మాది ప్రత్యేక అనుబంధం; ట్రంప్‌ | Trump Wipes Dandruff From The Suit Collar Of French President Macron | Sakshi
Sakshi News home page

మాది ప్రత్యేక అనుబంధం; ట్రంప్‌

Published Wed, Apr 25 2018 4:46 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Trump Wipes Dandruff From The Suit Collar Of French President Macron - Sakshi

మాక్రాన్‌ కోటు కాలర్‌ మీద ఉన్న డాండ్రఫ్‌ను తుడుస్తున్న ట్రంప్‌

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాదు అప్పుడప్పుడు వింత చేష్టలు చేసి కూడా వార్తల్లో నిలుస్తారు. ప్రస్తుతం ట్రంప్‌ చేసిన ఒక వింత పనికి సంబంధించిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోల్లో ట్రంప్‌... ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ కోటు కాలర్‌ మీద ఉన్న డాండ్రఫ్‌ను తొలగిస్తున్నారు. ఈ పని అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఆసక్తికర సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

ఇంతకు విషయం ఏంటంటే ట్రంప్‌ అధికారం చేపట్టిన 15 నెలల తరువాత ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మాక్రన్‌ అమెరికాను సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యక్ష భవనంలోని ఓవల్‌ కార్యాలయంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు, ఫ్రెంచ్‌ అధ్యక్షుడి కోటు కాలర్‌ మీద ఉన్న డాండ్రఫ్‌ను తొలగిస్తున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఆ నేపథ్యంలో ట్రంప్‌ మాట్లాడుతూ...  ‘మా మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది, మేము అతన్ని పర్ఫెక్ట్‌గా ఉంచాలి...అతను పర్ఫెక్ట్‌గా ఉన్నాడ’ని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement