మా పాపకు 12 ఏళ్లు. ఇంకా పీరియడ్స్ స్టార్ట్ అవలేదు. ఈ మధ్య ప్రైవేట్ పార్ట్స్‌లో ఇచింగ్ మొదలైందని చెబుతోంది. కానీ ఎలాంటీ డిశ్చార్చ్ లేదు. రాత్రిళ్లు చాలా ఇచింగ్‌తో చాలా సఫర్ అవుతోంది. అలా ఎందుకు అవుతోంది? కంట్రోల్ అవడానికి మందులేమైనా ఉన్నాయా?
– పేరు, ఊరు రాయలేదు.
మీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని vulvitis అంటారు. 8–12 ఏళ్ల మధ్య చాలామంది అమ్మాయిలకు ఉంటుంది. ఇది Vulval స్కిన్ అంటే వెజైనా ఔటర్ పార్ట్ పీరియడ్స్ కాకముందు పల్చగా.. సెన్సిటివ్‌గా ఉంటుంది. సబ్బు, క్రీమ్స్, బబుల్ బాత్, షవర్ జెల్స్ ఎక్కువగా వాడితే దురద, మంట ఉంటాయి. Vulval స్కిన్ ఇరిటేట్ అయ్యి ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. మూత్రం చేసేప్పుడు మంటగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే తక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడాలి. గోరువెచ్చని నీటితో ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి. Emollient సోప్స్ వాడటం మంచిది.
వెజైనల్ ఏరియాలో డియోడరెంట్స్, పర్‌ఫ్యూమ్స్ వాడకూడదు. క్లీన్ చేసుకుని తుడుచుకునేప్పుడు ముందు నుంచి వెనక్కి తుడవాలి. దీనికి రివర్స్‌వేలో తుడిస్తే మలద్వారంలోని క్రిములు వెజైనాలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నా ఇచింగ్ తగ్గకపోతే గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. కొన్ని క్రీమ్స్, యాంటీసెప్టిక్ లోషన్స్ ఇస్తారు. కొంతమందికి తక్కువ మోతాదు టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ అవసరమవుతాయి. ఈ కింది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ ఇరిటేషన్ రాకుండా ఉంటుంది.
ఎప్పుడూ గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ గాఢత ఉన్న సబ్బులను వాడకూడదు ∙మెత్తటి, తడి టిష్యూతో శుభ్రం చేసుకోవాలి. అయితే ఆ టిష్యూ వెజైనాలో అతక్కుండా తుడవాలి ∙బబుల్ బాత్ అవాయిడ్ చేయాలి. నీళ్లల్లో షాంపూ, సబ్బు వేసి స్నానం చేయకూడదు. ∙జుట్టు కోసం వాడే షాంపూని స్నానానికి వాడకూడదు. హెడ్ బాత్ చేసేప్పుడు ఆ షాంపూ నీళ్లు కూడా ఒంటి మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. వీలైతే వాష్‌బేసిన్‌లో హెడ్ బాత్ చేయించడం మంచిది.
లేదంటే స్నానం అయిపోయాక హెయిర్ వాష్ చేయించండి ∙స్నానం చేశాక యూరిన్‌కి వెళ్లమని చెప్పండి. సోప్ ఏదైనా యూరిన్ ప్రాంతంలో ఉంటే వాష్ చేసుకోమని చెప్పాలి ∙పదినిమిషాల కన్నా ఎక్కువసేపు స్నానం చేయనివ్వకండి. ఒంటి మీద నీళ్లు ఎక్కువసేపు ఉంటే స్కిన్ ఇరిటేషన్ పెరుగుతుంది ∙కాటన్ అండర్‌వేర్ మాత్రమే వాడాలి. పాలిస్టర్, నైలాన్ అస్సలు వాడకూడదు ∙కాన్‌సన్‌ట్రేటెడ్ యూరిన్ వస్తే vulval స్కిన్ ఇరిటేషన్ పెరుగుతుంది. అందుకే తగినన్ని మంచినీళ్లు తాగమని చెప్పండి ∙స్విమ్ చేయవచ్చు. కాని స్విమ్‌కి ముందు తరువాత ఏదైనా Emollient క్రీమ్‌ని vulval స్కిన్‌కి అప్లయ్‌చేయాలి.
డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?)
Comments
Please login to add a commentAdd a comment