emmanuel macron
-
కలిసి నడుద్దాం.. కలిమి సాధిద్దాం
పారిస్: వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులతోపాటు కీలక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ నిర్ణయించుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంతోపాటు అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల నడుమ పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఇరుదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతూ బలీయమైన శక్తులుగా ఎదగాలన్నదే తమ ఆశయమని పేర్కొన్నారు. ప్రజా బాహుళ్యానికి సామాజికంగా, ఆర్థికంగా లబ్ధి చేకూర్చడానికి, పర్యావరణ పరిరక్షణకు కృత్రిమ మేధ(ఏఐ)ను సవ్యదిశలో ఉపయోగించుకొనేలా చర్యలు తీసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని ఇద్దరు నేతలు ఉద్ఘాటించారు. నరేంద్ర మోదీ, ఇమ్మానుయేల్ మాక్రాన్ బుధవారం సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి మాసే నగరానికి విమానంలో వెళ్తూ చర్చల్లో పాల్గొన్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సుదృఢమైన సంబంధాలే లక్ష్యంగా విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు సైతం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఏడాది ద్వైపాక్షిక సహకారం విషయంలో డిజిటల్ హెల్త్, యాంటీ–మైక్రోబియల్ రెసిస్టెన్స్, రెండు దేశాల మధ్య ఆరోగ్య నిపుణుల మార్పిడిని ప్రాధాన్య అంశాలుగా గుర్తించారు. 2026లో ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని మోదీ, మాక్రాన్ తేల్చి చెప్పారు. ఈ అంశంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాలపై పరస్పరం సమన్వయంతో పని చేయాలని అంగీకారానికి వచ్చారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్నామని మాక్రాన్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య బంధం గత 25 ఏళ్లుగా నానాటికీ బలపడుతోందని, బహుముఖ భాగస్వామ్యంగా రూపాంతరం చెందుతోందని ఇరువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రక్షణ, పౌర అణు ఇంధనం, అంతరిక్షం వంటి కీలక వ్యూహాత్మక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మోదీ, మాక్రాన్ సమీక్షించారు. వచ్చే సంవత్సరాన్ని ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’గా జరుపుకోబోతున్న నేపథ్యంలో నవీన ఆవిష్కరణల్లో పరస్పర సహకారానికి అత్యధిక ప్రాధాన్యం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ గౌరవార్థం అధ్యక్షుడు మాక్రాన్ మాసే సమీపంలోని కసీస్ పట్టణంలో రాత్రి విందు ఇచ్చారు. త్వరలో భారత్‌లో పర్యటించాలని మాక్రాన్‌ను మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉమ్మడిగా అణు రియాక్టర్ల అభివృద్ధి ఇంధన భద్రత, కర్బన రహిత ఆర్థిక వ్యవస్థకు అణు విద్యుత్ ఉత్పత్తి చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ, ఇమ్మానుయేల్ మాక్రాన్ అభిప్రాయపడ్డారు. అత్యాధునిక న్యూక్లియర్ రియాక్టర్లను ఉమ్మడిగా అభివృద్ధి చేసుకోవడానికి వారు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్ఎంఆర్), అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్లు(ఏఎంఆర్)ల అభివృద్ధికి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారతీయ జవాన్లకు నివాళులు మాసే సిటీకి చేరుకున్న మోదీ, మాక్రాన్‌లకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాసేలోని చరిత్రాత్మక మజర్‌గిస్ శ్మశాన వాటికను మోదీ, మాక్రాన్ సందర్శించారు. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచయుద్ధంలో ప్రాణత్యాగాలు చేసిన భారతీయ సైనికులకు ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి ఇండియన్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. సావర్కర్‌కు మోదీ నివాళులు భారత స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌కు మాసే సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాళులరి్పంచారు. సముద్ర తీరప్రాంత నగరమైన మాసే నుంచే సావర్కర్ సాహసోపేతంగా తప్పించుకొనేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సావర్కర్‌ను బ్రిటిషర్ల కస్టడీకి అప్పగించవద్దంటూ అప్పట్లో మాసే ప్రజలు, ఫ్రెంచ్ కార్యకర్తలు ఉద్యమించారని వివరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఉద్ఘాటించారు. సావర్కర్ ధైర్యసాహసాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని కొనియాడారు. 1910 జూలై 8న మాసేలో బ్రిటిషర్ల ఓడలో బందీగా ఉన్న సావర్కర్ అక్కడి నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, ఫ్రెంచ్ అధికారులు ఆయనను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ బ్రిటిషర్లకు అప్పగించారు. తర్వాత సావర్కర్‌కు బ్రిటిష్ పాలకులు జీవిత ఖైదు విధించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలుకు తరలించారు. ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ బుధవారం మాసే సిటీలో భారత నూతన కాన్సులేట్‌ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారతీయులు, ఫ్రాన్స్ పౌరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ దేశ జాతీయ జెండాలు చేతబూని సందడి చేశారు. మా యువ శక్తిపై పందెం కాయొచ్చు ప్రధాని మోదీ పారిస్‌లో గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ)తో భారత్‌కు లభించే అవకాశాలపై వారు చర్చించారు. ఇండియాలో డిజిటల్ పరివర్తన కోసం గూగుల్, ఇండియా ఎలా కలిసి పని చేయాలన్నదానిపై మాట్లాడుకున్నారు. మోదీతో సమావేశమైన ఫొటోలను సుందర్ పిచాయ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దీనిపై మోదీ ప్రతిస్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం కృత్రిమ మేధను సమర్థంగా ఉపయోగించుకొనే విషయంలో ఇండియా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అవకాశాల గనిగా మారిన భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘మా యువ శక్తిపై మీరు పందెం కాయొచ్చు’’ అని పెట్టుబడిదారులకు సూచించారు. అమెరికాకు పయనమైన మోదీ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని అమెరికాకు బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన సమావేశం కానున్నారు. మెర్సియిల్ ఎయిర్‌పోర్టులో మోదీకి మాక్రాన్ వీడ్కోలు పలికారు. ‘థాంక్యూ ఫ్రాన్స్’ అంటూ మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫ్రాన్స్ పర్యటన ఫలవంతంగా జరిగిందన్నారు. -
ఫ్రాన్స్‌లో ప్రధాని
న్యూఢిల్లీ: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. రక్షణ మంత్రి సెబ్ లెకొర్నూ ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం దారి పొడవునా, హోటల్ వద్ద బారులు తీరిన భారతీయుల సమూహానికి మోదీ అభివాదం చేశారు. సాయంత్రం మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలు కూడా విందులో పాల్గొన్నారు. పారిస్‌లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు మాక్రాన్‌తో కలిసి మోదీ ఆతిథ్యమిస్తున్నారు. మంగళవారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అనంతరం బుధవారం చారిత్రక నగరం మార్సెయిల్లో భారత్ తొలి కాన్సులేట్‌ను మాక్రాన్‌తో కలిసి ప్రారంభిస్తారు. కడారచ్లో ఫ్రాన్స్, భారత్, పలు ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్‌ను సందర్శిస్తారు. తర్వాత ఫ్రాన్స్ గడ్డపై మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలర్పించిన భారత సైనికులకు మజారŠగ్స్ వార్ సిమెట్రీ వద్ద నేతలిద్దరూ నివాళులర్పిస్తారు. అనంతరం మోదీ అమెరికా బయల్దేరి వెళ్తారు. ప్రధానిగా ఫ్రాన్స్‌లో మోదీకి ఇది ఆరో అధికారిక పర్యటన. గతేడాది భారత్–ఫ్రాన్స్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్ల వేడుక జరుపుకున్నాయి. ఇరు దేశాల భాగస్వామ్యం ఇన్నొవేషన్లు, టెక్నాలజీ, మారిటైం, రక్షణ సహకారం, ఉగ్రవాదంపై పోరు, ఆరోగ్యం, సంప్రదాయేతర ఇంధన వనరులతో పాటు పలు రంగాలకు విస్తరించిందని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొంది. మాక్రాన్ ఆహా్వనం మేరకు మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. యూఎస్‌తో బంధం బలోపేతం తన అమెరికా పర్యటన ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘టెక్నాలజీ, వర్తకం, రక్షణ, ఇంధన, సరఫరా తదితర రంగాల్లో అమెరికాలో బంధాన్ని సుదృఢం చేసే అజెండా రూపకల్పనకు నా పర్యటన దోహదం చేయనుంది. ట్రంప్ తొలి హయాంలో పలు అంశాలపై ఆయనతో సన్నిహితంగా కలిసి పని చేశా. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి భేటీ అవబోతున్నా. నా మిత్రున్ని కలిసేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా’’ అంటూ ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఎక్స్‌లో పేర్కొన్నారు. -
ఫ్రాన్స్ ప్రధానిగా ఫ్రాంకోయిస్
ప్యారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇ మ్మానుయేల్ మాక్రాన్ శుక్ర వారం అధికార కూటమికి చెందిన నేత ఫ్రాంకోయిస్ బైరూ పేరు(73)ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. గత వారం నేషనల్ అసెంబ్లీ పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో ఓడిపోవడంతో మైకేల్ బెర్నియర్ ప్రభుత్వం గద్దె దిగడం తెలిసిందే. ఫ్రాన్సు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న బైరూ అందరికీ తెలిసిన వ్యక్తి. పార్లమెంట్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే సత్తా బైరూకు ఉందని భావిస్తున్నారు. -
ఉక్రెయిన్‌లో తక్షణమే శాంతి నెలకొనాలి
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తక్షణమే ఆగిపోవాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. పారిస్‌లో శనివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్‌లో.. ‘రష్యాతో వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. ‘అవసరమే లేని యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్లు రెండూ వేలాదిగా సైనికులను పోగొట్టుకున్నాయి. అందుకే చర్చలు ప్రారంభించి, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి. ఎన్నో ప్రాణాలు అనవసరంగా బలయ్యాయి. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌తో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని అంతకుముందు జెలెన్స్కీ పేర్కొన్నారు. ‘శాంతి ఒప్పందంతో మాకు న్యాయం జరగాలి. రష్యా, పుతిన్, ఇతర దురాక్రమణదారులు ఇలాంటి యుద్ధాలకు దిగే అవకాశం మళ్లీ ఇవ్వరాదు’అని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని, మరో 3.70 లక్షల మంది క్షతగాత్రులయ్యారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనని రష్యా ట్రంప్ ప్రకటనపై ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే, అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంతకాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటనను గుర్తు చేసింది.నాటో నుంచి బయటికొస్తాంనాటో నుంచి అమెరికా బయటికి వచ్చే విషయం ఇప్పటికీ తమ పరిశీలనలో ఉందని, అది సాధ్యమేనని ట్రంప్ ఎన్బీసీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నాటోలో అమెరికా బలగాలుండాలంటే బదులుగా యూరప్, కెనడా ప్రభుత్వాలు అందుకయ్యే వ్యయం భరించాలి. అప్పుడే వాళ్లు మమ్మల్ని సమభావంతో చూస్తున్నట్లు లెక్క. అలాగైతేనే మేం నాటోలో కొనసాగుతాం’ అని ఆయన స్పష్టం చేశారు. యూరప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా గతంలోనే ఆయన ప్రశ్నించడం తెల్సిందే. -
పదవి నుంచి తప్పుకోను: మాక్రాన్
పారిస్: పదవీకాలం ముగిసేదాకా కొనసాగుతానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు. కొత్త ప్రధానిని మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రధాని మైకేల్ బార్నియర్ రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాక్రాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఫ్రెంచ్ ఫార్ రైట్, హార్డ్ లెఫ్ట్ పార్టీలు రిపబ్లికన్ వ్యతిరేక ఫ్రంట్‌కు సహకరిస్తున్నాయని ఆరోపించారు. ‘‘నా నిర్ణయాలపై వ్యతిరేకతతో రాజకీయ ప్రత్యర్థులు గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి దృష్టి ప్రజల సమస్యలపై కాదు. కేవలం అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది’’ ని విమర్శించారు. తదుపరి ప్రధాని ఎవరనే దానిపై మాక్రాన్ సంకేతాలివ్వలేదు. రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్, అంతర్గత మంత్రి బ్రూనో రిటైల్లీయు, ఫ్రాంకోయిస్ బేరూ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. -
దిక్కులు చూస్తున్న ఫ్రాన్స్!
యూరప్ దేశాల్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న ఫ్రాన్స్ సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణిస్తున్నది. దేశాన్ని చుట్టుముట్టిన అనిశ్చితి పోవాలంటే ఎన్నికలొక్కటే మార్గమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్ ఆర్నెలల క్రితం భావించి పార్లమెంటు రద్దుచేశారు. కానీ మొన్న జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో సమస్య మొదటికొచ్చింది. దిక్కుతోచని స్థితిలో రెండు నెలల అనంతరం మైకేల్ బార్నియర్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కానీ అది మూడునెలల ముచ్చటైంది. ఆరు దశాబ్దాల చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైన తొలి ప్రభుత్వం బార్నియర్ దే. అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన అప్రదిష్ట కూడా ఆయనదే. ఫ్రాన్స్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగాల కోత, పరిశ్రమల మూత రివాజుగా మారాయి. అసలే పడిపోయిన నిజ వేతనాలతో, నిరుద్యోగ బెడదతో బతుకులు ఎలా నెట్టుకు రావాలో తెలియక పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు.ప్రజల కొనుగోలు శక్తి క్షీణించటంతో రెస్టరెంట్లు, చిన్నా పెద్దా దుకాణాలు మూసేస్తున్నారు. ఈ దశలో పులి మీద పుట్రలా ప్రభుత్వ వ్యయాన్ని అదుపుచేసే పేరిట బార్నియర్ భారీ కోతలకు దిగారు. ఇది ప్రతిఘటనకు దారితీసింది. పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విరుచుకుపడక ముందు యూరప్ దేశాల్లో అగ్రగాములుగా వెలిగిన జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ 2021నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్థిక స్వస్థతకు తీసుకున్న చర్యలు ఫలించ బోతున్నాయన్న సంకేతాలున్న తరుణంలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడి ఆర్థిక వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. జర్మనీ కొంతవరకూ దీన్ని తట్టుకోగలిగినా ఇంధన సంక్షోభంతో, భారీ వడ్డీ రేట్లతో ఫ్రాన్స్ కుదేలవుతోంది. ఒకపక్క ఊపిరాడనీయని రుణ భారం, మరోపక్క ద్రవ్యలోటు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో సజావుగా నడిచేందుకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకూ పరిశ్రమలకు ప్రభుత్వం ఉదారంగా పంచిన 15,000 కోట్ల యూరోలు ఆవిరైపోయాయి. సరిగదా... ఇంధన ఆధారిత సంస్థలు ఉత్పత్తిని తగ్గించి వేలాదిమందిని తొలగించబోతున్నామని గత నెలలో ప్రకటించాయి. నెక్సిటీ వంటి భారీ నిర్మాణరంగ సంస్థ సైతం తడిసి మోపెడవుతున్న వడ్డీ రేట్ల కారణంగా కొత్త పెట్టుబడులకు వెళ్లటం లేదని తెలిపింది. పర్యవసానంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోక తప్పని స్థితి ఏర్పడింది. ప్రభుత్వ రుణాలు కనీవినీ ఎరుగని రీతిలో 3 లక్షల 20 వేల కోట్ల యూరోలకు చేరాయి. ఇది దేశ జీడీపీ కన్నా 112 శాతం అధికం. గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలను మించి ప్రభుత్వ లోటు 6.1 శాతం చేరుకుంది. సంపన్నులకూ, కార్పొరేట్ సంస్థలకూ ఇచ్చిన పన్ను రాయితీల వల్ల కాస్తయినా ప్రయోజనం లేకపోగా, వచ్చే ఏడాది కనీసం 6,000 కోట్ల యూరోలు పొదుపు చేయటానికి తాత్కాలికంగా పన్నులు పెంచుతామని మొన్న అక్టోబర్‌లో ప్రతిపాదించగానే అంతంత మాత్రంగా నడుస్తున్న సంస్థలు అంతెత్తున లేచాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారమే లేని స్థితిలో ఈ పన్నుల మోతేమిటని ప్రశ్నించాయి.ఫ్రెంచి పౌరులు గర్వపడే పారిస్‌లోని 860 యేళ్లనాటి పురాతన భవంతి నోటర్‌డామ్ కేథడ్రిల్కు 2019లో నిప్పంటుకుని చాలా భాగం ధ్వంసమైనప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వర్తమాన ఆర్థిక స్థితికి అది అద్దం పడుతోందని అనేకులు వ్యాఖ్యానించారు. అయిదేళ్లలో దాన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మేక్రాన్ జయప్రదంగా ఆ పని పూర్తిచేయగలిగారు. కానీ ఆర్థికవ్యవస్థ మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తోంది. మామూలుగా అయితే శనివారం 50మంది ప్రపంచాధినేతలు, కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వగైరాల సమక్షంలో ఆ భవంతి ప్రారంభం కాబోయే వేళ మేక్రాన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. కానీ తాజా రాజకీయ సంక్షోభం ఎదుర్కొనటం ఎలాగో తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.577మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు కావాలి. కానీ వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్‌కు 182, మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 ఉన్నాయి. తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్)కి 143 సీట్లున్నాయి. వామపక్ష ఫ్రంట్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచటం ద్వారా ఆర్ఎన్ ఇప్పుడు బార్నియర్ ప్రభుత్వ పతనానికి కారణమైంది. తన బడ్జెట్ పార్లమెంటులో నెగ్గే స్థితి లేదని తెలిసి రాజ్యాంగంలోని అధికరణ ఉపయోగించి బార్నియర్ దాన్ని అమల్లోకి తెచ్చారు.పర్యవసానంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనక తప్పదని అర్థమైనా ఆయన ఈ మార్గం ఎంచుకున్నారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏడాది గడిస్తే తప్ప... అంటే వచ్చే ఏడాది జూలై వరకూ మళ్లీ ఎన్నికలు జరపకూడదు. కనుక అప్పటివరకూ ఫ్రాన్స్‌కు ఆపద్ధర్మ ప్రభుత్వమే గతి. ఈలోగా తన వైఫల్యాలను అంగీకరించి మేక్రాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిరావొచ్చు. ఫలితంగా దేశానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు. అంతంతమాత్రంగా ఉన్న తమ బతుకులు ఆర్ఎన్ నిర్ణయంవల్ల మరింత అధోగతికి చేరాయని జనం అనుకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్ఎన్ అధినాయకురాలు మెరిన్ లీ పెన్ ఆశలు అడుగంటినట్టే. ఫ్రాన్స్ సంక్షోభం మరింత వికటిస్తే అది మొత్తం యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలను అనిశ్చితిలో పడేస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోసహా అన్ని సంక్షోభాలూ ఆగితేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం యూరప్‌కు సాధ్యమవుతుంది. -
ఏడు వైపులా శత్రువులతో పోరాడుతున్నాం
జెరూసలేం: ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను నిలిపివేస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాçహు మండిపడ్డారు. ‘‘మాక్రాన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఇరాన్ అండదండలు అందిస్తున్న అరాచకశక్తులపై ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇందుకు నాగరిక దేశాలన్నీ మద్దతు ఇవ్వాలి. కానీ ఫ్రాన్స్, ఇతర పశి్చమ దేశాలు మాకు ఆయుధాలివ్వొద్దని నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇది నిజంగా సిగ్గుచేటు’’ అంటూ ఆదివారం దుయ్యబట్టారు. ‘‘మేం ఏడు దిక్కులా శత్రువులతో పోరాడుతున్నాం. గాజాలో హమాస్‌పై, లెబనాన్‌లో హెజ్»ొల్లాపై, యెమెన్‌లో హౌతీలపై, ఇరాక్, సిరియాల్లో షియా మిలిటెంట్లపై పోరాడుతున్నాం. ఇరాన్ ప్రభుత్వం మిలిటెంట్లకు ఆయుధ సరఫరా ఆపడం లేదు. మిలిటెంట్ శక్తులు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. వాటిని వ్యతిరేకిస్తున్న పశి్చమ దేశాలు ఇజ్రాయెల్‌కు ఆయుధాలివ్వడం మాత్రం నిలిపివేస్తున్నాయి’’ అని ఆక్షేపించారు. ఎవరి సహకారమున్నా, లేకపోయినా యుద్ధంలో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. -
మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని
జెరూసలేం: ఎవరెన్ని ఏం చెప్పినా, ఏ దేశం తమకు మద్దతు ఇవ్వకపోయినా తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తమదే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.దాదాపు 200 క్షిపణులతో (మిసైల్స్) ఇరాన్లో బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని, దాడుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్)ప్రకటించింది. ఆ ప్రతిపాదనలను ప్రధాని నెతన్యాహుకి పంపినట్లు వెల్లడించింది. నెతన్యాహు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తమ పనిని మొదలుపెడతామని ఐడీఎఫ్ తెలిపింది.ఈ ప్రకటన అనంతరం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్‌కు తాము సరఫరా చేస్తున్న అణ్వాయుధాలను నిలిపి వేస్తున్నట్లు అధికారంగా వెల్లడించారు. ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు. అయితే మాక్రాన్ నిర్ణయాన్ని నెతన్యాహు ఖండించారు. ఫాన్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తాము అవమానకరంగా భావిస్తున్నట్లు ఓ వీడియోని విడుదల చేశారు. ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నప్పుడు, నాగరిక దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు నిలబడాలి’ అని నెతన్యాహు కోరారు. అయినా మాక్రాన్, ఇతర పాశ్చాత్య నాయకులు ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ఆయుధాల ఆంక్షలు విధించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటుగా అభివర్ణించారు.గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ ,సిరియాలోని షియా మిలీషియా, వెస్ట్ బ్యాంక్‌లోని ఉగ్రవాదులతో చేస్తున్న ఇజ్రాయెల్ పోరాటాలను ఎత్తి చూపారు. ఇరాన్ తన మిత్రదేశాలకు ఆయుధాలను పరిమితం చేసిందా అని ప్రశ్నిస్తూ.. కాదు.. ఇరాన్‌ను వ్యతిరేకించే దేశాలు.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాల్ని పంపడాన్ని ఆపేయడం ఎంత అవమానకరం అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, నెతన్యాహు వారి మద్దతు ఉన్నా,లేకుండానే ఇజ్రాయెల్ గెలుస్తుందని పునరుద్ఘాటించారు. కాగా,ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాలు పంపడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్‌కు పలుదేశాలు మద్దతు పలుకుతున్నాయి. -
ప్రజాభీష్టానికి పాతర
వేసవి ఒలింపిక్స్, పారాలింపిక్స్ – రెండూ పూర్తవడంతో ఫ్రాన్స్‌లో ఆటల వేడి ముగిసిందేమో కానీ, రాజకీయ క్రీడ మాత్రం బాగా వేడెక్కింది. కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ నేత మిషెల్ బార్నియెర్ను దేశ ప్రధానిగా నియమిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ గడచిన గురువారం చేసిన ప్రకటనతో రచ్చ రేగుతోంది. కొద్ది నెలల క్రితం జూన్ 9న పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి, ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి, దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభనకు గురి చేసిన మెక్రాన్ తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన 60 రోజుల తర్వాత తాపీగా ప్రజాతీర్పుకు భిన్నంగా నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన దేశంలో జరిగిన ఈ అపహాస్యమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆగ్రహించిన వేలాది జనం వీధుల్లోకి వచ్చి, ప్రదర్శనలకు దిగింది అందుకే. కొత్త ప్రధాని సారథ్యంలో సరికొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది కానీ, రాజకీయ సంక్షోభం అంచున ఉన్న దేశానికి సారథ్యం వహించడం అగ్నిపరీక్షే. వెరసి ఫ్రాన్స్‌లో అనిశ్చితి తొలగకపోగా, మరింత పెరగనుండడమే వైచిత్రి. నిజానికి, ఫ్రాన్స్‌లో జూలైలో రెండో విడత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీవ్ర మితవాద పక్షమైన ‘నేషనల్ ర్యాలీ’నీ, అలాగే మెక్రాన్‌కు చెందిన ‘రినైజెన్స్ బ్లాక్’నూ వెనక్కి నెట్టారు. వామపక్ష కూటమి ‘న్యూ పాపులర్ ఫ్రంట్’ (ఎన్‌ఎఫ్‌పీ)కి అధిక మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్ఎఫ్పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వమేదీ లేకుండానే మెక్రాన్ కథ నడిపారు. పైగా, అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాన్ని వాడి, వామపక్ష కూటమి ప్రతిపాదించిన అభ్యర్థు లెవరినీ ప్రధానిగా అంగీకరించలేదు. చివరకు ఎన్నికల్లోని ప్రజా తీర్పును అగౌరవిస్తూ, నాలుగో స్థానంలోని పార్టీ తాలూకు వ్యక్తిని ప్రధానిగా దేశాధ్యక్షుడు ఎంపిక చేయడం ఓటర్లకు, అందునా యువతరానికి అమితమైన ఆగ్రహం కలిగించింది. దాని పర్యవసానమే – వేలాదిగా జనం వీధు ల్లోకి రావడం! ఒక రకంగా ఈ ప్రధానమంత్రి ఎంపిక ‘ఎన్నికల చోరీ’ అని పేర్కొంటూ, ఏకంగా దేశాధ్యక్షుడు మెక్రాన్కే ఉద్వాసన పలకాలంటూ వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నంతలో అధిక స్థానాలున్న కూటమికే పగ్గాలు అప్పగించడం విహితమని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ సిద్ధాంతాలను ప్రవచించిన ఘన ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా ఆశిస్తారు. కానీ, 2017 నుంచి విభజన రాజకీయాలు చేస్తున్న ప్రెసి డెంట్ మెక్రాన్ ఎన్నికలలో తన పార్టీ కింద పడ్డా తనదే పైచేయిగా వ్యవహరించారు. వరుసగా చేస్తూ వస్తున్న తప్పుల్ని కొనసాగిస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు. ఆ మాటకొస్తే, రాజకీయాల పట్ల నమ్మకం క్షీణింపజేసే ఇలాంటి చర్యల వల్లనే ఫ్రాన్స్ సహా యూరప్ అంతటా తీవ్ర మితవాదం పైకి ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచినవారికి కనీసం ఏకాభిప్రాయ సాధనకైనా అవకాశమివ్వకుండా అధ్యక్షుడు తన పదవీకాలపు లెక్కలతో తోచిన ఎంపికలు చేయడం అవివేకం. తీవ్ర మితవాదానికీ, దాని జాత్యహంకార, విదేశీయతా విముఖ సిద్ధాంతానికీ పట్టం కట్టరాదన్న ప్రజాభీష్టానికి వ్యతిరేకం. ఈ కొత్త సర్కార్ కింగ్ మేకర్లయిన తీవ్ర మితవాదుల మద్దతుపై ఆధార పడక తప్పని స్థితి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధ్యక్షుడు దేశాన్ని మళ్ళీ చిక్కుల్లోకి నెట్టారు. అలాగని ప్రధానిగా ఎంపికైన 73 ఏళ్ళ బార్నియెర్ మరీ అనామకుడేమీ కాదు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ పక్షాన గతంలో సంప్రతింపులకు సారథ్యం చేసిన వ్యక్తి. ఏకాభిప్రాయ సాధనలో ప్రసిద్ధుడు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోగలి గినవాడు. ముగ్గురు దేశాధ్యక్షుల హయాంలో మంత్రిగా చేసిన ఆయనది యూరోపియన్ అనుకూల వైఖరి. అది వామపక్షాలకు నచ్చవచ్చు. ఇక, వలసల నియంత్రణకు మరింత కఠినమైన నిబంధనలు ఉండాలన్న వాదననే బార్నియెర్ సమర్థిస్తున్నారు. అది కన్జర్వేటివ్‌లకు నచ్చే అంశం. ప్రభుత్వ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో... ప్రధానిగా ఇలాంటి వ్యక్తే సరైనవాడని మెక్రాన్ ఎంచు కున్నారట. కానీ, ఫ్రెంచ్ సమాజం నుంచి ఆమోదం లభించడం, రాజకీయంగా విజయం సాధించడం మెక్రాన్, బార్నియెర్లు ఇద్దరికీ అంత సులభమేమీ కాదు. సుదీర్ఘంగా శ్రమించక తప్పదు. యూకేతో బ్రెగ్జిట్ ఒప్పందం వేళ చేసినట్టే... ఇప్పుడూ ఏదో ఒక రాజీ మార్గంలో, అందరి మధ్య సహకారం సాగేలా కొత్త ప్రధాని చేయగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం. వచ్చే 7 నుంచి 12 ఏళ్ళ లోగా ఫ్రాన్స్ తన ప్రభుత్వ లోటును 10 వేల కోట్లు యూరోల పైగా తగ్గించనట్లయితే, ఇటలీ లాగానే ఫ్రాన్స్ సైతం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 1లోగా కొత్త ప్రధాని, ఆర్థిక మంత్రితో కలసి 2025 బడ్జెట్ ముసాయిదాతో బిల్లుకు రూపకల్పన చేయాల్సి ఉంది. అది అతి కీలకమైన మొదటి అడుగు. అదే సమయంలో దేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడానికే తాను పగ్గాలు చేపట్టినట్టు ఫ్రెంచ్ ప్రజానీకానికి ఆయన నచ్చజెప్పగలగాలి. ఏమైనా, ప్రజలు, పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి విభేదాలతో ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. అది ఈ ఘన ప్రజాస్వామ్యా నికి పెను ముప్పు. ఆ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఇంకా అనేక సమస్యలను కొత్త ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే పాలన పూర్తిగా అటకెక్కిన ఫ్రాన్స్‌ను ఆ దేశపు అతి పెద్ద వయసు ప్రధాని, అధ్యక్షుడు కలసి ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. -
ఫ్రాన్స్ ప్రధానిగా మైకేల్ బార్నియర్
పారిస్: ఫ్రాన్ నూతన ప్రధాని మైకేల్ బార్నియర్‌ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్‌కు 73 ఏళ్ల బార్నియర్ ప్రాతినిధ్యం వహించారు. హంగ్ పార్లమెంటు ఏర్పడటం వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమితో గాబ్రియెల్ అట్టల్ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసినా ఒలింపిక్స్ క్రీడల దృష్ట్యా మాక్రాన్ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రాన్ శిబిరం అన్వేíÙంచింది. చివరకు బార్నియర్‌ను ఎంపిక చేసింది. ‘దేశానికి, ఫ్రెంచ్ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్‌కు అప్పగించాం’ అని మాక్రాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్నియర్ గతంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్ యూనియన్ కమిషనర్‌గా రెండు పర్యాయాలు చేశారు. -
Paris Olympics 2024 : లాహిరి లాహిరి లాహిరిలో...
ఈఫిల్ టవర్ సమీపాన చారిత్రక ‘ట్రొకార్డో’ వద్ద ప్రారంభమైన పరేడ్ సెన్ నదీ తీరం వెంట సాగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్‌తో పాటు దాదాపు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రారంబోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నింటికంటే ముందు సెన్ నదిపై ఉన్న పాంట్ డి ఆస్టర్లిజ్ బ్రిడ్జిపై ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని ఎరుపు, తెలుపు, నీలి రంగులను వెదజల్లుతూ నయనానందకరంగా కార్యక్రమం మొదలైంది. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఫ్రెంచ్ భాషలో ‘ఎన్‌చాంట్’ నినాదంతో పడవలపై ఆటగాళ్ల పరేడ్ మొదలైంది. ఎప్పటిలాగే తొలి ఒలింపిక్స్‌కు వేదికైన గ్రీస్ బృందం అందరికంటే ముందుగా రాగా, ఐఓసీ శరణార్థి టీమ్ దానిని అనుసరించింది. ఫ్రెంచ్ అక్షరమాలలో జట్లు వరుసగా వచ్చాయి. బోట్లు వెళుతున్న సమయంలో ఫ్రెంచ్ సంగీతాన్ని నేపథ్యంలో వినిపించారు. అనంతరం ప్రఖ్యాత పాప్ సింగ్ లేడీ గాగా తన ఆటపాటతో అలరించింది. పారిస్: ప్రారంబోత్సవంలో భాగంగా ఆ తర్వాత ఫ్రాన్స్ దేశపు చరిత్ర, సంస్కృతి, సంగీతం అన్నీ ప్రతిబింబించేలా వరుసగా కార్యక్రమాలు సాగాయి. 80 మంది కళాకారులతో ఫ్రెంచ్ క్యాబరే డ్యాన్స్ ‘కెన్ కెన్’ను ప్రదర్శించగా... పారిస్ ఒలింపిక్ క్రీడలను నిర్వహించడంలో పని చేసిన కార్మికులు, సామాన్య ప్రజలకు అంకితం ఇస్తూ ‘సింక్రానిసిటీ’ పేరుతో షోను ఫ్రాన్స్ పర్యాటక ప్రదేశాల్లో ప్రఖ్యాతమైన ‘నోటర్ డేమ్ క్యాథడ్రిల్’ వద్ద నిర్వహించారు. ఆపై ఫ్రెంచ్ సాహిత్యం విశేషాలు తెలిపే, ఆ దేశపు ప్రస్థానాన్ని తెలిపే థీమ్‌తో ప్రోగ్రాం జరిగింది. ఈ క్రమంలో ఫ్రెంచ్ విప్లవ కాలపు గీతాలను కూడా వినిపించారు. చారిత్రక ల్యూర్ మ్యాజియం, మేడలీన్ చిత్రం తదితర కళాఖండాలను గుర్తుకు తెస్తూ వాటిని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆ తర్వాత ఫ్రెంచ్ సినిమాకు నీరాజనం అంటూ కార్యక్రమం సాగింది. అనంతరం ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించారు. ఈ సమయంలో ఫ్రెంచ్ చరిత్రలో పది మంది ప్రముఖ మహిళల బంగారు విగ్రహాలను ప్రదర్శించారు. 78 మందితో మన బృందం... బోట్లపై పరేడ్‌లో 84వ స్థానంలో భారత జట్టు వచ్చింది. ఫ్లాగ్ బేరర్లు పీవీ సింధు, ఆచంట శరత్ కమల్ ముందుండి భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించగా... ఇతర అథ్లెట్లు కూడా చేతుల్లో చిన్న పతాకాలతో అభివందనం చేశారు. ఒలింపిక్స్‌లాంటి విశ్వ సంబరంలో పాల్గొంటున్న ఆనందం అందరిలోనూ కనిపించింది. దీపిక కుమారి, లవ్లీనా బొర్గొహైన్, మనికా బత్రా, రోహన్ బోపన్న, సుమీత్ నగాల్, శ్రీరామ్ బాలాజీ తదితరులు పరేడ్‌లో భాగమయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ నుంచి ఆటగాళ్లు, అధికారులు కలిపి మొత్తం 78 మంది పాల్గొన్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, పారిస్ ఒలింపిక్స్‌లో భారత చెఫ్ డి మిషన్ గగన్ నారంగ్ కలిసి ఈ బృందాన్ని ఎంపిక చేశారు. శనివారం పోటీలో పాల్గొనే ప్లేయర్లతో పాటు ఇంకా పారిస్‌కు చేరుకోని అథ్లెట్లు, వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు ఈ కార్యక్రమంలో భాగం కాలేదు. శనివారం తమ పోటీలు లేని షూటర్లు అంజుమ్, సిఫ్ట్ కౌర్, ఐశ్వర్య ప్రతాప్, అనీశ్ కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. భారత హాకీ జట్టు నేడు న్యూజిలాండ్‌తో తలపడనుండటంతో జట్టులోని రిజర్వ్ ఆటగాళ్లు మాత్రమే హాజరయ్యారు. ‘తస్వ’ డిజైన్లతో... ప్రారంబోత్సవ కార్యక్రమంలో భారత బృందం ధరించిన డ్రెస్‌లను ప్రముఖ కంపెనీ ‘తస్వ’ తయారు చేసింది. పురుషుల డ్రెస్‌లలో, మహిళల చీరకట్టులో కూడా అంచులను భారత త్రివర్ణ పతాకపు మూడు రంగులతో డిజైన్ చేశారు. ‘తస్వ’ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందినది కాగా... ఇందులో భాగంగా ఉన్న ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని పర్యవేక్షణలోనే భారత టీమ్ డ్రెస్ రూపకల్పన జరిగింది. మరో వైపు మన ఆటగాళ్లు పోటీల్లో పాల్గొనే సమయంలో ఉపయోగించే కిట్లను ప్రముఖ సంస్థ జిందాల్ గ్రూప్‌నకు చెందిన ‘ఇన్‌సై్పర్’ రూపొందించింది. జిందాల్ గ్రూప్ గతంలో 2022 కామన్వెల్త్ క్రీడల్లో, 2023 ఆసియా క్రీడల్లో కూడా భారత బృందానికి కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు వాడే స్పోర్ట్స్ కిట్లను డిజైనర్ ఆఖిబ్ వాని రూపొందించాడు. నీరజ్ చోప్రా, మనూ భాకర్, మనికా బాత్రా తదితర ఆటగాళ్లు జిందాల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ గ్రూప్‌లో భాగంగా ఉన్నారు. -
2024 ప్యారిస్ ఒలింపిక్స్: స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, ఛైర్మన్ నీతా అంబానీ 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారిస్‌లో జరుగుతున్న 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌కు నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించిన మాక్రాన్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా నీతాకు శుభాకాంక్షలు తెలిపారు.ఫ్రాన్స్ రాజధాని నగరంలో జరిగిన లూయిస్ విట్టన్ ఫౌండేషన్‌లో జరిగిన 142వ ఐఓసీ షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతా అంబానీ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన ఎరుపు రంగు సూట్‌ను ధరించారు. గోల్డెన్ థ్రెడ్‌వర్క్ డ్రెస్‌లో చాలా నిరాడంబరమైన ఆభరణాలతో నీతా అందంగా, హుందాగా కనిపించారు..కాగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు శుక్రవారం, జూలై 26న జరగనున్నాయి. అధికారిక ప్రారంభోత్సవానికి ముందు జూలై 24న కొన్ని క్రీడలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఒలింపిక్స్‌లో 206 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10,500 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆగస్టు 11న ముగుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా చాలా పాపులర్. ఇటీవల తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. -
ఫ్రాన్స్ గమ్యం ఎటు?
అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆదివారం రెండో రౌండ్ ఎన్నికల్లో వోటర్లు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా ఫ్రాన్స్‌లో సందిగ్ధత నెలకొంది. తొలి రౌండులో స్పష్టంగా మితవాదం వైపు మొగ్గినట్టు కనిపించిన వోటర్లు హఠాత్తుగా దారి మార్చి ఇతర పక్షాలను తలకెత్తుకున్న వైనం బహుశా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. 577 మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు రావాలి. కానీ తాజా ఫలితాల తర్వాత వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ 182 (తొలి రౌండ్లో రెండో స్థానం) సీట్లతో అగ్రభాగాన ఉండగా అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 (తొలి రౌండ్లో మూడోస్థానం) వచ్చాయి. తొలి రౌండ్లో 32 శాతం వోట్లు సాధించుకుని అధికార పీఠానికి చేరువగా వెళ్లినట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) రెండో రౌండ్లో సీట్లపరంగా 143తో మూడో స్థానానికి పరిమితమైంది. ఆర్ఎన్ పార్టీ తొలి రౌండ్లో అగ్రభాగాన ఉండటంతో ఇతర పక్షాల వోటర్లు అప్రమత్తమయ్యారు. మితవాద పక్షానికి పాలనాపగ్గాలు దక్కనీయరాదన్న కృతనిశ్చయంతో అటు మధ్యేవాద పక్షానికీ, ఇటు వామపక్షానికీ వోటేశారు. తొలి దశలో 65 శాతం, రెండో దశలో 63 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1981 తర్వాత ఈ స్థాయి వోటింగ్ ఎప్పుడూ లేదు. ఆర్ఎన్ గెలుపు ఖాయమని తేలినచోట్ల వామపక్ష కూటమి, మధ్యేవాద కూటమి అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగి ముఖాముఖి పోటీకి మార్గం సుగమం చేశారు. కనీసం 200 స్థానాల్లో బహుముఖ పోటీ బెడద తప్పింది. దీని ప్రభావం ఎంతగా ఉందంటే... ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతం లా సార్ద్లోని అయిదు స్థానాల్లో ఆర్ఎన్ తొలి రౌండ్లో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. తీరా ముఖాముఖి పోటీలో ఆ పార్టీకి ఒక్కటీ దక్కలేదు.రాజకీయ అస్థిరత ఫ్రాన్స్‌కు కొత్తగాదు. 1946–’58 మధ్య పన్నెండేళ్లలో ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. అయితే అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ప్రచ్ఛన్న యుద్ధ దశ మొదలైన తొలినాళ్ల కాలం. భవిష్యత్తులో మరెప్పుడూ దేశం సంకీర్ణాల జోలికి పోకుండా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ నూతన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పటికీ అదే అమల్లోవుంది. ఎన్నికల్లో భిన్నపక్షాలు కూటమిగా పోటీ చేయటం, నెగ్గితే కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయటం ఫ్రాన్స్‌లో సాధారణమే. కానీ కూటమిలో అధిక స్థానాలొచ్చిన పార్టీయే తన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి భిన్నమైనది. ఒక పార్టీగా అత్యధిక స్థానాలు గెల్చుకున్నది ఆర్ఎన్ ఒక్కటే. చిత్రమేమంటే అటు ఆర్ఎన్లోనూ, ఇటు న్యూ పాపులర్ ఫ్రంట్‌లోనూ మేక్రాన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయలేని స్థితిలో పాలనలో పాలుపంచుకోవటం వృథా అని ఇరుపక్షాల నేతలూ భావిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రజల్లో మేక్రాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన పార్టీతో కలిస్తే ఆ చీడ తమకూ అంటుతుందన్న భయాందోళనలు ఇరుపక్షాల్లోనూ ఉన్నాయి. అందుకే విస్తృత మధ్యేవాద కూటమిని ఏర్పాటు చేయాలన్న మేక్రాన్ ప్రయత్నం ఫలించకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. ఈనెల 26న ప్యారిస్ ప్రధాన వేదికగా ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ ఘట్టం ప్రారంభం కాబోతోంది. 16 నగరాల్లో ఆగస్టు 11 వరకూ వివిధ ఈవెంట్లు జరగబోతున్నాయి. ఈ దశలో దేశంలో రాజకీయ అస్థిరత అలుముకుంటే ఎలాగన్న ఆందోళన అన్ని పక్షాల్లోనూ ఉంది. తమ కూటమికి అత్యధిక స్థానాలొచ్చాయి గనుక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వామపక్ష అన్బౌడ్ నేత జీన్ లక్ మెలింకోన్ కోరుతున్నారు. మితవాద ఆర్ఎన్ పార్టీని రానీయకూడదన్న పట్టుదలతో సోషలిస్టులు, వివిధ వామపక్షాలూ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి తప్ప వాటి మధ్య లుకలుకలు తక్కువేమీ కాదు. అన్బౌడ్ పార్టీ భావసారూప్య పక్షాలన్నిటినీ ఒక గొడుగు కిందకు తెచ్చిందన్న మాటేగానీ ఆ పార్టీకి తలొగ్గి ఇతర పక్షాలు పనిచేస్తాయా అన్నది సందేహమే. సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేకపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లకతప్పదు. అదే జరిగితే వామపక్ష కూటమికి ఇప్పుడు దక్కిన ఆదరణ ఆవిరయ్యే ప్రమాదం, ఆర్ఎన్ మరింత పుంజుకునే అవకాశం ఉంటాయి. మెలింకోన్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఆయన దుందుడుకు విధానాలు ఇంటా బయటా సమస్యాత్మకం కావొచ్చని, ముఖ్యంగా యూరప్ యూనియన్ (ఈయూ)తో పేచీలు తేవచ్చునని భయాందోళనలున్నాయి. ఈయూలో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌దే. నాజీల దురాక్రమణతో సంక్షోభాన్నెదుర్కొన్న ఫ్రాన్స్‌లో మితవాదపక్షానికి ఆది నుంచీ ఆదరణ లేదు. కానీ ఆర్ఎన్ అధినేత మెరిన్ లీ పెన్ తెలివిగా జాత్యహంకారం, యూదు వ్యతిరేకత వంటి అంశాల్లో పార్టీ విధానాలను సవరించుకున్నారు. విద్వేష ప్రసంగాలతో తరచు జైలుపాలైన తన తండ్రి మెరీ లీపెన్‌ను పార్టీ నుంచి సాగనంపారు. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని కూడా వెనకేసుకొచ్చారు. ఫ్రాన్స్ రాజ్యాంగంలోని 12వ అధికరణం కింద కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నిర్దిష్ట వ్యవధంటూ లేదు. అలాగని దీర్ఘకాలం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే అది మేక్రాన్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొస్తుంది. మొత్తానికి మూడు పక్షాల్లోనూ ఎవరూ మరొకరితో కలవడానికి ఇష్టపడని వర్తమాన పరిస్థితుల్లో మేక్రాన్ ఏం చేస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా అవిశ్వాస తీర్మాన గండం తప్పదు. మెడపై మితవాద బెడద వేలాడుతున్న తరుణంలో చివరకు ఫ్రాన్స్ గమ్యం ఏమిటన్నది మిలియన్ యూరోల ప్రశ్న! -
అంచనాలు తలకిందులు.. హంగ్ దిశగా ఫ్రాన్స్ ఫలితాలు!
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 577 స్థానాలకుగాను మూడు పార్టీల కూటములకు స్పష్టమైన తీర్పు రాలేదు. అంచనాలు తలకిందులై ఫ్రాన్స్‌లో ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు రాకుండా హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 289 ఎంపీ సీట్లు గెలవాలి.ఇక మొదటి దశ పోలింగ్‌లో అతివాద కూటమి నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) 33 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. లెఫ్ట్ వింగ్ న్యూ పాపులర్ ఫ్రంట్(ఎన్‌ఎఫ్‌పీ) కూటమి 28 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. అయితే అధికార ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కేవలం 21 శాతం ఓటు షేర్‌తో మూడోస్థానానికి పరిమితమైంది. ఇక.. ఆదివారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో లెఫ్ట్ పార్టీ న్యూ పాపులర్ ఫ్రంట్ అనూహ్యంగా 182 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 289 సీట్లు రావాల్సింది ఉంది. మొదటి రౌండ్ పోలింగ్‌లో అత్యధిక పాపులర్ ఓటు షేర్ సంపాధించిన రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ రెండో దశ పోలింగ్ అనంతరం 143 స్థానాలు మాత్రమే గెలచుకొని మూడో స్థానంలోకి వెళ్లింది. ఇక అధికార మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కూటమి 163 ఎంపీ స్థానాలు గెలచుకొని రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మొదటి నుంచి ఈసారి ఎన్నికలల్లో రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ పార్టీ అధిక సీట్లు గెలచుకొని అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు జోస్యం చెప్పాయి. అంచనాలను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా లెఫ్ట్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని మొదటి స్థానంలోకి రాగా.. రైట్ వింగ్ పార్టీ మూడో స్థానంలోకి వెళ్లింది. ఈ అనూహ్య ఫలితాలతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే.. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వచ్చారు. ప్రస్తుతం ఫలితాలతో ఏ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందనే ఆసక్తి నెలకొంది. -
ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండ్లో విపక్ష కూటమి గెలుపు
పారిస్: ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దేశాధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్లో మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. తొలి దశలో పోలైన 68 శాతం ఓట్లలో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి ఏకంగా 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టింది. న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమికి 27.99 శాతం వచ్చాయి. మేక్రాన్ పార్టీ 20.04 శాతంతో సరిపెట్టుకుంది. జూలై 7న రెండో రౌండ్ పోలింగ్ ఉంటుంది. గత నెలలో ఈయూ ఎన్నికల్లో కూడా నేషనల్ ర్యాలీ పార్టీయే విజయం సాధించింది. -
ఫ్రాన్స్ ఎన్నికలు: మెక్రాన్‌కు ఎగ్జిట్‌పోల్స్ గుబులు
పారిస్: ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫ్రాన్స్ పార్లమెంటరీ ఎన్నికల్లో.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు ఘోర పరాభవం తప్పదా?. ఇప్పటికప్పుడు అంచనాకి రాలేకపోయినప్పటికీ.. తొలి రౌండ్ పోలింగ్ అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి గుబులు పుట్టిస్తున్నాయి. ఆ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ కూటమి స్థానానికే పరిమితమవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలకు తొలి రౌండ్ పోలింగ్ ముగిసింది. అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మెరైన్ లే పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ(RN)కు అనుకూలంగా వచ్చాయి. ఆర్ఎన్ పార్టీకి 34 శాతం ఓటింగ్‌తో.. గెలుపు దిశగా దూసుకెళ్తోందని సర్వే సంస్థలు వెల్లడించాయి. మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి 20.5-23 శాతం ఓటింగ్ రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. న్యూ పాపులర్ ఫ్రంట్(NFP) కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయని వెల్లడించాయి. అయితే ఈ నెల ఏడున మలి విడత పోలింగ్ జరగనుంది. ఆ తర్వాతే పూర్తి స్థాయి ఫలితంపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతి మితవాదులు(RN Party) ఘన విజయం సాధించడంతో మెక్రాన్ పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు. మొత్తం 577 మందిని ఎన్నుకోనున్నారు అక్కడి ఓటర్లు. త్రిముఖ కూటమి మధ్య పోరు హోరాహోరీగా జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
G7 Summit 2024: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో చర్చలు
జీ7 సమావేశం కోసం విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తోనూ మోదీ చర్చలు జరిపారు. ‘మా ఇద్దరి మధ్య ఏడాదికాలంలో జరిగిన నాలుగో భేటీ ఇది. అద్భుతంగా జరిగింది. ఇండో–పసిఫిక్ రోడ్‌మ్యాప్, హారిజాన్ 2047 సహా రక్షణ, అణు, అంతరిక్షం, సముద్రమార్గంలో వాణిజ్యం, విద్య, వాతావరణ మార్పులు, డిజిటల్ మౌలిక వసతులు, కనెక్టివిటీ, కృత్రిమ మేథ రంగాల్లో పరస్పర తోడ్పాటుపై చర్చలు జరిపాం. యువతలో ఆవిష్కరణలు, పరిశోధనలపై మరింత మక్కువ పెంచేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదీ మాట్లాడుకున్నాం’ అని మోదీ చెప్పారు. శుక్రవారం ఇటలీకి చేరుకున్నాక మోదీ తొలుత మేక్రాన్‌ను కలిశారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఒక అంతర్జాతీయ నేతతో మోదీ సమావేశంకావడం ఇదే తొలిసారి. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సమ్మర్ ఒలంపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మేక్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు
పారిస్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటరీ ఎన్నికలు పరోక్షంగా ఫ్రాన్స్ పార్లమెంట్ ముందస్తు ఎన్నికలను మోసుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 720 సీట్లు ఉండగా 81 సభ్యులను ఫ్రాన్స్ ఎన్నుకోనుంది. ఇందుకోసం జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ విపక్ష నేషనల్ర్యాలీ పార్టీకి 32 శాతం ఓట్లు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చెందిన రనీసాన్స్ పారీ్టకి కేవలం 15 శాతం ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. నిజంగానే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మూడేళ్ల తర్వాత అంటే 2027లో జరగబోయే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విపక్ష పార్టీ విజయం సాధించే ప్రమాదముందని దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భావించారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆయన పార్లమెంట్‌ను రద్దుచేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో వచ్చే 20 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 30న తొలి దశ, జూలై ఏడో తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. మూడేళ్ల తర్వాత నిర్వహిస్తే ఓడిపోతామని, ప్రజాదరణ తగ్గేలోపు ఇప్పుడే నిర్వహిస్తే తమ రనీసాన్స్ పారీ్టయే గెలుస్తుందన్న అంచనాతో ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చాయి. సరైన నిర్ణయం తీసుకున్నా: మేక్రాన్ పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని మేక్రాన్ సమరి్థంచుకున్నారు. ‘‘ దేశం కోసం సరైన నిర్ణయం తీసుకున్నా. ఈయూ ఎన్నికల ద్వారా ప్రజలు మా ప్రభుత్వానికి ఏం చెప్పదల్చుకున్నారో అర్థమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా వదిలేయలేను’ అని చెప్పారు. -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు.. ఆకస్మిక ఎన్నికలకు మేక్రాన్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. యూరోపియన్ యూనియన్(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్ ప్రకటించారు. అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్ రెనాయిసెన్స్ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.‘రైట్ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్ ప్రజలపై ఉన్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అన్నారు.ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్ పార్లమెంట్‌ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్ యూనియన్ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. -
మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
ఇండో–ఫ్రెంచ్ సంబంధాల్లో నవశకం
భౌగోళిక–వ్యూహాత్మక అస్థిరతను ఎదుర్కోవాలంటే, సంబంధాల్లో వైవిధ్యం పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో భారత గణతంత్ర దినోత్సవాలకు అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పర్యటన ఇరుదేశాల సంబంధాలను మరింత దృఢతరం చేస్తుంది. గాజాలో యుద్ధం కారణంగా చాలామంది అసాధ్యం అని భావిస్తున్న ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరోప్ కారిడార్ గురించి ఇరుపక్షాలు ప్రస్తావించాయి. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను స్వీకరించేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. ఇక ‘ఇండో–ఫ్రెంచ్ రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య రోడ్‌మ్యాప్’ ఇరుదేశాలనూ కొనుగోలుదారు–విక్రేత సంబంధాన్ని దాటి చూస్తోంది. మోదీ, మెక్రాన్ ల మధ్య ఉన్న వ్యక్తిగత బంధం వల్ల కూడా ఈ పర్యటన ప్రత్యేకంగా మారింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తన భారత పర్యటనను ఇటీవలే ముగించారు. ఇది ఇరుదేశాల మధ్య నిర్మాణాత్మకమైన పర్యటనగా మార వచ్చని భావిస్తున్నారు. ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన గౌరవ అతిథి కావడం వల్ల ఈ పర్యటన సందర్భమే... ఆడంబరం, సంకేతాలతో కూడుకుని ఉన్నది. అయితే, ఆయన పర్యటనలో స్పష్టంగా కనిపించని అంశాన్ని చూడటం, భౌగోళిక–వ్యూహాత్మక చిక్కులను పరిశీలించడం చాలా ముఖ్యం. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పరస్పరం చక్కగా కలిసిపోతారు. ఎమ్–ఎమ్ (మోదీ, మెక్రాన్)అంశం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి పలు విషయాలను జోడించింది: నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేసింది, పైగా ఒక దార్శనికతను అందించింది. ఈ క్రమంలో, ఇది బ్యూరోక్రాటిక్ జడ త్వాన్ని, అతి భారమైన ఆలోచనలను అధిగమించడంలో సహాయ పడింది. ప్రపంచ వ్యూహాత్మక రాజకీయాల్లో తీవ్రమైన అల్లకల్లోలం నేపథ్యంలో మెక్రాన్ తాజా పర్యటనను చూడాల్సి ఉంటుంది. రెండు ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి ఉక్రెయిన్ లో, మరొకటి గాజాలో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కష్టంగా కనిపిస్తోంది. బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ప్రపంచ వాణిజ్య సంస్థ అవసాన దశలో ఉండటం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం చిందరవందరగా ఉంది. ప్రబల శక్తి అయిన అమెరికా దేశీయ రాజ కీయ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. కనీవినీ ఎరుగని ఈ భౌగోళిక–వ్యూహాత్మక అస్థిరతను భారత దేశం ఎదుర్కోవాలంటే... నష్ట భయం తగ్గించుకోవాలి, దేశాలతో సంబంధాల్లో వైవిధ్యం పెంచుకోవాలి, బహుళ ఒడంబడికల ఆధారంగా విదేశాంగ విధానాన్ని కొనసాగించాలి. అమెరికా ఎల్లప్పుడూ భారతదేశానికి కీలకమైన వ్యూహాత్మక రక్షణ భాగస్వామిగా ఉంటుంది. అయితే, అది ఎప్పటికప్పుడు, కొన్ని దేశీయ ఒత్తిళ్లకు, చైనా–అమెరికా సంబంధాల స్థితి వంటి బాహ్య కారకాలకు కూడా లోబడి ఉంటుంది. జపాన్‌తో సంబంధాలను చూస్తే, భారతీయ వస్తూత్పత్తిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నాయి. కానీ రక్షణ, భద్రతా సహ కారం జరిగే అవకాశం కాస్త పరిమితంగా ఉంది. రష్యా విషయానికి వస్తే, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారతదేశ వైఖరి గురించి సానుకూలంగా వ్యాఖ్యానించారు. ఇతర శక్తులతో తన రక్షణ సంబంధాలను విస్తరించుకోవాలని భారత్ కోరు కోవడాన్ని రష్యా అర్థం చేసుకోగలదని ఆయన చెప్పడం గమనార్హం. పై దృష్టాంతం ప్రకారం చూస్తే, ఫ్రాన్స్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం విపరీతమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇండో –ఫ్రెంచ్ సంబంధాలు... వ్యూహాత్మక ఏకీభావం, స్వయంప్రతిపత్తి, ఇరు దేశాలలోని అన్ని పార్టీల ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉంటాయి. అయితే మోదీ, మెక్రాన్ ల మధ్య ఉన్న అసాధారణమైన వ్యక్తిగత స్నేహసంబంధాలు... ఇండో–ఫ్రెంచ్ వ్యూహాత్మక భాగస్వా మ్యాన్ని నిజంగా ప్రత్యేకమైనదిగా మార్చింది. ‘బాసిల్ డే’(ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం) ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ గత ఏడాది జూలైలోనే పారిస్‌కు వెళ్లారనీ, అప్పుడే ఇరు నేతలూ వివరణాత్మక పత్రం ‘హొరైజన్ 2047’కు అంగీకరించారనీ పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుత పర్యటన నుండి కూడా నాటకీయ ప్రకటనలను ఆశించడం అవాస్తవికంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ పర్యటన నుండి బయటపడిన అత్యంత ముఖ్యమైన ఫలితం ‘ఇండో –ఫ్రెంచ్ రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యం కోసం రోడ్‌మ్యాప్’. ఇది క్లాసిఫైడ్ అయినప్పటికీ, ఇందులోని ఆంశాలేమిటో చూచాయగా తెలుస్తున్నాయి. ఈ రోడ్‌మ్యాప్ ఇరుదేశాలనూ కేవలం కొనుగోలు దారు–విక్రేత సంబంధంలో చూడటం లేదు. భారత సాయుధ దళాల రక్షణ అవసరాలు తీర్చడమే గాక, సహ డిజైన్, సహ అభివృద్ధి, సహ ఉత్పత్తికి వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా ఇతర స్నేహపూర్వక దేశా లకు నమ్మకమైన రక్షణ సామగ్రిని అందించేందుకూ అంగీకరిస్తోంది. ఇది ప్రతిష్ఠాత్మకమైన ప్రణాళిక. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’కు మాత్రమే కాకుండా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి కూడా గణ నీయంగా దోహదపడుతుంది. ఫ్రెంచ్ సంస్థ సాఫ్రెన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల గురించి మాత్రమే కాకుండా రాఫెల్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతులు, కార్యకలాపాల స్థాపనలో పురోగతి గురించి ఉమ్మడి ప్రకటనలో సూచనలు ఉన్నాయి. సాఫ్రెన్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థల మధ్య సమగ్ర భాగస్వామ్యం అనేది 100 శాతం సాంకేతికత బదిలీతో బహుళ–పాత్ర పోషించే హెలికాప్టర్ ఇంజిన్ ల అభి వృద్ధికి ఉద్దేశించబడింది. అదనంగా, స్కార్పెన్ జలాంతర్గాములు భారత్‌లో గణనీయమైన స్వదేశీకరణతో నిర్మించడాన్ని కొనసాగిస్తాయి. టాటా అడ్వాన్్సడ్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ భారత దేశంలో పౌర హెలికాప్టర్ల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది. ఇది రెండు దేశాల ప్రైవేట్ రంగానికీ మొట్టమొదటిది. ఇరుపక్షాలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఉమ్మడి ట్రైసర్వీసెస్ కార్యక్రమాన్ని పరిశీలి స్తున్నాయి. ఇరుదేశాల సంబంధాల్లో అంతరిక్ష రంగం కూడా ముఖ్య స్థానంలో ఉంది. రెండు దేశాలు ఆరు దశాబ్దాలకు పైగా అంతరిక్ష రంగంలో సహకరించుకున్నాయి. 2023 జూన్‌లో ప్రారంభించిన సంస్థాగత వ్యూహాత్మక అంతరిక్ష సంభాషణ మరింత ముందుకు సాగుతోంది. వాస్తవానికి, రక్షణ అంతరిక్ష భాగస్వామ్యంపై రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అంగీకార లేఖ ఈ ఫలితాలలో ఒకటి. రక్షణ, అంతరిక్షం కలిసి ఈ భాగస్వామ్యాన్ని నడిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, గాజాలో యుద్ధం కారణంగా చాలామంది అసాధ్యం అని భావిస్తున్న ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరోప్ కారిడార్ గురించి ఇరుపక్షాలు ప్రస్తావించాయి. రెండు వైపులా ఈ కార్యక్రమం గురించిన వ్యూహాత్మక ప్రాముఖ్యతను పున రుద్ఘాటించడమే కాకుండా, ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక ప్రతినిధిని మెక్రాన్ నియమించడాన్ని మోదీ స్వాగతించారు. బహుశా, ఈ కీలకమైన ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి భారతదేశం కూడా అదే పని చేయాలి. వ్యూహాత్మక భాగస్వామ్య కొనసాగింపు... స్పష్టంగా ఆవిష్కరణ, సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మేధ, అడ్వాన్్సడ్ కంప్యూటింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌లో సహకారాన్ని తీవ్ర తరం చేయాలని ఇరుపక్షాలూ నిర్ణయించాయి. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఫ్రాన్స్ స్వీకరించడం గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు అంగీకరించారు. ఇది చాలావరకు సాధ్యమే. భారతదేశం – యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఇద్దరు నాయకులు తమ దృఢమైన మద్దతును పునరుద్ఘాటిస్తుండటం స్వాగతించదగినది. సాధారణ ఎన్నికల తర్వాత భారతదేశానికి ఈ ఒప్పందం ప్రధాన వాణిజ్య విధాన లక్ష్యా లలో ఒకటిగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారతదేశం 30పైగా వ్యూహా త్మక భాగస్వామ్యాలను కలిగి ఉంది. వాటిలో కొన్ని పరస్పర అవస రాలపై, రాజకీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. కానీ ఇండో –ఫ్రెంచ్ భాగస్వామ్యం మాత్రం పరస్పర ఎంపికపై ఆధారపడి ఉంది. అంతేకాకుండా ఇది ప్రపంచ భౌగోళిక వ్యూహాత్మక సంబంధాలను పునర్నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మోహన్ కుమార్ వ్యాసకర్త ఫ్రాన్స్‌లో భారత మాజీ రాయబారి; ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ డీన్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Republic Day 2024: నారీశక్తి విశ్వరూపం
న్యూఢిల్లీ: భారత 75వ గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. శుక్రవారం ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్ విభాగానికి చెందిన కెపె్టన్ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, డీఆర్డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆసాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్లు గగుర్పొడిచేలా డేర్‌డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. బీఎస్ఎఫ్, సీఆరీ్ప ఎఫ్ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వీటన్నింటినీ ఆసాంతం ఆస్వాదిస్తూ కని్పంచారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్‌లో ముర్ము, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. 90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వణికించే చలిని, దట్టంగా కమ్మేసిన పొగ మంచును లెక్క చేయకుండా భారీ జనసందోహం వేడుకలను తిలకించింది. ఈసారి ఏకంగా 75 వేల మందికి పైగా గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ వారితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. ఫొటోలు, సెలీ్ఫలకు పోజులిచ్చారు. ఆయన ధరించిన రంగురంగుల బంధనీ తలపాగా ఆహూతులను ఆకట్టుకుంది. మోదీ రాక సందర్భంగా భారత్ మాతా కీ జై అంటూ వారు చేసిన నినాదాలతో కర్తవ్య పథ్ మారుమోగింది. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు దళం, 30 మందితో కూడిన సైనిక వాయిద్య బృందం కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. చివరగా వాయుసేనకు చెందిన 29 యుద్ధ విమానాలు, ఏడు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్ ప్లేన్‌తో పాటు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ ఏ330 మల్టీ ట్యాంకర్ రావాణా విమానం, రెండు రాఫెల్ ఫైటర్ జెట్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ విన్యాసాల్లో కూడా 15 మంది మహిళా పైలట్లు పాల్గొనడం విశేషం. అలరించిన నాగ్ మిసైల్ వ్యవస్థ ► వేడుకల్లో ప్రదర్శించిన టీ–90 భీష్మ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థ, తేజస్ వంటి యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్ వ్యవస్థ స్వాతి, డ్రోన్లను జామ్ చేసే వ్యవస్థ, అత్యాధునిక ఎల్రక్టానిక్ వార్ఫేర్ వ్యవస్థ, క్యూఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులు అలరించాయి. మోదీ నివాళులు శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తొలుత నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. దేశమాత రక్షణలో ప్రాణాలొదిలిన సైనిక వీరులకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముర్ము, మేక్రాన్ గుర్రపు బగ్గీలో వస్తున్న దృశ్యాలను కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించేందుకు జనం పోటీ పడ్డారు. అనంతరం జెండా వందనం, జాతీయ గీతాలాపన, 105 ఎంఎం దేశీయ శతఘ్నులతో 21 గన్ సెల్యూట్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారత కీర్తి పతాకను వినువీధిలో ఘనంగా ఎగరేసిన చంద్రయాన్ థీమ్‌తో రూపొందిన శకటం అలరించింది. దాంతోపాటు అయోధ్య రామాలయ ప్రారంభం నేపథ్యంలో కొలువుదీరిన బాలక్ రామ్ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర శాఖలకు సంబంధించి 9 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. వేడుకలు ముగిశాక మోదీ కర్తవ్య పథ్ పొడవునా కాలినడకన సాగి ఆహూతులను అలరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొన్నారు. గొప్ప గౌరవం: మేక్రాన్ ‘‘గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతో పాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం! ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహా్వనించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా (1995లో) మొదలుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015లో) దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు. దేశాధినేతల అభినందనలు బ్రిటన్ రాజు చార్లెస్ 3 మొదలుకుని ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దాకా పలు దేశాల అధినేతలు భారత్‌కు 75వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. అభినందన సందేశాలతో సామాజిక వేదికల్లో పోస్టులు పెట్టారు. భారత్‌తో బ్రిటన్ సంబంధాలు నానాటికీ పటిష్టమవుతున్నాయని రాష్ట్రపతి ముర్ముకు పంపిన సందేశంలో కింగ్ చార్లెస్ హర్షం వెలిబుచ్చారు. -
దాదాపు 40 ఏళ్ల తరువాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అలా...
#RepublicDay2024- MurmuHorsebuggy for parade రిపబ్లిక్ డే 2024 వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే.. దాదాపు 40 సంవత్సరాల విరామం తర్వాత, రిపబ్లిక్ డే పరేడ్‌లో గుర్రపు బగ్గీ సంప్రదాయం మళ్లీ వచ్చింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ‘సాంప్రదాయ గుర్రపు బగ్గీ’ కర్తవ్య పథానికి చేరుకున్నారు.ప్రెసిడెంట్ ముర్ముతోపాటు ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ ప్రత్యేక వాహనంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకులకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ బగ్గీకి రాష్ట్రపతి అంగరక్షకుడు ఎస్కార్ట్ చేశారు. భారత సైన్యంలోని అత్యంత సీనియర్ రెజిమెంట్ రాష్ట్రపతి అంగరక్షకుడుగా ఉంటారు. అయితే భద్రతా కారణాల రీత్యా 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రిపబ్లిక్ డే కార్యక్రమాలకు అధ్యక్షుడి బగ్గీని ఉపయోగించడం నిలిపివేశారు. అప్పటిక అధ్యక్షులు వారి ప్రయాణానికి లిమోసిన్‌లను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు 2014లో, బీటింగ్ రిట్రీట్ వేడుకలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు గుర్రాల బగ్గీని నడిపి ఈ సంప్రదాయాన్నిపునరుద్ధరించిన సంగతి తెలిసిందే. #WATCH | President Droupadi Murmu and French President Emmanuel Macron riding in a special presidential carriage escorted by the President's Bodyguard make their way to Kartavya Path pic.twitter.com/F4hOovJoua — ANI (@ANI) January 26, 2024 కాగా 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నారీశక్తి థీమ్‌కు అనుగుణంగా 26 శకటాలు దేశంలో మహిళా సాధికారతను ప్రదర్శిస్తూ కర్తవ్య పథంలో కవాతు చేశాయి. అగే తొలి సారి మహిళా అధికారుల సారధ్యంలో త్రివిధ దళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 105 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17 IV హెలికాప్టర్లు కర్తవ్య పథంలో హాజరైన ప్రేక్షకులపై పూల వర్షం కురిపించాయి. 100 మంది మహిళా కళాకారులు నారీ శక్తికి ప్రతీకగా వివిధ రకాల తాళ వాయిద్యాలను వాయిస్తూ ‘ఆవాహన్’ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకు గాను దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ అంతటా 70వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. -
Republic Day 2024: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: దేశ సైనిక శక్తిని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటే 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ సిద్ధమైంది. కర్తవ్యపథ్‌లో గంటన్నరపాటు సాగే పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సారథ్యం వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ హాజరు కానున్నారు. పరేడ్‌లో క్షిపణులు, డ్రోన్జా మర్లు, నిఘా వ్యవస్థలు, సైనిక వాహనాలపై అమర్చిన మోర్టార్లు, పోరాట వాహనాలను ప్రదర్శించనున్నారు. మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో కూడిన త్రివిధ దళాల కంటింజెంట్ కవాతులో పాల్గొననుంది. గత ఏడాది ఆర్టిలరీ రెజిమెంట్‌లో విధుల్లో చేరిన 10 మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్లు దీప్తి రాణా, ప్రియాంక సెవ్దా సహా మొట్టమొదటిసారిగా స్వాతి వెపన్ లొకేటింగ్ అండ్ పినాక రాకెట్ సిస్టమ్‌కు సారథ్యం వహించనున్నారు. సంప్రదాయ మిలటరీ బ్యాండ్లకు బదులుగా ఈసారి భారతీయ సంగీత పరికరాలైన శంఖ, నాదస్వరం, నాగడ వంటి వాటితో 100 మంది మహిళా కళాకారుల బృందం పరేడ్‌లో పాల్గొననుంది. భారత వైమానిక దళానికి చెందిన 15 మంది మహిళా పైలట్లు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాల పాటు కొనసాగనుంది. -
Republic Day 2024: జైపూర్‌లో మోదీ, మేక్రాన్ రోడ్ షో
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ గురువారం జైపూర్‌లో రోడ్ షోలో పాల్గొ న్నారు. మోదీ ఆయనకు అయోధ్య రామాల యం ప్రతిమను కానుకగా అందజేశా రు. ఇద్దరు నేతలు జైపూర్‌లో మసాలా చాయ్ రుచిని ఆస్వాదించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా హాజరు కానున్న ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం జైపూర్‌కు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఫ్రాన్సు అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచి, అందంగా అలంకరించిన గజరాజులతో స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి మేక్రాన్ అంబర్ కోటకు వెళ్లారు. జంతర్‌మంతర్ వద్ద ప్రధాని మోదీ ఆయన్ను కలిశారు. పరస్పర కరచా లనం, ఆత్మీయ ఆలింగనాల అనంతరం ఓపెన్ టాప్ కారులో జంతర్‌మంతర్ నుంచి రోడ్ షోకు బయలుదేరారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ హవా మహల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి తాజ్ రామ్‌బాగ్ ప్యాలెస్‌కు చేరుకుని, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
నేడు భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. మోదీతో స్పెషల్ ప్రోగ్రామ్..
ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాక్రాన్ నేడు భారత్‌కు చేరుకుంటారు. మాక్రాన్ నేరుగా రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయంలో గురువారం ల్యాండ్ అవుతారు. వివరాల ప్రకారం.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మాక్రాన్ గురువారం భారత్‌కు చేరుకుంటారు. జైపూర్ విమానాశ్రయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి మాక్రాన్ జైపూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. అలాగే, రాంబాగ్ ప్యాలెస్‌లో మాక్రాన్ కోసం ప్రైవేటు డిన్నర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రోడ్ షో.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు నేతలు ట్రిపోలియా గేట్‌కు కాలినడకన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జైపూర్‌లో ఇద్దరు నేతలు రోడ్ షో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన తర్వాత మాక్రాన్ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. #WATCH | Rajasthan: Jaipur decked up with posters of PM Narendra Modi and French President Emmanuel Macron ahead of their visit today pic.twitter.com/2tOGZZmxVx — ANI (@ANI) January 24, 2024 ఈ రెండు రోజుల పర్యటనలో భారత్‌తో మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇక, ఫ్రాన్స్.. భారత్‌కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది. -
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా.. ఇందుకు మెక్రాన్ కూడా అంగీకరించారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. నా ప్రియమైన మిత్రుడు మోదీ.. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీతో వేడుకలను జరుపుకోవడానికి నేను వస్తున్నాను’ అని పేర్కొన్నారు. Thank you for your invitation, my dear friend @NarendraModi. India, on your Republic Day, I’ll be here to celebrate with you! — Emmanuel Macron (@EmmanuelMacron) December 22, 2023 కాగా రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆరో ఫ్రెంచ్ నేత మాక్రాన్. మాజీ ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ రెండుసార్లు(1976,1998) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా 1980, 2008, 2016లో వేడుకలకు విచ్చేశారు. మరోవైపు ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే పరేర్కు ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు మెక్రాన్ వచ్చారు. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తోన్న విషయం తెలిసిందే. చదవండి: నానమ్మ ఇందిరా గాంధీపై వరుణ్ ప్రశంసలు -
రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ నుంచి హాజరవుతున్న ఆరవ అధ్యక్షునిగా మాక్రాన్ నిలవనున్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ ఆయన హాజరుకాలేనని వెల్లడించారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. ఫ్రెంచ్ మాజీ ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ 1976, 1998లో రెండుసార్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా 1980, 2008, 2016లో ఈ వేడుకలకు హాజరయ్యారు. STORY | French President Macron set to be Republic Day chief guest READ: https://t.co/P8euyRpHkB pic.twitter.com/cMuCijvqcl — Press Trust of India (@PTI_News) December 22, 2023 భారత్‌లో జరిగిన జీ-20 మీటింగ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరయ్యారు. ప్రధాని మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు. మధ్యాహ్న భోజన సమావేశంలోనూ పాల్గొన్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై పురోగతి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. గతేడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలను ఆహ్వానిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021, 2022లో విదేశీ నేతలను ఆహ్వానించలేదు. ఇదీ చదవండి: ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు -
G20 Summit: 10న ప్రధానితో మాక్రాన్ భేటీ
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర భేటీకి హాజరవుతున్న ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల10న ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. శిఖరాగ్రం ఆఖరి రోజైన ఆదివారం ఫ్రాన్సు అధ్యక్షుడు ప్రధానితో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆయన బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా, ఇండోనేసియా అధ్యక్షుడు విడోడో, సౌదీ యువరాజు సల్మాన్తోనూ చర్చలు జరుపుతారు. -
ఫ్రాన్స్ మాక్రాన్ భార్యకు అరుదైన బహుమతిచ్చిన మోదీ.. విలువెంతంటే?
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇటీవల ఫ్రాన్స్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ ఫ్రాన్స్ బాస్టిల్ డే ఉత్సవాలకు అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ.. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా, ప్రధాని మోదీ.. మాక్రాన్ భార్యకు ఇక్కత్ చీరను బహుమతిగా ఇచ్చారు. దీని ఖరీదు.. లక్ష రూపాయల వరకు ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. ఈ సందర్భంగా నల్లగొండకు చెందిన ఇక్కత్ చీరల నేత కార్మికుడు గోలి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ.. మేము నేసిన చీరను ప్రధాని మోదీ బహుమతిగా ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. పోచంపల్లి, పుట్టపాక, గట్టుప్పలలో ఇక్కత్ చీరల తయారీ జరుగుతోంది. దేశంలో మరెక్కడా ఇక్కత్ చీరలు తయారు చేయరు. పురాతన కాలం నుంచి ఇక్కత్ చీర కళను కాపాడుతున్నామని తెలిపాడు. మోదీ బహుమతిగా ఇచ్చిన చీరకు దాదాపు రూ.లక్ష వరకు ఉండొచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: థాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ అంటూ వీడియో పోస్ట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. -
భారత ప్రధానికి ఫ్రాన్స్ అధ్యక్షుడి అపురూప కానుక..
పారిస్: భారత ప్రధాని పర్యటనను గుర్తు చేసుకుంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియోని పోస్ట్ చేశారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీతో గడిపిన క్షణాలను పొందుపరచి ఇది భారతీయ ప్రజలకు, వారి నమ్మకానికి, స్నేహానికి అని రాశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ బాస్టిల్ డే ఉత్సవాలకు అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు అజరిగిన ప్రధాని పర్యటనలో అపురూప క్షణాలన్నిటినీ వీడియోగా మలచి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇదే వీడియోని ప్రధాని మళ్ళీ రీట్వీట్ చేస్తూ.. ఫ్రాన్స్- భారత్ మన బంధం కాలాతీతమైనది. ఇందులో మన విలువలు, కలిసికట్టుగా కన్న కలలు ప్రతిధ్వనిస్తుంటాయి. నా ప్రియ స్నేహితుడైన ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. నేను ఈ దఫా ఫ్రాన్స్ లో గడిపిన ప్రతి క్షణాన్నీ నెమరు వేసుకుంటూనే ఉంటానని రాశారు. To the people of India, trust and friendship. pic.twitter.com/s8b3Hb7cf8 — Emmanuel Macron (@EmmanuelMacron) July 15, 2023 ఫ్రాన్స్ అధ్యక్షుడు పోస్ట్ చేసిన వీడియో భారత ప్రధానికి ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని బహుకరించడడంతో మొదలైంది. అనంతరం జులై 14న జరిగిన బాస్టిల్ డే ఉత్సవాల్లో ప్రధానితో కలిసి మెక్రాన్ పాల్గొన దృశ్యాలు.. అందులో సైనిక, వైమానిక దళాల విన్యాసాలను ఇద్దరు కలిసి తిలకిస్తున్న సన్నివేశాలున్నాయి. ఫ్రాన్స్ దేశాధినేతలతో ఎల్సీ ప్యాలెస్ లో జరిగిన సమావేశం.. అందులోని ఒప్పందాలు.. ఫ్రాన్స్ ఎకనామిక్ ఫోరమ్ సభ్యులతో మంతనాలు.. లౌవ్రే మ్యూజియంలో డిన్నర్ అన్నిటినీ దృశ్యాల సమాహారంగా చేసి చివర్లో ప్రధాన మంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు. వీడియో చివర్లో భారతీయ నటుడు మాధవన్ కూడా తళుక్కున మెరిశారు. అందరూ కలిసి సెల్ఫీ తీసుకున్న దృశ్యం వీడియోకే హైలైట్. India and France…a bond that transcends time, echoing in our shared values and kindling our collective dreams. I will always cherish my recent visit to France. Thank you my friend, President @EmmanuelMacron. https://t.co/R6rcvhMKoj — Narendra Modi (@narendramodi) July 16, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ ప్రేమకథలో మరో ట్విస్టు.. నువ్వు మాకొద్దు.. -
మోదీ ఫ్రాన్స్ పర్యటన.. మరింత పదునెక్కిన చెలిమి!
అంతర్జాతీయ వ్యవహారాల్లో సొంత గొంతు వినిపించటంలో సారూప్యత కలిగివుండే భారత్–ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక చెలిమి ఏర్పడి ఇరవై అయిదు వసంతాలు పూర్తయిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ గడ్డపై అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో శుక్రవారం ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించే బాస్టిల్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నావికా దళ అవసరాల కోసం ఉద్దేశించిన 26 రాఫెల్ జెట్ ఫైటర్లు, మూడు స్కార్పీన్ రకం జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలవుతున్నాయి. రక్షణ రంగంలో సహకరిస్తున్న ఫ్రాన్స్ ఈ ఒప్పందాలతో రష్యా తర్వాత మనకు ఆయుధాలు విక్రయించే రెండో పెద్ద సరఫరాదారు కాబోతోంది. ఇప్పటికే మనం ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ జెట్ విమానాలు, ఆరు స్కార్పీన్ రకం జలాంతర్గాములు కొనుగోలు చేశాం. ఇరు దేశాలమధ్యా సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1916లో మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్‌ను చేజిక్కించుకొనేందుకు నాటి జర్మనీ చేసిన ప్రయత్నాలను డన్కిర్క్ పట్టణంలో వమ్ము చేసింది మన దేశానికి చెందిన పంజాబ్ రెజిమెంట్ జవాన్లే. ఆ విజయానికి గుర్తుగా అప్పట్లో పారిస్ వీధుల్లో మన జవాన్లు కవాతు కూడా జరిపారు. దాన్ని గుర్తుచేసుకుంటూ శుక్రవారం బాస్టిల్ డే సందర్భంగా అదే రెజిమెంట్‌కు చెందిన మన సైనికులు 107 ఏళ్ల సుదీర్ఘకాలం అనంతరం కవాతు చేశారు. మనకు స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం ఫ్రాన్స్‌తో సాన్నిహిత్యాన్ని కోరుకున్నారు. 1950 తర్వాతనుంచీ రెండు దేశాల మధ్యా అణు, అంతరిక్ష రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిన గత 25 సంవత్సరాలుగా భారత్–ఫ్రాన్స్ చెలిమి ఎన్నో సంక్లిష్ట సందర్భాలను తట్టుకుని నిలబడింది. 1998లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో మన దేశం పోఖ్రాన్లో అణ్వస్త్ర పరీక్ష నిర్వహించినప్పుడు అమెరికాతో సహా అగ్ర రాజ్యాలు తీవ్ర విమర్శలకు దిగాయి. కానీ ఆ సమయంలో ఫ్రాన్స్ అన్నివిధాలా అండగా నిలబడింది. యూరోప్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సులో భారత్‌ను అభిశంసిస్తూ, దానిపై ఆంక్షలకు పిలుపునిస్తూ బ్రిటన్ తీర్మానం ప్రతిపాదించబోయినప్పుడు వీటో చేస్తానని హెచ్చరించి ఆ ప్రయత్నాన్ని నిలువరించింది ఫ్రాన్సే. చదవండి: ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్ టవర్ నుంచే చెల్లింపులు రెండు దేశాల విదేశాంగ విధానంలో ఎన్నో పోలికలు కూడా ఉన్నాయి. అమెరికాతో సఖ్యంగా మెలగుతూనే ఏదోమేరకు స్వతంత్రతను పాటించటం భారత్, ఫ్రాన్స్‌లు మొదటినుంచీ అనుసరిస్తున్న విధానం. అమెరికా బద్ధశత్రువులైన ఇరాన్, రష్యాలతో సాన్నిహిత్యం నెరపడంలోనూ ఇద్దరిదీ ఒకే ఆలోచన. ఏకధ్రువ ప్రపంచం ఏర్పడాలని, అది కూడా తన నాయకత్వంలోనే ఉండాలని తహతహలాడే అమెరికా వైఖరికి భిన్నంగా ఏ ఒక్కరి ఆధిపత్యమో ఉండటం చేటు తెస్తుందని భావించటంలోనూ భారత్, ఫ్రాన్స్లమధ్య పోలిక ఉంది. ఎవరిపైనా సంపూర్ణంగా ఆధారపడే ధోరణి సరికాదని, ఏ దేశానికైనా స్వాలంబన సాధించటం అవసరమని గుర్తించటంలోనూ ఇద్దరూ ఇద్దరే. బహుశా అందువల్లే కావొచ్చు... పరస్పరం సహకరించుకోవటం ద్వారా భిన్న రంగాల్లో ఎదగటానికి రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి. వ్యూహాత్మక చెలిమిలో ముందడుగు వేస్తున్నాయి. అమెరికా మనతో సఖ్యంగా ఉంటున్నా ఆ చెలిమికి ఎప్పుడూ పరిమితులుంటున్నాయి. ఆ దేశంతో మనం కుదుర్చుకునే రక్షణ ఒప్పందాలకు ఎన్నో అవరోధాలుంటాయి. అక్కడి కాంగ్రెస్ వాటిని ఆమోదించాలి. రక్షణ పరికరాలకు సంబంధించి అమల్లోవుండే ఎగుమతుల నియంత్రణ వ్యవస్థలను దాటాలి. ఈ క్రమంలో ఎక్కడైనా ఆగిపోవచ్చు. లేదా జాప్యం చోటుచేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్షణ కొనుగోళ్లకు అంగీకరించినా, సాంకేతికత బదిలీ సాధ్యపడదు. ఉదాహరణకు మన తేలిక రకం యుద్ధ విమానం తేజస్‌కు జీఈ ఎఫ్ 414 ఇంజిన్ అమర్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాని సాంకేతికత బదిలీకి మాత్రం అంగీకరించలేదు. ఫ్రాన్స్‌తో ఈ పేచీ లేదు. దానితో కుదుర్చుకునే ఒప్పందాలకు అవాంతరాలుండవు. సాంకేతికత బదిలీకి అభ్యంతరాలుండవు. జీఈ ఎఫ్ 414 ఇంజిన్ మాదిరే పనిచేసే ఫ్రాన్స్ సఫ్రాన్ ఇంజిన్‌ను ఇక్కడే ఉత్పత్తి చేయడానికి ఆ దేశం అంగీకరించింది. సాంకేతికత బదిలీ చేయటం వల్ల కేవలం రక్షణ ఉత్పత్తులు విక్రయించే దేశమే కాక, కొనుగోలు చేస్తున్న దేశం కూడా లబ్ధిపొందటానికి అవకాశముంటుంది. రెండు దేశాలూ పర్యావరణ రంగంలో కూడా పరస్పరం సహకరించుకోవటానికి ఇప్పటికే నిర్ణయించాయి. నిరుడు అక్టోబర్‌లో గ్రీన్ హైడ్రోజన్‌పై ఒప్పందం కుదుర్చుకుని, పరస్పర భాగస్వామ్యంతో ప్రపంచానికి విశ్వసనీయమైన, స్థిరమైన హరిత ఇంధనాన్ని అందించే దిశగా ఇరు దేశాలూ అడుగులు వేస్తున్నాయి. ఇంకా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీ, 6జీ తదితర అంశాల్లో సమష్టిగా పనిచేస్తున్నాయి. క్వాడ్, జీ 20 తదితర వేదికల్లో ఒకే గళం వినిపిస్తున్నాయి. అలాగని విభేదాలు లేకపోలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఉక్రెయిన్‌కు గట్టి మద్దతుదారుగా నిలబడింది. ఆయుధాలు సరఫరా చేస్తోంది. మన దేశం మాత్రం దురాక్రమణ ఆపాలని రష్యాను కోరడం మినహా అమెరికా, ఈయూ దేశాల తరహాలో రష్యా వైఖరిని ఖండించటంలేదు. అలాగే చైనా విషయంలోనూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియెల్ మాక్రాన్ భిన్న వైఖరితో ఉన్నారు. విభేదించుకునే అంశాల్లో అవతలి పక్షం అవగాహన తెలుసుకోవటం, వారిని ఒప్పించే ప్రయత్నం చేయటంలోనే దౌత్య నైపుణ్యం వెల్లడవుతుంది. చిరకాల మిత్ర దేశమైన ఫ్రాన్స్ మోదీ పర్యటన తర్వాత మనకు మరింత సన్నిహితమవుతుందని ఆశించాలి. -
నేటి నుంచి ఫ్రాన్స్‌లో... ప్రధాని మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అధికారిక పర్యటన వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ కవాతులో భారత త్రివిధ దళాలకు చెందిన బృందం పాల్గొననుంది. ప్రధాని అయ్యాక మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఐదోసారి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ మోదీకి ఫ్రాన్స్ అధికార విందుతోపాటు ప్రత్యేక ఆతిథ్య విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు విస్తృతస్థాయి అంశాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత ఫ్రాన్స్ సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులనూ మోదీ కలుస్తారు. అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు, భారతీయ సీఈవోలు, అక్కడి ప్రముఖులను కలుస్తారు. ‘ఇండియా–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆరంభమైన ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల భిన్నరంగాల భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. సాంస్కృతిక, శాస్త్రీయ, విద్య, ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ‘ నేవీ వేరియంట్ 26 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుతోపాటు ఇరుదేశాలు సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను భారత్‌లో తయారుచేసే ఒప్పందం ఖరారుకావచ్చు’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా చెప్పారు. ఫ్రాన్స్ గణతంత్ర వేడుకలుగా భావించే బాస్టిల్ డే కవాతులో పాల్గొనేందుకు ఇప్పటికే 269 మంది సభ్యుల త్రివిధ దళ బృందం సీ–17 గ్లోబ్‌మాస్టర్ యుద్ధసరుకు రవాణా విమానంలో పారిస్‌కు చేరుకుంది. ఛాంప్స్ ఎలీసెస్ చారిత్రక ప్రాంత గగనతలంలో ఫ్రెంచ్ యుద్ధవిమానాలకు తోడు భారత రాఫెల్ ఫైటర్జెట్లు ఫ్లైపాస్ట్‌లో పాల్గొననున్నాయి. తిరుగుప్రయాణంలో యూఏఈలో పర్యటన ఫ్రాన్స్ పర్యటన తర్వాత తిరుగుప్రయాణంలో జూలై 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షులు, అబుదాబీ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్తో ఈ సందర్భంగా మోదీ భేటీ కానున్నారు. సంస్కృతి, ఇంధనం, ఆహార భద్రత, రక్షణ, ఫిన్‌టెక్, విద్య, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవడంపై ఇరుదేశాధినేతలు చర్చించనున్నారు. ‘కాప్–28కు యూఏఈ, జీ20కి భారత్ సారథ్యం వహిస్తున్న ఈ తరుణంలో అగ్రనేతలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చలు జరపనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
ఆగమవుతున్న ఫ్రాన్స్.. అదుపులోకి రాని పరిస్థితులు, వివాదంలో అధ్యక్షుడు
పారిస్: యూరప్ దేశం ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వాహన, గృహ దహనాలు, దుకాణాల లూటీలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏకంగా 45,000 మంది పోలీసులను రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. రేవు నగరం మార్సిలీలో ఆందోళనకారులు ఓ ఆయుధ దుకాణాన్ని లూటీ చేసి, ఆయుధాలు ఎత్తుకెళ్లారు. యువతీయువకులు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండేలా వారి తల్లిదండ్రులు చూడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాలుగో రోజు శనివారం సైతం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఒక్కరోజే 1,311 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 2,400 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 దాకా దహనాలు, లూటీల ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. నిరసనకారుల దాడుల్లో వందలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అయితే, ఎంతమంది నిరసనకారులు గాయపడ్డారన్నది ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మంగళవారం రాజధాని పారిస్ శివారులోని నాంటెర్రేలో పోలీసు కాల్పుల్లో నేహల్ అనే 17 ఏళ్ల యువకుడు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర అశాంతికి దారితీసిన సంగతి తెలిసిందే. నేహల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, మిత్రులు శనివారం నిర్వహించారు. మతాచారం ప్రకారం తొలుత మసీదులో ప్రార్థనలు చేసి, నాంటెర్రే అనంతరం శ్మశాన వాటికలో ఖననం చేశారు. సంగీత కచేరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్‌లో ఘర్షణలను నివారించడంలో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశమంతటా ఒకవైపు ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండగా, మరోవైపు ఆయన పారిస్‌లో ఓ సంగీత కచేరీలో తన భార్యతో కలిసి పాల్గొన్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సంగీత కచేరీ బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేక్రాన్ నిర్వాకంపై ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అధ్యక్షుడు చేయాల్సిన పని ఇదేనా? అని మండిపడుతున్నారు. As protesters burn French cities, Macron lights up at Elton John concert in Paris The President of France in these shots is in a great mood, he enjoys music with his wife and dances a little. pic.twitter.com/v1CSKI7WB8 — Spriter Team (@SpriterTeam) June 30, 2023 సోషల్ మీడియానే కారణం: మేక్రాన్ ఫ్రాన్స్‌లో అలజడికి సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మేక్రాన్ ఆక్షేపించారు. హింసను ప్రేరేపించడానికి కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని, వారిని కచి్చతంగా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలన్నారు. ఈ విషయంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు. యువత బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులను మేక్రాన్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, మేక్రాన్ సోమవారం నుంచి జర్మనీలో పర్యటించాల్సి ఉంది. స్వదేశంలోని పరిణామాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతమాత్రానికే కాల్చి చంపుతారా? నేహల్ మృతి పట్ల అతడి తల్లి, అల్జీరియా మూలాలున్న మౌనియా స్పందించారు. తన బిడ్డను కాల్చి చంపిన పోలీసు అధికారిపై మాత్రమే తనకు ఆగ్రహం కలుగుతోందని, ఇతరులపై కాదని చెప్పారు. ఏ నేరమూ చేయని పిల్లల ప్రాణాలను బలిగొనే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. తన కుమారుడు నేహల్ చూడడానికి అరబ్ దేశస్తుడిలా కనిపిస్తాడని, అంతమాత్రానికే కాల్చి చంపుతారా? అని నిలదీశారు. -
ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు
17 ఏళ్ల యువకుడి చావు ఫ్రాన్స్ దేశాన్ని తగలబెడుతోంది. జూన్ 27న జరిగిన ఓ ఘటన దేశాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. పోలీసుల కాల్పుల్లో యువకుడు నాహేల్ చినపోయిన తర్వాత ఆదోళలు, నిరసలతో అట్టుడుకుతోంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి బీభత్సం అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పారిస్ శివారు ప్రాంతాల్లో మొదలైన ఈ అల్లర్లు.. ఇప్పుడు దేశమంతటికీ పాకాయి. గత నాలుగో రోజులుగా హింసా కొనసాగుతూనే ఉంది. ఏ వీధిని చూసినా.. రణరంగంగానే కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి 1,311 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే అల్లరిమూకల కారణంగా 200 మందికిపైగా పోలీసులు అధికారులు గాయపడ్డారని పేరేంది. నిరసనలు ప్రారంభమైన మంగళవారం నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు ఈ స్థాయిలో అరెస్ట్‌లు జరగడం ఇదే అత్యధికం. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం బయడపడింది. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు కనిపిస్తున్నాయి. దేనికైనా తెగిస్తామన్నట్టుగా ఊరేగింపుగా సాగుతున్నారు. ఎంతగా నచ్చజెప్పినా ఆందోళనలు తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. నహేల్ మృతితో చెలరేగిన అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. How are French protesters getting their hands on heavy firearms? pic.twitter.com/k9nqO6bFfy — Ian Miles Cheong (@stillgray) July 1, 2023 ప్రస్తుతం హింస కాస్త తగ్గిందని ఫ్రెంచ్ ప్రభుత్వం వెల్లడించింది. ఆందోళనకారుల నిరసనల్లో 1,350 వహానాలు, 234 భవనాలు తగలబడిపోయాయని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో 2,560 అగ్ని ప్రమాదాలు జరిగాయని చెప్పింది. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా 45, 000 మంది పోలీసులు సాయుధ వాహనాలతో మోహరించారు. క్రాక్ పోలీస్, ఇతర భద్రతా దళాలను సైతం రప్పించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మార్సెయిల్ మేయర్ బెనాయిట్ పాయన్, వెంటనే అదనపు దళాలను పంపాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరారు.. ఫ్రాన్స్‌లోని మూడవ అతిపెద్ద నగరమైన లియోన్‌లో హెలికాప్టర్, సాయుధ సిబ్బంది క్యారియర్లు మోహరించాయి. ఉద్రిక్తతల కారణంగా పారిస్ శివారులోని క్లామర్ట్ టౌన్లో కర్ఫ్యూ విధించారు. ఇదిలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం తనిఖీల సమయంలో 17 ఏళ్ల యువకుడు నాహేల్‌ను ఓ పోలీస్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్సెయిల్, లియోన్లలో హింస, దాడులు అత్యంత దారుణ స్థాయికి చేరాయి. పారిస్ శివారు, గ్రెనోబుల్, సెయింట్-ఎటియెన్లోని కొన్ని ప్రాంతాల్లో హుడ్ ధరించిన నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచే బస్సు, ట్రామ్ సేవలను నిలిపివేశారు. బాణసంచా అమ్మకాలను కూడ నిషేధించారు. కాగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒమ్మాన్యుయేల్ మాక్రాన్ టీనెజ్ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియానే ఈ హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. వీడియోలు వైరల్ యాప్‌లు స్నాప్ చాట్, టిక్‌టాక్ లలో వాటిని తొలగించాలని కోరారు. మరోవైపు ఉద్రిక్త వాతావరణంలో నాన్టెర్రిలోని స్మశానవాటికలో నాహెల్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
ఒడిశా రైలు ప్రమాద ఘటన: ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
లండన్/మాస్కో: దుర్ఘటనకు పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు పంపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ‘మృతుల కుటుంబాల బాధను మేమూ పంచుకుంటాం. గాయాలపాలైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని టెలిగ్రామ్ ద్వారా ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సందేశం పంపారు. ‘విషాదంలో మునిగిన వారు, ప్రధాని మోదీ తరఫున మేం ప్రార్థనలు చేస్తున్నాం’ అంటూ రిషి సునాక్ ఒక ట్వీట్‌చేశారు. ‘ఒడిశా ప్రమాద ఘటనలో భారత్‌కు సంఘీభావంగా నిలుస్తున్నాం’ అని మాక్రాన్ ట్వీట్‌చేశారు. ప్రమాదంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జపాన్ ప్రధాని కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) , పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక విదేశాంగ మంత్రి, భూటాన్ ప్రధాని షెరింగ్, ఇటలీ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసభ అధ్యక్షుడు కసాబా కొరొసో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సానుభూతి సందేశాలు పంపించారు. -
ఫ్రాన్స్‌లో ప్రత్యేక అధికారాలతో పెన్షన్ బిల్లుకు ఆమోదం
పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వం పెన్షన్ సంస్కరణల్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతోంది. దేశ పార్లమెంటులో ఓటింగ్ జరగకుండానే బిల్లు చట్టరూపం దాల్చేలా ప్రత్యేకమైన రాజ్యాంగ అధికారాన్ని పొందేలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్యలు తీసుకున్నారు. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ తీసుకుని వచ్చిన ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీలోని దిగువ సభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అందుకే ఓటింగ్‌కి కొన్ని నిమిషాల ముందు ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ చట్టసభలు ఆమోదించకుండానే బిల్లు చట్టంగా మారేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 49:3ని వినియోగించుకున్నారు. ఈ కొత్త పెన్షన్ బిల్లుపై గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. -
ఎయిరిండియా బిగ్ డీల్..500 విమానాల కొనుగోలుకు ఒప్పందం!
ప్రపంచ చరిత్రలోనే తొలిసారి అరుదైన కొనుగోలు ఒప్పందం జరిగింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో టాటా గ్రూప్ తన విమానయాన సంస్థ ఎయిరిండియా కోసం ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ నుంచి 250 విమానాల కొనుగోలుకు డీల్ కుదుర్చుకుంది. ఇదే విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధికారికంగా ప్రకటించారు. విమానాల కొనుగోలు ఒప్పందం సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భారత్ నుంచి ఎయిరిండియా చైర్మన్ రతన్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియాలు పాల్గొనగా.. ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ , ఎయిర్‌బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుయిలౌమ్ ఫౌరీలు పాల్గొన్నారు. ఈ డీల్‌లో 40 ఏ350 వైడ్ బాడీ లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, 210 న్యారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు రతన్ టాటా ఆర్డర్ ఇచ్చారు. అనంతరం మోదీ మాట్లాడుతూ..ఫ్రాన్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకమని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా విమానా కొనుగోళ్లు.. ఏవియేషన్ రంగంలో భారత్ మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 15 ఏళ్లలో భారత్‌కు 2,500 విమానాలు అవసరం అవుతాయని గుర్తు చేశారు. ఇక ఈ ఒప్పందం భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మాక్రాన్ కొనియాడారు. ‘టాటా - ఎయిర్ బస్ సంస్థల ఒప్పందం హిస్టారిక్ మూమెంట్. ఈ కొనుగోలు ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు దోహహదపడుతుందని’ ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, మరో ఏవియేషన్ సంస్థ బోయింగ్ నుంచి 250 విమానాల కొనుగోలుపై టాటా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. -
France: ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్.. ఎందుకీ వ్యతిరేకత?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పెన్షన్ సంస్కరణలు దేశ చరిత్రలో అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దారి తీశాయి. పదవీ విరమణ వయసుని 62 నుంచి 64కి పెంచుతూ ప్రతిపాదనలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పెన్షన్ అందుకోవడానికి మరో రెండేళ్లు పని చేయాలా అంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు తెరుచుకోలేదు. కార్యాలయాలు మూతబడ్డాయి. ఈఫిల్ టవర్‌ను మూసేశారు. పారిస్ సహా పలు నగరాల్లో 10 లక్షల మందికిపైగా నిరసనకారులు వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 12 ట్రేడ్ యూనియన్లు, లెఫ్ట్ పార్టీలు, ఫార్ రైట్ పార్టీలు కలసికట్టుగా ఈ ఆందోళనల్లో పాల్గొనడం విశేషం. దేశంలో 68% ప్రజలు ఈ పెన్షన్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. రైట్ పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పెన్షన్ సంస్కరణల బిల్లుకు ఎంతవరకు మద్దతు లభిస్తుందన్న అనుమానాలున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపు ఎందుకు? ప్రపంచమంతటా సగటు ఆయుఃప్రమాణం పెరుగుతోంది. జననాల రేటు తగ్గిపోతోంది. దీంతో వయసు మీద పడినా కష్టపడి పని చేయాల్సి వస్తోంది. అయితే రిటైర్మెంట్ వయసు యూరప్‌లోకెల్లా ఫ్రాన్స్‌లోనే తక్కువ. స్పెయిన్‌లో 65, యూకేలో 67, జర్మనీలో 67 ఏళ్లుగా ఉంది. జర్మనీ కూడా రిటైర్మెంట్ వయసును 70 ఏళ్లకు పెంచే యోచనలో ఉంది. ఫ్రాన్స్ కూడా పెన్షన్ నిధుల్ని పెంచుకోవడానికే ఈ సంస్కరణలను తీసుకొచ్చింది. రెండేళ్ల రిటైర్మెంట్ వయసు పెంపుతో ఏడాదికి 1,770 కోట్ల యూరోలు జమ అవుతాయి. 2027 నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యపడుతుంది. ఎందుకీ వ్యతిరేకత? హాయిగా ఇంటి పట్టున ఉండి పెన్షన్ అందుకుందామని అనుకున్న వారు మరో రెండేళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరు. ఇంకా పని చేస్తే రిటైరవక ముందే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని రైల్వే వర్కర్లు, మహిళలు, నైట్‌షిఫ్ట్‌ల్లో ఉండేవారు ఆందోళనగా ఉన్నారు. కనీసం 43 ఏళ్లు పని చేయాలన్న నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలస్యంగా మొదలు పెట్టే మహిళలు, ఉన్నత విద్య చదివే వారు 67 ఏళ్ల దాకా పని చేయాల్సి వస్తుంది. మరోవైపు నిరుద్యోగులు కూడా తమకు ఉద్యోగాలు లేటవుతాయంటూ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లో కనీస పెన్షన్ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా లేదు. కరోనా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ధరాభారం పెరిగింది. ఫ్రాన్స్‌లో పెన్షన్ సంస్కరణలపై నిరసనలు ఇదేం మొదటి సారి కాదు. 2010లో రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచినప్పుడు కూడా ఇదే స్థాయి వ్యతిరేకత ఎదురైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడయ్యాక మాక్రాన్ ఈ సంస్కరణలు తేవాలని గట్టిగా అనుకున్నారు. 2019లో ఈ ప్రతిపాదిత సంస్కరణలకి వ్యతిరేకంగా సమ్మె జరిగినా కరోనా సంక్షోభంతో సమ్మెని ఆపేశారు. పెన్షన్ నిధి పెంచుకోవాలంటే సంపన్నులకి పన్నులు పెంచాలని, పెన్షన్ పథకంలో యాజమాన్యాల వాటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ పథకంలో సంస్కరణలివే ► రిటైర్మెంట్ వయసును ఏడాదికి మూడు నెలల చొప్పున పెంచుతూ 2030 నాటికి 64 ఏళ్లకు పెంచడం. ► 2027 తర్వాత చేరే ఉద్యోగులెవరైనా పూర్తి పెన్షన్ కోసం కనీసం 43 ఏళ్లు పని చేయాలి. ► పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిటైరయే నాటికి 43 ఏళ్ల సర్వీసు లేకపోతే 67 ఏళ్లు వచ్చేదాకా పని చేస్తేనే పెన్షన్ లభిస్తుంది. ► పూర్తి కాలం ఉద్యోగం చేసిన అల్పాదాయ వర్గాలకు 85% పెంపుతో పెన్షన్ 1200 యూరోలు అవుతుంది. 20 లక్షల మంది చిన్న ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ‘‘నేను ఒక కాస్మటిక్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా కార్యాలయంలో పని చేసే పరిస్థితుల్లేవు. మరో రెండేళ్లు పనిచేయాలంటే నా వల్ల కానేకాదు. ఈ పెన్షన్ బిల్లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’’ – వర్జీనియా, మహిళా ఉద్యోగి ‘‘నేను రైల్వేల్లో పనిచేస్తాను. శారీరక శ్రమ చేయాలి. చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటూ పని చేస్తున్నాను.ఈ పరిస్థితుల్లో ఎన్నేళ్లు వచ్చే వరకు పని చెయ్యగలను. కనీసం 43 ఏళ్ల సర్వీసు ఉంటేనే పెన్షన్ వస్తుందనడం చాలా అన్యాయం’’ – రైల్వే కార్మికుడు ఇక వృద్ధులు భారమేనా..? ► ప్రపంచ దేశాలు పెన్షన్లను ఖరీదైన వ్యవహారంగా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 50 ఏళ్ల క్రితం ప్రతీ 10 మందిలో 8 మందికి డిఫైన్డ్ బెనిఫిట్ పథకాలు వర్తిస్తే ఇప్పుడు ప్రతీ 10 మందిలో ఒక్కరికే వర్తిస్తోంది. ► ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం వృద్ధులలో దాదాపు మూడో వంతు మందికి పెన్షన్‌పై భరోసా లేదు. కొందరికి పెన్షన్ వస్తున్నా అది వారి కనీస అవసరాలకి ఏ మూలకూ సరిపోవడం లేదు. ► వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు ఆర్థికంగా అండదండగా ఉంటారన్న నమ్మకం లేదు. ఎందుకంటే పిల్లల సంఖ్య కూడా ప్రపంచమంతటా క్రమక్రమంగా తగ్గిపోతోంది. కుటుంబంలో పిల్లల సంఖ్య సగటున 1.7కి పడిపోయింది. ► 1960వ దశకంలో ప్రపంచ జనాభాలో ఒక వృద్ధునికి సగటున 12 మంది పని చేసే శ్రామికుల చొప్పున ఉండేవారు. కానీ ప్రస్తుతం అలా పని చేసేవారి సంఖ్య ఏకంగా ఎనిమిదికి పడిపోయింది! 2050 నాటికల్లా ఈ సంఖ్య మరీ తక్కువగా 4కు పడిపోతుందని అంచనా. దీంతో పని చేయలేని వృద్ధులను ప్రభుత్వాలు భారంగా చూసే రోజులొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఘోర అవమానం.. చెంప చెళ్లుమనిపించిన మహిళ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్‌కు మరోసారి ఘోర అవమానం ఎదురైంది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించింది. అధిక ధరలు, నిరుద్యోగాన్ని అరికట్టడంలో మెక్రాన్ విఫలమయ్యాడంటూ ఆరోపిస్తూ మహిళ దాడి చేసింది. భద్రతా సిబ్బంది వచ్చేలోపే ఆమె ఈ ఘటనకు పాల్పడింది. వెంటనే సెక్యూరిటీ గార్డులు మహిళను గుంపు నుంచి పక్కకు లాగి అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి పాల్పడిన మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బారియర్‌కు అటువైపున్న మాక్రాన్ తన ఎదురుగా ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడ గుంపులో ఉన్న ఓ మహిళ అధ్యక్షుడి చెంప పగలగొట్టింది ఫ్రాన్స్‌లోని డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్'హెర్మిటేజ్ అనే పట్టణాన్ని మాక్రాన్ సందర్శించిన సమయంలో ఈ దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. చదవండి: 10 రోజుల్లో 12 మందికి శిరచ్ఛేదం.. మరణ దండనలో రాజీపడని సౌదీ.. Emmanuel Macron got slapped up again pic.twitter.com/puqyPnJOyB — Luke Rudkowski (@Lukewearechange) November 20, 2022 ఇదిలా ఉండగా గతేడాది కోవిడ్ సమయం జూన్‌లో కూడా మెక్రాన్‌పై ఓ ర్యాలీలో దాడి జరిగింది. ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా ఓ యువకుడు ఆయన చెంపపై కొట్టాడు.అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని నాలుగు నెలలపాటు జైలు శిక్ష వేశారు. అయితే మాక్రాన్‌పై దాడి ఘటన ఇప్పటిది కాదని.. ఇది పాత వీడియో అని కొందరు ప్రచారం చేస్తున్నారు. గతేడాది జరిగిన సంఘటనకు సంబంధించినది చెబుతున్నారు. అంతేగాక దాడి చేసింది మహిళ కాదని వ్యక్తి అని అంటున్నారు. వీడియో వెనక భాగం నుంచి రికార్డ్ చేయడం ద్వారా మహిళ అధ్యక్షుడిపై దాడి చేసినట్లు కనిపిస్తుందని వాస్తవానికి అది అబ్బాయి అని పేర్కొంటున్నారు. ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. -
హిరోషిమా అణుబాంబు విషయమై పుతిన్ కీలక వ్యాఖ్యలు... షాక్‌లో ఫ్రాన్స్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సంభాషించారు. ఆ సంభాషణలో జపాన్ అణుబాంబు దాడుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. పుతిన్ మరోసారి అణుదాడుల గురించి సంభాషించడం దిగ్భ్రాంతి గురి చేసిందని యూకే స్థానిక మీడియా డైలిమెయిల్ పేర్కొంది. అదీగాక పుతిన్ అవసరమైతే ఉక్రెయిన్‌పై వ్యూహాత్మక అణుదాడులు చేస్తానంటూ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో పుతిన్ సంభాషిస్తూ...1945లో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా తన మొదటి అణుబాంబును వేసిన మూడు రోజుల తర్వాత యూఎస్ జపాన్‌లోని నాగసాకిని లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని పునురుద్ఘాటించారు. జపాన్ లొంగిపోయేలా రెండో ప్రపంచ యుద్ధం ముగిసేలా జరిపిన బాంబు దాడులు గురించి మాట్లాడారు. అలాగే తాము గెలవాలంటే ప్రధాన నగరాలపై దాడిచేయాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా అణు దాడికి రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అంతేగాదు మాక్రాన్‌తో పుతిన్ కీవ్‌ని వదిలేసి తూర్పు ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక అణుదాడి చేసే అవకాశం ఉందనే సంకేతం ఇచ్చారని డెయిల్ మెయిల్ పేర్కొంది. కానీ రష్యా పదేపదే తన నియంత్రణలో ఉ్నన ఖేర్సన్ ప్రాంతంపై డర్టీ బాంబు ప్రయోగించనుందంటూ ఆరోపణలు చేస్తోంది. ఐతే ఉక్రెయిన్ విదేశంగ మంత్రి డిమిట్రో కులేబా రష్యా తాను చేస్తున్న కుట్రని ఇతరులు చేస్తున్నట్లుగా చిత్రీకరించడం అలవాటు అంటూ మండిపడ్డారు. (చదవండి: దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు) -
ఔను! మోదీ చెప్పింది కరెక్ట్... ప్రశంసించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
Prime Minister Narendra Modi was right: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన శాంతి సందేశం సరైనదేనని ఫ్రాన్స్ ఇమ్మాన్యయేల్ మాక్రాన్ ప్రశంసించారు. ఈ మేరకు మాక్రాన్ న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశంలో మోదీ సందేశాన్ని ప్రస్తావిస్తూ..ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ పుతిన్‌కి ఇచ్చిన సందేశం సరైనదని అన్నారు. ఔను! ఇది యుద్ధానికి సరైన సమయం కాదు అని మోదీ వ్యాఖ్యలను పునురుద్ఘాటించారు. ప్రస్తుతం పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా వ్యతిరేకించడానికి సరైన సమయం కాదని, మనమంతా సమిష్టిగా మన సార్వభౌమాధికారాలను కాపాడుకుంటూ సవాళ్లను ఎదర్కొనే సమయం అని పుతిన్‌కి మోదీ హితువు పలికారు. ఆ విషయాలను గురించే మాక్రాన్ మాట్లాడుతూ మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోదీ పుతిన్‌తో ఉక్రెయిన్ యుద్ధం విషయమై ఇలా సంభాషించారు. ఆ సదస్సులో మోదీ పుతిన్‌తో ఇంకా ...."భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలు సమస్యలు గురించి చాలా సార్లు మాట్లాడానంటూ గుర్తు చేశారు. ఆహారం, ఇంధన భద్రత, ఎరువుల సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు కనుగొనాలి అన్నారు. అలాగే ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తరలించడంలో మాకు సహాయం చేసినందుకు రష్యాకి, ఉక్రెయిన్‌కి ధన్యావాదాలు" అని మోదీ చెప్పారు. ఆ వ్యాఖ్యలకు పుతిన్ స్పందించి...ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ విధానం గురించి తమకు తెలుసునని, భారత్ ఆందోళనను అర్థం చేసుకుంటున్నామని అన్నారు. సాధ్యమైనంతవరకు దీన్ని ముగించేయాలనే అనుకుంటున్నాం అని చెప్పారు. అంతేగాదు రష్యా భారత్‌ల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, అవి మరింతగా కొనసాగుతాయని పుతిన్ అన్నారు. (చదవండి: రాణి పోయింది... రాజ కుటుంబ కలహాల పుల్‌స్టాప్‌కు ఇదే రైట్ టైం) -
సంచలనం: అడ్డదారిలో ఉబర్ క్యాబ్,వేల కోట్ల డాలర్ల నిధులు మళ్లింపు!
యాప్ ఆధారిత చౌక ట్యాక్సీ సేవల పేరుతో దశాబ్ద కాలం క్రితం (2009లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఉబర్ .. అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా 30 పైచిలుకు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో వ్యవస్థలను, రాజకీయ నేతలను మేనేజ్ చేసింది. డ్రైవర్లను వాడుకుంది. కార్మిక, ట్యాక్సీ చట్టాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేల కోట్ల డాలర్లు వెచ్చించి నేతలతో లాబీయింగ్ చేయడం మొదలుకుని, పన్నుల ఊసు ఉండని దేశాలకు లాభాలను మళ్లించడం, డ్రైవర్లను బలిపశువులను చేయడం వరకూ అన్ని అడ్డదారులూ తొక్కింది. ఇలా ఉబర్ పాటించిన తప్పుడు విధానాలను రుజువు చేసే డాక్యుమెంట్స్ లీకవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఉన్న వీటిని ఉబర్ ఫైల్స్ పేరిట అంతర్జాతీయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల కన్సార్టియం అయిన ఐసీఐజే బైటపెట్టింది. గతంలో ప్రముఖుల అక్రమాస్తులను పనామా పేపర్స్ పేరిట బైటపెట్టి సంచలనం సృష్టించినది కూడా ఈ ఐసీఐజేనే కావడం గమనార్హం. 1,24,000 పైచిలుకు డాక్యుమెంట్స్ లీక్ కాగా వీటిలో 83,000 పైచిలుకు ఈమెసేజీలు, వాట్సాప్ మెసేజీలు ఉన్నాయి. ఉబర్ సహ–వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ సారథ్యంలో 2013–2017 మధ్య కాలంలో ఉబర్ విస్తరణ గురించిన వివరాలు వీటిలో ఉన్నాయి. లింగ వివక్ష, లైంగిక వేధింపుల ఆరోపణలతో 2017లో కలానిక్ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లు తొలుత బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది గార్డియన్‌కు, అక్కణ్నుంచి ఐసీఐజేకి అందాయి. యూరప్‌లో ఉబర్ తరఫున లాబీయిస్టుగా పనిచేసిన మార్క్ మెక్‌గాన్.. ఈ అక్రమాలను బైటపెట్టడంలో కీలకమైన ప్రజావేగుగా వ్యవహరించారు. యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. రైడ్ షేరింగ్ యాప్ ద్వారా చౌకగా ట్యాక్సీ సేవలను అందించే క్రమంలో ఉబర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు అనిపించినప్పటికీ.. వాస్తవానికి వ్యాపార విస్తరణ కోసం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు ఉబర్ ఫైల్స్ ద్వారా వెల్లడైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సన్నిహితులైన వ్యక్తులు ఉబర్‌కు లాబీయిస్టులుగా పనిచేశారు. కంపెనీ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ నిలిపివేయాలంటూ దర్యాప్తు సంస్థలను, కార్మిక .. ట్యాక్సీ చట్టాలను సవరించాలంటూ, డ్రైవర్ల బ్యాగ్రౌండ్ ధ్రువీకరణ నిబంధనలను సడలించాలంటూ అధికారులపై వారు ఒత్తిడి తెచ్చారు. యూరప్ తదితర మార్కెట్లలోనూ ఉబర్ ఇదే తరహా ధోరణిలో విస్తరించింది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి ఎమాన్యుయెల్ మాక్రాన్ (ప్రస్తుత అధ్యక్షుడు), యూరోపియన్ కమిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నీలీ క్రోయెస్ వంటి వారు ఇందుకు సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, మిగతా మార్గాలేవీ పనిచేయనప్పుడు విచారణ జరిపే దర్యాప్తు సంస్థలకు వివరాలను దొరకనియ్యకుండా చేసేందుకు ఉబర్ ‘‘కిల్ స్విచ్’’అనే స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించింది. సోదాల్లో కీలక ఆధారాలు అధికారులకు చిక్కకుండా ఇది ఆటోమేటిక్‌గా ఉబర్ సర్వర్లకు యాక్సెస్ నిలిపివేసేది. ఉబర్ ఇలా కనీసం ఆరు దేశాల్లో చేసింది. అలాగే, మిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఉబర్ తనకు వచ్చే లాభాలను బెర్ముడా తదితర ట్యాక్స్ హేవెన్స్కు (పన్నుల భారం ఉండని దేశాలు) మళ్లించింది. ఔను తప్పే.. కానీ ఇప్పుడు మారాము.. తాజా పరిణామాలపై ఉబర్ స్పందించింది. గతంలో తప్పిదాలు జరిగిన సంగతి వాస్తవమేనని.. వాటిని సమర్థించుకోబోమని పేర్కొంది. ఆ తప్పిదాల ఫలితంగా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు ఉబర్ తెలిపింది. కొత్త సీఈవో దారా ఖుస్రోవ్షాహీ వచ్చాక గత అయిదేళ్లలో కంపెనీ పనితీరు పూర్తిగా మారిపోయిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 90 శాతం మంది .. దారా సీఈవోగా వచ్చాక చేరినవారేనని పేర్కొంది. పోటీ సంస్థలతో పాటు లేబర్ యూనియన్లు, ట్యాక్సీ కంపెనీలు మొదలైన వర్గాలతో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఉబర్ వివరించింది. -
ఆ పోరులో మాతో కలిసి రండి.. జీ-7కు ప్రధాని మోదీ పిలుపు
ఎల్మౌ (జర్మనీ): పర్యావరణ పరిరక్షణకు, తత్సంబంధిత వాగ్దానాలకు భారత్ పూర్తిగా కట్టుబడిందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కొన్నేళ్లుగా భారత్ కనబరుస్తున్న పనితీరే అందుకు నిదర్శనమన్నారు. వాతావరణ మార్పులపై పోరులో సంపన్న జీ7 దేశాలు కూడా భారత్‌తో కలిసి వస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. స్వచ్ఛ ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి భారత్‌లో అందుబాటులో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని వాటికి పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఇక్కడ జీ7 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ మార్పులు, ఇంధనం తదితరాలపై జరిగిన భేటీలో మాట్లాడారు. ఇంధన సామర్థ్యంలో 40 శాతాన్ని శిలాజేతర వనరుల నుంచి సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని గడువుకు 9 ఏళ్ల ముందే సాధించామన్నారు. ‘‘పేద దేశాలు పర్యావరణానికి బాగా హాని చేస్తున్నారన్న అపోహను దూరం చేయడంలో భారత్ చిత్తశుద్ధి ఇతర వర్ధమాన దేశాలకూ స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రపంచ జనాభాలో 17 శాతానికి భారత్ నిలయం. కానీ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో దేశ వాటా కేవలం 5 శాతం. ప్రకృతితో కలిసి సాగే మా జీవన విధానమే ఇందుకు ప్రధాన కారణం’’ అన్నారు. ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో జీ7 వేదికైన ఎల్మౌలో సోమవారం మోదీకి జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం అధినేతల ఫొటో సెషన్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీ వద్దకు స్వయంగా వచ్చి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు కూడా మోదీతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతూ కన్పించారు. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడొ తదితరులతో మోదీ భేటీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సదస్సులో జి7 దేశాలైన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, కెనడా, జపాన్‌తో పాటు భారత్, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, సెనెగల్, అర్జెంటీనా దేశాధినేతలు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఛాయ్ పే చర్చలో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు జీ7 బాసట రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని జి7 దేశాధినేతలు ప్రతినబూనారు. యుద్ధం కాలంలో, తర్వాత కూడా మద్దతిస్తూనే ఉంటామన్నారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేనందున తమకు సాయంపై పశ్చిమ దేశాలు వెనుకంజ వేస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని జి7 దేశాధినేతలు కొట్టిపారేశారు. రష్యా నుంచి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌కు నానామ్స్ సిస్టమ్ అత్యాధునిక యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ ‘నాసమ్స్’ను ఉక్రెయిన్ అందించాలని అమెరికా నిర్ణయించింది. కౌంటర్–బ్యాటరీ రాడార్లు కూడా ఇవ్వనుంది. 7.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయమూ అందజేస్తామని బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి జి7 సహకారం కొనసాగిస్తూనే ఉండాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. -
అయిదేళ్ళ అగ్నిపరీక్ష!
వ్యక్తిగతంగా చరిత్రాత్మక విజయం సాధించినా, ఒక్కోసారి అది వ్యవస్థను నడపడానికి చాలక పోవచ్చు. గెలిచామన్న ఆనందం కళ్ళ ముందు కొద్ది రోజులకే ఆవిరి అయిపోనూ వచ్చు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పరిస్థితి ఇప్పుడు అదే! రెండునెలల క్రితం ఏప్రిల్‌లో దేశానికి వరుసగా రెండో సారి అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన ఆయన తీరా తాజా పార్లమెంట్ దిగువ సభ ఎన్నికల్లో తమ పార్టీ కూటమికి 289 సీట్ల మెజారిటీని కూడగట్టుకోలేకపోయారు. అనుమానిస్తున్నట్టే ఆదివారం నాటి ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెక్రాన్‌కు చేదు అనుభవమయ్యాయి. 577 సీట్ల సభలో ఆయన కూటమి 245 స్థానాలకే పరిమితమైంది. మునుపటి 350 స్థానాల స్థాయి నుంచి ఏకంగా 100కు పైగా సీట్లను తమ కూటమి కోల్పోవడంతో మెక్రాన్‌కు నిద్ర లేని రాత్రులు మొదలయ్యాయి. ఎగువ సభ ‘సెనేట్’, దిగువ సభ ‘నేషనల్ అసెంబ్లీ’ – ఇలా సభాద్వయ విధానమున్న ఫ్రాన్స్ పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ఫలితాలు పలురకాలుగా దిగ్భ్రాంతి కలిగించాయి. అనేక సంక్షోభా లున్న వేళ పార్లమెంట్లో తమ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుంటే, ఫ్రాన్స్‌లో, తద్వారా ప్రపంచంలో అస్తవ్యస్తత తప్పదంటూ మెక్రాన్ ఈ ఎన్నికల వేళ ఓటర్లను అభ్యర్థించారు. కానీ, ఓటర్లు ఆ మాటను నిర్ద్వంద్వంగా తిరస్కరించారన్నది స్పష్టం. కూటమిలోని హేమాహేమీలు ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం. పార్లమెంట్లో ప్రధాన బలం ఇప్పటికీ మెక్రాన్ సారథ్యంలోని మధ్యేవాద ‘ఎన్సెంబుల్’ కూటమిదే. కానీ సభలో మెజారిటీయే దక్కలేదు. 1988 తర్వాత అధ్యక్షు డిగా గెలిచినా, ఫ్రాన్స్ పార్లమెంట్లో మెజారిటీ సాధించలేకపోయిన తొలి ప్రెసిడెంట్ మెక్రానే. అతి తక్కువగా 46.23 శాతమే ఓటింగ్ నమోదైన ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో ఫ్రాన్స్ ఛాందస మితవాద పార్టీలు మునుపెన్నడూ లేనంతటి విజయం సాధించడం మరో విశేషం. రెండు నెలల క్రితమే అధ్యక్ష ఎన్నికల్లో మెక్రాన్ చేతిలో ఓడిపోయిన మహిళా నేత మెరైన్ లీ పెన్ సారథ్యంలోని ఆ కూటమి 8 నుంచి 89 స్థానాలకు ఎగబాకింది. అలాగే, ఫ్రాన్స్‌లో చీలికలు పేలికలుగా ఉన్న లెఫ్ట్ పార్టీలు ఈసారి అగ్గిబరాటా లాంటి సీనియర్ వామపక్షీయుడు జీన్ లుచ్ మెలెన్ఛాన్ నేతృత్వంలో ‘న్యూప్స్’ పేరిట కొత్త కూటమిగా ఏర్పడి, సత్తా చాటాయి. 2017లో ఈ పార్టీలన్నీ విడివిడిగా గెలి చినవాటికి రెట్టింపు పైనే సీట్లు సాధించి, 131 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షం కావడం అనూహ్యం. తాజా ఎన్నికల ఓటమిలో మెక్రాన్ పక్షం తప్పులూ చాలా ఉన్నాయి. ఏప్రిల్‌లో అధ్యక్ష ఎన్నికల విజయంతో వచ్చిన ఉత్సాహం మీదే ప్రధానంగా ఆ కూటమి ఆధారపడింది. ఈసారీ గెలుస్తాం లెమ్మనే అర్థంపర్థం లేని భరోసా పెట్టుకుంది. నిస్తేజంగా ప్రచారం నడిపింది. దాని పర్యవసానమే తాజా ఫలితాలు. అలాగే, ఒక్కతాటి మీదకు వచ్చిన వామపక్షాలను పెద్ద బూచిగా చూపిస్తూ, మెక్రాన్ తెలివితక్కువగా వ్యవహరించారు. అది సంప్రదాయవాదుల పట్ల వ్యతిరేకతకు గండికొట్టింది. చివరకు అటుపోయి, ఇటుపోయి సంప్రదాయవాద కూటమికే కలిసొచ్చింది. సభలో మెజారిటీ మెక్రాన్‌కు అందని మ్రానిపండయింది. ఈ రెండోసారి అధ్యక్ష పదవీకాలంలో ఆయన మునుపటి కన్నా భిన్నంగా వ్యవహరించక తప్పని పరిస్థితి వచ్చిపడింది. 2017లో తొలిసారి ఫ్రాన్స్ అధ్యక్ష పీఠమెక్కిన మెక్రాన్ కొన్నిసార్లు సర్వం సహాధిపతిలా వ్యవహరించారు. రాజకీయంగా అంతా తానే అన్నట్టు ప్రవర్తించారు. ఫలితంగా, ఆయనకు దూరమైన ఓటర్లు తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన రెక్కలు కత్తిరించారనుకోవాలి. ఇప్పుడిక రానున్న అయిదేళ్ళ అధ్యక్ష పదవీ కాలంలో మెక్రాన్ తాను అనుకున్నట్టు పాలన సాగించాలంటే, కొత్త మిత్రపక్షాలను కూడదీసుకోక తప్పదు. ఆ క్రమంగా అనేక అంశాలపై రాజీలూ పడక తప్పదు. పదవీ విరమణ వయస్సును పెంచడం, సంక్షేమ సంస్కరణల్ని ప్రవేశపెట్టడం లాంటి మెక్రాన్ ఆలోచనలు ఏమవుతాయో ఇప్పుడే చెప్పలేం. ఆ ప్రతిపాదనలకు ఇతర పార్టీల సభ్యుల మద్దతును ఏ మేరకు ఆకర్షించగలుగుతారన్నది చూడాలి. నిన్నటి దాకా రబ్బరు స్టాంపు అనుకున్న నేషనల్ అసెంబ్లీ రాత్రికి రాత్రి కీలకంగా మారడం ఫ్రెంచ్ ప్రజాస్వామ్యానికి మంచిదే. అయితే, ఉక్రెయిన్‌లో యుద్ధం, పర్యావరణ ఆత్యయిక పరిస్థితుల లాంటి అనేక సవాళ్ళపై తక్షణం చర్యలు చేపట్టాల్సిన తరుణంలో పార్లమెంటులో మెజారిటీ లేక పాలన కుంటుపడితే కష్టమే. మొత్తానికి, నేషనల్ అసెంబ్లీ ఫలితాలతో ఫ్రాన్స్‌లో కొత్త కథ మొదలైంది. మరో వారంలో కొత్త పార్లమెంట్ తొలిసారి కొలువు తీరగానే జీవన వ్యయానికి సంబంధించిన బిల్లుతో ఆట ఆరంభమవు తుంది. పార్లమెంట్లో అవసరమైన మెజారిటీ కన్నా కనీసం 44 సీట్లు తక్కువున్న మెక్రాన్ సర్కార్ ఏ బిల్లుకు ఆమోదముద్ర వేయించాలన్నా ప్రతిపక్షాలపై ఆధారపడక తప్పదు. ఇలా పార్లమెంట్లో ఆయనకు ప్రతిరోజూ అగ్నిపరీక్షే! ఫ్రాన్స్‌లో విదేశాంగ విధానమంతా అధ్యక్షుడి వ్యవహారమే కానీ, ఖండాంతర దౌత్యవేత్తగా పేరు తెచ్చుకున్న మెక్రాన్ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాంగ విధానం పక్కనబెట్టి, తన పదవీ కాలమంతా దేశీయ అజెండా పైనే దృష్టి సారించక తప్పదు. అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, కనీసం ఐరోపా స్థాయిలోనూ ఆయన మునుపటిలా రాజకీయ విన్యాసాలు చేయలేకపోవచ్చు. ఇదంతా ఐరోపా రాజకీయ వ్యవహారాలపై ప్రభావం చూపవచ్చు. వెరసి, ఇటు మెక్రాన్‌కూ, అటు ఫ్రాన్స్ పార్లమెంట్‌కూ గతుకుల బాటలో పయనం తప్పదు. అయితే, జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఆ ప్రయాణం సాగితే ప్రజాస్వామ్యానికి మంచిది. -
పార్లమెంట్లో అమ్మాయిల డ్యాన్స్ స్టెప్పులు.. వీడియో వైరల్
యూరప్ పార్లమెంట్లో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐరోపా భవిష్యత్ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో మండిపడ్డారు. వివరాల ప్రకారం.. ఇటీవల యూరప్ భవిష్యత్‌పై సమాలోచన జరిగింది. అందులో భాగంగా నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్లో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో చివరి రోజు సందర్భంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న అంశంపై చర్చించారు. కాగా, ఈ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా కొందరు యువతీయువకులు ప్రత్యక్షమై 10 నిమిషాల పాటు డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) భవిష్యత్తు ఇదే అయితే.. మీరంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లేనని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌కు చెందిన మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈయూతో బ్రేకప్ పట్ల సంతోషంగా ఉన్నానంటూ కామెంట్ చేశాడు. మరోవైపు తన కీలక ప్రసంగం ముందు జరిగిన ఈ డ్యాన్స్ ప్రదర్శనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అసహనం వ్యక్తం చేశారు. #EU Interpretive dance performed at European Parliament But Emmanuel Macron looked unimpressed as the European Parliament was treated to a nine-minute youth dance session “to embody the French Presidency of the European Council” on Monday ahead of his key speech to the assembly pic.twitter.com/g9Gqe9Qamx — Freedom Truth Honor 🇺🇳 (@FreedomHonor666) May 10, 2022 ఇది కూడా చదవండి: ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది: మనికే మగే హితె సింగర్ యోహానీ -
మాక్రాన్‌తో మోదీ భేటీ
పారిస్: ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ఇండో–ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. ప్రపంచశాంతి కోసం ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రణాళికలపై ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. డెన్మార్క్ పర్యటన అనంతరం మోదీ ఫ్రాన్స్ స్వల్పకాలిక పర్యటనకు వచ్చారు. పారిస్‌లోని ఎలైసీ పాలస్‌లో మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరిపారని విదేశాంగ శాఖ తెలిపింది. మాక్రాన్‌ను కలవడం సంతోషాన్నిచ్చిందని, ఇండియా, ఫ్రాన్స్‌లు పలు రంగాల్లో కీలక భాగస్వాములని మోదీ ట్వీట్ చేశారు. వివిధ అంతర్జాతీయ సంక్షోభాలు, ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం, భారత్ కీలక పాత్ర పోషించే ఎఫ్‌ఏఆర్‌ఎం కార్యక్రమంపై మోదీతో చర్చించానని మాక్రాన్ ట్వీట్ చేశారు. వీలైనంత త్వరలో భారత పర్యటనకు రావాలని మాక్రాన్‌ను మోదీ ఆహ్వానించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిస్థాపనకు రెండుదేశాలు కీలక భాగస్వామ్యం కొనసాగిస్తున్నాయని, ఈ ప్రాంతం స్వేచ్ఛగా ఉండాలన్నది ఇరుదేశాల ఆకాంక్షని ఉమ్మడి ప్రకటన తెలిపింది. పరోక్షంగా ఈ ప్రాంతంపై చైనా పెత్తనాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో పౌర మరణాలను ఇరువురూ ఖండించారు. వెంటనే ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాలని, చర్చలు ఆరంభించాలని విజ్ఞప్తి చేశారు. ఐరాస నిబంధనలను అందరూ గౌరవించాలని కోరారు. శీతోష్ణస్థితి మార్పుపై ఉమ్మడి పోరాటం శీతోష్ణస్థితి మార్పును గతంలో కన్నా బలంగా ఎదుర్కోవాలని ఇండియా, ఫ్రాన్స్ నిర్ణయించాయి. పర్యావరణహిత సాంకేతికతలను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాక్రాన్, మోదీ చర్చలు జరిపారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) లక్ష్యాలకు తమ మద్దతు ప్రకటించారు. జాతీయ హైడ్రోజన్ మిషన్‌లో పాలుపంచుకోమని ఫ్రాన్స్‌ను భారత్ ఆహ్వానించింది. PM @narendramodi and President @EmmanuelMacron meet in Paris. This meeting will add momentum to the 🇮🇳 🇫🇷 friendship. pic.twitter.com/bblaQf96F8 — PMO India (@PMOIndia) May 4, 2022 -
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు దిమ్మతిరిగే షాక్.. వీడియో
ఇటీవల జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి మరీన్ లీపెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల రోజునే ఆయన గెలుపును జీర్ణించుకోలేని వ్యతిరేకవాదులు మాక్రాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మాక్రాన్ ఫ్రెంచ్ పట్టణంలోని ఓ ఫుడ్ మార్కెట్లో కొంత మందితో మాట్లాడుతుండగా ఆయనపై నిరసనకారులు టమాటాలతో విసిరారు. వెంటనే మాక్రాన్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయి ‘ప్రొజెక్టల్’ అంటూ గట్టిగా అరుస్తూ ఆయనకు రక్షణగా నిలిచారు. దీంతో మాక్రాన్‌కు ఈ పర్యటన సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. Emmanuel Macron made his first appearance since his election, he received tomato from the French crowd. pic.twitter.com/s6AnNM75TI — 🍁En el barrio de Cortes viven residentes (@VecBarrioCortes) April 27, 2022 కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా పాల్గొన్న మొదటి పబ్లిక్ మీట్లోనే ఇలా జరగడంతో మాక్రాన్ ఖంగుతిన్నారు. ఈ ఘటన అనంతరం మాక్రాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ఇదేం రూల్ సామీ.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ.20 వేలు ఫైన్! -
పాత కిరీటం – కొత్త సవాళ్ళు
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలలో ఇమాన్యుయేల్ మెక్రాన్ ఎట్టకేలకు విజయం సాధించారు. అది ఆ దేశానికే కాక యూరప్‌కూ, మన దేశానికీ శుభవార్తే. పుతిన్‌కు సమర్థకురాలైన ఛాందసవాద, ప్రత్యర్థి మహిళా నేత మెరైన్ లీ పెన్ గెలిస్తే... ఫ్రాన్స్‌లో ప్రజాస్వామ్యం క్షీణిస్తుందనీ, యూరప్‌లో అశాంతి నెలకొంటుందనీ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంటుందనీ ఓ దశలో ఆందోళన వినిపించింది. అందుకే, యూరప్‌లో సుస్థిరత, శాంతి కోరుకుంటున్న వారందరికీ మళ్ళీ మెక్రానే గెలవడం ఓ తీపికబురు. ప్రజాస్వామ్య ఫ్రాన్స్‌కూ, పటిష్ఠమైన యూరప్‌కూ, భారత్ – ఫ్రాన్స్‌ల మధ్య మరింత పటిష్ఠ సంబంధాలకూ కీలక పరిణామం. అయితే, గడచిన అయిదేళ్ళలో ఫ్రాన్స్ అభివృద్ధి, సుస్థిరతపై దృష్టి పెట్టిన మెక్రాన్‌కు ఇప్పుడీ రెండో విడత అధ్యక్ష పదవి మరింత సవాలు కానుంది. ప్రత్యర్థిగా ఒక దశలో గట్టి పోటీ ఇచ్చిన లీ పెన్ ఓటమి అమెరికా సహా అనేక దేశాలకు పెద్ద ఊరట. పుతిన్ విధానాలను సమర్థించే ఆమె 2017లో రష్యాలో సైతం పర్యటించారు. ఉక్రెయిన్‌లో సుదీర్ఘంగా నడుస్తున్న యుద్ధం నేపథ్యంలో రష్యా అనుకూల వైఖరి ఉన్న ఆమె గెలిచి ఉంటే, అది గొంతులో పచ్చి వెలక్కాయ అయ్యుండేది. ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యాపై ఒత్తిడి పెంచాలని అమెరికా, ఐరోపా సమాజం (ఈయూ) చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలేది. పైపెచ్చు, ‘నాటో’, ఈయూ, అమెరికా అంటే ఆమెకు బొత్తిగా పడదు. అదీ కాక, ఆమె విజయం సాధిస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్లు, ప్రపంచమంతటా ఇస్లామోఫోబియాకు ప్రోద్బలం లభించేదని పరిశీలకుల భావన. ఇస్లామ్ సహా మైనారిటీ వర్గాల పట్ల దుర్విచక్షణ లేని ఫ్రాన్స్‌లో సామరస్యపూర్వక సామాజిక చట్రమూ దెబ్బతినిపోయేదని వారి భయాందోళన. లీ పెన్కు కాకుండా మెక్రాన్కే ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తూ, ఫ్రాన్స్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ‘లా మోందే’ అనే దినపత్రికలో జర్మన్ ఛాన్సలర్ ఓలఫ్ షోల్జ్ ఏకంగా ఓ వ్యాసమే రాశారు. పొరుగు దేశపు రాజకీయాల గురించి ఇలా మరో దేశ నేత వ్యాసం రాయడం అసాధారణమే. అయితే, విమర్శలు వచ్చినా సరే యూరప్ భవిష్యత్తు పట్ల అక్కర చూపడమే ముఖ్యమని షోల్జ్ భావించారనుకోవాలి. భారత్ సంగతికొస్తే, మెక్రాన్ మళ్ళీ గద్దెనెక్కడం ఈ మండు వేసవిలో చల్లటి వార్త. పాశ్చాత్య దేశాలన్నిటిలోకీ ఇవాళ మన దేశానికి సన్నిహిత మిత్ర దేశం ఫ్రాన్సే. ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞాన సరఫరా సహా అనేక అంశాల్లో, రంగాల్లో మన దేశానికి ఫ్రాన్స్ కావాల్సినంత సాయం అందిస్తోంది. ఇరుదేశాలూ పరస్పర కీలక ప్రయోజనాలకు తగ్గట్లు సున్నితంగా వ్యవహరిస్తూ, ద్వైపాక్షిక సంబంధాల్లో ఆదర్శంగా నిలుస్తున్నాయి. మన ప్రధానికీ, మెక్రాన్‌కూ మంచి దోస్తీ కూడా ఉంది. ఆ రకంగా తాజా ఎన్నికల ఫలితాలు మనకూ మంచివే. చాలామంది కోరుకున్నట్టే చివరకు లీ పెన్ ఓడిపోయారు. వరుసగా మూడోసారీ ఆమెను అదృష్టం వరించలేదు. అయితే, ఇంతటితో కథ ముగిసిందనుకోవడానికి వీల్లేదు. తొలిసారి గెలిచిన ప్పుడు 68 శాతం ఓటు షేర్ తెచ్చుకున్న మెక్రాన్ ఇప్పుడీ రెండోసారి 58.5 శాతంతోనే తృప్తిపడాల్సి వచ్చింది. ఫ్రెంచ్ రాజకీయాలను ఛాందస వాదం వైపు నడిపించడంలో పెన్ కొంత విజయం సాధించారనే చెప్పాలి. 2017లో కేవలం 32 శాతం ఓటు షేర్ తెచ్చుకున్న ఆమె ఈసారి దాదాపు 42 శాతానికి బలం పెంచుకోవడం గమనార్హం. ఆమెకూ, ఛాందసవాదానికీ పెరుగుతున్న ఆమోద యోగ్యతకు ఇది తార్కాణం. అదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధారణ పైన, వలస దారుల పైన నిషేధం లాంటి శ్రుతి మించిన ఆమె విధానాలను ఫ్రాన్స్ ఓటర్లు వ్యతిరేకించారన్న మాట. చివరకు తమ దేశపు ఆదర్శమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను నిలబెట్టారు. లీ పెన్ ఓటమితో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ లాంటి దృశ్యం ఫ్రాన్స్‌లో తప్పిపోయిందని విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. అదేమో కానీ, ఆమె విజయం సాధించి ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రాన్స్ వైఖరి మారిపోయి ఉండేదనడంలో సందేహం లేదు. నిజానికి, గత హయాంలో భారీగా పెరిగిన ధరలు, రిటైర్మెంట్ వయసు, మెక్రాన్ ‘ఉన్నతవర్గ ప్రవర్తన’ లాంటివన్నీ ఆయన ప్రాచు ర్యాన్ని అమాంతం కిందకు పడేశాయి. తీరా ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచంలో రష్యా అధినేత పుతిన్ పట్ల ప్రబలిన వ్యతిరేకత సైతం ప్రత్యర్థి లీ పెన్కు ప్రతికూలంగా పరిణమించి, ఆ నెగిటివ్ ఓటింగ్ మెక్రాన్‌కు కలిసొచ్చింది. ఆ సంగతి ఆయనా ఒప్పుకున్నారు. తాజా ఎన్నికల్లో దాదాపు 28 శాతం మంది ఓటింగే చేయలేదు. మొన్న ఆదివారం ఓటింగుతో సౌకర్యవంతమైన ఆధిక్యం సాధించి, రాజకీయంగా గెలిచిన ఆయన ముందుగా మునుపటి సమస్యలను పరిష్కారించాల్సి ఉంటుంది. ర్యాడికల్ మధ్యేవాదాన్ని నమ్ముకొన్న ఈ మాజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రేపు జూన్‌లో రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో ఇటు వామపక్షవాదుల నుంచీ, అటు ఛాందస మితవాదుల నుంచీ గట్టి సవాలును ఎదుర్కోనున్నారు. ఆ ఎన్నికల్లోనూ ఆయన తన ఆధిక్యాన్ని నిలుపుకోవాల్సి ఉంటుంది. అసంతృప్త ఓటర్లను సైతం తన వైపు తిప్పుకొని, ప్రత్యర్థి లీ పెన్ వర్గాన్ని నిర్వీర్యం చేయాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా తన రాజకీయ, ఆర్థిక, సామాజిక అజెండాకు మద్దతుగా యావత్ ఫ్రాన్స్‌ను సమైక్యపరిచి, వెన్నంటి నిలిచేలా చూసుకోవాలి. జీ–7 దేశాల్లో అమెరికా తర్వాత అత్యంత వేగంగా కరోనా దెబ్బ నుంచి కోలుకున్న ఫ్రాన్స్‌ను తన ఆరేళ్ళ వయసు పార్టీతో ఇప్పుడు నూతన శకంలోకి నడిపించాల్సింది మెక్రానే. అది అంత సులభమేమీ కాదు. ఆ సంగతి మెక్రాన్‌కూ బాగా తెలుసు. -
మాక్రాన్ గెలుపుతో ఉక్రెయిన్‌కు ఊరట
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోమారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం సాధించడంతో ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంది. అయితే గతంతో పోలిస్తే లీపెన్‌కు మద్దతు బాగా పెరిగినట్లు కనిపించింది. అతివాద నాయకురాలు లీపెన్ నెగ్గొచ్చన్న ఊహాగానాలు తొలుత యూరప్ హక్కుల సంఘాలకు, ఉక్రెయిన్ నాయకత్వానికి ఆందోళన కలిగించాయి. ఆమె బహిరంగంగా పుతిన్‌కు అనుకూలంగా మాట్లాడటం, ఈయూకు, నాటోకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆమె అధ్యక్షురాలైతే తమకు ఒక పెద్ద అండ లోపిస్తుందని జెలెన్‌స్కీసహా ఉక్రెయిన్ నాయకత్వం భయపడింది. లీపెన్ పదవిలోకి వస్తే జీ7లాంటి కూటములు కూడా ప్రశ్నార్థకమయ్యేవని జపాన్ ఆందోళన చెందింది. లీపెన్‌పై మాక్రాన్ విజయం సాధించినప్పటికీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య స్వదేశంలో పెరిగిపోతోంది. ఈ అంశాన్ని గుర్తించిన మాక్రాన్ స్వదేశంలో తనను వ్యతిరేకిస్తున్నవారి ధోరణికి కారణాలు కనుగొంటానని, వారిని సంతృప్తి పరిచే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. తాను దేశీయులందరికీ అధ్యక్షుడినన్నారు. అయితే స్వదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విదేశీ వ్యవహారాల్లో పెద్దమనిషి పాత్ర పోషిస్తున్న మాక్రాన్‌పై స్వదేశంలో చాలామంది గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి మద్దతు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభం కావడానికి ముందే యుద్ధ నివారణకు మాక్రాన్ చాలా యత్నాలు చేశారు. వ్యక్తిగతంగా పుతిన్‌తో చర్చలు జరిపారు. యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యా చర్యను ఖండించడంలో ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో ముందున్నారు. అందుకే మాక్రాన్‌ను నిజమైన స్నేహితుడు, నమ్మదగిన భాగస్వామిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొనియాడారు. పుతిన్ చర్యకు వ్యతిరేకంగా రష్యాపై మాక్రాన్ ఆంక్షలను కూడా విధించారు. అలాగే రష్యా సహజవాయువు అవసరం ఫ్రాన్స్‌కు లేదని, తాము గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడతామని మాక్రాన్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఇకపై పుతిన్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని మాక్రాన్ చెప్పారు. ఒకపక్క రష్యా చర్యను వ్యతిరేకిస్తూనే పుతిన్‌తో చర్చలకు తయారుగా ఉన్నానని ప్రకటించడం ద్వారా మాక్రాన్ హుందాగా వ్యవహరించారని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ముదురుతున్న ఈ తరుణంలో ఫ్రాన్స్ ఈ సమతుల్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అయితే అస్తవ్యస్తంగా మారిన ఫ్రాన్స్ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడమనే పెద్ద సవాలు ప్రస్తుతం మాక్రాన్ ముందున్నదని నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అదంత సులభం కాబోదంటున్నారు. ఫ్రాన్స్ పీఠం మాక్రాన్దే ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు మరీన్ లీ పెన్ (53)పై మాక్రాన్ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్‌కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో ఆయన 66 శాతం ఓట్లు సాధించారు. గెలుపు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితరాల నేపథ్యంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నానా అనుమానాలతో, పలు రకాల విభజనలతో అతలాకుతలంగా ఉన్న దేశాన్ని మళ్లీ ఒక్కతాటిపైకి తెస్తా’’ అని ప్రకటించారు. యూరప్ దేశాధినేతలంతా ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాక్రాన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇండో–ఫ్రాన్స్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఆయనతో మరింతగా కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
రికార్డులు బద్దలు.. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎన్నిక
France election.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి మరీన్ లీపెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో, అధికారిక ఫలితాలు వెలువడక ముందే లీపెన్ తన ఓటమిని అంగీకరించారు. ఈ క్రమంలో మాక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్, యూరోపియన్ జెండాలను ఊపారు. కాగా, ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్ లీపెన్‌పై గెలిచి 39 ఏళ్ల మాక్రాన్ ఫ్రాన్స్ లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. ఇక, గడిచిన 20 ఏళ్లలో వరుసగా రెండు సార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు. ఇక, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మాక్రాన్ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్‌లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చినట్టు అయిందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మాక్రాన్ మరోసారి విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు అందుతున్నాయి. మాక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. "ఫ్రాన్స్ మా అత్యంత సన్నిహిత, ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ మళ్లీ ఎన్నికైనందుకు అభినందనలు" అని అన్నారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు -
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు
ప్యారిస్: ఫ్రాన్సు అధ్యక్ష పదవికి ఆదివారం మొదటి రౌండ్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 13 మంది నేతలు బరిలో ఉండగా ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, మరీన్ లీపెన్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. మొదటి విడత ఎన్నికల్లో ఏ ఒక్కరికీ 50% మించి ఓట్లు రాకుంటే ఈ నెల 24వ తేదీన నిర్ణయాత్మక రెండో విడత ఓటింగ్ చేపడతారు. ఫ్రాన్సు చరిత్రలో అధ్యక్ష పదవికి రెండో రౌండ్ ఎన్నిక ఎన్నడూ జరగలేదు. 2017 ఎన్నికల్లో లీ పెన్‌పై విజయం సాధించి మాక్రాన్ పిన్న వయస్కుడైన ఫ్రాన్సు అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. చదవండి: ఫ్రాన్స్‌కు పరీక్షా సమయం -
Covid Live Updates: కోటికి పైగా కోవిడ్ కేసులు నమోదైన ఆరో దేశంగా రికార్డు..!
ప్యారిస్: మహమ్మారి వ్యాప్తి చెందినప్పట్నుంచి శనివారం నాటికి కోటికి పైగా కరోనా ఇన్ఫెక్షన్లు నమోదైన దేశాల్లో ఫ్రాన్స్ 6వ దేశంగా అవతరించినట్లు అధికారిక సమాచారం. గడచిన 24 గంటల్లో ఫ్రాన్స్‌లో 2,19,126 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యినట్లు ఫ్రాన్స్ హెల్త్ అధారిటీస్ నివేదిక విడుదల చేశాయి. వరుసగా నాలుగో రోజు కూడా రెండు లక్షలకు పైగా కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యినట్లు ఈ నివేదిక తెల్పుతోంది. 10 మిలియన్లకుపైగా కరోనా కేసులు నమోదైన అమెరికా, భారత్, బ్రెజిల్, బ్రిటన్, రష్యా దేశాల సరసన తాజాగా ఫ్రాన్స్ చేరింది. దీంతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాబోయే కొన్ని వారాలు కష్టతరంగా మరొచ్చని హెచ్చరికలు జారీ చేశాడు. ఐతే పెరుగుతున్న పాజిటివిటీ కేసుల దృష్ట్యా దేశంలో మరిన్ని ఆంక్షల విధింపుకు బదులు ప్రజల స్వేచ్ఛను పరిమితం చేయడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచనలివ్వడం గమనార్హం. సోమవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో 6-11 సంవత్సరాల పిల్లలతో సహా, ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం తప్పనిసరని అక్కడి ప్రభుత్వం ముందే హెచ్చరించింది. కాగా గడచిన 7 రోజుల వ్యవధిలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో కేసులు పుట్టుకొచ్చాయి. కేవలం ఒక్క నెలలో ఐదు రెట్లు పెరిగాయి. 24 గంటల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 96కు పెరిగింది. అలాగే కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 24 గంటల్లో 110 పెరగగా, ఆ సంఖ్య 123,851కి చేరుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్ మరణాల్లో 12వ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. ఆ దేశంలో మే 14 నుండి అత్యధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయి. చదవండి: ‘ఫ్లొరోనా’కలకలం..! లక్షణాలివే.. -
పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు..
ఫ్రాన్స్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, యూరప్ దేశాల్లో రోజురోజుకు పరిస్థితి చేజారేలా కనిపిస్తోందని డబ్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 24 న ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసినప్పటినుంచి, ఇప్పటి వరకు 108 దేశాల్లో పంజా విసిరింది. ముఖ్యంగా ఐరోపాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఒక్కరోజులోనే తొలిసారిగా లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశంలో అధిక సంఖ్యలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఆసుపత్రుల్లో చేరికలు కూడా రెట్టింపయ్యాయి. గడచిన వారంలో ప్రతి వంద మందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ బయటపడుతోంది. అంతేకాకుండా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధిక ఇన్ఫెక్షలు ఒమిక్రాన్‌తో సంబంధం కలిగి ఉంటున్నాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ మరింత డామినెట్ చేసే అవకాశం ఉన్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కోవిడ్ 19 ఉధృతిపై సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా.. -
ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ
జి–20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోమ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. భారత్–ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మాక ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భదత్రా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. మోదీ, మాక్రాన్ నడుమ ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువరూ అభిప్రాయాలను పంచుకున్నారని వెల్లడించింది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడనున్నాయని పేర్కొంది. నరేంద్ర మోదీ రోమ్‌లో సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్‌తోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను ఈ సందర్భంగా సమీక్షించారు. లూంగ్‌తో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్విట్టర్లో వెల్లడించింది. భారత సంతతి ప్రజలతో సమావేశం ఇటలీలోని పలువురు భారత సంతతి ప్రజలు, భారతీయులను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఈ మేరకు ఫొటోలను మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. -
తెలంగాణలో పెట్టుబడులపై విశ్వవేదికగా ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొ నేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం బయలుదేరి వెళ్లింది. ఫ్రాన్స్ సెనేట్‌లో ఈనెల 29న జరిగే ‘యాంబిషన్ ఇండియా 2021’సదస్సులో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో భారత్– ఫ్రాన్స్ సంబంధాలు అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయేల్ లెనైన్ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై విశ్వవేదికపై వివరిస్తారు. ఆరోగ్యరక్షణ, వాతావరణం, వ్యవ సాయం, వాణిజ్యం, డిజిటలైజేషన్ వంటి అంశా లపై జరిగే చర్చల్లో తెలంగాణ ప్రత్యేకతలను తెలియజేస్తారు. అలాగే ఫ్రాన్స్ పెట్టుబడిదారులు, సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో జరిగే సమా వేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. భారత్, ఫ్రాన్స్ మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రాన్ చొరవతో ‘యాంబిషన్ ఇండియా 2021’సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రతినిధి బృందంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు ఉన్నారు. తొలిరోజు పలు అంశాలపై చర్చ.. పారిస్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్ ప్రభుత్వ డిజిటల్ వ్యవహారాల అంబాసిడర్ హెన్రీ వర్డియర్తో సమావేశమయ్యారు. ఇన్నో వేషన్, డిజిటైజేషన్, ఓపెన్ డేటా వంటి అంశాల్లో ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో ఇన్నోవేషన్, అంకుర సంస్థలను ప్రోత్సహించ డానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, ఓపెన్ డేటా పాలసీ, డిజిటల్ రంగంలో రాష్ట్రంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి మంత్రి కేటీఆర్, హెన్రీ వర్డియర్‌కు వివరించారు. తెలంగాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఫ్రాన్స్‌లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడంపై కూడా విస్తృత చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఫ్రాన్స్‌లో భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కే.ఎం.ప్రఫుల్ల చంద్రశర్మ, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డైరెక్టర్ డిజిటల్ మీడియా కొణతం దిలీప్, డైరెక్టర్ ఏవియేషన్ ప్రవీణ్ పాల్గొన్నారు. -
కలిసి నడుద్దాం.. భారత్, ఫ్రాన్స్ నిర్ణయం
పారిస్: జలాంతర్గాముల కొనుగోలు వివాద అంశంలో అమెరికా, ఆ్రస్టేలియాపై గుర్రుగా ఉన్న ఫ్రాన్స్ ఇకపై ఇండోపసిఫిక్ ప్రాంతంలో భారత్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫ్రాన్స్ అధిపతి మాక్రాన్ భారత ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాల్సిన జలాంతర్గాముల ఆర్డర్‌ను ఆ్రస్టేలియా అర్థాంతరంగా రద్దు చేసింది. వీటికి బదులు అమెరికా నుంచి జలాంతర్గాములు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆగ్రహించిన ఫ్రాన్స్ తన రాయబారులను యూఎస్, ఆ్రస్టేలియా నుంచి వెనక్కుపిలిపించింది. అలాగే ఫ్రాన్స్‌కు సంబంధం లేకుండా యూఎస్, యూకే, ఆ్రస్టేలియాలు ఇండోపసిఫిక్ ప్రాంతంలో ఆకుస్ పేరిట కొత్త గ్రూపును ఏర్పరుచుకోవడం కూడా ఫ్రాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తమకు ఈ ప్రాంతంలో నమ్మకమైన మిత్రదేశం అవసరం ఉందని గ్రహించే ఇండియాను ఫ్రాన్స్ సంప్రదించిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు. మోదీతో టెలిఫోన్ సంభాషణలో అఫ్గాన్ అంశం కూడా చర్చకు వచి్చనట్లు మాక్రాన్ కార్యాలయం తెలిపింది. ఇకపై ఇండోపసిఫిక్ ప్రాంతంలో భారత్, ఫ్రాన్స్‌లు సంయుక్తంగా వ్యవహరిస్తాయని తెలిపింది. భారత్‌కు ఎటువంటి సాయం అందించేందుకైనా తయారుగా ఉన్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు. పరస్పర నమ్మకం, గౌరవం ఆధారంగా ఇరుదేశాల సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. మరోవైపు ఫ్రాన్స్‌ను శాంతిపజేసేందుకు యూఎస్ అధ్యక్షుడు యతి్నస్తున్నారు. కానీ ఇరువురి సమావేశానికి తేదీ నిర్ణయించలేదు. -
అధ్యక్షుడికి చెంపదెబ్బ: ‘అతడికి 18నెలల జైలు శిక్ష విధించండి’
వాలెన్స్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తికి 18 నెలల జైలు శిక్ష విధించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. నిందితుడు డామియెన్ టారెల్ చర్య కచ్చితంగా ఆమోదయోగ్యం కానిదని, అది ఉద్దేశ్యపూర్వకంగా హింసకు పాల్పడడమేనని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కారణంగా ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 45వేల యూరోల జరిమానా పడే అవకాశం ఉంది. కాగా, గత మంగళవారం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మాక్రాన్ టేయిన్ ఎల్ హెర్మిటేజ్‌లోని ఓ హోటల్ స్కూల్‌ను సందర్శించారు. మధ్యాహ్నం 1.15 ప్రాంతంలో అక్కడినుంచి వెళ్లిపోవటానికి తన కారులోకి వెళ్లి కూర్చున్నారు. అయితే, ప్రజలు ఆయన్ని చూడాలని అరుస్తుండటంతో జనం దగ్గరకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో బ్యారిగేడ్ల దగ్గర ఉన్న డామియెన్ టారెల్( ఆకుపచ్చ రంగు టీషర్టు వేసుకున్న వ్యక్తి) దగ్గరకు వచ్చారు. ఆ వెంటనే అతడు అధ్యక్షుడు మాక్రన్ చెంపను చెల్లుమనిపించాడు. దీంతో మాక్రాన్ వ్యక్తిగత సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వారు ఆయన్ని పక్కుకు తీసుకెళ్లి, టారెల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. చదవండి : షేక్‌హ్యాండ్ ఇవ్వబోయిన అధ్యక్షుడి చెంప మీద కొట్టాడు! -
వైరల్ వీడియో: షేక్‌హ్యాండ్ ఇవ్వబోయిన అధ్యక్షుడి చెంప పగలకొట్టాడు
-
షేక్‌హ్యాండ్ ఇవ్వబోయిన అధ్యక్షుడి చెంప మీద కొట్టాడు!
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు ఘోర పరాభావం ఎదురయ్యింది. దేశవ్యాప్త పర్యటనలో ఉన్న మాక్రాన్ చెంప పగలకొట్టాడు ఓ ఆగంతకుడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం మాక్రాన్ ఆగ్నేయ ఫ్రాన్స్‌లో పర్యటించారు. బీఎఫ్ఎం న్యూస్ చానెల్ ప్రసారం చేసిన వీడియో ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1:15 గంటలకు (11.15 జీఎంటీ) డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను సందర్శించి తన కారు దగ్గరకు వెళ్లాడు మాక్రాన్. కానీ అక్కడ ఉన్న జనాలు మాక్రాన్‌ను పిలవడంతో ఆయన తిరిగి వెనక్కి వచ్చాడు. బారికేడ్ల వెనక ఉన్న జనాలను పలకరించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న 43 ఏళ్ల వ్యక్తికి మాక్రాన్ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఇంతలో సదరు ఆగంతకుడు వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని.. మాక్రాన్ చెంప పగలకొట్టాడు. దాంతో అంత దూరాన పడ్డాడు అధ్యక్షుడు. అనుకోని ఈ సంఘటనకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇంతలో మాక్రాన్ బాడీగార్డులు వచ్చి ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. చదవండి: నడి రోడ్డుపై దేశాధ్యక్షుడి పోస్టర్లు -
'మనం కలిసికట్టుగా విజయం సాధిద్దాం'
న్యూఢిల్లీ: కోవిడ్ విజృంభణతో అల్లాడుతున్న భారత్‌కు తమవంతుగా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్ ప్రకటించారు. ఈ మేరకు హిందీలో ఆయన భారత్‌ను ఉద్దేశిస్తూ ‘మనం కలిసికట్టుగా విజయం సాధిద్దాం’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. కోవిడ్‌పై పోరులో భాగంగా భారత్‌కు త్వరలో ఆక్సిజన్ జనరేటర్లు, ద్రవ ఆక్సిజన్ కంటైనర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, ఔషధాలను సముద్ర, వాయు మార్గంలో ఈ వారం చివరిలోగా పంపిస్తామని మంగళవారం ఫ్రాన్స్ తెలిపింది. ‘ భారత్‌లో కోవిడ్ చికిత్సలో సదుపాయల కొరత ఉంది. ఈ వైద్య అత్యయక స్థితిని పూర్తిగా అధిగమించేందుకు మేం సాయం చేస్తాం. కష్టకాలంలో ఇరు దేశాలు ఇలా గతంలోనూ ఒకరికొకరు ఎంతగానో సాయపడ్డాయి’ అని ఫ్రాన్స్ యూరప్, విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫ్రాన్స్ పంపే ఒక్కో ఆక్సిజన్ జనరేటర్ ఏకంగా 250 పడకలున్న ఆస్పత్రికి నిరంతరాయంగా పదేళ్లపాటు ఆక్సిజన్ అందించే సామర్థ్యం గలది. వీటితోపాటు ఐదు ద్రవ ఆక్సిజన్ కంటైనర్లను పంపనుంది. రోజుకు 10వేల మంది రోగులకు ఆక్సిజన్‌ను అందించే సామర్థ్యం వీటి సొంతం. 200 ఎలక్ట్రిక్ సిరంజీ పంపులు, 28 వెంటిలేటర్లు భారత్‌కు చేరనున్నాయి. ఐర్లాండ్ నుంచి 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్‌కు తాము చేస్తామని ఐర్లాండ్ మంగళవారం ప్రకటించింది. 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిస్తామని తెలిపింది. బుధవారం ఉదయంకల్లా భారత్‌కు తీసుకొస్తామని ఐర్లాండ్ రాయబార కార్యాలయం పేర్కొంది. వెంటిలేటర్లనూ భారత్‌కు తరలించనుంది. ఆస్ట్రేలియా నుంచి 500 వెంటిలేటర్లు కోవిడ్‌పై పోరాడుతున్న భారత్‌కు తమ వంతు సాయగా 500 వెంటిలేటర్లు, పది లక్షల సర్జికల్ మాస్క్‌లు, ఐదు లక్షల ప్రొటెక్టివ్ మాస్క్‌లు, ప్రత్యేక కళ్లద్దాలు, ఫేస్ షీల్డులను పంపిస్తామని ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. మరోవైపు, భారత్ నుంచి నేరుగా విమాన సర్వీసులను మే 15వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. మే 15 తర్వాత పరిస్థితులను సమీక్షించాక విమానసర్వీస్‌ల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చెప్పారు. ఈయూ సభ్య దేశాల నుంచి భారత్‌కు వైద్య సాయం యురోపియన్ యూనియన్(ఈయూ)లో సభ్య దేశాలైన బెల్జియం, లక్సెంబర్గ్, పోర్చుగల్, స్వీడన్లు సైతం భారత్‌కు తోచిన సాయం చేస్తున్నాయి. జర్మనీ సహా పలు సభ్య దేశాలు భారత్‌కు సాయపడటంతో నిమగ్నమయ్యాయని ఈయూ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 9వేల డోస్‌ల రెమ్‌డెసివర్ ఔషధాన్ని బెల్జియం పంపిస్తోంది. 120 వెంటిలేటర్లను స్వీడన్ తరలిస్తోంది. 80 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 75 ఆక్సిజన్ సిలిండర్లను రుమేనియా సరఫరా చేయనుంది. లక్సెంబర్గ్ 58 వెంటిలేటర్లను, 5,503 వయల్స్‌ల రెమ్‌డెసివర్‌ను, వారానికి 20వేల లీటర్ల ఆక్సిజన్‌ను పోర్చుగల్ భారత్‌కు తరలించనుంది. కాలిఫోర్నియా రాష్ట్రం నుంచీ.. అత్యంత ఎక్కువగా ప్రవాస భారతీయులు నివసించే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సైతం భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. 275 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 440 ఆక్సిజన్ సిలిండర్లు, 240 ఆక్సిజన్ రెగ్యులేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, నిమిషానికి 120 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల డిప్లోయబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సిస్టమ్(డీఓసీఎస్)ను భారత్‌కు పంపిస్తామని కాలిఫోర్నియా గవర్నర్ గవీన్ న్యూసమ్ చెప్పారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు కరోనా
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. మాక్రాన్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌గా తేలిందని అధ్యక్ష భవనం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిర్ధారణ కాగానే మాక్రాన్ ఏడు రోజుల సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. క్వారంటైన్లో ఉంటూనే ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు.ఇటీవల మాక్రాన్ చాలా మంది ప్రపంచ నేతల్ని కలుసుకున్నారు. ఈయూ సదస్సుకు సైతం హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో అధ్యక్షుడిని కలుసుకున్న వారంతా క్వారంటైన్లోకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధ్యక్ష భవనం ప్రతినిధులు సూచించారు. ఇటీవల ఫ్రాన్స్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. ఆరువారాల పాటు లాక్డౌన్ కూడా విధించారు. ఈ నెల 27 నుంచి ఫ్రాన్స్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ తర కరోనా బారిన పడి కోలుకున్నారు. -
నడి రోడ్డుపై దేశాధ్యక్షుడి పోస్టర్లు
ముంబై : గురువారం ముంబైలోని మహమ్మద్ అలీ రోడ్డుపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ పోస్టర్లు కలకలం రేపాయి. అలా రోడ్డుపై వందల సంఖ్యలో పోస్టర్లు దర్శనమివ్వటంతో పాదచారులు, వాహనదారులు ఆసక్తిగా వాటిని తిలకించారు. సమాచారం అందుకున్న ఫైధోనీ పోలీసులు రోడ్డు వద్దకు చేరుకుని పోస్టర్లను తీసివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( నా పిల్లలకు ఈ మాట చెప్పండి..) కాగా, గురువారం ఫ్రాన్స్‌లోని నైస్ సిటీలోని నాట్రిడేమ్ చర్చిలో ఓ దుండగుడు కత్తి దాడి జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీనిపై ఇమాన్యుయేల్ స్పందిస్తూ.. దాన్ని మతోన్మాదుల దాడిగా పేర్కొన్నారు. ‘ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పోస్టర్లు ముంబైలోని రోడ్డుమీద కనిపించటం చర్చనీయాంశంగా మారింది. -
ఫ్రాన్స్‌లో లాక్డౌన్
పారిస్/లండన్/బెర్లిన్: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ యూరప్ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. కరోనా కట్టడికి పలు దేశాలు పూర్తి స్థాయి లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుంటే, మరికొన్ని దేశాలు పరిమితమైన ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఫ్రాన్స్ నెల రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ దేశంలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్నాయని, దానికి తగ్గ స్థాయిలో ఆస్పత్రి సదుపాయాలు లేవని అన్నారు. అందుకే లాక్డౌన్ మినహా తమ ముందు మరో మార్గం లేదన్నారు. తొలి దశలో వణికించిన కరోనా కంటే రెండోసారి మరింత ప్రమాదకరంగా కరోనా విజృంభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గురువారం నుంచి మొదలైన లాక్డౌన్ డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. అయితే లాక్డౌన్ నిర్ణయంపై దేశంలోని వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక జర్మనీలో బార్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, సినిమా థియేటర్లు మూసివేశారు. క్రీడల్ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ప్రకటించారు. గత పది రోజుల్లోనే జర్మనీలో ఆస్పత్రుల రోగుల సంఖ్య రెట్టింపైందని దేశంలో ఆరోగ్య సంక్షోభం రాకుండా ఉండాలంటే ఈ ఆంక్షలన్నీ తప్పనిసరని మెర్కల్ తెలిపారు. మిగిలిన దేశాల్లో నిబంధనలు ఇలా.. యూరప్‌లో మిగిలిన దేశాలు కూడా పలు ఆంక్షల్ని విధిస్తున్నాయి. పోర్చుగల్ ప్రభుత్వం దేశ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. వారం రోజుల పాటు ప్రయాణాలపై ఆంక్ష లు విధించింది. బెల్జియంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు అత్యధిక స్థాయిలో పెరిగిపోతున్న దేశాల్లో బెల్జియం ముందుంది. చెక్ రిపబ్లిక్లో కర్ఫ్యూ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుని తప్పనిసరి చేశారు. ఇక బ్రిటన్‌లో కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ఆరోగ్య నిపుణులు ప్రధాని బోరిస్ జాన్సన్‌కి సూచిస్తున్నారు. ప్రభుత్వ సలహా సంస్థ సేజ్ సెకండ్ వేవ్ యూరప్‌ని ఘోరంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ కరోనా పరీక్షలు మరింత విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించింది. -
ఫ్రాన్స్‌లో టీచర్ తలనరికిన యువకుడు
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒక ఉపాధ్యాయుడిని తలనరికి దారుణంగా హత్య చేశారు. చెచెనీయాకు చెందిన 18ఏళ్ల యువకుడు ఇందుకు బాధ్యుడని పోలీసులు భావిస్తున్నారు. టీచర్‌ను చంపిన అనంతరం సదరు యువకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎటాక్ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ ప్రకటించారు. శుక్రవారం ఒక పాఠశాలలో ప్రవక్తకు సంబంధించిన క్యారికేచర్లను ప్రదర్శించినందుకు టీచర్‌ను హత్య చంపేశాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ యాంటీ టెర్రరిజం ప్రాసిక్యూటర్ విచారణ ఆరంభించారు. మూడువారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. క్యారికేచర్లు ప్రదర్శించారంటూ గత నెల పాక్‌కు చెందిన ఒక యువకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచాడు. త్వరలో ఇస్లామిక్ రాడికల్స్‌కు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చేందుకు మాక్రాన్ ప్రభుత్వం యత్నిస్తోంది. హత్యకు గురైన టీచర్‌పై ఒక స్టూడెంట్ తండ్రి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు చెప్పారు. -
కరోనా ఎఫెక్ట్.. దండం పెట్టేస్తున్నారు
పారిస్: కరోనా మనందరి జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందనండంలో ఎలాంటి సందేహం లేదు. మనతో పాటు ప్రపంచ దేశాల ప్రజలకు భారతీయ అలవాట్ల గొప్పతనం గురించి కరోనా సమయంలో బాగా తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో స్వాగత పలకరింపుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనాకు ముందు విదేశీ పలకరింపుల్లో కరచాలనం, ఆలింగనం తప్పని సరిగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు మనతో పాటు విదేశీయులు కూడా చక్కగా చేతులు జోడించి నమస్కారం, నమస్తే అంటూ స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో జర్మనీ చాన్సలర్ ఏంజెల్ మార్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగని నమస్తే స్వాగత పలకరింపుకు సంబంధించిన ఫోటోలు, వీడియో తెగ వైరలవుతున్నాయి. కరోనా మహమ్మారి, బెలారస్లో ఎన్నికల అనంతర తలెత్తిన అశాంతి, టర్కీతో పెరుగుతున్న ఉద్రిక్తతలతో సహా పలు విషయాల గురించి చర్చించడానికి ఇరువురు నాయకులు ఫ్రెంచ్ అధ్యక్షుడి వేసవికాల విడిదిలో సమావేశమవుతున్నారు. ఆ సమయంలో ఇలా ఒకరికొకరు నమస్తే చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని) Willkommen im Fort de Brégançon, liebe Angela! pic.twitter.com/lv8yKm6wWV — Emmanuel Macron (@EmmanuelMacron) August 20, 2020 వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, సామాజిక దూరం పాటించడం కోసం పలువురు ప్రపంచ దేశాధ్యక్షులు కరచాలనానికి స్వస్తి చెప్పి.. నమస్తేను ఎంచుకున్నారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఉన్నారు. నమస్తేను మొదట ఆమోదించిన విదేశీ నేత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి. ‘హ్యాండ్‌షేక్‌ను మర్చిపొండి. భారతీయ పద్దతి నమస్తేను అనుసరించండి. లేదంటే షాలోమ్ అని చెప్పండి’ అంటూ జనాలకు సూచించారు నెతన్యాహు. మార్చిలో, డొనాల్డ్ ట్రంప్ ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్‌ను చేతులు జోడించి నమస్కారం చెబుతూ పలకరించారు. ‘మేము ఈ రోజు కరచాలనం చేయలేదు. మేము ఒకరినొకరు చూసుకున్నాము. చూపుల ద్వారానే మేం ఏం చేయబోతున్నామో చెప్పుకున్నాము. ఇది ఒక విచిత్రమైన అనుభూతి’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు. -
విశ్వవ్యాప్తమవుతున్న భారతీయ సంస్కృతి
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు మనుషులు కలిస్తే సాధారణంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇప్పటి వరకు చూశాము. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు షేక్ హ్యాండ్ల పరంపర మరుగున పడి, భారతీయుల సంస్కృతిలో భాగమైన నమస్కారం విస్తృతంగా వాడుకలోకి వస్తోంది. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇద్దరు మనుషులు ఎదురైతే వినమ్రతతో రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. (నాన్న కోసం నది దాటాడు) బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువల్ మక్రాన్లు గురువారం కలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఇదివరకులా షేక్హ్యాండ్లు ఇచ్చుకోకుండా, నమస్కారంతో పలకరించుకున్నారు. వీరితో పాటూ బ్రిటన్ రాజవంశీయులు సైతం తమ అధికారిక కార్యక్రమాల్లో అగ్రనేతలను కలుసుకున్నప్పుడు నమస్కారంతోనే పలకరిస్తున్నారు.(డీఏసీఏపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ) గ్లోబలైజేషన్‌తో వివిధదేశాల నుంచి ప్రాజెక్టులే కాకుండా వారి అలవాట్లు కూడా భారత్‌లోకి రావడంతో కార్పోరేట్ సంస్థల్లో షేక్ హ్యాండ్ సంస్కృతి దాదాపు వచ్చింది. ఈ క్రమంలోనే అగ్గికి ఆజ్యం పోసినట్టు కరోనా వైరస్ వ్యాప్తికి షేక్ హ్యాండ్ సంస్కృతికి కూడా ఒక కారణం కావడంతో, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పుడందరూ నమస్కారాన్ని వాడుతున్నారు. -
అక్కడ మే 11 వరకు లాక్డౌన్ పొడిగింపు...
పారిస్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో యూరప్ దేశం ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు మే 11 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత దశల వారీగా విద్యా, వ్యాపార సంస్థలు తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడతామని వెల్లడించింది. అదే విధంగా జూలై ద్వితీయార్థం వరకు బహిరంగ కార్యక్రమాలకు అనుమతినివ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘కరోనా నెమ్మదిస్తుందని భావిస్తున్నాం. ఆశలు చిగురిస్తాయి. మే 11 తర్వాత కొత్త దశ ప్రారంభమవుతుంది. ఫలితాలను అంచనా వేస్తూ క్రమక్రమంగా లాక్డౌన్ ఎత్తివేయాలనుకుంటున్నాం’’అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. (కరోనా: అమెరికా కంటే అధ్వాన్నంగా..) కాగా కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో ఒకేసారి కాకుండా.. నియంత్రణ చర్యలు, నిబంధనలను దశల వారీగా ఎత్తివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయం తెలిసిందే. ప్రాణాంతక వైరస్‌ను సమూలగా నాశనం చేయాలంటే అందుకు తగిన వ్యాక్సిన సాధ్యమైనంత త్వరగా కనిపెట్టాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక యూరప్‌లో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. కరోనా మరణాల సంఖ్య ఇటలీలో 20 వేలు దాటగా.. స్పెయిన్‌లో 17 వేలు దాటింది. అయితే కరోనా కేసుల సంఖ్యలో పెరుగదల కాస్త తగ్గుముఖం పట్టడంతో స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలపై దృష్టిసారించింది. రెండు వారాల తర్వాత నిర్మాణరంగ కార్మికులు సోమవారం నుంచి పనుల్లో చేరారు. ఇక సోమవారం ఒకేరోజు ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మార్చి 17న విధించిన లాక్డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.(చైనాను మించిన న్యూయార్క్) -
ఒక్కరోజే 1000 కరోనా మరణాలు.. స్వార్థం వద్దు ప్లీజ్!
రోమ్: యూరప్ దేశం ఇటలీపై కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి కరోనా వైరస్ ధాటికి ఆ దేశం చిగురటాకులా వణికిపోతోంది. ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పటికే అక్కడ వేలాది మందిని బలితీసుకోగా... కేవలం శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 9134కు చేరింది. అదే విధంగా దాదాపు 86 వేల మంది ఈ అంటువ్యాధి బారిన పడ్డారు. ఈ మహమ్మారి పురుడుపోసుకున్న చైనాలోని మరణాల కంటే ఇటలీలో సంభవించిన మరణాలు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. కేవలం వారాల వ్యవధిలోనే వేలాది మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే గత వారంతో పోలిస్తే శుక్రవారం నాటికి కరోనా మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదైందని... సగటు మరణాల శాతం 8 నుంచి 7.4 శాతానికి పడిపోయిందని జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొంది. (కరోనా: ఊపిరితిత్తుల పరిస్థితి ఇది.. తస్మాత్ జాగ్రత్త!) ఈ విషయం తమలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తోందని.. అయితే కరోనాపై మరింత కఠినంగా పోరాడాల్సి ఉందని ఆ సంస్థ చీఫ్ సిల్వియో బ్రుసాఫెరో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో సత్ఫలితాలు పొందగలుగుతున్నామన్నారు. కాగా ఇటలీలో మార్చి 9 నుంచి లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ గడువు(ఏప్రిల్ 3)ను మరికొన్ని రోజుల పాటు పొడగించే అవకాశం ఉందని ఇటలీ ప్రధాని గుసిప్పీ కోంటే గత వారం ప్రకటన విడుదల చేశారు. కాగా కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే అక్కడ కుప్పలుతెప్పలుగా శవాలను చూడాల్సి వస్తోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.(కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!) సెల్ఫిష్‌గా ఉండకండి.. విపత్కర పరిస్థితుల్లో ఇటలీకి ఫ్రాన్స్ అండగా నిలుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ భరోసా ఇచ్చారు. ఓ ఇటలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ చైనా, రష్యాల సహాయం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇటలీకి ఫ్రాన్స్, జర్మనీ కూడా సహాయం చేస్తున్నాయి. రెండు మిలియన్ల మాస్కులు, వందల కొద్దీ గౌన్లు(వైద్య సిబ్బందికి) అక్కడికి పంపించాం. అయితే ఇది ఏమాత్రం సరిపోదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మేం వారికి మరింత సాయం చేస్తాం. ఈ కష్టం కేవలం ఇటలీ, స్పెయిన్‌కో పరిమితం కాదు. ప్రతీ ఒక్కరికి ఎదురవుతుంది. అందుకే యూరోప్ కలిసికట్టుగా ఉండాలి. స్వార్థంగా ఉండకండి. స్వార్థపూరితమైన.. ఐకమత్యంగా లేని యూరప్‌ను నేను కోరుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు.(కరోనా: 64 దేశాలకు అమెరికా సాయం.. ) కరోనా : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక! అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు? కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి? -
రెండు హెలికాప్టర్లు ఢీ; 13 మంది మృతి
సాహెల్ : రెండు సైనిక హెలికాప్టర్లు గగనతలంలో ఒకదానికొకొటి ఢీకొనడంతో ఫ్రాన్స్ దేశానికి చెందిన 13 మంది సైనికులు మరణించారు. ఈ విషాద ఘటన మాలీ దేశంలోని సాహెల్‌లో చోటుచేసుకుంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మంగళవారం మాలీలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ దుర్ఘటన జరిగింది.ఇదే విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యూయేల్ మక్రాన్ చనిపోయిన సైనికుల కుటుంబలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారిలో ఆరుగురు ఆర్మీ అధికారులతో పాటు మరో ఏడుగురు నాన్ కమీషన్డ్ అధికారులు ఉన్నట్లు తేలింది. 1983లో బీరుట్ బ్యారక్స్ బాంబు దాడిలో 58 మంది ఫ్రెంచ్ పారాట్రూపర్స్ మరణం తర్వాత ఇప్పుడు 13మంది ఫ్రెంచ్ అధికారులను పోగొట్టుకోవడం బాధాకరమని ఫ్రాన్స్ రక్షణ విభాగం పేర్కొంది. అయితే దుర్ఘటనకు సంబంధించిన కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.ఇస్లామిక్ మిలిటెంట్లు మాలీలోని ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించడంతో 2013లో ఫ్రాన్స్ ప్రభుత్వం తన బలగాలను అక్కడ మోహరించింది. ప్రస్తుతం సుమారు 4500 ప్రాన్స్ బలగాలు మాలీ దేశ సైన్యానికి సహకరిస్తున్నాయి. -
ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
పారిస్ : విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునెస్కో హెడ్ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, ఫ్రాన్స్ మధ్య చిరకాల స్నేహం ఉందని అన్నారు. కాలానికి అతీతంగా ఇరుదేశాల మధ్య స్నేహం బంధం నిలిచి ఉందని పేర్కొన్నారు. ‘భారత్, ఫ్రాన్స్ దేశాలు పరస్పరం అభివృద్ధిని కోరుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య మధ్య చిరకాల స్నేహం ఉంది. భారత్, ఫ్రాన్స్ సంబంధాలు ఈనాటికి కావు. మీ అందరినీ కలవడం నా అదృష్టం. రామభక్తి, దేశభక్తి, మహాత్మా గాంధీ భారత్‌కు ప్రతీక. కష్టనష్టాల్లో భారత్, ఫ్రాన్స్ పరస్పరం సహకరించుకుంటాయి. నవభారత్ నిర్మాణం కోసం మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఈజ్ ఆఫ్ డూయింగే కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గత ఐదేళ్లలో దేశంలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి గర్వకారణం’అన్నారు. -
మోదీకి ఫ్రాన్స్‌లో ఘనస్వాగతం
పారిస్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఆయనకు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీనివ్స్ లీ డ్రియన్ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్న మోదీ, శుక్రవారం యూఏఈకి వెళ్లనున్నారు. అనంతరం బహ్రెయిన్‌కు వెళ్లనున్న ప్రధాని.. ఆ దేశపు రాజు షేక్ హమీద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమై చర్చలు జరుపుతారు. చివరగా ఆదివారం ఫ్రాన్స్‌కు తిరిగొచ్చి జీ7 సదస్సులో పాల్గొంటారు. -
నోటర్ డామ్‌కు రూ.7 వేల కోట్ల విరాళాలు
ప్యారిస్: అగ్నికి ఆహుతైన ప్యారిస్‌లోని ప్రఖ్యాత చర్చి నోటర్ డామ్ కెథడ్రల్ పునర్నిర్మాణ పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ చర్చి మరమ్మతులకు గానూ సుమారు రూ.7 వేల కోట్ల విరాళాలు వసూలయ్యాయి. అయితే ఈ కట్టడంపునర్నిర్మాణానికి గానూ ఐదేళ్లు పడుతుందంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్ ప్రకటించారు. బుధవారం ఉదయం నిర్మాణ బృందాలు భారీ క్రేన్‌తో పాటు అవసరమైన చెక్క సామగ్రితో నోటర్ డామ్‌కు చేరుకున్నాయి. సోమవారం నోటర్ డామ్‌కు మంటలు అంటుకొని పైకప్పు పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో ప్రాణనష్టం జరగలేదు. -
ఫ్రాన్స్‌లో ఆందోళనలు హింసాత్మకం
పారిస్: ఫ్రాన్స్‌లో ఇంధన, జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా రెండువారాల నుంచి జరుగుతున్న ఆందోళనలు శని, ఆదివారాల్లో తీవ్ర హింసాత్మకంగా మారాయి. దీంతో ఫ్రాన్స్‌లో అత్యవసర స్థితి విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి బెంజమిన్ గ్రైవాక్స్ వెల్లడించారు. జీ–20 సమావేశాల కోసం అర్జెంటీనా వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అత్యవసరంగా పారిస్ చేరుకుని ప్రధాని, హోం మంత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హింస చోటుచేసుకున్న పలు ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు తగ్గించాలని కోరుతూ నిరసనకారులు నవంబర్ 17 నుంచి రాజధాని పారిస్‌తోపాటు పలుచోట్ల ‘యెల్లో వెస్ట్’ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న విధ్వంసంలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, పలు వాహనాలు, భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్‌లోనే 133 మంది గాయపడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించిన యువకులు ఇనుప రా డ్లు, గొడ్డళ్లు చేతబట్టి రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసులు ప్రయోగించే బాష్పవాయువు నుంచి రక్షించుకునేందుకు కొందరు ఆందోళనకారులు గ్యాస్ మాస్క్‌లను, ప్రత్యేకమైన కళ్లద్దాలను ధరించారు. గొడవలకు కారకులైన 412 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దశాబ్దకాలంలో ఫ్రాన్స్‌లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు జరగడం ఇదే ప్రథమం చర్చలకు రావాలి: ప్రభుత్వం ఆందోళనకారులు హింసకు పాల్పడకుండా చర్చలకు రావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కోరారు. ‘హింసను నేను ఎన్నటికీ అనుమతించను. అధికార భవనాలపై దాడులు చేయడం, వాణిజ్య సముదాయాలను కొల్లగొట్టడం, రోడ్లపై వెళ్తున్న వారిని, విలేకరులను బెదిరించడం వంటి చర్యలకు ఏ కారణమూ సమర్థనీయం కాదు’ అని మేక్రాన్ చెప్పారు. యెల్లో వెస్ట్ ఉద్యమానికి ఓ నాయకుడు, నేతృత్వం వహించే పార్టీ/సంస్థ అంటూ ఏదీ లేదు. దీంతో ఎవరితో చర్చలు జరపాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. పన్నులు పెంచి, డీజిల్ వినియోగం తగ్గించి పర్యావరణహిత ఇంధనాలవైపునకు ప్రజలను మళ్లించేందుకేననీ, ఈ విషయం వారికి సరిగా అర్థమయ్యేలా చెప్పలేకపోయామని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ అనుకూలుడిగా పేరున్న మేక్రాన్ ఇప్పటివరకు పన్నులను తగ్గించేందుకు సానుకూలంగా స్పందించలేదు. అయితే మేక్రాన్ అధికారంలోకి వచ్చాక కంపెనీలపై పన్నులను తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేశారు. దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇవి అవసరమని ఆయన వాదన. మరోవైపు ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి ప్రభుత్వమే కారణమని పలువురు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు వెళుతున్న మేక్రాన్ -
సమరం ముగిసి శతాబ్దం
పారిస్: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఆదివారానికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, టర్కీల అధ్యక్షులు వరుసగా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌లు, రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, కెనడా, ఇజ్రాయెల్‌ల ప్రధానులు జస్టిన్ ట్రూడో, బెంజమిన్ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్‌లోని చాంప్స్–ఎలైసెస్‌లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్ డి ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం సరిగ్గా ఉదయం 11 గంటలకు జరిగింది. మొదటి ప్రపంచ సమరం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ముగియడం తెలిసిందే. ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి పైగానే గాయపడ్డారు. ఆదివారం మేక్రాన్ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్నోన్ సోల్జర్ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి నడకన వెళ్లారు. ఫ్రాన్స్ జాతీయగీతంతో ప్రారంభం నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్ జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్, దాని మిత్ర దేశాల నుంచి 3,400 మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథలను చదివి వినిపించారు. అంతకుముందు ట్రంప్ చాంప్స్–ఎలైసెస్‌కు చేరుకుంటుండగా ఇద్దరు స్త్రీలు అర్ధనగ్నంగా వచ్చి ట్రంప్ వాహన శ్రేణికి అడ్డు తగిలి నిరసన తెలపగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ స్త్రీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఫెమెన్ అనే బృందానికి చెందిన వారు. అనంతరం సంస్మరణ స్థలం వద్ద ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. మెర్కెల్‌తోపాటు పలు ఇతర నేతలతో కూడా చేయి కలిపిన ట్రంప్.. ట్రూడోను మాత్రం పట్టించుకోలేదు. కొన్ని నెలల క్రితం ట్రూడోను ‘నిజాయితీ లేని, బలహీన వ్యక్తి’గా ట్రంప్ విమర్శించడం తెలిసిందే. జాతీయవాదం వెన్నుపోటు వంటిది ఈ సందర్భంగా ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ..‘జాతీయవాదం వెన్నుపోటు వంటిది. మా ప్రయోజనాలే ముఖ్యం.. మాకు ఇతర దేశాల గురించి బాధ లేదు.. అనడం ద్వారా మన దేశాల గొప్పతనాన్ని, నైతిక విలువలను పోగొడుతున్నాం’ అంటూ పరోక్షంగా ట్రంప్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నివాళి భారత్‌తోపాటు బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మయన్మార్ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కామన్వెల్త్ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘భారత్ ప్రత్యక్షంగా పాల్గొనని యుద్ధమిది. అయినా మన సైనికులు కేవలం శాంతి కోసమే ప్రపంచంలో చాలా చోట్ల పోరాడారు’ అని అన్నారు. ‘తొలి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ సామరస్యం, సౌభ్రాతృత్వంతో మెలిగేలా కృషి చేసేందుకు, యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం పునరావృతం కాకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాన్బెర్రాలో మాట్లాడుతూ ‘మన రేపటి కోసం నాడు ఆ సైనికులు వారి ‘ఈ రోజు’ను త్యాగం చేశారు’ అన్నారు. లండన్‌లో రాణి ఎలిజబెత్, ప్రధాని థెరెసా మే తదితరులు వేలాది మందితో కలిసి యద్ధంలో చనిపోయిన పౌరులకు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య కరచాలనం -
కాస్త ఆలస్యం
జర్మనీకి చెందిన ఇమ్మాన్యూల్ కాంట్ ఓ తత్త్వవేత్త. ఈయన వద్దకు ఓరోజు ఓ మహిళ వచ్చింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఆశ. అయితే ఆయనేమీ ప్రేమ చక్రవర్తికాదు. ప్రేమకు ఆయన ఆమడదూరంలో ఉండేవాడు. నియమనిష్టలకు కట్టుబడి బతుకుతున్న వ్యక్తి. కానీ ఇవేవీ తెలియని ఆ యువతి తన మనసులోని మాట చెప్పింది. అయితే కాంట్ తీరు వేరుగా ఉండేది. రాత్రి పదైతే చాలు అప్పటికప్పుడు చేస్తున్న పనిని సైతం పక్కన పెట్టేసేవారు. ఎప్పుడూ లెక్కలేస్తూ ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడైనా సరే టైము పదైందంటే చాలు ఏదీ చెప్పకుండా వెళ్లిపోయి నిద్రపోతారు. ఆయన దగ్గర ఓ పనివాడు ఉండేవాడు. అతను అక్కడున్న అతిథులకు చెప్పేవాడు.. అయ్యగారు పడుకుండిపోయారని. అప్పుడు వాళ్లు వెళ్లిపోయేవారు. కాలం పట్ల చాలా నిక్కచ్చిగా ఉంటాడు కాంట్. మహా పట్టింపు. ఆయన తీరు నచ్చక ఆయన గుణం తెలిసిన కుటుంబసభ్యులు కాంట్‌ను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయారు. ఉదయం అయిదు గంటలకు లేవడం ఆయన అలవాటు. అది చలి కాలమైనా ఎండాకాలమైనా కావచ్చు. ఆరోగ్యం బాగులేకపోయినా సరే బాగున్నా సరే అయిదు గంటలకు లేవవలసిందే. ఐదైతే పక్కమీద ఒక్క సెకను కూడా ఉండరు. అన్నింటినీ కాలంతో చూసే అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళ ముందుకు రావడమేంటీ.. ఆశ్చర్యమే! ఆయనంటే ఎందుకు ఇష్టమో చెప్పింది కూడా. ఆమె మాటలతో ఆలోచనలో పడ్డారు కాంట్. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే అందులోని కష్టసుఖాలను ఆయన గణించుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ పుస్తకం కూడా రాశారు. కష్టాలకు వంద మార్కులు, ఇష్టాలకు 101 మార్కులు వేసుకున్న ఆయన ఆపైన సరేనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని కలిసి జరిగినదంతా చెప్పారు. ఆయన మాటలు విని తండ్రి పెద్దగా నవ్వాడు. ‘‘నువ్వు కాస్తంత ఆలస్యం చేశావు. అయిదేళ్లు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నావు. నువ్వు చేసుకుందామనుకున్న ఆ యువతికి ఎప్పుడో పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు’’ అని తండ్రి చెప్పాడు. ఇమ్మాన్యూల్ కాంట్ శోకతప్తుడయ్యాడు. – యామిజెన్ -
మోదీకి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రన్‌లకు ఐక్యరాజ్య సమితి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డు లభించింది. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో ఇద్దరు నేతలు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం పొందారు. పాలసీ లీడర్షిప్ కేటగిరీ కింద ప్రకటిస్తున్న ఈ అవార్డును ఐరాస ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారంగా భావిస్తారు. పారిస్ ఒప్పందం కుదరడంలో మాక్రన్ పాత్ర, 2022 నాటికి భారత్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న మోదీ వాగ్దానాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. పర్యావరణ పరిరక్షణకు విశేష కృషిచేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. సౌరశక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి విమానాశ్రయానికి కూడా చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు దక్కింది. -
నేనప్పుడు పదవిలోకి రాలేదు
ఐక్యరాజ్య సమితి: భారత్–ఫ్రాన్స్ దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం కుదిరే సమయానికి తాను పదవిలోకి రాలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అన్నారు. రాఫెల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిందని, ఇది కేవలం వాణిజ్య సంబంధమే కాదని, వ్యూహాత్మకమైనది అని అన్నారు. ‘ఒప్పందంపై సంతకాలు జరిగినప్పుడు నేను అధికారంలో లేను. ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ఏం చెప్పారో నేనూ అదే చెప్పాలనుకునుకుంటున్నా’ అని మాక్రన్ అస్పష్ట సమాధానం ఇచ్చారు. ప్రతిదానిలో లాగుతున్నారు: వాద్రా నాలుగేళ్లుగా బీజేపీ నిరాధార ఆరోపణలతో తనపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఆరోపించారు. రూపాయి పతనం, ఇంధన ధరల పెరుగుదల, రాఫెల్ వివాదం..ఇలా ఎప్పుడు ఇరకాటంలో పడినా ప్రతిసారి అధికార పార్టీ తన పేరును తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. -
రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడి స్పందన
న్యూయార్క్ : రోజుకో మలుపు తిరుగుతున్న రాఫెల్ డీల్ వివాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ స్పందించారు. రాఫెల్ డీల్ వివాదంపై డైరెక్ట్‌గా సమాధానం చెప్పకుండా... భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ఈ వేల కోట్ల డీల్ జరిగేటప్పుడు తాను పదవిలో లేనని చెప్పారు. యునిటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాల్గొన్న సమయంలో ప్రెస్‌తో సమావేశమైన సమయంలో ఈ మేరకు స్పందించారు. మాజీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చెప్పిన మాదిరి మోదీ ప్రభుత్వమే అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్‌ను భారత భాగస్వామిగా చేర్చుకోవాలని ఫ్రెంచ్ ప్రభుత్వానికి లేదా రాఫెల్ తయారీదారి డసో ఏవియేషన్ సంస్థకు ప్రతిపాదించిందా? అని అధ్యక్షుడు మాక్రోన్‌ను రిపోర్టర్లు ప్రశ్నించారు. వీరి ప్రశ్నపై స్పందించిన మాక్రోన్.. ‘ఏ ఆరోపణలను నేను ప్రత్యక్షంగా తిప్పికొట్టలేను. ఆ సమయంలో నేను ఇన్‌ఛార్జ్‌గా లేను. కానీ మేము చాలా స్పష్టమైన నిబంధనలు కలిగి ఉన్నాం. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించిన చర్చ. ఇది భారత్, ఫ్రాన్స్‌ల మిలటరీ, డిఫెన్స్‌ల సంకీర్ణ ఒప్పందం’ అని తెలిపారు. కాగా, గతేడాది మేలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రోన్ ఎన్నికయ్యారు. రాఫెల్ డీల్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో ప్రకటించారు. ఆ సమయంలో ఫ్రాంకోయిస్ హోలాండ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. భారత ప్రభుత్వం సూచనమేరకే రిలయన్స్ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ గత వారం పేల్చిన బాంబుతో, భారత్‌లో రాఫెల్ వివాదం తారాస్థాయికి చేరుకుంది. కాగా, రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ హోలాండ్ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించింది. జూలీ గయె ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి తాము ఫ్రెంచ్ సినిమాలు తీస్తామంటూ అనిల్ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్ ప్రో కో ఒప్పందంలో భాగంగా రాఫెల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసమే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఫ్రెంచ్ ప్రభుత్వం, డసో కంపెనీ కొట్టిపారేస్తున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను పక్కనపెట్టి, ఒక ప్రైవేట్ సంస్థను ఎలా ఎంపిక చేశారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది కూడా. -
మొబైల్ వ్యసనం నుంచి రక్షించేందుకు..
పారిస్ : సెల్‌ఫోన్ వ్యసనం బారి నుంచి పాఠశాల విద్యార్థులను రక్షించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పాఠశాలల్లో సెల్ఫోన్లపై నిషేధం విధించే బిల్లును జాతీయ అసెంబ్లీ(దిగువ సభ)లో ప్రవేశపెట్టింది. మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఎగువ సభకు బిల్లును పంపించారు. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందినట్లైతే ఈ విద్యా సంవత్సరం(సెప్టెంబరు) నుంచే మొబైల్లపై నిషేధం అమలులోకి రానుంది. అయితే ఈ నిబంధనను పారిస్ వరకే పరిమితం చేయాలా లేదా దేశ వ్యాప్తంగా అమలు చేయాలా అనే అంశంపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అసెంబ్లీ సభ్యులు తెలిపారు. కాగా దివ్యాంగ , విద్యా, సాంస్కృతిక కార్యకలాపాల కోసం సెల్ఫోన్లు, ట్యాబెట్లు ఉపయోగించే విద్యార్థులకు ఈ నిబంధన వర్తించదు. ఇందుకు సంబంధించి పూర్తి నియమావళిని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 90 శాతం విద్యార్థులు... 7 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల్లో 90 శాతం మంది సెల్ఫోన్లను వినియోగిస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల పిల్లలు సైబర్ ప్రమాదాల బారిన పడుతుండటం, పోర్న్సైట్లు చూసే కల్చర్ పెరిగి పోతుండటంతో కనీసం స్కూళ్లో అయిన నిషేధం అనివార్యమని పలువురు అసెంబ్లీ సభ్యులు అభిప్రాయపడ్డారు. నిబద్ధత నిరూపించుకున్నా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటానంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. ‘స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్లపై సాధారణ నిషేధం విధించే బిల్లుకు జాతీయ అసెంబ్లీలో పూర్తి మద్దతు లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ పూర్తైనట్లే. నా నిబద్ధత నిరూపించుకున్నా’ అంటూ మాక్రాన్ ట్వీట్ చేశారు.