Itching
-
మా పాపకు పీరియడ్స్ ఇంకా రాలేదు! కానీ ఆమెకు అలా అవుతోంది..
మా పాపకు 12 ఏళ్లు. ఇంకా పీరియడ్స్ స్టార్ట్ అవలేదు. ఈ మధ్య ప్రైవేట్ పార్ట్స్‌లో ఇచింగ్ మొదలైందని చెబుతోంది. కానీ ఎలాంటీ డిశ్చార్చ్ లేదు. రాత్రిళ్లు చాలా ఇచింగ్తో చాలా సఫర్ అవుతోంది. అలా ఎందుకు అవుతోంది? కంట్రోల్ అవడానికి మందులేమైనా ఉన్నాయా? – పేరు, ఊరు రాయలేదు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని vulvitis అంటారు. 8–12 ఏళ్ల మధ్య చాలామంది అమ్మాయిలకు ఉంటుంది. ఇది Vulval స్కిన్ అంటే వెజైనా ఔటర్ పార్ట్ పీరియడ్స్ కాకముందు పల్చగా.. సెన్సిటివ్‌గా ఉంటుంది. సబ్బు, క్రీమ్స్, బబుల్ బాత్, షవర్ జెల్స్ ఎక్కువగా వాడితే దురద, మంట ఉంటాయి. Vulval స్కిన్ ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. మూత్రం చేసేప్పుడు మంటగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే తక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడాలి. గోరువెచ్చని నీటితో ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి. Emollient సోప్స్ వాడటం మంచిది. వెజైనల్ ఏరియాలో డియోడరెంట్స్, పర్ఫ్యూమ్స్ వాడకూడదు. క్లీన్ చేసుకుని తుడుచుకునేప్పుడు ముందు నుంచి వెనక్కి తుడవాలి. దీనికి రివర్స్వేలో తుడిస్తే మలద్వారంలోని క్రిములు వెజైనాలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నా ఇచింగ్ తగ్గకపోతే గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. కొన్ని క్రీమ్స్, యాంటీసెప్టిక్ లోషన్స్ ఇస్తారు. కొంతమందికి తక్కువ మోతాదు టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ అవసరమవుతాయి. ఈ కింది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ ఇరిటేషన్ రాకుండా ఉంటుంది. ఎప్పుడూ గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ గాఢత ఉన్న సబ్బులను వాడకూడదు ∙మెత్తటి, తడి టిష్యూతో శుభ్రం చేసుకోవాలి. అయితే ఆ టిష్యూ వెజైనాలో అతక్కుండా తుడవాలి ∙బబుల్ బాత్ అవాయిడ్ చేయాలి. నీళ్లల్లో షాంపూ, సబ్బు వేసి స్నానం చేయకూడదు. ∙జుట్టు కోసం వాడే షాంపూని స్నానానికి వాడకూడదు. హెడ్ బాత్ చేసేప్పుడు ఆ షాంపూ నీళ్లు కూడా ఒంటి మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. వీలైతే వాష్బేసిన్లో హెడ్ బాత్ చేయించడం మంచిది. లేదంటే స్నానం అయిపోయాక హెయిర్ వాష్ చేయించండి ∙స్నానం చేశాక యూరిన్‌కి వెళ్లమని చెప్పండి. సోప్ ఏదైనా యూరిన్ ప్రాంతంలో ఉంటే వాష్ చేసుకోమని చెప్పాలి ∙పదినిమిషాల కన్నా ఎక్కువసేపు స్నానం చేయనివ్వకండి. ఒంటి మీద నీళ్లు ఎక్కువసేపు ఉంటే స్కిన్ ఇరిటేషన్ పెరుగుతుంది ∙కాటన్ అండర్వేర్ మాత్రమే వాడాలి. పాలిస్టర్, నైలాన్ అస్సలు వాడకూడదు ∙కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తే vulval స్కిన్ ఇరిటేషన్ పెరుగుతుంది. అందుకే తగినన్ని మంచినీళ్లు తాగమని చెప్పండి ∙స్విమ్ చేయవచ్చు. కాని స్విమ్కి ముందు తరువాత ఏదైనా Emollient క్రీమ్‌ని vulval స్కిన్‌కి అప్లయ్చేయాలి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?) -
పాపం!.. ఆ మంత్రి దురదకు తాళలేక నడిరోడ్డు మీద కుర్తా తీసి..
మధ్యప్రదేశ్‌లో బీజేపీ వికాస్ రథయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే యాత్ర చేస్తున్న మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆ యాత్ర ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ మేరకు మంత్రి బ్రజేంద్ర సింగ్ అసెంబ్లీ నియోజకవర్గం మంగవోలిలోని ఓ గ్రామం గుండా యాత్రకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దురద పెట్టించే పౌడర్‌ను చల్లాడు. దీంతో ఆ మంత్రికి విపరీతమైన దురద రావడంతో.. నడిరోడ్డుపైనే కుర్తా విప్పే పరిస్థితికి దారితీసింది. ఆ దురదకు తాళలేక మంత్రి నీళ్లతో చేతులను, ముఖాన్ని కడుక్కున్నారు. అందుకు సంబంధించిన వీడియోని కొందరూ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మాజీ సర్పంచ్ వికాస్ యాత్ర అవసరమా అని బ్రిజేంద్ర సింగ్‌ని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అంతేగాదు వీడియోలో..ఈ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేయలేకపోయింది. మేము కాంగ్రెస్ చెడ్డదనుకున్నాం, కానీ మీరు అంతకంటే అధ్వాన్నంగా ఉన్నారు. మాకు మంచి రహదారులను ఇవ్వండి లేకపోతే మీకు ఓటు వేయం అని ఆ వ్యక్తి ఎమ్మెల్యే ముఖం మీదే అంటున్నట్లు వినిపిస్తుంది. దీనికి మంత్రి కూడా ఓటు వేయకండి అదీ మీ హక్కు అని అతనికి బుదులిస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఇలానే రెండు రోజుల క్రితమే ఖండ్వా జిల్లాలోని ఒక గ్రామం గుండా వెళ్తుండగా మరో వికాస్ రథ్ రోడ్డుపై ఇరుక్కుపోయింది. ఇదిలా ఉండగా, ఈ వికాస్ యాత్రలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. अशोकनगर, मध्य प्रदेश जनसंपर्क पर निकले मंत्री को लगाया #खुजली पाउडर। यात्रा रोक, नहाना पड़ा। PHE मंत्री / भाजपा नेता बृजेंद्र सिंह यादव को जनसंपर्क के दौरान किसी ने लगाया खुजली पाउडर। खुजा खुजा कर हुआ था बुरा हाल ! pic.twitter.com/w5GZtCWmyy — काश/if Kakvi (@KashifKakvi) February 9, 2023 (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
చర్మం పొడిబారుతోందా!
చలికాలం రావడానికి ముస్తాబు అవుతోంది. పగటి వేళ ఎండగానూ, రాత్రి వేళ కాస్త చలిగా ఉండడం సహజంగా జరుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో చర్మ సంరక్షణ పట్ల ముఖ్యంగా పొడి చర్మం గలవారు తప్పనిసరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీళ్లతోనూ, చల్లని నీళ్లతోనూ కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ముఖానికి పదే పదే సబ్బు వాడకుండా వెచ్చని నీటితో రోజులో రెండు – మూడు సార్లు కడగాలి. స్నానం చేసిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ కాలం గాలిలో తేమ తక్కువ. దీని వల్ల ఒంటిమీద ఉండే స్వేదం కూడా త్వరగా ఆరిపోతుంటుంది. దీంతో చర్మం పొడిబారినట్టు అవుతుంది. ఈ సమస్య రాకుండా 2 నుంచి 4 లీటర్ల నీళ్లు రోజులో తప్పనిసరిగా తాగాలి. రాబోయే కాలంలో మృతకణాల సంఖ్య కూడా పెరుగుతుంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని ఎక్కువసేపు స్క్రబ్ చేయకూడదు. మీ చర్మతత్త్వం ఏదో తెలుసుకొని తగిన సౌందర్య ఉత్పాదనలను ఎంపిక చేసుకొని వాడాలి. పనుల వల్ల పాదాలు, చే తులు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి. దీంతో వీటి పై చర్మం త్వరగా తేమ కోల్పోతుంది. అలాగే వదిలేస్తే పగుళ్లు బారే అవకాశం ఉంది. అందుకని, రాత్రివేళ తడి లేకుండా చేతులను తుడిచి మాయిశ్చరైజర్ రాసి, గ్లౌజ్‌లను వేసుకోవాలి. గ్లిజరిన్ ఉండే క్రీమ్స్, పెట్రోలియమ్ జెల్లీ మాయిశర్చరైజర్లు పాదాల చర్మాన్ని పొడిబారనివ్వవు. వారానికోసారి పాదాలను స్క్రబ్బర్‌తోరుద్ది, కడిగాలి. పడుకునే ముందు పెట్రోలియమ్ జెల్లీ రాసి, సాక్స్‌లు వేసుకోవాలి. చర్మం దురద పెడుతుంటే పొడిబారి ఉంటుందిలే అనుకుని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే, ఒక్కోసారి అవి రకరకాల చర్మ సమస్యలకు కారణమై ఉండచ్చు. -
యానల్ ఫిషర్ సమస్యకు పరిష్కారం ఉందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 38 ఏళ్లు. నేను కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్ ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. నా సమస్య హోమియో మందులతో పూర్తిగా నయం అవుతుందా? – ఎమ్. చిన్నారావు, విశాఖపట్నం దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిల్లో ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్, ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... రెక్టమ్‌కు రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఆటిజమ్ తగ్గుతుందా? మా బాబుకు మూడున్నర ఏళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో ఈ సమస్యకు చికిత్స ఉందా?– ఎమ్‌డి. షమీమ్బానో, గుంటూరు ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువ. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కారణాలు : గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వంటి అనేక కారణాలతో ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవడలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ∙వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. మాటలు సరిగా రానివారికి స్పీచ్ థెరపీ ఉపయోగకరం. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే తప్పక గుణం కనిపిస్తుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ సొరియాసిస్ నయమవుతుందా? నాకు 38 ఏళ్లు. సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? – డి. సురేశ్, ఖమ్మం సోరియాసిస్ అనేది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న కొందరిలో మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙దీర్ఘకాలికంగా కొన్ని మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమై మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. ఈ మందులను క్రమం తప్పకుండా అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
చర్మం కొన్ని చోట్ల దళసరిగా...నల్లగా...ఎందుకిలా?
డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నా చర్మం గోధుమ రంగులో ఉంటుంది. అయితే ఏడాదిగా నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ చర్మం మడతలు పడ్డట్టుగా ఉంటుందో అక్కడక్కడల్లా ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎల్. శ్రీనివాసరావు, మదనపల్లె మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్ఓఎమ్ఏ–ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. దీనికి చికిత్స ఈ కింది విధంగా ఉంటుంది. ∙బరువు తగ్గించుకోవడం ∙జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ∙మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... – ఆర్బుటిన్ – లికోరైస్ – కోజిక్ యాసిడ్ ∙పైన పేర్కొన్న మందులతో పాటి క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి. ∙యాభైకు ఎక్కువగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యానం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్సూ్యల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్ఫార్మిన్ –500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. ఇతర ప్రక్రియలు : ∙ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 – 6 సెషన్ల పాటు చేయించుకోవాలి ∙లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది. గీరుకున్నచోట నల్లమచ్చలు.. తగ్గేదెలా? నా రెండు చేతుల మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తే చాలాసేపు గీరుకున్నాను. దాంతో నల్లటి మచ్చలు (డార్క్ మార్క్స్) ఏర్పడ్డాయి. అవి తగ్గి, నా చర్మం మామూలుగా అయ్యేందుకు ఏం చేయాలో చెప్పండి. – ఎమ్. నీరజ, సంగారెడ్డి మీరు చెబుతున్న కండిషన్‌ను పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి ఈ సూచనలు పాటించండి. ∙సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి. ∙ఎండకు ఎక్స్పోజ్ అయ్యే చోట ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి – కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీములు అప్లై చేయండి. ∙ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. అయితే మీ అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. వేళ్లకు బొబ్బలు... మచ్చలు రాకుండా మార్గం చెప్పండి నా వయసు 32 ఏళ్లు. రెండు రోజుల క్రితం చూడకుండా వేడిగా ఉన్న పాత్రను చేత్తో పట్టుకున్నాను. వేళ్లు బాగా కాలాయి. బొబ్బలు కూడా వచ్చాయి. అప్పుడు వాటిపై మచ్చలు పడతాయని ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. లక్ష్మీప్రసన్న, కోదాడ మీ అరచేతుల్లో బొబ్బలు వచ్చాయంటే ఆ తీవ్రత సెకండ్ డిగ్రీ బర్న్స్‌ను సూచిస్తోంది. ఒకవేళ ఈ బొబ్బలు చాలా పెద్దవిగా ఉంటే మీరు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలిసి, క్రమం తప్పకుండా డ్రస్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు మూడు రోజుల పాటు అజిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇక గాయాలపై రోజుకు రెండుసార్లు మ్యూపిరోసిన్ అనే యాంటీబయాటిక్ పూతమందు వాడాలి. ఇది వారంరోజుల పాటు పూయాల్సి ఉంటుంది. మీ బొబ్బలు ఆ తర్వాత మచ్చలుగా మారకుండా ఉండాలంటే సిల్వర్ సల్ఫాడైజీన్తో పాటు మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ వాడాల్సి ఉంటుంది. గాయం మానిన తర్వాత కూడా మచ్చలు వస్తే క్లిగ్మాన్స్ రెజీమ్ వంటి స్కిన్ లైటెనింగ్ క్రీమ్స్‌ను రెండుమూడు వారాలపాటు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్, నికోటినమైడ్ వంటివి ఉన్న నాన్‌స్టెరాయిడ్ క్రీమ్స్ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మచ్చలు వస్తే ఫ్రాక్షనల్ లేజర్ లేదా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
వేళ్ల మధ్య చర్మం చెడి ఎర్రబారుతోంది.. ఏం చేయాలి?
నా వయసు 56 ఏళ్లు. గృహిణిని. నా కాళ్లు ఎప్పుడూ తడిలోనే ఉంటుంటాయి. శాండల్స్ కూడా వేసుకోను. ఈమధ్య నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – పి. ఉదయమ్మ, నిజామాబాద్ మీరు చెబుతున్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్యాబ్లెట్‌ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి. మీసాలలో విపరీతమైన దురద... తగ్గేదెలా? నా వయసు 28 ఏళ్లు. వృత్తిరీత్యా ప్రతిరోజూ బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నాకు ప్రతిరోజూ మీసాలలో విపరీతమైన వస్తోంది. రోమం మూలల్లో ఇది ఎక్కువగా అనిపిస్తోంది. గత నెల రోజులుగా ఇలా జరుగుతోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – ఎమ్. కమల్, హైదరాబాద్ మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీరు సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది మీ మీసాలు ఉన్న చోట సెబమ్ అనే నూనె వంటి దాన్ని ఎక్కువగా స్రవిస్తుండటంతో వస్తున్న సమస్య. మీ సమస్యను అధిగమించడానికి ఈ సూచనలు పాటించండి. మొమటోజోన్తో పాటు టెర్బనాఫిన్ యాంటీ ఫంగల్ ఉండే కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ క్రీమును ప్రతిరోజూ రాత్రిపూట మీ మీసాల వద్ద చర్మంపై రాసుకోండి. ఇలా పది రోజులు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. కొద్ది నెలల పాటు ఐసోట్రెటినాయిన్ ట్యాబ్లెట్లను నోటి ద్వారా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్య పరిష్కారం కోసం ఒకసారి డర్మటాలజిస్ట్‌ను కలవండి. బొబ్బలువచ్చాయి... మచ్చలుగామారకూడదు అంటే? నా వయసు 32 ఏళ్లు. రెండు రోజుల క్రితం చూడకుండా వేడిగా ఉన్న పాత్రను చేత్తో పట్టుకున్నాను. వేడిగా ఉందని చూసుకోకపోవడంతో బాగా కాలాయి. బొబ్బలు కూడా వచ్చాయి. అవి తర్వాత ఒంటిపై మచ్చల్లాగా ఉండిపోతాయేమోనని ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – రహమత్బానో, గుంటూరు మీ అరచేతుల్లో బొబ్బలు వచ్చాయంటే ఆ తీవ్రత సెకండ్ డిగ్రీ బర్న్స్‌ను సూచిస్తోంది. ఒకవేళ ఈ బొబ్బలు చాలా పెద్దవిగా ఉంటే మీరు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలిసి, క్రమం తప్పకుండా డ్రస్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు మూడు రోజుల పాటు అజిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇక గాయాలపై రోజుకు రెండుసార్లు మ్యూపిరోసిన్ అనే యాంటీబయాటిక్ పూతమందు వాడాలి. ఇది వారంరోజుల పాటు పూయాల్సి ఉంటుంది. మీ బొబ్బలు ఆ తర్వాత మచ్చలుగా మారకుండా ఉండాలంటే సిల్వర్ సల్ఫాడైజీన్తో పాటు మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ వాడాల్సి ఉంటుంది. గాయం మానిన తర్వాత కూడా మచ్చలు వస్తే క్లిగ్మాన్స్ రెజీమ్ వంటి స్కిన్ లైటెనింగ్ క్రీమ్స్‌ను రెండుమూడు వారాలపాటు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్, నికోటినమైడ్ వంటివి ఉన్న నాన్‌స్టెరాయిడ్ క్రీమ్స్ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మచ్చలు వస్తే ఫ్రాక్షనల్ లేజర్ లేదా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. కళ్లజోడు ఆనేచోట నల్లమచ్చలు... పోయేదెలా? నేను గత కొన్నేళ్లుగా కళ్లజోడు వాడుతున్నాను. అది ఆనుకునే చోట ముక్కు ఇరువైపులా నల్లటి మచ్చలు వచ్చాయి. కొన్ని క్రీములు కూడా వాడి చూశాను. అయినా ఎలాంటి ఫలితం లేదు. ముక్కుకు ఇరువైపుల ఉన్న ఈ మచ్చలు తగ్గిపోయే మార్గం చెప్పండి. – సుమ, రాజంపేట కళ్లజోడును ఎప్పుడూ తీయకుండా, నిత్యం వాడేవారికి, ముక్కుపై అది రాసుకుపోవడం (ఫ్రిక్షన్) వల్లæఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అక్కడి చర్మంలో రంగుమార్చే కణాలు ఉత్పత్తి (పిగ్మెంటేషన్) జరిగి, ఇలా నల్లబారడం మామూలే. కొన్నిసార్లు అలా నల్లబడ్డ చోట దురద కూడా రావచ్చు. మీ సమస్య తొలగడానికి ఈ కింది సూచనలు పాటించండి. n మీకు వీలైతే కళ్లజోడుకు బదులు కాంటాక్ట్ లెన్స్‌లు వాడండి n కోజిక్ యాసిడ్, లికోరిస్, నికోటినెమైడ్ ఉన్న క్రీమును మచ్చ ఉన్న ప్రాంతంలో రాయండి n అప్పటికీ ఫలితం కనిపించకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
ఫ్యామిలీ హెల్త్ కౌన్సెలింగ్
డర్మటాలజీ కౌన్సెలింగ్ ఎండ పడే చోట్లా ఫెయిర్‌గా కావాలంటే...? నా వయసు 18 ఏళ్లు. నా ఒంటిలో దుస్తులు కవర్ చేస్తున్న ప్రాంతం తెల్లగానే ఉంది. మిగతాచోట్ల నల్లగా ఉంది. కనిపిస్తుంది. ఈ దుస్తులు కవర్ చేయని చేతులు వంటి భాగాలు కూడా నిగారింపుతో కనిపించడానికి తగిన సూచనలు ఇవ్వండి. – సంజన, హైదరాబాద్ శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు నల్లబడకుండా ఉండటానికి సూచనలు ఇవి... - సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి. - సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల ప్రతి మూడు గంటలకోసారి 50 ఎస్పీఎఫ్ ఉండే సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. - సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా దేహానికీ అదే నిగారింపు వస్తుంది - గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళ మీ చర్మంపై పూసుకోండి. - పై సూచనలు పాటించినా ప్రయోజనం కనిపించకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి. వేలిపై దురద, గీరుకుంటే నలుపు... ఏం చేయాలి? నా కుడి చేతి మధ్యవేలిపై వెంట్రుకలు ఉండే భాగంలో తీవ్రమైన దురద వస్తోంది. దాంతో అక్కడ గీరుకున్న కొద్దీ అక్కడి చర్మం నల్లబారిపోయింది. నాకు తగిన పరిష్కారం చూపండి. – జగదీష్‌ప్రసాద్, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఆ భాగంలో బహుశా మీకు అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చిందేమోనని అనిపిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అక్కడ ఉంగరం ధరించడం లేదా మీరు వాడుతున్న హ్యాండ్ వాష్ కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు కారణాలు కావచ్చు, మీకు దేనివల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి దానికి దూరంగా ఉండటం నివారణ అంశాల్లో ప్రధానమైనది. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ కింది సూచనలు పాటించండి. - ప్రతిరోజూ మీకు దురద వస్తున్న భాగంలో మాయిశ్చరైజింగ్ క్రీమును రోజుకు రెండుసార్లు రాయండి. - మెమటోజోన్ ఫ్యూరోయేట్ లాంటి మాడరేట్ కార్టికోస్టెరాయిడ్ క్రీమ్‌ను ప్రతిరోజూ మీకు దురద వస్తున్న ప్రాంతంలో రాయండి. దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున 3–5 రోజుల పాటు రాయాలి. అప్పటికీ దురద రావడం తగ్గకపోతే ఒకసారి మీ డర్మటాలజిస్ట్‌కు చూపించండి. మొటిమలు విపరీతంగా వస్తున్నాయి... తగ్గేదెలా? నా వయసు 19 ఏళ్లు. నా ముఖం మీద మొటిమలు, మచ్చలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా తగ్గడం లేదు. నేను బెట్నోవేట్ అనే క్రీమ్ వాడుతున్నాను. దాంతోపాటు ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్ కూడా తీసుకుంటున్నాను. అయినా ఎలాంటి మార్పూ రావడం లేదు. దయచేసి మొటిమలు, మచ్చలు తగ్గడానికి నేనేం చేయాలో సూచించండి. – కె. రవి, విశాఖపట్నం మీ వయసు వారిలో ఇలా మొటిమలు రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. ఈ వయసు పిల్లల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ల పాళ్లు పెరగడం వల్ల చర్మంపై మొటిమలు రావడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మీ విషయంలో ఇది స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నే లా అనిపిస్తోంది. మీరు బెట్నోవేట్ క్రీమ్ రాస్తున్నట్లు చెబుతున్నారు. బెట్నోవేట్ అనే క్రీమ్‌లో స్టెరాయిడ్ ఉంటుంది. దీనిలోని స్టెరాయిడ్ వల్ల మొదట్లో కొంచెం ఫలితం కనిపించినట్లు అనిపించినా... ఆ తర్వాత మొండిమొటిమలు (ఒక పట్టాన తగ్గనివి) వస్తాయి. అందుకే మీరు ఈ కింది సూచనలు పాటించండి. - మొదట బెట్నోవేట్ క్రీమ్ వాడటాన్ని ఆపేయండి. - క్లిండామైసిన్ ప్లస్ అడాపలీన్ కాంబినేషన్‌తో తయారైన క్రీమ్‌ను రోజూ రాత్రిపూట మొటిమలపై రాసుకొని పడుకోండి. - అజిథ్రోమైసిన్–500 ఎంజీ క్యాప్సూల్స్‌ను వరసగా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకోండి. ఇలా మూడు వారాలు వేసుకోవాలి. అంటే మొదటివారం సోమ, మంగళ, బుధ వారాలు తీసుకున్నారనుకోండి. దీన్నే రెండో వారం, మూడోవారం కూడా కొనసాగించాలి. ఈ అజిథ్రోమైసిన్ క్యాప్సూల్‌ను ఖాళీ కడుపుతో అంటే భోజనానికి ముందుగానీ... ఒకవేళ భోజనం చేస్తే... రెండు గంటల తర్వాత గానీ వేసుకోవాలి. - మీరు వాడుతున్న ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్‌ను అలాగే కొనసాగించండి. - అప్పటికీ మొటిమలు తగ్గకపోతే కాస్త అడ్వాన్స్డ్ చికిత్సలైన సాల్సిలిక్ యాసిడ్ పీలింగ్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రెండువారాలకు ఒకసారి చొప్పున కనీసం ఆరు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. - ఒకవేళ మీ మొటిమల వల్ల ముఖంపై గుంటలు పడినట్లుగా ఉంటే, వాటిని తొలగించడానికి ఫ్రాక్షనల్ లేజర్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. -డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్ -
ముక్కుదురద... హాచ్..హాచ్..?
నా వయసు 27 ఏళ్లు. ఈమధ్య చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారడం, విపరీతంగా తుమ్ములు రావడం జరుగుతోంది. కళ్లు దురదపెడుతున్నాయి. కళ్ల నుంచి నీరుకారుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే అలర్జిక్ రైనైటిస్ అన్నారు. మందులు వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. హోమియోలో నా సమస్యకు శాశ్వత చికిత్స ఉందా? – కృష్ణమూర్తి, పిడుగురాళ్ల అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. అలర్జిక్ రైనైటిస్ ఉన్న వారి విషయంలో వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు వారి జీవితాన్ని మరింత దుర్భరం చేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఈ సమస్య ఉన్నవారు, తరచూ ఇలాంటి బాధలకు గురవుతుంటారు. కారణాలు : ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది. పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు. ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు : ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స : హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీరతత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
హెల్త్ టిప్స్
కండరాల నొప్పులతో బాధపడుతున్నట్లయితే బామ్‌లు, ఇతర మందులు వాడే ముందు ఒకసారి గోరువెచ్చటి ఆముదం రాసి మర్దన చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది. తలలో చుండ్రు కారణంగా దురద పెడుతుంటే మాడుకు వెనిగర్ పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఒంటి మీద ర్యాష్ కాని మరేదైనా దురద కాని (చర్మం పొడిబారడం వల్ల వచ్చిన మంట కాకుండా) వచ్చినా కూడా ఇదే పద్ధతి. అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు కాని మరే కారణంతోనైనా ఆహారంలో చక్కెరను మినహాయించదలుచుకుంటే దానికి బదులుగా షుగర్ ఫ్రీ ఉత్పత్తులను వాడడానికంటే తేనె వాడకమే మంచిది. రాత్రి పడుకునే ముందు నాలుగైదు పుదీనా ఆకులు నమిలితే నోరు శుభ్రపడుతుంది. పళ్ళు, చిగుళ్ళకు సంబంధించిన వ్యాధులు రావు. పుదీనా నోటి దుర్వాసనను అరికడుతుంది. వర్షానికి తడిచి జలుబుతో బాధపడుతుంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగాలి. -
దురదే!
తింటే దురదే! కందతో వండిన ఏ పదార్థమైనా ఒక్కసారి తింటే... మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాలుకకు కంద దురద ... అలా పట్టుకుంటుంది. కమాన్ ఎంజాయ్ సాటర్ డే! కంద తినడానికి వంద దురదలు అందులో కొన్ని ఇవి. నోట్: కందను కట్ చేసేటప్పుడు చేతులకు దురద వస్తుంది. అందుకని రెండుమూడు సార్లు నూనె రాసుకుంటూ, కట్ చేయాలి. మిగతా కూరగాయలకన్నా కందను కొద్దిగా ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది. కంద గారెలు కావల్సినవి: కంద ముక్కలు – 3 కప్పులు (కందపై తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు కోసి, ఉడికించి, వడకట్టి పక్కనుంచాలి), పసుపు – పావు టీ స్పూన్ చింతపండు – నిమ్మకాయ పరిమాణం అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 1/2 టీ స్పూన్ కారం – టీ స్పూన్ గరం మసాలా – అర టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్‌స్పూన్లు కొబ్బరి తురుము – టేబుల్‌స్పూన్ బ్రెడ్ స్లైసులు – 4, పుట్నాల పప్పు – 1 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙పసుపు, ఉప్పు, చింతపండు, కందముక్కలు వేసి ఉడికించాలి. చల్లారాక కంద ముక్కలను పప్పుగుత్తితో మెదపాలి. నూనె మినహా మిగతాపదార్థాలన్నీ ఇందులో వేసి కలపాలి. మిశ్రమం గట్టిగా అవుతుంది. మిశ్రమం లూజ్‌గా ఉంటే బ్రెడ్ స్లైసులు వేసి బాగా కలపాలి. కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని, ఉండలు చేయాలి. గారెల షేప్ వచ్చేలా వత్తి, ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. పొయ్యిమీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. మంట తగ్గించి, సిద్ధం చేసుకున్న గారెలను వేసి, అన్ని వైపులా గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. అదనపు నూనె పీల్చుకోవడానికి గారెలను పేపర్ టవల్మీద వేయాలి. వేడి వేడిగా టొమాటో కెచప్ లేదా చట్నీతో వడ్డించాలి. కంద దోసె కావల్సినవి: బియ్యం – ముప్పావు కప్పు పెసలు – ముప్పావు కప్పు కంద (సన్నని ముక్కలు) – అర కప్పు పచ్చిమిర్చి – 1–2, అల్లం – చిన్న ముక్క జీలకర్ర – పావు టీ స్పూన్, పసుపు – చిటికెడు ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని; నూనె – తగినంత. తయారీ: ∙బియ్యం, పెసలు కడిగి, కనీసం 3 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వడకట్టాలి. కంద పై తొక్క తీసి, శుభ్రం చేయాలి. మిక్సర్జార్లో వడకట్టిన బియ్యం, పెసలు, కందముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి రుబ్బాలి. దీనికి తగినన్ని నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని, మూత పెట్టి, ఓ గంటసేపు ఉంచాలి. పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్‌తో తుడిచేయాలి. సిద్ధం చేసుకున్న పిండిని గరిటెతో పెనం మీద వేసి, అదే గరిటెతో వలయాకారంగా పిండిని పలచని అట్టులా చేయాలి. స్పూన్‌తో నూనె తీసుకొని, దోసె చుట్టూ వేయాలి. కొద్దిగా మంటను పెంచి, బంగారు రంగు వచ్చేవరకు ఉంచి, రెండోవైపు తిప్పాలి. మరో నిమిషం సేపు ఉంచి, ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోసెను పల్లీ పొడి, లేదా ఏదైనా చట్నీతో వడ్డించాలి. నోట్: దోసె కరకరలాడుతూ రావాలంటే పెసరపప్పుకు బదులు మినప్పప్పును వాడుకోవచ్చు. కంద పోహ కావల్సినవి: అటుకులు – 2 కప్పులు, కంద తరుగు – 3 టేబుల్ స్పూన్లు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీ స్పూన్, పల్లీలు – టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు ఉల్లిపాయలు – 3 (సన్నగా కట్ చేయాలి) ఉప్పు – తగినంత, పంచదార – చిటికెడు పసుపు – అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం – 2 టీ స్పూన్లు తయారీ: ∙అటుకులను ఒక గిన్నెలో వేసి, అవి మునిగేలా నీళ్లు పోసి అటూ ఇటుగా కలపాలి. నీళ్ల నుంచి అటుకులను తీసి జల్లిలో వేసి, ఐదు నుంచి పది నిమిషాలు నీళ్లన్నీ పోయేదాకా ఉంచాలి. నీళ్లన్నీ పోవాలని తడి అటుకులను గట్టిగా పిండకూడదు. ∙పొయ్యి మీద కడాయి పెట్టి, నూనె వేసి కాగనివ్వాలి. దీంట్లో ఆవాలు, పల్లీలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కంద వేసి కలపాలి. ఇవి బాగా వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పంచదార, పసుపు, వేసి కలిపి దీంట్లో ఆరిన అటుకులను వేసి కలపాలి. పైన కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి నిమిషం సేపు ఉంచి, మంట తీసేయాలి. కంద మటన్ కావల్సినవి: మటన్ – 300 గ్రాములు కంద ముక్కలు – 250 గ్రాములు (ఇంచు పరిమాణం), ఉల్లిపాయ – 1 (కట్ చేసి, మెత్తగా రుబ్బాలి), టొమాటో – 1 (పేస్ట్ చేయాలి), జీడిపప్పు – పావు కప్పు, పచ్చిమిర్చి – 4, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కొత్తిమీర – అర టీ స్పూన్, మిరియాల పొడి – టీ స్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు, మసాలా – టీ స్పూన్ (సోంపు – అర టీ స్పూన్, ఇలాచీ – 1, దాల్చిన చెక్క – చిన్నముక్క కలిపి పొడి చేయాలి), చిక్కటి కొబ్బరిపాలు – కప్పు, పల్చటి కొబ్బరి పాలు – 2 కప్పులు, బిర్యానీ ఆకు – 1 , కొత్తిమీర+ పుదీనా – గుప్పెడు, నూనె – టేబుల్ స్పూన్ తయారీ: ∙పొయ్యి మీద ప్రెషర్కుకర్ పెట్టి, నూనె వేసి, వేడయ్యాక ముక్కలు చేసిన బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం– వెల్లుల్లి, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీంట్లో మటన్ ముక్కలు, కారం, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, మసాలా, పుదీనా, కొత్తిమీర, టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఒకసారి కలపాలి. దీంట్లో పచ్చిమిర్చి, కందముక్కలు, జీడిపప్పులు, ధనియాలపొడి, రెండు రకాల కొబ్బరిపాలు పోసి, మూత పెట్టాలి. 5 విజిల్స్ వచ్చేవరకు ఉంచి, మంట తీసేయాలి. పదినిమిషాల తర్వాత కుకర్ మూత తీసి పావు టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నీళ్లు కలిపి మరో 5 నిమిషాలు పొయ్యిమీద పెట్టి ఉడికించి, దించాలి. ఈ కంద మటన్ కూరను జీరారైస్, పులావ్, వెజిటబుల్ బిర్యానీలోకి వడ్డించాలి. కంద పులుసు కావల్సినవి: కంద ముక్కలు – 1 1/2 కప్పులు, ఉల్లిపాయలు – 3 పచ్చిమిర్చి – 1 ఉల్లికాడ – 1, కారం – టీస్పూన్ పసుపు – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, బెల్లం – తగినంత చింతపండు – నిమ్మకాయ పరిమాణం ధనియాల పొడి – 3/4 టీ స్పూన్ జీలకర్ర పొడి – పావు టీ స్పూన్ ఆవాలు – అర టీ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ మెంతిపొడి – పావు టీ స్పూన్ నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙చింతపండులో కొద్దిగా వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. కందముక్కలను ఉడికించి, నీళ్లు వడకట్టి పక్కనుంచాలి. కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి కాగనివ్వాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగనివ్వాలి. దీంట్లో కందముక్కలు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు, బెల్లం, ఉప్పు వేసి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో చింతపండు రసం కలిపి 2–3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి, సన్నని మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి, మూత పెట్టాలి. చపాతీ, అన్నంలోకి ఈ పులుసు రుచిగా ఉంటుంది. -
తగ్గినా... తిరగబెడుతోంది!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 54 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడితే అప్పటికి తగ్గినట్లుగా అనిపించినా, మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి.– సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు, దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువమానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు ∙సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి ∙చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది దీని తీవ్రత సాధారణంగా చలికాలంలో ఎక్కువగానూ, వేసవిలో ఒకింత తక్కువగానూ ఉంటుంది. చిన్నపిల్లల్లో : తలపై చర్మం జిడ్డుగా, పొరలుగా, ఎర్రటి దద్దుర్లలా కనిపిస్తాయి. దీనినే ‘క్రెడిల్ క్యాప్’ అని అంటారు. ఇది చంకలకు, గజ్జలకు వ్యాపిస్తుంది. వీళ్లలో దురద ఎక్కువగా ఉండకపోవచ్చు. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
బాబు గీరుకుంటున్నాడు. సమస్య ఏమిటి?
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు 12 ఏళ్లు. గత మూడు నెలలుగా చేతి వేళ్లు, మెడ భాగంలో దురద వస్తోంది. రాత్రిపూట తీవ్రంగా ఉంటోంది. మావాడు డస్ట్‌లో ఎక్కువగా ఆడుతుంటాడు. శుభ్రంగా ఉండడు. దీనికి హోమియోలో పరిష్కారం చెప్పండి. - నర్సింహారావు, ఆదిలాబాద్ ఇది ఒక అంటువ్యాధి. ఇది సర్కోప్టిస్ స్కేబీ అనే పరాన్నజీవి (ప్యారసైట్) వల్ల వస్తుంది. పరాన్నజీవి (ప్యారసైట్) అంటే తన ఆహారం, నివాసం కోసం ఇతరులపై ఆధారపడే జీవులు. ఇది చిన్నగా 1 - 3 మిల్లీమీటర్ల పొడవుంటాయి. ఇవి చర్మంలో కన్నాలు/రంధ్రాలు (బరోస్) చేసి దురదను కలిగిస్తాయి. ఆ రంధ్రాలు దారాల లాగా కనిపిస్తాయి. ఇవి 2 -15 మిల్లీమీటర్ల పొడవుంటాయి. దురద వల్ల ఈ కన్నాలు కనిపించకపోవచ్చు. ఈ ప్యారసైట్లు పాకుతాయి. ఎగరలేవు. స్కేబీస్ అనే పదం లాటిన్లో స్కేబర్ నుంచి వచ్చింది. అంటే గోకడం అని అర్థం. ఇది సాధారణంగా శరీర శుభ్రతా వ్యవస్థ లోపించిన వారిలో, లింఫోమా ఉన్నవారిలో కనిపించవచ్చు. కారణాలు : వ్యాధిగ్రస్థులు వాడే వస్తువులు వాడటం స్కూలు పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం ఇతరుల పక్కబట్టలను వాడడం కుక్క లేదా పిల్లి వంటి పెంపుడు జంతువుల నుంచి కూడా వ్యాపించవచ్చు. లక్షణాలు : చర్మంపై చిన్న చిన్న కురుపుల్లాగా వస్తాయి. ఇవి చేతి వేళ్ల మధ్యలో, మణికట్టు, కీళ్ల వెనక, నడుము, నాభి, పాదాల దగ్గర ఎక్కువగా వస్తాయి. చిన్న పిల్లల్లో ముఖం, మెడ, అరచేతులు, అరికాళ్ల మీద రావచ్చు. ఇవి బొబ్బల మాదిరిగా కనిపిస్తాయి. దురద రాత్రివేళ ఎక్కువగా కనిపిస్తుంది. మొదట తక్కువగానే ఉన్నా... వ్యాధి వచ్చిన 1 - 2 నెలల తర్వాత అది చాలా ఎక్కువై నిద్రాభంగం కూడా అవుతుంది. చికిత్స : స్కేబిస్కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను, రోగి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. మెర్క్‌సాల్, హెపార్‌సల్ఫ్, సల్ఫర్, పెట్రోలియం వంటి మందులు ఈ వ్యాధి చికిత్స కోసం అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ సర్జరీ లేకుండానే... గుండె రంధ్రాలను పూడ్చవచ్చు! కార్డియాలజీ కౌన్సెలింగ్ మా బాబుకు ఐదేళ్లు. వాడు పుట్టినప్పుడు ఒకవైపు ఛాతీ ఉబ్బినట్లుగా ఉండటం, బరువు తక్కువగా ఉండటం, బరువు తక్కువతో పాటుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు. డాక్టర్లు పరీక్షించి, గుండెలో చిన్న హోల్ ఏర్పడిందని, కంగారు పడాల్సిన పనిలేదనీ, మందులతో పూడ్చేయవచ్చనీ సలహా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాం. అయితే మా బాబు ఆరోగ్య పరిస్థితిలో కొంతకాలం నుంచి పుట్టినప్పుడు కనిపించిన ఆరోగ్య సమస్యలే మళ్లీ చోటుచేసుకుంటున్నాయి. కార్డియాలజిస్ట్‌కు చూపిస్తే పరీక్షలు చేసి, గుండెలో వెంట్రికల్ గదుల మధ్య 5.5 ఎం.ఎం.కు పైగా రంధ్రం ఉందని, సర్జరీ చేయాలని అంటున్నారు. సర్జరీ కాకుండా మరేమైనా ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా? దయచేసి మా బాబు సమస్యకు పరిష్కారం చూపండి. - సుజాత, వైజాగ్ పిల్లల్లో గుండెకు సంబంధించిన రంధ్రాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. గర్భం దాల్చిన సమయంలో ఒక పొడవాటి గొట్టం నుంచి శిశువు గుండె రూపుదిద్దుకోవడం, వాటి భాగాలు అభివృద్ధి చెందడం జరుగుతాయి. ఈ దశలో ఏర్పడే లోపాలే తదనంతరం గుండెలో రంధ్రాలకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన అంశాలు కూడా ఈ రంధ్రాలకు కారణమవుతాయి. ఆట్రియా లేదా వెంట్రికల్ గదుల గోడల మధ్య పుట్టుకతో ఏర్పడే రంధ్రాల కారణంగా రక్తం ఒక గది నుంచి మరొక గదిలోకి ప్రవహించి, తిరిగి ఆక్సిజన్ కోసం మళ్లీ మళ్లీ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దాంతో ఊపిరితిత్తులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. పుట్టుకతో గుండెలో రంధ్రాలతో జన్మించేవారిలో 25 - 30 శాతం మంది వీఎస్డీ లోపం అనే సమస్యతో బాధపడుతుంటారు. మీ అబ్బాయి విషయంలో కూడా అదే జరిగిందని మీరు వెల్లడించిన వివరాలను బట్టి చెప్పవచ్చు. అప్పటి కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు అదే రంధ్రం వల్లనే మీ బాబు మళ్లీ గుండె సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పరీక్షలో రంధ్రం పరిమాణం 5 ఎం.ఎం. కంటే పెద్దదిగా ఉందని తేలిందన్నారు. ఈ రంధ్రాలు పూడ్చటానికి అప్పట్లో సర్జరీ మాత్రమే అందుబాటులో ఉండేది. అలాంటి పిల్లలు తీవ్రమైన నొప్పిని భరించాల్సి వచ్చేది. అలాగే మచ్చలు శాశ్వతంగా మిగిలిపోయేవి. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రంలో వచ్చిన అత్యాధునిక పురోగతి వల్ల ఇలాంటి పిల్లలకు అలాంటి అసౌకర్యం, నొప్పి లేకుండా గుండెలోని రంధ్రాలను పూడ్చటం చాలా సాధారణమైన వైద్యప్రక్రియగా మారిపోయింది. ఇందుకోసం సర్జరీ అవసరమే లేదు. మొదట గజ్జల్లో ఉండే రక్తనాళాల ద్వారా కార్డియాక్ కేథటర్‌ను సూది ద్వారా పంపి గుండె పనితీరును తెలుసుకుంటారు. అలాగే గుండె రంధ్రం పరిమాణంతో పాటు దాని తీరును రేడియో కాంట్రాస్ట్‌ను ఇంజెక్ట్ చేసి తెలుసుకుంటారు. ఆ తర్వాత రంధ్రాన్ని మూసివేసే ప్రక్రియను చేపడతారు. ఈ చికిత్స పూర్తయ్యాక గుండెలోకి పంపిన కేథటర్స్ అన్నింటినీ బయటకు తొలగిస్తారు. ఆ తర్వాత ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష చేసి, రంధ్రం పూడుకుందా లేదా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలకూ గురికాకుండా మీ బాబును కార్డియాలజిస్ట్‌కు చూపించి మెరుగైన, శాశ్వతమైన చికిత్సను అందించండి. డాక్టర్ ఆర్. ప్రసాద రెడ్డి సీనియర్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
బ్యూటిప్స్
పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో అయిదారు చుక్కల తేనె కలిపి, రాత్రి పడుకోబోయే ముందు రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు మృదువుగా ఉంటాయి.వేడినీళ్లలో వేపాకులు వేసి స్నానం చేస్తే దురద తగ్గుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. టీ స్పూన్ కీరదోసకాయ రసంలో చిటికెడుచందనం కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత కడిగితే చర్మం నునుపు తేలుతుంది.టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి, ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగితే... జిడ్డు తగ్గి చర్మం అందంగా ఉంటుంది. -
బ్యూటిప్స్
రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టుకొని, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. దూది ఉండను ఈ నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలకూ తొలగిస్తాయి. దురద, దద్దుర్లు లాంటివాటినీ, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. పచ్చిపాలు, అలొవెరా జెల్, తేనె టీ స్పూన్ చొప్పున తీసుకొని, అందులో ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు కలపాలి. ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకొని, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత పాల మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని, ముఖానికి రాసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఆరేంత వరకు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మకాంతి పెరుగుతుంది. -
మందులు వాడినా దద్దుర్లు తగ్గడం లేదు!
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. గత నాలుగు నెలల నుంచి ఒళ్లంతా దద్దుర్లు, దురద ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్లు ‘అర్టికేరియా’ అని చెప్పి ఇచ్చిన మందులు వాడినా, తాత్కాలిక ఉపశమనమేగానీ పూర్తిగా తగ్గడం లేదు. ఇది పూర్తిగా నయమవడానికి ఆయుర్వేద చికిత్స సూచించండి. - శాంభవి, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలున్న అవస్థను ఆయుర్వేదంలో ‘శీత పిత్త, ఉదర్ద ఉత్కాఠ’ అనే పేర్లతో వివరించారు. దీనికి ప్రధాన కారణం ‘అసాత్మ్యజ’ (అలర్జిక్) పదార్థాల ప్రభావం దీనివల్ల శరీరంలో ‘పిత్తం’ ప్రకోపిస్తుంది. దీనికి తోడుగా అతిశీతల వాతావరణం చర్మం మీద ప్రభావం చూపడం జరిగితే వాత, కఫాలు కూడా వికృతి చెంది ‘దురదతో కూడిన దద్దుర్లు’ వ్యక్తమవుతాయి. కందిరీగలు కుట్టినట్లుగా నొప్పి, మంట ఉండవచ్చు. అప్పుడప్పుడు జ్వరం, వాంతి కూడా ఉంటాయి. ఆ దద్దుర్లు బండి చక్రాల్లాగ గుండ్రంగా ఉండి మధ్యలో పల్లంగా ఉండవచ్చు. చికిత్స సూత్రాలు: జఠరాగ్ని సక్రమంగా పనిచేసేట్టు చూసుకోవాలి. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ‘జావల’ వంటి ఆహారం తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగాలి. అలర్జీని కలిగించే ఆహార పదార్థాలను, ఇతర ద్రవ్యాలను శీఘ్రంగా పసిగట్టడం కష్టం కాబట్టి ఆ సమయంలో మజ్జిగ అన్నం కానీ, బార్లీ, గోధుమ జావలుగానీ రెండు రోజుల పాటు సేవిస్తే మంచిది పొట్టలో క్రిములు లేదా అమీబియాసిస్ (ప్రవాహికా) వంటి వికారాలు ఉంటే వాటికి వెంటనే చికిత్స చేయాలి ఆహారపదార్థాల్లో వాడే రంగులు, నూనెలు, నిల్వ కోసం వాడే రసాయనాలు, గరం మసాలాల వంటివి ఎన్నో ద్రవ్యాలు అలర్జీలకు కారణమవుతాయని గుర్తుంచుకోండి. వాటికి దూరంగా ఉండండి అతిశీతల వాతావరణానికి గురికావద్దు దుమ్ము ధూళి రసాయనాలు వంటి వాటికి దూరంగా ఉండండి అలాగే ఎక్కువ సేపు ఎండకి కూడా గురికావద్దు. ఔషధాలు : క్రిమికుఠారరస (మాత్రలు) : ఉదయం 1 మధ్యాహ్నం 1 రాత్రి 1 (ఐదు రోజుల పాటు వాడాలి) లఘుసూతశేఖర రస (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2 (రెండు వారాలు వాడాలి). రసపీపరీరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 (మూడు వారాలు వాడాలి)యష్టిమధు (మాత్రలు) : ఉదయం 2 రాత్రి 2 ( మూడు వారాలు వాడాలి). ఖదిరారిష్ట (ద్రావకం): నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి రోజూ మూడుపూటలా తాగాలి (సమస్య తగ్గేవరకు)పైపూతకు: ‘మహామరిచాదితైలం మూడు పూటలా పూయవచ్చు. గృహవైద్యం: పసుపు 500 మి.గ్రా + వేపాకు ముద్ద 3 గ్రాములు + బెల్లం 5 గ్రాములు కలిపి ఒక మోతాదుగా వేడినీటితో ఉదయం పరగడుపున సేవించాలి. వ్యాధి తీవ్రతను బట్టి రోజూ రెండు, మూడు సార్లు కూడా తీసుకోవచ్చు. ఆవనూనెను దద్దుర్లపై పూసుకోవచ్చు. గమనిక : పై చికిత్సలకు లొంగకపోతే, వైద్యనిపుణుడి పర్యవేక్షణలో అవసరమైన పంచకర్మలు చేయించుకోవాలి (విరేచన, వమన, అభ్యంగ, స్వేద వంటి ప్రక్రియలు). కొన్ని ప్రత్యేక కషాయాలు కూడా వైద్యుడు తయారుచేసి ఇవ్వాల్సి ఉంటుంది.ట ఉదా : గుడూచీ, మంజిష్ఠా, శారిబా మొదలైన ద్రవ్యాలతో వాటిని తయారు చేస్తారు. నొప్పి ఎక్కువై నడవడం కష్టమౌతోంది ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. తగిన సలహా ఇవ్వండి. - రత్నమ్మ, కాకినాడ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తాం. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) చేయాల్సి రావచ్చు. ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది (ట్విస్ట్ అయ్యింది). అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. - నీరజ, గుంటూరు మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోంది. దాదాపుగా ఏడాది నుంచి ఈ నొప్పి ఉంది. కుడి మోకాలి నొప్పి కాస్త భరించగలిగేట్లు ఉన్నా ఎడమ మోకాలిలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నొప్పి పెరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎడమ మోకాలిలో తీవ్రమైన ఆర్థరైటిస్ ఉందనీ, కుడి మోకాలిలో దాని తీవ్రత ఒకింత తక్కువగా ఉందని అంటున్నారు. ఈ మోకాళ్లలోకి ల్యూబ్రికెంట్ పనిచేసే అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. దాంతో ఆర్థరైటిస్ నొప్పులూ, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ చాలా ఖరీదైనవి అంటున్నారు. అంత ఖరీదైన ఇంజెక్షన్స్‌ను భరించే స్తోమత నాకు లేదు. అందుకే నాకు తగిన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - దుర్గాప్రసాద్, విజయవాడ మీరు చెప్పినట్లుగా ల్యూబ్రెకెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి మరీ ఆధునికమైనవేమీ కాదు. గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాటిని వాడుతూనే ఉన్నారు. అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి లక్షణాల తీవ్రతను తగ్గించడం మాత్రమే చేస్తాయి. అంతేకాదు... ఆర్థరైటిస్ పెరగడాన్ని కాస్త తగ్గించి, కార్టిలేజ్‌ను బలం చేకూరుస్తాయి. అంతేగానీ వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. పైగా తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీ విషయానికి వస్తే అది కుడి కాలికి కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎడమకాలికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే దానివల్లనే అంతా చక్కబడుతుందని అనుకోవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్య చికిత్స పొందండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
మా పేరెంట్స్‌కు గుండెసమస్యలు... నాకు కూడా వస్తాయా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబుకు పదేళ్లు. వాడికి పొట్టమీద , చర్మం మీదా ఎర్రగా గుండ్రంగా మచ్చలు ఏర్పడ్డాయి. ఆ మచ్చలు దురద అని ఏడుస్తున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే ఎగ్జిమా అని చెప్పారు. అంటే ఏమిటి? ఇది ఎలా తగ్గుతుంది? సలహా చెప్పగలరు. - పుష్పలత, హైదరాబాద్. నూటికి 90 శాతం మంది ఏదో ఒక సాధారణ చర్మవ్యాధితో బాధపడుతూనే ఉంటారు. మీ బాబుకు వచ్చిన వ్యాధి గురించి మీరు ఆందోళన పడకండి. మందులు వాడితే నయం అవుతుంది. ఎగ్జిమాను తెలుగులో తామర అంటారు. ఎగ్జిమాలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా కనిపించే అటోపిక్ ఎగ్జిమాతో ఎక్కువమంది బాధపడుతుంటారు. శిశువులలో 55 శాతం, ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో 85 శాతం, ఈ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ సమస్య పెద్ద వయసు వారిలో కూడా కనిపిస్తుంది. శరీరంలో ఎక్కడయినా ఏర్పడే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా మోకాలు వెనుక భాగం, మోచేయి, మణికట్టు మడతలలో, మెడపైన, కాలి మడమలు, పాదాలపైన కనిపిస్తాయి. ఎగ్జిమా రకాలు: అలర్జిక్ డర్మటైటిస్, కాంటాక్ట్ డర్మటైటిస్, అటోపిక్ డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్, నమ్యులార్ డర్మటైటిస్, స్టేనిస్ డర్మటైటిస్, డిస్ హైడ్రాయ్టిక్ ఎగ్జిమా. కారణాలు: ఎక్కువగా పొడిచర్మం, ఏదైనా అలర్జీ కలిగించే వస్తువులు తగిలినప్పుడు, కొన్ని రసాయనాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థితి నుంచి ఎక్కువగా ప్రతిక్రియ జరపడంతో ఎగ్జిమా లక్షణాలు కనిపిస్తాయి. ప్రేరేపకాలు: వాతావరణ మార్పులు, పూల మొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, జంతుకేశాలు, కొన్ని ఆహార పదార్థాలు, డిటర్జెంట్లు, చేతిగడియారాలు, ఇమిటేషన ఆభరణాలు, డయాపర్లు, డియోడరెంట్లు, ఉన్నివస్త్రాలు, ఇవేకాకుండా దురద పుట్టించే కొన్ని పదార్థాలు దీనిని తీవ్రతరం చేస్తాయి. ఒత్తిడి వల్ల కూడా ఎగ్జిమా ఎక్కువయే అవకాశం ఉంది. లక్షణాలు: ప్రధాన లక్షణం దురద. దీంతో చర్మం కమిలిపోయి ఎరుపు రంగుకు మారటం, ఆ తర్వాత చర్మం పైన వాపుతో కూడిన పొక్కులు ఏర్పడటం, క్రమేణా అవి నీటిబుడగలుగా మారి వాటినుంచి రసి కారటం, కొంతకాలానికి చర్మం దళసరిగా, నల్లగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శిశువుల లో మొదట బుగ్గలపై దద్దుర్లుగా కనిపిస్తాయి. కొన్ని నెలలకు ఇవే దద్దులు చేతులు, కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలకూ పాకుతాయి. నివారణ, హోమియో చికిత్స: పైన చెప్పిన వస్తువులు, పరిస్థితులకు దూరంగా ఉండటం ద్వారా కొంతవరకు నివారించుకోవచ్చు. హోమియోకేర్ అందించే కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వ్యాధిని నివారించడమే కాకుండా భవిష్యత్తులో ఈ ఎగ్జిమాను ప్రేరేపించే వస్తువులను ఉపయోగించినా మళ్లీ ఈ వ్యాధి సోకకుండా పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. మా అమ్మకు, నాన్నకు ఇద్దరికీ గుండెసమస్యలు ఉన్నాయి. నాకు కూడా వచ్చే అవకాశాలున్నాయేమో అని భయంగా ఉంది. గుండెపోటు రావడానికి కారణాలు, చికిత్సా విధానాలు తెల్పగలరు. - కె.కిరణ్ కుమార్, పీలేరు గుండెసమస్య ఎవరికైనా రావచ్చు. ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, అధిక కొవ్వుశాతం, స్థూలకాయం, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యత మొదలైనవి. సాధారణంగా రక్తనాళాల లో బ్లాకులు (అడ్డంకులు) ఏర్పడినప్పుడు మందుల ద్వారా లేదా ఆంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. శరీరంలో అధిక కొలెస్టరాల్ వల్ల వచ్చే అనర్థాలు, రక్తనాళాలలో కొవ్వు చేరడం వల్ల, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కొలెస్టరాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. సంవత్సరానికి ఒకసారి గుండెకు సంబంధించిన పరీక్షలైన 2డీ ఎకో, టి.ఎం.టి. కొలెస్టరాల్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె కండరాలు, గుండె పనితీరు తెలుస్తుంది. గుండెలో రక్తనాళాలలో అడ్డంకులు ఉంటే దీనికి ఆంజియోప్లాస్టీ అవసరం. ఆంజియోప్లాస్టీ అంటే సూక్ష్మనాళాన్ని మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపి, తర్వాత సన్నటి వైరు వంటి దాని సాయంతో రక్తనాళాలలోని కొవ్వును తొలగిస్తారు. అవసరాన్ని బట్టి అక్కడ స్టంట్‌ను అమర్చడం ద్వారా ఆంజియోప్లాస్టీ చికిత్స పూర్తవుతుంది. రక్తనాళాలలో ఉన్న అడ్డంకిని తొలగించడం వల్ల రక్తప్రసారం మామూలు స్థాయికి చేరి గుండె కండరాలు బలహీన పడకుండా ఉంటాయి. నా వయసు 68. నాకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిశాను. తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్‌గారు నాకు వాల్యులో ప్లాస్టీ చికిత్స అవసరమని సూచించారు. దయచేసి వివరించగలరు. - కె.వి.రావ్, కోదాడ గుండె కవాటాలను సరిచేయడానికి చేసే చికిత్సను వాల్వులో ప్లాస్టీ అంటారు. గుండెకు ఎడమపక్కన ఉన్న మిట్రల్ కవాటం మూసుకుపోయినప్పుడు దాన్ని వాల్వులోప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా బెలూన్ సాయంతో వెడల్పు చేస్తారు. పల్మునరీ వాల్వులోప్లాస్టీ- పిబీపీవో- గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనికి ఉన్న కవాటం పల్మునరీ వాల్వ్ అంటారు. ఈ పల్మునరీ వాల్వ్ మూసుకుపోయినప్పుడు బెలూన్ ద్వారా దీన్ని తెరవవచ్చు. ఇది సాధారణంగా పుట్టుకతో వచ్చే లోపం కాబట్టి దీన్ని చిన్న వయసులోనే సరిచేయవచ్చు. పి.బి.ఎ.వి. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకు వెళ్లే ధమనికి ఉన్న కవాటం అమోర్టిక్ కవాటం మూసుకుపోయినప్పుడు ఈ పద్ధతి ద్వారా సరి చేస్తారు. మీరు భయపడకండి. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 27. గర్భం ధరించడంలో నాకు ఎలాంటి సమస్యా లేదు. అయితే నాకు చాలాసార్లు గర్భస్రావం అయ్యింది. ఎనిమిది వారాల గర్భం అప్పుడు ఒకసారి, పదకొండు వారాలకు ఒకసారి, తొమ్మిది వారాల టైమ్‌లో ఇంకోసారి గర్భస్రావం అయ్యింది. ఇక ఎనిమిది వారాల సమయంలో నాలుగోసారి కూడా గర్భస్రామైంది. దాంతో నాకు తీరని నిరాశకు లోనవుతున్నాను. నేను బిడ్డ పుట్టే అవకాశాలు లేవేమోనని ఆందోళనకు గురవుతున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ఒక సోదరి, విజయవాడ ఒకసారి గర్భస్రావం అయ్యిందంటే అది సాధారణంగా పరిగణించవచ్చు. కానీ మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు అదే జరిగితే వాటిని తరచూ జరిగే గర్భస్రావాలని (రికరెంట్ మిస్క్యారేజ్) భావించాలి. అసలు మీ సమస్యకు కారణం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి. మీ లేఖలో మీ వయసెంతో పేర్కొనలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ గర్భస్రావాలు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అండంలో నాణ్యత కూడా తగ్గుతుంది. ఉదాహరణకు 20-24 వయసు వారిలో గర్భస్రావం అయ్యేందుకు అవకాశాలు 11 శాతం మాత్రమే ఉంటాయి. అదే 40-44 ఏళ్ల వయసు వారిలో అది 50 శాతం ఉంటాయి. వయసుతో పాటు పెరిగే బరువు కూడా గర్భస్రావాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి మీరూ, మీ భర్త ఇద్దరూ క్రోమోజోమ్ విశ్లేషణ పరీక్షలు చేయించుకోవాలి. దీనితో పాటు ఒకసారి మీరు థైరాయిడ్, డయాబెటిస్ పరీక్షలూ చేయించుకోండి. మీ గర్భసంచి ఎలా ఉందో తెలుసుకోడానికి హిస్టరోస్కోపీ లేదా లాపరోస్కోపీతో పాటు చేసే హిస్టెరోస్కోపీ 3-డీ స్కానింగ్ చేయించండి. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే, దానికి తగిన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీకు ఏ సమస్యా లేకపోతే అందరిలాగే మీరూ గర్భవతి అయ్యేందుకు, పండంటి బిడ్డ పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నిగనిగల కురులకు...
బ్యూటిప్స్ చలికాలం మాడు పొడిబారి, దురద పెడుతుంటుంది. గాల్లో తేమ తగ్గడం వల్లే ఇలా జరుగుతుంది. మాడు పై చర్మం పొలుసులుగా లేచి, చుండ్రుకు దారితీస్తుంది. కొబ్బరి నూనెను వేడి చేసి, అందులో అర నిమ్మచెక్కను పిండి, తలకు పట్టించాలి. మాడుకు బాగా మసాజ్ చేసుకొని, తలస్నానం చేయాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.తలను శుభ్రపరచడానికి మరీ వేడి నీళ్లు వాడితే మాడుపై సహజ నూనెలు తగ్గి త్వరగా పొడిబారుతుంది. అందుకని గోరువెచ్చని నీటినే తలస్నానానికి ఉపయోగించాలి. తలస్నానం తర్వాత కండిషనర్ వాడితే వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి. వెచ్చని ఆలివ్ ఆయిల్‌ను మాడుకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. నూనె కుదుళ్లకు పట్టి, వెంట్రుక చిట్లకుండా ఉంటుంది. చలికాలం జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్లను వాడకపోవడమే మంచిది. హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించి జుట్టును ఆరబెట్టడం వల్ల శిరోజాలు మరింత త్వరగా పొడిబారే అవకాశం ఉంది. -
మీసాల్లో దురద తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయికి వంటి మీద చిన్న చిన్న కురుపుల్లా వచ్చాయి. వేళ్ల మధ్యలో కూడా పొక్కుల్లా వున్నాయి. వీటిమూలంగా దురదతో చాలా బాధ పడుతున్నాడు. దీనికి హోమియోలో మంచి మందులు ఉంటే తెల్పగలరు. - నీలిమ, హైదరాబాద్ మీ అబ్బాయికి వచ్చినది దురదతో కూడిన ఒక అంటువ్యాధి. ఇది సార్కోప్టెస్ స్కాబీ అనే ఒక పరాన్నజీవి వలన ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది చర్మంలో రంధ్రా లు చేసి దురదను కలిగిస్తుంది. ఈ జీవి ఎగరలేదు కాని చాలా వేగంగా పాకుతుంది. దోమకాటు, నల్లికాటు, కుక్క లేదా పిల్లిని పెంచడం వల్ల వాటి ఒంటి మీద ఉండే రోమాల కారణంగా కూడా దురదతో కూడిన ఇన్ఫెక్షన్ ఉంటుంది. దురద రాత్రిపూట ఎక్కువగా ఉండటం, చర్మం కన్నాలు పడినట్లు ఉండటం గమనించవచ్చు. లక్షణాలు: చర్మంపై చిన్న చిన్న కురుపులలాగా, రక్తంతో కూడిన బొబ్బల మాదిరిగా వస్తాయి. ఇవి చేతివేళ్లమధ్యలో, మణికట్టు, కీళ్లవెనుక, నడుము, నాభి, పాదాల దగ్గర ఎక్కువగా వస్తాయి. దురద మొదట తక్కువగానే ఉంటుంది. కాని కాలం గడిచేకొద్దీ దురద ఎక్కువ అవుతుంది. నిద్రాభంగం కూడా అవుతుంది. గోక్కోవడం వలన చర్మం దెబ్బతిని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కారణాలు: వ్యాధిగ్రస్థులు వాడే వస్తువులు వాడటం వలన, ఇతరుల పక్కబట్టలు, వ్యాధి కలవారిని తాకినా వచ్చే అవకాశం ఉంది. ఇది సాధారణంగా మానసిక వికలాంగులలో, శరీరభద్రతావ్యవస్థ లోపించిన వారిలో, ఎయిడ్స్, లింఫోమా ఉన్న వారిలో రావచ్చు. మోకాళ్లు, అరచేతులు, నుదురు, అరికాళ్లలో ఎక్కువగా వస్తుంది. చర్మం మొదట పొడిబారిపోయి పొట్టులాగా ఏర్పడుతుంది. తర్వాత పులిపిర్లలాగా లేదా చీముగడ్డలలాగా మారుతుంది. గోళ్లు మందంగా అయ్యి, రంగు మారతాయి. దుర్వాసనతో కూడిన చెమటలు ఎక్కువగా పడతాయి. చలిని తట్టుకోలేరు. దురద ఉంటుంది కాని సాధారణ స్కాబిస్ ఇన్ఫెక్షన్లా ఇందులో దురద అంత తీవ్రంగా ఉండదు. పుండు ఉన్న చోట చుట్టూ చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. లింఫ్ గ్రంథుల వాపు, జ్వరం, చలి, వికారం వంటి లక్షణాలు కనపడతాయి. మానసిక ఆందోళన అధికమైన కొద్దీ దురద, చిరాకు, మంటలు ఎక్కువ అవుతాయి. నివారణ: వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, వ్యాధిగ్రస్థులు వాడిన దుస్తులు, దువ్వెనలు తదితర వస్తువులను ఉపయోగించకపోవటం, లక్షణాలు కనిపించినప్పుడే అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించడం అవసరం. స్టార్ హోమియోపతి చికిత్స: మెర్క్‌సాల్, హెపార్ సల్ఫ్, పెట్రోలియా, సారస్పరిల్లా, ఎకినీషియా వంటి మందులను వ్యాధి లక్షణాలను బట్టి, రోగి వ్యక్తిత్వాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుని మందును నిర్ధారిస్తారు. కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23 ఏళ్లు. గత ఐదేళ్లుగా రుమాటిక్ ఫీవర్‌తో బాధపడుతున్నానను. ప్రస్తుతం నేను పెన్సిలిన్ ఎల్ఏ 1200 తీసుకుంటున్నాను. ఇంకా రెండేళ్ల వరకు పెనిడ్యూర్ ఇంజెక్షన్ తీసుకోవాలని డాక్టర్ సూచించారు. ఇంజెక్షన్ తీసుకోకపోతే నాకు ఒక్కసారిగా కీళ్లనొప్పి, ఛాతీలో నొప్పి మొదలవుతాయి. నేను ఎంతకాలం ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి వివరంగా చెప్పండి. - మురళీకృష్ణ, కందుకూరు మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ గుండెలోని ఎడమవైపు గదుల్లో ఉండే మైట్రల్ వాల్వ్ వనే కవాటం పరిమాణం పెరిగి మందమైనట్లుగా తెలుస్తోంది. కాబట్టి గుండె సంకోచం జరిగేటప్పుడు రుమాటిక్ ఫీవర్ వస్తోంది. కాబట్టి మైట్రల్ వాల్వ్‌కు ఎలాంటి ఇన్షెక్షన్ సోకకుండా, నష్టం జరగకుండా మీరు పెన్సిలిన్ ప్రొఫిలాక్సిస్ (ముందుజాగ్రత్తగా) ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది. మీ వాల్వ్ పరిస్థితిని పరిస్థితులను గమనించడానికి పన్నెండు నెలలకు ఒకసారి ఈసీజీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. మీరు పాల ఉత్పాదనలు (డయరీ ప్రాడక్ట్స్), పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యులను సంప్రదిస్తూ ఉంటే మీరు అందరిలాగే పూర్తికాలం జీవించవచ్చు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా నాన్నగారి వయసు 60 ఏళ్లు. బరువు 90 కిలోలు. గత మూడు నెలలుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌ను సంప్రదిస్తే కరొనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష నిర్వహించి, గుండెకు సంబంధించిన వ్యాధి ఏమీ లేదని చెప్పారు. ఇది కండరాలకు సంబంధించిన నొప్పి అని తేల్చారు. అయితే ఛాతీలో నొప్పికి కారణం ఏమిటో తెలియడం లేదు. దయచేసి మా నాన్నగారి విషయంలో తగిన సలహా ఇవ్వండి. - జయకుమార్, నందిగామ సాధారణంగా ఛాతీలో నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ఛాతీ భాగంలో కండరాలు, ఆహారనాళం, ఊపిరితిత్తులు, దాని పొరలు... ఇలా అనేక అంతర్గత భాగాలు ఉంటాయి. కరొనరీ యాంజియోగ్రామ్ ద్వారా ఇది గుండెకు సంబంధించిన సమస్య కాదని నిర్ధారణ అయ్యింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బహుశా అది గ్యాస్ట్రయిటిస్ సమస్య కావచ్చు. అయితే నిర్దిష్టంగా సమస్యను నిర్ధారణ చేయడానికి ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. నాకు మీసాలలో విపరీతమైన దురద వస్తోంది. రోమం మూలల్లో ఇది ఎక్కువగా అనిపిస్తోంది. గత నెల రోజులుగా ఇలా జరుగుతోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - కిశోర్, హైదరాబాద్ మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీరు సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీసాలలో దురద రావడం అనే సమస్య సెబమ్ అనే నూనె వంటి స్రావం ఎక్కువగా స్రవిస్తున్నందువల్ల కావచ్చు. మీ సమస్యను అధిగమించడానికి ఈ కింది సూచనలు పాటించండి. మోమటోజోన్తో పాటు టెర్బనాఫిన్ యాంటీ ఫంగల్ ఉండే కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ క్రీమును ప్రతిరోజూ రాత్రిపూట మీ మీసాల వద్ద చర్మంపై రాసుకోండి. ఇలా పది రోజులు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. కొద్ది నెలల పాటు ఐసోట్రెటినాయిడ్ టాబ్లెట్లను నోటి ద్వారా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్య సత్వర పరిష్కారానికి డర్మటాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 31 ఏళ్లు. నేను రజస్వల అయినప్పటి నుంచి నా శరీరం దుర్వాసన ఎక్కువగా వస్తోంది. రోజుకు మూడు సార్లు స్నానం చేస్తున్నా ఈ దుర్వాసన తగ్గడం లేదు. నా సమస్యకు సరైన పరిష్కారం ఇవ్వండి. - ఒక సోదరి, గుంటూరు కొంతమందిలో చర్మంపై ఉండే సెబేషియస్ గ్లాండ్స్ చాలా ఎక్కువగా పనిచేస్తుంటాయి. చర్మంపై ఉన్న ఈ గ్రంథుల నుంచి సీబమ్ అనే ఒక రకమైన నూనె స్రవిస్తుంటుంది. ఈ స్రావాలకు చెమట కూడా తోడైతే, దాని వల్ల చర్మంపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా చర్మం నుంచి దుర్వాసన వస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు చేయాల్సినవి... మీ చర్మంపైన ఎక్కువ చెమట పట్టే బాహుమూలాల వంటి ప్రదేశాల్లో కొద్దిపాటి సువాసన ఉండే యాంటీబ్యాక్టీరియల్ మెడికేటెడ్ సబ్బుతో రోజుకు మూడు సార్లు శుభ్రపరచుకోండి. ఆ ప్రాంతాలలో రోజూ టాల్కమ్ పౌడర్‌ను చల్లుకోండి. రోజూ ఉదయం పూట అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్ ఉండే లోషన్‌ను ఒంటిపై రాసుకోండి. ఇది మిమ్మల్ని మరింత సేపు ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. అప్పటికీ మీ ఒంటి దుర్వాసన తగ్గకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. -
ఆ మందులు ఇంకా వాడాలా..?
హోమియో కౌన్సెలింగ్ తామరను తరిమి కొట్టవచ్చు నా వయసు 36. నాకు తొడల మీద, కాళ్ల మీద, పొట్టమీద ఎర్రగా, గుండ్రంగా మచ్చలు వచ్చాయి. ఇవి చాలా దురద పెడుతున్నాయి. నాకు ఈ మచ్చల వల్ల చాలా అసౌకర్యంగా ఉంది. హోమియోలో ఏమైనా మందులు ఉంటే సూచించగలరు. - పి.కుమార్, మాచర్ల ఎగ్జిమా అనేది దీర్ఘకాలిక చర్మసమస్య. దీనివల్ల చర్మం ఎరుపు దనంతో కమిలినట్లు కనిపించడం, దురద, రసితో కూడిన చిన్న చిన్న పొక్కులుగా ఏర్పడటం, చర్మం పొలుసులుగా రాలడంతోపాటు పిగ్మెంటేషన్ జరుగుతుంది. కారణాలు: ఇది వంశపారంపర్యం, వాతావరణ మార్పులు, అలర్జీ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిమాను ప్రేరేపించే కారణాలు... వాతావరణ మార్పులు, దురద పుట్టించే ఆహార పదార్థాలు, సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, కొన్ని రకాల అలర్జిన్స్ ముఖ్యంగా డస్ట్మైట్లు, పెంపుడు జంతువులు, పుప్పొడి రేణువులు, డాండ్రఫ్ మొదలైనవి. ఒత్తిడి వల్ల కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. హార్మోన్ల అసమతుల్యత ముఖ్యంగా స్త్రీలలో ఈ లక్షణాలను మరింత దుర్భరం చేస్తాయి. ఎగ్జిమా ఎక్కువగా ఉబ్బసం, తీవ్రమైన జ్వరాలు, ఇతర శ్వాస సంబంధితమైన అలర్జీల వంటి వ్యక్తిగత చరిత్ర కలిగి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రకాలు... ఎగ్జిమాలో అటోపిక్ డెర్మటైటిస్ సర్వసాధారణం. అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్, కాంటాక్ట్ ఎగ్జిమా, డిస్హైడ్రియాట్రిక్ ఎగ్జిమా, న్యూరో డెర్మటైటిస్, నమ్యులార్ ఎగ్జిమా, సెబోరిక్ ఎగ్జిమా, స్పాసిస్ డెర్మటైటిస్ వంటి రకాలున్నాయి. ముఖ్యలక్షణాలు: ఇవి వయస్సును బట్టి మారుతుంటాయి. శిశువులలో... చర్మంపై దద్దులు ముఖ్యంగా బుగ్గలపై, తలపైన ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నీటిబుగ్గల మాదిరిగా తయారై, రసికారడం, విపరీతమైన దురద, గోకడం వల్ల చర్మంపై ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలు, యుక్తవయసు వారిలో మోచేయి, మోకాలి మడతలలో, మణికట్టు, చీలమండలు, పిరుదులు, కాళ్ల మీద కనిపిస్తుంది. పెద్దవారిలో మోకాలు, మోచేయి, మెడభాగాలలో, ముఖంపైన, కళ్లచుట్టూ దద్దుర్లు వస్తాయి. చర్మం పొడిబారడం, దురద, చర్మం ఇన్ఫెక్షన్లకు గురికావడం వంటివి ఎలా నిర్థారిస్తారంటే... కుటుంబ చరిత్ర, వ్యక్తిగత చరిత్ర తెలుసుకుని వ్యాధిని నిర్ధారిస్తారు. బాహ్యపరీక్ష, అవసరమైతే రక్తపరీక్ష, కొన్ని సందర్భాలలో చర్మపు మచ్చల నిర్ధారణకై బయాప్సీ చేయించాల్సి ఉంటుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..? వ్యాధి లక్షణాలను దుర్భరం చేసే ప్రేరేపకాలకు దూరంగా ఉండాలి. ఎగ్జిమాల వల్ల వచ్చే పుండ్లను గోకడం, రక్కడం లాంటివి చేయకూడదు. హోమియో చికిత్స: కాన్స్టిట్యూషనల్ హోమియోపతిలో భాగంగా రోగి శరీర రోగనిరోధక కణాలకు పునరుజ్జీవం కల్పించి, దుష్ఫలితాలు లేకుండా ఎగ్జిమాను పూర్తిగా నయం చేయవచ్చు. అన్ని ప్రతికూల పరిస్థితులలో సైతం ఆరోగ్యవంతమైన జీవనం సాగించే విధంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ వారు అందించే వైద్య కచ్చితంగా దోహపడుతుంది. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ క్రియాటినిన్ పెరిగినా డయాలసిస్ చేయలేదు..? నా వయసు 55. ఇటీవలే బాగా నిస్సత్తువగా, నీరసంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. అన్ని పరీక్షలు చేసి క్రియాటినిన్ పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దాంతో నాకు డయాలసిస్ చేస్తారేమోనని ఆందోళన పడ్డాను. కానీ డయాలసిస్ చేయడం లేదు. మందులే ఇస్తున్నారు. క్రియాటినిన్ ఎంత ఉంటే డయాలసిస్ చేస్తారు? - మస్తాన్, గుడివాడ ఒక రోగికి డయాలసిస్ మొదలుపెట్టడానికి కేవలం క్రియాటినిన్ కౌంట్ మాత్రమే ఆధారం కాదు. ఇంకా చాలా రకాల పరీక్షలు చేసి డయాలసిస్ ఎప్పుడు చేయాలో నిర్ధారణ చేస్తారు. ఇటీవలి నూతన పరిశోధనల ఆధారంగా క్రియాటినిన్ కౌంట్ 6 - 8 మధ్యలో ఉన్న రోగులకు కొందరికి డయాలసిస్ చేశారు. అయితే క్రియాటినిన్ కౌంట్ 10 - 12 మధ్య ఉన్నవారికి డయాలసిస్ ప్రారంభించినప్పుడు ఇచ్చినన్ని సత్ఫలితాలు ఈ 6 - 8 మధ్య ఉన్నవారిలో కనిపించలేదు. దీనివల్ల డయాలసిస్ చేయాలనడానికి కేవలం క్రియాటినిన్ మాత్రమే ఒక నిర్దిష్ట పరీక్ష కాదని స్పష్టంగా తేలిపోయింది. క్రియాటినిన్ ఎక్కువగా ఉండటంతో పాటు మూత్రపిండాల రోగి ఊపిరి తీసుకోలేకపోవడం, సరైన పోషకాహారం తీసుకోక సన్నబడిపోవడం, ఆకలిని కోల్పోవడం, వాంతులు కావడం (ఈ లక్షణాలన్నింటినీ యూరెమిక్ సింప్టమ్స్ అంటారు) వంటివి కనిపించినప్పుడు మాత్రమే డయాలసిస్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీ విషయానికి వస్తే మీకు ఎప్పుడు డయాలసిస్ ప్రారంభించాలన్న అంశాన్ని మీ నెఫ్రాలజిస్టు నిర్ణయిస్తారు. నా వయసు 49 ఏళ్లు. ఇటీవలే నాకు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని తెలిసింది. నేను నీళ్లు ఎక్కువగా తాగకూడదని డాక్టర్ చెప్పారు. సాధారణంగా డాక్టర్లు నీళ్లు ఎక్కువగా తాగమని చెబుతుంటారు కదా! మరి నా విషయంలో నీళ్లు తాగవద్దని ఆంక్ష ఎందుకు పెట్టారు? నాకు అర్థమయ్యేలా వివరించగలరు. - సుందర్రావు, ఆకివీడు సాధారణంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారిలో నీరు తక్కువగా తాగాలని ఆంక్షలు విధించరు. అయితే కిడ్నీ జబ్బుతో పాటు గుండెజబ్బు లేదా అలా నీరు తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం ఎంత నీరు తీసుకోవాలన్నది డాక్టర్లు నిర్దేశిస్తారు. మన భారతదేశం లాంటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న దేశాల్లో మామూలు వ్యక్తి రోజుకు 5-6 లీటర్ల నీటిని తీసుకుంటాడు. అయితే కొందరి కిడ్నీలు కేవలం ఒక్క లీటరు నీటిని ప్రాసెస్ చేయడానికే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వారికి ఉన్న జబ్బు ఆధారంగా, వారి కిడ్నీ పనిచేసే సామర్థ్యం ఎంతో తెలుసుకొని, డాక్టర్లు రోజూవారీ తీసుకోవాల్సి నీటి మోతాదును నిర్ణయిస్తారు. కార్డియాలజీ కౌన్సెలింగ్ ఆ మందులు ఇంకా వాడాలా..? నా వయసు 56. పన్నెండేళ్ల కిందట నాకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రతిరోజూ అటార్ 10, క్లోపిటాబ్-ఏ 75 తీసుకొమ్మని చెప్పారు. ఇప్పటికీ నేను ఆ మందులు తీసుకుంటూనే ఉన్నాను. పన్నెండేళ్లు గడిచాక కూడా ఇంకా నేను వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉందా? తెలియజేయగలరు. - అమీర్‌సాహెబ్, గుంటూరు మీ యాంజియోప్లాస్టీ తర్వాత మీరు ఏడాదికొకసారి మీ డాక్టర్‌ను కలుసుకొని మీరు తీసుకునే మందులను రివ్యూ చేయించుకోవాల్సింది. ఇలా దీర్ఘకాలం పాటు కొన్ని మందులు తీసుకోవడం వల్ల వాటి దుష్పరిణామాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఉండవచ్చు. మొదట మీరు పీటీ-ఐఎన్ఆర్, లిపిడ్స్ (కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డీఎల్, హెచ్‌డీఎల్) పరీక్షలు చేయించుకోండి. కార్డియాక్ ఫంక్షన్ అసెస్మెంట్ కూడా చేయించుకోండి. ఇకవేళ మీ రక్తంలో లిపిడ్స్ పాళ్లు సరిగా ఉంటే అటర్వోస్టాటిన్ (అటార్ 10)ను ఆపివేయవచ్చు. ఇక క్లోపిటాబ్-ఏ 75 లో రక్తాన్ని పలచబార్చే రెండు రకాల ఏజెంట్స్ ఉంటాయి. అవి... 1) క్లోపిడోగ్రెల్, 2) ఆస్పిరిన్. ఈ రెండింటి స్థానంలో అవసరాన్ని బట్టి మీకు కేవలం ఆస్పిరిన్ 75 - 100 ఎంజీ ఇవ్వవచ్చు. అయితే ఈ మందుల మార్పిడి అంతా మీ రక్తపరీక్షలూ, కార్డియాక్ ఫంక్షన్ పరీక్షల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న పరీక్షలు చేయించి ఒకసారి మీ కార్డియాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 60. నాకు ఆర్నెల్ల క్రితం యాంజియోప్లాస్టీ చేసి మెడికేటెడ్ స్టెంట్ వేశారు. అప్పట్నుంచి నేను ఆస్పిరిన్-100 ఎంజీ, క్లోపిడోగ్రెల్ 75 ఎంజీ, అటెనొలాల్ 25 ఎంజీ, ఒమెప్రొజాల్ 20 ఎంజీ, ఫోలిక్‌యాసిడ్ 5 ఎంజీ, మల్టీవిటమిన్ విత్ జింక్ (రోజుకు ఒకసారి), సింవాస్టాటిన్ 10 ఎంజీ (రాత్రిపూట), ఎజెటెమైబ్ 10 ఎంజీ (రెండు నెలల క్రితం మొదలుపెట్టాను, రాత్రిపూట తీసుకుంటున్నాను)... ఈ మందులు వాడుతున్నాను. ఇటీవల రక్తపరీక్షలు చేయిస్తే టోటల్ ఆర్బీసీ - 5.4 ఎం/సీఎమ్ఎమ్, హీమోగ్లోబిన్ 14.2 జీ/డీఎల్, పీసీవీ 48%, ఎంసీవీ 89 ఎఫ్ఎల్, ఎమ్సీహెచ్ - 26 పీజీ, ఎమ్సీహెచ్సీ 29%, మోనోసైట్స్ 9%, ఇసినోఫిల్స్ 7%, బ్లడ్‌గ్లూకోజ్ 112 ఎంజీ/డీఎల్ , సీఈఏ 5.2 వీ ఎన్జీ/ఎమ్మెల్ ఉన్నాయి. లిపిడ్ ప్రొఫైల్‌లో కొలెస్ట్రాల్ 146, గ్రైగ్లిజరైడ్స్ 165, హెచ్‌డీఎల్ 40, ఎల్డీఎల్ 73 ఉన్నాయి. ఇటీవలే నేను బరువు తగ్గడానికి గ్జెనికాల్ (ఆర్లిస్టాట్ రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత) తీసుకోవడం మొదలుపెట్టాను. నా రిపోర్టుల ప్రకారం అంతా బాగున్నట్టేనా? దయచేసి తెలియజేయగలరు. - చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు మీ గుండెకు సంబంధించినంత వరకు మీ రిపోర్టులన్నీ చక్కగానే ఉన్నాయి. అయితే మీరు పంపిన దాంతో ఎర్రరక్తకణాలకూ గుండెజబ్బులకూ నేరుగా ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒకసారి మీ ఫిజీషియన్నుగానీ లేదా కార్డియాలజిస్టును గానీ కలిసి, అంతర్గతంగా ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవడం అవసరం. స్లీప్ కౌన్సెలింగ్ నిద్రలో కాళ్లు కదులుతున్నాయేమిటి? నా భార్య వయసు 50 ఏళ్లు. కాస్త లావుగా ఉంటుంది. డయాబెటిస్తో బాధపడుతోంది. ఇటీవల నిద్రలో ఆమె కాళ్లను కుదిపినట్లుగా చాలా వేగంగా కదిలిస్తోంది. నిద్రలోంచి లేచి పిక్కలు పట్టేస్తున్నాయని (మజిల్ క్రాంప్స్) అంటోంది. దీంతో ఆమె నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దయచేసి ఆమె విషయంలో ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి. - వెంకటేశ్వరరావు, హన్మకొండ నిద్రలో ఇలా కుదుపుతున్నట్లుగా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్ డిజార్డర్ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. సాధారణంగా నిద్రపోతున్న సమయంలో మన శరీరంలో శ్వాస తప్ప మరే కదలికా ఉండదు. కానీ నిద్రలో ఇలా కదలికలు కనిపించే జబ్బు ఇదే. ఇక్కడ ‘పీరియాడిక్’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 - 40 సెకండ్ల పాటు వస్తుంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్ఎమ్డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు. సెకండరీ పీఎల్ఎమ్డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... డయాబెటిస్ ఐరన్ లోపం వెన్నెముకలో కణుతులు వెన్నెముక దెబ్బతినడం స్లీప్ ఆప్నియా (గురక సమస్య) నార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) యురేమియా (రక్తంలో యురియా, నైట్రోజన్ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి. పీఎల్ఎమ్డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు నిర్దిష్టంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్ ఏజెంట్స్, యాంటీకన్వల్జెంట్ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్ వంటి మందులతో చికిత్స చేయవచ్చు కాబట్టి మీరు ఆందోళన పడకుండా మీ భార్యతో కలిసి ఒక ఫిజిషియన్‌ను సంప్రదించండి. -
మెదడు అతి స్పందనతోనే దురద.. గోకుడు!
దురద పుట్టినప్పుడు అక్కడ గోక్కుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదూ. కానీ ఆ తర్వాతే కాసేపటికల్లా మంట పుడుతుంది. కానీ.. అలా గోక్కోవాలి అనిపించడానికి.. మెదడు అతిగా స్పందించడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోక్కుంటున్నప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది గానీ, మరీ ఎక్కువగా గోకితే మాత్రం అక్కడ దురద ఇంకా పెరుగుతుందని, అలాగే నొప్పితో పాటు చర్మం మీద కూడా మచ్చలు పడతాయని ఈ అంశం మీద పరిశోధన చసిన హిడెకి మొచిజుకి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పారు. ఆయన అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌లోని డెర్మటాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. బాగా దురదలు ఎక్కువగా ఉండే కొంతమంది రోగులతో పాటు, పదిమంది ఆరోగ్యవంతులైన వారిని ఈ పరిశోధన కోసం తీసుకున్నారు. వారికి అత్యాధునికమైన ఎఫ్ఎంఆర్ఐ నిర్వహించి చూశారు. దురదలు ఎక్కువగా ఉండి, గోక్కునేటప్పుడు వారికి మెదడులో ఉండే మోటార్ కంట్రోల్, రివార్డ్ ప్రాసెసింగ్ భాగాలు బాగా ఉత్తేజితం అయినట్లు గుర్తించారు. ఇలా అతిగా ఉత్తేజితం కావడం వల్లే గోక్కోవాలని అనిపిస్తుందని తమ పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. వాళ్లకు దురద పుట్టడం కోసం ఈ పరిశోధన సమయంలో దురద గుంట ఆకు ఉపయోగించారు. -
ఎగ్జిమా
ఆయుర్వేద శాస్త్రానుసారం ఎగ్జిమా వ్యాధిని విచర్చికా వ్యాధిగా పిలుస్తారు. ఇది ఒక చర్మవ్యాధి. ఈ వ్యాధి మన శరీరంలో రోగ నిరోధక శక్తి హెచుతగ్గుల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. పెద్దవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అకాల ఆహార విహారాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అజిన్ల వలన జీర్ణశక్తి తగ్గి పిత్తదోషం ప్రకోపించిదీనివలన ఆమము అనే విషపదార్థాలు శరీర కణాల్లో ఏర్పడి చర్మ భాగాన్ని దూషింప జేస్తాయి. ఈ కారణాల వలన విచర్చికా వ్యాధి ప్రారంభమవుతుంది. ఇది 3 రకాలుగా వర్ణిస్తారు. 1. వాత దోష విచర్చికా: చర్మం పొడి బారినట్లు ఉండి, నొప్పి, దురద ఉంటుంది. 2. కఫ దోష విచర్చికా: చర్మం దళసరిగా ఉండి దురద, తేమ కలిగి ఉంటుంది. 3. పిత్త రోష విచర్చికా: మంట, జ్వరం మొదలైన లక్షణాలతో చర్మం చిట్లినట్లు ఉంటుంది. వ్యాధి కారణాలు.. శీతల పదార్థాలు, ఉప్పు, కారం, మసాలాలు, అధిక మోతాదులో కలిగిన పదార్థాలు తీసుకోవటం వలన, నిల్వ ఆహారం తీసుకోవటం, నూనెతో చేసిన పదార్థాలు వాడటం వలన, నిద్రలేమి, ఆలస్యంగా భోజనం చేయటం, ఆల్కహాల్, టీ, కాఫీలు అధికంగా సేవించటం, మలబద్ధకం, అజీర్తి, ఒత్తిడి ఈ వ్యాధికి ముఖ్య కారణాలు. లక్షణాలు: దురద, చర్మం ఎర్రగా ఉండటం, ఎండిన చర్మం, చర్మంపై పొలుసులుగా ఏర్పడటం, వాపు, దురద, చర్మం మందబారటం, పొక్కులుగా ఏర్పడటం మొదలైన లక్షణాలు. తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. నూనె వస్తువులు, మసాలా, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. 2. ఔషధ గుణాలు కల సబ్బులు వాడాలి. 3. రోగి దుస్తులు వేరొకరు వేసుకోరాదు. 4. వేళకు భోజనం చేయాలి. రాత్రి పూట ఎక్కువగా మేల్కొనరాదు. 5. ఒత్తిడి, ఆలోచనలు మానుకోవాలి. 6. చల్లిని గాలిలో, అతి ఎండలో తిరగరాదు. ఆయుర్వేద వైద్యంలో చక్కని ఔషధాలు విచర్చికా వ్యాధికి అందుబాటులో ఉన్నాయి. అనుభవం కలిగిన వైద్యుల సమక్షంలో వ్యాధి నిర్థారణ చేయించుకుని తగిన చికిత్స పొందితే శాశ్వతంగా ఎగ్జిమా వ్యాధిని నివారించుకోవచ్చు. -
వీడెవడండీ బాబూ!
వెండి తెరపై కనిపించే తారలను ‘పిచ్చి’గా ప్రేమించే వార్ని చూశాం. కానీ.. వీడెవడండీ బాబు..! ఇంత తేడాగా ఉన్నాడు..! సెలబ్రిటీలపై ‘చేయి’ చేసుకొని దురద తీర్చుకోవడం ఇతగాడి సరదానట! పేరు విటాలీ సెడూక్. లేటెస్ట్గా ప్యారిస్‌లో ఫ్యాషన్ వీక్‌కు వెళ్లిన రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియాపై తెగబడ్డాడు. ఆమెను గట్టిగా లాగితే... పాపం కింద పడినంత పనైంది. షాక్ నుంచి తేరుకున్న సెక్యూరిటీ.. అతగాడిని పట్టుకుని చితకబాదారు. తీగ లాగితే.. గతంలో లియో డికాప్రియో, బ్రాడ్ పిట్, విల్‌స్మిత్ వంటి సూపర్స్టార్సపై పడినట్టు గొప్పగా చెప్పుకొంటున్నాడట. -
స్ట్రెస్ వల్ల సోరియాసిస్
దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో కనబడుతుంది. మిగిలిన వేసవికాలం, వర్షాకాలంలో ఈ వ్యాధి లక్షణాలు అసలు కనబడకుండాపోతాయి. ఇట్లాంటి సందర్భంలో ఈ వ్యాధి ఉన్న వారు వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని పొరబడే అవకాశం కూడా ఉంది. అయితే దానివల్ల ముందు ముందు ఎంతో ముప్పు ముంచుకొస్తుంది. అసలు వ్యాధి కారణాలు, దాని పరిష్కారమార్గాలపై అవగాహన కలిగిస్తూ, కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా వ్యాధిని మూలం నుంచే నయం చేయవచ్చు. ఇతర విధానాలతో పోల్చితే హోమియో వైద్యవిధానంలో దీనికి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. సోరియాసిస్ రావడానికి కారణాలు వంశపారంపర్యంగా మానసికంగా ఒత్తిడి, ఆందోళన ఉండటం పొడిచర్మం ఉన్నవారిలో కొన్ని రకాల మందుల దుష్పరిణామాల వల్ల స్త్రీలలో పొగతాగే అలవాటు గల వారిలో అధిక బరువు ఉన్నవారిలో బి.పి., డయాబెటిస్ వ్యాధి గల వారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలుంటాయి వాతావరణంలోని మార్పుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సోరియాసిస్ వ్యాధి రకాలు సోరియాసిస్ వల్గారిస్ గటేట్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ వస్ట్యులార్ సోరియాసిస్ పల్మోప్లాంటార్ సోరియాసిస్ సోరియాసిస్ వ్యాధి లక్షణాలు చర్మం మీద చిన్న ఎర్రని మచ్చలాగ మొదలై చర్మం బూడిదరంగులో మారి పొడిబారి పొలుసులలాగ రాలిపోతుండటం విపరీతమైన దురద ఈ మచ్చలు మి.మీ. నుంచి మొదలై కొన్ని సెంటీమీటర్ల వరకూ విస్తరిస్తుంటాయి. తలలో అయితే డాండ్రఫ్ లాగ పెద్ద పెద్ద పొలుసుల రూపంలో రాలిపోతుంటాయి గోరు పసుపురంగులో మారి చర్మం నుండి వేరుపడుతుంది చర్మంపై నున్న పొలుసులను బలవంతంగా లాగినపుడు చిన్నగా రక్తం వస్తుంది. సోరియాసిస్ వలన వచ్చే దుష్పరిణామాలు సోరియాసిస్ వల్ల వచ్చే ఒకే ఒక దుష్పరిణామం కీళ్ళ నొప్పులు. సోరియాసిస్‌తో బాధపడేవారిలో 10 శాతం నుండి 35 శాతం మందిలో ఈ కీళ్ళ నొప్పులు ఉంటాయి. దీనినే ‘‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో చనిపోయిన చర్మకణాలు చర్మం పైపొర ద్వారా బయటకు వెళ్ళకుండా కీళ్ళలో చేరి ఎముకల అరుగుదలకు దోహదపడతాయి. అందువలన కీళ్ళనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ వ్యాధిని గుర్తించడం ఎలా? 1. వ్యాధి లక్షణాలను బట్టి రోగిని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు. 2. చర్మంలోని చిన్న ముక్కను తీసి పరీక్షకు పంపడం ద్వారా తెలుసుకోవచ్చు. సరైన చికిత్సా విధానం హోమియోపతి వైద్య విధానం ద్వారా ఈ సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. హోమియోపతి వైద్య విధానంలో చికిత్స అనేది రోగి శరీరతత్వం, మానసిక స్థితి, వ్యాధి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ‘కాన్స్టిట్యూషనల్ థెరపీ’ అని అంటారు. ఈ విధమైన చికిత్సా విధానం ద్వారా ఏ విధమైన రోగాన్ని అయినా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. డాక్టర్ సృజనారెడ్డి, సీనియర్ డెంటల్ సర్జన్ పాజిటివ్ డెంటల్, హైదరాబాద్.