French actor
-
ఇది మోదీ ఆలోచన కాదు! ఫ్రెంచ్ నటి కీలక వ్యాఖ్యలు
ఫ్రెంచ్ నటి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు 75 ఏళ్ల మరియన్ బోర్గ్ ఆస్తి వివాదం కారణంగా గోవాలోని తన ఇంట్లోనే తాను బంధీగా ఉన్నాని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెండ్లీ టూరిజం కోసం పర్యాటకాన్ని ఎంతగానో అభివృద్ధి చేసనప్పటికీ తాను చాలా నిరాశ చెందానని చెప్పుకొచ్చారు. గోవాలోని బీచ్ టౌన్లో కలాంగుట్లో ఉన్న తన బంగ్లాను వదలి వెళ్లిపోయినట్లు చెప్పారు. తన ఆస్తిని లాక్కుకుని కొందరూ వ్యక్తులు.. ఆ ఇంటికి విద్యుత్, నీళ్లు రాకుండా చేసి వేధించారని చెప్పారు. తాను స్నానం చేయకుండా ఉండలేని కారణంగా ఆ ఇంటిన ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదీగాక ప్రస్తుత పరిస్థితులు కారణంగా తన ఆరోగ్యం క్షీణిస్తోందని బోర్గో అన్నారు. మోదీ సానుకూల స్నేహపూర్వక పర్యాటక ఇమేజ్ కోసం చాలా శ్రమిస్తున్నారు. బహుశా ఇది మోదీ ఆలోచన కాకపోవచ్చు కానీ ఇటీవల జరిగిన సంఘటనలు నన్ను ఎంతగానో నిరాశపరిచాయి. ఆయన సాధించిన విజయాలు గోవా రాష్ట్ర స్థాయికి చేరుకోక పోవడం బాధకరం అన్నారు. వాస్తవానికి ఫ్రెంచ్ నటి బోర్గో ఫ్రాన్సిస్కో సౌసా అనే న్యాయవాది నుంచి 2008లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఐతే కోవిడ్ మహమ్మారి సమయంలో అతడు మరణించడం పరిస్థితులన్ని ఒక్కసారిగా తలకిందులు అయిపోయాయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. గోవా స్థానిక పోలీసుల ఈ కేసు కోర్టులో నడుస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెబుతున్నారు. నేషనల్ డి'ఆర్టే డ్రామాటిక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్)లో శిక్షణ పొందిన బోర్గో యూరప్, భారతదేశ అంతటా చలనచిత్రాలు, టెలివిజన్, థియేటర్లలో విస్తృతంగా పనిచేశారు. ఆమె ఫ్రెంచ్ థ్రిల్లర్ సిరీస్ “ప్రొఫైలేజ్”లో ప్రముఖ పాత్రను పోషించారు. అలాగే ఇటీవల భారతీయ నిర్మాణంలో “డానీ గోస్ ఓమ్”కి కూడా దర్శకత్వం వహించింది బోర్గ్. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
‘అద్దంలో నా ముఖం చూసి గుర్తుపట్టలేకపోయా’ .. ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన నటి
సాధారణంగా సినీ తారలు కొంత మంది తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఫ్రెంచ్ నటి జుడిత్ చెమ్లా గాయాలతో ఉన్న తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి పలు విషయాలను పంచుకుంది. అయితే ఆ ఫోటోతో పాటు తన కుమార్తె తండ్రే దీనంతటికి కారణమని తెలిపింది కానీ అతని పేరును మాత్రం చెప్పలేదు. ఫ్రెంచ్ సినిమా ‘మెస్ ఫ్రెరెస్ ఎట్ మోయి’ తో మంచి పేరు సంపాదించుకుంది నటి జుడిత్ చెమ్లా. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గృహ హింస ఫలితంగా ఒక సంవత్సరం క్రితం తాను తీవ్రంగా గాయపడ్డ ఫోటోలను చేస్తూ ఇలా రాసింది.. “ఒక సంవత్సరం క్రితం ఒకరి వల్ల నా ముఖం గాయపడింది. ఎంతలా అంటే నన్న నేను గుర్తపట్టలేనంత. ఆ సమయంలో నన్ను నేను అద్దంలో చూసుకుంటే చాలా బాధేసింది. చాలా రోజుల వరకు బయట ప్రపంచంలోకి రాలేకపోయాను. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, ఇకపై నా ముఖాన్ని దాచలేనని తెలుసుకుని, దాని నుంచి బయటపడ్డానని’’ చెప్పుకొచ్చింది. అయితే తన పరిస్థితికి కారణమైన వాడిపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు పెద్దగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే అతనిపై పలుమార్లు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పాంది. కాగా చెమ్లా గతంలో చిత్ర దర్శకుడు యోహన్ మాన్కాతో డేటింగ్లో ఉంది. అతడిని నటిపై గృహ హింస కేసు విషయంలో ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. ఆ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Judith Chemla (@judithhhhhhhhhhhhhh) చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య -
రోజుకు 14 బాటిళ్ల మద్యం తాగేస్తున్న హీరో
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత హీరో గెరార్డ్ డెపార్డీ మాత్రం తనకివేమిపట్టవని చెబుతున్నాడు. బాటిళ్ల మీద బాటిళ్ల మద్యం తాగేస్తున్నాడు. ఏ రోజైనా అతనికి బోర్ కొడితే ఉదయం నుంచి రాత్రికి ఏకంగా 14 బాటిళ్ల మద్యం లాగించేస్తాడట. గెరార్డ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయం చెప్పాడు. గెరార్డ్ ఉదయం మద్యపానంతోనే దినచర్య మొదలుపెడతాడు. 10 గంటలలోపే రెడ్ వైన్ లేదా షాంపైన్ తీసుకుంటాడు. ఆ తర్వాత షాంపైన్.. భోజనంతో మరో రెండు బాటిళ్ల వైన్.. మధ్యాహ్నం షాంపైన్, బీర్.. సాయంత్రం హాఫ్ బాటిల్.. రాత్రికి వోడ్కా లేదా విస్కీ తీసుకుంటాడట. మొత్తమ్మీద ఆ రోజు 14 బాటిళ్ల మద్యం పూర్తి చేస్తాడట. టాక్స్ సమస్యల కారణంగా దేశం వెలుపల ఉంటున్న గెరార్డ్ మద్యం తాగడం మొదలుపెడితే ఆ రోజంతా ఆపనని చెప్పాడు. విమానాశ్రయాల్లో మద్య తాగడం, యాక్సిడెంట్లు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.