
న్యూఢిల్లీ: మెషిన్ టూల్ పరిశ్రమకు సంబంధించి జనవరి 23 నుండి 29 వరకు బెంగళూరులో ఐఎంటీఈఎక్స్ 2025 ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్ తదితర 23 దేశాల నుండి 1,100కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గోనున్నారు.
సుమారు 90,000 చ.మీ. విస్తీర్ణంలో నిర్వహించే ఎగ్జిబిషన్‌లో టూల్‌టెక్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ మొదలైన కార్యక్రమాల్లో భారత తయారీ సాంకేతికత సామర్థ్యాలను ప్రతిబింబించే పలు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మెషిన్ టూల్ రంగ సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్ రాజేంద్ర ఎస్ రాజమాణె తెలిపారు.