Actress Judith Chemla Shares Her Shocking Photos Of Injuries From Domestic Abuse, Goes Viral - Sakshi
Sakshi News home page

French Actress Judith Chemla: ‘అద్దంలో నా ముఖం చూసి గుర్తుపట్టలేకపోయా’ .. ఇన్‌స్టాలో ఫోటోలు షేర్‌ చేసిన నటి

Published Tue, Jul 5 2022 1:20 PM | Last Updated on Tue, Jul 5 2022 2:09 PM

French Actor Judith Chemla Shares Horrifying Injuries Photos Instagram Domestic Abuse - Sakshi

సాధారణంగా సినీ తారలు కొంత మంది తమ పర్సనల్‌ విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఫ్రెంచ్‌ నటి జుడిత్‌ చెమ్లా గాయాలతో ఉన్న తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసి పలు విషయాలను పంచుకుంది. అయితే ఆ ఫోటోతో పాటు తన కుమార్తె తండ్రే దీనంతటికి కారణమని తెలిపింది కానీ అతని పేరును మాత్రం చెప్పలేదు. ఫ్రెంచ్‌ సినిమా ‘మెస్ ఫ్రెరెస్ ఎట్ మోయి’ తో మంచి పేరు సంపాదించుకుంది నటి జుడిత్ చెమ్లా. 

ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గృహ హింస ఫలితంగా ఒక సంవత్సరం క్రితం తాను తీవ్రంగా గాయపడ్డ ఫోటోలను చేస్తూ ఇలా రాసింది.. “ఒక సంవత్సరం క్రితం ఒకరి వల్ల నా ముఖం గాయపడింది. ఎంతలా అంటే నన్న నేను గుర్తపట్టలేనంత. ఆ సమయంలో నన్ను నేను అద్దంలో చూసుకుంటే చాలా బాధేసింది. చాలా రోజుల వరకు బయట ప్రపంచంలోకి రాలేకపోయాను. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, ఇకపై నా ముఖాన్ని దాచలేనని తెలుసుకుని, దాని నుంచి బయటపడ్డానని’’ చెప్పుకొచ్చింది.

అయితే తన పరిస్థితికి కారణమైన వాడిపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు పెద్దగా స్పందించలేదని ఆవేదన ‍ వ్యక్తం చేసింది. అందుకే అతనిపై పలుమార్లు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పాంది. కాగా చెమ్లా గతంలో చిత్ర దర్శకుడు యోహన్ మాన్కాతో డేటింగ్‌లో ఉంది. అతడిని నటిపై గృహ హింస కేసు విషయంలో ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. ఆ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం.
 


చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్‌ మీనింగ్‌ ఉండదు : నాగచైతన్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement