Jammu Kashmir: ఆర్టికల్‌ 370 రద్దు సబబే | Jammu Kashmir: Supreme Court historic judgment upheld the abrogation of Article 370 | Sakshi
Sakshi News home page

Jammu Kashmir: ఆర్టికల్‌ 370 రద్దు సబబే

Published Tue, Dec 12 2023 1:36 AM | Last Updated on Tue, Dec 12 2023 1:36 AM

Jammu Kashmir: Supreme Court historic judgment upheld the abrogation of Article 370 - Sakshi

సోమవారం తీర్పు వెలువరిస్తున్న ధర్మాసనం సభ్యులు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సూర్యకాంత్‌

ఆర్టికల్‌ 370పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పంచిన ఈ ఆర్టికల్‌ ను రద్దు చేయడం సబబేనని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ ఏకగ్రీవంగా మూడు తీర్పులు వెలువరించింది. ఆర్టికల్‌ 370 తాత్కాలిక ఏర్పాటేనని, దాని రద్దుకు రాష్ట్రపతికి పూర్తి అధికారాలున్నాయని  స్పష్టం చేసింది. లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని సమరి్థంచింది.

జమ్మూ కశ్మీర్‌కు తక్షణం రాష్ట్ర హోదాను పునరుద్ధరించి సెప్టెంబర్‌ 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించా లని కేంద్రాన్ని ఆదేశించింది. కశ్మీర్లో మానవ హక్కుల హననంపై స్వతంత్ర కమిషన్‌ ఆధ్వర్యంలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటూ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ విడి తీర్పు వెలువరించారు. కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు సహేతుక కారణాలు ఉండి తీరాల్సిందేనని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పు చరిత్రాత్మకమంటూ మోదీ ప్రస్తుతించారు. ఆరెస్సెస్, బీజేపీ ఈ తీర్పును స్వాగతించగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు భిన్నంగా స్పందించాయి.


న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్‌ను రద్దు చేయడం సబబేనని స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముక్త కంఠంతో సమరి్థంచింది. 370 ఆర్టికల్‌ రద్దు తాలూకు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది.

సోమవారం ఈ మేరకు ఏకగ్రీవంగా మూడు తీర్పులు వెలువరించింది. ఆర్టికల్‌ 370 కేవలం ఓ తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, దాన్ని రద్దు చేసే పూర్తి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయని సీజేఐ స్పష్టం చేశారు. ఈ మేరకు తనతో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌ తరఫున ఆయన 352 పేజీల మెజారిటీ తీర్పు వెలువరించారు.

లద్దాఖ్‌ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం కూడా సబబేనని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి. 2024 సెపె్టంబర్‌ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి’’ అని కేంద్రాన్ని సీజేఐ ఆదేశించారు.

ఈ తీర్పును సమరి్థస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ 121 పేజీలతో విడిగా తీర్పు ఇచ్చారు. ఈ రెండు తీర్పులతోనూ పూర్తిగా ఏకీభవిస్తూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కూడా మరో తీర్పు వెలువరించారు. ఈ తీర్పును కేంద్రంలో మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. ప్రధానితో పాటు బీజేపీ తీర్పును సమర్థించగా పలు పార్టిలతో పాటు పలువురు నేతలు వ్యతిరేకించారు.

ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేయలేరు
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్‌ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. రాష్ట్ర హోదా రద్దు చేసి దాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ అనంతరం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సెపె్టంబర్‌ 5న తీర్పును రిజర్వు చేసింది.

ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యంగ ఆదేశం (సీఓ) 272లో జమ్మూ కశ్మీర్‌కు రాజ్యాంగంలోని అన్ని విధి విధానాలనూ వర్తింపజేశారు. ఆర్టికల్‌ 370లో పేర్కొన్న రాజ్యాంగ అసెంబ్లీ అనే పదాన్ని అసెంబ్లీగా మార్చారు. ఈ నిర్ణయాల చెల్లుబాటుపై ధర్మాసనం ప్రధానంగా విచారణ జరిపింది. జమ్మూ కశ్మీర్‌ విషయమై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేయజాలరని తీర్పులో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

స్వాతంత్య్రానంతరం అది భారతదేశంలో సంపూర్ణంగా విలీనమై అంతర్భాగంగా మారిందనడంలో ఏ సందేహానికీ తావులేదని స్పష్టం చేశారు. ‘‘ఆర్టికల్‌ 1 ప్రకారమే గాక ఆర్టికల్‌ 370ని బట్టి చూసినా జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే. అలాంటప్పుడు దానికి ప్రత్యేక సార్వ¿ౌమాధికారమంటూ ఏమీ ఉండబోదు. హక్కుల విషయంలోనూ మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే. అంతే తప్ప ప్రత్యేకతేమీ ఉండబోదు’’ అని పునరుద్ఘాటించారు.

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామన్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రకటించిన నేపథ్యంలో దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం ఆర్టికల్‌ 3 ప్రకారం సరైందో కాదో తేల్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్‌ 370 (1) (డి) కింద తనకున్న అధికారాలను వినియోగించేందుకు (నాటి) జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వ అంగీకారం తీసుకోవడం రాష్ట్రపతికి తప్పనిసరేమీ కాదని పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్‌ రాజ్యాంగ అసెంబ్లీ అనుమతి లేకుండా ఆర్టికల్‌ 370కి ఎలాంటి మార్పుచేర్పులూ చెల్లుబాటు కావని, రాజ్యాంగ అసెంబ్లీ 1957లోనే రద్దయినందున ఆర్టికల్‌ 370 శాశ్వతత్వం సంతరించుకుందని పిటిషనర్లు చేసిన వాదనను పూర్తిగా అసంబద్ధమన్నారు. అది కేవలం తాత్కాలిక ఏర్పా టేనని రాజ్యాంగంలోని పలు నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. దాన్ని రాజ్యాంగంలోని 21వ భాగంలో పొందుపరిచేందుకు కూడా అదే కారణమని వివరించారు.
 
సార్వభౌమత్వం ఉండదు
ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు అంతర్గత సార్వ¿ౌమత్వం ఉంటుందన్న వాదనను కూడా ధర్మాసనం తోసిపుచి్చంది. 1947లో విలీనం సందర్భంగా రక్షణ, విదేశాంగ, సమాచార అంశాల్లో మాత్రమే జమ్మూ కశ్మీర్‌ సార్వ¿ౌమాధికారాలను భారత ప్రభుత్వానికి నాటి రాజు హరిసింగ్‌ వదులుకున్నారన్న వాదనను కూడా కొట్టిపారేసింది. కేంద్రంతో ఇలాంటి ప్రత్యేక నిబంధనలున్న ఇతర రాష్ట్రాలు కశ్మీర్‌ను ఉదాహరణగా చూపుతూ తమకూ అంతర్గత సార్వ¿ౌమత్వముందని వాదిస్తే పరిస్థితేమిటని సీజేఐ ప్రశ్నించారు.

మన అసౌష్టవ సమాఖ్య వ్యవస్థ స్వభావం ప్రకారం కొన్ని రాష్ట్రాలకు మిగతా వాటితో పోలిస్తే కొన్ని విషయాల్లో కాస్త స్వయం ప్రతిపత్తికి ఆస్కారముందని గుర్తు చేశారు. ‘‘భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా ఔదలదాలుస్తూ 1949 నవంబర్‌ 25న కశ్మీర్‌ విలీన ఒప్పందాన్ని దాని యువరాజు కరణ్‌సింగ్‌ బేషరతుగా ఆమోదించడంతోనే అది పూర్తిగా దేశంలో కలిసిపోయింది.

కనుక జమ్మూ కశ్మీర్‌కు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎప్పుడూ ఏ విధమైన అంతర్గత సార్వభౌమత్వమూ లేదు, ఉండబోదు. అక్కడి ప్రజలకూ ఇదే వర్తిస్తుంది’’ అన్నారు. ‘‘రెండు కారణాలతో ఆర్టికల్‌ 370 తెరపైకి వచి్చంది. ఒకటి జమ్మూ కశ్మీర్లో రాజ్యాంగ అసెంబ్లీ కొలువుదీరేదాకా దాకా అది మధ్యంతర ఏర్పాటుగా పని చేసింది. అలాగే నాడు అక్కడ నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాటుగా కూడా ఆర్టికల్‌ 370ని తీసుకొచ్చారు. అది శాశ్వతమేమీ కాదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది’’ అని స్పష్టం చేశారు. సెపె్టంబర్‌ 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సీజేఐ సూచించారు.

కశ్మీర్లో మానవ హక్కుల హననంపై నిష్పాక్షిక దర్యాప్తు: జస్టిస్‌ కౌల్‌
సీజేఐ వెలువరించిన మెజారిటీ తీర్పుతో ఏకీభవిస్తూ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ విడిగా తీర్పు వెలువరించారు. దశలవారీగా కశ్మీర్‌ను అభివృద్ధి తదితర అన్ని అంశాల్లోనూ ఇతర రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్లడమే ఆర్టికల్‌ 370 ఉద్దేశమని స్పష్టం చేశారు. దాని రద్దు పూర్తిగా సబబేనని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌కు తగిలిన గాయాలు మానాల్సిన అవసరముందని జస్టిస్‌ కౌల్‌ తన తీర్పులో అభిప్రాయపడ్డారు.

1980ల నుంచి అక్కడ ప్రభుత్వపరంగా, ఇతరత్రా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. అప్పటి దారుణాలపై అది నిష్పాక్షికంగా పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక సమరి్పంచాలన్నారు. కశ్మీర్‌ జస్టిస్‌ కౌల్‌ స్వస్థలం. ఈ నేపథ్యంలో తీర్పులో ఒక చోట ‘కశ్మీరీలమైన మేము’ అని కూడా ఆయన పేర్కొన్నారు. ‘‘1947 నుంచీ దశాబ్దాల పాటు కశ్మీరీలు వేర్పాటు, ఉగ్రవాదాల బాధితులుగా ఉంటూ వస్తున్నారు.

దాంతో తొలుత కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను ఇతర దేశాలు ఆక్రమించాయి. 1980ల్లో వేర్పాటువాదం లోయలో కల్లోలం సృష్టించింది. అది వలసలకు దారి తీసింది. అవి స్వచ్చంద వలసలు కావు. సరిహద్దుల ఆవలి నుంచి వచ్చి పట్ట మతిలేని మతోన్మాదాన్ని తాలలేక కశ్మీరీ పండిట్లు ప్రాణాలు కాపాడుకునేందుకు విధి లేక ఇల్లూవాకిలీ విడిచి మూకుమ్మడిగా వలస వెళ్లారు. దాంతో కశ్మీర్‌ తాలూకు సాంస్కృతిక విలువలే సమూలంగా మారిపోయాయి.

దేశ సమగ్రత, సార్వ¿ౌమత్వమే ప్రమాదంలో పడి సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విదేశీ చొరబాట్లను అరికట్టి దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించేందుకు సైన్యం చేపట్టిన చర్యలతో పరిస్థితులు మరో మలుపు తీసుకున్నాయి. తర్వాతి పరిణామాల్లో ఆడ, మగ, చిన్నా, పెద్దా అందరూ భారీ మూల్యం చెల్లించాల్సి వచి్చంది. మూడు దశాబ్దాలు దాటినా నాటి అన్యాయాలను సరిదిద్దలేదు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అక్కడ పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు కశ్మీర్‌ తాలూకు సామాజిక నిర్మాణాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. తద్వారా కశ్మీరీలు సహనశీలత, పరస్పర గౌరవం సహజీవనం సాగించేలా చూడాలి’’ అని పేర్కొన్నారు.  

గట్టి కారణాలుంటేనే యూటీలు: జస్టిస్‌ ఖన్నా
రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఈ చర్య విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. సమాఖ్య తత్వానికి అడ్డంకిగా మారుతుంది. ప్రజలకు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకుండా చేస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. అందుకే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలంటే అందుకు సహేతుకమైన గట్టి కారణాలు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3లో పొందుపరిచిన నియమ నిబంధలను పూర్తిగా అనుసరిస్తూ మాత్రమే అందుకు పూనుకోవాలని సూచించారు. ఆర్టికల్‌ 370 అంశంపై వెలువరించిన విడి తీర్పులో జస్టిస్‌ ఖన్నా ఈ మేరకు పేర్కొన్నారు. దాని రద్దు సబబేనంటూ సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ వెలువరించిన తీర్పులతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. ఆర్టికల్‌ 370కి శాశ్వత లక్షణం లేదని స్పష్టం చేశారు. ‘‘ఈ మేరకు సీజేఐ, జస్టిస్‌ కౌల్‌వెలువరించిన తీర్పులు గొప్ప పరిణతితో కూడుకున్నవి. సంక్లిష్టమైన న్యాయపరమైన అంశాలను సరళంగా వివరిస్తూ సాగాయి’’ అని ప్రస్తుతించారు.  

అంతిమ అధికారం కేంద్రానిదే
ప్రజాస్వామ్యం, సమాఖ్య తత్వం మాన రాజ్యాంగపు మౌలిక లక్షణాలైనా కొన్ని నిర్దిష్ట ఏకస్వామ్యపు లక్షణాలు కూడా అందులో ఇమిడే ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘వాటి ప్రకారం ఏ విషయంలోనైనా అంతిమంగా నిర్ణాయక అధికారాలు కేంద్రానికే దఖలు పడ్డాయి. కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు వంటివి వాటిలో భాగమే’’ అని సీజేఐ వివరించారు. ‘‘కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల విభజన, వాటి అమలులో రాష్ట్రాలకు ఇచ్చిన స్వతంత్రం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేవే. అయితే పలు కారణాల దృష్ట్యా రాష్ట్రంగా మనుగడ సాగించలేవని భావించిన ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే సంపూర్ణ అధికారాలు కేంద్రానికి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

ఏమిటీ ఆర్టికల్‌ 370?
► ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉంటుంది.
► ప్రత్యేక రాజ్యాంగం, రాష్ట్ర పతాకం ఉంటాయి.
► అంతర్గత పాలన విషయంలో పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.
► కశ్మీర్‌పై భారత సార్వభౌమాధికారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల వరకే పరిమితం.
► ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్మూ కశ్మీర్‌లో ఆస్తులు, భూములు కొనుగోలు చేయలేరు.
► ప్రజల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం మిగతా ప్రాంతాల వారికంటే భిన్నంగా ఉంటుంది.
► అక్కడ ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అధికారం కేంద్రానికి లేదు.
► రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్లు మినహా ఇతర చట్టాల అమలుకు అక్కడి రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి.
► ఆర్టికల్‌ 370ని సవరించే, రద్దు చేసే అధికారం రాజ్యాంగ అసెంబ్లీకి ఉంది.
► కానీ రాజ్యాంగ అసెంబ్లీయే 1957లో రద్దయిపోయింది.
► దాంతో ఆర్టికల్‌ 370 రాజ్యాంగంలో శాశ్వత భాగమైయిందని, దాని రద్దు అధికారం కేంద్రానికి లేదని అక్కడి పారీ్టలు వాదిస్తూ వస్తున్నాయి.
 

అమలు నుంచి రద్దు దాకా...
1947 అక్టోబర్‌ 26:  భారతదేశ విభజన తర్వాత జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర దేశంగా ఉండడానికే మహారాజా హరిసింగ్‌ మొగ్గు చూపారు. భారత్‌లో గానీ, పాకిస్తాన్‌లో గానీ విలీనం కాబోమని ప్రకటించారు. ఇంతలో పాకిస్తాన్‌ సైన్యం అండతో అక్కడి గిరిజనులు జమ్మూకశ్మీర్‌పై దండెత్తారు. మహారాజా హరిసింగ్‌ భారత ప్రభుత్వ సహకారాన్ని కోరారు. భారత్‌లో విలీనానికి అంగీకరించారు. కొన్ని షరతులతో విలీన ఒప్పందంపై సంతకం చేశారు.
1949 మే 27:  రాజ్యాంగాన్ని రూపకల్పనకు ఏర్పాటైన రాజ్యాంగ సభ విలీన ఒప్పందం ప్రకారం ఆర్టికల్‌ 370 ముసాయిదాను ఆమోదించింది.  
1949 అక్టోబర్‌ 17: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తూ ఆర్టికల్‌ 370ని భారత రాజ్యాంగంలో చేర్చారు.  
1951 మే 1: జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ రాజకుమారుడు డాక్టర్‌ కరణ్‌ సింగ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.  
1952:  ఇండియా, జమ్మూకశ్మీర్‌ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ‘ఢిల్లీ అగ్రిమెంట్‌’పై భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, జమ్మూకశ్మీర్‌ ప్రధానమంత్రి షేక్‌ అబ్దుల్లా సంతకం చేశారు.  
1954 మే 14:  రాష్ట్రపత్తి ఉత్తర్వు మేరకు ఆర్టికల్‌ 370 అమల్లోకి వచ్చింది.  
1954 మే 15:  జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసితుల హక్కుల విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలకు రక్షణ కలి్పంచడానికి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ‘ఆర్టికల్‌ 35ఏ’ను భారత రాజ్యాంగంలో చేర్చారు.  
1957 నవంబర్‌ 17:  జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగాన్ని ఆమోదించారు.  
1958 జనవరి 26:  జమ్మూకశ్మీర్‌కు సొంత రాజ్యాంగం అమల్లోకి వచి్చంది.  
1965:  జమ్మూకశ్మీర్‌లో ప్రధానమంత్రి, సదర్‌–ఇ–రియాసత్‌ పదవులను ముఖ్యమంత్రి, గవర్నర్‌గా అధికారికంగా మార్చారు.  
2018 డిసెంబర్‌ 20:  జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.  
2019 జూలై 3:  రాష్ట్రపతి పాలనను మరోసారి పొడిగించారు.  
2019 ఆగస్టు 5:  ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.  
2019 ఆగస్టు 6:  ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ అడ్వొకేట్‌ ఎం.ఎల్‌.శర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తర్వాత మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.
2019 ఆగస్టు 9:  జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ చట్టం–2019ను పార్లమెంట్‌ ఆమోదించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
2019 సెప్టెంబర్‌ 19:  ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.  
2023 ఆగస్టు 2:  పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ మొదలైంది.
2023 సెపె్టంబర్‌ 5:  మొత్తం 23 పిటిషన్లపై ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తుది తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.  
2023 డిసెంబర్‌ 11:  ఆర్టికల్‌ 370 రద్దును సమరి్థస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. 2024 సెప్టెంబర్‌ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.  

చరిత్రాత్మక తీర్పు
ఆరి్టకల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం. ఇదొక చరిత్రాత్మక తీర్పు. ఇది కేవలం న్యాయపరమైన తీర్పుకాదు. భవిష్యత్తు తరాలకు ఒక ఆశాదీపం. మెరుగైన భవిష్యత్తుకు వాగ్దానం. మరింత బలమైన, ఐక్య భారత్‌ను నిర్మించుకొనే విషయంలో మన సమ్మిళిత కృషికి మద్దతుగా నిలుస్తుంది.  జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌లోని మన సోదర సోదరీమణుల ప్రగతి, ఐక్యత, ఆశను ప్రతిధ్వనించే తీర్పు ఇది. వారి కలలను నెరవేర్చే విషయంలో మన అంకితభావం చెదిరిపోనిది. భారతీయులుగా మనం గర్వపడే మన ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చింది. ఆరి్టకల్‌ 370 వల్ల నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ప్రగతి ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష
– ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  

 
కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం  
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో జమ్మూకశీ్మర్‌లో శాంతి నెలకొంది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు హింసను అనుభవించిన ప్రజలు  ప్రస్తుతం శాంతియుతంగా జీవిస్తున్నారు. వారి జీవితాల్లో అభివృద్ధికి కొత్త నిర్వచనం వచ్చిచేరింది. జమ్మూకశీ్మర్‌లో పర్యాటకం, వ్యవసాయ రంగాలు వెలిగిపోతున్నాయి.
– అమిత్‌ షా, కేంద్ర హోంశాఖ మంత్రి  
 

ప్రతీ భారతీయుడి మదిలో సంతోషం
ఆరి్టకల్‌ 370, ఆరి్టకల్‌ 35ఏను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచింది. ఈ చరిత్రాత్మక నిర్ణయంతో ప్రతీ భారతీయుడి మదిలో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ ఒక కొత్త అధ్యాయం లిఖించారు.
– రాజ్‌నాథ్‌ సింగ్, రక్షణ శాఖ మంత్రి  
 
ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్తు  
జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌ ప్రజల ఉజ్వలమైన భవిష్యత్తుకు సుప్రీంకోర్టు తీర్పు నాంది పలికింది. అభివృద్ధిని వారికి చేరువ చేయడానికి మోదీ సర్కారు కృషి చేస్తూనే ఉంటుంది. న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు ఇచి్చంది. అభివృద్ధి, సుపరిపాలన, సాధికారత జమ్మూకశీ్మర్, లద్దాఖ్‌ ప్రజలకు అందుతాయి. వారంతా ఇకపై కలిసికట్టుగా ఉంటారు
– ఎస్‌.జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి  
 
ప్రజల పాలిట మరణ శాసనం  
ఆరి్టకల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు జమ్మూ        కశీ్మర్‌ ప్రజల పాలిట మరణ శాసనం కంటే తక్కువేమీ కాదు. ఇది కేవలం ప్రజలకే కాదు, భారత్‌ అనే భావనకు పరాజయం. భారత పార్లమెంట్‌ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక, చట్టవ్యతిరేక చర్యకు నేడు న్యాయపరంగా ఆమోదం లభించింది.  కోర్టు తీర్పుతో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏ నిర్ణయమూ తుది నిర్ణయం కాదు. జమ్మూకశీ్మర్‌ ప్రజలు రాజకీయ పోరాటం కొనసాగించాలి.
– మెహబూబా ముఫ్తీ, పీడీపీ
 
ఈ తీర్పు నిరాశ కలిగించింది    
సుప్రీంకోర్టు తీర్పు నాకు నిరాశ కలిగించింది. అయితే, ఉత్సాహం మాత్రం కోల్పోలేదు. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. జమ్మూకశీ్మర్‌ ప్రజల పోరాటం కొనసాగుతుంది. ఓటమి ఎదురైతే వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం. చట్టపరంగా ముందుకెళ్తాం
– ఒమర్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు  
 
 రాష్టహోదా పునరుద్ధరించాలి  
ఆరి్టకల్‌ 370 రద్దుకు చట్టపరంగా ఆమోదం లభించింది. ఇక చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై నగరాలను కేంద్ర  పాలిత ప్రాంతాలుగా మార్చకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఇక ఎవరూ అడ్డుకోలేరు. వాస్తవానికి ఆరి్టకల్‌ 370 రద్దు వల్ల జమ్మూ లోని డోంగ్రాలు, లద్దాఖ్‌లోని బౌద్ధులు ఎక్కువగా నష్టపోతారు. జమ్మూకశ్మీర్‌కు వెంటనే రాష్టహోదా పునరుద్ధరించాలి. రాబోయే లోక్‌సభ ఎన్నికలతోపాటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి  
 – అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం  

జాతీయ సమైక్యత బలోపేతం  
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు మన జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తుంది. ఈ ఆరి్టకల్‌ను మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఆరి్టకల్‌ 370 రద్దుకు చట్టపరంగా మద్దతు లభించడం ఆహా్వనించదగ్గ పరిణామం. జమ్మూకశీ్మర్‌ ప్రజలకు ఇకపై ఎంతో మేలు జరుగుతుంది
– సునీల్‌ అంబేకర్, ఆర్‌ఎస్‌ఎస్‌
 

ఆ తీర్పునకు చట్టపరంగా విలువ లేదు  
ఆర్టికల్‌ 370 విషయంలో భారత సుప్రీంకోర్టు తీర్పునకు చట్టపరంగా ఎలాంటి విలువ లేదు. భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఏకపక్షంగా, చట్టవ్యతిరేకంగా తీసుకున్న చర్యలను అంతర్జాతీయ చట్టాలు, న్యాయ వర్గాలు గుర్తించడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం జమ్మూకశీ్మర్‌ ప్రజలకు స్వయం ప్రతిపత్తి అనే హక్కు ఉంది. ఆ హక్కును వారి నుంచి ఎవరూ బలవంతంగా లాక్కోలేరు. భారత సుప్రీంకోర్టు తీర్పును మేము తిరస్కరిస్తున్నాం.
పాక్‌ విదేశాంగ మంత్రి  
      
ప్రజల ఆకాంక్షలను కేంద్రం నెరవేర్చాలి  
జమ్మూకశీ్మర్‌కు తక్షణమే రాష్ట్రహోదా పునరుద్ధరించాలి. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశాన్ని జమ్మూకశ్మీర్‌ ప్రజలకు కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పును కుణ్నంగా పరిశీలించాల్సి ఉంది. న్యాయస్థానం కొన్ని అంశాలను పక్కనపెట్టినట్లు కనిపిస్తోంది.
 పి.చిదంబరం, అభిõÙక్‌ సింఘ్వీ, కాంగ్రెస్‌
   
కోర్టు తీర్పు కలవరానికి గురిచేసింది  
సుప్రీంకోర్టు తాజా తీర్పు కొంత కలవరానికి గురిచేసింది. ఈ తీర్పు పర్యావసానాలు దేశ రాజ్యాంగ సమాఖ్య నిర్మాణంపై తీవ్రస్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు.  
 – సీపీఎం పొలిట్‌ బ్యూరో      

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement