
ఉల్లితో జుట్టు మళ్లీ...
బ్యూటిప్స్
పెదాలు నల్లగా ఉన్నాయని బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని పెదాలకు రాసుకుంటే సరి. కొద్ది రోజుల్లోనే పెదాలపై ఉన్న నలుపుదనం పోయి ఎర్రగా మారుతాయి. అలాగే ఎప్పటికప్పుడు పెదాలు పొడిబారకుండా ఆర్గానిక్ లిప్‌బామ్ రాసుకుంటూ మార్పు వెంటనే చూడొచ్చు.
చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు ఒక స్పూను ఉల్లిపాయ రసాన్ని, రెండు స్పూన్ల కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకోవాలి. ఓ అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది.