infection
-
ఇన్ఫెక్షన్: సెల్యు'లైట్' తీసుకోకండి..!
ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మానికి సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్పై అవగాహన కోసం ఈ కథనం.సెల్యులైటిస్ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్తో కూడిన సెల్యులైటిస్‌ను తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్‌లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... సెల్యులైటిస్ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్‌కు దారితీయవచ్చు. ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. సెల్యులైటిస్‌లో ఎలా వస్తుందంటే?వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది.చర్మం రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ అనిపిస్తుంటుంది. ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్‌కు తావిచ్చే కండిషన్స్చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్ ఫూట్ వంటివి). ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉందాహరణకు చికెన్‌పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్ ఉన్నవారిలో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్ వెయిన్స్ వంటివి). పెరిఫెరల్ వ్యాస్క్యులార్ డిసీజ్ వంటి జబ్బుల కారణంగా. శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్‌కు అవకాశాలెక్కువ). స్థూలకాయం ఉన్నవారిలో. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్ రావచ్చు. ఒకసారి సెల్యులైటిస్ సోకాక...ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్‌కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్‌లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్‌కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు.సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇలా జరుగుతుంది. సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్‌గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్ సెల్యులైటిస్ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. చికిత్స యాంటీబయాటిక్స్‌తో చికిత్స స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.వ్యాయామం (ఫిజియోథెరపీ) వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. కొన్ని జాగ్రత్తలుసెల్యులైటిస్ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం. గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం. కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్‌ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్తోపాటు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం వేరికోస్ వెయిన్స్ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం. చివరగా... సెల్యులైటిస్ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్డా.జి. వెంకటేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ – కాస్మటిక్ సర్జన్ (చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
వెజైనల్ డిశ్చార్జ్.. ఇన్ఫెక్షన్ల ముప్పును తప్పించుకోవాలంటే..
నాకిప్పుడు 40 ఏళ్లు. అయిదేళ్లుగా వెజైనల్ డిశ్చార్జ్‌తో సఫర్ అవుతున్నాను. చాలా యాంటీబయాటిక్స్ వాడాను. అయినా రిజల్ట్ లేదు. ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉందా? ప్రయత్నించొచ్చా?– పి. మైథిలి, హైదరాబాద్35 ఏళ్ల వయసు దాటిన వారిలో హార్మోన్ చేంజెస్‌తో సర్విక్స్‌లో చాలా మార్పులు వస్తాయి. చాలాకాలంగా వైట్ డిశ్చార్జ్ అవుతూంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని నిర్ధారించుకోవడానికి ముందుగా వెజైనల్ స్వాబ్స్, యూరినరీ ఏరియా స్వాబ్స్, ర క్త పరీక్షలు, పాప్ స్మియర్ వంటి టెస్ట్‌లు చేయించుకోవాలి. వీటిలో ఏ సమస్యా లేదని తేలితే సర్విక్స్‌లోని మార్పులే కారణమనుకోవచ్చు. ఏ ఇన్ఫెక్షన్ లేకపోతే క్రయోకాటరీ అనే పద్ధతిని ఫాలో కావచ్చు. కొంతమందికి ఇది బాగా పనిచేస్తుంది. సర్వైకల్ ఎక్ట్రోపియన్కిచ్చే ట్రీట్మెంట్ ఇది. సర్వైకల్ ఎక్ట్రోపియన్ అంటే సాధారణంగా సర్విక్స్ లోపల ఉండే కణాలు సర్విక్స్ పైన కనిపించడం. కొలనోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా సర్విక్స్‌లో కొంత డై స్టెయిన్ చేసి కెమెరా ద్వారా చెక్ చేసి చిన్న బయాప్సీ తీసి టెస్ట్‌కి పంపిస్తారు. ఈ రిపోర్ట్ నార్మల్‌గా ఉంటే సర్విక్స్‌లో ఏ ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన మార్పులు లేవని అర్థం. కొలనోస్కోపీ ప్రొసీజర్‌ను కూడా పాప్ స్మియర్లాగే అవుట్ పేషంట్ విభాగంలోనే చేస్తారు. దీనికి అరగంట సమయం పడుతుంది. ఆ రిపోర్ట్ వచ్చాక క్రయోకాటరీ ప్లాన్ చేస్తారు. క్రయోకాటరీలో.. క్రయోప్రోబ్ అనే పరికరం ద్వారా సర్విక్స్‌లోకి ఎనర్జీ సోర్స్‌ను పంపించి, సర్విక్స్ పైన లేయర్ సెల్స్ అన్నింటినీ ఫ్రీజ్ అండ్ డిస్ట్రాయ్ చేస్తారు. అప్పుడు కొత్త, ఆరోగ్యకరమైన సెల్స్ తయారవుతాయి. ఈ ప్రక్రియలో ఫ్రీజింగ్ మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను అవుట్ పేషంట్ విభాగంలోనే చేస్తారు. దీనికీ అరగంట సమయం పడుతుంది. పెయిన్‌కి పారాసిటమాల్ తీసుకోవచ్చు. చాలాకాలంగా అవుతున్న వైట్ డిశ్చార్జ్కిది మంచి ట్రీట్మెంట్. ఈ ప్రక్రియ తర్వాత రొటీన్‌గా అన్ని పనులూ చేసుకోవచ్చు. అయితే ఒక నెల రోజులు వాటర్ డిశ్చార్జ్‌కి ప్యాడ్స్ వాడాలి. ఇంటర్‌కోర్స్, స్విమింగ్కు ఒక నెల దూరంగా ఉండాలి. నెల పాటు హెవీ ఎక్సర్సైజెస్ కూడా చేయకూడదు. -
Intips: ఈ పదార్థాలకు పురుగు పట్టకుండా.. ఇలా చేయండి!
బియ్యం, గోధుమపిండి, కంది, పెసర, మినప్పప్పు లాంటì వాటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, చిన్న చిన్న కీటకాలు చేరుతాయి. వీటిని తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు, కొన్నిసార్లు అలర్జీలు కూడా రావచ్చు. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు.ఎండు వెల్లుల్లి రెబ్బలు..పప్పు, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే, అందులో కొన్ని ఎండు వెల్లుల్లి రెబ్బలు కలపాలి. వెల్లుల్లి నుంచి వెలువడే గాఢమైన వాసన వల్ల పురుగులు పప్పు, బియ్యం గింజల వైపు రాలేవు.వాము కలపడం..బియ్యం డబ్బా లేదా బస్తాలో కాస్తంత వాము వేస్తే, అందులో పురుగులు పట్టవు. ఎందుకంటే వాము వాసన కూడా పురుగులకు పడదు.ఎండు మిరపకాయలు..బియ్యం లేదా గోధుమలు నిల్వ చేసేటప్పుడు, కాసిని ఎండు మిరపకాయలు ఉంచితే, పురుగు పట్టకుండా చాలాకాలం పాటు తాజాగా ఉంటాయి.వేపాకులు..వేపాకులకు ఉండే చేదు గుణం, ఘాటైన వాసన వల్ల పురుగులు దూరంగా ఉంటాయి. అందుకే, బియ్యం నిల్వ చేసే పాత్రలో కొన్ని వేపాకులు వేస్తే పురుగులు పట్టవు.మిరియాలు..బియ్యం నిల్వచేసే డబ్బాల్లో కొన్ని మిరియాలు వేస్తే, అందులో పురుగులు పట్టవు. మిరియాల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. వీటిని గోధుమల్లో కలిపి, వాటికి కూడా పురుగులు పట్టకుండా జాగ్రత్త పడొచ్చు.లవంగాలు..లవంగాల ఘాటు వాసనను పురుగులు, కీటకాలు భరించలేవు. అందుకే, బియ్యం నిల్వ ఉంచే పాత్రలో కాసిని లవంగాలు వేయాలి. లవంగ నూనె కూడా కీటకాలను దూరం చేస్తుంది.ఇవి చదవండి: ఇవి.. సహజసిద్ధ'మండి'! -
పదేళ్లుగా ఆ అమ్మాయి అలానే మాంసం తినడంతో..!
మాంసాహారులు చేపలు, కోడి, మటన్ వంటివి తినేటప్పుడు పరిశుభ్రత పాటించాలి. అలాగే బాగా ఉడికించి తినాలి లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే ఒక అమ్మాయి పదేళ్లుగా పచ్చి మాంసమే తిని భయానక వ్యాధిని బారిన పడింది. పచ్చి మాంసం తింటేనే ఆ వ్యాధి బారిన పడతారని వైద్యుల చెబుతున్నారు. ఇంతకీ ఆ యువతికి వచ్చిన వ్యాధేంటీ? పచ్చి మాంస వల్లనే వచ్చిందా..?అసలేం జరిగిందంటే..చైనాలోని డెకిన్ కౌంటీ యుబెంగ్ విలేజ్‌కు చెందిన యువతికి పచ్చి మాంసం తినే అలవాటు ఉంది. పదేళ్లుగా పంది మాంసాన్ని పచ్చిగానే తినేదట. దీని కారణంగా ఆమె అనారోగ్యం బారినపడి ఇబ్బందిపడింది. ఒక్క నిమిషం కూడా స్థిమితంగా ఉండలేని విధంగా ఉంది. చూడటానికి పైకి బాగానే ఉన్న ఏదో నిస్సత్తువ అవగాస్తున్నట్లుగా ఉండేది. దీంతో వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షలు నిర్వహించి సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి బారిన పడినట్లు నిర్థారించారు. అంతేగాదు వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ నిర్వహించి చూడగా.. ఆమె శరీరంలోని ఉన్న పరాన్నజీవుల సంఖ్యను చూసి కంగుతిన్నారు. ఆ యువతి శరీర భాగాలన్నింటిలో కళ్లు, కాళ్లు, చేతులు విడిచిపెట్టకుండా ఎక్కడపడితే అక్కడ టేప్‌వార్మ్ గుడ్లతో నిండి ఉండటాన్ని చూసి విస్తుపోయారు. దీంతో ఆమె ఆహారపు శైలి గురించి ప్రశ్నించగా తనకు యుక్త వయసు నుంచి పచ్చి పంది మాంసం తినే అలవాటు ఉందని వెల్లడయ్యింది. ఇలా పచ్చిమాంసం తింటేనే భయానకమైన సిస్టిసెర్కోసిస్ అనే వ్యాధి బారినపడతారని అన్నారు వైద్యులు. ఈ వ్యాధి శరీరంలోని ఏ భాగానికైనా వస్తుందని అన్నారు. దీని కారణంగా ఉబ్బిన కళ్లు, రెటీనా నుంచి రక్తం, మూర్చ, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల ఎదర్కొంటారని చెప్పారు. అంతేగాదు దీని ప్రభావం మెదడుపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పరిస్థితి విషమిస్తే మరణం కూడా సంభవిస్తుందని చెప్పుకొచ్చారు. అలాకాకుండా శరీరంలోకి చేరిన ఈ పరాన్నజీవులు చనిపోతే ఇన్ఫ్లమేటరీ సమస్యలు, తీవ్రమైన అలెర్జీ లాంటి సమస్యలు వస్తాయన్నారు. ఇలా సిస్టిసెర్కోసిస్ బారినపడి ఏడాదికి ఐదు వేలకు పైగా మరణిస్తున్నట్లు వెల్లడించారు న్యూరాలజీ విభాగానికి చెందిన చీఫ్ ఫిజిషియన్ ప్రొఫెసర్ మెంగ్ కియాంగ్ వైద్యులు.(చదవండి: 'స్లీప్‌మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?) -
గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అయితే.. ఏం చేయాలి?
నేను డెలివరీ అయ్యి రెండు వారాలు అవుతోంది. 102 ఫీవర్‌తో హాస్పిటల్లో మళ్లీ అడ్మిట్ అయ్యాను. గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఇది రాకుండా నేను ఎలా జాగ్రత్తపడాల్సిందో తెలీలేదు. నా హెల్త్ కండిషన్ నాకేం అర్థంకావడం లేదండీ..! – వి. మయూరి, కరీంనగర్ప్రసవం అయిన ఆరువారాల్లోపు వచ్చే గర్భసంచి ఇన్ఫెక్షన్ని ఎండోమెట్రైటిస్ అంటారు. సిజేరియన్ తర్వాత దీని రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జ్వరం, పొట్టలో నొప్పి, అధిక రక్తస్రావం ఉంటాయి. వెంటనే యాంటీబయాటిక్స్ ఇస్తే త్వరగా తగ్గిపోతుంది. డెలివరీ ప్రాసెస్‌లో గర్భసంచిలోకి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వెళ్లి ఈ ఇన్ఫెక్షన్కి కారణమవుతాయి. చాలామందిలో రెండు నుంచి పదిరోజుల మధ్య జ్వరం కనిపిస్తుంది.వందలో ఒకరికి ఈ పోస్ట్‌పార్టమ్ ఎండోమెట్రైటిస్ వస్తుంది. వెజైనల్ డెలివరీలో, సిజేరియన్ అయిన వారిలో వందలో ఇరవై మందికి ఇది వస్తుంది. ఉమ్మనీరు ముందుగా పోయిన వారిలో, ప్లెసెంటా ్చఛీజ్ఛిట్ఛn్టగా ఉన్నవారిలో, ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో, ఒబేసిటీ, డయాబెటిస్, రక్తహీనత ఉన్నా, నొప్పులతో ప్రసవం మరీ ఆలస్యం అయినా పోస్ట్‌పార్టమ్ ఎండోమెట్రైటిస్ రిస్క్ పెరుగుతుంది.ఈ కండిషన్లో ప్రసవం తర్వాత బ్లీడింగ్ తగ్గుముఖం పట్టాల్సింది పోయి హఠాత్తుగా హెవీగా అవుతుంది క్లాట్స్‌తో. వెజైనా నుంచి దుర్వాసన వస్తుంది. మూత్రంలో మంట ఉంటుంది. ఈ లక్షణాలు మీకున్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి వెంటనే యాంటిబయాటిక్స్ ఇస్తారు. యూరిన్ ఏరియా, వెజైనా ఏరియా నుంచి స్వాబ్ తీస్తారు. వెజైనాలో పెట్టుకునే యాంటీబయాటిక్స్ని సూచిస్తారు.డాక్టర్ దగ్గరకి ఆలస్యంగా వెళ్లినా, సరైన చికిత్స అందకపోయినా ఇన్ఫెక్షన్ యూటరస్ నుంచి పెల్విస్కి వ్యాపిస్తుంది. దాన్ని సెప్సిస్ అంటాము. ఇది శరీరమంతా స్ప్రెడ్ కాకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. సిజేరియన్ కుట్లకి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇది ఇంత ప్రమాదం కాబట్టి సిజేరియన్‌కి ముందు యాంటీబయాటిక్స్ ఒక డోస్ ఇస్తారు. వెజైనాని యాంటీసెప్టిక్ లోషన్‌తో క్లీన్ చేస్తారు. ఈ యాంటీబయాటిక్స్ మీకు యూటరస్, యూరినరీ ట్రాక్ట్, వూండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: మౌత్ అల్సర్‌తో.. పుట్టబోయే బిడ్డకేమైనా ప్రమాదమా? -
భారత్‌లో బ్రెయిన్-ఈటింగ్ డిసీజ్ కలకలం
భారత్‌లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ కలకలం రేగింది. మెదడును తినే అమీబా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్‌కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)అని పిలుస్తారు.ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరినప్పుడు, నాలుగు రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ నలుగురు మరణించారు. అయితే.. దీనికి ముందు కూడా మన దేశంలోని వివిధ ఆసుపత్రులలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి బారినపడి కేరళ, హర్యానా, చండీగఢ్‌లలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. వీటిలో ఆరు మరణాలు 2021 తర్వాత నమోదయ్యాయి. కేరళలో మొదటి కేసు 2016లో వెలుగులోకి వచ్చింది.అప్రమత్తమైన కేరళ ప్రభుత్వంఅమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ నివారణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ కూడా మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని, చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున వారు నీటి వనరులలోకి ప్రవేశించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ చేసే సమయంలో నోస్ క్లిప్‌లను ఉపయోగించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ వేణు, ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజన్ ఖోబ్రగాడే తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడినా.. ఇన్ఫెక్షన్స్ వస్తాయా?
సాధారణ వెజైనల్ డిశ్చార్జ్‌కి ఈస్ట్ ఇన్ఫెక్షన్కి తేడా ఏంటో చెప్తారా? – ఆలూరి సుష్మారెడ్డి, ఖానాపూర్వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్‌గా కూడా ఉంటుంది. ఇది నెలసరి సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా నెల మధ్యలో అండాల విడుదల సమయానికి తీగలాగా తెలుపు అవుతుంది. ఇది రెండు నుంచి అయిదు రోజులు అవుతుంది. నెలసరికి ముందు రెండు నుంచి అయిదు రోజుల వరకు థిక్‌గా ఈ వైట్ డిశ్చార్చ్ అవుతుంది.ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి థిక్‌గా, లైట్‌గా, నీళ్లలా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ఈ డిశ్చార్జెస్ ఏవీ రంగు, వాసన ఉండవు. దురద, మంట, ఎరుపెక్కడం వంటివీ ఉండవు. జ్వరం రాదు. వీటినే నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అంటారు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లో చాలా వరకు వెజైనాలో దురద, మంట, దుర్వాసన, దద్దుర్లు, మూత్ర విసర్జనప్పుడు నొప్పి, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి. డిశ్చార్జ్.. పెరుగులా, థిక్‌గా, గ్రీన్, యెల్లో కలర్స్‌లో ఉంటుంది.తొడల మీద కూడా దద్దుర్లు వస్తాయి. అయితే ఇది లైంగిక వ్యాధి కాదు. ఏడాదిలో మూడు సార్లకన్నా ఎక్కువగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని రికరెంట్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. దీనికి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వెజైనాలో సహజంగా ఉండే బ్యాలెన్స్ తప్పినప్పుడు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడినా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యాంటీఫంగల్ క్రీమ్స్, జెల్స్, టాబ్లెట్స్‌తో ఈ ఇన్ఫెక్షన్కు చికిత్సను అందిస్తారు. కొన్నిసార్లు వెజైనల్ స్వాబ్ అనే చిన్న స్మియర్ టెస్ట్ చేసి ఈస్ట్ ఇన్ఫెక్షన్ను నిర్ధారిస్తారు. పెల్విక్ పరీక్ష చేసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. – డా భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?
సౌదీ అరేబియా రాజు సల్మాన్ తీవ్ర స్వస్థతకు గురయ్యారు. జెడ్డాలోని అల్ సలామ్ ప్యాలెస్‌లోని రాయల్ క్లినిక్ సల్మాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతున్నారని, తొందరలోనే కోలుకుంటారని పేర్కొంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే..ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా పరాన్నజీవులు, శ్వాసనాళాలు లేదా ఊపిరితిత్తుల కణజాలాలకు వాపు, హాని కలిగించే పరిస్థితి. ఈ పరిస్థితి కారణంగా ఒకటి లేదా రెండ ఊపిరితిత్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సంకేతాలు ఎంలా ఉంటాంటే..లక్షణాలు..దగ్గు..ఎడతెరిపి లేని దగ్గు ఊపిరితిత్తుల సంక్రమణకు సంకేతం. అలాగే స్పష్టంగా పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే శ్లేష్మం, జ్వరం. సాధారణంగా అయితే అధిక జ్వరం కనిపిస్తుంది.శ్వాస ఆడకపోవుట..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా..ఊపిరితిత్తుల్లో వాపు, ద్రవం పేరుపోవడానికి కారణమవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఛాతి నొప్పి..ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్లో కూడా ఛాతీలో తీవ్ర నొప్పి కలుగుతుంది. ప్రత్యేకించి లోతైన శ్వాస తీసుకున్నా..దగ్గు తీసుకున్నా..ఛాతీలో పదునైన కత్తిపోటులా నొప్పిగా ఉంటుంది. అలసట..విపరీతంగా అలసిపోయినట్లు ఉండొచ్చు. గురకఇరుకైన వాయుమార్గాల కారణంగా ఊపిరి పీల్చుకునేటప్పుడు పెద్దగా శబ్దం రాడం. ఇది శ్లేష్మంగా కారణంగా ఏర్పడే వాపు లేదా అడ్డంకికి సంకేతం.వేగవంతమైన శ్వాసశరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు ప్రతిస్పందించినప్పుడూ జరుగుతుంది.గందరగోళం..ఇది ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తుంది.ఆకలి నష్టం..అనారోగ్యంతో పోరాడటానికి శరీరానికి తగినంత శక్తి అవసరం కానీ ఈ ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్ ఆకలిని తగ్గించేస్తుంది.వికారం వాంతులు..కొంతమందిలో లేదా పిల్లలకు వికారం, వాంతులు, అతిసారం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.ఎందువల్ల వస్తుందంటే..బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు..స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, మైకోప్లాస్మా న్యుమోనియా వంటివి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు ప్రాథమిక కారణాలు. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు, ద్రవం చేరడం వంటివి జరుగుతాయి.వైరల్ ఇన్ఫెక్షన్లు..సార్స్ కోవీ-2తో సహా ఇన్ఫ్లు ఎంజా వైరస్లు, కరోనా వైరస్లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు. ఈ అంటువ్యాధులు తరుచుగా దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లుపర్యావరణంలో శిలీంధ్ర బీజాంశాలను పీల్చడం వల్ల ఈ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో తలెత్తుంది. బలహీన రోగ నిరోధక వ్యవస్థ..హెచ్ఐవీ లేదా ఎయిడ్స్, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, కేన్సర్ చికిత్సలు లేదా అవయవ మార్పిడి వంటి పరిస్థితుల కారణంగా ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. (చదవండి: మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..) -
షేవింగే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది, నెల రోజులు కోమాలో!
ఇన్ గ్రోయిన్ హెయిర్ అమెరికాలో ఒక వ్యక్తిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ సెప్పిస్ బారిన పడ్డాడు. వైద్యులు కూడా చేతులెత్తేశారు. బతికే అవకాశం చాలా తక్కువని చెప్పారు.చివరికి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. కానీ అనూహ్యంగా.. కోలుకోవడం విశేషంగా నిలిచింది.. వివరాలు ఇలా ఉన్నాయి న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అమెరికాటెక్సాస్ రాష్ట్రానికి చెందిన36 ఏళ్ల స్టీవెన్ స్పైనాల్ గజ్జల వద్ద ఉన్న ఇన్గ్రోన్ హెయిర్‌ను తొలగించుకున్నాడు. దీనికి ఇన్ఫెక్షన్ సెప్సిస్ సోకి చివరికి సెప్సిస్షాక్కు దారి తీసింది. రక్తం గడ్డకట్టడం, డబుల్ న్యుమోనియా, అవయవ వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)కి దారితీసింది. ఇన్ఫెక్షన్ అతని గుండెకు కూడా చేరింది. దీంతొ కోమాలోకి వెళ్లి పోయాడు. ఇక కష్టం అని ప్రకటించిన వైద్యులు చివరి ఆశగా వెంటిలేటర్‌పై ఉంచి దాదాపు నెల రోజుల పాటు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ చికిత్సకు స్పందించిన స్టీవెన్ కొద్దిగా కోలుకున్నాడు. మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని సోదరి మిచెల్ పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో సమాచారం ప్రకారం 2022 ఏడాది చివరల్లో అనారోగ్యానికి గురైన స్టీవెన్ 2023 చివరినాటికి కొద్దిగా బలం పుంజు కున్నాడంటూ స్టీవెన్ రికవరీ జర్నీనీ షేర్ చేసింది. ఇందు కోసం 8వేల డాలర్లు ఖర్చు అయినట్టు తెలిపింది. గోఫండ్‌మీ ద్వారా విరాళాలకోసం అభ్యర్థించింది. (ఇన్ గ్రోయిన్ హెయిర్: పురుషులు ఛాతీ, చంకలు, వీపు, గజ్జలు తదితర ప్రదేశాల్లో ముఖ్యంగా వ్యతిరేకదిశలో(ఎదురు) షేవ్ చేసుకున్నా, కట్ అయినా వెంట్రుకల కుదుళ్ల వద్ద ఎరుపు దురద గడ్డలు వస్తాయి. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి. అలాగే వీటిమీద రాంగ్ డైరెక్షన్లో వెంట్రుకలొస్తాయి. దీనికి సాధారణంగా వైద్య చికిత్స అవసరం లేదు. వాటికవే తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ షేవింగ్ జెల్ లేదా క్రీమ్ లాంటివి వాడతారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ప్రమాదం. నిర్లక్ష్యం చేస్తే సెప్సిస్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. దీన్నే " సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు. మహిళలల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంచనా ప్రకారం ప్రతీ ఏడాది 1.7 మిలియన్ల అమెరికన్లు సెప్సిస్ బారిన పడుతున్నారు. ఏటా దాదాపు 270,000 మంది మరణిస్తున్నారు.) -
సెప్టిక్ షాక్: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!
టాలీవుడ్ నటుడు శరత్ బాబు తెలుగు , కన్నడతో సహా వివిధ భాషలలో హీరోగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలా ఆయన దాదాపు 230కి పైగా చిత్రాల్లో నటించారు . ఆయన క్యారెక్టర్ రోల్స్‌లో కూడా ప్రేక్షకులను అలరించారు. చివరికి 71 ఏళ్ల వయసులో ఈ మహమ్మారి సెప్సిస్ బారిన పడి మృతి చెందారు. ఆఖరి దశలో తీవ్ర ఇన్ఫెక్షన్కు గురై చాల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయనకు వచ్చిన సెప్సిస్ ప్రాణాంతకమా? ఎందువల్ల వస్తుంది..? సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్‌కి సంబంధించిన తీవ్ర దశ. దీని కారణంగా శరీరంలో ఒక్కసారిగా రక్తపోటు పడిపోయి శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కు గురవ్వుతుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైనది. ఈ దశలో మెదడు నుంచి సమస్త అవయవాలు వైఫల్యం చెంది పరిస్థితి విషమంగా మారిపోతుంది. దీన్ని బహుళ అవయవాల వైఫల్యానికి దారితీసే వైద్య పరిస్థితి అని అంటారు. సెప్సిస్ అంటే.. సెప్సిస్‌ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)గా పిలుస్తారు. అంటే.. ఇన్ఫెక్షనకు శరీరం తీవ్ర ప్రతిస్పందించడం అని అర్థం. ఈ పరిస్థితి ఎప్పుడు సంభవిస్తుందటే..శరీరం అంతటా ఇన్షెక్షన్ చైన్ రియాక్షన్‌లా వ్యాపించడం జరిగితే ఈ సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు రోగిని ఆస్పత్రికి తీసుకు వెళ్లే ముందు ప్రారంభమవుతాయి. ఈ సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు, మూత్రనాళాలు, చర్మం లేదా జీర్ణశయాంతర ప్రేగుల నుంచి ప్రారంభమవుతాయి. కారణం.. సూక్ష్మక్రిములు ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయి.ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభిస్తుంది. అయితే దీనికి చికిత్స తీసుకుంటూ ఆపేసినా లేక తీసుకోకపోయినా సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సెప్సిస్‌కు కారణం. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సెప్సిస్‌ని శరీరంలో అభివృద్ధి చేసే వ్యక్తులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల లేదా బలహీనమైన రోగనిరోధక వ్యకవస్థతో తీవ్ర వైద్య పరిస్థితిని కలిగి ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్తో బాధపడే వారిలో దాదాపు పావు నుంచి ఒక వంతు దాక ఆస్పత్రిని సందిర్శించిన ఒక్క వారంలోనే మళ్లీ ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. సెప్సిస్ దశలు.. మూడు దశలు సెప్సిస్: ఇది రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు అతిగా స్పందించే పరిస్థితి. తీవ్రమైన సెప్సిస్: సెప్సిస్ అవయవాలు పనిచేయకపోవడానికి కారణమవుతుంది. ఇది సాధారణంగా తక్కువ రక్తపోటు, వాపు ఫలితంగా జరుగుతుంది. సెప్టిక్ షాక్: సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్ చివరి దశ. చాలా IV (ఇంట్రావీనస్) ద్రవాలు ఉన్నప్పటికీ, ఇది అత్యంత తక్కువ రక్తపోటు ద్వారా నిర్వచించబడింది. ఈ దశ ప్రాణాంతకమని చెప్పొచ్చు. లక్షణాలు.. వేగవంతమైన హృదయ స్పందన రేటు జ్వరం లేదా అల్పోష్ణస్థితి (ఉష్ణోగ్రతలు పడిపోవడం) వణుకు లేదా చలి వెచ్చగా, తడిగా లేదా చెమటతో కూడిన చర్మం గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి హైపర్వెంటిలేషన్ (వేగవంతమైన శ్వాస) శ్వాస ఆడకపోవుట. సెప్టక్ షాక్ లేదా చివరి దశకు చేరినప్పుడు.. చాలా తక్కువ రక్తపోటు కాంతిహీనత మూత్ర విసర్జన తక్కువగా లేదా లేదు గుండె దడ అవయవాలు పనిచేయకపోవడం చర్మ దద్దుర్లు (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్!
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు.. వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకో అవకాశం ఇచ్చారు. అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని మరోసారి ఆయన నోటీసులు జారీ చేశారు. అయితే.. నోటీసుల్లో ఇదే తుది విచారణగా పేర్కొనడం గమనార్హం. వైఎస్సార్సీపీ నుంచి నెగ్గి.. పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలకు ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. అయితే సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ.. అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో 19వ తేదీన మధ్యాహ్నాం విచారణ ఉంటుందని.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం ఉంటుందని నోటీసుల్లో అసెంబ్లీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. అనర్హత పిటిషన్ వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ లకు సైతం శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణకు హాజరయ్యే విషయమై వీళ్లంతా నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. -
'సైంటిస్ట్‌గానే కాదు... భార్యగానూ గెలిచింది'!
ఆమె అంటువ్యాధులకు సంబంధించిన వైద్యురాలు, పరిశోధకురాలు. ఆమె భర్త అనుకోకుండా యాంటీబయాటిక్స్‌కి లొంగని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు గురయ్యాడు. తన కళ్లముందే భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతి క్షణం ఓ యుగంలా భయం ముంచుకొస్తోంది. అంత పెద్ద పరిశోధకురాలు అయినా ఓ సాధారణ మహిళలా భర్త ప్రాణాల ఎలా రక్షించాలో తెలియక తల్లడిల్లిపోయింది. ఇంతవరకు అలాంటి యాంటీబయోటిక్ బ్యాక్టీరియల్ కోసం ఎలాంటి చికిత్స లేదని తెలిసి హుతాశురాలైంది. ఎలాంటి యాంటి బయాటిక్‌లు వాడిన ఫలితం ఉండదని తెలిసిన క్షణంలో ఆమె మెదడు తట్టిన మెరుపులాంటి ఆలోచనతో.. కలియుగ సావిత్రలా మారి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. అందరిచేత శభాష్ అనిపించుకుంది. దాని గురించి ఓ పుస్తకం సైతం ప్రచురించింది కూడా. ఇంతకీ ఆమె ఏం చేసింది. ఎలా భర్త ప్రాణాలు కాపాడుకుంది అంటే.. యూఎస్‌కి చెందిన స్టెఫానీ స్ట్రాత్డీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎపిడెమియాలజిస్ట్. ఆమె భర్త టామ్ ప్యాటర్సన్ సూపర్ బగ్(యాంటీబయాటిక్స్‌కి లొంగని బ్యాక్టీరియా) ఇన్ఫెక్షన్ బారినపడ్డాడు. సరిగ్గా 2015లో టామ్ నదిపై సర్ఫింగ్ చేస్తూ.. అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పితో పడిపోయాడు. తక్షణమే స్ట్రాత్ డీ ఈజిప్ట్‌లోని ఒక క్లినిక్‌కి తరలించగా, అక్కడ అతడి ఆరోగ్య మరింతగా దిగజారడం ప్రారంభమయ్యింది. దీంతో ఆమె అతడిని జర్మనీలోని ఓ ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యుల యాంటీబయోటిక్స్‌కి లొంగని "బాక్టీరియం అసినెటోబాక్టర్ బౌమన్ని"తో బాధపడుతున్నట్లు తెలిపారు. అది అతడి కడుపులో ద్రాక్షపండు సైజులో ఓ గడ్డలా ఉందని చెప్పారు. అది ఎలాంటి యాంటీ బయోటిక్‌లకు లొంగదని చెప్పారు. నిజానికి ఈ బ్యాక్టీరియాని మధ్యప్రాచ్యంలోనే గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇరాక్ యుద్ధంలో చాలామంది అమెరికన్ దళాల గాయపడ్డారు. అయితే వారంతా ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లాక ఈ బ్యాక్టీరియా బారిన పడే చనిపోయినట్లు నిర్థారించారు. అప్పుడే ఈ బ్యాక్టీరియాకు ఇరాకీ బాక్టీరియాగా నామకరణం చేశారు. దీనికి ఆధునిక వైద్యంలో సరైన చికత్స లేదు. ఇప్పటికీ ఈ బ్యాక్టీరియాని అంతం చేసేలా పరిశోధనలు జరుగుతున్న దశలోనే ఉన్నాయి. ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా జరగలేదు. దీంతో స్ట్రాత్ డీ డీలా పడిపోయింది. కళ్ల ముందు మృత్యు ఒడిలోకి జారిపోతున్న భర్త, ఏం చేయాలేని స్థితిలో తాను ఏంటీ స్థితి అని పరివిధాలుగా ఆలోచించింది. ఈ క్రమంలో ఎందరో పరిశోధకులను సంప్రదించింది. దీనికి సంబంధించిన సమాచారాన్నంత క్షుణ్ణంగా పరిశీలించింది. దేనికి లొంగని ఈ యాంటీ బ్యాక్టీరియాలను తినేసే ఫేజ్ వైరస్‌లే(పరాన్నజీవులు) శరణ్యమని అర్థమయ్యింది. ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే బ్యాక్టీరియాలని కూడా చెప్పొచ్చు. ఇవి మురికి నీటిలోను, చెరువులు, పడవల్లో, సముద్రాల్లో ఉంటాయని గుర్తించింది. అయితే వాటిలో ఏది తన భర్తకు వచ్చిన బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ను తినేయగలదో అంచనావేసి, ఆ ఫేజ్ వైరస్‌ని శుద్ధి చేసి రక్తంలోకి ఇంజెక్ట్ చేయాలి. అయితే ఇంతవరకు ఈ ఫేజ్ థెరఫీని ఏ పేషెంట్‌కి ఇవ్వలేదు. ఎందుకంటే దీనిపై పూర్తి స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ జరగలేదు. తన భర్త ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ సాహసం చేయకు తప్పదు స్ట్రాత్ డీకి. అందుకోసం ముందుగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో పాటు ఈ ట్రీట్మెంట్ చేసేందుకు పరిశోధకులు కూడా స్వచ్ఛందంగా ముందుకురారు ఎందుకంటే? ఈ టీట్మెంట్ పేషెంట్ ప్రాణాలతో చెలాగాటమనే చెప్పాలి. చివరకు టెక్సాస్ యూనివర్శిటీ బయోకెమిస్ట్ రైలాండ్ యంగ్ అనే పరిశోధకుడు మాత్రమే ముందుకొచ్చారు. ఆయన గత 45 ఏళ్లుగా ఈ ఫేజ్లపైనే ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ టెక్సాస్ యూనివర్సిటీ ల్యాబ్ స్ట్రాత్ డీ భర్త టామ్‌కి సరిపడా ఫేజ్ కోసం ఆహర్నిశలు యత్నించి టామ్ శరీరంలోని బ్యాక్టీరియాతో క్రియాశీలకంగా పనిచేసే ఫేజ్ వైరస్‌ని కనుగొన్నారు. ముందుగా అతడి పొత్తికడుపులో చీముతో నిండిన గడ్డలోని ఈ ఫేస్‌ని ఇంజెక్ట్ చేశారు. ఏం జరగుతుందో తెలియని ఉత్కంఠతో ప్రతి రెండు గంటలకు చికిత్సు కొనసాగిస్తూ పరిశోధక బృందమంతా అతడిని పర్యవేక్షించారు. ఆ తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలను వ్యాపించిన బ్యాక్టీరియాను నివారించటం కోసం ఆ ఫేజ్లను టామ్ రక్తంలోకి ఇంజెక్ట్ చేశారు. నెమ్మదిగా టామ్ కోలుకోవడం కనిపించింది. దీంతో పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తూ..ఇలా యూఎస్‌లో సిస్టమిక్ సూపర్‌బగ్ ఇన్ఫెక్షన్కు చికిత్స చేయడానికి ఇంట్రావీనస్ ఫేజ్ థెరపీని పొందిన తొలి వ్యక్తి టామ్ అని చెప్పారు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా కోమాలోకి వెళ్లిన టామ్ కాస్త బయటకు రావడమే కాకుండా తన కూతురిని గుర్తుపట్టి ఆమె చేతిని ముద్దాడాడు. దీని నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డాకు దీర్ఘాకాలిక వ్యాధులైన డయాబెటిస్ వంటి రోగాల బారిన పడ్డాడు. ఆహార సంబంధ జీర్ణశయ సమస్యలను కూడా ఫేస్ చేశాడు. అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలో కరోనా బారిన పడి శ్వాస సంబంధ సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే వాటన్నింటిని విజయవంతంగా జయించి కోలుకున్నాడు. ఇప్పుడూ తన భార్య స్ట్రాత్ డీతో కలిసి ప్రపంచాన్ని చుట్టి వచ్చే పర్యటనలు కూడా చేస్తున్నాడు. ఒకరకంగా టామ్‌కి ఇచ్చిన ఫేజ్ థెరఫీ కొత్త శాస్త్రీయ ఆలోచనకు నాందిపలికింది. ఇక స్ట్రాత్ డీ తన భర్త ప్రాణాల కోసం సాగించిన అలుపెరగని పోరాటాన్ని “ది పర్ఫెక్ట్ ప్రిడేటర్: ఎ సైంటిస్ట్ రేస్ టు సేవ్ హర్ హస్బెండ్ ఫ్రమ్ ఎ డెడ్లీ సూపర్‌బగ్” అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించి మరీ ఈ బ్యాక్టీరియా పట్ల అవగాహన కల్పిస్తోంది. తనలా ధైర్యంగా ఉండి తమవాళ్లను ఎలా కాపాడుకోవాలో ఈ పుస్తకం ద్వారా ప్రచారం చేస్తోంది కూడా. కాగా, అయితే యాంటీబయటిక్లను ఈ ఫేజ్‌లు భర్తీ చేయవు కానీ యాంటీబయోటిక్‌లకు లొంగని బ్యాక్టీరియాలకు(సూపర్ బగ్‌లు) ఈ ఫేజ్‌లు మంచి ప్రత్యామ్నాయమైనవి, సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు పరిశోధకులు. నటుడు కృష్ణంరాజు సైతం.. అంతేగాదు 2050 నాటికి ప్రతి మూడు సెకన్లకు ఒకరు చొప్పున ఏడాదికి 10 మిలియన్ల మంది దాక ప్రజలు ఈ సూపర్‌బగ్ ఇన్ఫెక్షన్తో మరణిస్తారని యూస్ లైఫ్ సైన్స్ అంచనా వేసింది. అంతేగాదు దివంగత సినీనటుడు కృష్ణంరాజు మృతికి కారణం పేర్కొంటూ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన నివేదికలో కూడా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ప్రస్తావన ఉండటం గమనార్హం. ఇది ఎక్కువగా సుదీర్ఘ కాలం ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందిన వారికే వస్తున్నట్లు వెల్లడించారు వైద్యులు. దీన్ని నెగిటివ్ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. భారత్‌లో కూడా దీని తాలుకా కేసులు పెరుగుతుండటంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. (చదవండి: 41 ఏళ్ల క్రితం చనిపోతే..ఇప్పుడామె ఎవరనేది గుర్తించి కూతురికి అందజేస్తే..!) -
పొరుగునే స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్! మన దగ్గరా అప్రమత్తత అవసరం!!
ఆంధ్రప్రదేశ్‌కు ΄పొరుగునే ఉన్న ఒడిశాలో కొంతకాలంగా ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్వైరవిహారం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్కడ కనిపిస్తున్న ఈ కేసులు గత రెండు మూడు వారాలుగా ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల ఒక్క సుందర్ఘర్ జిల్లాలోనే దాదాపుగా 200కు పైగా కేసులు రావడంతో పాటు, కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలూ అప్రమత్తం కావాల్సిన అవసరమున్న ఈ తరుణంలో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను ‘బుష్ టైఫస్’ అని కూడా అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియమ్ పేరు ‘ఓరియెంటియా సుసుగాముషి’. ఇది చిమ్మటలా కనిపించే చిగ్గర్ అనే ఒక రకం కీటకం ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ‘ఓరియెంటియా సుసుగాముషి’ అనే బ్యాక్టీరియమ్ దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి చిగ్గర్ కుట్టాక... బ్యాక్టీరియమ్ బాధితుల రక్తంలోకి చేరితే... దాదాపు పది రోజుల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. చాలావరకు లక్షణాలు నిర΄ాయకరంగా ఉండవచ్చు. కానీ మొదటివారంలో దీన్ని గుర్తించకపోవడం లేదా సరైన చికిత్స ఇవ్వకపోవడం జరిగితే రెండోవారం నుంచి కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, కొన్ని సందర్భాల్లో మెదడు కూడా ప్రభావితమై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. నిర్ధారణ ఈ వ్యాధి నిర్ధారణకు చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు వెయిల్ ఫెలిక్స్ పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ యాంటీబాడీ (ఐఎఫ్ఏ) పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనో పెరాక్సైడేజ్ (ఐపీపీ) పరీక్ష, ఎలీజా, ఇమ్యూనో క్రొమాటోగ్రాఫిక్ టెస్ట్ (ఐసీటీ), పీసీఆర్ పరీక్షల ద్వారా దీన్ని నివారణ చేయవచ్చు. అయితే చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో కూడా దాదాపుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో తగిన మోతాదులో యాంటీబయాటిక్ చికిత్స చేసి, బాధితుల పరిస్థితిని నార్మల్ చేయవచ్చు. అందుకే అన్నన్ని ఖరీదైన పరీక్షలకు బదులు కాస్తంత అనుభవజ్ఞులైన డాక్టర్లు కొన్ని లక్షణాల ఆధారంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. ఉదాహరణకు మలేరియాలో ప్రోటోజోవన్ పారసైట్ రకాన్ని బట్టి కొన్ని రోజుల వ్యవధిలో జ్వరం మాటిమాటికీ వస్తుంటుంది. అదే వైరల్ జ్వరాలు చాలా తీవ్రంగా, ఎక్కువ ఉష్ణోగ్రతతో వస్తుంటాయి. ఈ లక్షణాలను బట్టి ఆయా జ్వరాలను గుర్తుబట్టి చికిత్స అందిస్తారు. దీనికి జ్వరం వచ్చిన తొలిదశలోనే సింపుల్‌గా ఇచ్చే యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే చాలు. ఒకవేళ చికిత్స అందించకపోతే కొన్నిసార్లు ఇది లంగ్స్, గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థతోపాటు కిడ్నీలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. నివారణ దీనికి టీకా ఏదీ అందుబాటులో లేదు. చిగ్గర్ కీటకాల కాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇవి పొలాల్లో, మట్టిలో నివసిస్తూ, అక్కడే గుడ్లు పెడతాయి. కాబట్టి చేలూ, పొలాల్లో నడిచే సమయాల్లో చెప్పులు వాడటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఫుల్ స్లీవ్ దుస్తులు, కాళ్లు పూర్తిగా కప్పేలాంటి దుస్తులు ధరించడం మేలు. ట్రెకింగ్ వంటి సాహసక్రీడల్లో పాల్గొనేవారు చిగ్గర్స్ ఉండే ప్రాంతాల్లోనే నడిచే అవకాశాలు ఎక్కువ. అందుకే... ట్రెక్కింగ్ చేసేవారు ఇప్పుడీ వ్యాధి విస్తరిస్తున్న ప్రాంతాలకు కొన్నాళ్లు ట్రెక్కింగ్‌కు వెళ్లకవడమే మంచిది. చికిత్స కొన్ని అరుదైన సందర్భాల్లో (అంటే కాంప్లికేషన్ వచ్చిన కేసుల్లో) మినహా... టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులతోనే ఇది అదుపులోకి వస్తుంది. కీమోప్రోఫిలాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే... అది కొంతవరకు దీని నివారణకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రాల నుంచి ఒడిశా వెళ్లాల్సినవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కిమో ప్రోఫిలాక్టిక్ తీసుకోవడం కొంత మేలు చేస్తుందని చెప్పవచ్చు. డా.. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ(76) అస్వస్థతకు గురయ్యారు. ఛాతి ఇన్ఫెక్షన్తో పాటు జ్వరంతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో నిన్న రాత్రి చేరినట్లు అధికారులు తెలిపారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్నామని తెలిపిన వైద్యులు.. రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే చికిత్స జరుగుతున్నట్లు చెప్పారు. సోనియా గాంధీ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. కొద్ది రోజులకే ఇలా ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసి ఇండియా కూటమిని ముందుకు తీసుకుపోయే విధంగా సోనియా గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఇండియా కూటమి ముంబయి సమావేశంలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. Congress Parliamentary Party Chairperson Sonia Gandhi has been admitted to Delhi's Sir Gangaram Hospital with symptoms of mild fever. She is under doctors' observation and is currently stable: Sources pic.twitter.com/9uuZz8n4ra — ANI (@ANI) September 3, 2023 ఎన్డీయేకి వ్యతిరేకంగా కూటమిని బలపరచడానికి ఇప్పటికే నిర్వహించిన పాట్నా, బెంగళూరు, ముంబయి వరుస సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకుపోవడానికి కాంగ్రెస్ శ్రేణులకు ముందుండి నడుస్తున్నారు. 2019లో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇదీ చదవండి: సర్జికల్ స్ట్రైక్ హీరో చేతికి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు -
"బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది!అద్భుతం చేసింది!
ఒక్కొసారి నిరాశగా అన్న మాటలు కూడా ఆయుధంగా మారతాయి. అవి వరంగా మారి గెలిచే ఆసక్తిని రేపుతాయి కూడా. బహుశా అందుకేనేమో పెద్దలు విమర్శిస్తున్నారని కూర్చొకు వాటినే ఎదిగేందుకు ఉపయోగపడే మెట్లుగా భావిస్తే విజయం నీ పాదాక్రాతం అని అన్నారు. ఇది జరిగే అవకాశమే లేదు అన్నవి, ఒక్క శాతం కూడా గెలిచే అవకాశం లేనివి కూడా ఏదో ఒక ఊహించని మలుపులో గెలుపు తీరం అందుతుంది, ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. అచ్చం అలాంటి అద్భుత ఘటనే యూఎస్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విషయంలో ఈ అద్భుతం జరిగింది. యూఎస్‌లో అలెగ్జెండర్ అనే వ్యక్తి 1946లో జన్మించాడు. ఆ టైంలో యూఎస్ అంతట పోలియో ప్రబలంగా ఉంది. అతను కూడా ఈ పోలియో బారినే పడ్డాడు. అయితే ఇతని కేసు మాత్రం యూఎస్ చరిత్రలో పిల్లలకు సోకిన 58 వేల పోలియో కేసుల్లో ఘోరమైనది. అలెగ్జెండర్ ఆరేళ్ల ప్రాయంలో ఈ పోలియో బారిన పడ్డాడు. ఎంత ఘోరంగా అంటే.. అతడి వెన్నుపాముని చచ్చుపడేలా చేసి ప్రాణాంతకంగా మారింది. దీని కారణంగా అలెగ్జాండర్ ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరుకున్నాడు. నిజానికి ఈ పోలీయో వ్యాధి పోలియోన్ లేదా పోలియోమైలిటిస్ అనే పోలియో వైరస్ వల్ల వస్తుంది. దీని కారణంగా వికలాంగులు కావడమో లేదా ప్రాణాంతకంగా మారవచ్చు. పోలియో వ్యాక్సిన్‌ని యూఎస్ 1955లోనే ఆమోదించింది. పిల్లలందరికీ అందించింది కూడా. 1979 కల్లా దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది కూడా. అప్పటికే అలెగ్జాండర్కి జరగకూడని నష్టం జరిగిపోయింది. శరీరం అంతా చచ్చుబడి శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న అలెగ్జాండర్కి ట్రాకియోటమీ అనే ఇనుప ఊపిరితిత్తులు అమర్చారు. అది అతని మెదడు నుంచి కాలి వరకు కవర్ అయ్యి ఉంటుంది. అది అతన్ని కదలడానికి లేదా దగ్గడానికి అనుమతించదు. నిజం చెప్పలంటే అతను ఎప్పటి వరకు బతుకుతాడనేది కూడా చెప్పలేం. ఏ క్షణమైన చనిపోవచ్చు. ఏదో వైద్యులు అతన్ని కాపాడేందుకు అమర్చిన పరికరమై తప్ప అతని లైఫ్ టైం పెంచేది మాత్రం కాదు. వైద్యులు కూడా అతను బతకడు, బతికే అవకాశం లేదనే భావించారు. కొద్ది రోజుల్లోనే చనిపోతాడనే అన్నారు. అయితే అతడు అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా 70 ఏళ్లు అలానే కదలకుండా ఆ ఇనుప యంత్రంతో బతికాడు. ఐతే అత్యాధునిక యంత్రాలు వచ్చినప్పటికీ అతడి శరీరం ఆ భారి ఇనుమ మెషిన్‌కి అలవాటుపడటంతో ఈ తేలికపాటి ఆధునిక యంత్రాలు అమర్చడం అసాధ్యమయ్యింది. అసలు చెప్పాలంటే అతడు ఉన్న పరిస్థితి తలుచుకుని దిగులుతో చనిపోతారు. కానీ అతడు ఎంతో గుండె నిబ్బరంతో ఆ సమస్యతో పోరాడుతూనే బతికి చూపించాడు. పైగా పాఠశాల విద్యను పూర్తి చేశాడు. న్యాయశాస్త్రంలో పట్టుభద్రుడవ్వడమే గాక చాలా ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశాడు కూడా. కదలేందుకు వీలు లేకపోయినా నిరాశ చెందలేదు. కాలు మెదపకుండా జీవితాంత ఆ బరువైన ఇనుప మెషిన్‌తో అలానే బెడ్‌కి పరిమితమైన కూడా.. "జీవించాలి" అనే ఆశను వదులుకోలేదు. ఎలాగో చనిపోతాడని తెలిసి కూడా ఏదో ఒకటి చేస్తూ.. బతకగడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మొత్తం మిషన్‌తో ఓ డబ్బాలో ఉన్న మొండెలా కనిపిస్తాడు అలెగ్జాండర్. ఏ క్షణంలోనూ కొద్దిపాటి నిరాశకు, నిస్ప్రుహను దరిచేరనివ్వకుండా బతికి చూపడు. అతడి ఈ తెగువే అత్యంత పొడవైనా ఐరన్ ఊపిరితిత్తులు కలిగినా వృద్ధ రోగిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కేలా చేసింది. అతడికి వైద్యం చేసిన వైద్యులే చనిపోయారేమో కానీ అత్యంత దయనీయ స్థితిలో బతకీడుస్తూ కూడా తాను పూర్ణాయుష్కుడినే అని నిరూపించాడు. వైద్యులు సైతం అతడు ఇప్పటి వరకు జీవించి ఉండటం అద్భుతమని చెప్పారు. క్షణికావేశంలో అకృత్యాలకు పాల్పడే యువతకు, అనుకున్నది జరగలేదన్న వ్యథతో బతుకు ముగించుకోవాలన్న వ్యక్తులందరీకి అతడు స్ఫూర్తి. ఓపికతో ఎలా వ్యవహిరించాలి, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా సంయమనంతో ఉండి అందరూ ముక్కున వేలేసుకునేలా ఎలా జీవించాలో అతడు చేసి చూపించాడు. (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
ఆ పరాన్నజీవి గుడ్లు నేరుగా నోట్లోకి వెళ్లడంతో..ఆ ముప్పు తప్పదు!
హుక్ వార్మ్ అనే పరాన్నజీవి ప్రధానంగా చిన్నపేగుల్లో ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని అది సంగ్రహిస్తూ ఉండటం వల్ల నీరసం, నిస్సత్తువ, పొషకాల లోపంతో పాటు ప్రధానంగా ఐరన్ లోపం కనిపిస్తుంది. చాలామందిలో ఇది ప్రధానంగా చిన్నపేగులనే ఆశ్రయించినా కొందరిలో మాత్రం ఊపిరితిత్తులు, చర్మం వంటి ఇతర అవయవాలపైనా ప్రభావం చూపవచ్చు. పోలాలకు వెళ్లే పెద్దలూ, మట్టిలో ఆడుకునే పిల్లల్లో ఇది ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్ గురించి అవగాహన కోసం ఈ కథనం. హుక్వార్మ్ ఇన్ఫెక్షన్ అనేది పోలాల్లో నడిచేవారిలో... అది కూడా చెప్పులు, ΄ాదరక్షలు లేకుండా నడిచేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పటికీ కొన్ని మారుమూల పల్లెల్లో ఆరుబయలు మలవిసర్జన చేసే అలవాటు ఉంటుంది. మలంతో పాటు విసర్జితమైన హుక్వార్మ్ గుడ్లు ఏదో రూపంలో మనుషుల నోటి ద్వారా మళ్లీ లోనికి ప్రవేశించడం అన్నది దీని జీవితచక్రం (లైఫ్‌సైకిల్)లో భాగం. నేల/మట్టి ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది కాబట్టి దీన్ని ‘సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మింథిస్’ అంటారు. మనుషులు నేల మీద నడవక తప్పదు కాబట్టి దీని విస్తృతి ఎంతంటే... ప్రపంచవ్యాప్త జనాభాలో దాదాపు 10% మందిలో ఈ ఇన్ఫెక్షన్ ఏదో ఒక దశలో వచ్చే ఉంటుందనేది ఒక అంచనా. లక్షణాలు: కొద్దిపాటి నుంచి ఓ మోస్తరు జ్వరం పొట్టలో నొప్పి ఆకలి మందగించడం ∙నీళ్ల విరేచనాలు బరువు తగ్గడం ∙రక్తహీనత ∙కొందరిలో దగ్గు / పిల్లికూతలు (ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు) ∙చర్మంపై ర్యాష్ (చర్మం ప్రభావితమైనప్పుడు). ఇదీ ముప్పు... తీసుకున్న ఆహారం, దాంతో సమకూరే శక్తి, సారం అంతా హుక్వార్మ్స్ గ్రహించడంతో తీవ్రమైన రక్తహీనత, ΄ోషకాల లోపం, ్ర΄ోటీన్స్ లోపం వంటి పరిణామాలతో తలతిరగడం, తీవ్రమైన అలసట, కండరాలు పట్టేయడం, ఊపిరి అందక΄ోవడం, ఛాతీలో నొప్పి వంటి అనేక పరిణామాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. దాంతో క్రమంగా భౌతికంగా, మానసికంగా బలహీనమయ్యే అవకాశం ఉంది. నిర్ధారణ: మల, రక్త (సీబీపీ) పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు. రక్తపరీక్షలో ఈసినోఫిలియా (తెల్లరక్తకణాల్లో ఒక రకం) కౌంట్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మల పరీక్షలో హుక్వార్మ్ గుడ్లు కనిపిస్తాయి. నివారణ: కాచివడబోసిన నీళ్లు తాగాలి. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తినేయాలి. తినేముందు చేతులు కడుక్కవాలి ఆరుబయట మలవిసర్జనను పూర్తిగా నిలిపివేయాలి. (పల్లెల్లో సైతం ఇది జరగాలి) మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి పెద్దలు పొలాల్లో తిరిగి వచ్చాక, పిల్లలు మట్టిలో ఆడుకున్న తర్వాత చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా డీ–వార్మింగ్ చేయిస్తుండాలి. చికిత్స: కాళ్లకు లేదా ఒంటి మీద ఎక్కడైనా ర్యాష్ కనిపించినా, లేదా ఆకలి / బరువు తగ్గినట్లుగా ఉన్నా, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షల తర్వాత వ్యాధి నిర్ధారణ జరి΄ాక వారు మిబెండిజోల్, ఆల్బెండిజోల్ వంటి మందుల్ని సూచిస్తారు. --డాక్టర్ కె. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్! లాభాలేమిటంటే?) -
CRPS: ఈ నరకం పగవాడికి కూడా రావొద్దమ్మా!
ఏదైనా పట్టుకోవాలన్నా నొప్పే.. ఏదైనా వస్తువు తలిగినా నొప్పే. చివరికి కాస్త కదిలినా నొప్పే. ఈ భూమ్మీద అత్యంత అరుదైన వ్యాధి పదేళ్ల చిన్నారికి సోకింది!. ఆస్ట్రేలియాకు చెందిన బెల్లా మేసి(10).. సెలవుల్లో కుటుంబంతో కలిసి ఫిజీ టూర్‌కు వెళ్లింది. అక్కడ ఆ చిన్నారి కుడి పాదానికి ఇన్ఫెక్షన్ సోకి పొక్కులు ఏర్పడ్డాయి. ఆ నొప్పికి ఆమె విలవిలలాడిపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. డాక్టర్లకు చూపిస్తే.. కాంప్లెక్స్ రీజినల్ పెయిన్ సిండ్రోమ్complex regional pain syndrome (CRPS)గా తేల్చారు వైద్యులు. ఇది నయంకాని రోగం. దీర్ఘకాలికంగా నొప్పుల్ని కలిగిస్తుంది. విపరీతమైన మంటతో అవయవాల్ని కదిలించలేరు. మెసి విషయంలో కాలి భాగం కదలకుండా ఉండిపోయింది. మంచానికే పరిమితమైంది. ఎటూ కదల్లేని స్థితిలో ఉండిపోయింది. స్పర్శతో పాటు బడికి.. తన బాల్యానికి దూరం అవుతూ వస్తోంది ఆ చిన్నారి. అందుకే మానవాళి చరిత్రలో అత్యంత అరుదైన వ్యాధిగా సీఆర్పీఎస్ను అభివర్ణిస్తుంటారు వైద్యులు. ప్రస్తుతం గోఫండ్‌మీ విరాళాల సేకరణ ద్వారా అమెరికాకు తీసుకెళ్లి బెల్లాకు చికిత్స అందిస్తోంది ఆమె తల్లి. కానీ, వైద్యులు మాత్రం ఆ చిన్నారి కోలుకుంటుందన్న గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే.. ఈ ప్రపంచం మీద అత్యంత బాధాకరమైన వ్యాధి ఇదే కాబట్టి. -
కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా?
కుక్క కరిస్తే ఎంత ప్రమాదమో అని అందరికీ తెలుసు. అందుకే అది కరిచిన వెంటనే ర్యాబిస్ వ్యాధి రాకుండా ఇంజెక్షన్లు తీసుకుంటాం. కొద్ది రోజులు ఆహార నియమాలు పాటిస్తాం. అయితే కుక్క కాటు కంటే మనిషి కరిస్తేనే అత్యంత ప్రమాదకరమట. ఆ వ్యక్తి కోలుకోవడానికే ఆరు నెలల పడుతుందట. ఔను! ఈ విచిత్ర ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే..డోని ఆడమ్స్ ఫిబ్రవరిలో టంపా బేలో ఒక కుటుంబ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ చిన్న గొడవ జరిగింది. దీంతో ఇద్దరు బంధువులు కలబడ్డారు. వారిని విడదీసేందకు మధ్యలో కలగజేసుకున్న ఆడమ్స్‌ని ఒక వ్యక్తి కోపంతో మోకాలిపై కరిచాడు. దీంతో అతను నైక్రోటైజింగ్ షాసిటిస్ వ్యాధి బారినపడ్డాడు. దీనిని సాధారణంగా మాంసం తినే భ్యాక్టీరియా అని పిలుస్తారు. దీని కారణంగా శరీరీం కుళ్లిపోతూ ఇన్ఫెక్షన్కు గురై చనిపోతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా చర్శంలోకి ప్రవేశించి కండరాల తొడుకు ఉండే ఆరోగ్యకరమైన కణజాలాన్ని నాశనం చేస్తుంది. పాపం ఆ ఘటన కారణంగా ఆడమ్స్ ఆస్పత్రికి సందర్శించాల్సి వచ్చింది. అక్కడ వైద్యలు ఈ విషయాన్నే ఆడమ్స్ తెలిపారు. వెంటనే శస్త్ర చికిత్స చేయలని లేదంటే ప్రాణాంతకమని చెప్పారు. కుక్క కాటు కంటే మనిషి కాటు ఎంత ప్రమాదమో వైద్యులు అతనికి వివరించి చెప్పారు. శస్త్ర చికిత్సలో ఆడమ్స్కి 70 శాతం కణజాలాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ శస్త్ర చికిత్స త్వరిత గతిన చేయకపోతే గనుక ఆడమ్స్ కాలుని కోల్పోవలసి ఉండేది. అతను కోలుకోవడానికి మూడు వారాలు పడితే..పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. దీంతో ఆడమ్స్ ఈ భయానక ఘటన నుంచి కోలుకునేలా చేసిన వైద్యులకు రుణపడి ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆడమ్స్. కుక్క కాటు కన్న మనిషిక కాటు ఇంతా భయానకంగా ఉంటుందని తాను అస్సలు అనుకోలేదని వాపోయాడు. అందుక సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్) -
బిడ్డకు జన్మనివ్వడంతోనే..వికలాంగురాలిగా మారిన ఓ తల్లి..
ఏ తల్లికి అయినా మాతృత్వం అనేది చాలా గొప్ప అనుభూతి. ఆ మధుర క్షణాలు ప్రతి తల్లికి గొప్ప జ్ఞాపకంలాంటివి. అలాంటి మాతృత్వమే ఆమెకు శాపంగా మారింది. డెలివరీ అయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. హాయిగా తన బిడ్డతో గడపాలనుకునేలోపే మళ్లీ ఆస్పత్రి పాలై వికలాంగురాలిగా మారిపోయింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని క్రిస్టినా పచెకో అనే మహిళ రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమెకు సీజెరియన్ చేసి బిడ్డను తీశారు. ఆమె ఆపరేషన్ చేయించుకుని.. రెండు రోజుల అనంతరమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఐతే ఇంటికి వచ్చిన తర్వాత నుంచే నలతగా ఉండటం ప్రారంభించింది. ఆపరేషన్ వల్లే అలా అనిపిస్తుందంటూ నర్సు ఒక ఇంజక్షన్‌ని కూడా ఇచ్చింది. అయినా క్రిస్టినా ఇంకా అలా డల్‌గానే ఉంది. విపరీతమైన జ్వరంతో చాలా నీరసించిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా.. ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ ఆమె శరీరం సెప్టిక్‌కి గురయ్యిందని తేలింది. ఆ ఇన్ఫెక్షన్ అంతా కాళ్లు, చేతులకు వ్యాపించినట్లు వెల్లడించారు వైద్యులు. దీంతో ఆమె రెండు చేతులు, పాదాలను తొలగించాల్సి వచ్చింది. ఇలా మొత్తం ఆమె ఆస్పత్రిలోనే సుమారు నాలుగుల నెలల వరకు ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు క్రిస్టినా మాట్లాడుతూ.. ఆరోజు ఇప్పటికి మర్చిపోలేనంటూ నాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగానే..అలా కళ్లు మూతబడిపోయాయని చెబుతుంది. తన భర్త ప్లీజ్ కళ్లు తెరు మన పిల్లలు అంటూ ఏడుస్తున్న మాటలు వినిపిస్తున్నా.. తాను లేవలేకపోతున్నట్లు అనిపించిందని, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తనకు తెలియదంటూ.. చెప్పకొచ్చింది. ఏది ఏమైతే తాను ఆ భయానక పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడిగలిగానూ అదే చాలు, ఇప్పుడూ నా ఇద్దరూ పిల్లలను బాగా చూసుకోవాలి అని ఆనందంగా చెబుతోంది. (చదవండి: ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!) -
మీ పిల్లలు తరచు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా?
ఇది అటు చలికాలం కాదు, అలాగని పూర్తి వేసవి కాలమూ కాదు... అటూ ఇటూ కానీ సంధికాలం. ఈ కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలే తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. వాటిలో ప్రధానమైనవి దగ్గు, జలుబు. అలెర్జీ, దగ్గు, న్యూమోనియా, బ్రాంకైటిస్, అధిక జ్వరం, టాన్స్లైటిస్, చెవి ఇన్ఫెక్షన్ సమస్యలు పిల్లలకు తరచు సోకుతుంటాయి. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు పిల్లలకు దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు, అధిక తీపి, ఎక్కువ చల్లగా ఉండే ఆహారాలను తినిపించకూడదని వైద్యులు సలహానిస్తుంటారు. ఎందుకంటే ఇవి దగ్గును ఎక్కువ చేస్తాయి. అలాగే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. వీటితోపాటు క్యాండీలు, ఐస్ క్రీం, చాక్లెట్లు, డోనట్స్, పేస్ట్రిలు, ద్రాక్ష, రిఫ్రిజిరేటర్ లో ఉండే చల్లని ఆహారాలకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి దగ్గును బాగా పెంచుతాయి. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు పిల్లలను పంపించకూడదు. ఎందుకంటే ఇవి దగ్గును ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు బొమ్మలు ఇవ్వాల్సి వస్తే.. వాటిని వాష్ చేసిన తర్వాతే ఇవ్వండి. అలాగే పావురాలు, ఇతర పెంపుడు జంతువులకు కొద్దిగా దూరంగా ఉంచండి. ఇవి అలెర్జీని కలిగిస్తాయి. -
రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగితే.. ప్రమాదం ఎక్కువే.. లక్షణాలేంటి? చికిత్స ఉందా?
సాధారణంగా ఇతర అవయవాలకు వచ్చే ఇన్ఫెక్షన్ తెలుసుగానీ... రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇక్కడ ఓ కీలకం దాగి ఉంది. మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకితే... మెల్లగా పాకుతూ అంత త్వరగా ప్రమాదం రాకపోవచ్చు. కానీ రక్తానికి ఇన్ఫెక్షన్ గనక సోకితే అది అన్ని అవయవాలకూ, కణాలకూ వెళ్తూ ఆహారాన్నీ, ఆక్సిజన్‌ను తీసుకెళ్తూ వెళ్తూ ఇన్ఫెక్షన్ను కూడా దేహమంతటికీ వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి. రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగించే ఈ కండిషన్‌ను 'సెప్టిసీమియా’ అని పిలుస్తారు. దీనిపై అవగాహన కోసం ఈ కథనం. మామూలుగా ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని వాడుకగా ‘సెప్టిక్’ అయిందని అంటారు. రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది దేహాన్నంతటినీ విషపూరితం చేసే కండిషన్‌ను ‘సెప్సిస్’ లేదా ‘సెప్టిసీమియా’ అంటారు. దీని గురించి కొన్ని వివరాలివి... సెప్టిసీమియాకు కారణాలు బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఏవైనా పరాన్నజీవులతో పాటు మరికొన్ని అంశాలు కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. చాలాకాలంగా ఆల్కహాల్‌కు తీసుకుంటూ ఉండటం, దీర్ఘకాలంగా అదుపులేకుండా డయాబెటిస్ బారిన పడటం, తగిన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం, రోగనిరోధక వ్యవస్థను మందకొడిగా చేసే ఇమ్యునోసప్రెసెంట్స్ వాడుతుండటం, కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులను విచక్షణరహితంగా వాడటం సెప్టిసీమియాకు దారితీయవచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్లలో సెస్టిసీమియా ముప్పు మరీ ఎక్కువ... ♦ గుండెజబ్బులు వచ్చి చికిత్స పొందని సందర్భాల్లో ♦ ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందిలో కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ప్రధానంగా నిమోనియా వచ్చినప్పుడు ఇది మరీ ఎక్కువ. ♦ ఏదైనా కారణంతో పొట్ట (అబ్డామిన్)లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాదాపు మూడోవంతు కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ♦ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ముఖ్యంగా పైలోనెఫ్రైటిస్ అనే కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో అది సెప్టిసీమియా ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ♦ మెదడు తాలూకు ఇన్ఫెక్షన్స్ కూడా సెప్టిసీమియాగా మారవచ్చు. ♦ ఎముకలు, కీళ్లకు ఇన్ఫెక్షన్ సోకితే చాలా కొద్దిమందిలో (2% మందిలో) అది సెప్టిసీమియాగా మారే అవకాశముంది. నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్ష, మూత్రపరీక్షలతో పాటు ఎక్స్–రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో సెప్టిసీమియా ఉనికి, తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ పరీక్షల ఆధారంగా తర్వాత చేయాల్సిన చికిత్సనూ నిర్ణయిస్తారు. నివారణ బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలావరకు సెప్టిసీమియా నుంచి రక్షించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగేనీరు, పీల్చే గాలి కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే మరికొన్ని అంశాలూ సెప్సిస్ నుంచి కాపాడతాయి. అవి... ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ♦ నీటిని కాచి, చల్లార్చి లేదా ఫిల్టర్ అయిన నీటినే తాగాలి. ♦ వంటకాల్ని వేడివేడిగా ఉండగానే తినేయాలి. బయటి ఫుడ్‌కు (వీలైనంతవరకు) దూరంగా ఉండాలి. ♦ కూరగాయలను, ఆకుకూరలను శుభ్రంగా కడిగాకే వంటకు ఉపక్రమించాలి. తొక్క ఒలిచి తినే పండ్లు మినహా మిగతా వాటిని కడిగే తినాలి. ♦ తినడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ♦ మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ♦ గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌవ్స్ వేసుకోని, సేవలందించాలి. ♦తుమ్ముతూ, దగ్గుతూ ఉండేవారి నుంచి, ముక్కు నుంచి స్రావాలు వస్తున్నవారి నుంచి, జ్వరంతో బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. వాళ్లతో మాట్లాడాల్సి వస్తే ఫేస్‌మాస్క్ ధరించాలి. ♦ చెప్పులు, బూట్లు వంటి పాదరక్షల్ని బయటే విడవాలి. ♦ పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦ డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. లక్షణాలు ♦ చలితో వచ్చే జ్వరం ( ఫీవర్ విత్ చిల్స్) ♦ ఊపిరి అందకపోవడం (బ్రెత్‌లెస్‌నెస్) ♦ గుండె వేగంగా కొట్టుకోవడం (ర్యాపిడ్ హార్ట్‌బీట్) ♦ అయోమయం / మూర్ఛ (ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ / సీజర్స్) ♦ మూత్రం పరిమాణం బాగా తగ్గడం ♦ దేహంలోని చాలా చోట్ల నుంచి రక్తస్రావం ♦ పొట్టలో నొప్పి / వాంతులు / నీళ్ల విరేచనాలు ♦ కామెర్లు (జాండీస్). చికిత్స సెప్టిసీమియా రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఈ కింది ప్రొసీజర్స్ చేస్తారు. ♦ రక్తనాళం ద్వారా ద్రవపదార్థాలు అందజేయడం (ఇంట్రావీనస్ ఫ్లుయిడ్స్) ♦రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్ (ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్) ♦ రక్తపోటు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారించే మందులతో సపోర్ట్ ♦ ఆక్సిజెన్ తీసుకోలేకపోతున్న రోగికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, వెంటిలేటర్‌తో శ్వాస అందించడం ♦ కిడ్నీ రోగుల్లో డయాలసిస్ ♦ అవసరమైన సందర్భాల్లో రక్తమార్పిడి లేదా రక్తంలోని కొన్ని అంశాలు తగ్గితే కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయడం (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా బ్లడ్ ప్రోడక్ట్స్‌ను ఎక్కించడం) ♦ పేషెంట్‌కు ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా రక్తనాళం ద్వారానే అందిస్తారు. (ఇంట్రావీనస్ న్యూట్రిషనల్ సపోర్ట్). - డాక్టర్ ఆరతి బెల్లారి ,సీనియర్ ఫిజీషియన్ -
వాయిస్ విని వైరస్ గుట్టు చెప్పేస్తుంది
లండన్: కృత్రిమ మేథ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ఫోన్ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్ సోకిందో లేదో ఈ యాప్ చెప్పగలదు. కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్‌ను రికార్డ్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. అల్పాదాయ దేశాల్లో ఇది ఎంతో ఉపయోగకరం’ అని పరిశోధకులు చెప్పారు. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో ఈ యాప్ సంబంధ వివరాలను బహిర్గతంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ యాప్ 89 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రీసెర్చ్‌లో పాల్గొన్న అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్కు గురవుతాయి. దాంతో వచ్చిన మార్పులను ఈ యాప్ గుర్తిస్తుందని నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ మహిళా పరిశోధకులు వఫా అజ్బవీ చెప్పారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఆరోగ్యవంతులు, అస్వస్తులైన వారివి కలిపి 4,352 మందికి చెందిన 893 ఆడియో శాంపిళ్లను తీసుకున్నారు. ఇందులో 308 మంది కోవిడ్ రోగుల వాయిస్లూ ఉన్నాయి. యాప్ టెస్ట్‌లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్ మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్ చేసిన యాప్ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది. -
కు.ని. బాధితుల్లో 28 మందికి ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు వికటించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మంది బాధితుల్లో 28 మందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. వారికి అపోలో, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స నిర్వహిస్తున్నారు. ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మిగిలిన 30 మంది మహిళలనూ వేరే ఆసుపత్రులకు తరలించింది. ఇన్ఫెక్షన్కు గురైన వారిని సకాలంలో ఆసుపత్రులకు తీసుకురావడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ నియంత్రణకు ఉపయోగించే వైద్య పరికరాలు సరిగా స్టెరిలైజేషన్ చేయకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మందిలో 10 మందిని శుక్రవారం డిశ్చార్జి చేయాలని భావిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. విడతల వారీగా బాధితులను డిశ్చార్జి చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం బాధితులంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టంచేశారు. ఇన్ఫెక్షన్ కారణంగానే మృతి ఇబ్రహీంపట్నంలో మృతి చెందిన నలుగురి పోస్ట్‌మార్టం వివరాలను వైద్య వర్గాలు వెల్లడించాయి. వారి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని తెలిపాయి. ఇతరత్రా అవయవాలపై ఎలాంటి ప్రభావం కనిపించలేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ కారణంగానే వారు మరణించినట్లు భావిస్తున్నామన్నాయి. కాగా, డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ (డీపీఎల్) పద్ధతిలో క్యాంపుల ద్వారా జరిగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక్కో రోజు 10–15 మంది కంటే ఎక్కువగా కు.ని. ఆపరేషన్లు చేయకూడదని నిర్ణయించినట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు. ఇతర విధానాల్లో కు.ని. సర్జరీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు గురువారం జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఘటన నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడైనా వికటించే సంఘటనలు జరిగితే జిల్లా వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఓరి దేవుడో! చైనాను హడలెత్తిస్తున్న కొత్త వైరస్, 35 కేసులు నమోదు
బీజింగ్: కరోనా వైరస్ ఇంకా అంతమవ్వనేలేదు. కోవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ ప్రపంచ దేశాల్లో నిత్యం కేసులు నమోదవుతూనే ఉన్నాయి. భారత్‌లోనూ కోవిడ్ కేసులు వేలల్లో వెలుగు చూస్తున్నాయి. దీనికి తోడు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త రకం వైరస్ హడలెత్తిస్తోంది. అదే లాంగ్యా హెనిపా వైరస్‌గా వైద్యులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తూర్పు చైనాలోని హెనాన్, షాన్డాంగ్ ప్రావిన్సుల్లో ఇప్పటి వరకు 35 మందికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. జర్వంతో బాధపడుతున్న రోగుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో లాంగ్యా వైరస్‌ను వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ మనుషుల్లో మూడో వంతు మంది ప్రాణాలను తీయగలదని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసులో ఎలాంటి మరణం సంభవించలేదు. అంతేగాక ఈ వైరస్ బారిన పడిన వారిలో కేవలం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. పేషెంట్లు ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. లాంగ్యా వైరస్‌కు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని లక్షణాలు, సమస్యల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. చదవండి: కరోనా అంతమెప్పుడో చెప్పిన చైనా నోస్ట్రాడమస్.. ఇది నిజమేనా! -
China: చైనాలో మరో వైరస్.. ప్రపంచంలోనే ఫస్ట్
బీజింగ్: కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రాగన్ కంట్రీ చైనాను మరో వైరస్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. కాగా, ఇది ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. అయితే, సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న బాలుడు(4) కొద్దిరోజుల క్రితం జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బాలుడికి పరీక్షలు చేయగా అతడికి ఈ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(NHC) స్పష్టం చేసింది. బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులు ఉన్నాయని.. వాటివల్లే H3N8 వేరియంట్ అతనికి సోకిందని చెప్పారు. అయితే, బాధితునితో ఉన్నవారికి ఆ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. దీంతో, చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని.. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. మొదటిసారిగా 2002లో H3N8 వైరస్ ఉత్తర అమెరికా వాటర్‌ఫౌల్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఈ వైరస్ కేవలం గుర్రాలు, కుక్కలు, సీల్స్కు మాత్రమే సోకుతుందని వైద్యశాఖకు చెందిన అధికారులు తెలిపారు. కానీ, తాజాగా మనుషులకు కూడా ఈ వైరస్ సోకడంతో ఆందోళన నెలకొంది. 🚨 China has recorded the first human infection with the H3N8 strain of bird flu — a four-year-old boy from central Henan province. https://t.co/W8wPNgNzMf — Byron Wan (@Byron_Wan) April 27, 2022 ఇది కూడా చదవండి: నార్త్ కొరియా కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్ -
మహిళకు అరుదైన శస్త్ర చికిత్స.. కంటి నుంచి బొట్‌ఫ్లైస్ తొలగింపు!
న్యూఢిల్లీ: ప్రకృతి అంటే ఇష్టపడిని వారు ఉండరు. అందుకోసం చాలామంది అడువులకు లేదా పచ్చదనంతో కూడిని మంచి అందమైన ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. మరి కొద్దిమంది ఏ మాత్రం అవకాశం దొరకిన ప్రపంచంలో మంచి అభయ అరణ్యాలను సందర్శించటం వంటివి చేస్తుంటారు. అయితే అడువుల్లో తిరిగితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కు గురవడమే కాక ఒక్కొసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంటుందంటున్నారు వైద్యులు. జౌను ఇటీవలే అమెజాన్ అడువులను సందర్శించిన ఒక మహళకి మియాసిస్ అనే ఒక రకమైన టిష్యూ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఘటన ఢిల్లీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీ ఆసుపత్రిలోని వైద్యులు 32 ఏళ్ల అమెరికన్ మహిళకు అరుదైన మియాసిస్ అనే టిష్యూ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమెకు సోమవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. మియాసిస్(బోట్ ఫ్లై) అనేది మానవ కణజాలంలో ఫ్లై లార్వా (మాగ్గోట్)కి సంబంధించిన ఇన్ఫెక్షన్. అయితే ఆమె ఆమెరికాలో ఉండగానే తనకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని చ్పెపారు. కానీ అక్కడి అమెరికన్ వైద్యులను సంప్రదించినప్పడూ ఆ రోగ లక్షణానికి సంబంధించిన ఉపశమన మందులు ఇచ్చి పంపించేశారని ఆమె తెలిపారు.అయితే ఆమెకు మళ్లీ నాలుగు వారాల నుంచి శరీరంలో ఏదో కదులుతున్నట్లు అనిపించడం, కనురెప్పలో వాపు, కళ్లు ఎరుపెక్కడం వంటి ఫిర్యాదులతో ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆ అమెరికన్ మహిళ ఒక ప్రయాణికురాలు. కాబట్టి ఆమె ప్రయాణ చరిత్ర గురించి ఆరా తీయగా.... ఆమె ఇటీవలే అమెజాన్ అడువులను సందర్శించి వచ్చినట్లు చెప్పారు. దీంతో మియాసిస్(బోట్ ఫ్లై) కి సంబంధించిన కేసుల గురించి వైద్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆమె ఇన్ఫక్షన్స్‌కి గల కారణాలను నిర్ధారణ చేశారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి దాదాపు 2 సెం.మీ పరిమాణంలోని మూడు ప్రత్యక్ష బొట్ ఫ్లైస్‌ను తొలగించారు. ఒకటి కుడి ఎగువ కనురెప్ప నుంచి, రెండవది ఆమె మెడ వెనుక నుంచి, మూడవది ఆమె కుడి ముంజేయి నుంచి బోట్ ఫ్లైని తొలగించారు. అంతేకాదు ఎలాంటి అనస్థీషియా లేకుండా అన్ని అస్ప్టిక్ జాగ్రత్తలతో 10-15 నిమిషాల్లో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. మియాసిస్(బొట్ ఫ్లైస్) అనే ఇన్ఫక్షన్ ఉష్ణమండల ప్రాంతాలలో నివశించే వారికి వస్తుంది. ఇది ఒక రకమైన పరాన్నజీవి అడవులలో చెట్లను ఆశ్రయించి ఉంటుంది. ఇది మానవుని శరీరంలో సున్నితమైన పొరల్లోకి చొచ్చుకుపోయి మానవ కణజాల వ్యవస్థలను నాశనం చేసి ప్రాణాంతకంగా మారుతుంది. భారతదేశంలో, ఇటువంటి కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇవి దెబ్బలు తగిలి గాయాలు ఏర్పడినప్పుడు లేదా అడువుల్లోనూ, దట్టమైన చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ సంచరించినప్పుడూ ఇలాంటి అరుదైన ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: చెత్త యవ్వారం: కంటెయినర్ల నిండా టన్నుల్లో! యూకేకు షాకిచ్చిన లంక) -
మొన్న డెల్టా, ఒమిక్రాన్.. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఫ్లురోనా.. అసలు దీని కథేంటి?
కరోనా రావడమేమో గానీ అది ప్రజలకు చాలా కొత్త పదాలు నేర్పింది. ఉదాహరణకు... స్ట్రెయిన్, వేరియంట్, డెల్టా, ఒమిక్రాన్... లాంటివి. తాజాగా ఇప్పుడు ‘ఫ్లురోనా’ అనే సరికొత్త పదం కూడా మంచి ట్రెండింగ్‌లో ఉంది. అదేదో మనమూ తెలుసుకుందాం రండి. ఇజ్రాయెల్‌లో ఇద్దరు గర్భిణులకు అటు ‘కరోనా’తో పాటు ఇటు ఇన్ఫ్లుయెంజాగా పిలిచే ‘ఫ్లూ’ లక్షణాలు కనిపించడంతో మొట్టమొదటిసారిగా ‘ఫ్లురోనా’ అనే పదం పుట్టింది. తొలుత ఇజ్రాయెల్‌లో, ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్, ఫిలిప్పిన్స్, హంగరీలలోనూ ఈ తరహా కేసులు రావడం మొదలైంది. సాధారణ కరోనా లక్షణాలైన రుచీ, వాసనలు కోల్పోవడంతో పాటు ‘ఫ్లూ’లో విస్తృతంగా కనిపించే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను గమనించిన డాక్టర్లు... ఈ కొత్త వ్యాధిని ‘ఫ్లురోనా’గా పిలవడం మొదలుపెట్టారు. చదవండి: కరోనా ప్రమాద ఘంటికలు.. ప్రధాని మోదీ కీలక ఆదేశాలు అన్నట్టు సమస్య పాతదా, కొత్తదా? ‘ఫ్లురోనా’ కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ... ఈ సమస్య పాతదా, కొత్తదా అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. ఎందుకంటే 2020 ఫిబ్రవరిలో ఇలాంటి లక్షణాలతోనే ఓ వ్యక్తి న్యూయార్క్ హాస్పిటల్లో చేరినట్టు ‘ద అట్లాంటిక్’ అనే జర్నల్ వెల్లడించింది. ఈ వ్యక్తిని పరీక్షించినప్పుడు తొలుత అతడికి ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉందనీ, కొన్ని వారాల తర్వాత మళ్లీ పరీక్షించినప్పుడు ఈసారి కరోనా కూడా ఉందని తేలింది. దాంతో వారాల వ్యవధిలో అతడి కుటుంబ సభ్యులందరినీ పరీక్షించగా వారందరికీ ఇటు ‘కరోనా’ అటు ‘ఇన్ఫ్లుయెంజా’... ఈ రెండు వైరస్‌లూ ఉన్నట్లు తేలింది. తాజాగా యూఎస్‌లోని హ్యూస్టన్‌లో క్రిస్మస్ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కొందరికి కరోనా, ఇన్ఫ్లుయెంజా... రెండూ ఉన్నట్లు తెలియవచ్చింది. ఓ కేస్ స్టడీలా ‘అలెక్ జెర్లీన్’ అనే విద్యార్థిని పరీక్షించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. ఇదేమీ కొత్త కాదు... ఇలా రెండు రెండు సమస్యలు ఉండటం కొత్త విషయమేమీ కాదంటున్నారు ఫిలిప్పిన్స్ వైద్య పరిశోధకులు. ఆ దేశానికి చెందిన నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఎడ్సెల్ సల్వానా మాట్లాడుతూ... గతంలోనూ ఇలాంటి కొన్ని కేసులు చూశామనీ... చైనాకు చెందిన ఒక రోగిలో కోవిడ్–19, ఇన్ఫ్లుయెంజా, నిమోనియాను కలిగించే స్ట్రెప్టోకోకస్ లాంటి అనేక సమస్యలను తాము చూసిన దాఖలాలున్నాయంటూ వివరించారు. చదవండి: కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల.. 300 భవనాలకు సీల్ ఇక బ్రెజిల్లో సైతం ఓ పక్క ‘ఒమిక్రాన్’ కేసులు రావడం మొదలు కాగానే... ఇలాంటి ఫ్లురోనా కేసులు కనిపిస్తున్నాయంటూ అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. తమ దేశంలోనూ ఇప్పటి వరకు అధికారికంగా కనీసం ‘ఆరు’ ఫ్లురోనా కేసులు కనిపించాయని, ఇంకా 17 కేసులను క్షుణ్ణంగా విశ్లేషించాల్సి ఉందంటూ... రియో డి జెనీరో మున్సిపల్ హెల్త్ సెక్రటరీ అయిన డేనియల్ సోరాంజ్ పేర్కొంటున్నారు. ఇదొక్కటే కాదు... ‘ఫ్లురోనా’ అనే ఓ కొత్త పదం నేర్చుకోవడానికి మాత్రమే మనం పరిమితం కాలేదు. ఇలాంటివే ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు డెల్టా వేరియెంట్‌నూ, ఒమిక్రాన్‌ను కలిపి ‘డెల్‌మైక్రాన్’ అని కూడా అంటున్నారు. (ఇదేమీ కొత్త వేరియెంట్ కాదు. కేవలం లక్షణాల ఆధారగానే). ఇక లక్షణాలను బట్టి ఇప్పటివరకూ ఈ ‘మహమ్మారి’ని ‘ప్యాండమిక్’ అంటూ నిపుణులు పిలుస్తూ వచ్చారు కదా. ఇప్పుడు... రెండ్రెండు జల్బులు కలిసి వచ్చే ఈ ‘ఫ్లూరోనా’ను కొందరు ‘ట్విన్–డమిక్’ అంటూ చమత్కారపూరితంగా పిలుస్తుండటం ఓ కొసమెరుపుగా చెప్పవచ్చు. -
కరోనాపై పోరులో కొత్తమందు!
లండన్: కోవిడ్ వైరస్ ఉపరితలాన్ని అతుకోవడం ద్వారా, సదరు వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించే ఒక మాలిక్యూల్(ఔషధి, చిన్న సైజు ఆర్గానిక్ కాంపౌండ్)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డెన్మార్క్‌కు చెందిన ఆర్హస్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఈ ఔషధి చౌకైనదని, కోవిడ్‌పై పోరులో ఉపయోగపడే యాంటీ బాడీల ఉత్పత్తితో పోలిస్తే దీన్ని ఉత్పత్తి చేయడం తేలికన్నారు. పీఎన్ఏఎస్ జర్నల్‌లో పరిశోధనా ఫలితాలను మంగళవారం ప్రచురించారు. చదవండి: ప్రధాని మోదీని కలిసిన ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ ఈ మాలిక్యూల్ ఆర్ఎన్ఏ ఆప్టమర్స్ జాతికి చెందిన కాంపౌండ్ అని, ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీలో ఉపయోగపడే బిల్డింగ్ బ్లాక్స్ దీనిలో ఉంటాయని తెలిపారు. 3డీ నిర్మితిలో మలిచేందుకు వీలయ్యే జన్యు పదార్ధం(డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ)ను ఆప్టమర్ అంటారు. ఇవి నిరి్ధష్ట లక్షిత కణాలను కనుగొనే శక్తి కలిగి ఉంటాయి. ఈ మాలిక్యూల్ వైరస్ ఉపరితలానికి అతుక్కోగానే వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్ మానవ కణంలోకి ప్రవేశించకుండా నిరోధించడం జరుగుతుందని పరిశోధకులు తెలిపారు. దీన్ని కేవలం కోవిడ్ నిరోధానికే కాకుండా, గుర్తించడానికి వాడుకోవచ్చన్నారు. -
అసలే చలికాలం..సైనసైటిస్‌కు ఈ జాగ్రత్తలు తీసుకుందాం..
ప్రస్తుత చలి వాతావరణం సైనసైటిస్కి అత్యంత అనుకూలించే సీజన్. అంతేకాదు అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులు కూడా. ఎండగా ఉండాల్సిన రోజుల్లో వర్షం, వర్షాకాలంలో ఎండ.. మధ్యాహ్నం సమయంలో చల్లని గాలులు... ఇటీవల అన్నీ ఇలాంటి చిత్ర విచిత్ర వాతావరణ పరిస్థితులే చూస్తున్నాం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సర్వ సాధారణ ఆరోగ్య సమస్య సైనసైటిస్. ఈ నేపధ్యంలో హైదరాబాద్, కొండాపూర్‌లో ఉన్న అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఇఎన్‌టి డాక్టర్ మహమ్మద్ నజీరుద్దీన్ సైనసైటిస్‌కు లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారిలా... శ్వాస..ఇన్ఫెక్షన్... సైనసైటిస్ అనేది సైనస్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది సైనస్ లైనింగ్ కణజాలంలో వాపు కారణంగా ఏర్పడుతుంది. సైనస్‌లు సన్నని శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ముక్కు మార్గాల ద్వారా బయటకు వస్తుంది. ఇదే ముక్కును శుభ్రంగా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచుతుంది. ఈ సైనస్‌లు సాధారణంగా గాలితో నిండినప్పుడు, ద్రవంతో నిండినప్పుడు, సైనసైటిస్‌కు దారితీసే ఇన్ఫెక్షన్లకు లోనుకావడం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎవరికైనా రావచ్చు కానీ అలర్జీలు, ఉబ్బసం మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు తరచుగా సైనస్ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. కొన్ని లక్షణాలు: ► దట్టమైన రంగు మారిన ద్రవంతో ముక్కు నుంచి స్రావాలు ► ముఖం నొప్పి 10 రోజులకు మించి ఉండడం ► ముక్కు మూసుకుపోవడం లేదా మూసుకుపోవడం వల్ల ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ► కళ్ళు, బుగ్గలు, చెవులు, తల, పై దవడ మరియు దంతాల చుట్టూ నొప్పి, సున్నితత్వం, వాపు ► వాసన మరియు రుచి తగ్గినట్టు అనిపించడం ► గొంతు నొప్పి, నోటి దుర్వాసన, అలసట కారణాలు ► సైనసైటిస్ సాధారణంగా వైరస్, బాక్టీరియా లేదా ఫంగస్ వల్ల వస్తుంది, ► సాధారణ జలుబు వల్ల సైనస్‌లు ఉబ్బి ఇన్ఫెక్షన్లకు దారితీసినప్పుడు సైనసైటిస్‌కు దారి తీస్తుంది. ► కాలానుగుణ అలెర్జీలు పుప్పొడి లేదా ధూళి వంటి అలెర్జీ కారకాలకు శరీరం లోనైనప్పుడు సైనస్‌లు ఉబ్బి, సైనసైటిస్‌కు దారితీసే మార్గాన్ని అడ్డుకుంటుంది. ► ధూమపానం సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది, పొగాకు పొగ నాసికా వాయుమార్గాలను చికాకుపెడుతుంది, తద్వారా శరీరం మరింత శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది, దీని వలన అలెర్జీలు లేదా జలుబు సైనసైటిస్‌కు దారితీసే అవకాశం ఉంది. చికిత్స ► సైనసైటిస్ తీవ్రతను బట్టి వివిధ పద్ధతులలో చికిత్స చేయవచ్చు. డీకోంగెస్టెంట్లు, సెలైన్ ద్రావణంతో నాసికా నీటిపారుదల, యాంటీబయాటిక్స్, పుష్కలంగా నీరు త్రాగడం వంటివి ఈ ఇన్ఫెక్షన్స్కు ప్రాథమిక చికిత్సగా చెప్పొచ్చు. ► దీర్ఘకాలిక/క్రానిక్ సైనసైటిస్ కోసం అలెర్జీలు. ఇంట్రానాసల్ స్టెరాయిడ్ స్ప్రేలు, ఓరల్ హిస్టామిన్ మాత్రలు, యాంటిహిస్టామైన్ స్ప్రేలు చికిత్సలో భాగంగా వైద్యులు సూచిస్తారు. ► అదనపు మందులను కలిగి ఉండే సెలైన్ సొల్యూషన్స్ ఉపయోగించి చేసే నాసికా ప్రక్షాళన కూడా సైనస్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సమర్థవంతమైన సాధనం. ► వేరే చికిత్సలు ఏవీ ఇన్ఫెక్షన్స్ నియంత్రించడంలో విజయవంతం కానప్పుడు సమస్యను పరిష్కరించడానికి శస్త్రచికిత్స... తర్వాత ఇఖీ స్కాన్ చేయబడుతుంది. నివారణ ప్రధానం.. ► తగినంత అవగాహన, ముందస్తు జాగ్రత్తలతో సైనసైటిస్‌ను నివారించవచ్చు. జలుబు లేదా ఇ¯Œ ఫెక్ష¯Œ లతో అనారోగ్యంగా ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని వదులుకోవాలి. –భోజనానికి ముందు చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. ► వైద్యుల సూచనలు పాటించడం ద్వారా తమకేవైనా అలర్జీలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. ► ఊపిరితిత్తులు, నాసికా భాగాలకు చికాకు కలిగించే, మంటను కలిగించే పొగాకు పొగ వంటి కాలుష్య కారకాలకు గురికాకూడదు. పైన పేర్కొన్న లక్షణాలతో పాటు, ఏవైనా ఇతర అసాధారణతలు గమనించినట్లయితే తక్షణ నిపుణుల సంప్రదింపులు అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది శరీరం నుండి అవాంఛిత టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. –డాక్టర్ మహమ్మద్ నజీరుద్దీన్ఇఎన్టి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ -
ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కరోనా.. కోర్టు తీర్పు ఏంటంటే..
కౌలాలంపూర్: ఓ వ్యక్తి కోవిడ్ సోకడం వల్ల కోర్టు చివరి నిమిషంలో మరణశిక్ష అమలుపై స్టే విధించింది. ఈ ఘటన సింగపూర్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. 2009లో నాగేంద్రన్ కే ధర్మలింగం పోలీసులు అరెస్టు చేశారు. మరుసటి సంవత్సరమే అతనికి మరణశిక్ష విధించారు. ముందస్తు తీర్పు ప్రకారం బుధవారం రోజు అతనికి ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి ఈ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోసారి సైకియాట్రి పరీక్షలు చేయాలని కోర్టుకు నాగేంద్రన్ లాయర్ కోరారు. మంగళవారం సవాల్‌పై విచారణ జరగనున్నందున అప్పీల్ కోర్టులో చివరి ప్రయత్నంగా అప్పీల్ దాఖలు చేయడంతో ఉరిశిక్షను నిలిపివేశారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణుల బృందం సోమవారం ఈ కేసు చుట్టూ పెరుగుతున్న ఆందోళనలకు తమ స్వరాన్ని జోడించింది, మేధో వైకల్యం ఉన్న వ్యక్తులను ఉరితీయకూడదని పేర్కొంది. అతని శిక్షను తగ్గించాలని యూరోపియన్ యూనియన్ పిలుపునిచ్చింది. నాగేంద్రన్ మరణశిక్షను తగ్గించాలని కోరుతూ ఇప్పటికే ఆన్లైన్ పిటిషన్‌పై దాదాపు 70,000 సంతకాలు వచ్చాయి. కానీ సింగపూర్ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉరితో ముందుకు వెళ్లాలనే నిర్ణయాన్ని సమర్థించింది. చివరికి ఉరిశిక్ష అమలు జరిగితే, సింగపూర్‌లో 2019 తర్వాత ఇది మొదటిది అవుతుంది. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. -
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు అస్వస్థత
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (75) అస్వస్థతకు గురయ్యారు. దీంతో మాజీ అధ్యక్షుడిని చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడికల్ సెంటర్లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల క్లింటన్ అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు వెల్లడించారు. డాక్టర్ అల్పేస్ అమీన్, డాక్టర్ లిసా బార్డాక్ నేతృత్వంలో క్లింటన్‌కు చికిత్స కొనసాగుతోంది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన క్లింటన్ మంగళవారం స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. 1993 నుంచి 2001 మధ్య బిల్ క్లింటన్ అమెరికాకు 42వ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. -
పెళ్లైన 23 ఏళ్లకు తల్లి అయ్యింది.. అంతలోనే ప్రాణాలొదిలింది
కోరుట్ల: పెళ్లి అయిన 23 ఏళ్లకు మాతృత్వపు ఆశలు తీరినా 15 రోజులకే అవి ఆవిరయ్యాయి. ఇద్దరు మగశిశువులకు జన్మనిచ్చి కన్నుమూసింది ఓ తల్లి. తనివితీరా బిడ్డలను చూసుకోకముందే తనువు చాలించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్‌కు చెందిన పొన్నం స్వరూప (42), అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు. పెళ్లి అయి 23 ఏళ్లు అయినా వారికి సంతానంలేదు. సంతానం కోసం ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం ఫలించి పది నెలల క్రితం స్వరూప గర్భం దాల్చింది. జూలై 19న ఆమె మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్ద రు మగ శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో పుట్టిన వెంటనే వారిద్దరినీ అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో మెట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన స్వరూప మూడు రోజుల క్రితం పిల్లలను చూసేందుకు హైదరాబాద్ వెళ్లింది. తన పిల్లలతో ఆనందంగా గడపకముందే ఇన్ఫెక్షన్తో అనారోగ్యం పాలైంది. హైదరాబాద్‌లోనే మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. -
డెల్టా వేరియంట్‌పై షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మూడో వేవ్ ముంచుకొస్తోందన్న ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ‘డెల్టా వేరియంట్’ పై తాజా నివేదిక మరింత ఆందోళన పుట్టిస్తోంది. ఇది ఇతర వేరియంట్ల కంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందని, అత్యంత ప్రమాదకరమైన చికెన్‌పాక్స్ కంటే సులభంగా వ్యాప్తి చెందుతుందని యూఎస్ హెల్త్ అథారిటీని ఉటంకిస్తూ అక్కడి మీడియా నివేదించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇంకా ప్రచురితం కాని డేటా ప్రకారం భారతదేశంలో ముందుగా గుర్తించిన డెల్టా వేరియంట్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల నుంచి బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలను ప్రచురించాయి. డెల్టా సోకిన వ్యక్తిలో వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని తాజా అధ్యయనం తెలిపింది. దీనిపై శుక్రవారం సీడీసి అదనపు డేటాను ఏజెన్సీ ప్రచురిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా విస్తరిస్తోందని, వ్యాక్సిన్ల రక్షణ వలయం కూడా దీన్ని అడ్డుకోలేదని, మరింత విధ్వంసకరంగా విజృంభించే ప్రమాదముందని సీడీసీ వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే, వారి ముక్కు, గొంతులో ఎంత వైరస్ ఉంటుందో, వ్యాక్సిన్ తీసుకోని వారిలో కూడా అంతే వైరల్ లోడ్ ఉంటుందని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ పీ వాలెన్స్కీ వెల్లడించారు. వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువనీ, మెర్స్, సార్స్, ఎబోలా, కామన్ కోల్డ్, సీజనల్ ఫ్లూ, స్మాల్ పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. అలాగే డెల్టా వేరియంట్‌తో చాలా తీవ్రమైన ముప్పు అని వస్తున్న డేటాతో ఆందోళన రేపుతోందని, దీనిపై తక్షణమే గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నారు. అందుకే అందరూ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఇతరులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వాలెన్స్కీ చెప్పారు. కాగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారితో వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు తాజాగా తేలింది. దీంతో అందరూ మాస్క్ ధరించాలని సీడీసీ మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. టీకా వైరస్ తీవ్రతను 90 శాతం అడ్డుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ లేదా ట్రాన్స్‌మిషన్‌ను నివారించడంలో తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు అని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇతర కేసులతో పోలిస్తే వైరల్ లోడ్ అధికంగా ఉందనీ, ఆల్ఫా వేరియంట్ సోకినవారు గాలిలోకి వదిలే లోడ్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌తో గాలిలోకి విడుదలయ్యే వైరల్ లోడ్ పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సీడీసీ అంచనా వేసింది. -
చైనాలో మరో వైరస్, ఒకరు మృతి
బీజింగ్: చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే కరోనా మహమ్మారి పుట్టిందన్న విమర్శల మధ్య చైనాలో మనుషుల్లో మరో వైరస్ ఉనికి కలకలం రేపుతోంది. మంకీ బీ వైరస్ సోకి తొలిసారిగా బీజింగ్‌కు చెందిన పశువుల వైద్యుడు (53) కన్నుమూశాడు. ఈ మంకీ బీవైరస్ (బీవీ) సోకిన తొలి మానవ కేసుగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం వెల్లడించింది. అయితే అతనితో సన్నిహితంగా మెలిగిన వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్టు తెలిపింది. నాన్-హ్యూమన్ ప్రైమేట్లపై పరిశోధన చేస్తున్న సంస్థలో పనిచేసే పశువైద్యుడు మంకీ బీవీ వైరస్ బారినపడ్డాడు. మొదట వికారం వాంతులు లాంటి లక్షణాలతో బాధపడ్డాడు. అనేక ఆసుపత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో చివరికి మే 27న మరణించాడు. మార్చి ప్రారంభంలో చనిపోయిన రెండు కోతులను విడదీసిన ఒక నెల తరువాత అతను వైరస్ బాడిన పడ్డారని సీడీసీ వెల్లడించింది. ఏప్రిల్‌లో అతని సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని సేకరించిన పరిశోధకులు అతన్ని మంకీ బీవీకి పాజిటివ్‌గా గుర్తించారు, అయితే అతని దగ్గరి పరిచయాలున్నవారి నమూనాల పరీక్షలు నెగిటివ్ వచ్చాయి. 1932 లో గుర్తించిన ఇది మకాకా జాతికి చెందిన మకాక్లలో ఆల్ఫాహెర్పెస్వైరస్ ఎంజూటిక్. డైరెక్ట్ లేదా శారీరక స్రావాల ద్వారా సోకుతుంది. మరణాల రేటు 70 శాతం నుండి 80 శాతం వరకు ఉంది. -
మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..!
సాక్షి,హైదరాబాద్: ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్కు తప్పనిసరి. కరోనా బారినపడకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాసు్కలు ధరిస్తున్నారు. చాలాసేపు మాస్కు ధరించడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తోంది. ఇది పరోక్షంగా గొంతు నొప్పి, చిగుళ్లవాపు, బ్లీడింగ్ సమస్యలకు కారణమవుతోందని దంత వైద్య నిపుణలు చెబుతున్నారు. కనీసం ఆరు నెలలకోసారైనా నోటిని క్లీనింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇతర చికిత్సలతో పోలిస్తే.. దంత చికిత్సలు ఎమర్జెన్సీ కాకపోవడంతో చాలా మంది వీటిని వాయిదా వేసుకుంటున్నారు. కోవిడ్‌కు భయపడి గతేడాది నుంచి వీటికి దూరంగా ఉంటున్నారు. అయితే నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నోటిలో సూక్ష్మజీవులు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని దంత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లపై ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ పలు సూచనలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 90 శాతం మందిలో దంత సమస్యలు.. ప్రస్తుతం జనాభాలో 90 శాతం మంది ఏదో ఒక దంత సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 45 నుంచి 48 శాతం మంది పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతుండగా.. 75 శాతం మంది చిగుళ్లవాపుతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. జన సమూహంలోకి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాక్ ధరించడం తప్పనిసరిగా మారింది. దీంతో పీల్చిన గాలే పీల్చడంతో నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. నోటి దుర్వాసన, గొంతు నొప్పికే కాకుండా గుండె రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తూ గుండెపోటుకు కారణమవుతుంది. నోరు ఎండిపోయి సూక్ష్మజీవుల వృద్ధి నిజానికి 6 నెలలకోసారి దంతాలను క్లీన్ చేయించుకోవాలి. లేదంటే దంతాల చుట్టూ పాచీ పేరుకుపోయి వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌కు నిలయంగా మారుతుంది. అనేక మంది చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నారు. దంతాల మధ్యలో పాచీ పేరుకుపోయి చిగుళ్ల సమస్యలు తలెత్తి దంతాలు పటుత్వాన్ని కోల్పోతాయి. రోజంతా మాస్కు ధరించడం వల్ల మంచినీరు తక్కువగా తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంటుంది. దీంతో దుర్వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతుంది. ఇప్పటికే కోవిడ్ టీకా తీసుకున్న వారు దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. పిప్పి పళ్లు ఉంటే బ్లాక్ ఫంగస్ ముప్పు.. కరోనా బారిన పడి, ఆస్పత్రుల్లో చేరిన వారిలో చాలామందికి స్టెరాయిడ్స్ అవసరమయ్యాయి. చికిత్సల్లో భాగంగా అవసరానికి మించి స్టెరాయిడ్స్ వాడటం వల్ల కొందరికి బ్లాక్‌ఫంగస్ సోకింది. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడి ఇప్పటికే పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువ. బ్లాక్ ఫంగస్ లక్షణాల్లో చిగుళ్లు, దవడ వాపు కూడా లక్షణం కావడంతో ఏది బ్లాక్ ఫంగసో? ఏదీ చిగుళ్ల వాపు వ్యాధో? గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది. పిల్లల్లో కూడా దంతాలను సరిగా శుభ్రం చేయకపోవడం, ఏడాదిగా ఫాలోఅప్ చికిత్సలకు దూరంగా ఉండటంతో వారిలోనూ దంత సమస్యలు రెట్టింపయ్యాయి. చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం -
గతేడాది కరోనా.. ఇప్పుడు బ్రూసోల్లోసిస్
బీజింగ్: కరోనా వైరస్ ఈ ప్రపంచంలోకి ప్రవేశించి దాదాపు ఏడాది కావాస్తోంది. వుహాన్ ల్యాబ్ నుంచి బయటపడిందని భావిస్తున్న ఈ మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌలో 6,000 మందికి పైగా బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి పాజిటివ్ వచ్చినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా స్థానికంగా ఉన్న ఓ వ్యాక్సిన్ ప్లాంట్ నుంచే ఏడాది క్రితం లీకైనట్లు సమాచారం. ఈ క్రమంలో లాన్జౌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణంలోని 55,725కి పరీక్షలు చేశాం. వీరిలో 6,620 మందికి పాజిటివ్‌గా తేలింది’ అని తెలిపారు. పశువుల మీద ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 14 నాటికి కేసుల సంఖ్య 3,245 ఉండగా.. ప్రస్తుతం 6000 పైగా నమోదయ్యాయి. బ్రూసెల్లోసిస్ లక్షణాలు జంతువులతో ప్రత్యక్ష సంబంధం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, త్రాగటం ద్వారా లేదా గాలిలో ఉండే ఏజెంట్లను పీల్చడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో కూడా ఫ్లూలో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు దీర్ఘకాలికంగా మారి.. ఇక ఎన్నటికి తగ్గకపోవచ్చు అని వైద్యులు తెలిపారు. ఈ మేరకు లాన్జౌ హెల్త్ కమిషన్ సెప్టెంబర్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. (చదవండి: సెకండ్ వేవ్.. తస్మాత్ జాగ్రత్త! ) చైనా యానిమల్ హస్బండ్రీ ఇండస్ట్రీ కో యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి ఇది బయటకు వచ్చిందని ప్రకటనలో తెలిపింది. ‘కంపెనీ గత ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్యలో బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ల తయారీకి గడువు ముగిసిన క్రిమిసంహారక మందులను ఉపయోగించింది. ఆ తరువాత బ్యాక్టిరియాను కలుషితమైన వ్యర్థ వాయువులో వదిలివేయడంతో అవి ఏరోసోల్స్‌ని ఏర్పాటు చేశాయి. ఆ తరువాత గాలి ద్వారా అవి లాన్జౌ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిసర ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. దాంతో మొదటి సారి గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ బ్రూసెల్లోసిస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చింది’ అని ఆరోగ్య కమిషన్ తెలిపింది. గ్లోబల్ టైమ్స్ ప్రకారం, బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వర్క్‌షాప్‌ను గత ఏడాది డిసెంబర్లో మూసివేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో దీనిని కూల్చివేశారు.(చదవండి: పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది..) విదేశీ విమానాలపై బ్యాన్ వందేభారత్ మిషన్‌లో భాగాంగా తాజాగా భారత్ నుంచి చైనాకు వెళ్లిన ఎయిరిండియా విమానంలో 19 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. నిషేధం తాత్కలికమేనని.. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని చైనా ప్రకటించింది. -
పంటి నొప్పిని పట్టించుకోండి లేదంటే..
పన్ను నొప్పే కదా అని తేలిగ్గా తీసుకోకండి. పంటిలో ఏర్పడిన చిన్న ఇన్ఫెక్షన్ను నియంత్రించక పోవడంతో ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో 5 నెలల పాటు ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది. రెండుసార్లు గుండె ఆగిపోయి ప్రాణం పోయినంత పనైంది. దాదాపు 30 కిలోల బరువును కోల్పోయింది. నమ్మలేకపోతున్నారా! ఇది నిజం. తూర్పు యార్క్‌షైర్‌లోని స్నైత్కు చెందిన రెబెక్కా డాల్టన్ (30)కు గత ఏడాది డిసెంబరులో జ్ఞాన దంతంలో చీముగడ్డ ఏర్పడింది. యాంటీబయాటిక్స్ ఇచ్చిన డాక్టరు దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆమె నిండు గర్భిణీ కావడంతో పట్టించుకోలేదు. దీంతో మార్చి నెలలో మళ్లీ తిరగబెట్టింది. సమస్య తీవ్రమై ఇన్ఫెక్షన్ మెదడు దాకా పాకిపోయింది. ఫలితంగా మతిమరుపు సమస్య ఉత్పన్నమైంది. అంతేకాదు నడవడానికి కూడా ఇబ్బంది పడటంతో ఆమె తిరిగి వైద్యులను సంప్రదించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మెదడు, గుండె, కాలేయంలో బాక్టీరియా గడ్డలను గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆమెకు హల్ రాయల్ వైద్యశాలలోని న్యూరోలాజికల్ విభాగానికి తరలించారు. ఐదు నెలలు ఆసుపత్రిలో చికిత్స తర్వాత, రెబెక్కా కోలుకుని గత వారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఘటన తన జీవితాన్నే మార్చేసిందనీ, 30 ఏళ్ల వయసులో కనీసం టాబ్లెట్ కూడా తీసుకోలేని స్థితిలో ఒకరి మీద ఆధారపడటం తనను షాక్‌కు గురిచేసిందని రెబెక్కా తన బాధలను గుర్తు చేసుకున్నారు. 30 కిలోల కంటే ఎక్కువ బరువు కోల్పోయాననీ, ఇప్పటికీ తన పని తాను చేసుకోలేకపోతున్నానని వాపోయారు. ఈ ఉదంతం జీవితంపై తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పుకొచ్చారు. సో... బీకేర్‌ఫుల్. యాంటిబయోటిక్స్ వాడాం కదా..నొప్పి పోయిందిలే అనే నిర్లక్ష్యం అసలు వద్దు..ఎందుకంటే చాలాసార్లు పరిస్థితి చేయిదాటి పోయేంతవరకు ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి రావచ్చు. అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మరోవైపు ఆమెకు కచ్చితంగా కరోనా వస్తుందని భయపడిపోయానని రెబెక్కా తల్లి తెలిపారు. అదృష్టవశాత్తూ కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ రావడం సంతోషం కలిగించిందన్నారు. కాగా గతంలో యుకెకు చెందిన ఆడమ్ మార్టిన్ కూడా దాదాపు ఇదే సమస్యతో ప్రాణాపాయం నుంచి బైటపడ్డారు. పళ్లలో పాప్ కార్న్ ఇరుక్కోవడంతో అది గమ్ ఇన్ఫెక్షన్కు దారి తీసింది. అది కాస్తా దంతాల నుంచి గుండె వరకు వ్యాపించడంతో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండెల్లో ఒక కవాటాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. -
కరోనా : లాక్డౌన్ సడలింపుల వేళ గుడ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ / సియోల్: దక్షిణ కొరియాలోని కొరియన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధన కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల నుంచి వైరస్ వ్యాప్తి చెందదని వెల్లడించింది. వైరస్ నుంచి కోలుకున్న రోగులకు తిరిగి వైరస్పాజిటివ్ రావడం, వారినించి కూడా విస్తరిస్తోందన్న ఆందోళనపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని తేల్చింది. దీనికి ప్రకారం కరోనావైరస్ నుండి కోలుకున్న వారంలోనే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు (రీపాజిటివ్ రోగులు) ఈ వైరస్‌ను వ్యాప్తి చేయలేరని తెలిపింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చాలా దేశాలు లాక్డౌన్ నిబంధనలను సడలించి, ఆర్థిక కార్యలాకాలను ప్రారంభించాలని చూస్తున్న తరుణంలో ఈ ఫలితాలు సానుకూల సంకేతంగా నిలుస్తున్నాయి. కోలుకున్న తర్వాత మళ్లీ వైరస్ బారిన పడిన 285 కోవిడ్-19 రోగులపై దక్షిణ కొరియా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. వీరు వ్యాప్తి చెసే వైరస్ కణాల్లో జీవం వుండదని, చనిపోయిన కణాలతో వైరస్‌ను వ్యాప్తి కాదని నివేదించింది. ఈ నేపథ్యంలో కోలుకునే వ్యక్తులు తిరిగి వైరస్‌ను వ్యాప్తి చేస్తారనే అందోళన అససరం లేదని స్పష్టం చేసింది. దీంతో దక్షిణ కొరియా వైరస్‌కు సంబంధించిన ప్రోటోకాల్స్ నిబంధనలను సవరించింది. ఒకసారి కోలుకొని, ఐసోలేషన్ పూర్తి చేసిన రోగులకు పనికి లేదా పాఠశాలలకు వెళ్లేందుకు వైరస్ పరీక్షలు చేయవలసిన అవసరం లేదని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. కాగా ఆంక్షలున్నప్పటికీ, కొన్ని సడలింపులతో దేశవ్యాప్తంగా మే 18 నుండి నాలుగవ లాక్డౌన్ అమల్లో వుంది. దీంతో దేశమంతా వ్యాపార కార్యకాలాపాలు తిరిగి ప్రారంభ మైనాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4,895,033 మంది కరోనా బారినపడగా, 320,192 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా వైరస్ కారణంగా 3,164 మంది మరణించగా కేసులు సంఖ్య లక్ష మార్క్(101,261)ను దాటేసింది. దక్షిణ కొరియాలో 263 మరణాలు 11,078 కేసులు నమోదయ్యాయి. -
నాకు కరోనా లేదు.. కానీ: కైలీ జెన్నర్
లాస్ ఏంజిల్స్: ఇరవై ఏళ్లకే బిలియనీర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పారు టీవి స్టార్, మేకప్ మొగల్ కైలీ జెన్నర్. అది కూడా కేవలం సోషల్ మీడియా ద్వారా బ్యూటీ ప్రొడక్టులను, కాస్మొటిక్స్ విక్రయిస్తూ ఈ ఘనత సాధించారు. 2015లో సొంతంగా ‘కైలీ లిప్ కిట్స్’ బ్రాండ్‌ను ప్రారంభించిన కైలీ.. ప్రస్తుతం కోట్లాది మంది అమ్మాయిలకు ఫ్యాషన్ ఐకాన్. కాగా ప్రస్తుతం కైలీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది కైలీ.. కరోనా వైరస్ బారీన పడినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. (కరోనా నుంచి కోలుకున్న హీరోయిన్ ) ఘోర మహమ్మారి కోవిడ్-19తో కైలీ పోరాడుతున్నారు అని ఓ అభిమాని సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో.. తాజాగా ఈ వార్తలను కైలీ కొట్టి పారేశారు. ఆమె కేవలం గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ‘ఆశ్చర్యంగా ఉంది. నాకు కరోనా లాంటి లక్షణాలు ఎప్పుడూ లేవు. నాకు గొంతులో భయంకరమైన ఇన్ఫెక్షన్ ఉంది. దానితోనే నేను ఇప్పటి వరకు పోరాడుతున్నాను.’ అని కైలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేశారు. ప్రముఖ అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్‌ను కైలీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. (కరోనా: ఒకే రోజులో 70 డబ్బాల కోక్, వయాగ్ర డెలివరీ) వీరికి ఓ ఆడపల్ల కూడా ఉంది. అయితే ఇటీవల కైలీ తన భర్తతో విడిపోయారు. ప్రస్తుతం ప్యాలెస్‌తో తాను తన కూతురు మాత్రమే ఉంటున్నారు. కైలీ ఫేస్బుక్ ఫాలోయర్ల సంఖ్య రెండు కోట్లకు పైనే. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 కోట్లకుపైనే ఫాలోయర్స్ ఉన్నారు. ట్వీటర్ ఫాలోయర్స్ కౌంట్ దాదాపు మూడు కోట్లు. కర్దాషియన్ ఫ్యామిలీ మెంబర్‌గా గుర్తింపు ఉన్నప్పటికీ తెలివితేటలతో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు కైలీ జెన్నర్. i had strep and staph in my throat and was bleeding from the mouth it was HORRIBLE #kuwtk — Kylie Jenner (@KylieJenner) March 27, 2020 -
ప్రియమైన మిత్రులారా.. శత్రువులారా...
‘‘మీరు నా పట్ల చూపించిన ప్రేమ, శ్రద్ధకు ధన్యవాదాలు.. నాకేం కాలేదు. బాగున్నాను’’ అంటూ సీనియర్ నటుడు రిషీ కపూర్ తన ట్వీటర్లో పేర్కొన్నారు. విషయం ఏంటంటే.. స్వల్ప అనారోగ్యంతో రిషి ఆస్పత్రిలో చేరారు. అంతే.. ఆయనకేదో అయిందంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తకు ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నారు రిషి. ‘‘ప్రియమైన మిత్రులారా.. శత్రువులారా.. ట్వీటర్లో నన్ను ఫాలో అవుతున్న అభిమానుల్లారా నా ఆరోగ్యం గురించి మీరు చూపించిన శ్రద్ధకు ధన్యవాదాలు. 18 రోజులుగా ఢిల్లీలో షూటింగ్ చేస్తున్నాను. పొల్యూషన్ వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడ్డాను. అందుకని ఆస్పత్రిలో చేరాను. అంతకు మించి వేరే ఏమీ లేదు. నేను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ముంబై వచ్చేశాను. చాలామంది అల్లిన కథలకు ముగింపు ఇస్తున్నాను. ముంబైలో హాయిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు రిషీ కపూర్. ప్రస్తుతం ఆయన ‘షర్మాజీ నమ్కీన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. -
వచ్చిందా రాలేదా ఆ శంక మనకేల...కరోనా వైరస్‌ను నివారిద్దామిలా!
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి, అక్కడ మాత్రమే గాక మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించిన పుకార్లు మన తెలుగు రాష్ట్రాల్లోనూ షికారు చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోనూ ఇది విస్తరించిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. అదెంత ప్రభావపూర్వకమైనదో, ప్రపంచవాసులందరినీ ఎంతగా బెంబేలెత్తిస్తోందో అందరికీ తెలిసిందే. అందుకే అది హైదరాబాద్‌కు వచ్చిందా, రాలేదా అన్న శంక కంటే... వచ్చినా రాకున్నా దాన్ని నివారించుకోవడం ఎలాగో తెలుసుకోవడం మంచిది. అందుకే దాని లక్షణాలూ, నివారణ తేలిగ్గా అర్థమయ్యేలా ఇక్కడ వివరిస్తున్నాం. ఈ జాగ్రత్తలు పాటిస్తే... కరోనా మాత్రమే కాదు... మరే వైరస్ అయినా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లయినా నివారితమవుతాయి. చికిత్స కంటే నివారణ మెరుగు (ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్) అన్న సామెత మనమంతా ఎరిగిందే. ఇందుకు ఉపయోగపడేదీ ఈ బొమ్మల కథనం కరోనా వైరస్‌తో జలుబు లాంటి ఇన్ఫెక్షనే వస్తుంది. ఇది అప్పర్ ఎయిర్‌వే రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే.. శ్వాస వ్యవస్థ పైభాగానికే పరిమితమైతే జలుబులాగే తగ్గిపోతుంది. కానీ అది శ్వాసవ్యవస్థ అంతర్గత భాగాలైన ఊపిరితిత్తులోకి వెళ్తే నిమోనియాకి దారితీసి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి ప్రమాదం చిన్నపిల్లలు, వృద్ధుల్లాంటి రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో ఉంటుంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. నివారణకు చేయాల్సిందేమిటి? 1 చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడం ద్వారా మంచి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించాలి. ఇలా చేతులు కడుక్కునేందుకు సబ్బు లేదా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్Ô >నిటైజర్లు వాడాలి. మరీ ముఖ్యంగా దగ్గడం, తుమ్మడం చేశాక... అడ్డుపెట్టుకున్న ఆ చేతులను శుభ్రంగా కడగాలి. టాయిలెట్‌కు వెళ్లొచ్చాక సబ్బుతో గాని, లిక్విడ్ సోప్తోగాని చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలి. ఇక వైద్యరంగంలో పనిచేసే (మెడికల్ ప్రొఫెషనల్స్) వారంతా రోగిని లేదా అతడి వస్తువులను ముట్టుకోగానే చేతులను శుభ్రం చేసుకోవాలి. 2 సాధ్యమైనంత వరకు నోటిని, ముక్కును, కళ్లను చేతులతో ముట్టుకోకండి. ముక్కును, కళ్లను అదేపనిగా రుద్దుకోకండి. 3 బాగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు వీలైనంతవరకు మాస్క్ ధరించండి. 4 రోగి ఉపయోగించిన వస్తువులను వారి తాలుకు ఇతర సామగ్రిని వీలైనంతవరకు తాకకండి. 5 వీలైనంత వరకు తుమ్ముతున్నప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు డిస్పోజబుల్ టిష్యూ పేపర్స్ గనక అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించి, తక్షణం వాటిని పారేయండి. అలా టిష్యూ పేపర్ అందుబాటులో లేనివారు... పొడుగు చేతుల చొక్కా (లాంగ్‌స్లీవ్స్ షర్ట్) వేసుకొని ఉంటే... తమ మోచేతి ప్రాంతాన్ని నోరు, ముక్కుకు అడ్డుపెట్టుకొని దగ్గడం/తుమ్మడం చేయాలి. 6 మంచి పోషకాహారం తీసుకోవడం, సాధారణ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అందరికీ మేలు చేస్తుంది. 7 తినేముందర పండ్లు, కోసి వండే ముందర కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత శుభ్రంగా కడగండి. 8 ఆరోగ్యకరమైన అలవాట్లతోపాటు రోజూ వ్యాయామం చేయండి. తగినంతగా నిద్రపొండి. వీటిన్నింటివల్ల మన ఆరోగ్యం బాగుండటంతో పాటు మన రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. అది మనల్ని కరోనా వైరస్ మాత్రమే కాదు... మరెన్నో జబ్బులనుంచీ కాపాడుతుంది. 1 నోరు, ముక్కు గుండా ప్రవేశిస్తుంది 2 ఏదో ఒక కణాన్ని ఆశ్రయించి ఆవాసం ఏర్పరచు కుంటుంది. 3 అలా ఆవాసం ఏర్పరచుకున్న వైరస్... పొరుగునున్న కణాలన్నింటికీ విస్తరిస్తుంది. -
వామ్మో సెప్సిస్..!
వాషింగ్టన్: సెప్సిస్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? రక్తానికి ఇన్ఫెక్షన్ సోకడం. శరీరంలో ప్రవహించే రక్తం అంతా కలుషితమైపోయి రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో మనిషి కుంగి కృశించిపోవడం. ఇప్పుడు ఈ జబ్బు ప్రాణాంతకంగా మారింది. ఇది సోకిందంటే శరీరం అంతా కుళ్లిపోయి మనిషి ప్రాణాలను తోడేస్తుంది. గతంలో కంటే సెప్సిస్ సోకిన మృతులు రెట్టింపు అయ్యాయని లాన్సెట్ జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. సెప్సిస్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతీ అయిదుగురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారని పిట్స్బర్గ్ వర్సిటీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. 2017లో ప్రపంచవ్యాప్తంగా సెప్సిస్ ఇన్ఫెక్షన్ కారణంగా 1.1 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినట్టు లాన్సెట్ జర్నల్ నివేదికలో వెల్లడించింది. సెప్సిస్ సోకిన వారిలో ప్రాణాలతో బతికి బయటపడ్డా, జీవితాంతం మంచానికి అతుక్కుపోయే పరిస్థితి కూడా వస్తుందని అధ్యయనకారులు వెల్లడించారు. సెప్సిస్ పురుషుల్లో కంటే మహిళలకే అధికంగా సోకుతుంది. 2017 సంవత్సరంలో అత్యధికంగా నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సెప్సిస్ కేసులు 85 శాతం వరకు నమోదుకాగా, ఇందులో ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనివే ఎక్కువ. 40 శాతం కంటే ఎక్కువ కేసులు అయిదేళ్లలోపు పిల్లల్లో కనిపిస్తున్నాయని వాషింగ్టన్ స్కూలు ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ మోహెసన్ నఘావి అన్నారు. -
ప్రాణం మీదకు తెచ్చిన పాప్‌కార్న్..!
లండన్: బ్రిటన్‌కు చెందిన 41 ఏళ్ల ఆడమ్ మార్టిన్ పంటిలో సెప్టెంబర్‌లో పాప్‌కార్న్ ఇరుక్కుంది. దీంతో దానిని బయటకి తీయడానికి పెన్, టూత్‌పిక్, వైరు ముక్క, నెయిల్ కట్టర్ ఇలా అనేక సామగ్రిని పాప్‌కార్న్‌పై ప్రయోగించాడు. దీంతో మార్టిన్ చిగుళ్లకి ఇన్ఫెక్షన్ సోకింది. అదీ కాస్తా పెరిగి పెరిగి ఎడోకార్డిటిస్ అనే గుండె వ్యాధికి దారి తీసింది. రాత్రిళ్లు నిద్రలో బాగా ఇబ్బందిగా ఉండటంతో వైద్యుడి వద్దకు వెళ్లగా గుండె దెబ్బతిందని చెప్పారు. చిగుళ్ల ఇన్ఫెక్షన్ రక్త నాళాల ద్వారా గుండెకు చేరి రక్తం గడ్డకట్టిందని వివరించారు. సరైన సమయానికే గుర్తించడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ను తొలగించారు. నరకానికి చాలా దగ్గరగా వెళ్లి అదృష్టం కొద్ది బయటపడ్డానని, ఇకపై పాప్‌కార్న్ జోలికి మాత్రం పోనని మార్టిన్ అంటున్నాడు -
కాఫ్ & క్లూస్
గాలిని నిరంతరం ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని మళ్లీ వదిలేసే ప్రక్రియే శ్వాసక్రియ. నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో... అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి ఆ గ్లాటిస్నుంచి ఒక్కసారిగా బలంగా నోటి నుంచి బయటకు రావడాన్ని ‘దగ్గు’ అంటారు. అది ఒకే ఒకసారి రావచ్చు. లేదా అలా వస్తూనే ఉండవచ్చు. దగ్గులో రకాలు... తడి దగ్గు : మన ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి జరిగే చోట తడిగా ఉంచేందుకు కొన్ని స్రావాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ స్రావాలు మామూలుగానైతే బయటకు రావు. ఏవైనా కారణాల వల్ల ఈ స్రావాల ఉత్పత్తి సాధారణం కంటే ఎక్కువగా జరుగుతుంటే దగ్గుతో పాటు అవి బయటకు వస్తుంటాయి. అలా వచ్చేదాన్ని తడి దగ్గు (వెట్ కాఫ్) అంటారు. పొడి దగ్గు : దగ్గుతున్నప్పుడు స్రావాలు ఏమీ రాకుండా వచ్చే దాన్ని పొడి దగ్గు అంటారు. తడి, పొడి దగ్గులను బట్టి కొన్ని వ్యాధులను తొలిదశలో ప్రాథమికంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పొడి దగ్గు వస్తుంటే వ్యాధి శ్వాసకోశనాళాల తొలి భాగం (అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్–వే)లో ఉందని, తడి దగ్గు అయితే ఊపిరితిత్తుల్లోపల వ్యాధులు (బ్రాంకైటిస్, నిమోనియా, ఆస్తమా) ఉండవచ్చునని డాక్టర్లు ఒక అంచనాకు వస్తుంటారు. రాత్రీ – పగలూ తేడాను బట్టి... దగ్గు వచ్చే వేళల్లో తేడాను బట్టి కొన్ని వ్యాధిలను అనుమానించవచ్చు. రాత్రి వేళల్లో దగ్గు వస్తుంటే అది అలర్జీ కారణంగా వస్తుందని అనుమానించవచ్చు. మధ్యాహ్నం పూట దగ్గు ఎక్కువగా ఉంటే దానికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చని ఊహిస్తారు. తెమడను బట్టి... తడి దగ్గు వచ్చే సమయంలో బయటకు వచ్చే తెమడ /కళ్లె (స్ఫుటమ్/ఫ్లెమ్) రంగును బట్టి రకరకాల వ్యాధులను అనుమానించి, వాటికి తగిన విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించవచ్చు. ఉదాహరణకు ►ఆకుపచ్చరంగులో తెమడ ఉంటే... సూడోమొనాస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు వస్తుండవచ్చు. ►పసుపుపచ్చగా ఉంటే... క్లెబ్సిల్లా నిమోనియా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ►ఎర్రగా ఉంటే... సూడోమొనాలీ, నీమోకోకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఎర్రరంగులో కళ్లెపడవచ్చు. ►నలుపు రంగులో ఉంటే... కాలుష్యం బారిన పడటం, పొగతాగడం వంటివి జరిగి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అప్పడు దగ్గుతో పాటు వచ్చే కళ్లె నల్లగా ఉండవచ్చు. మరెన్నో జబ్బులకు సూచిక... దగ్గుతో అలర్జీ, టీబీ, నిమోనియా వంటి జబ్బులని అనుమానించవచ్చు. అలాగే... ►ఊపిరితిత్తుల్లో నీరు నిలిచిపోయే ప్లూరల్ ఎఫ్యూజన్ ►కీళ్ల నొప్పులతో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ►కీళ్లకు సంబంధించిన లూపస్ అరిథమెటోసిస్ వంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా పొడి దగ్గు వస్తూ ఉంటుంది. క్యాన్సర్లలో... స్వరపేటిక, ఊపిరితిత్తులు, నోటికి సంబంధించి క్యాన్సర్లలో మొదటి లక్షణంగా దగ్గు కనిపించవచ్చు. చికిత్స ఏ కారణం వల్ల దగ్గు వస్తోందో నిర్ధారణ చేశాక దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. సాధారణంగా దగ్గు కనిపించగానే చాలామంది మందుల దుకాణాల్లో దొరికే దగ్గు మందులు వాడుతుంటారు. దాంతో తాత్కాలిక దగ్గు తగ్గినా వ్యాధి మాత్రం అలాగే లోపల ఉండిపోతుంది. అసలు ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుందంటేనే అది లోపలేదో తీవ్రమైన సమస్య ఉందని చెప్పడానికి ఒక సూచన. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలి. దగ్గు వచ్చిన సందర్భాల్లో సాధారణంగా యాంటీబయాటిక్స్, యాంటీ టీబీ మందులు, శ్వాసనాళాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్స్, తెమడను బయటకు తెచ్చే మందులైన ఎక్స్పెక్టరెంట్స్ వంటి మందులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆవిరి పట్టడం కూడా దగ్గు నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వృద్ధాప్యంలో దగ్గు ఎడతెరిపిలేకుండా వస్తుంటే కేంద్ర నాడీ వ్యవస్థలో దగ్గును ప్రేరేపించే కేంద్రాన్ని ఉపశమింపజేయడానికి కోడిన్ వంటి మందులు ఉపయోగిస్తారు. వయసును బట్టి.. దగ్గు కనిపించినప్పుడు రోగి వయసును బట్టి కూడా దాని కారణాన్ని అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు... ►పిల్లల్లో (ఇన్‌ఫాంట్స్ మొదలుకొని ఐదేళ్ల వరకు) దగ్గు వస్తుంటే అది ఏదైనా బయటి పదార్థం (ఫారిన్‌బాడీ) ఊపిరితిత్తుల్లోపలికి వెళ్లడం వల్ల కావచ్చునని డాక్టర్లు అనుమానిస్తారు. అంటే... సాఫ్ట్టాయ్స్లో ఉండే నూగు, రగ్గుల్లో ఉండే నూలు, దుమ్ము, ధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు వచ్చే అలర్జీ వల్ల దగ్గు రావచ్చు. ►గొంతు, ముఖంలో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్‌లు, శ్వాసనాళంలోని కింది భాగమైన బ్రాంకైలలో వైరల్ ఇన్ఫెక్షన్తో దగ్గు రావచ్చు. ►పిల్లల్లో బోర్డెటెల్లా పెర్ట్యుసిస్ అనే బ్యాక్టిరియమ్ ఇన్ఫెక్షన్ వల్ల నిరంతరాయం దగ్గు రావచ్చు. దీన్నే మనమంతా ‘కోరింత దగ్గు’ (ఊఫింగ్ కాఫ్) అంటుంటాం. అంతేకాదు... మరికొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా దగ్గురావచ్చు. ►పిల్లల్లో గుండె కవాటాలు, గుండె గోడల్లోని చిల్లులకు సంబంధించిన వ్యాధులు (వీఎస్డీ, ఏఎస్డీ, పీడీఏ) వంటివి ఉన్నప్పుడు కూడా దగ్గు ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆయాసం కూడా ఉంటుంది. కొందరు పిల్లలు నీలంగా మారిపోతుంటారు. ఇలా నీలంగా మారే లక్షణాన్ని ‘సైనోసిస్’ అంటారు. దగ్గుతో పాటు ఈ లక్షణం కనిపిస్తే దాన్ని గుండె జబ్బుగా అనుమానించి తక్షణం చికిత్స అందించాలి. ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లల్లో... దగ్గు ఎక్కువగా వస్తుంటే అలర్జీ వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయాయేమో అని అనుమానించాలి. ఎందుకంటే... అలర్జీ కారణంగా వచ్చే ఆస్తమాలో పిల్లికూతల (వీజింగ్) కంటే మొట్టమొదటగా దగ్గు కనిపిస్తుంటుంది. పెద్దల్లో వచ్చే దగ్గు... పొగతాగడం వల్ల : పొగతాగేవారిలో ఊపిరితిత్తులోకి అనేక విషపూరితమైన రసాయనాలు వెళ్తాయి. పొగతాగడం అలవాటయ్యాక తొలి సిగరెట్లోలా వెంటనే దగ్గు రాకపోయినా, సుదీర్ఘకాలం పొగతాగిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల దగ్గు వస్తూ నల్ల రంగులో తెమడ కూడా పడుతుంటుంది. అలర్జీతో : పెద్దల్లో తగ్గు వస్తుంటే అది అలర్జీ వల్ల అయి ఉంటుందని అనుమానించాలి. ఇన్ఫెక్షన్లతో : టీబీ వ్యాధి ఉన్నవారిలో దగ్గు ప్రధానంగా కనిపిస్తుంది. మన జనాభాలో 75 శాతం నుంచి 85 శాతం మంది దేహాల్లో టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనలోని వ్యాధి నిరోధకశక్తి (ఇమ్యూనిటీ) వల్ల అది నిర్వీర్యంగా అలా ఉండిపోతుంది. కాని... కొందరిలో ఏవైనా ఇన్ఫెక్షన్లతో వ్యాధినిరోధక శక్తి లోపించినప్పుడు టీబీ వ్యాధి బయటపడుతుంది. అయితే టీబీ ఉన్న ప్రతివారికీ అలా ఎడతెరిపి లేకుండా దగ్గు రాదు. అప్పుడప్పుడు మాత్రమే దగ్గు వస్తూ, కొందరిలో తెమడ పడుతుంది. అయితే సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత (టెంపరేచర్) పెరుగుతుంది. ఈ మూడు లక్షణాలు కనిపిస్తూ సాయంత్రం వేళ జ్వరం కనిపిస్తున్నప్పుడు అది టీబీ వ్యాధి కావచ్చేమోనని అనుమానించాలి. అంతేకాదు... టీబీ కనిపించిందంటే... వారిలో వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి హెచ్ఐవీ లాంటి కారణాలేమైనా ఉన్నాయా అని తగిన పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. నిమోనియా: ఈ కారణంగా వచ్చే దగ్గుతో పాటు తెమడ ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో పడవచ్చు. కొన్ని రకాల మందులు : పెద్దలకు హైబీపీ తగ్గించే కొన్ని మందులు వాడుతున్నప్పుడు వారిలో కొందరిలో దగ్గు కనిపించవచ్చు. ఈ మందులు ఆపగానే దగ్గు తగ్గిపోతుంది. అలాంటప్పుడు వారికి మందులు మార్చాల్సి ఉంటుంది. వృద్ధుల్లో... వయసు పెరుగుతున్న కొద్దీ మనలో తెమడను బయటకు పంపించే శక్తి (కాఫ్ రిఫ్లక్స్) తగ్గుతుంది. దాంతో తెమడ శ్వాసనాళంలోనే ఇరుక్కుపోవడంతో వృద్ధుల్లో దగ్గు చాల సాధారణంగా కనిపిస్తుంటుంది. నివారణ ఇలా... ►మన పరిసరాలను, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ►పొగతాగే దురలవాటును పూర్తిగా మానేయాలి. ►సరిపడని వారు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి. ►పక్కబట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి. ►పుస్తకాల అరలను సాధ్యమైనంతవరకు మూసి ఉంచాలి ►వీలైనంత వరకు ఘాటైన వాసనలు వచ్చే సుగంధద్రవ్యాలు (పెర్ఫ్యూమ్స్)ను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలతో దగ్గునుంచి దూరంగా, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్
మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్ అందరికీ వచ్చినా ఇవి మహిళల్లో చాలా ఎక్కువ. మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడం అన్నది తరచూ కనిపించే సమస్య. ఇక తమ ప్రమేయం లేకుండా మూత్రం కారిపోవడం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్) అనే సమస్య వారిని చాలా ఇబ్బందికీ, ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. అలాగే ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ సమస్య కూడా మహిళల్లో ఎక్కువ. దీన్ని ఒకింత తీవ్రమైన సమస్యగా డాక్టర్లు పరిగణిస్తుంటారు. ఈ ఇన్ఫెక్షన్ పైకి పాకితే కిడ్నీని సైతం ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మహిళలు సాధారణంగా బయటకు చెప్పుకోడానికి కూడా బిడియపడుతూ, తమలో తామే బాధపడుతుంటారు. ఇలాంటివన్నీ చాలా సాధారణమనీ, కిడ్నీ లేదా మూత్రసంబంధిత స్పెషలిస్టులను సంప్రదిస్తే చాలా సులువుగా పరిష్కారమయ్యే సమస్యలేనని అవగాహన కల్పించడానికే ఈ కథనం. వేర్వేరు వయసులో... చిన్నవయసులో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే : చిన్నవయసు నుంచే ఇలా కనిపిస్తున్నాయంటే అది పుట్టుకతో వచ్చిన సమస్య (కంజెనిటల్ అనామలీస్)కారణంగా ఇన్ఫెక్షన్లు తరచూ వచ్చే ప్రమాదం ఉంది. కారణం తెలుసుకోకుండా ఎన్నిసార్లు చికిత్స ఇప్పించినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదు. పైగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదమూ పొంచి ఉంటుంది. యౌవనంలో: ఇక యువతుల్లో, కొత్తగా పెళ్లైన మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సాధారణం. కొత్తగా పెళ్లయిన వాళ్లకి హనీమూన్ సిస్టయిటిస్ అనే సమస్య కనిపిస్తుంది. ఇక వయసు పైబడిన మహిళల్లో (పోస్ట్ మెనోపాజల్ వుమన్‌లో) కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వచ్చే సమస్య. నెలసరి ఆగిపోయికవచ్చే హార్మోన్ల ప్రభావంతో ఈ సమస్యలు వస్తుంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల మూత్రనాళం సన్నబడే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండటంతో అది మాటిమాటికీ వచ్చే అవకాశం ఉండి, ఇది ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ఈ హార్మోన్ల లోపం కారణంగా మూత్రాశయ కణాలకు అనారోగ్యకరమైన బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. యూరినరీ ఇన్‌కాంటినెన్స్: ఈ సమస్య ఉన్నవారిలో తమ మూత్రవిసర్జనపైన తమకే నియంత్రణ ఉండదు. ఈ సమస్య కూడా పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ. కాన్పులు కష్టమైనవారిలో, స్థూలకాయంతో... హార్మోన్ సమస్యలతో బాధపడుతున్న వారిలో, మరికొంతమందిలో మెనోపాజ్ ఆగిపోయాక ఈ సమస్య కనిపిస్తుంది. కొందరిలో ఏ అవసరం లేకుండానే మూత్రాశయ కండరాలు సంకోచిస్తుంటాయి. మరికొంతమందిలో మూత్రాశయ నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. యాభైఅయిదేళ్ల లోపు వయసున్నవారిలో సగం మంది మహిళలు ఈ సమస్యకు లోనవుతుంటారు. కానీ సిగ్గు, బిడియం కారణంగా అందులో పది శాతం మంది కూడా వైద్యులను సంప్రదించడానికి ముందుకు రావడం లేదు. నిజానికి ఈ సమస్య అంత పెద్దది కాదు. అయినప్పటికీ మానసికంగానూ, శారీరకంగానే కాకుండా సామాజికంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఒక్కోసారి ఈ సమస్య ఉన్నవారిలో మూత్రం వల్ల ఏర్పడిన చెమ్మ కారణంగా చర్మ సంబంధిత అలర్జీలు కూడా వస్తాయి. సమస్య తీవ్రత పెరిగి సర్జరీ వరకు దారితీయవచ్చు. దీనికి పూర్తి చికిత్స అందించకపోతే ఇది కిడ్నీలపైన కూడా ప్రభావం చూపుతుంది. మూత్ర విసర్జక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురవడానికి ప్రధానమైన కారణం ‘ఈ–కొలి’ అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా బయటి వాతావరణంలోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది మూత్ర విసర్జన మూత్రనాళాల్లోకి వెళ్తుందో అప్పుడు దీనివల్ల కిడ్నీకి అత్యంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇందులోని ‘క్లెబిసియల్లా, ఇంటరోకోకస్ ఫైకలిస్’ అనే రెండు బ్యాక్టీరియాలు చాలా కీడు చేస్తాయి. పైగా యాంటీబయాటిక్స్లాంటి మందులకు కూడా ఇవి పెద్దగా లొంగవు. నివారణే మేలు : ►వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో భాగంగా మల, మూత్ర విసర్జన తర్వాత ప్రైవేటు పార్ట్స్ శుభ్రపరచుకునే సమయంలో పై వైపు నుంచి కింది వైపునకు కడుక్కోవాలి. లేకపోతే మల మార్గంలో ఉండే రోగకారక క్రిములు/సూక్ష్మజీవులు మూత్ర మార్గం వైపునకు వచ్చి ఇన్ఫెక్షన్లు కలిగించే అవకాశం ఉంది ►రోజూ తగినంత నీరు తాగకపోవడమే సాధారణంగా మూత్ర సంబంధిత వ్యాధులకు కారణమని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు మహిళల్లో చాలామంది ఉద్యోగలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. కనీసం మంచినీరు కూడా తగినంత తాగేంత తీరిక కూడా వారికి ఉండటం లేదు. దాంతో మహిళల్లోనే మూత్ర సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ►తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేయాలి. ►కాఫీ, టీ, జంక్ఫుడ్స్ లాంటి వాటి జోలికి వెళ్లకూడదు ∙గ్రామీణ ప్రాంతాల్లోని వారితో పాటు పట్ణణాల్లోని మురికివాడల వంటి అంతగా పరిశుభ్రత లేని ప్రాంతాల్లో నివసించే మహిళలు కూడా శుభ్రతపాటించేలా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రయత్నించాలి. చికిత్స సాధారణంగా వచ్చే మూత్ర వ్యాధులకు డాక్టర్లు నోటి ద్వారా తీసుకునే మందులతోనే చికిత్స చేస్తుంటారు. అవసరాన్ని బట్టి ఒక్కోసారి కాస్త ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇస్తారు. సమస్య ఇంకాస్త ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసే, పరీక్షలు నిర్వహించి, అందుకు అనుగుణంగా చికిత్స పద్ధతిని అవలంబిస్తారు. పుట్టుకతో వచ్చే లోపాలకు, మూత్రపిండాల్లో రాళ్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు అవసరమైతే సర్జరీ చేసి... ఆయా లోపాల్ని సరిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూత్రావయవాల్లో టీబీ వల్ల కూడా మాటిమాటికీ ఇన్షెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ డాక్టర్‌కి అనుమానం వస్తే టీబీ క్రిముల కోసం ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేసి, చికిత్సను అందిస్తారు. -
హెల్త్ టిప్స్
►కూరగాయ ముక్కలని పెద్దవిగా కట్ చేస్తే వీటిలో లభించే విటమిన్స్ వృథా అవ్వవు. ►ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది. ►క్యారెట్, టొమాటో కలిపి జ్యూస్‌చేసి, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తశుద్ధి అవుతుంది. ►తులసి ఆకులని మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మం పై రాషెస్ తగ్గుముఖం పడతాయి. ►జీలకర్ర, పంచదారని కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ►గ్లాసుడు నీళ్లలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుండి బయట పడవచ్చు ►అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. ►నెలసరి నొప్పితో బాధపడేవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక ఉసిరికాయను తింటే ఉపశమనం లభిస్తుంది. ►పంటి నెప్పితో బాధ పడేవారు, ఒక లవంగాన్ని పంటికింద ఉంచితే మంచి ప్రభావం ఉంటుంది. -
టెండనైటిస్ తగ్గుతుందా?
నా వయసు 39. నేనొక క్రీడాకారుణ్ణి. కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన సమస్య అని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటాము. వీటికి సాగగల గుణం ఉండటం వల్ల అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గడం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ►కారణాలు: వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిక ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. ►క్రీడల వల్ల: ►పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల. ►డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారు ►కొన్ని ఇన్ఫెక్షన్లు లక్షణాలు: టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలు. జాగ్రత్తలు: ►కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం. ►పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం ►వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం ►క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం. చికిత్స: కాన్స్టిట్యూషనల్ విధానంలో చికిత్స అందించడం ద్వారా రోగ నిరోధకశక్తిని సరిచేసి టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నడుమునొప్పి తగ్గుతుందా? నా వయసు 42 ఏళ్లు. నాకు కొద్దికాలంగా తీవ్రంగా నడు ము నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే అది డిస్క్ సమస్య అని, ఆపరేషన్ అవసరమవుతుందన్నారు. హోమియో చికిత్స ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండా నా సమస్య తగ్గుతుందా? నడుమునొప్పి తగ్గితే చాలని సర్జరీకి సిద్ధపడితే... ఒకవేళ ఆ ఆపరేషన్ విఫలమైతే కొత్త సమస్యలు మొదలవుతాయి. ఆ బాధలు చెప్పనలవి కాదు. చాలా మంది విషయంలో ఇదే జరుగుతుంది. డిస్క్‌లో సమస్య అని సర్జరీ చేస్తే అది కొత్త అనర్థాలకు కారణమవుతుంది. తప్పుడు భంగిమల్లో కూర్చుని, గంటల తరబడి అదేపనిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిజానికి డిస్క్, స్పాండిలోసిస్ వంటి సమస్యలను ఆపరేషన్ అవసరం లేకుండానే హోమియో మందులతోనే సమూలంగా తగ్గించే వీలుంది. నడుము భాగంలో విపరీతమైన నొప్పి వస్తున్నట్లయితే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారు. నడుమునొప్పి కారణంగా ఏ పనీ చేసుకోలేకపోవడం వంటి అసహాయత ఏర్పడుతుంది. ఉదయం వేళల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆ నొప్పి క్రమంగా నడుము నుంచి కాళ్లలోకి పాకుతుంది. మహిళలకు మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు సైతం వచ్చే అవకాశాలున్నాయి. లంబార్ స్పాండిలోసిస్‌తో దీర్ఘకాలం బాధపడే వారిలో శృంగార సమస్యలూ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాధి నిర్ధారణ: ఎక్స్–రే, ఎమ్మారై స్కాన్ ద్వారా డిస్క్‌లలో తేడాను, నడుమునొప్పి గల కారణాలను గుర్తించవచ్చు. చికిత్స: దీర్ఘకాలంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్యలకు హోమియో వైద్య విధానంలో చికిత్స అందుబాటులో ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందుల ద్వారా నడుమునొప్పిని పూర్తిగా దూరం చేయవచ్చు. వెన్నుపూసలో జరిగే మార్పులను నివారిస్తూ, కండరాలకు బలం చేకూర్చే విధంగా చికిత్స ఇవ్వడం వల్ల సత్ఫలితాలుంటాయి. అయితే పరిస్థితి పూర్తిగా విషమించకముందే డాక్టర్‌ను సంప్రదిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్‌ను సంప్రదించండి. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ -
పాపాయికి చెవులు కుట్టిస్తున్నారా?
ఆడపిల్లలైతే వారు ఓ ఏడాది వయసుకు చేరగానే చెవులు కుట్టించడం మన సంప్రదాయం. దీనికి మతాలూ, కులాలన్న తేడా లేదు. అలాగే కాస్తంత పెద్ద వయసు రాగానే అమ్మాయిలు ముక్కు కూడా కుట్టించుకుంటున్నారు. ఇటీవల అయితే కేవలం చెవి తమ్మెకు ఒక చోట మాత్రమే కాకుండా... ఇంకా రెండు మూడు రంధ్రాలు కూడా పెట్టి ఆభరణాలు ధరిస్తున్నారు. ఇలా చెవులు కుట్టించుకోవడంలో కాస్తంత సంప్రదాయంతో పాటు... బోల్డంత కాస్మటిక్ ప్రయోజనాలు కూడా చూస్తున్నారు ఈకాలం మహిళలు. గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారు లేదా వెండి వైర్స్తో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు. ఇప్పుడు బ్యూటీ సెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు అధునాతన పియర్సింగ్ గన్స్‌తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల కుట్టడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచుకున్న బంగారు, వెండి తీగలను ముందుగా స్టెరిలైజ్ చేసి ఈ పని చేస్తున్నారు. ఇలా చెవి, ముక్కు లేదా స్టడ్ వేయాల్సిన ఇతర ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఆ అనర్థాలను దృష్టిలో పెట్టుకుని కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుట్టించిన ముక్కు, చెవులు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అవి ఆరోగ్యంగా కూడా ఉంటాయి. చెవులు ముక్కు కుట్టించడంలో సహజంగా తలెత్తే సమస్యలు ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం: ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. మచ్చ ఏర్పడటం : కొన్నిసార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ►చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. ►మన శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నప్పుడే మీరు ఈ కుట్టించుకోవడం చేయండి. ►చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోండి. ►సాధారణంగా బంగారు, వెండి వైర్లతో కుట్టే సమయంలో అది చాలావరకు ఎలాంటి హానీ చేయదు. కానీ.. ముందుగానే ఆ వైర్లను స్టెరిలైజ్డ్ సొల్యూషన్‌లో శుభ్రపరచుకుని ఉండటం ఎందుకైనా మంచిది. ►చిన్న పోటుతో నొప్పిలేకుండానే కుట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరీ నొప్పిగా ఉంటే తప్ప... సాధ్యమైనంత వరకు అనస్థీషియా ఉపయోగించకూడదు. మీరు ఒకేసారి రెండుచోట్ల రంధ్రాలు వేయించడం వంటివి చేస్తున్నప్పుడు మాత్రం లోకల్ అనస్థీషియా క్రీమ్ పూయడం మంచిది. ►తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడం మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. -
యానల్ ఫిషర్ సమస్య తగ్గుతుందా?
నా వయసు 36 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా? దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ముందుగా ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుందా? నా వయసు 34 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ►బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ►హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ►మద్యపానం, పొగతాగడం ►వేళకు ఆహారం తీసుకోకపోవడం ►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ►కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ►ఉండటం, ఆకలి తగ్గడం ►నోటిలో నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: ►పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ►మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి కంటినిండా నిద్రపోవాలి ►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ పొలుసుల్లా రాలుతున్నాయి..! నా వయసు 39 ఏళ్లు. ఆరు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసు వారికైనా రావచ్చు. లక్షణాలు: ►చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ►కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ►తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టూ రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగా లేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో సాధ్యమే. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
పాపకు పదే పదే చెవి నొప్పి...తగ్గేదెలా?
మా పాప వయస్సు ఐదేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందన్నారు. తగ్గిపోయాక ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మళ్లీ ఇలా వచ్చే అవకాశం ఉందా? మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనుసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం (బ్లాక్ కావడం), నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. బాబుకు ఛాతీలో నెమ్ముఏంచేయాలి? మా బాబు వయసు రెండేళ్లు. వాడు ఛాతీలో నెమ్ము సమస్యతో బాధపడుతున్నాడు. యాంటీబయాటిక్స్ ఇప్పించాం. నెమ్ము రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి. మీ బాబుకు ఉన్న కండిషన్‌ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ ప్రాబ్లమ్స్) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్) వల్ల కూడా నిమోనియా కనిపించవచ్చు. కేవలం ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే సమూహాలుగా జనం (క్రౌడ్స్) ఉన్న ప్రాంతాలకు పిల్లలను పంపకూడదు. అలాగే తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి దూరంగా ఉంచాలి ∙పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్) చాలా ప్రధానం. హెచ్ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్‌తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకు చికిత్స చేయడం (సపోర్టివ్ కేర్) అవసరం. పాప నోట్లో ఏమిటీ మచ్చలు? మా పాప వయసు పదేళ్లు. ఆమెకు తరచూ నాలుక మీద, పెదవుల మీద, దవడ భాగాల్లో పుండ్లు వస్తున్నాయి.ఆమె నాలుకపైన ఎర్రటి మచ్చల్లా వచ్చి తాను ఏమీ తినలేకపోతోంది. ఇవి రావడానికి కారణం ఏమిటి? ఇది ఏమైనా తీవ్రమైన వ్యాధికి సూచనా? సరైన సలహా ఇవ్వండి. మీ పాపకు ఉన్న సమస్యను ఏఫ్తస్ అల్సర్స్ అంటారు. ఇవి కొందరిలో పదే పదే వస్తూ ఉండవచ్చు. ఇది చాలా సాధారణంగా, తరచూ చూసే నోటి సమస్యల్లో ఒకటి. ఈ అల్సర్స్‌కు నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా... అలర్జీ, ఇమ్యూనలాజికల్ సమస్యలు, హెర్పిస్, రసాయనాల వల్ల నోరు కాలడం, వేడి వేడి ఆహారం తీసుకోవడంతో నోరు కాలడం, నోటిలోని మృదువైన కణజాలంలో అయ్యే గాయాల వల్ల, కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వల్ల కూడా ఈ రకమైన నోటి అల్సర్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ పుండ్లు 5 నుంచి 10 రోజుల పాటు ఉండి, వాటికవే నిదానంగా తగ్గుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బెంజోకైన్ లేదా లిడోకైన్ వంటి ద్రావకాలను స్థానికంగా పూయడం, సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే పుండ్లపై పూతమందుల రూపంలో లభ్యమయ్యే స్టెరాయిడ్స్ పూయడం, కొన్ని సందర్భాల్లో సరైన యాంటీబయాటిక్స్ వాడటం కూడా జరుగుతుంది. అలాగే వ్యక్తిగత నోటి పరిశుభ్రత పాటించడం కూడా చాలా ప్రధానం. ఇక మీ పాపకు సంబంధించిన మరో సమస్య విషయానికి వస్తే... నాలుక మీద మచ్చలు మచ్చలుగా రావడాన్ని ‘జియోగ్రాఫికల్ టంగ్’ అని అంటారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా వస్తూ... కొన్ని గంటలు లేదా రోజుల్లో మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఒత్తిడి వల్ల, కారంగా ఉండే ఘాటైన ఆహారాల వల్ల మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యకు నిర్దిష్టమైన చికిత్స ఏదీ అవసరం లేదు. కాకపోతే ఘాటైన కారంతో ఉన్నవీ, మసాలాలతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండి, నోటి పరిశుభ్రత పాటించాలి. సమస్య మరీ తీవ్రమైతే ఒకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియా ట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
మా బాబు ముఖం ఉబ్బుతోంది...తగ్గేదెలా?
మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానీ యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12–14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. తరతూ మూత్రంలో మంట... ఎలా తగ్గుతుంది? నా వయసు 36 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్‌కు చూపించుకోండి. మూత్రం ఎర్రగా వస్తోంది? భవిష్యత్తులో సమస్యా? నాకు 34 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. డయాలసిస్ తర్వాత చర్మంపై దురద... ఏం చేయాలి? నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించాల్సిందేనా?
మా పాప పుట్టిన తర్వాత తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే పరీక్షచేసి హీమోగ్లోబిన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అప్పటినుంచి నెలనెలా రక్తం ఎక్కిస్తూ ఉండాలని చెప్పారు. మూడేళ్ల తర్వాత ప్లీహం (స్లీ్పన్) తొలగిస్తే ఇలా తరచూ రక్తం ఎక్కించే అవసరం తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్ చేయించాం. తర్వాత రెండు నెలలకోసారి రక్తం ఎక్కిస్తున్నారు. మంచి ఆహారం పెడుతూ నెలకోసారి పెనిడ్యూర్ ఇంజెక్షన్ చేయిస్తున్నాం. రక్తం ఎక్కించాక నెలన్నరకే... పాప పాలిపోయి నీరసంగా తయారవుతోంది. ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించే బాధ తప్పదా? దీనికి శాశ్వత చికిత్స లేదా? సాధారణంగా మన రక్తంలోని ఎర్ర రక్తకణాలు మధ్యన కాస్తంత నొక్కినట్లుగా బిళ్లలలా ఉంటాయి. కానీ మీ పాపకు ఉన్న సమస్య వల్ల తయారయ్యే ప్రక్రియలోనే అవి బంతిలా గుండ్రంగా తయారవుతుంటాయి. పాపకు ఇది పుట్టుకతో జన్యుపరంగా వచ్చిన సమస్య. ఇలా కణాల ఆకృతి భిన్నంగా ఉండటంతో మన శరీరంలోని ప్లీహం (స్పీ›్లన్) వాటిని లోపభుయిష్టమైన కణాలుగా గుర్తించి, ఎప్పటికప్పుడు నాశనం చేసేస్తుంటుంది. అందుకే పాపకు తరచూ రక్తహీనత వస్తోంది. సాధారణంగా ఒక ఎర్రరక్తకణం జీవితకాలం 120 రోజులు. కానీ ప్లీహం ఈ రక్తకణాలన్నింటినీ చాలా ముందుగానే నాశనం చేస్తుండటంతో వాటి సంఖ్య తగ్గిపోయి, తరచూ రక్తహీనత వస్తుంది. అందుకే చికిత్సలో భాగంగా బయటి నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. అలాగే ఉన్న రక్తకణాలు నాశనం కాకుండా కాపాడుకునేందుకు ప్లీహాన్ని కూడా తొలగించారు. ఇక పుట్టిన ఎర్రరక్తకణాలు త్వరత్వరగా నాశనమైపోతున్నాయి. కాబట్టి ఎముక మూలుగ/మజ్జ ఇంకా ఎక్కువెక్కువ ఎర్రరక్తకణాలను తయారు చేస్తుంటుంది. అది అవసరం కూడా. అందుకే దానికి కావాల్సిన మూలవనరులైన ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఐరన్ తదితరాలను మనం మాత్రల రూపంలో బయటి నుంచి ఇస్తుండాలి. దీనివల్ల పుట్టిన ఎర్రరక్తకణాలు ఎంతోకొంత సమర్థంగా ఉంటాయి. ప్లీహాన్ని తొలగించారు కాబట్టి ఒంట్లో నుంచి హానికారక/వ్యాధికారక సూక్ష్మక్రిముల వంటివి త్వరగా బయటకు పోవు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే ముప్పు ఎక్కువ. దీన్ని నివారించేందుకు పాపకు తరచూ నెలనెలా పెనిడ్యూర్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇది చాలా అవసరం. ►ఇక మీ పాప విషయంలో ప్రతి రెండు నెలలకోసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సి రావడం ఇబ్బందికరమే. మామూలుగా ప్లీహం తొలగించిన తర్వాత కొందరిలో రక్తం ఎక్కించాల్సిన అవసరమే తలెత్తదు. కానీ సమస్య తీవ్రంగా ఉన్న కొద్దిమందిలో మాత్రం ఇలా తరచూ రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది. ►తరచూ రక్తం ఎక్కిస్తున్నప్పుడు ఒంట్లో నుంచి ఇనుమును తొలగించే మందులు వాడుకోవడం తప్పనిసరి. ఎందుకంటే రక్తం ఎక్కించిన ప్రతిసారీ దాదాపు 100–150 మి.గ్రా. ఇనుము మన శరీరంలో పేరుకుపోతుంది. దీన్ని తొలగించేందుకు పాపకు నిత్యం మందులు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇనుము... కాలేయం, గుండె వంటి అవయవాల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తుంది. ►నిజానికి జన్యుపరంగా వచ్చే ఇలాంటి వ్యాధులన్నింటికీ రక్తం ఎక్కించడం తప్పించి, ఇతరత్రా చికిత్స ప్రక్రియలు తక్కువనే చెప్పాలి. ఇలాంటి వారికి కచ్చితమైన చికిత్స ఎముక మూలుగ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్). మిగతా చికిత్సలన్నీ సమస్యను నియంత్రణలోకి తెచ్చేందుకే. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని రక్తవ్యాధుల నిపుణుడిని సంప్రదించండి. పచ్చకామెర్లకు కారణం ఏమిటి? జాగ్రత్తలు చెప్పండి మా బాబుకు పదమూడేళ్లు. అతడికి ఈ మధ్య పచ్చకామెర్లు వచ్చాయి. దయచేసి దానికి కారణాలు, జాగ్రత్తలతోపాటు వీలైతే నివారణోపాయాలు కూడా చెప్పగలరు. రక్తంలోని ఎర్ర రక్తకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురుబిన్ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురుబిన్ పరిమాణం రెట్టింపు అవ్వడం వల్ల వచ్చేవే పచ్చకామెర్లు. వీటినే జాండిస్ అని కూడా అంటారు. కామెర్లు వచ్చిన వారి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది వ్యాధి తాలూకు ఒక లక్షణం. మనం సాధారణంగా బాధపడే పచ్చకామెర్లు మన శరీరంలోని కాలేయం అనే అవయవం సూక్ష్మజీవుల బారిన పడటం వల్ల వస్తుంది. ఇది రావడానికి మూడు ముఖ్య కారణాలు. అవి... 1) రక్తంలో ఎర్రరక్తకణాలు అత్యధికంగా విచ్ఛిత్తికావడం. దీన్ని హీమోలిటిక్ జాండీస్ అంటారు. 2) ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి వల్ల చోటు చేసుకున్న బిలురుబిన్ లివర్ కణాలలోకి చేరలేకపోవడం. దీన్ని ‘హెపాటిక్ జాండీస్’ అంటారు. 3) లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్) ప్రవాహమార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవడం. దీన్ని ‘అబ్స్ట్రక్టివ్ జాండిస్’ అంటారు. లివర్ ఇన్ఫెక్షన్కు గురైనట్లయితే ‘హెపటైటిస్’ అని వ్యవహరిస్తారు. హెపటైటిస్ కేసుల్లో హెపాటిక్ జాండిస్ చోటుచేసుకుంటుంది. హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు: ►ఇన్ఫెక్షన్ ►ఆల్కహాల్ ► పౌష్టికాహార లోపం. ఇన్ఫెక్షన్ పరంగా ఐదు రకాల వైరస్‌లను గుర్తించారు. ఇవి... హెపటైటిస్ ఎ, బి, సి, డి. చికిత్స: నీటి ప్రభావానికి లోనై వచ్చే వ్యాధులలో పచ్చకామెర్లు వ్యాధి ఒకటి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సత్వర నివారణ చర్యలు చేపట్టకుంటే ఇది మన శరీరంలోని అత్యంత ప్రధాన భాగమైన కాలేయాన్ని పనిచేయకుండా చేసి పరిస్థితిని మరింత విషమింపజేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ వ్యాధి వస్తే మళ్లీ రాకూడదన్న నియమం లేదు. దీని నివారణకు ఆహారంలోని కొన్ని నియమాలు పాటించాలి. ►ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడబోసి, చల్లార్చి వాడటం మంచిది. లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు. ►పచ్చకామెర్లు వ్యాధి సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణం కానివి ఏవీ వాడకూడదు. ►మజ్జిగ బాగా వాడాలి. కొబ్బరినీళ్లు తాగాలి. అరటిపండ్లు బాగా తినాలి. ►మాంసాహారులు మాంసానికీ, చేపలకు దూరంగా ఉండాలి. ►గోంగూరకు దూరంగా ఉండాలి. ఆవకాయ, మాగాయ లాంటి పచ్చళ్లకు కొన్నాళ్లు వాటికి దూరంగా ఉండాలి. కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీసీనియర్ హిమటాలజిస్ట్, హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, స్టార్ హాస్సిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఎయిడ్స్ నుంచి మూడో వ్యక్తికీ విముక్తి?
ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి నుంచి ఇంకో వ్యక్తి విముక్తి పొందాడా? అవును అంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు. డిస్సెలెడ్రోఫ్ రోగి అనిపిలుస్తున్న ఈ వ్యక్తి మూడు నెలలకు యాంటీ రెట్రోవైరల్ మందులకు దూరంగా ఉన్నప్పటికీ శరీరంలో వైరస్ ఛాయలు కనిపించలేదని కాన్ఫరెన్స్ ఆన్ రెట్రోవైరెసెస్ అండ్ ఆపర్చూనిస్టిక్ ఇన్ఫెక్షన్ సదస్సులో శాస్త్రవేత్తలు ప్రకటించారు. 1980 ప్రాంతంలో ప్రపంచానికి తెలిసిన హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి కొన్ని కోట్ల మంది ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌కు సహజ సిద్ధమైన నిరోధకత కలిగిన వ్యక్తి ఎముక మజ్జను అందివ్వడం ద్వారా 2007 ప్రాంతంలో తిమోతీ బ్రౌన్ అనే వ్యక్తి వ్యాధి నుంచి బయటపడ్డాడు. పన్నెండేళ్ల తరువాత ఇదే చికిత్సా పద్ధతి ద్వారా రెండో వ్యక్తికి కూడా వ్యాధి నుంచి ఉపశమనం లభించింది. తాజాగా డిస్సెలెడ్రోఫ్ రోగికి కూడా ఇదే పద్ధతి ద్వారా నయమైందని అన్నేమేరీ వెన్సింగ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అంతేకాదు.. ఇంకా కొంతమంది రోగులకు ఎముక మజ్జ మార్పిడి జరిగిందని.. వీరి శరీరంలోని వైరస్ ఆనవాళ్ల కోసం పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వివరించారు. -
మధులిక శరీరంలో ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మధులిక పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుందని వైద్యులు తెలిపారు. అయితే మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో మాత్రం మధులిక జ్వరంతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ సోకడంతో అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. -
పాపకు తరచూ విరేచనాలు... ఎందుకిలా?
మా పాప వయసు పదేళ్లు. గత కొద్ది నెలలుగా పదే పదే విరేచనాలు అవుతున్నాయి. కొద్దిపాటి మందులతో తగ్గినట్లే తగ్గినా... మళ్లీ సమస్య తిరగబెడుతోంది. మరీ చెప్పాలంటే... పాప భోజనం తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఎప్పుడైనా కొద్దిగా నీరసంగా ఉంటోంది. మా పాప సమస్య ఏమిటి? ఎందుకిలా జరుగుతోంది. పరిష్కారం ఉందా? మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మీ పాపకు రికరెంట్ డయేరియల్ ఎపిసోడ్స్ ఉన్నట్లు చెప్పవచ్చు. పిల్లల్లో వారు సాధారణంగా విసర్జనకు వెళ్లే టాయిలెట్స్ హాబిట్స్‌తో పోల్చినప్పుడు... వారు మలవిసర్జనకు వెళ్లాల్సిన విడతలు ఎక్కువైనా లేదా వారి క్రమబద్ధమైన వేళల్లో మార్పువచ్చినా దాన్ని డయేరియా అని నిర్వచించవచ్చు. అలాగే అది ఒకేసారి ఎక్కువగా విరేచనాలు (అక్యూట్ డయేరియా), లేదా పదే పదే విరేచనాలు కావడం లేదా దీర్ఘకాలికంగా ఉండే డయేరియా అయినా కావచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తూంటే మీ అమ్మాయిది రికరెంట్ డయేరియా అని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియల్ లేదా ప్రోటోజోవా (అమీబిక్) కావచ్చు. లేదా నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియా కూడా కావచ్చు. మీరు చెబుతున్న లక్షణాలతో మీ అమ్మాయిది నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియా అయ్యేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటి కండిషన్‌కు చాలా అంశాలు కారణం కావచ్చు. ఉదాహరణకు... ►తిన్న తిండి ఒంటికి పట్టడంలో సమస్యలు (మాల్ అబ్జార్ప్షన్). ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ లేదా ప్రోటీన్స్ లేదా ఫ్యాట్ అబ్జార్ప్షన్లో సమస్యలు. ►ఎండోక్రైన్ సమస్యలు, కొన్ని ఆటో ఇమ్యూన్ సమస్యలు, నిర్దిష్టమైన ఎంజైమ్స్‌లో లోపాలు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ (ఐబీడీ), ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి ఏదైనా కారణం వల్ల కూడా ఆమెకు సమస్య వచ్చి ఉండవచ్చు. తిన్న తిండి ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్జార్ప్షన్) ఉన్న పిల్లల్లో నీళ్ల విరేచనాలు, పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఎదుగుదల లోపాలు రావడం, కడుపునొప్పి ఎక్కువగా ఉండటం, దుర్వాసనతో కూడిన మలం, కొన్నిసార్లు ముఖం–కాళ్లూ చేతుల్లో వాపురావడం, కొన్ని విటమిన్ (ముఖ్యంగా ఎ, డి, ఈ, కె, బి12) లోపాలతో కనిపించే లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని అరుదైన ఉదంతాల్లో కౌమార వయసులో (అడాలసెంట్) పిల్లల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు లేదా చాలా ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు, రుతుస్రావంలో మార్పుల (మెనుస్ట్రువల్ డిస్టర్బెన్సెస్)తో కూడా డయేరియా లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే మీ పాపకు ఉన్న రికరెంట్ డయేరియాకు కారణం చెప్పడానికి కూలంకషమైన పరీక్షలు, డిటెయిల్డ్ స్టూల్ ఇవాల్యుయేషన్, హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఎస్సేతో పాటు... అవసరమనిపిస్తే తప్పనిసరిగా కొలనోస్కోపీ, ఎండోస్కోపీ చేయించడం కూడా ముఖ్యం. ఇటువంటి పిల్లల్లో ఆహారంలో మార్పులు – అంటే ముఖ్యంగా వాళ్లకు ఏది సరిపడటం లేదో, లేదా ఏది తింటే సరిగా జీర్ణం కావడం లేదో గుర్తించి, ఆ ఆహారంలో మార్పులు చేయడంతో పాటు కొవ్వు పదార్థాలు, మసాలాలు తగ్గించడం వల్ల చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది. కొన్ని ఎంజైమ్ సప్లిమెంట్లు ఇవ్వడంతో పాటు వైటమిన్లు, జింక్ ఇవ్వడం, యాంటీమొటిలిటీ డ్రగ్స్ (పేగుల కదలికలను తగ్గించే మందులు), యాంటీ సెక్రిటరీ డ్రగ్స్ (జీర్ణవ్యవస్థలో ఊరే రసాయనాలను తగ్గించే మందులు), అబ్జార్బెంట్స్, ప్రోబయాటిక్స్ (శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచే మందులు) ఇవ్వడం వల్ల పాపకు డయేరియా లక్షణాలు తగ్గుతాయి. అయితే ఇలా విరేచనాలు ఎక్కువగా అవుతున్నప్పుడు కారణం లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం జరిగితే వ్యాధి తీవ్రత మరింత పెరగడానికి (యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్ డయేరియాకు) దారితీయవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి మీ పాప సమస్యకు తగిన చికిత్స తీసుకోండి. ముర్రుపాలు,తల్లిపాలు, పోతపాలు –ప్రయోజనాలు కొత్తగా తల్లి అయిన చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరు, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరు అంటుంటారు. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్ అంటారు. ఈ ముర్రుపాలలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. ఆ నేచురల్ ఇమ్యూనిటీ వల్ల జీవితకాలంలో బిడ్డ ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. అంతేకాదు... వయసు పెరిగాక కనిపించే ఎన్నో జబ్బులు... ఈ ముర్రుపాల కారణంగా రాకపోవచ్చు లేదా చాలా ఆలస్యం రావచ్చు. అందుకే బిడ్డకు ముర్రుపాలు తప్పక పట్టించాలి. ఇక ఆ తర్వాత కూడా పిల్లలకు సాధ్యమైనంతవరకు తల్లిపాలే ఇవ్వాలి. కేవలం తల్లికి తగినన్ని పాలు పడనప్పుడు మాత్రమే పోతపాలకు వెళ్లాలి తప్ప... ఒకవేళ తల్లి దగ్గర పుష్కలంగా పాలు ఉంటే పిల్లలకు కడుపు నిండా తల్లిపాలు తాగించడం మంచిది. దీనివల్ల బిడ్డలకు ఎన్నో లాభాలు చేకూరుతాయి. బిడ్డల్లో రోగనిరోధక శక్తి పెరగడం, వాళ్లు పెద్దయ్యాక వచ్చే అనేక డీజనరేటివ్ డిసీజెస్ ఆలస్యం కావడం వంటి ప్రయోజనాలు తల్లిపాల వల్ల సమకూరుతాయి. మరి పోతపాలు వాడవచ్చా? ఇటీవలి కొన్ని నిరూపితమైన అధ్యయనాల ప్రకారం... పోతపాల (యానిమల్ మిల్క్)పై పెరిగే పిల్లల్లో కడుపునొప్పి వంటి ఉదరసంబంధమైన సమస్యలు, ఆస్తమా వంటి అలర్జిక్ వ్యాధులు ఎక్కువగా వస్తాయని తేలింది. పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు, స్థూలకాయం వంటి అనేక సమస్యలకు కూడా పోతపాలు ఒక ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది. పైగా ఇటీవల పశువుల్లో పాల ఉత్పత్తి పెంచడానికి అనేక హార్మోన్లు, మందులు, యాంటీబయాటిక్స్ ఉపయోస్తున్నారు. కాబట్టి ఇలాంటి పాలపై పెరిగిన పిల్లల్లో వాళ్ల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఆ రసాయనాల దుష్ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి పోతపాలు వాడటం సరికాదు. ఒకవేళ తల్లికి తగినన్ని పాలు పడకపోవడం లేదా బిడ్డకు పాలుసరిపడకపోవడం వంటి పరిస్థితుల్లో (అంటే లాక్టోజెన్ ఇన్టాలరెన్స్, ప్రోటీన్ ఇన్టాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే). మార్కెట్లో దొరికే కొన్ని ఫార్ములా ఫీడ్స్ ఉపయోగించవచ్చు. కానీ తల్లి వద్ద సరిపడా పాలు లేనప్పుడు పోత పాలు లేదా ఆవు లేదా గేదె పాలు పట్టించడం కంటే తల్లిలోనే పాలు పెరిగేలా కొన్ని స్వాభావిక విధానాలు (ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పుష్టికరమైన ఆహారం ఇవ్వడం వంటివి) అనుసరించడం మంచిది. అలా చేయడం వల్ల కూడా తల్లిలో పాలు పడకపోతే అప్పుడు మాత్రమే డాక్టర్ సలహామేరకు తల్లిలో పాలు పెరిగేందుకు కొన్ని మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే... ముర్రుపాలు తప్పనిసరి. తల్లిపాలు కంపల్సరీ. తల్లి దగ్గర తగినన్ని పాలు లేనప్పుడు మాత్రమే పోతపాలు. పాపకు నోట్లో పుండ్లు... తగ్గేదెలా? మా పాప వయసు ఏడేళ్లు.ఈమధ్య ఒకసారి గొంతులో నొప్పి ఉందని చెప్పింది. వెంటనే డాక్టర్‌కు చూపించాం. పాప నోట్లో, నాలుక మీద, గొంతులోపలా పుండ్లలాగా వచ్చాయి. గొంతులో ఇన్ఫెక్షన్లా కొంచెం పుండులాగా ఎర్రబారింది. ఏదైనా తినడానికి పెడితే గొంతులో నొప్పి అంటూ ఏడుస్తోంది. ఏమీ తినలేకపోతోంది. మా పాప సమస్యకు పరిష్కారం చూపండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది.ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ఉద్వేగాలపరమైన ఒత్తిడి బాగా నీరసంగా అయిపోవడం ∙విటమిన్లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్‌ల వంటి పోషకాలు లోపించడం) వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా). పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు వస్తుంటాయి. లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు విశ్లేషించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగానీ సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
స్పృహలోకి వచ్చిన మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో 2రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలు మధులిక(17) ఆరోగ్యం శుక్రవారానికి కొంత మెరుగుపడింది. 2 రోజుల నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందు తున్న ఆమె శుక్రవారం స్పృహలోకి వచ్చింది. చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తుండటంతో పాటు బీపీ, పల్స్‌రేటు సహజస్థితికి చేరుకు న్నాయి. న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ భొట్ల, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌలి, వాస్క్యూలర్ సర్జన్ డాక్టర్ ప్రకాశ్, జనరల్ సర్జన్ డాక్టర్ సాయిబాబా, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రసీద్‌లతో కూడిన వైద్య బృందం సుమారు 7 గంటలు శ్రమించి ఆమె తల, ఇతర భాగాలకైన గాయాలకు చికిత్స చేశారు. విరిగిన చేతి ఎముకలకు రాడ్డు సాయంతో సరిచేశారు. గదుమ, మెడ, మోచేతి భాగాల్లోని కత్తిగాట్లను శుభ్రం చేసి, గాయాలకు కుట్లు వేశారు. రక్త స్రావం పూర్తిగా నియంత్రించారు. ఇప్పటి వరకు పదిబాటిళ్లకు పైగా రక్తం ఎక్కించారు. ఉన్మాది ఉపయోగించిన కత్తి తుప్పుపట్టి ఉండటం వల్ల తలపై గాయానికి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ..ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం వెంటిలేటర్ నుంచి బయటికీ తీసుకురానున్న ట్లు తెలిపారు. మధులిక స్వయంగా శ్వాస తీసు కోగలిగి..ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాల్సి ఉంది. మరో 48 గంటలు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్య బృందం స్పష్టం చేసింది. -
టెండ నైటిస్ తగ్గుతుందా?
నా వయసు 42 ఏళ్లు. నేను క్రికెట్ ఎక్కువగా ఆడతాను. ఇటీవల కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. ఎన్ని మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటాము. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగగల గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కారణాలు:వయసు పెరగడం, గాయం కావడం. ∙వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిగ ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. క్రీడల వల్ల... పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది ∙కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది. లక్షణాలు:∙టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం ∙ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం ∙కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం ∙ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించండం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఉబ్బిన రక్తనాళాలు, చికిత్స చెప్పండి నా వయసు 46 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? మీకు ఉన్న సమస్యను వేరికోస్ వెయిన్స్ అంటారు. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఈ వేరికోస్ వెయిన్స్ సమస్య వస్తుంది. ఈ సమస్యలో రక్తనాళాల రంగు మారడం లేదా నలుపు రంగుకి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు:ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు:కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం. వ్యాధి నిర్ధారణ:అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స:వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లమచ్చలు పెరుగుతున్నాయి... తగ్గేదెలా? నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
క్రియాటిన్ ఎక్కువగానే ఉన్నా... డయాలసిస్ చేయడం లేదెందుకు?
కిడ్నీ కౌన్సెలింగ్స్ నా వయసు 58 ఏళ్లు. ఈమధ్య బాగా నీరసంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించాను. క్రియాటినిన్ పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దాంతో నాకు డయాలసిస్ చేస్తారేమోనని ఆందోళన పడ్డాను. కానీ డయాలసిస్ చేయడం లేదు. మందులే ఇస్తున్నారు. ఎందుకిలా? క్రియాటినిన్ ఎంత ఉంటే డయాలసిస్ చేస్తారు? – డి. రామేశ్వరరావు, విజయవాడ కిడ్నీ రోగికి డయాలసిస్ మొదలుపెట్టడానికి క్రియాటినిన్ కేవలం కౌంట్ మాత్రమే ఆధారం కాదు. ఇంకా చాలా రకాల పరీక్షలు చేసి డయాలసిస్ ఎప్పుడు చేయాలో నిర్ధారణ చేస్తారు. ఇటీవలి నూతన పరిశోధనల ఆధారంగా క్రియాటినిన్ కౌంట్ 6 – 8 మధ్యలో ఉన్న రోగులకు కొందరికి డయాలసిస్ చేశారు. అయితే క్రియాటినిన్ కౌంట్ 10 – 12 మధ్య ఉన్నవారికి డయాలసిస్ ప్రారంభించినప్పుడు ఇచ్చినన్ని సత్ఫలితాలు ఈ 6 – 8 మధ్య ఉన్నవారిలో కనిపించలేదు. దీని వల్ల కేవలం క్రియాటినిన్ మాత్రమే డయాలసిస్ చేయాలనడానికి ఒక నిర్దిష్ట పరీక్ష కాదని స్పష్టంగా తేలిపోయింది. క్రియాటినిన్ ఎక్కువగా ఉండటంతో పాటు మూత్రపిండాల రోగి ఊపిరి తీసుకోలేకపోవడం, సరైన పోషకాహారం తీసుకోక సన్నబడిపోవడం, ఆకలిని కోల్పోవడం, వాంతులు కావడం (ఈ లక్షణాలన్నింటినీ యూరెమిక్ సింప్టమ్స్ అంటారు) వంటివి కనిపించనప్పుడు మాత్రమే డయాలసిస్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీ విషయానికి వస్తే మీకు ఎప్పుడు డయాలసిస్ ప్రారంభించాలన్న అంశాన్ని మీ నెఫ్రాలజిస్టు నిర్ణయిస్తారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏమిటి? నా వయసు 52 ఏళ్లు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. పనిలో భాగంగా తరచూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ ఉంటాను. ఈ కారణంగా నెలలో మూడువారాలు బయటే తింటుంటాను. మద్యపానం అలవాటు కూడా ఉంది. అప్పుడప్పుడూ సిగరెట్లు తాగే అలవాటు కూడా ఉంది. కొద్ది నెలలనుంచి బలహీనంగా అనిపిస్తోంది. వీపు దిగువ భాగాన నొప్పిగా ఉంటోంది. తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదో మొదలయ్యిందని అనిపించి డాక్టర్‌కు చూపించగా కిడ్నీకి సంబంధించిన వ్యాధి సీకేడీ ఉన్నట్లు చెప్పి చికిత్స చేస్తున్నారు. అసలు ఇదేం వ్యాధి? ఎందుకు వస్తుంది? దయచేసి వివరంగా తెలపండి. – జి. గుర్నాధరెడ్డి, కొడంగల్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే మాటకు సంక్షిప్త రూపమే సీకేడీ. ఇది మూత్రపిండాలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి. ఆహారపు అలవాట్లలో లోటుపాట్ల కారణంగా మనదేశంలో చాలామందికి ఈ వ్యాధి వస్తున్నది. డయాబెటిస్, హైబీపీ వ్యాధిగ్రస్తుల్లో మూత్రపిండాల వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. ఆ రెండూ ప్రధాన కారణాలే అయినప్పటిMీ గ్లోమెరులార్ డిసీజ్, వారసత్వ (జన్యు) కారణాల వల్ల కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. పదే పదే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కు గురవుతుండటం, మూత్రపిండాలలో రాళ్లు, మద్యపానం, పొగతాగడం, ఊబకాయం కూడా సీకేడీ ముప్పును మరింత అధికం చేస్తాయి. సీకేడీ నెమ్మదిగా కబళించే వ్యాధి. దీనిలో మూత్రపిండాలకు జరిగే నష్టం తీవ్రమైనదీ, శాశ్వతమైనది. సీకేడీ వల్ల కొద్ది నెలల నుంచి కొద్ది సంవత్సరాల కాలంలో నెఫ్రాన్లకు నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉంటుంది. సీకేడీలో అధికరక్తపోటు, ఛాతీలో నొప్పి, తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం, అకారణంగా కనిపించే అలసట, కడుపులో వికారం, వాంతులు, వీపు దిగువభాగాన నొప్పి, చర్మంపై దురదలు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా వ్యాధి ముదిరిన దశలో మాత్రమే వ్యక్తమవుతాయి. చాలా సందర్భాలోల వ్యాధిగ్రస్తులను కాపాడటానికి అవకాశం లేని దశలోనే ఇవి వెల్లడి అవుతుంటాయి. నెఫ్రాన్లలో అధిక శాతం పూర్తిగా నష్టం జరిగి, ముదిరిన తర్వాతే వ్యాధి గురించి తెలుస్తుంది కాబట్టి సీకేడీని సైలెంట్ కిల్లర్ అంటున్నారు. దేశంలో ఆరోగ్యంగా కనిపిస్తున్న ప్రతి 5 నుంచి 10 మందిలో ఒకరు ఇంకా బయటపడని సీకేడీ బాధితులే అని అంచనా. ప్రారంభదశలోనే దీఇ్న గుర్తించినట్లయితే వ్యాధి మరింతగా విస్తరించకుండా చర్యలు తీసుకోడానికి వీలవుతుంది. మందులు ఉపయోగించి చికిత్స చేయడంలో భాగంగా మొదట అధికరక్తపోటును అదుపు చేయడం, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని స్థితిలో మిగిలిన అవకాశాలు రెండే. మొదటిది డయాలసిస్ చేస్తుండటం. అయితే ఇది మూత్రపిండాల వ్యాధులను నయం చేసే చికిత్స ఎంతమాత్రమూ కాదు. తాత్కాలికంగా మూత్రపిండాల బాధ్యతను స్వీకరించి, శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోకుండా చూసే మార్గమిది. ఇది మరో ప్రత్యామ్నాయం (మూత్రపిండాల మార్పిడి) దొరికే దాక అనుసరించాల్సి మార్గం మాత్రమే. డయాలసిస్ చేయడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు శాశ్వత పరిష్కారంగా మూత్రపిండాల మార్పిడిని సూచిస్తారు. ఇందుకు రోగి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులెవరైనా తమ మూత్రపిండాలలో ఒకదాన్ని దానం చేయడమో లేక బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి (రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని జీవన్‌దాన్ సంస్థ సాయంతో) సేకరించిన మూత్రపిండాన్ని అమర్చడమో చేస్తారు. డాక్టర్ కె.ఎస్.నాయక్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
కీళ్లకు జ్వరం
చలికాలం జ్వరాల కాలం. చలికాలం కీళ్లనొప్పుల కాలం కూడా. జ్వరాలను, కీళ్లనొప్పులను విడివిడిగా ఎదుర్కొనడం ఒక పద్ధతి. కాని జ్వరం వల్ల కీళ్లనొప్పులు వస్తే? జ్వరం తర్వాత కూడా కీళ్లనొప్పులు వస్తే? ఈ సీజన్లో ఈ సమాచారం తెలుసుకొని ఉండాలి. జ్వరంతో వచ్చే కీళ్లనొప్పులకు పరిష్కారం తెలుసుకొని ఉండాలి. అందుకే ఈ కథనం. కాలం మారింది. దాంతో వాతావరణం మారిపోయింది. బయటి ఉష్ణోగ్రతలకు తగినట్లు ఒళ్లు తనను తాను మార్చుకోవడంలో ఒడిదొడుకులకు లోనవుతుంది. వైరస్లు ఈ సీజన్‌కి ‘జ్వరాల సీజన్’ అని పేరు పెట్టిస్తాయి. ఒంటికి టెంపరేచర్ తగ్గాక ధర్మామీటర్కి అందని కీళ్లజ్వరం మొదలవుతుంటుంది. జ్వరం తర్వాత... జ్వరం మనిషిని నేరుగా పీల్చివేయడం కంటే ఆ తర్వాత పీడించడమే ఎక్కువగా ఉంటుంది. ఒక రోజు జ్వరాన పడితే పూర్తిగా కోలుకోవడానికి ఓ వారం పడుతుంది. నాలుగు రోజులు జ్వరంతో మంచం పడితే కోలుకోవడానికి నెల రోజులు పడుతుంది. అలాంటి జ్వరానికి అనుబంధంగా వచ్చి పడేదే కీళ్ల జ్వరం. జ్వరం తగ్గిన తర్వాత హుషారుగా లేచి తిరుగుదామంటే ఒళ్లు సహకరించదు. కీళ్లు ఒక పట్టాన కదలవు. అప్పటి వరకు దేహంలో ఉన్న జాయింట్స్ గురించి మనకు పెద్దగా పట్టింపు ఉండదు. జాయింట్ మెకానిజం ఒకటి ఉంటుందని అవి కదలడం మానేసినప్పుడు గుర్తుకు వస్తుంది. కీళ్ల నొప్పి అని సింపుల్‌గా చెప్పుకునే ఈ సమస్యకు కారణాలు రకరకాలుగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా ఒక రకం కాదు, అనేక రకాలుగా ఉంటాయి. కీళ్ల సమస్యకు దారి తీసిన కారణాన్ని బట్టి, కీళ్ల సమస్యల లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వైరల్ ఆర్థరైటిస్ నార్మల్ ఫీవర్ నుంచి కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ కోలుకుంటున్నప్పుడు కీళ్ల నొప్పులు విడవకుండా పీడించవచ్చు. ఈ లక్షణానికి కారణం ‘వైరల్ ఆర్థరైటిస్’ లేదా వైరస్ ద్వారా వచ్చిన ‘కీళ్లవాతం’. రోగకారక వైరస్ సోకడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. సాధారణ పరిభాషలో చెప్పాలంటే కొన్ని వైరస్లు సోకడం వల్ల సంక్రమించే వ్యాధి ఇది. దీని వల్ల కీళ్లలో వాపు వస్తుంది. వైరల్ జ్వరం తగ్గిన తర్వాత కీళ్లనొప్పి రావడం సర్వసాధారణంగా తలెత్తే చికిత్స సంబంధ సమస్య. వైరస్ ద్వారా సంక్రమించిన కీళ్లనొప్పుల్లో చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతుంటాయి. కొన్నింటికి వైరస్ నిరోధక చికిత్స చేయవలసి ఉంటుంది. సాధారణంగా వచ్చే కీళ్ల వాపు, వైరస్ ద్వారా సంక్రమించే కీళ్ల వాపు మధ్య తేడాలను నిర్ధారించడం కొంచెం కష్టమే. వైరస్ప్రేరేపిత కీళ్ల వాపు సంభవించడం, వ్యాప్తి చెందడాన్ని గురించి నిర్దుష్ట సమాచారం అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష మందిలో 0.6 నుంచి 27 మందికి ఈ వ్యాధి సోకుతున్నట్లు అంచనా. అయితే వార్ధక్యంలో ఉన్న వారిలో ఈ శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అరవై దాటిన వారిలో చూస్తే ప్రతి లక్షమందిలో 30 నుంచి 40 మందికి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జ్వరం అనంతరం బయటకు కనిపిస్తున్నప్పటికీ ఈ వ్యాధి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. వైరల్ ఆర్థరైటిస్‌కు కారణమవుతున్న వైరస్ల జాబితా ఇలా ఉంది. అవి... ∙జఠర సంబంధ వైరస్ ∙డెంగ్యూ వైరస్, ∙హెపటైటిస్ ఎ,బి,సి, ∙హెచ్ఐవి, ∙పాలిచ్చే పశువుల నుంచి సంక్రమించే బి19 వైరస్ ∙గవద బిళ్లలు, రుబెల్లా వైరస్, ఆల్ఫా వైరస్, ∙జీవకణాల ద్వారా సంక్రమించే వైరస్, ∙సువాసనల నుంచి వచ్చే వైరస్ ∙రెట్రో వైరస్లు. వ్యాధి నిరోధానికి రుబెల్లా వ్యాక్సిన్ టీకాలు వేసినప్పుడు కూడా వైరల్ ఆర్థరైటిస్ రావచ్చు. ఇది పిల్లల్లో సర్వసాధారణం. అప్పుడు కూడా పిల్లలు కీళ్ల నొప్పులతో బాధపడతారు. అయితే చాలా మందికి వ్యాక్సిన్ల రూపంలో వైరస్ సోకినప్పటికీ, కొద్దిమందికి మాత్రమే వైరస్ సంబంధ కీళ్ల వాతం వస్తుంది. మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ విషక్రిమి సంబంధ కీళ్లవాతం వచ్చిన రోగులు బహుళ కీళ్ల నొప్పుల (మల్టిపుల్ జాయింట్ పెయిన్స్)తో బాధపడుతుంటారు. కేవలం కీళ్ల నొప్పులు లేక కీళ్ల వాపు, కీళ్ల దగ్గర చర్మం ఎరుపెక్కడం, వాతం వల్ల వచ్చిన కీళ్లనొప్పిని పోలి ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నట్లుండి రావడమే కాక దద్దుర్లు కూడా వస్తాయి. జ్వరం, చలిపెట్టడం, దద్దుర్ల వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. అయితే చాలా కేసుల్లో వైరల్ ఆర్థరైటిస్‌గా రోగ నిర్ధారణ చేయడం కష్టమవుతుంటుంది. వైరల్ ఆర్థరైటిస్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి... అని ఇదమిత్ధంగా చెప్పడానికి ఒక్క నమూనా కూడా లేకపోవడం ఇందుకు కారణం. ∙ఈ రోగానికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలు ప్రత్యేకంగా ఏమీలేవు (ఉదాహరణకు జ్వరం, కీళ్లనొప్పులు, దద్దుర్లు). ఎందుకంటే ఇవన్నీ ఇతర వ్యాధులతో కూడా కనిపిస్తాయి. ∙ఒక్కొక్కసారి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు సోకడానికి ముందు సూచనగా కీళ్ల నొప్పులు రావచ్చు (ఉదాహరణకు హెపటైటిస్ బి వైరస్, పచ్చకామెర్లు రావడానికి ముందు) ∙వైరల్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన రుజువులను తరచుగా కనిపెట్టడం కష్టం. వైరల్ ఇన్ఫెక్షన్ అనంతర ఆర్థరైటిస్ చికిత్సజ్వరం లేదా వైరస్ జ్వరం నుంచి కోలుకుని కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారికి అవుట్ పేషెంట్‌గా చికిత్స చేయవచ్చు. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు. ఈ సమస్య వల్ల శాశ్వత అంగవైకల్యం వస్తుందని రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పి తగ్గుముఖం పడుతుంది.వైరల్ ఆర్థరైటిస్‌ను తగ్గించే కొన్ని మందులు పారాసిటమాల్: ఇది మంచి బాధ నివారిణి. దీనిని సరైన మోతాదులో క్రమం తప్పకుండా వేయాల్సి ఉంటుంది. నిద్రకు ఉపయోగపడే మందులు : ట్రమాడాల్ మంచి ఎంపిక. 30–100 మిల్లీగ్రాముల మోతాదులో ఆరు గంటలకొకసారి వాడాలి. ఎసిటిల్ సాలిసైక్లిక్ యాసిడ్: మందులు వాడడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందువల్ల వాటి తీవ్రత తగ్గిన తరవాత మాత్రమే వాడాలి.మూర్ఛ నిరోధక మందుల, ఉత్సాహ పరిచే మందులు,కార్టికో స్టెరాయిడ్స్: కొద్దిపాటి నొప్పి నుంచి తీవ్రమైన నొప్పి ఉన్న ప్పుడు కూడా వాడవచ్చు. దీనికి ప్రెడ్నిసోన్ మాత్రలను సూచించడం జరుగుతుంది. ఈ మందుల వాడకం వల్ల తగిన గుణం కనిపిస్తున్నట్లయితే మధుమేహం, హైపర్ టెన్షన్, గతంలో ఎముకలు విరిగిన దాఖలాలు, మానసిక స్థితి ఉన్నట్లుంది మారిపోవడం, స్థూలకాయం, హృద్రోగం ఉన్నవారికి ఈ మందులను ఇవ్వరాదు. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు ఉన్న రోగులకు హైడ్రో క్లోరోక్వైన్, సల్ఫాసాలాజైన్, మెథోట్రెక్సేట్ కూడా వాడవచ్చు.కీళ్లనొప్పులతో బాధపడే వారికి మూడు దశల్లో భౌతిక చికిత్స చేయించవచ్చు. అయితే వ్యాధి తీవ్రత ముదరక ముందు, విడవకుండా పీడిస్తున్నప్పుడే భౌతిక చికిత్సకు ప్రాధాన్యమివ్వాలి. లేకపోతే ఎలాంటి ప్రత్యేక వైరస్ నిరోధక చికిత్స చేయాల్సిన అవసరం లేదు. డెంగ్యూ వ్యాధి ఉన్న రోగుల్లో ఆస్పిరిన్ వంటి కొన్ని ఇతర మందులు వాడరాదు. డెంగ్యూ తీవ్రత సంకేతాలు లేనప్పుడు మాత్రం వాటిని వాడవచ్చు.సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చే సూచనలున్నప్పుడు మినహా మిగిలిన సందర్భాల్లో సర్జికల్ డ్రైనేజ్ (రక్తంలో చీమును తీసేయడం) కూడా అవసరం లేదు. ఆహార నియమాల మీద పెద్దగా ఆంక్షలు లేవు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత నెమ్మదిగా కదలడం మొదలు పెట్టాలి. అనుమానించాల్సిన ఇతర కారణాలు సర్వ సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చిందేమోనని పరిశీలించి ఒక అంచనాకు రావడం తప్పనిసరి. వ్యాధిని తీవ్రం చేయగల ఇన్ఫెక్షన్లలో సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, కీళ్లవాపు జ్వరం, క్షయ, కీళ్లవాతం, కడుపులో మంట, రక్తంలోకి వివిధ రసాలను విసర్జించు గ్రంథులు జరిగ్గా పనిచేయకపోవడం మొదలైన వాటిని క్షుణ్ణంగా పరిశీలించుకుని నిర్ధారించుకోవాలి.సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత ప్రకృతి సిద్ధమైన కాల్షియం, మెగ్నీషియం మూలకాలు, డి, బి12, ఈ విటమిన్ల లోపం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. మంచి ఆహారం తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. గమనిక: వ్యాధికి గురైన వాళ్లు తప్పని సరిగా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వైద్యం చేయించుకోవాలి. ఈ కథనం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. చికున్ గున్యా చికున్ గున్యా వ్యాధి సోకిన వారిలో వివిధ దశల్లో కీళ్ల నొప్పులు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా లేచి మామూలుగా తిరగడం ఇబ్బంది కావడం వల్ల వ్యాధి సోకిన రోగుల దైనందిన జీవనంపై ప్రభావం పడుతుంది. వస్తువులు తీసుకోవడం, కుర్చీలు ఎత్తడం, నడవడం మొదలగునవి కూడా సాధ్యం కాదు. వ్యాధి సోకడం వల్ల దాని ప్రభావం కేవలం నొప్పులకే పరిమితం కాదు. రోగుల్లో చాలామందికి సరిగ్గానిద్రపట్టకపోవడం, మనసు స్థిమితంగా ఉండవకపోవడం, మూడ్ మారిపోతుండడం జరుగుతుంటుంది.చికున్ గున్యా సోకిన వారికి చిన్న, పెద్ద కీళ్లు నొప్పులు వస్తాయి. చికున్ గున్యా తీవ్రంగా ఉన్నప్పుడు ఇతర వైరస్‌లకు ముఖ్యంగా డెంగ్యూకు దానికి ఉన్న తేడాను కనిపెట్టలేం. ఈ వ్యాధి సోకిన వారికి దీర్ఘకాలం కీళ్లనొప్పులు ఉంటాయి. ఒక్కొక్కసారి మూడేళ్ల పాటు కూడా కీళ్ల నొప్పులు బాధించవచ్చు. ఈ నొప్పులు సాధారణంగా వేళ్లు, చేతి మణికట్టు, మోకాళ్లు, కాలి చీలమండల దగ్గర కనిపిస్తాయి. అరవై నుంచి ఎనభై శాతం మంది రోగుల్లో ఈ నొప్పులు వస్తూ పోతూ ఉంటాయి. ఇరవై నుంచి నలభై శాతం మంది రోగుల్లో నిరంతరం ఉంటాయి. వయసు పైబడిన వారిలో, మహిళల్లో, ఇది వరకే కీళ్ల నొప్పులు ఉన్న రోగుల్లో ఎక్కువ రోజులు కీళ్ల నొప్పులు ఉండే ప్రమాదముంది. ఇన్పుట్స్: డా‘‘ రాహుల్ అగర్వాల్ (ఎం.డి, జనరల్ మెడిసిన్) సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, మాధాపూర్,హైదరాబాద్ -
యానల్ ఫిషర్ సమస్య తగ్గుతుందా?
నా వయసు 36 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్ ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా? – డి. సూర్యారావు, విజయవాడ దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిల్లో ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. కారణాలు : దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. చికిత్స : జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్‌కి చికిత్స ఉందా? నా వయసు 41 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? – డి. రఘురామరెడ్డి, కర్నూలు సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు : ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు : ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు : స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స : సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమై మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ సైనసైటిస్ తగ్గుతుందా? నా వయసు 36 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో మందులు వాడాను. కానీ సమస్య తగ్గడం లేదు. శాశ్వతంగా తగ్గేందుకు చికిత్స హోమియోలో చికిత్స ఉందా? – ఆర్. వెంకటేశ్వరరావు, కోదాడ సైనస్ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్ల లోపలివైపున మ్యూకస్ మెంబ్రేన్ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి ఉష్ణోగ్రతను మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఫ్యారింగ్స్ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది. సైనసైటిస్ వచ్చిన వారికి ∙తరచూ జలుబుగా ఉండటం ∙ముక్కుద్వారా గాలిపీల్చుకోవడం కష్టం కావడం ∙ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం ∙కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం ∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య తలనొప్పి రావడం ∙తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్షెక్షన్ వ్యాపించవచ్చు. ఎక్స్–రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు. సైనస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచన విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి... ∙హెపార్ సల్ఫూరికమ్ : అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు. మెర్క్‌సాల్ : రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శరీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టక్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
మెరుగవుతున్న కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ఎంకే కరుణానిధి(94) ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని ఆయన కొడుకు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పష్టంచేశారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ప్రస్తుతం జ్వరంతో పాటు శరీరంలోని ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతోందన్నారు. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ వైద్యుల బృందం 24 గంటల పాటు కరుణకు చికిత్స అందజేస్తోందని స్టాలిన్ తెలిపారు. కలైంజర్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నందున గోపాలపురంలోని ఆయన నివాసానికి రావొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలను స్టాలిన్ కోరారు. పరామర్శల వెల్లువ.. కరుణ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్, ప్రధాని∙మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తదితరులు స్టాలిన్, కుమార్తె కణిమొళికి ఫోన్ చేసి కరుణ∙ఆరోగ్యంపై వాకబు చేశారు. తండ్రి అనారోగ్యం నేపథ్యంలో కరుణ పెద్ద కుమారుడు అళగిరి తన కుమారుడు దురై దయానిధిని వెంటపెట్టుకుని గోపాలపురంలోని ఇంటికి శుక్రవారం చేరుకున్నారు. డీఎంకే అధినేతగా కరుణానిధి శుక్రవారంతో 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ ఆయన కుమారుడు స్టాలిన్ స్పందించారు.‘ సవాళ్లను విజయాలుగా మార్చుకునే మన నాయకుడు గత 50 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాల్లో దృఢమైన శక్తిగా ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. కొనసాగిన ఉత్కంఠ.. కరుణ ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని కావేరీ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించడంతో డ్రామా మొదలైంది. డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, తోటి మంత్రులు కరుణ ఇంటికి వెళ్లి స్టాలిన్‌ను కలవడం, ఇంటివద్ద పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టెన్షన్ పెరిగింది. మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి దగ్గర ప్రభుత్వం స్థల పరిశీలన చేస్తోందని వార్తలొచ్చాయి. చివరకు కరుణ ఆరోగ్యం మెరుగుపడుతోందని స్టాలిన్ ప్రకటించినప్పటికీ ఆయన ఇంటివద్ద నేతలు, కార్యకర్తల్లో ఆందోళన తగ్గలేదు. కాగా, కరుణకు పూర్తి విశ్రాంతి అవసరమని డీఎంకే వర్గాలు తెలిపాయి. ముందస్తుగా ఖరారైన పర్యటన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆదివారం చెన్నైకి చేరుకోనున్నారు. -
విషమంగా కరుణానిధి ఆరోగ్యం
-
కరుణానిధికి ఇన్ఫెక్షన్, జ్వరం
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి(94) మూత్రనాళ ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యేక వైద్య బృందం కరుణానిధి ఇంటిలోనే ఉండి చికిత్స అందిస్తోంది. వయో భారం, అనారోగ్య సమస్యలతో రెండేళ్లుగా కరుణానిధి గోపాలపురంలోని ఇంటికే పరిమితమయ్యారు. రెండు నెలల క్రితం కరుణ ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలో ప్రజాసేవకు అంకితమవుతారని డీఎంకే కార్యాలయం ప్రకటించింది. డీఎంకే అధినేతగా పగ్గాలు చేపట్టి 50వ వసంతంలోకి అడుగు పెడుతుండడంతో శుక్రవారం స్వర్ణోత్సవ కార్యక్రమాలకు డీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం కరుణ ఆరోగ్యం క్షీణించడం గమనార్హం. కాగా, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కరుణానిధిని చూసి వెళ్లారు. -
రసాయనాల్లేని రక్షణ
తన్వీ ఉత్పత్తి చేస్తున్న బయోడీగ్రేడబుల్ నాప్కిన్స్ విరివిగా అందుబాటులోకి వస్తే.. గర్భాశయ ఇన్ఫెక్షన్ల నుంచి మహిళ ఆరోగ్యాన్ని, పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కూడా రక్షించినట్లవుతుంది. ‘పరిశుభ్రత ఒక అలవాటుగా మారాలి’ అంటుంటాం. దేహ పరిశుభ్రత గురించి అందరి ముందు మాట్లాడగలుగుతాం. నోటి పరిశుభ్రత గురించి దంత వైద్యులు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే పక్కవారిని కూడా పిలుచుకుని మరీ వెళ్తాం. అయితే రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి అవగాహన కోసం మాట్లాడటానికి ఎవరైనా వస్తే మనలో ఎంతమందిమి హాజరు అవుతాం? అలాగని రుతుక్రమ పరిశుభ్రత గురించి సమాజంలో సంపూర్ణ అవగాహన ఉందా అంటే.. అదీ ఇరవై శాతానికి మించదు. భారతదేశంలో ఈ అంశం ఇంకా ఒక కళంకిత భావనగానే ఉంది. ఆ భావన తొలగిపోయే వరకు రుతుక్రమ పరిశుభ్రత క్యాంపెయిన్ల అవసరం కాదనలేనిది అంటున్నారు తన్వీ జోరీ. అనడమే కాదు, తనే శానిటరీ నేప్కిన్లను తయారు చేస్తూ, క్యాంపెయిన్‌ను నడుపుతున్నారు. ఇళ్లకే నేరుగా డెలివరీ తన్వీ జోరీకి స్వయంగా ఎదురైన ఇబ్బందుల నుంచి ఈ ఆలోచన వచ్చింది. బయోడీగ్రేడబుల్ నాప్కిన్ల అవసరాన్ని గుర్తించి, వాటి వాడకాన్ని మహిళలకు అలవాటు చేయాలనుకుంది. తనే వాటిని తయారు చేసింది. ఇక ఇప్పుడు వాటి వాడకం ఎంత అవసరమో తెలియచేసే ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తన్వీ జోరీ న్యూఢిల్లీలో బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసింది. మార్కెట్లో దొరికే శానిటరీ నాప్కిన్స్ వల్ల ఆమెకు స్కిన్ ర్యాష్ వస్తుండేది. దీని నుంచి బయటపడే మార్గం ఏమిటని ఆలోచించి తానే సొంతంగా 2016లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెట్టింది. మొక్కజొన్న పిండి, వెదురు పీచులను కలిపి నాప్కిన్లను తయారు చేసే టెక్నాలజీని కనుక్కుంది. ఇప్పుడు ఆమె ప్రారంభించిన ‘కార్మెసీ’ కంపెనీకి ఐదువేల మంది వినియోగదారులున్నారు. నేరుగా వాళ్ల ఇళ్లకే నేప్కిన్లు నెలనెలా డెలివరీ అవుతుంటాయి. ఈ ఉత్పత్తుల కోసం వెబ్సైట్ ద్వారా లాగిన్ అవుతున్నారు మహిళలు. తన్వీ వినియోగదారుల్లో 24–36 ఏళ్ల మధ్య వారే ఎక్కువ. నగరాల్లో నేచర్ బాస్కెట్ వంటి సహజమైన ఉత్పత్తులను విక్రయించే అవుట్లెట్లను ఇందుకోసం తన్వీ ఎంచుకుంది. ‘‘నెల నెలకూ 30 శాతం వ్యాపారం పెరుగుతోంది’’ అంటోంది తన్వి. ధైర్యమివ్వడమే ధ్యేయం కంపెనీ స్థాపనలో తన ఉద్దేశం అమ్మకాలు– కొనుగోళ్ల ఆధారంగా జరిగే వ్యాపారం కాదని, ఆధునిక మహిళలను కూడా వదలని సామాజిక కళంక భావనను సమూలంగా తుడిచేయడమేననీ ఆమె అంటోంది. రుతుక్రమం సమయంలో వాడి పారవేసే వ్యర్థాలు ఏటా మనదేశంలో లక్షా పదమూడు వేల టన్నులుగా ఉంటున్నాయి. రసాయనాలు, జెల్స్, సింథటిక్ ఫైబర్‌తో తయారైన నాప్కిన్లకు బదులుగా సహజపద్ధతుల్లో నేలలో కలిసి పోయే (బయోడీగ్రేడబుల్) నాప్కిన్ల వాడకం గురించి అవగాహన పెరగాలని ఆమె కోరుకుంటోంది. అంతకంటే ముందుగా తన అవసరాన్ని ధైర్యంగా చెప్పగలిగేటట్లు మహిళల్లో చైతన్యం తీసుకురావాలనేదే.. ఈ యూనిట్‌ను ప్రారంభించడంలో ఆమె ముఖ్యోద్దేశం. ఉన్నవాటికంటే మంచివి రెండు మూడు తరాలకు ముందు మహిళలు ఇంట్లో చేసుకుని వాడిన శానిటరీ నాప్కిన్స్ స్థానాన్ని ఇప్పుడు అధునాతన నాప్కిన్స్ భర్తీ చేస్తున్నాయి. మార్కెట్లో ఉన్న రసాయనాల ప్రభావంతో కూడిన నాప్కిన్స్ వాడకం మీద కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే అంతకంటే మరో మార్గం లేదు. అందువల్లనే ప్రభుత్వాలు కూడా పరిశుభ్రత లేని, అనారోగ్యకరమైన సంప్రదాయ పద్ధతుల నుంచి బయటకు వచ్చి మార్కెట్లో దొరికే స్టెరిలైజ్డ్ నాప్కిన్లను వాడమని సూచిస్తున్నాయి. ఇప్పటికి అందుబాటు ఉన్నవాటిలో అవే కొంత ఆరోగ్యకరం కాబట్టి! అయితే తన్వీ ఉత్పత్తి చేస్తున్న బయోడీగ్రేడబుల్ నాప్కిన్స్ విరివిగా అందుబాటులోకి వస్తే.. గర్భాశయ ఇన్ఫెక్షన్ల నుంచి మహిళ ఆరోగ్యాన్ని, పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కూడా రక్షించినట్లవుతుంది. మహిళలకు ఎదురయ్యే ఆ కష్టం ఎవరికీ అర్థం కాదు.. అలాంటి సమస్యనే ఎదుర్కొన్న మరో మహిళకు తప్ప. నేను పడిన ఇబ్బందిని మాటల్లో చెప్పలేను. సంపన్న మహిళ అయినా, సాధారణ మహిళ అయినా ఇందులో అంతా సమానమే. అధునాతనమైన పరిశుభ్రమైన జీవనశైలిలో కూడా ఆ కష్టం తప్పలేదంటే, సాధారణ జీవితంలో ఇంకెలా ఉంటుందో అనుకునేదాన్ని. స్త్రీలకు ఆరోగ్యక రమైన జీవితాన్నివ్వడానికి నేను ఎంచుకున్న మార్గం ఇది. – తన్వీ జోరీ, కార్మెసీ ఫౌండర్ – మంజీర -
పెంపుడు కుక్క తెచ్చిన అంటురోగం.. విషాదం
మాంచెస్టర్(ఇంగ్లాండ్) : ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క తెచ్చిన అంటురోగం కారణంగా రెండు కాళ్లు, తన కుడిచేతి ఐదు వేళ్లు, ముక్కు పోగొట్టుకున్నాడో వ్యక్తి. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాంచెస్టర్‌కు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ జాకో నెల్ (50) తన పెంపుడు కుక్కతో రోజూ సరదాగా ఆడుకునే వాడు. ఒక రోజు ఆడుకుంటున్న సమయంలో కుక్క కారణంగా చేతిపై ఓ చిన్న గాయం ఏర్పడింది. మూమూలు గాయమేకదా అనుకున్న జాకోనెల్ దాన్ని సబ్బుతో కడిగి మిన్నకుండిపోయాడు. కొద్ది రోజుల తర్వాత తీవ్రమైన జలుబు ఒళ్లు నొప్పుల కారణంగా మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఒంటి నిండా దురద మొదలైంది. కొద్ది సేపటికే శరీరంలోని భాగాలు నియత్రణ కోల్పోయి నడవటం, మాట్లాడటం, చేతులు సైతం పైకి ఎత్తలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతని భార్య జాకోనెల్ను ఆస్పత్రికి తరలించింది. జాకోనెల్ పరిస్థితి గమనించిన వైద్యులు అతన్ని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు. వైద్య పరీక్షల అనంతరం అతనికి పెంపుడు కుక్క కాటు కారణంగా సెప్సిస్ అనే అంటువ్యాధి సోకిందని వైద్యులు తేల్చారు. అంటువ్యాధి కారణంగా జాకోనెల్ రెండు కాళ్లు మోకాలి భాగం వరకు తొలగించేశారు. కుడిచేతి వేళ్లు, ముక్కు భాగాన్ని సైతం తొలగించాల్సి వచ్చింది. జాకోనెల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బయటకు వెళ్లడానికి కొంచెం బెరుగ్గా ఉందన్నారు. అయినా ఎవరీ మీద ఆధారపడకుండా బతకుతానని, తన రూపం మొత్తం తుడిచిపెట్టుకుపోవడమే కొద్దిగా బాధ కలిగిస్తోందన్నారు. -
కుక్క తెచ్చిన అంటురోగం.. రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు
-
అప్పుడప్పుడూ పాపకు ఒళ్లంతా రాష్... తగ్గేదెలా?
వూ పాపకు తొమ్మిదేళ్లు. కొన్ని నెలల కిందట ఒకరోజు బాగా ఆడుకున్న తర్వాత శరీరవుంతా ఎర్రగా రాష్లాగా వచ్చింది. ఏదైనా పురుగు కుట్టిందేమోనని అనుమానించి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇంజెక్షన్ చేశారు. అయితే అప్పటి నుంచి ఎండలోకి వెళ్లినా, ఇంట్లోనే పరుగెత్తే ఆటలు ఆడినా, వేణ్ణీళ్ల స్నానం చేసినా ఈవిధంగా శరీరవుంతా ఎర్రగా రాష్ వస్తోంది. ఐదు, పది నిమిషాల్లో అదే తగ్గిపోతోంది. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే శరీరంలో ఏదైనా పడని పదార్థాలు ఉంటే అలాగే వస్తుందని వుందులు ఇచ్చారు. వుందులు వాడినంతకాలం రాలేదు. వుందులు వూనేశాక వుళ్లీ అదే విధంగా వస్తోంది. ఇలా రావడం ఏమైనా హానికరవూ? దయచేసి వూ పాప సవుస్యకు శాశ్వత పరిష్కారం చూపగలరు. – సుధారాణి, నెల్లూరు మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఆర్టికేరియా అంటారు. అందులోనూ మీ పాపకు ఉన్న కండిషన్ కోలినర్జిక్ ఆర్టికేరియా అనిపిస్తోంది. ఇది ఒక రకమైన అలర్జిక్ రుగ్మత. కాని విచిత్రం ఏమిటంటే... ఇది ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయడం వల్ల కలిగే ప్రేరణ (స్టివు్యులస్) వల్ల ఎక్కువగా వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడం వల్ల ఈ సవుస్య ఉత్పన్నవువ#తుంది. సాధారణంగా దురదలు, చర్మం వేడెక్కడం, ఎర్రబడటం, వుచ్చలు, బొబ్బలు రావడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరవుంతటా వస్తాయి. అయితే అరచేతుల్లో, అరికాళ్లలో రావడం వూత్రం అరుదు. కొద్దివుంది పిల్లల్లో దీంతో పాటు శ్వాసకోశ సవుస్యలు తలెత్తడం కూడా చూస్తుంటాం. ఇది అలర్జిక్ టెండెన్సీస్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది సాధారణంగా పదేళ్ల పిల్లల నుంచి 30 ఏళ్ల వ్యక్తుల వరకు చూస్తుంటాం. ఇది ఒకసారి వస్తే కొన్నేళ్ల పాటు తరచూ కనిపిస్తుంటుంది. కారణాలు...: వుుందు చెప్పినట్లుగా ఇది ఫిజికల్ యాక్టివిటీతో కలిగే స్టివు్యులస్ వల్ల వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెవుటలు పట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వేడివేడి ఆహార పదార్థాలు, వుసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం, ఉద్వేగాలతో కూడిన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల ఇది రావచ్చు. కొందరిలో వేణ్ణీళ్ల స్నానం వల్ల ఆర్టికేరియా అటాక్ రావడం సాధారణమే. నిర్ధారణ...: ఈ పరిస్థితిని ఫిజికల్ యాక్టివిటీ చేయించడం ద్వారా, కొన్ని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. కొందరిలో ఇది సుదీర్ఘకాలం పాటు తరచూ కనిపిస్తూ ఉన్నా... వురికొందరిలో దానంతట అదే అకస్మాత్తుగా తగ్గిపోవచ్చు కూడా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ∙ఆర్టికేరియాకు దారితీసే పరిస్థితులు అంటే... చెవుటపట్టే పరిస్థితులను నివారించడం (మరీ తీవ్రమైన ఎక్సర్సైజ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకోవడం), వురీ ఎక్కువ ఉష్ణోగ్రతకు, వురీ ఎక్కువ తేవు (హ్యూమిడిటీ) వంటి వాతావరణ పరిస్థితులకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ∙ఆహారపరంగా... వేడివేడి పదార్థాలు, వుసాలాలు, శీతల పానీయాల వంటివాటికి దూరంగా ఉండటం వుంచిది. చికిత్స: ఈ కండిషన్ యాంటీహిస్టమైన్స్ అంటే ఉదాహరణకు సిట్రజైన్, లోరాటిడెన్ వంటి వుందులవల్ల చాలా వుటుకు తగ్గుతుంది. వాటితోపాటు ఇవు్యునోథెరపీ వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. మీ పాపకు ఉన్న కండిషన్‌కు కేవలం ఒక సిట్టింగ్‌లో శాశ్వత పరిష్కారం లభించడం కష్టం. అయితే ఈ ఆర్టికేరియా వల్ల పాపకు మేజర్ సవుస్యలు ఏవీ రావ#. మీరు పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ చర్మవ్యాధి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. మా బాబు సమస్య ఏమిటి? మా బాబుకి పదేళ్లు. ఒక సమస్య విషయమై డాక్టర్‌ను కలిస్తే ఆయన పరిశీలించి మావాడి బీజాలు లోపలికి ఉన్నాయి, ఆపరేషన్ చేయిస్తే తగ్గుతుందన్నారు. మాకేమో అయోమయంగా ఉంది. దయచేసి మా బాబు సమస్యకి పరిష్కారం తెలియజేయండి. – సందీప్, కరీంనగర్ మీరు వర్ణించిన దాన్ని బట్టి చూస్తే మీ బాబు సమస్య ‘రిట్రాక్టయిల్ టెస్టిస్’లాగా కనబడుతుంది. కొందరిలో టెస్టిస్ సంచిలోకి రాకుండా గజ్జల్లో లేదా పొత్తికడుపులో ఉండిపోవచ్చు. దీనిని క్రిప్టార్కిడిజం అంటారు. మీ బాబు టెస్టిస్ కిందికి రాని అన్డిసెన్డెంట్ టెస్టిస్తో బాధపడుతున్నాడా లేక సాధారణంగా కదిలే రిట్రాక్ట్రియల్ టెస్టిస్ ఉందా అన్నది నిర్ధారణ కావాలంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించవలసి ఉంటుంది. ఒక వేళ ఇది అన్డిసెన్డెంట్ టెస్టిస్ అని తేలితే తప్పక ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. పాప బుగ్గలు పొడిబారుతున్నాయి మా పాప వయసు ఐదేళ్లు. తను ఉదయం ఏడుగంటలకే స్కూల్ బస్‌లో వెళ్తుంటుంది. ఆ టైమ్‌లో చలిగాలి తగలగానే బుగ్గలు ఎర్రగా పొడిగా మారుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని మందులు ఇచ్చారుగాని పెద్దగా మెరుగుదల లేదు. పాప సమస్య పూర్తిగా నయం కావడానికి ఎలాంటి జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి? – సుప్రసన్న, హైదరాబాద్ మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎక్సిమా లేదా అలర్జిక్ డర్మటైటిస్ అని చెప్పవచ్చు. ఇందులో చర్మం ఎర్రబారడం, పొట్టులా రాలడం, విపరీతమైన దురదలు, కొంతమంది పిల్లల్లో చర్మంపై ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తుంటాం. ఇది ముఖ్యంగా వాతావరణంలో తీవ్రత (అంటే మరీ ఎక్కువ వేడిమి లేదా మరీ ఎక్కువ చలి) ఉన్న సమయంలో రావడాన్ని గమనిస్తుంటాం. ఇలాంటి పిల్లలకు మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడటం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ శరీరంపై రాయడం, మైల్డ్ స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ అలర్జీ అన్నది ఒక రోజులో లేదా కొద్ది రోజుల్లో లేదా ఒకసారి తీసుకునే చికిత్సతో నయమవుతుందని అనుకోవడం సరికాదు. కాబట్టి మీరు మీ పాపను మరీ తీవ్రమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కావడాన్ని నివారించడం వంటి జాగ్రత్తలు, పైన పేర్కొన్న చికిత్స తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
దాని వల్ల ఇబ్బందా?
గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా వేసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి తెలియ జేయగలరు. నాకు అప్పుడప్పుడు దగ్గు బాగా వస్తోంది. దగ్గడం వల్ల కడుపులో బిడ్డకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? – ఎల్ఆర్, రాజోలు వ్యాక్సిన్స్ అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి శరీరంలోకి ఆయా ఇన్ఫెక్షన్కి సంబంధించిన క్రిములను ఇన్‌యాక్టివ్ చేసి అతికొద్ది మోతాదులో లేదా క్రిముల మీద ఉండే దాని యాంటిజన్‌ను లేదా ఇన్‌యాక్టివ్ క్రిములలో హాని కలిగించే టాక్సిన్ను చిన్న ఇంజెక్షన్ ద్వారా పంపించడాన్ని వ్యాక్సిన్ అంటారు. దీనివల్ల ఆ క్రిములకు వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. తర్వాత ఎప్పుడైనా శరీరంలోకి రోగక్రిములు ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీస్ ఆ క్రిములను వృద్ధి కాకుండా అడ్డుకుంటాయి. అలా ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని వ్యాక్సిన్లను ఇవ్వొచ్చు. సాధారణంగా గర్భిణీ స్త్రీలు రెండుసార్లు టెటానస్ టాక్సాయిడ్ (టీటీ) ఇంజెక్షన్‌ను నెల వ్యవధిలో తీసుకోవాలి. దీనివల్ల కాన్పు సమయంలో తల్లికి, బిడ్డకి టెటానస్ అనే ప్రాణాంతక వ్యాధి రాకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక డోస్ టీటీతో పాటు ఏడవ నెలలో టీడాప్ అనే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పుట్టే బిడ్డలో కోరింత దగ్గు, డిఫ్తీరియా వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఫ్లూ ఎక్కువగా ఉండే అక్టోబర్, నవంబర్ నెలల్లో అవసరమైతే ఫ్లూ వ్యాక్సిన్ ఒక డోస్‌ను డాక్టర్ సలహామేరకు తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో ఫ్లూ వ్యాధి సోకితే, వాటి లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డకి సోకే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీబాడీస్ ఆ వ్యాధి రాకుండా, అలాగే బిడ్డకి సోకకుండా, రోగక్రిములను అడ్డుకుంటాయి. కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీ హెపటైటిస్–బి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్న వాతావరణంలో ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు హెపటైటిస్–బి వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. దగ్గడం వల్ల బిడ్డకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కాకపోతే తరచూ దగ్గడం వల్ల పొత్తికడుపు మీద ఒత్తిడి పెరిగి, కడుపులో నొప్పి రావడం, కొందరిలో ఒత్తిడికి మూత్రం కారిపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకానీ బిడ్డకు ఏమీ కాదు. ఎందుకంటే బిడ్డ చుట్టూ ఉమ్మనీరు, ఉమ్మనీరు పొర, గర్భాశయ కండరాలు.. షాక్ అబ్జార్బర్స్‌లా పని చేస్తాయి. అలాగే దగ్గువల్ల కలిగే ఒత్తిడిని బిడ్డ వరకు చేరనీయవు. కొందరిలో మాయ కిందకు ఉన్నా, గర్భాశయ ముఖద్వారం కొద్దిగా లూజుగా ఉన్నా, కొందరు తరచూ తీవ్రంగా దగ్గుతూ ఉంటే, కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వడం, ఉమ్మనీరు పోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉండొచ్చు. దగ్గు వచ్చినప్పుడు పొత్తికడుపు కింద చెయ్యిపెట్టుకుని, కూర్చొని దగ్గడం మంచిది. మీకు తరచూ దగ్గు వస్తుందంటున్నారు కాబట్టి ఒకసారి డాక్టర్ని కలిసి గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా అలర్జీ లేదా మరే ఇతర కారణాల వల్ల దగ్గు వస్తుందో తెలుసుకొని చికిత్స తీసుకోవడం మంచిది. అశ్రద్ధ చేస్తే వేరే సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే... అది వేరే అవయవాలకు పాకడం వంటి సమస్యలతో పాటు బిడ్డకి సోకే అవకాశంతో పాటు బిడ్డకి ఆక్సిజన్ వాయువు తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. ∙మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటోంది. అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తోంది. ‘మూత్రనాళ ఇన్ఫెక్షన్ కావచ్చు’ అని నా స్నేహితురాలు అంటోంది. ఇది నిజమేనా? మూత్రనాళ ఇన్ఫెక్షన్కు సంబంధించిన లక్షణాలను ఎలా గుర్తించాలి? – బీఎన్, మండపేట కొన్ని సందర్భాల్లో రోగకారక క్రిములు యోనిభాగం లేదా మలవిసర్జన ద్వారం దగ్గర నుంచి మూత్ర విసర్జన ద్వారం ద్వారా పైకి మూత్రాశయానికి, నిర్లక్ష్యం చేస్తే అక్కడి నుంచి మూత్రాశయ గొట్టాలకు, తద్వారా కిడ్నీలకు పాకి మూత్రనాళ ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. మూత్రంలో మంట, పొత్తికడుపులో నొప్పి, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రానికి వెళ్లేలోపల అది లీక్ అవ్వడం, మూత్రంలో రక్తం పడటం, చలి, జ్వరం, నడుము నొప్పి వంటి రకరకాల లక్షణాలు ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఉంటాయి. యోనిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, మూత్రం బయటకు వచ్చేటప్పుడు, యోనిభాగం దగ్గర మంట, దురద, పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉండొచ్చు. ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించి పరీక్ష చేయించుకోండి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ వంటివి చేయించుకొని, దానికి తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది. మందులతో పాటు మంచినీళ్లు కనీసం మూడు లీటర్లయినా తాగాలి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కి శుభ్రపరచుకోవడం, శారీరక పరిశుభ్రత వంటివి పాటించడం మంచిది. ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ కిడ్నీలకు పాకడం జరుగుతుంది. అలాగే రక్తంలోకి, శరీరంలోకి పాకి ప్రాణాంతకంగా మారే అవకాశాలూ లేకపోలేదు. - డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ ,హైదరాబాద్ -
యుటిఐకి కారణం?
ప్రెగ్నెన్సీ సమయంలో Urinary Tract Infection (UTI) సాధారణం అని చెబుతుంటారు. దీనికి కారణం ఏమిటి? ఎలాంటి నివారణ చర్యలు ఉన్నాయి? – వాణి, అనకాపల్లి ప్రెగ్నెన్సీ సమయంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మామూలు వారిలో కంటే కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మూత్రాశయం వెనుకకు ఆనుకొనే గర్భాశయం ఉంటుంది. బిడ్డ పెరిగే కొద్దీ గర్భాశయం పెరుగుతూ మూత్రాశయం పైన బరువు పడటం, ఒత్తిడి పడటం వల్ల మూత్రం పూర్తిగా మూత్రాశయం నుంచి బయటకు రాలేకపోవచ్చు. అందువల్ల మూత్రం కొద్దిగా మూత్రాశయంలో నిల్వ ఉండిపోయే అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల మూత్రాశయంలో ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియా పెరిగి, వ్యాప్తి చెంది మూత్రాశయం నుంచి యురెటర్స్కు, తద్వారా కిడ్నీలకు ఇన్ఫెక్షన్ పాకే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల మంచినీళ్లను తాగాలి. మూత్రం వస్తుంటే ఆపుకోకుండా మూత్ర విసర్జన చేస్తుండాలి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రం చేసుకోవాలి. మల, మూత్ర విసర్జన తర్వాత యోనిభాగం దగ్గర చెమ్మ లేకుండా శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. మితమైన పౌష్టికాహారం తీసుకోవాలి. దానివల్ల రక్తహీనత లేకుండా, రోగనిరోధకశక్తి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ చేయించుకొని, అందులో ఇన్ఫెక్షన్స్ ఉంటే యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ యాంటీ బయోటిక్స్ కోర్సు వాడాల్సి ఉంటుంది. ∙నా వయసు 29 ఏళ్లు. నేను బాగా లావుగా ఉంటాను. అలాగే మా అమ్మానాన్నలిద్దరికీ హైబీపీ ఉంది. అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. కాన్పుకు నా బరువేమైనా ప్రాబ్లమవుతుందా? అలాగే బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయా? దయచేసి సలహాలు, సూచనలు ఇవ్వగలరు. – లహరి, రాజమండ్రి బరువు ఎక్కువగా ఉంటే గర్భం దాల్చకముందే తగ్గడం మంచిది. కుటుంబంలో తల్లిదండ్రులకు బీపీ ఎక్కువగా ఉంటే, గర్భంతో ఉన్నప్పుడు బరువు పెరగకుండా ఉండటం, బీపీ పెరిగే రిస్క్ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటే, డాక్టర్ పర్యవేక్షణలో ఎకోస్ప్రిన్ మాత్ర వేసుకోవడం మంచిది. ముందు ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగి ఉంటే, తర్వాత ప్రెగ్నెన్సీలో ఎకోస్ప్రిన్ మాత్ర వాడటం, ప్రెగ్నెన్సీలో బీపీ పెరుగుతుంటే టైమ్‌కు చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ సలహామేరకు బీపీ మాత్రలు కూడా సక్రమంగా వాడాలి. ప్రెగ్నెన్సీలో బరువు పెరగకుండా చూసుకోవాలి. అలాగే ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అంతేకాకుండా అన్ని వసతులూ కలిగిన ఆసుపత్రిలో కాన్పు కావడం, అవసరమైతే డాక్టర్ సలహామేరకు సమయానికి ముందుగానే కాన్పు చేయించుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్య జటిలం కాకుండా, ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకునే అవకాశాలు పెరుగుతాయి. ∙మా స్నేహితురాలికి ్క Pre-eclampsia డిజార్డర్ వచ్చిందని విన్నాను. ఇది ఎందుకు వస్తుంది? ఈ డిజార్డర్ ప్రమాదకరమా? దానికి నివారణ ఏమిటి? – ఆర్సి, హైదరాబాద్ Pre-eclampsia అంటే గర్భిణులలో బీపీ పెరిగి, మూత్రంలో ప్రొటీన్, ఆల్బుమిన్ లీక్ అవ్వడం, శరీరంలో మార్పులు, నీరు చేరడం, కిడ్నీ, మెదడు, లివర్ వంటి అవయవాల పనితీరులో మార్పులను ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ఈ పరిస్థితిలో సరైన చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే గుర్రపువాతం, ఫిట్స్ రావడం, కళ్లు మసకబారి కనిపించకపోవడం, అలాగే ఉంటే కోమాలోకి వెళ్లడం, కిడ్నీలు, లివర్ దెబ్బతినడం. అధిక రక్తస్రావం వంటి ప్రాణాపాయస్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగంగా కడుపులో బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, మాయ విడిపోవడం, బిడ్డకు రక్తసరఫరా తగ్గిపోయి బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో గర్భంలో వచ్చే అనేక మార్పుల వల్ల, జన్యుపరంగా, అధిక బరువు వల్ల, రక్తం గూడుకట్టే గుణంలో మార్పువల్ల.. ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల తల్లిలోని రక్తనాళాలు సరిగా వ్యాకోచించకపోవడం వల్ల తల్లిలో బీపీ పెరగడం, అలాగే ఇతర అవయవాల సమస్యలు ఏర్పడి ప్రీ ఎక్లాంప్సియా రావడం జరుగుతుంది. ఇది రాకుండా నూటికి నూరు శాతం నివారించలేము. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల, కొందరిలో ఈ లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల, చికిత్స తీసుకోవడం వల్ల సమస్యలు అధికం కాకుండా అడ్డుకోవచ్చు. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ హైదర్‌నగర్ ,హైదరాబాద్ -
యూరినరీ ఇన్ఫెక్షన్తో మాటిమాటికీ జ్వరం... నయమయ్యేదెలా?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు తొమ్మిది నెలలు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా తరచూ జ్వరం వస్తోందంటున్నారు. మాకు తగిన పరిష్కారం చెప్పండి. – మాధవి, కందుకూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’గా చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లోనూ చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. ఏడాది లోపు వయసుండే చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మగపిల్లల్లోనే ఎక్కువ. అయితే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి తారుమారై... మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్న పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, వ్యాధి నిరోధక శక్తి, మూత్ర కోశ అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలు, విసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపలే మిగిలిపోవడం (వాయిడింగ్ డిస్ఫంక్షన్), మలబద్దకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటివి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నిర్ధారణ చేయడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే... కొన్ని లక్షణాలు సెప్సిస్, గ్యాస్ట్రోఎంటిరైటిస్లా కూడా ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో జ్వరం, త్వరగా చిరాకు పడటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాల ఉంటాయి. వాటి సహాయంతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను డయాగ్నోజ్ చేసినప్పుడు వారిలో మూత్ర కోశ వ్యవస్థ (జెనిటోయూరినరీ సిస్టమ్)కు సంబంధించి ఏదైనా లోపాలు (అబ్నార్మాలిటీస్) ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరిగా అవసరం. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), కిడ్నీ అబ్నార్మాలిటీస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎమ్సీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు తప్పక చేయించాలి. పిల్లలకు ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) ఉన్నట్లు బయటపడితే... వాటికి అవసరమైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ (పైలో నెఫ్రైటిస్) సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తాగేలా వారికి అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలపై అవగాహన పెంచుకొని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. రంగరంగుల ఆహారాలు తీసుకోవచ్చా? మా బాబు స్వీట్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. అందులోనూ అవి బాగా ఆకర్షణీయమైన రంగులతో ఉంటే వాటిని ఇప్పించమని అడుగుతుంటాడు. అవి తినడం మంచిదేనా? – శ్రీవాణి, బెంగళూరు ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, ఎదుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు చాలా ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. దాంతో వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది చాలాకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్లో సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్యాక్టివిటీ) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. బాబు నోట్లో పొక్కులు... ఎందుకిలా? మా బాబు వయస్సు తొమ్మిదేళ్లు. పెద్దల్లో కనిపించినట్టే వాడి నోట్లోనూ పొక్కులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. – లక్ష్మీప్రసన్న, ఖమ్మం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అని అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్)లో ఎక్కువగా వస్తుంటాయి. వీటికి ఫలానా అంశమే కారణమంటూ నిర్దిష్టంగా చెప్పలేం. అయితే నిమ్మజాతి (సిట్రస్) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. ఎక్కువ సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, బాగా మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి కనిపిస్తాయి. కొందరిలో ఇవి తీవ్రంగా అలసిపోయిన (ఫెటిగ్) సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారణ చర్యలివే... ∙నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం ∙బాగా పుల్లగా ఉండే పదార్థాలు అవాయిడ్ చేయడం ∙నోరు ఒరుసుకుపోయేందుకు దోహదపడే ఆహారపదార్థాలు (అబ్రేసివ్ ఫుడ్స్) తీసకోకపోవడం. ∙నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్ నైట్రేట్ వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. సమస్య మాటిమాటికీ వస్తున్నట్లయితే నాన్ ఆల్కహాలిక్ మౌత్‌వాష్, తక్కువ లో కాన్సంట్రేటెడ్ మౌత్ వాష్ వంటివి ఉపయోగిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) పాటించడంతో పాటు అతడికి విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పాప నోట్లో పుండ్లు... తగ్గేదెలా?
మా పాప వయసు ఆరేళ్లు. మొన్నీమధ్య గొంతునొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాం. పాప నోటిలోన, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. పాపకు గొంతులో ఇన్ఫెక్షన్లా కొంచెం ఎర్రబారింది. ఏమీ తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. మా పాప సమస్యకు మంచి సలహా ఇవ్వండి. – వైదేహి, ఖమ్మం మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ∙ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), ∙విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యం విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్ ఇన్ఫెక్షన్లు (ప్రధానంగా హెర్పిస్ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా) ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేకరకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి. మీరు లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వన్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు భావించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. గోడకున్న సున్నం తింటున్నాడు మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఇంట్లో పెచ్చుల్లా లేచిన సున్నాన్ని తింటున్నాడు. క్లాస్‌లో చాక్‌పీసులు కూడా తింటున్నాడని వాడి టీచర్ చెబుతున్నారు. వాడు తెల్లగా పాలిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఆ వయసులో ఉండాల్సినంత బరువు లేదు. మందులు వాడినా బరువు పెరగడం లేదు. మా అబ్బాయి విషయంలో ఏం చేయాలో తెలియజేయండి. – సుధారాణి, టెక్కలి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను వైద్యపరిభాషలో పైకా అంటారు. అంటే... ఆహారంగా పరిగణించని నాన్–న్యూట్రిటివ్ వస్తువులను పదే పదే తినడం, ఆ అలవాటును దీర్ఘకాలం కొనసాగించడం అన్నమాట. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ప్లాస్టర్, బొగ్గు (చార్కోల్), మట్టి, బూడిద, పెయింట్, బలపాలు, చాక్‌పీసులు లాంటివి తింటుంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా రెండేళ్లలోపువారు తమ పరిసరాలను తెలుసుకోవాలనే ఆసక్తితో నాన్–న్యూట్రిటివ్ వస్తువులను నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే పెద్ద పిల్లల్లోనూ ఇదే లక్షణం ఉంటే... అలాంటి కండిషన్‌ను తేలికగా తీసుకోకూడదు. ఈ కండిషన్ ఉన్నపిల్లల్లో చాలా సాధారణమైన సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన మానసిక రుగ్మతల వరకు ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినప్పటికీ సాధారణంగా... కుటుంబంలో సంబంధాలు సవ్యంగా లేకపోవడం, పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, కొన్ని మానసిక సమస్యలు, ఐరన్ లోపం, కడుపులో నులిపురుగుల వంటివి ఈ సమస్యకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పిల్లల్లో రక్తహీనత కూడా చాలా సాధారణంగా చూస్తుంటాం. మీ అబ్బాయికి రక్తహీనత కూడా ఉందంటున్నారు కాబట్టి ఒకసారి కంప్లీట్ బ్లడ్పిక్చర్తో పరీక్షతో పాటు, రక్తంలో లెడ్ పాళ్లు ఉన్నాయేమో అని పరీక్ష చేయించడం చాలా ప్రధానం. ఆహారం విషయానికి వస్తే మాంసాహారంలో కాలేయం, కోడిగుడ్లు, కూరగాయల్లో బీన్స్, సోయాబీన్, పప్పుధాన్యాలు, బ్రకోలీ, మస్టర్డ్, పాలకూర, రాగి వంటి వాటిల్లో ఐరన్ పాళ్లు ఎక్కువ. మీరు మీ అబ్బాయికి పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పాటు కొద్దిగా కొవ్వుపాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం మంచిది. అదేవిధంగా విటమిన్–సి ఎక్కువగా ఉన్న తాజా పండ్లు ఎక్కువగా తినిపించాలి. మీరు ఒకసారి మీ అబ్బాయికి కడుపులోని నులిపురుగులు పోవడానికి మందులు వాడటం కూడా అవసరం. మీరు మీ పిల్లల వైద్యనిపుణుణ్ణి సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. బాబుకు పాస్ పోసేటప్పుడు నొప్పి... మా బాబుకి పదేళ్లు. యూరిన్ పోసేటప్పుడు ఫ్రీగా కాకుండా కొంచెం, కొంచెంగా పోస్తుంటాడు. కొన్నిసార్లు పాస్ పోసేటప్పుడు నొప్పిగా ఉందంటాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఇన్ఫెక్షన్ ఉందని టాబ్లెట్స్ రాసిచ్చారు. అవి వాడినన్ని రోజులు తగ్గి, మళ్లీ మొదలవుతోంది. ఈ మధ్య సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తే తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలైంది. దయచేసి మా బాబు సమస్యకి పరిష్కారం తెలియజేయండి. – రియాజుద్దిన్, గుంటూరు మీరు చెప్పిన దాన్ని బట్టి్ట మీ బాబుకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో కూడా తరుచుగా చూస్తుంటాం. ఇది అబ్బాయిల్లో ఒక శాతం ఉంటే అమ్మాయిల్లో 3–5 శాతం ఉంటుంది. అనేక కారణాల వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తు ఉండవచ్చు. ఉదా. సరైన విసర్జన అలవాట్లు లేకపోవడం (ఇంప్రాపర్ టాయిలెట్ ట్రెయినింగ్), బిగుతు దుస్తులు వంటి సాధారణ అంశాలు కాక.... యూరినరీ ట్రాక్ట్‌లో అబ్నార్మాలిటీస్, వాయిడింగ్ డిస్ ఫంక్షన్, వియు రిఫ్లక్స్, బ్లాడర్‌కు ఉండే న్యూరలాజికల్ సమస్యలు, యూరెథ్రల్ అబ్స్ట్రక్షన్, మలబద్ధకం వంటి రిస్క్ ఫ్యాక్టర్ల వల్ల పిల్లల్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తుండవచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ పరీక్షలతో పాటు కెయుబి, అల్ట్రాసౌండ్, ఎంసీయూజీ అనే టెస్ట్‌లు చేయించడం చాలా ప్రధానం. ఈ పరీక్షలు చెయ్యడం వల్ల ఎనటమికల్ సమస్యలేమయినా ఉన్నాయేమో తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి యూరాలజిస్టును కలిసి తగిన సలహా, చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
సంతానం కలగాలంటే...
డాక్టరు గారు... నా వయసు 26 సంవత్సరాలు. మా ఆయన వయసు 28 సంవత్సరాలు. పెళ్లై సంవత్సరం దాటింది. మాకు సంతానం కలగలేదు. నాకు పిరియడ్స్ సక్రమంగానే వస్తాయి. వైద్య పరీక్షల్లో ఏ సమస్య లేదని చెప్పారు. మాకు పిల్లలు కలగాలంటే ఏ సమయాల్లో కలుసుకుంటే బాగుంటుంది తెలియజేయగలరు. – భావన, గుంటూరు సాధారణంగా భార్య, భర్తల్లో ఏ సమస్య లేనప్పుడు, 80 శాతం మంది పెళ్లయిన సంవత్సరం లోపల గర్భం దాల్చుతారు. 15 శాతం మంది రెండు సంవత్సరాల లోపల గర్భం దాల్చుతారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే, చికిత్స అవసరమవుతుంది. మీకు పెళ్లై సంవత్సరమే అయ్యింది. వైద్య పరీక్షలలో సమస్యలు ఏమీ లేవు కాబట్టి, ఇంకొక సంవత్సరం పాటు సాధారణ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. వైద్య పరీక్షలు నీకు మాత్రమే చేశారా లేక మీ వారికి కూడా వీర్య పరీక్ష చేశారా అనే విషయం సరిగా తెలుపలేదు. మీ వారికి కూడా వీర్య పరీక్ష చేసి, వీర్య కణాల సంఖ్య, కదలిక సరిగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ చెయ్యకపోతే, చేయించి చూడండి. అన్నీ బాగుంటే నీకు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయి కాబట్టి, బ్లీడింగ్ మొదలైన రోజు మొదటి రోజుగా లెక్కపెట్టి, 9వ రోజు నుంచి 16వ రోజు లోపల కలవడం వల్ల గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. నా వయసు 31 సంవత్సరాలు. పదహారు సంవత్సరాల క్రితం నాకు పెళ్లయింది. మా వారికి బ్లడ్ టెస్ట్‌లో హెచ్‌బియస్ ఏజీ పాజిటివ్ అని వచ్చింది. నాకు పిల్లలకు టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ అని వచ్చింది. మావారు కండోమ్లాంటివి ఎలాంటి సేఫ్టీ యూజ్ చేయరు. ఫ్యూచర్లో ఏమైనా సమస్య వస్తుందా? హెచ్‌బియస్ ఏజీ అంటే ఏమిటి? దీనికి ఏమైనా చికిత్స అవసరమా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మావారికి ఆల్కహాల్, నాన్‌వెజ్ తీసుకునే అలవాటు లేదు. – ఒక సోదరి, వరంగల్ శరీరంలో హెపటైటిస్–బి అనే వైరస్ ప్రవేశించడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ను హెపటైటిస్–బి ఇన్ఫెక్షన్ అంటారు. ఇది హెపటైటిస్–బి ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లతో సెక్స్ వల్ల, వారు వాడిన సిరెంజ్లు వాడటం వల్ల, ఇన్ఫెక్షన్తో కూడిన రక్తం ఎక్కించుకోవడం వల్ల, డెలివరీ సమయంలో తల్లి నుంచి బిడ్డకు సోకే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ లివర్ పనితీరు మీద ప్రభావం చూపి, దానిని దెబ్బతీస్తుంది. కొందరిలో ఇన్ఫెక్షన్ను ఎక్కువ కలగజేసి తర్వాత అదే తగ్గిపోతుంది. కొందరిలో మాత్రం ఈ వైరస్ రక్తంలో, శరీరంలోనే ఉండిపోయి, క్రానిక్ హెపటైటిస్–బిని కలగజేస్తుంది. ఏఆ అజ అంటే హెపటైటిస్–బి వైరస్ మీద ఉండే యాంటిజన్. బ్లడ్ టెస్ట్‌లో ఏఆ అజ ఉందని తేలితే, హెపటైటిస్–బి వైరస్ వారి రక్తంలో ఉందన్నమాట. కాకపోతే ఈ వైరస్ నిద్రావస్థలో ఉందా, యాక్టివ్‌గా ఉందా అనే దాని బట్టి, ఇన్ఫెక్షన్ తీవ్రత, వేరేవారికి సోకే అవకాశాలు, వారికి హాని కలిగించే లక్షణాల తీవ్రత ఆధారపడి ఉంటుంది. మీవారికి ఉండే హెపటైటిస్–బి ఇన్ఫెక్షన్ ఎటువంటిదో, దాని తీవ్రత తెలుసుకోవడానికి ఒకసారి ఫిజీషియన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి అవసరమైన పరీక్షలు ((HBSAg, HBSAb, Viral DNA load, LRT)) చెయ్యించుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. మీ టెస్ట్ నెగెటివ్ వచ్చింది కాబట్టి, మీరు హెపటైటిస్–బి వ్యాక్సిన్ మూడు డోస్‌లు తీసుకోవాలి. ఈ లోపల కండోమ్స్ వాడటం మంచిది. ∙నాకు ఒకప్పుడు క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకున్నాను. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. అయితే పిల్లలు కావాలనుకుంటున్నాను. కీమోథెరపీ ప్రభావం అండాలపై పడి, అండాలు తరిగిపోతాయని, ఉన్నవి ఆరోగ్యంగా ఉండవనే విషయం తెలిసింది. ఇది ఎంత వరకు నిజం? కీమోథెరపీ చేయించుకున్న నేను పిల్లల్ని కనవచ్చా? కంటే ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి? – రాధ, చిత్తూరు మీ వయస్సు ఎంతో రాయలేదు. కీమోథెరపీ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందో రాయలేదు. కీమోథెరపీలో వాడే చాలా మందుల ప్రభావం వల్ల అండాశయంలోకి అండాలు పెరిగే ఫాలికల్స్ ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వయస్సును బట్టి, మందుల మోతాదును బట్టి నశించిపోవటం, వాటి నాణ్యత తగ్గిపోవటం జరుగుతుంది. కీమోథెరపీ పూర్తయి కొన్ని సంవత్సరాలకి, దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అండాశయాల సామర్ధ్యతను బట్టి, కొందరిలో కొన్ని ఫాలికల్స్ మెల్లగా పెరిగి అండాలను విడుదల చేయడం జరుగుతుంది. కీమోథెరపీ సమయంలో కొన్ని సంవత్సరాల పాటు, పీరియడ్స్ ఆగిపోవటం జరుగుతుంది. వాటి ప్రభావం తగ్గిన కొన్ని సంవత్సరాలకు, కొందరిలో వయస్సును బట్టి, మళ్లీ పీరియడ్స్ మొదలవుతాయి. మీకు ఇప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా లేదా అనేది రాయలేదు. పీరియడ్స్ వస్తుంటే, గర్భం రావటానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కీమోథెరపీ తర్వాత పుట్టే పిల్లలకు తప్పనిసరిగా సమస్యలు ఉండాలని ఏమీలేదు. ఒకసారి మీకు చికిత్స ఇచ్చిన డాక్టర్‌ను సంప్రదించి, క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందా, తిరగబెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని, అవసరమైన పరీక్షలు చేయించుకుని, అండాలు తయారవుతున్నాయా లేదా వంటి పరీక్షలు చేయించుకుని, వారి సలహా మేరకు నిర్ణయం తీసుకోవటం మంచిది. -
ఇన్ఫెక్షన్ను అరికట్టే అరటిపువ్వు!
అరటిపువ్వు ఆరోగ్యానికి ఇచ్చే ప్రయోజనాలు ఒకటీ రెండూ కావు. దీనితో కూర చేసుకొని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. అరటిపువ్వులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్–ఈ వంటివి పుష్కలంగా ఉంటాయి. అరటిపువ్వుతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ♦ అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. ♦ క్యాన్సర్ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్ అనే కాలుష్య పదార్థాలను అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ సమర్థంగా హరిస్తాయి. వయసుపైబడే ప్రక్రియనూ అరటిపువ్వు మందగింపజేస్తుంది. అలా ఏజింగ్‌ను ఆపుతుంది. ♦ అరటిపువ్వుతో చేసిన కూరలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే అవి రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తాయి. ♦ అరటిపువ్వులో మెగ్నీషియమ్ ఎక్కువ. అందువల్ల అది యాంగై్జటీని తగ్గించడంతో పాటు, మూడ్స్ బాగుండేలా కూడా చేస్తుంది. ♦ ఇక అరటిపువ్వులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనత (అనీమియా)ను అరికడుతుంది. ♦ అరటిపువ్వు కూర తినడం మహిళల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. అరటిపువ్వుతో అనేక రుతుబాధలు నివారితమవుతాయి. రుతు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. ♦ రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, కడుపునొప్పి వంటి పీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్)కు కూడా అరటి పువ్వు మంచి ఔషధం. ♦ చంటి బిడ్డ తల్లులు అరటిపువ్వుతో చేసిన పదార్థాలు తింటే... వాళ్లకు బిడ్డకు సరిపడినన్ని పాలు పడతాయి. -
స్వైన్ ఫ్లూ
ఇటీవల విధి నిర్వహణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఒక పోలీస్ అధికారి స్వైన్‌ఫ్లూతో మృతి చెందారు. ఆయనే కాదు... ఇప్పుడు చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చూడటానికి అచ్చం మామూలు జలుబులాగే ఉన్నా... ఇది సాధారణ జలుబు కంటే ఒకింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. అందుకే దీన్ని గురించి అవగాహన పెంచుకోవడం అవసరం. ప్రత్యేకంగా ఇటీవల వాతావరణం చల్లబడుతున్న నేపథ్యంతో పాటు కొత్తగా చేరిన మిషిగన్ వైరస్‌తో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడం మరింత అవసరం. అందుకే ఈ ప్రత్యేక కథనం. సాధారణ లక్షణాలివే... సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే దీన్లోనూ కనిపిస్తాయి. అంటే... కాస్తంత జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ వేయడం, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు–ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు కూడా కనిపించవచ్చు. వ్యాప్తిచెందే అవకాశాలివి... ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గాలి ద్వారా సోకుతుంది. అంటే... సాధారణ జలుబులాగానే దగ్గడం, తుమ్మడం వల్ల గాలిలో కలిసిన ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవచ్చు. సీజనల్ ఫ్లూకూ... స్వైన్ ఫ్లూకు పోలికలు సీజనల్ ఫ్లూ విషయానికి వస్తే అది ఏ సమయాల్లో అయినా వస్తుంది, వస్తే ఎంతకాలం ఉంటుంది, దాని తీవ్రత ఎంత, ఏ సమయంలో అది తీవ్రమై ప్రాణాపాయానికి దారితీయవచ్చు అన్న అంశాలపై అవగాహన ఉంది. కొత్త హెచ్1ఎన్1 వైరస్ అన్నది 25 ఏళ్ల లోపువారిపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. 64 ఏళ్ల కంటే పైబడ్డవారిలో ఈ కొత్త హెచ్1ఎన్1 పెద్దగా ప్రభావం చూపిన దృష్టాంతాలు లేవు. కాని సీజనల్ ఫ్లూ విషయం అలా కాదు. వయసు అన్న అంశం మినహా మిగిలిన అంశాలన్నీ... అంటే గర్భవతి అయి ఉండటం, డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, మూత్రపిండాల, నరాల సంబంధమైన వ్యాధులు ఉండటం లాంటి అన్ని సందర్భాల్లోనూ... మిగతా ఇన్‌ఫ్లుయెంజాలో మాదిరిగానే ఈ కొత్త హెచ్1ఎన్1 వచ్చినప్పుడు పై అంశాలను రిస్క్ఫ్యాక్టర్లుగానే పరిగణించవచ్చు. పిల్లల్లో లక్షణాలు... ►పిల్లలు ఆయా సపడుతున్నట్లు ఉన్నా, శ్వాస అందడంలో ఇబ్బంది ఉన్నా ►చర్మం రంగు నీలంగా లేదా బూడిద రంగు (గ్రే)గా మారినా ►తగినంతగా ద్రవ పదార్థాలు తాగలేకపోతున్నా ►వాంతులు అవుతున్నా ►సరిగ్గా నడవలేకపోతున్నా లేదా మాట్లాడలేకపోతున్నా ► తట్టుకోలేనట్లుగా కనిపిస్తూ అస్థిమితంగా ఉన్నా ►ఫ్లూ లక్షణాలు తగ్గినా జ్వరం, దగ్గు మళ్లీ మళ్లీ రావడం... ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పెద్దల్లో లక్షణాలు... ►ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందకపోయినా ►ఛాతిలో నొప్పి, కడుపులో నొప్పి లేదా పట్టేసినట్లుగా ఉన్నా ►అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు అనిపించినా ►అయోమయంగా అనిపించినా ► ఆగకుండా, తీవ్రంగా వాంతులు అవుతున్నా ►ఫ్లూ లక్షణాలు తగ్గినా దగ్గు, జ్వరం మళ్లీ రావడం... అప్పుడు పెద్దవాళ్లూ (అడల్ట్స్) కూడా వైద్య సహాయం కోసం వెంటనే డాక్టర్‌ను కలవాలి. పోర్క్ తింటే వస్తుందా? పోర్క్ తింటే స్వైన్ ఫ్లూ వస్తుందన్నది చాలామందిలో ఉండే సాధారణ అపోహ. అయితే పేరును బట్టి అందరూ అనుమానించినట్లు ఇది పంది మాంసంతో సంక్రమించదు. అయితే... ఒకవేళ పంది మాంసాన్ని సక్రమంగా ఉడికించనప్పుడు (ఇంప్రాపర్లీ కుక్డ్ పోర్క్), పంది మాంసంతో కూడా స్వైన్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగానైతే గాలి ద్వారానే ఈ వైరస్ రోగి నుంచి మరో మామూలు వ్యక్తికి (మామూలు ఫ్లూ లాగా) వ్యాపిస్తుంది. ఇతరులకు వ్యాప్తి చేయగల వ్యవధి... హెచ్1ఎన్1 వైరస్ కూడా సాధారణ సీజనల్ ఇన్ఫ్లుయెంజా లాగానే వ్యాప్తి చెందుతుంది. రోగులు – తమకు లక్షణాలు కనిపించడానికి ఒక రోజు ముందు నుంచి తమకు వ్యాధి సోకిన 5 నుంచి 7 రోజుల వరకు ఇతరులకు వ్యాప్తి జేయగల స్థితిలో ఉంటారని అధ్యయనాల్లో తేలింది. కొందరిలో ఈ వైరస్ మరింత కాలం యాక్టివ్‌గా ఉంటుంది. వారి నుంచి రెండు వారాల వరకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ నళిని నాగళ్ల, సీనియర్ కన్సల్టెంట్ పల్మునరీ – స్లీప్ డిజార్డర్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఇంట్లో ఫ్లూ ఉన్నవాళ్లుంటే పనికి వెళ్లవచ్చా? మన ఇంట్లో ఫ్లూ రోగి ఉన్నా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నిరభ్యంతరంగా వర్క్‌ప్లేస్‌కు వెళ్లవచ్చు. అయితే మన ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పరీక్షించుకుంటూ ఉండాలి. నివారణ కోసం చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలన్నీ పాటిస్తుండాలి. ఆల్కహాల్ బేస్డ్ క్లెన్సర్స్ ఉపయోగిస్తుండాలి. ఒకవేళ జ్వరం లక్షణాలు కనిపిస్తే ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. చేతులు కడుక్కోవడం ఎలా? తరచూ చేతులు కడుక్కోవడం వల్ల అన్ని రకాల వైరస్ల నుంచి మంచి రక్షణ దొరుకుతుంది. సబ్బులతో చేతులు రుద్దుకోవడం అన్నది కనీసం 15–20 సెకండ్ల పాటు చేయాలి. సబ్బు, నీళ్లు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ బేస్డ్ డిస్పోజబుల్ రుమాళ్లు (హ్యాండ్ వైప్స్) లేదా శానిటైజర్స్ లేదా జెల్స్ ఉపయోగించవచ్చు. జ్వరంగా అనిపిస్తోందా? మీకు జ్వరం వచ్చినట్లుగా ఉంటే ఇతరులతో కలవద్దు. మీ పరిసరాల్లోని వ్యక్తుల్లో ఎవరికైనా ఇన్ఫ్లుయెంజా లక్షణాలు, జ్వరం ఉన్నట్లు తెలిస్తే వారిని మిగతావారితో సన్నిహితంగా మెలగనివ్వవద్దు. జ్వరం తగ్గిన 24 గంటల వరకూ మిగతావారితో కాంటాక్ట్ లేకపోవడమే మంచిది. వైద్య సహాయం కోసం తప్ప మిగతావాటి కోసం బయటికి వెళ్లవద్దు. అంటే... డ్యూటీకి వెళ్లడం, స్కూలు, కాలేజీలకు కూడా వెళ్లకూడదు. ప్రయాణాలు, షాపింగ్స్, ఫంక్షన్స్, సమావేశాల వంటి బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం సరికాదు. ఏమిటీ వైరస్? ఇది ఒక రకమైన జలుబు. కొన్నిచోట్ల ఈ వ్యాధిని హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ అని కూడా అంటారు. స్వైన్‌ఫ్లూ అంటే పంది నుంచి వచ్చే ఫ్లూ జ్వరం. అయితే ఈ వైరస్ పూర్తిగా పంది జాతిలో కనిపించేది కూడా కాదు. దీని చరిత్ర గురించి కాస్తంత తరచి చూద్దాం. జలుబుతో వచ్చే సాధారణ (ఫ్లూ) జ్వరానికి ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ కారణం. స్వైన్ ఫ్లూ వైరస్ ప్రధానంగా గాలి ద్వారానే వ్యాపిస్తుంది. ఫ్లూకు కారణమయ్యే ఇన్ఫ్లుయెంజాలోనే అనేక రకాల వైరస్లు ఉన్నాయి. అందులో దీన్ని ‘హెచ్1ఎన్1’ వైరస్‌గా నిపుణులు చెబుతున్నారు. మరి దీన్ని స్వైన్ ఫ్లూ అని ఎందుకంటున్నారు? సాధారణంగా ఈ తరహా వైరస్‌లను ‘ఇన్ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్ఫ్లుయెంజా బీ’, ‘ఇన్ఫ్లుయెంజా సి’ అని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ‘ఇన్ఫ్లుయెంజా బీ’ రకం పందుల్లో ఉండదు. ‘ఎ, సి’ రెండూ పందుల్లో కనిపిస్తాయి. ప్రస్తుతం కనిపిస్తున్న వైరస్ ‘ఇన్ఫ్లుయెంజా ఎ’ గ్రూపునకు చాలా దగ్గరగా ఉంది. ఇది... కొన్ని ఉత్పరివర్తనాలకు గురై, మానవులకు సోకే విధంగా రూపొందిందని నిపుణులు అభిప్రాయం. సాధారణ పరిభాషలో ప్రస్తుతం ‘స్వైన్ ఫ్లూ’గా అభివర్ణిస్తున్న ఈ వైరస్‌ను నిపుణులు ‘క్వాడ్రపుల్ రీ–అసార్టెంట్’ వైరస్ అని అంటున్నారు. అంటే... ఈ వైరస్ నాలుగు రకాల జీన్స్‌తో (జన్యు) మార్పిడి ఏర్పడ్డ సరికొత్త వైరస్ అని అర్థం అన్నమాట. అంటే ఇందులో రెండు ఖండాలకు చెందిన పందులకు వచ్చే వైరస్ల జీన్స్, పక్షులకు వచ్చే వైరస్ల జీన్స్, మానవులకు వచ్చే వైరస్ల జీన్స్... ఇలా అనేక రకాలకు చెందిన నాలుగు జీన్స్ ఉన్నా... రెండూ పందులకు వచ్చేవే ఉండటంతో దీన్ని ‘స్వైన్ ఫ్లూ’ అనే పిలుస్తున్నారు. దీని తీవ్రత ఎంతంటే? కొందరిలో ఇది మామూలు తీవ్రతతో కనిపించినా మరికొందరిలో ఇది మరీ ప్రమాదకరం కూడా కావచ్చు. ఇది సోకిన చాలామంది ఎలాంటి చికిత్స అవసరం లేకుండా తమంతట తామే కోలుకుంటారు. మరికొందరికి లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స అవసరం కావచ్చు. కొందరికి ఇది తీవ్రంగా పరిణమించవచ్చు. సాధారణ సీజనల్ ఫ్లూలో 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులు, ఐదేళ్ల లోపు చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులున్న అన్ని వయసుల వారిని ‘హై రిస్క్’ ఉన్నవారిగా చెప్పవచ్చు. డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, మూత్రపిండాల వ్యాధులతో గతంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నవారికి ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడు వాళ్లలో 70% మందికి గతంలో కనిపించిన లక్షణాలు తిరగబెట్టినందున వాళ్లను హైరిస్క్‌గా పరిగణించవచ్చు. కాని ఇంతవరకు ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్నవాళ్లకు ఈ కొత్త హెచ్1ఎన్1 హైరిస్క్‌గా తెలియరాలేదు. ఇటీవల సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్వహించిన పరిశోధనల్లో 64 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న అడల్ట్స్‌లో ఇంతవరకు ఈ కొత్త హెచ్1ఎన్1 వైరస్ యాంటీబాడీస్ కనిపించలేదు. అంతమాత్రాన ఈ ఒక్క కారణం చేతనే ఫలానా ఏజ్ గ్రూపునకు చెందిన వారికి ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ ఉంటుందని నిర్ధారణగా చెప్పడానికి లేదు. ఇది ఎవరికైనా రావచ్చు. గర్భవతులకు జాగ్రత్తలు గర్భవతులకు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిలోనూ, శరీరంలో జరిగే మార్పుల కారణంగానూ హెచ్1ఎన్1 త్వరగా, తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉంది. వారికి నిమోనియా, ఏఆర్డీఎస్ (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్) వంటి జబ్బులు వచ్చి ఊపిరితిత్తులు విఫలం అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అంతేకాదు... పిండానికి ఆక్సిజన్ అందక అబార్షన్ అయ్యేందుకు, బిడ్డ మరణించి పుట్టేందుకు (స్టిల్‌బర్త్) అవకాశం ఉంది. అంతేకాదు పుట్టిన బిడ్డకు ప్రాణాపాయం అయ్యే ప్రమాదమూ ఉంది. ఈ ప్రమాదాలు జరగకుండా గర్భిణి స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ►మూడో నెల తర్వాత డాక్టర్‌ను సంప్రదించి తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ►ఫ్లూ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి యాంటీవైరల్ (ఒసాల్టమివిర్) వంటి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణులు ఎంత త్వరగా (అంటే 48 గంటల లోపు) ఒసాల్టమివిర్ తీసుకుంటే ప్రమాదకరమైన పరిస్థితిని అంతగా నివారించవచ్చు. చికిత్స... సాధారణ ఫ్లూకు లాగే దీనికీ చికిత్స చేస్తారు. అయితే... ఇంతకంటే ముందుగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మరొకటుంది. ఫ్లూకు సంబంధించిన సాధారణ లక్షణాలు కనిపించగానే దాన్ని స్వైన్‌ఫ్లూ అంటూ అనుమానించి ఇష్టం వచ్చినట్లుగా యాంటీబయాటిక్స్ మందులు, వైరల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడం కోసమే ఉద్దేశించిన ఒసెల్టామివిర్ (టామీఫ్లూ) లేదా జనామివిర్ అనే మందు ఉపయోగించడం ఎంతమాత్రం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే విచక్షణ రహితంగా టామిఫ్లూ వంటి మందులు వాడటం వల్ల మామూలు వైరస్‌లకూ మందులను ఎదుర్కొనే శక్తిని (రెసిస్ట్ చేసే శక్తి లేదా రెసిస్టెన్స్) మరింతగా పెంచడం మినహా మరో ప్రయోజనం లేదు. నిర్దిష్టంగా టామిఫ్లూ మందునే ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్లు తమ పరిజ్ఞానం, విచక్షణతో విశ్లేషించి ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. ఇది మళ్లీ ఎందుకు పెరుగుతోంది? మన దేశంలో హెచ్1ఎన్1 వైరస్ 2009లో మొదటిసారి ఉద్ధృతంగా కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. మెల్లగా ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ పెరగడంతో 2010 నుంచి 2014 వరకు ఈ కేసులు ఎక్కువగా లేవు. కానీ 2015లో కాసిన్ని కనిపించాయి. ఆ తర్వాత ఇప్పుడు 2017లో ఇది మళ్లీ పడగవిప్పింది. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణలో 18, గుజరాత్లో 412 మృతులు నమోదయ్యాయి. ఇలా హెచ్1ఎన్1 తిరిగి విజృంభించడానికి కారణాలు... ►ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ తగ్గడం ∙అందరూ ప్రతి ఏడాదీ వ్యాక్సిన్ తీసుకోకపోవడం∙యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ యాంటీజెన్లో మార్పులు రావడం ∙కొత్తగా చేరిన మిషిగన్ వైరస్ హెచ్1ఎన్1 మిగతా ఫ్లూల కంటే ఎలా వేరు? ∙ఇది సాధారణంగా మధ్యవయస్కుల వారిలోనే ఎక్కువగా వ్యాపిస్తుంది ∙గర్భవతులకు చాలా త్వరగా వ్యాధి వ్యాపించి, ప్రమాదానికి దారితేసే అవకాశం ఉంది. (ఇటు తల్లికి, అటు కడుపులోని బిడ్డకు ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది) ∙ డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో కూడా ఈ జబ్బు తీవ్రంగా ఉంటుంది. స్వైన్ ఫ్లూ టిప్స్ ►దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతుల్ని, చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతి రుమాలు లేనప్పుడు తమ మోచేతి మడతలో ముక్కు, నోటిని దూర్చి తుమ్మాలి. ►దగ్గు, తుమ్ము వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ►దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను గాని వేరొకరు ఉపయోగించ కూడదు. దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి. ►జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. రోగులు కూడా వ్యాధి లక్షణాలు తగ్గిన రెండురోజులు అందరి నుంచి దూరంగా ఉండటమే మంచిది. ►జ్వరంతో ఉన్నవారు పిల్లల ఆటవస్తువులు, దుస్తులు, పుస్తకాలను ముట్టుకోకపోవడమే మేలు. ►పరిసరాలను, కిచెన్లను, బాత్రూమ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ►రోగి పక్కబట్టలను, పాత్రలను విడిగా శుభ్రపరచాల్సినంత అవసరం లేదు. అయినా వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పక్కబట్టలు, పాత్రలను మరొకరు ఉపయోగించకపోవడమే మంచిది. ►పబ్లిక్ ప్లేసెస్‌లో ఒకే బాత్ రూమ్ ఉపయోగించినప్పుడు తలుపు హ్యాండిల్, కొళాయి నాబ్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దాన్నే ఫొమైట్ ట్రాన్స్మిషన్ అంటారు. కాబట్టి హ్యాండిల్స్/నాబ్స్‌ను వాడిన తర్వాత చేతులను హ్యాండ్ శానిటైజెస్’తో శుభ్రం చేసుకోవడం అసవరం. ►పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ వాడటం వల్ల వ్యాధిని పూర్తిగా నివారించలేం. కానీ, కొంత మేరకు మంచిదే. ►స్వైన్ ఫ్లూకు ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. -
తోం తోం తోం
నిద్ర మత్తుతో లేచి బ్రష్ మీద కాస్త పేస్ట్ పూసి తోం తోం తోం అని తోమడం కాదు... పళ్లు చిగుర్ల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే రైట్ బ్రష్... కరెక్ట్ పేస్ట్... పర్ఫెక్ట్ టెక్నిక్ ఉండాలంతే! పళ్ల ప్రాబ్లమ్‌లు మిమ్మల్ని కొరుకుతూ ఉంటే ఈ చిట్కాలను ఒకసారి నెమరేయండి... పళ్లు నవ్వాలంటే చిగుర్లు బలంగా ఉండాలి!! పిల్లలకు డెంటల్ కేర్ అండ్ బ్రషింగ్ పసివయసు పిల్లలకు ప్రతిసారీ పాలుపట్టాక వాళ్ల నోటిని తడి గుడ్డతో గానీ, మామూలు నీళ్లలో ముంచిన దూదితో గానీ శుభ్రం చేయాలి. పాలపళ్లు వచ్చాక టూత్‌బ్రష్‌తో పళ్లు శుభ్రం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. రెండేళ్ల వయసు కంటే ముందే ఫ్లోరైడ్ టూత్పేస్ట్వాడాలనుకుంటే మొదట డెంటిస్ట్‌ను కలిసి వారి సలహా తీసుకోవాలి. ∙పిల్లలు ఊయగలరు అనీ, టూత్‌పేస్ట్‌ను మింగరు అని నిర్ధారణ అయ్యాక వాళ్ల టూత్‌బ్రష్‌పై కాస్తంత టూత్‌పేస్ట్ వేసి వాళ్లు పళ్లు తోముకునేలా చేయాలి. ∙చిన్నారులకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులే బ్రష్ చేయడం మంచిది. పిల్లలు నిద్రపోవడానికి ముందే పాలుపట్టడం పూర్తిచేయండి. వాళ్లు నిద్రపోయాక బాటిల్‌ను అలాగే నోట్లో ఉంచవద్దు. ∙పిల్లల మొదటి పుట్టినరోజు నాటి నుంచే వాళ్లు కప్స్ సహాయంతో ఆహారాన్ని చప్పరించి తీసుకునేలా ప్రోత్సహించండి. ∙వారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అలవాటు చేయండి. ఆహారంలో ఆకుకూరలు, పళ్లు, కాయధాన్యాలు ఎక్కువగా తినేలా, ఆహారం తీసుకునేప్పుడు చక్కెర పదార్థాలు తక్కువగా తినేలా చూడండి. పిల్లలు ఉపయోగించే బ్రష్ మృదువైన బ్రిజిల్స్ ఉన్నదై ఉండాలి. ∙బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకునేలా చూడాలి. రఫ్‌గా బ్రష్ చేసుకోవడం పిల్లల చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవడం వారికి నేర్పాలి. ∙పిల్లలు అదేపనిగా బ్రష్‌ను నములుతూ ఉండకుండా చూసుకోవాలి. ఆ అలవాటును ప్రోత్సహించవద్దు. ∙బ్రష్ చేసుకునే ప్రక్రియ కనీసం రెండు నిమిషాల పాటు కొనసాగాలి. మరీ ఎక్కువ సేపు కూడా బ్రషింగ్ వద్దు. ∙నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకునేలా టంగ్‌క్లీనింగ్ పిల్లలకు నేర్పాలి. ∙చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ముందువైపు పళ్లకు పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకునేలా నేర్పాలి. వెనకవైపు పళ్లకు, బ్రష్‌ను గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్ చేసుకునేలా చూడాలి పిల్లలూ... పిప్పిపళ్లు పిల్లల్లో పాల పళ్ల దశలో బ్రషింగ్ సరిగా జరగకపోతే కీలకమైన పాలపళ్లు కాస్తా పిప్పిపళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో పాలపళ్లు చాలా ప్రధానమైనవి. ఆహారం నమలడానికి, మాట్లాడటానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ దంతాలు చాలా దోహదపడతాయి. పాలపళ్లు సరిగా ఉంటే భవిష్యత్తుల్లో శాశ్వత దంతాలు సక్రమంగా రావడానికి చాలా ఉపయోగకరం. సాధారణంగా ఆర్నెల్ల వయసులో వచ్చే పాలపళ్లు వచ్చినప్పటి నుంచీ అవి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. తీపిపదార్థాలు, చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా తాగడం, పిల్లలు ఏడ్వకుండా ఉండటానికి పాలపీకను నోట్లో ఉంచేయడం వంటి అలవాట్లతో పళ్లు పాడవుతాయి. పళ్లన్నీ పిప్పిపళ్లుగా మారితే– పాడైన వాటినన్నింటినీ తొలగించాల్సి రావచ్చు. అయితే త్వరగా డాక్టర్‌ను సంప్రదిస్తే వాటిని కాపాడుకోడానికీ అవకాశం ఉంది. అందుకే ఒక వయసు వచ్చాక పిల్లల బ్రషింగ్పై తల్లిదండ్రులు తప్పక శ్రద్ధ చూపాలి. అనేక రకాల టూత్పేస్ట్లు మనకు ఇవాళ రకరకాల టూత్పేస్ట్లు లభ్యమవుతున్నాయి. వాటిలో అనేక రకాల సౌలభ్యాలూ ఉన్నాయంటూ తయారీదారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. దాంతో మనకు ఎలాంటి టూత్‌పేస్ట్ కావాలనే దానిపై సందిగ్ధం నెలకొంటుంటుంది. అయితే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఒకటుంది. ప్రతివారికీ వేర్వేరు జీవనశైలి ఉంటుంది. కాబట్టి ఒకరికి అనువైన టూత్‌పేస్ట్ మరొకరికి అనువుగా ఉంటుందనే నియమం ఉండదు. కాబట్టి ప్రతివారూ తమ అవసరాల మేరకు తమ టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా మనకు అందుబాటులో ఉండి, ఎంచుకోదగ్గ టూత్పేస్ట్లు ఇవి... పిల్లల టూత్పేస్ట్లు : పిల్లల టూత్‌పేస్ట్‌లలో ఫ్లోరైడ్ పాళ్లు పెద్దవారి టూత్‌పేస్ట్ కంటే తక్కువగా ఉంటాయి. నిజానికి ఫ్లోరైడ్ పాళ్లు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటే అది చాలా హానికరం. అలాగే గారపోగొట్టేలా రుద్దగల శక్తి (అబ్రేసివ్గుణం) కూడా పిల్లల టూత్‌పేస్ట్‌లో చాలా తక్కువగా ఉండాలి. అలాగే వారి దంతాలు, చిగుర్లు సున్నితంగా ఉంటాయి కాబట్టి శక్తిమంతమైన రసాయనాలు లేని స్వాభావికమైన టూత్‌పేస్ట్‌లను డాక్టర్‌ను సంప్రదించి తీసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్లు : మనదేశంలో ఫ్లోరైడ్ పాళ్లు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉన్నందున ఫ్లోరైడ్‌తో కూడిన నీళ్ల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయిగానీ... నిజానికి తగిన పాళ్లలో ఉంటే ఫ్లోరైడ్ వల్ల దంతాల ఎనామెల్‌కు రక్షణ కలుగుతుంది. అలాగే దంతాన్ని దృఢంగానూ చేస్తుంది. కాబట్టి మనకు పుష్కలంగా ఫ్లోరైడ్ లభ్యత ఉన్నచోట్ల మినహాయించి తగినంత ఫ్లోరైడ్ లభ్యత లేని మిగతా ప్రాంతాల వారు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌లను వాడవచ్చు. దంతాలను తెల్లగా చేసేవి (టీత్ వైటెనింగ్ టూత్‌పేస్ట్స్) : దంతాలు కాస్త పసుపుపచ్చగా అనిపిస్తున్నవారు గారపొగొట్టేలా రుద్దగల శక్తి (అబ్రేసివ్ గుణం) ఉన్న టూత్‌పేస్ట్‌లను వాడటం మంచిది. అయితే అలాంటివి వాడేవారు కాస్తంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గారపోగొట్టే ‘యాంటీ స్టెయిన్స్’ టూత్‌పేస్ట్‌ను ఎక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల క్రమంగా పంటిపై ఉండే ఎనామెల్ కూడా దెబ్బతినవచ్చు. సున్నితమైన దంతాల కోసం వాడాల్సినవి (సెన్సిటివ్ టూత్‌పేస్ట్స్) : త్వరగా ప్రభావితం కాగల చాలా సున్నితమైన పళ్లు (సెన్సిటివ్ టీత్) ఉన్నవారు, చిన్న సమస్యకే చిగుర్ల నొప్పి వచ్చేవారు సెన్సిటివ్ టూత్ పేస్ట్‌లు వాడాలి. ఇలాంటివారు పొటాషియమ్ నైట్రేట్ ఉన్న టూత్‌పేస్ట్ వాడటం మంచిది. ఎందుకంటే ఆ రసాయనం నొప్పిని తెలిపే యంత్రాంగాన్ని కాసేపు నిద్రాణంగా ఉంచుతుంది. దాని వల్ల కాసేపు నొప్పి తెలియకుండా ఉంటుంది. హెర్బల్ టూత్పేస్ట్లు : నేచురల్ ఆరోగ్యప్రదాయిను లంటూ ఇటీవల స్వాభావికమైన మూలికలు, అటవీ ఉత్పాదనతో తయారు చేసే టూత్పేస్ట్లు ఎక్కువగా వస్తున్నాయి. సాధారణంగా కొందరికి రసాయనాలతో తయారైన టూత్పేస్ట్లు కొద్ది మొత్తంలో తీసుకున్నా వారికి సరిపడవు. అలాంటి వారు ఈ హెర్బల్ టూత్‌పేస్ట్‌లను వాడవచ్చు. అయితే ఈ టూత్‌పేస్ట్ లలో ఫ్లోరైడ్ ఉండదు కాబట్టి... ఫ్లోరైడ్ నీళ్లు దొరికే ప్రాంతాల వారు, ఫ్లోరైడ్ అవసరాలు లేనివారు వీటిని వాడవచ్చు. అయితే ఫ్లోరైడ్ ప్రాంతాల వారితో పాటు మిగతా ప్రాంతాలవారు కూడా ఒకసారి తమ దంతవైద్యుడిని సంప్రదించాకే ఈ హెర్బల్ టూత్పేస్ట్లు వాడటం మంచిది. గారను తొలగించే పేస్ట్‌లు (యాంటీ ప్లాక్ టూత్ పేస్ట్) : పళ్లపై పేరుకునే పాచికి ఒక లక్షణం ఉంటుంది. వెంటవెంటనే బ్రష్ చేసుకుంటే ఆ పాచి త్వరగా తొలగిపోతుంటుంది. కానీ బ్రష్ చేయడంలో అలసత్వం వహించినప్పుడు అది గార (ప్లాక్)గా ఏర్పడుతుంది. అలాంటి గారను దంతవైద్యుల సహాయంతో స్కేలింగ్ చేయించాలి. ఇప్పుడు ఈ గారను తొలగించేలా బలమైన, శక్తిమంతమైన యాంటీ ప్లాక్ టూత్పేస్ట్లు దొరుకుతున్నాయి. అయితే వాటిని అవసరమైన వారు కొద్దికాలం పాటు దాన్ని ఉపయోగించాక... గారతొలగిపోయాక మళ్లీ తమ సాధారణ టూత్‌పేస్ట్‌కు మళ్లడం మంచిది. పెద్దగా అవసరం లేకపోయినా అదే పనిగా ఈ యాంటీ ప్లాక్ టూత్పేస్ట్లు వాడటం వల్ల దంతాలు దెబ్బతినవచ్చు. చిగుర్లు గాయపడి మంట (ఇరిటేషన్) రావచ్చు. పైగా ఇవి చిగుర్లను గాయపరచడం వల్ల బ్యాక్టీరియా పేరుకునేందుకు తావిస్తాయి. దాంతో చిగుర్ల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే యాంటీ ప్లాక్ టూత్‌పేస్ట్‌లను దీర్ఘకాలం వాడటాన్ని నిపుణులు అంతగా సిఫార్సు చేయరు. సాధారణంగా మనకు లభ్యమయ్యే రకరకాల టూత్‌పేస్ట్‌ల తీరుతెన్నులు ఇవి. ఎవరికి వారు తమ విచక్షణ మేరకు అవసరమైన వారు వాటిని వాడవచ్చు. అయితే తమకు ఎలాంటి టూత్‌పేస్ట్ సరిపడుతుందో అనుభవం మీద తెలిశాక... ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి దాన్ని కొనసాగించం అన్ని విధాలా మంచిది. పెద్దలు బ్రషింగ్ ఎలా చేసుకోవాలంటే..! ►మీ దంతసంరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ప్రతిరోజూ రెండుమార్లు పళ్లు తోముకోండి. ►మీ డెంటిస్ట్‌ను కలిసి క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోండి. ►మీరు బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడండి. ► దంత సంరక్షణను అందించే మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోండి. ► పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ►బ్రష్ చేసుకునే సమయంలో చాలా మృదువుగా బ్రష్ చేసుకోండి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి. ►లోపలివైపున బ్రష్ చేసుకోడానికి బ్రష్‌ను నిలువుగా పట్టుకొని పైకీ, కిందికీ మృదువుగా కదిలించండి. ► కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. ►నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి. ►బ్రష్షింగ్ తర్వాత టూత్‌బ్రష్‌ను మృదువుగా రుద్దండి. ►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►ప్రతి మూడు నెలలకు ఓమారు బ్రష్‌ను మార్చేయండి. లేదా బ్రిజిల్స్ వంగినట్లు, దెబ్బతిన్నట్లు కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. దంత సమస్యల నివారణ ఎలా? పిల్లలకు గాని, పెద్దలకు గాని చిగుళ్ల జబ్బులు రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు రెండు పూటలా బ్రష్ చేయించడం, పెద్దలూ రెండు పూటలా బ్రష్ చేసుకోవడం, పంటికి అతుక్కుపోయే పదార్థాలు తీసుకోకపోవడం, తినేవాటిలో జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త పడటం అవసరం. దాంతోపాటు స్వీట్స్ తగ్గించాలి. తీపి పదార్థాలు తిన్న ప్రతిసారీ నోటిని నీళ్లతో పుక్కిలించాలి. పంటి చిగుర్లకు ఇన్ఫెక్షన్లు వస్తే..! పంటి చిగురుకు ఇన్ఫెక్షన్ వస్తే మొదట తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతలోనే అకస్మాత్తుగా అది లేకుండా మాయమైనట్లు అనిపిస్తుంది. పంటి చుట్టూ చీము చేరుతుంది. ఈ ఇన్ఫెక్షన్ చిగురుకు పూర్తిగా పాకుతుంది. అది పంటిని వదులు చేస్తుంది. అక్కడో గడ్డ కూడా కావచ్చు. ఒక్కోసారి అది చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. నొప్పి లేదంటే అదేదో తగ్గిపోయిందనీ, డెంటిస్ట్ దగ్గరికి వెళ్లనక్కర్లేదని అర్థం కాదు. ఒకవేళ చీము అంతా ఎండిపోకపోతే అది క్రమంగా దవడకూ, తలకే కాదు... నొప్పి మెడవరకూ పాకొచ్చు. అది భయంకరంగా మారొచ్చు. నిజానికి మన నోట్లోనే బోల్డన్ని బ్యాక్టీరియా (సూక్ష్మజీవులు) ఉంటాయి. మనలో దంతక్షయంగానీ ఉంటే ఆ దెబ్బతిన్న పన్నులోని మృతకణాలున్న భాగం బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడి ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. దంతంలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే... అదే బ్యాక్టీరియా విస్తరించేందుకు సింహద్వారమవుతుంది. అలా ఇన్ఫెక్షన్ వస్తే మాటిమాటికీ నొప్పి వస్తూ ఉంటుంది. వేడి లేదా చల్లటి పదార్థాలు తిన్నప్పుడల్లా జిల్లుమంటుంది. అదేకాదు... నమలగానే నొప్పి ఠక్కున పొడుచుకొని వస్తుంది. అప్పటికీ డెంటిస్ట్‌కు చూపించకపోతే ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోని మరే అవయవానికైనా విస్తరిస్తుంది. ఉదాహరణకు గొంతులోని గ్రంధులు వాచినట్లుగా కావచ్చు. నోరు దుర్వాసన వస్తున్నట్లు, మనమేదైనా నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే నోట్లో చిగురు వద్ద వచ్చిన గడ్డ పలిగినందుకు అది సూచన. ఇలాంటప్పుడు నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది గానీ వాస్తవానికి ఇన్ఫెక్షన్ మాత్రం మన శరీరంలోనే ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం కావచ్చు. అందుకే మన పంటికి ఎలాంటి నొప్పి వచ్చినా వెంటనే డెంటిస్ట్‌కు చూపించుకొని తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ ప్రత్యూష హెచ్ఓడీ, ఓరల్ మెడిసిన్ మాక్సీలో ఫేషియల్ రేడియాలజీ, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పచ్చబొట్టు ప్రాణం తీసింది..
న్యూయార్క్: పచ్చబొట్టు వేయించుకున్న ఓ అమెరికన్ దాన్నుంచి శరీరంలోకి ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. టాటూ వేయించుకున్నాక∙కొన్ని వారాలు స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేయకూడదు. అయితే టాటూ వేయించుకున్న ఐదు రోజులకే స్విమ్మింగ్‌పూల్‌లో అతడు స్నానం చేశాడు. దీంతో కండను తినేసే విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా శరీరంలోకి చొరబడింది. తీవ్ర జ్వరంతోపాటు శరీరం ఎర్రగా మారింది. ఆస్పత్రిలో చేరిన బాధితుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో రెండు నెలల తర్వాత కాలేయం, కిడ్నీ, చర్మం పాడై ప్రాణాలు కోల్పోయాడు. -
ఆ ఇన్ఫెక్షన్లు ఈ సీజన్లోనే ఎందుకు ఎక్కువ?
విమెన్ కౌన్సెలింగ్ వేసవిలో నేను తరచూ మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్)కు గురవుతుంటాను. ఎండాకాలంలో ఎందుకీ సమస్య మాటిమాటికీ తిరగబెడుతుంది? కారణాలు వివరించండి. – మాలతి, వర్ధమాన్‌కోట మన మూత్ర వ్యవస్థలో రెండు కిడ్నీలుంటాయి. వాటి నుంచి మూత్రకోశానికి (బ్లాడర్) రెండు నాళాలు వెళ్తాయి. వాటిని యురేటర్స్ అంటారు. బ్లాడర్ నుంచి మరో నాళం (ఇదే మూత్ర నాళం) ద్వారా మూత్రవిసర్జన జరుగుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే... మాటిమాటికీ మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్ర విసర్జన సమయంలో మంట, పొత్తికడుపులో నొప్పి, కాస్తంత మబ్బు రంగులో, ఒక్కోసారి ఎర్రగా, కొంత దుర్వాసనతో మూత్రం వస్తుంది. చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు ఈ–కొలై అనే పరాన్న జీవి కారణమవుతుంది. సాధారణంగా ఇది ఆహారనాళంలో ఉంటుంది. అయితే అవి మూత్ర విసర్జన వ్యవస్థలోకి కూడా ప్రవేశించవచ్చు. అలాగే క్లెబిసియెల్లా, ఎంటరోకోకస్ ఫీకాలిస్ అనే సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్‌కు లొంగకుండా మొండిగా మారుతున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రవిసర్జక నాళం పొడవు తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు సోకగల ప్రదేశాల పైన మలవిసర్జన నాళం వంటి ప్రదేశాలకు దగ్గరగా ఉంటాయి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పరిమాణంలో బ్యాక్టీరియా పెరిగేందుకు అవకాశం ఉండటంతో మహిళల్లో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మహిళల్లో సహజంగా ఉండే సిగ్గు, బిడియం ఎక్కువ. కాబట్టి ఇటువంటి కారణాలున్నప్పటికీ వైద్యం కోసం హాస్పిటల్స్‌కు వచ్చే వాళ్లు చాలా తక్కువ. సమస్య తీవ్రమైనప్పుడే వారు ఆసుపత్రులకు వస్తుంటారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. గుర్తించిన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకోవాలి, లేకపోతే కిడ్నీల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్ ఆకర్షణీయమైన రంగుల ఆహారం తీసుకోవచ్చా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ వేసవి సెలవుల్లో ఊళ్లకు, బయటి ప్రదేశాలకు, విహార యాత్రలకు వెళ్తుంటాం కదా? అక్కడ ఆకర్షణీయమైన రంగులతో ఉండే ఆహారాలకు పిల్లలు తేలిగ్గా ఎట్రాక్ట్ అవుతుంటారు. ఆ ఆహారం వారికి ఇవ్వవచ్చా? – శ్రద్ధ శ్రీ, బళ్లారి ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు దీర్ఘకాలం నిల్వ ఉండటానికి వాడే ప్రిజర్వేటివ్స్... సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్యాక్టివ్) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయింది. అందుకే రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ మునుపటి చురుకుదనం సాధించడం ఎలా..? లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. గతంలో చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. ఇటీవల నా ఫిట్నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. మెట్లు ఎక్కే సమయంలో మునుపటిలా చురుగ్గా లేకపోవడం వల్ల నాకు ఈ ఫీలింగ్ వస్తోంది. నేను మునుపటిలాగే ఆరోగ్యాన్నే పొందడానికి ఏం చేయాలో సలహా ఇవ్వండి. ఇక ఇటీవల సమ్మర్లో మరింత అలసట ఫీలవుతున్నాను. – బి. వెంకటేశ్వరరావు, గుంటూరు వయసు పెరుగుతున్న సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశం. మీ వయసు వారిలో డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధి లక్షణాలు ఏవైనా ఉంటే, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాని వల్ల వయసు పైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినప్పుడు ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్సైజ్కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు. వేసవిలో మరింత నిస్సత్తువతోనూ, నీరసంగా ఉండటం జరుగుతోందంటే బహుశా మీరు నీటిని, ఉప్పును ఎక్కువగా చెమట రూపంలో కోల్పోవడం వల్ల కావచ్చు. వేసవిలో ఎక్సర్సైజ్ చేయవచ్చు. కానీ అవి ఎక్కువ శ్రమ కలిగించేలా కాకుండా బాగా తేలికపాటివే అయి ఉండాలి. ఈ సీజన్లో డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోండి. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆస్పత్రిలో చేరిన ఎన్డీ తివారి
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (91) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనను గతరాత్రి కుటుంబసభ్యులు రామ్ మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. తివారీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ...ఇవాళ తివారిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ’తివారీ తమకు వారసత్వ సంపద’ లాంటివారిని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తివారీ తనయుడు రోహిత్...సీఎంను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. కాగా ఈ నెల 19న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తివారీ హాజరయ్యారు. -
మహిళల్లో అధికంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్
కర్నూలు(హాస్పిటల్): వ్యాధికారక క్రిములతో పోరాడే శత్రువులుగా మారి వ్యాధికి గురిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజ్ మహిళల్లో అధికంగా వస్తున్నాయని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బి. ఉదయ్‌కుమార్ చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ఆదివారం పలురకాల ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లపై జోనల్ స్థాయి వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సును కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ సిస్టమిక్ లోపస్ ఎరిటమోసిస్ అని పిలవబడే చర్మ సంబంధ ఆటో ఇమ్యూన్ డిసీజ్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణం తీసే ప్రమాదం ఉందన్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లు చర్మం, కీళ్లు, కిడ్నీ, గుండె, మెదడు, కాలేయానికి వస్తాయన్నారు. వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటే ఇతర అవయవాలకు ఈ వ్యాధి పాకకుండా చూసుకోవచ్చన్నారు. అనంతరం పలు రకాల చర్మవ్యాధులపై చర్మవ్యాధినిపుణులు డాక్టర్ మస్తాన్ సాహెబ్, డాక్టర్ గౌతమిశ్రీ, డాక్టర్ పి. విజయలక్ష్మి, డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, డాక్టర్ అరుణకుమారి ప్రసంగించారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు డాక్టర్ చంద్రన్న, మెడికల్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఫ్లూ టీకాను ఆర్నెల్ల పాపకు ఇవ్వవచ్చా?
ఫ్లూ అంటే ఏమిటి? ఫ్లూకి టీకాలు, మందులు ఉన్నాయా? స్వైన్ ఫ్లూ కూడా ఒక రకమైన ఫ్లూయేనా? ఆర్నెల్ల లోపు పాపకు ఫ్లూ టీకా ఇవ్వవచ్చా? – కమల, చిత్తూరు ఫ్లూ అంటే శ్వాసకోశానికి ఇన్ఫెక్షన్ను సంక్రమింపజేయడం వల్ల వచ్చే ఒక రకం వ్యాధి. ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్లు ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు హానిచేయవచ్చు. జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి... ఈ వ్యాధి లక్షణాలు. వాంతులు, విరేచనాలు కూడా ఉండవచ్చు. ప్రతి ఫ్లూకీ జ్వరం రావాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి వ్యాధి ముదిరితే అది ప్రాణాంతకం కావచ్చు. ఫ్లూ జ్వరం వచ్చిన వాళ్లు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు ఉమ్ము ద్వారా ఈ వ్యాధి వేరేవారికి సంక్రమిస్తుంది. రోగి ఉమ్ము, ముక్కు నుంచి వచ్చే స్రావాలను ముట్టుకొని మళ్లీ మన ముఖాన్ని ముట్టుకున్నా ఈ వ్యాధి రావచ్చు. ఫ్లూ మొదలైన తర్వాత ఒక వారం వరకు వేరేవాళ్లకు దూరంగా ఉంటే మంచిది. కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండి మాట్లాడవచ్చు. కర్చిఫ్లు, గ్లాసులు, ప్లేట్లు ఒకరివి మరొకరు వాడకూడదు. సాధారణంగా 65 ఏళ్లు పైబడినవారు, నర్సింగ్‌హోమ్‌లో పనిచేసేవారు / ఉండేవారు, గర్భంతో ఉన్న మహిళలు, హెచ్ఐవీ / ఎయిడ్స్ వ్యాధి ఉన్నవాళ్లు, కిడ్నీ జబ్బులు ఉన్నవారు, గుండెజబ్బులు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది వ్యాధి విషమించడం వల్ల వచ్చే పరిణామాలూ వీళ్లలో చూస్తుంటాం. హెల్త్ కేర్ వర్కర్లు, డాక్టర్స్, నర్స్‌లతో పాటు ఆస్తమా జబ్బు ఉన్నవాళ్లు ఫ్లూకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే రెండేళ్లలోపు పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం మరింత ఎక్కువ. వీళ్లంతా ఫ్లూ టీకా తీసుకుంటే మంచిది. ఆరు నెలల లోపు పిల్లలకు ఫ్లూ టీకా ఇవ్వకూడదు. అయితే ఈమధ్య పిల్లలకు ఇస్తున్న ఫ్లూ టీకాలో స్వైన్‌ఫ్లూ టీకా కూడా ఉంటోంది. నివారణ : టీకాలు ద్వారా ఫ్లూను నివారించవచ్చు. అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఫ్లూ ఉన్నవారి నుంచి కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండటం, వారు ఉపయోగించిన కర్చిఫ్లు వాడకపోవడం, ఒకరి ప్లేట్లు మరొకరు వాడకుండా ఉండటం, ఫ్లూ ఉన్నవారు స్కూల్స్‌కు, ఆఫీసులకు వెళ్లకుండా ఉండటం ద్వారా దీన్ని నివారించవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఫ్లూ వస్తే మిగతావారికి ఫ్లూ టీకాలు ఇవ్వడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు. ఫ్లూ జ్వరం వచ్చినవారు జ్వరం మందు సరిగా తీసుకోవాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోవడం కూడా అవసరం. ఒకవేళ అప్పటికే స్వైన్‌ఫ్లూ బారిన పడితే అందుకు మంచి మందులు కూడా ఉన్నాయి. అయితే నిపుణులైన వైద్యుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలోనే వీటిని వాడాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఫ్లూ వస్తే మిగతావారికి ఫ్లూ టీకాలు ఇవ్వడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోవడం కూడా అవసరం. బాబు సరిగా తినడం లేదు... ఏం చేయాలి? మా బాబు వయసు ఏడేళ్లు. వాడు సరిగా అన్నం తినడం లేదు. ఈ వయసులో వాడు అలా అన్నం తినకపోవడం మాకు కాస్త ఆందోళన కలిగిస్తోంది. దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. – సరళ, నిడదవోలు ఈ వయసులో ‘మా పాప సరిగా అన్నం తినడం లేదు’, ‘మా బాబు తన తిండి విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టడు’ అని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు తరచూ డాక్టర్లు వింటుంటారు. పిల్లలు సరిగా తినకపోవడానికి కారణాలలో ముఖ్యమైనవి... 1. మలబద్ధకం 2. శరీరంలో ఇనుము (ఐరన్) తక్కువగా ఉండటం 3.పొట్టలో నులిపురుగులు 4. తల్లిదండ్రులు పిల్లలకు స్వాతంత్య్రం ఇవ్వకుండా బలవంతంగా తాము అనుకున్నట్లుగా తినిపించడం. ఇవి కాకుండా పేగుకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. పిల్లలు సరిగా తినడం లేదన్న సమస్యతో తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా మేము (డాక్టర్లం) ముందుగా ఆ చిన్నారి ఎదుగుదల ఎలా ఉంది; చర్మం, జుట్టు, పళ్లు, కళ్లు నోటిచిగుర్లు, గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా, లేదా అని చూస్తాం. వీటిలో ఏ లోపం కనిపించినా, దానికి తగిన పరీక్షలు చేయిస్తాం. అలాగే ఒంట్లో ఇనుము (ఐరన్) శాతం ఎంత ఉందో చెక్ చేస్తాం. మలబద్ధకం లేదా నులిపురుగులు ఉన్నట్లు తెలిస్తే, వాటిని నిర్మూలించే మందులు ఇస్తాం. తల్లిదండ్రులకు ఆ విషయాల గురించి అవగాహన కల్పిస్తాం. ఐరన్ లోపం ఉందని అవగతమైతే ఆ లోపాన్ని సరిచేస్తాం. ఇదిగాక చాలా సందర్భాల్లో పిల్లవాడు సరిగా తింటున్నా తల్లిదండ్రులకు తృప్తి ఉండదు. దాంతో వాడి చేత బలవంతంగా తినిపిస్తారు. ఫలితంగా పిల్లలకు ఊబకాయం వస్తుంది. దాని కారణంగా అనర్థాలు ఎదురవుతాయి. ఇక తల్లిదండ్రులంతా పిల్లలకు ఆహారం ఇచ్చే విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటంటే... వారికి మంచి పోషకాహారం ఇవ్వాలి. అంటే ఆ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు), ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కొవ్వుపదార్థాలు అన్నీ అందేలా సమతులాహారం ఇవ్వాలి. పిల్లల ఆహారంలో నట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఉండేటట్లుగా చూసుకోవాలి. పిల్లలు ఎంత మోతాదులో తింటారనేది చూసి, అంతే ఆహారం ఇస్తుండాలి. అంతేగానీ.. పిల్లల చేత ఎక్కువగా తినిపించాలనే ఉద్దేశంతో వాళ్లకు గాడ్జెట్స్ ఆశపెట్టడం, టీవీ చూపిస్తూ తినిపించడం వంటివి చేయకూడదు. పిల్లలు తమ సొంతంగా తినే అలవాటును మొదటినుంచీ చేయించాలి. ఎప్పుడూ ఒకేరకమైన ఆహారం తినిపించకుండా, రకరకాల వెరైటీలు చేస్తూ, ఆహారం పట్ల వాళ్లకు ఆసక్తి కలిగించాలి. ఇంట్లో చేసిన పదార్థాలే ఆహారంలో భాగం కావాలి. బలవంతంగా అస్సలు తినిపించకూడదు. వేళకు తినే అలవాటు చేయాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు), ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కొవ్వుపదార్థాలు అన్నీ అందేలా సమతులాహారం ఇవ్వాలి. -
మెరుగవుతున్న దాసరి ఆరోగ్యం
పరామర్శించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కోలుకుంటున్నారు. అన్నవాహికకు ఇన్ ఫెక్షన్ సోకడంతో ఆయనను మూడు రోజుల కిందట సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితంతో పోలిస్తే బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, ఊహించిన దానికంటే ఎక్కువగా చికిత్సకు స్పందిస్తున్నట్లు కిమ్స్ ఎండీ, సీఈవో డాక్టర్ భాస్కర్‌రావు ప్రకటించారు. దాసరి త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మూత్ర పిండాల పనితీరు మెరుగుపడటంతో డయాలసిస్ నిలిపివేసినట్లు తెలిపారు. అయితే మరో 24 గంటలపాటు సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ.. క్లిష్టమైన ఆపరేషన్ ను కిమ్స్ వైద్యులు విజయవంతంగా చేశారని, దాసరి పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం షిర్డి వెళ్లి తన గురువు కోసం బాబాకు పూజలు చేసి వస్తానని చెప్పారు. ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా ఆస్పత్రికి వచ్చి దాసరి ఆరోగ్యంపై వాకబు చేశారు. వైఎస్ జగన్ పరామర్శ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దాసరిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లా డి ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులతో దాసరి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆస్పత్రి ఎండీ భాస్కర్‌రావుతో మాట్లాడి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు, ప్రస్తుత పరిస్థితి ఏమి టి, ఎన్ని రోజుల్లో కోలుకుంటారనే విషయా లను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అధికార ప్రతినిధి అరుణ్ కుమార్, నాయకుడు కాసు మహేశ్‌రెడ్డి కూడా ఉన్నారు. దాసరి త్వరగా కోలుకోవాలి: పవన్ దాసరి నారాయణరావును సినీనటుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చి దాసరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాసరి పూర్తిగా కోలుకుంటారనే నమ్మకంతో వైద్యులు ఉన్నారని, గురువారం వెంటిలేటర్ తొలగిస్తామని చెప్పారని తెలిపారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పవన్ తోపాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మత్ శరత్ తదితరులు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కూడా దాసరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. -
చిన్న తప్పులతో పెద్ద తిప్పలు!
ఉమెన్స్ హెల్త్ ‘నొప్పి అనివార్యం. కానీ బాధపడుతూనే ఉండాలా అన్నది మన చేతుల్లో, చేతల్లో ఉంది!’ ఎవరు చెప్పారో తెలియదు కానీ, ఆలోచింపజేసే మాట ఇది. నిజం చెప్పాలంటే, ఇవాళ మన దేశంలో చాలామంది మహిళలం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ, ఇంటి పని, కుటుంబం బాగోగులలో మునిగి తేలుతున్నాం. బాధను అనుభవిస్తూ ఉండిపోతున్నామే తప్ప, దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించడం లేదు. నిజం చెప్పాలంటే, చాలా చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం కూడా మన గృహలక్ష్ముల ఆరోగ్యానికి ఇబ్బందిగా మారుతోంది. తెలిసి తెలిసీ... మనమందరం తరచూ చేసే కొన్ని తప్పల్ని, నివారిస్తే రానున్న 2017 ఆనందంగానే కాదు... ఆరోగ్యంగానూ ఉంటుంది. నివారించాల్సిన ఆ తప్పులు ఏమిటంటే... తగినంత మంచినీళ్ళు తాగకపోవడం! ఏ ఇల్లాలినైనా కదిలించి చూడండి... రోజూ ఏడెనిమిది గ్లాసుల మంచినీళ్ళు తాగాలని తెలుసు. కానీ, చాలామంది మహిళలం ఆ నియమాన్ని పాటించం. చిన్న విషయంలా కనిపించినా, ఇది చాలా పెద్ద తప్పు. మంచి నీళ్ళు తక్కువగా తాగడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గి, బలహీనంగా అనిపిస్తుంది. అదే సమయంలో, దీని వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ. అలాగే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యు.టి.ఐ) రావచ్చు. కాబట్టి, మహిళలందరం రోజు వారీ ఆహారంలో భాగంగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే, వీలైనంత ఎక్కువ మంచినీళ్ళు తాగాలి. భోజనం చేయకపోవడం! పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పనిలో మునిగితేలడంతో గృహిణుల్లో చాలామందిమి సరిగ్గా తిండి తినం. పొద్దున్న తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్‌కి మంగళం పాడేస్తుంటాం. అదేమంటే, కాస్తంత భారీగా మధ్యాహ్నం భోజనం లాగించవచ్చని అనుకుంటాం. కొన్నిసార్లు పనిలో లంచ్ మానేసి, కడుపు నిండా రాత్రి భోజనం చేయచ్చని అనుకుంటూ ఉంటాం. ఇది కూడా కరెక్ట్ కాదు. భోజనం మానేయడం వల్ల బాడీ మెటబాలిజమ్ నెమ్మదిస్తుంది. దాని వల్ల అతిగా తింటాం. ఫలితంగా బరువు పెరుగుతుంది. తద్వారా వచ్చిపడే ఆరోగ్య సమస్యలు సరేసరి. కాబట్టి, ఎంత పనిలో ఉన్నా సరే వేళకు తినడం మానకూడదు. వీలైనంత వరకు పండ్లు, కాయగూరలు, బీన్స్, మొలకెత్తిన విత్తనాలు కూడా తింటూ ఉంటే మెటబాలిజమ్ బాగుంటుంది. తగినంత నిద్ర పోకపోవడం! మన దేశంలోని గృహిణుల్లో చాలామందికి కనీసం సరైన నిద్ర కూడా కరవే! రకరకాల ఇంటి పనులు, బాధ్యతలతో కలత నిద్రతో సరిపుచ్చుకుంటున్నాం. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఫలితంగా, పెద్దగా వయసు లేకుండానే ముసలితనం లక్షణాలు వచ్చేస్తున్నాయి. తొందరగా మీద పడే ఈ వార్ధక్యాన్ని తప్పించుకోవాలంటే, ఆడవాళ్ళమే కాదు... మగవాళ్ళు కూడా రోజూ ఏడు గంటల పాటు సుఖంగా నిద్ర పోవాలి. క్యాల్షియమ్ తీసుకోకపోవడం! మనం రోజూ తినే ఆహారంలో తగినంత క్యాల్షియమ్ ఉండాలి. లేదంటే, చిన్న వయసులోనే ఎముకలు గుల్లబారి, ఆస్టియో పోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంట్లో పిల్లలకు రోజూ పాలు, పండ్లు పెట్టే మహిళలం మనం కూడా తప్పనిసరిగా పాలు తాగాలి. క్యాల్షియమ్ ఉంటుంది కాబట్టి, పాల ఉత్పత్తులు తీసుకోవడం మానేయకూడదు. 35 ఏళ్ళు దాటాయంటే, గృహిణులందరూ క్యాల్షియమ్ తీసుకోవాల్సిందే! మనం చేసే ఈ చిన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకుంటే, మన ఆరోగ్యం బాగుంటుంది. ఇల్లాలి ఆరోగ్యం బాగుంటేనే కదా... కుటుంబ ఆరోగ్యం బాగుండేది! కొత్త ఏడాది 2017 నుంచి అయినా ఇవన్నీ పాటిద్దాం. – ప్రణతి తగినన్ని ప్రొటీన్లు తీసుకోకపోవడం! ఇవాళ చాలా మంది ఉండవలసిన దాని కన్నా ఎక్కువ బరువుండడం చూస్తుంటాం. దీనికి సర్వసాధారణమైన కారణం ఏమిటంటే – తీసుకోవాల్సినంతగా ప్రొటీన్లు తీసుకోకపోవడం! సన్నగా ఉండాలనో, బరువు తగ్గాలనో ఆదుర్దాలో ప్రొటీన్లున్న ఆహారం తీసుకోవడం మానేస్తుంటాం. దీని వల్ల కండరాలు క్షీణించి, మరింత బరువెక్కుతాం. పైగా, ప్రొటీన్లు తినకపోతే, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తినేస్తుంటాం. ఫలితంగా బ్లడ్ షుగర్ ఉన్నట్టుండి పెరుగుతుంది. రోజంతా మరింత ఆకలి వేస్తుంది. కాబట్టి, తినే ఆహారంలో ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్తపడాలి. -
నాలో ఏదో భయం...
సందేహం నాకు పెళ్లై నాలుగేళ్లు అవుతుంది. రెండేళ్ల పాప కూడా ఉంది. ఇటీవల సమస్యగా ఉండి డాక్టర్ దగ్గరకు వెళ్లాను. నాకు హెర్పిస్ సింప్లెక్స్-2 వచ్చిందని డాక్టర్ అన్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నాలో ఏదో తెలియని భయం మొదలైంది. భవిష్యత్‌లో ఇది నా పాపకు కూడా వస్తుందేమోనని కంగారుగా ఉంది. అలా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఓ సోదరి హెర్పిస్ సింప్లెక్స్-2 అనేది హెర్పిస్ అనే వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా కలయిక ద్వారా ఆడవారి నుంచి మగవారికి, మగవారి నుంచి ఆడవారికి సంక్రమిస్తుంది. దీనివల్ల జననేంద్రియాల వద్ద చిన్నచిన్న నీటిపొక్కులు రావటం, నొప్పి, మంట, దురద ఏర్పడతాయి. మీ నుంచి ఇది పాపకు ఏ మాత్రం సంక్రమించడం జరగదు. కాబట్టి మీరు అసలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీరు, మీ వారు ఇద్దరూ కలిసి హెర్పిస్ వైరస్‌కు చికిత్స తీసుకోవడం మంచిది. ఒక్కరే చికిత్స తీసుకున్నా, మళ్లీ కలయిక ద్వారా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. చికిత్స సమయంలో ఇద్దరూ దూరంగా ఉండటం ఎంతో శ్రేయస్కరం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నా, రక్తహీనత ఉన్నా, ఈ ఇన్ఫెక్షన్ మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మా అక్కకు నెల రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పాప పుట్టింది. నార్మల్ డెలివరీ కావాలని మా అమ్మ తనను ఐదో నెల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వాళ్లు నార్మలే అయ్యేలా చూస్తామని చెప్పారు. కానీ ప్రైవేట్ ఆస్పత్రి వాళ్లేమో సిజేరియనే అవుతుందని చెప్పారు. అయితే తొమ్మిదో నెల పడిన రెండు రోజులకే అక్కకు నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప తిరగలేదు, అందుకే సిజేరియన్ అయిందని చెప్పారు డాక్టర్లు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళితే నార్మల్ అయ్యేదా? అసలు పిల్లలు తిరగకపోవడానికి కారణం ఏంటి? తిరగడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తారా? లేదా? - సుష్మ, వరంగల్ కాన్పు నార్మల్‌గా అవుతుందా, ఆపరేషన్ ద్వారా అవుతుందా అని ఐదో నెలలోనే చెప్పడం కష్టం. కాన్పు సమయానికి బిడ్డ పొజిషన్ కరెక్ట్‌గా ఉండాలి. అంటే తల కిందకు దిగడం, బిడ్డ బరువుకు తగ్గట్లు.. బిడ్డ బయటకు వచ్చే దారి సరిపడా ఉండటం, తల్లి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం వంటి అంశాలను బట్టి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పే వారు.. బిడ్డ బయటకు వచ్చే వరకు కచ్చితంగా నూటికి నూరుశాతం నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పలేరు. నొప్పులు తీసే క్రమంలో గుండె కొట్టుకునే తీరులో హెచ్చుతగ్గులు రావటం, బిడ్డ గర్భంలోనే మోషన్ పోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో నార్మల్ డెలివరీ కోసం ఎక్కువగా వేచి చూడటం వల్ల, బిడ్డ పుట్టగానే ఏడవకపోవడం, తర్వాత కాలంలో ఫిట్స్ రావడం, బిడ్డ చనిపోయి పుట్టడం, ఒకవేళ అప్పుడు బాగానే ఉన్నా తర్వాత ఎదుగుదలలో లోపాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. కాన్పు సమయానికినొప్పులు వచ్చినా, బిడ్డ తిరగకపోతే... ప్రభుత్వ హాస్పిటళ్లలో మాత్రం ఏమి చేయగలరు. నా వయసు 26. ఏడాది క్రితం డెలివరీ టైమ్‌లో పాప బయటికి రాగానే చనిపోయింది. దానికి కారణం నాకు డెలివరీ టైమ్‌లో హైబీపీ ఉండటం అన్నారు డాక్టర్లు. తర్వాత రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు నాలుగో నెలలో అబార్షన్ అయింది. మళ్లీ కొన్ని నెలలకు మూడోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు రెండో నెలలో అబార్షన్ అయింది. అప్పటి నుంచి నేను, మావారు బాధపడని రోజు లేదు. దయచేసి మరోసారి అలా జరగకుండా, గర్భం నిలవాలంటే మేమేం చేయాలి? - హేమలత, నల్లగొండ వివిధ కారణాల వల్ల పిల్లలు పుట్టి చనిపోవడం, అబార్షన్ అవ్వడం వంటి వాటిని ఆ్చఛీ ౌఛట్ట్ఛ్టటజీఛి జిజీటౌ్టటడ (ఆైఏ) అంటారు. ఇవి ఒక్కొక్కరిలో వేరువేరు కారణాల వల్ల అవవచ్చు. కాన్పు సమయంలో హైబీపీ వల్ల, నొప్పుల ఒత్తిడి వల్ల బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం, ఊపిరి ఆడకపోవడం వంటి అనేక కారణాల వల్ల పుట్టిన వెంటనే చనిపోయి ఉండవచ్చు. తర్వాత ఒక సంవత్సరం వ్యవధిలోనే రెండుసార్లు అబార్షన్లు అయ్యాయి కాబట్టి సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. అప్పుడు రిపోర్ట్‌లో వచ్చిన కారణాన్ని బట్టి చికిత్స తీసుకొని కొన్ని నెలలు ఆగి, మళ్లీ గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. థైరాయిడ్ సమస్య, తల్లి రక్తంలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవ్వడం వల్ల అబార్షన్లు, బిడ్డకు రక్త సరఫరా లేకపోవడం, రక్తం సరిగా గూడుకట్టే గుణం లేకపోవడం, యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ (అ్క), షుగర్ వ్యాధి, పిండంలో జన్యుపరమైన సమస్యలు వంటి అనేక రకాల సమస్యల వల్ల పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. థైరాయిడ్ సమస్య ఉంటే థైరాయిడ్ మాత్రలు వాడటం, హార్మోన్ల సమస్యకు హార్మోన్ల ట్యాబ్లెట్స్ వాడటం, అ్క ఉంటే ఉఛిౌటఞజీటజీ, ఏ్ఛఞ్చటజీ వంటి వాటితో చికిత్స తీసుకుంటూ పండంటి బిడ్డని కనవచ్చు. కాబట్టి మీరు అధైర్య పడకుండా డాక్టర్‌ను సంప్రదించి ముందు నుంచే రోజుకొకటి చొప్పున ఫోలిక్ యాసిడ్ మాత్ర వేసుకోవడం మంచిది. అలాగే మనసును బాధగా కాకుండా ఆహ్లాదంగా ఉంచుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
నోరు తెరవనివ్వవు!
మౌత్ అల్సర్లు వారం రోజుల్లో మూడుకేజీల బరువు తగ్గిపోయింది సునీత.బరువు తగ్గాలని ఎక్సర్సైజ్ చేశావా? డైటింగ్ చేశావా?ఆసక్తిగా అడిగింది స్నేహితురాలు.అవేవీ కాదని తల అడ్డంగా ఊపింది సునీత.‘అయినా నేను ఓవర్‌వెయిట్ ఉంటేగా తగ్గాలనుకోవడానికి. వారం రోజులుగా నీరసంతో ఒళ్లు సోలిపోతోంది. నోట్లో ముద్ద పెట్టుకున్న మింగుడు పడడం లేదు’ అన్నది సునీత నిస్సహాయంగా. అదేమైనా వ్యాధి లక్షణమేమో... ఓ సారి డాక్టర్ని కలవకపోయావా... అందామె కాస్త భయంగా.నిజానికి సునీతకు పెద్ద వ్యాధి ఏదీ లేదు. చిన్నపాటి మౌత్ అల్సర్. నోటి పుండు చిన్నదే కానీ నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. అల్సర్ కడుపులో వస్తే తిన్న తర్వాత బాధ పెడుతుంది, నోట్లో వస్తే తిననివ్వకుండా బాధిస్తుంది. మౌత్ అల్సర్ అపాయకరం కాదు. కానీ అది పెట్టే బాధ మాత్రం ఐదారు రోగాలపెట్టు. సరిగా తినకపోవడంతో పోషకాహార లోపం, రక్తహీనత వంటి అనుబంధ సమస్యలకు కారణమవుతుంటుంది. నోటి పూతగా మొదలై, పొక్కులు పెద్దవై పుండ్లుగా మారే క్రమంలో అవి పెట్టే బాధను వర్ణించలేం. మౌనంగా భరించక తప్పని పరిస్థితిని కల్పిస్తాయి. సాధారణంగా మౌత్ అల్సర్లు బికాంప్లెక్స్ లోపం వల్లనే వస్తుంటాయి. అయితే అన్ని సందర్భాలలోనూ మౌత్ అల్సర్‌ని చిన్న సమస్యగా కొట్టి పారేయలేం. దేహంలో చోటు చేసుకునే అనేక మార్పులు ఇందుకు కారణాలవుతుంటాయి. అల్సర్లు ఎన్ని రకాలు! ఎందుకు వస్తాయి? బ్యాక్టీరియల్ జింజివోస్టోమాటైటిస్... ఇది నోటిలోపల, చిగుళ్లకు వచ్చే సమస్య. దీని వల్ల నోటిలోపల వాపు, పుండ్లు వస్తాయి.హెర్పిస్ సింప్లెక్స్ వైరల్ ఇన్ఫెక్షన్... ఇది వైరల్ ఇన్ఫెక్షన్, నోటిలోపల, పెదవుల దగ్గర నీటి పొక్కులు వస్తాయి. ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఆర్ షార్ప్ టీత్... కొందరిలో దంతాలు వంకరగానూ, పదునుగానూ ఉంటాయి. అవి నోటి లోపల గుచ్చుకోవడం వల్ల చర్మకణాలు రప్చర్ అయి గాట్లు లేదా పుండ్లు వస్తాయి. ల్యూకోప్లాకియా... పొగాకు వాడకం వల్ల... ఓరల్ క్యాన్సర్... ఇది నోటి క్యాన్సర్ఓరల్ లెకైన్ ప్లానస్... ఇది చర్మ వ్యాధి. కొంద రిలో నోటి లోపల చర్మానికి కూడా సోకుతుంది. ఓరల్ థ్రష్... క్యాండిడా బ్యాక్టీరియా ఎక్కువ కావడంతో నోటి పూత వస్తుంది. అలాగే నోటి మూలల పగుళ్లు, చర్మం తెల్లగా అవుతుంటుంది.లైఫ్స్టయిల్తో... నైకోరాండిల్ వంటి మందుల వాడకం వల్ల, క్యాన్సర్ వ్యాధికి వాడే మందులు వల్ల నోటిలో చర్మం ఎర్రబారుతుంటుంది. అలాగే టూత్ పేస్టు, మౌత్ వాష్‌లలో ఉండే రసాయనాలు కలిగించే ఇరిటేషన్ నోటి లోపల చర్మం మీద అల్సర్‌గా బయటపడుతుంది. చిన్న-పెద్ద పేగులకు సంబంధించిన క్రోన్స్ డిసీజ్, ఆహారంలో లభించే గ్లూటెన్, అమైనో యాసిడ్స్ అలర్జీ కారణంగా వచ్చే సీలియాక్ డిసీజ్, ఆర్థరైటిస్, జన్యుపరమైన లోపాలు, కంటి అల్సర్ ఉన్నప్పుడు నోటి అల్సర్ వస్తుంటుంది. వీటితోపాటు పోషకాహారలోపం, రక్తహీనత కారణంగా నోటిపూత వస్తుంటుంది. ఇతర వ్యాధులేవీ లేని చాలామందిలో కనిపించే నోటి సమస్యలు పోషకాహార లోపంతో వచ్చేవే అయి ఉంటాయి. నోటి శుభ్రత పాటించని వారిలోనూ అల్సర్లు వస్తుంటాయి. చాలా కొద్ది సందర్భాలలో జన్యులోపాలు కూడా కారణమవుతుంటాయి. చికిత్స... మొదటగా అల్సర్ కారణంగా వచ్చిన నొప్పిని తగ్గిస్తారు. శరీరానికి అవసరమైన పోషకాహారం, ద్రవాలను ఇస్తారు. అల్సర్‌కు చికిత్స కంటే కారణాన్ని గుర్తించడమే కీలకం. దంతాలు గుచ్చుకోవడం ద్వారా వచ్చిన అల్సర్‌కు డెంటిస్ట్ చేత పంటిని సరి చేయించుకోవడమే అసలైన చికిత్స.నోటి అల్సర్ వచ్చినప్పుడు సాత్వికాహారం తీసుకోవాలి. వేడి పదార్థాలు, మసాలా వంటకాలు, కాఫీ వంటివి తీసుకుంటే నొప్పి తీవ్రమవుతుంది. రసాయనాల కారణంగా అల్సర్ వచ్చినట్లు సందేహం కలిగితే వెంటనే వాటి వాడకాన్ని మానేస్తే సమస్య దానంతట అదే తగ్గిపోతుంది.నోటి శుభ్రత పాటించడం వల్ల అల్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అల్సర్ ఏర్పడిన తర్వాత కూడా శుభ్రత పాటిస్తే తీవ్రత తగ్గుతుంది.యాంటీ హిస్టమైన్, అనీస్తటిక్, యాంటాసిడ్, కార్టికో స్టెరాయిడ్స్ వంటి పూత మందులను అల్సర్ మీద రాయడం, పుక్కిలించడం వల్ల ఫలితం ఉంటుంది. కొన్నింటికి యాంటీబయాటిక్స్‌తోపాటు ఓరల్ స్టెరాయిడ్స్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే రిలీఫ్ ఉంటుంది. పైన చెప్పిన విధంగా తాత్కాలికమైన చికిత్స విధానాలతో అప్పటికి తగ్గి మళ్లీ వస్తుంటే పూర్తిస్థాయిలో టెస్టులు చేసి చికిత్స చేయాలి. సాధారణంగా నోటిలో వచ్చే అల్సర్లలో చాలా అరుదుగా మాత్రమే క్యాన్సర్ అల్సర్లను గమనిస్తుంటాం. వాటికి పూర్తి చికిత్స తప్పనిసరి. పోషకాహారలోపం కారణంగా వచ్చిన నోటిపూత, అల్సర్ తగ్గడానికి ‘బి’ కాంప్లెక్స్ విటమిన్ మాత్రలు, ఇతర సప్లిమెంట్లను సూచిస్తారు. నివారణ... ఇలా! నోటిలో వచ్చే అల్సర్లలో చాలా రకాలు అపరిశుభ్రత కారణంగా వచ్చేవే ఉంటాయి. శుభ్రత పాటించని వాళ్లలో అల్సర్లు రావడంతోపాటు అల్సర్ కారణంగా వచ్చే సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి. శుభ్రతతో సంబంధం లేకుండా ఇతర కారణాలతో మౌత్ అల్సర్ వచ్చినప్పటికీ సరైన నోటి శుభ్రత పాటించడం వల్ల అల్సర్‌తో ఎదురయ్యే ఇతర సమస్యల తీవ్రత తగ్గుతుంది. దంతాలను డెంటిస్టులు సూచించే విధంగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుంటూ పొగాకు వాడకాన్ని మానేయాలి. కాఫీ, పుల్లటి పదార్థాల వాడకాన్ని పరిమితం చేయాలి. పంటి వంకర, లేదా మొనదేలి వాడిగా ఉండడం వంటి వాటిని గుర్తించినప్పుడు అవి అల్సర్‌కు దారి తీసే దాకా వేచి చూడకుండా డెంటిస్టును సంప్రదించి సరి చేయించుకోవాలి.హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కారణంగా ఏర్పడిన అల్సర్‌కు యాంటీవైరల్ ట్రీట్మెంట్ బాగా పని చేస్తుంది. సీలియాక్ డిసీజ్ కారణంగా ఏర్పడిన అల్సర్‌కు డైటీషియన్ సలహా మేరకు ఆహారంలో మార్పులు చేయడం ద్వారా పరిస్థితి అదుపులోకి వస్తుంది. తరచుగా నొప్పితో కూడిన అల్సర్ వస్తున్న సందర్భాలలో దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడకం, ఇమ్యునో సప్రెసెంట్స్ వాడకం ఉపయుక్తంగా ఉంటుంది. అల్సర్‌ని నిర్లక్ష్యం చేస్తే... అల్సర్‌కు కారణమైన ఇన్ఫెక్షన్ నోరంతా వ్యాపించి కొన్ని సందర్భాల్లో గొంతు వరకు కూడా వ్యాపించవచ్చు. అలాగే కొన్నిసార్లు అంటువ్యాధిలాగా ముద్దు పెట్టుకోవడం ద్వారా వ్యాపిస్తుంది. -
ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్!
నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికత్స ఉందా? - దామోదర్‌రావు, నల్లగొండ మీరు చెబుతున్న లక్షణాలతో మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు చాలావరకు అంతరాయం కలిగిస్తుంది. కారణాలు: మానసిక ఒత్తిడి, ఆందోళన సరైన సమయంలో భోజనం చేయకపోవడం మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం చికాకు, కోపం. లక్షణాలు: మలబద్దకం / విరేచనాలు తరచూ కడుపునొప్పి రావడం కడుపు ఉబ్బరం విరేచనంలో జిగురు పడటం భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం. హోమియో చికిత్స: మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ నడవడం కష్టమౌతోంది... ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. నాకు కుడిపైపు తుంటి భాగంలో నొప్పి వస్తోంది. గత ఆర్నెల్లుగా ఈ నొప్పి ఉంటోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. మా దగ్గర ఎముకల నిపుణుడిని సంప్రదిస్తే ఇది తుంటి ఎముక చివరలో ఉండే బంతి లాంటి భాగం దెబ్బతిన్నదనీ, అది ఒక రకం ఆర్థరైటిస్ అనీ చెప్పారు. నాకు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరమని అన్నారు. అయితే నా మిత్రులు మాత్రం దానికి సర్జరీ అవసరం లేదనీ అంటున్నారు. కానీ నేను చాలా మెల్లిగా మాత్రమే నడవగలుగుతున్నాను. వేగంగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఇది నన్ను చాలా ఆందోళన పరుస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - కృష్ణమూర్తి, చీరాల మీ ఫ్రెండ్స్ చెప్పినట్లే చాలామందిలో తుంటి ఎముక మార్పిడి (టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ) అనే శస్త్రచికిత్స మీద చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. ఒకవేళ మీ ఆర్థోపెడిక్ సర్జన్ అదే సమస్య అని నిర్ధారణగా చెబితే, మరో నిపుణుడి నుంచి రెండో అభిప్రాయం (సెకండ్ ఒపీనియన్) తీసుకోవడంలో తప్పులేదు. అయితే తుంటి ఎముక మార్పిడి మీద ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలు సరికాదు. అది గత 30 ఏళ్లుగా సురక్షితంగా చేస్తున్న ప్రక్రియ. నిపుణులైన డాక్టర్లు దాన్ని చేయడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ రావు. పైగా అది చేశాక ఆటలాడవద్దు అని ముందుజాగ్రత్తగా డాక్టర్లు చెప్పినా, పాశ్చాత్య దేశాల్లో చాలామంది సోర్ట్స్ వంటివి ఆడుతూనే ఉంటారు. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీతో దుష్ర్పభావాలు (కాంప్లికేషన్లు) కనిపించే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే. కాబట్టి మీరు సర్జరీ గురించి అపోహలు పెట్టుకోవద్దు. కాకపోతే నిపుణులను సంప్రదించి, రెండో అభిప్రాయం మాత్రం తీసుకోండి. నా వయసు 27 ఏళ్లు. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ను. చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండువారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. డాక్టర్గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? సలహా ఇవ్వండి. - చిన్నా, విజయవాడ మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొనిపనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ మీటింగ్స్‌లో కూడా నిద్రపోతున్నాను..! స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడు సైతం నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - వినయకుమార్, విశాఖపట్నం మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీడిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. -
చప్పదనమే చక్కదనం!
సన్నీ లియోన్ జీవితం చాలా చప్పగా సాగుతోందట. డాక్టర్ సలహా మేరకు తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను దూరం పెట్టాల్సి వస్తోందంటున్నారీ బ్యూటీ. విషయం ఏంటంటే... సన్నీకి ఏదో ‘ఇన్ఫెక్షన్’ సోకిందట. డాక్టర్ దగ్గరికెళితే.. ఆయన పచ్చి శాకాహార నియమాలను విధించి, మాంసాహారాన్ని కొన్నాళ్లపాటైనా మరిపోవాలని చెప్పారట. ఆ విషయం గురించి సన్నీ లియోన్ మాట్లాడుతూ - ‘‘మంచి కాఫీతో నా డే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి బదులు రుచి లేని ఓ టీని బలవంతంగా తాగాల్సి వస్తోంది. నా చైనీస్ డాక్టర్ ‘ఆల్కహాల్.. కెఫీన్... మీట్.. స్పైసీ ఫుడ్’ తీసుకోకూడదని చెప్పేశారు. పాల ఉత్పత్తులేవీ తీసుకోకూడదన్నారు. సో.. నేను ‘వేగన్’ (మూగజీవాల నుంచి వచ్చే దేన్నీ ఆహారంగా తీసుకోకపోవడం) గా మారిపోయా. సంప్రదాయబద్ధంగా తయారు చేసే చైనీస్ మందుల మీద నాకు నమ్మకం ఎక్కువ. ఒకవేళ నేను వేగన్‌గా మారిపోవాలన్నది ఆ దైవనిర్ణయం అయ్యుండొచ్చు. అందుకే నా డాక్టర్ ద్వారా చెప్పించి ఉంటాడు. కాఫీ తాగడం లేదనే కొరత తప్ప మిగతాదంతా బాగానే ఉంది’’ అని వివరించారు. అన్నట్లు... జీవితం చప్పగా ఉన్నా, చక్కగా ఆరోగ్యంగా ఉందని లియోన్ నవ్వుతూ అంటున్నారు. -
మీకు ఒకసారి చికెన్‌గున్యా సోకిందా.. అయితే..
న్యూఢిల్లీ: మీకు ఒకసారి చికెన్‌గున్యా సోకి తగ్గిందా. మీ సమాధానం అవును అయితే ఇక మీరు చికెన్‌గున్యా విషయంలో బేఫికర్ అంటున్నారు శాస్త్రవేత్తలు. చికెన్‌గున్యా ఒకసారి సోకినవారిలో మళ్లీ అంతగా ప్రభావం చూపదని ఢిల్లీ ఎయిమ్స్ వైరాలజిస్టులు స్పష్టం చేశారు. శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించిన వారి విషయంలో మాత్రమే చికెన్‌గున్యా రెండోసారి ప్రభావం చూపే అవకాశం ఉందని మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లలిత్ దర్ వెల్లడించారు. ఢిల్లీలో 2006లో చికెన్‌గున్యా తీవ్రంగా ప్రబలిన అనంతరం అక్కడ ఈ వ్యాధి అంతగా వ్యాపించలేదని.. అయితే ఆ తరువాతి కాలంలో అక్కడ జన్మించిన, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో ఈ వ్యాధి ప్రబలుతోందని ప్రస్తుత వ్యాధి తీవ్రతను ఆయన విశ్లేషించారు. ఢిల్లీలో చికెన్‌గున్యా మూలంగా ప్రజలు చనిపోతున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో కేవలం చికెన్‌గున్యా మూలంగానే మరణాలు సంభవిస్తున్నాయనడం సబబు కాదని.. ఇతర కారణాలతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై మాత్రమే చికెన్ గున్యా ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం ఇటీవల జ్వరంతో మృతి చెందిన 13 కేసులను పరిశీలించిన అనంతరం.. ఆ మరణాలకు కేవలం చికెన్‌గున్యా కారణం కాదని.. నిమోనియా, సెప్సిస్, కిడ్నీ సంబంధ వ్యాదులతో వారు మృతి చెందారని వెల్లడించింది. -
నడుము నొప్పికి ఆపరేషన్ ఒక్కటే మార్గమా?
స్పైన్ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నేను గత కొంతకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నాను. సాధారణ నొప్పే కదా అని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకూ ఇది క్రమంగా పెరుగుతూ పోతోంది. కాళ్లలోకి పాకుతూ తిమ్మిర్లు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు వెన్నెముక ఆపరేషన్ చేస్తారని మా బంధువులు కొందరు అంటున్నారు. వెన్నెముకకు ఆపరేషన్ చేస్తే కాళ్లుచేతులు పడిపోతాయని కూడా వారు భయపెడుతున్నారు. నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - మాధురి, హైదరాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు వెన్ను సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బరువు ఎక్కువగా ఎత్తడం, ఒకే భంగిమలో గంటలతరబడి కూర్చొని పనిచేయడం, అలవాటు లేని పనిచేయడం లాంటి అనేక కారణాల వల్ల లిగమెంట్లు తెగిపోవడం లేదా కండరాలు టేర్ కావడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే వయసుతో పాటు ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముక సాంద్రత తగ్గి, బలహీనపడి ఫ్రాక్చర్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతేకాకుండా వెన్నెముకకు ఇన్ఫెక్షన్ సోకినా కూడా అది నొప్పికి కారణమవుతుంది. అయితే వెన్నెముక గాయపడితే తప్ప సాధారణ నడుము నొప్పికి ఎప్పుడు కూడా పూర్త్తిస్థాయి బెడ్రెస్ట్గానీ సర్జరీ గానీ అవసరం ఉండవు. మూడువారాల మందులతో పాటు ఫిజియోథెరపీ చేయించుకుంటే సాధారణ స్థితికి రావచ్చు. అంతేగానీ ఆపరేషన్ చేస్తారనే భయంతో మీరు వైద్యులను సంప్రదించకుండా వాయిదా వేస్తూపోతుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. దాంతో సమస్య తీవ్రతరం కాకుండా నివారించగలుగుతారు. మీరు వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీకు ఆపరేషన్ అవసరమైనా అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపరేషన్ చేసే విధానాల్లో అత్యాధునికమైన మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ వంటి వైద్య ప్రక్రియలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియలతో సురక్షితంగా, సమర్థంగా, ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా వెన్నెముకకు ఆపరేషన్ చేయవచ్చు. ఈ విధానంలో చిన్న గాటుతోనే శస్త్రచికిత్స సాధ్యమవుతుంది. ఇది కేవలం ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనిద్వారా సురక్షితంగా ఆపరేషన్ నిర్వహిస్తారు. మినిమల్లీ ఇన్వేసిస్ స్పైన్ సర్జరీలో రోగి త్వరగా కోలుకుంటారు. శస్త్రచికిత్స జరిగిన రోజునే రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. కాబట్టి మీరు ఇక ఏమాత్రం ఆందోళనపడకుండా మంచి నిపుణులైన స్పైన్ సర్జన్‌ను కలవండి. డాక్టర్ కిరణ్ కుమార్ లింగుట్ల సీనియర్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ మింగుతుంటే గొంతునొప్పి.. ఎందుకిలా..? హోమియో కౌన్సెలింగ్ మా పాప వయసు 12 ఏళ్లు. చల్లని వాతావరణం ఏర్పడితే తరచూ జలుబు చేస్తోంది. గొంతులో పుండులా ఏర్పడి, తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతోంది. మింగేప్పుడు ఇబ్బందిగా ఉంటోందని చెబుతోంది. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినా, చల్లటి వాతావరణం ఏర్పడితే మళ్లీ సమస్య మామూలే. దీనివల్ల స్కూలుకు వెళ్లలేకపోతోంది. అసలు ఈ సమస్య ఎందుకు ఏర్పడుతోంది. హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందా? - ప్రవీణ, భద్రాచలం మీరు తెలిపిన వివరాలను బట్టి మీ పాప ఫ్యారింజైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గొంతు వెనక భాగాన్ని ఫ్యారింగ్స్ అంటారు. ఈ భాగానికి ఇన్ఫెక్షన్ రావడాన్ని ఫ్యారింజైటిస్ లేదా సోర్ థ్రోట్ అంటారు. చల్లటి వాతావరణంలో ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలలో ఫ్యారింజైటిస్ కూడా ఒకటి. సాధారణంగా ఈ వ్యాధి ఒక వారం రోజలలో తగిపోతుంది. కానీ సరైన చికిత్స అందించకుండా తరచూ ఈ వ్యాధికి గురవుతున్నట్లయితే చెవి ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, కిడ్నీ సంబంధింత వ్యాధులు (గ్లోమరులోనెఫ్రైటిస్), రుమాటిక్ ఫీవర్ వంటి వాటికి దారితీయవచ్చు ఒక్కోసారి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం కూడా ఉంది. కారణాలు : ఈ వ్యాధి 90 శాతం కేసుల్లో వైరస్ వల్ల కలుగుతుంది. జలుబు, ఫ్లూ, మీజిల్స్, మోనోనూక్లియోసిస్, చికన్పాక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమస్యకు కారణం కావచ్చు. మరికొంత మందిలో ఇది బ్యాక్టీరియా వల్ల కూడా కావచ్చు. కోరింతదగ్గు, కొన్ని స్టెఫలోకోకస్ సూక్ష్మజీవులు, డిఫ్తీరియా వంటి బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తి దగ్గడం లేదా తుమ్ముడం చేసినప్పుడు ఆ తుంపిర్ల ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియా గాల్లోకి చేరి, తద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపించే అవకాశం ఉంది. పొగతాగడం, పరిశుభ్రత పాటించకపోవడం, వ్యాధికి గురైన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వంటి అంశాల వల్ల ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని అలర్జీలు, గొంతుకండరాలు ఒత్తిడికి గురికావడం, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు, గొంతు, నాలుక లేదా లారింగ్స్లో కణుతులు ఏర్పడటం వల్ల కూడా గొంతు నొప్పి కలుగుతుంది. లక్షణాలు : ఫ్యారింజైటిస్ ముఖ్యలక్షణాల్లో గొంతునొప్పి, మింగేటప్పుడు నొప్పిగా ఉండటం చాలా ముఖ్యమైనవి. మిగతా లక్షణాలు ఇన్ఫెక్షన్కు కారణమైన బ్యాక్టీరియా లేదా వైరస్ మీద ఆధారపడి ఉంటాయి. వైరల్ ఫ్యారంజైటిస్ : గొంతునొప్పితో పాటు గొంతులోపలి భాగం ఎర్రగా మారడం, ముక్కు కారణం లేదా ముక్కుదిబ్బడ, పొడిదగ్గు, గొంతు బొంగురుపోవడం, కళ్లు ఎర్రబారడం, చిన్న పిల్లల్లో విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లలో నోటిలో, పెదవులపై పుండ్లలా ఏర్పడటం కూడా సంభవిస్తుంది. బ్యాక్టీరియల్ ఫ్యారంజైటిస్ : దీనిలో కూడా గొంతు పచ్చిగా ఉండటం, మింగే సమయంలో నొప్పి కలగడం, గొంతు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో లక్షణాల తీవ్రత ఎక్కువ. పైన పేర్కొన్న లక్షణాలతో పాటు జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, టాన్సిల్స్ వాపు, వాటి చుట్టూ తెల్లటి పొర ఏర్పడటం, గొంతుకు ముందుభాగంలోని లింఫ్‌గ్రంథుల వాపు వంటి లక్షణాలు గమనించవచ్చు. కొంతమంది చిన్నపిల్లల్లో వికారం, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలూ కనిపించవచ్చు. చికిత్స : ఒంట్లోని రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు సూక్ష్మజీవుల వల్ల ఫ్యారింజైటిస్ వస్తుంది. జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో రోగి శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి లక్షణాలు, కారణాలు, వాతావరణంలోని మార్పుల ఆధారంగా చికిత్స చేయవచ్చు. హోమియో విధానంలో చికిత్సతో ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్స్ వాడితే కొన్ని దుష్ర్పభావాలు ఉండవచ్చు. కానీ హోమియో విధానంలో అవేవీ లేకుండా, సమస్య మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఈ సిగరెట్ సురక్షితమేమీ కాదు!
పల్మునాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. ఎంత ప్రయత్నించినా చైన్స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. స్నేహితులు ఈ-సిగరెట్‌ను ప్రయత్నించమని చెబుతున్నారు. ఈ-సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) ఉపయోగించడం ద్వారా సిగరెట్ మానేయవచ్చా? ఇది మంచిదేనా? - నవీన్‌కుమార్, మహబూబ్‌నగర్ ఈ-సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలే ఉంటాయి. మామూలు సిగరెట్లు, ఈ-సిగరెట్లు... ఈ రెండింటిలోనూ నికోటిన్ కామన్‌గానే ఉంటుంది. ఇది తనకు బానిస అయ్యేలా చేసుకుంటుంది. మందుల సేఫ్టీ విషయంలో ప్రామాణికమైన అమెరికా అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ-సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ-సిగరెట్లో కాటరిడ్జ్లో డీ-ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు ఈ-సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. దీని పొగను కూడా మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ-సిగరెట్ పొగ అయినా సరే... కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ-సిగరెట్ మామూలు సిగరెట్ కంటే చాలా సురక్షితమేమీ కాదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ-సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ-సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ-సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడం మేలు. సిగరెట్ మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. డా॥రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ గుండెదడ తగ్గాలంటే..? నా వయసు 40 ఏళ్లు. ఈమధ్య నాకు గుండె దడగా ఉంటోంది. అడపాదడపా ఈ గుండెదడ వస్తోంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందా? వాటి సాధారణ కారణాలు తెలపండి. సలహాలు ఇవ్వండి. - సుబ్రహ్మణ్యం, బోధన్ సాధారణ పరిస్థితుల్లో అయితే గుండె తాలూకు స్పందనలను మనం గ్రహించలేము. ఒకవేళ అలా గ్రహించే స్థితి ఏర్పడితే దాన్ని గుండె దడ అంటారు. గుండె దడ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లక్షణం. గుండెదడ తాత్కాలికంగా కనిపించినా, దానంతట అదే సద్దుమణుగుతుంది. అయితే ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే చాలా మందిలో గుండెకు సంబంధించిన ప్రతి అంశం ఆందోళన పుట్టిస్తుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, టీ, కాఫీ, మద్యం తాగడం వంటి అంశాలు కూడా గుండెదడను కలిగించగలవనే విషయం తెలిక చాలామంది విపరీతమైన ఆందోళనకు, అలజడికి గురవుతారు. సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది లేదా గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కనిపిస్తుంది. గుండెదడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటప్పుడు సాధారణ రక్తపరీక్ష మొదలు ఈసీజీ వరకు కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. సూచనలు : గుండెదడగా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. ఎక్కువగా తినడం, తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు. మలమూత్ర విసర్జనలను ఆపుకోకూడదు. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరక పదార్థాలు వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీ మరింత ప్రమాదకరం. పొగతాగే అలవాటు మానేయండి. పక్కనుండే స్నేహితులు పొగతాగుతున్నా వారించండి. మానసికంగా నిలకడగా, నిశ్చింతగా ఉండాలి. బిగ్గరగా మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది. మృదుభాషణ సర్వదా హితకరం. నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకాన్ని తగ్గించాలి. మరీ దడ ఎక్కువగా ఉన్నపుపడు ఐస్‌ను నల్లగ్గొట్టి ఒక బ్యాగ్‌లో వేసి, ఛాతీపై పెట్టుకుంటే గుండెదడ సద్దుమణుగుతుంది. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. కాలు నేలకు ఆనడం లేదు... మడమనొప్పి తగ్గేదెలా? ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. గత నాలుగు నెలల నుంచి మడమనొప్పితో బాధపడుతున్నాను. బీపీ, షుగరు లేవు. డాక్టరుగారి సూచన మేరకు నరాల శక్తి కోసం మందులు వాడుతున్నాను. పెద్దగా ఫలితం కనబడలేదు. ఆయుర్వేదంలో పరిష్కారం ఉంటే తెలియజేయండి. - జి. కామేశ్వరి, విజయనగరం మీ సమస్యను ఆయుర్వేద పరిభాషలో ‘పార్షి శూల’ అంటారు. ఇది వాత ప్రధానమైన వ్యాధి. శరీరంలోని ‘కొసనరాలు’ (పెద్ద నరాల చివరి శాఖలు) బలహీనమై వాపునకు గురవుతాయి. అందువల్ల మీరు మడమను అదిమిపెట్టి నడవలేరు. రాత్రి పడుకొని ఉదయం లేచేటప్పుడు పాదాన్ని నేలపై మోపాలంటే భరించలేనంత నొప్పిగా ఉంటుంది. దీనికి ప్రధానంగా విటమిన్-బి కాంప్లెక్సు తగినంత తీసుకోవడం అవసరం. ముడిబియ్యంతో వండిన అన్నం తినండి. గంజిని వార్చి పారేయవద్దు. తాజాఫలాలు, డ్రైఫ్రూట్స్ ప్రతిరోజూ తినండి. పప్పులు, మొలకలు, మాంస రసం (మటన్‌సూప్) కూడా తినవచ్చు. మీ వయసు రీత్యా మీకు తగినంత కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషక విలువలున్న ఖనిజలవణాలు లభించాలంటే పైన చెప్పిన ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటూ మూడు నెలలు తినండి. బయటి తినుబండారాలు, మరిగించిన నూనెతో చేసిన ఆహారపదార్థాలు తినవద్దు. చికిత్స : 1. క్షీరబల క్యాప్సూల్స్ : ఉదయం 1, రాత్రి - 1 (ఆహారానికి ముందు) 2. మహాయోగరాజ గుగ్గులు (మాత్రలు) : ఉదయం 1, రాత్రి- 1 (తిన్న తర్వాత) 3. శిలాజిత్ ( స్వర్ణయుక్త) : రోజూ ఒకటి 4. మహారస్నాదికాఢ (కషాయం) : నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి రోజూ మూడు పూటలా తాగాలి. 5. పిండతైల : దీనిని మడమపై మృదువుగా మర్దన (మసాజ్) చేసి వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. (ఉదయం, సాయంత్రం) గృహవైద్యం : ఉమ్మెత్త ఆకుని శుభ్రంగా కడిగి, లోపలివైపు ఆముదంగానీ నువ్వుల నూనెగానీ పూసి, కొంచెం వేడి చేసి, దాన్ని మడమవై పెట్టి కట్టుకట్టుకోండి. ఈ విధంగా ఏడురాత్రులు చెయ్యండి. నొప్పి తగ్గిపోతుంది. మా బాబు వయసు ఐదు నెలలు. మల మార్గం దగ్గరున్న చర్మం ఒరుసుకుపోయింది. తాకితే ఏడుస్తున్నాడు మంచి ఆయుర్వేద ఔషధం చెప్పగలరు. - సుజాత, ఖమ్మం సాధారణంగా శిశువులు మలవిసర్జన చేసిన తర్వాత, తల్లులు శుభ్రం చేస్తుంటారు కదా. ఎక్కువగా ఒత్తడం, ఎక్కువ సార్లు కడగడం వల్ల, చేతి ఒత్తిడి వల్ల... అక్కడ ఒరుసుకుపోయి, ఎర్రగా అవుతుంది. దీనికి గుదంకుట్ట అని ఆయుర్వేదం వర్ణించింది. దీన్ని ఇంగ్లిష్‌లో న్యాప్కిన్ డర్మటైటిస్ అంటారు. చికిత్స : పరిశుభ్రం చేసినప్పుడల్లా మృదువుగా చేయాలి. మహామరిచాది తైలాన్ని శుభ్రమైన దూదితో మెల్లగా ఆ ప్రాంతంపై పూయాలి (రోజూ రెండు మూడు సార్లు పూయవచ్చు). వారం రోజులలో తగ్గిపోతుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
తరచూ రక్తస్రావం..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాను. నిద్ర కూడా తక్కువగా ఉంటుంది. మలద్వారం దగ్గర ఒక్కోసారి చీము రక్తం కనిపిస్తోంది. దీనికి పరిష్కారం చెప్పండి. - సురేశ్ కుమార్, జగ్గయ్యపేట మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మలబద్దకం సమస్యలకు ముఖ్యకారణం పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనవచ్చు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఇటీవల ప్రతి ఐదుగురిలో ఒకరికి మలద్వార సమస్యలు వస్తున్నాయి. ఫిస్టులా అంటే రెండు వైపులా రంధ్రం ఉన్న నాళం వంటిది అని అర్థం. ఇందులో ఫిస్టులా కూడా ఒకటి. మలవిసర్జన మార్గంలో ఏర్పడే ఫిస్టులాలు బయటి వైపునకు ఒక చిన్న కురుపులా కనిపిస్తుంటాయి. కానీ లోపలి నుంచి ఒక నాళం పెరుగుతూపోయి లోపలి పేగుకు ఒక రంధ్రం ఏర్పడుతుంది. దీన్ని ఫిస్టులా అంటారు. ఇది ఎక్కువగా ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. పిరుదల మధ్య మలద్వారానికి పక్కగా ఏర్పడుతుంది. ఫిస్టులా అనేది మానవ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ సాధారణంగా ఏర్పడే ఫిస్టులాలలో ‘యానల్ ఫిస్టులా’ ఒకటి. ఇది మలద్వారంలోకి తెరచుకోవడం వల్ల అందులో నుంచి మలం రావడాన్ని ‘ఫిస్టులా ఇన్ యానో’ అంటారు. ఫిస్టులా సంవత్సరాలకొద్దీ నొప్పితో బాధిస్తుంది. వారి బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకున్నా మరల తిరగబెట్టడం వాళ్లకు ఆందోళన కలిగిస్తుంది. వారికి హోమియో వైద్యం ఒక వరం లాంటిది. కారణాలు : ఇన్ఫెక్షన్ వల్ల మలద్వారం వద్ద ఉన్న యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ కావడం, మలద్వారం వద్ద సరైన శుభ్రత పాటించకపోవడం. ఊబకాయం, గంటల తరబడి కదలిక లేకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో కనిపిస్తుంది. దురద, మంట, నొప్పి ఉండటం దుర్వాసన కలగడం మలవిసర్జన మార్గం నుంచి చీము, రక్తస్రావం కావడం. వ్యాధి నిర్ధారణ : సిబీపీ, ఈఎస్ఆర్, ఫిస్టులోగ్రామ్ చికిత్స : ఫిస్టులాకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. దీనికి హోమియోపతి వైద్యం వరం లాంటిది. ఇది పూర్తిగా మూలానికి చికిత్స చేస్తూ, ఆపరేషన్ అవసరం లేకుండా చాలావరకు నయం చేస్తుంది. దీనికి కాస్టికమ్, నైట్రిక్ యాసిడ్, కాంథరిస్ వంటి మందులు ఉపయోగించవచ్చు. అయితే రోగి లక్షణాల ఆధారంగా అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వీటిని వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ చీదినప్పుడల్లా సమస్య..! పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఎనిమిదేళ్లు. టూ వీలర్ మీద వెళ్లే సమయంలో వర్షంలో తడిసింది. అప్పుడు జలుబు చేసింది. ముక్కు చీదినప్పుడు రక్తం బయటకు వచ్చింది. తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే జలుబు చేసిన సమయంలో గట్టిగా చీదడం వల్ల రక్తం వచ్చిందని చెప్పారు. మందులు ఇచ్చారు. వాడాం. అయితే మళ్లీ ఒకసారి పాప ముక్కు నుంచి రక్తం వచ్చింది. మాకు చాలా భయంగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - గౌతమి, ఖమ్మం మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎపిస్టాక్సిస్ అంటారు. పిల్లలకు ముక్కు నుంచి రక్తస్రావం కావడం చాలా తరచుగా చూస్తుంటాం. ఇది చాలా సాధారణం. మూడు నుంచి పదేళ్ల పిల్లల్లో మరీ సాధారణం. నిజానికి మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో ఒక్కసారైనా ముక్కునుంచి రక్తస్రావం అవుతుండటం చూస్తూనే ఉంటాం. తీవ్రతను బట్టి ఈ సమస్యను మైల్డ్ అండ్ సివియర్ అని వర్గీకరించవచ్చు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు మైల్డ్ అండ్ రికరెంట్ ఎపిస్టాక్సిస్ అని చెప్పవచ్చు. పిల్లల్లో ఎటోపిక్ రైనైటిస్, అడినాయిడ్స్, నేసల్ డిఫ్తీరియా, ఫారిన్‌బాడీ ఇన్ నోస్, ముక్కుకు దెబ్బతగలడం, రక్తం గడ్డకట్టడంలో సమస్యలు, ముక్కు క్యాన్సర్ వంటి అనేక సందర్భాల్లో రక్తస్రావం అవుతుంది. అయితే మనం రొటీన్‌గా చూసే ఎపిస్టాక్సిక్ని ప్రేరేపించే కారణాలలో... వేడిగా, పొడిగా ఉండే వాతావరణం, చల్లటి వాతావరణం, గట్టిగా చీదడం, ముక్కులో వేళ్లు పెట్టి లాగడం వంటివి కొన్ని. ఇలాంటి పిల్లలకు ఎక్స్-రేస్ ఆఫ్ ప్యారానేసల్ సైనసెస్, సీబీపీ, క్లాటింగ్ అండ్ బ్లీడింగ్ టైమ్, ప్లేట్లెట్ కౌంట్ అండ్ కోయాగ్యులేషన్ స్టడీస్‌తో పాటు సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సీటీ స్కాన్, యాంజియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించాలి. వీటి వల్ల బ్లీడింగ్‌కు కారణాలు, నిర్దిష్టంగా ఎక్కడినుంచి రక్తస్రావం అవుతోంది అన్న విషయాలు తెలుసుకోడానికి వీలవుతుంది. ప్రథమ చికిత్స : 1) పిల్లల్లో ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు ఆందోళన చెందకూడదు. పిల్లలకు ధైర్యం చెప్పి, సౌకర్యంగా ఉండేలా వాళ్లను కూర్చోబెట్టాలి. 2) ముందుకు ఒంగేలా చూసి, నోటితో గాలిపీల్చుకొమ్మని చెప్పాలి. 3) ముక్కుచివరి భాగాన్ని (ముక్కు రంధ్రాలపైన) బొటనవేలు, చూపుడువేలు సాయంతో కాసేపు నొక్కి పట్టి ఉంచాలి. 4) ముక్కుపైన ఐస్‌ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ఉంచాలి. పైన చెప్పిన చిన్నపాటి చర్యలతో రక్తస్రావం ఆగిపోతుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో రక్తస్రావం అవుతూనే ఉంటే తక్షణం ఈఎన్టీ నిపుణులను కలవడం తప్పనిసరి. నివారణ : 1) ముక్కు రంధ్రాల లోపలి భాగంలో వ్యాసలైన్ రాయాలి. 2) అలర్జీ ఉన్నవారికి క్రమం తప్పకుండా నేసల్ సెలైన్ డ్రాప్స్ వేయాలి. 3) పిల్లలకు గోళ్లు కత్తిరిస్తూ ఉండాలి. వాళ్లు ముక్కులో వేళ్లు పెట్టుకుని గిల్లుకోకుండా చూడాలి. 4) వాళ్లు గట్టిగా ముక్కు చీదకుండా చూడాలి. ఇక మీరు చెప్పిన అంశాలను బట్టి ఇది అలర్జీకి సంబంధించిన సమస్యగా అనిపిస్తోంది. కాబట్టి పైన పేర్కొన్న చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూనే మీరొకసారి ఈఎన్టీ నిపుణులను కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ -
సోరియాసిస్ వస్తే ఇక తగ్గదా?!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను చాలాకాలంగా శరీరంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్, చర్మం పగిలినట్లుగా కావడం, చర్మంపై పొలుసుల్లా వచ్చి రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే సోరియాసిస్ అని నిర్ధారించారు. ఏవేవో ఆయింట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఈ సమస్య మళ్లీ మళ్లీ కనిపిస్తోంది. అసలీ సమస్య ఎందుకు వస్తుందో తెలియ జేయండి. హోమియోలో దీనికి శాశ్వత పరిష్కారం ఉందా? - వినయ్, కర్నూలు సోరియాసిస్ అనేది దీర్ఘకాలం కనిపించే చర్మవ్యాధి. కానీ అంటువ్యాధి మాత్రం కాదు. ఇది ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వస్తే చర్మం ఎర్రగా మారుతుంది. పొడిబారినట్లుగా అయిపోయి చర్మం పొలుసుల్లా రాలిపోతుంది. దురదలు రావడం, మచ్చలు పడటం కూడా జరుగుతాయి. కారణాలు: సోరియాసిస్‌కు ఇప్పటివరకు కచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. అవి... మానసిక ఒత్తిడి వంశపారంపర్యం ఆటోఇమ్యూన్ ప్రతిస్పందన జన్యుసంబంధిత లోపాలు. రకాలు: చర్మ కణాలు, చర్మం మీది రంగులను బట్టి సోరియాసిస్‌ను చాలా రకాలుగా విభజించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని... ఫ్లేక్ సోరియాసిస్: ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చర్మం మీద ఎర్రగా పొంగిన కణాలను కలగజేస్తుంది. ఈ ఎర్రటి మచ్చలు తెల్లటి పొలుసులుగా వృద్ధి అవుతాయి. ఇవి ఎక్కువగా తల, మోచేతులు, మోకాళ్లు, గోళ్ల మీద ఏర్పడతాయి. గట్టేట్ సోరియాసిస్: ఇందులో నీటి బొట్ల లాంటి చిన్న చర్మ కంతుల వంటివి ఏర్పడతాయి. ఫిస్టులార్ సోరియాసిస్: దీనిలో తెల్లటి చీము వంటి చిక్కటి పదార్థం కలిగిన బొబ్బలు చర్మంపై కనిపిస్తుంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఒక రకమైన కీళ్లకు సంబంధించిన వ్యాధి. దీనిలో సోరియాసిస్‌తో పాటు కీళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. లక్షణాలు: చర్మం ఎర్రగా మారడం దురద చర్మం గట్టిగా తయారవడం అరికాలు, అరచేయిపై బొబ్బలు ఏర్పడటం గోళ్లు పెళుసుగా తయారయ్యి నల్ల రంగుకు మారడం జరుగుతుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది కీళ్లనొప్పులు దురద ఎక్కువగా ఉన్నప్పుడు గీరగానే చర్మం మీద పుండ్లు పడి రక్తం స్రవించడం కనిపిస్తుంది. సోరియాసిస్‌ను ప్రేరేపించే కారణాలు: సోరియాసిస్ అనేది చికిత్స తీసుకుంటున్నా తగ్గుతూ, మళ్లీ పెరుగుతూ ఇబ్బంది పెడుతుంది. అయితే దీన్ని ప్రేరేపించే కారణాలకు దూరంగా ఉంటే వ్యాధి తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి... మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి దుమ్ము ధూళి పెంపుడు జంతువుల వంటి అలర్జీలను కలిగించే కారకాలకు దూరంగా ఉండాలి యాంటీ బయాటిక్స్ వాడినప్పుడు దీని తీవ్రత పెరుగుతుంది. కాబట్టి వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి చల్లటి వాతావరణంలో తిరగకుండా ఉండటం మంచిది పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. నిర్ధారణ: రోగి వైద్య చరిత్రను పరిశీలించడం, చర్మాన్ని పరీక్షించడం ద్వారా దీని నిర్ధారణ చేయవచ్చు. వ్యాధిలోని వ్రణాలను బట్టి, చర్మంపై కనిపించే లక్షణాలను బట్టి అది ఏ రకమైన సోరియాసిస్ అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. నివారణ: వ్యాయామం చేయడం పరిశుభ్రత పాటించడం పోషకాహారం తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం మంచి ఆహారపు అలవాట్లు మెడిటేషన్ చర్మ సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇతర ఇన్ఫెక్షన్స్ రాకుండా శుభ్రత పాటించడం చర్మం పొడి బారకుండా ఆయిల్ పూయడం వంటి జాగ్రత్తల ద్వారా నివారించొచ్చు. చికిత్స: సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక రోగికీ, మరో రోగికీ వ్యాధి తీవ్రతలో, లక్షణాల్లో తేడా ఉంటుంది. హోమియో విధానంలో రోగి అలవాట్లు, వ్యక్తిత్వం, మానసిక స్థితి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని, కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో మందులిస్తారు. హోమియో మందుల ద్వారా పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. మళ్లీ ఇది తిరగబెట్టకుండా కూడా చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం.రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
ఎడతెరిపి లేకుండా దగ్గు... పరిష్కారం చెప్పండి
లంగ్ కౌన్సెలింగ్ నా వయసు 58 ఏళ్లు. గత 35 ఏళ్లుగా నేను సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. రోజూ విపరీతంగా సిమెంట్ పొడి వెలువడే చోట ఉంటాను. కొన్నిరోజుల నుంచి నాకు విపరీతంగా దగ్గు వస్తోంది. అది పొడి దగ్గే. అయితే దగ్గినప్పుడు పొత్తికడుపులోనూ, అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి కూడా వస్తోంది. అంతేకాకుండా ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని కొన్ని మందులు రాసిచ్చారు. కొంతకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. అసలు నాకేమైంది. ఏ స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలిస్తే నాకు నయమవుతుంది? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - జె. ప్రసాద్, కొత్తగూడెం ఈమధ్యకాలంలో లంగ్‌కు సంబంధించిన జబ్బులు మనదేశంలో విపరీతంగా కనిపిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా పొగతాగడం, వాతావరణంలో దుమ్ము, మనం తీసుకునే ఆహారం. ఇక మీ విషయానికి వస్తే... మీరు గత 35 ఏళ్లుగా నిత్యం సిమెంట్ దుమ్ము వెలువడే చోట పనిచేస్తున్నట్లు చెప్పారు. అది మీ అనారోగ్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. కంటికి కనిపించనంత సైజ్‌లో ఉండే సిమెంట్ ధూళిని కొన్నేళ్లుగా పీల్చడం వల్ల అది ఊపిరితిత్తుల్లోకి, కడుపులోకి చేరి ‘మీసోథీలియోమా’ అనే జబ్బుకు కారణం కావచ్చు. గనులు, పరిశ్రమల్లో దీర్ఘకాలం పని చేసేవారికి ఈ తరహా జబ్బులు సోకుతున్నట్లు ఈమధ్యకాలంలో కేసుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఈ జబ్బు ఊపిరితిత్తుల చుట్టూ ఆవరించే ఉండే కణజాలం పొరను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీరు చెప్పి లక్షణాలను బట్టి మీకు ఈ వ్యాధి సోకినట్లు అనుమానించాల్సి వస్తోంది. మీరు వెంటనే థొరాసిక్ సర్జన్‌ను సంప్రదించండి. వీడియో అసిస్టెడ్ సర్జరీ ద్వారా మీకు ‘మీసోథీలియోమా’ ఉందా లేదా అని నిర్ధారణ చేస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులు, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్స పద్ధతులు ఉపయోగిస్తారు. ఒకవేళ మీకు జబ్బు ఉందని తెలిసినా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నారు. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స సాధ్యమే. నిపుణులైన వైద్యులతో తగిన చికిత్స తీసుకుంటే మీరు పూర్తిగా కోలుకుంటారు. డాక్టర్ పి.నవనీత్ సాగర్ రెడ్డి సీనియర్ పల్మునాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ హైదరాబాద్ -
ఆకు కూరలతో రక్తహీనతకు చెక్!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 సంవత్సరాలు. ఇటీవల కొద్దికాలంగా మూత్రంలో మంట, చీము, రక్తం పడటం, నడుంనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే కిడ్నీల ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఎన్నో మందులు వాడుతున్నాను కానీ, అంతగా ఫలితం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియో చికిత్స ద్వారా అయినా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - రామారావు, పాలకొల్లు మన శరీరంలో మూత్రపిండాలది కీలకమైన పాత్ర. సాధారణంగా రక్తప్రవాహం ద్వారా కానీ, మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కారణాలు: 80 శాతం వరకు బ్యాక్టీరియా, 15 శాతం, వైరస్లు మరికొంత శాతం ఫంగల్, కొన్ని పరాన్నజీవులు. మూత్రం ఎక్కువ సమయం విసర్జించకుండా ఉన్న సమయంలో బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మూత్ర వ్యవస్థలో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డుగా నిలిచి ఈ సమస్య ఉత్పన్నం అయేలా చేస్తాయి. మూత్రకోశం ఇన్ఫెక్షన్లను స్త్రీలలోనే ఎక్కువగా గమనించవచ్చు. ముఖ్యంగా రజస్వల అయ్యే సమయంలోనూ, డెలివరీ అప్పుడు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ. వీటితోబాటు కృత్రిమ మూత్ర గొట్టాలు(క్యాథెటర్స్), స్టెంట్స్, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యత మలబద్దకం వలన కూడా మూత్ర మార్గం ఇన్ఫెక్షన్లు క లుగుతాయి. లక్షణాలు: రోగికి తరచు జ్వరం, కడుపు నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు కడుపునొప్పి గజ్జలలోకి, అటుపైన తొడల వరకు కూడా పాకుతుంది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో చీము, రక్తం కూడా పడుతుంటాయి. ఆకలి మందగించటం, ఒళ్ళు నొప్పులు, నీరసంతో పాటు మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట వంటి సమస్యలూ ఉంటాయి. జాగ్రత్తలు: వ్యక్తిగత శుభ్రత పాటించ డం, ఎక్కువ నీరు తాగటం, మూత్రాన్ని నియంత్రించకుండా ఉండటం, కృత్రిమ గర్భనిరోధక సాధనాలు వాడేటప్పుడు జాగ్రత్త వహించడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా ఈ వ్యాధి కలగకుండా నియంత్రించుకోవచ్చు. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా వ్యాధి లక్షణాలతో పాటు రోగి మానసిక, శరీర సమస్యలను పరిగణనలోకి తీసుకుని, రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం వల్ల ఇన్ఫెక్షన్ తాలూకు సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి. మీరు వెంటనే మంచి హోమియో నిపుణుని సంప్రదించండి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా అమ్మకు 60 ఏళ్లు. తనకు కుడికాలు, చెయ్యి విపరీతంగా కొట్టుకుంటోంది. నిద్రపోయినప్పుడే అవి ఆగుతున్నాయి. మళ్లీ మెలకువ వచ్చినా ఆపలేనంతగా కొట్టుకుంటున్నాయి. పరిష్కారం చెప్పండి. - నవనీతమ్మ, గూడూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అమ్మగారు హెమీబాలిస్మస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారిలో ఒక పక్క కాలు, చేయి ఆపలేనంతగా కొట్టుకుంటాయి. ఈ జబ్బు సాధారణంగా మెదడులో రక్తనాళం ముసుకుపోయి, నరాల కణాలు దెబ్బతినడం వల్ల వస్తుంది. మెదడులోని కణుతుల వల్ల కూడా రావచ్చు. మెదడులో రక్తస్రావం జరిగినా కూడా ఇది రావచ్చు. కొంతమంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ ఎక్కువగా కూడా ఇలా జరగవచ్చు. వీటిల్లో ఏ కారణం వల్ల మీ అమ్మగారికి ఇలా జరిగిందో రక్తపరీక్షల ద్వారానూ, బ్రెయిన్ స్కాన్ ద్వారానూ తెలుసుకోవచ్చు. కారణం తెలుసుకొని సరైన మందులు వాడటం ద్వారా మీ అమ్మగారి జబ్బును నయం చేయవచ్చు. నా వయసు 60 ఏళ్లు. నాకు పక్షవాతం వచ్చి నాలుగేళ్లు అయ్యింది. గత నెల రోజులుగా ఫిట్స్ వస్తున్నాయి. డాక్టర్ గారికి చూపిస్తే పెద్దాసుపత్రికి వెళ్లమని చెప్పారు. నాకు సరైన సలహా ఇవ్వగలరు. - అప్పారావు, విశాఖపట్నం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఇస్కిమిక్ సీజర్స్ అనే ఫిట్స్‌తో బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకసారి పక్షవాతం వచ్చినవారిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు సీటీస్కాన్, ఈఈజీ పరీక్షలు చేయించుకొని, కొన్ని కార్బమైజిపైన్ అనే మందు వాడటం ద్వారా ఫిట్స్‌ను తగ్గించవచ్చు. అయితే మీరు కనీసం మూడేళ్ల పాటు ఇది వాడాల్సి ఉంటుంది. కొంతమందికి జీవితాంతం కూడా వాడాల్సి రావచ్చు. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్ అనీమియా కౌన్సెలింగ్ మా పాప వయసు పదకొండేళ్లు. గత మూడు నెలలుగా రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి కారణాలు, లక్షణాలతో పాటు రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తెలపండి. - సౌజన్య, ఒంగోలు మన శరీరంలో రక్తం ఎర్రగా ఉంటుంది. దీనికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఒకవేళ హీమోగ్లోబిన్ తగ్గితే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనత (అనీమియా)కు గురైన వ్యక్తికి రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య (రెడ్ బ్లడ్ సెల్స్ లేదా ఆర్బీసీ లేదా ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. రక్తపరీక్ష ద్వారా రోగి రక్తంలో ఎర్ర రక్తకణాలు ఎన్ని ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. రక్తహీనత ఉన్న వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్రరక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. దీనివల్ల రోగి అలసటగా ఫీల్ కావడం జరుగుతుంది. రక్తహీనత తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో శ్వాసతీసుకోవడం కూడా కష్టమవుతుంది. రక్తహీనత ముఖ్యంగా మూడు కారణాల వల్ల వస్తుంది. అవి... 1) పౌష్టికాహారలోపం - ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోనూ ఎక్కువగా ఉంటాయి. అవి తగినంతగా తీసుకోకపోవడం. 2) రక్తం నష్టపోతుండటం - స్త్రీలలో రుతుస్రావం వల్ల, పిల్లల కడుపుల్లో నులి పురుగుల వంటి క్రిములు ఉండటం వల్ల. 3) రక్తం తయారీలో అవరోధం - ఏవైనా జబ్బుల (ఉదాహరణకు మలేరియా) వల్ల రక్తంలోని ఎర్రరక్తకణాలు ధ్వంసం అయి మరల పెరగకపోవడం. దీంతో రక్తం తయారవ్వక రక్తహీనత కనపడుతుంది. లక్షణాలు : తీవ్రమైన నిస్సత్తువ, సాధారణ పనులకే ఆయాసం రావడం, నాలుక, కనురెప్పల లోపలి భాగాలు పాలిపోవడం, అలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, చేతుల గోళ్లు వంగి గుంటలు పడటం, పాదాలలో నీరుచేరడం, చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి. అనీమియాను అధిగమించడం ఇలా : తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం రక్తహీనత నివారణకు సులభమైన మార్గం. బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, మాంసం, కాలేయం వంటి పదార్థాలలో కూడా ఇనుము పుష్కలంగా ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారంలో మొలకెత్తిన పప్పు ధాన్యాలు, విటమిన్-సి పాళ్లు ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
కృత్రిమ గుండెతో కొంతకాలం హ్యాపీ!
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు ఆరేళ్లు. గత ఏడాదిగా అతడి ప్రవర్తన కాస్త వేరుగా అనిపిస్తోంది. గంటలకొద్దీ స్తబ్దుగా ఉంటున్నాడు. అకారణంగా ఏడుస్తున్నాడు. ఇతరులతో కలవడం లేదు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటున్నాడు చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి, ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో దీనికి తగిన చికిత్స ఉందని చెబుతున్నారు. మాకు తగిన పరిష్కారం సూచించండి. - ప్రియ, నకిరేకల్ ఆటిజమ్ చిన్నపిల్లల్లో కనిపించే సమస్య. దీనినే ‘పర్వేసివ్ డెవలప్మెంట్ డిజార్డర్’ అంటారు. దీని వల్ల పిల్లల ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ఈ సమస్య వచ్చిన పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే ముందే వాటిని గమనిస్తే ఈ సమస్యను అధిగమించడం చాలా సులభం. కారణాలు: ప్రత్యేకంగా కారణమంటూ ఏదీ లేదు. కానీ కొన్నిసార్లు మెదడు పెరుగుదలలో లేదా పనితీరులో కనిపించే అసాధారణ లోపాల వల్ల ఆటిజమ్ రావచ్చు. కొందరిలో తల్లి గర్భంతో ఉన్న సమయంలో ఆమెకు ఏవైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు లేదా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా ఇది రావచ్చు. లక్షణాలు: ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించవచ్చు ఇతరులతో కలవలేకపోవడం తోటిపిల్లలతో ఆడుకోడానికి అంతగా ఇష్టపడకపోవడం చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుండటం భావ వ్యక్తీకరణలో లోపం వంటివి. నిర్ధారణ: మరీ చిన్న పిల్లల్లో... తల్లి దగ్గరకు తీసుకున్నా ఏమీ స్పందించకపోవడం, తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచినప్పుడు ఉత్సాహంగా ముందుకు రాకపోవడం గంటల తరబడి స్తబ్దుగా ఉండిపోవడం పరిచితులను చూడగానే పలకరింపుగా నవ్వకపోవడం నిరంతరం అకారణంగా ఏడవడం కాస్త పెద్ద వయసు పిల్లల్లో... కళ్లలో కళ్లు పెట్టి చూడకపోవడం ముఖంలో భావోద్వేగాలు చూపించకపోవడం నొప్పికీ, బాధకూ స్పందిచకపోవడం కాళ్లు, చేతులు అసహజంగా కదిలిస్తూ ఉండటం అసందర్భంగా ఏవేవో మాటలు మాట్లాడుతుండటం మానసిక ఎదుగుదల లోపించడం. నివారణ : పిల్లలకు పోషకాలతో కూడిన సమతులాహారం ఇవ్వడం ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎక్కువ సమయం వాళ్లతో గడపడం. చికిత్స: హోమియో విధానంలో వాళ్ల లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు కాన్స్టిట్యూషన్ విధానంలో తగిన మందులు ఇవ్వడం ద్వారా ఆటిజమ్ సమస్యను పరిష్కరించవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ హార్ట్ కౌన్సెలింగ్ మా అన్నయ్యకు 45 ఏళ్లు. అతడి గుండె రక్తం సరిగా పంప్ చేయలేని పరిస్థితికి వచ్చేసిందని డాక్టర్లు అంటున్నారు. దీనివల్ల ఏ సమయంలోనైనా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మా అన్నయ్యకు గుండె మార్పిడి చేయిద్దామని, చాలా కాలం క్రితమే అవయవ దానం చేసే ‘జీవన్‌దాన్’లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. కానీ మా అన్నయ్యది రేర్ బ్లడ్ గ్రూప్ కావడంతో సరిపోయే గుండె ఎంతకూ లభించడం లేదు. ఆయన గుండె మరింత బలహీనమైపోయి, హార్ట్ ఫెయిల్యూర్ అయితే మూడు నెలల్లోగా మాత్రమే గుండెను అమర్చుకునే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి. దయచేసి తగిన పరిష్కారం చెప్పగలరు. - వరుణ్, తిరుపతి గుండె పూర్తిగా విఫలమై రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం 20 నుంచి 10 శాతం వరకు పడిపోయే పరిస్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి పరిస్థితి వస్తే గుండె మార్పిడి ఒక్కటే మార్గం. అయితే గుండె మార్పిడికి దాత అవసరమవుతారు. సకాలంలో దాత లభించకపోయినా, బ్లడ్‌గ్రూప్ మ్యాచ్ కాకపోయినా గుండె మార్పిడి కోసం వేచి చూసేవారు ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వైద్యశాస్త్రంలో అధునాతన మార్పుల వల్ల ప్రస్తుతం సహజమైన గుండెకు ప్రత్యామ్నాయంగా పనిచేసే కృత్రిమ గుండె అందుబాటులోకి వచ్చింది. సకాలంలో సహజమైన గుండె లభించని రోగులకు కృత్రిమ గుండె ఒక వరంలాంటిదని చెప్పవచ్చు. గుండె పూర్తిగా చెడిపోయినప్పుడు లేదా పనిచేయని స్థితికి చేరినప్పుడు ఈ కృత్రిమ గుండెను కొన్ని ఉపకరణాల సహాయంతో అమర్చుకొని సాధారణ జీవితం గడిపేయవచ్చు. దీనినే వైద్య పరిభాషలో హార్ట్‌వేర్ వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైజ్ (హెచ్విఏడీ) అంటారు. గోల్ఫ్ బంతి సైజ్‌లో ఉండే ఈ పరికరాన్ని ఛాతీ లోపల గుండెకు కిందిభాగంలో అమర్చుతారు. రోగికి లెఫ్ట్ వెంట్రికల్ ఫెయిల్యూర్ అయితే గుండె ఎడమ భాగానికి సపోర్టుగా లేదా రైట్ వెంట్రికల్ ఫెయిల్యూర్ అయితే గుండె ఎడమభాగానికి సపోర్టుగా దీన్ని అమర్చుతారు. గుండె కింది భాగంలో అమర్చిన ఈ పరికరాన్ని ఛాతీ బయట ఉన్న బ్యాటరీ కంట్రోలర్‌కు అనుసంధానిస్తారు. ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి ఈ బ్యాటరీలను చార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి అధునాతనమైన వైద్య సదుపాయాన్ని అందిపుచ్చుకుంటే మీ అన్నయ్య కొన్నేళ్ల పాటు సాధారణ జీవితాన్ని చాలా ఆనందంగా జీవించగలరు. కాబట్టి ఆందోళన చెందకండి. వీలైనంత త్వరగా దగ్గర్లోని వైద్యులను సంప్రదించండి. డాక్టర్ పి.వి. నరేశ్ కుమార్ సీనియర్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ కార్డియో థొరాసిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ డెర్మటాలజీ కౌన్సెలింగ్ నేను నీళ్లు తాగుతున్నప్పుడు చేతిలోంచి వాటర్‌బాటిల్ జారి, కాలి బొటన వేలిపై పడింది. అప్పుడు ఏమీ అనిపించలేదు గానీ రెండు రోజుల తర్వాత వేలంతా ఎర్రగా నీలంగా వాచి బల్బులాగా మారింది. నా గోరు చెడిపోయినట్లుగా అనిపిస్తోంది. ఇక ఈ గోరు నార్మల్‌గా మారడం జరగదా? తగిన సలహా ఇవ్వండి. - సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ మీరు ఊహిస్తున్నట్లే మీ గోరు కణజాలానికి నష్టం చేకూరింది. ఒంటిలో గోరు ఆనుకుని ఉండే ‘నెయిల్ బెడ్’కు గాయమైనట్లు మీరు రాసిన విషయాలను బట్టి తెలుస్తోంది. గోటికి అయిన గాయం తగ్గడం కోసం మీరు ఈ కింద పేర్కొన్నవిధంగా మందులు తీసుకోవాలి. మీరు అజిథ్రోమైసిన్-500 ఎంజీ మాత్రలు పొద్దున ఒకటీ, రాత్రి ఒకటీ చొప్పున మూడు రోజుల పాటు తీసుకోవాలి. వాపుతో పాటు నొప్పి ఉంటే ఐబుప్రొఫెన్, పారాసిటమాల్ కాంబినేషన్లో ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒకటి చొప్పున రెండు రోజులు వాడాలి. వేలి దగ్గర నొప్పిగా ఉంటే గాయానికి నేరుగా ఐస్ అద్దకుండా, ఏదైనా గుడ్డలో చుట్టి ఐస్ కాపడం పెట్టండి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు ఐస్ కాపడం పెట్టాలి. గాయం తగ్గిన తర్వాత గోరు నార్మల్‌గా అనిపించకపోతే... ఒకసారి మీకు దగ్గర్లోని డెర్మటాలజిస్ట్‌ను కలవండి. వారు ఆ వేలిని పరీక్షించి అక్కడి ‘నెయిల్ మాట్రిక్స్’ అంతా బాగుందా లేదా అని చూసి, దాన్ని బట్టి ఆ తర్వాత చేయాల్సినదేమిటో నిర్ణయిస్తారు. నా వయసు 49. నా తొడలపై ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. చెమట పట్టినప్పుడు చాలా దురదగా ఉంటోంది. పైగా మచ్చల సైజు క్రమంగా పెరుగుతున్నట్లనిపిస్తోంది. నేనెన్నో క్రీములు రాశాను. కానీ మేలు జరగలేదు. తగిన సలహా ఇవ్వండి. - ఆనంద్‌రావు, నెల్లూరు మీరు చెబుతున్న అంశాలను బట్టి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మాటిమాటికీ తిరగబెడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోల్, టర్బినఫిన్ ఉన్న క్రీమును 2-3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు ప్రతిరోజూ మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డెర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ -
బాలింతలకు కఠిన పథ్యం అవసరం లేదు
ఆయుర్వేద కౌన్సెలింగ్ నాకు పదిరోజుల క్రితం పాప పుట్టింది. ఇంటిలోని వాళ్లు అవి తినకూడదు, ఇవి తినకూడదు అంటూ రకరకాల ఆంక్షలు విధిస్తున్నారు. జన్మించింది. బాలింతనైన నేను ఏవిధమైన ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలో సూచింప ప్రార్థన. - స్నేహ, హైదరాబాద్ ప్రసవమైన మూడు నాలుగు వారాల వరకు తల్లీ బిడ్డలకు ఇన్ఫెక్షన్లు రాకుండా పరిశుభ్ర వాతావరణాన్ని పాటించడం అత్యవసరం. మీరుండే గదిలోనికి ఎవ్వరినీ రానీయవద్దు. తల్లి, వైద్యుడు, నర్సు తప్ప ఇతరులెవ్వరూ శిశువుని తాకకుండా చూసుకోండి. సాధారణంగా ప్రసూతులలో (బాలింతలలో) కొంచెం రక్తహీనత ఉండవచ్చు. నడుంనొప్పి, పాదాలవద్ద కొద్దిగా వాపులు కొందరిలో కనిపించవచ్చు. మీరు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కఠిన పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. బయటి ఆహారం, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలు మంచివి కావు. వేడి ఆహారం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే కాయగూరలు, తాజాఫలాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు మంచిది. ప్రతిరోజూ ఉదయం బార్లీనీళ్లు, ఆవుమజ్జిగ తాగండి. నువ్వులు, బెల్లం తినండి. రోజూ రెండు లీటర్ల ఆవుపాలు తాగితే మీకు స్తన్యం బాగా ఉత్పత్తి అవుతుంది. అల్లం, వెల్లుల్లి, ఆహారంలో తగురీతిలో తినడం మంచిది. అదేపనిగా పడుకోకుండా కొంచెం శారీరక శ్రమ కలిగే తేలికపాటి వ్యాయామాలు చేయండి. రెండుపూటలా ఐదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ప్రసవానంతరం ఆరోగ్యం కుదుటపడటానికి సహకరించే ఈ కింద సూచించిన ఆయుర్వేద మందులు వాడండి. పునర్నవాది మండూర (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 బాలింత కాఢ నెం. 1 (ద్రావకం): ఉదయం 2 చెంచాలు, రాత్రి రెండు చెంచాలు రెండు వారాలు తాగండి. ఆ తర్వాత... బాలింత కాఢ నెం. 2 (ద్రావకం): ఉదయం 2 చెంచాలు, రాత్రి చెంచాలు రెండు వారాలు తాగండి. శిశువునకు... అరవిందాసవ (ద్రావకం): ఐదుచుక్కలు ఉదయం, ఐదు చుక్కలు సాయంత్రం తాగించాలి (తేనెతో). వీలుంటే శిశువుని (బట్టలు లేకుండా) ప్రభాత సూర్యకిరణాలలో ఐదు నిమిషాలు ఉంచితే మంచిది. ‘బలాతైలం’తో శిశువునకు మృదువుగా అభ్యంగం చేసి, అనంతరం సున్నిపిండితో, వేడినీటి స్నానం చేయించండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది క్రితం కడుపునొప్పి, కామెర్లు వచ్చాయి. ఒళ్లంతా ఒకటే దురద. డాక్టర్‌ను కలిస్తే పరీక్షలు చేసి, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈఆర్సీపీ టెస్ట్ చేసి స్టెంట్ వేశారు. నెల రోజుల నుంచి మళ్లీ కళ్లు పచ్చబడుతున్నాయి. జ్వరం వస్తోంది. నాకు సరైన సలహా ఇవ్వగలరు. - సుకుమార్, నందిగామ మీరు గాల్‌స్టోన్స్‌తో పాటు సీబీడీ స్టోన్స్ అనే సమస్యలతో బాధపడుతున్నారు. మీకు ఇటీవల వేసిన బిలియరీ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. దాంతో మీకు కామెర్లు, జ్వరం వస్తున్నాయి. మీరు మళ్లీ వీలైనంత త్వరగా ఈఆర్సీపీ పరీక్ష చేయించుకోండి. దీనివల్ల మీకు సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించడానికి వీలవుతుంది. అలాగే మూసుకుపోయిన స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ కూడా అమర్చవచ్చు. ఈఆర్సీసీ తర్వాత మీరు లాపరోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇదే సమస్య మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడంతో పాటు, కాళ్లవాపులూ వచ్చాయి. మా దగ్గర స్థానికంగా ఉండే డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. కొన్నాళ్ల పాటు సమస్య తగ్గింది. కానీ మళ్లీ అదే సమస్య వచ్చింది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. - రమాకాంతరావు, కంచికచర్ల కడుపులో నీరు రావడం, కాళ్ల వాపులు వంటి లక్షణాలను బట్టి మీకు లివర్, కిడ్నీ లేదా గుండెజబ్బు ఉన్నట్లుగా అనుమానించాల్సి ఉంటుంది. ఆల్కహాల్ అలవాటు ఉందంటున్నారు కాబట్టి ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. ఆ రిపోర్టులతో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలవండి. మీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా మీకు చికిత్స అందించాల్సి ఉంటుంది. నా వయసు 41 ఏళ్లు. నేను చాలా ఏళ్ల నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. దాదాపు మూడు నెలల పాటు రకరకాల మందులు వాడాను. ఇప్పుడు దాంతోపాటు మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలతోనూ బాధపడుతున్నాను. అయితే నాకు డయాబెటిస్‌గానీ, హైబీపీగాని లేవు. దయచేసి నా సమస్యలు తీరేలా తగిన సలహా ఇవ్వండి. - రాజ్‌కుమార్, కరీంనగర్ మీరు రాసిన ఉత్తరంలో మీరు ఎండోస్కోపీ చేయించుకున్నారా లేదా అన్న వివరాలు లేవు. మీరు ఒకవేళ ఎండోస్కోపీ చేయించుకోకపోతే ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి ఎండోస్కోపీ చేయించుకోండి. అందులో వచ్చే ఫలితాన్ని బట్టి వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా కూతురికి 23 ఏళ్లు. గత రెండేళ్లుగా అప్పుడప్పుడూ ఆమెకు కుడివైపున పొత్తికడుపులో నొప్పి వస్తోంది. శారీరకమైన శ్రమ చేసినప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. అయితే గత మూడు నెలల నుంచి ఈ నొప్పి రోజూ వస్తోంది. నొప్పి తీవ్రత కూడా ఎక్కువే. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్-రే తీసి ఆమెకు తుంటి భాగం సరిగా ఏర్పడలేదని అన్నారు. దాంతో మేం షాక్‌కు గురయ్యాం. పుట్టుక నుంచే ఈ సమస్య ఉన్నప్పుడు... ఈ మధ్యనే నొప్పి ఎందుకు వస్తోంది? ఆమెకు తుంటి భాగాన్ని మళ్లీ అమర్చాల్సి వస్తే... అది ఎప్పటికి కుదురుకుంటుంది? ఆమెది చిన్న వయసు. పైగా ఇప్పుడు పెళ్లి చేయాల్సిన సమయం. కాబట్టి ఈ సమయంలో ఆమెకు ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఆమె వైవాహిక జీవితానికి గాని, పిల్లల పుట్టుకకు గానీ ఏదైనా సమస్య వస్తుందా? దయచేసి వివరించండి. - స్నేహలత, గుంటూరు మీరు చెప్పినట్లుగా ఈ వయసులో ఏదైనా సమస్య బయట పడటం, పైగా జీవితంలో కుదురుకోవాల్సిన సమయంలో పుట్టుకతో సమస్య ఉన్నట్లుగా తెలియడం బాధాకరమే. మీరు చెప్పిన అంశాలను బట్టి ఆమెకు ఉన్న కండిషన్‌ను ‘డిస్‌ప్లాస్టిక్ హిప్’ అంటారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్లలోని మృదులాస్థి / చిగురు ఎముక... అంటే అసలు ఎముక చివరిభాగంలో ఉండే కార్టిలేజ్ అరిగిపోయి సమస్యతో పాటు, తీవ్రత కూడా బయటపడుతుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య బాల్యదశలోనే వెల్లడి అవుతుంది. వాళ్లలో ఆర్థరైటిస్‌తో పాటు తీవ్రమైన నొప్పి వల్ల ఈ కండిషన్ తెలుస్తుంది. సాధారణంగా కీళ్ల మార్పిడి ఆపరేషన్‌ను ఈ సమయంలో చేయరు. కానీ ఆమెకు ఉన్న కండిషన్ వల్ల మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే మీరు అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆమెకు అవసరమైన ఆపరేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో 30-40 ఏళ్ల వరకూ మళ్లీ సమస్య తలెత్తే అవకాశాలు చాలా తక్కువ. నొప్పి కూడా ఉండదు. ఆమె తన రోజువారీ వ్యవహారాలు చూసుకోడానికి గానీ లేదా పెళ్లికి, బిడ్డలను కనేందుకు ఈ శస్త్రచికిత్స వల్ల ఎలాంటి సమస్యా రాదు. కాబట్టి మీరు అంతగా బాధపడకుండా, మీకు దగ్గరలోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
గుండె పోటు కంటే కాలి పోటు ప్రమాదమా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబుకు ఆరేళ్లు. వాడికి తరచు జలుబు చేస్తోంది. వర్షాకాలం వస్తే చాలు... టాన్సిల్స్ వాచి, ఆహారం తీసుకోవడం కష్టంగా ఉంటోంది. డాక్టర్‌కు చూపిస్తే, ఇంకొంతకాలం తర్వాత ఆపరేషన్ ద్రావా తొలగించాలన్నారు. కొందరేమో టాన్సిల్స్ తొలగించడం అంత మంచిది కాదంటున్నారు. ఏం చేయాలో తెలియక మాకు ఆందోళనగా ఉంది. దయచేసి మా బాబు సమస్య పూర్తిగా తొలగేందుకు తగిన సలహా ఇవ్వగలరు. - డి.కల్యాణి, కొలనుకొండ టాన్సిలైటిస్ అంటే కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఇన్ఫ్లమేటరీ మార్పులు. ముఖ్యంగా టాన్సిల్స్‌లో చీము పట్టడం, నొిప్పి, వాపు లాంటి లక్షణాలతో బాధపడుతున్న స్థితిని టాన్సిలైటిస్ అంటారు. టాన్సిల్స్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. పిల్లల్లో తరచు వాస్తుంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఇవి క్షీణిస్తూ ఉంటాయి. టాన్సిల్స్ లింఫాయిడ్ టిష్యూ సముదాయం. పిల్లలో టాన్సిల్స్ దేహ రక్షణకు ఉపయోగపడతాయి. టాన్సిల్స్‌కు ఏ కారణం చేతనైనా చీము పడితే, అవి దేహాన్ని రక్షించే విధులను నిర్వర్తించకపోగా, చీము, రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకి, అది ఇతర రకాల వ్యాధులకు కారణమవుతుంది. వీటిని సకాలంలో గుర్తించి, తగిన చికిత్స చేయకపోతే వ్యాధి ముదిరి దీర్ఘకాల సమస్యగా మిగిలిపోతుంది. కారణాలు: అపరిశుభ్ర వాతావరణం, కిక్కిరిసిన పరిసరాలు, దుమ్ము, ధూళి ద్వారా, ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు గాలి ద్వారా, ఉమ్ము తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు ఒకరినుండి ఇంకొకరికి వ్యాపిస్తాయి. చిన్నవయసు వారిలో ఎక్కువగా జరుగుతుంది. లక్షణాలు: గొంతునొప్పి, ఆహారం మిగడంలో కష్టం, 102 నుండి 103 డిగ్రీల జ్వరం, ఒళ్లునొప్పులు, చెవినొప్పి, మలబద్ధకం, అక్యూట్ టాన్సిలైటిస్‌లో జ్వర తీవ్రత ఎక్కువగా అయి, దవడ కింద బిళ్లలు నొప్పిగా ఉంటాయి. హెచ్చరిక: కొందరిలో టాన్సిలైటిస్ ప్రమాదకరం కూడా కావచ్చు. టాన్సిల్స్ పొరలో చీముగడ్డ ఏర్పడుతుంది. దానిని పెరిటాన్సిలర్ ఏబ్సెస్ అంటారు. ఇది అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదకరం. వీటిలో తీవ్రజ్వరం, ఉమ్మి కూడా మింగలేరు. ముద్దగా మాట్లాడుతూ తీవ్రమైన చెవిపోటుతో రోగి చాలా బాధపడతాయి. ఇది గొంతుకు ఒకవైపునే వస్తుంది. రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు: పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, నీరు ఇవ్వాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. తరచు గొంతునొప్పి, జ్వరం వస్తూ ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. హోమియో వైద్యవిధానం: టాన్సిలైటిస్ వ్యాధికి సంబంధించి పాజిటివ్ హోమియోపతిలో చాలా అద్భుతమైన చికిత్స ఉంది. ముఖ్యంగా పిల్లల్లో తరచు వచ్చే ఈ వ్యాధిని హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతూ, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లని పూర్తిగా నియంత్రిస్తూ నివారిస్తూ పిల్లల్లో ఎటువంటి దుష్ర్పభావాలూ లేకుండా కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా మందులను ఎంపిక చేసి చికిత్స చేస్తే వ్యాధి పూర్తిగా నయం అవటమే కాకుండా మున్ముందు వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా అరికట్టవచ్చు. పిల్లలు ఈ మందులను స్వీకరించడం కూడా చాలా సులభం. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీకింద ఎడమవైపున గత వారం రోజులుగా నొప్పి వస్తోంది. డాక్టర్గారిని సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్సైజు ఎందుకు పెరిగింది తెలియజేయగలరు. - విజయ్, నిడదవోలు మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీకు లివర్ సైజు పెరిగిందని చెప్పవచ్చు. దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు. అవి...ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునే వారిలో, స్థూలకాయం ఉన్నవారిలో లివర్‌లో కొవ్వు పేరుకుపోయి, దాని సైజు పెరిగే అవకాశం ఉంది. మీరు స్థూలకాయులా లేదా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా అన్న అంశాలు మీరు తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్ ఇన్షెక్షన్స్... హెపటైటిస్-బి, హెపటైటిస్-సి అనే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ సైజు పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు పంపిన రిపోర్టులలో అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి మీకు ఆ ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీరు లివర్ ఎంత సైజ్‌కు పెరిగిందన్న అంశాన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా తెలుసుకోవాలి.మీకు వస్తున్న నొప్పి ఎడమవైపున ఛాతీ కింది భాగంలో కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ చేయించాలి.పై రెండు పరీక్షల వల్ల మీ లివర్ సైజు పెరగడానికి, కడుపునొప్పికీ కారణం తెలిసే అవకాశం ఉంది. దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. వాస్క్యులార్ డిసీజ్ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు పదిహేనేళ్ల క్రితం ఎడమరొమ్ము తొలగించారు. గత నెల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి తగ్గింది. కడుపులో నొప్పి వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - ఒక సోదరి, మహబూబాబాద్ మీరు రాసిన విషయాన్ని బట్టి మీకు రొమ్ముక్యాన్సర్ వచ్చినందున రొమ్ము తొలగించి ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం కామెర్లు ఉన్నాయి కాబట్టి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి... గతంలో ఉన్న రొమ్ము క్యాన్సర్ ప్రభావం ఏదైనా లివర్పైన పడిందా అనే విషయాన్ని పరిశీలించాలి. అలాగే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా సోకాయా, ఏవైనా మందులు వాడుతుంటే వాటి ప్రభావం కాలేయం మీద పడి ఈ పరిణామం సంభవించిందా అని పరీక్షించాలి. మీరు ముందుగా అల్ట్రాసౌండ్ స్కాసింగ్ (లివర్)తో పాటు లివర్‌కు చెందిన రక్తపరీక్ష చేయించుకోండి. ఒకవేళ క్యాన్సర్ ప్రభావం కాలేయంపై కూడా పడి ఉంటే, దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. మీరు ముందుగా పైన పేర్కొన్న పరీక్షలు చేయించి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 56 ఏళ్లు. నేను నడుస్తున్నప్పుడు కాలునొప్పిగా ఉంటోంది. పిక్కలు, తొడలు, తుంటి భాగంలోనూ నొప్పిగా ఉంటోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు వచ్చే నొప్పి, ఆగిన వెంటనే తగ్గుతోంది. నొప్పి సన్నగా, తిమ్మిరి ఎక్కినట్లుగా ఉంటోంది. కాళ్ల కండరాలు అలసిపోయినట్లుగా, పిరుదులూ నొపిగా అనిపిస్తున్నాయి. నా సమస్యకు కారణం ఏమిటో తెలపండి. - జె. రాధాకృష్ణమూర్తి, కొత్తగూడెం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కాలిలోని రక్తనాళాలు పూడిపోయినట్లుగా అనిపిస్తోంది. గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అయిన గుండెపోటు వచ్చినట్లే... కాలిలోనూ అదే పరిణామం సంభవించే అవకాశం ఉంది. గుండెపోటులో ఉంటే ప్రమాదం లాగే ఈ లెగ్ అటాక్స్ ప్రమాదకరం. కాలిపైన ఎంతకూ నయంకాని అల్సర్స్ వచ్చి, చివరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి దారితీయవచ్చు. లెగ్ అటాక్స్‌లో ఉన్న మరో ప్రమాదకరమైన అంశం... వీటిని చివరిదశ వరకూ గుర్తించడం కష్టం. అంతకుమించి ఈ వ్యాధి గురించి సాధారణ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు, 50 ఏళ్లు పైబడిన వారు, స్థూలకాయులు, రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు, పొగతాగే వారు ఈ లెగ్ అటాక్స్ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు పేర్కొన్న లక్షణాలతో పాటు కాళ్లు లేదా పాదాలు క్రమంగా పాలిపోయినట్లుగా ఉండటం, కాళ్లు నీలిరంగులోకి లేదా ముదురు ఎరుపు రంగులోకి మారడం వంటివీ చోటుచేసుకుంటాయి. నడవకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు గ్రహించాలి. ఈ రక్తనాళాల జబ్బును నిర్ధారణ చేయడానికి యాంజియోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే నిర్ధారణలో మరింత కచ్చితత్వం కోసం అల్ట్రాసోనోగ్రఫీ, ఎమ్మారైలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా కాలి రక్తనాళాల్లో పూడిక పేరుకుందని తెలిసినప్పుడు ప్రాథమిక దశలో సరైన మందులు, జీవనశైలిలో మార్పుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. దీనికి ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత మంచిది. ఎందుకంటే వ్యాధి ముదిరాక డాక్టర్‌ను సంప్రదిస్తే ఒక్కోసారి కాలిని తొలగించే ప్రమాదమూ ఉండవచు. అందుకే మీలో కనిపించిన లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు దీనికి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ విధానాల వంటి సమర్థమైన, సురక్షితమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. -
తెల్లకోటుల వల్లే రోగాలు విస్తరిస్తున్నాయి
బెంగళూరు: భారతీయ వైద్యులు,వైద్య విద్యార్థులు, ఇతర వైద్య సిబ్బంది ధరించే పొడుగు చేతుల తెల్లగౌనులవల్లే ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నా యంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థి. అందుకే వీటిని నిషేధించాలని స్థానిక వైద్య కళాశాలకు చెందిన ఎడ్మండ్ ఫెర్నాండెజ్ వాదిస్తున్నారు. వారు వేసుకొనే తెల్లగౌనుల వల్ల ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తున్నాయని ఇటీవల ఒక సర్వే తేల్చిందంటున్నారు. దీని వల్లే రోగులకు అనివార్యమైన హాని కలుగుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసిందంటున్నారు. దీనికి సంబంధించి అన్ని ఆస్పత్రులలోను ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటచేయాలని ఫెర్నాండెజ్ కోరుతున్నారు. 19వ శతాబ్దం నుంచి సాంప్రదాయకంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ తెల్లకోటులను ధరిస్తున్నారని తెలిపారు. వైద్యులు, నర్సులు ధరించే యాప్రాన్లు వ్యాధులను విస్తరింపచేసే వాహకాలుగా పనిచేస్తాయనే విషయాన్ని భారతీయులు గమనించాలని కోరారు. తెల్లగౌనులను నిషేధించాలంటూ 2007లో అమెరికా ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని, దీన్ని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఆమోదించిందన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అమలుచేయడానికి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాలు నిరాకరించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యులు ధరిస్తున్నతెల్ల గౌనుల కంటే చూడచక్కని దుస్తులు, ముఖంపైన చిరునవ్వు ముఖ్యమని ఆయనంటున్నారు. దీంతో పాటు వైద్యుడి పేరు తెలిపేలా బ్యాడ్జ్ కూడా ధరించాలని ఆయన సూచిస్తున్నారు. ఇప్పటికైనా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని ఫెర్నాండెజ్ కోరుతున్నారు. -
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
పాప మాడు మీద ర్యాష్... తగ్గడం ఎలా? మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా పిల్లల వైద్యులు ఇచ్చిన చికిత్సతో తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. ఇక పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచికనా? - వనజ, అనంతపురం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్.పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హెదరాబాద్ -
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
హెపటైటిస్-బితో లివర్ చెడిపోతుందా? నా వయసు 30 ఏళ్లు. నేను ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మా దగ్గర నిర్వహించిన ఒక మెడికల్ క్యాంప్‌లో హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ అని తెలిసింది. దీనివల్ల కాలేయం చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? ఈ వ్యాధి మందులతో తగ్గుతుందా? - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు హెపటైటిస్-బి అనే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ వైరస్ రక్తంలో ఉన్నంతమాత్రాన కాలేయం చెడిపోదు. రక్తంలో ఈ వైరస్ ఉండే దశను బట్టి కాలేయం చెడిపోయే అవకాశం ఉంది. వైరస్ ఏ దశలో ఉందో తెలుసుకోడానికి కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్, హెచ్‌బీవీ డీఎన్ఏ టెస్ట్ చేయించండి. వీటివల్ల వైరస్ ఏ దశలో ఉందో తెలుస్తుంది. ఒకవేళ హెచ్‌బీవీ డీఎన్ఏ ఎక్కువగా ఉండి, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో కూడా తేడా వస్తే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. నేను వృత్తిరీత్యా గోల్డ్‌స్మిత్‌ను. నా కూతురి వయసు 16 ఏళ్లు. మూడు నెలల క్రితం పొరబాటున గ్లాసులో ఉన్న తేజాబ్ ద్రావణం (యాసిడ్) తాగేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాను. కానీ ప్రస్తుతం ఆహారం మింగడం కష్టంగా ఉందని చెబుతోంది. ఎందుకని ఆహారం సాఫీగా జారడం లేదో అర్థం కావడం లేదు. దయచేసి మా అమ్మాయి సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. - ఒక సోదరుడు, ఊరి పేరు రాయలేదు మీ అమ్మాయి తేజాబ్ ద్రావణం తాగిందని అంటున్నారు. దాని వల్ల అన్నవాహికలో యాసిడ్ విడుదలై స్ట్రిక్చర్ డెవలప్ అయి ఉండవచ్చు. అంటే అన్నవాహిక సన్నబడి ఉండవచ్చు. దాంతో అన్నవాహిక నుంచి జీర్ణాశయానికి ఉన్న దారి మూసుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే మీ అమ్మాయికి వాంతులు అవుతున్నాయా లేదా అన్న విషయం మీరు రాయలేదు. ఒకవేళ వాంతులు లేకుండా కేవలం ఆహారం మింగడం కష్టంగా ఉంటే ఎండోస్కోపీ డయలటేషన్ అనే ప్రక్రియ ద్వారా సన్నబడిన ఆహార వాహిక మార్గాన్ని వెడల్పు చేసి చికిత్స చేయవచ్చు. ఈ ప్రక్రియను రెండువారాలకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్స వల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆహారం తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోండి. డాక్టర్ పి. భవానీ రాజు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
టూత్‌బ్రష్‌తో అంటువ్యాధులు
న్యూయార్క్: మీరు ఉమ్మడి బాత్రూమ్ వాడుతున్నారా? అయితే మీ టూత్‌బ్రష్‌ను బాత్రూమ్లోని స్టాండ్స్‌లో ఉంచే విషయంలో కాస్త ఆలోచించండి. ఎందుకంటే దాని ద్వారా మీకు ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాపించే అవకాశముంది. సాధారణంగా ఎక్కువ మంది వాడే బాత్రూముల్లో హానికరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. బాత్రూమ్లో ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల కంటే ఇది కలిగిన బాత్రూమ్ల్లో టూత్‌బ్రష్‌లను నిల్వ చేయడం వల్ల అది మనకు వ్యాపించవచ్చు. దీని వల్ల అంతకుముందు మనలో లేని బ్యాక్టీరియా ప్రభావానికి గురవుతామని అమెరికాలోని క్విన్నిపియాక్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అందువల్ల హాస్టళ్లలో ఉండే విద్యార్థులు టూత్‌బ్రష్‌ను వినియోగించడంలో, నిల్వ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు కలుగుతుంది. -
డెంటల్ కౌన్సెలింగ్
చిగుర్ల వ్యాధిలో నొప్పి తెలియదని ఎక్కడో చదివాను. మరి చిగుర్లకు వ్యాధి ఉన్నట్లు గుర్తించడం ఎలాగో తెలపండి. - ఉదయ్‌కుమార్, అనంతపురం చిగుర్లను జింజివా అనీ, వాటికి వచ్చే ఇన్ఫెక్షన్ను జింజివైటిస్ అనీ అంటారు. వ్యాధి జింజివైటిస్ దశలో ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. చిగుళ్లు ఎర్రగా మారడం, ముట్టుకుంటే జివ్వుమనడం, ఉబ్బినట్లుగా ఉండటం వంటివి జింజివైటిస్ లక్షణాలు. మీకు ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే డెంటిస్ట్‌ను కలవండి. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్ -
డెంటల్ కౌన్సెలింగ్
నేనెంత శ్రద్ధగా రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటున్నా నా నోటి నుంచి దుర్వాసన వస్తోంది. దీనిని నివారించడం ఎలాగో చెప్పండి. - తిరుమలరావు, ఒంగోలు నోటిదుర్వాసనను వైద్యపరిభాషలో హాలిటోసిస్ అంటారు. పంటి చిగుళ్లు లేదా పళ్లకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఇలా దుర్వాసన వస్తుంటుంది. మీరు రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకుంటున్నప్పటికీ దుర్వాసన పోవడం లేదంటే ముందు మీరొకసారి మీ సాధారణ ఆరోగ్యం ఎలా ఉందన్న విషయాన్ని జనరల్ ఫిజిషియన్‌ను కలిసి తెలుసుకోవండి. మీకు డయాబెటిస్ వంటి ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోండి. దాంతో చాలా వరకు సమస్య తగ్గుతుంది. ఈలోగా మీరు ఆహారం తీసుకున్న ప్రతిసారీ నోటిని బాగా పుక్కిలించడంతోపాటు టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవడం, మౌత్ వాష్లను ఉపయోగించడం వల్ల కొంతవరకు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా మీరు డెంటిస్ట్‌ను కలిసి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం మంచిది. నేను బీటెక్ చివరి సంవత్సరంలో ఉన్నాను. ఇటీవల నాకు దవడ చివరన కొత్తగా పళ్లు రావడం గమనించాను. అవి అప్పటికే ఉన్న పళ్లపై వస్తున్నాయి. దాంతో అక్కడ రక్తం రావడంతో పాటు, తినడం ఇబ్బందిగా మారుతోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సందీప్, హైదరాబాద్ మీరు చెబుతున్న దాన్ని బట్టి మీకు జ్ఞానదంతాలు వస్తుండవచ్చు. సాధారణంగా జ్ఞానదంతాలు యుక్తవయసు దాటాక వస్తుంటాయి. అయితే కొందరిలో కొన్నిసార్లు అప్పటికే దవడపై ఉన్న స్థలాన్ని మిగతా పళ్లు ఆక్రమించడం వల్ల ఇలా పంటిపైనే పన్ను వస్తుంటుంది. లేదా ఎముకలోనే ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు సాధ్యంగాక మీరు చెబుతున్న ఇబ్బందుల వంటివి రావచ్చు. అప్పుడు అక్కడ నొప్పిరావడం, రక్తస్రావం జరగడం మామూలే. ఇలాంటి సందర్భాల్లో ఒక చిన్న శస్త్రచికిత్సతో ఆ జ్ఞానదంతాలను తొలగించాల్సి ఉంటుంది. మీరు ఒకసారి డెంటిస్ట్‌ను కలవండి. -
ప్రముఖ శాస్త్రవేత్త వసంత్ కన్నుమూత
పుణే: ప్రముఖ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వసంత్ గోవారికర్(81) శుక్రవారం పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన డెంగ్యూ, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో కన్నుమూసినట్టు ఆస్పత్రి ఐసీయూ ఇన్చార్జ్ డాక్టర్ సమీర్ జోగ్ వెల్లడించారు. ఇస్రోకు సేవలందించిన గోవారికర్.. సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా.. ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు. -
ప్రసవ వేదన
సాక్షి, ఒంగోలు: ప్రజారోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా..పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగానే ఉంటోంది. జనాభా ప్రాతిపదికన ప్రతీ 10 వేల మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలి. కానీ జిల్లాలో ప్రతీ 15 వేల మందికి ఒకరు లేకపోవడం గమనార్హం. వైద్యారోగ్యశాఖకు కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ ద్వారా నిధులు విడుదల చేస్తోంది. జిల్లాకు ఏటా రూ.20 కోట్లు అందుతున్నాయి. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం కోసం పంచాయతీకి రూ.10 వేలు చొప్పున 880 గ్రామాలకు రూ.88 లక్షలు ఖర్చుచేస్తున్నారు. ఎలాంటి ఫలితాలు ఉండటం లేదు. గ్రామాల్లో అపరిశుభ్రత, అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు ఏటా ప్రబలుతూనే ఉన్నాయి. జననీ సురక్ష యోజన (జేఎస్వై), జననీ శిశుసంరక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) కింద గర్భిణులకు కాన్పుల కోసం ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నా.. ఇవి రికార్డులకే పరిమితమవుతున్నాయి. ఇక జిల్లాలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆస్పత్రులు 37 ఉన్నాయి. వీటిపై ఏటా రూ.కోటి వరకు ఖర్చుచేస్తున్నా.. వీటిల్లో కాన్పులు చేసుకునే వారి సంఖ్య ఏటా తగ్గిపోతూనే ఉంది. గణాంకాలు చెబుతున్నదేమిటంటే.. జిల్లా జనాభా 33,92,764 మంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం మంది ప్రజలుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 85 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 550 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 280 మంది వైద్యులకు గాను ప్రస్తుతం 200 మందే ఉన్నారు. 804 గ్రామాల్లో వైద్యసేవలు అందుబాటులో లేవు. ఇక్కడ ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలే దిక్కు. ఉత్సవ విగ్రహాలే.. జిల్లాలో 37 కేంద్రాల్లో గర్భిణులకు ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవి 24 గంటలు సేవలందించాలి. ఇక్కడి కేంద్రాల్లో ఆపరేషన్లు జరగకపోయినా ఏటా కోట్లల్లో ఖర్చులు చూపిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద ఈ ఏడాది రూ.30 కోట్లు రాగా, అధికారులు ఖర్చుచేసింది రూ.25 కోట్లు. వీటి ఖర్చుకు సంబంధించి పీహెచ్‌సీల నుంచి నివేదికలు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మత్తువైద్యులు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది కొరతతో ఆపరేషన్లు జరగడం లేదు. పరికరాలూ అందుబాటులో లేవు. తగ్గని మాతాశిశు మరణాలు మాతాశిశు మరణాలను పూర్తిస్థాయిలో తగ్గిం చేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైద్యఆరోగ్యశాఖ నుంచి ప్రయత్నిస్తున్నాయి. 24 గంటల సీమాంక్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే, ప్రతీ గ్రామపరిధిలో అంగన్వాడీ ఆశవర్కర్తో పాటు ఏఎన్ఎంను నియమించారు. వీరు గ్రామీ ణ ప్రాంతాల్లో తిరిగి గర్భిణుల వివరాలను నమోదుచేసి.. వారికి కాన్పుచేసి ఇంటికి వెళ్లేంత వరకు బాధ్యత తీసుకోవాలి. దీనికోసం ఎన్ఆర్హెచ్ఎం కింద జేఎస్ఎస్కే (జననీ శిశుసంక్షణ కార్యక్రమం), జేఎస్వై (జననీ సురక్షయోజన) పథకాల రూపంలో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా రు. జిల్లాలో మాతాశిశు మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. 2013-14 సంవత్సరంలో మాతృమరణాలు 127, శిశుమరణాలు 39 సంభవించాయి. గడచిన తొమ్మిది నెలల కాలంలో రెండూ కలిపి సుమారు 200 పైగానే ఉంటాయని వైద్యవర్గాలు పేర్కొనడం గమనార్హం. ప్రైవేటు వైపు ఎందుకు...? ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా, సిజేరియన్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు గుంజుతున్నారు. అయినా ఎక్కువగా ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. దీనికితోడు ఆర్ఎంపీలు ఒక్క కేసును గ్రామం నుంచి పంపితే రోగి ఇచ్చే ఫీజులో 40 శాతం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని సూచిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇందుకు ఒక్కో కేసుకు కొంతమొత్తంలో ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో అనుమతుల్లేని ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నా.. వైద్యారోగ్యశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం దురదృష్టకరం. -
రెండు తరాలకు రక్షణ..!
