జెరూసలేం: ఎవరెన్ని ఏం చెప్పినా, ఏ దేశం తమకు మద్దతు ఇవ్వకపోయినా తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తమదే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
దాదాపు 200 క్షిపణులతో (మిసైల్స్) ఇరాన్‌లో బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని, దాడుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్)ప్రకటించింది. ఆ ప్రతిపాదనలను ప్రధాని నెతన్యాహుకి పంపినట్లు వెల్లడించింది. నెతన్యాహు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తమ పనిని మొదలుపెడతామని ఐడీఎఫ్ తెలిపింది.
ఈ ప్రకటన అనంతరం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్‌కు తాము సరఫరా చేస్తున్న అణ్వాయుధాలను నిలిపి వేస్తున్నట్లు అధికారంగా వెల్లడించారు. ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు.
అయితే మాక్రాన్ నిర్ణయాన్ని నెతన్యాహు ఖండించారు. ఫాన్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తాము అవమానకరంగా భావిస్తున్నట్లు ఓ వీడియోని విడుదల చేశారు. ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నప్పుడు, నాగరిక దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు నిలబడాలి’ అని నెతన్యాహు కోరారు. అయినా మాక్రాన్, ఇతర పాశ్చాత్య నాయకులు ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఆయుధాల ఆంక్షలు విధించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటుగా అభివర్ణించారు.
గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ ,సిరియాలోని షియా మిలీషియా, వెస్ట్ బ్యాంక్‌లోని ఉగ్రవాదులతో చేస్తున్న ఇజ్రాయెల్ పోరాటాలను ఎత్తి చూపారు.
ఇరాన్ తన మిత్రదేశాలకు ఆయుధాలను పరిమితం చేసిందా అని ప్రశ్నిస్తూ.. కాదు.. ఇరాన్‌ను వ్యతిరేకించే దేశాలు.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాల్ని పంపడాన్ని ఆపేయడం ఎంత అవమానకరం అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, నెతన్యాహు వారి మద్దతు ఉన్నా,లేకుండానే ఇజ్రాయెల్ గెలుస్తుందని పునరుద్ఘాటించారు. కాగా,ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాలు పంపడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్‌కు పలుదేశాలు మద్దతు పలుకుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment