ఫ్రెంచ్ నటి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు 75 ఏళ్ల మరియన్ బోర్గ్ ఆస్తి వివాదం కారణంగా గోవాలోని తన ఇంట్లోనే తాను బంధీగా ఉన్నాని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెండ్లీ టూరిజం కోసం పర్యాటకాన్ని ఎంతగానో అభివృద్ధి చేసనప్పటికీ తాను చాలా నిరాశ చెందానని చెప్పుకొచ్చారు. గోవాలోని బీచ్ టౌన్‌లో కలాంగుట్‌లో ఉన్న తన బంగ్లాను వదలి వెళ్లిపోయినట్లు చెప్పారు. తన ఆస్తిని లాక్కుకుని కొందరూ వ్యక్తులు.. ఆ ఇంటికి విద్యుత్, నీళ్లు రాకుండా చేసి వేధించారని చెప్పారు.
తాను స్నానం చేయకుండా ఉండలేని కారణంగా ఆ ఇంటిన ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదీగాక ప్రస్తుత పరిస్థితులు కారణంగా తన ఆరోగ్యం క్షీణిస్తోందని బోర్గో అన్నారు. మోదీ సానుకూల స్నేహపూర్వక పర్యాటక ఇమేజ్ కోసం చాలా శ్రమిస్తున్నారు. బహుశా ఇది మోదీ ఆలోచన కాకపోవచ్చు కానీ ఇటీవల జరిగిన సంఘటనలు నన్ను ఎంతగానో నిరాశపరిచాయి. ఆయన సాధించిన విజయాలు గోవా రాష్ట్ర స్థాయికి చేరుకోక పోవడం బాధకరం అన్నారు. వాస్తవానికి ఫ్రెంచ్ నటి బోర్గో ఫ్రాన్సిస్కో సౌసా అనే న్యాయవాది నుంచి 2008లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు.
ఐతే కోవిడ్ మహమ్మారి సమయంలో అతడు మరణించడం పరిస్థితులన్ని ఒక్కసారిగా తలకిందులు అయిపోయాయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. గోవా స్థానిక పోలీసుల ఈ కేసు కోర్టులో నడుస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెబుతున్నారు. నేషనల్ డి'ఆర్టే డ్రామాటిక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్)లో శిక్షణ పొందిన బోర్గో యూరప్, భారతదేశ అంతటా చలనచిత్రాలు, టెలివిజన్, థియేటర్‌లలో విస్తృతంగా పనిచేశారు. ఆమె ఫ్రెంచ్ థ్రిల్లర్ సిరీస్ “ప్రొఫైలేజ్”లో ప్రముఖ పాత్రను పోషించారు. అలాగే ఇటీవల భారతీయ నిర్మాణంలో “డానీ గోస్ ఓమ్”కి కూడా దర్శకత్వం వహించింది బోర్గ్.
(చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!)
Comments
Please login to add a commentAdd a comment