సాక్షి, న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతకు మరింతగా వినియోగించుకుంటూ కింది స్థాయి న్యాయస్థానాలను ‘టెక్–ఫ్రెండ్లీ’గా తయారుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. గురువారం ఆరి్టకల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కింది కోర్టులు సాంకేతిక పుంజుకోవాల్సిన అవసరం ఉందంటూ చేసిన వాఖ్యపై సీజేఐ స్పందించారు.
కోవిడ్ కష్టకాలంలో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతిరోజూ నడపాల్సి వచి్చందని గుర్తుచేశారు. ఈ–కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు కేంద్రం కేటాయించిన భారీ బడ్జెట్ కారణంగా న్యాయవ్యవస్థ ముఖ్యంగా కింది కోర్టుల్లో సాంకేతిక పుంజుకొంటుందని సీజేఐ ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయస్థానాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఇతోధిక నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అత్యంత ముఖ్యమైనదని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment