friendly
-
పెంపుడు పాములను ఎప్పుడైనా చూసారా?
-
టెక్–ఫ్రెండ్లీగా కింది కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతకు మరింతగా వినియోగించుకుంటూ కింది స్థాయి న్యాయస్థానాలను ‘టెక్–ఫ్రెండ్లీ’గా తయారుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. గురువారం ఆరి్టకల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కింది కోర్టులు సాంకేతిక పుంజుకోవాల్సిన అవసరం ఉందంటూ చేసిన వాఖ్యపై సీజేఐ స్పందించారు. కోవిడ్ కష్టకాలంలో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతిరోజూ నడపాల్సి వచి్చందని గుర్తుచేశారు. ఈ–కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు కేంద్రం కేటాయించిన భారీ బడ్జెట్ కారణంగా న్యాయవ్యవస్థ ముఖ్యంగా కింది కోర్టుల్లో సాంకేతిక పుంజుకొంటుందని సీజేఐ ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయస్థానాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఇతోధిక నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అత్యంత ముఖ్యమైనదని గుర్తుచేశారు. -
ఇది మోదీ ఆలోచన కాదు! ఫ్రెంచ్ నటి కీలక వ్యాఖ్యలు
ఫ్రెంచ్ నటి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు 75 ఏళ్ల మరియన్ బోర్గ్ ఆస్తి వివాదం కారణంగా గోవాలోని తన ఇంట్లోనే తాను బంధీగా ఉన్నాని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెండ్లీ టూరిజం కోసం పర్యాటకాన్ని ఎంతగానో అభివృద్ధి చేసనప్పటికీ తాను చాలా నిరాశ చెందానని చెప్పుకొచ్చారు. గోవాలోని బీచ్ టౌన్లో కలాంగుట్లో ఉన్న తన బంగ్లాను వదలి వెళ్లిపోయినట్లు చెప్పారు. తన ఆస్తిని లాక్కుకుని కొందరూ వ్యక్తులు.. ఆ ఇంటికి విద్యుత్, నీళ్లు రాకుండా చేసి వేధించారని చెప్పారు. తాను స్నానం చేయకుండా ఉండలేని కారణంగా ఆ ఇంటిన ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదీగాక ప్రస్తుత పరిస్థితులు కారణంగా తన ఆరోగ్యం క్షీణిస్తోందని బోర్గో అన్నారు. మోదీ సానుకూల స్నేహపూర్వక పర్యాటక ఇమేజ్ కోసం చాలా శ్రమిస్తున్నారు. బహుశా ఇది మోదీ ఆలోచన కాకపోవచ్చు కానీ ఇటీవల జరిగిన సంఘటనలు నన్ను ఎంతగానో నిరాశపరిచాయి. ఆయన సాధించిన విజయాలు గోవా రాష్ట్ర స్థాయికి చేరుకోక పోవడం బాధకరం అన్నారు. వాస్తవానికి ఫ్రెంచ్ నటి బోర్గో ఫ్రాన్సిస్కో సౌసా అనే న్యాయవాది నుంచి 2008లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఐతే కోవిడ్ మహమ్మారి సమయంలో అతడు మరణించడం పరిస్థితులన్ని ఒక్కసారిగా తలకిందులు అయిపోయాయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. గోవా స్థానిక పోలీసుల ఈ కేసు కోర్టులో నడుస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెబుతున్నారు. నేషనల్ డి'ఆర్టే డ్రామాటిక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్)లో శిక్షణ పొందిన బోర్గో యూరప్, భారతదేశ అంతటా చలనచిత్రాలు, టెలివిజన్, థియేటర్లలో విస్తృతంగా పనిచేశారు. ఆమె ఫ్రెంచ్ థ్రిల్లర్ సిరీస్ “ప్రొఫైలేజ్”లో ప్రముఖ పాత్రను పోషించారు. అలాగే ఇటీవల భారతీయ నిర్మాణంలో “డానీ గోస్ ఓమ్”కి కూడా దర్శకత్వం వహించింది బోర్గ్. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
ఉమెన్ ఫ్రెండ్లీ విశాఖ.. మహిళలు దర్జాగా జీవించడానికి అనువైన నగరం
సాక్షి, అమరావతి: మహిళలు దర్జాగా ఉద్యోగాలు చేసుకోవడంతో పాటు జీవించడానికి అత్యంత అనుకూలమైన టాప్–10 నగరాల్లో ఒకటిగా విశాఖపట్నం నిలిచింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు రాణించడానికి దేశంలో అనుకూలమైన నగరాలపై జరిపిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా’ పేరుతో అవతార్ గ్రూప్ అనే సంస్థ దేశంలోని 111 నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆయా నగరాల్లో నేరాల రికార్డు, లివింగ్ ఇండెక్స్, మహిళా, శిశు సంక్షేమ శాఖ వార్షిక నివేదికలు, ఇతర విభాగాల నుంచి సేకరించిన 200కు పైగా అంశాలను విశ్లేషించారు. 10 లక్షల జనాభా పైబడిన(కేటగిరి–1), 10 లక్షల లోపు జనాభా నగరాలు (కేటగిరి–2) అనే రెండు విభాగాలుగా అధ్యయనం చేశారు. కేటగిరి–1లో 49, కేటగిరి–2లో 62 నగరాలను అధ్యయనం చేశారు. కాగా, కేటగిరి–1 నగరాల్లో చెన్నై మొదటి స్థానంలో ఉంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. విశాఖకు ఏడో స్థానం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీ నగరం 14వ స్థానంలో ఉండటం గమనార్హం. విజయవాడ నగరం 19వ స్థానంలో ఉంది. మరోవైపు కేటగిరి–2లో తమిళనాడుకు చెందిన తిరుచిరాపల్లి, వెల్లూర్, ఈరోడ్, సేలం, తిరుప్పూర్ నగరాలు వరుసగా ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ విభాగంలో కాకినాడ నగరం 12వ స్థానంలో నిలిచింది. ఇన్‌క్లూజన్ స్కోర్ ఆధారంగా సోషల్ ఇన్‌క్లూజన్ స్కోర్ (మహిళల భద్రత, ప్రాతినిధ్యం, సాధికారత, ఈజ్ ఆఫ్ లివింగ్, ఇండ్రస్టియల్ ఇన్‌క్లూజన్ స్కోర్ (సంస్థలు, పరిశ్రమలు, మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు) ఈ రెండింటిని విశ్లేషించి నగరాల వారీగా సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్‌ను ఇవ్వడం ద్వారా నగరాలకు ర్యాంక్‌లు ఇచ్చారు. చదవండి: ఎందుకీ గగ్గోలు?.. ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబడుతోంది? -
రెక్కలు ఊపితే... అది స్నేహ చిహ్నం!
రెక్కల చేతులు యుద్ధ విమానాలే కాదు, సాధారణ విమానాలు కూడా డిఫెన్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే బయలుదేరాలి. ‘ఫ్రెండ్లీ’ అనే సంకేతాన్ని జారీ చేసిన తర్వాత విమానాలు టేకాఫ్ అవుతాయి. మన గగనతలంలో మనవి కాని విమానాలు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని అడ్డగించడానికి మన ఎయిర్ క్రాఫ్ట్‌ను పంపించాలి. అందుకోసం యుద్ధ విమానాలు సిద్ధంగా ఉంటాయి. అది అనుమానాస్పద విమానానికి ఎదురుగా వెళ్లి రెక్కలు ఊపుతుంది. ఇలా రెక్కలను కదిలించడం అంటే... నీ కదలికలను అనుమానిస్తున్నామని ఎదుటి విమానంలోని పైలట్‌కి సంకేతం ఇవ్వడం! శత్రు విమానం అయితే ఈ సంకేతానికి స్పందించకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు వెళ్తుంటుంది. సంకేతాలకు స్పందించడం లేదనే సమాచారాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉన్న పైలట్ మాకు చేరవేస్తాడు. అలాంటప్పుడు పర్యవేక్షణ బృందం తరఫున ఫైరింగ్ ఆదేశాలు జారీ చేస్తాం. (మాజీ రింగ్ కమాండర్ టి.జె.రెడ్డి ఇచ్చిన సమాచారంతో) -
టిడిపిలో అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అంతర్మథనం ఆరంభమైంది. మిత్రపక్షం బీజేపీ వ్యవహారశైలి, పార్టీ, ప్రభుత్వపరంగా గుర్తింపు లభించక పోవడంతో అధికారం వచ్చిన సంతోషం నేతల్లో కనిపించడం లేదు. పదేళ్లుగా పార్టీని బతికించుకోడానికి పడిన కష్టాలన్నీ తొలగిపోతాయని భావించిన నేతలకు భిన్న పరిస్థితులు ఎదురవుతుంటే కలత చెందుతున్నారు. పార్టీ అధికారంలో ఉందో ప్రతిపక్షంలో ఉందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. జిల్లా, మండల పరిషత్ సమావేశాలు, పార్టీ సమావేశాల్లో ఇదే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బిజీబిజీగా ఉంటున్నారే కాని తమ సమస్యలు అర్థం చేసుకోవడం లేదని, అసలు దర్శన భాగ్యమే లభించడం లేదంటున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులెవరూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. జిల్లాలో బలపడేందుకు మిత్రపక్షం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా టీడీపీ నేతలను కలవర పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరడాన్ని టీడీపీ ముఖ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని బద్ధ శత్రువుగా చూసిన కన్నాతో ఇప్పుడెలా మైత్రీ బంధం కొనసాగించాలో అర్థం కావడం లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతుండటంతో జిల్లాలోనూ కన్నా చుట్టూ అధికారం కేంద్రీకృతమౌతుందనే భయం వారిని వెన్నాడుతోంది. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయరు పదవి తమకు కావాలం టూ బీజేపీ నేతల డిమాండ్‌కు కన్నా చేరిక మరింత బలం చేకూర్చుతుందనే భావన వ్యక్తం అవుతోంది. ఇటీవల పార్టీలో చేరిన తాడిశెట్టి మురళీకి కన్నాతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో మేయరు పదవిని బీజేపీ డిమాండ్ చేసే అవకాశాలున్నాయని టీడీపీ నేతలంటున్నారు. వీరి చేరికతో మేయరు పదవిపై టీడీపీ ఆశలు ఆవిరవుతున్నాయి. అధికారం వచ్చి ఆరు నెలలైనా ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు లభించకపోవడంతో సీనియర్లు, కార్యకర్తలు మధనపడుతున్నారు. మండల స్థాయి అదికారులు కూడా తమ మాట ఖాతరు చేయడం లేదని, వారిపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందుబాటులో ఉండటం లేదంటున్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులకు కీలక శాఖలు ఉండటంతో జిల్లా కంటే ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. సమస్యలు వచ్చినప్పుడు కనీసం ఫోన్‌కు కూడా అందుబాటులోకి రాకపోవడంతో నేతలు తల్లడిల్లిపోతున్నారు. జిల్లాలో సొంత కార్యాలయాలు, సమస్యల పరిష్కారానికి బాధ్యులను ఏర్పాటు చేయకపోవడంతో వారి పట్ల పార్టీలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జిల్లా పరిషత్, మండల పరిషత్, పార్టీ సమావేశాల్లో టీడీపీ నేతలు తమ ఆవేదనను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు.