హెల్త్ టిప్స్
కండరాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే బామ్‌లు, ఇతర మందులు వాడే ముందు ఒకసారి గోరువెచ్చటి ఆముదం రాసి మర్దన చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది. తలలో చుండ్రు కారణంగా దురద పెడుతుంటే మాడుకు వెనిగర్ పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఒంటి మీద ర్యాష్ కాని మరేదైనా దురద కాని (చర్మం పొడిబారడం వల్ల వచ్చిన మంట కాకుండా) వచ్చినా కూడా ఇదే పద్ధతి.
అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు కాని మరే కారణంతోనైనా ఆహారంలో చక్కెరను మినహాయించదలుచుకుంటే దానికి బదులుగా షుగర్ ఫ్రీ ఉత్పత్తులను వాడడానికంటే తేనె వాడకమే మంచిది. రాత్రి పడుకునే ముందు నాలుగైదు పుదీనా ఆకులు నమిలితే నోరు శుభ్రపడుతుంది. పళ్ళు, చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు రావు. పుదీనా నోటి దుర్వాసనను అరికడుతుంది. వర్షానికి తడిచి జలుబుతో బాధపడుతుంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగాలి.