Vaginal Discharge
-
వెజైనల్ డిశ్చార్జ్.. ఇన్ఫెక్షన్ల ముప్పును తప్పించుకోవాలంటే..
నాకిప్పుడు 40 ఏళ్లు. అయిదేళ్లుగా వెజైనల్ డిశ్చార్జ్‌తో సఫర్ అవుతున్నాను. చాలా యాంటీబయాటిక్స్ వాడాను. అయినా రిజల్ట్ లేదు. ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉందా? ప్రయత్నించొచ్చా?– పి. మైథిలి, హైదరాబాద్35 ఏళ్ల వయసు దాటిన వారిలో హార్మోన్ చేంజెస్‌తో సర్విక్స్‌లో చాలా మార్పులు వస్తాయి. చాలాకాలంగా వైట్ డిశ్చార్జ్ అవుతూంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని నిర్ధారించుకోవడానికి ముందుగా వెజైనల్ స్వాబ్స్, యూరినరీ ఏరియా స్వాబ్స్, ర క్త పరీక్షలు, పాప్ స్మియర్ వంటి టెస్ట్‌లు చేయించుకోవాలి. వీటిలో ఏ సమస్యా లేదని తేలితే సర్విక్స్‌లోని మార్పులే కారణమనుకోవచ్చు. ఏ ఇన్ఫెక్షన్ లేకపోతే క్రయోకాటరీ అనే పద్ధతిని ఫాలో కావచ్చు. కొంతమందికి ఇది బాగా పనిచేస్తుంది. సర్వైకల్ ఎక్ట్రోపియన్కిచ్చే ట్రీట్మెంట్ ఇది. సర్వైకల్ ఎక్ట్రోపియన్ అంటే సాధారణంగా సర్విక్స్ లోపల ఉండే కణాలు సర్విక్స్ పైన కనిపించడం. కొలనోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా సర్విక్స్‌లో కొంత డై స్టెయిన్ చేసి కెమెరా ద్వారా చెక్ చేసి చిన్న బయాప్సీ తీసి టెస్ట్‌కి పంపిస్తారు. ఈ రిపోర్ట్ నార్మల్‌గా ఉంటే సర్విక్స్‌లో ఏ ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన మార్పులు లేవని అర్థం. కొలనోస్కోపీ ప్రొసీజర్‌ను కూడా పాప్ స్మియర్లాగే అవుట్ పేషంట్ విభాగంలోనే చేస్తారు. దీనికి అరగంట సమయం పడుతుంది. ఆ రిపోర్ట్ వచ్చాక క్రయోకాటరీ ప్లాన్ చేస్తారు. క్రయోకాటరీలో.. క్రయోప్రోబ్ అనే పరికరం ద్వారా సర్విక్స్‌లోకి ఎనర్జీ సోర్స్‌ను పంపించి, సర్విక్స్ పైన లేయర్ సెల్స్ అన్నింటినీ ఫ్రీజ్ అండ్ డిస్ట్రాయ్ చేస్తారు. అప్పుడు కొత్త, ఆరోగ్యకరమైన సెల్స్ తయారవుతాయి. ఈ ప్రక్రియలో ఫ్రీజింగ్ మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను అవుట్ పేషంట్ విభాగంలోనే చేస్తారు. దీనికీ అరగంట సమయం పడుతుంది. పెయిన్‌కి పారాసిటమాల్ తీసుకోవచ్చు. చాలాకాలంగా అవుతున్న వైట్ డిశ్చార్జ్కిది మంచి ట్రీట్మెంట్. ఈ ప్రక్రియ తర్వాత రొటీన్‌గా అన్ని పనులూ చేసుకోవచ్చు. అయితే ఒక నెల రోజులు వాటర్ డిశ్చార్జ్‌కి ప్యాడ్స్ వాడాలి. ఇంటర్‌కోర్స్, స్విమింగ్కు ఒక నెల దూరంగా ఉండాలి. నెల పాటు హెవీ ఎక్సర్సైజెస్ కూడా చేయకూడదు. -
మా పాపకు పీరియడ్స్ ఇంకా రాలేదు! కానీ ఆమెకు అలా అవుతోంది..
మా పాపకు 12 ఏళ్లు. ఇంకా పీరియడ్స్ స్టార్ట్ అవలేదు. ఈ మధ్య ప్రైవేట్ పార్ట్స్‌లో ఇచింగ్ మొదలైందని చెబుతోంది. కానీ ఎలాంటీ డిశ్చార్చ్ లేదు. రాత్రిళ్లు చాలా ఇచింగ్తో చాలా సఫర్ అవుతోంది. అలా ఎందుకు అవుతోంది? కంట్రోల్ అవడానికి మందులేమైనా ఉన్నాయా? – పేరు, ఊరు రాయలేదు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని vulvitis అంటారు. 8–12 ఏళ్ల మధ్య చాలామంది అమ్మాయిలకు ఉంటుంది. ఇది Vulval స్కిన్ అంటే వెజైనా ఔటర్ పార్ట్ పీరియడ్స్ కాకముందు పల్చగా.. సెన్సిటివ్‌గా ఉంటుంది. సబ్బు, క్రీమ్స్, బబుల్ బాత్, షవర్ జెల్స్ ఎక్కువగా వాడితే దురద, మంట ఉంటాయి. Vulval స్కిన్ ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. మూత్రం చేసేప్పుడు మంటగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే తక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడాలి. గోరువెచ్చని నీటితో ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి. Emollient సోప్స్ వాడటం మంచిది. వెజైనల్ ఏరియాలో డియోడరెంట్స్, పర్ఫ్యూమ్స్ వాడకూడదు. క్లీన్ చేసుకుని తుడుచుకునేప్పుడు ముందు నుంచి వెనక్కి తుడవాలి. దీనికి రివర్స్వేలో తుడిస్తే మలద్వారంలోని క్రిములు వెజైనాలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నా ఇచింగ్ తగ్గకపోతే గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. కొన్ని క్రీమ్స్, యాంటీసెప్టిక్ లోషన్స్ ఇస్తారు. కొంతమందికి తక్కువ మోతాదు టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ అవసరమవుతాయి. ఈ కింది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ ఇరిటేషన్ రాకుండా ఉంటుంది. ఎప్పుడూ గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ గాఢత ఉన్న సబ్బులను వాడకూడదు ∙మెత్తటి, తడి టిష్యూతో శుభ్రం చేసుకోవాలి. అయితే ఆ టిష్యూ వెజైనాలో అతక్కుండా తుడవాలి ∙బబుల్ బాత్ అవాయిడ్ చేయాలి. నీళ్లల్లో షాంపూ, సబ్బు వేసి స్నానం చేయకూడదు. ∙జుట్టు కోసం వాడే షాంపూని స్నానానికి వాడకూడదు. హెడ్ బాత్ చేసేప్పుడు ఆ షాంపూ నీళ్లు కూడా ఒంటి మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. వీలైతే వాష్బేసిన్లో హెడ్ బాత్ చేయించడం మంచిది. లేదంటే స్నానం అయిపోయాక హెయిర్ వాష్ చేయించండి ∙స్నానం చేశాక యూరిన్‌కి వెళ్లమని చెప్పండి. సోప్ ఏదైనా యూరిన్ ప్రాంతంలో ఉంటే వాష్ చేసుకోమని చెప్పాలి ∙పదినిమిషాల కన్నా ఎక్కువసేపు స్నానం చేయనివ్వకండి. ఒంటి మీద నీళ్లు ఎక్కువసేపు ఉంటే స్కిన్ ఇరిటేషన్ పెరుగుతుంది ∙కాటన్ అండర్వేర్ మాత్రమే వాడాలి. పాలిస్టర్, నైలాన్ అస్సలు వాడకూడదు ∙కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తే vulval స్కిన్ ఇరిటేషన్ పెరుగుతుంది. అందుకే తగినన్ని మంచినీళ్లు తాగమని చెప్పండి ∙స్విమ్ చేయవచ్చు. కాని స్విమ్కి ముందు తరువాత ఏదైనా Emollient క్రీమ్‌ని vulval స్కిన్‌కి అప్లయ్చేయాలి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?) -
నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?
నాకు నాలుగు నెలల పాప. అంత చంటిపిల్లకు అప్పుడప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతోంది. నేను భయపడుతుంటే మా ఇంట్లో పెద్దవాళ్లేమో ‘మరేం పర్లేదు .. అలా అవడం సహజమే’ అని తేలిగ్గా తీసుకుంటున్నారు. నిజంగా పర్లేదా? అది సహజమేనా? – పేరు, ఊరు వివరాలు రాయలేదు. వైట్ కలర్ లేదా బ్లడ్ టైప్ వెజైనల్ డిశ్చార్జ్ పది రోజుల వయసు నుంచి ఆరు నెలల వయసు గల ఆడపిల్లల్లో చాలా నార్మల్. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంలో ఉండి.. పుట్టిన తరువాత ఒక్కసారిగా ఆ హార్మోన్ ప్రభావం నుంచి బయటపడ్డంతో ఇలా విత్‌డ్రాయల్ బ్లీడ్ లేదా డిశ్చార్జ్ కనపడవచ్చు. ఇది పుట్టినప్పటి నుంచి ఆరునెలల దాకా ఉండొచ్చు. మూడు నాలుగు రోజుల్లోనే తగ్గిపోతుంది. క్లియర్‌గా.. స్మెల్ లేని వైట్ డిశ్చార్జ్ ఆడపిల్లల్లో ఎప్పుడైనా కనపడొచ్చు. అయితే ఇన్ఫెక్షన్ గనుక ఉంటే రెడ్నెస్, బ్యాడ్ స్మెల్, యెల్లో లేదా గ్రీన్‌కలర్ వెజైనల్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. దగ్గు, జలుబుకు ఎక్కువసార్లు యాంటీబయాటిక్స్ వాడితే వాటితో వెజైనాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సబ్బుతో స్నానం, టాల్కంపౌడర్స్, డియోడరెంట్ పెర్ఫ్యూమ్స్ వంటివాటి వల్లా.. పిల్లల ఇన్నర్‌వేర్ నుంచీ ఇరిటేషన్ రావచ్చు. అందుకే మైల్డ్ క్లెన్సర్స్తో.. గోరువెచ్చని నీటిలో క్లీన్ చెయ్యాలి. పాపకు స్నానం చేయించాక వెట్ క్లాత్‌తో వెజైనల్ ఏరియాను ముందు నుంచి వెనుకగా తుడవాలి. ఔ్చbజ్చీ కింద డైపర్కి సంబంధించిందేమైనా ఉండిపోయి.. అది వైట్ డిశ్చార్జ్‌గా కనిపించవచ్చు. అందుకే అక్కడ శుభ్రంగా తుడవాలి. స్క్రబ్ చేయకూడదు. మెత్తటి తడి గుడ్డతోనే అదీ ముందు నుంచి వెనుకగా శుభ్రం చేయాలి. ఒక్కోసారి ఫారిన్ బాడీ ఏదైనా పొరపాటున వెజైనాలో ఉంటే కూడా తెల్లబట్ట అవుతూ ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్/ పీడియాట్రీషన్ని సంప్రదించడం మంచిది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!)