French
-
చదువుకుందామని ఇండియా వచ్చాడు.. రూ.50 కోట్లు సంపాదిస్తున్నాడు
మనం ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ తప్పకుండా ఇండియన్ రెస్టారెంట్స్, హోటల్స్ వంటివి ఉంటాయి. ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో ఉంటూ ఇలా రెస్టారెంట్స్ ప్రారంభించి బాగా సంపాదిస్తున్న భారతీయులు ప్రపంచ దేశాల్లో కోకొల్లలుగా ఉన్నారు. అయితే.. ఓ వ్యక్తి ఫ్రాన్స్ నుంచి చదువుకోవడానికి ఇండియాకు వచ్చి.. ఇప్పుడు ఏడాదికి రూ. 50 కోట్లు సంపాదిస్తూ వార్తల్లో నిలిచాడు.ఫ్రాన్స్‌కు చెందిన 'నికోలస్ గ్రాస్మీ' (Nicolas Grossemy) అనే వ్యక్తి 22 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ చేయడానికి ఇండియాకు వచ్చాడు. అయితే ఇప్పుడు నెలకు రూ.4 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఎంతో మంది యువతకు ఆదర్శమయ్యాడు.ఇండియాలో చదువు పూర్తయిన తరువాత 2015లో ఫుడ్ ట్రక్ ద్వారా బిజినెస్ ప్రారంభించాడు. తన తల్లికి వంట చేయడంలో చిన్నప్పుడు నికోలస్ సహాయపడేవాడు. ఆ విధంగా ఈ రంగంపై అతనికి మక్కువ పెరిగింది. ప్రస్తుతం బెంగళూరులో ఎనిమిది డైనింగ్ అవుట్లెట్లు, ఏడు క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి. ఫుడ్ ట్రక్ ద్వారా ప్రారంభమైన వ్యాపారం నేడు.. నగరం మొత్తం విస్తరించింది.ఇదీ చదవండి: 17ఏళ్ల యువకుడి కొత్త ఆలోచన.. నెలకు రూ.16 లక్షల సంపాదనఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నికోలస్‌కు చిన్నతనం నుంచే శాండ్‌విచ్‌లంటే చాలా ఇష్టం. దీంతో వీటిని తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. అదే ఈ రోజు కోట్లు సంపాదించేలా చేసింది. శాండ్విచ్ సేల్స్ దాదాపు 70 శాతం ఆన్లైన్లోనే జరుగుతాయని, మిగిలిన 30 శాతం మాత్రమే ఆఫ్‌లైన్‌లో జరుగుతాయని సమాచారం. -
ఫ్రాన్స్ లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్న విపక్షాలు
-
ఫ్రాన్స్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం !?
పారిస్: ఫ్రాన్స్‌లో మైనారిటీ ప్రభుత్వాన్ని నడపలేక తిప్పలు పడుతున్న ప్రధాని మైఖేల్ బార్నర్ను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిగువసభలో ఓటింగ్ చేపట్టకుండానే బడ్జెట్‌ను ఆమోదింపజేసుకున్నారన్న ఆగ్రహంతో ఈ చర్యకు దిగుతున్నాయి. తీర్మానానికి అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, వామపక్ష నేషనల్ ర్యాలీ (ఎన్ఆర్) తదితరాలు మద్దతివ్వనున్నాయి. ఈ ప్రయత్నాలను బార్నర్ తీవ్రంగా ఖండించారు. ‘‘ దేశ భవిష్యత్తును పణంగా పెట్టి స్వప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ఇలాంటి పార్టీలను ప్రజలు క్షమిస్తారనుకోను. మా ప్రభుత్వం కూలితే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుంది’’ అని హెచ్చరించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గితే గత 60 ఏళ్లలో ఫ్రాన్స్‌లో ఒక ప్రభుత్వం కూలడం తొలిసారి అవుతుంది. తాను మాత్రం 2027లో పదవీకాలం పూర్తయ్యేదాకా అధ్యక్షునిగా కొనసాగుతానని ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూలితే ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ ముఖచిత్రం మారనుంది. ప్రస్తుత పార్లమెంట్ దిగువసభ అయిన నేషనల్ అసెంబ్లీలో మేక్రాన్‌కు చెందిన మధ్యేవాద కూటమి, అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, మరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ పార్టీలు ఉన్నప్పటికీ ఏ పార్టీకి మెజారిటీ లేదు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 574 మంది సభ్యులకుగాను 288 మందికిపైగా సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి. అయితే విపక్షాలు రెండూ కలిస్తే వాటి బలం 330కిపైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో తీర్మానం నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విద్యుత్‌పై కొత్త పన్నులను తొలగించాలని మరీన్ లీ పెన్ డిమాండ్‌చేశారు. -
‘నా ఫోన్ దొరికింది’.. భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారి
ఢిల్లీ : భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. థియరీ మాథౌ ఫోన్ దొంగతనం చేసిన నలుగురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.దీపావళి పండుగ నేపథ్యంలో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ అక్టోబర్ 20 తన కుటుంబ సభ్యులతో కలిసి ఓల్డ్ ఢిల్లీలోని చాందినీ చౌక్ లో షాపింగ్ చేశారు. ఆ సమయంలో 20 నుంచి 25ఏళ్ల మధ్యన ఉన్న దొంగలు తమ చేతి వాటం ప్రదర్శించారు.షాపింగ్ చేస్తున్న థియరీ మాథౌ జేబులో ఉన్న ఫోన్‌ను కాజేశారు. ఫోన్ మాయ మవ్వడంతో మాథౌ ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయబార కార్యాలయం అధికారులు సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.దర్యాప్తులో భాగంగా మాథౌ షాపింగ్ చేస్తున్న ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా మాథౌ ఫోన్ ట్రేస్ చేశారు. నిన్న, ఇవాళ రెండ్రోజుల వ్యవధిలో ఫోన్ దొంగతనం చేసిన యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం థియరీ మాథౌకు ఫోన్‌ను అందించారు. దీంతో మాథౌకు సంతోషం వ్యక్తం చేశారు. -
మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: ఎవరెన్ని ఏం చెప్పినా, ఏ దేశం తమకు మద్దతు ఇవ్వకపోయినా తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తమదే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.దాదాపు 200 క్షిపణులతో (మిసైల్స్) ఇరాన్లో బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని, దాడుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్)ప్రకటించింది. ఆ ప్రతిపాదనలను ప్రధాని నెతన్యాహుకి పంపినట్లు వెల్లడించింది. నెతన్యాహు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తమ పనిని మొదలుపెడతామని ఐడీఎఫ్ తెలిపింది.ఈ ప్రకటన అనంతరం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్‌కు తాము సరఫరా చేస్తున్న అణ్వాయుధాలను నిలిపి వేస్తున్నట్లు అధికారంగా వెల్లడించారు. ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు. అయితే మాక్రాన్ నిర్ణయాన్ని నెతన్యాహు ఖండించారు. ఫాన్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తాము అవమానకరంగా భావిస్తున్నట్లు ఓ వీడియోని విడుదల చేశారు. ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నప్పుడు, నాగరిక దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు నిలబడాలి’ అని నెతన్యాహు కోరారు. అయినా మాక్రాన్, ఇతర పాశ్చాత్య నాయకులు ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఆయుధాల ఆంక్షలు విధించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటుగా అభివర్ణించారు.గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ ,సిరియాలోని షియా మిలీషియా, వెస్ట్ బ్యాంక్‌లోని ఉగ్రవాదులతో చేస్తున్న ఇజ్రాయెల్ పోరాటాలను ఎత్తి చూపారు. ఇరాన్ తన మిత్రదేశాలకు ఆయుధాలను పరిమితం చేసిందా అని ప్రశ్నిస్తూ.. కాదు.. ఇరాన్‌ను వ్యతిరేకించే దేశాలు.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాల్ని పంపడాన్ని ఆపేయడం ఎంత అవమానకరం అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, నెతన్యాహు వారి మద్దతు ఉన్నా,లేకుండానే ఇజ్రాయెల్ గెలుస్తుందని పునరుద్ఘాటించారు. కాగా,ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాలు పంపడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్‌కు పలుదేశాలు మద్దతు పలుకుతున్నాయి. -
ఫ్రాన్స్ స్కూళ్లలో ఫోన్లు స్విచ్ఛాఫ్
పారిస్: సెల్‌ఫోన్.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్‌ఫోన్ మారిన సెల్‌ఫోన్ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచి్చంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్ మిడిల్ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ‘డిజిటల్ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్ చేయాలన్న నిబంధన లేదు. -
సనోఫీ హెల్త్‌కేర్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న ఫ్రెంచ్ సంస్థ సనోఫీ భారత్‌లో సుమారు రూ.3,655 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) కోసం 2030 నాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సనోఫీ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మ్యాడలిన్ రోచ్ వెల్లడించారు. ఇందులో రూ.914 కోట్లు వచ్చే ఏడాదికల్లా వ్యయం చేస్తామని చెప్పారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సనోఫీ జీసీసీ నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించిన సందర్భంగా రోచ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంలో ప్రస్తుతం 1,000 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. కొత్త ఫెసిలిటీకి 2,600 మంది ఉద్యోగులు కూర్చునే సామర్థ్యం ఉందన్నారు. -
French elections 2024: ఫ్రాన్స్ రెండో దశలో... రికార్డు పోలింగ్
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ఆదివారం కీలకమైన రెండో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదుగంటలకు 59.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 1981 తర్వాత ఇంతటి పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 30వ తేదీన జరిగిన తొలి రౌండ్లో 67 శాతం పోలింగ్ జరిగింది. ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా రెండు దశల్లో జరుగుతాయి. ఆదివారం జరిగిన రెండో దశ కీలకమైనది. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల వల్ల ఆయన పదవికి తక్షణ ప్రమాదం ఏమీ లేకున్నా, చట్టాలు చేసేటప్పుడు పార్లమెంటులో అడుగడుగునా పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు తొలిరౌండ్లో చేదు అనుభవం ఎదురైన విషయం తెల్సిందే. మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టి విజయం సాధించింది. విపక్షాలకు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి 27.99 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ పార్టీ కేవలం 20.04 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల యురోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకురాలు మెరీన్ లీ పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం సాధించింది. ఆలస్యం చేస్తే విపక్షాలు మరింత పుంజుకుంటాయన్న భయంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే. -
French elections 2024: ఫ్రాన్స్‌లో నేడే రెండో దశ ఎన్నికలు
పారిస్: ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికల్లో కీలక దశకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటులో దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలోని 577 స్థానాలకు గాను 501 చోట్ల ఆదివారం రెండో రౌండ్లో భాగంగా పోలింగ్ జరగనుంది. తొలి రౌండ్లో 76 స్థానాలకు జరిగిన ఓటింగ్‌లో విపక్ష నేషనల్ ర్యాలీ, దాని మిత్ర పక్షాలు స్పష్టమైన ఆధిక్యం కనబరిచాయి. పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లతో విజయం సాధించింది. మరో విపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 27.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలోని మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి కేవలం 20.04 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. జూన్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో మెరీన్ లీ పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం నేపథ్యంలో విపక్షాలు పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టమయ్యాయి. దాంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. రెండో రౌండ్లో కూడా నేషనల్ ర్యాలీ కూటమి హవాయే కొనసాగవచ్చంటున్నారు. అదే జరిగి 289 పై చిలుకు స్థానాలతో అది పూర్తి మెజారిటీ సాధిస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఘనత సాధించిన తొలి రైటిస్టు కూటమి అవుతుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు కూటమి అధ్యక్షుడు జోర్డాన్ బార్డెల్లా ప్రధాని అవుతారు. ఆయనతో మాక్రాన్ అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. -
101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!
గత గురువారం పద్మ అవార్డు వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ పద్మ అవార్డు గ్రహీతల్లో ఫ్రాన్స్ మహిళ భారతీయ వస్త్రాలంకరణలో తళుక్కుమన్నారు. అందరీ అటెన్షన్ ఆమె వైపే. చక్కగా సంప్రదాయ ఆకుపచ్చ పట్టు చీరలో భారతీయ మహిళ మాదిరిగా వచ్చి మరీ అవార్డు తీసుకున్నారు. ఆమెను భారతదేశపు నాల్గొవ అత్యున్నత పురస్కారం పద్మ శ్రీతో సత్కరించారు. ఆ ఫ్రాన్ మహిళ పేరు ఫార్లెట్ చోపిన్. ఇంతకీ ఎవరీ షార్లెట్ చోపిన్ అంటే..ఫ్రాన్స్‌కు చెందిన షార్లెట్ చోపిన్ యోగా ప్రాక్టీషనర్. ఫ్రాన్స్‌లోని చెర్లోని చిన్న పట్టణమైన లేరే నివాసి. ఆమె ఈ యోగాను 50 ఏళ్ల వయసులో నేర్చుకుని సాధించడం ప్రారంభించింది. వయోపరిమితిని లెక్కచేయకగా చాలా అలవోకగా నేర్చుకుని యోగా టీచర్‌గా మారి యోగా ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నందుకు గానూ ఆమెకు ఈ పురస్కరం లభించింది. అంతేగాదు గతేడాది జూలైలో షార్లెట్ చోపిన్ పారిస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో యోగాను ప్రోత్సహించేలా చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే ఆమె యోగా ఆనందాన్ని, సంపూర్ణ శ్రేయస్సును ఎలా ప్రోత్సహిస్తుంది అనేదానిపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది కూడా. కాగా గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చోపీన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. Defying age limiting norms by learning #yoga post turning 50, Charlotte Chopin, a 101-year-old Yoga exponent from France receives #PadmaShri from President Droupadi Murmu at the Rashtrapati Bhavan #PeoplesPadma #PadmaAwards2024 pic.twitter.com/B0QMx2FJ6B— PIB India (@PIB_India) May 9, 2024 (చదవండి: కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!) -
రాధిక కొత్త ప్రయాణం
కథానాయికగా, ఆ తర్వాత క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా చిత్రసీమలో రాధిక ఎన్నో విజయాలు చూశారు. ఇటు బుల్లితెరపైనా నటిగా, నిర్మాతగా ఆమె కెరీర్ హిట్. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కిళక్కే పోగుమ్ రైల్’ (1978) ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు రాధిక. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న రాధిక ఫ్రెంచ్‌లో తొలి చిత్రం అంగీకరించారు. ‘‘నా సినిమా కెరీర్లో కొత్త ప్రయాణం ఆరంభించాను. ఫ్రెంచ్ సినిమాలో నటించడం నాకో కొత్త అనుభూతి. ఈ కొత్త ప్రయాణానికి ప్రోత్సహించిన శరత్‌కుమార్ (రాధిక భర్త), రేయాన్ (కుమార్తె)లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాధిక. ఈ చిత్రానికి లారెన్స్ వాలిన్ దర్శకుడు. -
ఫ్రాన్స్ విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు
ప్యారిస్: ఫ్రాన్స్‌లో బాంబు బెదిరింపులు కలవరం రేపాయి. దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలలో బాంబు పేలుళ్లు జరగనున్నాయని దుండగులు ఈమెయిళ్ల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆయా ఎయిర్‌పోర్టులను ఖాలీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. పారిస్‌కు సమీపంలో ఉన్న లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాల్లో బాంబులు పేలుళ్లు జరగనున్నాయని ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దీనిని ధ్రువీకరించిన అధికారులు తనిఖీలు చెపడుతున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ పనే.. ఇజ్రాయెల్ ఆధారాలు వెల్లడి -
బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..
ఈ విచిత్ర నిర్మాణం ఫ్రాన్స్‌లోనిది. పీయెయిర్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త ఈ భవనాన్ని కట్టించుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత వినూత్నంగా భవనాన్ని నిర్మించాలని కోరడంతో ఫిన్నిష్ ఆర్కిటెక్ట్ యాంటీ లోవాగ్ 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బుద్బుద భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణానికి పద్నాలుగేళ్లు పట్టింది. చూడటానికి విచిత్రంగా బుడగల మాదిరిగా కనిపించే ఈ భవన నిర్మాణాన్ని 1975లో మొదలుపెడితే, 1989లో పూర్తయింది. ఇందులోకి వచ్చిన రెండేళ్లకే బెర్నార్డ్ మరణించాడు. తర్వాత దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ పీయెయిర్ కార్డిన్ కొనుగోలు చేశాడు. భవనం పాతబడినట్లు అనిపించడంతో ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ ఓడిల్ డెక్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిపించి, కొత్త హంగులు సమకూర్చాడు. దీనిని 2017లో 350 మిలియన్ యూరోలకు (రూ.3120 కోట్లు) అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా 2020లో కార్డిన్ మరణించాడు. ఇప్పుడు దీన్ని విహారయాత్రలకు వచ్చే పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు. (చదవండి: 16 రోజుల్లో యూరప్ చుట్టేశాడు!..అదికూడా కేవలం..) -
అదానీ గ్రీన్‌లో టోటల్ ఎనర్జీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్‌తో ఏర్పాటు చేయనున్న శుద్ధ ఇంధన భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ తాజాగా వెల్లడించింది. కొత్తగా నెలకొల్పనున్న జేవీలో 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. మిగిలిన 50 శాతం వాటాను అదానీ గ్రీన్ ఎనర్జీ పొందనుంది. ఈ జేవీ మొత్తం 1,050 మెగావాట్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండనుంది. వీటిలో 300 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే ప్రారంభంకాగా.. 500 మె.వా నిర్మాణంలో ఉంది. మరో 250 మె.వా సోలార్, విండ్ కలయికతో అభివృద్ధి దశలో ఉంది. కాగా.. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీతో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ తొలిసారి పబ్లిక్ డీల్‌ను కుదుర్చుకోవడం గమనార్హం! శుద్ధ ఇంధన ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా టోటల్ తాజా పెట్టుబడులను చేపట్టింది. ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.7 శాతం వాటాను కలిగిన టోటల్.. 2,353 మె.వా. పోర్ట్‌ఫోలియోగల ఏజీఈ23ఎల్(జేవీ)లో అదానీ గ్రీన్‌తో సమాన వాటాను కలిగి ఉంది. ఇక 2019లోనే అదానీ టోటల్ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను టోటల్ పొందింది. ఇందుకు 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. -
ప్రాన్స్ కార్న్ ఫ్రిటర్స్
కావలసినవి: చిక్కటి పాలు – పావుకప్పు, గుడ్లు – 4, మొక్కజొన్న పిండి – అర కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు, రొయ్యలు – 20 లేదా 25 (ఉప్పు, కారం, మసాలా కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి), స్వీట్ కార్న్ – రెండున్నర కప్పులు (ఉడికించి మిక్సీ పట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు –2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాలు, మూడు గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో స్వీట్ కార్న్ గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని, ఉడికించిన ఒక్కో రొయ్యతో కలిపి.. చేత్తో చిన్నగా ఒత్తి, వడలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. (చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు) -
ఆర్నాల్ట్, అంబానీ డీల్: అద్దె ఎంతో తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ రెండో కుబేరుడు గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ , ఆసియాకుబేరుడురిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన లగ్జరీ మాల్లో ఒక స్టోర్‌ను లీజుకు తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్‌ను అద్దెకు తీసుకున్నారు. మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లకు గాను నెలకు చెల్లిస్తున్న అద్దె ఏకంగా 40.50 లక్షలుగా ఉంది. (కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్‌ఫాల్ ట్యాక్స్ కట్) ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం లూయిస్ విట్టన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ముఖేష్ అంబానీకి చెందిన నుండి రిటైల్ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు ఒప్పందం కుదుర్చు కుంది. అంతేకాదుప్రపంచ లగ్జరీ బ్రాండ్ అతిపెద్ద షోరూంగా ఇది నిలవడం విశేషం. కంపెనీ తొమ్మిదిరన్న ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఇరు సంస్థలు ఆగస్టు 21న కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం లూయిస్ విట్టన్ ఇండియా రిటైల్ రిలయన్స్‌కు నెలకు రూ.40.5 లక్షలు , లేదా మొత్తం లేదా నికర రాబడి వాటాలో 6 శాతం, ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తుంది. 36 నెలల తర్వాత అద్దె 15 శాతం పెరుగుతుంది. ఇందుకోసం కంపెనీ కంపెనీ రూ.2.43 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. కామన్ ఏరియాకు రూ.24.30 లక్షలు, ఫిట్అవుట్లకు రూ.29.46 లక్షలు కూడా చెల్లించారు.(డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) కాగా 1854లో పారిస్‌లో లూయిస్ విట్టన్చే దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆర్నాల్ట్ దీనికి చైర్మన్ అండ్ సీఈవోగా ఉన్నారు. 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఇండియాలో తొలి దుకాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరు,ఢిల్లీ, ముంబైసహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్లను కలిగి ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని నికర విలువ 208 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ 94 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. -
మెక్రాన్ సతీమణికి పోచంపల్లి ఇక్కత్ చీర బహుకరించిన మోదీ..
ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. శుక్రవారం జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో ఆ దేశ అధ్యక్షుడు సన్మానించారు. అయితే.. పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలకు తోడు సంస్కృతిక అంశాలను కూడా జోడించారు. ఆ దేశ పెద్దలకు ప్రధాని మోదీ భారత సంస్కృతికి చెందిన విలక్షణమైన కానుకలను అందించారు. అధ్యక్షుడు మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్‌ను బహుకరించారు. దక్షిణ భారతదేశంలో గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్‌పై ఉన్నాయి. మెక్రాన్ సతీమణి చేత.. తెలంగాణ చీర.. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్‌కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇక్కత్ చీర తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి. మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్.. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు 'మార్బుల్ ఇన్లే వర్క్'తో అలంకరించబడిన టేబుల్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి పాలరాతిని, దేశంలో విలువైన రాళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రాళ్లను కత్తిరించి అందంగా తయారు చేసే కళాఖండం. కాశ్మీరీ కార్పెట్.. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన కాశ్మీరీ కార్పెట్‌ను బహుకరించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన కళారూపం ఇది. మృదుత్వం కలిగి వివిధ కోణాల్లో వేరు వేరు రంగుల్ని కలిగి ఉంటుంది. గంధపు ఏనుగు.. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహుకరించారు. ఏనుగు భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ప్రకృతికి, కళలకు మధ్య సామరస్యాన్ని సూచించే అందమైన ప్రతిబింబం ఇది. ఇదీ చదవండి: ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు.. -
సైకో భర్త.. భార్యకు మత్తుమందు ఇచ్చి నిద్రపోగానే..
భర్త అంటే జీవితాంతం తన భార్యకు తోడునీడగా కలిసి జీవించాలి అంటారు. దాంపత్య జీవితంలో వచ్చే కష్టనష్టాలను భర్తిస్తూ బతుకు బండిని నడిపించాలి అంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం భర్త అనే పదానికి అర్థమే మార్చేశాడు. తన అర్థాంగిపై ఎవరూ చేయని దారుణానికి పాల్పడ్డాడు. అసలు విషయం తెలియడంతో ఆ మహిళ తన భర్తకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అసలేం జరిగిందంటే.. వీడు భర్త కాదు శాడిస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ కి చెందిన డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు రోజూ రాత్రి తినే అన్నంలో మత్తు మందును కలిపి ఇచ్చేవాడు. అది తిన్న ఆమె నిద్రలోకి జారుకునేది. ఆమె మత్తులోకి వెళ్లగానే పరాయి పురుషులను తన ఇంటికి పిలిపించి.. తన భార్యపై అత్యాచారం చేయించే వాడు. అంతేకాకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు ఆ దురదుర్మార్గపు భర్త. ఇదే తంతుని ఆమెకు తెలియకుండానే పదేళ్లపాటు నడిపించాడు. ఈ సమయంలో దాదాపు 92 మంది ఆ మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 51 మంది.. 26 నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని తెలిపారు. వీరిలో ఫైర్‌మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంకులో ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, నర్సు, జర్నలిస్టు సహా పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ దారుణమైన విషయాన్ని ఫ్రాన్స్ లో ది టెలిగ్రాఫ్ అనే పత్రికలో వెల్లడించారు. పొగతాగి, మద్యం సేవించి, పెర్ఫ్యూమ్ కొట్టుకొచ్చేవారిని డొమినిక్ అనుమతించేవాడు కాదు. ఎందుకంటే ఆ వాసనతో తన భార్యకు మెలుకువ వచ్చే అవకాశం ఉందని.. తన బండారం బయటపడుతుందని భావించేవాడు. అంతేకాకుండా బండ్లను తన ఇంటి ముందు కాకుండా దూరంగా పార్కింగ్ చేసి రావాలని సూచించేవాడు. అసలు నిజం బయటపడిందిలా అయితే మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరాలతో వీడియోలు తీస్తున్నట్లు అనుమానం రావడంతో డొమినిక్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక విచారణలో అత్యాచార వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికీ డొమినిక్ తో సహా 52 మందిని అరెస్ట్ చేశారు. మరికొంత మందిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇన్నాళ్లుగా తనపై జరుగుతున్న దారుణాన్ని గురించి తెలుసుకున్న ఆ మహిళ షాకయ్యింది. తన భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేక విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. చదవండి: టైటాన్ జలాంతర్గామి విషాదం.. భర్తతో, కుమారుడితో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుని.. -
కాపాడే టీ–షర్ట్లు
ఫ్రెంచ్ కంపెనీ ‘ఫ్లోటీ’ పద్దెనిమిది నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం యాంటీ–డ్రౌనింగ్ టీ–షర్ట్‌లను రూపొందించింది. పిల్లలు ప్రమాదవశాత్తు నీటిలో పడితే మునిగిపోకుండా ఈ టీ–షర్ట్లు కాపాడుతాయి. టీ–షర్ట్‌లో అమర్చిన విజిల్ పెద్దగా సౌండ్ చేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. స్టైలీష్‌గా, సౌకర్యవంతంగా ఉండే ఈ టీ–షర్ట్ ఎలా పనిచేస్తుంది...అనేదానిపై రూపొందించిన డెమో వీడియోను పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఇది నోబెల్ బహుమతి పొందిన ఆవిష్కరణ కంటే గొప్పది. ఒక తాతగా పిల్లల భద్రత అనేది నాకు అత్యంత ముఖ్యమైనది’ అని ట్విట్ చేశాడు. -
రెనాల్ట్ డస్టర్ కమింగ్ సూన్: సేల్స్‌లో దూకుడు! ఎన్ని కార్లు అమ్మిందంటే!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా విక్రయాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో 9 లక్షల వాహనాల విక్రయాలను అధిగమించినట్లు రెనాల్ట్ ప్రకటించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన దేశంలోని స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్ మేకర్లలో ఒకటిగా అవతరించింది. గత ఫిబ్రవరిలో 8 లక్షల సేల్స్ మార్క్‌ను తాకింది. త్వరలోనే కొత్త డస్టర్ లాంచ్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ కీలక విక్రయ మైలురాయిని చేరుకోవడం విశేషం. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) పదకొండేళ్ల క్రితం 2012లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది రెనాల్ట్. కైగర్, ట్రైబర్, క్విడ్ లాంటి కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2015లో క్విడ్ రాకతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో సేల్ అవుతున్న మూడు రెనాల్ట్ కార్లలో క్విడ్ ఒకటి. త్వరలోనే డస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్ ) ఇండియా తమకు టాప్ 5 మార్కెట్లలో ఒకటి, గతకొన్నేళ్లుగా దేశంలో బలమైన మార్కెట్‌ను సాధించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. కేంద్రం'మేక్ ఇన్ ఇండియా' కు కట్టుబడి ఉన్నామని, రానున్న ఉత్పత్తుల్లో 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం, రెనాల్ట్ 450 ప్లస్ సేల్స్, 530 సర్వీస్ టచ్‌పాయింట్స్ ద్వారా సేవలందిస్తోంది. మరిన్ని ఆటో, టెక్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఫ్రెంచ్ ఫ్రైస్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..
ఆలూ అనేది ఎంతటి గొప్ప దుంపకూర అంటే దీనిని ఏ వంటకంలోనైనా వినియోగించవచ్చు. అలాగే దీనితో ప్రత్యేకమైన వంటకాలు కూడా చేయవచ్చు. పైగా దీనిని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. అయితే ఆలూ అనగానే ముందుగా చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తుకువస్తాయి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పైగా వీటిని తయారు చేయడం కూడా ఎంతో సులభం. అయితే ఆలూతో చేసే ఈ వంటకాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు వినగానే మనకు ఫ్రాన్స్ గుర్తుకువస్తుంది. అయితే దీనికి ఫ్రాన్స్‌తో ఎటువంటి సంబంధం లేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ మొదట అమెరికాలో పుట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 17వ శతాబ్ధపు చివరిలో వేయించిన ఆలూని స్పెయిన్‌కు చెందిన కొందరు నిపుణులు దక్షిణ అమెరికా తీసుకువచ్చారట. తరువాత అది యూరప్ చేరిందట. దీని తరువాత ఆలూ ఫ్రాన్స్‌లో ఫేమస్ అయ్యిందట. వీటిని తొలుత ‘పోమ్ దె తెరె ఫ్రిట్’ లేదా ‘ఫ్రయిడ్ పొటాటో’ అని అనేవాట. మొదటి ప్రపంచ యుద్ధంలో బెల్జియం సేన అధికారిక భాష ఫ్రాన్సీన్సీ. ఆ సమయంలో అమెరికా సైనికులు వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అని పిలిచేవారట. ఈ పదం అమెరికాలో ఎంతో ఫేమస్ అయ్యింది. అదే పేరు ఈ వంటకానికి స్థిరపడిపోయింది. ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో వీటిని పోమ్ ఫ్రిట్ లేదా ఫ్రిట్ అని పిలుస్తుంటారు. కెనడాలో ఫ్రెంచ్ ఫ్రెస్ను మసాలా గ్రేవీ, వెన్నతో కూడిన పెరుగులో వేసుకుని ఇష్టంగా తింటారట. -
ఎప్పటికీ ‘మేధావులు’ అవసరమే!
ఫ్రెంచ్ సమాజంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ‘మేధావులు’ ఆవిర్భవించారు. అయితే ఈ మేధావులు అనే మాటను వామపక్షీయులను ఉద్దేశించి వాడింది సంప్రదాయవాదులు (రైట్‌వింగ్), కాకపోతే నిందాపూర్వకంగా! వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్‌లో కూడా అదే పరి స్థితి ఉండటం గమనార్హం. అయితే మేధావులు ఈ దాడులను మొదటినుంచీ తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. సమాజంలో జరిగే వ్యవహారాలకు మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకుని ఉండలేరు. కానీ మునుపటిలా శక్తిమంతంగా వారు పోరాడుతున్నారా అన్నది సందేహం. 1993లో ‘బీబీసీ రీత్ ప్రసంగం’ చేస్తూ పాలస్తీనియన్ –అమెరికన్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ సెడ్ ఇలా ప్రశ్నించారు: ‘‘సృజనాత్మకతకూ, దౌర్బల్యుల పట్ల నిబద్ధ తకూ మధ్య సమతౌల్యత సాధించడం ఎలా?’’ ఇంకా ఆయన ఇలా కొనసాగించారు: ‘‘అదిభౌతికమైన ఉద్వేగాలు, ఆసక్తి ఉండని న్యాయం, సత్యం వంటి సూత్రాలు కదిలించినప్పుడల్లా అసలైన మేధావులు ఎన్నడూ లేనంత తాముగా ఉన్నారు. వారు అక్రమాలను నిరసించారు, బలహీనుల పక్షాన నిలిచారు, అధికారాన్ని ప్రశ్నించారు.’’ ప్రజా మేధావి అన్న భావన మొట్టమొదట 1894 డిసెంబరులో ఫ్రాన్ ్సలో పుట్టుకొచ్చింది. ఆర్మీ కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రేఫస్‌పై దేశద్రోహం ఆరోపణలు వచ్చాయి. జర్మన్లకు మిలటరీ రహస్యాలు అమ్మేశాడన్నది ఆయనపై ఆరోపణ. ఇదే అదనుగా యూదు వ్యతిరేక సంస్థలు చెల రేగాయి. ఉదాహరణకు ఎడువార్డ్ డ్రూమాంట్ సంపాదకత్వంలో నడిచిన ‘లా లిబ్రే’ ఫ్రెంచ్ యూదులు విశ్వాస ఘాతకులన్నట్టుగా కథనాలు ప్రచురించింది. కొంతమంది డ్రేఫస్‌కు మద్దతుగా నిలిచారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం బలహీనంగా ఉంది. ఫెర్డినాండ్ వాల్సిన్ ఈస్టర్‌హేజీ అనే మరో అధికారిపై ఇలానే దేశద్రోహ ఆరోప ణలు వస్తే మిలటరీ కోర్టు వాటిని కొట్టివేసింది. జరిగిన అన్యాయం గురించి అందరికీ స్పష్టంగా అర్థమైంది. జాతి వివక్ష కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ నేపథ్యంలో మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకు ఉండలేని పరిస్థితి. విఖ్యాత నవలా రచయిత ఎమిలీ జోలా ‘జా అక్యూస్’ పేరుతో రాసిన బహి రంగ లేఖ ‘లా అరోర్’ పత్రికలో ప్రచురితమైంది. డ్రేఫస్‌ను అక్రమంగా దోషిగా నిర్ధారించి ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఎమిలీ ఆ లేఖలో సైన్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది మరో వివాదానికి దారితీసింది. జోలా మద్దతుదారులు సైన్యాన్ని కించ పరచడం ద్వారా దేశాన్ని బలహీన పరిచారని సంప్రదాయవాదులు (రైట్ వింగ్) విరుచుకుపడ్డారు. మండించే స్వభావం గల అలంకార ప్రాయమైన దేశభక్తి కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ఉదారవాద వామ పక్షీయులు మద్దతిచ్చారు. సంప్రదాయవాదులు వారిని ‘మేధావులు’ అని నిందాపూర్వకంగా పిలిచారు. వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్‌లో కూడా అదే జరుగుతోంది. అయితే మేధావులు ఎప్పుడూ ఈ దాడులను తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. తత్వవేత్త, రచయిత జా పాల్ సార్త్ర్ 1980లో మరణించినప్పుడు సుమారు యాభై వేల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. వివాదానికి దూరంగా ఉండే హక్కు మేధావికి లేదనే వారు సార్త్ర్. అన్నింటికీ అతీతంగా ఉంటామనే సౌలభ్యం కూడా వారికి నాస్తి అంటారాయన. సమాజాన్ని మార్చేందుకు ప్రజా మేధావి అనేవాడు తన సొంత విషయాలను పక్కనబెట్టాలనీ, వ్యక్తిగత జీవితం వంటివి అతడు లేదా ఆమెకు ఉండవనీ అంటారు. 1935లో ఫ్రెంచ్ మేధావులు అంతర్జాతీయ రచయితల సంఘం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ప్యారిస్ సంస్కృతి పరిరక్షణ దీని ఉద్దేశం. ఈ సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో ఫాసిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఏకమయ్యారు. జూన్ నెలలో జరిగిన ఈ సదస్సుకు సజ్జాద్ జహీర్, ముల్క్‌రాజ్ ఆనంద్ వంటివారూ హాజరయ్యారు. తరువాతి కాలంలో వీరిద్దరూ భారతీయ సాహిత్యం, ఉర్దూ కవిత్వంలో మార్పునకు కృషి చేశారు. ఆల్డస్ హక్స్లీ, ఈఎం ఫార్స్టర్, బోరిస్ ప్యాస్టర్‌నాక్, బెర్తోల్ట్ బ్రెష్ట్, ఇంకా ఇతర దిగ్గజ రచయితలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో తలెత్తిన వివాదాలు కాస్తా ప్యారిస్ వీధుల వరకూ విస్తరించాయి. సోవియట్ యూనియన్ చరిత్రకారుడు ఇల్యా ఎహ్రెన్ బర్గ్ ‘దోపిడిదారులను దునుమాడేందుకు ఆయుధంగా మారని ఏ కళ అయినా నిష్ప్రయోజనమైంది!’ అన్నారు ఇల్యా మీద ఆండ్రే బ్రెటన్ లాంటివారు బహిరంగంగానే విమర్శించారు. చివరకు ఆ సదస్సు ఫాసిస్టులకు వ్యతిరేకంగా ఒక సమాఖ్యనైతే ఏర్పాటు చేయలేకపోయింది. సదస్సుకు హాజరైన వారందరూ ఫాసిజాన్ని ద్వేషించారు. కానీ సోవియట్ యూనియన్ తరహా పరి ష్కారం ఉండాలన్న ఆకాంక్షపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. అధివాస్తవికులు, కమ్యూనిస్టుల మధ్య సయోధ్య కోసం రెనె క్రేవెల్ (అధివాస్తవికుడు) విఫలయత్నం చేశారు. ఆ నిస్పృహలో రెనె తన ఇంటికొచ్చేసి గ్యాస్ కనెక్షన్ ఆన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ఏవగింపు’ అని రాసి ఉన్న నోట్ అతడి కోటు జేబుకు అతికించి ఉండింది! ప్రగతిశీల రచయితల బాధ్యత రచయితలు, కవుల సామాజిక బాధ్యతలపై అదే కాలంలో భారత్‌లో కూడా ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కవులు, రచయితలు సామాన్యులతో కలిసిపోవాలంటే వారు తమ వ్యక్తిగత ఆనందాలు, కోరికలు, ఉద్వేగాలు, నిస్పృహలకు అతీతంగా తమ రచనలు, కవితలను తీసుకెళ్లాలన్న నమ్మకంతో 1936లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అఖిల భారతీయ ప్రగతిశీల రచయితల సంఘం) ఏర్పడింది. మతం, జాతీయత రాజకీయాల నుంచి పేద రికం, వివక్ష, వర్గం వైపు కవులను మళ్లించిన ఘనత దీనిదే. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటలీ కాలమిస్ట్ ఆంటోనియో గ్రాంసీ రచనలను అప్పటికి చదివి ఉండేందుకు అవకాశం లేదు. ఆయన ‘ప్రిజన్ నోట్‌బుక్’ 1970లలో ఆంగ్లంలో ప్రచురితమైంది. కానీ ముస్సోలిని అపఖ్యాతి జైలు వ్యవస్థలో మగ్గిన గ్రాంసీ రాసినదానిలో ఈ ప్రగతిశీల రచయితలు నమ్మకం ఉన్నవారే. అదేమిటంటే... మేధావి అనేవాడు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు అవసర మైన వాతావరణాన్ని సృష్టించాలి. ఉదారవాదులు రాజకీయ జీవితంలోకి ప్రవేశించాలి! ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యుడు, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ సభ్యుడైన కె.ఏ. అబ్బాస్ తన ఆత్మకథలో ‘నేనేమీ ఓ ద్వీపాన్ని కాదు’ అన్న వాక్యం ఉంటుంది. 1946 నాటి బాంబే గురించి ఈ వ్యాఖ్య. అప్పట్లో హిందూ, ముస్లింల మధ్య బాంబే రెండుగా విడిపోయి ఉండేది. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ , ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఓ శాంతి ప్రదర్శన ఏర్పాటు చేశాయి. పృథ్వీరాజ్ కపూర్‌కు చెందిన పృథ్వీ థియేటర్స్‌తో పాటు సుమారు 52 సాంస్కృతిక సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొ న్నాయి. కపూర్లు(పృథ్వీరాజ్, రాజ్, షమ్మీ), దేవానంద్, బల్రాజ్ సహానీ, అభ్యుదయ ఉర్దూ కవులు, రచయితలు సజ్జాద్ జహీర్, మజ్రూహ్ సుల్తాన్ పూరి, అలీ సర్దార్ జాఫ్రీ, కైఫీ అజ్మీ, సాహిర్ లూధి యాన్వీతో పాటు మరాఠీ, గుజరాతీ రచయితలు కూడా బోరిబందర్ నుంచి బాంద్రా వరకూ సాగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. శాంతి, సామరస్యాలు, సౌభ్రాతృత్వాలను సూచించే పాటలు పాడుతూ సాగిందా ఊరేగింపు. తద్వారా మత ఘర్షణల గాయాలకు మందు పూసే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతానికి వస్తే... మన నటులను అధికార పక్షంపై ప్రశంసలు కురిపించేలా బలవంతం చేస్తున్నారు. జైలుకెళ్లాల్సి వస్తుందని రచ యితలు భయపడుతున్నారు. విప్లవాత్మక ఆలోచనలున్న నాటక రంగం కనుమరుగైంది. కవులు రాస్తున్నారు కానీ వారి వారి ఏకాంతాల్లో! విద్యావేత్తలు తమ ఉపకులపతుల ఆగ్రహానికి గురి కాకుడ దన్న రంధిలో ఉన్నారు. ఏతావాతా... సమాజపు చేతన కాస్తా నిశ్శబ్దంలో అంగలారుస్తోంది. ఇది ఉపమాలంకారమే కావొచ్చుగానీ, మేధావుల చుట్టూ సంకెళ్ల శృంఖలాలు చుట్టుకుపోయి ఉన్నాయి. దశాబ్దాలపాటు ఫాసిస్టు వ్యతిరేక కూటమి కట్టిన శక్తులు మమ్మల్ని మళ్లీ ఆవహిస్తే బాగుండు. సామాజిక మేధావులు లేని సమాజం నశించిపోతుందనీ, అది కూడా చాలా నెమ్మదిగా కానీ కచ్చితంగా జరుగు తుందనీ ఆ శక్తులు గుర్తుచేస్తున్నాయి. నీరా చంఢోక్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మంత్రి హరీశ్ చొరవతో ప్రభుత్వ పాఠశాలలో హలో.. బోంజో.. ఓలా..
సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల.. లోపలికి అడుగుపెట్టగానే.. 9వ తరగతి చదువుతున్న మనోజ్ కనిపించాడు బోంజో అని పలకరించాడు.. అలా రెండడుగులు వేశామో లేదో.. ఓలా అన్నాడు రాంచరణ్.. ఏంటిది.. ఏమంటున్నారు అన్నదేగా మీ డౌట్.. వీళ్లిద్దరూ మనల్ని గుడ్ మార్నింగ్, హలో అని పలకరించారు. కాకపోతే.. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో.. ఒక్క మనోజ్, రాంచరణే కాదు.. ఆ బడిలో చాలా మంది ఫ్రెంచ్, స్పానిష్ భాషలను నేర్చుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్‌లో పట్టు సాధిస్తున్నారు.. పోటీ ప్రపంచంలో రాణించేందుకు తమను తాము సంసిద్ధం చేసుకుంటున్నారు. సాక్షి, సిద్దిపేట: ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్‌కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. మంత్రి హరీశ్‌రావు చొరవతో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నే ర్పి స్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 9వ తరగతిలో 160 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిలో 100మందికి ఇంగ్లిష్ , 30 మందికి ఫ్రెంచ్, 30 మందికి స్పానిష్ నే ర్పిస్తున్నారు. ఓ యూనివర్సిటీ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని విద్యాబోధన చేయడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 27న తరగతులను ప్రారంభించారు. ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నే ర్పి ంచారు. వారంలో రెండు రోజులు (గురు, శుక్రవారాలు) ఆన్లైన్, ఒకరోజు ( శనివారం) ప్రత్యక్షంగా ప్రొఫెసర్లు బోధన చేశారు. ఇలా నాలుగు వారాలపాటు బోధించారు. ఇంగ్లిష్ లో భాగంగా ఉచ్ఛారణ, సంభాషణ, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్‌పై అవగాహన కల్పించారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో పలకరించడం, సెల్ఫ్ ఇంట్రడక్షన్, సింపుల్ కన్వర్జేషన్ నే ర్పించారు. మార్చి 28న హైదరాబాద్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీకి 160 మంది విద్యార్థులను తీసుకెళ్లారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, విద్యాబోధన తీరు ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులతో ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ముచ్చటించారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ఈ నెల 16న మంత్రి హరీశ్‌రావు, యూనివర్సిటీ వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఆయా భాషల బోధనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి ఏడాదంతా బోధించనున్నారు. ఒక అడ్వంచర్‌లా అనిపించింది.. నేను స్పానిష్ నేర్చుకుంటున్నా. నాకు ఒక అడ్వంచర్‌లా అనిపిస్తుంది. యూనివర్సిటీకి వెళ్లినప్పుడు అక్కడి స్టూడెంట్‌తో నేను స్వయంగా స్పానిష్‌లో మాట్లాడాను. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే రెండో భాష స్పానిష్ నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేర్చుకోవాలని ఉంది. పూర్తిగా గలగలా స్పానిష్‌లో మాట్లాడాలి. ఉన్నత విద్య కోసం స్పెయిన్‌కు వెళ్లినా నాకు అక్కడి భాషతో ఇక ఇబ్బంది ఉండదు. –రాంచరణ్, 9వ తరగతి ఇన్ఫార్మల్ టు ఫార్మల్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం ఇంగ్లిష్ లో ఇన్ఫార్మల్ టు ఫార్మల్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకున్నాం. ఇఫ్లూ వర్సిటీ వారు మాకు ఇంగ్లిష్ నే ర్పి ంచడం చాలా లక్కీగా ఫీలవుతున్నాం. ఇతర విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో డబ్బులు పెట్టినా విదేశీ భాషలు నేర్చుకోలేరు అదే మా హరీశ్‌రావు సార్ కృషితో మా స్కూల్లోనే వాటిని నేర్చుకుంటున్నాం. –అప్ష, ఐమన్, తనీమ్, 9వ తరగతి విద్యార్థులు ఫ్రెంచ్నేర్చుకుంటున్నా.. –మనోజ్,9వ తరగతి ఫ్రెంచ్ భాషను ఇంట్రస్ట్‌గా నేర్చుకుంటున్నా.ఇఫ్లూ క్యాంపస్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఫ్రెంచ్ విద్యార్థులతో మాట్లాడాను. ఫ్రెంచ్ మాట్లాడటంతోపాటు అర్థం చేసుకోగలుగుతున్నా. పదో తరగతిలోనూ ఇంకొంచెం ఫ్రెంచ్ భాషను నేర్చుకోవాలని ఉంది. -
ఫ్రెంచ్ వెబ్ సిరీస్‌లో తెలుగు జర్నలిస్ట్
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి గురించి కానీ, ఆయన రచించిన 'బ్లడ్ సాండర్స్ - ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్' గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తెలుగు పాఠకులకు సుపరిచయమైన సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై రచించిన ఈ పరిశోధనాత్మక రచనను గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఇన్విస్టిగేషన్ జర్నలిజంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న హైదరాబాద్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఇప్పుడు అరుదైన ఘనతను సాధించారు. ఈయన ఫ్రెంచ్ భాషలో త్వరలో విడుదల కానున్న డాక్యుమెంటరీలో లీడ్ క్యారెక్టర్ చేశారు. తిరుమల అడవుల నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఎర్రచందనం గురించి ఈయన పుస్తక రూపంలో బయటపెట్టారు. ఎంతో మంది పోలీస్ అధికారులు, అటవీ శాఖ అధికారుల అభిప్రాయాలతో ఈ పుస్తకాన్ని సమగ్రంగా మలిచారు. సుధాకర్ రెడ్డి త్వరలో ప్లానెట్ కిల్లర్స్ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ప్రపంచంలో ప్రకృతిని నాశనం చేస్తున్న అంతర్జాతీయ క్రిమినల్స్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రధానంగా అడవులను నరికివేయడం, ఏనుగులను చంపి దంతాలను దొంగిలించడం, ఎర్రచందనం వంటి వాటిపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీలను రూపొందించారు. 2023 ఏప్రిల్ 3వ తేదీన ఈ డాక్యుమెంటరీ ఫ్రెంచ్ టీవీలో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో సుధాకర్ రెడ్డి పాత్ర కూడా ఉంది. ఇది నిజంగా తెలుగు జర్నలిస్టులకు దొరికిన అరుదైన, అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ఈ డాక్యుమెంటరీలో ఎర్రచందనం స్మగ్లర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహుల్ హమీద్‌పై ప్రత్యేకంగా కథనాన్ని రూపొందించారు. సాహుల్ హమీద్ ప్రస్తుతం దుబాయ్‌లో ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఉన్న ఎర్రచందనం కాజేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్, తిరుపతి, శేషాచలం అడవులు, చెన్నై, తమిళనాడులోని జావాదు మలై, సింగపూర్, దుబాయ్‌లలో చేశారు. అంతే కాకుండా చెన్నైలో సాహుల్ హమీద పుట్టిన ప్రాంతంలో కూడా షూటింగ్ జరిపారు. సాహుల్ హమీద్ విషయానికి వస్తే, యితడు అనేక నేరాలకు పాల్పడి దాదాపు 120 మిలియన్ డాలర్ల ఆస్తులను సంపాదించినట్లు ఇతనిపై అనేక వార్తలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు గతంలో ఇతన్ని అరెస్టు చేశారు. ఆ తరువాత సాహుల్ దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. సాహుల్ హమీద్ ఎర్రచందనం ఎలా దొంగిలిస్తాడు? అతని ముఠా ఎంతవరకు విస్తరించి ఉంది? అనే వివరాలు ఏప్రిల్ 3న ఎపిసోడ్లో ప్రసారమవుతాయి. ఫ్రాన్స్ డైరెక్టర్లు ఉడుముల సుధాకర్ రెడ్డి సహకారంతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. త్వరలో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌లో పర్యావరణాన్ని నాశనం చేయడానికి నేరగాళ్లు ఎలా పాల్పడుతున్నారు? పర్యావరణం వారి వల్ల ఎలా నాశనమవుతోంది? అరుదైన జంతువులను, అటవీ సంపదను ఎలా నాశనం చేస్తున్నారు? పోలీసులకు దొరకకుండా ఎలా తప్పినందుకుంటున్నారు? పోలీసులు వారిని ఎలా వెతుకుతున్నారనే విషయాలన్నీ సమగ్రంగా వివరించారు. ఈ డాక్యుమెంటరీలో మన తెలుగు తేజం సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి లీడ్ క్యారెక్టర్ చేయడం తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం. ఇది తెలుగు జర్నలిస్టుకు దొరికిన గొప్ప అవకాశం. ఇది అదృష్టం అనటం కంటే కూడా, శ్రమ, పట్టుదల, లోతైన విశ్లేషణ వంటి వాటితోనే ఉడుముల సుధాకర్ రెడ్డి ఈ ఘనత సాధించారని చెప్పాలి. భవిష్యత్తులో ఈయన మరింత గొప్ప స్థాయికి చేరాలను మనస్ఫూర్తిగా ఆశిద్దాం.. -
పారిస్.. యానాం మూడుముళ్ల బంధం
యానాం నుంచి పారిస్‌కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం. సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు. 30 మందికి పైగా.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే. ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. జాక్‌పాట్ కొట్టినట్టే.. ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్‌పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్‌లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు. చెక్కుచెదరని అనుబంధం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం -
Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్‌లో నివసించే హర్షవర్ధన్ అచ్చమైన తెలంగాణ అబ్బాయి. చదువుకునే సమయంలో తమిళనాడుకు చెందిన ‘అరు’ అనే యువతి ప్రేమలో పడ్డాడు. పెళ్లి తంతు మొత్తం తమిళ బ్రాహ్మణ సంప్రదాయంలో జరగడం.. ఆమెతో పెళ్లి కోసం అతను చేసుకున్న సర్దుబాట్లలో ఒకటి మాత్రమే. అతని భార్యగా మారాక అరు కూడా ఇక్కడి ఆచారాలు, అలవాట్లకు తగ్గట్టుగా తన వంతుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమ ముందు సంస్కృతీ సంప్రదాయాలు కూడా తలవంచుతాయి అని ఇలాంటి జంటలు నిరూపిస్తున్నాయి. ఖండాంతరాలు దాటిన ప్రేమ ‘మేం ఇద్దరం ఆరేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. మేం పరిచయమయ్యే నాటికి నా వయసు 18 ఆయనకు 25పైనే’ అంటూ గుర్తు చేసుకున్నారు సెలీన్ (41). ప్రస్తుతం నగరంలోని మణికొండలో నివసిస్తున్న సెలీన్, ఆమె భర్త కాకుమాను విక్రమ్‌ను ఫ్రాన్స్‌లోనే కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమ పెద్దలు, మతాలు వంటి అవాంతరాలు దాటి 2006లో జరిగిన పెళ్లితో సుఖాంతమైంది. పెళ్లి అనంతరం ఫ్రెంచ్ భాషలో ప్రావీణ్యం సాధించిన విక్రమ్ ప్రస్తుతం ఓ ఫ్రెంచ్ కంపెనీలోనే ఉద్యోగం చేస్తుండగా సెలెన్ నగరంలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయిని. తనకెంతో ఇష్టమైన తెలుగు వంటలు వండటం భార్యకు రాకపోయినా విక్రమ్ సర్దుకుపోతుంటే.. భర్తతో కలిసి తిరుపతి వంటి హిందూ దేవుళ్ల ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడం సెలెన్ అలవాటు చేసుకున్నారు. ఇక్కడి ఫంక్షన్లకు చక్కగా చీర కట్టుకుని మరీ హాజరయ్యే సెలెన్‌ను చూసినవారెవరైనా ఫ్రెంచ్ జాతీయురాలు అంటే నమ్మడం కష్టం. హైదరాబాద్ వాతావరణం చాలా నచ్చిందని, తెలుగు భాష కొద్దిగా నేర్చుకున్నానని చెబుతున్న సెలెన్.. తన భర్తకు నచ్చే విధంగా అత్తయ్యా, మావయ్యా అంటూ ఆయన తల్లిదండ్రులను సంబోధిస్తూ సంతోషపెడతారు. ఆపం, పుట్టు అతనికి.. ఇడ్లీ.. దోశ ఆమెకి.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో నగరానికి చెందిన దేవేందర్ ఫార్మాసిస్ట్‌గా.. కేరళకు చెందిన శశికళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ.. ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కేరళ–హైదరాబాద్ మధ్య దూరం తరిగిపోయింది. సెటిలయ్యాకే పెళ్లి అనుకున్నారు కాబట్టి పెద్దలు ససేమిరా అని అడ్డం పడినా ఆ అభ్యంతరాలన్నీ దూది పింజలైపోయాయి. పెళ్లి తర్వాత కొబ్బరినూనెతో వండే కేరళ తరహా వంటలు దేవేందర్ ఇష్టపడక తప్పలేదు. అత్తగారి ఊరెళ్లాక అక్కడి వస్త్రధారణ అయిన పంచెకట్టులోనే గుళ్లూ గోపురాలూ తిరగడం అతనికి అలవాటైంది. మరోవైపు కొబ్బరినూనె లేకుండా వండే వంటలు శశికళ తినక తప్పలేదు. అయితే తర్వాత తర్వాత అక్కడి కోకోనట్ ఆయిల్‌తో వంటలు ఆరోగ్యకరమని గ్రహించిన దేవేందర్ తనకు తన పిల్లల వరకూ అదే ఆయిల్‌ని వాడడం కోసం కేరళ నుంచి 4 కిలోల నూనెను ప్రత్యేకంగా తెప్పిస్తారు. పుట్టు, ఆపం వంటి కేరళ వంటలతో పాటే దేవేందర్‌కు మలయాళం, ఇక్కడి ఇడ్లీ, పూరిలతో పాటే శశికళకు తెలుగు భాష కూడా వంటబట్టేశాయి. ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నా...పరస్పరంప్రేమ ముందు ఇలాంటి సర్దుబాట్లు చిన్నవే అంటోందీ జంట. కేరళ అబ్బాయి.. తమిళ అమ్మాయి అమెజాన్ కంపెనీలో పనిచేస్తూనే ప్రేమలో పడిన ప్రియాంక తమిళమ్మాయి, అబ్బాయి శ్రీకాంత్‌ది కేరళ. ఇద్దరూ ప్రేమను పంచుకున్నారు. మరి పూర్తిగా భిన్నమైన సంప్రదాయాలను ఎలా పంచుకుంటున్నారు? అంటే.. సందర్భాన్ని బట్టి, అప్పటికప్పుడు ఏది బెటరయితే అది ఫాలో అయిపోవడమే అంటూ సింపుల్‌గా చెప్పేస్తారిద్దరూ. ఉదాహరణకి వీరి పెళ్లి ఏ సంప్రదాయంలో జరగాలి? అనే చర్చ వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. కేరళ సంప్రదాయంలో పెళ్లి పట్టుమని 15 నిమిషాలు కూడా ఉండదు కాబట్టి కాస్త గుర్తుంచుకునేలా ఉండడానికి ఇక్కడి సంప్రదాయాన్నే ఎంచుకున్నారు. ‘ప్యారా’నాపూల్ చార్మినార్: ప్రేమకు గుర్తుగా మూసీ నదిపై పురానాపూల్ వంతెనను నిర్మించారు. అప్పట్లో దీనిని ‘ప్యారా’నాపూల్ అనేవారు. తాను ప్రేమించిన భాగమతి దక్షిణ మూసీ ప్రాంతంలో ఉండటంతో.. ఉత్తరం వైపు ఉన్న గోల్కొండ నుంచి ప్రాణాలకు తెగించి నదిని దాటుకుంటూ వచ్చి వెళ్లేవాడు మహ్మద్ కులీ కుతుబ్ షా. ఇలా నది నీటిలో ఈదుకుంటూ వెళ్లి రావడం ఎప్పటికైనా ప్రమాదమని భావించిన మహ్మద్ కులీ కుతుబ్ షా తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా మూసీపై కొత్తగా వంతెన నిర్మాణానికి పూనుకున్నాడు. మూసీ నదిపై వంతెన నిర్మిస్తే తన కుమారుడు క్షేమంగా ఇవతలి నుంచి అవతలికి వెళ్లి రావడానికి అనువుగా ఉంటుందని.. అతను ప్రేమించిన భాగమతిని కలిసి వస్తాడని భావించి 1578లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. దీంతో మూసీ నదిపై భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ వంతెనను నిర్మించాడు. అప్పట్లో ప్యారానాపూల్‌గా ప్రసిద్ధి గాంచిన ఈ వంతెన.. అనంతర కాలంలో పురానాపూల్‌గా వాడుకలోకి వచ్చింది. -
వరల్డ్ వైడ్‌గా ‘పనిమంతులు’ ఏ దేశాల్లో ఉన్నారో తెలుసా?
ప్రపంచ దేశాలకు చెందిన ఉద్యోగులతో పోల్చుకుంటే అమెరికన్ ఉద్యోగులు ‘హస్టిల్ కల్చర్’లో ప్రాచుర్యం పొందుతుంటే ఫ్రెంచ్ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ పనిగంటలు చేస్తున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. గ్లోబల్‌లో సగటున 25శాతంతో ప్రతి పదిమంది ఫ్రెంచ్ బిజినెస్ లీడర్స్‌లో నలుగురు ఆఫీస్ వర్క్ చేసే సమయంలో ఎలాంటి బ్రేకులు తీసుకోకుండా గంటల తరబడి పని చేస్తున్నారు. యూఎస్,యూకే, చైనా దేశాలకు చెందిన ఉద్యోగులు సైతం పని విషయంలో మంచి రేటింగ్ పొందుతున్నట్లు సర్వే నిర్వహించిన హెల్త్ ఇన్స్యూరెన్స్ సంస్థ బుపా గ్లోబల్ ఫండ్ తెలిపింది. పనిమంతులే.. కానీ భయం ఎక్కువే! అదే సమయంలో ఏ దేశంలో సర్వే చేసిన ..ఆయా దేశాల్లో ఫ్రెంచ్ ఎగ్జిక్యూటివ్‌లు వారి వ్యక్తిగత పని పనితీరు గురించి ఆందోళన చెందుతున్నట్లు తేలింది. అందుకు ప్రస్తుత ఆర్థిక అస్థిరతను ఎదుర్కొనేందుకు వారి సంస్థల సామర్థ్యం గురించి ఆందోళనలు, ఇతర దేశాలకు చెందిన తరహాలో ఉద్యోగులు రిమోట్ వర్క్ చేసేందుకు ఇష్టపడకపోవడం వంటి అంశాలు ఉన్నాయని సర్వేలో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా..ఆర్థిక ఒత్తిళ్లు, బాధ్యతలు స్వీకరించే ధోరణి కారణంగా ఫ్రెంచ్ ఎగ్జిక్యూటివ్‌లు ఎక్కువ గంటలు పనిచేయడానికి దోహదపడుతుంది" అని బుపా గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంథోనీ కాబ్రెల్లి అన్నారు. ఆశ్చర్యం కలుగక మానదు ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఆఫీసుల్లో అమలు చేస్తున్న పాలసీలు, జీవనశైలి గురించి వింటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇక ఆదేశంలో చాలా మంది కన్స్ట్రక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్,ఆయిల్ ఫీల్డ్ వర్క్ వంటి బ్లూ కాలర్ జాబ్స్, ఫుడ్ సర్వీస్,క్లీన్ సర్వీస్, పర్సల్ సర్వీస్ వంటి సర్వీస్ ఉద్యోగులు వారంలో 35 గంటల పని చేస్తున్నారు. వేసవి సెలవులు ఉన్న ఆగస్ట్ నెలలో ఎక్కువ గంటలు ఆఫీస్ పనికే కేటాయిస్తున్నారు. రైట్ టూ డిస్ కనెక్ట్ 2017లో ఫ్రాన్స్ దేశం రైట్ టూ డిస్ కనెక్ట్ అనే చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టంలో నిర్దిష్ట గంటల తర్వాత ఇంటికి వెళ్లిన ఉద్యోగులకు ఇమెయిల్స్, కాల్స్ చేయడం నిషేధించాలని సంస్థలు కోరాయి. మహమ్మారి సమయంలో రిమోట్ వర్క్ చేసేలా ప్రతిపాదనలు తెచ్చేలా ఇతర దేశాలను ప్రేరేపించింది. కాగా, కొన్నేళ్లుగా ఫ్రెంచ్ లేబర్ కోడ్ ప్రకారం ఎవరైనా తమ డెస్క్‌ల వద్ద భోజనం చేయడం నిషేధం.. అయినప్పటికీ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో చట్టాన్ని నిషేధించారు. -
గొప్పగా భావిస్తున్న!.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన సీరియల్ కిల్లర్ శోభరాజ్
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 78 ఏళ్లు కావడంతో వయసు రీత్య విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు పేర్కొనడంతో.. ఆయన శుక్రవారం నేపాల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు ఆయనను విలేకరులు ఇంటర్య్వూలో తాను చాలా గొప్పగా భావిస్తున్నానని శోభరాజ్ చెప్పారు. తాను చేయాల్సింది చాలా ఉందని, చాలా మంది వ్యక్తులపై దావా వేయాలని అన్నారు. ఆయన ప్రస్తుతం దోహా మీదుగా విమానంలో ఫ్రాన్స్‌కి వెళ్లనున్నాడు. మిమ్మల్ని సీరియల్ కిల్లర్‌గా తప్పుగా వర్ణించారని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా..ఔను అని చెప్పాడు. నెట్‌ఫిక్స్‌లో 'సిరిస్ ది సర్పెంట్'లో శోభరాజ్ జీవిత చరిత్రలో 1970లలోని 20 హత్యలతో ముడిపడిన కథను తెరకెక్కించారు. భారత్‌లో 1976లో అరెస్టు అయ్యాడు. ఐతే 2003లో నేపాల్‌కు వెళ్లాడు, అక్కడ జర్నలిస్ట్ అతనిని గుర్తించి అరెస్టు చేశాడు. చివరికి 1970లలో చేసిన జంట హత్యలకు గాను అక్కడ 21 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ వారంలోనే అతని ఆరోగ్య కారణాల దృష్ట్యా విడులై ఫ్రాన్స్‌కి పయనమయ్యాడు. (చదవండి: సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదలకు ఆదేశాలు) -
19 ఏళ్లకు.. చార్లెస్ శోభరాజ్ రిలీజ్‌కు గ్రీన్‌సిగ్నల్
ఖాట్మాండు: ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌కు.. 19 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఊరట లభించింది. వయసు రీత్యా అతన్ని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన ఆరోపణలపై చార్లెస్ శోభరాజ్ 2003 నుంచి నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని వయసు ఇప్పుడు 78 ఏళ్లు. 1975లో శోభరాజ్ నేపాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్‌తో ప్రవేశించడం.. అమెరికా పౌరుడు 29 ఏళ్ల కొన్నీ జో బోరోన్జిచ్, అతని స్నేహితురాలు 26 ఏళ్ల కెనడియన్ లారెంట్ క్యారియర్ ఇద్దర్నీ హత్య చేసిన నేరంపై నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శోభరాజ్ తండ్రి భారతీయుడు. తల్లి వియత్నాం వాసి. శోభరాజ్‌కు ఫ్రెంచ్ పౌరసత్వం ఉంది. పూర్తి పేరు చార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హాట్చంద్ భవనాని. అతని ఫోటో నేపాల్‌లోని ఒక వార్త పత్రికలో ప్రచురితమవ్వడంతో ఆచూకీ ప్రపంచానికి తెలిసింది. జంట హత్యలు చేసినందుకుగానూ ఖాట్మండులోని సెంట్రల్ జైలులో 20 ఏళ్లు శిక్ష, నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించినందుకు గానూ ఒక ఏడాది జైలు శిక్ష కలిపి మొత్తం 21 ఏళ్లు జైలు శిక్షను అనుభవించాడు. అంతేగాదు రూ. 2 వేలు జరిమానా కూడా చెల్లించాడు. ఈ కరడుగట్టిన నేరస్తుడి గురించి సినిమాల్లో రిఫరెన్సులు ఉండడం, అతనిపై పలు సినిమాలు కూడా రావడం తెలిసిందే. (చదవండి: రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావు తప్ప మరో మార్గం లేదంటూ..) -
అర్థం లేనితనం
‘‘అమ్మ ఈ రోజు చనిపోయింది. లేదా బహుశా నిన్న, నాకు తెలీదు.’’ ఈ ప్రారంభ వాక్యాలతో ఉదాసీన గొంతుకతో మొదలయ్యే ‘ద స్ట్రేంజర్’ నవల సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం 1942లో వచ్చింది. ఆల్బర్ట్ కామూ ఫ్రెంచ్ భాషలో రాసిన, ఆంగ్లంలో ‘ది ఔట్‌సైడర్’ పేరుతో కూడా ప్రసిద్ధమైన ఈ నవల అసంబద్ధవాద తాత్విక చింతనకు శిఖరాయమానమైన రచనగా నిలిచింది. ఈ ప్రపంచానికి ఏ క్రమమూ లేదు, జీవితం అనేదానికి ఏ పరమార్థమూ లేదని అసంబద్ధవాదం చెబుతుంది. ఈ ప్రపంచం ఇలా ఉంటే బాగుంటుందనే అంచనాతో జనాలు ప్రవర్తిస్తారు. అలా ఉన్నా, ఉండకపోయినా ఈ ప్రపంచానికి పోయేదేమీ లేదు. కానీ మన తార్కిక మెదడు ఒక క్రమాన్నీ, అర్థాన్నీ అందుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఈ కఠిన సత్యాన్ని మనిషి అనేవాడు ఎదుర్కోవాల్సిందే. లేదా చచ్చిపోవడమే దారి. అలా చేయలేనివాళ్లు దేవుడినో, ఆధ్యాత్మికతనో ఆశ్రయిస్తారు. దానికి బదులుగా ఆ అర్థంలేనితనాన్ని అంగీకరించడం ఉత్కృష్ట మార్గం. దీన్నే మహత్తరమైన వచన సరళతతో, అత్యంత సంక్లిష్టమైన యాంటీ–హీరో పాత్ర చిత్రణతో నిరూపిస్తాడు కామూ. ఫ్రెంచ్–అల్జీరియాలోని అలై్జ్జర్స్ నగరంలో మ్యార్‌సో ఒక మామూలు ఉద్యోగి. వచ్చేది అరాకొరా జీతం. తల్లిని మరెంగో గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఉంచుతాడు. ఆమె మరణవార్త టెలిగ్రామ్ అందుకున్నాక, అంత్యక్రియలకు రెండ్రోజుల సెలవు అడుగుతాడు. (దానికి బాస్ చిరాకుగా ముఖం పెడతాడు. కారణం: అంత్యక్రియలు శుక్రవారం కాబట్టి, వీకెండ్‌తో కలుపుకొని ఆ సెలవు నాలుగు రోజులవుతుంది.) అలా సెలవు అడగాల్సి వచ్చినందుకు పశ్చాత్తాపపడుతూనే తల్లి దగ్గరికి వెళ్లిన మ్యార్‌సో ప్రవర్తనలోని పొసగనితనాన్ని ప్రపంచం అడుగడుగునా గమనిస్తుంది. తల్లి శవం పక్కన జాగారం చేస్తూ సిగరెట్ కాల్చుతాడు. కాఫీ తాగుతాడు. అతడు వెళ్లేప్పటికే మూసేసివున్న శవపేటిక తలుపు తెరవనక్కర్లేదని చెప్పి అక్కడి సహాయకుడిని విస్తుపోయేలా చేస్తాడు. ఇంకా ముఖ్యంగా తల్లి చనిపోయిందని ఏడ్వడు. తెల్లారి బీచిలో మాజీ సహోద్యోగి మరీ కార్డోనా అనుకోకుండా ఎదురవుతుంది. ఇద్దరూ ఈత కొడతారు. మ్యార్‌సో కోరిక మీద సినిమాకు వెళ్తారు. అది కూడా కామెడీ సినిమా. ఆ రాత్రి ఇద్దరూ కలిసి గడుపుతారు. గతం రోజే తల్లి ఖననం జరిగివుందనేది ఒక నేపథ్య వాస్తవం. మ్యార్‌సో తన చర్యల పరిణామాల గురించి ఆలోచించడు. ఇతరులు ఏమనుకుంటారో అని తలచడు. సందర్భశుద్ధి గల ఉద్వేగాలు ప్రకటించడు. సింపుల్‌గా చెప్పాలంటే, అతడు జీవితపు ఆట ప్రకారం ఆడడు. అందుకే అతడు సమాజానికి ‘అపరిచితుడు’, లేదా ‘బయటివాడు’. అందువల్ల దానికి తగిన మూల్యం చెల్లిస్తాడు. అనుకోకుండా అతడు చేసిన హత్య కన్నా, అతడి (అ)ప్రకటిత ఉద్వేగాలు ఎక్కువ ప్రశ్నార్థకం అవుతాయి. నిజాయితీతో కూడిన జవాబులే అయినప్పటికీ – విచారణ సమయంలో తాను అరబ్బును చంపడానికి కారణం మండుటెండ పుట్టించిన చీదర అని జవాబివ్వడం ద్వారా న్యాయమూర్తినీ, జైల్లో పడ్డాక కూడా తనకు దేవుడు అక్కర్లేదని మతగురువునూ చీకాకుపెడతాడు మ్యార్‌సో. ప్రకృతి మాత్రమే మన జీవితాల్ని శాసిస్తుందని చెప్పడం కామూ ఉద్దేశం. భౌతిక అవసరాలు మాత్రమే మ్యార్‌సోను శాసిస్తాయి. జైలు మూలంగా ఈత కొట్టలేకపోవడం, సిగరెట్లు కాల్చలేకపోవడం, శృంగార జీవితం లేకపోవడం గురించి బాధపడతాడు. ఆ శృంగారం కూడా ప్రత్యేకించి మరీయే అని కాదు. నిజానికి మనుషులు లోలోపల ఇలాగే ఉంటారు. కానీ పైన ఒక ఆమోదనీయ పొరను కప్పుకొంటారు. ఇంకోలా ఉండాలనో, ఉండలేకపోవడం తప్పనో భావిస్తారు. ఒకప్పుడు లక్ష్యం ఉండి, ఇప్పుడు అంతా ఒకటే అనే స్థితి మ్యార్‌సోది. ప్రమోష¯Œ వచ్చినా, రాకపోయినా తేడా లేదనే మనిషి ఎవరు ఉండగలరు? ఇదొక రుషిత్వపు లక్షణంలా కనబడుతుంది. కానీ ఎలా ఉన్నా అర్థమే లేనప్పుడు, దానికోసం మళ్లీ ప్రత్యేకంగా తపన పడటం ఎందుకనేది అతడి వాదం. నిజానికి ఒక సున్నితమైన మనిషి మ్యార్‌సోలో ఉంటాడు. అరబ్బును చంపిన తర్వాత తానిక సంతోషంగా ఉండలేనని అతడికి తెలుసు. అయినా అది జరిగిపోయింది. దానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేడు. అరబ్బు హత్య, ఆ హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇవేవీ కూడా ఒక క్రమం వల్ల జరిగినవి కావు. కానీ మ్యార్‌సో జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. జీవితానికో ప్రత్యేక క్రమం ఉందన్న వాదనను ఇది పటాపంచలు చేస్తుంది. అందుకే చివరలో గిలటి¯Œ తో తలను తెగ్గొట్టే మరణ శిక్ష అనుభవించడానికి ముందు, ఇక అక్కడ పోగుకాబోయే కోపగ్రస్థ మూక అరుపులను ఊహించుకున్నాక, ప్రపంచం గురించి అతడికి ఉన్న ఆ చివరి భ్రమలు కూడా తొలగిపోతాయి. జీవితపు సున్నితమైన ఉదాసీనతకు మేలుకుంటాడు. శిక్షను తేలిగ్గా అనుభవించే మానసిక స్థితికి వస్తాడు. అతడి చింతన సంపూర్ణమవుతుంది. ఊహ తెలిసేనాటికే మొదటి ప్రపంచ యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్నాడు కామూ. రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది జీవితాలు చెదిరిపోవడం చూశాడు. అల్జీరియాలో ఫ్రెంచివారి అణిచివేతకు సాక్షిగా ఉన్నాడు. పేదరికాన్ని అనుభవించాడు. జీవితపు అర్థరాహిత్యం ఆయన అనుభవసారం. కథకుడు, నాటకకర్త, పాత్రికేయుడు అయిన కామూ తన 28వ యేట ‘స్ట్రేంజర్’ రాశాడు. 1957లో నోబెల్ వరించింది. ఆ పురస్కారం అందుకున్న అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా నిలిచాడు. కానీ మూడేళ్లకే తన 46వ యేట కారు ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూశాడు, ప్రపంచపు అసంబద్ధతను తన జీవితం ద్వారా కూడా నిజం చేస్తూ! -
ఎంజాయ్ చేయడం లేదని జాబ్ పీకేశారు.. కోర్టుకెక్కిన ఉద్యోగి!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. లాభదాయకంగా లేని వ్యాపారాల్ని మూసివేస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ ఈ సంస్థ మాత్రం ఉద్యోగులు నవ్వలేదని ఫైర్ చేస్తుంది. 2015లో జర్మనీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ క్యూబిక్ పార్టనర్స్ సంస్థ ‘మిస్టర్ టి’ అనే ఉద్యోగికి పింక్ స్లిప్ జారీ చేసింది. అతను చేసిన తప్పల్లా ఒక్కటే. ఆఫీస్‌లో ఫన్‌గా ఉండక పోవడం, వీకెండ్స్‌లో ఆఫీస్ అయిపోయిన తర్వాత సహచర ఉద్యోగులతో కలిసి మందు కొట్టకపోవడంలాంటి కారణాలు చూపెట్టి అతన్ని ఇంటికి పంపించేసింది. దీంతో సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ కేసు విచారణలో భాగంగా ఉద్యోగి పారిస్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని, సంస్థ సిబ్బందితో వీకెండ్స్‌లో పబ్‌లు, పార్టీలకు రావడం లేదని క్యూబిక్ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. కాబట్టే ‘వృత్తిపరమైన అసమర్థత’గా పరిగణలోకి తీసుకుంటూ అతనిపై వేటు వేసినట్లు విన్నవించింది. సంస్థ వివరణపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ టి’ని సెమినార్లు, పబ్స్ బలవంతంగా పాల్గొనేలా హక్కు కంపెనీకి లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. విచ్చలవిడితనం, బెదిరింపులు, రెచ్చగొట్టడం, గొడవ పెట్టుకోవడంలాంటివి ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు. ఏదేమైనా పని గంటల తరువాత ఆఫీస్ నిర్వహించే పార్టీల్ని నిరాకరించే హక్కు ఆ ఉద్యోగికి ఉందని స్పష్టం చేసింది. కాబట్టి తన మాజీ ఉద్యోగికి నష్టపరిహారంగా 2,574 పౌండ్లు (సుమారు రూ. 2.54 లక్షలు) చెల్లించాలని క్యూబిక్ పార్ట్నర్స్ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో నష్టపరిహారాల రూపంలో మరో 395,630 పౌండ్లు (సుమారు రూ. 3.90 కోట్లు) కావాలన్న మిస్టర్ టి డిమాండ్‌ను కోర్టు పరిశీలించడానికి సిద్ధంగా ఉంది. మిస్టర్ టి 2011లో సంస్థలో చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ 2014లో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మరుసటి ఏడాది ఉద్యోగం నుంచి క్యూబిక్ తొలగి౦చింది. చదవండి👉 ‘ట్విటర్లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు -
డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్ను ప్రవేశపెడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లో దీన్ని ముందుగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఆసక్తి చూపిస్తే వాటిలోనూ అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంచైజ్ అలయెన్స్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా ఫ్రెంచ్ భాషను తీసుకురావడంపై కొన్నాళ్లు కసరత్తు చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఫ్రాన్స్ విదేశీ మంత్రిత్వశాఖతో కలిసి రాష్ట్రంలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓయూ పరిధిలోని కాలేజీల్లో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఈ కోర్సును ప్రవేశపెట్టి, వచ్చే ఏడాది నుంచి ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలకు విస్తరిస్తారు. ఇప్పటివరకూ హిందీ, తెలుగు సహా ఇతర భాషలు డిగ్రీలో ద్వితీయ భాషలుగా ఉన్నాయి. అయితే, ఫ్రెంచ్ భాషను రాష్ట్రంలో డిప్లొమా, ఇతర సర్టిఫికెట్ ప్రోగ్రాములుగా అందించారు. కొన్నేళ్లుగా కొంతమంది ఈ సబ్జెక్టులను నేర్చుకున్నారు. సీనియర్ డిప్లొమా చేసిన వాళ్లు కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వీళ్లను ఫ్రెంచ్ అధ్యాపకులుగా గుర్తించబోతున్నారు. వీరికి బోధనకు అనుకూలంగా ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని ఓయూ అధికారులు తెలిపారు. ఫ్యాకల్టీ సిద్ధం: చైర్మన్, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి ఫ్రెంచ్ భాషను ద్వితీయ భాషగా తెచ్చేందుకు కొన్నేళ్లుగా చేస్తున్న కృషి ఈ ఏడాది కార్యాచరణకు నోచుకుంటోంది. మంచి పాఠ్య ప్రణాళికతోపాటు సుశిక్షితులైన బోధకులను సిద్ధం చేశాం. ఈ భాష నేర్చుకున్న విద్యార్థి మంచి ఉద్యోగాలు పొందే వీలుంది. ఫలితంగా డిగ్రీ కోర్సులు మరింత ఆదరణ పొందుతాయి. ఉపాధి అవకాశాలు ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం వల్ల బహుళజాతి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొన్నేళ్లుగా చూస్తే రాష్ట్రంలో ఈ తరహా భాష మిళితమైన కార్పొరేట్ సంస్థల వ్యాపార లావాదేవీలు పెరిగాయి. సంస్థల ఏర్పాటు విస్తరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి కంపెనీల్లో ఫ్రెంచ్, ఇతర విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యత లభిస్తోంది. భవిష్యత్‌లో డిగ్రీ స్థాయిలో ఫ్రెంచ్‌తో పాటు జర్మనీ ఇతర కోర్సులు అందుబాటులోకి తెచ్చే వీలుంది. పీజీలోనూ ఈ భాషల ప్రాధాన్యత పెరిగే అవకాశముంది. – ప్రొఫెసర్ డి.రవీందర్, వీసీ, ఉస్మానియా వర్సిటీ -
ఇందులో కూర్చొని..ఎక్కడికంటే అక్కడికి పక్షిలా ఎగిరిపోవచ్చు!
పురాణాల్లో ఆకాశంలో ఎగిరే చిత్ర విచిత్ర రథాల గురించిన వర్ణనలు తెలిసినవే! ఇంచుమించు అలాంటి విచిత్ర వాహనాన్నే తయారు చేశాడు ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫ్రాంకీ జపాట. హోవర్బోర్డుకు జెట్ ఇంజన్‌ను అమర్చి, దీనికి రూపకల్పన చేశాడు. దీని పనితీరును పరీక్షించడానికి ఇటీవలే దీనిలో కులాసాగా కూర్చుని, హాయిగా ఎగురుతూ ఇంగ్లిష్ చానెల్‌ను దాటి వచ్చాడు. దీనిని మరింత మెరుగుపరచి, పరీక్షలు జరపాలని భావిస్తున్నానని, ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు పాతికమంది ఔత్సాహిక వాలంటీర్లు కావాలని జపాట ప్రకటించాడు. ప్రస్తుతం జపాట రూపొందించిన ఈ హోవర్‌బోర్డు నేల మీద నుంచి పదివేల అడుగుల ఎత్తు వరకు చేరుకోగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 250 కిలోమీటర్లు. -
Formula One: లెక్లెర్క్కు ఏడో ‘పోల్’
లె కాసెలెట్ (ఫ్రాన్స్): ఫార్ములావన్ తాజా సీజన్లో క్వాలిఫయింగ్ సెషన్లో రాణించిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఏడోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1ని:30.872 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. -
ఎట్టకేలకు ‘సిట్రోయెన్ సీ3’ లాంచ్, ధర, ఫీచర్ల వివరాలివిగో!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్ సీ 3 కార్లను ఎట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మంట్లో వీటిని సరికొత్తగా తీసుకొచ్చింది. ఈ కార్ ధరను రూ. 5.70 లక్షల (ఎక్స్-షోరూమ్, పరిచయ ధర) గా కంపెనీ నిర్ణయించింది. భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ హౌస్ నుండి వచ్చిన తొలి చిన్న ఎస్యూవీ ఇది. మొత్తం ఆరు వేరియంట్లలో, పది రంగుల్లో సిట్రోయెన్ సీ3 లభిస్తుంది. ఈ ఫైవ్ సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పూర్తిగా ఇండియా కస్టమర్లకోసం లాంచ్ చేయడం విశేషం. ఇంజన్, ఫీచర్లు రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లో లభ్యం. 5 స్పీడ్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5,750 ఆర్పీఎం వద్ద 81 బీహెచ్పీ, 115 టార్క్‌ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 5,750 ఆర్పీఎం వద్ద, 108 బీహెచ్పీని, 1150 ఆర్పీఎం వద్ద 190 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఫంకీ డిజైన్, V-ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్స్ అమర్చింది. డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్, చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో సిట్రోయెన్ సీ3 ముస్తాబైంది. డ్యూయల్-టోన్ డాష్ బోర్డ్ 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ,డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటీరియర్ ఫీచర్లుగా ఉన్నాయి. సిట్రోయెన్ సీ3 ధరలు లైవ్: రూ. 5,70,500 ఫీల్: రూ. 6,62,500 ఫీల్ వైబ్ ప్యాక్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 6,92,500 టర్బో ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 8,05,500 దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లా మైసన్ సిట్రోయెన్ ఫిజిటల్ షోరూమ్‌లలో వినియోగదారులకు కొత్త సీ3 డెలివరీలు నేటి (జూలై 20) నుండి ప్రారంభం. ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పూణే, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, చండీగఢ్, జైపూర్, లక్నో, భువనేశ్వర్ వంటి 19 నగరాల్లోని లా మైసన్ సిట్రోయెన్ ఫైజిటల్ షోరూమ్‌లలో కొత్త సిట్రోయెన్ సీ3 రిటైల్‌గా అందుబాటులో ఉంది. -
‘అద్దంలో నా ముఖం చూసి గుర్తుపట్టలేకపోయా’ .. ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన నటి
సాధారణంగా సినీ తారలు కొంత మంది తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఫ్రెంచ్ నటి జుడిత్ చెమ్లా గాయాలతో ఉన్న తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి పలు విషయాలను పంచుకుంది. అయితే ఆ ఫోటోతో పాటు తన కుమార్తె తండ్రే దీనంతటికి కారణమని తెలిపింది కానీ అతని పేరును మాత్రం చెప్పలేదు. ఫ్రెంచ్ సినిమా ‘మెస్ ఫ్రెరెస్ ఎట్ మోయి’ తో మంచి పేరు సంపాదించుకుంది నటి జుడిత్ చెమ్లా. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గృహ హింస ఫలితంగా ఒక సంవత్సరం క్రితం తాను తీవ్రంగా గాయపడ్డ ఫోటోలను చేస్తూ ఇలా రాసింది.. “ఒక సంవత్సరం క్రితం ఒకరి వల్ల నా ముఖం గాయపడింది. ఎంతలా అంటే నన్న నేను గుర్తపట్టలేనంత. ఆ సమయంలో నన్ను నేను అద్దంలో చూసుకుంటే చాలా బాధేసింది. చాలా రోజుల వరకు బయట ప్రపంచంలోకి రాలేకపోయాను. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, ఇకపై నా ముఖాన్ని దాచలేనని తెలుసుకుని, దాని నుంచి బయటపడ్డానని’’ చెప్పుకొచ్చింది. అయితే తన పరిస్థితికి కారణమైన వాడిపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు పెద్దగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే అతనిపై పలుమార్లు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పాంది. కాగా చెమ్లా గతంలో చిత్ర దర్శకుడు యోహన్ మాన్కాతో డేటింగ్లో ఉంది. అతడిని నటిపై గృహ హింస కేసు విషయంలో ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. ఆ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Judith Chemla (@judithhhhhhhhhhhhhh) చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య -
118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా?
సాక్షి, సెంట్రల్ డెస్క్: ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? అంటే.. రోజూ వ్యాయామం చేయాలి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. సమయానికి నిద్ర పోవాలి.. ఇలా రకరకాలుగా చెబుతూనే ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా (118 ఏళ్లు) ఇటీవలే గిన్నిస్ రికార్డుకెక్కిన ఫ్రెంచ్ నన్ సిస్టర్ ఆండ్రే ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా? ఆమె రోజు తీసుకునే చాక్లెట్, ఓ గ్లాస్ వైన్. ఆండ్రే నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్న డేవిడ్ టవెల్లా ఇదే చెబుతున్నారు. ‘ఆండ్రూ రోజూ తీసుకునే గ్లాస్ వైన్ వల్లే తాను జీవిత కాలం పెరగడానికి కారణమేమో. నేను మాత్రం వైన్ తాగమని ఎవరికీ సలహా ఇవ్వను’ అని డేవిడ్ అంటున్నారు. గతంలో ఎక్కువ వయసున్న వ్యక్తి రికార్డు జపాన్‌కు చెందిన కేన్ టనక పేరిట ఉండేది. తాను ఈ ఏడాది ఏప్రిల్ 19న మరణించారు. దీంతో ఈ రికార్డు ఆండ్రే సొంతమైంది. కరోనా బారిన పడి కోలుకున్న పెద్ద వయస్కురాలిగా కూడా ఆండ్రే రికార్డుకెక్కారు. -
'కీ వీవ్' అంటే ఏంటో తెలుసా..?
అలర్ట్‌గా ఉండడం, తదేకంగా పరిశీలించడం... ఇలాంటి సందర్భాలలో ఉపయోగించే ఎక్స్ప్రెషన్ కీ వీవ్. ఉదా: యాన్ ఆర్మీ ఆన్ ది కీ వీవ్ ‘కీ వీవ్’ అనేది ఫ్రెంచ్ ఎక్స్ప్రెషన్. ఆరోజుల్లో ఫ్రాన్సులో కోటలకు కాపల కాసే సైనికులు, దూరంగా ఎవరైనా అపరిచితులు కనిపిస్తే–‘కీ వీవ్’ (లాంగ్ లివ్ హూ?) అని గట్టిగా అరిచేవాళ్లు. అప్పుడు అటునుంచి జవాబు... ‘లాంగ్ లివ్ ది కింగ్’ అని వినిపించాలి. అలా కాకుండా, ఆ వ్యక్తి నీళ్లు నమిలినా, వేరే ఏదైనా జవాబు చెప్పినా...అతడిని అనుమానించి రకరకాలుగా ప్రశ్నించేవారు. ఇది ఎలా సాధ్యం? ఒక కాలువకు అటు వైపు యజమాని, ఇటు వైపు అతని శునకం జిమ్మీ ఉంది. ‘జిమ్మీ! ఇటు వచ్చేయ్’ అని అరిచాడు యజమాని. వెంటనే వచ్చేసింది జిమ్మీ. అయితే జిమ్మీ కొంచెం కూడా తడవలేదు. అలా అని అది వంతెన మీది నుంచి రాలేదు. పడవ ఎక్కి రాలేదు. తడవకుండా రావడం ఎలా సాధ్యమైంది? జవాబు: ఆ కాలువ గడ్డకట్టి పోయింది! -
అక్కడేం లేదు.. అయినా నాలుగు కోట్లు, అట్లుంటది మరి!
కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు మన కళ్ల ముందే జరుగుతుంటయ్. వాటి గురించి తెలిసినప్పుడల్లా నోళ్లు వెళ్లబెట్టడం, దిమ్మ తిరిగిపోవడం మాత్రమే మన వంతు అయితది. అట్లాంటి ఎగ్జాగరేట్ అయ్యే ముచ్చటే మీకు ఇప్పుడు చెప్తున్నం. ఏం లేని దానికి నాలుగు కోట్ల రూపాయలు ఎట్లొస్తయ్ అనే డౌట్ మీకూ రావచ్చు?.. అందుకే సీదా విషయంలోకే వెళ్దాం.. ఫ్రెంచ్ దిగ్గజ ఆర్టిస్ట్ యువెస్ క్లెయిన్ 50వ దశకంలో ఓ చిలిపి పని చేసిన్రు. 1958లో ‘ది వాయిడ్’ అంటూ ఓ ఎగ్జిబిషన్ పెట్టిండాయన. అసలే ఆయన బోలెడంత ఫేమస్సు. అందుకే ఆ ఎగ్జిబిషన్ కోసం మస్తు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చిన్రు జనాలు. తీరా ఆర్ట్ గ్యాలరీలోకి పోతే.. అంతా బ్లాంక్ అయిపోయిన్రు. ఎందుకంటే.. అక్కడ ఏం లేదు కావట్టి. ఏందిది అని అడిగితే.. ఇన్విజిబుల్(ఇమాజినరీ) ఆర్ట్ వర్క్ అంటూ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చిండాయన. పైగా ప్యూర్ గోల్డ్ ఇచ్చి .. కంటికి కనవడని ఆ ఆర్ట్ పీసులను తీసుకెళ్లండంటూ బంపరాఫర్ కూడా ఇచ్చిండట. అట్లుంటది.. మరి ఆయనతోని!. ఏం లేని ఆర్ట్‌వర్క్ ఆయన ఆఫర్ చేయడంతో జనాలు తిట్టుకుంటున్నారని అనుకుంటం కదా!. సారీ.. ఇక్కడే సీన్ ఉల్టా అయ్యింది. బంగారం ఇచ్చి.. ఆ ఆర్ట్ పీసులను(ఏం ఉండదు) కొనుక్కుపోయిన్రు వాళ్లంతా. అయితే జనాల్ని డిస్పాపాయింట్ చేసుడు ఇష్టం లేని ఆయన.. ఆ ఆర్ట్ పీసుల వంతుకు అమ్మినట్లు రిసిప్ట్లు మాత్రం ఇచ్చిండట. అట్లా.. 1959, డిసెంబర్ 7న అమ్ముడువోయిన ఓ ఇన్విజిబుల్ ఆర్ట్ పీస్‌ను యాంటీక్విటీ డీలర్ జాక్వెస్ కుగెల్ కొనుక్కున్నడు. అగో.. ఆ రిసిప్ట్ తోనే గిప్పుడు గా కళ్లకు కనవడని ఆ ఆర్ట్ వర్క్‌ను వేలం వేస్తున్నారంట. యువెస్ క్లెయిన్ చనిపోయి మస్తు ఏండ్లు అయితున్నా.. ఆయన దస్కత్ ఉన్న ఆ రిసిప్ట్, అదేవోయ్ ఇన్విజిబుల్ ఆర్ట్ పీస్.. సుమారు5,50,000 డాలర్లు కనీస ధర పలకొచ్చని అంచనా ఎసిన్ను. అంటే మన పైసళ్లలా నాలుగు కోట్ల రూపాయలకు పైమాటే. సోథ్బైస్ ఆక్షన్ హౌజ్ మాత్రం.. అంతకుమించే పైసలు రాబట్టొచ్చని అంటోంది మరి. ఇంకో ముచ్చట జెప్పాలె.. ఈ రిసిప్ట్కు ఇంకో స్పెషాలిటీ ఉంది. యువెస్ క్లెయిన్ yves kleinకు ఒక చిత్రమైన హ్యాబిట్ ఉండేదట. అమ్మేసిన బొమ్మలకు రిసిప్ట్‌లను కాల్చేసి.. వాళ్లు ఇచ్చిన బంగారంలో సగం ‘సీన్ నది’లోకి ఇసిరిపడేయమని కొనుక్కున్నోళ్లకు చెప్పేటోడట. సో, అట్ల చూసినా ఆయన దస్కత్తో మిగిలిపోయిన లాస్ట్ రిసిప్ట్ ఇదే. అందుకే అంత రేట్ వస్తదని అనుకుంటున్నరు మరి!. చమక్కులు ► కమెడియన్ comedian.. 2019లో సోషల్ మీడియాను ఊపేసిన ఓ టాపిక్. ఫ్రెష్ బనానాను , సిల్వర్ టేప్‌తో గోడకు అంటించి.. అదే ఒక ఆర్ట్ వర్క్ అంటూ ప్రచారం చేసిన్రు కొందరు. అట్ల బసెల్ మియామీ బీచ్ ఆర్ట్ గ్యాలరీతో 1,20,000 డాలర్లు వచ్చినయట. పోనీలేండి.. కనీసం ఇది కళ్లకైనా కనవడ్డది. ► కానీ, కిందటి ఏడాదిల ఇటాలియన్ ఆర్టిస్ట్ సాల్వటోర్ గరావు(67) అసలు ఉందో లేదో ఆర్ట్‌వర్క్‌ను వేలం ఎసి.. సుమారు 18 వేల డార్లు సంపాదించుడు. ఏం తెలివో ఏమో!. -
చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!
Scientists Discover Ants Can Identify Cancerous Cells: ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస్త్రవేత్తల బృందం నిరతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స, త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. తాజా అధ్యయనాల్లో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కునుగొన్నాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగో తెలుసా!. వివరాల్లోకెళ్తే..చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలవని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ పరిశోధనలుల చేయడానికి సిల్కీ చీమలు అని పిలిచే ఫార్మికా ఫుస్కా అనే చీమలను వినియోగించింది. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా శిక్షణ ఇచ్చింది. నిజానికి అవి తమ వాసన సాయంతోనే ఆహారాన్ని సంపాదించుకునే చీమలు మానవునిలోని క్యాన్సర్ కణాల నంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్‌ని నయం చేసే పద్ధతులను అన్వేషించే క్రమంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది మాత్రమే కాక తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చీమలకు తొలుత చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునే స్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని మానవుడిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉందని చ్పెపారు. అయితే ఈ మొదటి అధ్యయనం చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని తేలిందని అన్నారు. అంతేగాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై పరిశోధనలు చేస్తున్నారు. అయితే వాటికి మంచి ఘ్రాణ శక్తి కలిగి ఉందని తెలిపారు. పైగా కుక్కుల కంటే చాలా త్వరతిగతిన క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలు తీసుకోంటాయని అన్నారు. (చదవండి: చెర్నోబిల్‌లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్) -
ఎక్స్ రే అమ్మకానికి పెట్టిన డాక్టర్... ఎందుకో తెలుసా?
Surgeon Attempts To Sell Terrorist Victim's X-ray: ఇంతవరకు డాక్టర్లు పేషంట్లను మోసం చేసిన ఘటనలను చూశాం. అంతెందుకు ఎక్కువ మెడికల్ చార్జీలు మోపి రోగుల నడ్డి విరిచేసిన కథనాలను గురించి విన్నాం. కానీ ఇక్కడొక డాక్టర్ అత్యంత అమానుషంగా దాడిలో గాయపడిన బాధితుడి ఎక్స్ రేని అమ్ముకోవడానికి యత్నించాడు. అసలు విషయంలోకెళ్తే...పారిస్‌లోని బాటాక్లాన్ మ్యూజిక్ హాల్‌పై 2015లో జరిగిన ఉగ్రదాడుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. అయితే పారిస్‌లోని జార్జెస్ పాంపిడౌ పబ్లిక్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న ఫ్రెంచ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇమ్మాన్యుయేల్ మాస్మేజీన్ ఆ వ్యక్తి ఎక్స్‌రేని డిజిటల్ ఆర్ట్వర్క్గా అమ్మేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చిత్రం కలాష్నికోవ్ బుల్లెట్‌ను కలిగి ఉన్న ముంజేయిని చూపిస్తుంది. అంతేందుకు ఎన్ఫ్టీ డిజిటల్ ఇమేజ్‌గా పిలవబడే ఆ ఎక్స్‌రే ఓపెన్ వెబ్సైట్ సూమరు రూ 2 లక్షలు పలుకుతుంది. అయితే ఆ సర్జన్ మాస్మేజీన్ చేసిన పనికి తగిన చర్యలు తీసుకున్నామని పారిస్ ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతి మార్టిన్ హిర్ష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు ఇది సర్జన్ వృత్తికి విరుద్ధమైన పని మాత్రమే కాదు, వైద్య గోప్యతకు భంగం కలిగించే నేరానికి మాస్మేజీన్ పాల్పడ్డాని అన్నారు. అయితే మాస్మేజీన్ తన నేరాన్ని అంగీకరించడమే కాక పేషంట్ అనుమతి లేకుండా చేసిన ఇలాంటి పని చేసినందుకు బాధపడుతున్నానని చెప్పాడు. (చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో) -
ఫ్రెంచి–తెలుగు నిఘంటువు ఎంతో అవసరం: ప్రొ. డానియెల్
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్లుగా భాష, సంస్కృతులతో అనుబంధం కలిగి ఉన్న ఫ్రెంచ్–తెలుగు మహా నిఘంటువు అవసరం ఎంతో ఉందని ఫ్రెంచి రచయిత, తెలుగు అధ్యయనవేత్త ప్రొఫెసర్ డానియెల్ నెజాక్స్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌తో రవీంద్రభారతిలో గురువారం సమావేశమైన డానియెల్, నిఘంటువు ప్రచురణకు సహకరించవలసిందిగా కోరారు. మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు భాషతో, ప్రజలతో అనుబంధం ఉన్న తాను పారిస్‌లో తెలుగుపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ.. ఫ్రెంచి–తెలుగు మహా నిఘంటువు ప్రచురణకు తెలంగాణ సాహిత్య అకాడమీ సిద్ధంగా ఉందని, ఈ గ్రంథానికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. పారిస్‌లో తెలుగు భాష, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సంతోషదాయకమని, ముఖ్యమంత్రి కేసీఆర్, క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలుగు–ఫ్రెంచి మహా నిఘంటువు కోసం డానియల్ చేస్తున్న కృషిని జూలూరు అభినందించారు. -
కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని కోరిన మంత్రి ఇక లేరు!
Side Effects of Covid- 19 vaccines ఫ్రాన్స్: కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన ఫ్రెంచ్ చట్ట సభ్యుడు జోస్ ఎవ్రార్డ్ (76) కరోనా సోకి మరణించినట్లు పార్లమెంట్ అధ్యక్షుడు శుక్రవారం ప్రకటించారు. కాగా ఎవ్రార్డ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడమేకాకుండా, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించే నిరసనకారులకు సోషల్ మీడియాలో మద్ధతు తెలిపాడు. అతని భార్య, పిల్లలు, బంధువులు, అలాగే సహోద్యోగులు, సహచరులతో వాస్తవాలను పంచుకుంటానని నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడైన రిచర్డ్ ఫెర్రాండ్ ట్విటర్లో ఈ సందర్భంగా తెలిపారు. ఉత్తర ఫ్రాన్స్‌లోని పాస్ డి కలైస్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు చట్టసభ్యుల్లో ఎవ్రార్డ్ ఒకరు. నికోలస్ డుపాంట్ ఐగ్నాన్ వ్యాక్సిన్ వ్యతిరేక కార్యకర్తలకు వ్యవస్థాపకుడు. వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటరీ తీర్మానంపై అక్టోబర్‌లో ఎవ్రార్డ్ సంతకం చేశాడు కూడా. చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు పిల్లలు! 30 కోట్లు దాటిన కేసులు! -
ఫ్రెంచ్ తెలుగు భాష పరిశోధకుడితో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ‘యాంబిషన్ ఇండియా 2021’సదస్సులో పాల్గొనేందుకు ఫ్రెంచ్ రాజధాని పారిస్‌కు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో ఓ విశిష్ట అతిథి భేటీ అయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష మీద పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డేనియల్ నెగర్స్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఫ్రెంచ్ యూనివర్సిటీ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’లో దక్షిణ ఆసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో డేనియల్ నెగర్స్ కొన్నేళ్లుగా తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నారు. వేల మైళ్ల దూరాన ఉంటూ తెలుగు భాషపై మమకారం చూపించడం స్ఫూర్తిదాయకమని కేటీఆర్ ఈ భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వ పరిధిలో జాతీయ విధానాలు రూపుదిద్దుకుంటున్నా.. భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు పలు అంశాల్లో స్వయం ప్రతిపత్తిని గణనీయంగా పెంచుకుంటున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పరిశ్రమలకు అనుమతులు, భూ కేటాయింపు, ఆమోదం, కంపెనీలకు అవసరమైన శిక్షణ పొందిన మానవ వనరులు అందేలా చూడటం, వనరుల సేకరణ వంటి అంశాల్లో రాష్ట్రాలు సొంత విధానాలు రూపొందించుకుంటున్నాయని తెలిపారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’వాణిజ్య సదస్సులో కేటీఆర్ శుక్రవారం కీలకోపన్యాసం చేశారు. సెనేట్ సభ్యులతో పాటు స్థానిక వాణిజ్య, రాజకీయ వర్గాల ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో, ‘కోవిడ్ తదనంతర కాలంలో భారత్–ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తుకు కార్యాచరణ’అంశంపై మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాధించిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలోని పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలను వివరించారు. ఫ్రెంచ్ కంపెనీల కోసం, ముఖ్యంగా ఎస్ఎంఈల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్‌తో త్వరితగతిన అనుమతులు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు 15 రోజుల వ్యవధిలో సులభంగా లభించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానాన్ని అమలు చేస్తోందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) వద్ద రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవ వనరులను అందించేందుకు రాష్ట్రప్రభు త్వం ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలె డ్జ్’(టాస్క్) ద్వారా సొంత ఖర్చుతో శిక్షణ ఇస్తోం దని తెలిపారు. పెట్టుబడులతో ముందుకువచ్చే సంస్థల ఆకాంక్షలకు అనుగుణంగా వసతులు సమకూరుస్తామన్నారు. ‘యాంబిషన్ ఇండియా 2021’ సదస్సులో తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘క్యాంపస్ స్టేషన్ ఎఫ్’సందర్శన పారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ‘క్యాంపస్ స్టేషన్ ఎఫ్’ను కేటీఆర్ సందర్శించారు. తెలంగాణలో ఆవిష్కరణల వాతావరణం పెంపొందించేందుకు ‘టీ హబ్’, ‘వీ హబ్’, ‘టీ వర్క్స్’వంటి ఇంక్యుబేటర్లతో అవకాశాలు, పరస్పర అవగాహనపై చర్చించారు. పారిస్ నడిబొడ్డున గతంలో రైల్వే డిపోగా ఉన్న ‘స్టేషన్ ఎఫ్’ను వేయి స్టార్టప్‌లతో కూడిన ప్రత్యేక క్యాంపస్‌గా తీర్చిదిద్దిన తీరుపై వివరాలు సేకరించారు. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టిన ‘ఎయిర్‌పోర్ట్స్ డి పారిస్’(ఏడీపీ) చైర్మన్, సీఈఓ ఆగస్టిన్ రోమనెట్తోనూ కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. కరోనా తదనంతర పరిస్థితుల్లో భారత్‌లో విమానయాన పరిశ్రమ వేగంగా వృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్తోనూ కేటీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. సనోఫి సంస్థ త్వరలో హైదరాబాద్‌లోని తమ ఫెసిలిటీ ద్వారా ‘సిక్స్ ఇన్ వన్’వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆయా సమావేశాల్లో కేటీఆర్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. సీఈవోలతో భేటీ పారిస్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం వరుసగా రెండోరోజు కూడా పలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (ఎంఈడీఈఎఫ్) డిప్యూటీ సీఈఓ జెరాల్డిన్తో జరిగిన భేటీలో ఫ్రెంచ్ ఎస్ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సహకారాన్ని కేటీఆర్ వివరించారు. ఫ్రాన్స్‌లోని 95 శాతం వ్యాపార సంస్థలు, ఎస్ఎంఈలు ఎంఈడీఈఎఫ్ నెట్‌వర్క్‌లో అంతర్భాగంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఇటీవలి కాలంలో సాధించిన విజయాలను మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయని చెప్పారు. -
తెలంగాణలో పెట్టుబడి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పారిస్‌లోని పలు సంస్థలకు వివరించారు. తన పారిస్ పర్యటనలో భాగంగా గురువారం కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం అక్కడి వివిధ సంస్థల సీఈవోలు, పరిశ్రమల అధిపతులతో వరుస భేటీలు జరిపింది. ప్రపంచంలోని అతిపెద్ద క్షిపణివ్యవస్థల తయారీలో పేరొందిన ఎంబీడీఏకు చెందిన అత్యున్నత బృందంతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎంబీడీఏ డైరెక్టర్ బోరిస్ సోలొమియాక్, పాల్‌నీల్ లీ లివెక్‌తో పాటు భారత్, ఆసియా వ్యవహారాలు చూసే సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు జీన్ మార్క్ పీరాడ్ ఈ భేటీలో పాల్గొన్నారు. తయారీ రంగంలో తెలంగాణలో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఎంబీడీఏ బృందాన్ని కేటీఆర్ కోరారు. వరుస భేటీల్లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ‘ఏరోక్యాంపస్ ఎక్వటైన్’సేల్స్ డైరెక్టర్ జేవియర్ అడిన్‌తోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఎయిర్ అటాషెగా ఉన్న ఎయిర్ కమెడోర్ హిలాల్ అహ్మద్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత రాయబారితోనూ భేటీ ఫ్రాన్స్‌లో భారత రాయబారి జావేద్ అష్రఫ్‌తోనూ కేటీఆర్ బృందం భేటీ అయింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయనకు వివరించారు. ఫ్రెంచ్ కంపెనీల నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు అవకాశమున్న ప్రాధాన్య రంగాల గురించి మదింపు చేయాలని కోరారు. కాస్మెటిక్ వ్యాలీ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బిచరొవ్‌తో జరిగిన భేటీలో తెలంగాణలో కాస్మెటిక్స్ తయారీకి ఉన్న అవకాశాలపై చర్చించారు. భేటీలో కేటీఆర్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఏరోస్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు. -
అదో బుల్లి కారు.. మనకు నచ్చినట్లు మారుతుంది.
అదో బుల్లి కారు..అర్జెంట్‌గా బయటికెళ్లాలంటే మన ముందుకే వచ్చి నిలబడుతుంది. లోపల కూర్చుని అద్దాల్లోంచి చూస్తూ వెళ్లడానికి, ఓపెన్ టాప్ తరహాలో గాలి తగులుతూ ప్రయాణించడానికి వీలవుతుంది.. స్నేహితులతోనో, వ్యాపార భాగస్వాములతోనో పిచ్చాపాటీ మాట్లాడుతూ, కావాలంటే వైన్ తాగుతూ వెళ్లాలనుకుంటే.. అదే కారు చిన్నపాటి ఫైవ్‌స్టార్ లాంజ్‌గా మారిపోతుంది. వ్యాయామం చేయడానికి టైం లేదనుకుంటే.. కారే చిన్నపాటి జిమ్‌లా రెడీ అవుతుంది. అంతేకాదు.. ఈ కారు అటానమస్/సెల్ఫ్ డ్రైవింగ్. అంటే డ్రైవర్ అవసరం లేకుండా.. మనం కోరుకున్న చోటికి అదే తీసుకెళ్తుంది. ఆ కారు పేరు.. ‘స్కేట్’. ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ సిట్రోన్ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. చదవండి: మార్కెట్లోకి మరో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలే! పది సెకన్లలో మార్చేసుకోవచ్చు.. ‘స్కేట్’ కారు.. పేరుకు తగినట్టుగా స్కేటింగ్ బోర్డులా ఫ్లాట్‌గా ఉంటుంది. దానికి బిగించుకోవడానికి మూడు బాడీలు (పోడ్స్) వస్తాయి. ఫైవ్‌స్టార్ హోటల్ తరహాలో మెత్తని సోఫా, మినీ బార్‌తో కూడిన ‘సోఫిటెల్ వోయేజ్’ పోడ్ ఒకటికాగా.. వ్యాయామం చేయడానికి పలు పరికరాలతో కూడిన ‘పుల్‌మ్యాన్ పవర్ ఫిట్నెస్’ పోడ్ ఇంకొకటి. మూడోదేమో.. సగం క్యాబిన్, మిగతా సగం ఓపెన్ స్పేస్ ఉండే ‘సిటిజన్ ప్రొవైడర్’ పోడ్. దీనిలో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఈ పోడ్లలో ఒకదానిని వదిలేసి.. మరోదానిని కేవలం పది సెకన్లలోనే అమర్చేసుకునే వీలుంటుంది. మన దగ్గరికి అదే వస్తుంది.. ఈ కారు ఇంటర్నెట్ సాయంతో మన ఫోన్లోని యాప్‌కు లింక్ అయి ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా.. కావాలనుకున్నప్పుడు యాప్ నుంచి ఆదేశాలు ఇవ్వగానే మన దగ్గరికి బయలుదేరి వచ్చేస్తుంది. దగ్గరిలో ఉన్న చార్జింగ్ స్టేషన్‌కు వెళ్లి అదే చార్జింగ్ కూడా చేసుకుంటుందని సిట్రోన్ కంపెనీ చెప్తోంది. పక్కకూ నడపొచ్చు.. ఈ కారును ముందుకు, వెనక్కే కాదు.. పక్కలకు, ఐమూలగా ఎలాగంటే అలా నడపడానికి వీలుంటుంది. ఇందుకోసం బంతి ఆకారంలో ఉండే ప్రత్యేకమైన టైర్లను అమర్చారు. అంతేకాదు.. దీనిలో హైడ్రాలిక్ సస్పెన్షన్ ఏర్పాటు చేశారు. అంటే పెద్దగా కుదుపులు లేకుండా హాయిగా ప్రయాణిస్తుంది. దీనిలో ఉండే రాడార్, లైడార్ సెన్సర్ల ద్వారా రోడ్డును, ముందున్న వాహనాలు, మనుషులు, ఇతర అడ్డంకులను గుర్తిస్తూ.. వాటి నుంచి పక్కకు తప్పుకుంటూ దూసుకెళ్తుంది. -సాక్షి, సెంట్రల్ డెస్క్ -
పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్
వయసు ఏడుపదులు దాటిందంటే చాలామందికి అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమే అవుతుంటుంది. కొంతమంది మాత్రం ఆరోగ్యవంతమైన జీవనశైలితో హుషారుగా కనిపిస్తారు. ఫ్రెంచి దేశానికి చెందిన కొలెట్ట్ మేజ్ వయసు సెంచరీ దాటి ఏడేళ్లు అయ్యింది. అయినా పియానోపై రాగాలు పలికించడమే గాక ఏకంగా కొత్త ఆల్బమ్‌ను విడుదలచేసింది. 107 ఏళ్ల వయసులో డెబ్భై ఏళ్లకు పైబడ్డ కొడుకుతో కలిసి ఈ ఆల్బమ్‌ను విడుదల చేసింది కొలెట్ట్. 1914 జూన్ 16 న ఫ్రెంచ్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కొలెట్ట్ మేజ్. నాలుగేళ్ల వయసులో ఒకరోజు కొలెట్ట్ వాళ్లింటికి పక్కింటి పిల్లలు వచ్చి పియానో వాయించడం ఆమె వినింది. అప్పటినుంచి ఆమెకు పియోను వాయించాలన్న ఆసక్తి కలిగింది. దీంతో చిన్నతనంలో బాగా సంగీతం, పియానో వాయిస్తూ అదే లోకంగా గడిపేది. మ్యూజిక్ కోర్సు చేస్తానని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వద్దని వారించారు. అయినప్పటికీ కొలెట్ట్ ఎలాగైనా పియానో వాద్యకారిణి కావాలనుకుని..15 ఏళ్ల వయసులో మ్యూజిక్ స్కూలులో పియానో నేర్చుకుని 16వ ఏట పియానో టీచర్‌గా చేరింది. అప్పటి నుంచి అనేక ఏళ్లపాటు పియానో టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత కూడా కొలెట్ట్ పియానో వదల్లేదు. ఆరో ఆల్బమ్.. షూమాన్, క్లాడ్ డెబస్సీ మ్యూజిక్‌ను ఇష్టపడే కొలెట్. 84 ఏళ్ల వయసులో తొలిసారి ఆల్బమ్ విడుదల చేసిన కొలెట్ట్. తాజాగా 107 ఏళ్ల వయసులో ఆరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. గత పదిహేనేళ్లుగా రోజుకి ఎనిమిది గంటలు పియానో వాయించి వాటిని రికార్డు చేసి, సౌండ్ ఇంజినీర్ సాయంతో ఆల్బమ్‌లుగా మారుస్తోంది. ఇంతటి వృద్ధాప్యంలోనూ.. ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పియానో పై కీస్ ను ప్రెస్‌చేస్తూ సుమధుర సంగీతాన్ని అందిస్తోంది. పియానో వాయించడం ద్వారా తనని తాను బిజీగా ఉంచుకుంటుంది. సలాడ్ కన్నా ఆత్మీయ ఆహారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వాద్యకారిణిగా పేరొందిన కొలెట్ట్ మేజ్... సలాడ్ తినడానికి పడే కష్టం కంటే పియానోను వాయించడం తేలిక అని చెబుతున్నారు. ‘‘సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన, భావోద్వేగాలతో కూడుకున్న మాధ్యమం. ప్రకృతి, భావోద్వేగాలు, ప్రేమ, కలలు, ఆశలు వంటి వాటన్నింటికి సంగీతమే ఆత్మీయ ఆహారంగా పనిచేస్తుంది. అందుకే నేను మ్యూజిక్‌ను కంపోజ్ చేయడానికి ఇష్టపడతాను’’ అని చెబుతోంది నవ్వుతూ. -
ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!
దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు కొద్ది రోజుల నుంచి దేశంలో భారీగా నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఫ్రెంచ్ టెక్నాలజీ కంపెనీ అటోస్ వచ్చి చేరింది. అటోస్ ఐటీ కంపెనీ రాబోయే 12 నెలల్లో భారతదేశంలో సుమారు 15,000 మందిని నియమించుకొనున్నట్లు తెలిపింది. ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ సేవల్లో నెం.1గా నిలవడానికి దేశంలో కొత్తగా నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలీ గిరార్డ్ ఎకనామిక్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలో డిజిటైజేషన్ కారణంగా భారీగా ఉద్యోగుల అవసరం ఏర్పడినట్లు గిరార్డ్ అన్నారు. ప్రభుత్వ రంగం, డిఫెన్స్ తో సహా ఇతర రంగాలలో భారీగా డిమాండ్ ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ నైపుణ్యాలు గల మానవ వనరులు కలిగిన దేశాలలో భారత దేశం ఒకటి, అయితే ప్రస్తుతం డిమాండ్ సరఫరా మధ్య అంతరం ఎక్కువగా ఉన్నట్లు ఆయన అన్నారు. భారతదేశంలో ఏటా సంస్థ ఉద్యోగుల సంబంధిత ఖర్చులపై 400 మిలియన్ల యూరోలు పెట్టుబడి పెడుతోంది. ఫ్రెంచ్ సంస్థ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లో ప్రభుత్వంతో ఈ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది. (చదవండి: అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్మడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్!) అధిక పనితీరు కలిగిన కంప్యూటర్లను అసెంబ్లీ చేయడం, టెస్టింగ్ చేయడంపై కంపెనీ భారీగా పెట్టుబడి పెట్టినట్లు గిరార్డ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో దాదాపు మూడో వంతు భారత దేశం నుంచి వస్తున్నట్లు ఎలీ గిరార్డ్ చెప్పారు. "భారతదేశంలో మాకు క్వాంటం ల్యాబ్ ఉంది. దేశంలో అద్భుతమైన డిజిటల్ శక్తిని బట్టి భారతదేశం రాబోయే కాలంలో క్వాంటంలో నాయకత్వం వహించగలదని నేను అనుకుంటున్నాను" అని ఆయన అన్నారు. 5జీ టెక్నాలజీ వంటి తర్వాతి తరం టెక్నాలజీలు కొత్త అవకాశాలు సృష్టించవచ్చు అని ఆయన అన్నారు. -
పెద్ద మనసుంటే తప్ప చేయలేని పని ఆమె చేస్తోంది
పదహారేళ్లయింది ఈ ఫ్రెంచి ప్రొఫెసర్ తన జన్మభూమిని వదిలిపెట్టి వచ్చి. రెండేళ్లుగా ఇండియాలో ఉంటున్నారు. థెరిసా కాలేజ్‌లో పాఠాలు బోధించడమే కాదు, థెరిసా ప్రబోధాలను ఆచరణలో పెడుతూ ఇచ్చే చెయ్యిగా, పెట్టే ముద్దగా జీవిస్తున్నారు. నోరు లేని జీవుల్ని మనుషులుగా చూసే ప్రొఫెసర్ ఫేడెట్.. నోరు తెరిచి ఆడగలేని మనుషుల్ని గమనించి తనే వెళ్లి ఆదుకుంటూ ఉంటారు. ఇదేమీ పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ పెద్ద మనసుంటే తప్ప చెయ్యలేని పని! ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కాలేజ్‌లో ఫ్రెంచి భాషను బోధిస్తుండే ప్రొఫెసర్ ఫేడెట్ బ్యాడీ డీఆర్సిస్ గత ఇరవై నెలలుగా కొచ్చిలోని ప్రధాన కూడళ్లలో కనిపించే ఎవరికీ చెందని మూగజీవాలకు (స్ట్రే యానిమల్స్) ప్రేమతో ఆహారాన్ని అందిస్తున్నారు. ఫేడెట్ ఉంటున్నది కొచ్చిలో. అక్కడి నుంచి ఎర్నాకుళం పది కి.మీ. దూరం. కొచ్చి నుంచి రోజూ ఎర్నాకుళం వెళ్లొస్తుండే ఫేడెట్ తరచు కొచ్చిలోని హైకోర్టు జంక్షన్లో అక్కడి వీధి శునకాలకు బిస్కెట్లు వేస్తూ కనిపిస్తుంటారు. కొన్నిసార్లు వాటి కోసమే వండి తెచ్చిన ఆహార పదార్థాలను ప్రేమగా తినిపిస్తూ ఉంటారు. ‘‘మనుషుల్ని నేను ఎంత ప్రేమిస్తుంటానో ఈ మూగజీవుల్నీ అంతే’’ అంటారు ఫేడెట్. ఇప్పుడీ కరోనా సెకండ్ వేవ్‌లోనైతే వాటి కోసమే ఆమె వీధుల్లోకి వస్తున్నారు. అందుకు ఆమె పోలీస్‌శాఖ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. 2019 లో కొచ్చి వచ్చారు ఫేడెట్. ఫ్రెంచి ఫ్రొఫెసరమ్మగా కొచ్చి అంతటా ఆమె తెలుసు. ‘‘కోవిడ్ ఇక్కడ ఇంత ఎక్కువగా ఉంది. మీకేమీ భయం వేయడం లేదా? మీ దేశానికి వెళ్లిపోవాలని లేదా?’’ అంటే ‘‘ఇక్కడ నేను సేఫ్‌గానే ఉన్నాను. ఉద్యోగం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారు. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్.. అన్నీ ఉన్నాయి. ఈ మాత్రం లేనివాళ్లు మనలో ఇక్కడ ఎంత మంది లేరు? సేఫ్ అంటే కరోనా నుంచి మాత్రమే కాదు కదా. ఆకలి నుంచి, నిరుద్యోగం నుంచి, ప్రతికూల జీవన పరిస్థితుల నుంచి అందరూ సేఫ్‌గా ఉండాలి. అందుకోసం అందరం అందరికీ సహాయంగా ఉండాలి’’ అంటున్నారు ఫెడెట్. -
వాట్సాప్ ఫేక్ మెసేజ్: వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారు!
వ్యాక్సిన్ వేయించుకున్నారా? అయితే చావు ఖాయం. అది కూడా రెండేళ్లలోపే!. ఇది ఇప్పుడు వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఒక ఫార్వార్డ్ మెసేజ్ సారాంశం. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు.. ఫ్రెంచ్ వైరాలజిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్ టుక్ మోటాగ్నైర్. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం.. కరోనాకు సరైన మందు లేకపోవడంతో వ్యాక్సిన్లనే నమ్ముకుంది యావత్ ప్రపంచం. మరోవైపు వ్యాక్సిన్‌తో ఎలాంటి ప్రభావం ఉండబోదని, సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇబ్బంది పడాల్సి వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు మరో ఫార్వార్డ్ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా సరే రెండేళ్లలోపు చావు తప్పదనేది ఆ మెసేజ్ సారాంశం. పైగా ఫ్రెంచ్ వైరాలజిస్ట్, నోబెల్ గ్రహీత అయిన టుక్ మోటాగ్నైర్ పేరుతో ఆ వార్త వైరల్ అవుతోంది. దీంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అసలు విషయం ఏంటంటే.. వ్యాక్సిన్‌తో చావు ఖాయమని టుక్ మోటాగ్నైర్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు లైఫ్సైట్న్యూస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. పైగా ఆయన వికీపీడియా పేజీలో కొంత కంటెంట్‌ను కూడా అది షేర్ చేసింది. అయితే ఆ వెబ్సైట్ దానిని యూఎస్‌కు చెందిన ఎన్జీవో రెయిర్ ఫౌండేషన్ వెబ్సైట్ నుంచి తీసుకుంది(మే 18న పబ్లిష్ అయ్యింది). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ తీరును మాత్రమే తప్పుబట్టారు. అయితే ఆ వీడియోలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను పొరపాటున అర్థం చేసుకుని వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారని ఆ ఫౌండేషన్ కథనం రాసింది. అక్కడి నుంచి అది వాట్సాప్‌లో వైరల్ అయ్యింది. అయితే ఇది ఫేక్ కథనం అని తేలడంతో అస్సాం పోలీసులు ఫేస్బుక్ పేజీలో ఫార్వార్డ్ చేయొద్దంటూ ఒక అలర్ట్ పోస్ట్‌తో వాట్సాప్ యూజర్లకు సూచించారు. ఆయన ఉద్దేశం.. హెచ్ఐవీ పై పరిశోధనలకు గానూ 2008లో మోటాగ్నైర్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. అయితే వ్యాక్సినేషన్ విషయంలో మొదటి నుంచి మోటాగ్నైర్ది విచిత్రమైన వాదనే. వ్యాక్సిన్లనేవి అసలు శాస్త్రీయం కాదని ఆయన వాదిస్తుంటారు. పైగా కరోనా వ్యాక్సిన్స్ వల్లే ఇప్పుడు కొత్త వేరియెంట్స్ పుడుతున్నాయనేది ఆయన అభిప్రాయం. అంతేకాదు కరోనా నోవెల్ వైరస్ అనేది మనిషి తయారు చేసిందేనని, హెచ్ఐవీ నుంచి జెనెటిక్ మెటీరియల్‌తో దానిని రూపొందించారని స్టేట్మెంట్ ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. ఎయిడ్స్ జబ్బుకు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో చైనా వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని స్టేట్మెంట్తో ఆయన పెద్ద దుమారమే రేపారు. -
పిల్లి అనుకుంటే పులి ప్రత్యక్షం..
ఎంతో ముచ్చట పడి పిల్లిని పెంచుకుందామనుకున్న ఫ్రెంచ్ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. తాము తెచ్చుకున్నది పిల్లిని కాదు పులి పిల్లను అని తెలిసి షాక్‌కి గురయ్యారు. వివరాల ప్రకారం.. నార్మాండీకి చెందిన లా హవ్రే అనే దంపతులు సవన్నా జాతి పిల్లి కోసం ఆన్లైన్ ప్రకటన చూసి దాన్ని పెంచుకుందామనుకున్నారు. దాదాపు 6000 యూరోలకు కొనుకుని ఎంతో ఇష్టంగా పిల్లిని ఇంటికి తెచ్చుకున్నారు. వారం గడిచే లోపే తమతో పాటు ఇంట్లో ఉంటున్నది పిల్లి కాదు మూడు నెలల పులి పిల్ల అని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పులిని కొనుగోలు చేయడంతో పాటు అక్రమంగా రవాణా చేసినట్లు ఈ జంటపై అభియోగాలు వెలువడ్డాయి. దీంతో వీరితో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల పాటు జరిగిన సుధీర్ఘ విచారణ అనంతరం దంపతులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేశారు. ప్రస్తుతం పులిని ఫ్రెంచ్ బయో డైవర్సిటీ కార్యాలయ అధికారులకు అప్పగించారు. పులి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు. (వైరల్: రికార్డు సృష్టించిన కొండచిలువ) -
ఇదో ‘ఫ్రెంచి’ బంధం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాటి మాట. యానాంలో 137 ఏళ్ల పాలనను ఫ్రెంచి పాలకులు విడిచి వెళుతున్న రోజులవి. అప్పుడు యానాంలో సుమారు ఏడెనిమిది వేల మంది ఉంటారు. ఫ్రెంచి పాలకులు యానాంలో ఉన్న పౌరులను ‘ఫ్రెంచి పౌరసత్వం తీసుకుంటారా, భారతీయ పౌరులుగా కొనసాగుతారా?’ అని అడిగారు. ఫ్రెంచి పౌరసత్వం తీసుకుంటే భారత్‌తో విడిపోయాక ఆ దేశానికి పంపేస్తారనే భయంతో 90 శాతం మంది ఫ్రెంచి పౌరసత్వానికి వెనుకాడారు. ధైర్యం చేసిన 15 కుటుంబాలు ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నాయి. ఆ 15 కుటుంబాలే ఇప్పుడు యానాంలో 50 కుటుంబాలయ్యాయి. వీరి ద్వారా మరో 200 కుటుంబాలు ఫ్రాన్స్‌లో స్థిరపడ్డాయి. ఆరు దశాబ్ధాలుగా (1954 నుంచి) యానాం, ఫ్రెంచి కుటుంబాల మధ్య ఆత్మీయత, అనుబంధాలు నేటికీ చెక్కు చెదరలేదు. యానాంలో ఉన్న ఫ్రెంచి పౌరులను, ఫ్రాన్స్‌లో స్థిరపడిన యానాం ఫ్రెంచి పౌరులను ‘సాక్షి’ పలకరించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఫ్రెంచి పౌరసత్వం ఉంటే చాలు నాడు ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్న కుటుంబాల భవిష్యత్తు బంగారమైంది. 65 ఏళ్లు దాటితే ఫ్రెంచి పౌరుడికి ‘సెక్యూర్’ పథకం ద్వారా 900 యూరోలు (సుమారు రూ.75 వేలు) పెన్షన్ వస్తుంది. వృద్ధులను సాకే అటెండెంట్‌కు 550 యూరోలు (రూ.50 వేలు), ఇంటి అద్దెలో 50 శాతం, 25 సంవత్సరాలు దాటితే నిరుద్యోగ భృతి 550 యూరోలు (సుమారు రూ.50 వేలు) ఇస్తారు. ఫ్రెంచి పౌరసత్వం కలిగి, ఆ దేశంలో కనీసం ఆరు నెలలైనా ఉంటేనే వీటన్నింటికీ అర్హులు. ఫ్రెంచి పౌరసత్వం ఉన్న వారు ప్రపంచంలోని 129 దేశాలతో పాటు 24 యూరోపియన్ యూనియన్ దేశాలను వీసా లేకుండా చుట్టిరావచ్చు. ఆత్మీయత, అనుబంధాలకు ప్రతిరూపం స్థానికులతో యానాంలోని ఫ్రెంచి పౌరులు ఆరు దశాబ్దాలుగా విడదీయరాని అనుబంధాన్నే కొనసాగిస్తున్నారు. జూలై 14న ఫ్రెంచి జాతీయ దినోత్సవం. నవంబరు 11 ఫ్రెంచి పాలకులు యానాం విడిచిపెట్టి వెళ్లిపోయిన రోజును, మన పండగలను యానాం ప్రజలు, యానాంలోని ఫ్రెంచి పౌరులు కలిసే జరుపుకోవడం విశేషం. రోమన్ కేథలిక్ చర్చికి ప్రతి ఆదివారం హిందువులూ వెళుతుంటారు. యానాంకు చెందిన దవులూరి చంద్రశేఖ ర్, ఫ్రెంచి యువతి షావలోత్ భారతీయ సంప్రదాయంలో 2018 లో పెళ్లిపీటలు ఎక్కారు. యానాంలోనూ ఈఫిల్ టవర్ నిర్మించి ఇరు ప్రాంతాల మధ్య విడదీయరాని బంధాన్ని చాటిచెప్పారు. యానాంలో ఫ్రెంచి పాలన 1750లో హైదరాబాద్ నిజాం నవాబు ముజఫర్ జంగ్ ఫ్రెంచి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. మూడుసార్లు బ్రిటిషు వారి చేతిలోకి వెళ్లిన యానాం.. 1817లో చివరిగా ఫ్రెంచి వారి ఆధీనంలోనికి వెళ్లింది. యానాం సుమారు 137 ఏళ్లు ఫ్రెంచి పాలనలో ఉంది. 1954లో ఫ్రెంచి పాలన నుంచి బయటపడి, స్వాతం త్య్రం పొంది పుదుచ్చేరిలో భాగమైంది. ఫ్రెంచి పౌరసత్వంతో ఇక్కడున్న వారం దరూ ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని చెన్నైలోని ఫ్రా న్స్ కాన్సులేట్ జనరల్ కా ర్యాలయంలో ఓటు వేస్తారు. భారతీయతను ప్రేమిస్తారు ఫ్రాన్స్ ఆర్మీలో పని చేసి 2015లో రిటైరయ్యా. ఎక్కువ కాలం ఫ్రాన్స్‌లో ఉండటంతో అక్కడి వారితో విడదీయరాని అనుబంధమేర్పడింది. భారతీయతను వారు ప్రేమిస్తారు. –దవులూరి మృచ్ఛి, మాజీ సైనికుడు, ఫ్రెంచి జాతీయుడు,యానాం ఫ్రెంచి పౌరుల యోగక్షేమాలు తెలుసుకుంటారు ఫ్రెంచి కాన్సులేట్ జనరల్ నేరుగా మాట్లాడి, యానాంలో ఉన్న ఫ్రెంచి పౌరుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. వారాంతపు నివేదికలు కాన్సులేట్ నుంచి తీసుకుంటారు. రిటైరై, ఇక్కడ ఉన్న వారి బాగోగులను నిశితంగా పరిశీలిస్తుంటారు. – సాధనాల బాబు, ఫ్రెంచి పౌరుల ప్రతినిధి, యానాం ఆరు నెలలు అక్కడ.. ఆరు నెలలు ఇక్కడ ఫ్రాన్స్‌లో ఏళ్ల తరబడి నివసిస్తున్నా ఇక్కడి ఆచార సంప్రదాయాలను వీడలేదు. నాకు సెక్యూర్ స్కీమ్ ద్వారా ఫ్రెంచి ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ ఇస్తుంది. నా మనుమరాలు, మనువడుల చదువుకయ్యే ప్రతి పైసా ఫ్రెంచి ప్రభుత్వమే భరిస్తోంది. – సాధనాల అనసూయ, ఫ్రెంచి పౌరురాలు, యానాం -
సామాజిక దూరం.. స్టంట్ అదిరింది గురూ!
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం అత్యవసరంగా మారింది. మహమ్మారి సోకకుండా ఉండేందుకు భౌతిక దూరం అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక సోషల్ మీడియలోనూ సామాజిక దూరంపై అనేక ఫన్నీ వీడియోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఫ్రెంచ్కు చెందిన స్టంట్ స్కూల్ ఓ వినూత్నమైన వీడియోనే రూపొందించింది. లాక్డౌన్ నేపథ్యంలో స్టంట్ స్కూల్ మూతపడటంతో.. ట్రైనింగ్ స్కూళ్లో శిక్షణ పొందుతున్న కొంతమంది ఇంట్లో నుంచే స్టంట్లు నేర్చుకుంటూ సామాజిక దూరం గురించి అవగాహన కల్పిస్తున్నారు. (ఐటీ కంపెనీల కొత్త నిబంధనలు ) ఒకరికొకరు గుద్దుకుంటున్నట్లు, తల బాదుకుంటున్నట్లు కనిపిస్తున్న ఈ సరదా వీడియోను సామాజిక దూరం నిబంధనలకు కట్టుబడి రూపొందించారు. ఇందులో మొదట ఓ వ్యక్తి తన ఇంట్లో కెమెరా ముందుకు వచ్చి ఎదుటి వ్యక్తిపై కిక్ ఇచ్చినట్లు చేయగా మరో వ్యక్తి కెమెరా నుంచి వెనక్కి ఎగిరి పడినట్లు నటిస్తారు. అలా ఒకరికొకరు గుద్దుకుంటూ ఈ వీడియో కొనసాగుతుంది. వీరు కొట్టుకోవడానికి అరటిపండు, బూట్లు, దిండ్లను సాధనాలుగా ఉపయోగించారు. ఫ్రెంచ్ పాఠశాల క్యాంపస్ యూనివర్స్ యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు 13 మిలియన్ల వ్యూవ్స్ లభించాయి. లాక్డౌన్లో ఎన్నో చూశాము. కానీ, ఇలాంటి ఫైటింగ్ వీడియోను ఎప్పుడూ చూడలేదు. స్టంట్ అదిరింది గురూ. ఇది మమ్మల్ని ఎంతో నవ్విస్తుంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (అద్భుతమైన వీడియో.. థాంక్యూ!) -
విదేశీయునికి కరోనా పాజిటివ్
సాక్షి, అనంతపురం: బెంగళూరులో ఫ్రాన్స్‌కు చెందిన వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. కోవిడ్ స్టేట్ నోడల్ అధికారులు సదరు విదేశీయుడు పుట్టపర్తిలో ఎక్కడ బస చేశాడు? ఎవరితో సన్నిహితంగా ఉన్నాడు తదితర వివరాలు సేకరించాలని జిల్లా ఆరోగశాఖాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు ర్యాపిడ్ యాక్షన్ బృందం డాక్టర్ వాలీ్మకి శ్రీనివాస్, డాక్టర్ భీమసేనాచార్, డాక్టర్ రాంకిషోర్ (అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనాస్పత్రి), డీఎంఓ దోశారెడ్డి, పోలీసులు పుట్టపర్తిలో జల్లెడ పట్టారు. ఫ్రాన్స్ దేశస్తుడు కొమరైన్ అలైన్జెన్ (64) పుట్టపర్తిలోని సాయికుమార్ సాయికుమార్ లాడ్జ్‌లో బస చేశారని చెప్పడంతో బృందం అక్కడకు వెళ్లి ఆరా తీసింది. అధికారుల ఆదేశాల మేరకు విదేశీయులను లాడ్జి నుంచి ఖాళీ చేయించారు. దీంతో కొమరైన్ ఈ నెల 15న లాడ్జి ఖాళీ చేశాడు. 17వ తేదీ బెంగుళూరుకు వెళ్లిపోయాడు. శుక్రవారం బెంగుళూరులోని ఆస్పత్రిలోపరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో అధికారులు గురువారం రాత్రి సాయికుమార్ లాడ్జిని సీజ్ చేశారు. సదరు విదేశీయుడు పుట్టపర్తిలో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నాడు అని ఎస్పీ సత్యయేసుబాబు సైతం ఆరా తీశారు. ఐదుగురి నమూనాల సేకరణకు ఆదేశం పుట్టపర్తి చెందిన లాడ్జ్ యజమాని దంపతులు, ఓ వృద్ధురాలు, స్వీపర్, స్వీపర్ భర్తకు అధికారులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెల్సింది. శనివారం మరోసారి స్థానికంగా ఉండే వైద్యులు సర్వే చేయనున్నారు. మరో రెండు అనుమానిత కేసులు: కదిరి, తాడిపత్రి నుంచి మరో రెండు అనుమానిత కేసులు సర్వజనాస్పత్రికి వచ్చాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు అనంతపురం నుంచి రెండు అంబులెన్స్‌లను ఆయా ప్రాంతాలకు పంపారు. వెయ్యి టెస్టులకు సిద్ధం చేసుకోవాలి వైరల్ రీసెర్చ్ డయాగ్నస్టిక్ ల్యాబోరేటరీలో వెయ్యి కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన పరికరాలు, కెమికల్స్ సిద్ధం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డిల్లీరావు వైద్యులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం వైద్య కళాశాలలోని వీఆర్‌డీఎల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎన్ని పరీక్షలు జరిపారని, మౌలిక సదుపాయాలు ఏం కావాలని ఆరా తీశారు. ఆయన వెంట జాయింట్ డైరెక్టర్ సుదర్శన్, నోడల్ ఆఫీసర్ ఏపీ నాయుడు, వీఆర్డీఎల్ వైద్యులు తదితరులు ఉన్నారు. -
ఆ దేశాల్లోనే ‘ఫ్రెంచ్ ముద్దులు’ ఎక్కువ
న్యూఢిల్లీ : ‘ముద్దంటే చేదా నీకు, ఆ ఉద్దేశం లేదా నీకు!’ అంటూ ఆ దేశాల్లో ఎవరు, ఎవరిని అడకక్కర్లేదు. అడక్కుండానే అక్కడ ప్రేమికులు, భార్యా భర్తలు కలసుకున్నదే తడవుగా ‘ఫ్రెంచి కిస్’లు పెట్టుకుంటారు. దాన్నే మన సినిమా పరిభాషలో ‘లిప్ లాక్’ ముద్దులంటాం. ధనవంతుడికి పేద వాడికి మధ్య అత్యంత ఎక్కువ వ్యత్యాసాలున్న ఆరు ఖండాల్లోని 13 ఎంపిక చేసిన దేశాల్లో ‘ముద్దు’ ముచ్చటపై స్కాట్లాండ్లోని ఆల్బర్టీ యూనివర్శిటీ పరిశోధన బృందం అధ్యయనం జరిపింది. (చదవండి: పెంపుడు కుక్క పిల్లకూ కోవిడ్ వైరస్) మిగతా దేశాలకన్నా ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్న ఈ దేశాల్లోనే ప్రేయసీ ప్రేమికులు, భార్యా భర్తలు నాలుకకు నాలిక, పెదాలకు పెదాలు కలిపి గాఢ చుంభనంలో మునిగిపోతున్నారట. ప్రేమ, ఆప్యాయతల వ్యక్తీకరణకు, శృంగార ఆస్వాదనకు ఇంతకుమించిన మార్గం లేదని వారు వాదిస్తున్నారు. ముద్దే అసలైన శృంగారమని, ముద్దులేని సెక్స్ కూడా శృంగారం కాదని వారు వాదిస్తున్నారట. మగవారితో పోలిస్తే ఈ ముద్దులను ఎక్కువగా మహిళలే ఆస్వాదిస్తున్నారట. ముద్దూ ముచ్చట విషయంలో ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువున్న దేశాల్లోనే ఎందుకు ఆదరణ ఎక్కువగా ఉందో, అందుకు సంబంధించి ఆర్థిక, సామాజిక కారణాలపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ క్రిస్టఫర్ వాట్కిన్స్ మీడియాకు తెలిపారు. మరిన్ని అధ్యయన వివరాలతో ప్రజల ముందుకు వస్తామని, అప్పుడే తాము అధ్యయనం జరిపిన 13 దేశాల పేర్లను బహిర్గతం చేస్తామని ఆయన చెప్పారు. యువతీ యువకులు పది సెకన్ల పాటు ఫ్రెంచి ముద్దు పెట్టుకుంటే ఒకరి నుంచి ఒకరికి ఎనిమిది కోట్ల బ్యాక్టీరియా ఒకరి నోట్లో నుంచి ఒకరి నోట్లోకు పోతుందని డచ్ జీవ శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలియజేశారు. ప్రతి మనిషిలో సహజంగా కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుందనే విషయం తెల్సిందే. మరో రకంగా చెప్పాలంటే ఓ మనిషి బరువులో 30 శాతం బరువును ఈ బ్యాక్టీరియానే ఆక్రమిస్తుంది. చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉండడం వల్లనే మనుషులు మనుగడ సాగిస్తున్నారన్న విషయం కూడా తెల్సిందే. దంపతులు పది సెకడ్ల పాటు ముద్దు పెట్టుకుంటే ఒకరి నుంచి ఒకరిలోకి 8 కోట్ల బ్యాక్టీరియా వెళ్లినప్పుడు అది మంచిదా, కాదా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. దంపతుల్లో ఒకరు అనారోగ్య వంతులైతే రెండోవారికి బ్యాక్టీరియా మార్పిడి వల్ల నష్టం జరుగుతుందని కొంత మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడగా, ఆరోగ్యవంతుల నుంచి అనారోగ్యవంతులకు బ్యాక్టీరియా చేరడం వల్ల అవతలి వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వాదిస్తోన్న శాస్త్రవేత్తలు లేకపోలేదు. ఏదేమైనా ముద్దుల్లో బ్యాక్టీరియా ప్రభావంపై ప్రపంచంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిశోధన జరగలేదని, అవసరమైతే ఇప్పుడు జరపొచ్చని ‘నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రిసర్చ్’ పరిశోధకులు డాక్టర్ రెమ్కో కోర్ట్ తెలియజేస్తున్నారు. (చదవండి: కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి) -
స్వేచ్ఛకోసం తపించిన ఒక సీతాకోక చిలుక
ఫ్రెంచ్ గయానా. 1941. హత్యారోపణ ఎదుర్కొని దోషిగా తేలిన హెన్రి షెరిఎర్ ఒక అసాధారణమైన పనికి సిద్ధపడ్డాడు. అది డెవిల్స్ ఐలాండ్ జైలు నుంచి పారిపోవడం. కింద భయంకరమైన అలలు, సొరచేపలు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి వేచిచూస్తూ వుంటాయి. అయినా పంజరంలోంచి ఎగిరిపోవడానికి చేసిన తొమ్మిదేళ్ళ అన్వేషణే హెన్రి షెరిఎర్ కథ. పారిపోవడం అసాధ్యమని తెలిసీ హెన్రి తొమ్మిది సార్లు ప్రయత్నించాడు. 1930ల ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఫ్రాన్స్ అప్పుడప్పుడే ఎదుర్కొంటున్న రోజుల్లో పాపియాన్ జర్నీ ప్రారంభమైంది. 24 ఏళ్ళ షెరిఎర్ విధ్వంసం సృష్టించిన మొదటి ప్రపంచ యుద్ధం రోజుల్లో పెరిగినవాడు. ఇప్పుడు నిష్ణాత సేఫ్ క్రాకర్ (ఇనప్పెట్టెలు పగలగొట్టేవాడు)గా పారిస్ వీధుల్లో సంచరిస్తున్నాడు. ఫ్రెంచ్ అండర్ వరల్డ్‌లో జెంటిల్మాన్ దొంగగా పేరుగాంచాడు. హెన్రి ఛాతీ మీదున్న సీతాకోకచిలుక పచ్చబొట్టు తన అందమైన ముద్దుపేరుకు ప్రేరణే కాదు, స్వతంత్రం పట్ల అతనికున్న ప్రేమకు వీలునామా కూడా (సీతాకోకచిలుకని ఫ్రెంచ్‌లో పాపియాన్ అంటారు). కానీ 1930లో స్వతంత్రం అతన్నుంచి లాగేసుకోబడింది. అమ్మాయిలతో వ్యభిచారం చేయించే ఒకడిని చంపినందుకు షెరిఎర్ని విచారణకు నిలుచోబెట్టారు. ఈ హత్య చేయలేదనీ, అమాయకుడననీ చెప్పుకున్నాడు. ఒక ముఖ్య సాక్షి పోలీసుల నుంచి లంచం తీసుకుని ఒక కట్టు కథని అల్లి సాక్ష్యంగా చెప్పాడని అంటాడు. అక్టోబర్ 26, 1931న ఏదేమైనప్పటికీ షెరిఎర్ దోషిగా తేలాడు. ఫ్రెంచ్ గయానా జైలులో జీవిత ఖైదు విధించింది కోర్టు. చాలామంది ఇతర ఖైదీలతో ఫ్రెంచ్ గయానాకి సముద్రం గుండా ప్రయాణం అయ్యాడు. 1854 నుండి 1946 మధ్య ఫ్రెంచ్ గయానాలో శిక్ష విధింపబడిన 7000 మంది ఖైదీలలో పాపియాన్ ఒకడు. జైలులో ఖైదీలు నిప్పుల కొలిమి లాంటి ఎండలో వొళ్ళు హూనమైపోయేలా పని చెయ్యాలి. జైలుకి కొద్ది దూరంలోనే వున్న సముద్రంలో మూడు ద్వీపాలు వుంటాయి. అందులో అతి క్రూరమైంది డెవిల్స్ ఐలాండ్. ఇక్కడ తొంబైశాతం మంది వారి శిక్షా కాలం ముగియక ముందే చనిపోయేవారు. ఫ్రాన్స్ అనే గొప్ప దేశం ఇంత అనాగరికమైన ఫ్రెంచ్ గయానా జైలుని తయారుచేయడం అనే వైరుధ్యం షెరిఎర్‌కి ఒక చేదైన అనుభవం. జైలులో తను వుండడం కేవలం తాత్కాలికం అనే పట్టుదలతో ఉండేవాడు. నేర జీవితం వైపు నడిపించిన ధిక్కార స్వభావమే జైలు నుండి పారిపోడానికీ ప్రేరేపించింది. నేల మీద నుంచి తప్పించుకోడం ఆత్మహత్య చేసుకోవడం వంటిది అయితే సముద్రం గుండా తప్పించుకోవడం కూడా అటువంటిదే. గార్డ్స్ కళ్ళు గప్పి పడవను తయారుచేయడం అసాధ్యమైన పని. అప్పుడప్పుడు కొంతమంది చిన్ని పడవను తయారుచేసి పారిపోడానికి ప్రయత్నించేవారు. కాని ఆ భయంకరమైన అలల ధాటికి పడవలు నిలిచేవి కావు. అయినప్పటికీ షెరిఎర్ అదే మంచి మార్గం అని భావించాడు. పథకం పారడానికి కావలిసిన డబ్బుని ఫ్రెంచ్ గయానా లోకి రహస్యంగా తెప్పించుకున్నాడు. మూడేళ్ళు బందీగా వున్న తర్వాత మొదటిసారి రహస్యంగా తెప్పించుకున్న డబ్బుతో కొన్న పడవలో పారిపోయాడు. అతడి గమ్యం వెనిజులా. అతడి ప్రయాణం ట్రినిడాడ్ మీదుగా కెరిస్సా వరకు సవ్యంగానే సాగింది. కానీ బ్రిటిష్ హోండురస్ వద్ద విధి అడ్డం తిరిగింది. కొలంబియన్ పోలీస్ లాంచీ వాళ్ళు పట్టుకున్నారు. రియో ఆర్చర్ అనే కొలంబియన్ టౌన్ జైలులో పడేసారు. ఇక ఫ్రెంచ్ గయానాకి పోవడం కోసం ఎదురుచూస్తున్న షెరిఎర్ కి శిథిలావస్థలో వున్న గోడలో ఒక బలహీనత కనపడింది. జైలు కిటికీకి వున్న వూచలు విరుచుకుని బయటపడ్డాడు. వెనిజులా సరిహద్దు దగ్గర వహీర ఇండియన్ల తెగ దగ్గర తలదాచుకున్నాడు. వారు షెరిఎర్ని తమ తెగలోకి అంగీకరించారు. అక్కడ ఇద్దరిని భార్యలుగా స్వీకరించాడు. జైలు నుంచి బయటపడ్డాక ఇటువంటి గమ్యస్థానం వుంటుందంటే చాలామంది పారిపోయిన ఖైదీలకు అది అపురూపం. కాని షెరిఎర్‌కి కాదు. వారి మధ్య ఏడు నెలలు వున్న తర్వాత అక్కడనుంచి బయలుదేరిపోయాడు. ఒకేచోట నియమ నిబంధనలతో రోజువారీ పనులు చేయడం భరించలేకపోయాడు. ఇక్కడ జీవితం కూడా జైలు జీవితంలానే అనిపించింది. అక్కడ నుండి బయలుదేరి వెనిజులా వెళ్ళే దారిలో ఒక కొలంబియన్ చర్చిలో ఆశ్రయం పొందాడు. కానీ ఒక నన్ అతడిని వంచించి పోలీసులకి అప్పగించింది. ఈసారి కొలంబియన్ పోలీసులు షెరిఎర్ని తిరిగి ఫ్రెంచ్ గయానా జైలుకి తరలించారు. ఫ్రెంచ్ గయానాలోని సెయింట్ జోసెఫ్ ఐలాండ్‌లో తప్పించుకోడానికి ప్రయత్నించిన ఖైదీలను రెండేళ్ళు చీకటి బోనులో ఒంటరిగా నిర్బంధిస్తారు. టైగర్ కేజ్‌లుగా పిలవబడే ఆ ఇనుప బోనుల్లో నిశ్శబ్దం పాటించాలి. గార్డ్‌తో గొణిగినా శిక్షకి మరో నెల కూడుతుంది. దారుణమైన నరకయాతన. కొన్ని దశాబ్దాల తర్వాత షెరిఎర్ అంటాడు ‘‘చైనీయులు water dripping on the head (ఎటూ కదలనీకుండా మనిషి కాళ్ళు, చేతులు కట్టేసి పైనుంచి ఒక్కో నీటి చుక్క తల మీద పడుతూ చివరకు మనిషిని వెర్రి వాడిని చేస్తుంది) కనుక్కుంటే, ఫ్రెంచ్ వాళ్ళు నిశ్శబ్దాన్ని కనుక్కున్నారు’’ అని . చరిత్రలో ఏ ఖైదీ కూడా టైగర్ కేజ్ నుండి తప్పించుకోలేదు. పారిపోవాలన్న ఆలోచనను హెన్రి కూడా వదిలేసాడు. తన ముందున్న ఒకే సవాలు – బ్రతకడం, మరో రోజు తప్పించుకోడం కోసం బ్రతకడం. ఒంటరితనం భరించడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రతి రాత్రి తను సృష్టించుకున్న హాయయిన ప్రపంచంలోకి జారుకొనేవాడు. అలసిపోవడం వల్ల వూపిరి తీసుకోడం చాలామటుకు నిలిపేసేవాడు. ఆక్సిజన్ సరిగా అందకపోవడం, ఇంకా అలసత్వం రెండూ కలిసి మెదడుని దాదాపు hypnotic state లోకి తీసుకెళ్తాయి. పదిహేడేళ్ళ ముందే చనిపోయిన వాళ్ళ అమ్మ పియానో మీద మెలడీస్ ప్లే చేయడాన్ని తలుచుకునేవాడు. రెండేళ్ళు గడిచిపోయాయి. మనిషి మనస్సుని ఛిన్నాభిన్నం చేయడం కోసం ఈ శిక్ష ఉద్దేశించబడింది. కానీ షెరిఎర్ తన ప్రపంచం విరిగిపోకుండా బయటపడ్డాడు. అన్నిటికంటే గొప్ప ఎస్కేప్‌ని ప్రయత్నించాలని, అది అతనికి ఏదో ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ హోదా సంపాదించి పెడుతుందని షెరిఎర్‌కి రాసి పెట్టుందేమో. చరిత్రలో డెవిల్స్ ఐలాండ్ నుండి పారిపోయిన మొదటివ్యక్తి తనే అంటాడు షెరిఎర్. టైగర్ కేజ్ నుంచి బయటపడగానే పారిపోవాలనే ఆలోచనలు మళ్ళీ జీవం పోసుకున్నాయి. పథకం వేసుకుని అది అమలయ్యే సమయానికి సహచర ఖైదీ గార్డ్‌కి సమాచారం ఇచ్చేశాడు. కోపంతో హెన్రి ఆ ఖైదీని చంపేశాడు. 1931లో ఏ నేరమైతే తను చెయ్యలేదని చెప్పాడో అదే నేరాన్ని ఇప్పుడు చేశాడు. దాన్ని చాలా సంవత్సరాల తర్వాత ఇలా సమర్థించుకుంటాడు 'the best school of crime is jail' అని. మళ్ళీ రెండోసారి రెండేళ్ళు టైగర్ కేజ్‌లో ఒంటరిగా నిర్బంధించారు. 1939. ఐదు వేల మైళ్ళ దూరంలో షెరిఎర్ దేశస్తులు జాతీయ సంక్షోభాన్ని ఎదురుకుంటున్నారు. హిట్లర్ సైన్యం పోలెండ్‌ను ఆక్రమించాక ఫ్రాన్స్ ఇంకా బ్రిటన్, నాజీ జర్మనీ మీద యుద్ధం ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. జూన్ 1940లో పారిస్ ఆక్రమించబడింది. టైగర్ కేజ్‌లో షెరిఎర్ రెండో విడత శిక్షాకాలం కూడా ముగిసింది. ఎప్పటిలానే తన ఆలోచనలన్నీ పారిపోవడం మీదనే ఉండేవి. కానీ 1941లో పారిపోవడం అసాధ్యం అనబడే డెవిల్స్ ఐలాండ్ జైలుకి షెరిఎర్ని తరలించారు. డెవిల్స్ ఐలాండ్ 35 ఎకరాల్లో వుంటుంది. ఫ్రెంచ్ గయానా లోని మూడు ద్వీపాల్లో ఇదే చిన్నది. అలలనూ, సొరచేపలనూ దాటి ద్వీపానికి దూరంగా వెళ్ళినా అవతలి ఒడ్డున నరమాంస భక్షకుల దాడికి గురయ్యే అవకాశం వుంది. ఒడ్డున కొండ మీద ఒక పెద్ద రాయిపై కూర్చుని అలలను చూస్తూ రోజులు గడిపేవాడు. కొన్ని వారాల అధ్యయనం తరువాత ఆ అలలు కొండకింద రాళ్ళను గుద్దుకునే తీరు అసాధారణంగా అనిపించింది. గుట్ట కింద రాళ్ళను ఢీకొట్టే ప్రతీ ఏడో అల దాని వెనుక వచ్చే అలలను అణిచివేస్తూ వుండడం గమనించాడు. ప్రతీ ఏడో అల ద్వీపం నుండి దూరంగా వెనక్కు వెళ్లిపోతూ వుంది రాళ్ళను ఢీకొన్న తర్వాత. ఆ ఏడో అలలా తాను కూడా పారిపోవచ్చని అనుకున్నాడు. రెండు గుడ్డ పేలికలు, నీటిలో తేలే కొబ్బరికాయలతో ఒక ముడి తెప్పను తయారుచేసాడు. తన అవకాశాలను మెరుగుపర్చుకోడానికి అలలు భీకరంగా వుండే పౌర్ణమి రాత్రిని ఎంచుకున్నాడు. 36 గంటల నరకం తర్వాత సౌత్ అమెరికన్ తీరానికి చేరుకున్నాడు. అక్కడనుంచి వెనిజులాకి ప్రయాణం అయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఫ్రెంచ్ గయానా లోని అధికారులకి ఫ్రాన్స్ నుండి సహాయ సహకారాలు నిలిపివేయబడ్డాయి. పారిపోయిన షెరిఎర్ ను వెతికి పట్టుకోవడం కంటే మించిన సమస్యలతో అధికారులు సతమతమవుతున్నారు. అందుకని షెరిఎర్ పారిపోయింది వాళ్ళు పట్టించుకోలేదు. హెన్రి షెరిఎర్ జీవితం మానవ మనసు లాఘవానికి స్ఫూర్తినిచ్చే చిరునామా. కానీ అతడి కథ నిజమా? లేకపోతే పాపియాన్ కట్టు కథ అల్లి మోసం చేయడానికి పాల్పడ్డాడనే క్రిటిక్స్ మాట నిజమా? పాపియాన్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. వెనిజులాలో తర్వాతి మూడు దశాబ్దాలు బతికాడు. పెళ్లి చేసుకుని నీతివంతమైన జీవితాన్ని గడిపాడు. 1951లో ఫ్రెంచ్ గయానా జైలు మూతపడడం చూసి ఆనందించాడు. 1969లో ‘పాపియాన్’ నవల ప్రచురింపబడిన వెంటనే విపరీతమైన జనాదరణ పొందింది. రాత్రికి రాత్రి ఒక పూర్వ ఖైదీ సాహిత్య సంచలనంగా మారిపోయాడు. దీన్ని తెలుగులోకి ఎం.వి.రమణారెడ్డి ‘రెక్కలు చాచిన పంజరం’ పేరిట అనువదించారు. పాపియాన్ ఫ్రెంచ్ గయానా జైల్లో ఖైదీ అన్నది వాస్తవమే అని క్రిటిక్స్ ఒప్పుకున్నప్పటికీ తను చెప్పిన కథ చాలా వరకు కల్పించిందనీ ఇతర ఖైదీల అనుభవాలనుంచి తీసుకున్నదనీ అంటారు. షెరిఎర్ తనకు తానుగా జెంటిల్ మాన్ సేఫ్ క్రాకర్‌గా చెప్పుకోవడం డాక్యుమెంట్ల పరంగా అబద్ధం అంటాడు జిరడివియే. 1973లో చనిపోయేవరకు కూడా పాపియాన్‌గా పిలవబడే హెన్రి షెరిఎర్ తను రాసింది నిజమే అన్నాడు. పాపియాన్ చెప్పింది వాస్తవం కానివ్వండి, కల్పితం అయినా కానివ్వండి, నిజంగానే హత్య చేసిన నేరస్తుడు కానివ్వండి, ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అతని కథ ప్రతిధ్వనిస్తూనే వుంది. పాపియాన్ నేను బ్రతకాలి అనే దృఢ సంకల్పంతోనే బ్రతికాడు. ఈ తప్పించుకోవడంలో ఒక అద్భుతమైన సందేశం వుంది : ‘‘దారుణమైన విధి ప్రతికూలతలను అధిగమించే సామర్థ్యం మనుషులకు వుంది. అధర్మం, వేదన ఎక్కువగా వున్న ఈ భయానక ప్రపంచంలో కూడా జీవితేచ్ఛే రాజ్యమేలుతుంది’’.(తిరుపతిలో శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో ‘మానవ వికాస వేదిక’ ఏర్పాటైన సందర్భంగా) భూమన కరుణాకరరెడ్డి -
అదానీ గ్యాస్‌తో ఫ్రెంచ్ దిగ్గజం డీల్
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజ ఇంధన కంపెనీ అదానీ గ్యాస్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఏ గ్యాస్ పంపిణీ సంస్థ అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీలో 37.4 శాతం వాటా కొనుగోలుకి ఇంధన రంగ ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ ఎస్ఏ అంగీకరించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ సోమవారం ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం మొత్తం విలువను వెల్లడించలేదు. ఈ మేరకు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ సమాచారం అందించడంతో అదానీ గ్యాస్ లిమిటెడ్ కౌంటర్లో కొనుగోళ్ల జోరందుకుంది. 10శాతం లాభంతో 151 వద్ద ముగిసింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం భారీగా ఖర్చు చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీపీ, పీఎల్సి, షెల్ తరువాత దేశీయ గ్యాస్ రంగంలోకి ప్రవేశించిన మూడవ విదేశీ చమురు మేజర్ టోటల్ ఎస్ఏ. పబ్లిక్ షేర్ హోల్డర్లకు 25.2 శాతం ఈక్విటీ షేర్లను అదానీ నుండి కొనుగోలు చేయడానికి ముందు టెండర్ ఆఫర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే 10 సంవత్సరాలలో గ్యాస్ పంపిణీని భారతీయ జనాభాలో 7.5 శాతం, పారిశ్రామిక, వాణిజ్య, దేశీయ వినియోగదారులకు మార్కెట్ చేస్తుంది, 6 మిలియన్ల గృహాలను లక్ష్యంగా చేసుకుని 1,500 రిటైల్ అవుట్లెట్ల ద్వారా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. భారతదేశంలో సహజవాయువు మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ధ్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జి) ప్లేయర్ టోటల్, భారతదేశంలో అతిపెద్ద ఇంధన, మౌలిక సదుపాయాల సమ్మేళనం అదానీ గ్రూపుతో తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు టోటల్ చైర్మన్ , సీఈవో సిఇఒ పాట్రిక్ పౌయన్నే ఒక ప్రకటనలో చెప్పారు. ఈ భాగస్వామ్యం దేశంలో తమ అభివృద్ధి వ్యూహానికి మూలస్తంభం లాంటిదన్నారు. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో నేచురల్ గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నసంగతి తెలిసిందే. -
నీ మరణాన్ని నీవే చూస్తున్నప్పుడు...
‘నీ భార్యతో పాటు ఇంటి బయటకి వెళ్తావు. తోట మధ్యకు చేరుకున్నప్పుడు, టెన్నిస్ రాకెట్టు ఇంట్లో మరచిపోయావని ఆమెకి చెప్తావు. దానికోసం వెనక్కి వెళ్ళి,‘నీవు’ రాకెట్టుని పెట్టే ప్రవేశద్వారం వద్దున్న అల్మారాకి వెళ్ళకుండా, బేస్మెంటు వైపు దారి తీస్తావు. బయటే ఉన్న నీ భార్య, తుపాకీ శబ్దం విని, ఇంట్లోకి పరిగెత్తి నిన్ను పిలుస్తుంది. బేస్మెంట్ తలుపు తెరిచుందని గమనించి, కిందకెళ్తుంది. నీవు, రైఫిల్‌ని నీ కణత మీద పెట్టుకుని కాల్చుకున్నావని చూస్తుంది.’ మధ్యమ పురుషలో ఉండే ‘సూయిసైడ్’ నవల ప్రారంభం ఇది. యీ ఫ్రెంచ్ పుస్తకంలో ఉన్న మాటలు, 20 ఏళ్ళ క్రితం–తను పాతికేళ్ళకన్నా ఎక్కువ జీవించనని చాటి, తన 25వ ఏటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ఉద్దేశించి కథకుడు చెప్పినవి. మొదట్లో యధార్థ జీవితకథ అనిపించే నవల–20 పేజీల తరువాత కథకుని ఉనికి గురించిన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ‘నీవు బతికే ఉంటే నాకు అపరిచితుడివి అయి ఉండేవాడివి. మరణించిన తరువాత స్పష్టంగా కనిపిస్తున్నావు’ అన్న మాటలు, కథకునికీ ‘నీవు’కీ ఉన్న సంబంధాన్ని వివరించవు. అయితే, ‘నీ ఆత్మహత్యను వివరిస్తూ, కామిక్ పుస్తకపు పేజీ ఒకటి తెరిచి పెడతావు. నీ భార్య చేయి తగిలి, పుస్తకం మూసుకుపోతుంది. ఏ పేజీ నీ ఆత్మహత్యను ఉదహరించిందో, ఎవరికీ తెలియకుండా పోతుంది’ అన్న మాటలు ఆతృత హెచ్చిస్తాయి. ‘ఆమె నిన్ను తన చేతుల్లోకి తీసుకుని వెక్కుతూ, నీ మీదకి వాలుతుంది. నీ శరీరం చల్లబడ్డం గమనిస్తుంది... నీ అంతాన్ని నీవే యోచించి పెట్టుకున్నావు. నీ మరణానికి వెనువెంటనే, నీ శరీరం కనుక్కోబడే ఏర్పాట్లు చేసుకున్నావు. అదక్కడే కుళ్ళుతూ పడి ఉండటం నీకిష్టం లేకపోయింది’ అన్నలాంటి– నీవు జీవితపు ఉదంతాలను, అనుభూతులను, అలవాట్లను, వస్త్రధారణను, పడగ్గది వివరాలను – ఒకదానికొకటి సంబంధం లేకుండా చెప్పే కథనం కాబట్టి, కథకుడికి ‘నీవు’ గురించిన వ్యక్తిగత వివరాలు ఎలా తెలుసా!’ అన్న అనుమానం కలుగుతుంది. నవల ఆత్మహత్య అనే చర్యను ప్రశ్నించదు. కానీ, ఆ నిర్ణయం తీసుకున్న మనిషిని నిలదీస్తుంది. అయితే ఏ సమాధానమూ దొరకదు. యీ 104 పేజీల నవలికలో ఉన్న అధ్యాయాల చివర్న, నీవు కుండే ఇష్టాయిష్టాలు కనబడతాయి: ‘నవ్వు రక్షిస్తుంది. సంతోషం నిరాశ పరుస్తుంది. వార్తాపత్రికలు విసుగు పుట్టిస్తాయి’. ‘నీ మరణం తరువాత ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుందా? ఆమె శృంగారం జరుపుతున్నప్పుడు నీవు గుర్తుకొస్తావా! నీ పుట్టిన రోజున ఆమె ఏమిటి చేస్తుంది? నీ వర్ధంతి దినాన, నీ సమాధి మీద పూలు ఉంచుతుందా! ఇంకా నీ బట్టలు అట్టేపెట్టిందా?’ అన్న క్రూరమైన ప్రశ్నలు హృదయవిదారకంగా అనిపిస్తాయి. పుస్తకంలో కథకుడి వివరాలేవీ లేనప్పటికీ నవల వెనుక అట్టమీదున్న, ‘తన యీ చివరి పుస్తకపు అచ్చుప్రతి పబ్లిషరుకి ఇచ్చిన పది రోజులకి, రచయిత ఎద్వార్ద్ లేవే ఉరి వేసుకున్నాడు’ అన్న వాక్యాలే – నవలను పాఠకులు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాయి. ‘నీవు’ అన్న పేరులేని వ్యక్తంటూ ఎవరూ లేరనీ, రచయితే తన రెండు పక్షాల వ్యక్తిత్వాలనీ సమర్థించుకుంటూ, అంతర్గత సంభాషణలు జరిపినవాడనీ అన్నవారు అనేకమంది. భయం పుట్టించే పుస్తకం కాదిది. జాలి కలిగించే ప్రయత్నం చెయ్యదు. వ్యాకులత, నిస్పృహతో బాధను విపరీతం చేయదు. వచనం సరళంగా, సాఫీగా ఉంటుంది. జాన్ సై్టన్, ఇంగ్లిషులోకి అనువదించిన యీ నవలికను 2011లో డాకీ ఆర్కైవ్స్ ప్రెస్ ప్రచురించింది. కృష్ణ వేణి -
ప్రాణాలకు తెగించి పైలట్ సాహసం.. వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : మంచు పర్వాతాలు ఎక్కుతూ పర్వతారోహకులు, స్కీయింగ్ చేస్తూ సాహసికులు అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవడం, వారిని ఎమర్జెన్సీ సర్వీసులకు చెందిన నిపుణులు హెలికాప్టర్లలో వెళ్లి రక్షించడం తెల్సిందే. మంచు పర్వతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి వెళ్లే హెలికాప్టర్లు కూడా కొంత దూరం నుంచి తాళ్లతోని, ఇతరత్రా బాధితులకు కాపాడుతాయి. బాధితుల వద్దకు పూర్తిగా వెళ్లే అవకాశం వాటికి ఉండదు. ఎందుకంటే హెలికాప్టర్లు కూడా ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది కనుక. కానీ ఫ్రెంచ్ ఎమర్జెన్సీ సర్వీసుకు చెందిన ఓ హెలికాప్టర్ పైలట్ మాత్రం ప్రాణాలకు తెగించి సాహసించడమే కాకుండా అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి ప్రపంచ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. జనవరి రెండవ తేదీన ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ మంచు పర్వతాల్లో బ్రూనో తాజియట్ స్కీయింగ్ చేస్తుంటే అతని మొకాలి చిప్ప ‘డిస్లోకేట్’ అవడంతో అతను కుప్పకూలిపోయారు. ఇది గమనించిన అతని మిత్రుడు నికోలస్ డెరీలీ ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేయడంతో ఓ హెలికాప్టర్ వచ్చి వెయ్యి మీటర్ల ఎత్తులో చిక్కుకున్న బ్రూనోను రక్షించింది. రోడ్డుమీద గాయపడిన వ్యక్తి వద్దకు అంబులెన్స్ తీసుకొచ్చి ఆపినట్లుగా ఏటవాలుగా ఉన్న కొండ అంచుదాక హెలికాప్టర్‌ను తీసుకెళ్లి దాని ముక్కును మంచులోకి గుచ్చి నిశ్చలంగా హెలికాప్టర్ నిలబడేలా పైలట్ దాన్ని కంట్రోల్ చేస్తుండగా, బాధితుడిని మరొక మిత్రుడు హెలికాప్టర్లోకి ఎక్కించడం మనకు కనిపిస్తుంది. ఈ సాహసోపేత చర్యను తన సెల్‌ఫోన్ వీడియాలో బంధించిన మిత్రుడు నికోలస్ ఆన్లైన్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దాదాపు ఏడున్నర లక్షల మంది దీన్ని వీక్షించారు. -
అజీం ప్రేమ్‌జీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అధిపతి అజీం ప్రేమ్‌జీకి అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనను అత్యున్నత ‘షెవాలీర్ డె లా లెజియన్ డిఆనర్’ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్) పురస్కారంతో సన్మానించనుంది. ఐటీ దిగ్గజంగా భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి, వితరణశీలిగా సమాజానికి చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఫ్రాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెలాఖరులో జరిగే కార్యక్రమంలో భారత్‌లో ఫ్రాన్స్ దౌత్యవేత్త అలెగ్జాండర్ జిగ్లర్ దీన్ని ఆయనకు అందజేయనున్నట్లు వివరించింది. ఐటీ దిగ్గజంగానే కాకుండా అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, విశ్వవిద్యాలయం ద్వారా సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా ప్రేమ్‌జీ నిమగ్నమైన నేపథ్యంలో ఫ్రాన్స్ పురస్కారం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 28–29 తారీఖుల్లో జరిగే బెంగళూరు టెక్ సదస్సులో పాల్గొంటున్న సందర్భంగా జిగ్లర్ ఈ పురస్కారాన్ని ప్రేమ్‌జీకి అందజేయనున్నారు. -
హైదరాబాద్‌లో ఫ్రెంచ్ కంపెనీ పెట్టుబడులు
-
గ్రేట్ రైటర్
ఫ్రాన్స్ దేశీయుడైన రోమా రోలో రచనలకు మనిషి కేంద్ర బిందువు. ఆయన మానవతావాది. యుద్ధాన్నీ, ఫాసిజాన్నీ వ్యతిరేకించాడు. ఆయన ఉద్గ్రంథం ‘జాన్ క్రిస్టఫె’ పది సంపుటాల నవల. ఫ్రాన్స్‌ను తన రెండో ఇల్లుగా మలుచుకున్న ఒక జర్మన్ సంగీత మేధావి రూపంలో తన ఆదర్శాలు, ఆసక్తులు, దేశాల మధ్య అవగాహనలు విశదంగా వ్యక్తం చేశాడు. నాటకం, నవల, చరిత్ర, వ్యాసం ప్రక్రియల్లోనూ కృషి చేశాడు. నాటకరంగాన్ని ప్రజాస్వామీకరించడానికి నడుం బిగించాడు. తూర్పు దేశాల తత్వశాస్త్రం, ముఖ్యంగా భారత్ వేదాంతం ఆయన్ని ఆకర్షించింది. టాగూర్, గాంధీజీలతో సంభాషించాడు. గాంధీ మీద పుస్తకం రాశాడు. వయసులో పెద్దవాడైనప్పటికీ సిగ్మండ్ ఫ్రాయిడ్ మీద ఆయన ప్రభావం ఉంది. వారిరువురూ ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపారు. ఈ విశ్వంలో తానూ ఒకడిగా ఉన్నాననే మనిషి సంవేదనను వ్యక్తపరిచే ‘ఓషియానిక్ ఫీలింగ్’ పదబంధాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు రాసిన ఓ లేఖలో సృష్టించాడు. ఈ మానవతావాదిని 1915లో నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. 1866–1944 ఆయన జీవనకాలం. రోమా స్నేహితుడు, రోమా జీవిత చరిత్ర రాసిన స్టెఫాన్ త్సైక్ ఆయన్ని ‘ఐరోపా నైతిక చేతన’గా అభివర్ణించాడు. -
హామిల్టన్‌కే టైటిల్
పారిస్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో మూడో టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి రేసులో ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన హామిల్టన్... నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 30 నిమిషాల 11.385 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. అతని కెరీర్లో ఇది 65వ టైటిల్. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ రేసును పూర్తి చేయలేకపోయారు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి జూలై 1న జరుగుతుంది. -
పదునుతేరిన బంధం!
అంతర్గత సమస్యలు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవచిస్తున్న ‘అమెరికా ఫస్ట్’, రష్యా నుంచి అడపా దడపా ఎదురయ్యే చికాకులు ప్రపంచీకరణ పునాదుల్ని కదిలిస్తున్న తరుణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌లో నాలుగురోజులు పర్యటించారు. రక్షణ, భద్రత, అణు ఇంధనం వగైరా రంగాల్లో ఇరు దేశాల మధ్యా 14 ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాలకు చెందిన కంపెనీల మధ్యా కుదిరిన ఒప్పందాల విలువ లక్ష కోట్ల రూపాయలపైబడే ఉంది. భారత్–ఫ్రాన్స్‌ల మధ్య ఎంతటి గాఢమైన అనుబంధం ఉన్నదో చెప్పడానికి మాక్రాన్‌కు లభించిన ఘన మైన స్వాగతసత్కారాలే తార్కాణం. అలాగని గత నెల మన దేశంలో పర్యటించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తరహాలో మాక్రాన్ సూటూ బూటూ వదిలి ఇక్కడి సంప్రదాయ దుస్తులు ధరించి మనల్ని అలరించాలని చూడలేదు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయానా విమానాశ్రయానికెళ్లి మాక్రాన్ దంపతులకు స్వాగతం పలికారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన అనుబంధం కాదు. రెండు దేశాలూ వ్యూహాత్మక బంధంలోనికి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్త యింది. 1998లో వాజపేయి హయాంలో మన దేశం పోఖ్రాన్లో అణు బాంబు పరీక్ష నిర్వహించినప్పుడు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలన్నీ తీవ్ర విమ ర్శలకు దిగితే ఫ్రాన్స్ మనకు అండగా నిలబడింది. యూరప్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సులో భారత్‌పై ఆంక్షలు తెచ్చేందుకు బ్రిటన్ ప్రయత్నిస్తు న్నప్పుడు దాన్ని వీటో చేస్తానని హెచ్చరించింది ఫ్రాన్సే. అందుకు ఆనాటి భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా స్వయంగా పారిస్ వెళ్లి కృతజ్ఞతలు చెప్పి వచ్చారు. అనంతరకాలంలో రెండు దేశాల మధ్యా వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. నిలకడగా మాట్లాడటం, నిర్దిష్టమైన విధానాల్ని ప్రకటించి వాటికి కట్టుబడి ఉండటం డోనాల్డ్ ట్రంప్‌కు లేని కారణంగా అంతర్జాతీయంగా ఒక అనిశ్చితి ఏర్ప డింది. అమెరికాతో తమకెలాంటి సంబంధాలున్నాయో, అవి ఎటుపోతాయో తెలి యని అయోమయ స్థితిలో ప్రతి దేశమూ ఉంది. ఇటు చైనా అందుకు పూర్తి విరుద్ధం. ట్రంప్ తీరుతెన్నుల పర్యవసానంగా ఏర్పడ్డ ఈ పరిస్థితిని అది సంపూ ర్ణంగా వినియోగించుకుంటోంది. తన పలుకుబడి విస్తరించుకుంటోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తాజాగా వచ్చిన అపరిమిత అధికారాల కారణంగా ఈ దూకుడు ఉన్నకొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గదు. అటు రష్యా కూడా కొత్త ఎత్తులు వేస్తోంది. చైనా, పాకిస్తాన్లతో అంటకాగడానికి ఉత్సాహపడుతోంది. ఈ పరిస్థి తుల్లో భారత్–ఫ్రాన్స్‌లు మరింత దగ్గరయ్యాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఇప్పటికే నిర్ణయించగా...ఫ్రాన్స్‌తో మన దేశానికి ఇప్పుడు కుదిరిన సైనిక దళాల సహకార ఒప్పందం దాన్ని మరింత పటిష్టపరుస్తుంది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం సహకరించుకోవడానికి, ఉమ్మడి విన్యాసాలకూ, శిక్షణకూ, విపత్తుల్లో సాయం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఫ్రాన్స్‌కు జిబౌతి, అబూ ధాబీ, రీయూనియన్ ఐలాండ్ వగైరాల్లో సైనిక స్థావరాలున్నాయి. మన దేశం కూడా సెషెల్స్, మారిషస్, ఒమన్లలో నావికా దళ సదుపాయాలను సమ కూర్చుకోవాలని చూస్తోంది. ఈ విషయంలో ఇప్పుడు కుదిరిన ఒప్పందం తోడ్ప డుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక్కో దేశంతోనే సన్నిహి తమవుతూ భారత్ పలుకుబడిని తగ్గిస్తున్న చైనా పోకడలను నిలువరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇరు దేశాల నావికా దళాలూ ఒకరి స్థావరాలను మరొకరు వినియోగించుకునే సదుపాయం వల్ల ఇండో–పసిఫిక్ ప్రాంత భద్రతకు భరోసా ఏర్పడుతుంది. సౌరశక్తి వినియోగంలో పరస్పర సహకారం పెంచుకుని శిలాజ ఇంధనాల అవసరాన్ని గణనీయంగా తగ్గించాలన్న సంకల్పంతో రెండు దేశాల చొరవతో ఇప్పటికే అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) ఏర్పడి పనిచేస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి దీన్ని మరింత సమర్ధవంతంగా వినియోగిం చాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. అలాగే రకరకాల ఆంక్షలతో ట్రంప్ అమెరికా తలుపులు మూస్తున్న తరుణంలో మన విద్యార్థులకూ, శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ ఫ్రాన్స్‌లో మెరుగైన అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్న మాక్రాన్ హామీ ఆశలు రేకెత్తిస్తుంది. ఫ్రాన్స్‌తో యూపీఏ హయాంలో 2012లో కుదిరిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపైనా, ఎన్డీఏ వచ్చాక ఆ యుద్ధ విమానాల కోసమే 2016లో కుదిరిన ఒప్పందంపైనా ఎన్ని వివాదాలు తలెత్తాయో అందరికీ గుర్తుంది. అప్పట్లో రూ. 1.34 లక్షల కోట్ల వ్యయంతో 126 విమానాలు కొనాలని యూపీఏ సర్కారు వాటిని ఉత్పత్తి చేసే డసాల్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 18 విమానాలను నేరుగా అందజేసి, మిగిలిన 108 విమానాలనూ బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేతా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తా మని అది హామీ పడింది. కానీ ఇక్కడ రేకెత్తిన వివాదాలు చూసి వెనక్కు తగ్గింది. నరేంద్ర మోదీ 2015లో ఫ్రాన్స్ పర్యటించినప్పుడు రాఫెల్ విమానాలు 36 కొనాలన్న ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఒక్కో విమానం విలువ దాదాపు రూ. 670 కోట్లు. యుద్ధ విమానాలకు సంబంధించి కుదిరిన ఒప్పందం బయట పెట్టాలని మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు ఆందోళన చేయగా యూపీఏ హయాంలో 2008లో ఇరు దేశాల మధ్యా కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా దాన్ని బయటపెట్టలేకపోతున్నామని ప్రభుత్వం జవాబిచ్చింది. దాని ప్రకారం ఏ ఒప్పందంలోని అంశాలనైనా రెండు దేశాలూ వెల్లడించకూడదు. పదేళ్లపాటు అమల్లో ఉండే ఆ క్లాజుకు మొన్న జనవరి 24తో కాలదోషం పట్టింది. కనుక రాఫెల్ ఒప్పందాన్ని వెల్లడించడానికి ఇకపై ఎలాంటి ఆటంకాలూ ఉండ వనుకునేలోగానే తాజాగా ఆ ‘గోప్యత’ క్లాజుకు రెండు దేశాలూ ప్రాణప్రతిష్ట చేశాయి. ఇది సహజంగానే ‘రాఫెల్’ చుట్టూ అల్లుకున్న వివాదాలను మరింత పెంచుతుంది. మొత్తానికి మాక్రాన్ పర్యటన ఇరు దేశాల సంబంధాలనూ మరింత ఉన్నత స్థితికి చేర్చింది. -
సాగర తీరంలో ఆకట్టుకున్న ఫ్రెంచ్ షో
హైదరాబాద్: దేశంలోనే తొలిసారి రాజధాని వేదికగా నిర్వహించిన ఫ్రెంచ్ ఏరియల్ షో నగరవాసులను మంత్ర ముగ్ధులను చేసింది. భారీ క్రేన్ సాయంతో 50 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడుతూ.. మరోపక్క మనసుకు పులకరించే సంగీతం మధ్యన సాగిన విన్యాసాలను కేరింతలు, చప్పట్లతో సందర్శకులు స్వాగతించారు. ‘మన్సూర్ ఇండియా కల్చరల్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిర్వహిస్తున్న ఫ్రెంచ్ ఏరియల్ షో తొలి ప్రదర్శనను నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో 18 మంది కళాకారుల సంగీతం, నృత్యం, క్రాఫ్ట్, ఆర్కెస్ట్రా, సర్కస్ తదితర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. 18 మందిలో ఆరుగురు యువతులు ఉండటం విశేషం. దేశంలోనే తొలి ఫ్రెంచ్ ఏరియల్ షోను నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్సిస్ డైరెక్టర్ ఎమిలిన్ పాల్గొన్నారు. -
ఆయన వంట తింటే వదలరు.. కాని ఇకలేరు
పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అంటారు. కానీ ఎన్ని జిహ్వలకైనా సరే.. ఒకసారి పాల్ బొక్యూజ్ వంట రుచి చూశారంటే ఇక జీవితాంతం విడిచిపెట్టరు. అంతటి అద్భుత ఫ్రెంచ్ వంటగాడైన పాల్ జనవరి 20న కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన వయసు 91 ఏళ్లు. అయితే, ఆయనకు శిష్య బృందం ఘన వీడ్కోలు పలికింది. అందుకుగాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు పదిహేను వందలమంది శిష్యులు చెఫ్ యూనిఫాంలో హాజరయ్యారు. పాల్ బొక్యూజ్ను శతాబ్దికి వంటగాడని అంటారు. ఆయన ప్రపంచమంతటికి సుపరిచితుడే. పలుచోట్ల మనకు కనిపిస్తున్న క్విజైన్ రెస్టారెంట్లకు రూపకల్పన చేసిన వ్యక్తి కూడా ఆయనే. ఎలాంటి ఆహార పదార్థాలతోనైనా రుచిగా, విభిన్నంగా వండటం పాల్‌కు వెన్నతో పెట్టిన విద్య. పాల్ కుటుంబానికి కూడా వంటలు చేసే చరిత్ర ఉంది. 1765 నుంచీ వారు వంటనే ప్రధాన వృత్తిగా ఎంచుకుని ఎన్నో కొత్త రుచులను ఆవిష్కరించారు. 1926లో ఇదే కుటుంబంలో జన్మించిన పాల్‌ను ఫ్రెంచ్ ప్రభుత్వం పలు సత్కారాలతో గౌరవించింది. వేలమందికి తన వృత్తిలోని మెలకువలను నేర్పి జీవనోపాధి కల్పించారు. ఆయన వంటలకు ఎన్నో దశాబ్దాల నుంచి మూడు నక్షత్రాల గుర్తింపు ( త్రీస్టార్ రేటింగ్ ) ఉంది. పాల్ మంచి చమత్కారి కూడా. అందుకు ఉదాహరణగా చెప్పాలంటే ఆయన చివరి కాలంలో వచ్చిన ఓ పుస్తకంలో 'నాకు మూడు నక్షత్రాల రేటింగ్, మూడు బైపాస్ సర్జరీలు, ముగ్గురు భార్యలు' అని పేర్కొన్నారంటే ఎంతటి చతురులో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. -
వెస్టర్న్ వసంతం
ప్రపంచం ఎటో వెళ్లిపోతోంది.మాంచి స్పీడ్ మీదుంది. యంగ్‌స్టర్స్ బిగ్‌స్టార్స్ అవుతున్నారు.బిగ్ స్టార్స్ సూపర్ స్టార్స్ అవుతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఇదేకొత్త ట్రెండ్. ట్రెండ్లను తలదన్నే ట్రెండ్. కథ మారింది. ఫిట్ మారింది. ప్రింట్ మారింది. ఫ్యాబ్రిక్ మారింది.లుక్ మారింది. మరి మనం మారద్దూ! మనం కూడా వరల్డ్ ఫ్యాషన్లని మన భుజం మీద మోయద్దూ!! ఇదో... అదే ఆలోచనతో మీకు ఇవాళ సాక్షి సమర్పిస్తోంది. వస్త్రాలలో ఎన్నో పూల తోటలు. నిజంగా ఒక వెస్టర్న్ వసంతం. ► జార్జెట్, షిఫాన్, క్రేప్ ఫ్యాబ్రిక్స్ వలీ డిజైన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. సన్నగా ఉన్న అమ్మాయిలకు వీటితో డిజైన్ చేయించాలంటే మరింత సన్నగా కనపడతారని అపోహపడతారు. వలీ డిజైన్స్ చూస్తే చిన్న చిన్న మార్పులతో, సరైన కట్, ఫిట్‌తో అందంగా కనిపించేలా డిజైన్ చేయవచ్చు. చేతులు, నడుము, నెక్లైన్ వద్ద కొద్దిపాటి కుచ్చులను జత చేస్తే మార్పులో స్పష్టత సులువుగా అర్థమైపోతుంది. ► బొద్దుగా లేదా పొడవు తక్కువగా ఉన్నవాళ్లకు షార్ట్‌లెంగ్త్ డిజైన్స్ ఎలా నప్పుతాయో వలీ డిజైన్స్ చూసి తెలుసుకోవచ్చు. ఇలాంటి వారికి కొద్దిగా ముదురు రంగులు, చిన్న చిన్న ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. ► రాసిల్క్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన క్రీమ్ కలర్ షార్ట్ ఫ్రాక్. దాని మీద ఎర్రని పువ్వుల ఎంబ్రాయిడరీ ఆకర్షణీయతను పెంచుతుంది. ఇదే తరహా కాంబినేషన్లో ఇతర డ్రెస్ డిజైన్స్‌నూ మార్చుకోవచ్చు. జియామ్బటిస్టా వలి ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్. రోమ్‌లో పుట్టి, అక్కడే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాడు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్యాషన్ పరిశ్రమ అతనిలో సృజనను తట్టిలేపింది. లండన్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాడు. అక్కడ వేలాది మంది ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు చేస్తున్నారు. అప్పటికే ఎంతో మంది ఫ్యాషన్ డిజైనర్లు ప్రపంచాన్ని ఏలేస్తున్నారు. వారి మధ్య తను ఎలా నెగ్గుకు రాగలను అని ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నకు అతనికి చిత్రకళ సమాధానమిచ్చింది. దానిని ఆపోసన పట్టాడు. చిత్రకళను డ్రెస్ డిజైన్స్ మీదకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇతని సృజనను మెచ్చి ప్రముఖ కంపెనీలు ఎర్రతివాచీని పరిచాయి. పీటర్ ఎ పోర్టర్ వంటి కంపెనీలకు క్రియేటివ్ డిజైనర్‌గా ఉండి తర్వాత తనే సొంతంగా స్టోర్ ప్రారంభించాడు. ఇప్పుడు 41 దేశాల్లో 245 సెల్లింగ్ పాయింట్స్ ద్వారా ప్రపంచవ్యాప్త మార్కెట్ ఉంది వలీకి. తలలు పండిన డిజైనర్లు సైతం తమ ప్రతిభను కనబరిచేందుకు ఎదురుచూసే ప్యారిస్ ఫ్యాషన్ షోలో వరుసగా నాలుగు సార్లు పాల్గొనే అవకాశం దక్కింది వలీకి. పువ్వుల సోగయం సిసలైన స్టైల్ శరీరాన్ని హత్తుకుపోయినట్టుండే ప్యానెల్స్, రంగులు, పువ్వుల ప్రింట్లతో ప్రతి యేటా ఓ కొత్తదనం వలీ డిజైన్స్‌లో కనిపిస్తుంది. రాచఠీవితో వెలిగిపోయే డ్రెస్ డిజైనింగ్, నాటకీయతను రూపుకట్టే కేప్స్, పోల్కాడాట్స్.. వలీ డిజైన్స్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పూసలతో చేసిన ఎంబ్రాయిడరీ, బో కాలర్స్, అసెమెట్రికల్ డ్రేపింగ్, విశాలంగా కనిపించే పెప్లమ్స్ ఇట్టే ఆకట్టుకుంటాయి. కాంతిమంతమైన ఎరుపు, నీలం, పసుపులలోనే ఎన్నో షేడ్స్‌ని సృష్టించి వాటితోనే అద్భుతమైన డిజైన్స్ తయారుచేస్తాడు వలీ. ► నీ లెంగ్త్ మిడ్ ఫ్రాక్ ఇది. ప్రొఫెషనల్‌గా రాణించాలనుకునే ఆధునిక యువతులకు కాన్ఫిడెన్స్ ఇచ్చే డెస్ స్టైల్ ఇది. నెక్ కాలర్, స్ట్రెయిట్ కట్‌తో సాదా సీదాగా అనిపించే ఈ స్టైల్‌ని సన్నని బెల్ట్‌ను జత చేసి పూర్తి లుక్ మార్చేశారు. ►నడిచి వచ్చే పువ్వుల దండులా మేనిపై విరుల సోయగం ప్రత్యేకతను చాటుతుంది. దానికి ఫెదర్ని జత చేస్తే రాయంచ కొత్త రెక్కలు తొడుక్కున్నట్టే! టాప్ టు బాటమ్ ఒకే ప్రింట్ ఫ్యాబ్రిక్ వాడినా అందులోని ప్రధాన రంగును ఫెదర్ లేదా దుపట్టా లాంటివి ధరించడానికి ఎంపిక చేసుకోవచ్చు. జియామ్బటిస్టా వలి -
ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలు
-
జలాలపై జన నివాసాలు
ఎవరు ఔనన్నా, ఇంకెవరు కాదన్నా.... ఈ భూమ్మీద మనిషికి నూకలు చెల్లే కాలం దగ్గరకొచ్చేసింది. పర్యావరణం అతలాకుతలమవుతోంది. అకాల వరదలు నగరాలను ముంచేస్తున్నాయి. ఇంకొన్నేళ్లు పోతే... నీటి యుద్ధాలు తప్పవేమో అనేట్టుగా ఉంది పరిస్థితి. సపోజ్.. ఫర్ సపోజ్.. రేపోమాపో... ‘నేల‘పై బతికే పరిస్థితి లేకపోతే మీరేం చేస్తారు? మీరింకా అంతదూరం ఆలోచించి ఉండరుగానీ... సీస్టీడింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రం ఎంచక్కా సముద్రాలపై నగరాలు కట్టేస్తే పోలా అంటోంది. భూమ్మీద 70 శాతం ప్రాంతాన్ని ఆవరించిన సముద్రాలపై.. తేలియాడే నగరాలను కట్టాలన్న ఈ కంపెనీ ఆలోచనకు ఈ మధ్యే ఫ్రెంచ్ పాలినీసియా దేశ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. న్యూజిల్యాండ్, అమెరికాల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది ఈ చిన్ని దేశం. వందకుపైగా ద్వీపాలతో 2.5 లక్షల జనాభా మాత్రమే ఉండే ఫ్రెంచ్ పాలినీసియా సమీపంలో పైలెట్ పద్ధతిన ఓ తేలియాడే నగరాన్ని కట్టాలన్నది సీస్టీడింగ్ ఆలోచన. పక్క ఫొటోల్లో కనిపిస్తున్నది అలాంటి డిజైనే. అక్కడికక్కడే పంటలు పండించుకోవడానికి, విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడానికి ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. నాచుమొక్కల పెంపకం ద్వారా అటు చేపల్ని ఇటు ఇంధనాన్ని తయారు చేసుకుంటుంది ఈ నగరం. చిన్న చిన్న ద్వీపాల మధ్య ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు విపరీత వాతావరణంతో ఇబ్బందుల్లేకుండా చేసుకుంటున్నారు. దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుందని అంటున్నారు సీస్టీడింగ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి రున్డాల్ఫ్ హెన్కిన్. పర్యావరణానికి ఏమాత్రం హాని జరగని రీతిలో వ్యర్థాల రీసైక్లింగ్ కూడా జరుగుతుందని, ఏ దేశంవారైనా ఈ తేలియాడే నగరంలో నివసించేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భళా...కాంభోజ!
అదిగో అల్లదిగో... కంబోడియా ఆగ్నేయ ఆసియాలోని ఇండోనేషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉన్న దేశం కంబోడియా. ఇప్పటికీ రాచరిక విధానం అమలులో ఉన్న దేశం ఇది. ఖైమర్ సామ్రాజ్యకాలంలో విస్తారమైన సంపదలతో దక్షిణాసియా దేశాలలో ఆధిపత్యం సాధించింది. పద్దెనిమిదవ శతాబ్దంలో పొరుగు దేశాలైన థాయిలాండ్, వియత్నాంల ఆధిపత్యానికి గురైంది. థాయిలాండ్ కంబోడియాను ఆక్రమించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో కంబోడియాపై వియత్నాం దాడి చేసింది. దీంతో రక్షణ కోసం కంబోడియా థాయిలాండ్‌ను ఆశ్రయించింది. ఫలితంగా వాయవ్య కంబోడియా థాయిలాండ్ వశమైంది. థాయిలాండ్, వియత్నాంల నుంచి తమ దేశాన్ని రక్షించవలసిందిగా కంబోడియా రాజు వేడుకోవడంతో, 1863లో కంబోడియా ఫ్రెంచ్ రక్షణలోకి వెళ్లిపోయింది. ఫ్రెంచ్ పాలనలో కంబోడియాలో చెప్పుకోదగ్గ ఆర్థికాభివృద్ధి చోటుచేసుకుంది. రోడ్లు, రైల్వే లైన్ల నిర్మాణం జరిగింది. 1920లో రబ్బర్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. అయినప్పటికీ కంబోడియన్లు పెద్ద ఎత్తున పన్నులు చెల్లించాల్సి రావడంతో దేశంలో జాతీయవాదం తలెత్తింది. 1941లో కంబోడియా జపాన్ ఆక్రమణకు గురైంది. 1945లో జరిగిన యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో కంబోడియా మరోసారి ఫ్రెంచ్ పాలనలోకి వెళ్లింది. రాజకీయ పార్టీలు స్థాపించుకోవడానికి, రాజ్యాంగం నిర్మించుకోవడానికి ఈసారి కంబోడియన్లకు అవకాశం ఇచ్చింది. 1949లో జరిగిన ఒక ఒడంబడికతో కంబోడియా పాక్షికంగా స్వాతంత్య్రదేశమైంది. 1953లో ఫ్రెంచ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంబోడియాకు స్వాతంత్య్రం ఇచ్చింది. కంబోడియా చరిత్రలో 1975 ఒక చీకటి కాలం. దీనికి కారణం నియంత పాల్ పాట్ పాలన. ఆయన పరిపాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయి. కంబోడియాను పూర్తిస్థాయిలో వ్యవసాయ దేశంగా మార్చడానికి పట్టణాల్లో ఉన్నవారిని పల్లెల్లోకి తరలించాడు. వ్యవసాయ ఉత్పాదన నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు కావాలని నిర్ణయించి ప్రజలను కష్టపెట్టాడు. ఎంతో మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. విదేశీ భాషలు మాట్లాడటం కూడా నేరమైపోయింది. అనేక విషయాల్లో నియంతృత్వం వెర్రితలలు వేసింది. 1978లో వియత్నాంతో జరిగిన యుద్ధంతో పీడకలలాంటి వాస్తవానికి తెరపడింది. కొద్దికాలం తరువాత వియత్నాంకు వ్యతిరేకంగా గెరిల్లా పోరు మొదలైంది. 1998లో పాల్ పాట్ చనిపోయిన తరువాతగానీ దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడలేదు. పేద దేశంగానే ఉండిపోయిన కంబోడియాలో 21 శతాబ్దం తొలినాళ్లలో ఆర్థికవృద్ధి వేగవంతం అయింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పుడు కంబోడియా ముందు వరుసలో ఉంది. టాప్ 10 1. కంబోడియా పురాతన నామం... కాంభోజ. 2. కంబోడియా జలభాగంలో 2001లో చమురు నిల్వలు, సహజవాయు నిక్షేపాలను కనుగొన్నారు. 3. చిత్రమైన విషయమేమిటంటే కంబోడియాలో ఎవరూ పుట్టిన రోజు జరుపుకోరు. 4. దేశజాతీయ పతాకంపై కట్టడం (ఆంగ్కోర్ వాట్ దేవాలయం) ఉన్న ఏకైక దేశం కంబోడియా. 5. కంబోడియాకు ఉత్తరంలో థాయిలాండ్, ఈశాన్యంలో లావోస్, వియత్నాంలు ఉన్నాయి. 6. కంబోడియాలో 536 పక్షి జాతులు, 850 మంచి నీటి చేప జాతులు, 435 సముద్రజాతి చేపలు ఉన్నాయి. 7. అడవుల క్షీణత ఎక్కువగా ఉన్న దేశాలలో కంబోడియా ఒకటి. 8. వస్త్రపరిశ్రమ తరువాత కంబోడియాలో చెప్పుకోదగ్గది పర్యాటకరంగం. 9. కంబోడియా పర్యాటకానికి ప్రధాన ఆకర్షణ ఆంగ్కోర్ వాట్ దేవాలయం. ప్రపంచంలోని మత సంబంధిత పెద్ద కట్టడాల్లో ఇదొకటి. ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా పేరుగాంచింది. 10. దేశంలో 95 శాతం కంటే ఎక్కువ మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. -
పొరపాటున బాంబు వేశాం: ఫ్రెంచ్ ప్రధాని
ఇరవై ఐదేళ్ళ తర్వాత ఫ్రాన్స్, న్యూజిల్యాండ్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్ న్యూజిల్యాండ్ లో పర్యటించడం అందుకు పెద్ద నిదర్శనంగా చెప్పాలి. అక్కడకు వెళ్ళడమేకాక, ఫ్రాన్స్ 31 ఏళ్ళ క్రితం న్యూజిల్యాండ్ పై జరిపిన దాడి పెను తప్పిదమంటూ వాల్స్ విశ్లేషించడం ఇరు దేశాలమధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గ్రీన్ పీస్ పై 31 ఏళ్ళ క్రితం జరిపిన బాంబు దాడి పెను తప్పిదమేనన్నారు ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్. 25 సంవత్సరాల అనంతరం మొదటిసారి ఫ్రెంచ్ ప్రధాని న్యూజిల్యాండ్ ను సందర్శించారు. ఈ సందర్శన ఫ్రెంచ్, న్యూజిల్యాండ్‌ల మధ్య మైత్రిని పెంపొందించే అవకాశం ఉన్నట్లు జిన్హువా వార్తా సంస్థ అభిప్రాయపడింది. 1985 జూలైలో ఫ్రెంచ్ గూఢచారులు... ఆక్లాండ్ ప్రధాన పట్టణం పై.. రెండు భారీ మైన్లతో దాడికి పాల్పడ్డాయి. ఫసిఫిక్ లో ఫ్రాన్స్ జరుపుతున్న అణ్వస్త్ర పరీక్షలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ప్రచారం కొనసాగిస్తున్నసమయంలో రైన్బో వారియర్ నౌక.. బాంబుదాడితో నిమిషాల్లో నీటిలో మునిగిపోయింది. అనంతరం దాడిలో పాల్గొన్న ఇద్దరు ప్రెంచ్ సీక్రెట్ ఏజెంట్లను న్యూజిల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 సంవత్సరాలక్రితం మా సంబంధం పెద్ద పవాలుగా ఉండేదని, అప్పట్లో జరిగిన బాంబు దాడి తప్పిదమేనని, దాడితో చెరిగిపోయిన ఇరుదేశాల మధ్య బంధం... తిరిగి చిగురించాలని కోరుకుంటున్నట్లు ఫ్రాన్స్ ప్రధాని వెల్లడించారు. జరిగిన తప్పిదాలను గుర్తుంచుకొని, అటువంటివి మరెప్పుడూ జరగకుండా చూసుకుంటూ...ఇరు దేశాలు కలసి అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలని వాల్స్ ఆకాంక్షించారు. మరోవైపు.. బాంబు దాడి ఘోరమైన తప్పిదంగా ఫ్రాన్స్ అంగీకరించడం మంచి పరిణామమని న్యూజిల్యాండ్ ప్రధాని జాన్ కీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆక్లాండ్ లో వాల్స్ తో చర్చలు జరిపిన అనంతరం న్యూజిల్యాండ్ నష్టాన్ని, బాధను ఫ్రాన్స్ అర్థం చేసుకొందని అటువంటి సమస్యలు తిరిగి తెచ్చే అవకాశం లేదని తాను నమ్ముతున్నట్లు జాన్ కీ తెలిపారు. ఫ్రాన్స్ తన చర్యలను పెద్ద లోపంగా భావించిందని, ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రధాని రాక ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంచుతుందని న్యూజిల్యాండ్ ప్రధాని కీ అభిప్రాయపడ్డారు. -
ఫ్రెంచ్ ఫ్రైస్... మీరు చేయలేరా?!
సాయంత్రం పూట మంచి సినిమా చూస్తూ, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ, కోక్ చప్పరిస్తుంటే వచ్చే మజాయే వేరు. కాకపోతే ఫ్రైస్ కావాలంటే రెస్టారెంటుకు ఆర్డరివ్వాలి. లేదంటే మనమే వెళ్లి తెచ్చుకోవాలి. ఏం మనం చేసుకోలేమా? చేసుకోవచ్చు. కానీ బంగాళాదుంపల్ని కట్ చేయడం తలచుకుంటే వాటిని తినాలన్న ఆశ చచ్చిపోతుంది. ఎందుకంటే అన్నిటినీ సమానంగా కట్ చేసుకోవడం అంత చిన్న విషయమేమీ కాదు. అలా కట్ చేయకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగోవు. అందుకే వాటిని చేసే ప్రయత్నాన్ని విరమించుకుంటారు అందరూ. ఆ ఇబ్బందిని తీర్చడానికి వచ్చిందే ఈ ‘ఫ్రెంచ్ ఫ్రై కట్టర్’. బంగాళాదుంపను చెక్కు తీసి, దీనిలో పెట్టి, స్టేప్లర్ని నొక్కినట్టు ఒక్క నొక్కు నొక్కితే చాలు... క్షణంలో క్షణంలో పొడవాటి ముక్కలు రెడీ. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెల కూడా పెద్ద ఎక్కువేమీ కాదు. రూ. 500 లోపే! -
రోగి స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ!
ఫ్రాన్స్ వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. మెదడులోని క్యాన్సర్ కణతిని తొలగించేందుకు 3డీ వర్చువల్ గ్లాసెస్ వినియోగించి.. రోగి స్పృహలో ఉండగానే శస్త్ర చికిత్స నిర్వహించారు. కృత్రిమ ప్రపంచాన్ని రోగికి చూపుతూ.. ఆపరేషన్ సమయంలో మెదడులోని భాగాలను సులభంగా పరీక్షించేందుకు అనుమతించే త్రీడీ అద్దాలను వినియోగించారు. రోగి స్పృహలో ఉన్నపుడే శస్త్ర చికిత్స నిర్వహించడంలో భాగంగా వైద్యులు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ ఫ్రాన్స్ లోని ఏంజిర్ ఆస్పత్రిలో నిర్వహించిన చికిత్స విజయవంతమవ్వడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ సమయంలో రోగి కళ్లముందు కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించేందుకు త్రీడీ గ్లాస్ లు వాడినట్లు డాక్టర్లు చెప్తున్నారు. దీంతో మెదడు పని తీరును ప్రత్యక్షంగా గుర్తించగలిగినట్లు ఏంజెర్స్ ఆస్పత్రి న్యూరో సర్జన్ ఫిలిప్పీ మెనీ తెలిపారు. కణతి కారణంగా రోగి ఇప్పటికే ఓ కన్ను కోల్పోయాడని, అందుకే దృష్టిని రక్షించేందుకు ప్రత్యేకంగా వినియోగించే ఈ కొత్త టెక్నాలజీని అతడి ఆపరేషన్ కు వాడినట్లు వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత రోగి క్రమంగా కోలుకుంటున్నాడని, కీమో థెరపీ చేయించుకునే ప్రయత్నంలో కూడ ఉన్నాడని చెప్తున్నారు. స్పృహలో ఉండగా రోగికి ఆపరేషన్ చేయడం అనేది సుమారు పదేళ్లుగా జరుగుతోందని, అయితే వర్చువల్ రియాలిటీ అద్దాల వాడకం శస్త్ర చికిత్స సమయంలో వాడటం ఇదే మొదటిసారి అని డాక్టర్ మెనీ తెలిపారు. ఇలా చేయడంవల్ల రోగికి సంబంధించిన మాట, దృష్టి, కదలికలు చికిత్స సమయంలో స్పష్టంగా తెలుసుకోగలిగే అవకాశం ఉందంటున్నారు. పేషెంట్ కు ప్రత్యేక అనుభూతిని కల్గించడంకోసం కాదని, శస్త్ర చికిత్స సులభమవ్వడంకోసమే ఈ అద్దాలు వాడినట్లు వైద్యులు స్సష్టం చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో మెనీ బృందం... భవిష్యత్తులో మెదడు కణతిల ఆపరేషన్ కు ఇదే విధానాన్ని అమల్లోకి తేనున్నారు. త్వరలో పిల్లల చికిత్సలకు కూడ వచ్చువల్ రియాలిటీ గ్లాసెస్ వినియోగించే యోచనలో ఉన్నారు. -
వృధా పదార్థాలు పడేయడంపై బ్యాన్
పారేసేది వాడెయ్యమన్నది నానుడి.. అంటే మనకు పనికి రానిది మరొకరికి ఉపయోగపడేలా చేయాలని అర్థం. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో ఇది వర్తిస్తుంది. వృధాగా పోయే పదార్థాలను ఆపన్నులకు అందించాలన్న సూత్రం ఈ సందర్భంలో వెల్లడవుతుంది. పేదవారికి ప్రత్యేకంగా సహాయం అందించలేక పోయినా.. ఇటువంటి నియమాలను పాటించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఆహార పదార్థాలు వృధా చేయడంపై కొన్ని దేశాల్లో కఠినమైన చట్టాలు అమలవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలోని అమ్ముడుపోని పదార్థాలను చెత్తబుట్టల్లోకి విసిరేయడంపై నిషేధం విధించారు. ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకులను చెత్తబుట్టలకు తరలిస్తుంటారు. ఇటువంటి పోకడలకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేందుకు కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వస్తువులను వృధాగా పారేసేవారికి పరిమాణాన్ని బట్టి ఫైన్ వేసేందుకు నిర్ణయించింది. అంతేకాదు ఒక్కోసారి అవసరాన్ని బట్టి, తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడ విధిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎక్స్ పైరీ డేటుకు ముందే అనాధ శరణాలయాలకు, ఫుడ్ బ్యాంక్ లకు ఇచ్చేయాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో బిల్లు కూడ పాస్ చేశారు. ఫ్రాన్స్ లో ప్రతియేటా 7.1 మిలియన్ టన్నుల ఆహారం వేస్ట్ అవుతుండటం కూడా ఈ బిల్లు అమల్లోకి రావడానికి కారణంగా చెప్పాలి. ముఖ్యంగా ఈ వృధా చేస్తున్న పదార్థాల్లో అమ్మకందార్లు 11 శాతం వృధా చేస్తుంటే... కొని పారేసే వారు 67 శాతం, రెస్టారెంట్ల లో తినకుండా వదిలేసేవారు 15 శాతం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అటువంటివారికి భారీ జరిమానా విధించేందుకు ఈ కఠిన చట్టాన్నిఅమలుపరుస్తోంది. ప్రపంచంలో ఎంతోమంది తిండి లేక నానా ఇక్కట్లూ పడుతున్నారు. మరోపక్క అవసరానికి మించి ఆహారం కొనుగోలు చేసి వృధా చేసేవారూ అధికంగానే ఉన్నారు. దీన్ని అరికట్టాలన్నదే ఫ్రాన్స్ ప్రభుత్వ లక్ష్యం. అందుకే అక్కర్లేని పదార్థాలను సేవా సంస్థలు, ఆహార బ్యాంకులకు దానం చేయమని సూచిస్తోంది. పారిస్ కు దగ్గరలోని కౌర్బివాయి కౌన్సిలర్... ఆరాష్ దెరాంబర్ష్ ప్రవేశ పెట్టిన పిటిషన్ ను ఫ్రెంచ్ సెనేట్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 400 స్క్వేర్ మీటర్లు, అంతకు మించి ఉన్న సూపర్ మార్కెట్లన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం 3750 యూరోల జరిమానా విధిస్తుంది. ఆహార పదార్థాల వృధాను అరికట్టేందుకు ఇదే చట్టాన్ని ఇప్పుడు యూరప్ లోని అన్ని సూపర్ మార్కెట్లకు వ్యాప్తి చేసేందుకు ఆరాష్ దెరాంబర్ష్ కృషి చేస్తున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లలోని ఆహారం... వృధా కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని ఆయన అంటున్నారు. -
'అంతా ఓకే కానీ ఇప్పుడు కాదు'
న్యూఢిల్లీ: భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించే ఒప్పందం సరైన దారిలోనే ముందుకుపోతుందని, అయితే ఇది ఈ పర్యటనలోనే పూర్తయ్యే విషయం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు ఆదివారం భారత్ చేరుకున్న ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరు దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం కీలకం కానుందని హోలండే తెలిపారు. రాఫెల్ యుధ్దవిమానాల కొనుగోలుకు రూ 60 వేల కోట్లతో భారత్.. ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి భారత్ పొందనుంది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి సాంకేతికపరమైన కారణాల నేపథ్యంలో మరికొంత కాలం ఆగక తప్పదని హోలండే తెలిపారు. -
కెనడా...
పేరులో నేముంది మనకు ఒక కెనడా ఉంది. కెనడాలో వలే విశాలమైన రహదారులతో ఉన్న ఊరు కాబట్టి ‘కో కెనడా’ అయ్యి అది కాస్తా ‘కాకినాడ’ అయ్యిందని అంటారు. మరి కెనడాకు ఆ పేరు ఎలా వచ్చింది. కెనడాలో ఉన్న మూలవాసుల తండాలను నాటి ఫ్రెంచ్ పాలకుల హయాంలో ‘కెనటా’ అని అనేవారట. ‘కెనటా’ అంటే పల్లె, గూడెం అని అర్థం. ఆ తర్వాత ఆ కాలనీలకు బ్రిటిష్‌వారు వచ్చి పాలించారు. ఆ సమయంలో ఏదో ఒక ఊరు, పల్లె కాకుండా మొత్తం ప్రాంతమే ‘కెనడా’గా రూపాంతరం చెందింది. ఇంకొకటి కూడా చెబుతారు. నాటి స్పానిష్ పోర్చుగీసువారు ఈ ప్రాంతంలో బంగారం కోసం, వెండి కోసం తెగ వెతుకులాడి ఏమీ దొరక్క అందరికీ ‘కా నడా’ (నథింగ్ హియర్) అని చెప్పడం మొదలుపెట్టారు. అలా కూడా ఈ ప్రాంతం కెనడా అయి ఉండొచ్చని అంటారు. దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ దేశంలో ఉన్న జనాభా కేవలం మూడున్నర కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాభా కంటే తక్కువమన్నమాట. -
జీవరసాయన ఆయుధాల దాడి జరగొచ్చు!
పారిస్: కరుడుగట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జీవరసాయన ఆయుధాలతో దాడికి పాల్పడే అవకాశం ఉందని గురువారం ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయల్ వాల్స్ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్‌లో జరిగిన భయంకర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో గురువారం ఫ్రెంచ్ పార్లమెంట్ దిగువ సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'ఉగ్రవాదుల నుండి జీవరసాయన దాడులు జరిగే అవకాశం ఉంది. రసాయనాలు లేదా బాక్టీరియాతో ఉగ్రవాదులు ఫ్రాన్స్‌పై దాడి జరపొచ్చు. ఇలాంటి దాడుల నుండి బయటపడటానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మనం ఏ విషయాన్ని తోసిపుచ్చలేం' అన్నారు. దాడుల నేపథ్యంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని పొడగించడానికి పార్లమెంట్ అనుమతి కోరారు. భయంకరమైన దాడులకు ఊహించలేనన్ని అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారని మాన్యుయల్ వాల్స్ తెలిపారు. ఈ విషయాలను మనసులో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
జీశాట్- 15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
-
జరిగిపోయినట్లుగా అనిపించే అనుభవం ‘డెజా...వూ!’
మెడి క్షనరీ ఇది మనందరికీ నిత్యం అనుభవంలోకి వచ్చే విషయమే. కాకపోతే చాలామందికి ఇది ఒక సాధారణ అంశమనీ, దానికి వైద్యపరిభాషలో ఒక పేరుందనీ తెలియకపోవచ్చు. దాని పేరే ‘డెజా...వూ’ (ఛ్ఛ్జ్చీఠిఠ)! ఈ ఫ్రెంచ్ మాటకు ‘అప్పటికే కనిపించిన దృశ్యం’ అని అర్థం. ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు... ‘అరె... ఇది గతంలో మనకు అనుభవంలోకి వచ్చిన విషయమే కదా’ అనిపిస్తుంటుంది. మెదడులో జరిగే కొన్ని తప్పుడు ప్రక్రియల వల్ల మనకు ఇలా ముందే జరిగిన సంఘటనే పునరావృతమైనట్లుగా తోస్తుంది. ఆ సమయంలో జరిగే సంభాషణలూ ముందే తెలిసినట్లుగా మనకు అనిపిస్తుంటాయి.