అధికారం ఉంది కదా అనే అహంకారంతో మణుగూరు ఎస్సై జితేందర్ రెచ్చిపోయాడు. తన తప్పును ఎత్తిచూపడంతో సహించలేక వీరంగం సృష్టించాడు. భార్య, అత్తపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. వివరాలు.. జితేందర్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ అతడి భార్య ఆరోపించింది. తన తల్లితో కలిసి వివాహేతర సంబంధం గురించి భర్తను నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన జితేందర్.. భార్య, అత్తపై విచరక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.