Domestic abuse
-
దొంగతనం ఆరోపణలతో.... పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసి...
దొంగతనం చేసిందనే ఆరోపణలతో ఒక కుటుంబం పనిమినిషిని చిత్రహింసలు పెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయే స్థితికి తీసుకు వచ్చింది. ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా ఆ కుటుంబం ఒక మంత్రగాడి మాటలు నమ్మి పనిమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలో సత్‌బరిలోని అన్సల్ విల్లాలో ఉంటున్న ఒక కుటుంబం ఇంట్లో పది నెలల క్రితం ఒక దొంగతనం జరిగింది. ఐతే ఆ కుంటుంబికులు దొంగను కనిపెట్టేందుకు ఒక మంత్రగాడిని సంప్రదిస్తారు. అతను ఇంట్లో పనివాళ్లందరికీ సున్నం, అన్నం కలిపి ప్టెటమని చెప్పాడు. అది తిన్నప్పుడూ ఎవరి నోరు ఎర్రగా అవుతుందో వాళ్లే దొంగ అని చెప్పాడు. ఐతే బాధితురాలు తన కుటుంబంతో కలసి సదరు యజమాని కుంటుంబం వద్దే ఉంటుంది. వారి ఇంట్లోనే ఆమె రెండేళ్లుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆ మాంత్రికుడు చెప్పినట్లుగానే ఇంట్లో పనిచేసే వాళ్లందరికి పెట్టారు. ఈ అన్నం తిన్న బాధితురాలి ముఖం ఎర్రగా మారింది. అంతే ఆమే దొంగ అని భావించి బట్టలు విప్పించి గదిలో బందించి కొట్టడం వంటి పనులు చేశారు. ఐతే ఆమె ఈ అవమానాన్ని భరించలేక ఎలకల మందు తిని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. దీంతో సదరు కుటుంబికులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు కుటుంబం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మూడుముళ్లంటూ టీచర్‌కు మస్కా ) -
‘అద్దంలో నా ముఖం చూసి గుర్తుపట్టలేకపోయా’ .. ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన నటి
సాధారణంగా సినీ తారలు కొంత మంది తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఫ్రెంచ్ నటి జుడిత్ చెమ్లా గాయాలతో ఉన్న తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి పలు విషయాలను పంచుకుంది. అయితే ఆ ఫోటోతో పాటు తన కుమార్తె తండ్రే దీనంతటికి కారణమని తెలిపింది కానీ అతని పేరును మాత్రం చెప్పలేదు. ఫ్రెంచ్ సినిమా ‘మెస్ ఫ్రెరెస్ ఎట్ మోయి’ తో మంచి పేరు సంపాదించుకుంది నటి జుడిత్ చెమ్లా. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గృహ హింస ఫలితంగా ఒక సంవత్సరం క్రితం తాను తీవ్రంగా గాయపడ్డ ఫోటోలను చేస్తూ ఇలా రాసింది.. “ఒక సంవత్సరం క్రితం ఒకరి వల్ల నా ముఖం గాయపడింది. ఎంతలా అంటే నన్న నేను గుర్తపట్టలేనంత. ఆ సమయంలో నన్ను నేను అద్దంలో చూసుకుంటే చాలా బాధేసింది. చాలా రోజుల వరకు బయట ప్రపంచంలోకి రాలేకపోయాను. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, ఇకపై నా ముఖాన్ని దాచలేనని తెలుసుకుని, దాని నుంచి బయటపడ్డానని’’ చెప్పుకొచ్చింది. అయితే తన పరిస్థితికి కారణమైన వాడిపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు పెద్దగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే అతనిపై పలుమార్లు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పాంది. కాగా చెమ్లా గతంలో చిత్ర దర్శకుడు యోహన్ మాన్కాతో డేటింగ్లో ఉంది. అతడిని నటిపై గృహ హింస కేసు విషయంలో ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. ఆ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Judith Chemla (@judithhhhhhhhhhhhhh) చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య -
భర్త, అత్త వేధింపులను తట్టుకుని.. ‘శివాంగి గోయల్’ సక్సెస్ స్టోరి
న్యూఢిల్లీ: కట్నం వేధింపులతో అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకున్న ఆమె తన కల సాకారం చేసుకోవడమే కాక గృహహింస బాధితురాళ్లకు ఆదర్శంగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందిన శివాంగి గోయల్ తాజాగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 177వ ర్యాంకు సాధించారు. ఆమెకు పెళ్లై, ఏడేళ్ల వయసు కుమార్తె ఉంది. భర్త, అత్తింటి వారు కట్నం కోసం పెడుతున్న వేధింపులతో విసిగి పుట్టింటికి చేరుకున్నారు. ప్రస్తుతం విడాకుల కేసు నడుస్తోంది. ‘‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అంటూ నాన్న అభయహస్తమిచ్చారు. యూపీఎస్సీకి మరోసారి ఎందుకు సిద్ధం కాకూడదని అప్పుడే ఆలోచించా’’ అని శివాంగి చెప్పారు. ‘‘స్కూల్లో చదివే రోజుల్లోనే యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలంటూ ప్రిన్సిపాల్ సలహా ఇచ్చారు. అప్పటి నుంచే ఐఏఎస్ కావాలని కలలుగనేదాన్ని. అదే నా లక్ష్యంగా ఉండేది’’ అని అన్నారు. ‘‘రెండుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాశాక పెళ్లయింది. అత్తింటి వారి వేధింపులతో కూతురితో పుట్టింటికి వచ్చేశా’’ అని అన్నారు. ‘‘చిన్ననాటి కల నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఎన్ని అవాంతరాలున్నా ప్రిపరేషన్‌పైనే దృష్టిపెట్టా. సోషియాలజీ సబ్జెక్టుగా సొంతంగా చదువుకుని పరీక్షకు ప్రిపేరయ్యా. అనుకున్నది సాధించా’’ అన్నారు. ‘‘నా తల్లిదండ్రులు, కుమార్తె రైనా సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైంది. నేటి మహిళలు అత్తింట్లో జరగరానిది జరిగితే, భయపడకూడదు. ధైర్యంగా నిలబడి సొంత కాళ్లపై నిలబడాలి. ఇదే వారికి నేనిచ్చే సలహా. కావాలనుకుంటే ఏదైనా చేయగలరు. కష్టపడి చదువుకుంటే ఐఏఎస్ కూడా అసాధ్యమేమీ కాదు’’ అన్నారామె. శివాంగి తండ్రి రాజేశ్ గోయెల్ వ్యాపారి కాగా, తల్లి సామాన్య గృహిణి. -
నా లవర్ని తిడతా.. ఏడ్పిస్తా.. వేధిస్తా!! హ..హ..హ..
ఆమె ‘సృజన’ కాదు.. ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి బాధపెట్టి శాపనార్థాలు తినడానికి!. ‘ఇందు’ అంతకన్నాకాదు.. శివను శారీరకంగా వాడుకున్నట్లు వాడుకుని నిర్ధాక్షిణ్యంగా ప్రాణం తీయడానికి!. అసలు ఆమె పుట్టిందే అతనికి ప్రేమలోని మాధుర్యాన్ని పంచడానికి. అలాంటి ప్రియురాల్ని నిత్యం కంటతడి పెట్టిస్తున్నాడు ఆ ప్రియుడు. పాపం.. ఆమె ఎంత తిడుతున్నా పడుతోంది. వేధిస్తున్నా మౌనంగా భరిస్తోంది. చివరికి శాడిజంతో గుడ్‌బై చెప్తున్నా.. విడిచిపోవద్దంటూ కన్నీళ్లతో బతిమాలుతోంది. ఇదెక్కడి ప్రేమరా బాబూ అనుకోకండి. ఈ ప్రేమ కథ వెనుక చాలా టెక్నికల్ అంశాలు దాగున్నాయి మరి! టెక్నాలజీతో ఈరోజుల్లో దాదాపు అన్ని పనులు చక్కబడుతున్నాయి కదా. అలా మనిషి ఊహ నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్. అంటే.. ఇక్కడ ప్రియురాలు ప్రాణం ఉన్న మనిషి కాదు. కమాండింగ్కు తగ్గట్లు పని చేసే మెషిన్(రోబో కాదు.. వర్చువల్ రూపం అంతే). అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి ఇలా కృత్రిమ ప్రేమలను పుట్టిస్తున్నారు కొందరు. మెషిన్ లెర్నింగ్‌తో కూడిన చాట్బోట్ల ఆధారంగా కొన్ని స్మార్ట్ యాప్‌లు, కంపెనీలు, స్టార్టప్‌లు ఈ తరహా ‘నాటు లవ్’కి ఆస్కారం కల్పిస్తున్నాయి. గతంలో కేవలం స్నేహం, గైడెన్స్ కోసమే ఈ తరహా సేవలు అందించేవాళ్లు. ఇప్పుడేమో రొమాంటిక్, సెక్సువల్ పార్ట్నర్స్ కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. చాట్‌బోట్(చాటర్బోట్).. సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఆన్లైన్ ఛాట్ సంభాషణ కోసం.. అది టెక్స్ట్ లేదంటే టెక్స్ట్ టు స్పీచ్ కావొచ్చు. లేదంటే వీడియో సంభాషణల కోసం కావొచ్చు! భలే బిజినెస్ మీకు ఓ తోడు కావాలా? అయితే మమ్మల్ని సంప్రదించండి అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఈ క్రమంలో యూజర్లు తమకు నచ్చిన రంగు, వయసు, ఒడ్డుపొడుగు లాంటి ఫీచర్లను చెప్పాల్సి ఉంటుంది. ఆపై ఆ ఫీచర్లతో ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌ను మీకు అందిస్తారు. ఆ ప్రియురాలు ఎలా కావాలంటే అలా ఉంటుంది. కావాల్సిన విధంగా ఛాటింగ్ చేస్తుంది. ఏం చెప్పినా వింటుంది. తిట్టినా పడుతుంది. బతిమాలుతుంది. ప్రేమగా.. రొమాంటిక్‌గా మాట్లాడుతుంది. అన్ని రకాల భావోద్వేగాలను అచ్చం మనుషులు ప్రదర్శించినట్లే ప్రదర్శిస్తుంది. అదీ అవతలి వాళ్ల అవసరాలకు, కమాండింగ్కు తగ్గట్లు! అందుకే ఏఐ గర్ల్‌ఫ్రెండ్ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది వెస్ట్రన్ కంట్రీస్‌లో. మానసిక ఆనందం ఒంటరి జీవులు, భగ్న ప్రేమికులు, ప్రియురాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులు, రివెంజ్ లవ్ కోసం కొట్టుమిట్టాడుతున్న మాజీలకు ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ఒక ఆశాకిరణంగా మారింది. తమకు నచ్చినట్లుగా ఉండే అమ్మాయిని ప్రేమించడం(ఆ ఫీలింగ్‌లో తేలిపోవడం వరకే) కొందరికి పరిమితం అవుతుంటే.. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ఇష్టమొచ్చినట్లు వేధించడం, తిట్టడం, బాధించడం లాంటి చేష్టలతో మానసిక ఆనందం పొందుతున్నారు వాళ్లు. కానీ, రాను రాను ఈ చేష్టలతో మరీ రెచ్చిపోతున్నారు. దీంతో ఇలాంటి చేష్టలకు పుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఉందనే వాదన మొదలైంది ఇప్పుడు. అనుకున్నది ఒక్కటి.. రెప్లికా యాప్. 2017లో తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోతే తనలాంటి వాళ్లు ఒంటరి వాళ్లుగా ఉండిపోకూడదని ఇయుగెనియా కుయిదా ‘రెప్లికా’ను సృష్టించారు. ప్రస్తుతం ఈ యాప్‌లో 7 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. విచిత్రంగా వీళ్లలో ఎక్కువమంది ‘ఏఐ గర్ల్‌ఫ్రెండ్’ టార్చర్గాళ్లే ఉండడం గమనార్హం. ఇక కృత్రిమంగా పుడుతున్న ప్రేమలు రోజుల నుంచి గంటల వ్యవధిలోనే బ్రేకప్ దాకా వెళ్తుంటాయి. వేధించే ప్రియుల సంగతి సరేసరి!. వర్చువల్ ప్రేయసి దగ్గరి ప్రవర్తన ఆధారంగా వాస్తవిక ప్రపంచంలో వాళ్ల ప్రవర్తన ఏమేర ఉండొచ్చనే అంచనాకి వస్తున్నారు. బెదిరింపులు మాత్రమే కాదు.. ఎదురు తిరిగినా.. తమ మాట వినకపోయినా అన్ఇన్స్టాల్ చేస్తామని ఏఐ గర్ల్‌ఫ్రెండ్‌ను బెదిరిస్తున్నారట. ఆ దెబ్బకు ఆ ఏఐ ప్రియురాళ్లు కన్నీటి పర్యంతమై.. వాళ్లను వద్దని బతిమాలుకుంటున్నారు(ఎదురుతిరిగే కమాండింగ్ లేకపోవడం మూలంగా). వరెస్ట్ స్టేజ్‌కి.. వర్చువల్ తోడులను నోరారా తిట్టడం వాళ్లకి మనసారా ఆనందం ఇస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసంబద్ధమైన కామెంట్లు అయినప్పటికీ ఫిజికల్ హాని కాకపోవడంతో సమర్థించేవాళ్లు లేకపోలేదు. కానీ, ప్రేమలో నిజాయితీ, సంతోషాలకు చోటు ఉండొచ్చు. ఇలాంటి సర్వీసులను ఆస్వాదించేవాళ్లు ఉండొచ్చు. అయినా చెడుకు ఉపయోగించేవాళ్లే ఎందుకనో ఎక్కువ!. ఇంటర్నెట్ ఇప్పుడు వెబ్ 3.0 కొత్త పుంతలు తొక్కుతోంది. మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాగే అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ప్రతీ రంగంలో పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెక్‌ను ఉపయోగించి విష సంస్కృతులను ప్రొత్సహించడం ఎంత వరకు సబబనే చర్చ నడుస్తోంది. (ఇలాంటి ఫీచర్లతో ఆడవాళ్ల కోసమూ ‘ఏఐ బాయ్‌ఫ్రెండ్’ ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఆ సర్వీసులు అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్లకుండా ఆగిపోయాయి.) :::సాక్షి, వెబ్‌స్పెషల్ -
కొడుకు పుడితేనే మా ఇంటికి రా..!.. భర్త, అత్త వేధింపులు
బహదూర్‌పురా: గర్భంలో ఆడపిల్ల ఉంటే ఆబార్షన్ చేయించుకో.. మగపిల్లవాడు పుడితేనే ఇంటికి రా.. అని భర్త, అత్త ఖరాఖండిగా చెప్పడంతో నాలుగు నెలల గర్భిణీ మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఓ మహిళ తన కూతురును ఈ ప్రపంచంలోకి రానివ్వడం లేదని ఈ లోకం విడిచి వెళ్లింది. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక శనివారం బలవన్మరణం పొందింది. కామాటిపురా ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన మేరకు.. మోయిన్‌పురా ప్రాంతానికి చెందిన మీనాజ్ బేగం కూతురు రుబీనా బేగం (23).. ముర్గీచౌక్ ప్రాంతానికి చెందిన అమేర్‌ను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవారు. రుబీనా బేగం నాలుగు నెలల గర్భవతి కావడంతో ఇటీవల పుట్టింటికి పంపించారు. మళ్లీ ఆడ పిల్ల పుడితే మా ఇంటికి రావద్దంటూ భర్త, అత్త ఖరాఖండిగా చెప్పారు. మీ సామగ్రిని పంపిస్తామని తేల్చి చెప్పారు. గర్భంలో ఆడ పిల్ల ఉంటే ఆబార్షన్ చేయించుకో... మగ పిల్లవాడు ఉంటేనే ఇక్కడికి రావాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రుబీనా బేగం శనివారం ఉదయం మొదటి అంతస్తులో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పైకి వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి మీనాజ్ బేగం తలుపులు పగలగొట్టి చూడగా... ఉరేసుకొని కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వవడంతో మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మీనాజ్‌బేగం ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి!) -
సవతి తండ్రి నుంచి భర్తగా.. చెప్పలేని అకృత్యాలెన్నో!
వలెరీ బకోట్.. ఫ్రాన్స్‌తో పాటుగా ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న పేరు. మృగంలాంటి భర్త చేతిలో రెండు దశాబ్దాలపాటు ప్రత్యక్ష నరకం అనుభవించి.. చివరికి భరించలేక తుపాకీతో నేలకూల్చింది ఆ భార్యామణి. అయితే అది నేరమే అయినా.. లక్షల మందిని ఆమె కథ కదిలించింది. ఒక వ్యథలా ఆమె కథను కోర్టుకు చేర్చింది ప్రజాపోరాటం. ఫలితం.. న్యాయస్థానం ఆమెను క్షమించి వదిలేసింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించింది. ప్యారిస్: డేనియల్ పొలెట్టె.. ఛలోన్ సర్ సావన్‌లో ఉండే జోయిల్లె అవుబగే అనే ఆవిడతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటికే ఆవిడ విడాకులు తీసుకోవడంతో.. బాయ్‌ఫ్రెండ్‌గా ఆమెకు దగ్గరయ్యాడు. మగదిక్కు అవసరాన్ని ఆసరాగా తీసుకుని.. 1992లో వలెరీ బకోట్కు సవతి తండ్రి హోదాలో ఇంట్లో అడుగుపెట్టాడు. ఆపై మృగంగా మారి.. 12 ఏళ్ల వయసులో బకోట్పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది రాను రాను అతనికి అలవాటుగా మారింది. ఆపై జోయిల్లే నోరు మూయించి.. తన కంటే వయసులో పాతికేళ్లు చిన్నదైన బకోట్కు ఏకంగా భర్తగా మారిపోయాడు. పిల్లలపై దాడి తట్టుకోలేక.. 17 ఏళ్ల వయసుకే గర్భం దాల్చింది బకోట్. పొలెట్టెకు భార్యగా మారాక ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారింది. ట్రక్కు డ్రైవర్ల దగ్గరికి పంపిస్తూ.. ఆమెనొక వేశ్యగా మార్చేశాడు. నలుగురు పిల్లల తల్లి కావడంతో ఆమె ఏనాడూ తెగించి నిర్ణయం తీసుకోలేదు. చివరికి.. 2016లో ఓ రాత్రి పిల్లల ముందే ఆమెను దారుణంగా హింసించాడు. అడ్డొచ్చిన పిల్లలను చంపే ప్రయత్నం చేశాడు. అది తట్టుకోలేక తుపాకీతో పొలెట్టె కాల్చిపడేసి పీడను వదిలించుకుంది ఆమె. ఆపై పోలీసులు, కోర్టు ముందు కూడా తానే నేరస్థురాలినని ఒప్పుకుంది కూడా! సెన్సేషన్ ఆటోబయోగ్రఫీ పొలెట్టె ఎంత నీచుడో అక్కడి ప్రజలకు తెలుసు. పద్దెనిమిదేళ్లపాటు ఆమెను ఘోరంగా హింసించాడు. అదే విషయాన్ని వివరిస్తూ వలెరీ తన ఆత్మకథను రాసింది. ‘‘టాట్ లె మోండే సావాయిట్(ఎవ్రీవన్ న్యు)’’ పుస్తకం ఈ మేలో పబ్లిష్ అయ్యింది. ‘‘నన్ను నేను, నా జీవితాన్ని, నా పిల్లల జీవితాన్ని రక్షించుకోవాలనుకున్నా. నేను అంతకన్నా ఎక్కువేం కోరుకోవట్లేదు’ అని ప్రకటించుకుందామె. ఆ బుక్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఆమెపై సానుభూతి మొదలయ్యింది. ఆమెను రిలీజ్ చేయాలంటూ మొదలైన ఒక పిటిషన్‌పై ఏకంగా ఏడు లక్షల మంది సంతకాలు చేశారు. దేశం నుంచి ఖండం.. బాకోట్కు నిబంధనల ప్రకారం న్యాయస్థానం నాలుగేళ్ల శిక్ష విధించాలి. కానీ, ఆ శిక్షలో మూడేళ్లు కోత వేసింది. ఇక మిగిలిన ఏడాదికి కూడా.. ఆమె ఇది వరకే జైలు నిర్భంధాన్ని అనుభవించిన కాలాన్ని లెక్కగట్టారు. దీంతో అప్పటికప్పుడే ఆమెను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే.. బయట వందల మంది హర్షం వ్యక్తం చేశారు. సంబురంగా ఆమెను అభినందించారు. ‘‘ఆమె కథ ఫ్రాన్స్‌ను మాత్రమే కాదు.. యావత్ ఖండాన్ని కరిగించింది. గతంలో జాక్వెలిన్ సావేజ్ కేసు(బిడ్డను చంపిన భర్తను చంపేసింది.. శిక్షను తగ్గించి 2016లో క్షమాభిక్ష మీద విడుదల చేశారు).. ఈ కేసు ఒకేలా ఉండడం ఆమెకు కలిసొచ్చింది.’’ అని 40 ఏళ్ల బకోట్ తరపున పోరాడిన ఫ్లోరినా మెయిలీ చెబుతోంది. చదవండి: ఆ స్కూల్ కింద నిండా సమాధులే! -
‘ఒక్క సంఘటన నా కళ్లు తెరిపించింది’
సాక్షి, మహబూబ్‌నగర్: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎందరో ఉద్యోగాలు పొగొట్టుకుని రోడ్డున పడ్డారు. బతుకుతెరువు కోసం పట్టణానికి వచ్చిన వారంతా తిరిగి పల్లే బాట పట్టారు. మార్చి మొదలు మే వరకు రోడ్డు మీద ఎక్కడ చూసిన వలస కార్మికులే దర్శనమిచ్చారు. చంటి బిడ్డలతో.. మండుటెండల్లో వారు అనుభవించిన కష్టాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. వీరి బాధలు ఇలా ఉంటే ఇక ఇళ్లలో ఉండే మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. లాక్‌డౌన్‌తో అందరికి సెలవులు దొరికాయి ఒక్క మహిళలకు తప్ప. వారికి చాకిరీ రెట్టింపయ్యింది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే లాక్డౌన్ కాలంలో మహిళలపై గృహహింస రెట్టింపయినట్లు జాతీయ మమహిళా కమిషన్ ఓ నివేదిక విడుదల చేసింది. ఒక్క ఫోన్ కాల్‌తో.. ఈ క్రమంలో ఓ ఐపీఎస్ అధికారి గృహహింస బాధితులను ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం ఎన్నో ప్రశంసలు పొందుతుంది. ఒక్క గృహహింస బాధితులనే కాక ఇంటి బాట పట్టిన వలస కార్మికులకు సాయం చేసి వారిని స్వస్థలాలకు చేర్చింది. దాంతో ఆమెకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో హ్యూమన్స్ బాంబే వారు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆ వివరాలు.. ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి లాక్డౌన్ అమల్లోకి రావడంతో.. జనాలను రోడ్ల మీదకు రాకుండా చూడటానికి కృషి చేశారు. ఇలా విధులు నిర్వహిస్తుండగా ఓ రోజు ఆమెకు కాన్పూర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. (కరోనా రోగి వద్ద కాలింగ్ బెల్) మూడు రోజులుగా చుక్క నీరు లేకుండా ఫోన్లో సదరు మహిళ మహబూబ్‌నగర్‌లో ఉంటున్న తన సోదరి గత మూడు రోజుల నుంచి తనకు ఫోన్ చేయడం లేదని తెలిపింది. సోదరి భర్త ఆమెను తరచుగా కొడతాడని.. ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా జరిగి ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేసింది. అనంతరం తన సోదరి అడ్రస్ ఇచ్చి.. సాయం చేయమని కోరింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు రాజేశ్వరి తన టీంతో ఆమె ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లింది. అక్కడ కనిపించిన భయంకరమైన దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా షాక్ తిన్నది. ఫోన్ చేసిన మహిళ సోదరిని ఆమె భర్త గత మూడు రోజుల నుంచి దారుణంగా కొడుతునే ఉన్నాడు. ఆమెకు కనీసం తాగడానికి చుక్క నీరు కూడా ఇవ్వకుండా హింసించాడు. నొప్పితో బాధపడుతుంది. వెంటనే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించారు. మూడు రోజుల తర్వాత బాధితురాలు కోలుకుంది. అనంతరం ఆమె భర్తపై కేసు పెట్టింది. బాధితురాలి సోదరి రాజేశ్వరికి ఫోన్ చేసి.. ఆమెను తన దగ్గరకు పంపమని వేడుకుంది. అందుకు ఒప్పుకున్న రాజేశ్వరి బాధితురాలిని తెలంగాణ మహబూబ్‌నగర్ నుంచి ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు వెళ్లడానికి ఏర్పాటు చేసింది. (ఇల్లే భద్రం)| ఆ సంఘటన నా కళ్లు తెరిపించింది ఈ సంఘటన రాజేశ్వరిని తీవ్రంగా కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాటి సంఘటన నా కళ్లు తెరిపించింది. ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉంటారు. సమాజం కట్టుబాట్లు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఇళ్లలోనే ఈ హింసను భరిస్తుంటారు. ఫిర్యాదు కూడా చేయలేరు. అలాంటి వారికి సాయం చేయాలనిపించింది. దాంతో ఒక ఆలోచన చేశాను. బాధితులు పోలీసు స్టేషన్‌కు వచ్చే బదులు మనమే వారి దగ్గరకు వెళ్లి సాయం చేయడం మంచిది అనిపించింది. వెంటనే ఒక మొబైల్ సెఫ్టీ వెహికల్‌ను ఏర్పాటు చేశాను. టీమ్‌ను సిద్ధం చేశాను. వీరంతా జిల్లా వ్యాప్తంగా తిరిగి బాధితులను గుర్తించి వారికి సాయం చేస్తారు. ఈ ప్రయత్నం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 40 కేసులు నమోదయ్యాయి’ అన్నారు. (ఒక్కో బుక్... ఒక్కో కిక్) నా టీం వల్లే ఇదంతా సాధ్యమయ్యింది అంతేకాక ‘లాక్డౌన్ నియమాలు కఠినతరం కావడంతో.. వలస కార్మికులంతా ఇళ్ల బాట పట్టారు. దాంతో వారికి కూడా సాయం చేయాలని నిర్ణయించుకున్నాము. నేను, నా టీమ్ హైవేల వెంట ఫుడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసి.. వారికి సాయం చేశాం. వలస కార్మికుల కోసం రైళ్లు ఏర్పాటు చేసేంత వరకు దాదాపు 11 వేల మందిని స్వస్థలాలకు చేర్చాం’ అన్నారు రాజేశ్వరి. అంతేకాక గత మూడు నెలల నుంచి తన టీం ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబానికి దూరంగా ఉంటూ సామాన్యులకు సాయం చేశారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం వారిలో చాలామందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో క్వారంటైన్లో ఉన్నారన్నారు. అయినా కూడా వారంతా ‘‘మేడమ్ .. మేము తిరిగి ఎప్పుడు విధుల్లో జాయిన్ కావాలి’ అని అడుగుతున్నారు. ఈ ఉద్యోగం పట్ల వారికున్న ప్రేమ అలాంటిది. వారందరి సహకారంతోనే నేను ఇదంతా చేయగలిగాను’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజేశ్వరి ప్రయత్నాన్ని నెటిజనులు తెగ ప్రశంసిస్తున్నారు. -
ఆలుమగల గొడవ: యూట్యూబ్‌లో వీడియోలు డిలీట్
కౌలాలంపూర్: భార్యాభర్తలన్నాక సవాలక్ష గొడవలుంటాయి. పరిస్థితులను బట్టి ఎవరో ఒకరు సర్దుకుపోవాల్సిందే. అయితే మలేషియాలో మాత్రం ఓ జంట గొడవ యూట్యూబ్ అభిమానులకు కోపం తెప్పించింది. అది ఎలాగో చదివేయండి.. మలేషియాకు చెందిన ఎం.సుగు, ఎస్.పవిత్ర భార్యాభర్తలు. వీరిద్దరూ కలిసి ఇద్దరి పేరు వచ్చేలా "సుగు పవిత్ర" అనే యూట్యూబ్ చానల్ పెట్టారు. అందులో రుచికరమైన వంటకాల వీడియోలను అప్లోడ్ చేసేవారు. వీరు చేసే వంటలు నచ్చి, తయారీ విధానం మెచ్చి 7.8 లక్షల మంది ఈ ఛానల్‌ను ఫాలో అవుతున్నారు. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 98 వీడియోలను చేశారు. అయితే జూలై 20న ఈ ఆలుమగల మధ్య గొడవ జరిగింది. (అనుకోని అతిధి రాకతో అద్భుతం..) ఈ క్రమంలో తర్వాతి రోజు పూటుగా తాగిన సుగు తన భార్యపై కొడవలితో దాడి చేశాడు. ఆమె గృహ హింస కింద భర్తపై కేసు పెట్టింది. దీంతో సుగు భార్యపై కోపంతో యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోలను డిలీట్ చేశాడు. దీంతో వారికి ఉన్న ఏకైక ఆదాయం పోయినట్లైంది. మరోవైపు మీరు మీరూ తగవులాడుకుని మధ్యలో వీడియోలు ఎందుకు డిలీట్ చేశారని ఆ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు ప్రశ్నిస్తున్నారు. ఏదైతేనేం.. ప్రస్తుతం అక్కడ సుగు పవిత్ర ఛానల్ పేరు మార్మోగిపోతోంది. అయితే పవిత్ర తన భర్తను క్షమించివేసినట్లు, తన కేసు ఉపసంహరించుకున్నట్లు మలేషియా మీడియా పేర్కొంది. త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి మళ్లీ కొత్త వీడియో కూడా చేయనున్నారట. (వెనకాలే ఎలుగుబంటి.. ఆమె ఏం చేసిందంటే!) -
భార్య, అత్తపై విచరక్షణా రహితంగా దాడి
-
సిలికాన్ వ్యాలీలో కన్నీళ్లకు కొదవ లేదు
కాలిఫోర్నియా: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అందమైన ప్రదేశమే కాదు, అక్కడ పనిచేసే ఉద్యోగులకు అధిక జీతభత్యాలు ఉంటాయి. భార్యాభర్తలు కలిసి అక్కడే పనిచేస్తే ఇక వారి వైవాహిక జీవిత వైభోగానికి సరిసద్దులే ఉండవు. సరదాగా కార్లలో పబ్బులకు, క్లబ్బులకు కలసి తిరుగుతారు. వారాంతంలో దూర తీరాల విహార యాత్రలకు వెళతారు. విందు, వినోదాల్లో తేలిపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవితాలు స్వర్గతుల్యం. ఇది బయటకు కనిపంచే ప్రపంచం. ఇదంతా ఒట్టి భ్రమ. సిలికాన్ వ్యాలీలో దక్షిణాసియాకు చెందిన, ముఖ్యంగా భారతీయ పురుష పుంగవులు ఇలాంటి ఆనంద డోలికల్లో తేలిపోతున్నారేమో తెలియదుగాని, వారి భార్యలు మాత్రం భయటకు చెప్పుకోలేని బాధలను అనుభవిస్తున్నారు. గహ హింసలో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. భారత్‌లోని ఐఐటీలో ట్యాప్ రాంకర్గా వచ్చి సిలికాన్ వ్యాలీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అభిషేక్ గట్టానిపై ఆయన భార్య నేహా రస్తోగి గహ హింస కేసు పెట్టడంతో ఇలాంటి అంశాలన్నీ ఒక్కసారిగా వెలుగు చూశాయి. భర్త తనను హింసిస్తున్న విషయాన్ని ఆమె ఐఫోన్లో రికార్డు చేసి, దాన్ని కాలిఫోర్నియా కోర్టులో వినిపించడంతో ఈ వారమే ఆయనకు కోర్టు, నెల రోజుల జైలు శిక్ష విధించింది. మిత్రులతో సహోద్యోగులతో సౌమ్యంగా మెలిగే అభిషేక్ ప్రవర్తన గురించి తెలిసి సిలికాన్ వ్యాలీ నివ్వెరపోయింది. పెళ్లయినా కొత్తలో...ఆ తర్వాత ఐటీ రంగంలోనే ఉన్నత ఉద్యోగం చేస్తున్న రస్తోగి కథనం ప్రకారం పెళ్లైన కొత్తలో దంపతులిద్దరూ ఆనందంగానే ఉండేవారు. రానురాను ఇద్దరు కలసి బయటకు వెళ్లడం తగ్గింది. ఆ తర్వాత ఆఫీసుకు తప్ప బయటకు ఒంటరిగా వెళ్లడానికి వీల్లేదనే ఆంక్షలు భార్యపై మొదలయ్యాయి. చెంప దెబ్బలతో మొదలైన గహ హింస చితకబాదే వరకు వెళ్లింది. తనకు పిల్లలంటే ఇష్టమని, పిల్లలు కావాలను అభిషేక్ డిమాండ్ చేయడంతో అప్పటికే మూడుసార్లు గర్భస్రావంమైన రస్తోగి మందుల వాడడం ద్వారా ఇద్దరు ఆడపిల్లలను తల్లయ్యింది. గహ హింసా ఇంకా పెరిగింది. పిల్లలను ఏమత్రం దగ్గరికి తీయడంగానీ, వారికి సంబంధించిన పనులుగానీ చేసే వాడు కాదు భర్త. పైగా పిల్లలను విసుక్కునే వాడు. బయటే ఎక్కువ కాలం గడిపేవాడు. ఇంటికొస్తే భార్యను కొట్టడమే పనిగా పెట్టుకునే వాడు. ఎలాంటి గహ హింస ఉంటుంది? దక్షిణాసియాలో గహ హింసకు గురవుతున్న మహిళలను రక్షించేందుకు అమెరికాలో మైత్రి, నారికా అనే రెండు సంస్థలు కషి చేస్తున్నాయి. ఈ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం భర్తలు తీసుకెళ్లకుండా భార్యలు బయటకు రాకూడదు. షాపింగ్‌లకు కూడా వెళ్లకూడదు. భార్య మొబైల్లోని నెంబర్లను, మెస్సేజ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్లను చూస్తారు. ఈ నెంబర్లు ఎవరివీ, ఈ మిస్సేజ్‌లు ఎవరివంటూ అనవసర అనుమానాలతో వేధిస్తారు. రానురాను గొడవలు పెరుగుతాయి. చెంప దెబ్బల నుంచి చెప్పు దెబ్బల వరకు గహ హింస వెళుతుంది. కొందరు భార్యల ఉద్యోగాలు మాన్పిస్తారు. వారిని ఇంట్లోనే బంధీ చేస్తారు. పిల్లలు పుడితే వారి బాగోగుల సంగతి భార్యలకే వదిలేస్తారు. పట్టించుకోరు, ప్రశ్నిస్తే మళ్లీ హింస...అత్తామామలతో ఉండే కోడళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయరు? గహ హింస ఎదుర్కొంటున్న మహిళలు అమెరికా పోలీసులు అత్యవసర సేవలు అందించే 911కు ఫోన్ చేయవచ్చు. వాళ్లు వెంటనే స్పందిస్తారు. భర్తలపై గహ హింస కేసు పెడితే వెంటనే భర్తల ఉద్యోగాలు పోతాయి. వారి నుంచి ఇంకా దారుణాలను ఎదుర్కోవాలసి వస్తుందన్న భయం కూడా వారిని వెంటాడుతుంది. డిపెండెంట్ వీసాలపై వచ్చిన భార్యల పరిస్థితి ఇంకా దారుణం. హెచ్–1బీ కలిగిన భర్తలను వదిలేస్తే భార్యల డిపెండెంట్ వీసాలు రద్దవుతాయి. ఉద్యోగాలు పోతాయి. భారత్‌కు రావాల్సి వస్తుంది. వచ్చినా ఫర్వాలేదనుకుంటే అక్కడే పుట్టినందున వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం ఉంటుంది. వారిని తెచ్చుకోవడానికి తల్లులకు హక్కు లేదు. అందుకే వారు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేయరు. 70 శాతం కేసులు ఐటీ నుంచే... ఇలాంటి పరిస్థితులలోనే గహి హింస నుంచి మహిళలను రక్షించేందుకు తాము రంగంలోకి దిగామని మైత్రి, నారికాలు తెలిపాయి. ఒక్క 2016లోనే తమకు 4,330 మంది మహిళల నుంచి ఫిర్యాదులందాయని మైత్రి తెలిపింది. 2013లో అందిన ఫిర్యాదులతో పోలిస్తే ఇవి రెండింతలట. ఏడాదికి తమకు దాదాపు 1200 ఫిర్యాదులు అందుతాయని నారికా వెల్లడించింది. అందులో 65 నుంచి 70 శాతం ఐటీ రంగానికి చెందిన మహిళలే ఉంటున్నారని పేర్కొంది. భార్యా భర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు ఇటు అమెరికా, అటు భారత్ చట్టాలను దష్టిలో పెట్టుకొని తాము పరిష్కార మార్గాలు సూచిస్తున్నామని చెప్పారు. రస్తోగి సూచిస్తున్న చిట్కాలు... మగవారి గహ హింస నుంచి బయట పడాలంటే సంయుక్తంగా బ్యాంక్ ఖాతా తెరవకూడదు. ఇద్దరి ఖాతాలు వేర్వేరుగా ఉండడమే మంచిది. వ్యక్తిగత స్వేచ్ఛను ముందునుంచే కాపాడుకోవాలి. పిల్లలను అసలు కనకూడదని అమె చెబుతున్నారు. అమెరికాలో నివసించే పాశ్చాత్య, యూరప్ దేశాల భార్యా భర్తలో ఈ గహ హింస లేదని, భారత్ లాంటి దక్షిణాసియా దేశాల కుటుంబాల్లోనే ఈ హింస ఎక్కువగా ఉందని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అందుకు వారి సంస్కతే కారణమని, విడుకులు తీసుకోవడంలో వారికున్న స్వేచ్ఛ మనకు లేదని వారంటున్నారు. పాశ్చాత్య సంస్కతి మోజులో పడే మగవాళ్లు, ఆ సంస్కతికి భార్యలను దూరంగా ఉంచాలనుకోవడం వల్ల కూడా భార్యాభర్తల్లో సమస్యలొస్తున్నాయని, అది గహ హింసకు దారితీస్తోందని వారు చెబుతున్నారు. -
భర్త కాటుకు భలే దెబ్బ
అసలు సామెత.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. భర్తలు మనుషుల్లా ప్రవర్తించకపోతే.. కరవడం దాకా ఎందుకు.. మొరిగినా చాలు చట్టం ‘గొలుసు’తో కట్టేస్తుంది! ఆ తర్వాత కూడా తోక ఆడిస్తే.. దెబ్బ వేస్తుంది. గృహహింస నుంచి బంగారు తల్లులను రక్షించడానికిది.. భలే చట్టం. ఉసూరుమంటూ గేటు తీసి, కాంపౌండ్‌లోకి వచ్చింది ఉష. రెండు బస్సులు మారి రావడంతో ఒళ్లు హూనమైపోనట్లయింది.వరండాలో పిల్లలు బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. ‘ఏమ్మా డాలీ.. ఇంట్లోకి ఎందుకు వెళ్లలేదు?’ అని కూతుర్ని అడిగింది. ‘డాడీ పక్కింటి ఆంటీకి కీస్ ఇవ్వలేదటమ్మా! తమ్ముడికి ఆకలేస్తోందట.. నీ కోసం వెయిట్ చేస్తున్నాం’ అంది కూతురు. తల్లి మనస్సు తల్లడిల్లింది. తాళం తీసి ఇంట్లోకి వెళ్లింది. లైట్ వేసింది. వెలగలేదు! వీధిలో అందరికీ కరెంట్ ఉంది. వాచ్‌మెన్‌ని అడిగితే, ‘ఈ నెల కరెంటు బిల్లు కట్టలేదటమ్మా.. డిపార్ట్మెంట్వాళ్లొచ్చి మధ్యాహ్నమే కట్ చేసి వెళ్లారు’ అని చెప్పాడు. ‘ఈ ఫోన్‌కి కాల్ చేస్తే అతనొచ్చి బిల్లు కట్టించుకుని కనెక్షన్ ఇస్తాడంట’ అని.. ఫోన్ నెంబర్ రాసి ఉన్న స్లిప్పు ఇచ్చాడు. బిల్లును చూసుకుంది ఉష. గాడ్! వెయ్యి రూపాయలు. నెలాఖరు రోజులు. అంత డబ్బెలా కట్టాలి? ఇల్లంతా వెతికి వెతికి చిల్లర జమ చేసి, పక్కింట్లోంచి కొంత చేబదులు తీసుకుని వెంటనే కరెంట్ కనెక్షన్ ఇప్పించుకుంది. స్వర్గసీమను నరకం చేశాడు! బెడ్రూమ్లోకి వెళ్లింది ఉష. అందులోని వాష్‌రూమ్‌కి తాళం వేసి ఉంది! బుర్ర తిరిగిపోయింది. దేవుడా అనుకుంది. తిరిగి పిల్లల రూమ్‌లోకి వచ్చింది. ‘అమ్మా.. ఆకలి’.. కడుపు చేత్తో పట్టుకుని తల్లి చెంతకు వచ్చాడు కొడుకు. ‘అయిపోతుందమ్మా... స్నాక్స్ చేస్తున్నాను’ అంటూ మిక్సీ దగ్గరకు వెళ్లింది. వైర్ కట్ అయిపోయి కనిపించింది మిక్సీ! అరె, మాయగా ఉందే అనుకుంది ఉష.. అలసటని, చికాకుని దాచుకునే ప్రయత్నం చేస్తూ. రిఫ్రెష్ అవ్వకుండా.. అప్పటికప్పుడు వేడివేడిగా ఉప్మా చేసి పెట్టి పిల్లల ఆకలి చల్లార్చింది. తర్వాత కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా తెరిచింది. ఫ్చ్. బియ్యం లేవు! ఉదయమే చెప్పి వెళ్లింది కిశోర్‌కి, బియ్యం తెచ్చిపెట్టమని. తేలేదన్నమాట. పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. ‘అమ్మా.. స్కూల్ ఫీజ్‌కి రేపే లాస్ట్ డేట్’.. కూతురు గుర్తుచేసింది. ఒక్కక్షణం తనవన్నీ సినిమా కష్టాల్లా అనిపించాయి ఉషకి. అంత ఒత్తిడిలోనూ తనను తను సముదాయించుకుంటోంది. ‘అలాగే అమ్మా..’ అని చెప్పి బాత్రూమ్లోకి వెళ్లింది. అర్జెంటుగా తనిప్పుడు స్నానం చెయ్యాలి. వేణ్ణీళ్లతో స్నానం చేస్తే కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. పిల్లల బాత్రూమ్లో గీజర్ లేదు. మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే ఉంది. దానికి తాళం వేసి ఉంది. ఆలోచనలో పడిపోయింది ఉష. ఇదంతా కిషోర్ చేస్తున్న పని కాదు కదా, ఉద్దేశపూర్వకంగానే తను ఇలా చేస్తున్నాడా అనుకుంది. కొన్నాళ్లుగా భర్త కిషోర్ ప్రవర్తనలో మార్పును గమనిస్తోంది ఉష. ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు పైన రెండు గదులు కట్టించి అద్దెకు ఇవ్వాలని కిశోర్ అంటున్నాడు. ఆ అనడం క్రమంగా సతాయింపుగా మారుతోంది. సతాయింపు కొన్నిసార్లు వేధింపు స్థాయిని అందుకుంటోంది! ఉష పేరు మీద ఉన్న ప్లాట్‌ని అమ్మించి, ఇప్పుడున్న ఇంటిపై గదులు కట్టించాలని కిశోర్ ఒత్తిడి తెస్తున్నాడు. ఇదే విషయమై తరచు గొడవ పడుతున్నాడు. ఆ ప్లాట్‌ని అమ్మడం ఉషకు ఇష్టం లేదు. ముందుముందు పిల్లల చదువులకు పనికొస్తుందని ఆమె ఆశ. పైగా వాళ్లుంటున్న ఏరియాలో అద్దెలు కూడా ఎక్కువగా రావు. ఆ మాట అంటే కిశోర్ వినడం లేదు. పైగా కోపం తెచ్చుకుంటున్నాడు. కిశోర్ మొండితన ం గురించి ఉషకు తెలియంది కాదు కానీ, ప్లాటు విషయమై పట్టినపట్టు విడవకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. అస్తమానం పిల్లల ముందు గొడవపడితే ఆ పసి మనసులు కల్లోలం అయిపోతాయేమోనన్న భయంతో అన్నిటికీ ఓర్చుకుని నెట్టుకొస్తోంది. వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడవుతాయని.. చిన్న ఉద్యోగం వస్తే, ఇరవై కిలోమీటర్ల దూరమే అయినా వెళ్లి వస్తోంది. ఆ ఉదయం మళ్లీ గొడవైంది. ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. తేలిగ్గా తీసుకుని ఆఫీసుకు వెళ్లిపోయింది. తనూ మొండి వైఖరి ప్రదర్శిస్తే మొదటికే బంధం తెగిపోవచ్చు. అందుకుని అడ్జెస్ట్ అవుతోంది. ఇదిగో... ఇప్పుడు ఇంటికొచ్చేటప్పటికీ ఇలా ఉంది పరిస్థితి. పిల్లలు వింటున్నారన్నా వదల్లేదు! రాత్రి బాగా లేట్‌గా వచ్చాడు కిశోర్. ‘అబ్బో కరెంట్ తెప్పించుకున్నావే! భేష్. ఎంతైనా సంపాదనాపరురాలివి కదా’ అన్నాడు. ప్లేట్లో అందించిన చపాతీలను విసిరికొట్టి, ‘ఏం? బియ్యం తెప్పించుకోలేదా?’ అని పెద్దగా అరిచాడు. పిల్లలు వింటారు అన్నట్లు అతడి వైపు చూసింది ఉష. ‘ఇక మీదట ఇంటి ఖర్చులకూ నాకూ ఏ సంబంధమూ లేదు. నేను బయట తినొస్తాను. నా మాటా వినని వారు నా ఇంట్లో ఉండకూడదు’ అని పెద్ద గొడవ చేశాడు. ‘పిల్లలు వింటున్నారు. మెల్లిగా మాట్లాడండి’ అని ప్రాధేయపడింది ఉష. కిశోర్ వినలేదు. ‘నా అరుపులే కదా ఇప్పటి వరకు పిల్లలు విన్నారు. ఇప్పుడు నీ అరుపులు వింటారు చూడు’ అంటూ చప్పున బెల్టు తీసి ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. ఉష అరవలేదు. బాధను అదిమి పెట్టుకుంది. అది ఇంకా కోపం తెప్పించింది కిశోర్‌కు. పిడికిలి బిగించి ఆమె ముఖం మీద కొట్టాడు. ‘అమ్మా’ అని అరిచింది ఉష. ఆ పెదవుల మధ్య తడిగా.. ఉప్పటి స్పర్శ! వేలితో తడుముకుంది. రక్తం!! ఆర్థికంగా.. మానసికంగా.. శారీరకంగా... రాత్రంతా నిద్ర పోలేదు ఉష. ఆమె దేహం దెబ్బతింది. ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది. ఈ రెండిటి కన్నా కూడా.. భర్తతో ఆమె అనుబంధం దెబ్బతింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తల్లిదండ్రులతో పిల్లల బంధం దెబ్బతింటుంది. ఆలోచనలు ఉషను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఇంటి కోసం ఒక్క పనీ చేయడం లేదు కిశోర్. అంతేకాదు, ఇంట్లోని వస్తువులను వాడుకోనివ్వడం లేదు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. భర్త కారణంగా ఆఫీసు నుంచి ఇంటికి రావడానికే భయం వేస్తోంది ఉషకు. తనపై కోపంతో, పగబట్టినట్లు బిహేవ్ చేస్తున్నాడు కిశోర్. అతని ఇష్ట ప్రకారమే ప్లాటు అమ్మేసి, ఇంటిపైన గదులు వేయించినా అతడు మారతాడనేం లేదు. అప్పుడు ఇంకొకటేదో మొదలుపెడతాడు. ‘అద్దెల మీద బతికేయెచ్చు’ అని కిశోర్ తరచు అనేమాట చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఉషకు. ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నదో చితకదో తనూ చేస్తోంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు చేస్తే.. తమకేం తక్కువని! ప్లాటు ఎలాగూ ఉంటుంది. ఉండేది అలా ఉండిపోదు కదా. వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇవేవీ కిశోర్ తలకు ఎక్కడం లేదు. తెల్లవారుతుండగా ఒక నిర్ణయానికి వచ్చింది ఉష. ఆఫీస్‌లో లేట్ పర్మిషన్ తీసుకుని ‘ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్’కి వెళ్లింది! అక్కడ ఓ విభాగానికి పెద్ద బోర్డు వేలాడుతోంది. ‘డొమెస్టిక్ వయెలెన్స్ కేసెస్ ఆఫీస్’ అని! పదిరోజులు.. పంటి బిగువన..! ‘ఇది డొమెస్టిక్ వయెలెన్స్’ కిందికి వస్తుంది అన్నారు.. ఉష చెప్పిందంతా విన్న లీగల్ ఆఫీసర్. కేస్ ఎలా ఫైల్ చెయ్యాలో కూడా చెప్పారు. చాలా సులభంగా ఉంది ఆ ప్రొసీజర్ అంతా. ఉష మౌనంగా ఉండిపోయింది. ‘చెప్పండమ్మా.. ఏం చేద్దామంటారు’ అన్నారు ఆఫీసర్.‘కేసు పెట్టడం నా ఉద్దేశం కాదు సర్. నా భర్త మారేలా కౌన్సెలింగ్ ఇప్పించగలరా?’ అని అభ్యర్థనపూర్వకంగా అడిగింది ఉష. ఆ తర్వాత పది రోజుల్లో కిశోర్‌కి నోటీసులు వెళ్లాయి. ఈ పదిరోజుల్లో కిశోర్ ప్రవర్తన మితిమీరిపోయింది. పంటిబిగువన ఓపిక పట్టింది ఉష. నోటీసు రాగానే కాస్త నెమ్మదించింది.‘ఎంతకు తెగించావే’ అంటూ శాపాలు, శాపనార్థాలు పెడుతూ కౌన్సెలింగ్‌కి బయల్దేరాడు కిషోర్. హింస నుంచి రక్షణ ఉత్తర్వులు కౌన్సెలింగ్ మొదలైంది. కౌన్సెలింగ్ పూర్తయింది. లాయర్ ప్రస్తాంచిన ‘డీవీ’ యాక్ట్ తప్ప కిశోర్‌కి ఏవీ గుర్తులేవు. ‘మీ భార్య తలచుకుంటే మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపోయేలా ఈ చట్టం ద్వారా ఆమె ఆదేశాలు తెచ్చుకోవచ్చు. ఉమ్మడి నివాసం నుండి భర్తను ఖాళీ చేయించడానికి మాత్రమే కాదు.. తనను, పిల్లల్నీ వేధించకుండా ‘రక్షణ ఉత్తర్వు’లను కూడా ఆమె ఈ చట్టం ద్వారా పొందవచ్చు’ అని చెప్పాడు లాయర్. అయితే ఆమె మీపై కేసు పెట్టాలని కోరుకోవడం లేదు. మీరు మారితే అదే చాలు అనుకుంటోంది’ అని కూడా చెప్పాడు. కిశోర్ ముఖం వాడిపోయింది. అతడి కళ్లలో భయం కనిపిస్తోంది. ‘ఇకపై అలాంటి పనులు చేయను’ అని లిఖితపూర్వకంగా అంగీకరించి కేసు విత్‌డ్రా చేయించుకున్నాడు. గృహహింస (రక్షణ చట్టం) ఏం చెబుతోంది? ‘గృహహింస నుంచి, వేధింపుల నుంచి మహిళకు రక్షణ కల్పించడం కోసం 2005లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అదే డీవీ యాక్ట్. (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయెలెన్స్). ఈ చట్టం ప్రకారం... భర్త కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ మహిళను ఏ విధంగానైనా హింసిస్తే, ఆమె కోర్టును ఆశ్రయిస్తే.. కోర్టు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. గృహోపకరణాలను వాడుకోనివ్వకుండా అడ్డుకోవడడం, ఇంట్లోని సదుపాయాలను, సౌకర్యాలను వినియోగించకుండా నిరోధించడం; బియ్యం, ఇతర సరకులను తీసుకురాకుండా ఉండడం; అద్దె, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కట్టకుండా ఉండడం, పిల్లల ఫీజులకు, గృహావసరాలకు డబ్బులు ఇవ్వకపోవడం.. ఇవన్నీ కూడా గృహ హింసనుంచి రక్షణ కల్పించే చట్టం పరిధిలోకే వస్తాయి. అంతేకాదు.. సూటిపోటి మాటలతో మహిళను కించపరచడం, ఆమె ఆత్మాభిమానం దెబ్బతినేలా అవమానించడం, చెయ్యి చేసుకోవడం, ఆహారం అందకుండా నిర్బంధించడం, బెదిరించడం.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏ విధంగా మహిళను వేధించినా కూడా ఈ చట్ట ప్రకారం.. ఆ మహిళ కోర్టు నుంచి ‘రక్షణ ఉత్తర్వు’లను పొందవచ్చు. ఇ. పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
ఆ కేసు అత్తమామలపై కూడా వేయచ్చు!
గృహహింస :: కేస్ స్టడీ శ్రీలత వివాహమై నాలుగేళ్లయింది. భర్త ఐటీ ఉద్యోగి. రెండేళ్ల బాబు. దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో భర్త మరణించాడు. అప్పటిదాకా భర్త, అత్తమామలతో కలిసి ఉన్న శ్రీలత పుట్టింటికి చేరింది. పుట్టెడు దుఃఖంతో ఉండి ఏ వ్యవహారాలూ పట్టించుకోలేదు. అత్తగారింట్లో దాదాపు యాభై తులాల బంగారం ఉండిపోయింది. బీరువాలో ఉంచి అత్తగారే తాళం వేశారు. భర్తచనిపోయిన నెలవరకూ అత్తింటివాళ్లు సానుభూతి చూపారు. ఏమైందో ఏమో హఠాత్తుగా వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. శ్రీలత వల్లే తమ కుమారునికి ఆరోగ్యం దెబ్బతిందనీ, ఆమె కారణంగానే అతను మరణించాడనీ, ఆమె జాతకం బాగోలేదనీ నిందించసాగారు. లేనిపోని అభాండాలు వేస్తూ, కొడుకే తమకు కాకుండా పోయాక కోడలితో తమకిక ఏ సంబంధమూ లేదని తెగేసి చెప్పారు. శ్రీలత వారి కడుపుకోతని అర్థం చేసుకుని మిన్నకుండింది. అత్తగారింటినుండి ఏ సహాయమూ ఆశించలేదు, అందలేదు. కానీ బీరువాలో ఉన్న నగలు ఆమె పుట్టింటివారు పెట్టినవి. అవి ఆమె స్త్రీ ధనం. వాటికోసం అత్తగారిని అడిగితే ఆమె ససేమిరా అన్నారు. తమకేం తెలీదని, శ్రీలతే వాటిని తీసుకొని వెళ్లిందని గొడవ పెట్టుకున్నారు. అత్తగారు ఆ నగలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి శ్రీలత విస్తుపోయింది. తెలిసినవారు గృహహింస కేసు వేయమన్నారు. సాధారణంగా ఆ కేసులు భర్తలపై వేస్తారు కదా! మరి అత్తగారిపై వేయవచ్చా అనే సందేహంతో న్యాయవాదిని ఆశ్రయించింది. అత్తమామలపై ఖచ్చితంగా కే సు వేయవచ్చునని, శ్రీలతకు వారు వివాహం ద్వారా బంధువులవుతారని, అందువల్ల గృహహింస చట్టం ప్రకారం వారిపై కేసు వేయవచ్చునని న్యాయవాది తెలిపారు. నగలకు సంబంధించిన బిల్లులు, బీరువాలో అత్తగారు భద్రపరిచిన విషయం తెలిసిన సాక్షులు, కట్టుబట్టలతో పుట్టింటికి వెళ్లిన వైనం తెలిసిన శ్రేయోభిలాషులు ఉండడంతో ఊపిరి పీల్చుకొని కే సు వేసి, తన స్త్రీధనం దక్కించుకోవాలని నిర్ణయించుకుంది శ్రీలత. -
గృహహింసకు వీసా
వీసాలు రావడం కష్టమే. అమ్మాయి పెళ్లి చెయ్యడం? అమ్మో... అదీ పెద్ద కష్టమే. ఈ రెండు కష్టాలూ మూడు ముళ్లతో సెటిలైపోతే? ‘అబ్బ! ఎంత బాగుండు!!’ అనుకునే అమ్మాయిల తల్లిదండ్రులు ఎందరో! ఫారిన్లోఉన్న ఒక అయ్య చేతిలో పెడితే... అమ్మాయి సుఖపడుతుందని ఎంత సంబరమో! అమ్మా.. సిగరెట్లతో కాలుస్తున్నాడే... బెల్టుతో కొడుతున్నాడే... అన్నం పెట్టడం లేదే... కడుపులో తంతున్నాడే... ఇంట్లోనుంచి బయటికి అడుగుపెట్టనివ్వడం లేదే.. అన్నిటికీ అనుమానిస్తున్నాడే.. నాన్నకు చెప్పకే బాధపడతాడూ... ఏదో చేసి నన్ను వెనక్కి రప్పించుకోవే. ఇవీ... తరచు తల్లిదండ్రులు వింటున్న ఆక్రందనలు! దీనికి పరిష్కారం లేదా? ఉంది! కాలం మారినా స్త్రీల పట్ల హింసకు కాలం చెల్లలేదు. ముఖ్యంగా గృహహింసకు. స్వదేశంలో సరే విదేశాలలోనూ ఇది పెరిగిపోతోంది. ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలను సహిస్తూ వాళ్ల శాడిజానికి బలవుతున్న బాధితులు ఎక్కువవుతున్నారు. తాజా ఉదాహరణ హైదరాబాద్‌కు చెందిన రమ్యకృష్ణ. అమ్మానాన్నలు ఈ ఒక్కగానొక్క కూతురుని బాగా చదివించారు. తెలియని సంబంధమైతే ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని బంధువుల సంబంధాన్నే ఖాయం చేశారు. అబ్బాయికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం. ఘనంగా పెళ్లి చేసి కాపురానికి కావల్సిన వస్తువులను సారెగా ఇచ్చి సాగనంపారు. వెళ్లాక అమ్మాయి కూడా ఉద్యోగంలో చేరింది. కొన్నాళ్లు సవ్యంగానే గడిచిన ఆ సంసారంలో కలతలు వచ్చాయి. రమ్యకృష్ణ తల్లిదండ్రులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. బిజినెస్ చేస్తాను డబ్బు సర్దమని అల్లుడు అడిగితే ఇండియాలో లోన్ తీసుకొని మరీ డబ్బు పంపారు. అయినా అబ్బాయి సంతృప్తి పడలేదు. పిల్లలు కలగట్లేదంటూ ఆరళ్లు మొదలయ్యాయి. తన బాధను తల్లితో ఏకరువు పెట్టుకుంది. అంతా చక్కబడ్తుందిలే అని నచ్చజెప్పారు. కాని సమస్య చక్కబడలేదు. రమ్యకృష్ణ ప్రాణాన్ని బలితీసుకుంది. ఆత్మహత్య చేసుకుందని భర్త, కాదు హత్య అని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా రమ్యకృష్ణ జీవితం అలా ముగియాల్సింది కాదు. ఇదో ఇంకో వేధింపు కరీంనగర్‌జిల్లాకు చెందిన మాధవి బీటెక్ చేసింది. ఎమ్‌టెక్ చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సురేష్‌తో పెళ్లి అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా కుదిరిన సంబంధం. పెళ్లిచూపులయ్యాక పెళ్లికి 20 రోజుల వ్యవధే ఇచ్చారు అబ్బాయి తరపువాళ్లు. ‘ఇంత త్వరగానా? కుదరదేమో’ అని అమ్మాయి తరపువాళ్లు వెనకడుగువేస్తుంటే.. ‘అబ్బాయికి లీవ్ దొరకదు. కష్టం. మళ్లీ పెళ్లి కోసం రాలేడు’ అంటూ తొందర పెట్టారు. పెళ్లిచూపులప్పుడే సురేష్ ప్రవర్తన మాధవికి నార్మల్‌గా అనిపించలేదు. ఫోన్లో కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఈ విషయమే తల్లితో చెప్పింది. టెన్షన్ పడ్తున్నాడేమోలే అని తల్లి కొట్టి పారేసింది. అయితే మాధవి సందేహం అబద్ధం కాలేదు. హడావుడి పెళ్లి, అంతకన్నా హడావుడిగా అమెరికా ప్రయాణం. ల్యాండ్ అయిన వారానికి తెలిసింది మాధవికి తన భర్తకు మగాళ్లంటేనే ఇష్టమని. మోసపోయాననే అవమానం ఆవేశంగా మారింది. ‘నీ పరిస్థితి తెలిసీ నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని’ భర్త కాలర్ పట్టుకుంది. ‘మా అమ్మానాన్నా కోసం. చుట్టాలు, ఫ్రెండ్స్ దగ్గర పరువు కాపాడుకోవడానికి’ సమాధానమిచ్చాడు. కుమిలికుమిలి ఏడ్చింది. ఎక్కడ వాళ్ల తల్లిదండ్రులతో చెప్పి తన బండారం బయటపెడ్తుందోనని భయపడ్డ సురేష్ భార్య పాస్‌పోర్ట్ తీసి దాచేశాడు. సెల్‌ఫోన్ లాక్కున్నాడు. ఇంట్లో ల్యాండ్‌లైన్ కట్‌చేశాడు. ఇంటర్నెట్ కనెక్షనూ తీసేశాడు. ఏం చేయాలో పాలుపోలేదు. నెల రోజులవుతున్నా తమ కూతురితో మాట్లాడలేకపోవడం, అన్నిటికీ అల్లుడే ఆన్సర్ చేయడం, మాధవి మాట్లాడలేకపోవడానికి ఏదో ఒక సాకు చెప్పడం ఆమె తల్లిదండ్రులు అనుమానించేలా చేశాయి. దాంతో వాళ్లు రంగంలోకి దిగేసరికి సురేష్ దొరికిపోయాడు, మాధవి బతికిపోయింది. ఈ మధ్యే జరిగిన ఇలాంటి ఓ డజన్ సంఘటలను ఉదహరించొచ్చు. అన్నిట్లో బాధితులు లోకజ్ఞానంలేని అమాయకులు కాదు. అయినా భర్తల ఆగడాలకు బేలగా బలైపోయారు. కారణం... విదేశీ చట్టాలపట్ల అవగాహన లేకపోవడం. ఇబ్బందుల్లో ఉంటే అత్యవసరంగా ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి అడుగువేయాలి అన్న విషయాలు తెలియకపోవడం. అసలు వాటి గురించిన ధ్యేసే లేకపోవడం. ఇక్కడంటే అమ్మా నాన్న, అన్న, అక్క, స్నేహితులు, బంధువులు అందరూ ఉంటారు. మరి దేశంకాని దేశంలో? షెల్టర్ హోమ్స్ ఎక్కడుంటాయి? ఉంటున్న ఊళ్లో అడ్వకేట్లు ఎవరు? వాళ్ల నంబర్లు, కౌన్సిలింగ్ సెంటర్ల వివరాలు గట్రా తీసుకోవాలి, విధిగా దగ్గరపెట్టుకోవాలి అన్న ఆలోచన ఏ ఆడపిల్లా చేయదు. ఎందుకంటే భర్త మీద నమ్మకం. పెళ్లి కుదరగానే ఫేస్బుక్, వాట్సప్ చాటింగ్స్‌లో కాబోయే భర్త మనస్వత్వాన్ని అంచనా వేసే ప్రయత్నమూ చేయదు. ఇక్కడా నమ్మకమే నడిపిస్తుంది. లక్షల కట్నాలు, ఆర్భాటపు పెళ్లి మీద ఆరాటం తప్ప అమ్మాయి ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉండబోతోందన్న ఆందోళన, ఆలోచనలేదు అమ్మాయి తల్లిదండ్రులకు. అందుకే ఎన్ఆర్ఐ సంబంధాలు అన్నీ కాకపోయిన చాలా విఫలమై విషాదం మిగులుతోంది. కనుక ముందే జాగ్రత్త పడాలి. విదేశి సంబంధాలు ఖాయం చేసుకునే ముందు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి. పెద్ద దేశాల్లో అమ్మాయి సుఖపడేమాట నిజమే కాని ఆ సుఖం చేసుకోబోయేవాడి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. - సరస్వతి రమ మధ్యవర్తులు పోయి మ్యారేజ్ బ్యూరోలు రావడంతో.... ఎన్ఆర్ఐ సంబంధాలన్నీ దాదాపు షార్ట్‌టైమ్ గడువుతో కుదురుతున్నవే. ఇంతకుముందు మధ్యవర్తులుండేవాళ్లు. రెండు కుటుంబాల గురించిన విరాలను తెలిపేవాళ్లు. ఇప్పటి సంబంధాలన్నీ అన్నీ మ్యారేజ్‌బ్యూరోలు, ఆన్లైన్ మ్యాట్రిమోనీలు కుదురుస్తున్నవే కాబట్టి నచ్చిన సంబంధం గురించి తెలుసుకునే బాధ్యతను అమ్మాయి తరపు దగ్గరి బంధువుకి అప్పగించాలి. ఇర ుకుటుంబాల పెద్ద మనుషుల ముందుకూర్చోని ఆ కుటుంబాల వాళ్లు కట్నకానుకల విషయం కాక అబ్బాయి, అమ్మాయి మనస్తత్వం, ప్రవర్తనల గురించి మాట్లాడాలి. సర్దుబాటు చేసుకోగలరో లేదో అంచనాకు వచ్చే వీలుంటుంది. అమ్మాయి, అబ్బాయి కంపార్టబులిటీ చెక్ చేసుకోవడానికి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ వెళితే మంచిది. - పద్మపాల్వాయ్, సైకియాట్రిస్ట్. విదేశీ సంబంధం ఖాయం చేసుకునే ముందు.... ⇒అబ్బాయి తరపు ఆనవాళ్లను అంచనావేయాలి. ⇒వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని తెలుసుకోవడం అత్యవసరం. నేర చరిత్ర ఉందేమోనని అనుమానడ్డంలో తప్పులేదు. నివృత్తి చేసుకునే వంకతోనైనా ఆ కుటుంబ వివరాలు తెలుస్తాయి. ⇒ అబ్బాయి ఉద్యోగం చేస్తున్న చోటు, జీతం, ఉద్యోగం పర్మినెంటా? టెంపరరా? వగైనా వివరాలు తెలుసుకోవాలి. అతను ఉంటున్న చోటునూ తెలుసుకోవాలి. అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే చుట్టుపక్కల స్పందించే వాళ్లున్నారా ఆరా తీయాలి. ⇒అతనికి ఎలాంటి వీసా ఉంది, అమ్మాయిని ఏ వీసా మీద తీసుకెళ్తున్నాడు? ఒకవేళ డిపెండెంట్ వీసా మీద వెళితే ఎన్నాళ్లలో ఇండిపెండెంట్ వీసా వస్తుంది? అతని ఉద్యోగం అందుకు పర్మిట్ చేస్తుందా? వంటి విషయాలను వీసా కన్సల్టెన్సీ ద్వారా తెలుసుకోవాలి. సమాచారమంతా ఆన్లైన్లో అందుబాటులో ఉండే కాలం కాబట్టి ఈ విషయాలన్నీ అమ్మాయిలూ తెలుసుకోవచ్చు. పెళ్లాయ్యాక తాను ఏ దేశం వెళ్లబోతోందో ఆ దేశానికి సంబంధించిన చట్టాలు, ఆడవాళ్లకు కల్పిస్తున్న వెసులుబాటు, సౌకర్యాలనూ అమ్మాయిలు తెలుసుకోవాలి. డొమెస్టిక్ వయెలెన్స్‌ను ఫైల్ చేయడానికి అప్రోచ్ కావల్సిన ప్రొసిజర్ను తెలుసుకోవాలి. ⇒విదేశాల్లో భారతీయ మహిళలను భర్తలు డొమెస్టిక్ వయెలెన్స్‌కు గురి చేస్తున్నా , అదనపు కట్నం కోసం వేధిస్తున్నా వాళ్ల మీద అక్కడ కోర్టుల్లో కూడా కేస్ ఫైల్ చేయొచ్చు. లేదంటే ఇక్కడా చేయొచ్చు. ఇక్కడ కేస్ ఫైల్ చేస్తే అక్కడున్న భర్తను రప్పించడానికి రెడ్‌కార్నర్ నోటీసు ఉంది. ఒకవేళ భర్త ఇక్కడే ఉండి తప్పించుకోవడానికి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తే ‘లుక్ అవుట్నోటీస్’ అతన్ని వెళ్లనివ్వకుండా చేస్తుంది. ⇒దేశంలోనైనా, విదేశాల్లో నైనా అత్తింట్లో, భర్త చేతిలో అమ్మాయి ఆరళ్లకు గురవుతుంటే అక్కున చేర్చుకోవడానికి తామున్నామనే భరోసాను తల్లిదండ్రులు కల్పించాలి. అమ్మాయి వేసే ఏ అడుగుకైనా అండగా ఉంటామనే ధైర్యాన్నివ్వాలి. - రమ్యకుమారి, హైకోర్ట్ అడ్వకేట్ -
మృగాడి చేతికి గాజులు!
అత్యాచారంతో గొంతు నులిమేస్తే.. ష్ష్ష్! ఆధిపత్యంతో నోరు నొక్కేస్తే.. ష్ష్ష్! అల్పత్వంతో ఆత్మాభిమానానికి శిలువేస్తే.. ష్ష్ష్! ఏం చేయాలి?! ఏం చేస్తారు?! ఏం చేద్దాం?! ఈ దుర్మార్గాన్ని ఎలా దులపాలో? ఈ దాష్టీకం ఎలా ఆగాలో? ఎవరు ఆపాలి? మగాడే కదూ! కానీ, మగాడే మృగాడవుతున్న జాబితా క్షణక్షణం పెరుగుతోంది. ఒక అన్నయ్య, ఒక నాన్న, ఒక బాబాయి, ఒక మామయ్య. మర్చిపోయాం... ఒక తాతయ్య. ఓ... ఇంకో మగానుభావుడు ఉన్నాడు, అదేనండీ... ప్రేమికుడు. హత్ తెరికి... ఈనాటి ఒక ప్రేమికుడు వేధింపుల్లో గ్రాడ్యుయేట్ అయితే, ఒక భర్తగారేమో హింసలో పోస్ట్‌గ్రాడ్యుయేట్. ఇక వీళ్లందరికీ పాఠాలు చెప్పే టీచకులూ ఉన్నారు... కొందరు ఖాకీలూ ఉన్నారు. మరి చట్టాలు చేసేవారు... శాసనసభల్లో కూర్చునేవారూ... వీళ్లల్లో మాత్రం దుశ్శాసనులు లేరా? ఇంకా కనపడని ఈ చీకటి పొరలలో... ఎంతమంది మృగాళ్లు దాగున్నారో! పింప్స్, ట్రాఫికర్స్, బ్రోకర్లను నీచాతినీచులంటాం. మరి వీళ్లని...? దొంగలైతే పట్టుకోవచ్చు. మరి కాపాడాల్సినవాళ్ళే క్రూర మగాళ్ళయితే... ఎలా? ఛీఛీఛీ.. వెగటు పుడుతోంది. కడుపు తిప్పేస్తోంది. నిస్సహాయత గొంతు పిసికేస్తోంది. మన అచేతన మీద మనకే అసహ్యం కలుగుతోంది. ఉచ్ఛనీచాలు మరిచి... వావివరసలు లేకుండా... ఇంటా బయటా... పసిపాపల నుంచి ముసలివారి దాకా అందరి మీదా... ఈ నీచ్ కీచకులు కామం కక్కుతున్న వాసన... పేపర్లలో, టీవీలలో, ఇంటర్నెట్లో గుప్పుమంటుంటే... ‘ఏమీ చేయవేం’ అన్న ప్రశ్న వెక్కిరిస్తుంటే... ఆ బాధ గొప్పదా? పుండు పడుతున్న చెల్లి బాధ గొప్పదా? బీయింగ్ ఎ సెలైంట్ స్పెక్టేటర్ ఈజ్ ఎ బిగ్గర్ క్రైమ్.. చెడు చేసేవాడి కంటే చెడును చూస్తూ మౌనంగా ఉండేవాడే పెద్ద నేరస్థుడు. మన గొంతును ఎవరు నొక్కేశారని? మన నోటిని ఎవరు కుట్టేశారని? గుర్తుంచుకోండి! మానం దోచేవాడికి సాయం చేసేదే మన మౌనం. మన చెల్లిని కాపాడేదే... మన గళం. దీనికి మీరే సాక్షి! గృహహింస ఇది రకరకాల రూపంలో స్త్రీలను బాధిస్తోంది.. వేధిస్తోంది.. హింసిస్తోంది. కూరల్లో ఉప్పుకారాల మోతాదు తప్పాయన్న దగ్గర్నుంచి ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, పిల్లలను సరిగ్గా చూడట్లేదని, అత్తామామలను గౌరవించట్లేదని, ఆడబిడ్డ అడుగులకు మడుగులు ఒత్తట్లేదని, పడకటింట్లో సరిగ్గా మసలుకోవట్లేదని, భర్తను నిర్లక్ష్యం చేస్తోందని, చుట్టాలకు మర్యాద చేయట్లేదని, ‘మంచి చీర కట్టుకొని ఎవరి కోసం సింగారించుకున్నా’వని, మంచి చీర కట్టుకోకపోతే ‘పాచిమొహందానా’ అని... ఇలా ఏమి చేసినా.. చేయకపోయినా తప్పుపట్టి ఆపాదమస్తకం భార్యను విమర్శిస్తూ, ఆమె తల్లితండ్రులను కించపరుస్తూ ఆమెకు బతుకును నరకప్రాయం చేసే శాడిజం - గృహహింస. దీనికి సాధారణ గృహిణి నుంచి బాగా చదువుకుని, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డ మహిళల దాకా అందరూ బాధితులే. అలాంటి ఒక బాధితురాలే గుల్బర్గాకు చెందిన ఓ డెంటిస్ట్. ఈమెకు 2004 జూన్‌లో హైదరాబాద్‌లోని అజీజ్బాగ్కు చెందిన ఓ యువకుడితో వివాహమైంది. అప్పట్లో ఇతగాడు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పని చేస్తుండేవాడు. వివాహానంతరం వీరిద్దరూ కలిసి అమెరికాలో కాపురం పెట్టారు. అక్కడ ఉండగా భర్త నుంచి తీవ్ర వేధింపులు ఎదురుకావడంతో అక్కడి పోలీసులకు ఓసారి ఫిర్యాదు చేసింది. దీంతో వారు అక్కడ అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సదరు భర్తకు కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టారు. కొన్నాళ్ల క్రితం ఈ జంట హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తన భర్త ప్రవర్తన మళ్లీ మొదటికి వచ్చేసిందని ఆ డెంటిస్ట్ వాపోయింది. అకారణంగా కొట్టడంతో పాటు శరీరంలోని అనేక ప్రాంతాల్లో కొరుకుతున్నాడంటూ మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె కాళ్లు, చేతులతో పాటు శరీరంపై భీతిగొలిపే రీతిలో ఉన్న పంటి గాట్లను పోలీసులకు చూపించింది. వాటిని చూసి పోలీసులే చలించిపోయారు. బాల్య వివాహాలు ఈ హైటెక్ రోజుల్లోనూ వందలాది బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ - దేశంలోని ఏ మూలో కాదు.. తెలంగాణ నడిబొడ్డున ఉన్న రంగారెడ్డి జిల్లానే. ఈ మధ్య.. అంటే ఓ నెలరోజుల్లోనే ఇక్కడ పదుల సంఖ్యలో బాల్య వివాహాలు జరిగినట్టు దాఖలాలున్నాయి. పద్నాలుగేళ్ల అమ్మాయికి 32 ఏళ్ల అబ్బాయితో వివాహం చేశారు. ఇంకో అమ్మాయి విషయంలోనూ అంతే. పదమూడేళ్ల చిన్నారికి 29 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేస్తే ఆ అమ్మాయి ఆ పెళ్లిని తప్పించుకోవడానికి రాత్రికిరాత్రే ఇంట్లోంచి పారిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉంటూ చదువుకుంటోంది. ఈ కాలంలోనూ ఈ బాల్య వివాహాలకు విస్మయపడాల్సి వస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఇలా ఉంటే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో బాల్యవివాహాలకు కారణాలు ఇంకోరకంగా ఉన్నాయి. వలసలూ ఓ కారణమే! మహబూబ్ నగర్లో బాల్యవివాహాల నేరానికి వలసలు కారణమవుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ వలసవెళ్లక తప్పని పరిస్థితి. తమ పన్నెండు, పదమూడు, పధ్నాలుగేళ్ల ఆడపిల్లల బాధ్యతను ఇంట్లో వృద్ధుల మీద వదిలి పెట్టలేక పెళ్లిచేసి వీళ్లను అత్తారింటికి పంపి వాళ్లు వలసవెళ్తున్నారు. ఇక ఆదిలాబాద్‌లాంటి చోట్ల పేదరికం బాల్యవివాహాలను ఉసిగొల్పుతోంది. ఉత్తర భారతదేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గి వధువుల కొరత ఏర్పడడంతో అక్కడినుంచి ఆడపిల్లల అన్వేషణ కోసం దక్షిణాదికి వస్తున్నారు ఉత్తర భారతీయులు. వారికి మొదటగా కనిపిస్తున్నది తెలంగాణ. ఈ రాష్ట్రానికి తలలాగా ఉన్న ఆదిలాబాద్. ఇక్కడి పేదరికం వాళ్లకు వరంగా మారుతోంది. ఆడపిల్లల తల్లితండ్రులకు కానీ ఖర్చు కానివ్వకుండా టీనేజ్ అమ్మాయిలను పెళ్లిచేసుకొని తీసుకెళ్లిపోతున్నారు. చదువు, నాగరికత - అన్నీ ఉన్న హైదరాబాద్ వంటి నగరాల్లోనూ అడపాదడపా ఈ బాల్యవివాహాల తంతు కనిపిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో 2014లో అడ్డుకున్న బాల్య వివాహాల సంఖ్య 12. కాగా... 2015లో ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఏకంగా 24కు పెరిగింది. వరకట్నం వరకట్న దురాగతానికి బలి అవుతున్న ఆడబిడ్డలెందరో! అలాంటి వాళ్లలో ఒకరు స్వాతి. మెదక్‌జిల్లా తూప్రాన్‌కు చెందిన జగన్నాథం కుమార్తె స్వాతికి సికింద్రాబాద్ వాసి సాయిశంకర్‌తో 2013 నవంబర్ 10న వివాహమైంది. వస్త్రవ్యాపారి అయిన సాయి శంకర్ తన కుటుంబసభ్యులతో కలిసి చిలకలగూడలోని అపార్ట్మెంట్లో ఉండేవాడు. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. వ్యాపార పనులపై సాయి విజయవాడకు వెళ్లాడు. స్వాతి తన కుమారుడితో ఇంట్లో ఉంది. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు తలుపు కొట్టినా స్పందన లేదు. కొద్దిసేపటికి ఆ గదిలో నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. తలుపులు పగులకొట్టి చూస్తే... స్వాతి సీలింగ్ ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. విషయం తెలుసుకున్న స్వాతి పుట్టింటి వారు తమ బిడ్డను ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు అంతా కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై కూతురు తమకు అనేకసార్లు ఫోన్ చేసి బాధపడిందని మృతురాలి తండ్రి జగన్నాథం చెప్పారు. ఎంఈ, బీఈడీ చేసి ఇటీవలే కొన్ని ఉద్యోగ పరీక్షలకు హజరైన తన స్వాతి ఉరివేసుకునేంత పిరికిది కాదని కన్నీటి పర్యంతమయ్యారు. విదేశీ అల్లుళ్ల ఆటలు వివాహ వ్యవస్థ ఆధునిక కాలంలో అనంత నేరాలకు పురుడు పోస్తోంది.ఇలాంటి వాటిల్లో ఎన్ఆర్ఐ భర్తల మోసాలు మొదటిస్థానంలో నిలుస్తాయి. కడప జిల్లాకు చెందిన ఓ ఉన్నత విద్యాధికురాలికి అదే జిల్లాకు చెందిన అమెరికా ఎన్ఆర్ఐ సాఫ్ట్‌వేర్‌తో పెళ్లి అయింది. పెళ్లయిన మూడు నెలలకు అమెరికా తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక తెలిసింది అప్పటికే అతనికి ఓ అమెరికా యూదు యువతితో పెళ్లయిందన్న చేదు నిజం. నిలదీయడంతో ఆమె పాస్‌పోర్ట్ లాక్కున్నాడు. కొట్టడం, తిట్టడం, తిండిపెట్టకపోవడం, ఆమెను రక్తం కారేలా హింసించి ఆ రక్తాన్ని తన పెంపుడు కుక్కతో నాకించడం వంటి ఉన్మాద చేష్టలకు పాల్పడ్డాడు. ఎలాగోలా ఆమె అక్కడినుంచి బయటపడి అతని మీద కేస్ పెట్టింది. ఇప్పుడతను అమెరికా వీసా రద్దయి.. ఇండియన్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. నమ్మకద్రోహం మోసానికి, ద్రోహానికి తేలికగా దొరుకుతోంది అమ్మాయిలే. ప్రేమించి పెళ్లాడిన భార్యనే వెలయాలిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడో ఉన్మాది. నల్లగొండ జిల్లా మల్కపురానికి చెందిన ఎండబెత్తుల మురళీకృష్ణ మరదలి వరసయ్యే అమ్మాయిని ప్రేమించాడు. కృష్ణ కుటుంబీకులు డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారనే ఉద్దేశంతో యువతి కుటుంబీకులు వీరిద్దరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో పథకం ప్రకారం తనతో పాటు యువతికీ మహారాష్ట్రలోని పుణేకు బదిలీ చేయించుకున్న మురళీకృష్ణ అక్కడ ఆమెతో సహజీవనం చేశాడు. ఆ అమ్మాయి ఐదు నెలల గర్భవతిగా ఉండగా హైదరాబాద్‌కి తీసుకువచ్చి నాంపల్లిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ మోసంపై పుణేలో మదర్పట్టా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. యువతి కుటుంబీకులు, పెద్దలు, పోలీసుల సమక్షంలో రాజీ కుదిర్చి రూ.3 లక్షల ఖర్చుతో స్థానికంగా ఉన్న గుడిలో ఇద్దరికీ వివాహం చేశారు. ఈ పెళ్లిని మురళీకృష్ణ కుటుంబీకులు ఒప్పుకోలేదు. అప్పుడు యువతి కుటుంబీకులే మరో రూ.50 వేలు ఇచ్చి ఇద్దరినీ పుణేకు పంపించారు. వీరికి కొడుకు పుట్టిన తరవాత కొన్ని రోజులపాటు సజావుగానే ఉన్న మురళీకృష్ణ మళ్లీ యువతిని అక్కడి ఓ హోటల్లో వదిలేసి వచ్చేశాడు. దీంతో మళ్ళీ ఇరు కుటుంబాలకు చెందిన వారు పంచాయతీ పెట్టుకోవాల్సి వచ్చింది. తన కుమారుడికి ఘనంగా పెళ్ళి చేస్తేనే వాళ్ల కాపురాన్ని అంగీకరిస్తామని మురళీకృష్ణ కుటుంబీకులు చెప్పడంతో ఉంటున్న ఇంటిని అమ్మేసి, యువతి కుటుంబీకులు రూ.20 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్ళి జరిపించారు. ఆపై కొన్ని రోజులకు మురళీకృష్ణ మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. పుట్టింటికి వచ్చిన యువతి రెండో సంతానానికి జన్మనిచ్చింది. అదనపు కట్నం కావాలని అత్తింటివారు ఆమెను వేధించడంతో మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్య పై కక్షకట్టిన మురళీకృష్ణ... వివాహ సమయంలో తాము తీసుకున్న ఫోటోల్లోంచి యువతి ఫొటోలను సేకరించి వాటితో పాటు ఆమె ఫోన్ నెంబర్‌నూ అశ్లీలవెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. తద్వారా ఆమె వ్యక్తిత్వం మంచిది కాదని నిరూపించాలనేది ఆయన కుట్ర. కొందరి నుంచి ఫోన్లు రావడంతో అప్రమత్తమైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారైన మురళీకృష్ణ ఎట్టకేలకు చిక్కి జైలుకు చేరాడు. ప్రేమ పాపం ప్యార్ కియా తో మర్నా ఖాయం. నిన్నటి ‘బాలికా వధు’ ప్రత్యూషా బెనర్జీ ఈ మోసానికే బలైంది. మొన్నటి నటి జియాఖాన్ కూడా ఆ మోసానికే ఉరేసుకొని ఉసురు తీసుకుంది. ఈ ఇద్దరికీ గ్లామర్ ప్రపంచపు మెరుగులు తెలుసు. ఆ మాయ గురించీ అవగాహన ఉంది. అక్కడ జరిగే దగా, పగలూ పరిచయమే. అయినా ప్రేమకు పడిపోయారు. పడి మోసపోయారు. తట్టుకోలేక ఇద్దరూ ఫ్యాన్‌కి ఉరిబిగించుకున్నారు. ప్రేమ పేరుతో వీళ్లను వంచించిందీ.. ప్రముఖులే. జియాఖాన్‌ను వంచించింది ప్రముఖ నటదంపతులు ఆదిత్యాపంచోలీ, జరీనా వాహబ్‌ల కొడుకు సూరజ్ పంచోలీ అయితే ప్రత్యూషా బెనర్జీని నమ్మించి మోసం చేసింది సీరియల్ ప్రొడ్యూసర్, ఈవెంట్స్ మేనేజర్ రాహుల్‌రాజ్ సింగ్. చనిపోయేటప్పటికీ ప్రత్యూషా బెనర్జీ గర్భిణి కూడా. అన్నీ తెలిసిన వాళ్లను అందరూ తెలిసిన వాళ్లే వంచిస్తుంటే ఇక సామాన్య ఆడపిల్లల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండొచ్చు? ఏ సంఖ్యలో ఈ నేరానికి బలవుతుండొచ్చు? మొన్నటికి మొన్న జరిగిన రీనా ఆత్మహత్యే ఇందుకు ఉదాహరణ. ప్రేమించి మొహం చాటేశాడన్న అవమానం, బాధ, వేదనతో డెల్ ఉద్యోగిని అయిన రీనా ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జోగినీ వ్యవస్థ నాగరిక సమాజాన్ని కూడా పట్టి పీడిస్తున్న దురాచారం జోగిని. ఇప్పుడు దీన్ని నేరంగా పరిగణిస్తున్నా - మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి చోట్ల ఇంకా ఈ అనాచారం కొనసాగుతూనే ఉంది. ఈ నేరానికి మూలకారణం పేదరికం, సాంఘిక వ్యత్యాసాలే. వయసొచ్చిన ఆడపిల్లను దేవుడికి అంకితం చేయడం పేరుతో ఆమెను లెసైన్స్డ్ వేశ్యగా మార్చడం అన్నమాట. పల్లెల్లో ఈ నేరం బారిన పడి చాలామంది ఆడపిల్లల జీవితం నాశనమవుతోంది. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చట్టాలు తెచ్చినా, ఈ దురన్యాయం యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. ట్రాఫికింగ్... ప్రాస్టిట్యూషన్ ‘పట్నంలో నీ బిడ్డకు మంచి పని ఉంది.. నెలకు పదిహేను వేల రూపాయల దాకా సంపాదించుకోవచ్చు... ఉండడానికి ఇల్లు, తిండి - అన్నీ వాళ్లే ఇస్తారు’ అంటూ పట్నం పోయి బాగా డబ్బు సంపాదించుకున్న ఊరి కుర్రాడో, లేక ఆ ఊరి నడివయసు మహిళో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లో ఆశను రేకెత్తిస్తారు. అమ్మానాన్నలు ఆ ఇంటి ఆడపడచును వీళ్లతో పట్నం బస్ ఎక్కిస్తారు. ఆ పిల్ల పుణే రెడ్‌లైట్ ఏరియాలోనో, ముంబై కామాటిపురాలోనో.. కోల్‌కతా సోనాగచీలోనో తేలుతుంది. ఇవే - ట్రాఫికింగ్, వ్యభిచార నేరాలు. రెండూ ఒకదానికొకటి అనుసంధానమైన భూతాలు. ఈ రెండూ తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతాన్ని పట్టిపీడిస్తున్న పిశాచాలు. వీటిని అరికట్టడానికి మన దగ్గరున్న చట్టాలకు కొదవలేదు. కానీ అమలు చేసే చిత్తశుద్ధే కరువు. అందుకే ఏటా వేలమంది ఆడపిల్లలు ఈ నేరం కోరలకి చిక్కి చీకటికూపాల్లో మగ్గుతున్నారు. సైబర్ క్రైమ్ ...టీచకుడి కథ పెరిగిన సాంకేతికత చూపిస్తున్న వికృతాల్లో సైబర్‌క్రైమ్ ఒకటి. మెయిల్స్, ఫేస్‌బుక్‌ను మారణాయుధాలుగా మలచుకొని రకరకాల రూపాల్లో నేరాలు చేస్తున్న వాళ్ల సంఖ్య తక్కువేమీ లేదు. ఒక ఉదాహరణ...గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఉపాధ్యాయుడు బాబూరావు ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలైన ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చాడు. అందులో తన ఈ-మెయిల్ ఐడీతో పాటు తన ఫోన్ నెంబర్ కూడా పొందుపర్చాడు. దరఖాస్తు చేసిన వారిలో యువతుల్ని, మహిళల్ని మాత్రమే ఎంచుకుంటాడు. వారి ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలు సేకరించి ఉద్యోగాల సాకుతోనే చాటింగ్ చేశాడు. పరిచయం పెంచుకొని వారిని మాయజేస్తూ వ్యక్తిగత అంశాలతో పాటు అభ్యంతరకర, అశ్లీల సందేశాలూ పంపించాడు. కొన్నాళ్లకు తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ ‘చాటింగ్’ వివరాలను కుటుంబీకులకు చెప్తానంటూ బ్లాక్మెయిల్ మొదలెట్టాడు. అలా అందినంత మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ హైదరాబాద్ విద్యార్థిని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లోని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కీచక టీచర్ కటకటాల్లోకి చేరాడు. అసభ్యసందేశాలు గుంటూరుకు చెందిన సాయి, హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఇద్దరూ స్నేహితులు. స్పర్థలు రావడంతో ఆ యువతిపై సాయి పగ పెంచుకున్నాడు. కక్షగట్టి వేధింపులు ప్రారంభించాడు. ఫేస్బుక్ ద్వారా దుర్భాషలాడుతూ సందేశాలు పెట్టడంతో పాటు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. విసుగు చెందిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. సైబర్ బుల్లీయింగ్ సోషల్ నెటవర్క్ సిస్టమ్స్‌లో స్త్రీల మీద అసభ్యకరమైన కామెంట్లు చేయడం, వాళ్లతో అసభ్యంగా సంభాషించడం, అశ్లీల చిత్రాలు పంపడం వగైరా కూడా సైబర్ క్రైమ్ కిందకి వస్తాయి. ప్రముఖ స్త్రీవాది కవితాకృష్ణన్, ప్రముఖ జర్నలిస్ట్-రచయిత్రి సాగరికా ఘోష్ కూడా సైబర్ బుల్లీయింగ్ బారిన పడ్డారు. కవితాకృష్ణన్కైతే ఓ వ్యక్తి... ‘కండోమ్స్‌తో రమ్మంటావా? లేకుండా రమ్మంటావా?’ అని ఆమె ఫేస్బుక్లో కామెంట్ పెట్టాడు. అలాగే సాగరికా ఘోష్‌తో కూడా కొంతమంది... ‘నీ పదమూడేళ్ల కూతురు భలే ముద్దొస్తోంది...’ అంటూ అసభ్యంగా ఫేస్బుక్లో కామెంట్ చేశారు. ఈ ఇద్దరూ సమాజంలో చాలా పేరున్న మహిళలే. వాళ్లకూ సైబర్‌బుల్లీయింగ్ తప్పలేదు. ‘వాటినెలా ఎదుర్కోవాలో తెలిసినా పిల్లను స్కూల్‌కి పంపాలంటే గజగజ వణికిపోయాను’ అని వాపోయారు సాగరికా ఘోష్. ఇక మామూలు అమ్మాయిల పరిస్థితి ఏంటి మరి? షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్‌రూమ్స్‌లో... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఓ నగరంలో తన భర్తతో కలిసి పేరున్న పెద్ద షాపింగ్‌మాల్‌కి వెళ్లారు. తనకు నచ్చిన డ్రెసెస్‌ను ట్రై చేయడానికి ట్రయల్రూమ్లో అడుగుపెట్టారు. అయితే ఆ గదిలో కెమెరా ఉన్నట్టు ఆమెకు అనుమానం వచ్చింది. బయటకు వచ్చి భర్తతో చెప్పి కంప్లయింట్ చేశారు. వెళ్లి చూస్తే నిజంగానే కెమెరాలున్నాయి. అంత పేరున్న మాల్లో... కేంద్ర మంత్రికే ఆ ఆగచాటు తప్పలేదంటే మిగిలిన చోట్ల సామాన్య మహిళలు ఇంకెన్ని అగచాట్లు పడాలో? అలా షాపింగ్‌మాల్స్‌లో ట్రయల్‌రూమ్స్‌లో కెమెరాలు ఉండడాన్ని కూడా ‘నిర్భయ చట్టం’ కింద నేరంగా పరిగణిస్తారు. ఈవ్‌టీజింగ్ బస్‌స్టాప్స్, షాపింగ్ మాల్స్, పార్క్స్, సినిమాహాల్స్...ఏ పబ్లిక్ ప్లేస్‌లో అయినా కనిపిస్తోంది ఈవ్‌టీజింగ్. దీని భరతం పట్టడానికి ‘షీ టీమ్స్’ గస్తీ తిరుగుతున్నా కన్నుగప్పే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. సెల్ఫోన్ల ద్వారా రహదారులపై మహిళల్ని, యువతుల్ని వేధిస్తున్నారు. ఈవ్టీజర్ల బారిపడుతున్నవారిలో అనేకమంది ప్రముఖులూ ఉంటున్నారు. ఈ మధ్యనే తన కారులో వెళ్తున్న అస్మిత అనే టీవీ కళాకారిణిని సయ్యద్ నూరుల్లా, ఇమ్రాన్ బిన్ మహ్మద్ అనే ఇద్దరు పోకిరీలు వెంబడించి వేధించారు. ఆమె ధైర్యంగా వారి చేష్టలను సెల్ఫోన్లో చిత్రీకరించి ఫేస్బుక్ ద్వారా ‘షీ టీమ్స్’కి ఫిర్యాదు చేశారు. ఆ పోకీరీలు కటకటాలు లెక్కపెట్టారు. ఇలా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారి సంఖ్య వందల్లోనే ఉంటోంది. ప్రేమ పేరుతో వేధింపులు ప్రేమ అంటే.. ఇష్టపడ్డ వ్యక్తిని గౌరవించడం. ఆమెకు ఏ కష్టం కలగకుండా చూసుకోవడం. కానీ ఈ రోజు ప్రేమ నిర్వచనం మారిపోయింది. తన ఇష్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఇష్టపడమంటూ ఆమెను వేధించడమే ప్రేమ పరమార్థంగా మారింది. ఇష్టం లేదని చెప్తే యాసిడ్‌తో దాడి చేయడం పరిపాటి అయింది. దీనికి తోడు సినిమాల ప్రభావం నేటి యువత మీద విపరీతంగా పడుతోంది. కొన్ని సినిమాలు అసలే ఉన్మాదంగా ఉంటున్న యువతను తమ దారి సరైనదే అని ప్రోత్సహిస్తున్నట్టుగా చెప్తున్నాయి. ఒక సినిమాలో కథానాయికను ప్రేమిస్తున్నానంటే ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమె వెంటపడుతుంటాడు హీరో. ఇదో హీరోయిక్ స్టంట్లా భావించి మగపిల్లలంతా ఆ దారినే ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది. అమ్మాయిలూ తమ వెంట అబ్బాయిలు అలా పడితేనే గొప్ప అనే భావనలోకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాకున్న ప్రభావం ఎలాంటిదో వేరేగా చెప్పక్కర్లేదు. వరంగల్‌లో స్వప్నిక మీద యాసిడ్ దాడి అలాంటి ఉన్మాది చర్యే. అందుకే ఇలాంటి సున్నిత అంశాల పట్ల కాస్త బాధ్యతగా వ్యవహరిస్తే బాగుటుంది ఏ మాధ్యమమైనా. ప్రేమ పేరుతో వెంటపడి వేధించే ‘ఆర్య’ లాంటి యాంటీహీరోలు రియల్లైఫ్లోనూ కోకొల్లలు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ రోడ్ నెం.9లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో నివసించే ఓ యువతి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో కోచింగ్ తీసుకుంటోంది. అదే బస్తీలో ఉండే శివ అనే జులాయి ఆమెని వెంబడిస్తూ ప్రేమించాలని వేధించాడు. ఆమె రాకపోకల్ని గమనించి, తప్పతాగి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విసుగు చెందిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేప్ ఏ రోజు ఏ పత్రిక తిరగేసినా.. ఏ టీవీ చానల్ పెట్టినా స్త్రీల మీద లైంగిక దాడి వార్తలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. దేశంలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత వచ్చిన నిరసన.. తద్వారా ఏర్పడిన నిర్భయ చట్టం.. ఇక అమ్మాయి మానప్రాణాలను కాపాడడంలో కంచుకవచంలా ఉంటుందని ఆశపడింది దేశం. కానీ అది వట్టి అత్యాశే అని నిరూపిస్తున్నాయి - ఇప్పటికీ జరుగుతున్న అత్యాచార సంఘటనలు. నిర్భయ తర్వాత ఢిల్లీలోనే అయిదేళ్ల గుడియా మీద ఇంకో ఘోరం జరిగింది. తర్వాత హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ల చేతిలో లైంగికదాడికి బలైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అభయ కేస్ బయటపడింది.ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మచిలీపట్నం అమ్మాయి అనూహ్యను ముంబైలో టాక్సీ డ్రైవర్ రేప్ చేసి చంపేసిన వైనం ఇంకా భయపెడుతూనే ఉంది. ఇవన్నీ ప్రసార మాధ్యమాల దృష్టికి చిక్కిన నేరాలు. చిక్కకుండా భీతిగొల్పుతున్నవెన్నో! మ్యారిటల్ రేప్ వివాహబంధంలో ఉన్న భర్త... తన భార్య మానసిక, శారీరక పరిస్థితి తెలుసుకోకుండా ఆమెను ఇబ్బంది పెట్టడం, బలవంతం చేయడం కూడా క్రూయల్టీ కింద పరిగణించే నేరమే. నిజానికి దీన్ని జస్టిస్ వర్మ కమిటీ మ్యారిటల్రేప్గా పరిగణించాలని సూచించింది. కానీ దీనివల్ల భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు బీటలు వారుతాయని రాజకీయ పక్షాలు ఆమోదించలేదు. కానీ విడాకులు తీసుకున్న భార్యను, లేదా భర్త నుంచి విడిగా ఉంటున్న ఇల్లాలిని భర్త బలవంతం చేస్తే రేప్‌గా పరిగణించాలని మాత్రం నిర్ణయించారు. అయితే ఇంకా దీనిమీద వాదోపవాదాలు, చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. క్రైమ్ అండ్ పనిష్మెంట్ గృహ హింస... డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 31 కింద గృహహింస బాధితులకు ఈ చట్టం కొన్ని ఉపశమనాలను సూచిస్తోంది. వీటిలో రక్షణ, నివాస, ఆర్థిక ఉపశమనాలతోపాటు నష్టపరిహారం, పిల్లల కస్టడీ ఉత్తర్వులుంటాయి. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఏడాది జైలుశిక్ష, 20 వేల జరిమానా. వరకట్నం... 1961 నాటి వరకట్నం నిషేధ చట్టం కింద వరకట్నం అడగడం, ఇవ్వడం రెండూ నేరాలే. కట్నం కోసం వేధిస్తే సెక్షన్ 498 (ఎ) కింద నేరస్థులకు ఏడేళ్లు జైలుశిక్ష ఉంటుంది. అలాగే కట్నం కింద తీసుకున్న డబ్బుమొత్తాన్ని తిరిగి అమ్మాయి వాళ్లకు చెల్లించాలి. బాల్యవివాహాలు... ఈ నేరానికి పాల్పడిన వాళ్లకు బాల్యవివాహాల నిరోధక చట్టం-1929 ప్రకారం లక్ష రూపాయల జరిమానా. జోగినీ వ్యవస్థ... ఆంధ్రప్రదేశ్ దేవదాసీ నిరోధక చట్టం కిందకు వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కూడా దీన్ని అమలు చేస్తోంది. ట్రాఫికింగ్ అండ్ ప్రాస్టిట్యూషన్... ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇది నేరం. అయితే 370 (ఎ) నిర్భయ చట్టం కింద కొత్తగా దీనికి కొన్ని సవరణలు చేశారు. వ్యభిచారం కోసం అమ్మాయిల అక్రమ రవాణాను 372, 373 సెక్షన్ల కింద నేరాలుగా పరిగణిస్తారు. నేరస్థులకు పదేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. అలాగే వ్యభిచార గృహ నిర్వాహకులు, అమ్మాయిలను సరఫరా చేసేవారు, వ్యభిచార గృహాల చిరునామా చెప్పేవారికి అయిదేళ్ల జైలుశిక్ష ఉంటుంది. పీసీ అండ్ పీఎన్డీటీ... ‘పీసీ అండ్ పీఎన్డీటీ (ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్) యాక్ట్ -2002’ ప్రకారం లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరం. ఇలాంటి పరీక్షలు చేయమని కోరినవారు, సూచించిన వైద్యులు, పరీక్షలు నిర్వహించిన వైద్యులు - అందరూ శిక్షార్హులే. సైబర్‌క్రైమ్... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (2010) కిందకు వస్తుంది ఈ నేరం. టెక్నాలజీని ఆసరాగా చేసుకొని మహిళల మాన మర్యాదలకు భంగం కలిగించే ఏ చర్య అయినా సైబర్‌క్రైమ్ కిందకే వస్తుంది. ఈ నేరస్థులకు లక్షరూపాయల జరిమానా, రెండు నుంచి అయిదేళ్ల దాకా జైలు శిక్ష. వర్క్‌ప్లేస్ హెరాస్మెంట్.. 354, 509 సెక్షన్ల కింద నేర తీవ్రతను బట్టి ఏడాది నుంచి అయిదేళ్ల జైలుశిక్ష. ఈవ్‌టీజింగ్... ఐపీసీ సెక్షన్ 294 కింద ఈవ్‌టీజర్లకు ఆరు నెలల నుంచి ఏడాది దాకా జైలుశిక్ష. వైట్‌కాలర్ క్రైమ్... నిర్భయ చట్టం లోని 354వ సెక్షన్ కింద ఇదీ నేరమే. రేప్... నిర్భయ చట్టం సెక్షన్లు 376 ఎ, బి, సి, డి, ఇ కింద ఘోరమైన నేరం ఇది. నేర తీవ్రతను బట్టి 376 ఎ, ఇ సెక్షన్ల కిందయితే నేరస్తుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం, ఉరిశిక్ష, 376 బి,సి, డి కింద అయితే 20 ఏళ్ల జైలు, యావజ్జీవకాగారం. నమ్మకద్రోహం... ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద మోసం, నయవంచన, నమ్మకద్రోహం మొదలైన వాటికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష. వైట్ కాలర్ క్రైమ్స్ పెద ్దమనుషుల్లా ఉంటూ కిరాతకాలు చేసేవాళ్లను పట్టుకోవడం, వాళ్ల పనులను నేరాలుగా నిరూపించడం చాలా కష్టం. ఇలాంటి వాళ్లు తమ వృత్తినే నేరానికి వేదికగా చేసుకుంటారు. హైదరాబాద్‌లోని ఓ డాక్టర్ నిర్వాకం ఇందుకు ఒక ఉదాహరణ. ఇక్కడి లాల్బజార్లో ఉండే 20 ఏళ్ల యువతి ఓ రోజు చర్మ వ్యాధి చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లింది. ఇంజెక్షన్ ఇస్తానంటూ బెడ్ మీద పడుకోమన్నాడు డాక్టర్. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఆమె మత్తులోకి జారుకుంది. తన కళ్ల ముందు జరుగుతున్న సంఘటనను గుర్తిస్తున్నప్పటికీ... ఏమీ చేయలేని అచేతన స్థితికి చేరింది. కొద్దిసేపటికి శక్తిని కూడదీసుకుని తన స్నేహితులకి ఫోన్‌చేసి ఆస్పత్రికి రప్పించింది. వాళ్లు వెళ్లే సరికి ఆస్పత్రి కుర్చీలో నీరసంగా పడి ఉన్న ఆ యువతి డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని వివరించింది. డాక్టర్ మాత్రం ఆమె నీరసంగా ఉండటంతో ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే నిస్సత్తువకు లోనైందంటూ బుకాయించాడు. బాధితులు మాత్రం వైద్యుడిపై తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వర్క్‌ప్లేస్ హెరాస్మెంట్ స్త్రీలకు ఇంట్లో, బయటా భద్రత కరవైంది అనడానికి ఆఫీసుల్లో వారిపై జరుగుతున్న నేరాలే నిదర్శనం. నేరాల బారినపడకుండా ఉద్యోగిని తనను తాను కాపాడుకుంటూ విధినిర్వహణలోనూ తన సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటూ విపరీతమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తోంది. ఆఫీస్‌లో అలాంటి అఫెన్స్‌ను ఎదుర్కొన్న ఒక ఉద్యోగిని గురించి చెప్పుకుందాం... హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ప్రముఖ శాఖకు చెందిన కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తోంది. ఆమె భర్త అదే శాఖలో పని చేస్తూ చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. అదే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఈమె పని చేస్తున్న కార్యాలయం ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసి తన కోరిక తీరిస్తే... అండగా ఉండటంతో పాటు కుమారుడికి ఉద్యోగం ఇస్తానంటూ వేధింపులు మొదలెట్టాడు. ఆమె తిరస్కరించడంతో మరునాడే సుదూర ప్రాంతానికి బదిలీ చేశాడు. దీంతో బాధితురాలు భయపడి, దీర్ఘకాలిక సెల వుపై వెళ్లింది. సెలవు ముగిశాక తిరిగి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే చేరితే ఏం జరుగుతుందో అని భయపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. స్పందించిన పోలీసుల వేధింపులకు పాల్పడిన అధికారిపై ‘నిర్భయ చట్టం’ కింద కేసు నమోదు చేశారు.