Dandruff
-
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేయండి!
వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు సమస్యలు వేధిస్తాయి. చెమట, ధూళికారణంగా జుట్టుకి తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ∗ రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని ఒక టీస్పూన్ రసాన్ని తలకు (జుట్టు కుదుళ్లకు) పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. మరొక టీ స్పూన్ల రసంలో కప్పు నీటిని కలిపి తలస్నానం పూర్తయిన తర్వాత తల మీద (స్కాల్ప్‌కు పట్టేలా) పోసుకోవాలి.∗ వారం పాటు తలకు ఆలివ్ ఆయిల్ రాస్తే చుండ్రు వదులుతుంది. రోజూ తలస్నానం చేసే వాళ్లు రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ పెట్టి ఉదయం తలస్నానం చేయవచ్చు.∗ రెండు టేబుల్ స్పూన్ల ల కొబ్బరి నూనెలో అంతే మోతాదు నిమ్మరసం కలిపి తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. మర్దన చేసిన తర్వాత ఇరవై నిమిషాలకు మామూలు షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.∗ టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం (ఒక కాయ) కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తలకు మెంతుల పేస్ట్ పెట్టినప్పుడు కొద్దిగా తేమగా ఉండగానే తలస్నానం చేయాలి. పూర్తిగా ఎండి΄ోయే వరకు ఉంచితే జుట్టుకు పట్టేసిన మెంతుల పేస్టును వదిలించడం కష్టం.∗ కప్పు పుల్లటి పెరుగులో టీ స్పూన్ల నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.∗చుండ్రును వదిలించడంలో వేపాకు కూడా బాగా పని చేస్తుంది. వేపనూనె తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. వేప నూనె లేక΄ోతే వేపాకు రసం పట్టించి మర్దన చేయవచ్చు. -
చిన్నపిల్లల్లో చుండ్రు సమస్య.. ఎలా వదిలించాలి?
చిన్నపిల్లల్లో చుండ్రు రావడం కాస్త తక్కువే అయినా చలికాలంలో అప్పుడప్పుడు కనిపిస్తుండటం మామూలే. దీని నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలివి... ►పిల్లలకు వారానికి 3–4సార్లు తలస్నానం చేయించాలి. తలకు తేమనిచ్చే ఆయిల్స్, లోషన్స్ వంటివి అప్లై చేస్తుండాలి. ఒకసారి జుట్టు రాలడం తగ్గిన తర్వాత హెయిర్ ఆయిల్స్, లోషన్స్ వాడుతూ మాటిమాటికీ మాడు పొడిబారకుండా చూసుకోవాలి. ►అన్ని విటమిన్లతో పాటు ప్రత్యేకంగా విటమిన్ బీ కాంప్లెక్స్ లభ్యమయ్యే ఆహారాలు తీసుకోవాలి. అందులో జింక్ మోతాదులు ఎక్కువ ఉండటం మరింత మేలు చేస్తుంది. ► ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని కెటకెనజోల్, సాల్సిలిక్ యాసిడ్, జింక్ ఉన్న షాంపూలను వారానికి 2–3 సార్లు... అలా 4–6 వారాల పాటు వాడాల్సి ఉంటుంది. ► అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులతో పాటు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు సీబమ్ సెక్రిషన్స్ తగ్గించే మందుల్ని కూడా వాడాల్సి రావచ్చు. -
చుండ్రు సమస్య వేధిస్తుందా? అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు
చలికాలంలో బాధించే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, వయసుతో సంబంధం లేకుండా చాలామందిని చుండ్రు వేధిస్తున్న సంగతి తెలిసిందే. అసలు చుండ్రు ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలి? అన్న విషయాలు తెలుసుకుందాం. చుండ్రు ఎందుకు వస్తుంది? చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనే హానిలేని సూక్ష్మజీవి. ఇది అందరిలో ఉంటుంది. కానీ తలలో అధికంగా ఉండే నూనె, మృత కణాలని ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతుంది. దీనిమూలంగా మృత కణాలు ఎక్కువై తల నిండా పొట్టు లాగా కనపడుతుంది. దీనినే చుండ్రు అంటారు. ఆహారంలో గణనీయమైన మార్పులు, తరచూ ప్రయాణాలు చేయడం, వాతావరణ మార్పు, నీళ్లు మారడం లాంటివి చుండ్రుకు కారణాలు. ఏం చేయాలి? ► ఆపిల్ సీడర్ వెనిగర్‌తో చుండ్రును అరికట్టవచ్చు. ఫంగస్‌ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం వెనిగర్, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ►బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ►కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. ►రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానపెట్టి, ఉదయం దానిని పేస్టులా చేసుకుని ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ► వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ►చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది.. -
చుండ్రు నిమిషాల్లో మాయం
-
Hair Care: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్! ఒత్తైన జుట్టు ఇంకా..
Beauty- Hair Care Tips In Telugu: జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. అలాంటి వారు ఇంట్లోనే చక్కగా ఈ చిట్కాలు ట్రై చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల నువ్వుల పొడి కలిపిన కొబ్బరినూనె తలకు రాసుకుంటే చుండ్రు తగ్గడమే కాకుండా.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇలా తయారు చేసుకోవాలి.. ►కప్పు నల్లనువ్వులను తీసుకుని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. ►అరలీటరు కొబ్బరి నూనెను మందపాటి పాత్రలో పోయాలి. ►దీనిలో నువ్వులపొడి, నాలుగు మందార పువ్వులు, రెండు కరివేప రెబ్బలూ వేసి సన్నని మంటమీద మరిగించాలి. ►మందారపువ్వులు, కరివేపాకు క్రిస్పీగా మారాక నూనెను దించేసి చల్లారనిచ్చి, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. ►రెండురోజులకొకసారి ఈ ఆయిల్‌ను తలకు పట్టించి మర్దన చేసి నాలుగు గంటల తరువాత తలస్నానం చేయాలి. ►క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమేగాక, బాలనెరుపు నియంత్రణలో ఉంటుంది. జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుంది. నల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలు ►తెల్ల నువ్వుల్లో పోషకాలు ఉంటే నల్ల నువ్వుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మాడుని పొడిబారకుండా చేసి, చుండ్రుని తగ్గిస్తాయి. ►యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రుని మరింత విస్తరించకుండా నియంత్రిస్తాయి. చదవండి: Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే! Black Circles Under Eyes: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం Actress Rekha: కొబ్బరి నూనె, పెరుగు, తేనె.. కేశాల ఆరోగ్యం కోసం ఎవర్గ్రీన్ బ్యూటీ రేఖ చెప్పిన చిట్కాలివే! -
Beauty: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా చేయండి
కురులు ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరకుంటుందనడంలో సందేహం లేదు. కానీ కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు రాలడం సహా చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తోంది. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ►కొబ్బరి నూనె, ఆముదం సమపాళ్లల్లో తీసుకుని చక్కగా కలపాలి. ►ఈ నూనెను మాడుకు, జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పదినిమిషాలపాటు మర్దన చేయాలి. ►రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ►వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల ఆముదంలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టుకు అంది చుండ్రు రానివ్వకుండా చేస్తాయి. ►కురులలో వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. ►పీహెచ్ స్థాయులు నియంత్రణలో ఉండి జుట్టురాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇవి తింటే ఆరోగ్యకరమైన కేశాలు ►బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల కురుల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ►రాగి, జొన్న, సజ్జ, బార్లీ పిండిలను కలిపి రొట్టె చేసుకుని తినాలి. ►బ్రకోలి, పాలకూర, కాకరకాయ, బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ కే, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. ►తులసి, పుదీనా, సొరకాయల జ్యూస్.. బెల్లం, తులసి ఆకులతో చేసిన టీ కూడా జుట్టుకు పోషణ అందిస్తుంది. చదవండి: Breast Cancer Screening: అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు! ఇంకా వీరికి -
చుండ్రు సమస్యకు 2 చిట్కాలు! సింపుల్‌గా వదిలించేద్దాం
► అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం నీళ్లు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. ► దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. ► అరగంట తరువాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి. ► అరకప్పు నానిన మెంతులను పేస్టులా రుబ్బుకోవాలి. ► దానికి, పావు కప్పు అలోవెరా పేస్టు కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. చదవండి👉🏻 పొడి చర్మానికి తక్షణ నిగారింపు కోసం ఇలా చేయండి.. ► అరగంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి . ► ఈ రెండు ప్యాక్‌లలో ఏదైనా ఒకదానిని వారానికి రెండుసార్లు తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుముఖం పడుతుంది. దురద కూడా తగ్గుతుంది. చదవండి👉🏼 పైనాపిల్ – బత్తాయి.. పోషకాల జ్యూస్! -
Health Tips: తల దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే
Health Tips In Telugu: ఒక్కోసారి మనం బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది. పరిష్కారాలు ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తలదురద పూర్తిగా పోతుంది. ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు. దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు. ►దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. ►శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ►మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం. చదవండి👉🏾 వయసు యాభై దాటిందా? పాలు,పెరుగు, చీజ్ తీసుకుంటే... -
చుండ్రుకు చెక్ పెట్టాలనుకుంటున్నారా.. ఇవి పాటించండి..
సరిగ్గా తల స్నానం చేయకపోవడం... ఇంకా కొన్ని ఇతర కారణాల వల్ల తలలో చుండ్రు పేరుకు పోతుంది. అందువల్ల వారానికి కనీసం రెండు మూడుసార్లు తల స్నానం చేయాలి. మిగతా రోజుల్లో ఆయిల్‌తో మసాజ్ చేసుకుని సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తూ పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే చుండ్రు తగ్గుతుంది. ఇవి చేస్తూ కింద చెప్పిన సింపుల్ చిట్కాలు పాటిస్తే డ్యాండ్రఫ్ త్వరగా తగ్గుతుంది. సింపుల్ చిట్కాలు ►అరకప్పు మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానపెట్టాలి. నానిన మెంతులను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని ఈ పేస్టుని తలకు రాసుకోవాలి. నలభై నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. ► ఉసిరి, త్రిఫల చూర్ణాన్ని తలకు రాసుకుని ఇరవై నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. ►కప్పు కొబ్బరి పాలలో నాలుగు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తల స్నానం చేసేముందు తలకు పట్టించి పదినిమిషాల తరువాత తలను శుభ్రం చేసుకోవాలి. ►ఐదు స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసి..దీనిలో నాలుగు స్పూన్ల ఉసిరి పొడి వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టును తలకు రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ►స్పూను పెసరపొడి, మూడు స్పూన్ల పెరుగు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంతో తలంటు పోసుకోవాలి. వీటిలో ఏదైనా ఒకదానిని వారానికి రెండు మూడు సార్లు పాటించడం వల్ల చుండ్రు బాధ తగ్గుతుంది. -
చలికాలంలో చుండ్రు: అపోహలు-వాస్తవాలు
చలికాలం వచ్చిందంటే కొన్ని సమస్యలు మరింత తీవ్రంగా పరిణమిస్తాయి. అందులో ప్రధానంగా చర్మసమస్యలు ఒకింత ఎక్కువవుతాయి. అలాంటివాటిల్లో చుండ్రు ఒకటి. అటు జుట్టులోనూ, ఇటు మాడుపైనా మాటిమాటికీ దురద పుట్టిస్తూ, నలుగురితో ఇబ్బంది కలిగిస్తుందీ సమస్య. అన్ని కాలాల్లో కంటే ఈ సీజన్లో ఎక్కువయ్యే ఈ చుండ్రుకు కారణాలేమిటో, దాన్ని నివారించడం ఎలాగో తెలుసుకుందాం. కొందరు తలదువ్వుకోగానే దువ్వెనలో తెల్లటి పొలుసులు రాలుతాయి. మరికొందరిలో ఇవే పొలుసులు షర్ట్‌పై పడి అసహ్యంగా కనిపిస్తుంటాయి. ఇలా కనిపించడానికి కారణమేమిటో చూద్దాం. చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే రెండు పొరలు ఉంటాయి. పైన ఎపిడెర్మిస్, కింది డెర్మిస్ అనే పొరలుంటే అందులోని డెర్మిస్‌లోకి హెయిర్ ఫాలికిల్స్ అనే రోమాంకురాల్లోంచి వెంట్రుకలు పుట్టుకువస్తాయి. వీటి పక్కనే సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రం«థులు సీబమ్ అనే నూనెలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఇది వెంట్రుకలను ఆరోగ్యంగానూ, నిగారింపుతో కూడిన మెరుపును కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఈ సీబమ్ ఉత్పత్తి కొంతమందిలో సాధారణంగా ఉంటే, మరికొందరి లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తలపైన ఉండే చర్మం ఒకింత జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డుపై మెలస్సీజియా అనే ఒక తరహా ఫంగస్ పెరుగుతుంది. సాధారణం గా ఈ ఫంగస్ కూడా అందరిలోనూ ఉంటుంది. కాకపోతే జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ ఫంగస్ అధికంగా పెరిగి... చర్మకణాలపై దాడి చేసి, కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలతో చర్మం ఉపరితలంపైన మృతకణాలు పెరుగుతాయి. దాంతో తలలో పొట్టులా రాలే పొలుసులూ... వాటి కారణంగా దురద, చికాకు పెరుగుతాయి. దురద కారణంగా గోళ్లతో తలను గీరుకోగానే అక్కడ పేరుకున్న మృతకణాలు రాలిపడటం జరుగుతుంది. ఇలా రాలిపడే మృతకణాలనే మనం చుండ్రు అంటుంటాం. తీవ్రతను బట్టి ఒక్కోసారి ఈ చుండ్రు మాడుపైనేగాక కనుబొమలు, కనురెప్పలు, ముక్కుకు ఇరువైపులా, బాçహుమూలాల్లోనూ కనిపించవచ్చు. చలికాలంలో తీవ్రత ఎక్కువ... ఎందుకంటే? చలికాలం వాతావరణంలో తేమ తగ్గుతుంది. దాంతో చర్మం పొడిబారుతుంది. అందుకే చర్మంపై కొద్దిగా గీరగానే తెల్లటి చారికలు కూడా కనిపిస్తుంటాయి. ఇలా తేమ తగ్గిడం వల్ల మృతకణాలు పొడి పొడిగా రాలిపడుతుండటం చాలామందిలో చూడవచ్చు. చండ్రుకు కారణాలు చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు దోహదపడతాయి. చుండ్రు తీవ్రంగా ఉండే కండిషన్‌ను సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. సెబోరిక్ డర్మటైటిస్ ఈ కింది సమస్యలున్నవాళ్లలో తీవ్రంగా ఉండవచ్చు. అంటే... పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి తగ్గడం, మలబద్దకం, వైరస్‌లతో వ్యాపించే అంటువ్యాధుల ఇన్ఫెక్షన్ తర్వాత, సెబోరిక్ ఎగ్జిమా, మానసిక ఒత్తిడులు, తీవ్రమైన అలసట, వ్యక్తిగత శుభ్రత లోపించడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, హెయిర్ స్టైల్స్ కోసం వాడే స్ప్రేలు... ఇలా రకరకాల కారణాల వల్ల చుండ్రు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పార్కిన్సన్స్ లాంటి నరాలకు సంబంధించిన సమస్యలున్నప్పుడూ చుండ్రు వచ్చే అవకాశాలున్నాయి. లక్షణాలు చుండ్రును గుర్తించడం చాలా తేలిక. మాడు విపరీతమైన దురదగా ఉంటుంది. దాంతో గోళ్లతో గీరగానే తెల్లటి పొట్టులాంటి పదార్థం గోళ్లలోకి వస్తుంది. భుజాలమీద, దుస్తుల మీదా కనిపిస్తూ ఉంటుంది. నివారణ ఆహారపరంగా: చుంద్రును నివారించడానికి ఆహారపరమైన జాగ్రత్తల విషయానికి వస్తే... ఈ సీజన్లో సాధారణంగానే మనం తక్కువగా నీళ్లు తాగుతుంటాం. దేహంలో నీటిపాళ్లు తగ్గకుండా ఉండేందుకు చల్లటి సీజన్లో మనమే పనిగట్టుకుని కనీసం రోజూ 12 గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే అన్ని రకాల పోషకాలు ఉన్న సమతులాహారం తినాలి. ఆహారం లో తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. రోజూ తాజా పండ్లు కూడా ఎక్కువగానే తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని నివారించడంలో తోడ్పడతాయి. చర్మం, మాడును ఆరోగ్యంగా ఉంచడం ద్వారా చుండ్రును స్వాభావికంగా నివారించేందుకు ఉపయోగపడతాయి. తీసుకోకూడని పదార్థాలు చుండ్రు సమస్య ఉన్నవారు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే వాటిని తీసుకోవాలి. దువ్వెన విషయంలో జాగ్రత్తలు జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ ఎక్కువగా ఉండేలా చూడటం ద్వారా కూడా మృతకణాల తీవ్రతను తగ్గించవచ్చు. ఇందుకోసం వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. దీనివల్ల రోమాంకురాలకు మాలిష్ అందడంతో అక్కడ రక్తప్రసరణ పెరుగుతుంది. పైగా ఇలా దువ్వుతూ ఉండటం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఎప్పటికప్పుడు రాలిపోతుంది. దీంతోపాటు వాతావరణంలో ఉండే కాలుష్యాలూ, పొగ వంటివి జుట్టును తాకకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. కొంతమంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల, జుట్టులో చెమట పెరిగి చుండ్రు సమస్య ఎక్కువవుతుందని అపోహ పడుతుంటారు. నిజానికి హెల్మెట్ కారణంగా వాతావరణంలోని కాలుష్యం... ఇతర కాలుష్యకారకాలు జుట్టును అంటకపోవడం వల్ల చుండ్రు సమస్య ఒకింత తగ్గుతుందనే చెప్పవచ్చు. షాంపూలతో... చుండ్రును అరికట్టేందుకు అంటూ మార్కెట్లో రకరకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలు దొరుకుతున్నాయి. అందులో జింక్ పైరిత్రిన్, సెలీనియమ్ సల్ఫేడ్, కోల్తార్, కెటోకొనజోల్... లాంటి యాంటీడాండ్రఫ్ షాంపూల్లో ఏదైనా వాడుకోవచ్చు. షాంపూ లేబుల్స్‌పై ఉన్న నిబంధనలను పాటించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఇలాంటి మెడికేటెడ్ షాంపూలు వాడేటప్పుడు... ముందుగా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి వాడటం మంచిదే. లేదా నాలుగు వారాల పాటు ఒక షాంపును వాడినప్పటికీ తగ్గకపోతే మరో షాంపూని మార్చి చూడాలి. వీటి వల్లా తగ్గకపోతే మైల్డ్ కార్టికో స్టిరాయిడ్స్ లోషన్స్‌ని మాడుకు రాసుకుని, కడిగేయాలి. ఏ షాంపూ అయినా అరచేతిలోకి తగినంతగా తీసుకుని, అందులో ఒకింత నీటిలో కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఆ తర్వాత తలంతా రుద్దుతూ శుభ్రపరుచుకోవాలి. చుండ్రు ఉన్నవారు తప్పనిసరిగా రోజూ యాంటీ డాంఢ్రఫ్ షాంపూతో తలస్నానం చేయాలి. కేశాలు పొడిబారుతున్నాయి అనుకునేవారు స్నానం చేయడానికి అరగంట ముందు గోరువెచ్చని నూనెతో మర్ధనా చేసుకోవాలి. అరచేతిలోకి షాంపూను వేసుకున్న తర్వాత దాన్ని నేరుగా జుట్టుకు రాయడం కంటే ఒకింత నీరు కలిపాక అది జుట్టులోకి మరింతగా విస్తరిస్తుందని గుర్తుపెట్టుకోండి. చుండ్రు నివారణకు మరికొన్ని చిట్కాలు ఈ సీజన్లో చలి కారణంగా కొందరు తలస్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లనే వాడుతుంటారు. దీంతో మాడుపై చర్మం మరింత పొడిబారి చుండ్రు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకోసం తలస్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడటం మేలు. డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఇక్కడ పేర్కొన్న చిట్కాలు పాటిస్తూ, యాంటీడాండ్రఫ్ షాంపూలు వాడాక కూడా చుండ్రు తీవ్రత తగ్గకపోయినా, మాడుపై చర్మం ఎర్రగా మారినా, అది పెచ్చులు పెచ్చులుగా ఎక్కువగా ఊడుతున్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వ్యక్తి వయసు, వారి ఇతర ఆరోగ్య సమస్యలను వైద్యులు పరిగణనలోకి తీసుకుని డాండ్రఫ్ తీవ్రత ఎంతగా ఉందో గుర్తించి, తగిన చికిత్స చేస్తారు. అపోహలు – వాస్తవాలు అపోహ: అన్ని కాలాల్లోనూ విసిగిస్తుంది. వాస్తవం: అన్ని కాలాలలో కంటే... చలికాలంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అపోహ: చుండ్రు వల్ల ఎక్కువ జుట్టు రాలుతుంది. వాస్తవం: జుట్టు రాలడానికి కారణం చుండ్రే అన్నది చాలామంది అపోహ. నిజానికి హెయిర్ ఫాల్ వేరు, చుండ్రు వేరు. సాధారణ చుండ్రు వల్ల జుట్టు రాలదు. ఫంగస్ వల్ల చుండ్రు ఎక్కువయితే కొద్దిగా జుట్టు రాలవచ్చు. అయితే చుండ్రు ఉందని మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటే సమస్య మరింతగా పెరగవచ్చు. అపోహ: చుండ్రు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఉదా: దువ్వెనలు, దుస్తులు ఒకరివి ఒకరు వాడుకోవడం మూలంగా వాస్తవం: అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. (అయితే ఇతరుల దువ్వెన వాడకపోవడమే మేలు. ఒకవేళ వాడాల్సి వస్తే అది వాడేటప్పుడు శుభ్రత తప్పనిసరి). అపోహ: పిల్లల్లోనూ చుండ్రు ఉంటుంది. వాస్తవం: చాలా వరకు పిల్లల్లో చుండ్రు సమస్య ఉండదు. (ఏడాది లోపు పిల్లల్లో ఉండే చుండ్రును క్రెడిల్ క్రాప్ అంటారు. ఆ తర్వాత తగ్గిపోతుంది) -డాక్టర్ స్వప్నప్రియ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ -
జుట్టు ఎక్కువగా రాలుతుందా...?
జుట్టు రాలడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది. వయస్సుతో పాటు ఆడ మగ తేడా లేకుండా జుట్టు రాలుతుంది. జుట్టు రాలడం అనే సమస్యతో కనీసం 80 శాతం మంది బాధపడుతున్నారు. రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం మామూలే. అయితే అంతకుమించి రాలుతుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు: జీన్స్, ఒత్తిడి, కాలుష్యం, పోషకాహారలోపం, నిద్రలేమి, చెడు అలవాట్లు. వంశపారంపర్యంగా బట్టతల ఉంటే, హార్మోన్ తేడా జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తుంది. అందువల్ల చిన్న వయసులోనే జుట్టు రాలడం మొదలవుతుంది. ఇక్కడ హార్మోన్ కరెక్షన్స్ చేయాలి. ఒత్తిడి వల్ల తలపై చర్మానికి (స్కాల్ప్) అందవలసిన పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాహారం ముఖ్యం. కాలుష్యం వల్ల జుట్టు పొడిగా అవడం, పోషకాలు సరిగా అందకపోవడం, అవసరం లేని రసాయనాలు అడ్డుపడటం వల్ల జుట్టు రాలిపోతుంది. కాలుష్యం నుంచి కాపాడుకోవాలి. మంచి గాలి పీల్చడం, నార్మల్ వాటర్ తాగడం చేయాలి. ప్రధానంగా తీసుకోవాల్సిన పోషకాలు: విటమిన్ బి3, బి5, ఇలు తీసుకోవాలి. ఇవి చికెన్, ఫిష్, నట్స్, సోయా, ఆకుకూరల్లో లభ్యమవుతాయి. ఐరన్, జింక్ గుడ్డు సొనలో ఉంటాయి. కుంకుళ్లుతో కురులు ధృడం ఆధునికత పెరిగే కొద్దీ ఆడంబరాలకు పోతూ అలవాటుగా వస్తున్న ఆరోగ్య విధానాలను మరిచిపోతున్నాం. స్నానానికి రసాయనాలతో కూడిన ఖరీదైన షాంపూలు, సబ్బులను వాడుతూ.. ప్రకృతి ప్రసాదించిన కుంకుడుకాయలు, శీకాకాయ, సున్నిపిండి వంటివి మరచిపోతున్నాం. ఉద్యోగాలు చేసేవారికి కుంకుడుకాయలు నలగగొట్టి నానబెట్టడానికి ఖాళీ సమయమే కరువైంది. వీటిని నలగగొట్టితే మార్బుల్, సిరామిక్ గచ్చులు పాడైపోతాయని కుంకుడు కాయల జోలికే వెళ్లడం లేదు. అందమైన సీసాలు, ఆకట్టుకునే ప్యాకింగ్‌ల్లో లభించే షాంపూల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ సంప్రదాయ పద్దతుల్ని పాటిస్తే.. శిరోజాలకు కలిగే మేలు అంతా ఇంతాకాదు. తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు. కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతీసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెంట్రుకలు త్వరగా నెరవవు. జుట్టు ఊడదు. మృదువుగా ఉంటాయి. -
చుండ్రు నివారణకు
►వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ►చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది.. ►ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ►కప్పు నీళ్లలో 2–3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ►బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చుండ్రు నివారణకు ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి. ►కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది. -
చుండ్రు సమస్య తగ్గేదెలా?
నా వయసు 24 ఏళ్లు. నాకు చుండ్రు ఎక్కువగా వస్తోంది. అమ్మాయిని కావడంతో తలలో చేయిపెట్టి గీరుకోవడం చాలా ఎంబరాసింగ్‌గా అనిపిస్తోంది. దయచేసి నా సమస్య తీరడానికి ఏమైనా మార్గాలుంటే చెప్పండి. – సుప్రియ, విశాఖపట్నం నిజమే. అమ్మాయిలకు చుండ్రు ఉన్నప్పుడు వాళ్ల సెల్ఫ్–ఎస్టీమ్ కాస్తంత దెబ్బతిని, కొంత కుంగిపోతుంటారు. అయితే కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అవి... ►చుండ్రు ఉన్నవారు తలకు జిడ్డుగా ఉండే నూనెలు రాయకపోవడమే మంచిది. కొందరిలో నూనె రాయకపోతే తలనొప్పి వంటివి వస్తాయనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వారు తలకు నూనె రాయాల్సి వస్తే, కొద్దిసేపటి తర్వాత తప్పనిసరిగా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ నూనె రాసేటప్పుడు కూడా సువాసన నూనెలు కాకుండా శుభ్రమైన కొబ్బరినూనెకే పరిమితం కావడం మంచిది. ►మీరు తల స్నానం చేసేటప్పుడు మాడు అంతా పూర్తిగా శుభ్రపడేలా రుద్దుకుంటూ స్నానం చేయండి. మీకు సరిపడే మంచి షాంపూతో కనీసం వారంలో రెండుసార్లయినా తలస్నానం చేస్తుండాలి. ఇలా రోజు విడిచి రోజూ తలస్నానం చేయాల్సి వచ్చినప్పుడు మైల్డ్ షాంపూలు మాత్రమే ఉపయోగించాలి. ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడటమూ మంచి ప్రయోజనాలిస్తుంది. ►ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాక కూడా చుండ్రు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వారి సూచన మేరకు... యాంటీ ఫంగల్ ఏజెంట్స్, తార్ కాంపౌండ్స్ వంటివి ఉన్న మెడికేటెడ్ షాంపూలు వాడవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... ఈ తరహా షాంపూలు ఉపయోగించేటప్పుడు వీటిని నీళ్లలో పలుచబార్చకూడదు. ఒకసారి తలకు పట్టించాక కనీసం 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడే అవి తమ ప్రభావం చూపగలవు. ఐదు నిమిషాల తర్వాత వాటిని శుభ్రంగా కడిగేయాలి. జుట్టురాలుతున్నా లేదా దురద ఎక్కువగా ఉన్నా ఒక్కోసారి స్టెరాయిడ్ బేస్డ్ లోషన్లు కూడా డాక్టర్లు సూచిస్తారు. అయితే వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. ►చుండ్రుతో పాటు మొటిమలు కూడా ఉంటే... హార్మోన్లలో ఏవైనా మార్పులు వచ్చాయా అనే పరీక్షలు చేయించాలి. ఆ వచ్చే ఫలితాలను బట్టే తర్వాతి చికిత్స కొనసాగాలి. ►జుట్టు పొడవుగా ఉండే మహిళలు తలస్నానం చేశాక వెంటనే దాన్ని ముడుచుకోవడం తగదు. ఎందుకంటే అలాంటి సమయంలో జుట్టులో తేమ చాలాసేపు ఉండి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే వాతావరణానికి అనువుగా ఉంటుంది. పైగా జుట్టు తొందరగా చిక్కులు పడుతుంది. అందుకే జుట్టును ఆరేందుకు ఫ్రీగా వదిలేయాలి. పూర్తిగా తడి ఆరకముందే దువ్వడం సరికాదు. దాదాపు పొడిబారిపోయే సమయంలో దువ్వడం మంచిది. ►విటమిన్–ఏ, జింక్ పాళ్లు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ►చుండ్రు ఒక దీర్ఘకాలిక సమస్య. కేవలం కొద్దిరోజులు షాంపూ వంటివి వాడాక తగ్గిపోవడం అన్నది సాధారణంగా జరగదు. కాబట్టి సమస్య ఉన్నంతకాలం యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతుండటమే మంచిది. లేదా చుండ్రు మళ్లీ తిరగబెట్టినప్పుడు యాంటీడాండ్రఫ్ షాంపూల వాడకం మళ్లీ మొదలుపెట్టాలి. అవి చాలావరకు సురక్షితమే. అయితే దీర్ఘకాలం పాటు వాడుతున్నప్పుడు కొందరిలో అవి తలను పొడిబారేలా చేయవచ్చు. అలాంటప్పుడు కండిషనర్స్ కూడా వాడటం మంచిది. కొన్ని షాంపూల వల్ల జుట్టు రాలుతున్నట్లు గమనిస్తే వెంటనే షాంపూను మార్చి తమకు సరిపడేది వాడాలి. ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలతో చుండ్రును చాలావరకు తేలిగ్గానే అరికట్టవచ్చు. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ షాంపూఎంపిక ఎలా? నా వయసు 22 ఏళ్లు. చాలాకాలంగా షాంపూలు వాడుతున్నా దేనితోనూ సంతృప్తిపడలేకపోతున్నాను. మార్కెట్లో రకరకాల షాంపూలు అందుబాటులో ఉండటంతో పాటు, టీవీల్లో కనిపించే యాడ్స్‌తో ఇంకా అయోమయంలో పడిపోతున్నాను. నాలాంటి ఎంతోమంది అమ్మాయిలకు అది ఉపయుక్తంగా ఉంటుందనిపించేలా మంచి షాంపూను ఎంపికకు ఏమైనా సూచనలివ్వండి. ప్లీజ్! – ఎమ్ లక్ష్మీ సుశ్మిత కొందరివి పలుచటి వెంట్రుకలు, కొందరివి బిరుసుగా ఉంటాయి.. ఇలా సాధారణంగా అందరి వెంట్రుకలూ ఒక్కలా ఉండవు. కాబట్టి అందరి షాంపూ అవసరాలూ ఒకేలా ఉండవని మనం గుర్తుంచుకోడాలి. ఇక మన అవసరాలను బట్టి మార్కెట్లోకి రకరకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు కొంత అయోమయానికి గురికావడం సహజమే. అయితే మన అవసరాలను బట్టి మనం ఎలాంటి షాంపూలను ఎంచుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ కింది సూచనలు పాటించడం చాలావరకు మేలు చేస్తుంది. అందరూ వాడదగ్గవి : ఇందులో శుభ్రపరిచే సామర్థ్యం (క్లెన్సింగ్ ఎబిలిటీ) నార్మల్‌గా ఉంటుంది. నార్మల్ హెయిర్ కోసం వాడాల్సిన ఈ షాంపూలు సాధారణంగా లారిల్ సల్ఫేట్ అనే నురగవచ్చే పదార్థంతో తయారవుతాయి. ఇందులో ఆ రసాయనంతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఉత్పత్తిదారులు రకరకాల సుగంధ ద్రవ్యాలను చేర్చి వాటిని మంచి సువాసన వచ్చేలా రూపొందిస్తారు. ఇవి ఎవరైనా వాడవచ్చు. కాబట్టి మార్కెట్లో ఉన్న రకరకాల బ్రాండ్స్‌ను వాడుతూ... ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో... మీకు ఏది అనువైనదో, సౌకర్యమో అది వాడుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఛాయిస్ షాంపూను మీ సంతృప్తి మేరకు కొనసాగించవచ్చు. జుట్టులో మంచి సువాసనతో పాటు, ఆహ్లాదకరమైన ఫీలింగ్ కోరుకునే వారు ఇలాంటివి వాడుకోవచ్చు. అయితే షాంపూ ఏదైనప్పటిక అది మైల్డ్‌గా ఉండటం అన్నది జుట్టు విషయంలో దాదాపుగా అందరికీ ఆరోగ్యాన్నిచ్చేందుకు డాక్టర్లు ఇచ్చే ఒక మంచి సూచన. పొడి వెంట్రుకలు ఉండేవారికి : వెంట్రుకలు చాలా పొడిబారినట్లుగా ఉంటాయి. ఇలాంటి వారికోసం తయారయ్యే షాంపూల్లో రోమాన్ని శుభ్రపరిచే రసాయనాలు మరీ తీవ్రంగా లేకుండా చూస్తారు. అంటే మైల్డ్ క్లెనింగ్ ఏజెంట్స్‌ను ఉపయోగించి చేస్తారు. దాంతో పాటు వెంట్రుక కండిషనింగ్ కోసం అందులో సిలికోన్ వంటి ఏజెంట్స్, కెటాయినిక్ పాలిమర్స్‌ను కలుపుతారు. వాటిని ఉపయోగించాక ఆ సిలికోన్ పొడి వెంట్రుకల మీద సమంగా విస్తరించి ఒక కోటింగ్‌లా ఏర్పడుతుంది. కాబట్టి పొడి వెంట్రుకలు ఉన్నవారికి సిలికోన్, కెటాయినిక్ పాలిమర్స్ ఇంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉన్నవి మంచి షాంపూలుగా పరిగణించవచ్చు. మీరు పొడి వెంట్రుకలు కలవారేతే... పైన పేర్కొన్న ఇన్‌గ్రేడియెంట్స్ షాంపూలో ఉన్నాయో లేవో చూసి, అలాంటి వాటినే ఎంపిక చేసుకోవచ్చు. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి : తలలోని చర్మరంధ్రాల నుంచి సీబమ్ అనే స్రావం ఎక్కువగా వచ్చిన వారి వెంట్రుకలు సాధారణంగా జిడ్డుగా ఉంటుంటాయి. ఇలాంటి జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి అవసరమైన షాంపూలను మాడుపైన, వెంట్రుకపైన ఉన్న అదనపు సీబమ్‌ను తొలగించేలా రూపొందిస్తారు. ఇందులో క్లెన్సింగ్ ఏజెంట్‌గా లారిల్ సల్ఫేట్‌తో పాటు అదనపు నూనెవంటి స్రావాలను తొలగించడానికి ఉపయోగపడే ‘సల్ఫోసక్సినేట్’ వంటి రసాయనాలతో వీటిని తయారు చేస్తారు. అయితే జిడ్డుజుట్టు ఉన్నవారికి రూపొందించే షాంపూలలో కండిషనింగ్ తక్కువగా ఉండేలా చూస్తారు. కాబట్టి పైన పేర్కొన్న కాంబినేషన్స్ ఉన్నవి జిడ్డు కురుల వారు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే కురులు మరీ జీవం లేనట్టుగా మారిపోతాయి. అప్పుడది పీచులా కనిపించే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఎన్నిసార్లు తలస్నానం చేస్తే, అలా కనిపిస్తుందో ఎవరికివారు పరీక్షించి చూసుకొని, వారంలో అంతకంటే తక్కువసార్లు తలస్నానం చేయడం మంచిది. వారంలో తలస్నానం ఎన్నిసార్లు? జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయవచ్చు. – ఆర్. రమణి, గుంటూరు సాధారణంగా వారానికి ఇన్నిసార్లే తలస్నానం చేయాలంటూ నిర్దిష్టంగా లెక్కేమీ ఉండదు. కొందరికి రోజూ తలస్నానం చేస్తే తప్ప స్నానం చేసినట్టు ఉండదు. ఇలాంటివారికి తమ వ్యక్తిగత సంతృప్తే ప్రధానం కాబట్టి... తమ తమ వ్యక్తిగత అభిరుచి మేర తలస్నానం చేయవచ్చు. అయితే సాధారణంగా వారంలో రెండు సార్లు, మరీ తలలో దురద ఎక్కువగా వచ్చేవారు రోజు విడిచి రోజు... (అది కూడా మైల్డ్ షాంపూతో మాత్రమే) తలస్నానం చేస్తే మంచిది. -
బంగారుకాంతికి...
పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగులో ఉండే గుణాలు నలుపుగా మారిన చర్మాన్ని సాధారణ రంగులోకి తీసుకువస్తాయి. కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తుంది. ∙టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.∙టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. మెడకు, గొంతుకు కూడా రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా అవుతుంది. చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. పెరుగులో పెసరపిండి కలిపి రెండు రోజులు బయటే ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలకు మంచి కండిషనింగ్ లభించి మృదువు అవుతాయి. టీ స్పూన్ పెసరపిండిలో తగినంత పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువవుతుంది. -
మాది ప్రత్యేక అనుబంధం; ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాదు అప్పుడప్పుడు వింత చేష్టలు చేసి కూడా వార్తల్లో నిలుస్తారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఒక వింత పనికి సంబంధించిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోల్లో ట్రంప్... ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ కోటు కాలర్ మీద ఉన్న డాండ్రఫ్‌ను తొలగిస్తున్నారు. ఈ పని అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఆసక్తికర సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇంతకు విషయం ఏంటంటే ట్రంప్ అధికారం చేపట్టిన 15 నెలల తరువాత ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్ అమెరికాను సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యక్ష భవనంలోని ఓవల్ కార్యాలయంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు, ఫ్రెంచ్ అధ్యక్షుడి కోటు కాలర్ మీద ఉన్న డాండ్రఫ్‌ను తొలగిస్తున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ... ‘మా మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది, మేము అతన్ని పర్ఫెక్ట్గా ఉంచాలి...అతను పర్ఫెక్ట్గా ఉన్నాడ’ని తెలిపారు. -
బ్యూటిప్స్
ముప్పై సంవత్సరాలు దాటిన మహిళలకు, చర్మంలో ముడుతలు మొదలవుతాయి. ముడతలు తగ్గాలంటే ... ∙ కోడిగుడ్డు తెల్ల సొనను బాగా నురగ వచ్చేవరకు కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. గుడ్డు తెల్లసొన, రెండు టేబుల్స్పూన్ల శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని ఆరిన తరువాత (15 నిమిషాలు వుంచుకోవాలి) కడుక్కోవాలి. ∙ గుడ్డు పచ్చసొన, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, బాగా పండిన టొమాటోలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకుని 20 నిముషాలు ఉంచి కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లైనా చేసుకుంటే పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది. ఇలా తరచుగా చేసుకుంటే చర్మం కాంతివంతమవడమే కాకుండా, స్కిన్ టైట్ అవుతుంది. ∙గుడ్డులోని తెల్లసొనకు శనగపిండిని చేర్చి దానిని తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్యని కొంత వరకూ తొలగించవచ్చు. వెంట్రుకలు కూడా మృదుత్వం పొందుతాయి. -
బ్యూటిప్
జలుబు వల్ల ఉదయం నిద్రలేవగానే కళ్ల కింద ఉబ్బుగా కనిపిస్తుంది. ఎండిన చిట్టి చేమంతులను పొడి చేసి, ఆ పొడిని ఒక గుడ్డలో వేసి మూట కట్టాలి. వేడి నీటిలో ఆ మూటను కాసేపు ఉంచి, ఉబ్బుగా ఉన్న కళ్ల కింద మృదువుగా అద్దుతూ (తగినంత మాత్రమే వేడి ఉండేలా జాగ్రత్తపడాలి) ఉండాలి. రోజూ ఉదయాన్నే ఇలా చేస్తే కళ్లకింద ఉబ్బుతో పాటు నల్లని వలయాలు కూడా తగ్గుముఖం పడతాయి. చామంతి పొడితో కాచిన తేనీటిని మాడుకు పట్టించి, తర్వాత తలస్నానం చేస్తే ఎంతకీ తగ్గని చుండ్రు సమస్య పరిష్కారం అవుతుంది. -
బ్యూటీప్స్
పుదీనా ఆకులను రుబ్బి నీళ్లు కలిపి మాడుకు పట్టించి కొంతసేపటి తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి... గంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. -
హెల్త్ టిప్స్
కండరాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే బామ్‌లు, ఇతర మందులు వాడే ముందు ఒకసారి గోరువెచ్చటి ఆముదం రాసి మర్దన చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది. తలలో చుండ్రు కారణంగా దురద పెడుతుంటే మాడుకు వెనిగర్ పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఒంటి మీద ర్యాష్ కాని మరేదైనా దురద కాని (చర్మం పొడిబారడం వల్ల వచ్చిన మంట కాకుండా) వచ్చినా కూడా ఇదే పద్ధతి. అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు కాని మరే కారణంతోనైనా ఆహారంలో చక్కెరను మినహాయించదలుచుకుంటే దానికి బదులుగా షుగర్ ఫ్రీ ఉత్పత్తులను వాడడానికంటే తేనె వాడకమే మంచిది. రాత్రి పడుకునే ముందు నాలుగైదు పుదీనా ఆకులు నమిలితే నోరు శుభ్రపడుతుంది. పళ్ళు, చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు రావు. పుదీనా నోటి దుర్వాసనను అరికడుతుంది. వర్షానికి తడిచి జలుబుతో బాధపడుతుంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగాలి. -
స్కాల్ప్ సమస్యలు మాడుతోంది
ఎవరికైనా సరే... తొలి కిరణం సోకేది మాడుకే. తొలుత మాడిపోయేది మాడే. భానుడి చండప్రచండానికి మొదట గురయ్యేదీ, ఎక్కువగా ప్రభావితమయ్యేది కూడా మాడే. ఎండలకు మాడే ఈ మాడు తాలూకు... మూడు ప్రధాన సమస్యలు. అవి... వెంట్రుకలు రాలడం, దురద. చుండ్రు. ఎండ వల్ల పొడిబారి దురద పెరగవచ్చు. చుండ్రు రాలడం మరింతగా జరగవచ్చు. ఇవిగాక మరికొన్ని వ్యాధుల వల్లనే వచ్చేవి కాస్తంత అరుదు... అప్రధానం. మూడు సమస్యలను ప్రత్యేకంగా ఇచ్చాం. మిగతావి గుదిగుచ్చాం. మొత్తం మీద మాడుపై ప్రత్యేక కథనమిది. తల గోక్కుంటుంటే వెంటనే చదవవచ్చు. ఊరికే తల గీరుకోకూడదని అనుకున్నా వెంటనే ఈ కథనాన్ని చదవాల్సిందే. ఎండల్లో తిరుగుతుంటే చర్మం నల్లబారుతుండటం మనకు తెలిసిందే. స్కిన్ట్యాన్ను గుర్తించిన వెంటనే మనం ఫుల్ స్లీవ్స్ వేసుకోవడమో, సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడమో చేస్తుంటాం. మరి ఎండ వల్ల మాడుపై ఎలాంటి దుష్ప్రభావం పడుతుంది. దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలకు ఆస్కారం ఉంటుందనే విషయాలపై అవగాహన పెంచుకుందాం. ఎండలో మాడుపై పడే దుష్ప్రభావాలు! మిగతా చర్మంతో పోలిస్తే మన మాడు మీద నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. అలా నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అనీ... ఆ నూనెను సీబమ్ అని అంటారు. ఈ సీబమ్ సాధారణ వాతావరణంలో స్రవించే మోతాదుకంటే ఎండకాలం ఎక్కువగా స్రవిస్తుంటుంది. పైగా పది రెట్లు ఎక్కువగా. అందుకే ఈ సీజన్లో జుట్టు త్వరగా జిడ్డుగా మారడం, అణిగినట్లుగా కనిపించడం జరుగుతుంది. పైగా జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.అందరి చర్మంపైనా మలసేజియా అనే ఫంగస్ నివసిస్తూ ఉంటుంది. దానికి మన చర్మం పైన స్రవించే ఈ ‘సీబమ్’ ఆహారం. ఇక ఎండలో తిరిగేవారిలో సీబమ్ పెరగడం వల్ల ఈ ఫంగస్ మరింత ఎక్కువగా వృద్ధి చెంది చుండ్రుకు కారణమవుతుంది. అదే ఫంగస్ పెరుగుదల విపరీతంగా, అత్యంత ఎక్కువగా జరిగితే... అది సెబోరిక్ డర్మటైటిస్ అనే చర్మవ్యాధికి దారి తీస్తుంది. ఎండ కారణంగా... చెమట వల్ల... ఎండలో మాడుపై సీబమ్ పెరగడంతోపాటు కొందరిలో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇది జుట్టు దట్టంగా ఉండేవారికి నరకమే. ఇలాంటి స్థితిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. వీటివల్ల హెయిర్ ఫాలికిల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. దీన్ని వైద్యపరిభాషలో ‘ఫ్యాలిక్యులైటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్ నిండినట్లుగా అనిపించే కురుపులు) వస్తుంటాయి. వాటి వల్ల నొప్పి, దురద ఎక్కువగా ఉండవచ్చు. నేరుగా పడే ఎండ వల్ల! నేరుగా మాడుపై ఎండ పడుతూ ఉండటం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వెంట్రుకలపై ఎండ నేరుగా పడితే ‘రోమాంకురాలు’ (హెయిర్ ఫాలికిల్స్ డ్యామేజ్) దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యను ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లువియమ్’ అని కూడా అంటారు. వీటితో పాటు తీవ్రమైన ఎండల వల్ల కొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి వస్తుంటాయి. ఎండలో హెల్మెట్‌తో సమస్యా? హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు మరింతగా రాలుతుందనే అపోహ ఉంది. కానీ హెల్మెట్ జుట్టును, మాడును ఎండ నుంచి కాపాడుతుంది. కాలుష్యం నుంచీ రక్షిస్తుంది. జుట్టును రాలకుండా ఆపుతుంది. అయితే పరిశుభ్రమైన గుడ్డను తల మీద కప్పుకుంటే మంచిది. అలా చేయడం వల్ల చెమటతో తడిసి, అపరిశుభ్రంగా ఉన్న హెల్మెట్‌ను ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులను నివారించవచ్చు. స్కాల్ప్ అంటే ఏమిటి...? మాడు భాగాన్ని ఇంగ్లిష్‌లో స్కాల్ప్ అంటుంటాం. ముక్కు, చెవి, నుదురులాగ స్కాల్ప్ అనేది ఒక పదం కాదు. ఇంగ్లిష్‌లో ఐదుపదాల ముందు అక్షరాలను తీసుకొని ‘స్కాల్ప్’ అనే పదాన్ని రూపొందించారు. దీని స్పెల్లింగ్‌లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాలూ ఇలా ఉంటాయి. ఎస్ అంటే స్కిన్, సీ అంటే కనెక్టివ్ టిష్యూ, ఏ అంటే ఎపోన్యూరోటికా, ఎల్ అంటే లూజ్ ఏరియోలా, పీ అంటే పెరియాస్టియమ్ అనే మాటలను సూచిస్తాయి. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలై నుంచి పి అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక భాగం వరకు వరసగా ఉండే పొరలకు ఉన్న పేర్ల తాలూకు ఇంగ్లిష్ అక్షరాలతో స్కాల్ప్ అనే పదాన్ని రూపొందించారు. మాడు సమస్యల నివారణ కోసం... పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుతో పాటు పలు మాడు సమస్యలకు కారణమయ్యే అంశాలను నివారిస్తాయి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల మాడు మీద చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. మాడుపై చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. డాక్టర్‌ను సంప్రదించాల్సినదెప్పుడు... మాడుకు సమస్య వచ్చినట్లు గ్రహించిన తర్వాత, డాక్టర్‌ను తప్పక సంప్రదించాల్సిన అవసరం ఈ కింది సందర్భాల్లో ఉంటుంది. ∙మాడు మీద విపరీతంగా దురద పెడుతున్నప్పుడు ∙ఎండలో ఉన్నప్పుడు దురద మరింతగా పెరుగుతుంటే ∙చీముతో కూడిన కురుపులు కనిపించినప్పుడు ∙మాడు మీద తెలుపు లేదా గ్రే కలర్ పెచ్చులు వచ్చినప్పుడు ∙ఎండలో తిరిగినప్పుడల్లా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే... తప్పనిసరిగా చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించాలి. అపోహ... వాస్తవం ⇒ఎండల్లో హెల్మెట్ కారణంగా మరింత జిడ్డు పెరగడం, చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ హెల్మెట్ ఈ సీజన్లో నేరుగా ఎండ వెంట్రుకలపై పడటం వల్ల కలిగే దుష్ప్రభావాలనుంచి కాపాడుతుంది. కాకపోతే లూజ్‌గా ఉండే పరిశుభ్రమైన గుడ్డను చుట్టుకున్న తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం మేలు. ⇒మంచి షాంపూ వాడిన తర్వాత కాసేపు ఎండలో వెంట్రుకలు మెరుస్తూ కనిపిస్తాయని అనుకుంటాం. కానీ నేరుగా వెంట్రుకలపై పడే ఎండ వాటిని డల్‌గా చేస్తుంటుంది. అందుకే నేరుగా ఎండలోకి వెళ్లేవారు వెంట్రుకలకు రక్షణగా క్యాప్ ధరించడం మేలు. అది కాస్తంత వదులుగా ఉండే కాటన్ క్యాప్ అయితే మరింత మంచిది. ఎండ వేళల్లో... దువ్వుకోవాల్సిందిలా... ⇒రక్తప్రసరణ కుదుళ్లకు సరిగ్గా అందాలంటే బాగా దువ్వుకోవడం, మంచి దువ్వెన ఉపయోగించడం మేలు. వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, ముందుకు వేసుకుని కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. ఇలా చేయడం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఉంటే రాలిపోతుంది. అది మాడుకు మేలు చేస్తుంది. ⇒ఎండల్లో సాధారణంగా పెరుగుతూ మాడును మాడ్చేసే పై సమస్యలను తెలుసుకుంటే, దానికి బదులు సమస్యనే మాడ్చవచ్చు. చికిత్సతో మాన్పవచ్చు. అంతేకాదు... పైన పేర్కొన్న జాగ్రత్తలు కేవలం మాడుకే గాక మిగతా చర్మానికే మేలు చేస్తాయి. ఎండలో మాడు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ⇒మాడుపై సీబమ్ ఎక్కువగా రావడం వల్ల జుట్టు డల్‌గా, జిడ్డుగా కనిపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయాలి. ⇒మన స్కాల్ప్ తాలూకు పీహెచ్ విలువ 5.5 ఉంటుంది. సరిగ్గా ఇదే పీహెచ్ ఉన్న షాంపూలను వాడితే మాడుకు మంచిది. ⇒చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్ ఉన్నవారు తప్పనిసరిగా చర్మవ్యాధి నిపుణులను కలిసి వారు సూచించే మందులను తీసుకోవాలి. జాగ్రత్తలను తప్పక పాటించాలి. ⇒జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు... ఆయిలీగా ఉండే కండిషనర్స్‌ను వాడకూడదు. ⇒జిడ్డు చర్మం, జిడ్డు ఎక్కువగా ఉండే మాడు కలిగిన వారు తలకు నూనె పెట్టడం కూడా అంత మంచిది కాదు. ⇒నేరుగా ఎండలోకి వెళ్లేవారు, మోటార్ బైక్‌పై వెళ్లేవారు ఏదైనా వదులుగా ఉండే కాటన్ తల గుడ్డతో తలను కవర్ చేసుకొని ఆ పైనే హెల్మెట్ ధరించాలి. ⇒ ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అందరికీ మేలు. డాక్టర్ సింధూర కంభంపాటి కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్,హైటెక్ సిటీ, హైదరాబాద్ -
పెదవులకు కొత్తిమీర!
బ్యూటిప్స్ పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే సరి. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉన్న నలుపుదనం పోయి ఎర్రగా మారుతాయి. అలాగే ఎప్పటికప్పుడు పెదవులు పొడిబారకుండా ఆర్గానిక్ లిప్‌బామ్ రాసుకుంటూ ఉంటే మార్పును వెంటనే చూడొచ్చు. చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు ఒక స్పూను ఉల్లిపాయ రసాన్ని, రెండు స్పూన్ల కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకోవాలి. ఓ అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది. టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో కోకా బటర్ టేబుల్ స్పూన్, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, అప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఉడికించి, చల్లారాక జార్లో భద్రపరచాలి. రాత్రి పడుకునేముందు చేతులను శుభ్రపరుచుకొని ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఎండవల్ల నలుపుగా మారిన చేతులపై చర్మం సహజ రంగులోకి మారుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. -
గోధుమ ఊక.. కొబ్బరి పాలు..
బ్యూటిప్స్ అర కప్పు గోధుమ ఊకలో టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి, వేళ్లతో సున్నితంగా, వలయాకారంగా ఐదు నిముషాల సేపు రుద్దుతూ ఉండాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. కప్పు కొబ్బరి నూనెలో టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు కలిపి, వేడి చేయాలి. బియ్యం గోధుమవర్ణంలోకి వచ్చేంత వరకు వేడి చేసి, చల్లార్చి బాటిల్లో భద్రపరుచుకోవాలి. కొద్దిగా వేడి చేసి, ఈ నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెను వాడుతుంటే వెంట్రుకలు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి. -
బ్యూటిప్స్
జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేయాలి. క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చొప్పున చేస్తుంటే ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెతో కూడా ఇలాగే మర్దన చేసుకోవచ్చు. మరీ పొడిబారి నిర్జీవంగా ఉంటే ఆలివ్ ఆయిల్ వాడితే త్వరగా ఫలితం ఉంటుంది. భృంగరాజ్, మహా భృంగరాజ్ నూనెలతో మర్దన చేస్తే కేశాలు నల్లగా మెరుస్తాయి. జుట్టు రాగి రంగులో ఉండే వాళ్లు దీనిని ప్రయత్నించవచ్చు. ఈ నూనెలు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. చుండ్రుతో బాధపడుతుంటే కరక్కాయ పొడిలో మామిడి టెంకలోని జీడిని పొడి వేసి తగినంత నీటితో పేస్టులా కలుపుకుని జుట్టుకు పట్టించాలి. కరక్కా య, మామిడి జీడి తాజావి దొరికితే రెండింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని వాడితే పొడి కంటే బాగా పని చేస్తాయి. -
డాండ్ రఫ్పాడించండి
గట్టిగా కొట్టకూడదు. ఊహూ... తిట్టకూడదు. ప్రేమగా హ్యాండిల్ చేయాలి. రక్కినా, గీకినా రివర్స్ కొడుతుంది. కామ్‌గా డీల్ చేయాలి. ఎక్కువ హాట్ వద్దు... ఎక్కువ కూల్ వద్దు. వెచ్చగా బుజ్జగించాలి. భుజాలు దులుపుకోవడం ఆపి... లౌలీగా డాండ్ఫ్ఫ్రాడించండి. గమనిక: చుండ్రు ఒకసారి వచ్చిందంటే దానిని రకరకాల పద్ధతుల ద్వారా తగ్గించవచ్చు. కాని పూర్తిగా నివారించలేం అన్నది గుర్తుంచుకోవాలి. జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చుండ్రు మళ్లీ మళ్లీ బాధించే అవకాశమూ ఉంది. నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మన వేళ్లు మన జుట్టులోకి దూరిపోతాయి. అదంత డీసెంట్ కాదని కాసేపు ఆగాక తెలుస్తుంది. అదీ కాకపోతే జుట్టులోంచి పొడి రాలుతుంది. ఒక్కోసారి కొందరిలో గోళ్లలోకి జిడ్డు చేరుతుంది. ఏదైనా... పదిమందిలో మనకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే జరుగుతుంది. కారణం... చుండ్రు. చుండ్రు కారణంగా మన దేశంలో చాలా మంది బాధపడుతుంటారు. ప్రధానంగా 20 - 40 ఏళ్ల మధ్య వయసువారిలో ఈ సమస్య ఎక్కువ. అదీ స్త్రీలలోకన్న పురుషులలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. పుట్టుకొచ్చే విధం ఇదీ... చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే రెండు పొరలు ఉంటాయి. పై పొరను ఎపిడెర్మిస్ అని, కింది పొరను డెర్మిస్ అని అంటారు. మాడుపైన ఉండే డెర్మిస్ పొరలో నుంచే వెంట్రుకలు పుట్టుకువస్తాయి. ఈ హెయిర్ ఫాలికల్స్(వెంట్రుకల కుదుళ్లు) పక్కనే సెబేసియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రంథులు సీబమ్ అనే ఆయిల్‌ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ ఆయిల్ వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచటానికి దోహదం చేస్తుంది. దీని ఉత్పత్తి కొంతమందిలో సాధారణంగా ఉంటే, మరికొందరిలో అసాధారణంగా అంటే.. ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఎపిడెర్మిస్ పొర త్వరగా జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డుపై ఫంగస్ (మెలస్సీజియా) చేరుతుంది. సహజంగానే ఈ ఫంగస్ కూడా అందరి తలలోనూ ఉంటుంది. కాకపోతే జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ ఫంగస్ అధికంగా చేరి స్కిన్సెల్స్ (చర్మకణాల), సీబమ్పై దాడి చేసి, కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలు మృతకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తాయి. ఫలితంగా తలలో దురద, చికాకు కలుగుతుంది. దురద అనిపించగానే గోళ్లతో తలను గీకుతుంటారు. దీంతో మృతకణాలు పైకిలేస్తాయి. పొడిగా మారిన మృతకణాలు జుట్టు నుంచి రాలి పడతాయి. దానిపేరే ‘చుండ్రు.’ ఎక్కడెక్కడ? మాడుపైనే కాదు కనుబొమలు, కనురెప్పలు, ముక్కుకు ఇరువైపులా, బాహుమూలాల్లోనూ (చంకల్లోనూ) చుండ్రు కనిపించవచ్చు. లక్షణాలు చుండ్రును గుర్తించడం చాలా సులువు. మాడు విపరీతమైన దురదగా ఉంటుంది. తెల్లటి పొట్టులాంటి పదార్థం మాడుపైన, భుజాలమీద, దుస్తుల మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ కండిషన్ మరీ తీవ్రమైతే ఆ పరిస్థితిని ‘సెబోరిక్ డర్మటైటిస్’ అంటారు. కొన్నిసార్లు హెచ్ఐవీ, విటమిన్లలో లోపాలు, పార్కిన్సన్ వంటి నరాలకు సంబంధించిన వ్యాధులు (న్యూరలాజికల్ డిజార్డర్స్) ఉన్నవారిలో ఈ సీబమ్ అనే నూనెలాంటి స్రావాలు ఎక్కువవుతాయి. దీన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. పిల్లల్లో దీన్ని పొరబడటం తగదు ఇక చుండ్రు సమస్యను పసిగట్టి, అది సోరియాసిస్ కాదని గుర్తించడం కూడా ప్రధానమే. చాలా సందర్భాల్లో పిల్లల తలల్లో పొలుసులు రాలే ఫంగల్ ఇన్ఫెక్షన్ను (టీనియా కాపిటిస్)ను చుండ్రుగా పొరబడి తల్లిదండ్రులు చికిత్సకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. దాని వల్ల పిల్లల్లో శాశ్వతంగా జుట్టు రాలిపోయి... తలలో ప్యాచెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. వింటర్లో కీలకం చలికాలం వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారుతుంది. మృతకణాలు పెరగడంతో పాటు, పొడి పొడిగా మారి పైకి లేస్తుంటాయి. చుండ్రు - ఆహారం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని నివారించడానికి సహకరిస్తాయి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి, ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు సమస్య ఉన్నవారు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. జుట్టు - దువ్వెన రక్తప్రసరణ కుదుళ్లకు సరిగ్గా అందాలంటే దువ్వెన మంచి మార్గం. వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, ముందుకు వేసుకుని కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. ఇలా చేయడం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఉంటే రాలిపోతుంది. చుండ్రు వేధించకూడదంటే పొగ, దుమ్ము, వేడి మాడుకు తగలకుండా, తడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ని ఎప్పుడు కలవాలి? హెయిర్ ఫాల్ వేరు, చుండ్రు వేరు. చుండ్రు ఉందని ఆందోళన చెందితే సమస్య మరింతగా పెరగవచ్చు. కొన్ని వారాల పాటు వ్యక్తిగతంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా చుండ్రు తగ్గకపోయినా, దీనితో పాటు మాడుపై చర్మం ఎర్రగా మారినా, పెచ్చులు పెచ్చులుగా ఊడుతున్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. షాంపూలు మార్కెట్లో రకరకాల యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉత్పత్తులు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి... జింక్ పైరిథ్రోన్, సెలీనియమ్ సల్ఫేడ్, కోల్తార్, కెటోకొనజోల్, శాల్సిలిక్ యాసిడ్... లాంటి యాంటీడాండ్రఫ్ షాంపూల్లో ఏదైనా వాడుకోవచ్చు. నాలుగు వారాల పాటు ఒక షాంపును వాడినప్పటికీ తగ్గకపోతే మరో షాంపూని మార్చి చూడాలి. వీటి వల్లా తగ్గకపోతే మైల్డ్ కార్గికో స్టిరాయిడ్స్ లోషన్స్‌ని మాడుకు రాసుకుని, కడిగేయాలి. షాంపూ లేబుల్స్‌పై ఉన్న నిబంధనలను పాటించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఏ షాంపూ అయినా తగినంతగా తీసుకుని నీటిలో కలిపి జుట్టు తడపాలి. ఆ తర్వాత తలంతా రుద్దుతూ శుభ్రపరుచుకోవాలి. చుండ్రు ఉన్నవారు తప్పనిసరిగా రోజూ యాంటీ డాంఢ్రఫ్ షాంపూతో తలస్నానం చేయాలి. కేశాలు పొడిబారుతున్నాయి అనుకునేవారు స్నానం చేయడానికి అరగంట ముందు గోరువెచ్చని నూనెతో మర్ధనా చేసుకోవాలి. అయితే నూనెలు (హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల తల మరింత జిడ్డుగా మారి చుండ్రు సమస్య ఎక్కువ కావచ్చు. అందువల్ల చుండ్రు సమస్య ఉన్నవారు జుట్టుకు నూనె రాసుకోకపోవడమే మంచిది). చుండ్రు సమస్య మరీ తీవ్రంగా ఉన్న సమయంలో నోటి ద్వారా తీసుకోవాల్సిన ఫ్లుకోనజోల్ వంటి ఓరల్ యాంటీఫంగల్ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కండిషనర్ను రూట్లెవల్ నుంచి పెట్టుకోకూడదు. కేవలం కాస్త పై నుంచి జుట్టు పొడవునా (హెయిర్ లెంత్ పొడవునా) పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరిలోనైనా తల నుంచి చుండ్రు పొలుసులుగా రాలుతుంటే వెంటనే డాక్టర్‌ను కలిసి చిన్నపిల్లలైతే టీనియా కాపిటిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యగానీ పెద్దవాళ్లైతే సోరియాసిస్ ఏదైనా ఉన్నాయేమోనని నిర్ధారణ చేసుకోవాలి. దీని కోసం డర్మటాలజిస్ట్‌ను కలవాలి. చుండ్రు... మరికొన్ని ఇతరత్ర అంశాలు... చలి అని తలస్నానానికి బాగా వేడినీళ్లు వాడుతుంటారు. దీంతో మాడుపై చర్మం పొడిబారి చుండ్రు ఎక్కువయ్యే అవకాశం ఉంది. తలస్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడాలి. మెంతులతో... చుండ్రు నివారణకు మెంతులు మంచి ఔషధం. మెంతులను రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలంతా పట్టించి అరగంట అలాగే ఉంచి, కడిగేయాలి. పదిహేను రోజులకు ఒసారి ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. కేశాలు పొడిబారకుండా ఉంటాయి. నిమ్మకాయతో... చుండ్రు అనగానే నిమ్మచెక్కతో బరాబరా జుట్టును రుద్దేస్తుంటారు. అలా కాకుండా తలంటుకున్న తర్వాత టీ స్పూన్ తాజా నిమ్మరసాన్ని మగ్గునీళ్లలో కలిపి ఆ నీటితో జుట్టు తడిసేలా కడగాలి. ఈ విధంగా నెలకు ఒకసారి చేయాలి. పెసర పిండితో... చుండ్రును తగ్గించడానికి పెసరపిండి కూడా ఉపయోగపడుతుంది. రెండు టేబుల్స్పూన్ల పెసరపిండిని అరకప్పు పెరుగులో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. చుండ్రు - చిట్కాలు మూడు వంతుల గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక వంతు ఆపిల్ సిడార్ వెనిగార్‌ను కలిపి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఆ మిశ్రమం తలకు పూర్తిగా పట్టాక డాక్టర్ సలహా మేరకు సరైన పీహెచ్ ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. మార్చి మార్చి వేణ్నీళ్లు, చన్నీళ్ల స్నానం వల్ల మాడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో చుండ్రు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి వల్ల చుండ్రు పెరిగే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల నిండుగా బాగా గాలి పీల్చే వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గి... తద్వారా చుండ్రు కూడా తగ్గే అవకాశం ఉంది. తలస్నానానికి ముందే ఒకసారి జుట్టును బాగా దువ్వుకోవడం వల్ల అప్పటికే తలలో ఏర్పడి ఉన్న పొట్టు వదులైపోయి మాడు మరింత శుభ్రంగా అయ్యే అవకాశం ఉంది. షాంపూలు, మంచి పోషకాహారం, కొన్ని రసాయన ఆధారిత యాంటీ-డాండ్రఫ్ షాంపూలు చుండ్రును ఎదుర్కోవడంలో బాగా సహాయపడతాయి. వైద్య నిపుణుల సహాయంతో ఈ సమస్యను సమర్థంగానే ఎదుర్కోవచ్చు. అపోహలు - వాస్తవాలు అపోహ: చుండ్రు వల్ల జుట్టు రాలుతుంది. వాస్తవం: సాధారణ చుండ్రు వల్ల జుట్టు రాలదు. ఫంగస్ వల్ల చుండ్రు ఎక్కువయితే కొద్దిగా జుట్టు రాలవచ్చు. అపోహ: చుండ్రు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఉదా: దువ్వెనలు, దుస్తులు ఒకరివి ఒకరు వాడుకోవడం మూలంగా. వాస్తవం: అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు తక్కువ. అపోహ: అన్ని కాలాల్లోనూ విసిగిస్తుంది. వాస్తవం: చలికాలంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అపోహ: పిల్లల్లోనూ చుండ్రు ఉంటుంది. వాస్తవం: చాలా వరకు పిల్లల్లో చుండ్రు సమస్య ఉండదు. (ఏడాది లోపు పిల్లల్లో ఉండే చుండ్రును క్రెడిల్ క్రాప్ అంటారు. ఆ తర్వాత తగ్గిపోతుంది). అపోహ: మాటిమాటికీ గుండు చేయించుకోవడం వల్ల చుండ్రు తగ్గుందనేది ఒక అపోహ. వాస్తవం : ఒకసారి గుండుతో సమస్య తగ్గుతుంది. మాటిమాటికీ చేయించాల్సిన అవసరం లేదు. -
బ్యూటిప్స్
రెండు చెంచాల ఉసిరి రసంలో రెండు చెంచాల నిమ్మరసాన్ని కలిపి మాడుకు మర్దనా చేసి... ఓ గంట తర్వాత తలంటుకోవాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తుంటే జుత్తు బలంగా అవుతుంది. రాలడం ఆగుతుంది.ఉల్లిపాయను మెత్తగా దంచి, రసం తీయాలి. దీన్ని మాడుకు పట్టించి తలకు బట్ట చుట్టేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలంచుకోవాలి. వారానికోసారైనా ఇలా చేస్తే జుత్తు రాలడం తగ్గుతుంది. ఒకటిన్నర కప్పు బంగాళాదుంప రసంలో... చెంచాడు తేనె, కొంచెం నీళ్లు, గుడ్డు తెల్లసొన కలిపి మాడుకు, జుత్తుకు పట్టించాలి. అరగంట తర్వాత కుంకుడురసంతో కానీ షీకాయ పొడితో కానీ తలంటుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే... జుత్తు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు దరి చేరవు. పైగా కుదుళ్లు బలపడి జుత్తు ఒత్తుగా పెరుగుతుంది. నువ్వుల నూనె, బాదం నూనె, కొబ్బరి నూనె సమపాళ్లలో తీసుకుని, కొద్దిగా వేడి చేసి తలకు, జుత్తుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత తలంటుకోవాలి. వారినికి రెండు మూడు సార్లు ఇలా చేసినా ఫర్వాలేదు. జుత్తు రాలడాన్ని అరికట్టడానికి, జుత్తు పట్టులా మెరవడానికి ఇది మంచి చిట్కా