Modern Technology
-
ఆధునిక సాంకేతికతతో యువతను సన్నద్ధం చేయాలి
న్యూఢిల్లీ: దేశ పురోగతిలో యువత ఎంతో కీలకభూమిక పోషించాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు మారుతుతున్న కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికత నైపుణ్యంతో వారిని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వివిధ రంగాల్లో వేగంగా సంభవించే మార్పులు, సవాళ్లకు అనుగుణంగా యువత మారాల్సిన అవసరముందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో యువతకు ఇస్తున్న ప్రాధాన్యం, నూతన విద్యా విధానానికి అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. సర్వజన శ్రేయస్సు అనే మన పూర్వీకుల బోధనలకు అనుగుణంగానే రాజ్యాంగం మనకు సమానత్వ ఆవశ్యతను తెలియజేస్తోందన్నారు. మన దేశంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే బేధం లేదు. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానులేనని స్పష్టం చేశారు. గురు గోవింద్ సింగ్ కుమారులు ‘సాహిబ్జాదాస్’ప్రాణత్యాగం చేసిన వీర్ బాల్ దివస్ సందర్భంగా గురువారం ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. సాహిబ్జాదాస్ నుంచి ప్రేరణ దేశం కోసం మనం చేసే ప్రతి పనీ సాహసమే. మొఘల్ చక్రవర్తి అణచివేతకు లొంగడం కంటే ధైర్యం, ఆత్మగౌరవంతో పోరాటమే మేలని సాహిబ్జాదాస్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. విపత్కర పరిస్థితులెన్ని ఎదురైనా దేశం కంటే మిన్న మరేదీ లేదని వారు మనకు తెలియజెప్పారు. 300 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ 26వ తేదీన ఎంతో చిన్న వాళ్లయిన సాహిబ్జాదాస్, మొక్కవోని ధైర్యసాహసాలను, త్యాగనిరతిని ప్రదర్శించారు. మొఘల్ పాలకులు ఎన్ని ప్రలోభాలు చూపినా లొంగలేదు. తీవ్రమైన హింసను భరించారు. వారి దృష్టిలో దేశమే అత్యున్నతం. వారి వారసత్వం నుంచి మనం ప్రేరణ పొందాలి. సాహిబ్జాదాస్ వంటి వారి త్యాగాలు, ధైర్య సాహసాలపైనే భారత ప్రజాస్వామ్య సౌధం దృఢంగా నిర్మితమైంది. యువత రాజకీయాల్లోకి రావాలి దేశం మరింత ఐకమత్యంగా ముందుకు సాగేందుకు ధైర్యం, సేవానిరతిని కలిగి ఆవిష్కరణలపై దృష్టి సారించాలి. దేశంలో రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన లక్ష మంది యువత రాజకీయాల్లో ప్రవేశించాలి. దీనిద్వారా వచ్చే 25 ఏళ్లలో కొత్త తరానికి రాజకీయాలను పరిచయం చేయాలన్నదే నా ఉద్దేశం. వచ్చే ఏడాది స్వామి వివేకానందుని జయంతి నాడు ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ను నిర్వహిస్తాంచనున్నాం. దేశంలోని గ్రామాలు, పట్టణణాలు, నగరాలకు చెందిన యువత పాల్గొని అభివృద్ధి చెందిన భారత్ అనే విజన్‌కు రోడ్‌మ్యాప్‌పై జరిగే చర్చలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ గ్రహీతలతో ముచ్చటించారు. విజేతలైన 17 మందికి ప్రధాని అభినందనలు తెలిపారు. భారతీయ యువత ఏదైనా సాధించగలదని వీరు నిరూపించి చూపారని ప్రశంసించారు. కళలు, సంస్కృతి, సాహసం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు, పర్యావరణ, ఆవిష్కరణ రంగాల్లో అసాధారణ కృషి చేసినందుకు వీరిని బాల్ పురస్కార్‌కు ఎంపిక చేశారు. అదేవిధంగా, చురుకైన కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా పోషకాహార ఫలితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ‘సుపోషిత్ గ్రామ్ పంచాయత్ అభియాన్’అనే దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఏఐ యుగం ఇది యంత్ర యుగం కాదు, అంతకు మించి మెషీన్ లెర్నింగ్ యుగం. కృత్రిమ మేథ(ఏఐ) ఇప్పుడు అన్నిటికీ కేంద్రంగా మారింది. సంప్రదాయ సాఫ్ట్వేర్ స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుండటం మనమిప్పుడు చూస్తున్నాం. మున్ముందు ఎదురయ్యే ఇటువంటి సవాళ్లకు మన యువతను సన్నద్ధం చేయాల్సిన అవసరముంది. రైల్వేలు..సెమీ కండక్టర్లు..ట్రావెల్, ఆ్రస్టానమీ..ఇలా రంగమేదైనా యువత తమకు నచ్చిన అంశంపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. సైన్స్, క్రీడల నుంచి వ్యాపార రంగం వరకు స్టార్టప్‌లతో నూతన పరివర్తన శకం మొదలైంది. యువతకు మరింత చేయూతనిచ్చేలా మన విధానాలు రూపొందాయి. స్టార్టప్ అనుకూల విధానాలు, అంతరిక్ష ఆర్థిక రంగం, క్రీడలు, ఫిట్నెస్..ఇలా ప్రతిదీ యువతకు లాభం కలిగించేవే. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, పౌర కేంద్రీకృత విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. ఇందుకు మిషన్ కర్మయోగి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కొత్తకొత్త ఆలోచనల కోసం స్టార్టప్‌లు, పరిశోధన విభాగాలు, యువత నుంచి సలహాలను స్వీకరించాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ లెర్నింగ్ వీక్(కర్మయోగి సప్తాహ్)ను ప్రారంభించి, అధికారులనుద్దేశించి మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మరింత సులువుగా మారుతుందంటూ ఆయన..పౌరులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిపై నిఘాకు ఏఐతో వీలు కలుగుతుందన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే యంత్రాంగం అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2020లో మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. నారీ శక్తి ఆశీర్వాదమే స్ఫూర్తిమహిళల ఆశీర్వచనాలే తనకు దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ప్రేరణను అందిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మోదీకి కృతజ్ఞతగా అందజేయా’లంటూ ఓ గిరిజన మహిళ పట్టుబట్టి మరీ తనకు రూ.100 ఇచ్చారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా శనివారం ‘ఎక్స్’లో షేర్ చేసిన ఫొటోలపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా హృదయాన్ని కదిలించింది. నన్ను సదా ఆశీర్వదించే నారీ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి ఆశీస్సులే నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.నేడు వారణాసికి ప్రధాని మోదీ ప్రధాని ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. శంకర నేత్రాలయం సహా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. -
సూపర్ మార్కెట్ల తిండి...
ఆధునిక యుగంలో సర్వం ప్లాస్టిక్‌మయం.. మనం తీసుకొనే ఆహారం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కంటికి కనిపించిన సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు ఆహారంలో చేరుతున్న సంగతి తెలిసిందే అయినా ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారంలో ప్లాస్టిక్ పరిమాణంపై ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది. సూపర్ మార్కెట్లలో లభ్యమయ్యే రెడీమేడ్ ఆహారంతోపాటు ఫాస్ట్‌ఫుడ్‌ను ప్రయోగశాలలో క్షుణ్నంగా పరీక్షించింది. ఆహార తయారీ సమయంలోనే అందులో ప్లాస్టిక్ కలుస్తున్నట్లు గుర్తించింది... ► ఫాస్ట్ఫుడ్స్తోపాటు సూపర్ మార్కెట్లలో లభించే 85 రకాల ఆహార పదార్థాలను పరీక్షించగా, 84 పదార్థాల్లో ఫ్తాలేట్స్ అనే ప్లాస్టిక్ రసాయనం ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్లాస్టిక్ ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఈ కెమికల్‌ను ఉపయోగిస్తుంటారు. పోలార్ సెల్ట్జెర్ కంపెనీ తయారు చేసిన రాస్బెర్రీ లైమ్ అనే పండ్ల రసంలో ప్లాస్టిక్ లేదని తేలింది. ► తాము పరీక్షించిన వాటిలో 79 శాతం ఆహార నమూనాల్లో బైస్ఫెనాల్–ఏ(బీపీఏ) అనే మరో ప్లాస్టిక్ రసాయనం ఉన్నట్లు తేలిందని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రకటించింది. కానీ, 2009 నాటితో పోలిస్తే ఇప్పుడు ఆహార పదార్థాల్లో ఈ కెమికల్ పరిమాణం తక్కువే ఉన్నట్లు వెల్లడించింది. ► ఆహారంలో ఫ్తాలేట్స్ స్థాయి ఎంతవరకు ఉంటే క్షేమం అనేదానిపై సైంటిస్టులు ప్రమాణాలేవీ నిర్దేశించలేదు. అవి ఎంత తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ముప్పేనని చెబుతున్నారు. ► ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ శరీరంలో ఈస్ట్రోజెన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణను అస్తవ్యస్తం చేస్తాయి. ► ఇలాంటి రసాయనాలు కలిసిన ఆహారం తీసుకుంటే పుట్టుక లోపాలు, క్యాన్సర్, మధుమేహం, వంధ్యత్వం, స్థూలకాయం, నరాల సంబంధిత వ్యాధులతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ► చీరియోస్, గెర్బర్ బేబీ ఫుడ్, యోప్లాయిట్ యోగర్ట్‌తోపాటు వెండీస్, బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్స్ వంటి ప్రఖ్యాత కంపెనీల బర్గర్లు, చికెన్ నగ్గెట్స్, ఫ్రైలలో ఫ్తాలేట్స్, బైస్ఫెనాల్స్ ఉన్నట్లు గుర్తించారు. ► ఆహారంలో ప్లాస్టిక్‌ల నియంత్రణ కోసం ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని, నిబంధనలను కఠినతరం చేయాలని ‘కన్జ్యూమర్ రిపోర్ట్స్’ ప్రతినిధి జేమ్స్ రోజర్స్ సూచించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెక్నాలజీతో న్యాయం మరింత చేరువ: సీజేఐ
రాజ్‌కోట్: ఆధునిక సాంకేతికత సాయంతో న్యాయాన్ని అందరికీ ప్రజాస్వామ్యయుతంగా చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నూతన జిల్లా కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. కృత్రిమ మేధతో పని చేసే టెక్స్ట్ టు స్పీచ్ ‘కాల్–ఔట్’ సిస్టమ్‌ను, ఈ–ఫైలింగ్ 3.0 ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. జిల్లా కోర్టుల ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. న్యాయం కోసం ముందుగా అక్కడికే వస్తారని గుర్తు చేశారు. పౌరుల హక్కుల సాధనకు జిల్లా కోర్టులే పునాదిరాళ్లన్నారు. ‘‘ద్వారకలోని సోమ్‌నాథ్ ఆలయం, పూరీలోని జగన్నాథాలయంపై ఉండే ధ్వజం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పౌరులందరినీ కలిపి ఉంచే మానవత్వానికి ప్రతీక. అలాంటి మానవత్వానికి రాజ్యాంగమే రక్ష’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
టెక్–ఫ్రెండ్లీగా కింది కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతకు మరింతగా వినియోగించుకుంటూ కింది స్థాయి న్యాయస్థానాలను ‘టెక్–ఫ్రెండ్లీ’గా తయారుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. గురువారం ఆరి్టకల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కింది కోర్టులు సాంకేతిక పుంజుకోవాల్సిన అవసరం ఉందంటూ చేసిన వాఖ్యపై సీజేఐ స్పందించారు. కోవిడ్ కష్టకాలంలో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతిరోజూ నడపాల్సి వచి్చందని గుర్తుచేశారు. ఈ–కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు కేంద్రం కేటాయించిన భారీ బడ్జెట్ కారణంగా న్యాయవ్యవస్థ ముఖ్యంగా కింది కోర్టుల్లో సాంకేతిక పుంజుకొంటుందని సీజేఐ ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయస్థానాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఇతోధిక నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అత్యంత ముఖ్యమైనదని గుర్తుచేశారు. -
సాంకేతిక ప్రజాస్వామ్యం దిశగా
న్యూఢిల్లీ: ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్(ఎఫ్ఎం) రేడియో సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించే దిశగా 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేడియో పరిశ్రమలో ఇదొక విప్లవాత్మకమైన ముందుడుగు అని అభివర్ణించారు. సాంకేతిక(టెక్నాలజీ) ప్రజాస్వామీకరణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. తమ తరానికి రేడియోతో భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపారు. తాను రేడియో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నానంటూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోందని వివరించారు. దేశ ప్రజలతో భావోద్వేగపూరిత బంధం పెంచుకోవడం రేడియో ద్వారానే సాధ్యమని ఉద్ఘాటించారు. అందరికీ ఆధునిక టెక్నాలజీ స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో, బేటీ పడావో, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు మన్ కీ బాత్ ద్వారా ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆలిండియా రేడియో బృందంలో తాను కూడా ఒక భాగమేనని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించామని తెలియజేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం కీలకమన్నారు. డిజిటల్ ఇండియా వల్ల రేడియో శ్రోతల సంఖ్య పెరగడమే కాదు, కొత్త ఆలోచనా విధానం ఉద్భవిస్తోందని వివరించారు. ప్రతి ప్రసార మాధ్యమంలో విప్లవం కనిపిస్తోందని చెప్పారు. డీడీ ఉచిత డిష్ సేవలను 4.30 కోట్ల ఇళ్లకు అందించినట్లు తెలిపారు. ప్రపంచ సమాచారం ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు, దేశ సరిహద్దుల్లోని కుటుంబాలకు చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు సైతం విద్యా, వినోద సమాచారం చేరుతోందన్నారు. డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గ్రామీణ ప్రాంతాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణతో మొబైల్ డేటా చార్జీలు భారీగా తగ్గిపోయాయని, సమాచారం పొందడం ప్రజలకు సులభతరంగా మారిందని అన్నారు. దేశం నలుమూలలా డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొ స్తున్నారని వెల్లడించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ సేవలు బ్యాంకింగ్ సదుపాయాలు వాడుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన 91 ఎఫ్ఎం ట్రాన్స్‌మిట్టర్ల ద్వారా దేశవ్యాప్తంగా 85 జిల్లాల్లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఎఫ్ఎం రేడియో ప్రసారాలు వినవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, చత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు మారుమూల జిల్లాలతోపాటు లద్దాఖ్, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎఫ్ఎం రేడియో సేవలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. రికమండేషన్లకు చరమగీతం ఆలిండియా రేడియో వంటి కమ్యూనికేషన్ చానళ్లు మొత్తం దేశాన్ని, దేశంలోని 140 కోట్ల మందిని అనుసంధానించాలన్నదే తమ విజన్, మిషన్ అని ప్రధాని మోదీ వివరించారు. గతంలో రికమండేషన్ల ఆధారంగా పద్మా పురస్కారాలు ప్రదానం చేసేవారని, ఆ పద్ధతికి తాము చరమగీతం పాడేశామని అన్నారు. దేశానికి, సమాజానికి అందించిన విలువైన సేవల ఆధారంగానే ఈ పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలువురు పద్మ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు. -
Nature Astronomy: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు!
ఆధునిక సాంకేతిక యుగంలో మనషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాల (శాటిలైట్లు)పై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లోనూ వీటి అవసరం పెరిగిపోతోంది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్ బల్బుల వెలుగుతో పుడమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. అధ్యయనం వివరాలను ‘నేచర్ అస్ట్రానమీ’ పత్రికలో ప్రచురించారు. రానున్న రోజుల్లో విపరిణామాలే: భూగోళం చుట్టూ ప్రస్తుతం 8,000కు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి భూమిపై ప్రతి అంగుళాన్ని కవర్ చేస్తున్నాయి. స్పేక్‌ఎక్స్ సంస్థ 3,000కు పైగా చిన్నపాటి ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. వన్‌వెబ్ కూడా వందలాది కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దేశాల మధ్య పోటీ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వీటి సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు విద్యుత్ లైట్ల అవసరం పెరుగుతూనే ఉంది. శాటిలైట్ల నుంచి వెలువడే కాంతి, కరెంటు దీపాల నుంచి కాంతి వల్ల భూమిపై ప్రకృతికి విఘాతం వాటిల్లుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటివల్ల రాత్రిపూట ఆకాశం స్పష్టంగా కనిపించడం లేదని తేల్చారు. ‘‘అంతేగాక ఖగోళ శాస్త్రవేత్తల విధులకూ ఆటంకం కలుగుతోంది. అస్ట్రానామికల్ అబ్జర్వేటరీల పనితీరు మందగిస్తున్నట్లు తేలింది. ఈ కాంతి కాలుష్యం కారణంగా రాత్రివేళలో అనంతమైన విశ్వాన్ని కళ్లతో, పరికరాలతో స్పష్టంగా చూడగలిగే అవకాశం తగ్గుతోంది. అంతేగాక భూమిపై జీవుల అలవాట్లలో, ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి’’ అని వెల్లడించారు. దీనికి అడ్డుకట్ట వేసి సహజ ప్రకృతిని పరిరక్షించుకొనే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. పరిష్కారం ఏమిటి? కాంతి కాలుష్యానికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి పరిష్కార మార్గం లేదని నిపుణులు అంటున్నారు. దాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టడం మేలు. ‘‘శాటిలైట్లలో బ్రైట్నెస్ తగ్గించాలి. టెలిస్కోప్ పరికరాల్లోని షట్టర్లను కాసేపు మూసేయడం ద్వారా కాంతి తీవ్రతను తగ్గించవచ్చు’’ అని సూచిస్తున్నారు. కృత్రిమ ఉపగ్రహాలతో కాంతి కాలుష్యమే గాక మరెన్నో సమస్యలున్నాయి. కాలం తీరిన శాటిలైట్లు అంతరిక్షంలోనే వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. అంతరిక్ష కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పైగా వీటినుంచి ప్రమాదకర విష వాయవులు వెలువడుతుంటాయి. ఆర్బిటాల్ ట్రాఫిక్ మరో పెను సమస్య. – సాక్షి, నేషనల్ డెస్క్ -
5జీని విస్తరిస్తున్న టెల్కోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా టెలికం కంపెనీలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. రిలయన్స్ జియో తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోసహా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 నగరాలు, పట్టణాల్లో నూతనంగా 5జీ సర్వీసులను జత చేసింది. దీంతో భారత్‌లో కంపెనీ మొత్తం 331 ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీని పరిచయం చేసినట్టు అయింది. జియో వెల్కమ్ ఆఫర్లో భాగంగా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే కస్టమర్లు ప్రస్తుత చార్జీతో 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత ఇంటర్నెట్ను ఆస్వాదించవచ్చు. 2023 చివరినాటికి దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో 5జీ సర్వీ సులను అందుబాటులోకి తేవాలన్నది రిలయన్స్ లక్ష్యం. సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారతీ ఎయిర్టెల్ సైతం.. మరో టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ఏకంగా 125 నగరాలు, పట్టణాల్లో కొత్తగా 5జీ సేవలను జోడించింది. దీంతో సంస్థ అందిస్తున్న 5జీ సర్వీసులు దేశంలో మొత్తం 265 ప్రాంతాలకు విస్తరించాయి. ఉత్తరాదిన జమ్మూ మొదలుకుని దక్షిణాదిన కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన నగరంలో నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలకు 5జీని వేగంగా చేర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలతోపాటు ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో అడుగుపెడతామని భారతీ ఎయిర్టెల్ సీటీవో రన్‌దీప్ సెఖన్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు లక్ష్యమని తెలిపారు. -
2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’
న్యూఢిల్లీ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు ఆధునిక సాంకేతికత దోహదపడతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ విప్లవ ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భారీస్థాయిలో ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ‘అన్లీషింగ్ ద పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ’ పేరిట మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. చిన్న తరహా పరిశ్రమలపై భారంగా మారిన నిబంధనలను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీతో పేదలకు లబ్ధి అన్ని రంగాల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. 5జీ, కృత్రిమ మేధ(ఏఐ)పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోందన్నారు. సాంకేతికతతో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే రేషన్‌తోపాటు జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ నెంబర్(జేఏఎం)కు టెక్నాలజీయే ఆధారమని అన్నారు. దీనివల్ల పేదలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తం చేశారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏఐ ద్వారా పరిష్కరించగలిగిన పదింటిని గుర్తించాలని నిపుణులకు సూచించారు. 21వ శతాబ్దాన్ని టెక్నాలజీ ముందుకు నడిపిస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ప్రజల జీవనాన్ని సులభతరం చేయడానికి ప్రతి బడ్జెట్లోనూ పెద్దపీట వేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ఒక అవరోధంగా పరిగణించవద్దని ప్రజలకు సూచించారు. -
సాంకేతికతతో ‘పవర్’ఫుల్‌గా ప్రసారం
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో సొంతంగా ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ.. నిర్వహణను సులభతరంగా మార్చుకుంటోంది. భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో ప్రసార వ్యవస్థ(ట్రాన్స్మిషన్ నెట్వర్క్)ను మరింత బలోపేతం చేస్తోంది. నెట్వర్క్ మెయింటెనెన్స్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను సులభతరం చేసేందుకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)ను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ జీఐఎస్‌కు 63,000 టవర్లు, 30,010 సర్క్యూట్ కిలోమీటర్ల పొడవు లైన్లు, 358 ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్స్టేషన్ల నెట్‌వర్క్‌ను అనుసంధానించింది. దీంతో మొత్తం నెట్వర్క్ నిర్వహణ సులభతరంగా మారింది. క్షేత్రస్థాయి అధికారుల విధులతో పాటు నెట్వర్క్ సమాచారాన్ని భౌగోళికంగా ఒకే ప్లాట్‌ఫాంపై మ్యాపింగ్ చేసింది. ఈ మ్యాపింగ్‌లను ఉపయోగించి డేటాను యాక్సెస్ చేయడం ద్వారా నిర్వహణ కార్యకలాపాలకు రూపకల్పన జరుగుతోంది. అలాగే జీఐఎస్ వల్ల ఫీల్డ్ ఇంజనీర్లకు ప్రాథమిక సర్వే నిర్వహించడం సులభంగా మారింది. మరోవైపు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడానికి సహాయపడేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అంతర్గత డిమాండ్ అంచనా నమూనా(ఇన్‌హౌస్ ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్)ను కూడా అభివృద్ధి చేసింది. ఇది దాదాపు 99 శాతం కచ్చితత్వాన్ని కలిగి ఉంది. దీన్ని ఉపయోగించి విద్యుత్ అవసరాలను ముందే అంచనా వేస్తున్నారు. దీని ద్వారా విద్యుత్ సంస్థలు.. తమ కొనుగోళ్లలో కొన్ని రూ.కోట్లను పొదుపు చేసే అవకాశం ఉంది. ఏపీలో అభివృద్ధి చేసిన ఈ ఫోర్ కాస్టింగ్ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థల్లోనే మొదటిది. దీంతో అనేక రాష్ట్రాలు ఈ మోడల్‌ను తమకూ ఇవ్వాలని ఏపీని కోరుతున్నాయి. సీఎం ఆశయానికి అనుగుణంగా.. – బి.శ్రీధర్, సీఎండీ,ఏపీ ట్రాన్స్‌కో ఇటీవలే రెండు జాతీయ స్థాయి అవార్డులను గెల్చుకున్నాం. భవిష్యత్‌లోనూ విద్యుత్ ప్రసార నష్టాలను 2.8 శాతంలోపు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే సీఎం వైఎస్ జగన్ ఆశయానికి అనుగుణంగా ఏపీ ట్రాన్స్‌కో ఉత్తమ సాంకేతిక విధానాలను అమలు చేస్తోంది. డిస్కంలకు ఇవి సహాయపడతాయి. ఏపీ ట్రాన్స్‌కో విధానాలను తమకూ చెప్పాలని తమిళనాడు, రాజస్తాన్ తదితర రాష్ట్రాలు కోరాయి. -
దేశంలో 4.90 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపుగా 4.90 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పెండింగ్ కేసుల త్వరితగతి విచారణ కోసం ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలసికట్టుగా కృషి చేయాలన్నారు. అప్పుడే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని కేసుల విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఈ–కమిటీ చీఫ్‌గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ‘‘4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే చాలా మంది న్యాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. న్యాయం జరగడం ఆలస్యమవుతోందని అంటే న్యాయం చెయ్యడం తిరస్కరించడంగానే భావించాలి. వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలి’’ అని రిజిజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాల ఉమ్మడి కృషి కారణంగానే పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించగలమని వివరించారు. -
‘సంప్రదాయ పోలీసింగ్’ బలోపేతం
న్యూఢిల్లీ: పోలీసు దళాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కొత్త టెక్నాలజీలో సుశిక్షితులు కావాలన్నారు. అదేసమయంలో సంప్రదాయ పోలీసింగ్ విధానాలను బలోపేతం చేసుకోవాలని చెప్పారు. ఆదివారం డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ 57వ అఖిల భారత సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలు పరస్పరం సహకారం పెంపొందించుకోవాలని అన్నారు. ఉత్తమమైన విధానాలను పంచుకోవాలని తెలిపారు. వాడుకలోని లేని క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ ప్రమాణాలను మరింత పెంచాల్సి ఉందన్నారు. వివిధ దర్యాప్తు సంస్థల నడుమ డేటాను ఇచ్చిపుచ్చుకొనే విధానం బలపడాలని, ఇందుకోసం నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇక జైళ్ల సమర్థ నిర్వాహణకు సంస్కరణలు చేపట్టాలని తెలిపారు. నూతన సవాళ్లు, పరిష్కార మార్గాలపై చర్చించుకొనేందుకు పోలీసు ఉన్నతాధికారుల సదస్సులు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా నిర్వహించుకోవాలని సూచించారు. డీజీపీలు/ఐజీపీల సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 600 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు. -
‘టెక్నాలజీవినియోగంలో తెలంగాణ ముందంజ’
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని మంత్రి కేటీ రామారావు అన్నారు. నూతన సాంకేతికత ఫలితాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్కాటు చేసిన ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ప్రస్థానం విజయవంతంగా సాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ప్రారంభించిన ‘వెబ్ 3.0’రెగ్యులేటరీ సాండ్ బాక్స్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీలో ‘బ్లాక్ చెయిన్’సాంకేతికత సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సులభతర జీవనానికి బాటలు వేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సాండ్ బాక్స్ ద్వారా స్థానిక, అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తుల పనితీరును ప్రత్యక్షంగా పరీక్షించుకునేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘వెబ్ 3.0’రెగ్యులేటర్ సాండ్ బాక్స్‌ను బెంగుళూరులో శుక్రవారం జరిగిన ఎట్ ఇండియా హ్యాకథాన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంకా ప్రారంభించారు. -
Hyderabad: భవనం కాదండోయ్.. మరేంటో మీరే తెలుసుకోండి!
సాక్షి, హైదరాబాద్: కింది ఫొటోలో కనిపిస్తున్నది భవనం కాదు. పాదచారులు సదుపాయంగా రోడ్డు దాటేందుకు నిర్మించనున్న ఫుట్ఓవర్ బ్రిడ్జి నమూనా. నగరంలో పాదచారులు రోడ్డు దాటేందుకు పడుతున్న అవస్థలు, ప్రమాదాలు తగ్గించేందుకు ఇప్పటికే వివిధ చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అందులో భాగంగా నిర్మిస్తున్న ఎఫ్‌ఓబీల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ పద్ధతిలో అధునాతనంగా ఈ ఎఫ్ఓబీని నిర్మించేందుకు సిద్ధమైంది. బంజారాహిల్స్ జీవీకేమాల్ వద్ద అత్యంత ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రీడీ విధానంలో, పాదచారులు సదుపాయంగా రోడ్డు దాటేలా ఫొటోలో మాదిరి నిర్మించనుంది. పనులు పురోగతిలో ఉన్న ఈఎఫ్‌ఓబీని వీలైనంత త్వరితంగా పూర్తిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా రూ. 5కోట్ల అంచనా వ్యయంతో ఎంఎస్ స్టీల్‌తో నిర్మిస్తున్న ఈ ఎఫ్ఓబీ వివరాలిలా ఉన్నాయి. ►పొడవు : 54.97 మీటర్లు. ►రెండు వైపులా లిఫ్టులు. ఒక్కో లిఫ్టులో ఒకేసారి పదిమంది వెళ్లవచ్చు. ►రెండు ఎస్కలేటర్లు ►8 సీసీకెమెరాలు ►ఇప్పటి వరకు 43 ఎఫ్ఓబీల పనులు చేపట్టగా వాటిల్లో 21 ఎఫ్‌ఓబీలు పూర్తయినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. -
చెత్తకూ పవరుంది!
సాక్షి, అమరావతి: రోజురోజుకు పేరుకుపోతున్న చెత్త నగరాలు, పట్టణాలనే కాదు.. పచ్చని పల్లెలకూ సవాలు విసురుతోంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల (యూఎల్బీల) నుంచి రోజుకు 4,200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నట్టు తేలింది. ఈ చెత్త సమస్య పరిష్కారానికి ఉన్న వాటిలో ఉత్తమ మార్గం.. దాన్ని మండించి విద్యుత్ ఉత్పత్తి చేయడమే. ఈ ప్రక్రియ మన దేశంలో 1987లో ఢిల్లీలో మొదలైంది. అక్కడే మొదటి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇలా మున్సిపల్ వ్యర్థాలతో నడిచే విద్యుత్ ప్లాంట్లు ఢిల్లీ, జబల్పూర్, హైదరాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మన రాష్ట్రంలో రెండు ఉన్నాయి. గుంటూరు, విశాఖపట్నం నగరాలకు సమీపంలో ఒక్కోటి గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు రెండింటిని రూ.640 కోట్లతో జిందాల్ సంస్థ నిర్మించింది. చెత్తే ఇంధనంగా విద్యుత్ ఉత్పత్తి పల్నాడు జిల్లా కొండవీడులో ఏర్పాటు చేసిన ఈ పవర్ ప్లాంట్‌కు విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు సమీపంలోని మరో 9 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను తరలిస్తున్నారు. విశాఖ సమీపంలోని కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేసిన ప్లాంటుకు గ్రేటర్ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాల చెత్తను తరలిస్తున్నారు. ఇక్కడ గార్బేజ్ పిట్స్‌లో వారం రోజులు ఆరబెట్టి, వాటి నుంచి విడుదలయ్యే మీథేన్, ఇతర వాయువులను ఫ్యాన్ల ద్వారా బర్నింగ్ చాంబర్‌కు అనుసంధానించారు. గార్బేజ్ పిట్లో చెత్తను క్రేన్లతో బర్నింగ్ చాంబర్లో వేసి ఈ గ్యాస్‌తో మండించి 1,000 డిగ్రీల వేడిని ఉత్పత్తి చేస్తున్నారు. దీనితో నీటిని ఆవిరిగా మార్చి టర్బయిన్లు తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్స్ ఒక్కోదానిలో రోజుకు 1,200 టన్నుల చెత్తను మండిస్తారు. 15 మెగావాట్ల చొప్పున 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాంట్ అవసరాలకు పోను 13.5 మెగావాట్ల చొప్పున 27 మెగావాట్లను గుంటూరు జిల్లా వెంగళాయపాలెం సబ్ స్టేషన్‌కు, విశాఖలోని విద్యుత్‌ను ఆనందపురం సబ్‌స్టేషన్‌కు సరఫరా చేస్తున్నారు. పట్టణ ఘన వ్యర్థాల్లో ఈ రెండు ప్లాంట్లకు చేరుతున్నది 1,800 నుంచి 1,900 టన్నులు. మిగిలిన చెత్తను సాధ్యమైనంత మేర తరలిస్తే మరింత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. సమర్థంగా ఉప వ్యర్థాల వినియోగం కుళ్లిన చెత్త నుంచి ప్రధానంగా బయో గ్యాస్, లీచెట్ విడుదలవుతాయి. వీటిని జిందాల్ ప్లాంట్లలో సమర్థంగా శుద్ధి చేసి వినియోగిస్తున్నారు. రోజూ 1,200 టన్నుల వ్యర్థాల నుంచి 100 కిలో లీటర్ల (1కిలో లీటర్=1000 లీటర్లు) లీచెట్ వస్తోంది. లీటర్ లీచెట్‌లో 70 వేల నుంచి లక్ష మిల్లీగ్రాముల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ)తో పాటు ఇతర ప్రమాదకర రసాయనాలుంటాయి.దీన్ని భూమిలోకి ఇంకకుండా పిట్ అడుగునున్న చాంబర్ల ద్వారా సేకరించి శుద్ధి చేయగా 60 కిలో లీటర్ల శుద్ధి జలాలు, 35 కిలో లీటర్ల రిజెక్ట్ వాటర్‌తో పాటు 5 కిలో లీటర్ల స్లెడ్జ్ ఉత్పత్తి అవుతోంది. శుద్ధి జలాలను మొక్కలకు, రిజెక్ట్ వాటర్‌ను బూడిదను చల్లబరిచేందుకు, స్లెడ్జ్‌ను ఎండబెట్టి తిరిగి చెత్త మండించేందుకు వినియోగిస్తున్నారు, అంటే ఘన వ్యర్థాల నుంచి వచ్చే ఉప వ్యర్థాలను సైతం నూరు శాతం తిరిగి వినియోగిస్తున్నారు. ప్లాంట్లలో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కాలుష్య నియంత్రణ మండలితో అనుసంధానించారు. కాలుష్య రహితంగా ప్లాంట్ నిర్వహణ దేశంలో ఉన్న ఐదు ప్లాంట్లలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన రెండూ మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు వందల టన్నుల చెత్తను మండించినా కాలుష్యం ప్లాంట్ దాటి వెళ్లే పరిస్థితి లేదు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ విడుదల చేసే కాలుష్యంలో 10 శాతానికంటే తక్కువ కారకాలు విడుదలవుతుండగా, వాటిని గాల్లోకి చేరకుండా ఆధునిక టెక్నాలజీతో అడ్డుకుంటున్నారు. బాయిలర్ అడుగున పడే బూడిదను, బ్లోయర్ల ద్వారా వచ్చే ఫ్లైయాష్‌ను, లీచెట్ శుద్ధి చేయగా వచ్చిన నీటితో చల్లబరిచి రోడ్లపై గుంతలు పూడ్చడానికి వినియోగిస్తున్నారు. మరోపక్క ఫ్లై యాష్‌తో ఇటుకల తయారీపై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. రాష్ట్రంలో సగటున ఓ ఇంటికి రోజుకు 10 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. నెలకు 300 యూనిట్లు. ఓ ఇంటి నుంచి రోజుకు సగటున వచ్చే చెత్త 2.5 కిలోలని మున్సిపల్ శాఖ లెక్కగట్టింది. నెలకు ఒక్కో ఇంటి నుంచి సుమారు 75 కేజీలు. పల్నాడు జిల్లా కొండవీడు వద్ద, విశాఖపట్నం సమీపంలోని కాపులుప్పాడ వద్ద ఉన్న ‘జిందాల్ ఎకోపోలిస్ ఎనర్జీ ప్లాంట్లు’ గంటకు 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే దాదాపు 72 వేల ఇళ్లకు ఒక రోజుకు సరిపోయేటంత. విద్యుత్, చెత్త వేర్వేరు. మనం నిత్యం బయట పడేసే చెత్త ద్వారానే విద్యుత్ తయారై తిరిగి మన ఇంటికి వెలుగునిస్తుంది. ఇలా.. వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు. మరో ఏడు ప్లాంట్లకు అవకాశం ఏపీ మున్సిపాలిటీల్లో రోజూ సుమారు 4,200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. ఇది ఏటా 5 శాతం పెరుగుతుందని సర్వే చెబుతోంది. మా ప్లాంట్లు రెండింటిలోనూ గంటకు 20 మెగావాట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అనుకున్న స్థాయిలో చెత్తను అందిస్తే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయగలం. మా ప్రగతిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కృషి ఎంతో ఉంది. రాష్ట్రంలో మరో ఏడు ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటుకు అవకాశం ఉంది. – ఎం.వి.చారి, జిందాల్ ఏపీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ సమర్థంగా వ్యర్థాల నిర్వహణ మున్సిపల్ ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారీ ప్లాంట్లు దేశంలో ఐదు ఉండగా, వాటిలో రెండు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాహనాలతో ఎప్పటికప్పుడు యూఎల్బీల నుంచి ప్లాంట్లకు చెత్త తరలిస్తున్నాం. దీనివల్ల వ్యర్థాల నిర్వహణ సమర్థంగా జరుగుతుంది. – డాక్టర్ సంపత్‌కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ -
లేటెస్ట్ టెక్నాలజీతో సెబీ రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అత్యంత ఆధునిక టెక్నాలజీని, సంబంధిత టూల్స్‌ను సమకూర్చుకుంటోంది. వీటి సహాయంతో ఇన్సైడర్ ట్రేడింగ్, అక్రమ లావాదేవీల కేసులపై కొరడా ఝళిపించనుంది. తద్వారా నకిలీ ఖాతాల వినియోగంతో అక్రమాలకు పాల్పడిన కేసులను అత్యంత భారీ స్థాయిలో వెలికితీయనుంది. వెరసి క్యాపిటల్ మార్కెట్లు, కార్పొరేట్ ప్రపంచంలో పేరున్న ఇలాంటి కొంతమంది ప్రధాన అక్రమార్కులపై కేసులు నమోదు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్–19వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఈ తరహా కేసులపై ఇటీవల సెబీ పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ బాటలో ఇకపై ఇలాంటి కేసులను మరిన్నింటిని గుర్తించనున్నట్లు తెలుస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పర్యవేక్షణ వ్యవస్థల సామర్థ్యం 100 రెట్లు బలపడిన కారణంగా సెబీ మరింతలోతైన అధ్యయానికి తెరతీస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆల్గోరిథమ్స్, బిగ్ డేటా, కృత్రిమ మేథ తదితర టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వివరించాయి. -
స్టార్టప్‌లకు రైల్వే నిధుల మద్దతు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఏటా రూ.50 కోట్ల నిధులు అందించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. మరే ఇతర భాగస్వామ్యాల మాదిరిగా ఇది ఉండదని స్పష్టం చేస్తూ.. మేథో సంపత్తి హక్కులు ఆయా ఆవిష్కరణదారులకే (స్టార్టప్ సంస్థలకు) ఉంటాయని స్పష్టం చేశారు. ఇండియన్ రైల్వే ఆవిష్కరణల విధానం కింద.. రైల్వే శాఖ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడుతుందని, దీని ద్వారా వినూత్నమైన సాంకేతిక ఆవిష్కరణలను వారి నుంచి నేరుగా పొందొచ్చని మంత్రి తెలిపారు. వినూత్నమైన సాంకేతిక పరిష్కారాలకు రూ.1.5 కోట్లను సీడ్ ఫండ్‌గా అందించనున్నట్టు చెప్పారు. నిధుల మద్దతును రెట్టింపు చేస్తామని, విజయవంతంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తి లేదా టెక్నాలజీని అమల్లో పెడతామని వివరించారు. ఆవిష్కర్తలు, రైల్వే 50:50 నిష్పత్తిలో వ్యయాలు భరించేలా ఈ పథకం ఉంటుందన్నారు. స్టార్టప్ ల ఆవిష్కరణ, అభివృద్ధి దశలో రైల్వే ఫీల్డ్ ఆఫీసర్లు, ఆర్డీఎస్వో, జోనల్, రైల్వే బోర్డు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సహకారం అందుతుందని వైష్ణవ్ తెలిపారు. పారదర్శక విధానంలో స్టార్టప్‌ల ఎంపిక ఉంటుందని, ఇందు కోసం ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఇండియన్ రైల్వేస్ పేరిట పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
రహస్య భూగర్భ రైలు మార్గం: ఎక్కడ ఉందో, దాని చరిత్ర ఏంటో తెలుసా?
పూర్వం రాజులు శత్రు రాజులు తమ పై దండయాత్ర చేసినప్పుడు తప్పించుకోవడానికి లేదా ఒక వేళ యుద్ధంలో తాను ఓడిపోతే తన పరివారాన్ని రక్షించుకోవటం కోసం కోటలో ప్రత్యేకంగా భూగర్భ మార్గం(సోరంగం) కచ్చితంగా ఏర్పాటై ఉండేవి. వాటి సాయంతో తప్పించుకోవటం వంటివి చేసేవారు. లేదా రాజు రహస్యంగా దేశ సంచారం చేయాలనుకున్న ఆ రహస్య మార్గం గుండా వచ్చేవారు. ఎవ్వరికి తెలియనచ్చేవారు కాదు. అచ్చం అదేవిధంగా వాషింగ్టన్లో రహస్య భూగర్భ మార్గం ఉంది. కాకపోతే అది సొరంగాలా కాకుండా భూగర్భ రైలు మార్గం(సబ్వే). అసలు అది ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏంటో తెలుకుందాం రండి వాషింగ్టన్: వాషింగ్టన్లో ఉన్న ఈ రహస్య భూగర్భ రైలు(సబ్వే) మార్గం గుండా ప్రముఖులు, సుప్రీం కోర్టు జడ్జీలు, ప్రముఖ బాలీవుడ్ ప్రయాణించేవారట. పైగా విశేషమేమిటంటే చాలామంది అమెరికన్లకు కూడా ఈ సబ్వే ఒకటి ఉందని తెలుసుంటున్నారు చరిత్రకారులు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూగర్భ రైలు యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ప్రతినిధుల సమావేశమయ్యే వాషింగ్టన్ శ్వేత సౌధంలా ఉంటుందంటున్నారు. మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో అత్యంత క్లిష్టతరమైన గందరగోళ మార్గం, పైగా ఈ మార్గంలోకి వెళ్లంగానే బయట ఏం జరుగుతోందో కూడా మనకు తెలయదని సెనేట్ హిస్టారికల్ ఆఫీస్‌లోని సహాయక చరిత్రకారుడు హిస్టారియన్ డాన్ హోల్ట్ చెబుతున్నారు. ఒక శతాబ్దానికి పైగా రాజకీయ నాయకులు ఈ సబ్వేని ఉపయోగించారని చెబుతున్నారు. సెనెటర్లు, ప్రముఖులు ఎక్కువగా తమ కుటుంబాలతో వచ్చి గడిపేవారని, పైగా ప్రముఖుల పిల్లలు ఈ రైలులో ప్రయాణించడానికీ ఎకువగా ఇష్టపడేవారని అన్నారు. చరిత్రకారుడు హోల్ట్ ఈ రైలు ఏదో ప్రత్యేకత ఉందంటున్నారు. ఈ భూగర్భ మార్గం మూడే వేల అడుగుల లోతులో ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు సెనెటర్లు విలేకర్లు సమావేశం, రాజకీయ చర్చలు, పుకార్లతో విసిగిన అధికారులకు ఈ మార్గం గుండా ప్రయాణమనేది వారికీ అత్యంత నిశబ్దంతో కూడిన ప్రశాంతమైన జర్నీలా ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: చిప్సెట్ల కొరత.. చైనాకు చెక్ పెట్టేలా ఇండియా ప్లాన్ !) అలుముకున్న కొన్ని వివాదాలు .. ఇక్కడ ఒక మాజీ పోలీస్ అధికారి విలియమ్ కైసర్ అప్పటి అధ్యక్షుడి జాన్ బ్రిక్కర్ పై కాల్పులు జరిపాడని చెప్పారు. అంతే కాక అమెరికా 27వ అధ్యక్షుడు హోవార్డ్ టాఫ్ట్ ఇక్కడే అదృశ్యమైనట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిందన్నారు. దీంతో ప్రస్తుతం సెనెటర్లకు ఈ మార్గం అంటేనే భయంగలిగించే విధంగా అయ్యిందని ప్రస్తుతం ఈ మార్గాన్ని వినయోగించటం లేదని పేర్కొన్నారు. ఎప్పుడు ప్రారంభించారంటే...... ఈ భూగర్భ రైలు మార్గం మార్చి 7, 1990లో ప్రారంభమైంది. వాషింగ్టన్‌లోని తమ కార్యాలయాలకు వెళ్లడానికీ ఈ మార్గాన్ని వినియోగించేవారు. ఈ తర్వాత కాలంలో 1960లో 75 వేల డాలర్లలతో ఎలక్ట్రిక్ మోనో రైలులో రూపోందించారు. ప్రతినిధుల సమావేశాలు కూడా జరుపుకునే ఆఫీస్ కార్యాలయంలా అత్యధునిక టెక్నాలజీతో ఆ రైలుని రూపొందించారు. తదనంతరం 1993లో 18 వేల డాలర్లతో డిస్నీ ల్యాండ్ తరహా డ్రైవర్ లెస్ రైలును సరికొత్త హంగులతో ఆవిష్కిరించారు. కానీ కాలక్రమంలో అత్యధునిక టెక్నాలజీతో రూపాంతరం చెందుతున్న ఈ భూగర్భ రైలు(సబ్వే)ను చాలా మంది సెనెటర్లు అంతగా ఇష్టపడలేదనేది చారిత్రకారుల అభిప్రాయం. ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటు ఫిర్యాదులు వచ్చాయని చరిత్రకారులు అంటున్నారు. హమిల్లన్ అనే మ్యూజికల్ అల్బమ్ సృష్టి కర్త లిన్-మాన్యువల్ మిరాండా 2017లో అవార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ మార్గం గుండా రైడ్ చేయాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు. దీంతో ఈ భూగర్భ రైలు మార్గం వార్తల్లో నిలివడమే కాక ప్రజల్లో చర్చలకు తెరలేపింది. ఏది ఏమైనప్పటికీ ఈ భూగర్భ రైలు మార్గం(సబ్వే) ప్రముఖులను ఉద్దేశించి ఆవిష్కరించినదే అయినా కొన్ని వివాదాల కారణంగా శతాబ్దాలకు పైగా రాజకీయ నాయకులు ఉపయోగించిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన చారిత్రక రహస్య భూగర్భ రైలుగా మిగిలిపోయిందని సహాయక చరిత్రకారుడు హోల్ట్ అభివర్ణించారు. (చదవండి: భయంకరమైన బావి.. నరక కూప మర్మం చేధించిన సాహసికులు) -
ఇ-వ్యవసాయం.. ఒక్క క్లిక్‌తో సమగ్ర సమాచారం
పెద్దాపురం: అన్నదాతకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇ–వ్యవసాయం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాగులో యాజమాన్య పద్ధతులు తెలుసుకునేందుకు ప్రతిసారీ వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలను కలవాలన్నా, ఫోన్లో సంప్రదించాలన్నా రైతులకు కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని, కర్షకులకు చేరువలో ఉండేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టిందని పెద్దాపురం ఏడీఏ ఎం.రత్నప్రశాంతి తెలిపారు. పంటల వివరాలు, సాగు పద్ధతులు, రాయితీలు, సౌకర్యాలు తదితర అంశాలతో ఇ–వ్యవసాయం పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని సూచనలు, సలహాలు పాటిస్తే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు. అంతా తెలుగులోనే.. అంతర్జాలంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుగులోనే పొందుపరిచారు. వరి, మొక్కజొన్న, కంది, జొన్న, పత్తి, వేరుశెనగ, తదితర 18 రకాల పంటలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంచారు. విత్తనాలు విత్తే సమయం నుంచి ధాన్యం మార్కెట్‌కు తరలించే వరకూ తీసుకోవాల్సిన సూచనలు అందులో వివరించారు. ప్రధానాంశాలు ఇవీ.. పొలంబడి, వర్మికంపోస్టు ఎరువు తయారీ, గ్రామీణ విత్తన పథకం, బ్యాంక్ ద్వారా రుణ సదుపాయాలు, పంటల యాజమాన్యానికి సంబంధించిన వీడియోలు వెబ్సైట్లో ఉన్నాయి. జీవ రసాయన ఎరువుల తయారీ, వాటి వినియోగం, పంటల కనీస మద్దతు ధరలు, ఎరువుల అమ్మకాలు, భవిష్యత్‌లో ధరల అంచనాల విషయాలు పొందుపరిచారు. వ్యవసాయ అనుబంధ శాఖల వెబ్సైట్ లింకులు, అధికారుల ఫోన్ నంబర్లు, చిరునామాలు, వారి సలహాలు తీసుకునే విధంగా ఇ– వ్యవసాయం పేరుతో రూపకల్పన చేశారు. వ్యవసాయ పంచాంగం ఇ– వ్యవసాయం వెబ్‌పేజీలో కుడివైపు కింద భాగంలో వ్యవసాయ పంచాంగం ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ఆహార ధాన్యాల వివరాలు, ఫొటోలతో సహా పంచాంగం ఓపెన్ అవుతుంది. అందులో పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య పంటలు, పండ్ల తోటలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ, పూల మొక్కలు, ఇతర వివరాలు, పశు సంవర్ధక శాఖ, చేపలు, రొయ్యల పెంపకం వివరాలు ఉంటాయి. రైతులు గుగూల్ ఓపెన్ చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అగ్రీస్నెట్ అని టైప్ చేస్తే ఇ– వ్యవసాయం పేజీ ఓపెన్ అవుతుంది. చదవండి: హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్ అమ్మో.. కింగ్ కోబ్రా: భయంతో జనం పరుగులు -
వర్సిటీల ఆన్లైన్ బోధన
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బతో విద్యాబోధన తీరులో మార్పు రానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే విద్యా రంగాన్ని డిజిటైజేషన్ వైపు తీసుకెళ్లింది. కరోనా ఏమో ఇప్పుడు ఆన్లైన్ తరగతులు, వర్చువల్ సమావేశాల వైపు వేగంగా తీసుకెళ్తోంది. భవిష్యత్తులోనూ ఆన్లైన్ విద్య కొన సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 191 దేశాల్లోని 158 కోట్ల విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడగా, ఇప్పటికే ప్రత్యామ్నాయ బోధన విధానానికి చర్యలు చేపట్టాయి. మన దేశంలోనూ సంప్రదాయ డిగ్రీలు కాకుండా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాయి. ప్రైవేటు విద్యా సంస్థలైతే పాఠశాల విద్యలో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ప్రభుత్వ రంగంలోనూ పలు చర్యలు చేపట్టాయి. అయితే ఉన్నత విద్యలో ఒక ప్రత్యేక విధానం ఉండాలన్న ఆలోచనతో కేంద్రం ‘భారత్ పఢే’పేరుతో దేశంలో ఈ–లెర్నింగ్ విద్యా విధానం ఉండాల్సిన తీరుపై విద్యావేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది. డిగ్రీ కోర్సులను కూడా ఆన్లైన్లో నిర్వహించాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యూనివర్సిటీస్ ఇన్ 2030 పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలకు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థులతో మాట్లాడినట్లు పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలివే ► ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు 2030 నాటికి ఆన్లైన్లో పూర్తిస్థాయి డిగ్రీ కోర్సులు ప్రవేశ పెడతాయని అంగీకరీస్తారా అని ప్రశ్నించగా, 5 శాతం మంది అసలే అంగీకరించబోమని చెప్పగా, 13 శాతం మంది అలా కుదరకపోవచ్చని పేర్కొన్నారు. 19 శాతం మంది ఏమీ చెప్పకపోగా, 45 శాతం మంది అవునని, 18 శాతం మంది కచ్చితంగా అవునని (మొత్తంగా 63 శాతం) స్పష్టం చేశారు. ► పూర్తి స్థాయి డిగ్రీ కోర్సులను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు ఆన్లైన్లో ప్రవేశ పెడతాయని చెప్పిన వారిలో యూరప్‌లో 54 శాతం మంది ఉండగా, ఉత్తర అమెరికాలో 79 శాతం మంది ఉన్నారు. ఆసియా దేశాల్లో 53 శాతం మంది, ఆస్ట్రేలియాలో 71 శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ► డిగ్రీ కోర్సుల్లో ప్రత్యక్ష బోధన కంటే ఆన్లైన్ బోధన మెరుగ్గా ఉంటుందా అన్న ప్రశ్నకు ప్రత్యక్ష బోధన కంటే ఆన్లైన్ బోధన మెరుగ్గా ఉండదని అత్యధిక శాతం మంది స్పష్టం చేశారు. 53 శాతం మంది (ఇందులో 5 శాతం అసలే మెరుగైంది కాదని) మెరుగ్గా ఉండదన్న సమాధానమే చెప్పారు. యూరోప్‌లో 62 శాతం మంది, ఉత్తర అమెరికాలో 57 శాతం మంది, ఆసియాలో 37 శాతం మంది ఇదే విషయాన్ని చెప్పారు. ఆస్ట్రేలియాలో మాత్రం 54 శాతం మంది ప్రత్యక్ష బోధన కంటే ఆన్లైన్ బోధన మెరుగ్గా ఉం టుందని చెప్పడం గమనార్హం. అందులో 12 శాతం మంది అయితే ఆన్లైన్ బోధనే కచ్చితంగా మెరుగైందని పేర్కొన్నారు. ► ప్రత్యక్ష విద్యా సంబంధ సమావేశాల స్థానంలో ఆన్లైన్లో వర్చువల్ అకడమిక్ కాన్ఫరెన్స్‌లు వస్తాయా అంటే 10 శాతం అసలే రావని చెప్పగా, 44 శాతం మంది రావని చెప్పారు. 22 శాతం మంది వస్తాయని వెల్లడించగా, 4 శాతం మంది కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. 20 శాతం మంది తెలియదని పేర్కొన్నారు. ► ప్రత్యక్ష బోధన పోయి ఆన్లైన్ బోధనే ఉంటుందా అంటే 23 శాతం మంది అది అసలే సాధ్యం కాదని తెగేసి చెప్పగా, 42 శాతం మంది సాధ్యమని చెప్పారు. 16 శాతం మంది ఏమీ తెలియదని చెప్పగా, 19 శాతం మంది అవునని పేర్కొన్నారు. ► కొత్త పరిశోధన పత్రాలు అన్నీ ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయా.. అన్న ప్రశ్నకు 69 శాతం మంది అవుననే సమాధానమిచ్చారు. యూరప్‌లో 80 శాతం మంది అవునని చెప్పగా, ఉత్తర అమెరికాలో 43 శాతం మంది, ఆసియాలో 64 శాతం మంది, ఆస్టేలియాలో 65 శాతం మంది అవునని పేర్కొన్నారు. -
పాఠాలు చూడొచ్చు.. వినొచ్చు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8వ తరగతి ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు పుస్తకాలను అభివృద్ధి చేసి, వాటిల్లో క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ పొందుపరిచేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి చర్యలుచేపట్టింది. ప్రతి పాఠానికి సంబం ధించిన వివిధ అంశాలపై వీటిని అభివృద్ధి చేసింది. ఈనెల 11 నుంచి 14 వరకు వాటిని సమీక్షించి పుస్తకాల్లో పొందుపరచాలని నిర్ణయించింది. తద్వారా పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచే క్యూఆర్ కోడ్ ఆధారంగా విద్యార్థులు ఆ కోడ్‌ను ఎలక్ట్రానిక్ పరికరం లేదా మొబైల్ సహాయంతో రీడ్ చేస్తే ఆ పాఠ్యాంశానికి ఆడియో, వీడియోతో మొబైల్లో ప్రత్యక్షం అయ్యేలా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దీక్ష కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి తెలిపారు. మొదట ప్రయోగాత్మకంగా 8వ తరగతి ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులో వీటిని పొందుపరచాలని నిర్ణయించామని, దీనిని 2019–20 విద్యా సంవత్సరంలో అమల్లోకి తెస్తామని ఆమె వెల్లడించారు. ఇది సక్సెస్ అయితే అన్ని తరగతుల్లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. -
నా దేశం ఒక సందేశం
అంతటి రసస్ఫోరకమైన, ఉన్నత స్థితిలో దేశాన్ని చూడగలగడం అంటే.. దేశంపై ఇష్టం, ప్రేమ మాత్రమే కాదు.. దేశాన్ని గౌరవించడం, దేశాన్ని పూజించడం కూడా. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం మరొకసారి ప్రతిన పూనుదాం.దేశభక్తి అంటే ఏంటి? దేశాన్ని ఇష్టపడటమా? దేశాన్ని ప్రేమించటమా? స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా దేశభక్తి అర్థాన్ని, ఔన్నత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివేకానంద ఓ దశలో నాలుగేళ్ల పాటు పాశ్చాత్యదేశాలలో పర్యటించారు. ఆ దేశాల్లోని సిరిసంపదలను, విజ్ఞానాన్ని, అభివృద్ధిని, వారు అవలంబిస్తున్న విధానాలను, ఆధునికతను, ఆ దేశాల అగ్రగామితనాన్ని, ఆధునిక టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు. ఆ సుదీర్ఘ పర్యటనను ముగించుకుని, భారతదేశానికి వచ్చేందుకు అక్కడి విమానాశ్రయంలో వేచి ఉండగా ఓ పత్రికా విలేకరి ఆయన్ని.. ‘‘ఇక్కడికి, అక్కడికి తేడా ఏమిటని మీ అనుభవంలో తెలుసుకున్నారు?’’ అని అడిగారు. అందుకు వివేకానంద ఇలా సమాధానం ఇచ్చారు. ‘‘ఇక్కడి సంపదను, వైభోగాలను స్వయంగా చూశాను. ఇప్పుడు పర్యటన ముగించుకుని నా మాతృభూమికి వెళుతున్నాను. ఈ దేశాలకు రాక ముందు నా దేశాన్ని నేను ఇష్టపడేవాడిని. ఇప్పుడు నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అంతే తేడా. అంతేకాదు, నా దేశంలోని ధూళి, నీరు, నేల పవిత్రంగా అనిపిస్తున్నాయి. చెట్టూ చేమ, రాయి రప్పా, పుట్టా గుట్టా అంతా నాకు పరమ పవిత్రంగా కనిపిస్తోంది. మొత్తం మీద నా భారతదేశం నాకు ధగధగాయ మానమైన ఓ సువర్ణ దేవాలయంలా సాక్షాత్కారం అవుతోంది’’ అన్నారు వివేకానంద. స్వచ్ఛమైన, నిత్యమైన, దేశభక్తికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా? – డా. రమాప్రసాద్ ఆదిభట్ల -
ఆర్మీకి ఆధునిక సాంకేతికత అవసరం
హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాలంటే ఆర్మీకి ఆధునిక సాంకేతికత అవసరమని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ‘దేశ రక్షణ రంగ తయారీలో స్వావలంభన’అంశంపై ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్లో జరిగిన 2 రోజుల సదస్సు ఆదివారంతో ముగిసింది. సదస్సుకు హాజరైన యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రక్షణ రంగ నిపుణులను ఉద్దేశించి రావత్ మాట్లాడారు. పరిశ్రమలతో సంబంధాలు కొనసాగించడంలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లతో పోలిస్తే ఆర్మీ కాస్త వెనకబడి ఉండటం బాధాకరమన్నారు. పరిశ్రమలు, రక్షణ రంగానికి మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు. రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలకు తమ తో కలసి పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. ఇందుకోసం ‘ఆర్మీ డిజైన్ డివిజన్’వేదికగా పనిచేస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు ఆ వేదికను సంప్రదిస్తే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. ఆర్మీ అవసరాలు, సమస్యలు, సవాళ్లతో కూడిన 4 నివేదికలను సిద్ధం చేశామని, వాటి మీద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారు ముందుకురావచ్చని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సుతో సరైన నిర్ణయాలు.. ఉపగ్రహా, డ్రోన్ల వ్యవస్థలతోపాటు పలు రకాలుగా వచ్చే సమాచారాన్ని కృత్రిమ మేధస్సు(ఏఐ), బిగ్ డేటా ఎనలిటి క్స్ సహకారంతో విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారముందని అన్నారు. రక్షణ ఉత్పత్తులను తయారు చేసుకోగలిగితే దిగుమతి చేసుకునే సమస్య ఉండదన్నారు. ఇందుకు దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో కొత్తగా ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రక్షణ రంగ నిపుణులు వీఎస్ హెగ్డే, సందీప్ ఉన్నితన్, లెఫ్టినెంట్ జనరల్ డీబీ షేకట్కర్, సంజయ్ పరషార్ పాల్గొన్నారు. -
23–26 తేదీల్లో విజయవాడలో ఉద్యాన ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23–26 తేదీల మధ్య విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో ఉద్యాన ప్రదర్శన–2018 జరగనుంది. 150 స్టాల్స్ ఏర్పాటవుతున్నాయి. రైతులకు వివిధ పంటల మేలైన సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతలపై ఈ సందర్భంగా జరిగే సదస్సుల్లో అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. -
ఆధునిక టెక్నాలజీతో నేరాల నియంత్రణ
మామునూరు వరంగల్ : నూతన టెక్నాలజీని వినియోగించుకుని నేరాలను నియంత్రించాలని వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు స్థానిక పోలీసు సిబ్బందికి సూచించారు. నిరంతర ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో గ్రామాల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టంగా తయారు చేయాలని ఆదేశించారు. కేసులపై నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేపట్టి నేరస్తులకు జైలు శిక్ష పడేలా చేసి వారికి పోలీసులంటే భయం ఏర్పడాలని పేర్కొన్నారు. సోమవారం మామునూరు ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ శోభన్‌కుమార్ నేతృత్వంలో సబ్ డివిజన్ స్థాయి సీఐ, ఎస్సైలతో నిర్వహించిన సమావేశంలో డీసీపీ మాట్లాడారు. ప్రభుత్వం పోలీసు శాఖను సాంకేతిక దిశలో తీర్చిదిద్దుతున్న తరుణంలో ప్రతి కేసును ఆన్లైన్లోనే నమోదు చేయాలన్నారు. ప్రతి పోలీసు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. మెరుగైన పని తీరుతో స్టేషన్ సిబ్బంది పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలో నేరాలతో పాటు చోరీలు జరుగకుండా పగలు, రాత్రి గస్తీనీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుక వచ్చేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. శాంతిభద్రతల రక్షణే ధ్యేయంగా ఎస్సైలు తమ స్టేషన్ పరిధిలోని ప్రజలతో ఫ్రెండ్లీగా మెలగాలన్నారు. దీంతో నేరాలు తగ్గుముఖం పడుతాయన్నారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు ప్రత్యేక జోన్‌గా గుర్తించి ప్రమాదాలను నివారించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్‌లో ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు.సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి సంబంధిత ఆర్టీఏకు ఆప్పగించాలన్నారు. ఇప్పటి నుంచి కోర్టు కానిస్టేబుల్‌ను కోర్టు డ్యూటీ ఆఫీసర్‌గా ,గ్రామ బీట్ కానిస్టేబుల్‌ను విలేజీ డ్యూటీ ఆఫీసర్‌గా పిలవనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఏసీపీ శోభన్‌కుమార్, సీఐ శ్రీనివాస్‌తో కలసి డీసీపీ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదం జరిగే స్థలాలను పరిశీలించారు. ప్రమాద స్థలంలో సాంకేతిక బోర్డు ఏర్పాటుతోపాటు నిఘాను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో మామునూరు సీఐ శ్రీనివాస్, పర్వతగిరి సీఐ శ్రీధర్‌రావు, సబ్‌డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు. -
పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకోవాలి
కడప అర్బన్ : పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంను విస్తృతంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య అన్నారు. మంగళవారం ఆయన కడప నగరంలో పర్యటించారు. విజయవాడ నుంచి కడపకు వచ్చిన ఆయన కడప నగరం కో–ఆపరేటివ్ కాలనీలోని పోలీసు అతిథిగృహం చేరుకున్నారు. తర్వాత జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నేరాల పరిస్థితిని డీఎస్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జిల్లాలో నేరాలను తగ్గించే దిశగా ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. కడప, ప్రొద్దుటూరులలో నిర్వహిస్తున్న ఎల్‌హెచ్‌ఎంఎస్, కమాండ్ అండ్ కంట్రోల్ రూం పనితీరును గురించి అడిగితెలుసుకున్నారు. నేరాలను నియంత్రించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న జిల్లా పోలీసు అధికారుల పనితీరు భేష్‌గా ఉందన్నారు. రాష్ట్రంలో పార్థీగ్యాంగ్ లేదు.. అధికారుల సమీక్ష అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్థి గ్యాంగ్ లేదన్నారు. జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి నేరాలను తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్, కమాండ్ అండ్ కంట్రోల్ రూం విధానం వలన చోరీలకు అడ్డుకట్ట వేశారన్నారు. సైబర్ నేరాలను నిర్మూలించేదిశగా కృషి చేయాలన్నారు. బ్యాంక్ అధికారుల మాదిరిగా ఎవరైనా ఫోన్‌చేసి వివరాలను అడిగినపుడు చెప్పరాదన్నారు. నేరస్తులు కూడా సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడే విషయంపై ఇప్పటికే జార్ఖండ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా పోలీసు అధికారిని నియమించి నియంత్రణకు కృషి చేస్తున్నారన్నారు. పోలీసుశాఖతో మమేకమై యువతతో కమ్యూనిటీ పోలీస్, విద్యార్థులతో స్టూడెంట్ పోలీస్, మహిళలతో మహిళా మిత్ర పేరుతో పనిచేసేందుకు ఆసక్తిగలవారిని నియమించారన్నారు. పోలీసు సంక్షేమానికి విశేష కృషి ... పోలీసు సంక్షేమంలో భాగంగా కడపలో పోలీసు శాఖకు 22 ఎకరాల స్థలం వుందనీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ ద్వారా మొదట కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మింపచేసి తద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంక్‌లకు చెల్లిస్తూనే పోలీసు కుటుంబాలకు అవసరమైన క్వార్టర్స్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. పోలీసుల సంక్షేమంపై దృష్టి పెడతామన్నారు. ఇటీవల 5వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఇచ్చామనీ వారు విధుల్లో ఇప్పటికే చేరారనీ, ఎస్ఐలు 662 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారనీ వారు త్వరలో విధుల్లో చేరతారన్నారు. జిల్లాలో కడప, రాయచోటిలలో మోడల్ పోలీస్ స్టేషన్లను నిర్మించారనీ, త్వరలో వాటిని ప్రారంభించనున్నారన్నారు. రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య కడప పర్యటన ముగించుకుని సాయంత్రం అనంతపురం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాల్లో కడప కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ, జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం ఆస్మి, జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ఏ.శ్రీనివాసరెడ్డి, ట్రైనీ ఏఎస్పీ వకుల్ జిందాల్, ఏఆర్ అదనపు ఎస్పీ రిషికేÔశ్‌రెడ్డి, డీఎస్పీలు బి.శ్రీనివాసులు, రాజగోపాల్ రెడ్డి, లోసారి సుధాకర్, పి. షౌకత్ఆలీ, శ్రీనివాసులు, షేక్ మాసుంబాష, రాఘవ, కోలార్ కృష్ణన్, నాగరాజు, లక్ష్మినారాయణ, బిఆర్ శ్రీనివాసులు, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, చంద్రశేఖర్లతో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
మాట్లాడే పుస్తకాలు!
సాక్షి, పాన్‌గల్ (వనపర్తి) : కంటికి శ్రమ ఉండదు.. పెదవులు కదిలించాల్సిన అవసరం లేదు.. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆ పుస్తకాల్లో అక్షరాలపై డాల్ఫియా పెడితే చాలు.. భావయుక్తంగా స్పష్టంగా అర్థమయ్యేలా మాటల రూపంలో వినిపిస్తాయి. ఇది కోడింగ్, డీకోడింగ్ ద్వారా ముద్రించిన మాట్లాడే పుస్తకాల (టాకింగ్ బుక్స్) ప్రత్యేకత. దీంతో విద్యార్థులకు పదాలను ఎలా ఉచ్చరించాలో స్పష్టంగా తెలియడంతోపాటు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సరికొత్త పరిజ్ఞానం తో చదువుపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం సీసీఈ పద్ధతిలో విద్యార్థులు బట్టీ పట్టి చద వుతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా డిజిటల్ విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎలా మాట్లాడుతాయంటే.. యునిసెఫ్, సర్వశిక్ష అభియాన్ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కోడింగ్, డీకోడింగ్ విధానాన్ని అనుసరించి మాట్లాడే డాల్ఫియాను తయారు చేశారు. ఈ డాల్ఫియా లేదా డాల్ఫిన్ బొమ్మను ప్రతి పుస్తకం కవర్ పేజీపై ఉన్న గెట్ స్టార్ గుర్తుపై ఉంచాలి. తర్వాత పుస్తకంలోని పదాలపై డాల్ఫియాన్ కదిలిస్తూ ఉంటే డీకోడ్ విధానంలో పదాలు వినిపిస్తాయి. ఆ కథలో ఉన్న పాత్రలకు అనుగుణంగా మనకు మాటలు వినపడం వల్ల ఒక నాటికను చూస్తున్న అనుభూతిని విద్యార్థులు పొందుతారు. -
మారుమూల ఠాణాలకు టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖ మరింత ఆధునిక సాంకేతికతను సంతరించుకునేందుకు కసరత్తు చేస్తోంది. మారుమూల ఠాణాలను సాంకేతికంగా బలోపేతం చేయనుంది. దీనికితోడు మరిన్ని కొత్త వాహనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖకు అత్యాధునిక వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా తెలంగాణ పోలీస్ బ్రాండ్ ప్రజల్లో గుర్తుండిపోయేలా వాహనాలపై తెలంగాణ పోలీస్ లోగోతోపాటు పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇంటర్సెప్టార్ తదితర పదాలను తీర్చిదిద్దారు. నాలుగేళ్ల క్రితం రూపొందించిన ఈ బ్రాండింగ్‌లో స్వల్ప మార్పు చేయాలని లోగో పొజిషన్, స్టిక్కరింగ్ కలర్లో కొంత మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. బ్లూకోల్ట్స్ వాహనాలకు టెక్నాలజీపరంగా మార్పులు, చేర్పులు చేసి ఘటనాస్థలి నుంచే ఫొటోలు, వీడియోలు, వివరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపే విధంగా అనుసంధానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో ఠాణాల నుంచి డీజీపీ కార్యాలయానికి అనుసంధానం ఏర్పడింది. ఎఫ్ఐఆర్, కేసు డైరీ, నిందితుల వివరాలు, ఫొటోలు.. ఇలా అన్ని క్షణాల్లో ఉన్నతాధికారుల చేతికి అందుతున్నాయి. కొనుగోలు చేసే పెట్రోలింగ్ వాహనాల్లో ట్యాబ్, జీపీఎస్ అనుసంధానం, జియో ట్యాగ్ చేసిన హాట్స్పాట్లు కనిపించేలా టఫ్ప్యాడ్లు అందుబాటులోకి రాను న్నాయి. ఏసీ సదుపాయం కలిగిన పెట్రోలింగ్ వాహనాలతో గల్లీ గస్తీని మరింత విస్తృతం చేసేందుకు అవకాశం కల్పించి ట్లు అయింది. ప్రతీ ఠాణాకు రెండు పెట్రోలింగ్వాహనాలు, 4 బ్లూకోల్ట్స్ కొత్త వాహనాలు అందించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాహనాల కొనుగోలుకు 500 కోట్లు నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల నిమిత్తం పోలీస్‌శాఖకు మరిన్ని వాహనాలు అవసరమయ్యాయి. తాజాగా ఆరు వందలకుపైగా వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతేడాది హెచ్ఐసీసీలో జరిగిన పోలీస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో మరిన్ని కార్లు, పెట్రోలింగ్ బైకులు కొనుగోలు చేస్తున్నట్టు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి. -
అధునాతన వైపు ఆబ్కారీ..
ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తోంది. ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, అనుమతులు తదితర వాటిని పొందుపరుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా తెచ్చిపెడుతున్న ఎక్సైజ్ శాఖలోనూ ప్రజలకు చేరువయ్యేలా ‘ఆన్లైన్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పోలీసుశాఖను ఆధునిక సాంకేతిక వైపు తీసుకెళ్తున్న ప్రభుత్వం తాజాగా అదే దారిలో ఆబ్కారీ శాఖను తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులకు ల్యాప్‌ట్యాబ్‌లు అం దజేసింది. ఈ ట్యాబ్‌ల ద్వారా సాంకేతికతను ఉపయోగించుకొని అధునాతన సేవలు అందించనున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతా ల్లో గుడుంబా నివారణలో భాగంగా గుడుంబా తయారీదారులకు పునరావాస పథకం కింద ఆర్థికసాయం అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఎక్సైజ్‌శాఖ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ట్యాబ్‌లను అందజేసింది. సర్కిల్ ఇన్స్పెక్టర్స్థాయి నుంచి కమిషనర్ స్థాయి వరకు ట్యాబ్‌లు అందించిన ప్రభుత్వం నిత్యం వారి విధులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో అనుసంధానించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా పరిధిలో.. ఎక్సైజ్‌శాఖ పరిధిలో జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లతో పాటు ఒక సూపరింటెండెంట్, ఆరుగురు ఎస్సైలు ఉన్నారు. సూపరింటెండెంట్, సీఐలకు ప్రభుత్వం ఇప్పటికే ట్యాబ్‌లు కేటాయించగా త్వరలో ఎస్సైలకు అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కల్తీ కల్లు నుంచి గుడుంబా విక్రయాల వరకు అక్రమ మద్యం రవాణా చేసే వారి సమాచారం వరకు ఎప్పటికప్పుడు ట్యాబ్ ద్వారా వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో ఉన్నత అధికారులకు నివేదికలు పంపించే విధానం అమలులోకి వచ్చింది. నిత్యం తమ విధుల్లో భాగంగా తనిఖీలు, స్వాధీనం చేసుకునే గుడుంబా, దేశీదారు, బెల్లం, కేసులు, మద్యం దుకాణాల్లో జరిగే కల్తీదందా, అధిక ధరలకు విక్రయించే వారిపై తీసుకునే చర్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి ట్యాబ్‌లను వినియోగిస్తున్నారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ట్యాబ్‌లు వెంట తీసుకొని వెళ్లి ప్రత్యక్షంగా అక్కడ ఉన్న పరిస్థితులను చూపించే అవకాశాలు ఉన్నాయి. అక్రమ దందాలకు చెక్.. మద్యం దుకాణాల్లో జరిగే అక్రమ దందాలకు సంబంధించి వెంటనే అడ్డుకట్ట వేసేందుకు ట్యాబ్‌లను వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎక్సైజ్ యాప్‌ను రూపొందించారు. వినియోగదారులు ఎవరైనా మద్యం దుకాణాల్లో జరిగే కల్తీ, అధికధరల విక్రయాలు, నాన్ డ్యూటీ మద్యానికి సంబంధించి ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే యాప్ ద్వారా ఆయా దృశ్యాలను చిత్రీకరించి అప్లోడ్ చేయడం ద్వారా వెంటనే దానిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తే సంబంధిత ఎౖMð్సజ్ శాఖ పరిధిలోని అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయవచ్చు. ఇలాంటి అవకాశాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకొని అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్లో అనుమతులు.. జిల్లాలో ఎవరైనా ఈవెంట్ అనుమతి కోసం ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. tsexise.cgg.gov వెబ్‌సైట్‌ను రూపొందించింది. వెబ్సైట్లో ఈవెంట్‌కు సంబంధించిన అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును వెంటనే సంబంధిత ప్రాంత అధికారులతో వివరాలు తెలుసుకొని అక్కడున్న పరిస్థితులను బట్టి ఆన్లైన్లోనే అనుమతి మంజూరు చేస్తారు. శుభకార్యం నేపథ్యంలో మద్యం ఏర్పాట్లు చేసుకునే వారు ఎక్సైజ్‌శాఖ అనుమతి తీసుకోవాలి. ఇలాంటి అనుమతుల కోసం గతంలో ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ సేవలు.. ఎక్సైజ్‌శాఖ అన్ని సేవలను ఆన్లైన్లోనే పొందేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అధికారులకు ట్యాబ్‌లు అందించారు. వీటి ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చడంతో పాటు అధికారులకు వెంటనే సమాచారం అందించవచ్చు. ఈవెంట్ అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం అమలులోకి వచ్చింది. -
అవ్వా కావాలి..బువ్వా కావాలి
నేటి యువత పొద్దుపొద్దున్నే కాఫీకి నో చెబుతూ గ్రీన్ టీకి గుడ్ మార్నింగ్ పలుకుతున్నారు. ఒక వైపు సంప్రదాయ రైస్‌ను తీసుకుంటూనే వైట్ రైస్, మంచూరియా, నూడుల్స్ వంటి జంక్ ఫుడ్లపైనా మోజు పెంచుకుంటున్నారు. మరో వైపు హ్యాండ్ వాషింగ్, బ్రాండెడ్ టూత్ పేస్ట్, బ్రష్‌లకు ఓటేస్తూ పరిశుభ్రతకు అగ్ర తాంబూలమిస్తున్నారు. ఇంకో వైపు మగువల హ్యాండ్ బ్యాగుల వెంట తిరిగే ఫేస్ వాష్, బాడీ లోషన్ వంటి సౌందర్య సాధనాలనూ.. మగమహారాజులు తమ పాకెట్లలో పదిలంగా దాచుకుంటున్నారు. ఇటీవల తెనాలి విద్యార్థినుల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సాక్షి, తెనాలి: విద్యార్థులకు నేటి సమాజం గురించిన అవగాహన, చుట్టూ ఏం జరుగుతోందన్న స్పృహను కలిగి ఉండటం అవసరం. ఇందుకు ప్రత్యేకించి తరగతులు లేకున్నా, సొంతగా కాస్తంత ఆసక్తి, తగిన ప్రోత్సాహం ఉంటే అవకాశాలు అవే వస్తాయి. పాఠ్యాంశాల్లోనే కాకుండా సామాజికాంశాల్లోనూ తొంగి చూడొచ్చు. అబ్బుపరచే అనేక విశేషాలు తెలుసుకోవచ్చు. వాటిని పది మందికీ అందుబాటులోకి తేవచ్చు. ఈ తరహా పరిజ్ఞానం జ్ఞానాభివృద్ధికే కాదు, పోటీపరీక్షలు, ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత విజయాల సాధనకు తోడ్పడుతుంది. స్థానిక ఏఎస్ఎన్ మహిళా ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థినులు తాజాగా చేసిన సామాజిక సర్వే ఈ కోవలోకే వస్తుంది. 41 అంశాలపై సర్వే రోజూ నిద్ర లేచాక బ్రష్ చేయటం నుంచి, భోజనం చేసేవరకు దైనందిన జీవితంలో మనం కాఫీ, టీ, శీతల పానీయాలు, కాస్మటిక్స్, ఆహార పధార్ధాలను వినియోగిస్తుంటాం. ఇందులో రకరకాలుంటాయి. మారుతున్న జీవనశైలి, సంబంధిత వ్యాధులు, తినే ఆహారపదార్ధాలపై ప్రభావం చూపుతోందా? అనే అంశాలను సర్వేతో తెలుసుకోవాలని కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ ఫైనలియర్లో ఉన్న కీర్తి శివపార్వతి, తనూజ చెరుకూరి, మంజూషలు ఉత్సుకత చూపారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో భాగమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా చేయాలని తలపెట్టారు. ఇందుకు డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్‌చంద్ ప్రోత్సాహం లభించింది. ఇంటిల్లపాదీ వాడే టూత్ పేస్ట్ నుంచి నిత్యం ఉపయోగించే వినిమయ వస్తువులు, ఆహార పదార్థాల వరకు 41 అంశాలపై సర్వే చేశారు. ఒక్కో అంశానికి మల్టిపుల్ చాయిస్లో సమాధానాలు సేకరించారు.. ఇతరమైనవి అనే చాయిస్‌కు అవకాశం కల్పించారు. రెండు నెలల క్రితం చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వెయ్యి మంది అభిప్రాయాలను తీసుకున్నారు. అధునికతతోపాటు వదలని సంప్రదాయం... ఈ వివరాలతో క్రోడీకరించిన నివేదిక ఆధునికతను అందిపుచ్చుకుంటున్న వైనం స్పష్టమవుతోంది. జీవనశైలి వ్యాధులు సతమతం చేస్తున్నప్పటికీ ఆహారపు అలవాట్లలో మార్పులురాని వైనాన్నీ బహిర్గతం చేసింది. సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులపై వ్యామోహమూ తేటతెల్లమైంది. ఉదాహరణకు ఆహారంలో బియ్యం వినియోగం తగ్గించాలనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నా, 99.8 శాతం ప్రధాన ఆహారం బియ్యం కావటం ఇందుకో నిదర్శనం. ఇందులో తెల్లబియ్యాన్ని 85 శాతం వినియోగిస్తున్నారు. మరో వైపు ఫాస్ట్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. మంచూరియా, నూడుల్స్, బర్గర్స్కు ఎక్కువ రేటింగ్ వచ్చింది. అన్నింటికంటే మంచూరియా, తర్వాత స్థానంలో నూడుల్స్ ఉండటం గమనార్హం. శక్తినిచ్చే పానీయాల వినియోగం 93.4 శాతం ఉందట. ఆరోగ్యకరమైన తేనీరు స్థానంలో గ్రీన్ టీ వినియోగం పెరగటం మంచి మార్పు. హ్యాండ్‌వాష్‌కు ప్రాధాన్యనిస్తుండటం మరో శుభపరిణామం. టూత్ బ్రష్, టూత్ పేస్ట్‌తో సహా పలు వస్తువుల వినియోగంలో బ్రాండెడ్పైనే ఆదరణ చూపుతున్నారు. సౌందర్య సాధనకు మెరుగులు... వ్యక్తిగత పరిశుభ్రత, సౌందర్య సాధనకు ప్రాధాన్యత పెరగటం మరో కీలకాంశం. యువత/మహిళల్లో పెర్ఫ్యూమ్స్ వాడకం 88 శాతం ఉండగా, పెదవుల రక్షణ క్రీముల వినియోగం 92.6 శాతంగా కనిపించింది. మగవారూ ఇందుకు తీసిపోలేదు సుమా! ఒక విధంగా వారిని మించిపోయారు. బాడీ లోషన్స్‌ను 94.6 శాతం, ముఖం శుభ్రం చేసుకొనే లోషన్స్‌ను 90.2 శాతం వాడుతుండగా మొత్తంగా 94.8 శాతం యువత/మగవారు పెర్ఫ్యూమ్స్ను వినియోగిస్తున్నట్టు తమ సర్వేలో తేలిందని శివపార్వతి, తనూజ చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టులో భాగంగా ఈ నివేదికను యూనివర్సిటీకి సమర్పించారు. ప్రత్యేకంగా వెబ్సైట్లో పొందుపరచి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, మార్పులను అధ్యయనం చేయనున్నట్టు మంజూష చెప్పారు. సెకండియర్‌లో తామంతా ఆన్లైన్ సినిమా టికెట్లపై ప్రాజెక్టును రూపొందించినట్టు వెల్లడించారు. వాస్తవాల అధ్యయనంతో మార్పు ఇంజినీరింగ్‌లో ప్రాజెక్టులు కీలకమని తెలి సిందే. చిత్తశుద్ధితో నిజా యితీగా చేసే విద్యార్థులకు జాబ్ స్కిల్స్ అలవడతాయి. జీవితంలో విజేతలవుతారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసినప్పుడు ఏవైనా సమస్యలు దృష్టికి వస్తే సాఫ్ట్వేర్ ద్వారా పరిష్కారాన్ని కనుగొనే అవకాశముంటుంది. ఇలాంటి సర్వేలను ఎంకరేజ్ చేసి స్టార్టప్ స్థాయికి తీసుకెళ్లాలనేది లక్ష్యం. - కొలసాని రామ్‌చంద్, ప్రిన్సిపాల్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ -
మౌలిక ప్రాజెక్టులకు పటిష్ట విధానం
త్వరితగతిన పూర్తి చేయాలి: మోదీ ► ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి ► మౌలిక రంగాల్లో పురోగతిపై సుదీర్ఘ సమీక్ష న్యూఢిల్లీ: దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేందుకు పటిష్టమైన విధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పటివరకూ ప్రయాణ సదుపాయం లేని ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులను సాధ్యమై నంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను అధ్యయనం చేయాలని, వాటిని భారత్‌లో వినియోగించే అంశాన్ని పరిశీలించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. రహదారులు, రైల్వే, ఎయిర్‌పోర్టులు, డిజిటల్ తదితర రంగాల్లో పురోగతిపై మంగళవారం రాత్రి ప్రధాని సుమారు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి సబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) బుధవారం ప్రకటన విడుదల చేసింది. సమీక్ష సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ రంగాల్లో విశేషమైన పురోగతి సాధించినట్టు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో రోజుకు సగటున 130 కి.మీ.మేర రహదారుల నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. దీంతో 2016–17లో పీఎంజీఎస్‌వై కింద అదనంగా 47,400 కిలోమీటర్ల మేర రహదారులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇదే సమయంలో 11,641 నివాస ప్రాంతాలకు రహదారుల సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. గ్రామీణ రహదారుల్లో 4 వేల కిలోమీటర్లకుపైగా గ్రీన్ టెక్నాలజీని వినియోగించి నిర్మించినట్టు వెల్లడించారు. నిరంతరం పర్యవేక్షించాలి.. గ్రామీణ రహదారుల నిర్మాణం.. వాటి నాణ్యత ఎలా ఉంటోందనే విషయాన్ని పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 26 వేలకుపైగా జాతీయ రహదారులను నిర్మించినట్టు అధికారులు తెలిపారు. అలాగే 953 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించినట్టు వివరించారు. 2 వేల కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరణ, వెయ్యి కిలోమీటర్ల మేర గేజ్ మార్పిడి ప్రక్రియ పూర్తిచేసినట్టు తెలిపారు. 115 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం, 34 వేల బయో టాయిలెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మోదీ ఆదేశించారు. రైల్వేలో అవినీతిపై ప్రధాని సీరియస్ రైల్వే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావటంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులను హెచ్చరించారు. తమ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించేందుకు చిత్తశుద్ధితో ఉందని మోదీ అన్నట్లు ప్రకటన పేర్కొంది. ఈ సమావేశంలో ముంబై మెట్రో, తిరుపతి–చెన్నై హైవేతోపాటుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైలు, రోడ్డు ప్రాజెక్టులు, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని విద్యుత్ సరఫరా లైన్లపైనా సమీక్ష చేశారు. రైల్వేల్లో సమస్యలు, ఫిర్యాదుల కోసం, ప్రమాదాలు జరిగినప్పుడు వివరాల కోసం కూడా ఏకీకృత టెలిఫోన్ నెంబరు ఏర్పాటుచేసుకోవాలని ప్రధాని సూచించారు. చిన్నారులకు సమస్యాత్మకంగా మారిన వ్యాధులకు టీకాల కోసం ఉద్దేశించిన ‘మిషన్ ఇంద్రధనుష్’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 100 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎన్సీసీ, నెహ్రూ యువకేంద్ర సభ్యులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. స్వచ్ఛ్ భారత్, అమృత్లపైనా సమీక్షించిన మోదీ.. 2022 కల్లా నవభారత నిర్మాణం కోసం స్పష్టమైన ప్రణాళికలు, లక్ష్యాలను రూపొందించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరారు. -
వైఎస్సార్ నిథమ్‌కు పదో స్థానం
- తెలంగాణలో ద్వితీయ స్థానం - ప్రకటించిన జీహెచ్‌ఆర్‌డీసీ సంస్థ హైదరాబాద్: డాక్టర్ వైఎస్సార్ నిథమ్ అరుదైన గుర్తింపును పొందింది. ఢిల్లీలోని గ్లోబల్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ టూరిజమ్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి 2017 అవార్డులను ప్రకటించింది. అందులో గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ దేశవ్యాప్తంగా పదో స్థానం పొందగా.. తెలంగాణలో రెండవ స్థానం పొందడం విశేషం. 2004 పర్యా టక, ఆతిథ్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని నిథమ్‌ను గచ్చిబౌలి టెలికామ్‌నగర్‌లో విశాలమైన 30 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. దీన్ని 2005 మార్చి 16న నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక పర్యాటక, ఆతిథ్య రంగాలకు చెందిన కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి, శిక్షణా కార్యక్రమాలనూ నిర్వహిస్తూ వస్తోంది. ప్రస్తుతం పలు డిప్ల్లమో కోర్సులతో బీబీఏ, ఎంబీఏ, బీఎస్సీ కోర్సులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పాటి స్తున్న విద్యా ప్రమాణాలు, అధ్యాపక బృందం, ప్లేస్‌మెంట్స్, అడ్మిషన్ల, క్యాంపస్‌లో చేపట్టే కార్యక్రమాలను ఆధారంగా చేసుకుని నిర్వహించిన సర్వే ప్రకారం ర్యాంకులను జీహెచ్‌ఆర్‌డీసీ సంస్థ ప్రకటిస్తుంది. టాప్ త్రీలో ఒకటిగా చేయడమే లక్ష్యం: డాక్టర్ చిన్నంరెడ్డి వచ్చే ఏడాదిలో దేశంలోనే టాప్ త్రీలో నిథమ్ సంస్థ ఎంపిక కావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డైరెక్టర్ ఎస్ చిన్నంరెడ్డి తెలిపారు. అధ్యాపక బృందం, అధికారులు, విద్యార్థుల పని తీరులో గణనీయంగా వచ్చిన మార్పుల ఫలితమే ఈ ర్యాంకు సాధించేందుకు దోహదం చేసిందన్నారు. ఏడాదిలోనే ఆధునిక టెక్నాలజీతో లైబ్రరీని తీర్చిదిద్దామని, ఇంగ్లీష్ భాషను తమ మాతృభాష ఆధారంగా నేర్చుకోవ డానికి 30 కంప్యూటర్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. క్యాం పస్ను క్లీన్ అండ్ గ్రీన్‌లో నంబర్ వన్‌గా రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం 80 శాతం ప్లేస్‌మెంట్స్ సాధించామని, మరో వారంలో మిగిలిన 20 శాతం ప్లేస్‌మెంట్స్ సాధించడం జరుగుతుందన్నారు. -
దారిచూపుతున్నారు
రెండు నిమిషాలు కళ్లు మూసుకుంటే.. మన ముందు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతాం.. అలాంటిది బతుకంతా చీకటైతే.. జీవిత ప్రయాణం ఎంత అంధకారం. అటువంటి దృష్టిలోపం ఉన్న వారికి బతుకుదారి ‘చూపు’తోంది నేత్ర విద్యాలయం. శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులో శ్రీరామనగరంలో ఉన్న జీవా ప్రాంగణంలో చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 2007-08 విద్యా సంవత్సరంలో 55 మంది విద్యార్థులతో ఏర్పాటైందీ సంస్థ. ఇందులో అంధ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాప్‌ట్యాప్‌లపై బోధిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, డిగ్రీలో 116 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. - శంషాబాద్ రూరల్ దృష్టిలోపం వారి ప్రతిభకు అడ్డుకారాదు.. వైకల్యాన్ని అధిగమించడమే కాకుండా అంధుల ఉజ్వల భవిష్యతుకు బాటలు వేయాలనే సంకల్పంతో.. దేశంలోనే మొదటిసారిగా అంధ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాప్‌ట్యాప్‌లపై విద్యాబోధన, పరీక్షలు నిర్వహిస్తూ ఖ్యాతి గడించింది ‘నేత్ర విద్యాలయం’. శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులో శ్రీరామనగరంలో ఉన్న జీవా ప్రాంగణంలో శ్రీ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 2007-08 విద్యా సంవత్సరంలో 55 మంది విద్యార్థులతో ఇంటర్మీడియట్ బోధనకు శ్రీకారం చుట్టారు. ఇంటర్లో హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులు ఉండగా.. 2010-11లో బీఏ, బీకాం కోర్సులతో డిగ్రీ బోధనను ప్రారంభించారు. కో-ఎడ్యూకేషన్ విధానంతో అంధ విద్యార్థులకు ఈ నేత్ర విద్యాలయంలో ఉచిత బోధన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంటర్, డిగ్రీలో ప్రస్తుతం 116 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 మంది విద్యార్థులు బీఏ, బీకాం పూర్తి చేసుకున్నారు. వీరిలో చాలా వరకు ఉద్యోగాలు సంపాదిం చారు. నిష్ణాతులైన అధ్యాపక బృందం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడి అంధ విద్యార్థులు సాధారణ విద్యా ర్థులకు ఏరకంగా తీసిపోకుండా చదువులో రాణిస్తున్నారు. వినూత్న రీతిలో బోధన.. అంధ విద్యార్థులు సాధారణంగా బ్రెయిలీ లిపి ద్వారా బోధన సాగిస్తుంటారు. దీని కారణంగా వారు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. పరీక్షల సమయంలో సహాయకుల మీద ఆధారపడక తప్పదు. వీటంన్నిటినీ అధిగమించేలా నేత్ర విద్యాలయంలో వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు పూర్తిగా ల్యాప్‌ట్యాప్‌లపై అభ్యాసం చేయడంతో పాటు పరీక్షలు రాయడం ఇక్కడి ప్రత్యేకత. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జాస్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేత్ర విద్యాలయంలో తెలుగు రాష్ట్రాల్లోని కరీంనగర్, గుంటూరు, విజయనగరం, అనంతపురం, తిరుపతి ప్రాంతాల వారితో పాటు జార్ఖండ్ విద్యార్థులు ఉన్నారు. దినచర్య ఇలా .. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో అభ్యాసం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా సంగీత, నృత్యం, క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు. భవిష్యత్‌కు బాటలు.. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న వారిలో చాలా మంది విద్యార్థులు బ్యాంకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, కార్యాలయాల్లో ఉద్యోగాలు సాధించారు. ఐఏఎస్ కావాలన్నదే జీవితాశయం.. ఈ కళాశాలలో చదువుతో పాటు జీవిత లక్ష్యంపై అవగాహన కలిగింది. పదో తరగతి వరకు అంధ పాఠశాలలో చదువుకుని ఇంటర్మీడియట్లో ఇక్కడ చేరాను. ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం. ఐఏఎస్ కావాలన్నది నా జీవితాశయం. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం కోచింగ్ తీసుకుంటాను. జీవితంలో గొప్ప మలుపు.. ఈ కళాశాలలో చదువుకోవడం నా జీవితంలో గొప్ప మలుపు. ఇక్కడ 2015లో డిగ్రీలో చేరాను. నాన్న, అక్క సాయంతో ఇంటర్ వరకు పూర్తి చేశాను. బెంగళూరులో కంప్యూటర్ కోర్సులో చేరినపుడు.. అక్కడ ఈ కళాశాల పూర్వ విద్యార్థి ద్వారా తెలుసుకుని వచ్చాను. పొలిటికల్ సైన్స్ టీచర్ కావాలన్నది నా ఆశయం. - అంకిత్, జార్ఖండ్, బీఏ, రెండో సంవత్సరం -
లంచావతారులకు కళ్లెం
‘టౌన్‌ప్లానింగ్’ సంస్కరణలు సాంకేతిక వినియోగంతో కొత్త విధానం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అనగానే గుర్తుకు వచ్చేది అవినీతి... ఫైలు కదలాల న్నా... ఫైలు చూడాలన్నా పైసలు. మనీ లేనిదే ఏపనీ జరగదనేది బహిరంగ రహస్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆన్లైన్ ద్వారానే భవ న నిర్మాణ అనుమతులిచ్చేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు.. ఇదేతరుణంలో సాంకేతిక వినియోగంతో సిబ్బం దిలోని లంచావతారులకు చెక్ పెట్టాలని నిర్ణయించా రు. ప్రస్తుతం ఏ ప్రాంతంలోని భవన నిర్మాణ అనుమతులు ఎవరు చూస్తారో.. ఎవరు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారో తెలియడంతో వారిని కలిసి చేతులు తడిపితేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితి లేకుండా ఉండేందుకు భవన నిర్మాణ అనుమతి కోసం ఒక దరఖాస్తు ఆన్లైన్లో నమోదు కాగానే.. దానిని ఎవరు పరిశీలించాలనేది కంప్యూటరే నిర్ణయిం చేలా ఏర్పాట్లు చేశారు. ఉదాహరణకు ఇప్పటి వరకు ఒక సర్కిల్లో ఏయే ప్రాంతాలను.. ఏయే సెక్షన్ ఆఫీసర్లు చూస్తారో తెలిసి నిర్మాణదారులు తమ పనులు కావడం కోసం వారితో చేతులు కలిపేవారు. దరఖాస్తు చేయడానికి ముందే వారితో మాట్లాడుకుంటేనే పనులయ్యేలా సంబంధిత అధికారులు వ్యవహరించేవారు. ‘ర్యాండమైజేషన్’తో చెక్.. కాగా, కొత్తగా అమల్లోకి తెస్తున్న ‘ర్యాండమైజేషన్’ విధానంతో తమ దరఖాస్తు ఎవరికి వెళ్తుందో నిర్మాణదారులకు తెలియదు కనుక వారు ముందుగానే సదరు అధికారితో మాట్లాడుకోవడానికి ఉండదు. ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలి కనుక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే విధానాన్ని ప్రధాన కార్యాలయం స్థాయిలో ఏసీపీలకు వర్తింపచేయనున్నారు. తద్వారా ఏ ప్రాంతంలోని పనికి ఎవరికి ముడుపులు చెల్లించాలో నిర్మాణదారులకు తెలియదు. అంతేకాదు.. ఒక దరఖాస్తు ఆన్లైన్లో అందాక నిర్ణీత వ్యవధిలో పరిశీలించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ముడుపుల కోసం లేనిపోని సాకులతో దరఖాస్తును పెండింగ్‌లో ఉంచేందుకూ వీల్లేదు. క్షేత్రస్థాయి పరిశీలన ముగిశాక గరిష్టంగా 48 గంటల్లో ఫైల్ ను అప్లోడ్చేయాలి. ఈ విధానంలో సెక్షన్ ఆఫీసర్లకు కానీ, క్లర్కులకు కానీ, ఇతరత్రా ఎవరికీ ఎలాంటి లంచా లు ఇవ్వాల్సిన అవసరం రాదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే తేదీ నిర్మాణ దారుకు ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తుంది. అంతేకాదు.. ప్రస్తుతం మాదిరిగా అనుమతి ఇచ్చేంతవరకు ఒకసారి, ఫీజు చెల్లించాక మరోసారి వివిధ స్థాయిల్లోని వారి వద్దకు ఫైలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకేసారి అనుమతి పొందగానే ఫీజు కడితే వెంటనే అనుమతినిచ్చేలా విధానాలు రూపొందించారు. దీన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు. -
ఎస్బీఐ నో క్యూ
APPకీ కహానీ... ఆధునిక టెక్నాలజీని ఒడిసిపట్టుకొని, దాన్ని వినియోగదారులకు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే ఎస్బీఐ తాజాగా ‘నో క్యూ’ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు * బ్యాంక్ కస్టమర్లు/నాన్ కస్టమర్లు ఈ యాప్ సాయంతో వర్య్చువల్ క్యూ టికెట్ (ఎం-టోకెన్)ను బుక్ చేసుకోవచ్చు. * ఎస్బీఐకి సంబంధించిన ఎంపిక చేసుకున్న ఏ బ్రాంచ్‌లోనైనా, కావాల్సిన సర్వీసులకు గానూ ఎం-టోకెన్లను పొందొచ్చు. * బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లక ముందే టోకెన్లను తీసుకోవడం వల్ల అక్కడ క్యూ లైన్లో వేచి ఉండాల్సిన బాధ తప్పుతుంది. మన విలువైన సమయం మిగులుతుంది. * క్యూ లైన్లో మనకు ముందు ఎంతమంది ఉన్నారో, ఎంత సమయం పడుతుందో కూడా తెలుసుకోవచ్చు. * బ్యాంక్ బ్రాంచ్ ఎంత దూరంలో ఉన్నదీ.. దాని వద్దకు ఏ విధంగా వెళ్లాల్సిందీ.. యాప్‌లో చూడొచ్చు. * యాప్‌ను పెన్ చేయగానే బ్యాంకుకు సంబంధించిన సర్వీసులు (డిపాజిట్స్, నెఫ్ట్, విత్‌డ్రాయల్స్, డీడీ వంటి తదితర) మనకు కనిపిస్తాయి. * కావాల్సిన సర్వీస్‌పై క్లిక్ చేయగానే యాప్ మనకు దగ్గరిలోని బ్రాంచ్‌ను చూపిస్తుంది. బ్రాంచ్ ఎంపిక చేసుకొని అటు తర్వాత ఎం-టోకెన్‌ను బుక్ చేసుకోవచ్చు. -
రాష్ట్రానికే రోల్‌మోడల్!
► ఆధునిక పోలీసింగ్‌తో అందరికీ ఆదర్శం అదే తక్షణ కర్తవ్యం ► అమరావతి కమిషనరేట్‌పై సీపీ సవాంగ్ ► విధివిధానాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడి ► సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి, విజయవాడ : అమరావతి కమిషనరేట్ కొత్త రాష్ట్ర పోలీసులకు రోల్‌మోడల్‌గా ఉంటుందని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధి, విస్తీర్ణం దృష్ట్యానే కాకుండా ఆధునిక పోలీసింగ్‌తో అందరికీ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దటమే తమ తక్షణ కర్తవ్యమని చెప్పారు. కొత్త రాష్ట్ర రాజధాని కమిషనరేట్ కావటంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొదలుకొని అన్ని అంశాల్లో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోలీసులకు సుశిక్షితమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే ఉన్న విజయవాడ కమిషనరేట్‌ను అభివృద్ధి చేసి భవిష్యత్తులో వచ్చే అమరావతి కమిషనరేట్ పరిధిలోకి విజయవాడను కూడా చేర్చి మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. విజయవాడ కమిషనరేట్‌కు కొత్తగా వచ్చే అన్ని వసతులు, సౌకర్యాలు, ప్రత్యేక వింగ్‌లు అమరావతి కమిషనరేట్‌ను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తున్నవేనని వివరించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో వివిధ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే... కమిషనరేట్ విధి విధానాలు సిద్ధం ఇప్పటికే అమరావతి కమిషనరేట్ ప్రకటన జరిగింది. 8057 చదరపు కిలోమీటర్ల పరిధి మేరకు కమిషనరేట్ ఏర్పాటైంది. వాస్తవ స్థితిలో ప్రస్తుత కమిషనరేట్ పరిధిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్, కృష్ణా జిల్లా పోలీస్, గుంటూరు అర్బన్ జిల్లా, గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ ఉన్నాయి. వీటి స్థానంలో జోన్లు వస్తాయి. రెండు జిల్లాలు కలిపి అమరావతిగా మారిన క్రమంలో ఎన్ని జోన్లు, పోలీస్ సబ్ డివిజన్లు ఏర్పాటు చేయాలి, ర్యూట్ మ్యాప్ ఎలా ఉండాలి, కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ వింగ్‌లతో పాటు స్పెషల్ బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్ సబ్ డివిజన్లు, పోలీస్ కంట్రోల్ రూమ్‌లు, ఏఆర్, స్పెషల్ బెటాలియన్లు, ప్రత్యేక పోలీస్ శిక్షణ కేంద్రాలు, ఇలా అన్ని అంశాలపై కసరత్తు చేసి సిద్ధం చేస్తున్నాం. కమిషనరేట్ ఏర్పాటుకు రాజకీయ అడ్డంకులు ఉన్నాయనేది అవాస్తవం. భారీ కమిషనరేట్ కాబట్టి విధివిధానాల రూపకల్పనకు కొంత సమయం పడుతుంది. డెప్యుటేషన్‌పై సిబ్బంది... విజయవాడ కమిషనరేట్, తుళ్లూరు సబ్ డివిజన్‌కు కలిపి 1728 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 674 మంది సిబ్బందితో తుళ్లూరు కొత్త సబ్‌డివిజన్, విజయవాడ కమిషనరేట్‌లో 583 మందితో సిటీ సెక్యూరిటీ వింగ్, 471 అదనపు పోస్టులతో కమిషనరేట్‌ను బలోపేతం చేస్తున్నాం. వాటిలో సీఐ క్యాడర్ నుంచి డీసీపీ పోస్టుల వరకు ఫర్వాలేదు. మిగిలిన పోస్టుల భర్తీ కోసం కానిస్టేబుళ్లను ఇతర రేంజ్‌లు, ఇతర కమిషనరేట్, అర్బన్ జిల్లాల నుంచి డెప్యుటేషన్‌పై తీసుకురావాలని చూస్తున్నాం. కొద్ది నెలల్లో సిబ్బందిని భర్తీ చేస్తాం. నగరంలో 5 సబ్ డివిజన్లు... విజయవాడ నగరంలో ఇప్పటి వరకు మూడు మాత్రమే సబ్ డివిజన్లు ఉన్నాయి. వాటిని ఐదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉన్న మూడింటి పరిధిని పరిశీలించి వాటి హద్దులో మార్పులు చేర్పులు చేసి ఐదుగా చేస్తాం. సీఎం సహా ఇతర వీవీఐపీల రాకపోకలు సెంట్రల్ సబ్ డివిజన్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో సెంట్రల్ సబ్ డివిజన్, వెస్ట్ సబ్ డివిజన్ల పరిధిలో మూడోది కొత్తగా వస్తుంది. ఇవి కాకుండా లా అండ్ ఆర్డర్ డీసీపీ ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు దానిని రెండు చేసి వారికి పరిధి నిర్ణయిస్తాం. ట్రాఫిక్ సబ్ డివిజన్లను రెండింటిని నాలుగు చేస్తున్నాం. నగర ట్రాఫిక్‌ను బలోపేతం చేయటానికి కొత్తగా 183 మందిని కేటాయించారు. వారిని త్వరలోనే భర్తీ చేస్తాం. వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ పోలీసులకు రెగ్యులర్ పోలీసింగ్‌తో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యత కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విజయవాడలో సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఏర్పాటవుతుంది. దీనికంటే ముందు ప్రస్తుతం సైబర్ సెల్ పనిచేస్తుంది. ఈఎస్ఎఫ్ ల్యాబ్స్, కేఎల్ యూనివర్సిటీ, ఏపీ పోలీస్ కలిపి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ క్రైం, యాక్ట్, కేసు మిస్టరీ ఛేదించే క్రమంలో అధునాతన పరిజ్ఞానం వినియోగించుకోవాల్సిన తీరు ఇలా అన్ని అంశాలపై శిక్షణ సాగుతుంది. కొత్తగా వచ్చే సిటీ సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్ పోలీసులకు కూడా ప్రత్యేకంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తాం. -
రాష్ట్రానికే రోల్‌మోడల్!
ఆధునిక పోలీసింగ్‌తో అందరికీ ఆదర్శం అదే తక్షణ కర్తవ్యం అమరావతి కమిషనరేట్‌పై సీపీ సవాంగ్ విధివిధానాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడి ‘సాక్షి’తో ప్రత్యేక ఇంటర్వ్యూ విజయవాడ అమరావతి కమిషనరేట్ కొత్త రాష్ట్ర పోలీసులకు రోల్‌మోడల్‌గా ఉంటుందని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధి, విస్తీర్ణం దృష్ట్యానే కాకుండా ఆధునిక పోలీసింగ్‌తో అందరికీ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దటమే తమ తక్షణ కర్తవ్యమని చెప్పారు. కొత్త రాష్ట్ర రాజధాని కమిషనరేట్ కావటంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొదలుకొని అన్ని అంశాల్లో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోలీసులకు సుశిక్షితమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే ఉన్న విజయవాడ కమిషనరేట్‌ను అభివృద్ధి చేసి భవిష్యత్తులో వచ్చే అమరావతి కమిషనరేట్ పరిధిలోకి విజయవాడను కూడా చేర్చి మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. విజయవాడ కమిషనరేట్‌కు కొత్తగా వచ్చే అన్ని వసతులు, సౌకర్యాలు, ప్రత్యేక వింగ్‌లు అమరావతి కమిషనరేట్‌ను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తున్నవేనని వివరించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో వివిధ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే... కమిషనరేట్ విధి విధానాలు సిద్ధం ఇప్పటికే అమరావతి కమిషనరేట్ ప్రకటన జరిగింది. 8057 చదరపు కిలోమీటర్ల పరిధి మేరకు కమిషనరేట్ ఏర్పాటైంది. వాస్తవ స్థితిలో ప్రస్తుత కమిషనరేట్ పరిధిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్, కృష్ణా జిల్లా పోలీస్, గుంటూరు అర్బన్ జిల్లా, గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ ఉన్నాయి. వీటి స్థానంలో జోన్లు వస్తాయి. రెండు జిల్లాలు కలిపి అమరావతిగా మారిన క్రమంలో ఎన్ని జోన్లు, పోలీస్ సబ్ డివిజన్లు ఏర్పాటు చేయాలి, ర్యూట్ మ్యాప్ ఎలా ఉండాలి, కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ వింగ్‌లతో పాటు స్పెషల్ బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్ సబ్ డివిజన్లు, పోలీస్ కంట్రోల్ రూమ్‌లు, ఏఆర్, స్పెషల్ బెటాలియన్లు, ప్రత్యేక పోలీస్ శిక్షణ కేంద్రాలు, ఇలా అన్ని అంశాలపై కసరత్తు చేసి సిద్ధం చేస్తున్నాం. కమిషనరేట్ ఏర్పాటుకు రాజకీయ అడ్డంకులు ఉన్నాయనేది అవాస్తవం. భారీ కమిషనరేట్ కాబట్టి విధివిధానాల రూపకల్పనకు కొంత సమయం పడుతుంది. డెప్యుటేషన్‌పై సిబ్బంది... విజయవాడ కమిషనరేట్, తుళ్లూరు సబ్ డివిజన్‌కు కలిపి 1728 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 674 మంది సిబ్బందితో తుళ్లూరు కొత్త సబ్‌డివిజన్, విజయవాడ కమిషనరేట్‌లో 583 మందితో సిటీ సెక్యూరిటీ వింగ్, 471 అదనపు పోస్టులతో కమిషనరేట్‌ను బలోపేతం చేస్తున్నాం. వాటిలో సీఐ క్యాడర్ నుంచి డీసీపీ పోస్టుల వరకు ఫర్వాలేదు. మిగిలిన పోస్టుల భర్తీ కోసం కానిస్టేబుళ్లను ఇతర రేంజ్‌లు, ఇతర కమిషనరేట్, అర్బన్ జిల్లాల నుంచి డెప్యుటేషన్‌పై తీసుకురావాలని చూస్తున్నాం. కొద్ది నెలల్లో సిబ్బందిని భర్తీ చేస్తాం. వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ పోలీసులకు రెగ్యులర్ పోలీసింగ్‌తో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యత కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విజయవాడలో సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఏర్పాటవుతుంది. దీనికంటే ముందు ప్రస్తుతం సైబర్ సెల్ పనిచేస్తుంది. ఈఎస్ఎఫ్ ల్యాబ్స్, కేఎల్ యూనివర్సిటీ, ఏపీ పోలీస్ కలిపి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ క్రైం, యాక్ట్, కేసు మిస్టరీ ఛేదించే క్రమంలో అధునాతన పరిజ్ఞానం వినియోగించుకోవాల్సిన తీరు ఇలా అన్ని అంశాలపై శిక్షణ సాగుతుంది. కొత్తగా వచ్చే సిటీ సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్ పోలీసులకు కూడా ప్రత్యేకంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తాం. నగరంలో 5 సబ్ డివిజన్లు... విజయవాడ నగరంలో ఇప్పటి వరకు మూడు మాత్రమే సబ్ డివిజన్లు ఉన్నాయి. వాటిని ఐదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉన్న మూడింటి పరిధిని పరిశీలించి వాటి హద్దులో మార్పులు చేర్పులు చేసి ఐదుగా చేస్తాం. సీఎం సహా ఇతర వీవీఐపీల రాకపోకలు సెంట్రల్ సబ్ డివిజన్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో సెంట్రల్ సబ్ డివిజన్, వెస్ట్ సబ్ డివిజన్ల పరిధిలో మూడోది కొత్తగా వస్తుంది. ఇవి కాకుండా లా అండ్ ఆర్డర్ డీసీపీ ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు దానిని రెండు చేసి వారికి పరిధి నిర్ణయిస్తాం. ట్రాఫిక్ సబ్ డివిజన్లను రెండింటిని నాలుగు చేస్తున్నాం. నగర ట్రాఫిక్‌ను బలోపేతం చేయటానికి కొత్తగా 183 మందిని కేటాయించారు. వారిని త్వరలోనే భర్తీ చేస్తాం. -
ఆధునిక సేవలను వినియోగించుకోవాలి
కలెక్టర్ యోగితారాణా నిజామాబాద్ అర్బన్ : అత్యవసర సమయాల్లో ఆధునిక టెక్నాలజీతో కూడిన సర్జరీలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆస్పత్రిలో ఆధునిక పరికరాలతో నిర్వహించిన సిస్టెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్ట్రో ల్యాప్రోస్కోపీ ప్రైమరీ ఇనిఫిటీ సర్జరీల లైవ్ డెమోను కలెక్టర్‌తో పాటు జిల్లా చెందిన గైనకాలజిస్టులు, సర్జన్లు ఆదివారం తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సర్జరీలు చేస్తున్న తీరుతెన్నుల గురించి డాక్టర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ పేద ప్రజలకు సేవలందించడం ద్వారానే వైద్య వృత్తికి సార్ధకత చేకూరుతుందన్నారు. సర్వైకల్ కేన్సర్‌ను గుర్తించేందుకు 32 నుంచి 60 ఏళ్ల వయస్సున్న ప్రతి మహిళకు స్క్రీనింగ్ చేసేందుకు పెలైట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్రెస్ట్ కేన ్సర్ స్కీనింగ్ టెస్ట్‌లు జరుపాలని డాక్టర్లకు సూచించారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు, ఆస్పత్రిలో ప్రసవాలు జరిపేందుకు మానవాతా దృక్పథంతో పనిచేయాలన్నారు. మహిళలు, పిల్లలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించటంలో ముందుండాలని ఐఎంఏకు కలెక్టర్ పిలుపునిచ్చారు. కాగా, ఐఎంఏ, అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుల సంఘం సహకారంతో, భాగస్వామ్యంతో ఈ లాప్రోస్కోపీ సర్జరీ డెమో జరిగింది. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వినోద్‌కుమార్‌గుప్తా, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కవితారెడ్డి, డాక్టర్ ఐఎల్ కృష్ణమూర్తి, శ్రీనివాస్‌చక్రవర్తి, స్వామి, అరుణ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్‌కు సపోర్ట్
టాటా ట్రస్టు సహకారం సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై ఒప్పందం విజయవాడ : ఆధునిక టెక్నాలజీతో పాటు టాటా ట్రస్టు అందిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకుని ప్రతి గ్రామాన్ని, వార్డును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పంచాయతీలకు అభివృద్ధి వివరాలను తెలియపరిచేందుకు గ్రామ కార్యదర్శులకు ట్యాబ్‌లు ఇస్తామని చెప్పారు. ఎనికేపాడులో 24 కే కన్వెన్షన్ సెంటర్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టాటా ట్రస్టుతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామాణాభివృద్ధి అదనపు కార్యదర్శి శాంతిప్రియ పాండె, టాటా ట్రస్టు సీఈవో ఆర్.వెంకట్ రామన్ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్‌లు, వార్డుల అభివృద్ధికి టాటా ట్రస్టు సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు స్మార్ట్‌గా ఆలోచించి గ్రామాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారి సహాయం తీసుకోవాలని సూచించారు. కేశినేని నానిని ఆదర్శంగా తీసుకోండి... ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చొరవ చూపించి టాటా ట్రస్టు చైర్మన్ రతన్‌టాటాతో సంప్రదింపులు చేసి నియోజకవర్గంలోని గ్రామాలను దత్తత తీసుకునేందుకు కృషి చే శారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. రతన్‌టాటా దేశం గర్వించదగిన వ్యక్తని, ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు దీటుగా టాటా గ్రూపును అభివృద్ధి చేశారని తెలిపారు. నానో టెక్నాలజీని మన దేశం కూడా చేయగలదని నిరూపించారని కొనియాడారు. చంద్రబాబుతో ఎంతోకాలంగా అనుబంధం... చంద్రబాబుతో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని రతన్‌టాటా అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే చొరవ ముఖ్యమంత్రికి ఉందన్నారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ టాటా ట్రస్టు వెదురు పెంపకం, మత్స్య, పౌష్టికాహారం, గ్రామాల అభివృద్ధి సూక్ష ప్రణాళిక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. విజయవాడ బాంబూ (వెదురు) మిషన్ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి, రతన్‌టాటాలు సంయుక్తంగా ప్రారంభించారు. వెదురు మిషన్ అమలుకు కృషి చేసిన ఆదర్శరైతు సీతారాం ప్రసాద్, డీఎఫ్‌వో అశోక్‌కుమార్‌లను సీఎం అభినందించారు. రతన్‌టాటా, చంద్రబాబులపై కేశినేని నాని కుమార్తెలు శ్వేత, హేమలు రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, శాసనసభ్యులు జలీల్‌ఖాన్, రక్షణనిధి, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్, కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు. బిజీబిజీగా రతన్‌టాటా... టాటా ట్రస్టు చైర్మన్ రతన్‌టాటా విజయవాడలో ఒకరోజు పర్యటన బిజీబిజీగా గడిపారు. సీఎం చంద్రబాబుతో రతన్‌టాటా, ఎంపీ కేశినేని నాని సమావేశం నిర్వహించి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం 24 కే కన్వెన్షన్ హాలులో జరిగిన జరిగిన సమావేశంలో పాల్గొని విజయవాడ పార్లమెంట్ అభివృద్ధిపై అంగీకారం కుదుర్చుకున్నారు. -
ఆధునిక టెక్నాలజీపై అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన ‘డయాఫ్రమ్ వాల్’ పరిజ్ఞానంపై చీఫ్ ఇంజనీర్ల బోర్డు సమావేశంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ‘పట్టిసీమలో వీరబాదుడు’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనంలో పేర్కొన్న అనుమానాలే సోమవారం నాటి సమావేశంలోనూ వ్యక్తమయ్యాయి. ‘వెల్ సింకింగ్’ పరిజ్ఞానంలో పనులు చేయాలనేది ప్రభుత్వం, పట్టిసీమ కాంట్రాక్టర్ ‘మెగా’ మధ్య ఉన్న ఒప్పందం కాగా, ప్రభుత్వం నుంచి తగిన అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ డిజైన్‌ను మార్చి ‘డయాఫ్రమ్ వాల్’ పరిజ్ఞానాన్ని వాడుతున్న సంగతి తెలిసిందే. దీని వల్ల అదనంగా రూ.250 కోట్ల ఖర్చవుతుందని, ఆమేరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వానికి కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకున్న విషయమూ విదితమే. అలాగే సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా అడ్డగోలు నిర్ణయం తీసుకోలేక, రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)తో ఇందుకు ఆమోదముద్ర వేయించేందుకు విఫలయత్నం చేసిన సంగతీ తెలిసిందే. కాంట్రాక్టర్ చెబుతున్న సాంకేతిక పరిజ్ఞానం నమ్మశక్యంగా లేదని ఎస్ఎల్ఎస్సీ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం కావడంతో, చీఫ్ ఇంజనీర్ల బోర్డుకు విషయాన్ని నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం చీఫ్ ఇంజనీర్ల బోర్డు భేటీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ చెబుతున్న కొత్త టెక్నాలజీ, ధరలు నమ్మశక్యంగా లేవనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. దీంతో అదనపు సమాచారం కాంట్రాక్టర్‌ను అడగాలని నిర్ణయిం చారు. ఈనెల 17న మరోసారి భేటీ అయి నిర్ణయాన్ని వెలువరించాలని భావిస్తున్నారు. ఆ సమావేశంలో కాంట్రాక్టర్ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడటం ఖాయమని, మీడియాలో వార్తలు నేపథ్యంలో వారం రోజులు వాయిదా వేశారని ఇంజనీర్లు చెబుతున్నారు. -
పట్టిసీమలో మరో వింత డిజైన్
-
పట్టిసీమలో మరో వింత డిజైన్
ఏడాదిలో పూర్తిచేసుకునేందుకు పనులు కుదింపు అందుకోసమే డిజైన్ మార్పు.. అదనంగా రూ.250 కోట్లు ఖర్చు ‘మార్చిన డిజైన్’కు ప్రభుత్వ అనుమతులు లేకుండానే పనులు పూర్తి అనుమానాలున్నాయన్న మంజూరు కమిటీ డిజైన్ మార్చడం వల్ల రూ.260 కోట్లు ఖర్చు తగ్గాల్సి ఉండగా, అదనంగా రూ.250 కోట్లు కొట్టేసే వ్యూహం హైదరాబాద్: ఆధునిక పరిజ్ఞానం పేరిట అదనంగా రూ.250 కోట్లు కొట్టేయడానికి పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టర్, ప్రభుత్వ పెద్దలు కలిసి వ్యూహం రూపొందించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని వాస్తవ ఖర్చు కంటే భారీగా నిర్ణయించడం, అంచనా వ్యయంపై 21.9శాతం అధికంగా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిన అంశంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. దాని మీద అదనంగా రూ.250కోట్లు కొట్టేయడానికి తాజాగా ‘అత్యాధునిక పరిజ్ఞానం’ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చారు. గోదావరి నుంచి 8,500 క్యూసెక్కుల నీటిని తోడి పోలవరం కుడికాల్వలో పోయడానికి వీలుగా 30 మోటార్లు, 15 వరుసల పైపులైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ మెగా మధ్య ఒప్పందం కుదిరింది. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్)విధానంలో ప్రాథమిక అంశాల్లో మార్పు చేయకుండా డిజైన్ మార్చుకొనే స్వేచ్ఛ కాంట్రాక్టు సంస్థకు ఉంటుంది. అంచనా వ్యయానికి మించి చేసే అదనపు ఖర్చును ప్రభుత్వం చెల్లించదు. ఈ విషయం ఒప్పందంలోనూ ఉంది.పనులు ప్రారంభానికి ముందే డిజైన్‌ను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ నుంచి ఆమోదం పొందాలనే నియమం ఉంది. ఇందుకు భిన్నంగా పనులన్నీ పూర్తి చేసి డిజైన్‌ను ప్రభుత్వానికి పంపించింది. ఈపీసీ నిబంధనలను నెట్టి అంచనా వ్యయాన్ని మించి అదనంగా రూ.250 కోట్లు చెల్లించాలని ప్రతిపాదించింది. డిజైన్ మార్చాల్సిన అవసరం ఏమిటో? పనులు చేసే సమయంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి డిజైన్‌లో మార్పులు చేయడం సహజం. కానీ ఒప్పందం మీద సంతకాలు చేసిన వెంటనే.. కొత్త డిజైన్ మేరకు పనులు ప్రారంభం కావడం గమనార్హం. ఇలా రూ.కోట్లు కొల్లగొట్టే వ్యూహం ఇరు పక్షాలకు తెలుసు. అందుకే.. మార్చిన డిజైన్‌కు ఆమోదం లేకుండానే పనులు చేసేశారు. చివరి దశలో డిజైన్ ఆమోదానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది చెప్పకపోవడం గమనార్హం. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల మోటార్లు-పంపుల సంఖ్య 30 నుంచి 24కు తగ్గాయని చెప్పారు. కాంట్రాక్టర్ చెబుతున్న ఆధునిక పరిజ్ఞానానికి, ఒప్పందంలో పేర్కొన్న పరిజ్ఞానానికి వ్యత్యాసమేమిటో అధికారులు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. పంపుల సంఖ్య తగ్గితే వ్యయం తగ్గాల్సి ఉండగా, పెరుగుతుందంటూ కాంట్రాక్టు చేసిన ప్రతిపాదనకు తలాడించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధమన్న ఎస్ఎల్ఎస్సీ సర్కారు పెద్దల అండదండలతో ముందే రూపొందించుకున్న వ్యూహం మేరకు మారిన డిజైన్, ఫలితంగా అదనంగా రూ.250 కోట్లు చెల్లించాలన్న ప్రతిపాదన మీద నేరుగా సంతకాలు చేయడానికి అధికారులకు ధైర్యం సరిపోయినట్టులేదు. రాష్ట్రస్థాయి మంజూరు కమిటీఆమోదముద్రకు ప్రయత్నిం చారు. గురువారం రాత్రి వరకు చర్చించిన కమిటీ... కాంట్రాక్టర్ చెబుతున్న ఆధునిక పరిజ్ఞానం నమ్మశక్యంగా లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అదనంగా చెల్లించాలని కోరుతున్న రూ.250 కోట్లలో రూ.190 కోట్ల విలువైన ‘కాంపోనెంట్స్’ గురించి నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు కనీస అవగాహన లేదని, వాటి ధరలపైనా అనుమానాలున్నాయంది. మారిన డిజైన్‌కు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఆమోదం తెలిపినట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు సమావేశంలో వివరించారు. డిజైన్ మారడం వల్ల వ్యయం పెరుగుతుందంటూ పోలవరం సీఈ రాసిన లేఖలో ఎక్కడా.. మారిన డిజైన్‌కు ఆమోదం తెలిపారనే అంశం లేదు. ఆమోదం తెలిపిన లేఖా లేదు. డిజైన్‌కు ఆమోదం లేకుండానే పనులు ఎలా చేశారనే ప్రశ్న రావడంతో.. పాత తేదీలతో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈతో ఆమోదముద్ర వేయించడానికి ఉన్నతాధికారులు హడావుడి పడుతున్నారు. బోర్డు ఆమోదముద్ర వేయిస్తే సరి.. ఎస్ఎల్ఎస్సీలో ఊహించని అభిప్రాయం వ్యక్తంకావడంతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, సర్కారు పెద్దలు ప్రత్యామ్నాయ మా ర్గాలను అన్వేషించారు. ఆధునిక పరిజ్ఞానం, ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) జాబితా లో లేని అంశాల ధరల నిర్ధారణకు ‘బోర్డ్ ఆఫ్ సీఈస్’(చీఫ్ ఇంజనీర్ల బోర్డు) భేటీ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడూ ఈ భేటీ ఏర్పాటు చేసి ‘మమ’ అనిపించాలని శుక్రవారం నిర్ణయించా రు. సోమవారం భేటీ ఏర్పాటు చేసి, అక్కడే వారికి పత్రాలు ఇచ్చి ఆమోదముద్ర వేయిస్తామని.. పట్టిసీమ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ ‘సాక్షి’కి చెప్పారు. ఆమోదముద్ర పడిన మరుక్షణం అదనపు చెల్లింపులు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. రూ.500 కోట్లకు పైగా కొట్టేసే వ్యూహం మోటార్లు-పంపుల సంఖ్య 30 నుంచి 24కు, పైపుల లైన్ల సంఖ్య 15 నుంచి 12కు తగ్గించడం వల్ల రూ.260 కోట్ల వ్యయం తగ్గుతుందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఈ రూ.260 కోట్లు, ఆధునిక పరిజ్ఞానం పేరిట అదనంగా అడుగుతున్న రూ.250 కోట్లు కలిపి.. మొత్తం రూ.500 కోట్లు కొల్లగొట్టేసే వ్యూహాన్ని సర్కారు పెద్దల అండదండలతో అమలవుతోందని స్పష్టంగా తెలిసిపోతోంది. దోపిడీ కొనసాగింపునకే కొత్త నాటకం పట్టిసీమ పథకంలో అన్నీ అడ్డగోలు వ్యవహారాలే. ఈపీసీ నిబంధనల ప్రకారం 5 శాతానికి మించి బిడ్లు దాఖలైతే రద్దు చేయాలి. 21.9% అధికానికి టెండర్లు ఖరారు చేయడంపై శాసనసభ లోపల, వెలుపల విమర్శలు రావడంతో.. ఏడాదిలో పూర్తి చేస్తేనే 21.9% అధికంగా చెల్లిస్తామని, లేదంటే 5 శాతమేనని కొత్త పల్లవి అందుకొన్న విషయం విదితమే. ఏడాదిలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచి, ఇచ్చిన గడువులో పూర్తి చేస్తే 5 శాతంతోపాటు మరో 16.9% అదనంగా చెల్లిస్తామంటూ నిబంధనలను తుంగలో తొక్కినప్పుడే గూడుపుఠాని వెల్లడయింది. ఒప్పందం ప్రకారం చేస్తే ఏడాదిలో పూర్తవుతుందో, లేదో అనే అనుమానం రావడంతో కాంట్రాక్టర్-ప్రభుత్వం కలిసి కొత్త నాటకం మొదలుపెట్టాయి. మోటార్లు-పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గించి గడువులోగా పూర్తి చేసి సొమ్ము చేసుకోవాలని వ్యూహం పన్నాయి. మోటార్లు-పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గినప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయడానికి పట్టే సమయం, వ్యయం రెండూ తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా.. వ్యయాన్ని పెంచడం గమనార్హం. -
మహీంద్రా అర్జున్ నోవోకు ఆదరణ
♦ 48 పనులు చేయడానికి వీలుగా తయారీ ♦ ఆధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి... కరీంనగర్ : రైతులకు అవసరమైన ట్రాక్టర్స్ తయారీలో పేరున్న మహీంద్రా కంపెనీ సరికొత్త డిజైన్‌లో ఇటీవల విడుదల చేసిన‘అర్జున్ నోవో’ ట్రాక్టర్‌కు మంచి ఆదరణ లభిస్తుందన్నదని కంపెనీ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సౌరభ్ వాత్స తెలిపారు. రైతులు వివిధ సందర్భాల్లో ఏకంగా 48 రకాల పనులు చేసేలా ఈ ట్రాక్టర్‌ను రూపొందించింది. బుధవారం కరీంనగర్‌లోని మహీంద్రా కంపెనీడీలర్ షోరూంకు వచ్చిన ఆయన ‘అర్జున్ నోవో’ ట్రాక్టర్ ప్రత్యేకతను, వీటి అమ్మకాల తీరు తెన్నులను ‘సాక్షి’కి వివరించారు. వివరాలు... పొలాల్లో సునాయాసంగా పనులు అడ్వాన్స్డ్ ఎర్గొనామిక్స్, ఫ్లాట్‌ఫారం డిజైన్‌తో రూపొందించిన ‘అర్జున్ నోవో’తో సమయం ఎలా గడిచిపోతుందన్నది తెలియదు. గంటల పనిని కొద్ది నిమిషాల్లోనే సునాయాసంగా పూర్తి చేస్తుంది. ఫుల్ ఫ్లాట్‌ఫారం వేడి రాని విధానం, సులువుగా ఎక్కి దిగే సౌకర్యం, పవర్ఫుల్ ర్యాప్ అరౌండ్ హెడ్ ల్యాంప్స్, ఫోర్వే అడ్జస్టబుల్ డీలక్స్ సీట్, కారులాంటి సస్పెండెడ్ పెడల్స్ ఈ ట్రాక్టర్ ప్రత్యేకతలు. ఆధునిక ఇంజిన్ ఆధునిక ఇంజిన్ కలిగిన ‘ఆర్జున్ నోవో’ ఎక్కువ శక్తి కలిగివుంటుంది. 4 సిలిండర్ ఉన్న శక్తివంతమైన ఇంజిన్, తక్కువ ఇంధన ఖర్చు, అన్నింటికన్నా పెద్ద ఎయిర్‌క్లీనర్, రేడియేటర్లతో రూపొందించిన ట్రాక్టర్. గట్టి గరుకైన భూములను సైతం సునాయసంగా దున్నే సామర్థ్యం. అన్నిటికంటే ఎక్కువగా 15 ఫార్వర్డ్, 3 రివర్స్ గేర్లు, గంటకు 1.69 కిలోమీటర్ల అతి తక్కువ స్పీడ్కాగా, అధికంగా గంటకు 33 కిలోమీటర్లు ప్రయాణించే సౌకర ్యం. పీటీవో లీవర్లు కలిగి ఉంది. ఆధునిక క్లచ్, డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంది. రైతులకు అత్యంత అనువు నూతనంగా విడుదల చేసిన ‘మహీంద్రా నోవో’ ట్రాక్టర్‌కు అన్ని ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉంది. కరీంనగర్ జిల్లాలోని రెండు గుర్తింపు కలిగిన షోరూం లలో వీటిని అందుబాటులో ఉంచాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వందలాది ట్రాక్టర్లు అమ్మడుపోయాయి. ఆధునిక టెక్నాలజీతో దీనిని డిజైన్ చేశాం. రైతులకు అత్యంత అనువుగా ఉండటమే కాకుండా దాదాపు 48 పనులు చే సేలా దీనిని తయారు చేశాం. -
వైజాగ్‌లో జీపీఎస్ సర్వే యంత్ర పరికరాల పరిశ్రమ
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమయ్యే భూముల సర్వే, పలు రకాల భవన సముదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జీపీఎస్ పద్ధతిలో సర్వే చేసే యంత్ర పరికరాల తయారీ పరిశ్రమను విశాఖపట్నంలో ప్రారంభించనున్నట్లు జీయో ట్రాక్స్ ఇం టర్నేషనల్ సర్వీసెస్ అధ్యక్షులు వీవీఎస్ బందుకవి తెలిపారు. చైనా సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం వైజాగ్‌లో 2 వేల ఎకరాలను కేటాయించేందుకు అంగీకరించిందన్నారు. ఈ సందర్భంగా జీయో ట్రాక్స్ స్థాపించే అధునాతన జీపీఎస్ సర్వే పద్ధతులను సంస్థ ప్రతినిధులతో కలిసి శని వారం హైదరాబాద్‌లో మీడియాకు వివరించారు. చైనా హాస్ నావిగేషన్ కంపెనీ జీపీఎస్ టెక్నాలజీతో అత్యంత సులువుగా, వేగంగా భూములను సర్వే చేస్తుందన్నారు. -
పిల్లల్ని పుస్తకాల పురుగుల్ని చేయకండి...
కేరెంటింగ్ పరీక్షలలో నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకోమని వారిపై ఒత్తిడి పెడుతుంటారు చాలా మంది తల్లిదండ్రులు. అలా చేయడం వల్ల వారు పుస్తకాల పురుగులుగా తయారు కావడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. అంతకంటే, కొత్త కొత్త విషయాలను, పరిసరాల విజ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని అబ్బేలా చేయడం మరింత ప్రయోజనకరం. ⇒ ఆధునిక టెక్నాలజీ నుంచి ప్రాచీన నాగరకతల వరకు ప్రతి సంగతినీ తెలుసుకోవాలన్న ఆసక్తి కొందరిలో ఉంటుంది. ⇒ మన వృత్తివ్యాపారాలకు అవసరం ఉన్నా లేకపోయినా కొత్త విషయాలు తెలుసుకోవాలి. కనీసం వాటి గురించిన ప్రాథమిక సమాచారమైనా తెలిసుండాలని మీ పిల్లలకు తెలియజెప్పండి. ⇒ ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్ బ్రౌజ్ చే యడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగం, సాంకేతిక రంగాలలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త పరిశోధనల వివరాలను మీ పిల్లలు తమంతటతాము తెలుసుకునేలా చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మార్కెట్లోకి వచ్చిన కొత్త ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ, వాటిని పిల్లలకు తెలియజెబుతూ ఉండండి. ⇒ ‘మేగజైన్లలో వచ్చే పజిల్స్‌ను నింపడం ద్వారా కొత్త సంగతులు తెలుసుకోవచ్చునని, అలాగే మనకు ఎంత వరకు తెలుసు అన్నది నిర్ధారణ చేసుకోవచ్చునని మీ పిల్లలకు చెప్పండి. మీరు వాటిని పూరిస్తూ, అందులో మీ పిల్లలను కూడా భాగస్వాములను చేయండి. ⇒ చదువుతోబాటు పరిశోధనల సమాచారాన్ని తెలుసుకోవడంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పిల్లలకు తెలియజెప్పండి. ⇒ మన రక్షణ రంగంలో వాడుతున్న క్షిపణుల పేర్లు తదితర వివరాలు మీరు తెలుసుకుని మీ పిల్లలకు కూడా తెలియజెప్పండి. కోటలు, ప్యాలెస్‌ల వంటి చోటుకు పర్యటనకు వెళ్లినప్పుడు వాటి నిర్మాణంలో నాటి శిల్పులు అనుసరించిన నైపుణ్యాన్ని కూడా పరిశీలించడాన్ని పిల్లలకు అలవరచండి. ⇒ సినిమాకు తీసుకు వెళ్లినప్పుడు సినిమా కథతోపాటు అందులో గ్రాఫిక్స్, డిటిఎస్... లాంటి వాటిని కూడా వారు ఆనందించేలా చూడండి. -
ఇక ‘గ్రీన్స్‌హౌస్’ సాగు
పుణేలో శిక్షణ పొందిన ఉద్యాన అధికారులు ఆధునిక టెక్నాలజీతో ఉద్యాన పంటల సాగుకు సన్నాహాలు పంటల సాగుకు ప్రభుత్వం పెద్దపీట ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో గ్రీన్హౌస్ వ్యవసాయానికి కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ల్లో పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తుంది. ఆధునిక సాంకేతిక పరి/ా్ఞనంతో గ్రీన్హౌస్లను ఏర్పాటు చేసి వాటిలో ఉద్యాన పంటలను పండించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 5 జిల్లాలో గ్రీన్ హౌస్‌ల వ్యవసాయాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంతో పాటు పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై తదితర మహానగరాలు, పెద్ద నగరాలు, పట్టణాలకు కూరగాయలు, పూలు తదితర ఉద్యాన పంటలను సరఫరా చేరుుంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పద్ధతిలో రైతులు ఆధిక ఆదాయూన్ని గడించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ గ్రీన్హౌస్ సాగు విధానానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఒక్కో గ్రీన్ హౌస్‌కు రూ.11 నుంచి రూ. 15 లక్షల వెచ్చించి నిర్మింపజేయూలని ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. మొదటి విడతగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. రెండో విడత ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ సాగు విధానాన్ని చేపట్టాలని రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గ్రీన్హౌస్ వ్యవసాయాన్ని రాష్ట్రంలో రైతులతో చేయించాలని ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులు, నీటి వనరులు, ఏటేటా పడిపోతున్న భూగర్భజలాలు తదితర కారణాలతో రైతులను ఆధునిక వ్యవసాయం వైపునకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉన్న వనరులను వినియోగించుకుంటూ మార్కెట్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని పంటలను సాగు చేస్తూ డిమాండ్ తగిన ధరలకు రైతులు అమ్ముకునే విధంగా సాగు పద్ధతులు తీసుకురావాలని ప్రభుత్వం గ్రీన్హౌస్ విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ వ్యవసాయంపై తొలుత ఉద్యాన అధికారులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 జిల్లాలకు చెందిన 45 మంది ఉద్యాన అధికారులకు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోర్త్ హార్వెస్ట్ టెక్నాలజీస్ సంస్థ, మహాబలేశ్వరంలో శిక్షణ ఇప్పించారు. జిల్లా నుంచి ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు కె.సూర్యనారాయణ, కస్తూరి వెంకటేశ్వర్లు, ఉద్యాన అధికారులు ఉదయ్‌కుమార్(అశ్వారావుపేట), బి.వి.రమణ(కల్లూరు), భారతి(సత్తుపల్లి), సందీప్‌కుమార్ (ఇల్లెందు) శిక్షణ పొందారు. శిక్షణ గురించి ఉద్యాన అధికారి కె.సూర్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు. -
ఆధునిక పరిజ్ఞానంపై శిక్షణ అవశ్యం
ఏఎన్‌యూ: ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక పరిజ్ఞానంపై ప్రభుత్వ అధికారులు, సిబ్బంది శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ అన్నారు. ఁఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఆప్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్* అనే అంశంపై యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం, హైదరాబాద్‌కు చెందిన ట్రూత్ ల్యాబ్స్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన వర్క్‌షాప్ ముగింపు సభ సాయంత్రం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఐజీ మాట్లాడుతూ నిపుణులకు తెలిసిన శాస్త్రవిషయూలను అందరికీ పంచటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. పలు కీలక అంశాల్లో ఫోరెన్సిక్ విభాగం ద్వారా పోలీసు శాఖ విశేష సేవలు అందిస్తోందని చెప్పారు. బాంబు పేలుళ్లు, మారణ హోమాలు జరిగినపుడు మృతుల శరీర భాగాలు, ఘటనలకు సంబంధించిన ఆధారాలు సేకరించటం, వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు అనుగుణంగా భధ్రపరచటం చాలా కీలకమని పేర్కొన్నారు. వేలిముద్రల విభాగం, ఇతర కీలక శాఖలు సమన్యయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. నక్సలైట్ల నిర్మూలనలో గ్రే హౌండ్స్ ద ళాలతోపాటు ఫోరెన్సిక్ విభాగం పాత్ర కీలకమని తెలిపారు. ప్రస్తుతం యువత దేశంలో విజ్ఞానాన్ని పెంపొందించుకుని దాని ఫలాలను ఇతర దేశాలకు అందిస్తోందని చెప్పారు. ఇక్కడి జ్ఞాన ఫలాలు ఇక్కడే ఉపయోగపడాలన్నారు. అంబేద్కర్ వంటి మహనీయుల సేవల వల్లే మనం ఈ విధంగా ఉన్నామన్నారు. ఏ స్థాయి అధికారైనా తప్పులు సరిదిద్దుకోవటానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. జ్ఞానాన్ని పెంపొందించుకోలేకపోతేనే భయపడాలని చెప్పారు. ఆన్లైన్ విద్యావిధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ట్రూత్ ల్యాబ్స్ చైర్మన్ డాక్టర్ గాంధీ పీసీ కాజా, లా విభాగాధిపతి ఆచార్య ఎల్.జయశ్రీ తదితరులు ప్రసంగించారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి ఐజీ సర్టిఫికెట్లు అందజేశారు. ఆన్లైన్లో ఫోరెన్సిక్ సంబంధిత కోర్సులు ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏఎన్‌యూ ఓఎస్డీ ఆచార్య ఏవీ దత్తాత్రేయరావు మాట్లాడుతూ ఏఎన్‌యూ, ట్రూత్ ల్యాబ్‌ల మధ్య ఎంఓయూ (అవగాహన ఒప్పందం) ఖరారు కానుందని వెల్లడించారు. అనంతరం ట్రూత్‌ల్యాబ్స్ సహకారంతో ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రం ద్వారా ఆన్లైన్లో పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ తదితర కోర్సులను నిర్వహించనున్నామని తెలిపారు. -
ట్రాఫిక్ సమస్యలకు టెక్ పరిష్కారం
తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక టెక్నాలజీని వాడుకోవాలని డీజీపీ రాముడు పోలీసులకు పిలుపునిచ్చారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ‘సీసీ టీవీ సర్వేలైన్స్ సెంట్రల్ కమాండింగ్ సిస్టమ్, తిరుపతి ఫేస్బుక్ పేజ్’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. నగరంలో ప్రధాన జంక్షన్లలో 150 కెమెరాలు అమర్చామని చెప్పారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేర పరిశోధనలకు వీలవుతుందన్నారు. -
పల్లె ముంగిట్లో సాంకేతిక సౌరభాలు
దోమ: ఒకప్పుడు పట్టణాలకు, ఉన్నత కుటుంబాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్, వినోదం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ టెక్నాలజీ నిత్య నూతనమైంది. ఆయా రంగాల్లో సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సౌకర్యాలన్నీ మానవ జీవితాన్ని అత్యంత సుఖవంతం చేశాయి. అదే సమయంలో వాటిని దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా శాస్త్ర, సాంకేతికాభివృద్ధి ఫలితంగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వాటిని దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకై ప్రతి ఏటా నవంబర్ మాసంలో 2వ గురువారాన్ని ప్రపంచ యూజబిలిటీ డేగా పాటిస్తున్నారు. ప్రపంచ యూజబిలిటీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఈ రోజు పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. పల్లె జీవన శైలి మార్చిన టెక్నాలజీ గత కొన్నేళ్ల క్రితం వరకు పట్టణాలు,నగరాలకే పరిమితమైన టెక్నాలజీ వినియోగం నేడు పల్లెలకు కూడా పాకింది. కొన్నేళ్ల క్రితం వరకు సెల్‌ఫోన్ ఎవరిచేతిలోనైనా కనబడితే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నేడు పల్లెల్లో సెల్‌ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం పల్లెల్లో ఇంటర్నెట్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. పరిగి ప్రాంతాన్ని తీసుకుంటే మూడేళ్ల క్రితం కేవలం 2 ఇంటర్నెట్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. పరిగిలోనే కాకుండా దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నెట్ కేంద్రాలు వెలిశాయి. అన్ని చోట్లా కలిపి ప్రస్తుతం 20 ఇంటర్నెట్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇక ఇళ్లల్లో దాదాపు 200 మంది వరకు బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగిస్తున్నారు. నిర్మాణ రంగంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోయి బేస్మెంట్ దగ్గర నుంచి చెత్తు వేసే వరకు కూడా అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యా సంస్థల విషయానికొస్తే బ్లాక్‌బోర్డులకు బదులుగా ప్రస్తుతం కొన్ని చోట్ల ప్రొజెక్టర్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. అలాగే ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన కార్లు ప్రస్తుతం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా పల్లెల్లో ద్విచక్రవాహనం లేని ఇళ్లు లేదని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఇక వ్యవసాయంలోనూ కూలీల అవసరం తగ్గి మి షన్లతోనే పనులు జరుగుతున్నాయి. గతంలో వారాలు పట్టే పనిని యంత్రాలతో గంటల్లోనే ముగిస్తున్నారు. వినియోగంలో లోపిస్తున్న విచక్షణ.... విజ్ఞాన శాస్త్రం అనేక సమస్యలు పరిష్కరించి మానవ జీవితాన్ని సుఖమయం చేసింది. కానీ మనిషి విచక్షణా లోపం వల్ల ఆ విజ్ఞానమే పర్యావరణ అసమతుల్యత, పరిసరాల కాలుష్యానికి దారి తీస్తోంది. ఉదాహరణకు సోషల్నెట్వర్కింగ్తో పరిచయాలు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. అదే సోషల్నెట్వర్క్ను కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో వస్తున్న పెద్ద పెద్ద సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదే విధంగా సెల్ఫక్షన్ సిగ్నల్స్‌తో కొన్ని రకాల పక్షులు ఇప్పుడు పల్లెల్లో కూడా కనుమరుగవుతున్నాయి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సహచరులతో మాట్లాడటం తగ్గించి ఫోన్లతోనే కాలక్షేపం చేస్తుండటంతో సంబంధబాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. మానవుడు తన పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగించి సృష్టి ఔన్నత్యానికి పాటు పడాలే గానీ సృష్టి వినాశనానికి కాదని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. -
యాప్ నిఘా
వైద్యులూ తస్మాత్ జాగ్రత్త! డుమ్మా కొడితే నయా యాప్మీ పనిపడుతుంది త్వరలో అందుబాటులోకి హెల్త్‌ఇజాన్ ఇలాంటి ఏర్పాటు దేశంలో ఇదే మొదటిసారి నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమార్ సాక్షి, బెంగళూరు : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే కర్ణాటక ఈ విషయంలో మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని వైద్య విద్య కళాశాలల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు, నేరుగా తెలుసుకోవడానికి వీలుగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నూతన యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇలా ప్రభుత్వం వైద్య విభాగం సొంతంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం దేశంలో ఇదేమొదటిసారి. పేదల వైద్యం కోసం ప్రభుత్వాలు ఏడాది రూ. వేలకోట్లు ఖర్చు చేస్తున్నా సర్కారీ దవాఖానాలో వైద్యం నాణ్యత ప్రమాణాలు ఎంతమాత్రం అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు. విడుదల చేసిన నిధులు చాలా వరకూ క్షేత్రస్థాయికి చేరకపోవడం... వచ్చిన నిధుల్లో సింహభాగం పక్కదారి పట్టడం మొదటి కారణం. దీని వల్ల ఆస్పత్రుల్లో మందులు కాదుకదా కనీసం తాగునీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు, నర్సులు, సిబ్బంది సరైన సమయానికి అందుబాటులో లేక పోవడం రెండవది. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఎక్కడి సమస్యలు ఎక్కడివక్కడే ఉండిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్‌ఇజాన్ (HEALTHZEN)పేరుతో ఒక యూప్‌ను తయారు చేసింది. ఆండ్రాయిడ్ సదుపాయం కలిగిన ఏ ఫోన్ నుంచి అయిన ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న ఆస్పత్రుల పరిస్థితిని వివరించే విషయం అప్‌లోడ్‌చేసిన వెంటనే క్షేత్రస్థాయితో మొదలుకొని జిల్లా వైద్యాధికారితోపాటు రాష్ట్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, సంబంధిత మంత్రికి కూడా వెంటనే విషయం తెలిసిపోతుంది. అంతేకాకుండా ఇందులో జీపీఎస్ వ్యవస్థ కూడా ఉండటం వల్ల ఎక్కడి నుంచి విషయాన్ని పంపిస్తున్నారనే విషయం కూడా సంబంధిత అధికారులకు క్షణాల్లో తెలిసిపోనుంది. దీని వల్ల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ... ‘నూతన యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాం. కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభిస్తున్నాం. ఇటువంటి యాప్ దేశంలో ఇదే ప్రథమం.’ అని పేర్కొన్నారు. -
న్యూసిటీ - న్యూవిజన్
నవ విశాఖ పునర్నిర్మాణానికి కొత్త ప్రణాళిక నగరంలో దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వ సహకారంతో మరమ్మతులు గురువారం నుంచే నిర్వాసితులకు రేషన్ బియ్యం, ప్రతి ఇంటికీ తాగునీరు మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు వెల్లడి తుపాను వల్ల దెబ్బతిన్న విశాఖపట్నం మహానగరాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక టెక్నాలజీ సాయంతో కొత్త ప్రణాళికను సిద్ధం చేశామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ‘న్యూసిటీ.. న్యూవిజన్’ లక్ష్యంతో సరి కొత్త అందమైన నగరాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో గురువారం సీఎం మీడియా తో మాట్లాడారు. ‘‘గడచిన నాలుగు రోజుల నుంచి చేయాల్సిందల్లా చే శాను. బాధితులకు సాయం అందించే విషయంలో మంత్రులు, మీడియా అందరూ సహకరించాలి. కష్టకాలంలో నాకు ఎవరైనా ఒక్కటే. అందరి వెంటా పడతా. ప్రజలకు మేలు జరిగే వరకూ వదలను’’ అని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి తుపా న్లు వచ్చినా ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాలా ఎదుర్కొనే సత్తా ఉన్న భవనాల నిర్మా ణం ఎంతో అవసరమన్నారు. ఎల్ అండ్ టీ, ఐవీఆర్సీఎల్, టాటాగ్రూప్ వంటి ఉత్తమ నిర్మా ణ సంస్థల సాయంతో... మంచి కన్సల్టెంట్స్, ఆర్కిటెక్చర్ల సలహాలను స్వీకరించి అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో అందమైన భవనాల డిజైన్లతో విశాఖ స్మార్ట్‌సిటీ రూపకల్పన చేస్తామని చెప్పారు. ఇంకా ఆయనేం చెప్పారంటే... ► విశాఖ లో తుపానుకు దెబ్బతిన్న ఇళ్లన్నింటికీ ప్రభుత్వమే మరమ్మతులు జరిపిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాయంతో పేరున్న నిర్మాణ సంస్థల నుంచి నిపుణులైన సూపర్వైజర్ల బృందం రానుంది. బాధితుల జాబితాను ఆన్లైన్లో పొందుపర్చి దశలవారీ ఇళ్లకు మరమ్మతులు జరిపిస్తాం. మెటీరియల్‌ను యజమానులు తెచ్చుకుంటే అందుకయ్యే కూలీల ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుంది. ►దెబ్బతిన్న పచ్చదనాన్ని త్వరగా అభివృద్ధి పరిచేందుకు కడియం నర్సరీని సంప్రదించనున్నాం. సెల్ టవర్లను వేగంగా నిర్మించేందుకు వీలుగా టాటా, పాటూరి రామారావు, ఎల్ అండ్ టీ కంపెనీలతో చర్చిస్తున్నాం. విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరణకు టాటా పవర్‌గ్రిడ్ చైర్మన్‌తో మాట్లాడాం. శనివారం సాయంత్రానికి 80 శాతంసరఫరాను పునరుద్ధరిస్తాం. ►నగరంలో తెల్లకార్డుదారులకు రేషన్‌బియ్యం అందించనున్నాం. రాష్ట్రం లోని 72 అగ్నిమాపక శకటాలను రప్పించి వాటి ద్వారా విశాఖ అపార్ట్మెంట్లకు నీటి సరఫరా చేయనున్నాం.పశ్చిమ బెంగాల్ నుంచి 2,500 మెట్రిక్ టన్నుల బంగాళాదుంపలు, 200 లారీల ఉల్లిపాయలు తెప్పించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశాం. ►ఉత్తరాంధ్రలో కూలీలు, లారీ డ్రైవర్లు పనుల్లోకి వచ్చే పరిస్థితి లేనందున ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి రేషన్ బియ్యం తెప్పిస్తున్నాం. ఈ రోజు నుంచి స్టీల్‌ప్లాంట్‌కు సమీపంలోని కేవీఆర్‌కు పవర్ సరఫరా అందుతుంది. తీవ్రంగా దెబ్బతిన్న స్టీల్‌ప్లాంట్, నేవల్ బేస్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను పునర్ నిర్మించేందుకు కృషి చేస్తాం. ►నగరంలోని 72 వార్డులకూ గురువారం నుంచి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో ప్రజల కు పంపిణీ చేసేందుకు వీలుగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద పెద్ద కొవ్వొత్తులు, మస్కిటోకాయిల్స్ తెప్పించాలని అధికారులను ఆదేశించాం. ఎన్టీపీసీలో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి మొదలైంది. భవిష్యత్తులో కూలిపోకుండా ఉం డేందుకు గుండ్రని కరెంటు పోల్స్‌కు ప్రాథాన్యం ఇస్తున్నాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జరుగుతున్న సహాయక పనులను పరిశీలిస్తాం. రూ.10 ధర తగ్గించి పాలు విక్రయించాలి.. విశాఖ, హెరిటేజ్ డెయిరీల మేనేజర్లను పిలిపిం చిన సీఎం లీటరుకు రూ.10 ధర తగ్గించి రెండు రోజులపాటు పాలు విక్రయించాలని సూచిం చారు. పెట్టుబడిదారులు రారన్న ప్రచారం వద్దు: పవన్‌కల్యాణ్ తుపాను ధాటికి దెబ్బతిన్న విశాఖపట్నం ప్రాంతానికి పెట్టుబడిదారులు రారన్న ప్రచారం వద్దనీ, దీనివ ల్ల లేనిపోని భయాందోళనలు పెరుగుతాయని సినీహీరో పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో సమానంగా విశాఖ ప్రాంతం చిత్రపరిశ్రమగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. కాల్ చార్జీలు తగ్గించండి: సీఎం సూచన తుపాను ప్రభావిత జిల్లాల్లో ఫోన్ కాల్స్ చార్జీలను తగ్గించాలని సీఎం చంద్రబాబు సెల్‌ఫోన్ కంపెనీలను కోరారు. గురువారం విశాఖ కలెక్టరేట్లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో బాబు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తుపాను బారిన పడ్డ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో వినియోగదారులు ఇబ్బందుల్లో ఉన్నందున తక్కువ రేట్లతో టెలికాం సేవలు అందుబాటులోకి తేవాలని సీఎం కోరారు. పునరావాస చర్యలు వేగంగా చేపట్టేందుకు అధికారులందరికీ 3జీ సేవలను అందించాలని సీఎం సూచించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 50 శాతం సేవలను పునరుద్ధరించామని టాటా కంపెనీ ప్రతినిధులు తెలియజేయగా, 48 శాతం పునరుద్ధరించినట్లు యూనినార్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫోన్ చార్జింగ్‌ను సైతం కొందరు వ్యాపారంగా చేయటంపై సీఎం స్పందిస్తూ అన్ని కంపెనీలు మొబైల్ చార్జింగ్ పాయింట్లను వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. దీనికి ఐడియా సెల్యులర్ స్పందించింది. హాజరు కాని కంపెనీలపై అసహనం... తుపాను కారణంగా దెబ్బతిన్న విశాఖలో ఫోన్ సేవలను పునరుద్ధరించటంపై నిర్వహించిన కీలక సమావేశానికి పలు కంపెనీల అధిపతులు గైర్హాజరయ్యారు.భారతి ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ మాత్రమే హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవలందించేందుకు కంపెనీల అధిపతులు ముందుకు రాకపోవడం విచారకరమని సీఎం అసహనం వ్యక్తం చేశారు. -
ప్రకృతికి సెగ, తుపాన్ల పగ
వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్న సామెతకు కాలం చెల్లిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పురోగమించింది. ఇదిప్రకృతి విలయాలూ, ఉపద్రవాలూ, వాటితో జరిగే విధ్వంసాలనూ కొన్ని రోజుల ముందుగానే పసికట్టి హెచ్చరికలు చేయగలుగుతోంది. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, అది హెచ్చరించగలదే కానీ, బాధిత ప్రజలను ఒడ్డున పడవేసే చైతన్యాన్ని కలిగించలేదు. ఆ పని మానవ చైతన్యంతోనే సాధ్యం. ఇదే ఆ హెచ్చరికలకు ఆచరణలో విలువను సమకూరుస్తుంది. తూర్పు కోస్తాతీరంలోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల రూపురేఖలను హుదూద్ సర్వ నాశనం చేసింది. విశాఖ పట్నం దగ్గర తీరం దాటి, ఆ నగరానికి పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ రెండు రాష్ట్రాలలో జన జీవనాన్నీ, గ్రామా లనూ, అన్ని రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలను (రోడ్డు, రైల్వే మార్గాలు సహా) ఛిన్నాభిన్నం చేసింది. లక్షల ఎక రాలలో రకరకాల పంటలను నేలమట్టం చేసింది. భారత నావికా వ్యవస్థలో కీలకమైన ఈస్ట్రన్ నావెల్ కమాండ్‌కు కీలకంగా ఉన్న నగరం విశాఖ. ఆ నగర సౌందర్యం తుపా ను విలయంలో ధ్వంసమైంది. ఒక శాడిస్టు మనోవికా రంతో హుదూద్ అక్కడే తీరం దాటింది. మరో తుపాను పొంచి ఉందా? గత సంవత్సరం ఇదే అక్టోబర్‌లో కోస్తాను అతలాకుతలం చేసిన ‘పైలీన్’ బీభత్సం కన్నా ఎన్నో రెట్లు బీభత్సాన్ని నిన్నటి హుదూద్ సృష్టించింది. విషాదం ఏమిటంటే హుదూద్ విసిరిన గాలులు పెట్టిన ఘోష సైతం ఇంకా ప్రజలకు మరపునకు రాలేదు. కానీ మరో దుర్వార్త అప్పు డే సిద్ధమైపోయింది. కొద్దిరోజులలోనే- బహుశా ఈ నెలా ఖరులో లేదా నవంబర్ ఒకటో తేదీ సమీపంలోనో మరో పెను తుపాను పట్టవచ్చునని, అది ఉత్తరాంధ్రప్రదేశ్- చెన్నై కోస్తా వైపుగా దూసుకొచ్చే అవకాశం ఉందని ‘నాసా’(అమెరికా)కు చెందిన, జపాన్‌కు చెందిన శాస్త్ర వేత్తలు కొందరు అంచనా వేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ తుపాను పంజా విసరవచ్చు. లేదా తప్పి పోనూ వచ్చు. ఇది కూడా అండమాన్ దీవులలోనే తలెత్తే అవకాశం ఉందని వారి ఊహ. హుదూద్ అడుగుజాడలలో... ఆసియాను ముమ్మరించిన రెండు పెను తుపానులలో హుదూద్ ఒకటి. దీని ఫలితాన్ని చూశాం. మరొకటి వొంగ్ఫాంగ్. ఇది జపాన్ దిశగా కదులుతున్న విలయం. హుదూద్ మాదిరిగానే ఇది కూడా గంటలకు 180 కిలో మీటర్ల వేగంతో వీచే గాలులను మూట కట్టుకుని బయలు దేరింది. జపాన్‌లోని ఒకినావా నగరాన్ని గాలిదుమా రంతో, భారీ వర్షంతో ముంచెత్తింది. ఇక్కడితో తన ప్రతాపాన్ని చాలించకుండా జపాన్లోదే కియుషీ దీవిని కూడా కబళించనున్నదని అంచనా. అందుకే ముందస్తు చర్యగా అధికార యంత్రాంగం అక్కడ నివసించే లక్షన్నర జనాభాను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఇది కూడా హుదూద్ అడుగుజాడలలోనే ఆదివారమే తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో హుదూద్ తాకిడికి గుర య్యే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలో తుపాను కారణంగా కోటిన్నర జనాభా అన్నపానీయాలు లేకుండా బితుకుబితుకు మం టూ బతికారు. అనేక ఇక్కట్లకు గురయ్యారు. అన్నింటి కన్నా విచిత్రం ఏమిటంటే- ఇంతవరకు నమోదైన చరి త్రను బట్టి భారత ఉపఖండంలో 35 రాకాసి తుపానులు సంభవించాయి. అందులో 27 భీకర తుపానులకు బంగా ళాఖాతమే పురుడుపోసింది. అందుకే హిందూ మహా సముద్రం ఉష్టమండల తుపానులకు కేంద్ర స్థానమైందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాగే పైలీన్ లేదా, హుదూ ద్, ఈ రెండూ కూడా గత పదేళ్ల నుంచి పర్యావరణంలో, వాతావరణంలో కలుగుతున్న మార్పుల ఫలితాలేనని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. హుదూద్ అంటే ఇజ్రాయెల్ జాతీ య పక్షి పేరు. ఈ తుపానుకు ఒమన్ ప్రభుత్వం ఈ పేరు పెట్టింది. పరిజ్ఞానం ప్రయోజనం ఎప్పుడు? వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్న సామె తకు కాలం చెల్లిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పురోగమించింది. ఇదిప్రకృతి విలయాలూ, ఉప ద్రవాలూ, వాటితో జరిగే విధ్వంసాలనూ కొన్ని రోజుల ముందుగానే పసిగట్టి హెచ్చరికలు చేయగలుగుతోంది. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, అది హెచ్చరించగ లదే కానీ, బాధిత ప్రజలను ఒడ్డున పడవేసే చైతన్యాన్ని కలిగించలేదు. ఆ పని మానవ చైతన్యంతోనే సాధ్యం. ఇదే ఆ హెచ్చరికలకు ఆచరణలో విలువను సమకూరుస్తుంది. హుదూద్ విజృంభించబోతున్న సంగతి తెలిసిన తరువాత ఈ పనిని సైనిక, నావికా దళాలు చేపట్టాయి. రంగంలోకి దిగి వెళ్లగలిగినంత మేర చొచ్చుకుపోయి జనాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. నిజానికి ఇలాంటి విపత్తుల నుంచి కాపాడేందుకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు (డిజాస్టర్ మేనేజ్మెంట్) లేకపోలేదు. ప్రాణనష్టం జరగకుండా లేదా ఆ నష్టాన్ని బాగా తగ్గించడానికి, ఆస్తినష్టం జరగకుండా చూడడానికి ఈ వ్యవస్థలు రూపొందించిన పథకాలకు కూడా కొరతలేదు. కానీ ఆ వ్యవస్థలు పలు సందర్భాలలో ఎందుకు సకాలంలో స్పందించడం లేదు? ప్రభుత్వాలకు, అధికారులకు పాలనానుభవం ఉన్నప్పటికీ ప్రజానీకం అం టే శ్రద్ధాసక్తులు లేనందుకే కొన్ని లోటుపాట్లు జరుగుతు న్నాయి. ప్రజా సంక్షేమం బాధ్యత నుంచి తప్పించుకునే సంస్కృతికి అలవాటు పడడం వల్ల, విపత్తుల నుంచి బయటపడగల వ్యూహరచన కొరవడినందు వల్లనే తగ్గిం చుకోగల నష్టాల పైనా కష్టాల పైనా దృష్టి సారించడం లేదు. జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార వ్యవస్థను 2006లో ఏర్పాటు చేశారు. తరువాత క్రమంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఉపగ్రహ వ్యవస్థ జాతీయంగా కూడా నిలదొక్కుకుంటున్న కొద్దీ మన వాతావరణ శాస్త్ర వేత్తలు ప్రమాద హెచ్చరికలను ముందుగానే విడుదల చేయగలుగుతున్నారు. ఇంతకు ముందున్న పరిస్థితి వేరు. 1977 నాటి దివిసీమ రాకాసి తుపాను వల్ల జరిగిన భారీ ప్రాణనష్టం (10,000) గురించి, ముంచుకొస్తున్న ఆ తుపా ను గురించి ‘నాసా’(అమెరికా) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తే తప్ప మనకు తెలియలేదు. పెరుగుతున్న తుపాను ముప్పు బంగాళాఖాతం భారీ తుపానులకు నిలయంగా మారింది. అందులో పుట్టిన తుపానులు తూర్పు కోస్తాను అతలాకు తలం చేస్తున్నాయి. 1891-1977 మధ్య బంగాళాఖాతం లో 400 తుపానులు జనించాయి. అలాగే 1891-1969 మధ్య వచ్చిన 453 తుపానులకు ఈ తీరమే కారణమైనట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 1891ను ఎందుకు మైలురా యిగా తీసుకున్నారంటే, ఆ సంవత్సరమే బందరు (మచి లీపట్నం)మీద ఘోర తుపాను పడగ విప్పింది. పట్టణ వీధులన్నీ జలమయం కావడంతో బాధితులను పడవల మీద తరలించవలసి వచ్చింది. దాదాపు అంతటి ఘోర మైన తుపానులను చవిచూసిన అనుభవం నెల్లూరు, చీరాల పట్టణాలకు కూడా ఉందని రికార్డులు వెల్ల డిస్తున్నాయి. 1969 నాటి నెల్లూరు పెను తుపాను తరు వాతనే మిటిగేషన్ కమిటీ ఉనికిలోకి వచ్చింది. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను సూచించ డమే ఈ కమిటీ ధ్యేయం. మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. తుపాను బీభత్సం మరింత తీవ్రం కానున్న దని 1980లోనే అంచనా వేశారు. బీభత్సం పెరిగే కొద్దీ ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా పెరిగిపోతాయి. అందుచేత ప్రభుత్వ వ్యవస్థలు ముందస్తు జాగ్రత్తతోనే నివారణ చర్య లను బహుముఖంగా చేపట్టాలని, చావు నెత్తి మీదకు వచ్చే వరకు వేచి ఉండరాదని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచా ర్యుడు సీవీ రాఘవులు ఒక అధ్యయన పత్రంలో స్పష్టం చేశారు. 1979 నాటి ఘోర తుపాను తరువాత ఆయన ఈ పత్రాన్ని రూపొందించారు. అతివృష్టి-అనావృష్టి తుపానులు కోస్తా ఆర్థిక వ్యవస్థను దఫదఫాలుగా నాశనం చేస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు రాయలసీమ వర్షాభా వ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు 12 శాతం తగ్గిపోయాయి. ఒక్క తెలంగాణలోనే వర్షపాతం 30 శాతం తగ్గింది. నిజానికి కడచిన దశాబ్దంగా దేశంలో వర్షపాతం తక్కువై వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని భారత ఉష్టమండల వాతావ రణ సంస్థ (పుణే) మాజీ సంచాలకుడు బీఎన్ గోస్వామి అంచనా వేశారు. దీని ప్రభావం ధాన్యం ఉత్పత్తి పైన, సగటు జాతీయోత్పత్తులపైనా కూడా ఉండబోతోంది. పర్యావరణంలో మార్పులతోను, పసిఫిక్ సముద్ర ప్రాం తంలో పుట్టి పెరుగుతున్న ఎల్-నినో, లానినో వాతావరణ వ్యవస్థల వల్ల తుపానులు, అతివృష్టి, అనావృష్టి ఏర్పడు తున్నాయి. ఇండియాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రపం చ పర్యావరణం వేడెక్కి పోవడం కూడా కారణమేనని, ఈ పరిణామంతో వాతావరణంలో ఆవిరి పెరిగిపోతోందని ప్రొఫెసర్ గోస్వామి అంచనా. ఒకటి వాస్తవం- ‘మట్టి ఎప్పటికప్పుడు కలవరిస్తుంటుంది/ వాన నీటి స్పర్శ కోసం’ అన్న సహజ సూత్రాన్ని మరచిపోరాదు. ఏబీకే ప్రసాద్ -
బిక్కు.. బిక్కుమంటూ..
అంతా ఎవరిపనులు వారు చేసుకుంటున్నారు. ఇంతలోనే పెద్ద శబ్దం. భూమి కంపించినట్లు కదలికలు. ఇళ్లల్లో ఉన్న వారంతా ఒకేసారి కంగారుగా బయటకు వచ్చారు. ఒకరి గోడలు పగుళ్ల తేలగా.. మరొకరి ఇంటి పైకప్పు పగిలిపోయింది. ఇంకొకరి ఇంట్లో సామగ్రి కింద పడిపోయింది. ఈ దృశ్యం మంథని మండలం సింగరేణి ప్రభావిత గ్రామాల్లో నిత్యం కనిపిస్తుంటుంది. వారికి నిత్యం భూకంపమే. బ్లాస్టింగ్‌తో బీటలు వాడిన గోడలు - రోజూ భూకంపమే - ఓసీపీ-2 పేలుళ్లతో కంపిస్తున్న భూమి - నిర్వాసిత గ్రామస్తుల ఆందోళన మంథని రూరల్ : మంథని మండలం సింగరేణి ప్రభావిత గ్రామాలైన అక్కెపల్లి, రచ్చపల్లి, సిద్దపల్లి, పుట్టపాక, వేంపాడు గ్రామాల్లో నిత్యం భూకంపమే. సింగరేణి ఓసీపీల విస్తరణ చేపట్టిన తర్వాత ఆయా గ్రామాల సరిహద్దుల వరకు గనులు విస్తరించాయి. గ్రామాల సమీప ప్రాంతమంతా ఓబీ మట్టి కుప్పలతో నిండి ఉంది. ఓసీపీల నుంచి వెలికితీసిన మట్టిని సమీపంలో డంప్ చేస్తుండడంతో దుమ్ము, ధూళితో నరకం అనుభవించారు. తర్వాత బొగ్గు వెలికితీతకు పేలుళ్లు మొదలుపెట్టింది. రోజూ మధ్యాహ్నం పేలుళ్లు చేపడుతున్నారు. ఈ శబ్దాలతో సమీప గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి. ఇంట్లో సామగ్రి మొత్తం కిందపడుతోంది. తాత్కాలిక నిర్మాణాలు కూలిపోతున్నాయి. పేలుళ్లతో వస్తున్న దుమ్ముధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అప్పుడప్పుడు ఓసీపీ నుంచి దుర్వాసన వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా సింగరేణి యాజమాన్యం మాత్రం వీరిని పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు విచారణకు వచ్చే సమయంలో పేలుళ్లు నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాలను స్వాధీనం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓసీపీలో ఆధునిక టెక్నాలజీ ఓసీపీల విస్తరణలో సింగరేణి సంస్థ ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తోంది. పంచ్‌ఎంట్రీ విధానాన్ని లాంగ్వాల్ ప్రాజెక్టులో వాడేందుకు రంగం సిద్ధం చేసింది. మంథని మండల పరిధిలోని ఓసీపీ-2లో 450 మీటర్ల లోతు నుంచి 12 కిలోమీటర్ల మేర బొగ్గును పంచ్‌ఎంట్రీ ద్వారా సేకరించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ విధానంలో బొగ్గును వెలికి తీయాలంటే మొదట రచ్చపల్లి అడుగుభాగం నుంచి వెళ్లాలి. పరిహారం చెల్లించకపోవడంతో ఈ గ్రామాన్ని సంస్థ స్వాధీనం చేసుకోలేదు. దీంతో పంచ్‌ఎంట్రీ విధానం నిలిచిపోయింది. గ్రామ భూ భాగం నుంచి యంత్రం సొరంగం చేస్తూ బెల్టు ద్వారా బొగ్గును బయటకు పంపిస్తుంది. ఈ విధానం ప్రారంభించిన సరిహద్దులోని గృహాలు దెబ్బతిన్నాయి. భూమి కుంగిపోయి కిందపడ్డా... తెల్లవారే సరికి బాతురూం దగ్గర భూమి కుంగిపోయి బొంద పడ్డది. రోజుమాదిరిగా పొద్దుగాల అటుపోంగనే బొందల పడిపోయిన. మెడకు దెబ్బతాకి పదిహేను రోజులు ద వాఖానాల ఉన్న. రూ.10 వేల వరకు ఖర్చయ్యాయి. భూమి లోపల ఏదో మిషన్ అచ్చిందట. దాంతోనే గొయ్యి పడింది. - పోలవేన లక్ష్మి రోగాలొత్తున్నయ్.. మా ఊరి పక్కనే ఉన్న ఓసీపీల రోజూ పేలుళ్లు చేస్తున్నరు. వాటి నుంచి వచ్చే దుమ్ము, దూళితో రోగాలొత్తున్నయ్. అంతేకాకుండా అప్పుడప్పుడు ఓసీపీల నుంచి విషవాయువులు కూడా వత్తున్నయ్. వీటితోని చాలా మంది రోగాలబారిన పడుతాండ్రు. - గుర్రాల ఓదెలు రేకులు పగిలిపోతున్నయ్.. పేలుళ్లతో వచ్చే శబ్దాలకు ఇంటిపైకప్పులు కదిలిపోతున్నాయి. ఒక్కోసారి పెద్దగా శబ్దాలు వచ్చి రేకులు పగిలిపోతున్నయి. వానాకాలం వచ్చిందంటే పగిలిన రేకులతోని ఇళ్లంతా ఉరుస్తుంది. సింగరేణోళ్లు చేయబట్టి ఇండ్లళ్ల కూడా ఉండేటట్లు లేదు. - చిలుక ఓదమ్మ -
ఆధునికత దిశగా వ్యవసాయం
సాక్షి, బెంగళూరు : రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే దిశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధార్వాడలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కృషి వేళాను నిర్వహిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ప్రారంభించిన ఈ మేళా రెండు రోజుల పాటు సాగుతుంది. కాగా, రైతులు, స్థానిక ప్రజల కోరిక మేరకు ‘మేళా’ వ్యవధిని మరిన్ని రోజులు పెంచే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేళాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలు, వివిధ వ్యవసాయ వర్శిటీలు ఇటీవల అభివృద్ధి చేసిన నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశారు. ఈ మేళకు కేవలం స్థానిక రైతులే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా పలువురు తరలివచ్చారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
పీఆర్ ఇంజినీర్ల వర్క్‌షాప్‌లో మంత్రి అయ్యన్న విశాఖ రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ గ్రామాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ఇంజినీర్లు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈ శాఖకు క్వాలిటీ కంట్రోల్ విభాగం కీలకమని, దాన్ని పటిష్టపర్చి రానున్న కాలంలో అన్ని రకాల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూస్తామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాపులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ క్వాలిటీ కంట్రోల్‌ను అమలు పర్చే అంశంపై పూర్తి స్థాయిలో మేధోమథనం చేయాలని ఇంజినీర్లకు సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ గ్రామాల్లో నాణ్యమైన రోడ్లను నిర్మించాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందని పేర్కొన్నారు. పంచాయతీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలనే లక్ష్యంతో రోడ్, వాటర్, పవర్, గ్యాస్, ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందని పేర్కొన్నారు. వీటి నిర్మాణంలో సమస్యలు తల్తెకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని సూచించారు. పీఆర్ ఇంజినీర్-ఇన్-చీఫ్ సి.వి.ఎస్.రామ్మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామని, వీటి నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజినీర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ కనెక్టవిటీని పెంచేందుకు ఈ వర్క్‌షాపులో సుమారు రూ.100 కోట్లకు తక్కువ కాకుండా ప్రతిపాదనలు ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెడీ రెకనానర్ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటేశ్వరరావు, నాబార్డు సీఈ పద్మజ, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రవీంద్రనాథ్, ఈఈ ఎల్.కృష్ణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
జాబ్ సెర్చ్‌కు టెక్నాలజీని వాడుకోండి !
మీ అర్హతలు, నైపుణ్యాలకు తగిన మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే, అది ఎక్కడ లభిస్తుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. జాబ్ సెర్చ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పోటీ ప్రపంచంలో ఇతరులను దాటి ముందుకెళ్లాలంటే అభ్యర్థులు ఈ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి. జాబ్ పోర్టల్స్: ఒక్క క్లిక్‌తో అంతర్జాలంలో కొలువుల వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో జాబ్ పోర్టళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలోకి ప్రవేశించి, అర్హతలకు తగిన ఉద్యోగాలను, రంగాలను వెతుక్కోవచ్చు. సంస్థలు ప్రకటించిన ఖాళీల సమాచారం, దరఖాస్తు ప్రక్రియ గురించి జాబ్ పోర్టళ్లలో ఉంటుంది. కంపెనీల వివరాలు, కెరీర్ సలహాలు కూడా ఇందులో లభిస్తాయి. కాబట్టి ఉద్యోగాల వేటలో మునిగిన అభ్యర్థులు ఇలాంటి పోర్టళ్లను ఉపయోగించుకుంటే శ్రమ తగ్గుతుంది. అనుకున్న లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. ఈ-రెజ్యుమె: పేపర్ రెజ్యుమెలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఇకపై ఎలక్ట్రా నిక్-రెజ్యుమె(ఈ-రెజ్యుమె)లతోనే పని పూర్తవుతుంది. కంపెనీలు అభ్యర్థుల నుంచి ఇలాంటి రెజ్యుమెలనే స్వీకరిస్తాయి. కాబట్టి ప్రభావవంతమైన ఈ-రెజ్యుమెను రూపొందించు కోవాలి. ఇంటర్నెట్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో సలహాలు, సూచనలు కూడా లభిస్తాయి. వాటిని పరిశీలించాలి. సొంతంగా ఈ-రెజ్యుమెను రూపొందించుకున్న తర్వాత దాన్ని జాబ్ పోర్టళ్లకు, వెబ్సైట్లకు ఈ-మెయిల్ ద్వారా పంపించాలి. మీ అర్హతలను తగిన ఉద్యోగాలంటే.. కంపెనీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి. రిక్రూటర్ నుంచి మీకు పిలుపు వస్తుంది. వీడియో రెజ్యుమె: దరఖాస్తుల విషయంలో తెరపైకొచ్చిన మరో ఆధునిక ధోరణి.. వీడియో రెజ్యుమె. అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, ఇతర వివరాలను స్వయంగా చెబుతూ ప్రభావవంతమైన వీడియోను చిత్రీకరించుకోవాల్సి ఉంటుంది. దీని వ్యవధి సాధారణంగా రెండు నుంచి మూడు నిమిషాల్లోపే ఉండడం మంచిది. కొలువు ప్రకటనను చూసిన తర్వాత ఈ వీడియో రెజ్యుమెను రిక్రూటర్‌కు పంపించాలి. ఇటీవలి కాలంలో సంస్థలు ఇలాంటి రెజ్యుమెలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. సీడీలో రెజ్యుమె: కాంపాక్ట్ డిస్క్(సీడీ)లో రెజ్యుమెను భద్రపర్చుకోవాలి. అవసరాన్ని బట్టి దాన్ని రిక్రూటర్‌కు పంపించాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు రెజ్యుమెను సీడీలో పంపించాలని కోరుతుంటాయి. కాబట్టి ముందుగానే ఇలాంటి సీడీని రూపొందించుకోవడం మేలు. సొంత వెబ్సైట్: ఆధునిక కాలంలో అన్ని సంస్థలకు వెబ్సైట్లు సర్వసాధారణంగా మారాయి. అభ్యర్థులు కూడా తమ పేరిట సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించుకోవాలి. ఇందుకోసం వెబ్సైట్ డెవలప్మెంట్లో కొంత శిక్షణ పొందాలి. ఇందులో మీకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపర్చాలి. కొలువు వేటలో ఉన్నవారికి ఇలాంటి సొంత వెబ్సైట్ ఉపయోగపడుతుంది. సంస్థలు అభ్యర్థి వెబ్‌సైట్‌ను పరిశీలించి, ఇంటర్వ్యూకు పిలిచేందుకు అవకాశాలుంటాయి. సామాజిక మాధ్యమాలు: ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థులకు తప్పనిసరిగా ఖాతా ఉండాలి. వాటిలో తమ పూర్తి ప్రొఫైల్‌ను పొందుపర్చాలి. రిక్రూటర్లు వీటిని చూసి, తమకు తగిన అభ్యర్థులను ఎంచుకుంటారు. -
కాగితం వినియోగ రహిత శాఖగా రైల్వే
ఐదేళ్లలోపు తీర్చి దిద్దుతామన్న కేంద్ర మంత్రి సదానంద సాక్షి, బెంగళూరు : రానున్న ఐదేళ్లలోపు రైల్వే శాఖను పూర్తిగా కాగితం వినియోగ రహిత శాఖగా మార్చలన్నది లక్ష్యమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. బెంగళూరులోని జనతా కో ఆపరేటివ్ బ్యాంక్ సువర్ణ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే అక్రమాలను కనిష్ట స్థాయికి నియంత్రించవచ్చునని అన్నారు. ఇకపై రైల్వే శాఖలో రూ. 25 లక్షలకు పైబడిన పనులన్నింటినీ ఈ-టెండర్ ద్వారా కేటాయించనున్నట్లు చెప్పారు. రైల్వేలో అక్రమాలను పూర్తిగా నియంత్రించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. అంతకు ముందు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... ఆర్థిక సంక్షోభం ప్రభావం మన దేశంపై పడకపోవడానికి సహకార రంగమే కారణమని అన్నారు. వందల ఏళ్లుగా దేశంలో సహకార రంగం పునాదులు గట్టిగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సి.ఎన్.అశ్వత్థనారాయణ, జనతా కో ఆపరేటివ్ బ్యాంక్ డెరైక్టర్ సి.ఎల్.మరిగౌడ, అధ్యక్షుడు పుట్టుస్వామి పాల్గొన్నారు. -
పట్టాలు అందుకున్న వేళ..
సరూర్‌నగర్: విద్యార్థుల్లో ఒక్కసారిగా ఆనందం తొణికిసలాడింది. పట్టాలు పుచ్చుకున్న వేళ ఎగిరి గెంతులేశారు. ఉల్లాసం ఉత్సాహంగా గడిపారు. ఫొటోలకు పోజులిచ్చారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఇందుకు మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వేదికైంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎం-ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన టీకేఆర్ విద్యార్థులకు పట్టాల పంపిణీకి శనివారం ‘గ్రాడ్యుయేషన్ డే’ను నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ హాజరై విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయొద్దు.. దేశంలో వనరులకు కొదవ లేదని, మోడ్రన్ టెక్నాలజీని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ సూచించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే అది మన పతనానికి దారి తీస్తుందన్నారు. క్రమశిక్షణ, నైతికతను పాటిస్తూ సమాజానికి యువత నూతన వనరులుగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కళాశాల కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, కోశాధికారి అమర్నాథ్రెడ్డి, డెరైక్టర్లు ఎస్ఆర్ రామస్వామి, వరప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు రవిశంకర్, పి.రామ్మోహన్రావు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త ‘షో’కులతో...
ఆధునిక పరిజ్ఞానంతో లేజర్ షో నగర చరిత్ర, సంస్కృతులకు పెద్దపీట రూ.3.5 కోట్లతో ఆధునిక హంగులు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ ప్రాంత చరిత్ర, సంస్కృతులను కళ్ల ముందుంచుతూ పర్యాటకుల మదిని దోచుకుంటున్న ‘లేజర్ షో’కు సరికొత్త అందాలు అద్దేందుకు హెచ్ఎండీఏ నడుం బిగించింది. లుంబినీ పార్కులో ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రదర్శిస్తున్న లేజర్ షో భాగ్యనగరానికేగాక మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు కూడా కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. దీన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న థీమ్‌కు కొత్తగా మరో 2 థీమ్స్‌ను జత చేసేందుకు రూ.3.5 కోట్ల అంచనాలతో సోమవారం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. టర్న్‌కీ ప్రాతిపదికన అయిదేళ్ల పాటు నిర్వహణ, మరమ్మతులతో పాటు మల్టీమీడియా లేజర్ షో రూపకల్పన, సరఫరా, స్థాపన, ప్రదర్శన చేపట్టాలన్న నియమ, నిబంధనలను గ్లోబల్ టెండర్లో ప్రతిపాదించినట్లు చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అధునాతనమైన వివిధ థీమ్‌లను అధ్యయనం చేశాక వాటి నమూనాల ఆధారంగానే లుంబినీ లేజర్ షో థీమ్ పార్కుకు పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు. త్వరలో అద్భుత లేజర్ టెక్నాలజీని పర్యాటకులకు పరిచయం చేస్తామని చెప్పారు. వైభవానికి చిహ్నంగా... ప్రధానంగా తెలుగు సంస్కృతి, వైభవం, హైదరాబాద్ ప్రాంతంలోని చారిత్రక వైశిష్ట్యాన్ని ప్రతిబింబించేలా రెండు సరికొత్త థీమ్‌లతో లేజర్ షోను పరిపుష్ఠం చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో పాటు నగర ప్రజానీకాన్ని సంతృప్తిపరిచే విధంగా కొత్త థీమ్‌లను రూపకల్పన చేయాలన్నది అధికారుల యోచన. చిన్నపిల్లలు, విద్యార్థులకు వినోదం, విజ్ఞానం పంచి ఇచ్చే కొత్త థీమ్‌లపై ఇప్పటికే కొంత అధ్యయనం చేసిన అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు హైదరాబాద్ ప్రాంత చరిత్ర, వారసత్వం, సంస్కృతిపై ఓ అవగాహన కల్పించేలా సరికొత్త థీమ్‌లను షోలో చేర్చాలని భావిస్తున్నారు. పర్యావరణం, పరిసరాల విజ్ఞానం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కొన్ని థీమ్‌లను చేర్చాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. కొత్త లేజర్ షో అందుబాటులోకి వచ్చే వరకు పర్యావరణ పరిరక్షణపై కొన్ని యానిమేషన్ చిత్రాలను ప్రదర్శించాలని యోచిస్తున్నారు. మార్పులకు అనుగుణంగా... లుంబినీ పార్కులో ప్రస్తుతం ప్రదర్శిస్తున్న లేజర్ షోలు ప్రధానంగా పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ వి.కృష్ణ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇది కొత్తగానే ఉంటుందనే భావనతో ఎనిమిదేళ్లుగా ఒకే థీమ్‌ను కొనసాగిస్తూ వచ్చామన్నారు. ఇప్పుడు సాంకేతికంగా, వైజ్ఞానికంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా లేజర్ షోలకు కొత్త హంగులు సమకూర్చాలని కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రధానంగా లేజర్స్, పౌంటెన్స్, ఫౌంటెన్లస్రీన్స్ వంటి వాటిని అంతర్జాతీయ స్థాయిలోతీర్చిదిద్దుతామన్నారు. సాగర్ తీరంలోకి అడుగిడే పర్యాటకుల కోసం సరికొత్త అందాలను ఆవిష్కరించాలన్నదే హెచ్ఎండీఏ యోచన అని ఓఎస్డీ చెప్పారు. -
పెట్టా... పుంజూ... మా లాంటి ఫ్యామిలీయే!
ఉత్త(మ)పురుష ఇప్పుడే మా శ్రీవారితో గొడవేసుకొని వచ్చి ఇంటి పెరట్లో నించున్నాను. పొదుపు చేసి ఉంచిన కొద్దిపాటి డబ్బుతో డైనింగ్ టేబుల్ కొందామని నేనన్నాను. కర్వ్ ఎల్ఈడీ అని ఏదో కొత్తగా వచ్చిందట. తిన్నగా ఉండక ఒంపు తిరిగి ఉంటుందట. అచ్చం ఆయన ఆలోచనల్లాగే. ‘ఎలాగూ ఇంట్లో ఏదో టీవీ ఉండనే ఉంది కదా’ అని నేనంటే... ‘మోడ్రన్ టెక్నాలజీని అందిపుచ్చుకునే తెలివితేటలు లేవు. ఎప్పుడూ పాత ఆలోచనలే’ అంటూ వెక్కిరించడంతో మనసు పాడైంది. దాంతో కాసేపు పెరట్లో ఉన్న జీవజాలాన్ని చూస్తూ నిల్చుంటేనైనా ప్రశాంతత ఏర్పడుతుందని అనిపించింది. పెరట్లో మా కోడిపెట్ట చుట్టూ కొన్ని బుజ్జి బుజ్జి కోడిపిల్లలు కీచుకీచుమంటూ తిరుగుతున్నాయి. మా పెట్ట ఏదో బెదురుగా చూస్తున్నట్లు ఉంటుంది. కళ్లన్నీ పిల్లలపైనే పెట్టుకుని ఉంటుంది. వెళ్తూ వెళ్తూ... ఎక్కడో కెక్కరించి కాస్త తవ్వగానే... పిల్లలన్నీ అక్కడికి చేరి తమ చిన్నారి ముక్కుల్తో పొడుస్తూ పొడుస్తూ ఉంటాయి. తిండి వెతకాలంటే కాళ్లతో ఇలా కెక్కరించాల్రా పిచ్చినాన్నల్లారా అంటున్నట్లుగా పెట్ట తిరుగుతూ ఉంటుందా... పుంజు ఇదేమీ పట్టనట్టు ధీమాగా ఉంటుంది. అదెప్పుడూ పిల్లలనేసుకుని తిరగ్గా నేను చూళ్లేదు. పైగా ఒక కాలూ, ఒక రెక్కా బారజాపి ఒళ్లు విరుచుకోవడం... ఏ పెంటకుప్పనో, ఏ గొడ్ల కొట్టం మీదికో ఎక్కి ఓ కూత కూసేసి... ఇక ఆ రోజుకు తన పనైపోయింది అన్నట్టుగా వ్యవహరించడం పుంజు నైజంలా అనిపించింది. దేవుడా... పెరట్లోకి తీసుకొచ్చావు. ఇక్కడా నా ఇంటి దృశ్యాన్నే మళ్లీ పుంజూ-పెట్టల రూపంలో చూపించాలా? మా అత్తగారికీ, మామగారికీ కాళ్లు అంతగా ఒంగవు. వయసైపోతోంది కదా... నేల మీద కూర్చుని తినాలంటే గతంలోలా కుదరడం లేదు. ఎంతో కష్టం మీద కూర్చుని... ఆపైన తినడం పూర్తయ్యాక లేవాలంటే మరెంతగానో కష్టపడుతున్నారు. ఇక మా పిల్లలిద్దరికీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోని తినడం సరదా. అందుకే ఉన్న ఆ కాసిన్ని డబ్బుల్నీ డైనింగ్ టేబుల్ అనే లేని ఐటమ్ కోసం వెచ్చిస్తే అందరూ సుఖంగా ఉంటారూ... తింటారు. కానీ కొత్త టీవీ తెచ్చినా పాత దృశ్యమే కదా. అయినా మా ఆయన పిచ్చిగానీ టీవీ మారగానే ప్రోగ్రాములు మారతాయా? చెబితే వినరు కదా. పెరట్లోని పుంజుకూ మా ఆయనకూ అట్టే తేడా లేదు. నోటికి ఏదొస్తే అది కూయడమే. పైగా ఆ కూత జాతినంతా ఉత్తేజపరిచే చైతన్య నినాదమని పోజొకటి. పుంజు కూడా బహుశా... ‘పనీ పాటా లేకుండా పెట్ట ఎప్పుడూ కాళ్లతో కెక్కరించి కిందనున్న మట్టిని కెలుకుతూ ఉంటుంది. అదలా మట్టిని కెలకగానే కోడిపిల్లలన్నీ అలాగే చేస్తాయి. నోటితో అవీ ఇవీ పడతాయి. అంతే... పాపం పెట్టదెప్పుడూ డైనింగ్టేబుల్ బుద్ధే. ఈ పెట్టలంతా ఇంతే!’అనుకుంటూ పెంటకుప్పనెక్కి కూస్తుంటుందేమో పెట్టను వెక్కిరిస్తూ. అందుకే మా శ్రీవారిని ఏమీ అనలేక పుంజును తిట్టుకుంటూ ఓ మాట అనుకున్నా... పెట్ట అంటే పెంపకాలకు... పుంజు అంటే మా ఆయన లాగే చేతలకు ఏ మాత్రం కాదు... అడ్డదిడ్డమైన ఆ పెంటకుప్పలెక్కి గొప్పల కోతలకూ... కారుకూతలకే అని. - వై! -
ఆధునిక పరిజ్ఞానంతో గాలింపు
గల్లంతైన విద్యార్థుల ఆచూకీకి కృషి ఎన్డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి బేగంపేట: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన నగర విద్యార్థుల ఆచూకీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పడుతున్నట్లు ఎన్డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. శనివారం బేగంపేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లార్జి డ్యామ్ కింది భాగంలోని మూడున్నర కిలోమీటర్ల పరిధిలో ఇక ఎలాంటి మృతదేహం ఉండే అవకాశం లేదని తమ సంస్థ నిపుణులు తేల్చిచెప్పినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం నుంచిప్రారంభించే సెర్చింగ్ ఆపరేషన్‌లో నౌకాదళానికి చెందిన అత్యాధునిక సైడ్ స్కాన్ సోనార్, జీఎంఆర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన లాడర్ అనే మరో స్కానింగ్ యంత్రం సాయంతో నది అడుగు భాగంలో జల్లెడ పట్టనున్నట్లు పేర్కొన్నారు. మెత్తం ఆపరేషన్‌లో తమ ఎన్డీఎంఏ టీమ్‌తో సహా మెత్తం 700 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. లార్జి డ్యామ్ కింద నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండో డ్యామ్ వరకు జల్లెడ పడుతున్నట్లు తెలిపారు. తీవ్ర వాతవరణ ప్రతికూలతల మధ్య విద్యార్థుల ఆచూకీ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వేదనను తాము అర్థం చేసుకుంటామని అయితే ప్రకృతి సహకరించక పోవడంతో తీవ్ర ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసు బృందం తిరుగు పయనం హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లా లార్జి డ్యామ్ వద్ద బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల గాలింపు చర్యల్లో పాలుపంచుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం నేడు తిరుగుపయనమైంది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే స్పందించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సహాయక చర్యల కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించిన విషయం తెలిసిందే. బాలనగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ నేతృత్వంలో వెళ్లిన పేట్‌బషీరాబాద్ ఏసీపీ ఎం.శ్రీనివాసరావు, దుండిగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బృందం ఘటనా స్థలంలో వారం రోజుల పాటు బాధిత విద్యార్థి కుటుంబాలకు ధైర్యం చెబుతూ సహాయ చర్యల్లో పాలు పంచుకున్నారు. విద్యార్థుల మృతదేహాలు వెలికి తీయడంలో అక్కడి అధికారులు, సిబ్బందికి తోడుగా నిలిచారు. వెలికి తీసిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం లోను, మృతదేహాలు హైదరాబాద్‌కు తరలించడంలో సహకరించారు. గ ల్లం తైన 24 మంది విద్యార్థుల్లో కేవలం 8 మంది విద్యార్థుల మృతదేహాలు మాత్రమే బయటపడగా.. ఇంకా 16 మంది ఆచూకీ కానరాలేదు. మృతదేహాలు వెలికి తీసేందుకు ఇంకా ఆధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వం భావించింది. దీంతో వారం రోజు నుంచి అక్కడే విధినిర్వహణలో నిమగ్నమైన సైబరాబాద్ పోలీసులు ఆదివారం తిరిగి రానున్నారు. మృతదేహాలు ఆలస్యంగా లభించే అవకాశాలు ఉన్నాయని బాలనగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ పేర్కొన్నారు. -
నంబర్ పాత్రలతో యానిమేషన్ చిత్రం
ప్రయోగాత్మక, చిత్రాలకిప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ తమిళ సినిమా, మరో అంతస్తుకు చేరుకుంటోంది. ఇటీవల తెరపైకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్లో రూపొంది అశేష అభిమానుల్ని అలరిస్తోంది. తాజాగా 029 అనే మరో యానిమేషన్ చిత్రం తమిళ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వడానికి సిద్ధం అవుతోంది. ఇది జీరో నుంచి తొమ్మిది అంకెల పేరుతో పాత్రలు తెరకెక్కించిన వినూత్న ప్రయోగాత్మక యానిమేషన్ చిత్రం. టీఎఫ్ఎస్ఎస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహిళా దర్శక నిర్మాత బి.నిషా తెరపై ఆవిష్కరించిన చిత్రం 029. ఇలా సంఖ్య పేర్లతో పాత్రల రూపకల్పన చేసి చిత్రం చేయడం అనేది ప్రపంచంలోనే తొలి ప్రయత్నం అవుతుంది. ఈ కథ ప్రేమ, రొమాన్స్, హాస్యం, యాక్షన్ అంటూ జనరంజక అంశాలన్నీ చోటు చేసుకుంటాయంటున్నారు. దర్శక నిర్మాత బి.నిషా. ఈమె చిత్రం గురించి మాట్లాడుతూ, 100 నుంచి 150 మంది సాంకేతిక నిపుణులు ఆరేడేళ్లు, రేయింబవ ళ్లు శ్రమించి రూపొందించిన చిత్రం 029 అని తెలిపారు. తమిళ సినిమాలో ఒక కొత్త ప్రయోగం చేశామన్నారు. ఫలితం ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రాన్ని ముఖ్యంగా పిల్లలకు నచ్చే విధంగా రూపొందించామన్నారు. పెద్దలు మెచ్చే విధంగా 029 యానిమేషన్ చిత్రం ఉంటుందన్నారు. 3డి యానిమేషన్లో రూపొందిన కోచ్చడయాన్ చిత్రం విశేష ప్రజాదరణ పొందుతోందన్నారు. ఆ చిత్ర మైలేజ్ తమ చిత్రానికి ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని దర్శక నిర్మాత బి.నిషా వ్యక్తం చేశారు. విజయ్ రమేష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మిరకిల్ పీటర్ యానిమేషన్‌ను రూపొందించారు. చిత్రాన్ని మిస్బా యాడ్ సంస్థ మార్కెటింగ్ చేయనుంది. -
పంచాయతీల్లో ఇకపై ఆన్లైన్
జిల్లాలో 187 క్లస్టర్లలో ప్రయోగాత్మకంగా అమలు రికార్డులన్నీ కంప్యూటరీకరణ మండల పరిషత్ కార్యాలయాలకు చేరిన కంప్యూటర్లు నూజివీడు, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యాలయాల్లో త్వరలో ఆన్లైన్ విధానం అందుబాటులోకి రానుంది. రోజురోజుకూ అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకు ని పంచాయతీరాజ్ సంస్థలను శక్తివంతం చేయడానికి ఆన్లైన్ విధానానికి పాలకులు శ్రీకారం చుడుతున్నారు. దీని అమలు కోసం జిల్లాలో పంచాయతీ లను 519 క్లస్టర్లుగా విభజించారు. వీటిలో 187 క్లస్టర్లలో మొదటి విడతగా దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వీటిలో ఈ వి ధానం విజయవంతమైతే మిగిలిన పంచాయతీ ల్లో కూడా అమలుచేస్తారు. ఈ-పంచాయతీ పేరుతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన కంప్యూటర్లు, పరికరాలు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలకు చేరాయి. ఈ వి ధానం అమలులోకి వస్తే పంచాయతీలకు సం బంధించి మనకు అవసరమైన సమాచారాన్ని ఎక్కడినుంచైనా తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆయా పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనుల వివరాలు, అవి ఏ దశల్లో ఉన్నా యో కూడా తెలుసుకోవచ్చు. ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటి వినియోగం తదితర అం శాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. పంచాయతీల్లో ఆన్లైన్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియను కార్వే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించి, 187 క్లస్టర్లలో ఆన్లైన్ వి ధానాన్ని అమలు చేస్తుంది. ఈ విధానంలో భాగంగా పంచాయతీల్లో ఉన్న జనన మరణాల నమోదు రిజిస్టర్, ఇంటిపన్నులు, లెసైన్స్ ఫీజులు, పనుల పర్యవేక్షణ, పం చాయతీలకు వచ్చిన గ్రాంట్ల వివరాలు, వేలం పాటలు, పంచాయతీ సిబ్బంది సమాచారం తది తర వివరాలన్నీ కంప్యూటరీకరణ చేసి ఆన్లైన్లో ఉంచుతారు. దీంతో అన్ని రకాల సేవలు పంచాయతీల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పంచాయతీలకు ఏ పద్దు కింద ఎంత నిధు లు వచ్చాయి.. వాటిని ఖర్చుచేసిన విధానం ఎలా ఉంది.. తదితర విషయాలన్నీ ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఈ విషయమై డీపీఓ ఆనంద్ ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, కంప్యూట ర్లతో పాటు సంబంధిత సామగ్రిని కూడా ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు పం పించామని చెప్పారు. త్వరలోనే ఈ విధానాన్ని అ మలు చేస్తామని పేర్కొన్నారు. -
స్మార్ట్’ సాగుతో రైతుకు లబ్ధి
రైతుల వివరాలు కంప్యూటరీకరణ ఆధార్ తరహాలో వారికి గుర్తింపు సంఖ్య పారదర్శకతతో అనర్హులకు నో చాన్స్ రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాల కోసం స్మార్ట కార్డు వినియోగం తప్పనిసరి సాక్షి, బెంగళూరు : అర్హులైన రైతులకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడానికి వీలుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోనుంది. ఇందుకోసం మే మొదటి వారంలో ‘కే-కిసాన్’ (కర్ణాటక కృషి సమాచార సేవలు, నెట్వర్కింగ్) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా మొదట రాష్ట్రంలోని ప్రతి తాలూకా కేంద్రంలో ఉన్న వ్యవసాయ కార్యాలయాలను కంప్యూటరీకరిస్తారు. అనంతరం ఆయా కేంద్రాలకు వచ్చే రైతుల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేస్తారు. ఇందులో రైతు ఫోన్ నంబర్, రైతుకు చెందిన భూ విస్తీర్ణం తదితర వివరాలతో పాటు నేల రకాన్ని కూడా పొందుపరుస్తారు. అనంతరం రైతు గత ఐదేళ్లుగా పండిస్తున్న పంట రకాలను కూడా నమోదు చేస్తారు. రెండోదశలో రాష్ట్రంలోని 747 హోబళీ పరిధిలోని గ్రామాల్లో ఉన్న రైతుల వివరాలను రైతు సంపర్క కేంద్రాల్లో నమోదు చేసుకుని తాలూకా వ్యవసాయ కార్యాలయం, ఆయా జిల్లా వ్యవసాయ క్యార్యాలయాలకు అనుసంధానం చేస్తారు. అటుపై రాష్ట్రంలోని ప్రతి రైతు, కౌలురైతు వ్యక్తిగత, పంట వివరాలన్నీంటినీ బెంగళూరులోని కేంద్ర కార్యాలయంలోని కంప్యూటర్ డాటాబేస్‌తో అనుసంధానం చేస్తారు. దీని వల్ల రాష్ట్రంలోని ఉన్న రైతుల, కౌలు రైతుల సంఖ్య, వ్యవసాయ భూమి విస్తీర్ణంపై ఖచ్చితమైన సమాచారం లభ్యమవుతుంది. వివరాలన్నింటినీ క్రోడికరించిన తర్వాత ప్రతి రైతు, కౌలు రైతుకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. ఒకరికి కేటాయించిన సంఖ్య ఎట్టి పరిస్థితుల్లో మరొకరికి కేటాయించరు. అటుపై ఈ సంఖ్యతో పాటు ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డ్‌ను రైతులకు అందజేస్తారు. పారదర్శకత పెరిగే అవకాశం... ప్రస్తుత విధానంలో వ్యవసాయ రుణం మంజూరు చేయడంతో పాటు రుణమాఫీ, సబ్సిడీపై విత్తనాల వితరణలు చాలా వరకూ అర్హులకు దక్కడం లేదు. రైతులకు స్మార్ట్ కార్డులు అందించిన తర్వాత రుణాలు, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇచ్చే సమయంలో తప్పక ఆ కార్డును వినియోగించాల్సి ఉంటుంది. కార్డుపై ప్రత్యేక సంఖ్యతో పాటు ఎలక్ట్రానిక్ చిప్ ఉండటం వల్ల ప్రభుత్వం నుంచి ఒకరికి అందాల్సిన సంక్షేమ ఫలితాలు మరొకరు పొందడానికి వీలు పడదు. ఏ పంటకు రాష్ట్రంలోని ఏ మార్కెట్లో ఉత్తమ ధర దొరుకుతోందనే విషయాన్ని రైతులకు ఎస్.ఎం.ఎస్ రూపంలో కూడా పంపించడానికి వీలవుతుంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... ‘పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇప్పటికే ఇటువంటి ప్రక్రియ అమలు దశలో ఉంది. కే-కిసాన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. మే మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించి మూడు నాలుగు నెలల్లోపు పూర్తి చేస్తాం’ అని పేర్కొన్నారు. -
1..15..551
ఓటర్లకు పార్టీల గాలం మొదలైన బల్క్ ఎస్ఎంఎస్ల జోరు కేసులు తప్పవంటున్న పోలీసులు సాక్షి,సిటీబ్యూరో: ఇదేంటి లెక్క అనుకుంటున్నారా..? ఏమి లేదు.. ‘మేం ఒక ఎస్ఎంఎస్ పంపిస్తాం..దాన్ని 15 మందికి పంపించాలి..అలా చేస్తే రూ.551 రీచార్జీ ఫ్రీ’ అంటూ ఆయా పార్టీలు ఓటర్లకు గాలం వేస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో పార్టీలు కూడా ఓటర్ల సెల్‌నెంబర్లు సేకరించి ఈ నయా ప్రచారం ప్రారంభించాయి. ‘పలానా పార్టీ నాయకుడికి ఓటేయండి’ అని ఎస్ఎంఎస్ల ద్వారా ఎన్నికల ప్రచారం శనివారం నుంచి మొదలైందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమరం ఈసారి రసవత్తరంగా సాగుతుండడంతో అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొత్తదారులను ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే ఇంటింటికి తిరుగుతున్న పార్టీ నేతలు, సెల్ఫోన్ల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. నామినేషన్ల ఘట్టం ఓ పక్క జోరుగా సాగుతుండగానే మరోపక్క వివిధ పార్టీలు బల్క్ ఎస్ఎంఎస్ల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. వీటిని నమ్ముతున్న కొందరు ఇప్పటికే ఎస్ఎంఎస్లు చేసినట్లు సమాచారం. పోలీసుల కన్ను : బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పోలీసులు అంటున్నారు. ఇలాంటి వాటిపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్లపై దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసేందుకు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఇది కూడా ఒకరకమైన ఎన్నికల నిబంధన ఉల్లంఘనేనని..ఎస్ఎంఎస్లు ప్రచారం చేస్తే సెల్‌కు రీచార్జీ చేస్తామనడం నేరంగా పరిగణిస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. చర్యలు తీసుకుంటాం.. ఇలాంటి ఎస్ఎంఎస్లు చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టే. డబ్బులకు ఆశపడి ఇలాంటి ఎస్ఎంఎస్లను ఇతరులకు పంపిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. వివరాలను పోలీసులకు అందిస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. - అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ -
భూ సర్వే కోసం రూ. 900 కోట్లు రిజర్వు
= 1800 మంది సర్వేయర్ల నియామకం = రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాసప్రసాద్ కోలారు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో భూ సర్వే చేయడానికి రూ. 900 కోట్లు రిజర్వు చేశామని, ఇందులో రూ. 90 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి వి శ్రీనివాసప్రసాద్ అన్నారు. బుధవారం శ్రీనివాసపురం పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వివిధ పథకాలకు సంబంధించిన లబ్దిదారులకు ప్రమాణ పత్రాలు అందజేసి మాట్లాడారు. రెవెన్యూలో పలు సమస్యలు ఉన్నాయని, సర్వేయర్ల కొరత వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, ఈ నేపథ్యంలో సీఅండ్‌ఆర్ (క్యాడర్ అండ్ రిక్రూట్మెంట్ రూల్స్) ద్వారా 1800 మంది సర్వేయర్ల నియమించి శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్ర భూ ప్రదేశాన్ని సర్వే చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సర్వేయర్ల కొరత ఏర్పడితే లెసైన్సు కలిగిన ప్రైవేటు సర్వేయర్లను ఎంపిక చేసుకుని సర్వే పనులకు వినియోగించుకుంటామన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అదాలత్‌లను నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా శ్రీనివాసపురం పట్టణంలో మిని విధానసౌధ నిర్మాణానికి రూ. 5 కోట్లు విడుదల చేశామన్నారు. కేంద్రమంత్రి కేహెచ్ మునియప్ప మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. బయలు సీమ జిల్లాలో ఏర్పడిన నీటి సమస్య నివారణకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య సిద్దరామయ్య చొరవ చూపాలన్నారు. శ్రీనివాసపురంలో త్వరలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతందని, దీనికి రూ. 1500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, జెడ్పీ అధ్యక్షుడు తూపల్లి నారాయణస్వామి, కలెక్టర్ డీకే రవి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రమేష్‌కుమార్ ఆక్రోశం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ స్పీకర్, ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. మంత్రలందరూ గౌరవనీయులంటే తాను ఒప్పుకొనేది లేదన్నారు. నేటి రాజకీయాలు కలుషితమవుతున్నాయని, పైరవీలు చేసే వాళ్లు, ధనవంతులకే అవకా శాలు వస్తున్నాయన్నారు. ఇదిలా ఉంటే తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతోనే రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. -
ఆధునీకరణకు ఆసుపత్రులు సై..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆధునిక టెక్నాలజీకి పెద్ద పీటవేస్తూ నాణ్యమైన వైద్య సేవలందించే ఆసుపత్రులే భవిష్యత్తులో నిలదొక్కుకుంటాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నిపుణులైన వైద్యులతోపాటు ఆధునిక ఉపకరణాలను సమకూర్చుకున్న ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవడానికి రోగులు మొగ్గు చూపుతున్నారట. దీనికితోడు ఆసుపత్రుల మధ్య తీవ్ర పోటీ నెలకొంటోంది. ఇంకేముంది మార్కెట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వైద్య చికిత్సలో ఉపయోగించే, అలాగే రోగ నిర్ధారణ పరీక్షలకు వాడే ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, హిమోడైనమిక్ రికార్డింగ్, సర్జికల్ ఇమేజింగ్, వార్మర్ వంటి ఉపకరణాల మార్కెట్ పరిమాణం ప్రస్తుతం భారత్‌లో సుమారు రూ. 4,340 కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 7 నుంచి 10 శాతం ఉంది. ప్రైవేటు ఆసుపత్రులే ముందు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో దేశంలో ప్రైవేటు ఆసుపత్రులే ముందుంటున్నాయి. మొత్తం మార్కెట్లో 70 శాతం వాటా ఈ ఆసుపత్రులదే. మెట్రో, అగ్రశ్రేణి నగరాల్లోని పెద్ద ఆసుపత్రులు కొత్త టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నాయని జీఈ హెల్త్‌కేర్ లైఫ్‌కేర్ సొల్యూషన్స్ విభాగం దక్షిణాసియా డెరైక్టర్ అశుతోష్ బెనర్జీ తెలిపారు. లల్లబాయ్ వార్మర్ ప్రైమ్ ఉపకరణాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ప్రజల్లో కూడా ఉపకరణాలపట్ల అవగాహన పెరుగుతోంది. కావాల్సిన సౌకర్యాలున్న ఆసుపత్రికే వెళ్తున్నారని చెప్పారు. నవజాత శిశువుల సంరక్షణకు ఉపయోగించే వార్మర్లు దేశవ్యాప్తంగా ఏటా 15,000 అమ్ముడవుతున్నాయని వివరించారు. మొత్తం ఉపకరణాల మార్కెట్లో 40 శాతం వాటాతో జీఈ తొలి స్థానంలో ఉన్నట్టు చెప్పారు. దేశంలో ఫిలిప్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సీమెన్స్, ఎరిక్సన్ వంటి కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ. నైపుణ్యానికి టెక్నాలజీ తోడు..: ప్రపంచంలో వస్తున్న అధునాతన టెక్నాలజీని పరిశీలించి, సూచనలిచ్చేందుకు అంతర్జాతీయ పరిశోధనా విభాగాన్ని అపోలో హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకుంది. ఉపకరణాల కొనుగోలుకు ఏటా రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఈడీ సంగీతా రెడ్డి తెలిపారు. రోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అందుబాటు ధరలో వైద్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. నిపుణులైన వైద్యులకు టెక్నాలజీ తోడైతే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయని రెయిన్బో హాస్పిటల్స్ ఎండీ రమేష్ కంచర్ల తెలిపారు. కొత్త టెక్నాటజీ వినియోగంలో తమ ఆసుపత్రి ఎప్పుడూ ముందుంటుందని, ఏటా సుమారు రూ.10 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. ధర నియంత్రించాలి.. ఉపకరణాల ధరలు ఖరీదుగా ఉండడం వల్లే చికిత్సల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటోందని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. వీటి ధరలు దిగివస్తే సామాన్యులకూ నాణ్యమైన సేవలు చేరతాయని కామినేని హాస్పిటల్స్ ఎండీ కామినేని శశిధర్ తెలిపారు. ‘తక్కువ ధరకే వైద్యం అందించాలని ప్రభుత్వం అంటోంది. అదే ఉపకరణాల ధర విషయంలో మాత్రం దేశంలో నియంత్రణ లేకుండా పోయింది. ఉదాహరణకు గత ఏడాది రూ.1 కోటి ఉన్న ఉపకరణం ధర కాస్తా ఏడాదిలో సగానికి పడిపోతుంది. ఈలోపు మరో కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వస్తుంది. మొత్తంగా తయారీ కంపెనీలు ఆసుపత్రులతో ఆటలాడుకుంటున్నాయి’ అని అన్నారు. కాగా, టెక్నాలజీ కోసం కామినేని ఆసుపత్రులు ఏటా రూ.30 కోట్లదాకా వ్యయం చేస్తున్నాయి.