వైజాగ్‌లో జీపీఎస్ సర్వే యంత్ర పరికరాల పరిశ్రమ | Vizag GPS survey of machine tool industry | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో జీపీఎస్ సర్వే యంత్ర పరికరాల పరిశ్రమ

Published Sun, May 24 2015 4:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

Vizag GPS survey of machine tool industry

హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమయ్యే భూముల సర్వే, పలు రకాల భవన సముదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జీపీఎస్ పద్ధతిలో సర్వే చేసే యంత్ర పరికరాల తయారీ పరిశ్రమను విశాఖపట్నంలో ప్రారంభించనున్నట్లు జీయో ట్రాక్స్ ఇం టర్నేషనల్ సర్వీసెస్ అధ్యక్షులు వీవీఎస్ బందుకవి తెలిపారు. చైనా సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం వైజాగ్‌లో 2 వేల ఎకరాలను కేటాయించేందుకు అంగీకరించిందన్నారు.

ఈ సందర్భంగా జీయో ట్రాక్స్ స్థాపించే అధునాతన జీపీఎస్ సర్వే పద్ధతులను  సంస్థ ప్రతినిధులతో కలిసి శని వారం హైదరాబాద్‌లో మీడియాకు వివరించారు. చైనా హాస్ నావిగేషన్ కంపెనీ జీపీఎస్ టెక్నాలజీతో అత్యంత సులువుగా, వేగంగా భూములను సర్వే చేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement