద్ధతిలో లైడార్ స్కానింగ్, మొబైల్ మ్యాపింగ్‌ల ద్వారా డ్రోన్ ఆధారిత ఏరియల్ సర్వే ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అయితే రెవెన్యూ శాఖ చేసిన భూముల సర్వే ప్రతిపాదనపై ప్రభుత్వం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. ఎన్నో ప్రయోజనాలు.. కొన్ని సమస్యలు.. రాష్ట్రంలో భూముల సర్వేతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఎప్పుడో నిజాం కాలంలో భూముల సర్వే జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు రీసర్వే జరగలేదు. నాటి రికార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో భూముల సర్వే జరిగితే రికార్డులు మరింత పకడ్బందీగా రూపొందుతాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. భూముల సర్వేతో దాదాపు అన్ని రకాల భూవివాదాలకు చెక్ పడుతుందని, ప్రతి భూకమతం హద్దులు పక్కాగా తేలుతాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు కూడా పక్కగా గుర్తించవచ్చని అంటున్నారు. సర్వే ద్వారా వ్యక్తులు, సంస్థల మధ్య ఉండే భూవివాదాలే కాకుండా.. ప్రభుత్వ శాఖల మధ్య ఉండే భూవివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఏ సర్వే నంబర్లో ఎవరికి ఎంత భూమి ఉందనే అంశం కూడా వెల్లడవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన భూభారతి చట్టంలో కూడా భూముల రీసర్వేకు అవకాశం కల్పించడంతోపాటు ప్రతి భూకమతానికి పక్కాగా భూదార్ నంబర్ ఇచ్చేలా నిబంధనలు పొందుపరిచారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ‘‘తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రైతుల భూమి ఒక సర్వే నంబర్లో ఉంటే.. వారి రికార్డుల్లో మరో సర్వే నంబర్ నమోదైంది. ఇలాంటి సమస్యలకు కూడా భూముల సర్వేతో పరిష్కారం లభించే అవకాశం ఉంది..’’ అని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. సిబ్బంది కొరతతో ఇబ్బంది భూముల సర్వేలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది కొరత భూముల సర్వేకు విఘాతంగా మారుతుందని.. కొన్ని సందర్భాల్లో రైతుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నాయి. భూవిస్తీర్ణంలో తేడాలు, కబ్జాలోని తేడాలను రైతులు అంగీకరించే పరిస్థితి ఉండదని.. ఇలాంటి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపి, పక్కాగా లెక్కలు తేల్చగలిగితేనే భూముల సర్వే వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. -
రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: ‘రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా 22 ఏ, భూ సర్వే, భూ రికార్డుల సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని వెంటనే పరిష్కరించేందుకు, భూములకు సంబంధించి రెవెన్యూ నిబంధనల సరళతరం కోసం పరిశ్రమలు, మునిసిపల్, ఆర్థిక, రెవెన్యూ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది’ అని మంత్రి పార్థసారథి తెలిపారు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించినట్లు తెలిపారు.రైతులకు తదుపరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా వాటాను చూశాక... రైతు భరోసాలో రాష్ట్రం వాటాపై ఆలోచన చేయాలని చర్చించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు ‘తల్లికి వందనం’ అమలు చేయాలని చర్చించినట్లు చెప్పారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏప్రిల్‌లో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి మెగా డీఎస్సీతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు రాజకీయ కమిటీని నియమించి కూటమి నేతలంతా జన సమీకరణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. విశాఖ పర్యటనలో ఎన్టీపీసీ ఇంటిగ్రేడెట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండ్రస్టియల్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు, రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ భవనాలకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.⇒ తిరుపతిలో 50 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని వంద పడకలకు అప్‌గ్రెడేషన్, 191 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం. ⇒ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచనల మేరకు రాజధానిలో మరో రూ.2,723.02 కోట్లతో రెండు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకు అనుమతి.⇒ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం. తద్వారా రాజధాని మాస్టర్ ప్లాన్‌తో పాటు జోనల్ డెవలప్మెంట్లో అవసరమైన మార్పులు.⇒ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 6.35 ఎకరాల్లో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ఆమోదం. ⇒ కడపలో టీడీపీ కార్యాలయానికి గత ప్రభుత్వం రద్దు చేసిన రెండు ఎకరాలను తిరిగి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం. ⇒ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబీపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో రిలయన్స్ లిమిటెడ్ నెలకొల్పే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వృథాగా ఉన్న ప్రభుత్వ భూమి అయితే ఎకరాకు ఏడాదికి 15 వేల చొప్పున, అదే రైతుల భూమి అయితే ఎకరాకు ఏడాదికి 30 వేల చొప్పున 15 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం.డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారులు ఉన్నచోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్ నిర్మించాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో మెట్రో ప్రాజెక్టుల నిధుల అంశంపై సీఎం ఎన్.చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.విశాఖలో మొదటి స్టేజ్‌లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించాలన్న మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలుక్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన ఖేల్‌రత్న అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో అభినందనలు తెలిపారు. -
రీసర్వే వద్దు..
సాక్షి, అమరావతి: భూముల రీసర్వే గురించి అబద్ధాలే సిగ్గుపడేలా దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ రీసర్వే ద్వారానే కేంద్రం నుంచి నిధులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారనే అక్కసుతో రీసర్వేను నిలిపివేసినా.. దాని ఫలాలు అందుకునేందుకు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భూముల రీసర్వే నిర్వహించాలని చెబుతున్న కేంద్రం... ఇప్పటికే వైఎస్ జగన్ హయాంలో సర్వే జరిగిన తీరును మెచ్చుకుని ఈ మోడల్‌ను అనుసరించాలని పలు రాష్ట్రాలకు సూచించింది. రీసర్వేను ప్రోత్సహించే క్రమంలో సర్వే చేసిన రాష్ట్రాలకు భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏపీలో రీసర్వే విజయవంతంగా జరగడంతో ఆ ప్రోత్సాహకాలను మొదట మన రాష్ట్రమే అందుకోనుంది. వైఎస్ జగన్ ముందుచూపు.. రూ.500 కోట్ల ప్రోత్సాహకంవైఎస్ జగన్ హయాంలో ఏపీలో 6,800 గ్రామాల్లో రీసర్వే పూర్తయిన నేపథ్యంలో రూ.500 కోట్ల ఇన్సెంటివ్ పొందేందుకు అర్హత సాధించినట్టు కేంద్రం ఇటీవల రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. గత నెల 17న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ కార్యదర్శి మనోజ్ జోషి రాష్ట్రంలో పర్యటించి భూముల రీసర్వే జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ప్రోత్సాహకాలు పొందేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. భూ రికార్డుల ఆధునికీకరణ, రీసర్వే చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే ఆ పనిని చాలావరకూ పూర్తి చేసిన ఏపీకి ఇన్సెంటివ్ మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. భూముల సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. రీసర్వేపై తప్పుడు ప్రచారం చేసి...రాష్ట్రంలో జరిగిన భూముల రీసర్వేపై తప్పుడు ముద్ర వేసి రద్దు చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. గత ప్రభుత్వ హయాంలో దిగ్విజయంగా జరిగిన సర్వేను అధికారంలోకి రాగానే నిలుపుదల చేశారు. రాజకీయ స్వార్థంతో ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఒక భూతంగా, భూముల రీసర్వేను దారుణమైనదిగా ప్రచారం చేసి చంద్రబాబు కూటమి లబ్ధి పొందింది. భూములు పోతాయని, లాగేసుకుంటారని భయపెట్టి ప్రజలకు, సమాజానికి ఎంతగానే మేలుచేసే కార్యక్రమంపై విషం కక్కారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేస్తుండటమే కాకుండా నాలుగున్నరేళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా జరిగిన భూముల రీ సర్వేను నిలిపివేశారు. కానీ.. ఇప్పుడు అవే కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో జరగాలనికేంద్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. రీసర్వే ప్రాజెక్టుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుండటంతో దాన్ని ఇప్పటికే చేసిన నేపథ్యంలో ఆ వివరాలు పంపి ప్రోత్సాహకాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. -
భూమి లేదు.. ఉన్నా హక్కుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల సమస్యలు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త చట్టాలను, విధానాలను రూపొందించుకోవడంతోపాటు కొన్నిరకాల సంస్కరణలు, మరికొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాలతో కూడిన నివేదికను అందజేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది.రాష్ట్రంలోని 56శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని కమిటీ తమ నివేదికలో తెలిపింది. భూములున్న రైతాంగం కూడా హక్కుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంది. రాష్ట్రంలోని 50శాతం మంది పట్టాదారులకు భూముల విషయంలో పలు సమస్యలు ఉన్నాయని.. వారికి సమగ్ర హక్కుల కల్పన ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సర్వే తర్వాత తెలంగాణలో సర్వేనే జరగలేదని, వెంటనే భూముల డిజిటల్ సర్వేకు పూనుకోవాలని సిఫార్సు చేసింది. కోర్టు కేసుల్లో భూములు నలిగిపోతున్నాయని, దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ హక్కుల కోసం తిరగాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 66శాతం సివిల్ కేసులే ఉన్నాయని.. ఇందులో భూవివాదాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక రెవెన్యూ కోర్టులను రద్దు చేసే నాటికి వాటిలో 25వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపింది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూముల విషయంలో వివాదాలు ఉన్నాయని.. అటవీ శాఖ చెప్తున్న దానికి, ధరణిలో నమోదు చేసిన భూములకు 23.72 లక్షల ఎకరాల తేడా ఉందని వెల్లడించింది. వక్ఫ్, దేవాదాయ భూముల వివరాల్లో కూడా పొంతన లేదని తెలిపింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. పహాణీలను డిజిటలైజ్ చేయాలని, గ్రామానికో రెవెన్యూ నిర్వాహకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అయితే, తమ సిఫారసులన్నీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదని.. అందుకే మూడు విభాగాల్లో ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. అందులో కొన్ని తక్షణమే చేపట్టాల్సి ఉండగా, మరికొన్ని స్వల్పకాలిక, ఇంకొన్ని దీర్ఘకాలిక వ్యూహాలు, ప్రణాళికలతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదికలో ధరణి కమిటీ స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలోని ముఖ్య సిఫారసులివీ.. గ్రామస్థాయిలోనే ల్యాండ్ గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలి. కమ్యూనిటీ పారాలీగల్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లు, ఐటీడీఏలు, సీసీఎల్ఏలో లీగల్ సెల్స్ ఏర్పాటు చేయాలి. ఆర్వోఆర్ కొత్త చట్టం తీసుకురావాలి. సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ నివాస ప్రాంతాల (ఆబాదీ)ను సర్వే చేయాలి. – రాష్ట్రంలోని అన్ని భూములను రీసర్వే చేసి శాశ్వత భూఆధార్ ఇవ్వాలి. టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలి. – అసైన్డ్ భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ మంజూరు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలి. సీలింగ్ భూములకు కూడా హక్కులివ్వాలి. – ఇనాం భూములకు ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) ఇవ్వాలి. ఆ ఓఆర్ఎసీ వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. – అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేపట్టాలి. అటవీ భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో మరోమారు నమోదు చేయాలి. – భూదాన బోర్డును ఏర్పాటు చేయాలి. భూదాన భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. దేవాదాయ, వక్ఫ్ భూములను కూడా ధరణిలో పొందుపర్చాలి. – నిషేధిత భూముల జాబితా (22ఏ)ను సవరించాలి. అప్డేట్ చేయాలి. భూసేకరణ జరిగిన భూములను పట్టాదారు ఖాతాల నుంచి తొలగించాలి. – రాష్ట్రంలోని అన్ని భూచట్టాల స్థానంలో రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం) అమల్లోకి తేవాలి. నల్సార్ న్యాయ వర్సిటీలోని ల్యాండ్ రైట్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయాలి. – భూసంస్కరణల విషయంలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉండేందుకు ‘ఇన్నోవేషన్స్ అండ్ లీగల్ సపోర్ట్ సెల్’ను ఏర్పాటు చేయాలి. – తహసీల్దార్ స్థాయిలో ల్యాండ్ సపోర్ట్ సెల్స్ ఏర్పాటు చేయాలి. గ్రామానికో భూమి నిర్వహణ అధికారిని నియమించాలి. – రెవెన్యూ సిబ్బంది సామర్థ్యాలు, పనితీరును మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం కోసం ల్యాండ్ అకాడమీని ఏర్పాటు చేయాలి. కొత్త ల్యాండ్ పాలసీ రూపొందించాలి. – కోనేరు రంగారావు, గిర్గ్లానీ కమిటీలతోపాటు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ’ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ రిపోర్టు తయారు చేయాలి. – ధరణి పోర్టల్‌ను ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలి. గతంలో జరిగిన ధరణి లావాదేవీలపై థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలి. – ధరణి పోర్టల్‌లో ఉన్న అన్ని మాడ్యూళ్ల స్థానంలో ఒక్కటే మాడ్యూల్ ఉంచాలి. పార్ట్–బీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సేత్వార్, ఖాస్రా, సెస్లా, పాత పహాణీలను డిజిటలైజ్ చేయాలి. -
మళ్లీ భూసర్వే.. పహాణీల నమోదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికా ర్డులను పారదర్శకంగా నిర్వహించడం కోసం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024’ పేరిట ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకు రానుంది. దీనికి సంబంధించి ముసాయిదా ప్రతిని ప్రజలకు అందుబాటులో ఉంచింది. అందులోని అంశాలపై ప్రజల నుంచి సల హాలు, సూచనలను ఆహ్వానించింది. దీనితో వేలాది మంది నుంచి స్పందన వస్తోంది. కానీ ఇందులో సలహాలు, సూచనల కన్నా సందేహాలే ఎక్కువగా ఉంటున్నాయని రెవెన్యూ వర్గాల సమాచారం. ముసాయిదాపై ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సందేహాలకు అధికారికంగా జవాబు ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ‘ఆర్వోఆర్–2024’ ముసాయిదా చట్టంలోని అంశాలపై ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న సందేహాలను ‘సాక్షి’ సేకరించింది. వాటిని భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డితోపాటు కొందరు రెవెన్యూ అధికారుల ముందుపెట్టి.. ఆయా సందేహాలకు సమాధానాలను రాబట్టింది. ఆ సందేహాలు, సమాధానాలు ఇవీ..సందేహం: కొత్త ఆర్వోఆర్ చట్టం తేవాల్సిన అవసరమేంటి?సమాధానం: ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం లోపభూయిష్టంగా ఉంది. చాలా సమస్యలకు అందులో పరిష్కారం లేదు. సాదాబైనామాల పరిష్కార నిబంధన లేదు. అప్పీలు వ్యవస్థ లేదు. రికార్డులో ఏ సమస్య వచ్చినా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. ధరణి పోర్టల్‌లో సవరణలు చేసే అధికారాన్ని కూడా ఆ చట్టం ఎవరికీ కల్పించలేదు. ధరణి సవరణలకు చట్టబద్ధత కావాలంటే చట్టం మారాల్సిందే.ధరణి సమస్యలను ఈ చట్టం ఎలా పరిష్కరిస్తుంది?– ధరణి పోర్టల్‌లో చేర్చకుండా పార్ట్–బి పేరిట పక్కన పెట్టిన భూములను రికార్డుల్లోకి ఎక్కించడానికి కొత్త చట్టంలో నిబంధన ఉంది. దాదాపు 18లక్షల ఎకరాల భూమికి ఈ చట్టం ద్వారా మోక్షం కలుగుతుంది. ధరణిలో చేర్చిన తర్వాత నమోదైన తప్పుల సవరణకు కూడా చట్టబద్ధత ఏర్పడుతుంది.రైతుల వద్ద ఉన్న పాస్‌బుక్‌లు రద్దవుతాయా?– రద్దు కావు. ప్రస్తుతమున్న ధరణి రికార్డు కొనసాగుతుంది. కానీ తప్పొప్పులను సవరించవచ్చు. భవిష్యత్తులో ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టి, కొత్త రికార్డు తయారు చేయాలనుకుంటే మాత్రం కొత్త రికార్డుతోపాటు కొత్త పాస్‌బుక్‌లు వస్తాయి. ముసాయిదా చట్టంలో ఈ మేరకు నిబంధన ఉంది.ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ వస్తుందా?– ధరణి పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ వస్తుంది. అయితే భూమాత అనే పేరు ఏదీ ముసాయిదా చట్టంలో లేదు. ధరణి అనేది ఆర్వోఆర్ రికార్డు నిర్వహించే పోర్టల్. ఈ పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ వస్తుంది. దానికి ప్రభుత్వం ఇష్ట్రపకారం ఏ పేరైనా పెట్టవచ్చు.ఇప్పుడు జరుగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులొస్తాయి?– స్లాట్ బుకింగ్ కొనసాగుతుంది. కానీ రిజిస్ట్రేషన్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులుంటాయి.ఆటోమేటిక్ మ్యుటేషన్ రద్దు అవుతుందా?– పాత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగితే ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరిగిపోతుంది. కొత్త చట్టం ముసాయిదా ప్రకారం ఈ మ్యుటేషన్ ఆగిపోదు. కానీ సరైన కారణాలుంటే మ్యుటేషన్ నిలిపేయవచ్చు. డబుల్ రిజిస్ట్రేషన్లకు, మోసపు లావాదేవీలకు ఈ నిబంధనతో చెక్ పడుతుంది. వారసత్వం, భాగం పంపకాలు, కోర్టు కేసులు, ఇతర మార్గాల్లో వచ్చే భూములపైనా విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు.ఈ చట్టం అమల్లోకి వస్తే భూముల సర్వే మళ్లీ నిర్వహిస్తారా?– భూములను మళ్లీ సర్వే చేయాలనే చట్టం చెబుతోంది. ముసాయిదా చట్టం ప్రకారం భూఆధార్ కార్డు జారీ చేయాలంటే సర్వే చేయాల్సిందే. తాత్కాలిక భూఆధార్ ఇవ్వాలన్నా రికార్డుల ప్రక్షాళన చేయాల్సిందే. భూఆధార్ కార్డు ఇవ్వాలా, వద్దా అన్నది ప్రభుత్వ అభీష్టం. ఈ మేరకు చట్టంలోని నిబంధనల్లో వెసులుబాటు ఉంది.ఈ చట్టం వస్తే మళ్లీ పహాణీ రాస్తారా?– పహాణీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్న నిబంధన 1971 చట్టంలో ఉంది. కానీ 2020లో తొలగించారు. మళ్లీ ఇప్పుడు అప్డేట్ చేసే నిబంధన పెట్టారు. ముసాయిదాలోని సెక్షన్ 13 దీని గురించే చెబుతోంది.ఈ చట్టంతో అసైన్డ్ భూములకు హక్కులు వస్తాయా?– ఆర్వోఆర్ చట్టం అన్ని సమస్యలకు పరిష్కారం చూపదు. అసైన్డ్ భూములకు పట్టా హక్కు కావాలంటే మారాల్సింది ఆర్వోఆర్ చట్టం కాదు.. పీవోటీ చట్టం. కాబట్టి ఈ చట్టం ద్వారా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు రావు.కౌలు రైతుల పేర్లు నమోదు చేస్తారా?– కౌలుదారుల నమోదు ప్రక్రియ కూడా ఆర్వోఆర్ చట్టం పరిధిలోకి రాదు. కౌలుదార్ల చట్టం–1950, రుణ అర్హత కార్డుల చట్టం– 2011 ప్రకారం కౌలుదారుల నమోదు జరుగుతుంది. ఆ చట్టాల పరిధిలో కౌలుదారుల గుర్తింపు జరుగుతుంది.ఈ చట్టం ప్రకారం కాస్తు కాలం నమోదు ఉంటుందా?– 1996లో గ్రామ రెవెన్యూ లెక్కల నిర్వహణ గురించి ప్రత్యేక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం పహాణీల నిర్వహణ ఉంటుంది. ఆర్వోఆర్ చట్టం పరిధిలోకి ఈ అంశం రాదు. కాస్తు కాలం ఉంచాలా, వద్దా అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.ఈ చట్టం ద్వారా టైటిల్ గ్యారంటీ ఇస్తారా?– కొత్త చట్టానికి ల్యాండ్ టైటిల్‌కు సంబంధం లేదు. ఈ చట్టం హక్కులకు స్పష్టత మాత్రమే ఇస్తుంది. టైటిల్ గ్యారంటీ ఇచ్చేది వేరే చట్టం.మ్యుటేషన్ సమయంలో మ్యాప్ కావాలన్న నిబంధన రైతులను ఇబ్బంది పెట్టేది కాదా?– ఆర్వోఆర్ చట్టంలోని అన్ని నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చేవి కాదు. కొన్ని వెంటనే అమల్లోకి వస్తే.. మరికొన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొందుపర్చినవి. ఈ మ్యాప్ నిబంధనను అమలు విషయంలో ప్రభుత్వానికి సమయం ఉంటుంది. వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటైన తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. ఒకవేళ మ్యాప్ నిబంధన అమల్లోకి రావాలంటే సర్వేయర్ల వ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉంటుంది.(సాదాబైనామాలు, భూఆధార్కార్డులు, కోర్టులు, అప్పీళ్లు, ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం రేపటి సంచికలో..) -
సంగారెడ్డి పెద్దపూర్‌లో టెన్షన్.. టెన్షన్
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం అధికారులు భూ సేకరణ సర్వే చేస్తున్నారు. రైతులు సర్వేను ఆడుకున్నారు. సర్వేను అడ్డు కోవడంతో అక్కడి ఉదిక్తత వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. భూ సర్వే ఆడుకున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి. డీసీఎంలో తరలించారు. రెండ్రోజుల క్రితం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) కోసం ప్రజాభిప్రాయ సేకరణలోను భూములు ఇవ్వబోమని రైతుల ఆందోళన చేశారు. -
భూముల సర్వేకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములను సర్వే చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, సర్వేకు సంబంధించిన ప్ర తిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆ దేశించారు. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భూముల సర్వేలను పరిశీలించండి. అత్యాధునిక పరిజ్ఞానంతో సర్వే ఎలా చేయాలన్న దాని పై నివేదిక తయారు చేయండి’అని నిర్దేశించా రు. బుధవారం సచివాలయంలో భూపరిపాల న, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. భూపరిపాలన, సర్వే విభాగాల అధికారులతో సమీక్ష సందర్భంగా భూముల సర్వే అంశం చర్చకొచ్చింది. ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలు జరుగుతున్నాయని, ఏపీలో జరుగుతున్న సర్వే మోడల్ సర్వేగా ఉపయోగపడుతుందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన పొంగులేటి.. ఏపీలో ఏం జరుగుతోందో పరిశీలించడంతోపాటు మంచి, చెడులను విశ్లేషిస్తూ సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు. భూముల క్రమబద్దీకరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రెవెన్యూ రికార్డుల్లో దాపరికం ఉండకూడదని చెప్పారు. వీఆర్ఏలకు త్వరలోనే ఐడీ కార్డులు, వేతనాలివ్వాలని, ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షల్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీసీఎల్ఏ, సర్వే–ల్యాండ్ సెటిల్మెంట్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయమెందుకు తగ్గింది? రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ వృద్ధి గతంతో పోలిస్తే సహేతుకంగా లేదని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. దీనికి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పందిస్తూ గతంలో పంచాయతీల లేఅవుట్లను కూడా రిజిస్ట్రేషన్ చేసేవారమని, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో అవి పెండింగ్‌లో పడ్డాయని చెప్పారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు తెచ్చిన సవరణలు ఇబ్బందికరంగా మారాయని, ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు . దీనిపై స్పందించిన పొంగులేటి.. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతోనూ తాను మాట్లాడతానని, సుప్రీం తీర్పు ఉల్లంఘన జరగకుండా ఎల్ఆర్ఎస్ విషయంలో ఏం చేయాలో నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌తో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. -
ల్యాండ్ రీసర్వేపై అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రసంగం..
-
‘రికార్డు’ సంస్కరణలు ప్రజలకు చెబుదాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెవిన్యూ శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేటేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలను క్షుణ్నంగా వివరిస్తూ ప్రజల్లోకి విస్తృత సమాచారాన్ని పంపాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు తీరుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలపై కూడా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ ద్రుష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు రాతలు రాస్తోందని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేకనే వక్రీకరణలకు పాల్పడుతున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఆయా మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉండగా మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కీలక సంస్కరణలు చేపట్టి రిజిస్ట్రేటేషన్ల వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాల వద్దకే తెస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేటేషన్ చేయించుకునేవారు ఇంటి నుంచే ఆ పనిని చేయించుకునేలా సాంకేతికతను తెస్తున్నామన్నారు. ఇన్ని సౌలభ్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే కొందరు తప్పుడు రాతలు, వక్రీకరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని దిశా నిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి అంతా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. 95 శాతం డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జరుగుతున్న సమగ్ర సర్వే ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. 13,460 గ్రామాలకు గానూ 12,836 గ్రామాల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లయింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా పనిని అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామన్నారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ పూర్తైనట్లు చెప్పారు.60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలను (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) జిల్లాలకు పంపే పని పూర్తి చేయాల్సి ఉందన్నారు. సర్వేలో 3,240 రోవర్లను వినియోగించామని, గతం కంటే 1,620 అదనంగా పెరిగినట్లు చెప్పారు. తొలి విడతగా చేపట్టిన 2 వేల గ్రామాల్లో అన్ని రకాలుగా సర్వే పూర్తయిందని వివరించారు. మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్ డివిజన్లు, 19 వేల సరిహద్దుల సమస్యల పరిష్కారం,సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూహక్కు పత్రాల పంపిణీ పూర్తైనట్లు వెల్లడించారు. ఫేజ్ 2లో మరో 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండో దఫా సర్వే గ్రామాల్లో అక్టోబరు 15 నాటికి రిజిస్ట్రేటేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో.. మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని కూడా అధికారులు నివేదించారు. ఇప్పటికే 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్ పూర్తైందని, 66 మున్సిపాలిటీల్లో ఓఆర్ఐ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. ఫేజ్ 2 సర్వే పూర్తైన చోట రిజిస్ట్రేటేషన్ సేవలకు సిద్ధం కావాలి మొదటి దశ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయడంతోపాటు ఫేజ్ 2 సమగ్ర సర్వే పూర్తైన గ్రామాల్లో కూడా రిజిస్ట్రేటేషన్ సేవలను అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేటేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థను గ్రామాల్లోకే తెచ్చామన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండల స్థాయిలో మొబైల్ కోర్టులు సేవలందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
1,650 జనాభా ఉన్న గ్రామంలోనే 270 మందికి పింఛన్లా!
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం 1,650 మంది (448 ఇళ్లు) జనాభా ఉన్న గుంటూరు జిల్లా చింతలపూడిలో 252 మందికి నెలనెలా పింఛన్లు ఇస్తోందని అధికారులు తెలపడంతో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్‌కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ఆయన ప్రశంసించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల సమీక్షతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. తాడేపల్లిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలును స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వే, స్వమిత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల పరిధిలోని ఉండే ఇళ్లకు సంబంధించి యాజమాన్య హక్కుపత్రాలు ఇచ్చే ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన 15వ ఆర్థికసంఘం నిధుల వినియోగంపై ఆరా తీశారు. పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టిన అనంతరం ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో ఇంకా రూ.3.89 లక్షలు ఆర్థికసంఘ నిధులు మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులను కేవలం సీసీ రోడ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు పెట్టాలని చంద్రశేఖర్‌కుమార్ సూచించారు. పంచాయతీపై భారం లేకుండా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని అధికారులు ఆయనకు వివరించారు. గ్రామంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి తెలిపిందని చెప్పారు. డిజిటల్ ల్రైబరీల ఏర్పాటు ద్వారా గ్రామంలోని పేద విద్యార్థులు, నిరుద్యోగులు సైతం ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర పోటీపరీక్షలకు సమర్థంగా ప్రిపేరయ్యే అవకాశం ఉంటుందని ఆయన మెచ్చుకున్నారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో పర్యటించి అక్కడ అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి, అదనపు కమిషనర్ సుధాకర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, గుంటూరు జెడ్పీ సీఈవో మోహనరావు, డీపీవో కేశవరెడ్డి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లానాయక్, దుగ్గిరాల తహశీల్దార్ మల్లేశ్వరి, చింతలపూడి సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు. -
పట్టణ ప్రాంతాల్లోనూ వేగంగా భూ సర్వే
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూముల సర్వే జోరుగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల్లో కూడా వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో 15 లక్షల ఎకరాలను సర్వే చేయాల్సి ఉందని సబ్ కమిటీ పేర్కొంది పట్టణ ప్రాంతాల్లో 5.5 లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి కాగా మిగిలిన 9.44 లక్షల ఎకరాలు పట్టణ ప్రాంతంగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి 38.19 లక్షల ఆస్తుల సర్వేను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం అమలుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమీక్షించింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో 2 వేల గ్రామాల్లో మే 20వ తేదీలోగా సర్వే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ స్పష్టం చేసింది. డ్రోన్ సర్వే, మ్యాపింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, రికార్డుల వివాదాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటివరకు సిద్ధమైన 1,94,571 భూహక్కు పత్రాలను ఈ కేవైసీ ద్వారా వివాదాలకు తావు లేకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ యజమానుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి ఈ నెలాఖరు నాటికి 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి కానుంది. 7,158 గ్రామాల్లో డ్రోన్ ఫొటోలు తీసుకుని 3,758 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 2,611 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, 2,391 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన ముగిసిందని చెప్పారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా ముందుగానే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నామని, 4 లక్షలకు పైగా రికార్డులకు మ్యుటేషన్ అవసరమని గుర్తించినట్లు వెల్లడించారు. జూన్ నాటికి రాష్ట్రంలో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. 25.8 లక్షల సర్వే రాళ్లు సర్వే పూర్తయిన గ్రామాల కోసం 25.8 లక్షల సర్వే రాళ్లు సిద్ధంగా ఉన్నట్లు మైనింగ్ అధికారులు తెలిపారు. 18.9 లక్షల సర్వే రాళ్లను ఇప్పటికే సరఫరా చేయగా మరో 12.3 లక్షల రాళ్లు ఆయా గ్రామాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రోజుకు 50 వేల సర్వే రాళ్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సర్వే ముగిసిన గ్రామాల్లో రాళ్లను పాతే ప్రక్రియ మే 20వ తేదీలోగా పూర్తవుతుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 30.11 లక్షల ఆస్తులను వెరిఫై చేశామని, అందులో 36.32 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు పురపాలక శాఖ అధికారులు పేర్కొన్నారు. సర్వే కోసం మాస్టర్ ట్రైనర్ల ద్వారా అన్ని జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. సమావేశంలో సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్, ఎంఏయూడీ కమిషనర్ కోటేశ్వరరావు, డీఎంజీ వి.జి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
West Godavari: 5.50 లక్షల ఎకరాల భూమి రీ సర్వే
ఆకివీడు(ప.గో. జిల్లా): జగనన్న సంపూర్ణ భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో రీ సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. మండలంలోని చినమిల్లిపాడు శివారు కొత్త చెరువు ప్రాంతంలో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్(సర్వే రాయి)ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపూర్ణ భూహక్కు రీ సర్వే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పారు. సరిహద్దు వివాదాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ముందుగా రీ సర్వే పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఆకివీడు, కాళ్ల మండలాల్లో డ్రోన్ సర్వేను వేగవంతం చేయాలన్నారు. ముందుగా ఆకివీడు మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల జిల్లా అధికారి కె.జాషువాను ఆదేశించారు. ఆకివీడు మండలంలో 15 గ్రామాల్లో 2,9971.29 ఎకరాల భూమి రీ సర్వే చేయాల్సి ఉందని, దానిలో ఇంతవరకూ మూడు గ్రామాల్లో 492.46 ఎకరాల భూమి రీ సర్వే చేయించామని కలెక్టర్ చెప్పారు. కాళ్ల మండలంలో 13 గ్రామాల్లో 3,6561.69 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉండగా 2 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందన్నారు. గ్రామాల్లో సర్వే చేస్తున్న సమయానికి ముందుగా గ్రామస్తులందరికీ సర్వే గురించి తెలియజేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు. పీహెచ్సీ వైద్యులపై ఆగ్రహం మండలంలోని పెదకాపవరం గ్రామంలో పీహెచ్‌సీని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ సెలవులో ఉండటం, ఇన్చార్జి డాక్టర్ విధులకు రాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు డాక్టర్లు సెలవులో ఉంటే ఓపీ ఎవరు చూస్తారని ప్రశ్నించారు. ప్రతీ రోజూ రోగులు ఎంత మంది వస్తున్నారు, డెలివరీ కేసులు ఎన్ని వస్తున్నాయి, వాటిలో ఫ్రీ డెలివరీ కేసులెన్ని అని సిబ్బందిని ప్రశ్నించారు. ఫ్యామిలీ డాక్టర్ సేవల్ని గ్రామాల్లో విస్తరింపజేయాలని కలెక్టర్ హెచ్చరించారు. తొలుత గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు–నేడు పనుల్ని పరిశీలించారు. ఫేస్–2లో పాఠశాలలో జరగుతున్న పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. స్కూల్లోని ల్యాబ్‌ను పరిశీలించి, ఇటీవల పంపిణీ చేసిన ట్యాబ్‌లను ఏవిధంగా ఉపయోగిస్తున్నారని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కఠారి జయలక్ష్మీ, సర్పంచ్‌లు ఊసల బేబీ స్నేతు, ఎన్.రామరాజు, డీఈఓ వెంకటరమణ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీకర్, ఎంఈఓ రవీంద్ర, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విశాఖ ఆకస్మిక సర్వే.. ఓ తప్పుడు కథనం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తీరును, నేతలను బద్నాం చేసేలా యెల్లో మీడియా వరుసగా అసత్య కథనాలతో వక్రబుద్ధి ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా విశాఖ అటవీ భూముల్లో ఆకస్మిక సర్వే పేరుతో ఓ కథనం ప్రచురించింది ఈనాడు. అయితే.. సదరు కథనం పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్ పేరు మీద ఒక ప్రకటన విడుదల అయ్యింది. సదరు సర్వే.. అదొక సాధారణ స్పందన అర్జీలో భాగమని ప్రకటించారు. నవంబర్ 26వ తేదీన ఈ సర్వే జరిగిందని, ఇందుకుగానూ నోటీసులు 12 రోజుల ముందే అందించామని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారు, డివిజనల్ ఫారెస్ట్ అధికారికి నోటీసులు అందించి.. నోటీసుల ప్రకారం ఈ తేదీనే TS.NO:88/B1, B2, B3 భూమిని సర్వే చేసినట్లు వెల్లడించారు. శీరంవహిత ఫర్మా ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను జత చేసి సర్వే చేయాలని స్పందన ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారని అధికారులు వెల్లడించారు. అంతేగానీ.. కడప ప్రాంతానికి చెందిన నేత ప్రమేయం ఉందంటూ ఈనాడులో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్ కార్యాలయం తరపున ఒక ప్రకటన వెలువడింది. ఇదీ చదవండి: ‘రాజధాని అంటే జేబులు నింపుకోవడం కాదు’ -
16 గ్రామాల్లో రీ సర్వే పూర్తి.. రైతులకు పత్రాల పంపిణీ!
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంలో భాగంగా భూముల రీ సర్వేను మూడు ఫేజ్‌ల్లో చేపట్టగా ఫేజ్ 1లో 98 గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. అందులో పైలెట్ ప్రాజెక్టుగా 16 మండలాల్లోని 16 గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో ఉండే వ్యవసాయ, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల ను రీ సర్వే చేసి నూతన రికార్డుల్లో పొందుపరిచారు. సర్వే పూర్తి చేసిన గ్రామాలకు సంబంధించి రైతులకు జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పత్రాలను అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి 23న ప్రారంభించారు. అందులో భాగంగా జిల్లాలో సర్వేపూర్తి చేసిన 16 గ్రామాలల్లో కూడా భూ పత్రాల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పత్రాల్ని అందిస్తారు. 16 గ్రామాలకు కలిపి మొత్తం 6,187 మంది రైతుల 5,656 పత్రాలు పంపిణీ చేస్తారు. 98 ఏళ్ల తర్వాత రీ సర్వే 98 ఏళ్ల క్రితం నాటి బ్రిటిష్ పాలకులు భూముల సర్వే చేసి వ్యవసాయ, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములుగా విభజించి వాటిని రికార్డుల్లో ఎక్కించారు. అప్పటి నుంచి భూముల రీ సర్వే చేయలేదు. ఏళ్ల తరబడి ఉన్న రికార్డులు పాడువడం, భూముల మాయం, కచ్చితమై విస్తీర్ణం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి భూముల రీ సర్వే కోసం ప్రత్యేకమైన పథకం ప్రవేశపెట్టి ఉచితంగా రీ సర్వే చేయిస్తున్నారు. భూముల సర్వే చేయించి కొలతల ప్రకారం భూమి చుట్టూ సర్వే రాళ్లు వేయిస్తున్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో వెంటనే భూ హక్కు, రక్షణ పత్రాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అధునిక పరికరాలతో రీ సర్వే భూముల రీ సర్వే కోసం అధికారులు అధునిక పరికరాలను ఉపయోగించి సర్వే పనులు చేస్తున్నారు. మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్, ఇతర సిబ్బంది కలిసి ఒక టీంగా ఏర్పడి సర్వే చేసి వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. భూముల రీసర్వే పనులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ల్యాండ్ అండ్ సర్వే శాఖ జిల్లా అధికారి పర్యవేక్షిస్తున్నారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న సర్వే పనులు ఎప్పటికప్పుడు పరిశీలిన చేసి సర్వేపై సూచనలు, సలహాలు ఇస్తు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం గ్రామాల్లోని వ్యవసాయ, గ్రామ కంఠం, ప్రైవేట్ భూములను ఉచితంగా రీ సర్వే చేసి, కచ్చితమైన విస్తరణతో భూములను చూపించి వాటికి సంబంధించి భూహక్కు, రక్షణ పత్రాలను అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూముల రీ సర్వే ద్వారా భూ సమస్యలు, గొడవలకు చెక్ పెట్టేలా సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఈ పథకం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. 16 గ్రామాల రైతులకు పత్రాల పంపిణీ రీసర్వేకు సంబంధించి ఫేజ్ 1లో 98 గ్రామాల్లో పనులు చేపట్టాం. పైలెట్ ప్రాజెక్టుగా 16 గ్రామాల్లో పూర్తి చేశాం. ఈ గ్రామాలకు సంబంధించి 6,187 రైతులకు 5,656 జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టాం. భూహక్కు రక్షణ పత్రాలు అందుకున్న రైతులు వాటిలో తప్పులుంటే మండలంలో మొబైల్ మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకుంటే సమస్య పరిష్కరిస్తాం. మిగిలిన గ్రామాల్లో సర్వే పనులు వేగంగా చేయించి మూడు ఫేజ్‌ల్లో భూముల రీ సర్వే పనులు పూర్తి చేస్తాం. – పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్ -
చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: భూ సర్వే చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప మనసుతో భూ సర్వేకి శ్రీకారం చుట్టారని చెప్పారు. దేశంలో ఇది ఒక ఆదర్శమైన నిర్ణయమని పేర్కొన్నారు. వందేళ్ల క్రితం భూ సర్వే జరిగింది. 14 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడు భూ సర్వే నిర్వహించలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు, కొన్నిమీడియా సంస్థలు కలిసి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కలలు కన్నా మళ్లీ సీఎం కావడం జరగదన్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చదవండి: (CM Jagan: జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్) -
మరింత జాగ్రత్తగా రికార్డుల అప్డేట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూముల రీసర్వే చురుగ్గా సాగుతోంది. ప్రతిదశలోను రైతులు, భూయజమానులకు భాగస్వామ్యం కల్పిస్తూ పారదర్శకంగా అమలవుతోంది. రీసర్వే ద్వారా రికార్డులు అప్డేట్ చేసే ప్రక్రియ మరింత జాగ్రత్తగా అమలయ్యేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. రీసర్వే పూర్తయి తుది నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత కూడా రైతులు, భూయజమానులు రికార్డుల్లో తమ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు, సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. దీన్ని వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. రీసర్వేలో భూయజమానుల భాగస్వామ్యం ఉండేలా రూపొందిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) ప్రకారం ప్రతిదశను పటిష్టంగా అమలు చేస్తున్నారు. రీసర్వే జరిగినప్పుడు వివిధ కారణాల వల్ల అందులో పాల్గొనని భూయజమానులు సర్వే పూర్తయ్యాక ఆర్వోఆర్ ప్రక్రియలో తమ రికార్డులను అప్డేట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఏపీ సర్వే అండ్ బౌండరీ యాక్టు ప్రకారం సర్వే ముగిశాక అప్పీల్‌కు గడువు పూర్తయినా రైతులు, భూయజమానులు అప్పీల్ చేస్తే వాటిని స్వీకరించి విచారిస్తున్నారు. ఒకవేళ వారు సర్వే సమయంలో గ్రామంలో లేకపోతే వీడియో కాన్ఫరెన్స్, వాట్సాప్ వీడియోకాల్, జూమ్ వీడియోకాల్ వంటివాటి ద్వారా వారి స్టేట్మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంది. విచారణ సమయంలో మొబైల్ మేజిస్ట్రేట్లు ఈ స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం నిర్దేశించింది. సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత తమ హద్దులపై సంతృప్తి చెందకపోతే భూయజమానులు మధ్యవర్తిత్వం కోరే అవకాశం ఉంది. గ్రామసభలో తుది ఆర్వోఆర్ ప్రచురించిన తర్వాత కూడా ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ చట్టం ప్రకారం రికార్డుల్లో నమోదైన వివరాలను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ ప్రచురించిన ఒక సంవత్సరం తర్వాత దిద్దుబాటు కోసం తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. తహశీల్దార్ ఇచ్చే ఆర్డర్‌పై 90 రోజుల్లో ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చు. మరింత పక్కాగా అమలు చేయాలని సీసీఎల్ఏ సర్క్యులర్ రీసర్వేలో ప్రతిదశలోను రైతులు, భూయజమానుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండలా చూడాలనే మార్గదర్శకాలతో భూపరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సర్క్యులర్ జారీచేశారు. ప్రతిదశలో రైతులు, భూస్వాములు వారి అవకాశాలను వినియోగించుకునేలా చేయాలని సూచించారు. ఈ అవకాశాల గురించి అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించారు. సర్వే ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను కూడా ప్రత్యేక ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేలా చూడాలని సూచించారు. సర్వే జరుగుతున్న గ్రామాల్లో నెలలో 15 రోజులు మొబైల్ మేజిస్ట్రేట్లు పర్యటించి పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ చేసేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇలా వచ్చే వినతులను గ్రామాల వారీగా జాబితాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలు ఈ దరఖాస్తులు నిర్దిష్ట గడువులోపు పరిష్కారమవుతున్నాయో లేదో పరిశీలిస్తాయని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం, ఆర్డీవోకి అప్పీలు వంటి వాటికోసం ప్రత్యేక ఐటీ అప్లికేషన్లు తీసుకురానున్నట్లు సర్క్యులర్‌లో తెలిపారు. -
ముమ్మరంగా డీజీపీఎస్ సర్వే
సాక్షి, అమరావతి: జీపీఆర్ఎస్ సిగ్నల్స్ అందని ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా భూములు రీ సర్వే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) చేపట్టిన సర్వే విజయవంతమైంది. ఆరు గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ప్రైవేట్ ఏజెన్సీలు డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్నాయి. త్వరలో నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సర్వే చేపట్టనున్నారు. కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో... ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా శాటిలైట్ల నుంచి వచ్చే జీపీఆర్ఎస్ సిగ్నల్స్ ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. కానీ కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ ద్వారా పనిచేసే రోవర్లు సరిగా పనిచేయడంలేదు. దీంతో ఇటువంటి ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 2,800 గ్రామాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను డీజీపీఎస్ ద్వారా సర్వే చేయనున్నారు. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య ఎక్కువగా ఉండడంతో అక్కడే ఎక్కువ దృష్టి పెట్టారు. మొత్తం 2,800 గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి డీజీపీఎస్ సర్వేకు టెండర్లు పిలిచారు. తొలి ప్యాకేజీని గతంలోనే ఖరారు చేసి ఐదు ఏజెన్సీలకు పనులు అప్పగించడంతో సర్వే ముమ్మరంగా సాగుతోంది. మిగిలిన మూడు ప్యాకేజీల టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. త్వరలో అక్కడ కూడా సర్వే ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పట్టణ సర్వే సిబ్బందికి మరో దఫా శిక్షణ
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ఆస్తుల సమగ్ర సర్వే కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చిన మునిసిపల్ అధికారులు నవంబర్ 1 నుంచి సర్వే చేపట్టాలని భావించారు. సర్వే విధానంపై సిబ్బందికి గల అనుమానాలను నివృత్తి చేసేందుకు మంగళవారం 400 మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి యూఎల్బీ నుంచి ముగ్గురు చొప్పున రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి సిబ్బంది హాజరు కానున్నారు. సర్వే పనుల కోసం వివిధ విభాగాల అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేయడంతోపాటు, ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సైతం పీఎంయూలను ఏర్పాటు చేయడంతో పాటు పరిపాలనాధికారిని కూడా నియమించారు. మంగళవారం జరిగే శిక్షణలో పీఎంయూ అధికారితో పాటు వార్డు పరిపాలనా కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరా లతో కూడిన హక్కుపత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. మొత్తం 123 యూఎల్బీల్లోను 38 లక్షల ఆస్తులు ఉన్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన సర్వేలో ప్రతి వార్డు నుంచి ఆరుగురు సిబ్బంది చొప్పున మొత్తం 20 వేలమంది పాలుపంచుకునేలా చర్యలు తీసుకున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్న అధికారులు మ్యాపింగ్, రికార్డుల పరిశీలనలో తలెత్తే సమస్యలపై వివరించనున్నారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా వివిధ స్థాయిల్లో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు ఇతర మునిసిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. ఈసారి వారికి రికార్డుల ప్రకారం ఆస్తుల గుర్తింపు, మునిసిపాలిటీ పరిధి మ్యాపింగ్‌తో పాటు, ప్రతి వార్డు మ్యాప్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, ఆర్ఎస్ఆర్, టీఎస్ఆర్, కేఎంఎల్ ఫైల్స్ పరిశీలనపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. విలీనమైన వాటిలో 648 రెవెన్యూ గ్రామాలున్నాయి. పకడ్బందీగా సర్వే చేపట్టాలని నిర్ణయించామని పట్టణ ఆస్తుల సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. -
సర్వే ఉద్యోగులకు సర్కారు కానుక
సాక్షి, అమరావతి: సర్వే ఉద్యోగుల దశాబ్దాల కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపింది. సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖను దశాబ్దాల తర్వాత పునర్వ్యస్థీకరించింది. అందుకనుగుణంగా రాష్ట్రంలోని 101 మంది మండల సర్వేయర్లకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేగా పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ ఉత్తర్వులిచ్చారు. నిజానికి.. సర్వే శాఖలో సర్వేయర్‌గా చేరితే మళ్లీ సర్వేయరుగానే పదవీ విరమణ చేయాలి. ఆ శాఖ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు పదోన్నతులు లేకపోవడమే ఇందుకు కారణం. 1971లో సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగింది. భూరికార్డుల నిర్వహణ, సరిహద్దు తగాదాల పరిష్కారం, భూసేకరణ కోసం తహసీల్దార్ కార్యాలయాలకు ఒక సర్వేయర్ చొప్పున కేటాయించారు. అప్పటినుండి భూ యాజమానుల అవసరాలు, ప్రభుత్వ భూ పంపిణీ, ప్రాజెక్టులకు భూసేకరణ, ఇళ్ల పట్టాల సర్వే, పారిశ్రామికీకరణకు భూముల సర్వే, రోడ్ల అభివృద్ధి వంటి అన్ని కార్యక్రమాలు ఎన్నో రెట్లు పెరిగినా సర్వేయర్ల సంఖ్య మాత్రం పెరగలేదు. కనీసం 2 వేల మంది సర్వేయర్లను అదనంగా ఇవ్వాలని గత ప్రభుత్వాలను ఎన్నోసార్లు ఆ శాఖ ఉద్యోగులు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడగకుండానే సర్వే అవసరాలు, రీ సర్వే కోసం కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ పోస్టులు సృష్టించి నియమించారు. సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 410 కొత్త ఉద్యోగాలు మంజూరు చేశారు. దీనివల్ల 410 కొత్త ఉద్యోగాలే కాకుండా వివిధ స్థాయిల్లో 620 మందికి పదోన్నతి లభించనుంది. ఆ విధంగా ఎన్నో దశాబ్దాల సర్వే ఉద్యోగుల కల నెరవేరింది.101 మంది సర్వేయర్లకు తాజాగా పదోన్నతులు ఇచ్చారు. మిగిలిన కేడర్ల వారికీ త్వరలో ఇవ్వనున్నారు. -
Dharani Website Issues: పల్లెబాట పడితేనే 'ధరణి' దారికి
సాక్షి, హైదరాబాద్: ఒక్కో గ్రామంలో కనీసం 200 సమస్యలు. గ్రామీణ ప్రజలకు న్యాయ సహాయం అందించేందుకు గాను ఓ స్వచ్ఛంద సంస్థ ఇటీవల రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఉన్న నాలుగు గ్రామాల్లో పర్యటిస్తే.. ధరణి పోర్టల్‌కు సంబంధించి వెలుగుచూసిన సమస్యల సంఖ్య ఇది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలోని 12 వేలకు పైగా ఉన్న గ్రామాల్లో 24 లక్షలకు పైగానే సమస్యలు ఉండే అవకాశం ఉందని భూచట్టాల నిపుణుల అంచనా. ఈ సమస్యలకు ధరణి పోర్టల్‌లో పరిష్కారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పారదర్శక నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో కార్యాచరణ ద్వారానే అది సాధ్యమవుతుందని వారంటున్నారు. గురువారం రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో ధరణి పోర్టల్ సమస్యలపై చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రెండేళ్లుగా రైతుల పాట్లు రాష్ట్రంలోని భూములకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు సులభతరమైన భూసేవలను అందించేందుకు గాను ప్రభుత్వం ధరణి పేరిట పోర్టల్‌ను తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా, ఈ పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలు, పరిష్కారం చూపని మాడ్యూళ్లు, క్షేత్రస్థాయిలో పరిష్కార వ్యవస్థలు లేకపోవడంతో దాదాపు రెండేళ్లుగా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయిలో ప్రయత్నిస్తోందే తప్ప శాస్త్రీయ పరిశీలన జరపడం లేదనే విమర్శలున్నాయి. రైతాంగం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. కొన్నిటికి పరిష్కార మాడ్యూళ్లే లేవు? రైతుల ఇక్కట్ల నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల కేంద్రాన్ని పైలట్‌గా ఎంచుకుంది. ఈ గ్రామంలో మొత్తం 277 సమస్యలున్నాయని గుర్తించగా, ఇందులో 140 సమస్యల పరిష్కారానికి అసలు ధరణి పోర్టల్‌లో మాడ్యూళ్లే లేవని భూనిపుణులు చెపుతున్నారు. కానీ ఈ సమస్యలన్నీ దాదాపు పరిష్కారమయ్యాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. తాత్కాలిక ఉపశమనమే! ధరణి పోర్టల్‌లో ఎదురయ్యే సమస్యలపై చేసుకునే దరఖాస్తులను పరిష్కరించే బాధ్యత జిల్లా కలెక్టర్లకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం క్షేత్రస్థాయిలో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు ఇచ్చే సమాచారం మేరకు కలెక్టర్లు నిర్ణయం తీసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారు, లేదంటే తిరస్కరిస్తున్నారు. కానీ ఈ సమస్యలు పరిష్కరించినా లేదా తిరస్కరించినా.. ఆ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదు. కంప్యూటర్లోనే ఆమోదించి, లేదంటే తిరస్కరించి ఆ మేరకు ధరణి రికార్డులను మార్చేస్తున్నారు. ఈ విధంగా చేయడం తాత్కాలిక ఉపశమనమే కానీ చట్టాల ముందు కలెక్టర్లకు కట్టబెట్టిన ఈ అధికారాలు నిలబడవని నిపుణులు అంటున్నారు. భూరికార్డుల్లో జరిగిన మార్పులకు లిఖితపూర్వక ఆదేశాలు లేదా ఉత్తర్వులు లేనిదే అవి చెల్లుబాటు కావనేది భూ చట్టాల నిపుణుల వాదన. 2020 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో ఈ మేరకు కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టే నిబంధన ఎక్కడా లేదని వారంటున్నారు. సాదాబైనామాలకైనా చట్ట సవరణ చేయాల్సిందే.. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా కానీ, చట్టాన్ని సవరించి కానీ.. ఏదో స్థాయిలోని అధికారికి తగిన అధికారాలు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. సదరు అధికారులు గ్రామాలకు వెళ్లి సర్వే నంబర్ల వారీగా దరఖాస్తులను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసినప్పుడే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ఇక సాదాబైనామాల అంశాన్ని పరిష్కరించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న భూ హక్కుల (ఆర్వోఆర్) చట్టానికి తప్పనిసరిగా సవరణ జరగాల్సిందేనని పేర్కొంటున్నారు. పాత చట్టం (1971 ఆర్వోఆర్) అమల్లో ఉన్నప్పుడు వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాన్న కోర్టు.. కొత్త చట్టం (2020) వచ్చాక స్వీకరించిన దరఖాస్తులపై స్టే విధించింది. కొత్త చట్టంలో సాదాబైనామాల పరిష్కారానికి ఎలాంటి నిబంధన పొందుపరచక పోవడమే ఇందుకు కారణం. అయితే కోర్టు చెప్పినట్టు పాత చట్టం ఉన్నప్పుడు వచ్చిన 2.4 లక్షల సాదాబైనామాలను పరిష్కరించాలన్నా చట్ట సవరణ చేయాల్సిందేనని నిపుణులు అంటున్నారు. గ్రామాలకు వెళ్లి పరిష్కరించడమే ఉత్తమం భూసమస్యల పరిష్కారానికి గ్రామాలే సరైన వేదికలని గత 20 ఏళ్ల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. 2004–05 మధ్య కాలంలో గ్రామ రెవెన్యూ అదాలత్‌లను నిర్వహించారు. ఆ తర్వాత 2005–07 మధ్య కాలంలో గ్రామ రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ కోర్టుల ద్వారానే భూసమస్యలను పరిష్కరించాలని, ఎమ్మార్వో స్థాయిలో 75 శాతం, ఆర్డీవో స్థాయిలో 50 శాతం సమస్యలను.. గ్రామ రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేసి పరిష్కరించాలని అప్పట్లో జీవో కూడా ఇచ్చారు. ఆ తర్వాత రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లపై యూనిక్ కోడ్ వేసేందుకు గాను రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్లింది. ఆ తర్వాత రఘువీరారెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు మూడు నెలల పాటు గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు రెండేళ్ల పాటు వరుసగా నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ పరిశీలిస్తే క్షేత్రస్థాయికి అంటే గ్రామ స్థాయికి వెళ్లి ధరణి సమస్యలను పరిష్కరించడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి భూ కమతానికి భూ కిట్ ఇవ్వాలి క్షేత్రస్థాయిలో భూసమస్యల పరిష్కారానికి కనీసం 6–8 నెలల సమయం పడుతుంది. సర్వే నంబర్లు, భూయజమానులు, సమస్యలను గుర్తించేందుకు రెండు నెలలు, ఆ తర్వాత సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు 2 నెలలు, వాటిని గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కరించేందుకు మరో 2–4 నెలలు పడుతుంది. ప్రతి భూకమతానికి భూకిట్ (పహాణీ నకలు, 1బీ నకలు, టిప్పన్, గ్రామ పటం, సేత్వార్, పాస్‌బుక్, టైటిల్ డీడ్) ఇచ్చినప్పుడే భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్టవుతుంది. ఇందుకోసం ఆర్వోఆర్ చట్టానికి సవరణ చేయడం, రికార్డుల సవరణ అధికారాలను కట్టబెట్టడం, గ్రామస్థాయికి రెవెన్యూ యంత్రాంగం వెళ్లడం చాలా కీలకం. ఈ దిశలో మంత్రివర్గం ఆలోచించాలి. – భూమి సునీల్, భూమి చట్టాల నిపుణుడు చదవండి: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..! -
పట్టణాల్లోనూ భూసర్వే
సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులను సర్వే చేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరాలతో కూడిన పత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్షా పథకంలో భాగంగా పట్టణాల్లో సర్వేకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో భూ సర్వే చేపట్టిన ప్రభుత్వం.. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజలకు వారి ఆస్తికి సంబంధించి కచ్చితమైన సమాచారంతో ధృవీకరణ పత్రం అందించనుంది. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో పైలట్ ప్రాజెక్టుగా రెండు రెవెన్యూ వార్డుల్లో చేపట్టిన సర్వే విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో అమలు చేయనుంది. పట్టణ ప్రాంత భూములకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఈ నెల 15 తర్వాత సర్వే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను వచ్చే ఏడాది జూలైకి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతకంటే ముందే పూర్తి చేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగంతో కలిసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్ కుమార్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. సర్వే సందర్భంగా తలెత్తే వివాదాలకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రభుత్వం మొబైల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తోంది. అధికారికంగా 37 లక్షల ఆస్తుల గుర్తింపు సరిహద్దులు, సర్వే నంబర్లతో కూడిన రికార్డులు పక్కాగా ఉండడంతో పంచాయతీల్లో సర్వేలో పెద్దగా ఆటంకాలు ఎదురవలేదు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రక్రియ సవాలుగానే మారనుంది. ముఖ్యంగా ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు వంటి వివాదాలు చాలానే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దశాబ్దాల తరబడి పట్టణ ప్రాంత ప్రజలు ఆస్తి పన్ను చెల్లిస్తున్నప్పటికీ ఆ భవనం ఏ సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందో తెలియదు. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి పన్ను చెల్లించని వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు, ఆస్తి పన్ను చెల్లిస్తున్న డేటా ప్రకారం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 37 లక్షల ఆస్తులు ఉన్నట్టు మున్సిపల్ శాఖ గుర్తించింది. సర్వేలో ఇవి మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో భవనాలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఖాళీ స్థలాలు.. ఇలా వేటికవి ప్రత్యేకంగా గుర్తిస్తారు. గత ప్రభుత్వాలు పురపాల సంఘాల్లో పన్నుల వసూళ్లపై పెట్టిన దృష్టి ఆస్తుల గుర్తింపుపై పెట్టకపోవడంతో కొనుగోళ్లు, అమ్మకం రిజిస్ట్రేషన్ సమయంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపై ఈ సమస్యలు లేకుండా ఎవరి ఆస్తిపై వారికి అన్ని వివరాలతో కూడిన హక్కు పత్రం ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. దీనిద్వారా సర్వే నంబర్లు, పట్టా నంబర్లు, అధికారిక సరిహద్దులు వంటి సమగ్ర వివరాలతో హక్కుదారులకు పత్రాలు అందుతాయి. నేడు శిక్షణ ఈ సర్వే ప్రక్రియ అమలుపై వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించే ఈ శిక్షణలో డ్రోన్ ఉపయోగించి ఆస్తుల కొలతలు తీసుకోవడం, రికార్డుల ప్రకారం రోడ్లు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల గుర్తింపు, ఆయా సర్వే నంబర్లుపై తర్ఫీదునిస్తారు. అనంతరం యూఎల్బీల్లో అవసరమైనంత మంది సిబ్బందికి వీరు శిక్షణ ఇస్తారు. సర్వేతో పట్టణ ప్రజలకు ఎంతో మేలు పట్టణ భూ సర్వేతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటి దాకా పట్టణాల్లో ఆస్తులకు పన్ను చెల్లిస్తున్న డేటా ఉంది. సర్వే నంబర్ల డేటా కూడా ఉంది. అయితే ఏ సర్వే నంబర్లో ఏ ఆస్తులు.. ఎవరి ఆస్తులు ఉన్నాయో లేదు. ఇప్పుడు ఈ రెండు అంశాలను కలిపి డేటాను రూపొందిస్తాం. అన్ని సరిహద్దులను వివరిస్తూ సర్వే నంబర్‌తో సహా హక్కుదారుకు సర్టిఫికెట్ ఇస్తాం. ఇందుకోసం మున్సిల్ చట్టంలో సవరణలు చేస్తాం. సర్వేలో అనుభం ఉన్న రెవెన్యూ, సీసీఎల్ఏ, ఇతర విభాగాల సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి బృహత్తర కార్యక్రమం గతంలో ఎప్పుడూ చేపట్టలేదు. – ప్రవీణ్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ -
సకాలంలో భూముల రీ–సర్వే : కలెక్టర్
కశింకోట: సమగ్ర భూముల రీ–సర్వే సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి ఆదేశించారు. కశింకోట పొలాల్లో సర్వే, రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న భూముల రీ–సర్వేను శుక్రవారం ఆయన అకస్మాత్తుగా పరిశీలించారు. రీ–సర్వే పూర్తి చేయడానికి ఆగస్టు నెలాఖరు వరకు సమయముందని, ఈలోగా నిబంధనలకు లోబడి సర్వే పూర్తి చేయాలన్నారు. అనంతరం బయ్యవరం సచివాలయాన్ని సందర్శించి పనితీరును పరిశీలించారు. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ నెల రోజులపాటు సెలవులో ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఎవరినైనా తాత్కాలికంగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో చిన్నోడు, తహసీల్దార్ బి.సుధాకర్, ఈవోఆర్డీ ధర్మారావు, ఆర్ఐ కిషోర్ కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు. (చదవండి: టీవీ రిపోర్టర్‌నంటూ మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి..) -
సర్వే సెటిల్మెంట్ శాఖ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: 50 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల శాఖను ప్రభుత్వం పునర్వ్యస్థీకరించింది. కింది నుంచి పైస్థాయి వరకు కేడర్ పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పలు విభాగాలకు సంబంధించి కీలకమైన మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1971లో సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి నుంచి పదోన్నతుల ఛానల్ లేకపోవడంతో నియమితులైన వారంతా ఒకే కేడర్‌లో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్ అవుతున్నారు. తాజాగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా భూముల రీసర్వేను చేపట్టడంతో సర్వే శాఖ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగి పని విధానం పూర్తిగా మారిపోయింది. మరోవైపు.. గ్రామ సచివాలయ వ్యవస్థలో 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించడంతో సర్వే శాఖ మరింత క్రియాశీలకంగా మారింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పేరుతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భూముల రీ సర్వే, వాటి సేవల స్వరూపం పూర్తిగా మారిపోవడం, సర్వే అవసరాలు పెరగడం, భూసేకరణ, భూముల సబ్ డివిజన్ వంటి పనులు గతం కంటే పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో సర్వే శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, తనిఖీ వ్యవస్థ ఉండేలా పునర్వ్యవస్థీకరించింది. పర్యవేక్షణాధికారులుగా మండల సర్వేయర్లు మండల స్థాయి నుంచి డివిజన్, డివిజన్ నుంచి జిల్లా, జిల్లా నుంచి రీజినల్ స్థాయి వరకు 410 పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ పోస్టు ఉండేది. దాన్ని డిప్యూటీ డైరెక్టర్ హోదాకు పెంచారు. రీజినల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను జాయింట్ డైరెక్టర్ హోదాకు పెంచారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేశారు. మండల స్థాయిలో కొద్దికాలం క్రితం వరకు మండల సర్వేయర్లే ప్రారంభ ఉద్యోగులు. గ్రామ సర్వేయర్లు రావడంతో ఇప్పుడు వారు ప్రారంభ ఉద్యోగులయ్యారు. దీంతో మండల సర్వేయర్ పోస్టు పర్యవేక్షణాధికారి పోస్టుగా మారింది. గతంలో మండల సర్వేయర్లను పర్యవేక్షించేందుకు డివిజన్ స్థాయిలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఉండేవారు. ఇప్పుడు గ్రామ సర్వేయర్లందరికీ మండల సర్వేయర్ పర్యవేక్షణాధికారిగా మారారు. దీనికి అనుగుణంగా మండల సర్వేయర్ పోస్టును మండల ల్యాండ్ సర్వే అధికారిగా మార్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సర్వేయర్లు, అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏపీ సర్వే శిక్షణ అకాడమీని ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో డెశీ అండ్ జియో ఇన్ఫర్‌మ్యాటిక్స్‌గా మార్చారు. సెంట్రల్ సర్వే కార్యాలయాన్ని సెంట్రల్ సర్వే ఆఫీస్ అండ్ జియో స్పేషియల్ వింగ్‌గా మారుస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. -
అభివృద్ధి పేరుతో భూ వ్యాపారమా?
‘కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ’ (కుడా) వరంగల్ నగర శివారును ఆనుకొని ఉన్న గ్రామాల్లోని రైతుల భూముల్లో గత మూడేళ్ల నుంచీ రహస్య సర్వే చేస్తోంది. మొదట్లోనే స్థానిక రైతాంగం ‘మా భూముల్లో మా అనుమతి లేకుండా సర్వే చేయడం ఏమిటి?’ అని అడ్డుకున్నారు. అడ్డుకున్న రైతులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ‘కుడా’ ప్రయత్నాలను ఆదిలోనే రైతులు అడ్డుకోవ డంతో ఒక అడుగు వెనక్కి వేసి సర్వేను ఆపుతున్నాం అని అధికారులు ప్రకటించారు. వరంగల్ చుట్టూరా అవుటర్ రింగురోడ్డును ఆనుకొని పచ్చని పంట భూములు ఉన్నాయి. అక్కడి నుంచే కొత్తిమీర, పుదీనా, వంకాయ ఇతర కూర గాయలు ఉదయం 3 గంటలకే వరంగల్ మార్కెట్‌కు చేరుకుంటాయి. హన్మకొండ, వరంగల్ సిటీ ప్రజలకు 90 శాతం కూరగాయలు సిటీ శివారు గ్రామాల రైతులు తీసుకొచ్చేటివే. కూరగాయలు, మార్కెట్ వ్యాపారంపై చిన్న, సన్నకారు పేద రైతులు వేలాదిగా ఆధారపడి ఉన్నారు. ‘కుడా’ అవుటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న 27 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం 21,510 ఎకరాల భూమిని సేకరించాలని సర్వే చేసింది. ఆ తర్వాత సర్వే నంబర్లతో సహా జీవో నం. 80(ఎ) విడుదలయింది. 27 గ్రామాల్లో 2 గ్రామాల రైతుల అభిప్రాయ సేకరణ జరగలేదు. ముందుగా అసైన్డ్ భూముల సర్వే చేశారు. ఇవి పడావ్ భూములు కావు. దశాబ్దాల కాలం నుండి రైతుల వద్ద సాగులో ఉన్న భూములే. తర్వాత రైతుల పట్టా భూముల్లో సర్వే చేశారు. మొత్తంగా తమ ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూమి మొత్తాన్ని సేకరించారు. 27 గ్రామాల్లోని 21,510 ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి వ్యాపారం చేయబోతున్నారు. అందులో నుండి భూమి ఇచ్చిన రైతుకు 1200–1400 గజాల భూమిని ప్లాట్ల రూపంలో ఇస్తారు. వ్యవ సాయ భూమి ప్లాట్ల రూపంలోకి మారడం వల్ల... భూమి రేటు రెట్టింపు అవుతుంది. కాబట్టి మొత్తం 1400 గజాల్లో రైతుకు లాభం కోట్లల్లో వస్తుందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంటే వేలాది ఎకరాల పంట భూముల్ని భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నదన్న మాట! మొన్న వరంగల్, పరకాల మీటింగ్‌లలో మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు. రైతుల భూమిని రైతుల అనుమతి లేకుండా గుంజు కొని ప్రభుత్వమే రియల్ భూవ్యాపారం అధికారి కంగా చేస్తుందనేది ఇందువల్ల రూఢి అయింది. ల్యాండ్ పూలింగ్‌పై ప్రజలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ సందేహాలను తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే. ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇచ్చిన రైతు భవిష్యత్ ఏమిటి? భూమిపై ఆధారపడి పంటలు పండిస్తూ బ్రతికే రైతును ప్రభుత్వమే భూమి లేని వాడిగా చేస్తోంది. కూలీగా మార్చివేస్తోంది. 21,510 ఎకరాలను ప్లాట్లుగా మార్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి... వచ్చిన ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టమయింది. (క్లిక్: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) భూ వ్యాపారమే లక్ష్యంగా పెట్టుకొని వరంగల్ నగర అభివృద్ధి అంటే ఎలా? వరంగల్ చుట్టూ ఎత్తయిన భవనాల నిర్మాణం జరిగేతేనే అభివృద్ధా? ఇందులో బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనం దాగి ఉంది. స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ల్యాండ్ పూలింగ్ వేగవంతం అవుతోంది. రైతుల ఆందోళనల ఫలితంగా ‘కుడా’ చైర్మన్ ల్యాండ్ పూలింగ్ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనలో కూడా స్పష్టత లేదు. ల్యాండ్ పూలింగ్ కోసం తెచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలి. రైతాంగానికి ప్రజలందరూ అండగా నిలబడాలి. (క్లిక్: భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?) - ఎల్. రాజు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి, వరంగల్ -
భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?
తెలంగాణతో భూమి అంశం తరతరాలుగా మమేకమైంది. వ్యవస్థ మార్పునకు, భౌగోళిక మార్పునకు ఇక్కడ భూమి కూడా కీలక కారణమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భూ సమస్య పరిష్కారమవుతుందేమోనని ఎనిమిదేళ్ళుగా ఎదురు చూస్తున్నా, అది ఇప్పటికీ సాకారం కావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల విషయంలో సమూల ప్రక్షాళనకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం, ‘ధరణి’ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. కానీ వాటిల్లో లొసుగుల పరిష్కారానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో సమస్యలు జటిలమవుతున్నాయి. ముఖ్యంగా ‘ధరణి పోర్టల్’లో చేతులు మారిన భూములకు సంబంధించిన పట్టాదారుల పేర్లు మారకపోవడం, మోకాపై ఉన్న వారి పేరు లేక పోవడం సమస్యలకు కారణమవుతోంది. అన్నిటికీ మించి ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియకు మూలమైన భూ సర్వే ఇంకా చేపట్టకపోవడంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయి. ఏడాదిలో డిజిటల్ భూ సర్వే చేసి, అక్షాంశాలు, రేఖాంశాల వారీగా వివాదాలకు తావు లేకుండా భూముల గుర్తింపు చేస్తామని సీఎం ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా, అది ముందుకు సాగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ విడివిడిగానే రెవెన్యూ చట్టాలు, భూ కార్డులున్నప్పటికీ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. రికార్డులను సరిచేయడానికి ఉపశమన చర్యలు చేపట్టారు. భూ సమగ్ర సర్వే చేస్తే, భూముల అన్యాక్రాంతం, రికార్డులలో నెలకొన్న లొసుగులు బహిర్గతమయ్యేవి. కానీ అందుకు భిన్నంగా, ఆర్వోఆర్, అసైన్మెంట్ చట్టం, దేవాదాయ, వక్ఫ్ భూములకు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు ఎన్ని వచ్చినా అవి ప్రచారానికే పరిమితమైనాయి. కానీ క్షేత్రస్థాయిలో మార్పేమీ రాలేదు. 2004 సంవత్సరంలో అసెంబ్లీలో చర్చ జరిపి ఆనాటి మంత్రి కోనేరు రంగారావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అనుభవపూర్వకంగా 104 సిఫారసులు చేసినప్పటికీ అవి బుట్టదాఖలైనాయి. ఈ రకంగా తెలంగాణ భూములు ప్రయోగశాలకు నిలయమైనాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మేధావులు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులు భూ అంశంపైన అనేక అర్జీలిచ్చినా ప్రభుత్వం పట్టించు కోలేదు. రెవెన్యూ చట్టం అస్తవ్యస్తంగా ఉన్నదని 2020 సెప్టెంబర్ 11న కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించారు. మాన్యువల్ రికార్డుల స్థానే ‘ధరణి పోర్టల్’ తేవడం ఇందులోని ముఖ్యమైన అంశం. దాని పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ‘ధరణి పోర్టల్’ సాఫ్ట్వేర్ మాత్రమే అమలుకు తెచ్చారు. దానిని పూర్తిగా నమ్ముకుంటే రైతుల భూ రికార్డులు తారుమారై బజారులో పడతారని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న లొసుగులతో రైతులు తీవ్రమానసిక వ్యధకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో 100 నుండి 200 మంది రైతుల పైబడి భూ రికార్డులు, సర్వే నంబర్ హద్దులు అన్యాక్రాంతమై దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తే... జిల్లా కలెక్టర్ దగ్గరకి వెళ్లమంటారు. వారికి సమయముండదు. రైతుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రభుత్వం... సర్వే నెంబర్ వారీగా సమగ్ర భూ సర్వే (డిజిటల్) విధిగా చేపట్టాలి. సాదా బైనామాలకు ‘ధరణి పోర్టల్’లో ఆప్షన్ పెట్టాలి. అపరిష్కృతంగా ‘మీ సేవ’లో పెండింగ్ వున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలి. గతంలో ‘ధరణి’ వచ్చిన తరువాత తప్పుగా నమోదైన పేర్ల స్థానంలో ఒరిజినల్ పట్టాదారుల పేర్లు నమోదు చేయాలి. (చదవండి: కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?) పై అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, సవరణలు చేస్తూ చర్యలు చేపట్టగలిగితే సమస్యలు పరిష్కారమవుతాయి. భూ రికార్డులు సరి అవుతాయి. అయితే దీనికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుంది. (చదవండి: ‘రెవెన్యూ’కు 250 ఏళ్లు) - చాడ వెంకటరెడ్డి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
భూముల రీ సర్వేపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్ట్‌ను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసే క్రమంలో సమన్వయంతో ముందడుగు వేయాలని టేపీ జియో స్పేషియల్ డేటా సెంటర్, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ శాఖ అధికారులు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయా శాఖల అధికారులు చర్చించారు. ఉప్పల్‌లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో నిర్వహించిన ఈ కీలక సమావేశానికి 12 మంది నోడల్ అధికారులతో కలిసి రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థజైన్ నేతృత్వం వహించగా, జియో స్పేషియల్ డేటా సెంటర్ డైరెక్టర్ ఎస్వీ సింగ్ తన బృందంతో పాల్గొన్నారు. డేటా సెంటర్‌కు సంచాలకులుగా సింగ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రీసర్వే ప్రాజెక్ట్‌కు సంబంధించి పలు అంశాలపై లోతుగా చర్చించారు. ప్రాజెక్ట్ పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన అంశాలు, ఇకపై చేయవలసిన కార్యక్రమాలు, కాలపరిమితి వంటి అంశాలపై సమావేశం సాగింది. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయడంతో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ సాగింది. మెరుగైన సామర్థ్యం కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలి, మరిన్ని శిక్షణలు ఇవ్వాల్సిన ఆవశ్యకత తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సమావేశంలో సర్వే సెటిల్మెంట్ కమిషనర్ కార్యాలయ సంయుక్త సంచాలకుడు ప్రభాకరరావు, రాష్ట్ర సర్వే శిక్షణ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ కుమార్, ప్రత్యేక అధికారి అజయ్‌నాయక్ పాల్గొన్నారు. -
సమగ్ర భూ సర్వే
-
AP: ఎక్కడికక్కడే పరిష్కారం
► 2023 జూలై ఆఖరుకు 5,200 గ్రామాల్లో, 2023 ఆగస్టు ఆఖరుకు 5,700 గ్రామాల్లో, 2023 సెప్టెంబరు ఆఖరుకు 6,460 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, క్లియర్ టైటిల్స్ ఇచ్చేలా కార్యాచరణ పూర్తి చేశాం. ► సచివాలయాల వారీగా భూ వివరాల అప్డేషన్ వల్ల గతంలో వెబ్‌ల్యాండ్ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. – సీఎంతో అధికారులు సాక్షి, అమరావతి: భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనివల్ల స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయన్నారు. భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చే నాటికి దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో న్యాయ శాఖకు కూడా భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో రాష్ట్రం.. దేశానికి ఒక దిక్సూచిగా నిలవాలని స్పష్టం చేశారు. అందుకే సీనియర్ అధికారులను, సీనియర్ మంత్రులను ఇందులో భాగస్వాములు చేశామని తెలిపారు. గతంలో వెబ్ ల్యాండ్‌లో ఉన్న సమస్యలను అత్యంత పారదర్శక పద్ధతుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకు అనుసరించాల్సిన విధానాలు, ఎస్ఓపీలతో రోడ్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు. రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, టాంపర్ చేయలేని విధంగా చేయాలని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్ రికార్డులు కూడా తయారు చేయాలని చెప్పారు. ఈ ఫిజికల్ డాక్యుమెంట్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. సబ్ డివిజన్ కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్నారు. ఎక్కడా అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా ఈ వ్యవస్థ నడవాలని, ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలన్నారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూ సర్వే కోసం 154 డ్రోన్ల వినియోగం ► సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించారు. డ్రోన్ పనితీరు గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏప్రిల్ 5 నాటికి భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమై ఉంటాయన్నారు. ► మరింత వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కొనుగోలు చేస్తున్నామని, మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 1,441 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందన్నారు. ► వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్ సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నామని, రెవిన్యూ విలేజ్ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా అదే సమయంలో రికార్డుల స్వఛ్చీకరణ ఉండేలా చూస్తున్నామన్నారు. ► వెబ్ ల్యాండ్ అప్డేషన్, గ్రామ ల్యాండ్ రిజిస్టర్ అప్డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్, దీంతోపాటు జగనన్న భూ హక్కు పత్రం ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. సచివాలయాల వారీగా భూ వివరాల అప్డేషన్ ► సచివాలయాల వారీగా భూ వివరాల అప్డేషన్ వల్ల గతంలో వెబ్‌ల్యాండ్ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. 5,200 గ్రామాల్లో 2023 జూలై ఆఖరుకు, 5,700 గ్రామాల్లో 2023 ఆగస్టు ఆఖరుకు, 6,460 గ్రామాల్లో 2023 సెప్టెంబరు ఆఖరుకు సర్వే పూర్తి చేసి, క్లియర్ టైటిల్స్ ఇచ్చేలా కార్యాచరణ పూర్తిచేశామన్నారు. ► ఓఆర్ఐ (ఆర్థోరెక్టిఫైడ్ రాడార్ ఇమేజెస్) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్ ఆఖరుకు, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్ ఆఖరుకు, మూడో విడత గ్రామాల్లో జనవరి ఆఖరుకు పూర్తవుతాయని చెప్పారు. ► సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి.సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రెవెన్యూ శాఖ కమిషనర్ సిద్దార్ధ జైన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సమగ్ర భూసర్వేతో ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని, ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు & భూ రక్ష పథకంపై గురువారం క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా.. సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందించారు. అంతేకాదు సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను సీఎం జగన్ పరిశీలించారు. ఏప్రిల్ 5వ తేదీకల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఆపై సీఎం జగన్ అధికారులతో.. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అవినీతి.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలని సీఎం వైఎస్ జగన్.. అధికారులకు సూచించారు. అనుసరించాల్సిన విధానాలు, ఎస్ఓపీలను తయారు చేయాలని, రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించాలని ఆదేశించారు. కేవలం ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్ రికార్డులు కూడా తయారుచేయాలని, ఆ ఫిజికల్ డాక్యుమెంట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులతో చెప్పారు. సబ్ డివిజన్‌కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్న సీఎం జగన్.. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని స్పష్టం చేశారు. ► ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ► భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. తద్వారా స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. ► భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చేనాటికి.. దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలి. ► న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలి. ► సమగ్రంగా ఓ రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేయాలి. ► భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో దేశానికి ఒక దిక్సూచిగా ఏపీ నిలవాలని సీఎం జగన్ ఆకాంక్ష. ► అందుకే సీనియర్ అధికారులను, సీనియర్ మంత్రులను ఇందులో భాగస్వాములుగా చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామన్న అధికారులు.. ఇప్పటివరకూ 1,441 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు సీఎం జగన్‌కు వివరించారు. వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్ సర్వే నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నామన్న అధికారులు.. రెవెన్యూ విలేజ్ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ► సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా అదేసమయంలో రికార్డుల స్వఛ్చీకరణ. ► వెబ్ ల్యాండ్ అప్డేషన్, గ్రామ ల్యాండ్ రిజిస్టర్ అప్డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్, దీంతోపాటు జగనన్న భూ హక్కు పత్రం అందజేత. ► గ్రామ సచివాలయాల వారీగా.. భూ వివరాలను అప్డేషన్ చేయనున్న అధికారులు. ► తద్వారా.. గతంలో వెబ్‌ల్యాండ్ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం. ► 5,200 గ్రామాల్లో 2023 జులై నెలాఖరుకు, 5,700 గ్రామాల్లో 2023 ఆగస్టు నెలాఖరు కల్లా, సెప్టెంబరు నెలాఖరు నాటికి 6,460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్ టైటిల్స్ ఇచ్చేలా కార్యాచరణ పూర్తి. ► ఓఆర్ఐ (ఆర్థోరెక్టిఫైడ్ రాడార్ ఇమేజెస్) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్ నెలాఖరు నాటికి, మూడోవిడత గ్రామాల్లో జనవరి నెలాఖరు నాటికి పూర్తవుతాయని చెప్పిన అధికారులు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి(రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్ సిద్దార్ధ జైన్.. ఇతర అధికారులు హాజరయ్యారు. -
గ్రామ స్వరాజ్యం ఇదే
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులను ప్రజలకు క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తూ మారు మూల గ్రామాలకు వేగంగా సేవలందించేందుకు ఏపీ సేవ పోర్టల్–2ను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. రెండేళ్లలో గ్రామ స్వరాజ్యం అంటే ఇదీ అని కళ్ల ముందు కనిపించేలా అమలు చేసి చూపించామని చెప్పారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ఇంతకన్నా వేరే అర్థం బహుశా ఉండదన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి (ఏపీ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్) ఏపీ సేవ 2.0 (టూ పాయింట్ ఓ) పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవాళ ప్రారంభించిన సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ (సీఎస్పీ)ను పలకడానికి అనువుగా ఏపీ సేవ అంటున్నామని చెప్పారు. దీని వల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగు పరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇంతకంటే వేరే నిదర్శనం లేదు ► గ్రామ స్వరాజ్యం అంటే మన కళ్లముందే కనిపించేలా రెండేళ్లుగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. 540కి పైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. ప్రతి 2 వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. అక్కడ పది మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా 1.34 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు పని చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, మున్సిపల్ స్థాయిలో ప్రతి 100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.60 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. మొత్తంగా దాదాపు 4 లక్షల మంది ఈ డెలివరీ మెకానిజంలో పని చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో ఇంటింటికి వెళ్లి నిరంతరం పని చేస్తున్నారు. ఇంతకన్నా గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదు. వీరందరికీ అభినందనలు. ► ఇలా సేవలందించే కార్యక్రమాన్ని 2020 జనవరి 26న ప్రారంభించాం. ఈ రెండేళ్ల పయనంలో నేర్చుకున్న పాఠాల ద్వారా మరింత మెరుగ్గా సేవలను అందించేలా, పారదర్శకంగా ఉండేలా మార్పులు తీసుకొచ్చి ఏపీ సేవ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. 540కి పైగా సేవల్లో వేగం ► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకే వేదికపై 540కి పైగా ప్రభుత్వ సేవలు మెరుగైన రీతిలో అందుబాటులోకి వస్తాయి. గత రెండేళ్లలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 3.46 కోట్ల మందికి సేవలు అందించాం. ఈ లెక్కన ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉపయోగపడిందో ఇట్టే తెలుస్తోంది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొత్త పోర్టల్ ద్వారా మరింత వేగంగా పనులు జరుగుతాయి. ► తాము ఇచ్చిన అర్జీ ఎక్కడ ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఎవరి దగ్గర ఎన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది? అన్న విషయాన్ని నేరుగా ప్రజలు తెలుసుకోవచ్చు. సంబంధిత శాఖలోని పైస్థాయి అధికారులు కూడా ఈ విషయాలు తెలుసుకోవచ్చు. లంచాలు, అవినీతికి తావుండదు ► కొత్త సాఫ్ట్వేర్ ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. పారదర్శకత పెరిగి అవినీతి దూరం అవుతుంది. ► ప్రజలు వారి దరఖాస్తును ట్రాక్ చేసుకునే (ఏ దశలో ఉందో చూసుకునే) వెసులుబాటు ఉంటుంది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం సాధ్యపడుతుంది. అటు ప్రభుత్వ శాఖలు, ఇటు ప్రజల మధ్య వారధిగా అంటే ముఖ్యమైన హబ్‌గా.. గ్రామ, వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసేందుకు ఏపీ సేవ పోర్టల్ ఉపకరిస్తుంది. ► ప్రజలు ఏదైనా సేవకు సంబంధించి దరఖాస్తు చేయగానే పక్కాగా రశీదు వస్తుంది. భౌతికంగా, డిజిటల్ పద్ధతుల్లో రశీదులు వస్తాయి. పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో కూడా చెబుతారు. ఆయా దరఖాస్తుల ప్రాసెస్‌ను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అర్జీదారులకు ఎస్ఎంఎస్లు వస్తాయి. ► ఫీజులు చెల్లించాల్సి ఉంటే.. ఏపీ సేవ పోర్ట్ల్ సహాయంతో రుసుములు చెల్లించే అవకాశం ఉంటుంది. యూపీఐ, క్యూ ఆర్ కోడ్ స్కానింగ్, క్యాష్ పేమెంట్ లేదా ఆన్లైన్లో పేమెంట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేయొచ్చు ► ఏపీ సేవ పోర్టల్ ద్వారా రెవిన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను కూడా తీసుకు వచ్చాం. మునిసిపాలిటీలకు సంబంధించి 25 సేవలు, పౌర సరఫరాలకు చెందిన 6 సేవలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్ రంగానికి సంబంధించిన 53కు పైగా సేవలను పోర్టల్ కిందకు తీసుకు వచ్చాం. ► దరఖాస్తుదారుడు తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా.. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఒకచోట దరఖాస్తు చేస్తే.. వేరే చోట నుంచి కూడా సర్టిఫికెట్ పొందవచ్చు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే.. దానికి కారణాలు ఏంటో చెబుతారు. ఇలాంటి సదుపాయాలన్నీ కూడా ఏపీ సేవ పోర్టల్ద్వారా అందుబాటులోకి వస్తాయి. ► ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సేవలన్నింటినీ పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నుంచి మండల స్థాయి, మునిసిపాలిటీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర సచివాలయంలోని ఉన్నత స్థాయి ఉద్యోగులు అందరూ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంపై పని చేస్తారు. తద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. ప్రతి ఉద్యోగి డిజిటల్ సిగ్నేచర్ అందరికీ కనిపిస్తుంది. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదని పై అధికారులు, దరఖాస్తుదారులు ప్రశ్నించ గలుగుతారు. తద్వారా సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల జారీలో జాప్యం ఉండదు. అవినీతికి తావుండదు. – సీఎం వైఎస్ జగన్ -
బాధితులకు తగిన న్యాయం చేస్తాం
వెల్దుర్తి(తూప్రాన్): మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములకు సంబంధించి బాధిత రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, త్వరలో అందరికీ న్యాయం చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అచ్చంపేట శివారులో కొనసాగుతున్న భూముల సర్వేను శనివారం రాత్రి పరిశీలించారు. ఫోన్ టార్చి లైట్ వెలుగులో అటవీప్రాంతం మాదిరిగా ఉన్న భూముల్లోకి వెళ్లి సర్వే అధికారులు ఏర్పాటు చేసిన సబ్ డివిజన్ హద్దులను స్వయంగా పరిశీలించారు. సర్వే ప్రక్రియ మరో రెండు, మూడు రోజులు కొనసాగుతుందని, భూ కబ్జా ఆరోపణలపై నిజాలు బయటకు రావడానికి సమయం పడుతుందన్నారు. అచ్చంపేట శివారులో సర్వే ప్రక్రియ సబ్ డివిజన్ల వారీగా దాదాపు పూర్తయిందని, ఈ విషయంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారిణి నివేదిక అందించాల్సి ఉందన్నారు. జమునా హేచరీస్ వ్యర్థాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై అధికారుల నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. -
ఈటల సంస్థకు నోటీసులు.. 16 నుంచి 18 వరకు భూసర్వే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణల విచారణలో కదలిక వచ్చింది. జమునా హేచరీస్‌కు సంబంధించిన భూములను సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 16, 18 తేదీల్లో నిర్వహించనున్న సర్వేకు సంబంధించి నిర్ణీత ప్రదేశానికి హాజరు కావాలని ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డిలతోపాటు సంబంధిత భూములున్న 154 మంది రైతులకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ తూప్రాన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీసుజాత సోమవారం నోటీసులు జారీ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 130, 77, 78, 79, 80, 81, 82తోపాటు హకీంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 97 పరిధిలోని భూములపై సర్వే నిర్వహిస్తున్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ భూముల సర్వే కోసం ఈ ఏడాది మేలో జారీ చేసిన నోటీసులకు కొనసాగింపుగా మరోమారు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 66 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని ప్రాథమిక నివేదిక.. ఈటల తమ భూములను కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. తక్షణమే విచారణ చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. భూ ఆక్రమణలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకూ ఆదేశాలు జారీ చేసింది. అటవీశాఖ కూడా తమ భూములు ఏమైనా ఆక్రమణకు గురయ్యాయా అనే దానిపై విచారణ చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు సర్వే, విచారణ చేపట్టగా జమున హేచరీస్‌లో 66 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములున్నాయని మెదక్ కలెక్టర్ అప్పట్లో ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఈ భూముల్లో షెడ్లు, రోడ్లు, భవనాలు నిర్మించారని, చెట్లు నరికారని పేర్కొన్నారు. మేలో జరగాల్సిన సర్వే.. జమునా హేచరీస్ సంస్థ అసైన్డ్, సీలింగ్ భూ ములను ఆక్రమించిందనే ఆరోపణలపై మెదక్ జిల్లా అధికారులు ఈ ఏడాది మేలో సర్వే చేపట్టారు. దీనిపై జమున హేచరీస్ హైకోర్టును ఆశ్రయించగా కోవిడ్ వ్యాప్తి తగ్గాక నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో ఈ భూములను సర్వే చేయాలని నిర్ణయించినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవారం తెలిపారు. అసైన్డ్, సీలింగ్ భూములు ఎంత మేరకు ఆక్రమణలకు గురయ్యాయనే దానిపై ఈ సర్వేలో తేలుతుందన్నారు. -
గడువులోగా భూసర్వే పూర్తిచేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వేను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశించారు. భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులను కూడా అప్డేట్ చేయాలని.. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలన్నారు. ప్రతియేటా ఒక వారంలో భూ రికార్డుల అప్డేషన్ కార్యక్రమం చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే, నిషేధిత భూముల వ్యవహారాలకు చెక్ పెట్టాల్సిందేనని.. ఆ జాబితాలో చేర్చాలన్నా, తొలగించాలన్నా సరైన విధానాలు పాటించాలని, లోపాలు లేకుండా ఆధీకృత వ్యవస్థలను బలోపేతం చేయాలని కూడా ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలు.. ఎస్ఓపీలు రూపొందించండి భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు పట్టాదారు పుస్తకానికి సంబంధించిన వివరాలు అమ్మకందారులు, కొనుగోలుదారుల రికార్డుల్లో అప్డేట్ కావాలని, అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లుగా భావించాలని సీఎం స్పష్టంచేశారు. దీనిపై ప్రత్యేక టీంను పెట్టి.. తగిన విధానాన్ని రూపొందించాలన్నారు. భూ రికార్డుల్లో నిపుణులైన వారిని, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారిని ఈ టీంలో నియమించాలన్నారు. వీరి సిఫార్సుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు రూపొందించాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఉండాలని, ప్రజలు వీటి కోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా తగిన విధానం రూపొందించాలని ఆదేశించారు. భూ సర్వేకు సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాలి భూ సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి తగినన్ని సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు తగినన్ని డ్రోన్లు పెట్టుకోవాలని సీఎం సూచించారు. సర్వేకు సంబంధించి డేటా భద్రతపైనా తగిన చర్యలు తీసుకోవాలని.. దీనిపై అనుభవం ఉన్న వ్యక్తులు, సంస్థలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డుల అప్డేషన్ను ఏటా ఒక వారంలో చేపట్టాలని, దీనిపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. భూ రికార్డుల అప్డేషన్, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. మనం తీసుకొస్తున్న సంస్కరణలతో అవినీతికి ఆస్కారం ఉండకూడదని.. రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలని.. ఇందుకోసం సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారుచేయాలని జగన్ ఆదేశించారు. నిషేధిత భూముల విషయంలో ‘అవి’ పునరావృతం కాకూడదు నిషేధిత భూముల అంశానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. 22–ఎ (నిషేధిత భూములు) విషయానికి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకొస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరముందన్నారు. అధికారులు సమావేశమై దీనిపై ఒక విధానం రూపొందించాలని.. ఇలాంటి పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. తగినన్ని మార్గదర్శకాలు పటిష్టంగా రూపొందించాలని, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, ఆ జాబితాలో చేర్చాలన్నా అనుసరించాల్సిన విధానాన్ని లోపాలు లేకుండా తీసుకురావాలని సూచించారు. దీనికి సంబంధించి ఆధీకృత వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని అధికారులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పురపాలక–పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర భూ సర్వే ప్రగతి ఇలా.. సమీక్షలో అధికారులు సమగ్ర భూ సర్వే పనుల్లో జరిగిన ప్రగతిని, లక్ష్యాలను సీఎంకు వివరించారు. ఆ వివరాలు.. ► పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తయింది. ► డిసెంబర్ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తవుతుంది. ► మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ 650 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. ► జూన్ 22, 2022 నాటికి 2,400 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. ► ఆగస్టు 2022 నాటికి మరో 2,400 గ్రామాల్లో పూర్తవుతుంది. è మొత్తంగా ఆగస్టు 2022 నాటికి దాదాపు 5,500 గ్రామాల్లో సర్వే పూర్తవుతుంది. ► అక్టోబరు 2022 నాటికి 3 వేల గ్రామాల్లో, అదే ఏడాది డిసెంబరుకు మరో 3వేల గ్రామాల్లో.. అలాగే మార్చి 2023కల్లా మరో మూడువేల గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. ► ఇక జూన్, 2023 నాటికి ఇంకో 3 వేల గ్రామాలతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తాం. 51 గ్రామాల్లో ‘పైలెట్’ సర్వే ► అలాగే, పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 51 గ్రామాల్లో 30,679 కమతాలను సర్వేచేశాం. ► 3,549 పట్టాదారుల వివరాలను అప్డేట్ చేశాం. ► రెవెన్యూ నుంచి 572, సర్వే వైపు నుంచి వచ్చిన 1,480 అభ్యర్థనలను పరిష్కరించాం. ► 235 సరిహద్దు వివాదాలను పరిష్కరించాం. ► సంబంధిత రికార్డులను అప్డేట్ చేయడమే కాకుండా వాటిని స్వచ్ఛీకరించాం. ► సర్వే అనంతరం పూర్తి వివరాలు, మ్యాపులతో కూడిన పట్టాదారు పుస్తకాన్ని రైతులకు అందిస్తున్నాం. -
సర్వేకు అదనంగా డ్రోన్లు
-
స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారిగా పూర్తిభూ సర్వే చేపట్టిన ఏ పీ సర్కార్
-
శాశ్వత భూహక్కు-భూరక్షపై నేడు సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఏపీ: సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్: మంత్రులు
సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశమైంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, వందేళ్ల తర్వాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వే జరుగుతుందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షతో భూ వివాదాలకు చెక్ పడుతుందని మంత్రులు అన్నారు. ఆధునిక డ్రోన్, రోవర్ల సహకారంతో భూ సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూ సర్వేకు రాష్ట్రంలో 70 కోర్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు వివరించారు. సమగ్ర సర్వే కోసం 12వేల మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 736 గ్రామాల్లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 70లక్షల అసెస్మెంట్లకు గానూ 13.7లక్షల అసెస్మెంట్ల పరిశీలన పూర్తయ్యిందని, సమగ్ర భూ సర్వే ద్వారా రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసినట్లు మంత్రులు వెల్లడించారు. -
భూ రీ సర్వేతో భూ వివాదాలు పూర్తిగా తొలగిపోతాయి : ధర్మాన కృష్ణదాస్
-
సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం
-
అనుకున్న సమయంలోగా లక్ష్యాలను చేరాలి: సీఎం జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘భూసర్వే చురుగ్గా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌తో మంద గమనంలో ఉన్న పథకం పరుగులు పెట్టాలి. లక్ష్యాలను అనుకున్న సమయంలోగా చేరాలి. క్రమం తప్పకుండా దీనిపై సమీక్షలు చేయాలి. అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి. పథకాన్ని పూర్తి చేయడానికి అంకిత భావంతో ముందుకెళ్లాలి. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలి. పట్టణాల్లో కూడా సమగ్ర సర్వే వెంటనే వేగం చేయండి. అందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. సర్వే పూర్తైతే అన్నింటికి క్లియర్ టైటిల్స్ వస్తాయి. ఎక్కడా భూ వివాదాలకు అవకాశం ఉండదు’’ అన్నారు అనుకున్నట్లుగా సర్వే జరగాలి.. ‘‘మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. అక్కడ సిగ్నల్స్ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. సర్వే పనులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన వాటి కోసం ఆర్డర్ చేయండి. సర్వే ఆలస్యంగా కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 2023 నాటికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి కావాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సచివాలయాల్లో సేవలు.. ‘‘ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారు కావాలి. ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధృవీకరణ పత్రాల్లానే అన్నిరకాల సర్టిఫికెట్లు వారికి సచివాలయాల్లోనే అందేలా చూడాలి. సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటిల్ ఫార్మాట్లో పెట్టి.. వారు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్లోడ్ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా అందుబాటులో ఉంచాలి. యూజర్ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు వారికి అందుబాటులో డిజిటిల్ ఫార్మాట్లో ఉంచాలి. సచివాలయాల్లోని సిబ్బందికి ఇస్తున్న అన్నిరకాల శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఫార్మాట్లో ఉంచాలి. అలాగే ఒక డిజిటిల్ లైబ్రరీని అందుబాటులో ఉంచాలి’’ అని సీఎం జగన్ సూచించారు. కాగా, రాష్ట్రంలో సర్వే పురోగతిపై సమావేశంలో అధికారులు వివరిస్తూ.. ఇప్పటికే 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని వెల్లడించారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో మరి కొన్ని గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, అదే విధంగా అవసరమైనన్ని డ్రోన్లను రంగంలోకి దించుతామని అధికారులు వివరించారు. సర్వేలో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు పూర్తి కాగా, తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఆ గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రికార్డుల ప్యూరిఫికేషన్ పూర్తి చేసి, ముసాయిదా ముద్రిస్తామని చెప్పారు. పట్టణాల్లోనూ (యూఎల్బీ) సర్వే కాగా, పట్టణాలు, నగరాల్లో కూడా సర్వేకు సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో సర్వే మొదలు పెట్టామని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. మిగిలిన పట్టణాలు, నగరాలకు సంబంధించి.. ఫేజ్ –1. జూన్ 2021లో ప్రారంభమై జనవరి 2022 కల్లా 41 పట్టణాలు, నగరాల్లో. ఫేజ్ –2. ఫిబ్రవరి 2022లో ప్రారంభమై, అక్టోబరు 2022 నాటికి 42 పట్టణాలు, నగరాల్లో. ఫేజ్ –3. నవంబర్ 2022లో ప్రారంభమై, ఏప్రిల్ 2023 నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి చేస్తామని మున్సిపల్ అధికారులు వివరించారు. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, రెవెన్యూ కమిషనర్ (సర్వే, సెటిల్మెంట్స్ అండ్ లాండ్ రికార్డ్స్) సిద్దార్ధ జైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ఐజీ ఎంవీవీ శేషగిరిబాబుతో పాటు, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. చదవండి: ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండరాదు: సీఎం జగన్ -
ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండరాదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని సూచించారు. సమగ్ర భూసర్వేకి సంబంధించి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ పథకంపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏం చెప్పారంటే.. ఎలాంటి రుసుము వసూలు చేయవద్దు.. సర్వే వేగంగా చేపట్టినందున రాళ్ల సరఫరా కూడా అంతే ముఖ్యం. రాళ్ల సరఫరా ఆలస్యం కాకుండా చూడాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు. ప్రతి గ్రామ సచివాలయంతో పాటు వార్డులలో ఒక హోర్డింగ్ పెట్టాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వివరాలు ఉండాలి. ముఖ్య కూడళ్లలో శాశ్వత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. సర్వే ముగిసిన గ్రామాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సమగ్ర సర్వే పూర్తయిన 51 గ్రామాల్లో రికార్డుల ప్యూరిఫికేషన్, రికార్డుల అప్డేషన్, సర్వే రాళ్లు పాతడం లాంటివి ముగిసే నాటికి? ఆయా గ్రామాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా ఏర్పాటు కావాలి. ఈ ఏడాది జూలై నాటికి ఆ 51 గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రారంభం కావాలి. అప్పుడే సమగ్ర భూసర్వే పూర్తైనట్లుగా భావించాలి. ఆ మేరకు సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం తగిన ఏర్పాట్లు చేయాలి. సీసీఎల్ఏ కీలకపాత్ర.. సమగ్ర భూ సర్వే సజావుగా జరిగేలా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలి. ఈ ప్రక్రియ మొత్తంలో భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌ది కీలకపాత్ర. వచ్చే జనవరికి తొలిదశ పూర్తి సమగ్ర భూ సర్వే వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత మూడు నెలలుగా వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటం, యంత్రాంగం అంతా ఆ ప్రక్రియలో నిమగ్నం కావడం, దీర్ఘకాలం పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం తదితర కారణాల వల్ల సమగ్ర భూ సర్వేలో కొంత జాప్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.26 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో 17,460 గ్రామాలు, 47,861 ఆవాసాల (హ్యాబిటేషన్స్)కు సంబంధించి సమగ్ర సర్వేకు పక్కాగా ఎస్వోపీ (ప్రామాణిక యాజమాన్య విధానం) రూపొందించినట్లు తెలిపారు. తొలిదశలో జిల్లాకు ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ఆ తర్వాత ప్రతి డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాలు, ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 51 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణ పూర్తి అయిందని, వచ్చే నెల నుంచి గ్రామ స్థాయిలో సర్వే మొదలు పెట్టి జూలై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే 545 గ్రామాల్లో డ్రోన్లతో సర్వే పూర్తి చేసి ఛాయాచిత్రాలు సేకరించామని, వ్యవసాయ భూములు, హ్యాబిటేషన్ల (నివాస ప్రాంతాలు)కు సంబంధించి 2,693 ఛాయాచిత్రాలు తీశామని వివరించారు. మండలానికి ఒకటి చొప్పున 650 గ్రామాలలో సర్వే మొదలుపెట్టి వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఫిబ్రవరిలో రెండో దశ సర్వే.. సమగ్ర భూ సర్వే రెండో దశ సర్వేను 2022 ఫిబ్రవరిలో ప్రారంభించి వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 2022 నవంబరులో మూడో దశ.. మూడో దశను వచ్చే ఏడాది నవంబరులో మొదలు పెట్టి 2023 ఏప్రిల్ నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సర్వే సిబ్బందికి సంప్రదాయ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, మైన్స్ డీఎంజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు. ఎక్కడ, ఎవరు ఏ చిన్న అవినీతికి పాల్పడినా మొత్తం కార్యక్రమానికి చెడ్డపేరు వస్తుంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ప్రతిచోటా తనిఖీ పక్కాగా ఉండాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – సీఎం వైఎస్ జగన్ రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు... మొత్తం భూ రికార్డులు, డేటాను అప్డేట్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం నుంచి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం లభించేలా చూడాలి. ఆ విధంగా ఒక సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. సర్వే ప్రక్రియకు నిధుల కొరత రాకూడదు. సర్వే తర్వాత పక్కాగా సరిహద్దులు చూపాలి. మొత్తం సర్వే పూర్తయిన తర్వాత చెత్తా చెదారం తొలగించి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే జంగిల్ క్లియరెన్స్ కింద వాటన్నింటినీ తొలగించి చివరగా రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు పాతాలి. ఆ విధంగా ఈ ప్రక్రియలో రైతుల ప్రమేయం కూడా ఉండాలి. -
హెచ్ఎండీఏ మినహా..రాష్ట్రమంతా భూముల సర్వే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూముల పూర్తిస్థాయి సర్వేకు ప్రభుత్వం పకడ్బందీగా సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండేలా అత్యాధునిక పద్ధతుల్లో సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వెరీ హైరిజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ (వీహెచ్‌ఆర్‌ఎస్‌ఐ) వ్యవస్థను వినియోగించి సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది కూడా. ఈ సర్వే ప్రక్రియలో చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. సర్వే అయ్యాక భూముల రికార్డులను తనిఖీ చేసి యజమానులకు నోటీసులు జారీ చేయాలని, అప్పీళ్లు వస్తే వాటన్నింటినీ పరిష్కరించాకే తుది రికార్డులను నమోదు చేయాలని భావిస్తోంది. జియో రిఫరెన్స్.. ఫోటోగ్రామెట్రీ సాఫ్ట్వేర్లతో.. రాష్ట్రంలో మొత్తం భూవిస్తీర్ణం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లుకాగా.. అందులో 77,916 చదరపు కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ భూములను సర్వే చేయనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో, అటవీ భూముల్లో ఎలాగూ వ్యవసాయ భూములుండే అవకాశం లేనందున.. ఈ ప్రాంతాలను మినహాయించి మిగిలిన భూములను సర్వే చేయనున్నారు. ఇందుకోసం వీహెచ్‌ఆర్‌ఎస్‌ఐ విధానాన్ని వినియోగించాలని గతంలోనే నిర్ణయించారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ద్వారా నిరంతరం పనిచేసేలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 రిఫరెన్స్ స్టేషన్లను ఏర్పాటు చేసి, కచ్చితమైన భూనియంత్రణ పాయింట్లను నిర్ధారించనున్నారు. ఈ పాయింట్ల నుంచి 28 సెంటీమీటర్ల స్థాయి వరకు రిజల్యూషన్ ఉండే శాటిలైట్ ఇమేజ్‌లను సేకరించి.. వాటిని జియో రిఫరెన్స్, ఫోటోగ్రామెట్రీ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఆర్థోఫోటోలను తయారు చేస్తారు. ఆ ఫోటోల ఆధారంగా ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లలో కమతాల సరిహద్దులను క్యాప్చర్ చేసి.. భూహక్కుల రికార్డుల్లోని (ఆర్ఓఆర్) ఆధారంగా సదరు కమతానికి అనుసంధానం చేస్తారు. ఈ వివరాలను ఏకీకృత భూసమాచార వ్యవస్థకు అనుసంధానం చేసి.. రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, భూరికార్డుల శాఖల సమక్షంలో తనిఖీ చేస్తారు. ఆ తర్వాత తుది సర్వే రికార్డులు నమోదు చేస్తారు. దేనికెంత ఖర్చు? రాష్ట్రంలో డిజిటల్ విధానంలో భూముల సర్వేకు అయ్యే ఖర్చు వివరాలను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ శాఖ అవుట్‌కమ్ బడ్జెట్లో పేర్కొన్నారు. ఒక చదరపు కిలోమీటర్లో 28 సెంటీమీటర్ల రిజల్యూషన్ ఉన్న శాటిలైట్ ఇమేజ్‌ల కోసం రూ.4,000 చొప్పున ఖర్చవుతుందని.. దాదాపు 80వేల చదరపు కిలోమీటర్లకు గాను రూ.32 కోట్లు అవసరమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక అటవీ సరిహద్దు ప్రాంతాలను లైడార్ పద్ధతిలో స్కానింగ్ చేసేందుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని.. మండలానికో రిఫరెన్స్ స్టేషన్ ఏర్పాటు చేసి సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ సాయంతో 600 రోవర్స్ సమకూర్చేందుకు రూ.30 కోట్లు వ్యయం కావచ్చని అంటున్నాయి. మరోవైపు భూనియంత్రణ పాయింట్ నెట్వర్క్ ఏర్పాటు, గ్రౌండ్ టూతింగ్ కోసం చరదపు కిలోమీటర్‌కు రూ.42 వేల చొప్పున మొత్తం రూ.327 కోట్లు కానుందని అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రూ.400 కోట్ల మేర వ్యయం అవుతుందని చెబుతున్నారు. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించన నేపథ్యంలో.. ఈ ఏడాదిలోనే వ్యవసాయ భూముల డిజిటల్ రీసర్వే చేసే చాన్స్ ఉందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. సర్వే కోసం ప్రభుత్వం తీసుకున్న భూవిస్తీర్ణ గణాంకాలు (చదరపు కిలోమీటర్లలో) రాష్ట్రం మొత్తం విస్తీర్ణం: 1,12,077 అటవీ ప్రాంతం: 26,904 మిగిలిన ప్రాంతం: 85,173 హెచ్ఎండీఏ ప్రాంతం: 7,257 ఇమేజరీ సేకరించాల్సిన ప్రాంతం: 77,916 (హెచ్ఎండీఏ, అటవీ ప్రాంతాలు మినహా) -
త్వరలోనే భూముల డిజిటల్ సర్వే: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం ప్రగతి భవన్లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంటనే సర్వే కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. డిజిటల్ సర్వేతోనే భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సర్వే కరోనా కారణంగా ఆలస్యం అయిందని తెలిపారు. ఇక ఒకేసారి సర్వే పూర్తయితే రైతుల మధ్య భూ పంచాయతీలు ఉండవని, ఇక పోడు భూముల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమయిందని కేసీర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు కూడా జాబ్ చార్టు రూపొందించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. -
నెలాఖరు వరకు ఇళ్ల పట్టాల పంపిణీ: సీఎం
సాక్షి, అమరావతి: దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ 90 రోజుల్లోగా పట్టా ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విధానం సమర్థవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాద్ దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం గిరిజా శంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమవేశంలో పాల్గొన్నారు. సర్వే సిబ్బందికి శిక్షణ ఈ సందర్భంగా సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ‘ఇప్పటికే రెండు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించాం.ఇందులో 92శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నాం. ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇందుకు స్పందనగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధిత అంశాలపై సమర్థతను పెంచడానికి అవగాహన, శిక్షణ, పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రమం తప్పకుండా ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచడమే లక్ష్యం కావాలని దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా.. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేంతవరకూ వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు, సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం పెంచేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. తద్వారా పనితీరులో సమర్థత కనబరుస్తారని పేర్కొన్నారు. ఇక పేదలకు కొత్తగా నిర్మించనున్న కాలనీలను కూడా సర్వేలో భాగంగా తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ‘‘మ్యాపుల తయారీలో వీటినీ పరిగణలోకి తీసుకోవాలి. కాలనీల్లో ప్రతి ఇంటికీ కూడా యూనిక్ ఐడీ నంబరు ఇవ్వాలి. సర్వేకు గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్తున్న సందర్బంలో ప్రతిరోజూ కనీసం 2 గంటల పాటు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు. రిజిష్ట్రార్ కేంద్రాలుగా సచివాలయాలు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కార్యాచరణను అధికారులు ముఖ్యమంత్రికి వివరించగా.. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తైన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనితీరును స్వయంగా చూసి నేర్చుకునేలా కార్యాచరణ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బందికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్ అధికారులతో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిబంధనల ప్రకారం చేసే అవకాశం సిబ్బందికి ఉంటుంది. ఇప్పటికే ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది, ఇదికూడా కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఓపీ సర్వేయరు నుంచి జేసీ వరకూ ఈ ప్రక్రియపై కచ్చితమైన ఎస్ఓపీలు ఉండాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. లంచాలకు తావులేని వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే సరికొత్త వ్యవస్థలు అని, మొబైల్ ట్రైబ్యునల్స్‌పైన కూడా ఎస్ఓపీలను తయారుచేయాలని ఆదేశించారు. జనవరి 30 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగింపు: సీఎం ఇక ఇళ్లపట్టాలకు సంబంధించి... ప్రతి లబ్ధిదారునికి నేరుగా పట్టా పత్రం అందిస్తున్నామని, తన ఇంటి స్థలం ఎక్కడో చూపిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందుకు బదులుగా.. లబ్ధిదారులకు సంతృప్తి కలిగించేలా కార్యక్రమం కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. ‘‘ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ విధానం సమర్థవంతంగా కొనసాగాలి. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. -
ఆ పథకం పూర్తి వివరాలు మా ముందుంచండి
సాక్షి, అమరావతి: భూముల రీసర్వే కార్యక్రమం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్షణ పథకం’ పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూముల రీసర్వే వల్ల గిరిజన ప్రాంతాల్లోని భూములు గిరిజనేతరులపరమయ్యే ప్రమాదముందన్న పిటిషనర్ ఆందోళన నేపథ్యంలో దీనిపై స్పష్టతనివ్వాలని స్పష్టం చేసింది. అలాగే ఈ పథకం కింద పట్టాల జారీ విషయంలోనూ స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్షణ పథకం’ వల్ల గిరిజన ప్రాంతాల్లోని గిరిజనుల భూములు గిరిజనేతరులపరం అయ్యే ప్రమాదముందని, అందువల్ల ఆ భూములపై గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు కల్పించకుండా ఆదేశాలివ్వాలంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కుంజా శ్రీను ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ రమణ వాదనలు వినిపించగా, దీనిపై ప్రభుత్వ న్యాయవాదులు జీఎల్ నాగేశ్వరరావు, రంగారావు ప్రతిస్పందిస్తూ.. ఇది కేవలం భూముల రీ సర్వేకు సంబంధించి మాత్రమేనని, దీనివల్ల ఎవరి హక్కులు ప్రభావితం కావని తెలిపారు. ఈ పథకం కింద ప్రత్యేకంగా పట్టాలు ఏవైనా జారీ చేస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వివరాలు తెలుసుకుని చెబుతామని వారు కోర్టుకు నివేదించారు. అలాగైతే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
రాష్ట్రమంతా ఒకే నమూనా సర్వే రాళ్లు
సాక్షి, అమరావతి: సర్వే రాళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద చిక్కు. ఇది సర్వే రాయా, కాదా అని తెలుసుకోవాలంటే దాన్ని పెకలించి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్న సమస్య. సమగ్ర రీసర్వే తర్వాత ఇలాంటి అనుమానాలకు ఆస్కారమే ఉండదు. సర్వే అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నాటే సర్వే రాళ్లన్నీ ఒకే నమూనాలో ఉంటాయి. ట్రైజంక్షన్లలో పెద్దవి, సర్వే నంబర్ల మధ్య చిన్నవి పాతుతారు. వీటిపై ‘వైఎస్సార్ జగనన్న భూరక్ష –2020’ అనే అక్షరాలు ఉంటాయి. ఈ రాయిని చూస్తేనే ఇది 2020లో జరిగిన రీసర్వే సందర్భంగా నాటిన సర్వే రాయి అని తెలుస్తుంది. సర్వే రాళ్లను గుర్తించడానికి ఎలాంటి చిక్కులు ఉండకుండా ఒకే నమూనా రాళ్లు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయడంవల్ల ఒకవేళ ఎక్కడైనా సర్వే రాళ్లు పడిపోయినా సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ప్రతి సర్వే రాయిని జియో ట్యాగింగ్ చేస్తారు. దీంతో ఎవరైనా ఈ రాళ్లను పీకేసినా ఇది ఎక్కడ ఉండాల్సిందో సులభంగా గుర్తించవచ్చు. మొదటి విడత సర్వే చేయనున్న 5,500 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 17,461 ‘ఎ’ క్లాస్ సర్వే రాళ్లు, 50 లక్షల ‘బి’ క్లాస్ సర్వే రాళ్లు అవసరమని సర్వే సెటిల్మెంట్ విభాగం లెక్కకట్టింది. ఈమేరకు రాళ్లను వచ్చే నెల ఒకటో తేదీ నాటికి సేకరించాలని ప్రభుత్వం సర్వే సెటిల్మెంట్ శాఖను ఆదేశించింది. భూగర్భ గనులశాఖ సహకారంతో ఈ రాళ్లను సేకరించి ఆయా గ్రామాలకు అవసరమైన మేరకు పంపుతారు. వీటిని ఆయా గ్రామాల్లో సచివాలయాల వద్ద భద్రపరిచేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ‘ఎ’ క్లాస్ రాళ్లు మూడు గ్రామాలు కలిసే సరిహద్దుల్లో (ట్రై జంక్షన్లలో) వీటిని నాటుతారు. పెద్ద పరిమాణంలో ఉండే ఈ రాళ్లను ‘ఎ’ క్లాస్ రాళ్లు అంటారు. ఇవి ఎక్కువ ఎత్తు ఉండటంవల్ల దూరం నుంచే కనిపిస్తాయి. వీటికి సర్వే సెటిల్మెంట్ కమిషనర్ ఆమోదించిన డిజైన్ ప్రకారం పైన రోలు లాగా చిన్న గుంత ఉంటుంది. రాష్ట్రమంతా ఈ రాళ్లు ఒకే ఎత్తు, వెడల్పు, డిజైన్‌లో ఉంటాయి. ‘బి’ క్లాస్ రాళ్లు కొద్దిగా చిన్న పరిమాణంలో ఉండే వీటిని ‘బి’ క్లాస్ రాళ్లు అంటారు. సర్వే నంబర్లకు సరిహద్దులుగా ఈ రాళ్లను నాటుతారు. సర్వే సెటిల్మెంట్ కమిషనర్ ఆమోదించిన డిజైన్ల ప్రకారం వీటికి ఒకవైపు బాణం కోణంలో గుర్తు ఉంటుంది. -
వైఎస్సార్–జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ప్రారంభం
-
తక్కెళ్లపాడులో సర్వే ఎలా చేశారంటే..?
సాక్షి, మచిలీపట్నం: తక్కెళ్లపాడు.. వందేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా చేసిన ఈ గ్రామం రాష్ట్రవ్యాప్త రీసర్వేకి ఆదర్శంగా నిలిచింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో దేశంలోనే తొలిసారిగా కంటిన్యూస్ ఆపరేటింగ్ రిసీవింగ్ స్టేషన్ (కోర్స్) నెట్వర్క్ ద్వారా డ్రోన్లను ఉపయోగించి రీసర్వేకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 11 ప్రత్యేక బృందాలు 31 రోజులపాటు శ్రమించాయి. సర్వే ఎలా చేశారంటే.. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా వెబ్‌ల్యాండ్ రికార్డుల్ని అప్డేట్ చేసి తొలుత గ్రామ సరిహద్దుల గుర్తింపు చేపట్టారు. గల్లంతైన 102 సరిహద్దురాళ్లు వేశారు. రెండోదశలో 86 సర్వే నంబర్లలో ఉన్న 272.52 ఎకరాల ప్రభుత్వ భూములను, మూడోదశలో 221 సర్వే నంబర్లలో ఉన్న 1,266.45 ఎకరాల ప్రైవేటు భూములను సర్వేచేసి హద్దులు గుర్తించారు. చివరగా గ్రామంలో ఉన్న ఆలయాలు, ప్రభుత్వ భవనాలు, ఇళ్లు, ప్రైవేటు ఆస్తులు సర్వే చేశారు. గుర్తించిన వ్యత్యాసాలకు సంబంధించిన 9 (2) నోటీసులపై 147 అప్పీళ్లు వచ్చాయి. వీటిలో 112 అప్పీళ్లను పరిష్కరించారు. మిగిలిన కేసులను పరిష్కరించి 10వ తేదీన ఫైనల్ పబ్లికేషన్ జారీచేశారు. కొత్తగా రూపొందించిన గ్రామ మ్యాప్, ఎఫ్ఎంబీ, ఆర్ఎస్ఆర్, అడంగల్, ఐబీ, ప్రభుత్వ భూముల రిజిష్టర్లను నేడు (సోమవారం) ప్రకటిస్తారు. భూ యజమానులకు కొత్త పాస్‌పుస్తకాలు జారీచేస్తారు. కొత్త సర్వే రాళ్లు పాతుతారు. గుర్తించిన వ్యత్యాసాలు ఎఫ్ఎంబీ ప్రకారం 6.04 శాతం, అడంగల్ ప్రకారం 11.25 శాతం వ్యత్యాసం ఉన్నట్లుగా గుర్తించారు. సబ్ డివిజన్ల ప్రకారం అత్యధికంగా 2.10 ఎకరాలు, అత్యల్పంగా 0.01 ఎకరాలు, అడంగల్ ప్రకారం అత్యధికంగా 3.73 ఎకరాలు, అత్యల్పంగా 0.01 సెంట్ల తేడా ఉన్నట్లు నిర్ధారించారు. పాత ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నంబరు 97లో 1.46 ఎకరాలు ఎక్కువ, సర్వే నంబరు 125లో 0.80 ఎకరాలు తక్కువ ఉన్నట్టుగా గుర్తించారు. అడంగల్ ప్రకారం 3.73 ఎకరాలు తక్కువగా నమోదైనట్టుగా లెక్క తేల్చారు. (చదవండి: జనం ఆస్తికి అధికారిక ముద్ర) -
రీసర్వేకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికా బద్ధంగా చేస్తోంది. గత వందేళ్ల చరిత్రలో దేశంలో ఎక్కడా తలపెట్టని అతి పెద్ద సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నందున అవసరమైనవన్నీ సమకూర్చుకుంటూ ముందుకెళుతోంది. హైబ్రిడ్ మెథడ్‌లో కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధిష్ట సమయంలో సర్వే క్రతువు పూర్తి చేసేందుకు టైమ్‌లైన్ రూపొందించింది. రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో రీసర్వేకు నిబంధనావళి రూపొందించాయి. 17,460 రెవెన్యూ గ్రామాల్లో.. – రాష్ట్ర వ్యాప్తంగా 17,461 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించి యజమానులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. – మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తులను మూడు దశల్లో సర్వే చేయనున్నారు. మొదటి దశలో 5,122 గ్రామాల్లో, రెండో దశలో 6000 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తారు. తదుపరి మూడో దశలో మిగిలిన గ్రామాల్లో సర్వే ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేస్తారు. – డ్రోన్ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియానే డ్రోన్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ సర్వేయర్ల బృందం రాష్ట్రానికి చేరుకుంది. శరవేగంగా రికార్డుల స్వచ్చికరణ – రెవెన్యూ రికార్డుల స్వచ్చికరణ కార్యక్రమం చకచకా సాగుతోంది. ఎంపిక చేసిన గ్రామాల సరిహద్దు రాళ్లను అక్కడి సర్వేయర్లు గుర్తించారు. రికార్డులను సర్వే టీమ్‌కు అందజేశారు. సర్వే సమయంలో వచ్చే వివాదాలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 670 మొబైల్ ట్రైబ్యునల్స్‌ను కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది. – ఈ సర్వేలో జిల్లాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో రీసర్వేకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. గ్రామాల వారీగా సర్వే ప్రారంభమయ్యే తేదీలను ఆయా జిల్లా కలెక్టర్ల పేరుతో సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. రీ సర్వే సమయంలో అందుబాటులో ఉండాలని గ్రామ సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాలు, పట్టణాల వారికి సూచిస్తారు. మొదటి విడతలో 30 బేస్ స్టేషన్లు – రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కోసం 70 బేస్ స్టేషన్లు (సెల్‌ఫోన్ పని చేయడానికి సెల్ టవర్లలాగే రోవర్లకు బేస్ స్టేషన్లు అవసరం) ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో 5,122 గ్రామాల్లో రీసర్వేకు ఇబ్బంది లేకుండా తొలుత 30 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 5 పూర్తయ్యాయి. మిగిలిన 25 బేస్ స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. – జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 3, విశాఖపట్నంలో 4, తూర్పుగోదావరిలో 7, పశ్చిమ గోదావరిలో 4, కృష్ణాలో 5, గుంటూరులో 3, ప్రకాశంలో 7, నెల్లూరులో 5, చిత్తూరులో 7, వైఎస్సార్ కడపలో 5, కర్నూలులో 5, అనంతపురంలో పది కలిపి మొత్తం 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రేపు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద రీసర్వే పూర్తి చేసిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ నెల 21వ తేదీ (సోమవారం) పట్టాలు ఇవ్వడం ద్వారా రీసర్వే మహాక్రతువుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పచ్చజెండా ఊపుతారు. భూ యజమానులకు ఫీల్డ్ మ్యాపు, భూ యాజమాన్య హక్కు పత్రం (1బి), గ్రామంలోని స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తుల యజమానులకు ప్రాపర్టీ కార్డు (ఆస్తి పత్రం) అందజేస్తారు. అనంతరం ఈనెల 22వ తేదీన ప్రతి జిల్లాల్లో ఒక్కో గ్రామంలో రీసర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 13 గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేశారు. తదుపరి వారం రోజుల్లో ఒక్కో రెవెన్యూ డివిజన్లో ఒక్కో గ్రామం చొప్పున మొత్తం 51 గ్రామాల్లో, తర్వాత నాలుగైదు రోజుల్లో ఒక్కో మండలంలో ఒక్కొక్కటి చొప్పున 670 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభిస్తారు. పక్షం లేదా 20 రోజుల నాటికి 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేలా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన 14,000 మంది సర్వేయర్లలో 9,423 మందికి సర్వే సెటిల్మెంట్ విభాగం ఇప్పటికే సంప్రదాయ సర్వే విధానాలపై శిక్షణ ఇచ్చింది. 6,740 మందికి ఆటోక్యాడ్, ఎల్రక్టానిక్ టోటల్ స్టేషన్స్ (ఈటీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) సర్వేపై శిక్షణ పూర్తి చేసింది. ఎలాంటి రికార్డులు అడగరు రీ సర్వే సందర్భంగా యజమానులు ఎలాంటి రికార్డులు చూపించాల్సిన పని ఉండదు. రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారమే సర్వే పూర్తి చేస్తారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం అన్నీ పరిశీలించి ఎలాంటి వివాదాలు లేని వారికి నిర్దిష్ట కాల పరిమితిలో శాశ్వత భూ హక్కులు కల్పిస్తారు. ప్రతి భూమి బిట్ (పార్సల్)కు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తారు. రెవెన్యూ, సర్వే రికార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. రీ సర్వే తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తోంది. – నీరబ్ కుమార్ ప్రసాద్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ -
భూ సర్వే: ఏ చిన్న సమస్య ఉండకూడదనే ..
సాక్షి, అమరావతి : భూముల రీ సర్వే నిర్ణయం చారిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. 2023 జూలై నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భూమి అంశంలో ఏ చిన్న సమస్య ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ పాదయాత్రలో భూ వివాదాలపై అనేక ఫిర్యాదులు అందాయని ప్రస్తావించారు. భూ సర్వే ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమమని.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించినా ప్రైవేట్ సంస్థల వలన అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. చదవండి: ‘సవరించిన అంచనాలను ఆమోదించండి’ ఈసారి మేము సర్వే ఆఫ్ ఇండియా తో కలిసి పని చేస్తున్నాం .స్థిరాస్తులు అన్ని సర్వే చేస్తాం. గ్రామ సచివాలయాల్లో ఈ భూ రికార్డులు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి రైతులకు అండగా నిలుస్తాం. చట్టబద్ధమైన, న్యాయమైన హక్కులు చేకూరుతాయి అని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ అంశం పై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. అత్యాధునిక సాంకేతికతతో సర్వే నిర్వహిస్తాం. ప్రజలతో పాటు, ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాం’ అని తెలిపారు. -
విజయవాడ: ఈ నెల 21 నుంచి రీసర్వే ప్రారంభం
-
ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు: గిరీష్ కుమార్
సాక్షి, విజయవాడ: భూముల రీసర్వే కచ్చితత్వంతో పూర్తి చేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ అన్నారు. మొదటి దశలో భాగంగా ఈ నెల 21న రీసర్వే ప్రారంభవుతుందని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్తంగా భూములను సమగ్రంగా రీసర్వే చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సర్వే ఆఫ్ ఇండియాతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో గిరీష్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో మాత్రమే రీసర్వే జరగనుందని పేర్కొన్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ పూర్తి ఆధునిక సాంకేతికత ద్వారా రీసర్వే చేపడతాం. ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తాం. అత్యాధునిక కెమెరాలు, డ్రోన్లు వినియోగిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంపై 14 వేల మంది సర్వేయర్లకి శిక్షణ ఇవ్వనున్నాం. రీసర్వే చేసి మేం ఇచ్చే మ్యాపులు అన్ని ప్రభుత్వ శాఖలకి ఉపయోగకరంగా ఉంటాయి. సర్వే ఆఫ్ ఇండియాకి ప్రామాణికత అధికం. మూడు దశల్లో కచ్చితత్వంతో రీసర్వే పూర్తిచేస్తాం. జాతీయ మ్యాపులు తయారు చేసే ఏజెన్సీగా సర్వేయర్ ఆఫ్ ఇండియా ఉంది. రీసర్వేకి జీపీఎస్ అనుసంధానం చేసిన డ్రోన్‌తో కొనసాగుతుంది. అయిదు సెంటీమీటర్ల మార్పుతో కచ్చితమైన సర్వే జరుగుతుంది. తిరుపతిలో ఒక ట్రైనింగ్ అకాడమి ఏర్పాటు చేస్తాం. ఛార్టర్డ్ సర్వేయర్లను రాబోయే కాలంలో అందించేందుకు ఈ ట్రైనింగ్ అకాడమీ ఉంటుంది’’ అని గిరీష్ కుమార్ తెలిపారు.(చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ ) మూడేళ్లపాటు ఒప్పందం రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి రీసర్వే ప్రారంభం కాబోతోందని సీసీఎల్ఎ ఛీఫ్ కమీషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రీసర్వే పూర్తయ్యే వరకు రాబోయే మూడేళ్ల పాటు ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ రీసర్వే ద్వారా ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తాం. లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ ఆధారంగా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ప్రతీ గ్రామంలో డ్రోన్ సర్వే ద్వారా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది’’ అని తెలిపారు. 17340 గ్రామాల్లో.. మూడు దశల్లో: ఉషారాణి ‘‘మన రాష్ట్రంలో బ్రిటిష్ కాలంలో వంద సంవత్సరాల క్రితం సర్వే జరిగింది. మళ్లీ ఇప్పుడు జరుగుతోంది. భూమి విలువ పెరగడంతో భూసమస్యలు పెరిగాయి. రీసర్వే ద్వారా భూవివాదాలకి పరిష్కారం లభిస్తుంది. ప్రజలు రీసర్వేకి సహకరించాలి. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పధకం ఈ నెల 21 న ప్రారంభిస్తాం. 2023 నాటికి మూడు దశల్లో ముగుస్తుంది. 14 వేల మంది సర్వేయర్లకి ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. రీ సర్వే కోసం 956 కోట్లను కేటాయించాం. భూ యాజమానికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తాం. డ్రోన్లు వినియోగిస్తాం. ప్రభుత్వ ఖర్చుతోనే భూములకి రీసర్వే చేసి రాళ్లు కూడా వేయడం జరుగుతుంది. రీసర్వే ద్వారా అసలైన యాజమానికి పూర్తి హక్కులు లభిస్తాయి. అదే విధంగా రీసర్వే తర్వాత సంబంధిత భూములపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. అటవీ భూములు మినహాయించి వ్యవసాయ భూములు, గ్రామనకంఠాలు, పట్టణాలలోని భూములన్నింటికీ రీసర్వే జరుగుతుంది. 17340 గ్రామాలలో మూడు ఫేజులలో రీసర్వే పూర్తి చేస్తాం. మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మొబైల్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాం’’ అని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి తెలిపారు. -
భూమికి ట్యాగ్‌లైన్, లోగోలతో భరోసా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూములను సంపూర్ణంగా సర్వే చేసి యజమానులకు వాటిపై శాశ్వత హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన బృహత్తర కార్యక్రమానికి మంచి పేరు, ట్యాగ్‌లైన్, లోగో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సర్వే నంబరుకు కచ్చితమైన హద్దుల నిర్దారణ, రైతులకు శాశ్వతహక్కుల కల్పన లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూముల సమగ్ర రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అమలు చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకుని ముందుకెళుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా రీసర్వే యజ్ఞానికి శ్రీకారం చుడుతుండటం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వందేళ్ల తర్వాత చేపడుతున్న అతి పెద్ద సాహసోపేత కార్యక్రమం అయినందున ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా ప్రజలకు దీని ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత పేర్లు ఇవే... ఈ బృహత్తర కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా కొన్ని పేర్లను ప్రతిపాదించారు. ‘స్వక్షేత్ర’, ‘క్షేత్రఘ్న’, ‘స్వధాత్రి’, ‘స్వభూమి’, ‘వసుంధర’, ‘వసుధ’, ‘క్షేత్రపతి’, ‘భూమిదారు’ తదితర పేర్లను ప్రాథమికంగా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. మరికొన్ని పేర్లనూ పరిశీలించి అందులో ఒకదానిని ముఖ్యమంత్రి ఆమోదించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఏడు ప్రతిపాదనలు ట్యాగ్ లైన్ కోసం ఏడు ప్రతిపాదనలను రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించారు. ‘మీ భూమికి మా హామీ’, ‘మీ భూమికి భద్రత’, ‘మీ భూమి పదిలం’, ‘మీ భూమికి శాశ్వత హక్కు‘, ‘ప్రతి క్షేత్రం పదిలం’, ‘మీ భూమికి మా భరోసా’, ‘ప్రతి క్షేత్రం క్షేమం’ అనే అంశాలను ట్యాగ్‌లైన్ కోసం ప్రాథమికంగా ప్రతిపాదించారు. రైతుపై నయాపైసా భారం ఉండదు రీ సర్వే కోసం ఎంత ఖర్చయినా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, భూ యజమానులపై నయాపైసా భారం కూడా వేయరాదని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నంబరు రాళ్ల ఖర్చును రైతులే చెల్లించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినా అది కూడా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాడు... గతంలో భూమి కొలతలు, సబ్ డివిజన్ చేయించుకోవాలంటే చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చేది. ముందుగా మీసేవ కేంద్రంలో డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాల్సి వచ్చేది. ముడుపులు ఇవ్వనిదే సర్వేయరు వచ్చి భూమి కొలతలు వేయని పరిస్థితి. సర్వేయర్ల కొరతవల్ల నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. నేడు... వైఎస్ జగన్ సర్కారు రాగానే 11,500 పైగా గ్రామ సర్వేయర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించింది. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయరు ఉన్నారు. ఎవరు భూమి కొలతలు వేయించుకోవాలన్నా గ్రామ/ వార్డు సచివాలయంలో అర్జీ ఇస్తే చాలు. వెంటనే సర్వేయరు వచ్చి పని పూర్తి చేస్తారు. ఇప్పటి వరకూ విదేశాలకే పరిమితమైన కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) అనే అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూసర్వేకు కార్యాచరణ రూపొందించాం రాష్ట్రంలో 120 ఏళ్ల నుంచి భూముల సర్వే జరగలేదు. దీనివల్ల చాలాచోట్ల సరిహద్దు రాళ్లు లేవు. పెద్ద సంఖ్యలో పొలంగట్ల వివాదాలు ఉన్నాయి. రికార్డులు సక్రమంగా లేనందున రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందువల్లే రికార్డులను స్వచ్ఛీకరించి ట్యాంపర్డ్ ఫ్రూఫ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయన మార్గనిర్దేశం ప్రకారం భూ సర్వేకి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. - వి. ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి. -
'సమగ్ర భూసర్వేను పక్కాగా నిర్వహించాలి'
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాశ్వతంగా భూహక్కు కల్పించే సమగ్ర సర్వేకు సంబంధించిన ఏర్పాట్లు, టైటిల్ తదితర వివరాలతో పాటు, కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను సమావేశంలో అధికారులు వైఎస్ జగన్‌కు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ..'శాశ్వత భూహక్కు కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపడుతున్నాం.దీన్ని పక్కాగా నిర్వహించాలి.ఇప్పుడు అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1న సమగ్ర భూసర్వే మొదలు కావాలి. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలి. వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోంది, దీనివల్ల రాష్ట్రంలో పక్కాగా భూరికార్డుల డిజిటలైజేషన్ అవుతుంది.అత్యాధునిక టెక్నాలజీ.. డ్రోన్లు, రోవర్స్ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం.త్వరలోనే సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలి. అలాగే సచివాలయాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి. గతంలో రికార్డులు ట్యాంపర్ చేయడానికి చాలా అవకాశం ఉండేది, ఆ పరిస్థితి పూర్తిగా మారాలి. ఎవ్వరు కూడా రికార్డులు తారుమారు (ట్యాంపర్) చేసే అవకాశం లేకుండా డిజిటైజేషన్ జరుగుతుందని' పేర్కొన్నారు.( చదవండి : రూ.40కి కేజీ ఉల్లి అందించనున్న ఏపీ ప్రభుత్వం) కాగా, అంతకు ముందు సమీక్షా సమావేశంలో అధికారులు పలు అంశాలను వివరించారు. వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే కొనసాగుతుందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4500 బృందాలు పని చేస్తాయని వారు వెల్లడించారు. భౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్) ద్వారా శాటిలైట్ ఫోటోలు పొందడం, ఆ ఇమేజ్ను ప్రాసెస్ చేయడం, క్షేత్రస్థాయి పరిశీలన, ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్మెంట్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. డ్రోన్ల ద్వారా స్పష్టంగా గ్రామ కంఠాలను జీఐఎస్ ద్వారా ఫోటో తీస్తామని పేర్కొన్నారు.(చదవండి : అమరావతిలో చంద్రబాబు చేసిన అభివృద్ధేంటి?) వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వే రెండేళ్లలో జనవరి 2023 నాటికి పూర్తవుతుందని, మూడు దశల్లో సర్వే కొనసాగుతుందని వివరించారు. సమగ్ర భూసర్వే కోసం 70 కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్(బేస్ స్టేషన్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే కొన్నింటిని ఏర్పాటు చేశామని తెలిపారు.మొబైల్ (విలేజ్) కోర్టులు కూడా ఏర్పాటు అవుతున్నందున వివాదాలు కూడా ఎక్కడికక్కడే వేగంగా పరిష్కారమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌ప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఐజీ సిద్థార్థజైన్‌తో పాటు, రెవెన్యూ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. -
విజయనగరంలో సమగ్ర భూ సర్వే..!
మరికొద్ది నెలల్లో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. భూముల వివరాలు ఆన్లైన్ కానున్నాయి. ప్రభుత్వ పథకాలు, రాయితీలు అర్హులైన రైతులకు అందనున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న భూ సమగ్ర సర్వే నిర్ణయం రైతుల్లో ఆనందం నింపుతోంది. సాక్షి, మెరకముడిదాం: దశాబ్దాల కాలంగా రైతులను వెంటాడు తున్న భూ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడగులేస్తోంది. భూముల సమగ్ర సర్వేకు సన్నద్ధమవుతోంది. 2021 జనవరి నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేందు కు ఏర్పాట్లు చేస్తోంది. రైతుల భూములకు చెందిన రికార్డుల సమస్యలను గుర్తించిన సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భూ సమగ్రసర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 12లక్షల60వేల377ఎకరాల 20 సెంట్ల భూమిని అధికారులు సర్వే చేయనున్నారు. దీనివల్ల భూముల వివరాలు పక్కాగా నమోదవుతాయని, ఎలాంటి వివాదాలకు తావుండదని, వివాదాల్లో ఉన్న భూములకు పరిష్కారం దొరుకుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సమస్యలకు చెక్... గతంలో పట్టాదారు పాస్ పుస్తకం ఒకరిపేరు మీద ఉంటే రెవెన్యూ రికార్డుల్లో ఇంకొకరి పేరుతో ఆ భూమి ఉండేది. ఫలితంగా సంక్షేమపథకాలు సంబంధిత రైతులకు అందడంలేదు. మరోవైపు తల్లిదండ్రులు మృతిచెందితే... వారిపేరు మీద ఉన్న భూములు వారసుల పేరుకు మార్చేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ సమగ్ర సర్వే ఒక్కటే మార్గమని సీఎం భావిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం– కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ నెట్వర్క్ సాయంతో సమగ్ర భూసర్వేకు సన్నద్ధమవుతున్నారు. గ్రామాల్లో రైతులకు ఉన్న భూములను గుర్తించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. చిన్నచిన్న కమతాల నుంచి భూస్వాముల వరకూ ప్రతీది నమోదు చేస్తారు. జనవరి నుంచి ఈ పునఃసర్వే జరగనుంది. తొలుత మెట్ట ప్రాంతాలను తీసుకోగా, అనంతరం పల్లపు భూములను కొలతలు వేసి ప్యూరిఫికేషన్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు సర్వేయర్లతో పాటు ఇతర అధికారులకు శిక్షణ ఇస్తోంది. క్షేత్రస్థాయి నుంచి సర్వే... ముందుగా తహసీల్దార్ కార్యాలయాల్లోని రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి రికార్డులు గ్రామస్థాయిలోకి వెళ్తా యి. రైతులకు ఉన్న వాస్తవ భూమిని పరిశీలించి సరి చేస్తారు. చిన్నచిన్న సమస్యలు ఉన్నచోట వెంటనే పరిష్కరిస్తారు. పెద్ద, పెద్ద సమస్యలను తహసీల్దార్ సమక్షంలో పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయి నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. కోర్టులో కేసులు ఉన్నవాటి వివరాలను ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచుతారు. మిగిలిన భూము ల వివరాలు మొత్తం ఆన్లైన్ కానున్నాయి. వీటితో పాటు ఇంటిపట్టాల వివరాలు, పొజిషిన్ సర్టిఫికెట్లు, ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు పట్టాలు కూడా ఆన్లైన్ కానున్నాయి. సమగ్ర సర్వే నిర్వహిస్తాం.. భూ సమగ్ర సర్వేకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే సర్వేయర్లకు, అధికారులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 2021 జనవరి నుంచి ఈ సర్వే ప్రారంభం కానుంది. ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించనుంది. సమగ్ర సర్వే వల్ల భూముల వివరాలు క్రమబద్ధీకరణ జరుగుతుంది. దీనికి రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలి. – పీవీఎన్ కుమార్, జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్, విజయనగరం -
భూ సర్వే పైలట్ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
జనవరి 1 నుంచి ఏపీలో సమగ్ర భూ సర్వే
సాక్షి, తాడేపల్లి: భూ సర్వే పైలెట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా.. జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టి 2023, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలకు సంబంధించిన ప్రజెంటేషన్ సమర్పించారు.(చదవండి: సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన) చదవండి: ఏపీ: రాష్ట్రమంతా భూముల రీసర్వే -
‘సర్వే’త్రా నిరీక్షణ!
సాక్షి, హైదరాబాద్: గట్టు తగవుల గుట్టు విప్పాలన్నా... భూవివాదాలకు తెరదించాలన్నా.. శిఖం పంచాయితీలకు ఫుల్స్టాప్ పెట్టాలన్నా... ఆక్రమణల నిగ్గు తేల్చాలన్నా... భూసేకరణ చేపట్టాలన్నా... అన్నింటికీ సర్వరోగ నివారిణి భూసర్వేనే. కానీ, రాష్ట్రంలో సర్వేత్రా సర్వేయర్ల కొరత పీడిస్తోంది. భూముల కొలతల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపే సర్వే వ్యవస్థే పరోక్షంగా భూవివాదాలకు కారణమవుతోందన్న విమర్శలున్నాయి. సర్వే ప్రక్రియ పూర్తి చేస్తే కొలిక్కి వచ్చే వివాదాలు కూడా సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంటున్నాయి. భూసర్వే, రికార్డుల (సర్వే, ల్యాండ్ రికార్డ్స్) అనే ఈ కీలక విభాగాన్ని పాలకులు గాలికి వదిలేశారని రైతులు విమర్శిస్తున్నారు. సర్వేయర్ల భర్తీ, అవసరమైన సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం వంటి అంశాలను ప్రభుత్వాలు ఏళ్లుగా పట్టించుకోవడంలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా రైతుగానీ, పరిశ్రమల స్థాపనకుగానీ భూసర్వే చేయించుకోవడం గగనమైపోయింది. చాలాచోట్ల సర్వేయర్లు దొరకడంలేదు, దొరికినా.. వారి గొంతెమ్మ కోర్కెలు తీరిస్తేగానీ భూముల సర్వే జరిగే పరిస్థితి లేకుండాపోయింది. సగం పోస్టులు ఖాళీ..! రాష్ట్రవ్యాప్తంగా సగటున మూడు మండలాలకు ఒక సర్వేయర్ ఉన్నారు. అంటే... సర్వేయర్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో దీనిని బట్టి అర్థమవుతోంది. ఇక మండలానికి ఇద్దరు చొప్పున ఉండాల్సిన చైన్మెన్ల జాడేలేదు. 35 ఏళ్ల క్రితం ఉన్న ఉద్యోగుల నిష్పత్తినే ఇంకా కొనసాగిస్తుండటం, ఆ పోస్టుల్లోనూ భారీగా ఖాళీలు ఉండటం భూముల సర్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 1985లో మండల వ్యవస్థ పురుడుపోసుకోవడంతో అప్పటివరకు తాలూకాకు కొనసాగిన ఒక సర్వేయర్‌ను కాస్త మండల పరిధిలో చేర్చారు. ఒక మండల విధులేగాకుండా పాత తాలూకా పరిధిలోని అన్ని మండలాల బాధ్యతలను ఆ సర్వేయర్‌కే అప్పగించారు. అదే స్థితిని నేటికీ కొనసాగిస్తుండటంతో భూముల సర్వేలో ఎడతెగని జాప్యం ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,697 పోస్టులుండగా ఇందులో 965 మందే పనిచేస్తున్నారు. మిగతా 732 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది క్రితం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 253 మంది ఎంపిక కాగా, ఇందులో 130 మంది ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. అప్పట్లో వివాదాలు.. విధులు తక్కువే నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు భూవివాదాల సంఖ్య అంతంత మాత్రమే. దీంతో భూముల సర్వేలో పెద్దగా తలనొప్పులుండేవికావు. కాలక్రమేణా భూముల విలువలు అమాంతం పెరిగిపోవడంతో సర్వేయర్లపై కూడా పనిభారం పెరిగింది. గజం జాగాకు కూడా పోటీపడటం.. భూ ఆక్రమణలు, దాయాదుల మధ్య వివాదాలు, సరిహద్దు తగాదాలు, సర్వేనంబర్ ఒకచోట భూమి మరోచోట ఉండటం, భూముల పంపకంలో తేడాలతో ఒక్కసారిగా భూముల సర్వేకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే భూముల వాటా లెక్క తేల్చాలని, సరిహద్దులు గుర్తించాలని, హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని భూరికార్డుల సర్వే విభాగాన్ని ఆశ్రయించేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. జిల్లాల పునర్విభజన జరిగినా, కొత్త జిల్లాలకు అనుగుణంగా సిబ్బందిని ప్రభుత్వం కేటాయించనేలేదు. పాత జిల్లాల సిబ్బందినే సర్దుబాటు చేసింది. కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లోనూ భూముల విలువ విపరీతంగా పెరిగింది. గతంలో ఉన్న సమస్యలకు ఇవి కూడా జత కలిశాయి. నాలుగోవంతు మండలాల్లో కొరత ఒక మండలాన్ని పరిశీలిస్తే సగటున సర్వేయర్, ఇద్దరు చైన్మన్లు ఉండాలి. కానీ, రాష్ట్రంలో నాలుగోవంతు మండలాల్లో సర్వేయర్ల కొరత ఉంది. దీంతో ఆయా మండల సర్వేయర్లకే అదనపు బాధ్యతలు అప్పగించడం, ఒక్కో సర్వేయర్ పరిధిలో మూడు, నాలుగు మండలాలు ఉండటంతో సర్వే దరఖాస్తులను పరిశీలించడానికి కూడా సమయం సరిపోవడం లేదు. సర్వేయర్‌ను ఫీల్డ్‌కు తీసుకొచ్చి సర్వే చేయించుకోవడానికి రైతులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన’చందంగా.. ప్రభుత్వం సాగునీటి, ఫార్మా, పవర్ ప్రాజెక్టుల భూసేకరణకు ఈ సర్వేయర్లను మళ్లించడంతో సమస్య మరింత జటిలమైంది. రహదారుల విస్తరణ, వక్ఫ్, దేవాదాయ, అటవీ, భూదాన్ తదితర కేటగిరీ వారీగా భూముల సర్వే చేపట్టడం కూడా సర్వే సిబ్బందిపై అదనపు భారంగా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలను మొదటగా చేపట్టాల్సి రావడంతో రైతుల భూసర్వేలను పక్కనపెట్టాల్సి వస్తోంది. క్రమపద్ధతిలో దరఖాస్తులను పరిశీలించి సర్వే నిర్వహించాల్సిన సర్వేయర్లు కొందరు ఇవేవీ పట్టించుకోకుండా పలుకుబడి కలిగిన మోతుబరులు, చేయి తడిపేవారికి సంబంధించిన సర్వేలను ముందు కానిచ్చేస్తున్నారు. ఏమీ ఇచ్చుకోలేని చిన్న, సన్నకారు రైతన్నలు నెలల తరబడి తిరిగితే తప్ప సర్వే చేయించుకోలేకపోతున్నారు. సర్వే నిమిత్తం భూమి వద్దకు రావాలంటే సదరు సర్వేయర్‌కు వాహన సౌకర్యం, గొలుసు ఇతరత్రా సేవలను రైతులే సమకూర్చాల్సి వస్తోంది. -
ఏపీ: రాష్ట్రమంతా భూముల రీసర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనుషులకు ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య) ఇచ్చినట్లుగా ప్రతి ల్యాండ్ బిట్‌కు భూధార్ నంబరు కేటాయించి అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం జీఓ జారీ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో రీసర్వే ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్టిన రూ.200.15 కోట్లకు పరిపాలనామోదం ఇవ్వాలని సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. (కరోనా టెస్టుల్లో ఏపీ మరో రికార్డు) దీంతోపాటు కొన్ని పరికరాల కొనుగోలుకు అనుమతి కోరారు. ‘రీసర్వే ఫేజ్–1, ఫేజ్–2 కోసం 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల స్థాయి పెంపు, నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలి. 11,158 రోవర్స్ కొనుగోలుకు పరిపాలనామోదం ఇవ్వాలి’ అని సర్వే డైరెక్టర్ కోరారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం అనుమతించింది. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, కొలతల్లో ఏమాత్రం లోపం లేనివిధంగా రీసర్వే పనులు చేపట్టాలని ఆదేశించింది. (మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా కరెంట్ బిల్లు..) -
టెండర్ల ఫైళ్లను మీడియా ముందుంచిన డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏపీటీఎస్ టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు. అదే విధంగా పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసరమైన నిబంధనలను పక్కన పెడతామని... చిన్న చిన్న కారణాలతో ఇళ్ల స్థలాల లబ్దికి అనర్హులని ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భూ రికార్డుల సర్వే టెండర్ల ఖరారు విషయంలో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. అధికారులు కష్టపడి పని చేస్తుంటే ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా భూముల రీ-సర్వేకు సంబంధించిన టెండర్ల ఫైళ్లను సుభాష్ చంద్రబోస్ మీడియా ముందు ఉంచారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా 3.31 కోట్ల ఎకరాల భూమి ఉంది. రీ సర్వే చేస్తున్నాం. టెండర్ల ఫైలును మీ ముందు పెడుతున్నాం... అంతా పరిశీలించుకోవచ్చు. బహుశా ఫైళ్లను మీడియా ముందు పెట్టడం ఇదే తొలిసారి అనుకుంటా’ అని ఆయన పేర్కొన్నారు. సమాచారం సేకరిస్తున్నాం ‘పేదలకు.. వివిధ వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ వేశాం. వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలతో సమావేశమయ్యాం. గత ప్రభుత్వం కొందరు ఐఏఎస్‌లకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా.. ఇంకొందరికి ఇవ్వాల్సి ఉంది. అలాగే ఎంత మంది ఉద్యోగులకూ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంపై అంచనా వేయాలని సంబంధిత అధికారులను కోరాం. అలాగే అర్చకులు, ఇమామ్‌లు, ఫాస్టర్లు, హైకోర్టు అడ్వకేట్లు, జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ వర్గాలకు సంబంధించి ఎంత మంది అర్హులు ఉంటారన్న వివరాలను అధికారులను అడుగుతున్నాం’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
మా భూములు సర్వే చేయండి..
సాక్షి, ఖమ్మం: జిల్లాలో 21 మండలాలు ఉండగా.. 21 మంది సర్వేయర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ప్రభుత్వానికి సంబంధించిన భూముల సర్వేతోపాటు ఎవరైనా రైతులు తమ భూములను సర్వే చేయాలని దరఖాస్తు చేసుకుంటే.. ఆయా భూములను సర్వే చేసి సరిహద్దులు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే రైతులు తమ భూముల సర్వే కోసం తొలుత మీసేవలో దరఖాస్తు చేసుకుంటారు. ఇవన్నీ తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుంటాయి. వాటిని పరిశీలించిన అధికారులు తొలుత వచ్చిన దరఖాస్తును తొలుత పరిష్కరించేందుకు ఆ పనిని సర్వేయర్లకు అప్పగిస్తారు. తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతుల భూములను కొలిచి.. సరిహద్దులు నిర్ధారించాల్సి ఉంటుంది. జిల్లాలో ఆరు నెలల కాలంలో తమ భూములను సర్వే చేయాలని కోరుతూ 3,319 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 323 దరఖాస్తులను తిరస్కరించారు. అయితే సర్వేయర్లు సుమారు 15వేల ఎకరాల వరకు భూమిని కొలవాల్సి ఉండగా.. 6వేల ఎకరాల వరకే కొలిచినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న రైతులు మాత్రం తమ భూములు సర్వే చేయాలంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వ పనులతో.. మండలానికి ఒక సర్వేయర్ ఉండడంతో వారిని అధికారులు ప్రభుత్వ పనుల కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతుండడంతో ఆయా పనులకు సంబంధించి భూముల సర్వే చేపట్టాల్సి వస్తోంది. దీంతో నెలలో ఎక్కువ భాగం ప్రభుత్వ భూములు సర్వే చేయడంతోనే సరిపోతుందని పలువురు సర్వేయర్లు పేర్కొంటున్నారు. గతంలో ఎస్సారెస్పీ, నేషనల్ హైవే పనులు సాగాయి. దీంతో అధిక శాతం మంది సర్వేయర్లు ఇందుకు సంబంధించిన భూముల సర్వేలోనే నిమగ్నం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినా.. లేదంటే ఎవరైనా దాతలు ముందుకొచ్చి స్థలం దానం చేసినా.. ఆ స్థలాన్ని సర్వేయర్లు కొలిచి.. ఎంత స్థలం అవసరం అవుతుందనే వివరాలను అంచనా వేసి ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామాల్లో ప్రస్తుతం ఈ పనులు ముమ్మరంగా సాగుతుండడంతో సర్వేయర్లు ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారు. రైతుల ఎదురుచూపులు.. సర్వేయర్లు వివిధ పనులతో బిజీగా ఉండడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మీసేవలో దరఖాస్తు చేసుకున్న రైతులు.. ఎంతకూ సర్వేయర్లు స్పందించడం లేదని గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు అందిస్తున్నారు. నెలలు గడుస్తున్నా.. తమ భూములను సర్వే చేయడం లేదని వాపోతున్నారు. పహాణీలో భూమి తప్పుగా నమోదు కావడం.. ఇద్దరు రైతుల మధ్య సరిహద్దు పంచాయితీ, భూమి ఆక్రమణకు గురికావడం తదితర సమస్యలతో రైతులు తమ భూములు సర్వే చేయాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే నెలలతరబడి సర్వేకు నోచుకోకపోవడం.. సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రైతులు మాత్రం సర్వేయర్లు తమ దరఖాస్తులను పట్టించుకోవడం లేదని, వారికి ఇష్టం వచ్చిన వారికైతే వెంటనే సర్వే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. భూమి చూపించండి.. మా భూమిని సర్వే చేసి.. అప్పగించాలని ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాం. అధికారులు ఇప్పటివరకు మా భూమిని కొలత వేయలేదు. తరతరాలుగా వస్తున్న మా భూమికి సరైన హద్దులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. – గుడవర్తి వెంకటేశ్వర్లు, కొత్త లింగాల, కామేపల్లి మండలం ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం.. రైతులు వివిధ సమస్యల నిమిత్తం భూముల సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో మా సిబ్బంది వీలైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పనులు కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో ఆ పనుల్లో సర్వేయర్లు నిమగ్నమయ్యారు. దీంతో జాప్యం జరిగితే పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించి.. త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.శ్రీనివాసులు, ఏడీ ఎఫ్ఏసీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ -
‘సర్వే’ ఎదురు చూపులకు చెక్
సాక్షి, అమరావతి: భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, భాగ పరిష్కారం (సబ్ డివిజన్), స్థలాల కొలతల కోసం ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. సర్వేయర్ల కోసం మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ముడుపుల మాటే లేదు. ఇప్పటి వరకూ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు కలిపి మొత్తం 942 మంది ఉన్నారు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలతో పోల్చితే మన రాష్ట్రంలోనే సర్వేయర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణం ప్రకారం కనీసం 4,000 నుంచి 5,000 వేల మంది సర్వేయర్లు అవసరమని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గతంలో శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వాలు ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదు. దీనివల్ల క్రమేణా భూసంబంధమైన సమస్యలు పెరిగిపోయాయి. దేశ చరిత్రలోనే లేని విధంగా... స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే లేనివిధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు గ్రామ సచివాలయాల ద్వారా ఏకకాలంలో 11,158 సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం మండలానికి ఒక్క సర్వేయరు మాత్రమే ఉండగా ఈ పోస్టుల భర్తీతో ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ ఉండనున్నారు. 2,000 మంది జనాభా ఉన్న గ్రామ సచివాలయంలో కూడా ఒక సర్వేయర్ అందుబాటులో ఉంటారు. దీంతో గ్రామంలో కొలతల కోసం ఎవరు అర్జీ పెట్టుకున్నా అక్కడున్న సర్వేయర్ వెంటనే కొలతలు వేసి సబ్‌డివిజన్ చేస్తారు. సర్వేయర్లను నియమించగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభమార్గంలో సర్వే చేసే విధానంపై శిక్షణ కూడా ఇస్తారు. గ్రేడ్ –3 సర్వేయర్లుగా నియామకం మొదట 11,158 మందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా గ్రేడ్ –3 సర్వేయర్లుగా నియమిస్తారు. తర్వాత వారికి నిబంధనల మేరకు గ్రేడ్–2 సర్వేయర్లుగా పదోన్నతి కల్పిస్తారు. గ్రేడ్ –2 సర్వేయర్లను పెద్ద గ్రామపంచాయతీల్లో నియమిస్తారు. గ్రేడ్–2 సర్వేయర్లను తదుపరి గ్రేడ్ –1కు ప్రమోట్ చేసి పట్టణాల్లో నియమిస్తారు. వీరందరినీ భూముల రీసర్వేకి ప్రభుత్వం వినియోగించుకుంటుంది. భూముల రీసర్వే, సర్వే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్వేయర్లను నియమిస్తోంది. -
సమగ్ర భూ సర్వేకు కసరత్తు!
సాక్షి, మచిలీపట్నం: గజం భూమి కన్పిస్తే చాలు పాగా వేసేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గడిచిన ఐదేళ్లుగా వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములను చెరబట్టారు. అధికారుల అండ దండలతో రికార్డులను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ, ప్రైౖవేటుభూముల కబ్జాలకు తెగపడ్డారు. సామా న్య, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చలగాట మాడారు. సెంటు భూమి కోసం కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. భూ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం చూపే దిశగా సమగ్ర భూ పరిరక్షణా చట్టాన్ని తీసుకు వస్తోంది. ఈ మేరకు రూపొందించిన ల్యాండ్ టైటిల్ యాక్టు–2019 ముసాయిదా బిల్లుకు ఇటీవలే రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. భూముల యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న భూ తగాదాలకు పరిష్కారం చూపడం, భవిష్యత్‌లో పత్రాలు, భూ రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా నిరోధించేందుకు వీలుగా ఈ చట్టాన్ని రూపొందించనున్నారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కూడా కసరత్తు మొదలు పెట్టింది. బ్రిటీష్ హయాంలోనే సమగ్ర సర్వే భూముల సర్వేకు పెద్ద చరిత్రే ఉంది. బ్రిటీష్ పాలనకు ముందు అక్బర్ హయాంలో పన్నులు వేసేం దుకు తొలిసారి బ్లాక్ సర్వే జరిగింది. ఆ తర్వాత బ్రిటీష్ హయాంలో 1900లో చేపట్టిన సమగ్ర భూ సర్వే 1923 వరకు సాగింది. చేర్పులు, మార్పుల అనంతరం 1932లో పూర్తిస్థాయిలో రీ సెటిల్ మెంట్ రిజిస్ట్రర్ (ఆర్ఎస్ఆర్) రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎస్టేట్ ఎబాలిష్‌మెంట్ యాక్టు–1956ను తీసుకొచ్చారు. విలేజ్ మ్యాప్స్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ (ఎఫ్ఎంబీ),రీ సెటిల్మెంట్ రిజిస్ట్రర్స్ (ఆర్ఎస్ ఆర్), సెటిల్మెంట్ కాని భూములను ఫెయిర్ ల్యాండ్ రిజిస్ట్రర్స్ (ఎఫ్ ఎల్ఆర్) ఆధారంగానే భూములను గుర్తిస్తారు. వీటి ఆధారంగానే రెవెన్యూ రికార్డ్స్ రూపొందిస్తారు. గడిచిన ఐదేళ్లలో వెలుగు చూసిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జా వివా దాలను దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి రాగానే సమగ్ర భూ పరిరక్షణ చట్టం తీసుకొస్తానని, రీ సర్వే జరిపిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజా సంకల్ప పాదయాత్ర సభల్లో స్పష్టమైన హామీ ఇచ్చారు. నాలుగు గ్రామాల ఎంపిక ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సమగ్ర భూ సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో భూముల సమగ్ర సర్వేకు జిల్లా యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వాదేశాల మేరకు ప్రయోగాత్మకంగా సర్వే చేసేందుకు డివిజన్ కో గ్రామాన్ని ఎంపిక చేసింది. విజయవాడ డివిజన్లో కంకిపాడు మండలం కొణతనపాడు, గుడివాడ డివిజన్లో పామర్రు మండలం పోలవరం, మచిలీపట్నం డివిజన్ గూడూరు మండలం గురిజేపల్లి, నూజివీడు మండలం మర్రిబందు గ్రామాలను ఎంపిక చేశారు. కొణతనపాడులో 127, పోలవరంలో 55, గురిజేపల్లిలో 51, మర్రిబందులో 81 సర్వే నెంబర్లున్నాయి. పైగా ఈ గ్రామాలన్నీ 500 ఎకరాల విస్తీర్ణం లోపలే ఉన్నాయి. జియోట్యాగింగ్ ద్వారా సరిహద్దుల గుర్తింపు సమగ్ర సర్వేలో సర్వే విభాగంతో పాటు రెవెన్యూ, పంచాయతీ ఇతర శాఖలు కూడా భాగస్వాములను చేయనున్నారు. అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డిజిటల్ గ్లోబల్ పొజిషన్ సిస్టం ద్వారా సరిహద్దులను గుర్తించి జియో ట్యాగింగ్ చేస్తారు. ప్రయోగాత్మక సర్వేనంతరం సాధక బాధకాలపై అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత జిల్లాస్థాయిలో సర్వేకు ఎంత సమయం పడుతుంది? ఎన్ని బృం దాలు కావాలి? ఎంత వ్యయం అవుతుంది? అనే దానిపై కసరత్తు జరుగుతుంది. ఆ తర్వాత ఈ సమగ్ర సర్వేను మన యంత్రాంగంతోనే చేసేం దుకు ఏ మేరకు అవకాశాలున్నాయి లేదంటే ఏదైనాప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలా? అనే అంశం పై కసరత్తు చేపడతారు. జిల్లాస్థాయిలో సమగ్ర సర్వే జరపాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లాలో భూముల వివరాలు డివిజన్లు 4 మండలాలు 50 పంచాయతీలు 980 రెవెన్యూ గ్రామాలు 1005 మున్సిపాల్టీలు 9 జిల్లా భౌగోళిక విస్తీర్ణం 8727 చదరపు కిలోమీటర్లు జిల్లా విస్తీర్ణం 8,34,159 హెక్టార్లు గ్రామ పటాలు (విలేజ్ మ్యాప్స్) 1005 సర్వే నెంబర్లు 3,15,153 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ (ఎఫ్ఎంబీ) 3,15,153 సబ్ డివిజన్స్ 10,08,552 భూ ఖాతాలు 7,02,649 ఇనాం భూములు 26,214.49 ఎకరాలు ఎస్టేట్ భూములు 11,28,188.73 ఎకరాలు ప్రభుత్వ భూములు 9,05,971.23 ఎకరాలు వ్యవసాయ భూములు 13,36,241.60 ఎకరాలు వ్యవసాయేతర భూములు 1,17,160.80 ఎకరాలు ఎస్సెస్డ్ వేస్ట్‌ల్యాండ్స్ 43,768.76 ఎకరాలు అన్ ఎస్సెస్డ్ వేస్ట్ ల్యాండ్స్ 35,171.11 ఎకరాలు దేవాదాయ భూములు 24,197.73 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములు 1810.73 ఎకరాలు అటవీ భూములు 1,03,158.13 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ భూములు 8334.98 ఎకరాలు ఎసైన్మెంట్ ల్యాండ్స్ 86,449.83 ఎకరాలు సోషల్ వెల్ఫేర్ ల్యాండ్స్ 3800.79 ఎకరాలు -
భూమిలో సారమెంత
సాక్షి,నిజామాబాద్: భూసారంపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. రైతుల పంట పొలాల్లో పంటల సాగుకు అవసరపడే పోషకాలు భూమిలో ఉన్నాయా..? లోపమున్న పోషకాలు ఏంటీ..? వంటి అంశాలను తేల్చే పనిలో పడింది. రైతులు కనీస అవగాహన లేకుండా విచ్చలవిడిగా ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి.. ఆ గ్రామంలో ఉన్న రైతులందరి భూముల్లో మట్టి నమూనాలను సేకరిస్తోంది. గ్రామ పరిధిలో ఎంత మంది రైతులు ఉంటే అంత మందికి సంబంధించిన భూముల మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ఈ నమూనాలకు నిజామా బాద్, బోధన్‌లో ఉన్న భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటివరకు 26 గ్రామాల్లో సుమారు 4,094 మట్టి నమూనాలను సేకరించింది. సుమారు 80 శాతం నమూనాల సేకరణ పూర్తికాగా, మరో వెయ్యి నమూనాలను ఇంకా సేకరించాల్సి ఉందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. యూరియా.. జిల్లాలో రైతులు విచక్షణా రహితంగా ఎరువులను వాడుతున్నట్లు భూసార పరీక్షల్లో తేలింది. యూరియా వినియోగం విపరీతంగా ఉండటంతో భూముల్లో నత్రజని అవసరానికి మించి ఉన్నట్లు గుర్తించారు. అలాగే రైతులు కాంప్లెక్స్ ఎరువులను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 60,563 మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగిస్తున్నారు. ఈ ఎరువు వినియోగం జిల్లాలో ఏటా పెరుగుతూ వస్తుండటాన్ని వ్యవసాయశాఖ గుర్తించింది. అలాగే కాంప్లెక్ ఎరువుల వినియోగం కూడా అధికంగా ఉంది. సుమారు 26,500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను వాడుతున్నట్లు ఆ శాఖ అనధికారిక అంచనా. దీంతో ఎరువులకు సంబంధించిన పోషకాలు అవసరానికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఇలా అవసరానికి మించి ఎరువులు వాడటంతో పంట సాగు వ్యయం పెరుగుతోంది. ఈ ఎరువుల మీదే రైతులు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. ఈ సాగు వ్యయాన్ని తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విత్తనోత్పత్తికి అండగా.. రైతులు విత్తనోత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూసార పరీక్షల ద్వారా వచ్చి న ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ప్రోత్సహించనున్నారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు. 80 శాతం సేకరణ పూర్తయింది మట్టి నమూనాల పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాము. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశాము. ఇప్పటి వరకు 80 శాతం రైతుల భూములకు సంబందించి మట్టి నమూనాల సేకరణ పూర్తయింది. ఈ నమూనాలను భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టే గ్రామీణ విత్తనోత్పత్తి వంటి పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మేకల గోవిందు, జిల్లా వ్యవసాయశాఖాధికారి -
దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ!
కేంద్రమిలా... 2011 యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త ముసాయిదాను రూపొందించాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది. రాష్ట్రమిలా... ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న భూ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యయనం చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం కోసం ముసాయిదాకు తుదిరూపునిస్తోంది. సాక్షి, హైదరాబాద్: టైటిల్ గ్యారంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే హరియాణాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2011 యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త ముసాయిదాను రూపొందించాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది. ఇప్పటికే మన రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడానికి నిపుణుల కమిటీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే ఉద్ధేశంతో టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని ప్రవేశపెట్టడమే ఉత్తమ మార్గమమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేసేందుకుగాను ముసాయిదాకు తుదిరూపునిస్తోంది. ఆర్థిక భారం కేంద్రానిదే!.. భూ సర్వే, రెవెన్యూ సంస్కరణలకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం ఇది వరకే అంగీకరించింది. భూ భారతి మొదలు సమగ్ర భూ సర్వేకు కూడా నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలోనే టైటిల్ గ్యారెంటీ చట్టం అమలుకు అవసరమైన వ్యయాన్ని భరించడానికి సుముఖంగా ఉంది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జాతీయ భూ రికార్డుల నవీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) ప్రవేశపెట్టింది. దీని స్థానే ఎన్డీఏ సర్కారు డిజిటల్ ఇండియా భూ రికార్డుల నవీకరణ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ)ను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశం టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయడం. ఈ నేపథ్యంలోనే గతేడాది హర్యానాలోని ఒక జిల్లాలో టైటిల్ గ్యారెంటీని పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టింది. అలాగే మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని పట్టణ ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలులో కొంత ముందడుగు పడింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడంతో టైటిల్ గ్యారెంటీ చట్టంపై ఆశలు చిగురించాయి. మరోవైపు మన రాష్ట్ర ప్రభుత్వంకూడా ఆ దిశగా ఆలోచన చేస్తుండటం.. కేంద్రం కూడా దానికి సానుకూలంగా ఉండటంతో టైటిల్ గ్యారెంటీ పట్టాలెక్కేందుకు మార్గం సుగమమం కానుంది. అంతేగాకుండా.. టైటిల్ గ్యారెంటీని ప్రవేశపెట్టాలంటే హద్దులు, టైటిల్ క్లియర్ అవసరం. దీంతో భూసర్వే నిర్వహిస్తే తప్ప ఈ చట్టం అమలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సమగ్ర భూ సర్వే చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అవసరమైన నిధులను రాష్ట్రాలకు కేటాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. 2022లోపు టైటిల్ గ్యారెంటీని అందుబాటులోకి తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించడం కూడా మోదీ సర్కారు భూసంస్కరణల వైపు మొగ్గు చూపడానికి కారణంగా కనిపిస్తోంది. -
కబ్జాల ఖాతాలో.. దేవుడి భూములు జమ!
సాక్షి, హైదరాబాద్ : దేముడి సొమ్మే కదా అని తేరగా స్వాహా చేసిన కబ్జాదారుల లెక్క తేల్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయ మాన్యం దాదాపు 87వేల ఎకరాలదాకా ఉంది. వీటిలో 24వేల ఎకరాల మేర అక్రమార్కుల చేతుల్లో చిక్కుకుంది. గుట్టు చప్పుడుగాకుండా గుడిని గుడిలో లింగాన్ని మింగేసే ఈ కబ్జాబాబుల దర్జాకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడనుంది. ధూప,దీప నైవేద్యం, దేవాలయాల పరిరక్షణ కోసం దాతలు వితరణ చేసిన భూములను పర్యవేక్షించడంలో దేవాదాయశాఖ నిర్లక్ష్యం వహించింది. దీంతో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.కొన్ని చోట్ల లీజుదారుల కబంధహస్తాల్లో భూమి చిక్కుకుపోయింది. భూములపై నిర్దిష్ట సమాచారం లేకపోవడం, సర్వే నిర్వహించకపోవడంతో భూబకాసురుల చెర నుంచి విముక్తి చేయలేకపోయింది.ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఆలయాల భూముల లెక్క తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాలవారీగా మాన్యాల వివరాలను సేకరించిన దేవాదాయశాఖ.. వాటిని కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.అలాగే విలువైన భూములను లీజుకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. సెల్ టవర్లు, దుకాణ సముదాయాలు, ఇతరత్రా వాణిజ్యావసరాలకు స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా సమకూరే ఆదాయం ఆలయాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. 24వేల ఎకరాలు హాంఫట్! విలువైన దేవాలయ భూములకు రెక్కలొచ్చాయి. ప్రజాప్రతినిధులు మొదలు బడాబాబుల వరకు ఈ స్వాహాపర్వాన్ని కొనసాగించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేంద్రంలోని సొమలింగేశ్వర స్వామి భూమి, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని వేణుగోపాలస్వామి మాన్యాలు కూడా కబ్జాకోరల్లో చిక్కుకున్నవే. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా 24వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,500 ఎకరాలు, హైదరాబాద్‌లో 2,200 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 1,800 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇందులో ఏకంగా 16వేల ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. భూముల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్ దేవాలయ భూముల లెక్క తేల్చడానికి దేవాదాయ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. గత నెలలో దేవాలయాలవారీగా భూముల వివరాలను సేకరించింది. దేవుడి పేరిట భూములను దానం చేస్తే వాటి వివరాలను 43 రిజిష్టర్‌లో దేవాదాయ శాఖ నమోదు చేస్తుంది. ఇలా నోటిఫై చేసిన భూములపై సర్వహక్కులు దేవాదాయశాఖకే ఉంటాయి.వాటి వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకునేందుకు తాజాగా ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. 43 రిజిష్టర్‌లో నమోదైన భూమిలో ఎంతమేర కబ్జా అయ్యింది? ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? ఇనాం/కౌలు దారులున్నారా? తదితర సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తించిన మాన్యాలను కాపాడుకునేందుకు ప్రహారీగోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది. అలాగే భూమిలో దేవాదాయ భూమిగా పేర్కొంటూ బోర్డులను పెడుతోంది. కాగా, ఇంకా 43 రిజిష్టర్‌లో నోటిఫై చేయని, ఇటీవల ఎక్కడైనా దానం చేసిన భూమి ఉంటే వాటి వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకుంటోంది. రికార్డులను పకడ్బందీగా రూపొందించిన అనంతరం భూ సర్వే జరపాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళనలో తేలిన దేవాలయాల భూముల జాబితాను పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ.. తమవద్ద ఉన్న లెక్కలతో సరిచూసుకుంటోంది. వీటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. భూ సర్వేకు వెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ, సర్వే సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నందున.. జూన్‌లో ప్రతి దేవాలయ భూమిని సర్వే చేయించాలని నిర్ణయించింది. -
మూడో రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష
-
మూడో రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష
సాక్షి, అమరావతి: తమ భూములను ఎంజాయ్మెంట్ సర్వేలో నమోదు చేయాలంటూ రాజధాని అసైండ్ భూముల రైతులు చేపట్టిన అమరణ నిరహార దీక్ష మంగళవారం మూడో రోజుకి చేరకుంది. దీక్ష చేపట్టిన రైతుల షుగర్, బీపీ లెవల్స్ పడిపోవడంతో వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు చేపట్టిన దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు చేపట్టిన దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు, వామపక్షాలకు చెందిన నాయకులు సంఘీభావం తెలిపారు. రాజధాని ప్రకటన సమయంలో చేసిన ఎంజాయ్మెంట్ సర్వేలో తమ భూములు నమోదు చేయకుండా అధికారులు, అధికార పార్టీ నాయకులు కక్ష పూరితంగా వ్యవహరించారని దీక్ష చేపట్టిన రైతులు మండిపడ్డారు. తమకు చెందిన 49 ఎకరాల చుట్టు పక్కల ఉన్న భూములన్నింటినీ సర్వేలో నమోదు చేసి తమ భూములను మాత్రం చేయకపోవడానికి ప్రధాన కారణం తమ భూములపై టీడీపీ నేతల కన్నుపడటమేనని రైతులు ఆరోపిస్తున్నారు. -
జీపీఎస్ విధానంతో భూసర్వే
శివ్వంపేట(నర్సాపూర్) : జిల్లాలో పార్ట్ బీలో ఉంచిన భూ సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కిషన్‌రావు అన్నారు. శుక్రవారం జేసీ నగేశ్‌తో కలిసి శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయ రికార్డులను పరిశీలించడంతోపాటు గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 315, 316లో జరుగుతున్న భూసర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు సంబంధించి భూముల వివరాలు పార్ట్ బీలో ఉంచామని, ఇప్పటి వరకు 30 వేల ఎకరాలు ఫార్ట్ ఏలోకి మార్చినట్లు చెప్పారు. మిగతా భూ సమస్యలను సైతం పరిష్కరించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా శివ్వంపేట మండలంలో భూ సమస్యలు అధికంగా ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గతంలో పనిచేసిన సిబ్బంది చేసిన తప్పుల మూలంగా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. మండలంలో 48 వేల 327 ఎకరాల భూములు ఉండగా 11వేల376 ఎకరాల విస్తీర్ణం రికార్డుల్లో పెరిగిందన్నారు. భూ విస్తీర్ణం పెరిగిన సర్వేనంబర్లలో సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు సర్వే బృందాలు ఉండగా మారో మూడు బృందాలను పంపిస్తామని చెప్పారు. జీపీఎస్ విధానం ద్వారా త్వరగా సర్వే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. సర్వే అనంతరం రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వడంతో పాటు పెట్టుబడి సాయం, రైతుబీమా బాండ్లు ఇస్తామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ నగేశ్ తహసీల్దార్ భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
నింగి నుంచి భూమి సర్వే..
మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణితో పాటు సర్వే ల్యాండ్ రికార్డుల కార్యాలయాలకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. తమ భూమి సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆ ఫిర్యాదుల్లో పలువురు కోరుతుంటారు. శాశ్వత పరిష్కారం కోసం వీరందరూ ఎదురుచూస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈక్రమంలో నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ రికార్డుల ప్యూరిఫికేషన్‌కు చర్యలు చేపట్టింది. అయితే, రికార్డుల వరకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మాటిక్ సిస్టమ్(జీఐఎస్) సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలో రికార్డుల ప్యూరిఫికేషన్ సర్వే సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే జీఐఎస్ ద్వారా భూముల సర్వే చేపడితే ఎలా ఉంటుందనే సాధ్యాసాధ్యాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూత్రప్రాయంగా నిర్దేశించినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే భూముల లెక్క తేల్చడంతో పాటు రికార్డుల ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో రికార్డులకు, క్షేత్ర స్థాయికి తేడాలు ఉన్నట్లు అధికారులు గమనించారు. భూప్రక్షాళన కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలు రావాలంటే మరిన్ని చర్యలు అవసరమని భావించిన ప్రభుత్వం జీఐఎస్ ల్యాండ్ సర్వే చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా భూరికార్డులు, హద్దుల విషయంలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదీ మేలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ద్వారా భూముల సర్వే చేపడితే భూయాజమానులకు మేలు జరగడంతో పాటు రికార్డుల నిర్వహణ సైతం పారదర్శకమవుతుంది. సర్వే నంబర్ల వారీగా నిర్ణయించే హద్దుల మేరకు వాస్తవంగా భూమి విస్తీర్ణం, నక్షాలు రూపొందిస్తారు. పట్టాదారుల విస్తీర్ణం తేల్చి తర్వాత హద్దులు నిర్ణయిస్తారు. వీఆర్వో, సర్వేయర్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. వీఆర్వో, సర్వేయర్ల రిపోర్టును తప్పని సరిచేయడంతో పాటు కొనుగోలు చేసిన భూమికి పక్కా కొలతలు నిర్ణయిస్తారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్, ముటేషన్ రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో కొలతలకు సంబంధించి ఇబ్బందులు ఉండవు. అలాగే, ఎవరైనా భూమి కొలతల సమస్యతో అధికారుల వద్దకు వస్తే పరిష్కరించడం సులువవుతుంది. సర్వే నంబర్ల జియో ట్యాగింగ్ జీఐఎస్ సర్వే ద్వారా భూకొలతలు చేపట్టాక కర్ణాటక తరహాలో సర్వే నంబర్ల వారీగా హద్దులు నిర్ణయించి సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తారు. వచ్చే నెలలో జరగనున్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన మేరకు జీఐఎస్ ల్యాండ్ సర్వే నిర్వహిస్తే భూప్రక్షాళన ఆశయం నెరవేరడమే కాకుండా భూ యాజమానులకు కొలతలు, హద్దులు, రికార్డుల పరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశముంది. ఇందులో భాగంగా సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. గతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని తహసీల్దార్లకు సూచిస్తే కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములు లేవని చెప్పడం, భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతుండడం ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అదే సర్వే నంబర్లను జియో ట్యాగింగ్ చేస్తే వాస్తవంగా ఎంత భూమి అందుబాటులో ఉందో తెలిసిపోనుంది. త్వరలో సర్వే మహబూబ్‌నగర్ జిల్లాలోని తహసీల్దార్లతో ఈనెల 17న కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చిన అంశాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న హద్దుల సమస్యను అన్ని జిల్లాల అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఐఎస్ సర్వే నిర్వహించి భూప్రక్షాళన ఫలితాలను ప్రజలకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. -
సీసీఎల్ఏ నియామకంపై నిర్లక్ష్యం ఎందుకు ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మ కంగా భూ సర్వే చేప ట్టిన ప్రభుత్వం.. భూ పరిపాలన అధికారి (సీసీఎల్ఏ)ని నియమించకుండా ఎందు కు నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సోమవారం ప్రశ్నించారు. ఇప్పటికీ సమగ్రమైన వ్యవ సాయ విధానాన్ని ప్రభుత్వం రూపొం దించలేకపోయిందని విమర్శించారు. ట్రాక్టర్ల కొనుగోలు పథకంలో టీఆర్ఎస్ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చిందని ఆరోపిం చారు. వ్యవసాయ యంత్రాల రాయితీ కోసం రూ. 416 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. రూ. 56 కోట్లు మాత్రమే విడుదల చేసిందని దుయ్యబట్టారు. ఖరీఫ్ పూర్తయి, రబీ సమీపిస్తున్నందున వ్యవసాయ పనిముట్లను రైతులకు వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని చాడ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
భూ సర్వే పకడ్బందీగా నిర్వహించండి
బజార్హత్నూర్(బోథ్): భూముల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూ సర్వే రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాలు లేకుండా, రెవెన్యూ గ్రామ ప్రజల సహకారంతో భూసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సంబంధిత అధికారులు స్థానికంగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. కోర్టు కేసులు, భూవివాదాలు ఉన్న వాటిని రెండవ విడతలో చట్టబద్ధంగా రికార్డులను పరిశీలించి సర్వే చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేందర్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, ఎంఆర్ఐ రాజేశ్వర్, జూనియర్ అసిస్టెంట్ వినోద్, వీఆర్వోలు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ నేతలతో భూసర్వేనా
పొంగులేటి సాక్షి, హైదరాబాద్: అత్యంత కీలకమైన భూముల సర్వేను కేవలం టీఆర్ఎస్ నేతలతో పూర్తి చేస్తారా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రైతు సంఘాలను కేవలం టీఆర్ఎస్ రైతు సంఘాలుగా చేయాలని చూస్తున్నారన్నారు. సర్వే పేరిట నామినేటెడ్ కమిటీలను వేసి, గ్రామాల్లో కొత్త వివాదాలను సృష్టిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ముతో సర్వే చేయిస్తూ టీఆర్ఎస్ నేతలను పర్యవేక్షకులుగా పెడతారా అని పొంగులేటి ధ్వజమెత్తారు. -
సర్వే టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమా?
షబ్బీర్ అలీ ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల సర్వే టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమా అని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం భూ సర్వేపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మాత్రమే మాట్లాడటం సరికాదన్నారు. భూ సర్వేపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్వేలంటూ హడావిడి చేయడం, వాటిని మూలకు పడేయడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో లేదని, డూప్లికేట్ టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉందని విమర్శించారు. టీఆర్ఎస్లో నుంచి ఇతరపార్టీల్లోకి ఎమ్మెల్యేలు ఫిరాయించనున్నారనే భయంతోనే అందరికీ టికెట్లు ఇస్తామంటూ కేసీఆర్ మభ్యపెడ్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 90 శాతం మంది సిట్టింగ్ సభ్యులకు సీఎం కేసీఆర్ టికెట్లు ఇవ్వరని ఆయన చెప్పారు. -
భూసర్వేకు కేంద్ర సాయం
- తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి హుకుమ్‌సింగ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేకు కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి (భూ వనరులు) హుకుమ్‌సింగ్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమం అత్యంత విప్లవాత్మకమైనదని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం ఆయన తన బృంద సభ్యులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన సమగ్ర భూసర్వేపై చర్చ జరిగింది. దీనిపై సీఎం కేసీఆర్ తొలుత మాట్లాడుతూ 1932–36 మధ్య కాలంలో జరిగిన సర్వే ఆధారంగా భూవివరాలు సరిగా లేకపోవడం వల్ల వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతీ ఎకరానికి ఏడాదికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి అందించే కార్యక్రమం ప్రారంభించిందని, ఈ పథకం సక్రమ అమలుకుగాను ఏ భూమి ఎవరి అధీనంలో ఉందో తెలుసుకునేందుకే సర్వే చేస్తున్నట్టు పేర్కొన్నారు. భూ సర్వే కార్యక్రమానికి కేంద్ర సహకారం కావాలని ఆయన కోరారు. త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రాజెక్టు రిపోర్టు కేంద్రానికి పంపుతామని కేసీఆర్ చెప్పారు. అనంతరం హుకుమ్‌సింగ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి భూ సర్వే నిర్వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి భూ వనరు ల విభాగం టెక్నికల్ డైరెక్టర్లు గౌతమ్ పొత్రు, దినేశ్ కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
వడివడి అడుగులు
తాడేపల్లిగూడెం : జిల్లాలోని ఏలూరు ప్రధాన కాలువ మీదుగా జల రవాణాను పునరుద్ధరించే ప్రక్రియ ఊపందుకుంటోంది. ఈ కాలువను విస్తరించేందుకు ఏ మేరకు భూములు అవసరమవుతాయనే దానిపై ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి చేసిన కేంద్ర జల రవాణా విభాగం భూసేకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఏలూరు కాలువ వెంబడి ఎక్కడెక్కడ ఎంత భూమిని సేకరించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చింది. భూసేకరణకు సంబంధించి శనివారం నుంచి సర్వే చేపట్టబోతోంది. 8 మండలాలు.. 37 గ్రామాల్లో.. ఏలూరు ప్రధాన కాలువను జల రవాణాకు వీలుగా వెడల్పు చేసేందుకు జిల్లాలో 8 మండలాల పరిధిలోని 37 గ్రామాల్లో 2,547.13 ఎకరాల భూమి వడివడి అడుగులు అవసరమవుతుందని నిర్థారించారు. రైతుల నుంచి ఆయా భూములను సేకరించనున్నారు. విజయవాడలోని జల రవాణా కార్యాలయ అధికారులు, సర్వే పనులు చేపట్టే ఎక్సెల్ కంపెనీ ప్రతినిధులు సర్వే కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో సమావేశమై కాలువకు సంబంధించిన వివరాలు, భూముల పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. ముందస్తుగా సమాచారం సేకరించి సర్వే అధికారులకు అప్పగించనున్నారు. సర్వేలో పాల్గొనేందుకు తహసీల్దార్లు, సర్వేయర్లను అందుబాటులో ఉండాలని ఇప్పటికే కోరారు. గ్రామాల వారీగా సేకరించే భూములిలా కొవ్వూరు మండలం : మద్దూరులో 104.94 ఎకరాలు నిడదవోలు మండలం : విజ్జేశ్వరంలో 52.83, గోపవరంలో 49.28, నిడదవోలులో 210.34, ఆట్లపాడులో 26.18, శెట్టిపేటలో 131.93 ఎకరాలు (మొత్తం 470.57 ఎకరాలు) తాడేపల్లిగూడెం మండలం : నందమూరులో 80.79, ఆరుళ్లలో 89.04, నవాబ్‌పాలెంలో 101.21, ఆరుగొలనులో 34.43, కుంచనపల్లిలో 0.11, తాడేపల్లిగూడెం పట్టణంలో 47.69, కడకట్లలో 60.15, తాడేపల్లిలో 54.57 ఎకరాలు (మొత్తం 467.98 ఎకరాలు) పెంటపాడు మండలం : ప్రత్తిపాడులో 102.28, దర్శిపర్రులో 50.32 ఎకరాలు (మొత్తం 152.60 ఎకరాలు) ఉంగుటూరు మండలం : బాదంపూడిలో 88.40, వెల్లమిల్లిలో 32.23, ఉంగుటూరులో 129.06, చేబ్రోలులో 38.52, చేబ్రోలు ఖండ్రికలో 35.61, కైకరంలో 79.49 ఎకరాలు (మొత్తం 403.31 ఎకరాలు) భీమడోలు మండలం : కొండ్రుపాడులో 50.16, పూళ్లలో 55.11, అంబర్‌పేటలో 44.58, భీమడోలులో 192.16, సూరప్పగూడెంలో 63.13, గుండుగొలనులో 43.34 ఎకరాలు (మొత్తం 448.47 ఎకరాలు) దెందులూరు మండలం : సింగవరంలో 95.86, కొమిరిపల్లిలో 4.04, పోతునూరులో 40.10, కొవ్వలిలో 4.52, దెందులూరులో 204.67 ఎకరాలు (మొత్తం 349.19 ఎకరాలు) ఏలూరు మండలం : మల్కాపురంలో 115.09, కొమడవోలులో 34.96 ఎకరాలు (మొత్తం 150.15 ఎకరాలు) -
మారతారా.. మార్చమంటారా
కొందరి తప్పులతో రెవెన్యూ శాఖకు చెడ్డపేరు –రెవెన్యూ శాఖను సంస్కరణల బాట పట్టించాం –భూముల రీ సర్వేతోనే సమస్యలకు పరిష్కారం – అలసత్వపు సర్వేయర్లను సస్పెండ్ చేయండి: డిప్యూటీ సీఎం కర్నూలు(అగ్రికల్చర్): ‘‘రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం.. రైతుల సంక్షేమం దృష్యా అసెంబ్లీలో మూడు కీలకమైన బిల్లులను ఆమోదించాం.. త్వరలో జీవోల రూపంలో రానున్నాయి.. అయితే కొంత మంది అధికారులు చేస్తున్న తప్పుల వల్ల మొత్తం రెవెన్యూ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. ఇక దీన్ని చూస్తూ కూర్చోలేం. మీరు మారండి.. లేకపోతే మేమే మార్చాల్సి వస్తుంది.’’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తహసీల్దార్లను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల సదస్సు నిర్వహించారు. రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్చంద్రపునీత, సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ విజయమోహన్, అసిస్టెంట్ సీసీఎల్ఏ జగన్నాథం, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ డిప్యూటీ ఐజీ ఉదయభాస్కర్ తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఇ కృష్ణమూర్తి మూట్లాడుతూ.. మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్న ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు.. ఎఫ్–లైన్ పటిషన్లు, మ్యుటేషన్లు, ఈ–పాసు పుస్తకాల జారీలో అవినీతి ఎక్కువగా ఉందని, ఈ సేవలను సరళతరం చేసే విధంగా జిల్లా కలెక్టర్, జేసీలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి మ్యుటేషన్స్కు సంబంధించి రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్ణీత గడువు 30 రోజుల్లోపు తహసీల్దార్లు చర్యలు తీసుకోకపోతే ఆటో మ్యుటేషన్ జరుగుతుందని స్పష్టం చేశారు. సంస్కరణల బాట రెవెన్యూ శాఖలో పారదర్శకత పెంపొందించడంలో భాగంగా మీ భూమి వెబ్‌సైట్‌ను తెలుగులో రూపకల్పన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని డిప్యూటీ సీఎం తెలిపారు. రైతులు తమ భూముల వివరాలు సరిగా లేకపోయినట్లయితే ఫిర్యాదు చేయడానికి వెబ్సైట్లో వెసులుబాటు కల్పించామన్నారు. ఈ ఫిర్యాదులను జేసీ మానిటర్ చేసి పరిష్కరిస్తారన్నారు. సంస్కరణలతో రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నా.. నాణేనికి రెండో వైపు ఉన్నట్లు కొంత మంది అధికారులు స్వార్థంతో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తున్నారన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూముల రీ సర్వే జరుగాలి పట్టాదారుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలన్నా.. లోపాలను పూర్తిగా సరిదిద్దేందుకు భూముల రీ సర్వే జరగాలని.. ఆ దిశగా సర్వే సెటిల్మెంటు, ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మండల కార్యాలయాల్లో సర్వే పిటిషన్లు పేరుకుపోతున్నాయని, సర్వే కోసం వచ్చే పిటిషన్లను వేగంగా పరిష్కరించేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 670 ఈటీఎస్ మిషన్లు వినియోగించడంతో పాటు జిల్లాకు ఒక డీజీపీఎస్ మిషన్ సరఫరా చేశామన్నారు. పనిచేయని సర్వేయర్లను సస్పెండ్ చేయండి సర్వేయర్లు టూర్ డైరీ సక్రమంగా నిర్వహించడం లేదని, ఈవిషయంలో పై అధికారులు కూడా తనిఖీలు చేయడం లేదని కేఈ అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం దారుణమన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సర్వేయర్లను సస్పెండ్ చేయాలని.. టూర్ డైరీని విధిగా తనిఖీ చేయాలని వివరించారు. ప్రభుత్వ నిర్ణయాలు త్వరితగతిన అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆలస్యం వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోందన్నారు. కర్నూలు జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి: సీసీఎల్ఏ రెవెన్యూ అంశాల్లో కర్నూలు జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకొచ్చేందుకు రెవెన్యూ శాఖలోని ప్రతి ఒక్కరు మరింత పట్టుదలతో పనిచేయాలని సీసీఎల్ఏ అనిల్చంద్రపునీత అన్నారు. ఇప్పటి వరకు అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలు మొదటి స్థానాల్లో ఉన్నాయని.. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఇ కృష్ణమూర్తి సొంత జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ రెవెన్యూలో జిల్లాను ఆరు నెలల్లో ఉన్నత స్థానానికి తీసుకొస్తామన్నారు. సమావేశంలో జేసీ ప్రసన్నవెంకటేష్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సర్వే డీడీ ఝూన్సీరాణి.. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు హుసేన్‌సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు , సర్వే ఏడీ చిన్నయ్య, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భూ సర్వేను అడ్డుకున్న రైతులు
పరిహారంపై స్పష్టత ఇవ్వాల్సిందేనని డిమాండ్ పుట్లూరు : అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం తమ భూములకు అందించే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసిన అధికారులు మండలంలోని దోశలేడు, కడవకల్లు, కందికాపుల, గాండ్లపాడు రెవిన్యూ గ్రామాల్లో రోడ్డు మార్గం వెళ్లే సర్వే నంబర్లను గుర్తించారు. రోడ్డు కోసం 150 మీటర్ల వెడల్పుతో భూములను సేకరించడం కోసం హద్దులను ఏర్పాటు చేయడానికి మండలానికి నలుగురు సర్వేయర్లను కూడా నియమించారు. అయితే మంగళవారం ఓబుళాపురం, కడవకల్లు గ్రామాలకు వెళ్లిన సర్వేయర్లను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. తాము అరటి పంట సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని భూములను కోల్పోతే జీవనాధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే చేయడానికి ముందు అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం సేకరించే భూములకు ఎంత పరిహారం ఇస్తారన్న విషయంపై తమకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము సర్వే చేస్తున్నామని వారు రైతులకు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న రైతులు భూములకు అందించే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని వినతి పత్రం అందించారు. స్థానిక భూ విలువను బట్టి పరిహారం అందించాలన్నారు. -
పేదల భూములపై పెద్దల కన్ను
-
భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు
గజ్వేల్(మెదక్ జిల్లా): గజ్వేల్ మండలం కొడకండ్లలో జరుగుతున్న రైల్వేలైను భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్‌తో వాగ్వివాదానికి దిగారు. అలైన్మెంట్ మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత అలైన్మెంట్ ప్రకారమే రైల్వేలైను నిర్మించాలని డిమాండ్ చేశారు. క్తొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైను కోసం అధికారులు ఈ సర్వే చేస్తున్నారు. -
భూసార పరీక్షల ల్యాబ్ ఏర్పాటుకు సన్నాహాలు
– డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కృష్ణమూర్తి చిలమత్తూరు : భూసార ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ల్యాబ్‌లను జిల్లాలో 10 కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రార ంభించామని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కష్ణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక మార్కెట్ యార్డు గోదామల సమీపంలో ల్యాబ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన వసతులను పరిశీలించారు. గతంలో జిల్లాలో అనంతపురం, ధర్మవరం, పెనుకొండ ప్రాంతాల్లో మాత్రమే భూసార ప్రయోగశాలలు ఉండేవి. ప్రస్తుతం రూ.28 లక్షలతో మడకశిర, ఉరవకొండ, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం, కదిరి, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి ప్రాంతాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఏడీఏ రోషన్ వలీ, ఇన్చార్జ్ ఏఓ సురేంద్రనాయక్, ఏఈఓ మల్లికార్జున ఆయనతో పాటు ఉన్నారు. -
భూములను పరిశీలించిన డీఎఫ్ఓ
శివ్వంపేట : ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూమిలోకి ఫారెస్టు అధికారులు రానివ్వడం లేదని ఫిర్యాదు చేయడంతో మెదక్, నిజామాబాద్ జిల్లాల డీఎఫ్ఓ ప్లయింగ్‌స్కాడ్ రవీంద్రరాథోడ్ శుక్రవారం విచారణకు వచ్చారు. కొత్తపేట గ్రామానికి చెందిన హరినాథ్‌కు 480 సర్వే నెంబర్లో రెవెన్యూ అధికారులు ఐదు ఎకరాల భూమిని కేటాయించారు. సాగుకు చేయడానికి పోతే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని శివ్వంపేట మాజీ సర్పంచ్ పబ్బరమేష్‌గుప్తా ఫారెస్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకునేందుకు రవీంద్రరాథోడ్ భూమిని పరిశీలించారు. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని చెప్పారు. -
వద్దంటున్నా.. ఆగడం లేదు!
ప్రశాంతంగా ఉన్న తమ ప్రాంతంలో థర్మల్‌ప్లాంటును ఏర్పాటు చేసి జీవితాలను నాశనం చేయవద్దని వేడుకుంటున్న ప్రజల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. తమదే పైచేయి కావాలన్నట్టు వ్యవహరిస్తూ ముందుకు పోతోంది. జపాన్‌కు చెందిన సుమితోమా సంస్థ ఆర్థిక సహకారంతో పోలాకి మండలంలో నిర్మించతలపెట్టిన 400 మెగావాట్ల ఆల్ట్రామెగా థర్మల్ప్లాంటు ఏర్పాటును ఈ ప్రాంతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు విధాలుగా నిరసన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్లాంటు ప్రతిపాదిత ప్రాంతాల్లో శుక్రవారం భూ సర్వేకు పూనుకున్నారు. దీన్ని రైతులు, ప్రజాసంఘాలు అడ్డుకోవడంతో పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. భారీ బందోబస్తు మధ్య సర్వేను కొనసాగించారు. అరెస్టు చేసిన వారిని వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు. * ఉద్యమంపై ఉక్కుపాదం * భారీ పోలీసు బందోబసు నడుమ ‘థర్మల్’ సర్వే * అడ్డుకున్న ప్రజాసంఘాల నాయకులు అరెస్టు, విడుదల * ఆటంకం కలిగిస్తే ఎంతమందినైనా అరెస్టు చేస్తామన్న పోలీసులు తోటాడ(పోలాకి): ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా థర్మల్‌ప్లాంట్ నిర్మాణానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. పోలీసుల సాయంతో ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు వెనుకాడడం లేదు. పోలాకి ప్రాంతంలో 38 వేల కోట్ల రూపాయలతో నిర్మించాలని భావిస్తున్న మెగాఆల్ట్రా థర్మల్ ప్లాంట్ కోసం భూసర్వేకు ఇటీవల అధికారులు పూనుకోవడంతో ప్రజలు అడ్డుకున్నారు. అయితే అప్పటికి వెనక్కి తగ్గిన అధికారులు శుక్రవారం మరోసారి సర్వేకు వచ్చారు. ఈసారి భారీగా పోలీసులను వెంటతీసుకొచ్చారు. అరుుతే థర్మల్ వ్యతిరేకులు కూడా వెనక్కి తగ్గలేదు. తోటాడ వద్ద జెన్కో, రెవెన్యూ అధికారులు చేపడుతున్న సర్వేను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పోలాకి, నరసన్నపేట, జలుమూరు స్టేషన్ల నుంచి సిబ్బందిని రప్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై ఎన్.లక్ష్మణ్ మాట్లాడుతూ సర్వేను అడ్డుకోవద్దని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు వినలేదు. సర్వే బృందాలను వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఈటీసీ యంత్రాలను పట్టుకుని సిబ్బంది వెనక్కి వచ్చేశారు. అదే సమయంలో నరసన్నపేట సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జలుమూరు ఎస్ఐతోపాటు మరికొంతమంది సిబ్బంది అక్కడకు చేరుకుని సర్వే అడ్డుకోవద్దని, ప్రజలు సహకరించాలని కోరారు. దీంతో అక్కడే ఉన్న ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటివరకూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన అధికారులు సర్వే నిలుపుదల చేస్తామని ప్రకటించి ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. వారితోపాటు ప్రజలు కూడా సర్వే తీరుపై తీవ్రంగా విరుసుకుపడ్డారు. దీంతో పోలీసులు ముందుగా ప్రజాసంఘాల నాయకులు కె.మోహనరావు, సురేష్‌బాబు, వారికి మద్దతిచ్చిన రైతు పైశాగి అప్పలస్వామిలను అరెస్టు చేసి.. పోలీసు వాహనంలో ఎక్కించి నరసన్నపేట స్టేషన్‌కు తరలించారు. వారి అరెస్టులను అడ్డుకున్న స్థానికులను కూడా పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టేశారు. ఎంతమందినైనా అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మరికొన్ని వాహనాలను తెప్పించారు. దీంతో ప్రజలు భయంతో వెనక్కి తగ్గారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య సర్వేను కొనసాగించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు కేవలం దౌర్జన్యంగా, అధికార బలంతో.. అడ్డగోలుగా చేస్తున్న సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అరుుతే పోలీసు బందోబస్తు మధ్య కొనసాగించటం దారుణమైన చర్య. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. గతంలో కూడా పోలాకి థర్మల్పవర్ప్లాంట్ విషయంలో అనేక అరెస్టులను చూశాం. ఇలాంటి వాటికి భయపడేదిలేదు. సర్వేను అడుగడుగునా అడ్డుకుని తీరుతాం. - కె.మోహనరావు, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిరసన వ్యక్తం చేసే పద్ధతి ఇదికాదు ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై అనుమానాలు, వ్యతిరేకత ఉంటే వేరే పద్ధతుల్లో నిరసన చేపట్టండి. అంతేగాని సర్వేచేస్తు న్న అధికారులును అడ్డుకుంటే సహిం చం. కొంతమంది కావాలనే స్థానికులను రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని నమ్మోద్దు. నేరుగా ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా ప్రజాభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. - ఆర్.ఎస్.ఎస్.చంద్రశేఖరరావు, సీఐ, నరసన్నపేట -
మళ్లీ థర్మల్ సెగ
పోలాకి: మళ్లీ థర్మల్ సెగ రాజుకుంది. జపాన్‌కు చెందిన సుమితొమో సంస్థ ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ధర్మల్ పవర్ ప్లాంట్ భూములసర్వే పోలాకి మండలంలో సెగలు పుట్టిస్తోంది. ప్లాంటు నిర్మాణ విషయమై ఆదినుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకువెళ్లడంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సోమవారం ప్రతిపాదిత భూముల్లో సర్వే నిర్వహిస్తున్న అధికారుల బృందాన్ని అడ్డుకోవాలని అక్కడి ప్రజలు నిర్ణయంచటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కూడా మద్దతు తెలపటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే తహసీల్దార్ జెన్ని రామారావు స్పందించి సిబ్బంది, పోలీసులతో ప్రతిపాదిత గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ ప్రజలు, థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, రైతులతో మాట్లాడారు. ఇది కేవలం భౌగోళిక సర్వే మాత్రమేనని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేయటంతో సర్వే నిలిపి వేస్తున్నట్టు తహసీల్దార్ ప్రకటించారు. ప్లాంటే వద్దంటే.. భూముల సర్వే ఎందుకు? అనంతరం సీపీఎం నాయకుడు చౌదరి తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తుంటే భూముల సర్వే ఎందుకని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సర్వే పేరుతో ఒక్క అడుగు ముందుకు వేసినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తరువాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆయనకు మద్దతుగా థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, కింజరాపు మల్లేశ్వరరావు, సురేష్‌బాబు, రైతు సంఘం నాయకుడు మోహనరావు తదితరులు అధికారులకు ప్రశించారు. నేటినుంచి గ్రామాల్లో అవగాహన సదస్సులు సర్వే నిలిపి వేసిన అనంతరం తహసీల్దార్ ధర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, రైతులతో మాట్లాడారు. మంగళవారం నుంచి ధర్మల్ ప్రతిపాదిత గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ముందుగా చీడివలస, ఓదిపాడు, గవరంపేట గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజల అనుమానాలు నివృత్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ అనిల్‌కుమార్‌తోపాటు సిబ్బంది కృష్ణమోహన్, వెంకటరమణ పాల్గొన్నారు. -
భూసర్వే చేపడితే ఊరుకోం
రణస్థలం: కొవ్వాడ అణువిద్యుత్ పార్క్ నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా కోటపాలెంలో భూసర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు, సీఐటీయూ నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ అణుపార్కు నిర్మించవద్దని, భూములు సర్వే చేయవద్దని తేల్చిచెప్పారు. అణువిద్యుత్ పార్క్ నిర్మాణం కోసం కోటపాలెం గ్రామంలో సోమవారం నుంచి అధికారులు భూసర్వేలు చేయనున్నారని తెలుసుకున్న సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి, నాయకులు ఎన్వీ రమణ, శ్యాంసుందరతో పాటు మరికొంతమంది సీఐటీయూ నాయకులు ఉదయాన్నే కోటపాలెం గ్రామస్తులతో సదస్సు నిర్వహించారు. అధికారులు మాయమాటలు చెప్పి భూసర్వేలు చేపడుతున్నారని, సర్వేలు అనంతరం నోటీసులు జారీచేసి బలవంతంగా భూములు లాక్కోవటమే కాకుండా గ్రామాలను ఖాళీచేయిస్తారని చెప్పారు. ఈ సమయంలో కొవ్వాడ భూసేకరణాధికారి, డెప్యూటీ కలెక్టర్ జె.సీతారామారావు, తహసీల్దార్ ఎం.సురేష్ కోటపాలెం గ్రామంలోకి విచ్చేశారు. వారి వాహనాలకు అడ్డంగా సీఐటీయూ నాయకులు, గ్రామస్తులు నిల్చొని నినాదాలు చేశారు. భూసర్వేలు నిలిపివేయాలని, అణువిద్యుత్ పరిశ్రమ మాకు వద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డెప్యూటీ కలెక్టర్ జె.సీతారామారావు వాహనం దిగి గ్రామస్తులతో మాట్లాడారు. కొవ్వాడ అణుపార్క్ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలగదని అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. ప్రమాదకరమైతే ప్రభుత్వం అనుమతులు జారీచేయదన్నారు. భూసర్వేలకు సహకరించాలని కోరారు. అయితే గ్రామస్తులు మాత్రం తమకు అణువిద్యుత్ పార్క్‌వద్దు, సర్వేలు వద్దని తేల్చిచెప్పేశారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ అణుపార్క్‌ను నిర్మిస్తే ఈ ప్రాంతం సర్వనాశనం అవుతుందని ఇటువంటి ప్రమాదక పరిశ్రమలకు భూసర్వేలు చేపడితే చూస్తూ ఊరుకునేదిలేదని అన్నారు. అధికారులు ఎంత నచ్చచెప్పినా స్థానికులు, సీఐటీయూ నాయకులు ఒప్పుకోకపోవటంతో అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు. ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా రణస్థలం ఎస్సై వి.సత్యనారాయణ, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్డీవో దయానిధి మాట్లాడుతూ కోటపాలెంలో రెండురోజుల్లో గ్రామసభను నిర్వహించి అనంతరం సర్వేలను ప్రారంభిస్తామని చెప్పారు. -
అయ్యా.. కాల్మొక్తా
♦ బతుకులు ఆగం చేయకుండ్రి ♦ ఎవుసం.. ఇండ్లు.. గొడ్డు.. గోద.. ♦ ఇడ్సిపెట్టి యాడికి బోవాలె.. ♦ కలెక్టర్, ఆర్డీఓ కాళ్లపై పడి వేడుకోలు ♦ బోరున విలపించిన ఏటిగడ్డ కిష్టాపూర్ ♦ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలి: రోనాల్డ్‌రాస్ ♦ తాత్కాలికంగా భూ సర్వేను వాయిదా వేసిన జేసీ తొగుట: ‘కాల్మొక్తం సార్లు.. మా కొంపలు ముంచి మా బత్కుల్ని ఆగం జేయకుండ్రి.. మా ఊరు మునిగిపోతే మేమెట్లా బతికేది.. ఎవుసం, ఇండ్లు, గొడ్డు గోద ఇడ్సిపెట్టి మేము యాడికి బోవాలే సార్లు...’ అంటూ సాక్షాత్తు కలెక్టర్ కాళ్లమీద పడి ఊరుకు ఊరే బోరున విలపించింది. ఈ ఘటన తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో మండల పరిధిలోని ఏడు గ్రామా లు ముంపునకు గురవుతన్నాయి. ఈ నేపథ్యంలో ముంపు బాధితుల్లో ఆందోళన నెల కొంది. కలెక్టర్‌తో పాటు జేసీ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి.. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముంపు బాధితులకు భూ సేకరణ చట్టం పై అగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మిహ ళలంతా ఉద్వేగాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా బోరున విలపిం చారు. మా బత్కుల్ని ఆగం చేయవద్దు సార్లూ.. అటూ కలెక్టర్ రోనాల్డ్ రాస్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి కాళ్ళపై పడి కన్నీరు మున్నీరయ్యా రు. అక్కడే ఉన్న మరి కొందరు రైతులు కంట తడి పెట్టారు. వేములఘట్ మాజీ సర్పంచ్ కరుణాకర్‌రెడ్డి మనోవేదనకు గురై ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే చికిత్స కో సం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి: కలెక్టర్ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు సాగాలంటే ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కలెక్టర్ రోనాల్డ్ రాస్ ముంపు బాధితులను కోరారు. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తుల సమస్యలను ఆయన సావదానంగా అడిగి తెలుసుకున్నారు. ఉద్వేగానికి గురై విలపించిన భూ బాధితులను, రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముంపు బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు భూ సేకరణ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం కోసం రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణానికి లైడార్ శాస్త్రవేత్తలు సర్వే పూర్తి చేసి సర్కారుకు నివేదికలు అందించారని తెలిపారు. సర్వే ప్రకారం తొగుట, కొండపాక మండలాలల్లో రిజార్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి, ప్రజలకు భూ సేకరణ చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉండగా ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం వహించడంతో సమస్యలకు దారి తీసిందన్నారు. రైతులు పెద్ద మనసుతో భూములు ఇవ్వాలని కోరారు. ఎకరానికి రిజిష్ట్రేషన్ విలువ ప్రకారం రూ.5.85 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తుందన్నారు. చెట్లు, బోరు బావులు, ఓపెన్ వెల్స్కు, డ్రిప్పు పైపులైన్లకు అదనంగా నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఇంటి పరిహారంతో పాటు అదనంగా రూ. 5.04 లక్షల పరిహారం అందజేస్తమన్నారు. ప్రజలు ముంపు ప్రాంతం నుండి మరో చోటికి వెళ్ళడానికి మరో రూ. 50 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ముంపు బాధితులను ఆదుకునేందుకు కొత్త జీవో తేవాలి కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2013 భూ సేకరణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 123 జీవోలతో సంబంధం లే కుండా ముంపు బాధితులకు న్యాయం జరిగేలా కొత్త జీవో చట్టాన్ని తీసుకురావాలని ఏటిగడ్డ కిష్టాపూర్ ముంపు బాధితులు డిమాండ్ చేశారు. ఎకరానికి రూ. 15 లక్షల నష్ట పరిహారంతో పాటు గ్రామాలకు గ్రామాన్ని నిర్మించి ఇవ్వాలని తీర్మాణం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు భూ సర్వేను ఆపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో జేసీ వెంకట్రాంరెడ్డి స్పందించి భూ సర్వేను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. -
అణు విద్యుత్ పార్క్ సర్వేలపై సమావేశం
రణస్థలం: స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో కొవ్వాడ అణువిద్యుత్ పార్క్ భూసేకరణ సర్వేలకు సంబంధించి సంబంధిత ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో అణుపార్క్ భూసేకరణాధికారి జె.సీతారామారాజు, ఆర్డీవో ధయానిధిల ఆధ్వర్యంలో బుధవారం చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో కొవ్వాడ, కోటపాలేం, పాతర్లపల్లి, అల్లివలస, టెక్కలి, మరువాడ తదితర గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూసేకరణాధికారి సీ తారామరాజు మాట్లాడుతూ అణువిద్యుత్ పా ర్క్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణకు సర్వేలు నిలిచిపోయాయని, వాటిని మళ్లీ ప్రా రంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీని కోసం మొదటి విడతగా రూ.389 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుకు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 2074 ఎకరాలు అవసరమని అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు మూడేళ్లుగా ఇక్కడ అమ్మకాలు, కొనుగోలు ఆధారంగా మార్కెటింగ్ రేటుకు నూతన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అమ్మకాలు, కోనుగోలు జరగని చోట బేసిక్ ఆధారంగా నష్టపరిహారం అందిస్తామని అన్నా రు. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్లు స్థలంలో 6 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఇస్తామని చెప్పారు. ఈ డబ్బులు ఖర్చు చేసి నిర్మించుకున్నవారికి డబ్బులు మిగిలితే వారికి ఇస్తామని, ఒక వేళ తగిలితే వారి నుంచి సేకరించవలసి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఎంపీపీ గొర్లె విజయకుమా ర్, న్యాయవాది లక్ష్మణరావు, కోటపాలేం సర్పంచ్ ధనుంజయరావు, వైసీపీ నాయుకులు పిన్నింటి సాయికుమార్, అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్, కొవ్వాడ నాయకులు స త్యం, తదితరులు మాట్లాడుతూ ఇక్కడ కాకుం డా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల కు అన్నీ చెప్పాలన్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటుచేసినప్పుడు 9 నుం చి 10 రెట్లు శాతం పెంచి నష్టపరిహారం అందించాలన్నారు. వీటిపై ప్రజావేదిక పెట్టి ప్రజల అభిప్రాయంతో సర్వేలను చేపట్టాలని తెలిపా రు. అనంతరం సీతారామరాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. -
ప్రాణాలైన తీసుకుంటాం.. భూములు ఇవ్వం
తంగెడంచ(జూపాడుబంగ్లా): ప్రాణాలైన తీసుకుంటాం..జీవ నాధారమైన భూములను మాత్రం ఇవ్వమని తంగెడంచ రైతులు తేల్చిచెబుతున్నారు.రెండోవిడత భూసేకరణలో భాగంగా తంగెడంచ రెవెన్యూ పరిధిలోని 1595.63 ఎకరాల భూములను సేకరించేందుకు మంగళవారం 35 మంది సర్వేయర్లు గ్రామానికి వచ్చారు. ఏడు బృందాలుగా విడిపోయి రైతుల పొలాల్లో కొలతలు వేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. మాకు చెప్పాపెట్టకుండా మా భూముల్లో ఎలా కొలతలు వేస్తారని సర్వే అధికారులను నిలదీశారు. 1980లో శ్రీశైలం జలాశయానికి భూములిచ్చి నష్టపోయామని, మళ్లీ ఇప్పుడు పరిశ్రమలకు ఇచ్చి కుటుంబసభ్యులతో రోడ్డున పడలేమన్నారు. మొదటి విడతగా తంగెడంచ ఫారంలోని 864 ఎకరాల భూములను సేకరించి ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమను స్థాపించలేదన్నారు. పరిశ్రమల పేర్లు చెప్పి రెండుకార్ల పండే భూములను బలవంతంగా లాక్కుంటే సహించమని హెచ్చరించారు. ఎన్నికల ముందు రైతులకు పెద్దపీఠ వేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలవంతంగా భూములు లాక్కొని పాడెకట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. వెనుదిరిగిన అధికారులు భూసర్వేకు వచ్చిన 30 మంది అధికారులకు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ విషయాన్ని సర్వేయర్లు జిల్లా అధికారులకు తెలియజేయగా రైతులతో సమావేశం కాకుండా ముందే వారి పొలాల్లోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించడంతో కిమ్మనకుండా కొలతలను వేయటం విరమించుకుని వెనుదిరిగి పోయారు. ఉన్నభూమి పోతే ఎలా బతకాలి నాకు 11.25 ఎకరాల పట్టాపొలం ఉంది. రెండోవిడత భూసేకరణలో మొత్తం భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని తెలిసింది. ఉన్నదంతా ప్రభుత్వం తీసుకుంటే వ్యవసాయం ఆధారపడి జీవించే మా కుటుంబం ఏమి తినాలో, ఎలా బతకాలో చెప్పాలి. - గోకారమయ్య, రైతు తంగెడంచ ఆత్మహత్యలే శరణ్యం నాకు 20 ఎకరాల పొలం ఉంది. భూసేకరణలో మొత్తం భూమిని ప్రభుత్వం తీసుకుంటుందంట. కుటుంబానికి వ్యవసాయయే ఆధారం. ఈ ఆధారం పోతే మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. - చిన్నరంగస్వామి, రైతు తంగెడంచ చెప్పాపెట్టకుండా సర్వే చేస్తున్నారు. నాకు 12 ఎకరాల పట్టాభూమి ఉంది. ఒకరి వద్దకు వెళ్లకుండా ఏటా పంటలు పండించుకుంటూ బతుకుతున్నాం. మంగళవారం చెప్పాపెట్టకుండా అధికారులు వచ్చి భూములు కొలతలు వేస్తున్నారు. మమ్మల్ని ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు. - శ్రీనివాసరెడ్డి, రైతు తంగెడంచ -
ప్రాజెక్టు నిర్మాణానికి భూమి సర్వే
చింతపల్లి : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చింతపల్లి మండల కేంద్రంలోని చిన్నచెరువు, పెద్దచెరువు ప్రాంతాల వద్ద 1.11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు భూములను బుధవారం అధికారులు పరిశీలించారు. మండల కేంద్రంలోని శిఖం భూములతో పాటు రైతులకు చెందిన 1500 ఎకరాలుపాజెక్టు నిర్మాణంలో కోల్పోనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రైతుల భూములను పరిశీలించారు. -
ప్రైవేటు సర్వేయర్లతో భూముల సర్వే
- భూసేకరణ వేగవంతానికి - ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కింద భూసేకరణను వేగవం తం చేసేందుకు ప్రైవేటు సర్వేయర్ల సేవలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖ పరిధిలో సర్వేయర్ల కొరత కారణంగా భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలి సింది. ప్రాజెక్టుల పరిధిలో పనులు నిర్వర్తిస్తు న్న ఏజెన్సీలు ప్రైవేటుగా చేయించిన సర్వే నివేదికను అధికారులు నిర్ధారించుకున్నాకే పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. సత్వర నిర్మాణానికి బాటలు: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో భూసేకరణ, పునరావాసానికి తొలి ప్రాధాన్యమిచ్చి, సత్వ రం పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే జీవో 123ను తీసుకొచ్చి భూ కొనుగోలుకు అంకురార్పణ చేసింది. రాష్ట్రంలో భూసేకరణ అవసరమైన ప్రాజెక్టులు 36 వరకు ఉండగా.. ఇప్పటివరకు 7 ప్రాజెక్టుల కు మాత్రమే భూసేకరణ పూర్తయింది. మొత్తం 36 ప్రాజెక్టులను కలిపి 3,15,323.51 ఎకరాల భూమి కావాలని గుర్తించగా... ఇప్పటివరకు 2,21,358.37 ఎకరాల సేకరణ పూర్తి చేశారు. మరో 1,44,686.66 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే దీనిని వేగవంతం చేసేం దుకు ప్రతి 50వేల ఎకరాల సేకరణకు స్పెషల్ కలెక్టర్, 10వేల ఎకరాలకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను పలుచోట్ల నియమించింది. కానీ సర్వేయర్ల కొరతతో గత మూడు నెలల్లో 7 వేల ఎకరాల భూసేకరణే జరిగింది. దీనిపై ప్రభుత్వం రెండ్రోజుల కిందట అన్ని జిల్లాల కలెక్టర్లు, స్పెషల్ కలెక్టర్లతో సమావేశం నిర్వహిం చింది. అధికారులంతా సర్వేయర్ల కొరతని చెప్పిన మీదట ప్రైవేటు సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఏజెన్సీలో నైపుణ్యమున్న సర్వేయర్లను వినియోగించుకోవాలని, ఆ సర్వేకు స్పెషల్ కలెక్టర్ స్థాయి లో ఆమోదముద్ర వేయాలని సూచించింది. -
పిఠాపురంలో అధికారుల సర్వే.. ఉద్రిక్తత
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎంసీ ఆస్పత్రికి చెందిన భూముల్లో రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే చేసేందుకు పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగారు. ఆస్పత్రి భూముల్లో పోరంబోకు భూములు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు సర్వేకు వచ్చారు. సర్వే చేయడానికి వీలులేదని ఆస్పత్రి సిబ్బంది భీష్మించుకు కూర్చున్నారు.ఈ ఘర్షణలో ఒక నర్సుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల వాదోపవాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
డిండి ప్రాజెక్టుకు సంబంధించి భూములను బుధవారం సర్వే చేయడానికి వచ్చిన అధికారులను చింతపల్లి మండలం కృష్ణరాయపల్లికి చెందిన గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు ఎకరానికి రూ.10 లక్షలు చెల్లించి, ఇంటికో ఉద్యోగం ఇచ్చిన తర్వాతే సర్వే ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
భూముల సర్వేను అడ్డుకున్న రైతులు
శాంతిపురం: చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్టు సర్వే బృందం మంగళవారం పర్యటించింది. వీరు మండలంలో ఏర్పాటు చేసిన ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం స్థలాన్ని సర్వే చేసేందుకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన రైతులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్ధలానికి చేరుకొని ఆరుగురు సభ్యుల బృందాన్ని అడ్డుకున్నారు. విమానాశ్రయానికి మేం భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. -
తెగనున్న భూ‘పంచారుుతీ’
ముకరంపుర : తెలంగాణ ప్రాంత భూముల చిట్టా అంతా నిజాం లెక్కల్లోనే ఉండడంతో చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయి. 30 ఏళ్లకు ఒకసారి చేపట్టాల్సిన భూ రీసర్వే 70 ఏళ్లు గడిచినా అతీగతి లేకపోవడంతో భూములకు అనామతు లెక్కలే ఆధారమయ్యాయి. అప్పటి రికార్డులకు చెదలు పట్టడంతో లెక్కల గుట్టు తెలవకుండా పోరుుంది. ఐదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పెలైట్ ప్రాజెక్టుగా నిజామాబాద్‌లో భూభారతి కార్యక్రమం అమలు చేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రూపొందించినా పాలకుల నిర్లక్ష్యంతో మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం ‘భూభారతి’ కార్యక్రమం ద్వారా భూముల లెక్కలు తేల్చడానికి చర్యలు మొదలుపెట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సర్వేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చినిగిపోయిన టీపన్లు నైజాం పాలనలో ఒక్కో సర్వే నంబర్లో ఉన్న భూ మిని ఒక టీపన్(ఒక సర్వే నంబర్లోని భూ వైశాల్యం హద్దులు)గా గుర్తించారు. అప్పుడు జిల్లాలో 6,21,990 టీపన్లు ఉండగా 1,63,762 టీపన్లు చెదలు పట్టి పోయాయి. దీంతో ప్రస్తుతం అధికారు ల వద్ద 4,58,228 టీపన్లు మాత్రమే మిగిలారుు. అందులో సగానికి పైగా ఆనవాళ్లు కనిపించకుండా ఉన్నారుు. ఈ టీపన్ రికార్డులన్నీ 1926-36 మధ్య కాలంలో కాగితపు రికార్డుల్లో నమోదు చేసి ఉండడంతో వాటి భద్రత కష్టంగా మారింది. నాడు గొలుసులు, దారాలతో చేసిన కొలతలు సక్రమమే అయినప్పటికీ వాటి రికార్డులు భద్రంగా లేకపోవడంతో లెక్కలు తారుమారవుతున్నాయి. భూముల హద్దు లు.. లెక్కలు గందరగోళంగా మారడంతో తగాదాలు పెరిగిపోరుు పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా తయూరైంది. మరోవైపు భూములు అన్యాక్రాంతమై వివాదాలకు కారణమవుతున్నాయి. చాలా మంది బాధితులు భూరికార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో భూ సర్వే కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత రికార్డులు(టీపన్) ఆధారంగా ఉన్న కొలతలకు ఇప్పుడున్న కొలతలకు పొంతన లేకుండాపోయూరుు. బాధితులు సర్వే కోసం పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. జిల్లాలో 78 మంది సర్వేయర్లు అవసరం ఉండగా, 37 మంది మాత్రమే ఉన్నారు. లెసైన్స్డ్ సర్వేయర్లు అమాయక రైతుల నుంచి సర్వేల పేరుతో అధిక సొమ్ము దండుకుంటున్నారు. ప్రభుత్వ సర్వేయర్లు కొలతల కోసం సర్వే నంబర్ల వారీగా రూ.200 నుంచి రూ.400 వరకు తీసుకుంటుండగా లెసైన్స్డ్ సర్వేయర్లు ఎకరాలను బట్టి గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాలవారీగా రూ.500 నుంచి రూ.1000 తీసుకోవాలని నిబంధన ఉన్పప్పటికీ ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు. -
ఎయిర్‌పోర్టు సర్వే అధికారులను అడ్డుకున్న భోగాపురంవాసులు
విజయనగరం (భోగాపురం) : సోమవారం తొలి ఏకాదశి కావడంతో మంచి రోజన్న కారణంతో ఎయిర్‌పోర్టు భూముల సర్వేకు వెళ్లిన అధికారులను ముక్కాం గ్రామ సమీపంలో భోగాపురం మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. వారు వెంట తీసుకువచ్చిన మ్యాపులను చించి వేసి అధికారులను అడ్డుకున్నారు. మేము ఎలాంటి భూమలు ఇవ్వబోమని, మరోసారి ఎయిర్‌పోర్టు భూమల సర్వే కోసం వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
డిఫెన్స్ భూములపై సర్కారు కన్ను
- వివిధ ప్రాంతాల్లో ఉన్న మిలటరీ భూములపై ఆరా - వినియోగంలో లేని భూములను సర్వే చేయాలని ఆదేశం - రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డిఫెన్స్ భూములపై సర్కారు కన్నేసింది. వివిధ ప్రాంతాల్లోని మిలటరీ విభాగాల ఆధీనంలో.. ఎన్నెన్ని ఎకరాల భూమి ఉందనే అంశంపై ఆరా తీస్తోంది. ప్రత్యేకించి మిలటరీ విభాగాలకు గత ప్రభుత్వాలు కేటాయించిన భూముల్లో ఎంతమేరకు ఆయా విభాగాలు వినియోగించుకోవడం లేదన్న(ఖాళీగా ఉన్న భూములు) అంశంపై సర్కారు దృష్టిపెట్టింది. దీంతో మిలటరీ భూముల్ని సర్వే చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పటికే మిలటరీ భూములు అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. వెనువెంటనే తక్షణం వివరాలు సేకరించాలని కలెక్టర్లు మిలటరీ భూములున్న మండల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. వినియోగంలో లేని భూములను స్వాధీనం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సర్కారు సూచించినట్లు తెలిసింది. జంట జిల్లాల్లో ఏడువేల ఎకరాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు ఏడువేల ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ మిలటరీ విభాగాల ఆధీనంలో ఉంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్, బాలనగర్, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన భూమి 3,000 ఎకరాలుండగా, హైదరాబాద్ జిల్లాలోని బండ్లగూడ, తిరుమలగిరి, గోల్కొండ, షేక్‌పేట్, మారేడ్‌పల్లి, ఆసిఫ్‌నగర్ మండలాల పరిధిలో సుమారు 3,000 ఎకరాలు మిలట రీ ఆధీనంలో ఉంది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ ప్రభుత్వం తెచ్చిన డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం బలవంతపు(ఎప్పుడైనా, ఎక్కడైనా) భూసేకరణ జరిగే ది. బేగంపేట్, దుండిగల్, హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ సంస్థల ఆధీనంలో ఉన్న భూములు ఈ చట్టం ప్రకారం తీసుకున్నవే. 1964లో కేం ద్రం తెచ్చిన ‘రిక్విజేషన్ అండ్ ఎక్విజేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్’ ప్రకారం వివిధ డిఫెన్స్ ఏజెన్సీలు తమ సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు భూములను ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి. ఈ చట్టం ప్రకారమే.. గత ప్రభుత్వాలు డీఆర్డీఎల్, డీఎంఆర్ఎల్, బీడీఎల్, డీఎల్ఆర్ఎం వంటి డిఫెన్స్ పరిశోధన సంస్థలు, ఆర్టిలరీ, ఎయిర్‌ఫోర్స్.. వంటి మిలటరీ సంస్థలకు పెద్దెత్తున భూములను కేటాయించాయి. రిక్విజేషన్ అండ్ ఎక్విజేషన్ పద్ధతిన ప్రభుత్వం కేటాయించిన భూములకు ప్రతిఏటా లీజు చెల్లించాలి. తమ సంస్థలను విస్తరించుకునేందుకు అవసరమైన మేరకు సొమ్ము చెల్లించి భూసేకరణ చేయించుకోవాలి. 1985 నుంచి ఇప్పటివరకు కొన్ని మిలటరీ సంస్థలు లీజు చెల్లింకపోవడం, తమ సంస్థల విస్తరణను నిలిపివేయడం తాజాగా సర్కారు దృష్టికి వచ్చింది. ఆ జాగాలను ఖాళీ చేయిస్తారా.. హైదరాబాద్‌కు అవసరమైన హంగు, ఆర్భాటలను నెలకొల్పేందుకు ఎంతో స్థలం అవసరం కానుంది. ఈ నేపథ్యంలోనే.. వినియోగంలో లేని మిలటరీ భూములను స్వాధీనం చేసుకొని, ఆయా జాగాలను రాష్ట్ర అవసరాలకు వినియోగించాలని సర్కారు భావిస్తోంది. -
వైజాగ్‌లో జీపీఎస్ సర్వే యంత్ర పరికరాల పరిశ్రమ
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమయ్యే భూముల సర్వే, పలు రకాల భవన సముదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జీపీఎస్ పద్ధతిలో సర్వే చేసే యంత్ర పరికరాల తయారీ పరిశ్రమను విశాఖపట్నంలో ప్రారంభించనున్నట్లు జీయో ట్రాక్స్ ఇం టర్నేషనల్ సర్వీసెస్ అధ్యక్షులు వీవీఎస్ బందుకవి తెలిపారు. చైనా సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం వైజాగ్‌లో 2 వేల ఎకరాలను కేటాయించేందుకు అంగీకరించిందన్నారు. ఈ సందర్భంగా జీయో ట్రాక్స్ స్థాపించే అధునాతన జీపీఎస్ సర్వే పద్ధతులను సంస్థ ప్రతినిధులతో కలిసి శని వారం హైదరాబాద్‌లో మీడియాకు వివరించారు. చైనా హాస్ నావిగేషన్ కంపెనీ జీపీఎస్ టెక్నాలజీతో అత్యంత సులువుగా, వేగంగా భూములను సర్వే చేస్తుందన్నారు. -
వేగిరం.. పూర్తయిన గుట్ట భూసేకరణ సర్వే
భువనగిరి: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం అభివృద్ధికి చేపట్టిన 2 వేల ఎకరాల భూసేకరణ కార్యక్రమం పూర్తయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను వాటికన్ సిటీ తరహాలో తెలంగాణలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం నాలుగుసార్లు యాదగిరిగుట్టకు వచ్చి అభివృద్ధికి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సేకరించిన భూమిని యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిసంస్థకు అప్పగించారు. మరో వెయ్యి ఎకరాలు సేకరించడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో గత సోమవారం హైదరాబాద్‌లోని యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణకు అవసరమైన నిధులు సమకూర్చడంతోపాటు, భూసేకరణకు ఏమైన ఇబ్బందులు ఉన్నాయా అని చర్చించారు. తొలిసారిగా అక్టోబర్ 17, డిసెంబర్ 17, ఫిబ్రవరి 25, 27న గుట్ట స్వామిని దర్శించుకున్న కేసీఆర్ ఆరోజే రెండు వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజులుగా జేసీ సత్యనారాయణ అధ్వర్యంలో అధికారులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సిన భూమికి సంబంధించిన వివరాల సమగ్ర సేకరణలో ఉన్నారు. మొత్తంగా సుమారు 2100 ఎకరాల భూమిని అధికారులు గతంలోనే సేకరించాలని నిర్ణయించారు. ఇందులో దేవాలయ భూములు 166.07 ఎకరాలు, సీలింగ్ భూమి 327.37 ఎకరాలు, చెరువు శిఖం 174.28 ఎకరాలు, ఫారెస్ట్ భూములు 380 ఎకరాలు, రైతులు, ప్రవేట్ వ్యక్తుల నుంచి 1001 ఎకరాల భూమితో కలిపి 2100 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్వేనంబర్ల ఆధారంగా భూముల వివరాలను సేకరించి వాటికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించారు. భూములకు సంబందించిన సమగ్ర నివేదికను యాదగిరిగుట్ట దేవస్థాన ం అభివృద్ధి సంస్థకు అప్పగించారు. కాగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక్కడ భూములు ఇలా ఉన్నాయి.. యాదగిరిపల్లి, గుండ్లపల్లి, దత్తాయపల్లి, సైదాపురంతోపాటు, భువనగిరి మండలం రాయగిరిలో భూములను తీసుకోవాలని నిర్ణయించారు. యాదగిరిపల్లిలో 147.07 ఎకరాల దేవాలయం భూమి, 121.02 ఎకరాల ప్రభుత్వ భూమి, 35.20 ఎకరాల చెరువు శిఖం ఉంది. గుండ్లపల్లిలో 47.26 ఎకరాల సీలింగ్ భూమి, దత్తాయపల్లిలో 5 ఎకరాల దేవాలయ భూమి, 2.36 ఎకరాల సీలింగ్ భూమి, సైదాపురంలో 14 ఎకరాల దేవాలయ భూమి, 22.19 ఎకరాల సీ లింగ్ భూమి, 133.36 ఎకరాల ప్రభుత్వ భూమి, 27.30 ఎకరాల చెరువు శిఖం, రాయగిరిలో 72.39 ఎకరాల ప్రభుత్వ భూమి, 111.18 ఎకరాల చెరువు శిఖం, 380 ఎకరాల పారెస్ట్ భూమి, ఈ గ్రామాల్లో ఇలా తీసుకుంటారు.. దేవస్థానం అభివృద్ధి కోసం అధికారులు గుర్తించిన దేవాలయ,సీలింగ్, ప్రభుత్వ, చెరువు శిఖం, ఆటవీ శాఖ భూములకు అదనంగా అవసరమైన ప్రైవేట్ భూములను గుర్తించారు. రైతుల వద్దనుంచి ఈ భూములను భూసేకర ణ ద్వారా తీసుకోనున్నారు. ఇందులో భాగంగా యాదగిరిపల్లిలో 357.24 ఎకరాలు, గుండ్లపల్లిలో 144.15 ఎకరాలు, దత్తాయపల్లిలో 122.16 ఎకరాలు, సైదాపురంలో 311.37 ఎకరాలు, రాయగిరిలో 81.11 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. దీంతో అధికారులు భూసేకరణకు సంబంధించి తొలివిడత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భూములు ఎక్కడ, ఏమేరకు సేకరించాలన్న నిర్ణయం కావడంతో భూసేకరణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రియల్టర్ల గుండెల్లో పరుగులుపెడుతున్న రైళ్లు.. యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థకోసం గుట్ట పరిసరాల చుట్టూ రైతులు, రియల్లర్ల వెంచర్ల నుంచి భూములను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అధికారులు భూసేకరణ చేసే గ్రామాల్లో పదుల సంఖ్యలో వెంచర్లు ఉన్నాయి. వాటిల్లో వందలాది మందికి రియల్టర్లు ఓపెన్ప్లాట్లను అమ్మారు. పలు వెంచర్లకు ఎలాంటి అనుమతులూ లేవు, కనీసం నాలా కన్వర్షన్ కూడా లేవు. దీంతో హైదరాబాద్‌తో పాటు ఇక్కడి ప్రాంతం వారు కొన్న ప్లాట్ల పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు,. నేడు గుట్టకు సీఎం భువనగిరి/యాదగిరికొండ : చినజియర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ గురువారం ఉదయం యాదగిరిగుట్టకు రానున్నారు. గత నెల 27న గుట్టకు వచ్చిన సీఎం వారం రోజుల్లో చినజియర్ స్వామితో కలిసి వచ్చి ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలిస్తామని, ఆయన సూచనలు తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం మరోమారు యాదగిరిగుట్టకు వస్తున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే నాలుగుసార్లు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి స్వయంగా ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే గత నెల 25న, 27న రెండుసార్లు గుట్టకు వచ్చిన సీఎం కొండపై కలియదిరిగి మాస్టర్‌ప్లాన్‌కు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రధాన ఆలయానికి ఎలాంటి మార్పులూ లేకుండా ఆగమ శాస్త్రం, వాస్తు ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఎం షెడ్యూల్.. ఉదయం 11 గంటలకు జియర్‌స్వామితో కలిసి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలు దేరుతారు. 11.30 యాదగిరిగుట్టకు చేరుకుంటారు. ఒంటి గంటవరకు అక్కడ ఆలయ పరిసరాలను, ప్రధాన గర్భాలయంలో ఆయన జియర్‌స్వామితో కలిసి చర్చిస్తారు. అనంతరం హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు. సీఎం రాకకు పకడ్బందీ ఏర్పాట్లు త్రిదండి చిన జియర్‌స్వామితో సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దేవస్థానం పరిసరాలను శుభ్రం చేశారు. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను, చెత్తాచెదారాన్ని తొలగించారు. కొండపైకి వస్తున్న భక్తుల వాహనాలను ఆపి బైక్‌లను, కార్లలో డాగ్‌స్క్వాడ్‌తో విస్త్రృత తనిఖీలు చేపడుతున్నారు. బ్రహ్మోత్సవాల సందడి అంతా తొలగించారు.సీఎం రాకను దృష్టిలో ఉంచుకుని స్వామి, అమ్మవార్ల దర్శనానికి రానున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
