నాకిప్పుడు 40 ఏళ్లు. అయిదేళ్లుగా వెజైనల్ డిశ్చార్జ్‌తో సఫర్ అవుతున్నాను. చాలా యాంటీబయాటిక్స్ వాడాను. అయినా రిజల్ట్ లేదు. ఇంకేదైనా ట్రీట్‌మెంట్ ఉందా? ప్రయత్నించొచ్చా?
– పి. మైథిలి, హైదరాబాద్
35 ఏళ్ల వయసు దాటిన వారిలో హార్మోన్ చేంజెస్‌తో సర్విక్స్‌లో చాలా మార్పులు వస్తాయి. చాలాకాలంగా వైట్ డిశ్చార్జ్ అవుతూంటే ఇన్‌ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని నిర్ధారించుకోవడానికి ముందుగా వెజైనల్ స్వాబ్స్, యూరినరీ ఏరియా స్వాబ్స్, ర క్త పరీక్షలు, పాప్ స్మియర్ వంటి టెస్ట్‌లు చేయించుకోవాలి. వీటిలో ఏ సమస్యా లేదని తేలితే సర్విక్స్‌లోని మార్పులే కారణమనుకోవచ్చు. ఏ ఇన్‌ఫెక్షన్ లేకపోతే క్రయోకాటరీ అనే పద్ధతిని ఫాలో కావచ్చు. కొంతమందికి ఇది బాగా పనిచేస్తుంది.
సర్వైకల్ ఎక్ట్రోపియన్‌కిచ్చే ట్రీట్‌మెంట్ ఇది. సర్వైకల్ ఎక్ట్రోపియన్ అంటే సాధారణంగా సర్విక్స్ లోపల ఉండే కణాలు సర్విక్స్ పైన కనిపించడం. కొలనోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా సర్విక్స్‌లో కొంత డై స్టెయిన్ చేసి కెమెరా ద్వారా చెక్ చేసి చిన్న బయాప్సీ తీసి టెస్ట్‌కి పంపిస్తారు. ఈ రిపోర్ట్ నార్మల్‌గా ఉంటే సర్విక్స్‌లో ఏ ఇన్‌ఫెక్షన్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన మార్పులు లేవని అర్థం. కొలనోస్కోపీ ప్రొసీజర్‌ను కూడా పాప్ స్మియర్‌లాగే అవుట్ పేషంట్ విభాగంలోనే చేస్తారు. దీనికి అరగంట సమయం పడుతుంది.
ఆ రిపోర్ట్ వచ్చాక క్రయోకాటరీ ప్లాన్ చేస్తారు. క్రయోకాటరీలో.. క్రయోప్రోబ్ అనే పరికరం ద్వారా సర్విక్స్‌లోకి ఎనర్జీ సోర్స్‌ను పంపించి, సర్విక్స్ పైన లేయర్ సెల్స్ అన్నింటినీ ఫ్రీజ్ అండ్ డిస్ట్రాయ్ చేస్తారు. అప్పుడు కొత్త, ఆరోగ్యకరమైన సెల్స్ తయారవుతాయి. ఈ ప్రక్రియలో ఫ్రీజింగ్ మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను అవుట్ పేషంట్ విభాగంలోనే చేస్తారు. దీనికీ అరగంట సమయం పడుతుంది. పెయిన్‌కి పారాసిటమాల్ తీసుకోవచ్చు. చాలాకాలంగా అవుతున్న వైట్ డిశ్చార్జ్‌కిది మంచి ట్రీట్‌మెంట్. ఈ ప్రక్రియ తర్వాత రొటీన్‌గా అన్ని పనులూ చేసుకోవచ్చు. అయితే ఒక నెల రోజులు వాటర్ డిశ్చార్జ్‌కి ప్యాడ్స్ వాడాలి. ఇంటర్‌కోర్స్, స్విమింగ్‌కు ఒక నెల దూరంగా ఉండాలి. నెల పాటు హెవీ ఎక్సర్‌సైజెస్ కూడా చేయకూడదు.
Comments
Please login to add a commentAdd a comment