రెండో రోజు ముమ్మరంగా భూ సర్వే
దామరచర్ల : థర్మల్ పవర్ ప్రాజెక్టు భూ సర్వే శనివారం రెండో రోజు మండలంలో ముమ్మరంగా కొనసాగింది. భూ సర్వే నిమిత్తం ఏర్పాటుచేసిన 21టీములు 6 గ్రామాల్లో పర్యటించాయి. బృందం సభ్యులు ఆయా గ్రామాల్లోని భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూ మి ఎంత ఉంది, ఏయే ప్రాంతాల్లో ఉందో ఆరా తీశారు. మండలంలోని 7 గ్రామాల్లో 9వేల ఎకరాల సేకరణ లక్ష్యంగా సర్వే సాగింది. అయితే అధికారుల కోసం ఆయా గ్రామాల రైతులు పనులు మానుకొని భూముల వద్ద అందుబాటులో ఉన్నారు. అందుబాటులో లేకపోతే భూములు కోల్పోతామోనన్న బెంగతో ఉద యం 9 గంటలు మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉన్నారు. వీర్లపాలెంలో అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు మిర్యాలగూడ తహసీల్దార్ కృష్ణారెడ్డి బృందం మండలంలోని వీర్లపాలెం గ్రామంలో సర్వే చేసేందుకు వచ్చింది. విషయం తెలుసుకున్న సాత్‌తండా, దుబ్బతండా గిరిజనులు అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు .మహిళలు వాహనాలు ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో కృష్ణారెడ్డి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. దీంతో ఫోన్ ద్వారా మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆర్డీఓ హుటాహుటిన వీర్లపాలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నీటివసతి కల్పించుకుని సాగుచేసుకుంటున్న భూములు పవర్‌ప్లాంట్‌కు పోతే తమకు జీవనాధారం లేకుండా పోతుందని రైతులు.. ఆర్డీఓకు మొర పెట్టుకున్నారు. సాగుచేసిన భూములు ఫారెస్టువని, వాటికి నష్ట పరిహారం రాదని, దీంతో భూములు నమ్ముకుంటూ బతుకుతున్న కుటుంబాలు వీధిన పడతాయని విన్నవించారు. ఆర్డీఓ కిషన్‌రావు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందడంలో తప్పులేదని, ఈ విషయాలను సీఎం వచ్చిన నాడే కలెక్టర్‌కు, సీఎంకు విన్న వించామని తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. భూమిని నమ్ముకొని జీవించే ఏ ఒక్క కుటుంబానికీ నష్టం కలగకుండా చూస్తామని, భూమి కోల్పోయిన వారికి భూమి, లేదా నష్టపరిహారం, కుటుం బంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు నిరసనను విరమించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దుర్గెంపూడి నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ కోట్యానాయక్, టీఆర్ఎస్ నాయకులు చల్లా అంజిరెడ్డి, పర్ష్యానాయక్, బాలు, అనిమిరెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
థర్మల్ పవర్ ప్లాంట్‌కు నేటినుంచి భూ సర్వే
దామరచర్ల : దామరచర్ల మండల పరిధిలో నిర్మించతలపెట్టిన 7500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ భూసేకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు రంగం సిద్ధం చేశారు. భూ సర్వే కోసం కలెక్టర్ చిరంజీవులు 21 బృందాలను నియమించారు. ఈ మేరకు అధికారుల బృందాలు శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు మండలంలోని ముదిమాణిక్యం, కొండ్రపోల్, కల్లెపల్లి, దిలావర్పూర్, నర్సాపురం, తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాల పరిధిలో గల ఫారెస్టు భూములు సర్వే చేయనున్నారు. ప్రాజెక్టు కావాల్సిన 9వేల ఎకరాలను సేకరించనున్నారు. బృందంలో ఉండేది వీరే.. సర్వే కోసం నియమించిన 21 బృందాలు విడిపోయి ఒక్కో గ్రామాన్ని పరిశీలిస్తారు. ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు సర్వేయర్లు, వారికి సహాయకులుగా ఒక వీఆర్ఓ, వీఆర్ఏ ఉంటారు. ప్రతి రెండు బృందాల పనితీరును పరిశీలించేందుకు తహసీల్దార్‌ను నియమించారు. ఐదు బృందాలకు కలిపి ఒక ఆర్డీఓను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈయన ఎప్పటికప్పుడు వారి పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ ఐదు బృందాలు ఐదు రోజులపాటు ఏడు గ్రామాల్లో తిరిగి భూమి సర్వే చేయనున్నాయి. ఐదు రోజులూ స్థానికంగానే.. సర్వే చేసేందుకు మండలానికి వచ్చే అధికారులు ఐదు రోజులపాటు (26 నుంచి 30వ తేదీ వరకు) స్థానికంగానే ఉంటా రు. అంటే సర్వే పూర్తయ్యేంతవరకు ఉండాలి. వారికి కావాల్సిన వసతులను కూడా కల్పించారు. దామరచర్ల, వీర్లపాలెం, ముదిమాణిక్యం, తాళ్లవీరప్పగూడెం గ్రామాలు సర్వే చేసేవారికి మండలకేంద్రంలో, దిలావర్పూర్, కల్లెపల్లి, నర్సాపూర్, కొండ్రపోల్ పరిధిలో సర్వే చేసే అధికారులకు మిర్యాలగూడలో వసతి ఏర్పాటు చేశారు. రైతులు అందుబాటులో.. సర్వే చేసే గ్రామాల్లో ఫారెస్టు భూములు పొందిన రైతులు ఐదురోజులు వారివారి భూముల మీద అందుబాటులో ఉండాలని అధికారులు కోరుతున్నారు. పునరావాసం ద్వారా డిఫారెస్టు భూములు పొందిన రైతులు, అటవీ హక్కుల చట్టం ద్వారా సంక్రమించిన వారు, ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా భూముల పొందిన రైతులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఈ పత్రాలతో రైతులు సిద్ధంగా ఉండాలి.. ఆయా గ్రామాల పరిధిలో ఫారెస్టు భూములపై హక్కులు పొందిన రైతులు కింది సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలి. ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్, పట్టా సర్టిఫికెట్, భూమికి సంబంధించిన(లిఖిత పూర్వక) హక్కు కాగితాలు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌం ట్ బుక్, భూమి శిస్తు రశీదులతో ఐదురోజులు అందుబాటులో ఉండాలి. రైతులు సహకరించాలి ఐదు రోజులపాటు ఫారెస్టు భూముల సర్వేకు ఆయా గ్రామాల రైతులు సహకరించాలి. ఫారెస్టు భూములు పొందిన రైతులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఉండాలి. ఐదురోజుల్లో ఎప్పుడైనా సర్వే అధికారులు భూముల మీదికి రావచ్చు. సేద్యం చేసే ఫారెస్టు భూములకు సంబంధించి రైతులు ఆధారాలతో లేకుంటే అవి ఫారెస్టు భూములుగాపరిగణిస్తారు. సర్వే బృందానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అధికారుల బృందానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. - వేముల రమాదేవి, తహసీల్దార్ మఠంపల్లిలో బంగారం, నగదు చోరీ మఠంపల్లి : మండలకేంద్రంలోని శౌరినగర్‌లో కాకుమాను బాలశౌరి ఇంటిలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం బాధితుడు స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. గురువారం అర్ధరాత్రి క్రీస్తుజననం సందర్భంగా స్థానిక శుభవార్త చర్చిలో జరిగే పూజలకు వెళ్లి తెల్లవారుజామున ఇంటికి వచ్చామన్నారు. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక భాగం నుంచి తలుపులు పగులకొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని 26గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 10వేల నగదు, కొన్నివెండి వస్తువులు అపహరించారన్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేయనున్నట్లు బాధితుడు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
కరీంనగర్ క్రైం : భూమి సర్వే చేసిన నివేదిక ఇచ్చేందుకు రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో రెవెన్యూ సర్వేయర్. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం... జిల్లాకేంద్రంలోని భగత్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న గబ్బు జాదవ్ మానకొండూర్ మండల సర్వేయర్‌గా 2012 నుంచి పనిచేస్తున్నాడు. ఈదులగట్టెపల్లికి చెందిన తీర్థాల కుమార్ అనే రైతుకు గ్రామశివారులోని 542, 543 సర్వనంబర్లలో వ్యవసాయ భూమి ఉంది. తన భూమిని సర్వే చేయమని మార్చిలో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం రుసుము కూడా చెల్లించాడు. సదరు భూమిని 15 రోజుల క్రితమే సర్వే చేసిన జాదవ్... నివేదిక ఇచ్చేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశాడు. తాను పేదవాడినని డబ్బులు ఇచ్చుకోలేనని కుమార్ పలుమార్లు విన్నవించినా పట్టించుకోకుండా డబ్బులు ఇస్తేనే నివేదిక ఇస్తానని తేల్చిచెప్పాడు. వేధింపులు భరించలేని కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి పథకం ప్రకారం మంగళవారం ఉదయం జాదవ్‌కు రైతు ఫోన్ చేయగా కరీంనగర్‌లోని ఇంటికి రమ్మని చెప్పాడు. జాదవ్ ఇంటి వద్ద కుమార్‌నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సీఐ విజయ్‌కుమార్ మానకొండూర్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి బాధితుడి భూ వివరాల దరఖాస్తు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ తెలిపారు. అయినా మారలేదు మానకొండూర్ మండల తహశీల్దార్ రాంబాబు సెప్టెంబర్ 24న ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ తిమ్మాపూర్ మండలం అల్గునూర్ వద్ద ఏసీబీకి చిక్కాడు. తహశీల్దార్ పట్టుబడిన సమయంలో మానకొండూర్ మండల వాసులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదే మండలంలో సర్వేయర్‌గా చేస్తున్న జాదవ్... ఉన్నతాధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నా తన ధోరణిలో మార్పుతెచ్చుకోలేదని మండలవాసులు పేర్కొంటున్నారు. -
రాచకొండ గుట్టలను అభివృద్ధి చేస్తాం
భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మంచాల: రాచకొండ గుట్టలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. సీఎం పర్యటన అనంతరం ఆయన సోమవారం రాచకొండ గుట్టల్లో మీడియాతో మాట్లాడారు. రాచకొండ గుట్టల పరిసర ప్రాంతాలు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయన్నారు. 30 వేల ఎకరాలను సర్వే చేయించి పారిశ్రామిక వాడగా అభివృద్ధి పరుస్తామని ఎంపీ తెలిపారు. మొదటగా భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తిస్తామని చెప్పారు. అనంతరం క్లస్టర్లుగా విభజించి సోలార్ కంపెనీ, ఫార్మాసీటీ, ఫిలింసిటితో పాటు అన్ని విధాలుగా రాచకొండ గుట్టలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న రాచకొండ గుట్టలను చూసిన సీఎం కేసీఆర్ చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా పదకొండు నిమిషాల్లో ఇక్కడికి చేరుకున్నారని, రోడ్డు మార్గంలో కూడా 45 నిమిషాల్లో చేరుకునే విధంగా రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. స్థానిక ప్రజలకు కూడా జీవనోపాధి కల్పించేలా చూస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలియజేశారు. సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, భువనగిరి ఎమ్మెల్యే చంద్ర శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆక్రమణలపై కొరడా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న కబ్జాకోరులపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం దృ ష్టి సారించింది. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభు త్వ భూములను అందినకాడికి దండుకున్నట్లు భూ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు తిరిగి వాటి ని స్వాధీనం చేసుకోవాలనే కృతనిశ్చయంతో రెవెన్యూ యంత్రాంగం ఉంది. నిబంధనల్లో లొ సుగులను ఆధారం చేసుకుని చట్టబద్ధత కల్పిం చుకున్న ఘనులు ఎవరో కూడా ఇప్పటికే గుర్తిం చారు. ప్రభుత్వ భూ ఆక్రమణల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ఎంత ఆక్రమణకు గురైం ది? వాటిలో పక్కా భవనాలు ఎన్ని నిర్మించారు? వాటి విలువ ఎంత? అనే అంశాలపై రెవెన్యూ అధికారులు మండలాల వారీగా జరిపిన భూ సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి. ఇవి రెవెన్యూ వ్యవహారాల్లో అనుభవం ఉన్న సీనియర్ అధికారులనే విస్మయపరిచాయి. ఇన్నాళ్లకు మోక్షం జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని కొన్ని సంవత్సరాలుగా పలు రాజకీయపక్షాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి, ప్రభుత్వ భూమి ఎవరి చెరలో ఉందన్న అంశంపై మాత్రం ఇప్పటి దాకా స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారంలో కిందిస్థాయి రెవెన్యూ అధికారుల అండదండలే అధికంగా ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. గ్రామాల్లో రైతుల ఆధీనంలో ఉన్న భూములకు ఓ సర్వే నంబర్, ప్రభుత్వ భూములకు మరో సర్వే నంబర్ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. కబ్జాకోరులతో మిలాఖత్ అయిన రెవెన్యూ అధికారులు కొన్ని మండలాల్లో తమ బుద్ధి ప్రదర్శించారు. కబ్జాకోరులతో కుమ్మక్కై ప్రభుత్వ సర్వే నంబర్లో ఉన్న భూములకు సైతం విచ్చలవిడిగా రెవెన్యూ పట్టాలు, హక్కు పత్రాలు మంజూరు చేశారు. దీని ఆధారంగా ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోనే వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమార్కులు వాటిలో లక్షల రూపాయల విలువ చేసే భవనాలను సైతం నిర్మించారు. ఆక్రమించిన ప్రభుత్వ భూములకు చట్టబద్ధత కల్పించుకున్నారు. వాటిలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేయడం సైతం జరిగినా ఇప్పటి దాకా వాటి గురించి కూలంకషంగా ప్రభుత్వ యంత్రాంగం ఆరా తీయలేదు. ఇదే అదనుగా ఆక్రమణదారులు ఆడిందే ఆటగా...చెలామణి అయ్యారు. ప్రభుత్వ అవసరాలకు దొరకని భూమి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా సర్కార్ అవసరాలకు భూములు దొరకకపోవడం ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. పేదల గృహ నిర్మాణాలు మొదలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చివరకు రక్షిత మంచినీటి పథకాలకు సైతం భూములు దొరక్కపోవడం గమనార్హం. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ ఆక్రమిత భూములను వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత ? అందుబాటులో ఉన్నది ఎంత? దానిలో ప్రజా అవసరాలకు ఉపయోగపడేది ఎంత? మిగిలిన భూమి ఏయే రూపంలో అన్యాక్రాంతం అయిందో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని జేసీ ఆదేశించారు. ఈ మేరకు మూడునెలలుగా మండలస్థాయి రెవెన్యూ యంత్రాంగం, సర్వే అధికారులు మూకుమ్మడిగా కసరత్తు చేశారు. వేలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆ భూముల్లో విలువైన భవనాలు, బహుళ అంతస్థుల మేడలు నిర్మించినట్లు తెల్చారు. వీటి ఆధారంగా ఆయా ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం ఉపక్రమించింది. చెరువులూ..కుంటలు సైతం ఆక్రమణ జిల్లాలోని చెరువులు, కుంటలను సైతం ఆక్రమణదారులు వదలలేదు. వీటిలో సైతం పక్కా భవనాలు నిర్మించారు. రియల్ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ చెరువుల స్ఫూర్తిని తుంగలో తొక్కారు. జిల్లాలో రెండువేల ఎకరాల చెరువు భూములను దాదాపు మూడు వేలమందికి పైగా ఆక్రమించారని ఈ సర్వే తేల్చింది. కబ్జాదారులకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆయా ప్రాంతాల్లోని అధికారుల ద్వారా నోటీసులు జారీ చేసింది. భూములపై ఆక్రమణదారులకు గల హక్కు ఏమిటో, వారికిఉన్న పత్రాలు ఏమిటో సంబంధిత అధికారులకు చూపించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఐదు, పది కుంటల నుంచి ఎకరాలకు ఎకరాలను తమ ఆధీనంలో ఉంచుకున్న రైతులకు అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ఇందులో కేవలం చెరువు గట్టుకింద ఉన్న భూమిని సాగు చేసుకున్న రైతులు సైతం లేకపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల వల్ల తమ జీవనాధారం పోతుందేమోనని, ఉన్న అరెకరం చెరువు పొలం దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని చిన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం పరిసరాలపై దృష్టి ఖమ్మం అర్బన్, రూరల్ వంటి మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి చేరడంలో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. ప్రభుత్వ సర్వే నంబర్లలో ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు ఏ ప్రాతిపదికన జారీ చేశారో తేల్చడానికి సైతం రెవెన్యూ అధికారులు సంస్థాగతంగా ప్రయత్నా లు ప్రారంభించారు. ఏ మండలంలో, ఏ అధికారి హయాంలో ఈ తరహా అక్రమాలు జరిగా యో కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం అర్బన్ మండలంలో భూ ఆక్రమణలు జరిగిన తీరు జిల్లా రెవెన్యూ అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది. చట్టంలో ఉన్న లొసుగులు, రెవెన్యూ శాఖలో ఉన్న అనుభవాన్ని క్రోడీకరించి కొందరు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు సహకరించారు. ఎక్కడా దొరకకుండా ఉండేందుకు తమకున్న తెలివితేటలు, యావత్తు ఉపయోగించారని రెవెన్యూశాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతిలోకి వెళ్లడానికి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారి ఉంటాయన్న విషయం బహిరంగ రహస్యమే. ఇప్పటికైనా యంత్రాంగం అప్రమత్తం కావడం ఒకింత మంచిదే అయినా..ప్రభుత్వ భూముల్లో నిర్మించిన పక్కా భవనాలను గుర్తించినా..వాటిని స్వాధీనం చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలి సింది. వాటిని తక్షణం కూల్చివేయకుండా ప్రజా అవసరాలకు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే భద్రాచలంలో ప్రభుత్వ స్థలంలో కట్టిన కట్టడాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని ప్రజా ఉపయోగార్థం వినియోగిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వ వసతి గృహాలను ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశం సైతం సర్కారు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆకాశహర్మ్యాల వైపు అడుగులు
* ముగిసిన భూముల సర్వే * రికార్డులు పరిశీలిస్తున్న రెవెన్యూ శాఖ * పొంతన కుదరని లెక్కలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. సాగర్ చుట్టూ ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించేందుకు చేపట్టిన సర్వే శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాం శర్మ, భూ సర్వే డిప్యూటీ డెరైక్టర్ గోపాల్‌రావు, త హశీల్దారులు శ్రీనివాసరెడ్డి, సుజాతతో పాటు 16 మంది ల్యాండ్ సర్వే సిబ్బంది పాల్గొన్నారు. ఈటీసీ (ఎలక్ట్రానిక్ టోటన్ స్టాటిక్స్) మిషన్ సహకారంతో మాన్యువల్ సర్వే నిర్వహించారు. సాగర్ చుట్టూ 26 పార్శళ్లలో(ప్రాంతాల్లో) సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు మాతాజీ నగర్, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలమని తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూములు వివాదాస్పదంగా ఉండడంతో పాటు, కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. సర్వే చేసిన ప్రాంతాలివే... సెయిలింగ్ క్లబ్, యూత్ హాస్టల్ షెడ్లు, సతీష్ చంద్రమోడి, బుద్ధభవన్ పక్కనున్న ఖాళీ స్థలం, రాణి గంజ్ బస్ డిపో తూర్పున ఉన్న ఖాళీ స్థలం, అంబేద్కర్ నగర్ విగ్రహం, అంబేద్కర్ నగర్ అండర్ బిడ్జి నుంచి ఎంఎంటీఎస్ సంజీవయ్య పార్కు వరకు సర్వే చేశారు. పీవీ ఘాట్ ఎదురుగా ఉన్న ప్రాంతం, పాటిగడ్డ ఎస్టీపీ, పార్కు హోటల్ సమీపంలోని ఆదిత్య బిల్డర్స్ వద్దనున్న ఖాళీ స్థలం, పీవీ ఘాట్ నుంచి జలవిహార్ మధ్య స్థలం, పీపుల్స్ ప్లాజా ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలం తదితర ప్రాంతాల్లో సర్వే చేశారు. ఓరిస్ హోటల్ ఎదురుగా ఉన్న కుందన్‌బాగ్ ఖాళీ స్థలం, ఐమాక్స్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలం, సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా, టిప్‌టాప్, మింట్ కాంపౌండ్, ముద్రణాలయం, లుంబినీ పార్కు, బోట్స్ క్లబ్, లేజర్ ఫో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వద్దనున్న స్థలం, మారియట్ హోటల్, ట్యాంక్‌బండ్ మధ్య గల స్థలం, త హశీల్దార్ కార్యాలయం, ట్యాంక్‌బండ్ మధ్య స్థలం, భాస్కర్‌రెడ్డి ఎన్వోసీ, రాఘవ సదన్, నర్సింగ్ కాలేజి, దిల్కుష్ గెస్ట్‌హౌస్, గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌస్, హోమ్ సైన్స్ కళాశాల, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అధికార యంత్రాంగం దీనికి అనుగుణంగా భూ వివరాల సేకరణకురికార్డులు పరిశీలిస్తున్నారు. సర్వే వివరాలను రికార్డులతో సరి చూసుకోవటం ద్వారా సాగర్ చుట్టూ ప్రభుత్వ ఖాళీ స్థలం ఎంత ఉందన్న విషయంపై రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దీనికి ముందు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా తేలని లెక్క సాగర్ చుట్టూ ఉన్న 26 ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలం ఎంతన్నది పక్కాగా లెక్క తేలలేదు. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి పొంతన లేకపోవడం అధికారులను అయోమయానికి గురిచేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో అనేక చోట్ల శాశ్వత నిర్మాణాలు రూపుదాల్చగా, మరికొన్ని చోట్ల ఆక్రమణదారులు దర్జాగా అనుభవిస్తున్న తీరు అధికారులను విస్మయానికి గురిచేసింది. అనే క స్థలాలపై కోర్టులో వివాదాలు నడుస్తున్నట్లు తేలింది. కిమ్స్ ఎదురుగా సుమారు 32 ఎకరాలు సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండగా...అందులో 10 ఎకరాలకు పైగా ఆక్రమణ చెరలో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌చుట్టూ ఇతమిత్థంగా ఎంత భూమి ఉందన్న విషయాన్ని నిగు ్గతేల్చేందుకు కసరత్తు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించేందుకు రెవెన్యూ అధికారులు హడావుడి చేస్తున్నారు. బీపీపీ స్థలాలపై ఆరా హుస్సేన్‌సాగర్, చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పరిధిలో ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్నే సాగర్ పరిశుభ్రత, పార్కుల నిర్వహణకు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు సాగర్ చుట్టూ అభివృద్ధికి బాటలు వేస్తుండటంతో అసలు బీపీపీ ఆధ్వర్యంలో ఎంత భూమి ఉందన్న విషయమై ప్రభుత్వం ఆరా తీసింది. సాగర్ తీరాన విలువైన భూమిని ఏఏ సంస్థలకు, ఎన్నేళ్ల కాలపరిమితికి లీజ్‌కు ఇచ్చారు? వాటిలో ఎలాంటి నిర్మాణాలున్నాయి? లీజ్ గడువు ముగిసిన భూమి ఎంత ఉంది.? ఏఏ భూములపై కోర్టు వివాదాలున్నాయి? ఏటా ఎంత ఆదాయం వస్తుంది? వంటి విషయాలపై బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులను సమాచారం అడిగారు. రికార్డుల ప్రకారం సుమారు 270 ఎకరాలకు పైగా బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఉన్నట్లు వారు తేల్చారు. వీటిలో ఎస్టీపీలు, పార్కులు అభివృద్ధి చేయడంతో పాటు కొంత భూమిని హోటళ్లు, థియేటర్లు, పార్కింగ్, ఎమ్యూజ్మెంట్, రిక్రియేషన్ వంటి వాటికి కేటాయించినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. -
మరో ని‘బంధనం’
రుణమాఫీకి భూమి సర్వే నంబర్ కావాలట జిల్లాలో 50శాతం మంది రైతులు దూరం విశాఖ రూరల్ : వరికుప్పంత హామీనిచ్చి.. వడ్ల గింజంత రుణమాఫీకి చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉంది. వారానికో ఉత్తర్వులతో రైతుల్ని హతాశుల్ని చేస్తోం ది. విస్తరి వేసి వడ్డన ఎగ్గొట్టినట్లు.. ఆర్భాటంగా ఇచ్చిన రుణమాఫీ హామీ నుంచి తప్పించుకోవడానికి శతవిధా లా యత్నిస్తోంది. ఇప్పటికే కుటుంబంలో ఒక్కరే మాఫీకి అర్హులని, ఉద్యానవన రైతులకు వర్తించదని ప్రకటించారు. ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం వంటి నిబంధనలు విధించారు. తాజాగా.. అడ్డగోలుగా సర్వే నంబర్ అడ్డంకిని సృష్టించారు. దీంతో జిల్లా రైతుల్లో 50 శాతం మంది రుణమాఫీకి దూరం కానున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల తప్పిదాలు ప్రభుత్వానికి కలిసివస్తున్నాయి. భూమి క్రయవిక్రయాలు, వారసులకు రాసి చ్చిన తర్వాత అధికారులు రెవెన్యూ అడంగళ్లలో మార్పులు చేయకుండా, ఒకే సర్వే నంబర్‌ను నమోదుతో చాలా మంది రైతులు రుణమాఫీకి దూరం కానున్నారు. ఒక్కరే అర్హులు.. ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మాఫీ అర్హతకు 31 అంశాలకు సంబంధించిన సమాచారం పొందుపర్చాలి. ఇందులో రైతులు పూర్తి చేయాల్సినవి కొన్ని కాగా, మిగిలినవి బ్యాంకులు నమోదు చేయాల్సినవి. ఇందుకు ప్రభుత్వం రూపొందించి, బ్యాంకులకు అందజేసిన సాఫ్ట్‌వేర్‌లో సర్వే నంబర్ కూడా చేర్చింది. ఒకే సర్వే నంబర్‌తో ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది రైతులు మాఫీకి దరఖాస్తు చేసుకుంటే.. కేవలం ఒక్కరి రుణమే మాఫీ అవుతుంది. ఒకే సర్వే నంబర్‌పై వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు పొందినా, ఒకరి కన్నా ఎక్కువ మంది ఒకే సర్వే నంబర్ ఇచ్చినా దానిని సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. అప్పుడు ప్రభుత్వం నియమించే టెక్నికల్ కమిటీ ఒకరిని మాత్రమే రుణమాఫీకి అర్హుడిగా ఎంపిక చేస్తుంది. మాయోపాయాలు.. చాలా చోట్ల ఒక సర్వే నంబర్‌పై భూమి క్రయవిక్రయాలు జరిగాయి. సాధారణంగా తండ్రి ఆస్తిని అదే సర్వే నంబర్‌పై వారసులకు పంపిణీ చేసి రిజిస్టర్ చేస్తుంటారు. దీని ఆధారంగానే రెవెన్యూ అధికారులు వారికి టైటిల్‌డీడ్, పట్టాదారుపాస్‌పుస్తకాలను మంజూరు చేస్తున్నారు తప్పా సర్వే నంబర్ల సబ్ డివిజన్ చేసి, అడంగళ్లలో నమోదు చేయడం లేదు. సర్వే నంబర్ల సబ్ డివిజన్‌కు అనుమతి ఇవ్వాల్సిన ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా పట్టించుకోవడం లేదు. సాధారణంగా బ్యాంకులు సర్వే నంబర్‌తో సంబంధం లేకుండా టైటిల్ డీడ్, పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. పంట నష్టపోతే ప్రభుత్వం కూడా వీటి ఆధారంగానే పెట్టుబడి రాయితీ ఇస్తోంది. దీని వల్ల చాలా మంది రైతులు ఇప్పటి వరకు సర్వే నంబర్ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రుణమాఫీకి సర్వే నంబర్‌ను కూడా నమోదు చేయాలని చెప్పడంతో లబోదిబోమంటున్నారు. -
తెలంగాణలో త్వరలో ల్యాండ్ సర్వే: మహమూద్ ఆలీ
నల్గొండ: తెలంగాణ వ్యాప్తంగా త్వరలో ల్యాండ్ సర్వే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. నల్గొండ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ సర్వే కోసం కేంద్రాన్ని 600 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరాం అని అన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో కరవు జిల్లాలను గుర్తించి.. దాన్ని అడ్డుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
భూ రికార్డుల్లో తప్పులన్నీ సరిచేయండి
సమగ్రంగా భూముల సర్వే చేపట్టాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల సమగ్ర సర్వేను పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. భూముల వివరాలన్నీ కలెక్టరేట్ల వద్దనున్న ల్యాండ్ ఇన్వెంటరీలో ఒకరకంగా, క్షేత్రస్థాయిలో మరో రకంగా ఉంటున్నాయన్నారు. ఈ రికార్డుల్లో తప్పులను సరిదిద్దాలని హెచ్ఐసీసీలో జరిగిన సమావేశంలో అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు వ్యవసాయ యోగ్యం కాని భూమి ఎంత ఉందని సీఎం కార్యాలయం కోరితే.. కలెక్టర్లు 40 లక్షల ఎకరాలు ఉందన్నారని... వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగేలా చిన్నచిన్న రాళ్లు రప్పలు తొలగిస్తే ఎంత ఉంటుంది? అని అడగ్గా 5 లక్షల ఎకరాలు తగ్గిపోయిందని సీఎం తెలిపారు. అధికారులు తాజాగా 20 లక్షల ఎకరాల సాగుయోగ్యం కాని భూమి ఉన్నట్లు తేలిందని వెల్లడించడంతో.. ఆ భూమిని 3 రకాలుగా విభజించాలని సీఎం సూచించారు. తక్షణమే పరిశ్రమల ఏర్పాటుకు 3 నుంచి 4 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందంటున్నారని.. దీనిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సిబ్బందితో కలిసి మరోసారి సర్వే చేయాలని సూచించారు. -
భూముల రీసర్వేకు కేంద్ర సాయం కోరాం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ న్యూఢిల్లీ: నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఆధారంగా ఉన్న నేపథ్యంలో.. తెలంగాణ భూములపై మరోసారి సర్వే జరిపించేందుకు కేంద్ర సాయం కోరినట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆధ్వర్యంలో భూసేకరణ అంశంపై జరిగిన రాష్ట్రాల రెవెన్యూ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో భూములన్నింటినీ రీసర్వే జరిపించాలనుకుంటున్నారని.. ఇందుకు దాదాపు రూ. 600 కోట్లు అవసరమవుతుందని, కేంద్ర నిధులు కేటాయించాలని గడ్కారీని కోరినట్టు వివరించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల విషయంలో అక్రమాలు జరిగినందునే ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తోందన్నారు. -
మళ్లీ తెరపైకి 214 సర్వే నంబర్ భూమి
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాకతీయ విశ్వ విద్యాలయ స్థలాల వివాదం మళ్లీ మొదలైంది. మొన్నటివరకు కోర్టు వివాదంలో ఉన్న భూములను సర్వే చేసేందుకు ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విభాగం... యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. కోటగిరి బాబూరావు, వెంకటస్వామి దరఖాస్తు మేరకు హన్మకొండ మండలం కుమార్పెల్లి గ్రామ పరిధిలోని 214 సర్వే నంబర్లో ఉన్న స్థలానికి కొలతలు వేయనున్నట్లు ప్రకటించింది. సంబంధిత అధికారులు శనివారం కొలతలు వేసి.. హద్దులు నిర్ణయిస్తారని నోటీసులో పేర్కొంది. దరఖాస్తుదారులతోపాటు పొతార్ల రాజారాం, యూనివర్సిటీ రిజిస్ట్రార్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఈ నోటీసులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీన ఇచ్చిన నోటీసులకు యూనివర్సిటీ అధికారులు సైతం స్పందించారు. యూనివర్సిటీ ఆవిర్భావం నుంచి తమ ఆధీనంలో ఉన్న 214 సర్వే నంబర్లోని స్థలాన్ని సర్వే చేయడానికి నిరాకరించారు. యూనివర్సిటీకి మొత్తం 650 ఎకరాల స్థలం ఉందని... సర్వే చేయాలనుకుంటే మొత్తం భూమిని సర్వే చేయాలని తమ అభ్యంతరాన్ని వ్యక్త పరిచారు. మొత్తం భూమిని కొలతలు వేయించి.. అంతకంటే ఎక్కువగా తమ పరిధిలో ఉన్నట్లు తేలితే స్వాధీనం చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.సాయిలు సంబంధిత అధికారులకు లేఖ రాశారు. యూనివర్సిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ సమ్మూలాల్, లీగల్ ఆఫీసర్ రాంచందర్ గురువారం ఈ లేఖల ప్రతులను కలెక్టర్, జేసీ, ఆర్డీఓ, తహసీల్దార్లకు అందించారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ రాజుకున్నట్లయింది. ఈ సర్వే నంబర్లో తమకు సొంత స్థలం ఉందని.. భూ సేకరణలో యూనివర్సిటీ తమ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ పరిహారం చెల్లించలేదని.. అది తమకే చెందుతుందని ఇద్దరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. ఏకంగా ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదంతా తమ స్థలమేనని.. ఇందులో సర్వేకు అంగీకరించేది లేదని, ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని సహించేది లేదని యూనివర్సిటీ అధికారులు సైతం పట్టుదలతోనే ఉన్నారు. ఈ స్థలాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే కోర్టు కేసులు, ఫీజుల కింద దాదాపు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు యూనివర్సిటీ ఖర్చు చేయడం గమనార్హం. యూనివర్సిటీ స్థలాల ఆక్రమణను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు సైతం పలుమార్లు ఆందోళనలు చేపట్టాయి. ఈ వ్యవహారంలో తెర వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ఉండడం... జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఆయనకు అండదండగా ఉండడంతో రెవెన్యూ అధికారులు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఒక వైపు కోర్టు వివాదం.. మరోవైపు రాజకీయ జోక్యం మితిమీరిన నేపథ్యంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూముల సర్వేకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ ఆర్డీఓ నుంచి అందిన ఫైలు మేరకు తాము సర్వేకు ఆదేశించినట్లు భూమి కొలతల విభాగం ఏడీ సమీనాబేగం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల లేఖ కూడా అందిందని చెప్పారు.