ఒట్టి మనిషికి ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కరికే జబ్బు. కానీ గర్భవతికి ఇన్ఫెక్షన్ వస్తే అది ఇద్దరు వ్యక్తులకు వచ్చిన రుగ్మతతో సమానం. అందుకే కాబోయే అమ్మకు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటున్నామంటే రెండు తరాలను రక్షిస్తున్నామని అర్థం. కాబట్టే గర్భవతికి వచ్చే ఇన్ఫెక్షన్లు... వాటి నుంచి రక్షించుకునే మార్గాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అలా తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం. గర్భవతికి ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయి? మిగతావారిలాగే గర్భణికీ ఇన్ఫెక్షన్లు పలు మార్గాల నుంచి సోకే అవకాశం ఉంది. ఒక వ్యక్తి నుంచి మరొకరికి, జంతువుల నుంచి, దోమల వంటి కీటకాలు, కలుషితమైన కొన్ని రకాల ఆహారాల వంటి వాటి నుంచి కూడా గర్భిణికి ఇన్ఫెక్షన్లు రావచ్చు. గర్భవతిని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడం ఎందుకు? ఒకవేళ గర్భవతికి ఇన్ఫెక్షన్లు వస్తే సమస్య రెట్టింపు అయినట్లే భావించాలి. ఎందుకంటే అది వారిలో సాధారణ మహిళలతో పోలిస్తే సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. అది కాబోయే తల్లికి ప్రమాదం మాత్రమే కాదు... వారికి చికిత్స చేయడమూ కష్టమే. కేవలం తల్లికి మాత్రమే పరిమితం కాకుండా బిడ్డకూ సంక్రమించవచ్చు. పుట్టిన తర్వాత చిన్నారికీ ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తీసుకురావచ్చు. అందుకే సాధారణ మహిళతో పోలిస్తే ఇన్ఫెక్షన్ల విషయంలో గర్భవతికి రెండింతలు జాగ్రత్త అవసరం. ఏయే ఇన్ఫెక్షన్లు తల్లికీ,బిడ్డకూ సమస్యగా పరిణమిస్తాయి? చాలా రకాల ఇన్ఫెక్షన్లు అటు తల్లికీ, ఇటు బిడ్డకూ... ఇలా ఇరువురికీ సమస్యగా పరిణమించవచ్చు. సాధారణ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే ఇద్దరికీ ప్రమాదకరంగా మారే కొన్ని ఇన్ఫెక్షన్ల జాబితా ఇది. సైటోమెగాలోవైరస్ అనే ఇన్ఫెక్షన్ను సంక్షిప్తంగా ‘సీఎమ్‌వీ’ అని పిలుస్తారు. ఇది సెక్స్, లాలాజలం, మూత్రం, ఇతర శరీర ద్రవపదార్థాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సీఎమ్‌వీ సోకినవారిలో జ్వరం, గొంతు బొంగురుపోవడం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఇతర ఇన్ఫెక్షన్ పచ్చిమాంసాన్ని తిన్నప్పుడు లేదా ఇంట్లో పెంపుడు పిల్లులు ఉండి, వాటి తాలూకు వ్యర్థాలను తీసివేసినప్పుడు రావచ్చు. పర్వోవైరస్ అనే ఇన్ఫెక్షన్ను ఫిఫ్త్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో ముఖంపైనా, ఛాతీమీద, వీపు, భుజాలు, కాళ్లపై ర్యాష్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో కీళ్లనొప్పులు, ఒంటినొప్పులు కనిపిస్తాయి. పర్వోవైరస్ ఉన్నవారి దగ్గరకు వెళ్లివచ్చిన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మీ డాక్టర్ సంప్రదించాలి. లిస్టేరియా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం, చలి, వెన్నునొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది చెడిపోయిన ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఒక్కోసారి మనకు ఆహారం చెడిపోయిందన్న విషయమే తెలియక తీసుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. అందుకే డాక్టర్లు గర్భవతిని పచ్చిపాలు, సాఫ్ట్చీజ్, శాండ్విచ్ వంటి వాటి కోసం పొరలుపొరలుగా కోసిన మాంసం (డెలీ మీట్) వంటివి తీసుకోవద్దని చెబుతారు. గర్భిణి తీసుకోవలసిన / తెలుసుకోవలసిన వ్యాక్సిన్లు ఇవి... ఒక మహిళ తాను గర్భవతినని తెలియగానే తనకు వచ్చే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్ల గురించి, తాను తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఈ వ్యాక్సిన్ల వల్ల గర్భివతికి చాలా తీవ్రంగా పరిణమించగల కొన్ని ఇన్ఫెక్షన్లను ముందుగానే ప్రభావపూర్వకంగా నివారించడం సాధ్యమవుతుంది. పైగా ఆ సమయంలో వీటిని తీసుకోవడం గర్భవతికి పూర్తిగా సురక్షితం కూడా. గర్భిణి తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇవి... ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్ : ఫ్లూ వల్ల గర్భవతిలో జ్వరం, చలిగా ఉండటం, కండరాల నొప్పులు, దగ్గు, గొంతుబొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భవతి విధిగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. సాధారణ ప్రజలు కూడా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే. టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (డీపీటీ) వ్యాక్సిన్ : టెటనస్ వచ్చిన రోగిలో కండరాలు చాలా అసాధారణంగా ప్రవర్తిస్తాయి. డిఫ్తీరియా వస్తే గొంతులోపల వెనక భాగంలో ఒక మందపాటి పొరగా ఏర్పడవచ్చు. ఇలా జరిగినప్పుడు అది శ్వాస సమస్యలకు కారణమవుతుంది. ఇక పెర్టుసిస్ను ‘కోరింత దగ్గు’ అని కూడా పిలుస్తాయి. ఈ మూడు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోడానికి గర్భవతి విధిగా డీపీటీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రతిసారీ గర్భధారణలో మహిళలందరూ తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు... ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాక్సిన్ : గర్భవతులకు ఫ్లూ వ్యాధి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే ప్రతి సీజన్లో మహిళలందరూ దీన్ని తీసుకోవడంతో పాటు, గర్భవతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక గర్భధారణ సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల పిండంపై పడే దుష్ర్పభావం గురించి అధ్యయనాలు లేనప్పటికీ గర్భం ధరించి ఉన్నప్పుడు తీసుకుంటే బిడ్డ పుట్టాక మొదటి ఆర్నెల్లపాటూ చిన్నారికీ అది రక్షణ ఇస్తుందని ఒక ఊహ. ఇక ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ముక్కుతో పీల్చడం ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ తరహా ముక్కుతో పీల్చే వ్యాక్సిన్‌ను లైవ్వైరస్తో తయారు చేస్తారు కాబట్టి గర్భవతులు మాత్రం ఈ తరహా పీల్చే వ్యాక్సిన్‌ను వాడకూడదు. టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (డీపీటీ) వ్యాక్సిన్ : టీ డాప్ అంటూ సంక్షిప్తంగా పిలిచే ఈ వ్యాక్సిన్‌ను గర్భధారణ జరిగిన ప్రతిసారీ తీసుకోవాలి. దీన్ని గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు తీసుకోవాలి. ఇక 27వ వారం నుంచి 36వ వారం మధ్యలో తీసుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల పుట్టిన చిన్నారికి కూడా ఆయా వ్యాధుల నుంచి కొంతకాలం పాటు రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లను తప్పించు కోవడానికి ఏ జాగ్రత్తలు పాటించాలి? ఇన్ఫెక్షన్లు వచ్చే పలు మార్గాల గురించి అవగాహన పెంచుకుంటే వాటిని రాకుండానే నివారించుకునే అవకాశం ఎక్కువ. గర్భవతి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి... తరచూ చేతులు కడుక్కుంటూ ఉండాలి. ముఖ్యంగా వంట చేసే ముందు, బాత్రూమ్ నుంచి బయటికి వచ్చాక, డయాపర్స్ మార్చాక, తోటపని చేశాక, చెత్త లేదా జంతువుల వ్యర్థాలను తాకిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. బట్టలను ఉతికిన తర్వాత, పెంపుడు జంతువులను తాకాక, చిన్నపిల్లల ఆటవస్తువులను స్పర్శించాక తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. స్నేహితులతో ఆహారాలను కలిసి తీసుకునే సమయంలో ఎంగిలి పదార్థాలను తీసుకోకూడదు. గర్భవతి తన ప్లేట్లు, పాత్రలు, స్పూన్ల వంటి ఉపకరణాలను వేరుగా ఉంచుకోవడమే మేలు. ఆహారం కలుషితం కాకుండా చూసుకుంటూ పరిశుభ్రమైన వాటినే తీసుకోవాలి. దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఒళ్లంతా కప్పేలా దుస్తులు ధరించడం మేలు. బగ్ స్ప్రేలను ఉపయోగించవచ్చు. అయితే వాటి ఘాటైన వాసన పోయే వరకు ఆ గది నుంచి దూరంగా ఉండాలి. వాసన ఘాటు తగ్గాకే గదిలోకి వెళ్లాలి. సెక్స్ సమయంలో తప్పనిసరిగా జీవిత భాగస్వామి కండోమ్ వాడేలా చూసుకోవాలి. ఎందుకంటే అతడినుంచి గర్భవతికి ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. దూరప్రాంతాలకు, ఇతర దేశాలకు ప్రయాణం చేసే సమయంలో ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాపించి లేవని నమ్మకంగా తెలిశాకే ప్రయాణం పెట్టుకోవాలి. ఎలుకల నుంచి ఎంత దూరం ఉంటే అంత మేలు. వృత్తిపరంగానూ / పిల్లలతోనూ జాగ్రత్త వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) : గర్భం ధరించాక మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తి నుంచి వ్యక్తికి సాంక్రమిక ఇన్ఫెక్షన్లు వ్యాపించవచ్చు కాబట్టి... ముద్దుపెట్టడం, సెక్స్‌లో పాల్గొనడం వంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిపరంగా వైద్యులు లేదా వ్యక్తుల రక్తం లేదా శరీర ద్రవపదార్థాలతో (లాలాజలం, మూత్రం వంటివి) డీల్ చేసే నర్సుల వంటి వృత్తుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ ద్రవపదార్థాలను కళ్లకు, ముక్కుకు, నోటికి సోకకుండా జాగరూకత వహించాలి. ఇలాంటి సందర్భాల్లో గ్లౌవ్స్ ధరించడం, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఆహారం, పానీయాలను షేర్ చేసుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తమకు మరో చిన్న బిడ్డగానీ లేదా స్కూల్‌కు వెళ్లే వయసు పిల్లలు గానీ ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తమ ఒక్కరికే కాకుండా పిల్లలనూ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడినవారవుతారు. ఇక ఈ పిల్లలు స్కూల్ నుంచి/బయటి నుంచి రాగానే తమను తాకకుండా చూసుకోవాలి. వాళ్లు కాళ్లూ చేతులు కడుక్కుని వచ్చాకే దగ్గరికి రానివ్వాలి. ఎందుకంటే స్కూల్/డేకేర్ సెంటర్స్/ఆటస్థలాలనుంచి రాగానే వాళ్ల చేతుల్లో హానికరమైన ఇన్ఫెక్షన్ను కలిగించే కారకాలు (ఉదా: సైటోమెగాలోవైరస్ వంటివి) ఉండవచ్చు. ఇవి చిన్నపిల్లల్లో దగ్గరే ఎక్కువ కాబట్టే ఈ జాగ్రత్త. ఇంట్లో పెంపుడు పిల్లులు ఉంటే వాటి వ్యర్థాలను తాకకూడదు. ఒకవేళ తాకాల్సి వస్తే తప్పనిసరిగా గ్లౌవ్స్ ధరించాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గర్భవతికి ఇతర ఇన్ఫెక్షన్లు ఉంటే... గ్రూప్-బి స్ట్రెప్టోకాకస్ : చాలామంది మహిళలకు ఈ గ్రూప్-బి స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా అవి పుట్టిన చిన్నారికి సోకే అవకాశం ఉంది. దాంతో నవజాతశిశువుకు అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అందుకే ప్రసవం అయ్యే కొద్దివారాల ముందు డాక్టర్లు గర్భవతికి ఈ బ్యాక్టీరియా ఉందా, లేదా అని పరీక్ష చేస్తారు. ఇకవేళ ఉంటే ప్రసవానికి ముందరే తగిన యాంటీబయాటిక్స్ వాడతారు. జెటెనల్ హెర్పిస్: కొంతమంది మహిళలకు తమ మర్మావయవాల వద్ద హెర్పిస్ ఉంటే బిడ్డ పుట్టే సమయంలో అది పాపాయికీ సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి మర్మావయవాల వద్ద చీరుకుపోయినట్లుగా (హెర్పిస్ ఉన్నట్లు) అనుమానిస్తే డాక్టర్ ఈ విషయాన్ని చెప్పాలి. అప్పుడు డాక్టర్ ప్రసవానికి ముందే కొన్ని మందులు ఇచ్చి ప్రసవ సమయంలో గర్భవతికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూస్తారు. హెచ్ఐవీ: ఒకవేళ కాబోయే తల్లికి హెచ్ఐవీ ఉంటే అది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి హెచ్ఐవీ ఉన్నట్లు తెలిస్తే తప్పనిసరిగా డాక్టర్ ఆధ్వర్యంలో మందులు వాడాల్సి ఉంటుంది. దీంతో తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకే అవకాశాన్ని గణనీయంగా తగ్గించే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యగమనిక: ఇంట్లో గర్భవతి మాత్రమే గాక... మిగతా కుటుంబ సభ్యులంతా ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలో అవన్నీ తగిన సమయానికి తీసుకోవాలి. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటే గర్భవతికీ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు చాలా తక్కువ. చేతులు కడుక్కోవడం ఎలా? ఆరోగ్యకరమైన రీతిలో చేతులు కడుక్కోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి... సబ్బు రాసుకున్న తర్వాత మీ చేతులు రెండింటినీ ఒకదానికొకటి కనీసం 15 నుంచి 30 సెకన్ల పాటు రుద్దుకుంటూ ఉండాలి. చేతుల్ని సబ్బుతో శుభ్రపరచుకునే సమయంలో మీ మణికట్టు వరకూ శుభ్రపడేలా చూసుకోవాలి. దాంతోపాటు మీ గోళ్లు, వేళ్ల మధ్యన ఎలాంటి మురికీ లేకుండా శుభ్రమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. రెండు అరచేతులనూ నురగ వచ్చేలా సబ్బుతో రుద్దుకోవాలి. చేతులు కడుక్కున్న తర్వాత విధిగా టవల్‌తో చేతుల్ని పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. చేతులు కడుక్కోవడానికి ఆల్కహాల్ ఉండే జెల్ అయితే మంచిది. ఇది సూక్ష్మజీవులన్నింటినీ తొలగించేలా చేతుల్ని శుభ్రపరుస్తుంది. ఇప్పుడు ఈ తరహా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్‌వాష్‌లు మీ హ్యాండ్‌బ్యాగ్‌లో పట్టేంత సైజుల్లోనూ లభ్యమవుతున్నాయి. వీటిని ఎప్పుడూ దగ్గరుంచుకోవాలి. ఒకవేళ చేతులు దుమ్ముతో మురికిపట్టినప్పుడు మాత్రం మురికిపోయేలా సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు అవి ఆనే చోట్లు... డోర్నాబ్స్, కాలింగ్బెల్స్ వంటి ప్రదేశాలూ శుభ్రంగా ఉంచుకోవాలి. కీటకాలతో జాగ్రత్త చాలారకాలైన ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు డెంగ్యూ, మలేరియా వంటివి దోమల నుంచి వ్యాప్తిచెందుతాయి. అందుకే గర్భవతులు దోమకాటు నుంచి తమను తాము రక్షించుకుంటూ ఉండాలి. దీనికోసం ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు వాడటం మేలు. ఇక ఇంట్లో ఉన్నప్పుడు దోమతెరలు వాడాలి. బయటికి వెళ్తున్నప్పుడు ‘డీట్’ ఆధారిత కీటక నాశనుల(ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్)ను వాడాలి. ఇటీవల ఈ ‘డీట్’ ఆధారిత కీటక నాశనులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ ‘డీట్’ ఆధారిత ఉత్పాదనలలో 10 నుంచి 35 శాతం ‘డీట్’ ఉన్న కీటక నాశనులు లభ్యమవుతున్నాయి. డాక్టర్ సిఫార్సు మేరకు వాటిని తీసుకుని వాడితే వాటి వల్ల గర్భవతులకు గాని / పాలిచ్చే తల్లులకు గాని ఎలాంటి ప్రమాదం ఉండదు (డీట్ అంటే... ఎన్ ఎన్ డై ఇథైల్ మెటా టాల్వమైడ్ అనే రసాయనానికి సంక్షిప్త రూపం. పసుపురంగులో చిక్కటి ద్రవంలా ఉండే దీన్ని రాసుకుంటే ఇది వ్యక్తులకు హాని కలిగించకుండా కీటకాలను దూరం చేస్తుంది). వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? వాస్తవానికి వ్యాక్సిన్‌లో నిర్వీర్యం చేసిన రోగ కారక క్రిమి గానీ లేదా చనిపోయిన రోగ కారక క్రిమి ఉంటుంది. దీన్ని ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో ప్రవేశపెట్టడం వల్ల రోగ కారక క్రిమిని ఎదుర్కోడానికి తగిన వ్యాధినిరోధకత శరీరంలో పుడుతుంది. మన శరీరంలోకి ప్రవేశపెట్టిన నిర్వీర్యమైన/చనిపోయిన క్రిమి ఎలాగూ జబ్బును కలగజేయదు. పైగా దీన్ని ప్రవేశపెట్టగానే దాంతో పోరాడే యాంటీబాడీలు మన శరీరంలో పుడతాయి. ఒకసారి ఆవిర్భవించిన ఆ యాంటీబాడీలు వ్యాధి కారకాన్ని గుర్తుంచుకుని, మళ్లీ అవి ఎప్పుడు శరీరంలో ప్రవేశించినా, దాన్ని ఎదుర్కొంటాయి. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిని తాను తీసుకున్న వ్యాధి వ్యాక్సిన్ కారణంగా సదరు జబ్బు నుంచి రక్షణ కలుగుతుందన్నమాట. ఇవ్వకూడని వ్యాక్సిన్ జోస్టర్ వ్యాక్సిన్‌ను గర్భవతికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది జీవించి ఉండే వైరస్‌తో తయారు చేసే వ్యాక్సిన్ కాబట్టి. సాధారణంగా దీన్ని 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి సిఫార్సు చేస్తుంటారు. ఆ సమయానికి గర్భధారణ వయసు ఎలాగూ మించిపోతుంది కాబట్టి దీని ప్రభావం గర్భధారణపై ఉండటానికి సాధారణంగా ఆస్కారం ఉండదు. గర్భం దాల్చడానికి ముందుగానే ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలి? గర్భం ధరించడానికి సిద్ధమవుతున్న మహిళలు తాము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోగానే కొన్ని వ్యాక్సిన్లను విధిగా తీసుకోవాలి. అవి... మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్లు. గర్భం దాల్చిన తర్వాత ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం గర్భవతికి ప్రమాదం. ఒకవేళ వ్యాధి నిరోధకత అంతగా లేని గర్భవతికి ఈ ఇన్ఫెక్షన్లు సోకితే అది చాలా ప్రమాదకరంగా పరిణమించేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీటిని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకన్నప్పుడు ఇంకా గర్భం దాల్చకముందరే తీసుకోవడం మేలు. ఒకవేళ మీజిల్స్, మంప్స్, రుబెల్లా (ఎమ్ఎమ్ఆర్): ఈ వ్యాక్సిన్ చిన్నప్పుడే రొటిన్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్నారా లేదా అనే సందేహం ఉంటే మీ డాక్టర్‌తో చెప్పాలి. అప్పుడు వారు ఒక రక్తపరీక్ష ద్వారా మీరు ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారా, లేదా అన్నది నిర్ధారణ చేస్తారు. దాన్ని బట్టి అవసరమైతే ఆ వ్యాక్సిన్ ఇస్తారు. ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకోని మహిళలకు గర్భం దాల్చాక అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో గనక ఆ వ్యాధులు సోకితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇక రుబెల్లా వైరస్ గనక అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో సోకితే అది బిడ్డలో పుట్టుకతోనే వచ్చే తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. రుబెల్లా వైరస్ సోకవడం వల్ల పుట్టిన బిడ్డలకు వినికిడి సమస్యలు, కళ్లు, గుండె, మెదడు సమస్యల వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. వారిసెల్లా (చికెన్‌పాక్స్) వైరస్: ఈ గర్భవతికి సోకడం వల్ల (ముఖ్యంగా అర్లీ ప్రెగ్నెన్సీలో) బిడ్డలో పుట్టుకతోనే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా గర్భిణి గతంలోనే చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి గర్భం ధరించాలనుకునే వారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందరే ఈ పరీక్ష చేయించుకుని, ఒకవేళ చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉండకపోతే గర్భం దాల్చడానికి నెల రోజుల ముందే దాన్ని తీసుకోవడం మేలు. హ్యూమన్ పాపిలోమా వైరస్: హెచ్‌పీవీ అని సంక్షిప్తంగా పిలిచే ఈ వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదో ఏటి నుంచి 26 ఏళ్ల వయసు మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే గర్భం దాల్చకముందే దీన్ని తీసుకోవాలి. కొందరు గర్భవతులు నిర్దిష్టంగా వాడాల్సిన వ్యాక్సిన్లు కొంతమంది గర్భవతులకు కొన్ని అంశాల నుంచి ఎక్కువ ప్రమాదం (హైరిస్క్) ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరంగా దూరప్రయాణాలు చేయాల్సిన వారు ఈ గ్రూపునకు చెందుతారు. ఇలాంటి వారు వారి పరిస్థితికి అనుగుణంగా మరికొన్ని అదనపు వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన ఉంటుంది. అవి... హెపటైటిస్ బి వ్యాక్సిన్ : హెపటైటిస్ బి వైరస్ చాలా తీవ్రమైనది. ఇది కాలేయానికి ఇన్ఫ్లమేషన్ కలగజేస్తుంది. అందుకే దీన్ని నివారించడానికి ఇప్పుడు బిడ్డ చిన్నతనంలోనే వరసగా మూడు మోతాదుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ వ్యాక్సిన్ తీసుకోని వారు చాలామందే ఉన్నారు. ఇలా వ్యాక్సిన్ తీసుకోని గర్భవతులు తప్పనిసరిగా దీన్ని తీసుకోవాలి. న్యూమోకాకస్ వ్యాక్సిన్ : న్యూమోకాక్సీ అనేది ఒక రకం బ్యాక్టీరియా. దీని వల్ల నిమోనియాతో పాటు మరెన్నో ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఉదాహరణకు ఒటైటిస్ (చెవి ఇన్ఫెక్షన్స్), మెనింజైటిస్ (మెదడువాపు) వంటివి. కొందరు హైరిస్క్ మహిళలకు న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఈ వ్యాక్సిన్ వాడాలి. ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ : ఇది దోమల ద్వారా వ్యాపించే ఒక రకం వైరల్ జ్వరం. మన దేశంలో లేకపోయినా ఈ వ్యాధి దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని సహారా ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉంది. గర్భధారణ సమయంలో వృత్తిపరంగా ఆయా దేశాలకు వెళ్లాల్సి వస్తే, వీలైతే ఆ ప్రయాణాలను మానుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా దేశాలకు వెళ్లాల్సిన మహిళలు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇందుకోసం సాంక్రమిక వ్యాధుల (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)కు చికిత్స చేసే నిపుణుల ఆధ్వర్యంలో తీసుకోవడం మంచిది. ఇతర ఇమ్యూనైజేషన్ ప్రక్రియలు : పైన పేర్కొన్న వ్యాక్సిన్లతో పాటు పరిస్థితులను బట్టి, వారి వారి వ్యక్తిగత వృత్తి వ్యవహారాలను బట్టి మరికొన్ని ఇతర వ్యాక్సిన్లను తీసుకోవడం కూడా అవసరం కావచ్చు. ఉదాహరణకు కలరా, మెనింగోకోకస్, రేబీస్, జపనీస్ ఎన్కెఫలైటిస్, టైఫాయిడ్, హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా బీ వంటి వ్యాక్సిన్లు. మీ గురించి పూర్తిగా తెలిసిన మీ డాక్టర్ మీ వ్యక్తిగత, వృత్తిగత అవసరాలను బట్టి ఆయా వ్యాక్సిన్లు మీకు అవసరమో, కాదో నిర్ణయించి, అవి మీకు ఇస్తారు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
‘ఎబోలా’పై అప్రమత్తం
సాక్షి, ముంబై : ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ డిసీజ్ (ఈవీడీ)పై బీఎంసీ అప్రమత్తమైంది. అసాధారణమైన ఈ వ్యాధి ఆఫ్రికాలోప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఇటీవల ప్రకటించడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందుకు అవసరమైన చర్యలు తీసుకొంటోంది. వైరస్‌ను ఎదుర్కోవడానికి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఒక వేళ ఈ వైరస్‌ను నగరంలో గుర్తిస్తే తీసుకోవాల్సిన చర్యలపై బీఎంసీ కసరత్తు చేస్తోంది. ఎయిర్‌పోర్టు అధికారులకు అవగాహన అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రయాణికులు ఎవరైనా ఈ వైరస్‌ను మోసుకొస్తున్నారా అనే అంశంపై కూడా బీకేసీ ఆరోగ్య విభాగం ఆరా తీస్తోంది. ఎయిర్ పోర్టులోని అతి ముఖ్యమైన విభాగాలకుఈవైరస్‌పై సంబంధిత అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఈ వైరస్ సోకిన వారిని సున్నితంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని వివరిస్తారు. వెస్ట్ ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల కాలంలో ఎంత మంది ప్రయాణికులు వచ్చారో, వారి వివరాలను అందజేయాలని బీఎంసీ ఎయిర్ పోర్ట్ అధికారులకు లేఖ రాసింది. 20 రోజులల్లోపు ఇక్కడికి వచ్చిన ప్రయాణికుల వివరాలను అందజేయాలని కోరింది. ఈ ప్రయాణికులకు వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరీక్షించనున్నారు. వ్యాధి సోకితే వీరికి చికిత్స కూడా నిర్వహించనున్నారు. గుర్తించిన ఆస్పత్రులు కేం, సైన్, బీవైఎల్ నైర్ ఆస్పత్రి వైద్య సిబ్బందికి... ఈ వైరస్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వ్యాధి బాధితులకు చికిత్స అందజేయడానికి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కొత్త జోగేశ్వరి ట్రామా ఆస్పత్రి, చించ్పోక్లీలోని కస్తూర్బా ఆస్పత్రులను కార్పొరేషన్ గుర్తించింది. ఈ వ్యాధి అనుమానితులను జోగేశ్వరి ఆస్పత్రికి తరలిస్తారు, వ్యాధి నిర్ధాణ అయిన కేసులను కస్తూర్బా ఆస్పత్రికి తరలించనున్నట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఏవీడీ కోసం 10 బెడ్లను రిజర్వ్ చేసి ఉంచామన్నారు. ఆందోళన అవసరం లేదు: డాక్టర్ పద్మజ ఎబోలా వైరస్ పట్ల నగరానికి ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని కార్పొరేషన్ ప్రకటించింది. నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎంసీ ఎగ్జిక్యూటివ్ వైద్యాధికారి డాక్టర్ పద్మజ కేత్కర్ పేర్కొన్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా తగు చర్యలు తీసుకొంటున్నారన్నారు. ముంబైలో కూడా మందస్తు చర్యలు తీసుకొంటున్నామని వెల్లడించారు. సమీప రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు నమోదుకాలేదన్నారు. -
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి స్వల్ప అస్వస్థత
విశాఖపట్నం, మెడికల్ : పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి చేరారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ఆమె జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఆమెను గురువారం చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మకుమారి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కర్ణంనాయుడు, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, జి.మాడుగుల, పాడేరులకు చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు పరామర్శించారు. -
డేంజరస్ హెపటైటిస్...
‘‘పునరాలోచించండి...’’ ఇదీ ఈ ఏడాది ప్రపంచ హెపటైటిస్ డే థీమ్‌గా నిర్ణయించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) దాని అనుబంధంగా ఆరోగ్య రంగంలో పనిచేసే అనేక రంగాలకు చెందిన నిపుణులు. హెపటైటిస్ గురించి పునరాలోచించాలంటూ వీళ్లంతా అన్ని దేశాల ప్రభుత్వాలనూ, విధాన నిర్ణేతలనూ, ఆరోగ్య కార్యకర్తలనూ, చికిత్సారంగ నిపుణులనూ ఎందుకు కోరుతున్నారు? ఎందుకంటే... హెపటైటిస్ చడీచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ప్రాణం తీసుకోగలదు. ప్రపంచ జనాభాలో చాలామంది హెపటైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ, అది తమకు ఉన్నట్లే తెలియదు. అందుకే ఈ థీమ్ అవసరం ఏర్పడింది. హెపటైటిస్పై సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం... హెపటైటిస్ అంటే... నిజానికి హెపటైటిస్ అనేది ఒక జబ్బు కాదు. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్ ఏ; బి; సి; డి; ఈ అనే ఐదు రకాల హెపటైటిస్‌లు కోట్లాది మంది ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. పై ఇన్ఫెక్షన్లలో దేనికైనా గురైన వారికి దీర్ఘకాలంలో క్రమంగా కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్ వ్యాధితో ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటీ యాభై లక్షల మంది మరణిస్తున్నారు. హెపటైటిస్ అన్న పదం గ్రీకు నుంచి వచ్చింది. ఈ పదంలోని మొదటిభాగం ‘హెపార్ స్టెమ్ ఆఫ్ హిప్యాట్’... అంటే కాలేయం అనీ, ‘ఐటిస్’ అంటే ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) అని అర్థం. A- హెపటైటిస్ చాలా సందర్భాల్లో ఈ వ్యాధి ఉన్నవారికి (ముఖ్యంగా యుక్తవయస్కుల్లో) బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొందరిలో లక్షణాలు కనిపించవచ్చు. ఇలా వ్యాధి సోకిన నాటి నుంచి లక్షణాలు బయటకు కనిపించడానికి రెండు నుంచి ఆరు వారాలు పట్టవచ్చు. ఇక లక్షణాలు కనిపించేవారిలో వికారం, వాంతులు, కామెర్లతో ఇది బయటపడుతుంది. ఇది సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధి కాదు. చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇది సంభవించిన ఒక శాతం మందిలో ఇది మరణానికి దారితీస్తుంది. వ్యాప్తి ఇలా: ఇది కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాప్తిచెందుతుంది. మలవ్యర్థాలు తాగు నీటితో కలవడం వల్ల కలుషితమైనా లేదా ఆ నీటితో పదార్థాలు తయారు చేయడం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. అంటే సురక్షితం కాని నీరు, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. తీవ్రత: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కోటీ నలభై లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. లక్షణాలు: హెపటైటిస్- ఏ తీవ్రత స్వల్పం మొదలుకొని తీవ్రం వరకు ఉండవచ్చు. ఈ వైరస్ ఉన్నవారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, కడుపులో ఇబ్బంది, మూత్రం పచ్చగా రావడం, కామెర్లు (చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుగా మారడం) కనిపించవచ్చు. అందరిలోనూ అన్ని లక్షణాలూ ఉండకపోవచ్చు. నిర్ధారణ: హెపటైటిస్- ఏ ను కేవలం బయటి లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ వైరస్‌ను నిర్ధారణ చేసే ప్రత్యేక రక్తపరీక్ష ఆధారంగా యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. దీనితో పాటు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) అనే మరో అదనపు పరీక్ష కూడా ఈ వైరస్ నిర్ధారణ కోసం చేసేదే. ప్రత్యేకమైన ల్యాబ్‌లలో ఈ పరీక్ష ద్వారా ఈ వైరస్ తాలూకు ఆర్ఎన్ఏను గుర్తించడం ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. చికిత్స: ఈ వ్యాధి చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే కాలేయానికి భారం పడని విధంగా తేలికపాటి ఆహారం, లక్షణాలను బట్టి చేసే చికిత్సలు (సింప్టమాటిక్ ట్రీట్మెంట్స్) చేస్తే చాలు. లక్షణాలు తగ్గడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒక్కోసారి వారాలు మొదలుకొని నెలలు కూడా పట్టవచ్చు. నివారణ: సురక్షితమైన, పరిశుభ్రమైన నీరు తాగడం / వాడటం ఆరుబయట మల విసర్జన లాంటి అలవాట్లు మానుకుని, మలం బయటకు కనిపించని విధంగా కట్టించిన టాయెలెట్లలోనే మలవిసర్జన చేయడం (దీని వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు తగ్గుతాయి). వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం (అంటే భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత పరిశుభ్రంగా కాళ్లూ,చేతులు కడుక్కోవడం వంటివి). వ్యాక్సిన్: హెపటైటిస్-ఏ కు చాలారకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ ఏదైనప్పటికీ అవన్నీ ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పించే విధానం మాత్రం ఒకటే. అయితే ఏడాది లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి లేదు. కేవలం ఒక్క మోతాదు వ్యాక్సిన్‌తో నెల రోజుల్లోనే ఈ వ్యాధి పట్ల నూరు శాతం భద్రత ఒనగూరుతుంది. B- హెపటైటిస్ ఇది హైపటైటిస్లోని అన్ని వైరస్లలోనూ అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి ఏటా రెండు బిలియన్ ప్రజల్లో వారికి తెలియకుండానే ఈ వైరస్ ఉంది. 35 కోట్ల మందిలో ఇది దీర్ఘకాలిక వ్యాధి (క్రానిక్)గా మారి వేధిస్తోంది. వ్యాప్తి ఇలా: ఇది ఎంత చురుకైనదంటే... సూదిపోటు ద్వారా వ్యాపించడం అనే ఒక్క అంశంలోనే హెచ్ఐవీతో పోలిస్తే దాదాపు 50 నుంచి 100 రెట్లు వేగంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ప్రతి ఏటా దాదాపు 7,80,000 మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ఇది ప్రధానంగా మూడు రకాలుగా వ్యాపిస్తుంది. గర్భవతి వ్యాధిగ్రస్తురాలైతే... తల్లి నుంచి బిడ్డకూ సోకుతుంది. లేదా మరీ నెలల పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది సెక్స్ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఇక ఒకరు వాడిన ఇంజెక్షన్ సూది మరొకరు వాడటం వల్ల ఇది వ్యాపిస్తుంది. అలాగే సరైన పరిశుభ్రత పాటించకుండా వేసుకునే పచ్చబొట్టు పరికరాల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఎంత ప్రమాదకరమైనదంటే.. : హెచ్ఐవీ వైరస్‌ను మానవ శరీరం నుంచి వేరు చేయగానే కొద్ది క్షణాల్లోనే అది మరణిస్తుంది. కానీ హెపటైటిస్-బి వైరస్ వ్యక్తి శరీరం బయటకు వచ్చాక కూడా కనీసం ఏడురోజుల పాటు సజీవంగా ఉండగలదు. అందుకే దీని వ్యాప్తి చాలా వేగవంతం, తీవ్రం. వ్యాక్సిన్ వేయని వ్యక్తిని రక్తమార్పిడి వల్లనో, సెక్స్ వల్లనో లేదా సూదిపోటు వల్లనో వ్యాపించడం జరిగితే అది అతి వేగంగా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక దాదాపు 30 నుంచి 180 రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. అంటే సగటున 75 రోజుల్లో బయటపడవచ్చు. లక్షణాలు: వ్యాధి సోకిన కొందరిలో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం కామెర్లు, మూత్రం చాలా పచ్చగా రావడం, తీవ్రమైన అలసట, నీరసం, వికారం, వాంతులు, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వైరస్ దీర్ఘకాలంగా కాలేయంపై ప్రభావం చూపితే అది సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌గా పరిణమించవచ్చు. అయితే అదృష్టవశాత్తు 90 శాతం మంది యువకుల్లో ఇది ఆర్నెల్లలో దానంతట అదే తగ్గిపోవచ్చు కూడా. నిర్ధారణ: చాలా సాధారణ రక్త పరీక్షతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ఇదే పరీక్షతో రక్తంలో వైరస్ తీవ్రతనూ తెలుసుకరోవచ్చు. చికిత్స: దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. కేవలం సమతుల ఆహారం ఇస్తూ రోగిని సౌకర్యవంతంగా ఉంచడం, తరచూ ఎదురయ్యే లక్షణాలను తగ్గించే మందులు ఇవ్వడం (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) మాత్రమే ఈ వ్యాధి ఉన్నవారికి చేయగల చికిత్స. ఈ వ్యాధి ఉన్న రోగుల్లో కాలేయంపై దాని ప్రభావ తీవ్రతను బట్టి ఇంటర్ఫెరాన్, యాంటీవైరల్ ఏజెంట్స్ వంటి మందులు ఇస్తారు. ఒకవేళ దీని కారణంగా కాలేయ క్యాన్సర్ వస్తే... దాన్ని చాలా త్వరితంగా గుర్తించినప్పుడు క్యాన్సర్‌కు గురైన భాగం వరకు తొలగించవచ్చు. నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఈ వ్యాక్సి పిల్లలకు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. ఇక చిన్నప్పుడు వ్యాక్సిన్ ఇవ్వని 18 ఏళ్ల లోపు వారికి (ఆ ప్రాంతంలో హెపటైటిస్-బి వ్యాప్తిని గుర్తిస్తే) వ్యాక్సిన్ ఇప్పించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. దీనితోపాటు రిస్క్ గ్రూప్‌లో ఉన్నవారు అంటే... చికిత్సారంగంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, డయాలసిస్ పేషెంట్స్, ఇంజెక్షన్స్ చేయించుకునే వారు, సెక్స్వర్కర్స్, ఒకరి కంటే ఎక్కువగా సెక్స్ భాగస్వాములు ఉన్నవారు, దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. C - హెపటైటిస్ ఇది చాలామందిలో, చాలావరకు దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫెక్షన్. కానీ కొద్దిమందిలో ఇది స్వల్పకాలిక ఇన్ఫెక్షన్గా కూడా ఉండవచ్చు. ఇది సోకిన వారిలో 15% నుంచి 45% మందిలో ఆర్నెల్లలో వ్యాధి దానంతట అదే ఆకస్మికంగా తగ్గిపోతుంది. మిగతా 55% నుంచి 85% మందిలో అది దీర్ఘకాలిక హెపటైటిస్- సి ఇన్ఫెక్షన్గా పరిణమిస్తుంది. అయితే ఈ వ్యాధి వల్ల లివర్ సిర్రోసిస్ వచ్చేందుకు చాలా ఎక్కువ కాలం పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న 15% నుంచి 30% మందిలో ఇది సిర్రోసిస్‌గా పరిణమించడానికి 20 ఏళ్లు కూడా పడుతుంది. వ్యాప్తి ఇలా: ఇది సరిగా స్టెరిలైజ్ చేయకుండా వాడే వైద్య పరికరాలతో ముఖ్యంగా ఒకరు వాడిన ఇంజెక్షన్ సూదులను మరొకరు వాడటం వల్ల వ్యాప్తి చెందుతుంది. సెక్స్ వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. గర్భవతికి ఇది ఉంటే బిడ్డకూ వచ్చే ప్రమాదం ఉంది. లక్షణాలు: వైరస్ సోకాక లక్షణాలు బయటపడటానికి రెండు వారాల నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. 80 శాతం మందిలో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. కానీ కొందరిలో జ్వరం, నీరసం/అలసట, ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, మలం నల్లరంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: లక్షణాలు బయటకు కనిపించని కారణంగా సోకిన తర్వాత తొలి దశల్లోనే దీన్ని గుర్తించడం అరుదుగా జరుగుతుంది. అందుకే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా పరిణమించినవారిలో అది కాలేయాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేశాకే బయటపడుతుంది. దీని నిర్ధారణ ప్రక్రియల్లో భాగంగా రక్తపరీక్షతో సీరలాజికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్‌ను గుర్తించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ఫలితం పాజిటివ్ అని వస్తే అప్పుడు మరో వైద్య పరీక్ష చేస్తారు. ఇందులో హెచ్‌సీవీ ఆర్ఎన్ఏ ను గుర్తించడానికి ఒక న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష చేస్తారు. ఇది పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్ష. ఇది చేయాల్సిన అవసరం ఏమిటంటే... దాదాపు 15 శాతం నుంచి 45 శాతం మందిలో ఈ వ్యాధి సోకి దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి వారికి యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్ పరీక్ష చేస్తే అది పాజిటివ్ అని వస్తుంది. కాబట్టి అసలు వ్యాధి ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఆర్ఎన్ఏ ని గుర్తించే న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష అవసరం. ఇక రోగికి హెపటైటిస్-సి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది కాలేయాన్ని ఏ మేరకు ప్రభావితం చేసింది (ఫైబ్రోసిస్ / సిర్రోసిస్) అన్న అంశాన్ని తెలుసుకునే పరీక్ష చేస్తారు. ఇందుకోసం కొందరిలో బయాప్సీ లేదా మరికొందరిలో ఇతర మార్గాలను అనుసరిస్తారు. దీనితో పాటు కొన్ని ల్యాబ్ పరీక్షలూ అవసరమే. ఎందుకంటే వైరల్లోడ్ ఎంత ఉందో తెలుసుకోవడంతో పాటు ఈ వైరస్‌లోనే ఆరు రకాల జీనోటైప్లు ఉంటాయి. ఒక జీనోటైప్ వైరస్‌కు ఇచ్చే చికిత్స మరో జీనోటైప్కు పనిచేయదు. కాబట్టి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అది నిర్దిష్టంగా ఏ జీనోటైప్ అన్నది తెలుసుకోవడం చికిత్స కోసం చాలా అవసరం. దీని ఆధారంగానే చేయాల్సిన చికిత్సనూ, వ్యాధిని అదుపులో ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలనూ నిర్ణయిస్తారు. నివారణ: ఇప్పటివరకూ హెపటైటిస్-సి కి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి వ్యాపించే మార్గాలను తెలుసుకుని, వాటినుంచి దూరంగా ఉండటమే మంచి నివారణ చర్య. కొన్ని సమర్థమైన నివారణ చర్యలివే.... చేతులు శుభ్రంగా ఉంచుకోవడం; చికిత్సారంగంలో ఉన్నవారు సర్జికల్ గ్లౌజ్ వంటివి వాడటం, గ్లౌజ్ వేసుకునే ముందర చేతులు శుభ్రంగా కడుక్కుని తుడుచుకోవడం. చికిత్సరంగంలో ఉపయోగించిన వ్యర్థాలను సమర్థంగా పారేయడం (సేఫ్ డిస్పోజింగ్) అన్ని ఉపకరణాలను శుభ్రంగా ఉంచుకోవడం స్టెరిలైజ్ చేసుకోవడం వంటివి నివారణ చర్యల్లో కొన్ని. D- హెపటైటిస్ ఇది వర్తులాకరంలో ఉన్న చాలా చిన్న ఆర్ఎన్ఏ కలిగి ఉండే వైరస్. దీన్ని ఒక పూర్తిస్థాయి వైరస్‌గా కాకుండా ఒక ఉప-వైరస్‌లాగే పరిగణిస్తారు. ఎందుకంటే హెపటైటిస్-బి అండ లేకుండా ఇది స్వతంత్రంగా వ్యాప్తిచెందలేదు. కాబట్టి ఇది హెపటైటిస్-బితో పాటూ రావచ్చూ (కో-ఇన్ఫెక్షన్)... లేదా హెపటైటిస్-బి వచ్చాక ఆ తర్వాతా రావచ్చు (సూపర్ ఇన్ఫెక్షన్). అది కో-ఇన్ఫెక్షన్ అయినప్పటికీ లేదా సూపర్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఒకవేళ ఇది వస్తే మాత్రం కేవలం హెపటైటిస్-బి ఉన్నప్పటి కంటే కాలేయం పై తీవ్రత అధికంగా ఉంటుంది. అంటే లివర్ ఫెయిల్యూర్ చాలా వేగంగా జరగడం లేదా సిర్రోసిస్ కండిషన్/కాలేయ క్యాన్సర్ రావడం వంటివి చాలా త్వరితంగా రావడం జరగవచ్చు. కేవలం హెపటైటిస్-బి మాత్రమే ఉన్నవారితో పోలిస్తే దాంతోపాటు హెపటైటిస్-డి కూడా ఉన్నప్పుడు రోగి మరణాల రేటు ఎక్కువ. (దాదాపు 20 శాతం ఎక్కువ). వ్యాప్తి ఇలా: హెపటైటిస్-బి వ్యాపించే అన్ని మార్గాల్లోనూ ఇది కూడా వ్యాపిస్తుంది. కాబట్టి హెపటైటిస్-బి వ్యాప్తిని నిరోధించే మార్గాలే ఈవ్యాధి నివారణకూ తోడ్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా కోటీ యాభై లక్షల మందిలో ఇది హెపటైటిస్-బి వైరస్‌తో పాటూ ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో దీని ఉనికి అంతగా లేనప్పటికీ, డ్రగ్స్ వాడే వారిలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. చికిత్స / నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ కూడా దీని బారి నుంచి రక్షణ కలిగిస్తుంది. ఎందుకంటే అది హెపటైటిస్-బి సోకితేనే వస్తుంది కాబట్టి ఈ తరహా రక్షణ లభిస్తుందన్నమాట. ఇక హైపటైటిస్-బి నివారణ కోసం అవలంబించాల్సిన అన్ని జాగ్రత్తలనూ దీని వ్యాప్తి నివారణకూ అవలంబించాలి. E- హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ హెపటైటిస్-ఈ అనే వైరస్ వల్ల సోకుతుంది. ఇది కూడా కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుంది. చాలావరకు ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. సాధారణంగా నాలుగు నుంచి ఆరువారాల్లో పూర్తిగా తగ్గుతుంది. అయితే చాలా అరుదుగా కొందరిలో లివర్ ఫెయిల్యూర్ పరిస్థితి ఏర్పడి అది మృత్యువుకు దారితీయవచ్చు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మంది కొత్తరోగులు దీని బారిన పడుతున్నారు. వ్యాప్తి ఇలా: సాధారణంగా మలంతో కలుషితమైన నీరు మంచినీటితో కలవడం వల్లనే ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కలుషితమైన ఆహారం, నీటిని పూర్తిగా నివారించాలి. కేవలం సురక్షితమైన నీటినే తాగాలి/ఉపయోగించాలి. అలాగే రక్తమార్పిడి, రక్తంతో సంబంధం ఉన్న చర్యల వల్ల కూడా వ్యాప్తిచెందుతుంది. ఇక గర్భవతికి ఇన్ఫెక్షన్ ఉంటే తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. ప్రధానంగా ఇది కలుషితమైన నీటి వల్లనే వస్తుంది కాబట్టి సురక్షితం కాని నీళ్లు తాగడం, ఉడికించని ఆహారం పదార్థాలు తీసుకోవడం అంత మంచిది కాదు. లక్షణాలు: హెపటైటిస్‌కు ఉండే అన్ని సాధారణ లక్షణాలూ దీనిలోనూ ఉంటాయి. అంటే... కామెర్లు (చర్మం, కళ్లలోని తెలుపు భాగం పచ్చగా మారడం, మూత్రం పచ్చగా రావడం, మలం తెల్లగా ఉండటం) ఆకలి పూర్తిగా లేకపోవడం (అనొరెక్సియా), కాలేయవాపు (హెపటోమెగాలీ), పొత్తికడుపులో నొప్పి, పొత్తికడుపు భాగాన్ని ముట్టుకుంటే కూడా నొప్పి (టెండర్నెస్) వికారం/వాంతులు జ్వరం. ప్రభావం: హెపటైటిస్-ఈ వల్ల కలిగే లక్షణాలు సాధారణంగా వారం లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ చాలా అరుదుగా ఫల్మినెంట్ హెపటైటిస్ (అంటే కాలేయం పూర్తిగా వైఫల్యం కావడం) వంటి కండిషన్ ఏర్పడి మరణానికి దారితీయవచ్చు. గర్భిణుల్లో ఈ వైరస్ ప్రభావం వల్ల కలిగే దుష్ఫలితాలు ఎక్కువ. సాధారణంగా ఈ వైరస్ సోకిన గర్భిణుల్లో 20 శాతం మంది మూడో త్రైమాసికంలో దీని వల్లనే మరణించిన దాఖలాలు ఉన్నాయి. చికిత్స: హెపటైటిస్-ఈ వ్యాధి చాలా వరకు దానంతట అదే తగ్గుతుంది. సమతుల ఆహారం ఇవ్వడం, లక్షణాలను బట్టి మందులు ఇవ్వడం (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్) మాత్రమే చేస్తారు. అయితే ఈ లక్షణాలు ఉన్న గర్భిణులను మాత్రం ఫల్మినెంట్ హెపటైటిస్ బారి నుంచి రక్షించడానికి ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తారు. ప్రస్తుతానికి హెపటైటిస్-ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఆధారంగా చాలా త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే...
లక్షణాలు - పరీక్షలు సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమయంలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. రాయి ఏర్పడిన తర్వాత కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. అవి... వెన్నులో, పొత్తికడుపులో ఒక్క సారిగా అలలా కానీ, అకస్మాత్తుగా గుచ్చినట్లుగా కానీ నొప్పిరావడం. నొప్పి వచ్చినప్పుడు ఎటు కదిలినా, దేహాన్ని ఏ స్థితిలో ఉంచినా సౌకర్యంగా అనిపించకపోవడం. తల తిరగడం, వాంతులు కావడం, మూత్రంలో రక్తం పడడం, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా తోడయితే చలి, జ్వరం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి, మూత్రం దుర్గంధపూరితంగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. పరీక్షలు సి.టి. స్కాన్, ఇంట్రావీనస్ పైలోగ్రామ్ (ఐవిపి), అల్ట్రాసౌండ్, ఎక్స్ - రే (కిడ్నీ - యూరేటర్ - బ్లాడర్... దీనినే కెయుబి ఎక్స్‌రే అంటారు)లాంటివి చేయాలి. జాగ్రత్తలు వెన్ను, పక్కల, పొత్తికడుపు భాగంలో ఉన్నట్లుండి భరించలేనంత నొప్పి, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మూత్రంలో రక్తం పడడం వంటి లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా మూత్రపిండాల్లో రాయి ఏర్పడి ఉండవచ్చని సందేహించి డాక్టర్‌ను సంప్రతించాలి. -
మహిళల్లో మూత్రసంబంధిత వ్యాధులు...తెలుసుకోవలసిన విషయాలు
మహిళల్లో మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు చాలా తరచుగా వస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడం, తమ ప్రమేయం లేకుండా మూత్రం కారిపోవడం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్) అనే సమస్యలను చాలా ఎక్కువగా చూస్తుంటాం. మూత్రంలో ఇన్ఫెక్షన్ అనే సమస్యతో బాధపడేవారు మూత్రవిసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం, చలిజ్వరం వంటి లక్షణాలతో వస్తుంటారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మూత్రంలో రక్తం వచ్చే అవకాశం ఉంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఎన్నో కారణాల వల్ల రావచ్చు. చిన్నపిల్లల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో ఈ సమస్య వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ వాడి ఊరుకోకుండా ఈ సమస్యకు కారణాలేమిటో పరిశీలించాలి. ఎందుకంటే చిన్నపిల్లల అవయవాలలో పుట్టుకతోనే వచ్చే మార్పుల (కంజెనిటల్ అనామలీస్) వల్ల మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అసలు కారణం తెలుసుకోకుండా ఎన్నిసార్లు చికిత్స చేసినా ఉపయోగం ఉండదు. సరికదా... మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. యువతుల్లో, కొత్తగా పెళ్లయిన మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వస్తుంటాయి. కొత్తగా పెళ్లయిన వాళ్లలో వచ్చే హనీమూన్ సిస్టైటిస్ వల్ల ఈ సమస్య వస్తుంది. మహిళల్లో మూత్రనాళం చిన్నగా ఉండటం, జననేంద్రియాలకు దగ్గరగా ఉండటం వల్ల పురుషుల కంటే తరచుగా స్త్రీలలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వయసుమళ్లిన స్త్రీలలో (పోస్ట్ మెనోపాజల్ ఉమన్‌లో) కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వచ్చే సమస్యే. దీనికి కారణం నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే హార్మోన్ల లోపమే. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ లోపం వల్ల మూత్రనాళం సన్నబడే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండి మాటిమాటికీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ హార్మోన్ల లోపం వల్ల మూత్రాశయంలోని కణాలకు రోగకారక క్రిముల (బ్యాక్టీరియా)ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా రావచ్చు. మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ను యురెథ్రైటిస్ అని అంటారు. మూత్రాశయంలోని ఇన్ఫెక్షన్స్ను సిస్టయిటిస్ అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. అలాగే మొదటిసారి మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని ప్రైమరీ ఇన్ఫెక్షన్ అనీ, మళ్లీ మళ్లీ రావడాన్ని పర్సిస్టెంట్ బ్యాక్టీరియోరియా అనీ లేదా రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. మొదటిసారి వచ్చే ఇన్ఫెక్షన్స్ కోసం ప్రత్యేకమైన పరీక్షలేమీ అవసరం లేదు. కానీ మళ్లీ మళ్లీ వస్తుంటే మాత్రం అది ఏ కారణం వల్ల అన్నది తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్దిష్టంగా చికిత్స జరగాల్సి ఉంటుంది. పుట్టుకతో వచ్చే లోపాలకూ, మూత్రపిండాల్లో రాళ్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్కు అవసరమైతే ఆపరేషన్ చేసి, ఆ లోపాన్ని సరిచేయాల్సి రావచ్చు. ఒక్కోసారి మూత్రావయవాలలో టీబీ వల్ల కూడా మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మామూలుగా చేసే కల్చర్ పరీక్షలో బయటపడదు. టీబీ క్రిముల కోసం ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేయాల్సి ఉంటుంది. మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చేవారికి సాధారణంగా చేసే పరీక్షలే కాకుండా మూత్రావయవాలలో ఏమైనా మార్పులు వచ్చేయేమో తెలుసుకోడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొన్ని ప్రత్యేకమైన ఎక్స్-రే (ఐవీయూ, ఎంసీయూజీ లాంటివి) పరీక్షలు చేయాల్సి ఉంటుంది. గర్భవతుల్లో వచ్చే మూత్ర సంబంధిత సమస్యలు... గర్భవతుల్లో కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే గర్భసంచి పెరుగుతున్నకొద్దీ అది మూత్రనాళాలపై ఒత్తిడి కలగజేయడం వల్ల మూత్రపిండాలు వాచిపోతాయి. దాంతో మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్ కాస్తా... మూత్రపిండాలకూ చేరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదమూ ఉంది లేదా నెలలు నిండకముందే ప్రసవం కూడా కావచ్చు. అందువల్ల గర్భవతులు మూత్రపరీక్ష చేయించుకుని, ఇన్ఫెక్షన్ ఉంటే తప్పక మందులు వాడాల్సి ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్కి చికిత్స... సాధారణంగా వచ్చే సిస్టైటిస్‌కి మూడురోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు సరిపోతుంది. మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే పదినుంచి పదిహేను రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొందరిలో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే దీర్ఘకాలం పాటు చికిత్స (లాంగ్ టర్మ్ సప్రెసెంట్ థెరపీ) అవసరమవుతుంది. ఇందులో చాలా తక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇక అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం చాలా సాధారణమే అయినా, మాటిమాటికీ వస్తుంటే మాత్రం దానికి అసలు కారణం కనుక్కోవాలి. దీనిని అందరూ గుర్తుంచుకోవాలి. లేకపోతే దీర్ఘకాలంలో మూత్రపిండాలపై దుష్ర్పభావం పడవచ్చు. నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకుంటే కచ్చితమైన చికిత్సను అందించడానికి అవకాశం ఉంటుంది. నిర్వహణ: యాసీన్ డాక్టర్ కె. లలిత, సీనియర్ యూరాలజిస్ట్ - యూరో గైనకాలజిస్ట్, యశోదా హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్. -
పసి వేదన
ఇంటికి లక్ష్మీదేవీ రూపంగా భావించుకునే ఆడపిల్లల పుట్టుక ఇప్పుడు భయానక మవుతోంది. కనికరం లేని కొందరు తల్లిదండ్రులు పుట్టిన పాపాయిలు ఈ లోకం చూడకుండానే కాటికి పంపేస్తున్నారు. అదీ దారుణంగా. సభ్య సమాజం తలదించుకునేలా. మానవత్వం మరిచేలా. కొడంగల్‌లో జరిగిన ఈ సంఘటనే ఇందుకు సాక్ష్యం. ఎందరినో కదిలించిన వైనం. కొడంగల్, న్యూస్‌లైన్ : ‘అమ్మా..నన్నెందుకు కన్నావ్...? నేనేం నీ కడుపులోనే పుడతానను కోలేదే. నా ప్రమేయం లేకుండా ఈ భూమ్మీదకు తెచ్చిన వెంటనే నువ్వు మురుగు కాలువ పాల్జేస్తే నేను ఓ 18 గంటలు మృత్యువుతో పోరాడి మిమ్మల్నందర్నీ వదిలి వెళ్లి పోయా. అంత దానికి నన్ను 9 నెలలు ఎందుకు మోసావ్. పెంచడమే భారమనుకుంటే ఆ మాత్రం అనుభూతి కూడా నాకెందుకు’. ఇదీ ఓ పసికందు ఆత్మ ఘోష. ఎంతో గొప్పదనుకున్న బ్రహ్మముహూర్తంలో పుట్టిన ఆడపిల్ల మారని ఈ లోకం తీరుపై రువ్విన ప్రశ్నలు.గతి తప్పుతున్న సమాజానికి వేస్తున్న చురకలు. గుండెల్ని పిండేసిన ఈ సంఘటన కొడంగల్ పట్టణంలో గురువారం తెల్లవారున చోటు చేసుకుంది. స్థానిక పెద్దలు బొంకులు శంకరప్ప, బాకీ కైసర్, కానకుర్తి నర్సింహారెడ్డిలు రోజూ వారి మాదిరిగానే వాకింగ్‌కు బయలు దేరారు. వారిళ్లకు సమీపంలో ఉన్న షాబజార్ ప్రాంతంలోని మురుగు కాలువలో ఓ పసికందు తేలియాడుతూ కనిపించింది. అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా పడుకోవాల్సిన ఆ చిన్నారి గడ్డగట్టించే చలిలో దుర్భర స్థితిలో కనిపించడంతో చలించి పోయారు. మానవత్వం మేల్కొంది. వెంటనే ఈవిషయాన్ని విలేకరులకు, పోలీసులకు, 108 అంబులెన్స్‌కు తెలియజేశారు. విషయం తెలుసుకొని కలాల్వాడీలో ఉంటున్న అంగన్వాడీ టీచర్లు కానుకుర్తి యాదమ్మ, బైండ్ల శశికళలు అక్కడకు చేరుకొని పసికందును తీసుకొని 108లో కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అప్పటికే ఆ చిట్టి తల్లి పరిస్థితి విషమంగా మారడంతో తాండూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మపాలుతో కడుపు నింపుకోవాల్సినా చిన్నారి మురుగునీటిని తెలీకుండానే తాగేసింది. మరోవైపు ఇన్ఫెక్షన్లు సోకి ముక్కు నుంచి నోట్లో నుంచి రక్తస్రావం ప్రారంభమైంది.కన్నవారు చేసిన ఘనకార్యానికి పాపాయి గుండె కూడా చివుక్కుమందేమో అదీ మండకొడి స్పందనలతోనే సరిపెట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు అత్యవసరంగా చికిత్సలందించాలంటే తక్షణమే రూ. 2వేల విలువచేసే ఇంజక్షన్ వేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఐసీడీఎస్ సూపర్వైజర్ జయశ్రీ తాండూరుకు చేరుకొని అక్కడి ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డితో మాట్లాడి చిన్నారికి సాయం చేయాలని కోరారు. ఆయనా చలించి ముందుకు వచ్చినా... తాండూరులోని మెడికల్ షాపులన్నీ వెతికినా ఆ చిన్నారికి కావాల్సిన ఇంజక్షన్ దొరకలేదు. అలా అప్పటి వరకూ మృత్యువుతో పోరాడిన చిట్టి ఈ లోకం పోకడ అర్ధం చేసుకొని ఇక చాల్లే అనుకొని సరిగ్గా రాత్రి 8గంటల సమయంలో కాలుని గూటికి చేరుకుంది. అమ్మే అక్కరలేదనుకున్నప్పుడు ఈ సంఘానికి తానెందుకు భారం కావాలనుకుందేమో చివరి శ్వాస వదలి శాశ్వత లోకాలకు వెళ్లిపోయింది. డాక్టర్ అంచనా ప్రకారం ఆ శిశువు గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ భూమిపైకి అడుగు పెట్టి ఉండవచ్చు. అంటే కేవలం 18 గంటల్లో బతుకు పాఠాలను తెలుసుకుందన్నమాట. ఉన్న కొద్ది గంటల్లోనూ తనకోసం శ్రమించిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు పలికింది. అందరికీ కల్లు చెమర్చేలా చేసింది. -
విసర్జన తర్వాత కూడా కొంత మూత్రం లోపలే మిగిలిపోతోంది..?
నా వయసు 55. మూడేళ్ల నుంచి నాకు మూత్రధార సరిగా రాకపోవడం, రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రానికి లేవాల్సి రావడం జరుగుతోంది. పదిహేనేళ్ల నుంచి నాకు షుగర్ ఉంది. షుగర్ ఉంటే మూత్రం ఎక్కువసార్లు వస్తుందంటారు కానీ నాకు చాలా తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు వస్తోంది. స్కానింగ్ చేయించుకుంటే ‘మూత్ర విసర్జన తర్వాత లోపల 150 ఎం.ఎల్. మిగులుతోంది’ అంటున్నారు. ఇలా మిగిలిపోవడం వల్ల ఏదైనా ప్రమాదమా? - ఎస్.వి.కె., వరంగల్ సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఇలాంటి మూత్ర సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తిలో లోపల 20 ఎం.ఎల్. కంటే ఎక్కువగా మూత్రం మిగలకూడదు. ఇలా మూత్రం సరిగా రాకపోవడానికి ప్రోస్టేట్ గ్రంథి వాపు, మూత్రంలో ఇన్ఫెక్షన్, పురుషాంగంపై చర్మం ముడుచుకుపోవడం వంటివి ప్రధాన కారణాలు. మీరు యూరిన్ ఎగ్జామినేషన్, ప్రోస్టేట్ గ్రంథి సైజు తెలుసుకునేందుకు స్కానింగ్, మూత్ర విసర్జన చేసే విధానాన్ని తెలుసుకునే యురెథ్రోమెట్రీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల ద్వారా మీ సమస్యకు కారణం తెలుసుకుని దానికి అనుగుణంగా చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్, ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే శస్త్రచికిత్స లేదా కొన్ని మందులు వాడటం, పురుషాంగంపై చర్మం మూసుకుపోతే సున్తీ ఆపరేషన్ వంటి చికిత్సల ద్వారా మీ సమస్యను నయం చేయవచ్చు. మా బాబుకు మూడేళ్లు. బాబు కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకున్నప్పుడు బాబుకు కిడ్నీలో వాపు ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తే రెండు కిడ్నీల్లోనూ వాపు ఉందన్నారు. వాడికి ఏడాది వయసున్నప్పుడు ఎంసీయూజీ అనే పరీక్ష చేయించారు. అతడికి రెండువైపులా కిడ్నీల్లోకి మూత్రం వెనక్కు వెళ్తోందని చెప్పారు. ఐదేళ్ల వయసు వచ్చే వరకు అతడిని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాపు తగ్గకపోతే ఐదేళ్ల తర్వాత ఆపరేషన్ అవసరమంటున్నారు. అసలు మా బాబుకు వచ్చిన సమస్య ఏమిటి? - ఆర్. ధనంజయరావు, అనంతపురం పిల్లల్లో వచ్చే ఈ జబ్బును విసైకో యురెథ్రల్ రిఫ్లక్స్ అంటారు. మూత్రం పోసినప్పుడు మూత్రం వెనక్కు తిరిగి కిడ్నీల్లోకి వెళ్లకూడదు. ఒకవేళ అలా వెళ్తుంటే ఆ కండిషన్‌ను ‘రిఫ్లక్స్’ అంటారు. ఇలా మూత్రం రివర్స్‌లో వెనక్కు వెళ్తున్నప్పుడు... అది ఎంతదూరం వెనక్కు వెళ్లిందనే దాన్ని బట్టి ఐదు గ్రేడులుగా విభజిస్తారు. మొదటి రెండు గ్రేడుల్లో కిడ్నీకి ప్రమాదం తక్కువ. అందువల్ల కొద్దిరోజులు వేచి చూసినా పర్వాలేదు. నాలుగు, ఐదు గ్రేడుల్లో కిడ్నీలో వాపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగానే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. గ్రేడ్-3లో యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్లీ మళ్లీ వస్తుంటే కూడా ఆపరేషన్‌ను సూచిస్తాం. వయసు పెరిగేకొద్దీ రిఫ్లక్స్ తగ్గుతుంది. అందుకోసమే మీ బాబు విషయంలో డాక్టర్లు ఐదోఏడు వచ్చే వరకూ వేచిచూడమని మీకు సలహా ఇచ్చి ఉంటారు. మీరు క్రమం తప్పకుండా మీ యూరాలజిస్ట్‌తో ఫాలో అప్‌లో ఉండి, ఆయన సలహా మేరకు చికిత్స తీసుకోండి. నాకు 27 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయ్యింది. ఈమధ్య ఒకసారి సెక్స్ తర్వాత వీర్యంలో కొద్దిగా రక్తం కనిపించింది. ఆ తర్వాత ఒకసారి హస్తప్రయోగంలో కూడా కాస్త రక్తం వచ్చింది. నాకు చాలా ఆందోళనగా ఉంది. అయితే అంగస్తంభన యథావిధిగా జరుగుతోంది. సెక్స్ కూడా బాగానే చేయగలుగుతున్నాను. నాకు ఉన్న సమస్య తీవ్రత ఏమిటి? అది భవిష్యత్తులో ఏదైనా పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉందా? - ఎస్.ఆర్.ఎమ్., భీమవరం వీర్యంలో రక్తం రావడం అన్నది అంత ప్రమాదకరమైన పరిస్థితి కాకపోవడానికే అవకాశాలు ఎక్కువ. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, టీబీ ఉన్నా, వీర్యం వచ్చే మార్గంలో నీటిబుడగలు (సిస్ట్స్) ఉన్నా, అక్కడ ఏవైనా గడ్డలు ఉన్నా ఇలా వీర్యంతో పాటు రక్తం రావడం చాలా పరిపాటి. పైగా ఇలా కనిపించడం చాలా సాధారణం. ఇది చాలామందిలో జరిగేదే. కొన్నిసార్లు ఇలా జరగడానికి ఏ కారణమూ కనిపించదు. చికిత్స చేసినా చేయకపోయినా ఒక్కోసారి దానంతట అదే తగ్గిపోవచ్చు. అందుకే చాలామంది బయటకు చెప్పకపోవడం అన్నది ఇలాంటి కేసుల్లో చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో పరిస్థితి దానంతట అదే చక్కబడుతుంది కాబట్టి చాలామందిలో దీనికి సంబంధించిన ఆందోళన కూడా క్రమంగా తగ్గిపోతుంటుంది. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మీరు ఒకసారి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని యూరాలజిస్ట్‌ను కలిసి, ఏమైనా సాధారణ యాంటీబయాటిక్స్ తీసుకోవాలేమో చూసుకోండి. ఇది ఆందోళన పడాల్సినంత పెద్ద సమస్య కాదనే కాన్ఫిడెన్స్‌తో యూరాలజిస్ట్‌ను కలవండి. నాకు 67 ఏళ్లు. ఇటీవల మూత్రం సరిగా రాకపోవడంతో మూత్రపరీక్షలు చేయించుకున్నాను. ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు తయారైనట్లు చెప్పారు. ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని అంటున్నారు. ఇప్పటికీ నేనూ, నా భార్య సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అందుకే ఆపరేషన్ అనగానే నా అంగస్తంభన సామర్థ్యం దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. - ఎస్.ఆర్.కే., రాజమండ్రి అరవైఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్‌పీ)తో నయం చేస్తాం. వీర్యంలో ఎక్కువభాగం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా రావడం అన్నది చాలా సాధారణం. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్‌లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల మీ అంగస్తంభనలకుగాని, సెక్స్ పార్ఫార్మెన్స్కు గాని ఎలాంటి లోపమూ రాదు. అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని మీ డాక్టర్లు చెబితే మీరు నిశ్చింతగా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. డాక్టర్ వి.చంద్రమోహన్ యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటే...?
మా పాప వయసు మూడు నెలలు. ఈ మధ్య ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది. డాక్టర్గారికి చూపిస్తే ‘ఈ వయసు పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంటుంది, మరేం భయం లేదు’ అని కొన్ని మందులు రాశారు. మందులు వాడినప్పుడు కొద్దిరోజులు తగ్గినా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - ఎస్. దిల్షాద్ బేగం, కర్నూలు పిల్లలు ఇలా అదేపనిగా ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా ఎలాంటి ప్రమాదం లేని చిన్న సమస్య మొదలుకొని, చాలా ప్రమాదకరమైన సమస్య వరకూ అన్నింటినీ వారు ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. పిల్లలు అదేపనిగా ఏడ్వటానికి కొన్ని కారణాలు: ఆకలి వేయడం, భయపడటం, దాహం, మూత్ర విసర్జన తర్వాత డయాపర్ తడి కావడం, బయటి వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండి వారికి అసౌకర్యంగా ఉండటం, భయపెట్టే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం (దీపావళి లేదా ఏదైనా సెలబ్రేషన్ సందర్భంగా బాణాసంచా కాల్చినప్పుడు పిల్లలు ఉలిక్కిపడి ఏడ్వటం సాధారణం), వారున్న గదిలో కాంతి మరీ ఎక్కువగా ఉండటం, పొగ వస్తూ ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా పరిణమించడం, వారికి ఏవైనా నొప్పులు ఉండటం, దంతాలు వస్తుండటం, ఇన్ఫెక్షన్లు ఉండటం, కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) రావడం, జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను పిల్లలు ఏడుపు ద్వారానే తెలియచేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు అదేపనిగా ఏడుస్తున్నారంటే దానికి కారణం ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటి సమస్యలు ఉండటం. మీ పాప విషయంలోనూ ఏడుపునకు మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా బహుశా కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) కారణం కావచ్చని అనిపిస్తోంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు ఎక్కువగా కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇలాంటి పిల్లల్లో ఏడుపు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేక పోయినప్పటికీ... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను సరిగా ఎత్తుకోవడం (అప్ రైట్ పొజిషన్), కొద్దిసేపటి కోసం వాళ్ల పొట్టమీద వాళ్లను పడుకోబెట్టడం (ప్రోన్ పొజిషన్), తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
పళ్ల మధ్య సందులు... పరిష్కారం చెప్పండి
నా వయసు 45 ఏళ్లు. గత కొన్ని సంవత్సరాలుగా ముందు పళ్ల మధ్య సందులు వచ్చాయి. కాస్త ఎత్తుగా కూడా అవుతున్నాయి. దాంతో నవ్వేటప్పుడు ఇబ్బందిగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సులక్షణ, మంచిర్యాల యుక్తవయసులో పలువరసగా చక్కగా అమరి ఉన్నప్పటికీ దంత సమస్యలపట్ల అవగాహన లేకపోవడం, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీరు చెప్పిన సమస్యలు వస్తుంటాయి. ఒకప్పుడు పలువరస చక్కగా ఉండి, ఆ తర్వాత గ్యాప్స్ వస్తున్నాయంటే అందుకు చిగుర్ల జబ్బులే కారణం. ముఖ్యంగా ప్రసూతి తర్వాత ఆడవాళ్లలో చిగుర్ల జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భంతో ఉన్నప్పుడు వచ్చే చిన్నపాటి చిగుర్ల ఇన్ఫెక్షన్కి చికిత్స చేయించుకోకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మధ్యవయసు వచ్చేసరికి పళ్ల మధ్య సందులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే దీనికి కంగారు పడాల్సిందేమీ లేదు. పళ్ల మధ్య సందులు ఉంటే ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తారు. ఎత్తు పళ్లు వచ్చినట్లుగా తెలుస్తూ, పెదవులు ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తాయి. వయసు పైబడ్డట్లు కనిపించవచ్చు. అందువల్ల వీటిని సరిచేయించుకోవాలి. దంతవైద్యనిపుణుడిని కలిస్తే ఎక్స్-రే సహాయంతో మీకు చిగుర్ల జబ్బు ఉందా లేదా అని నిర్ధారణ చేసి, పళ్లను దృఢంగా చేసే ప్రత్యేక చిగుర్ల చికిత్సలు చేస్తారు. దాంతోపాటు ఎడంగా ఉన్న పళ్లను సరిచేయడానికి ఇప్పుడు పెద్దవారికి సైతం క్లిప్పులతో చికిత్స చేయవచ్చు. కొంతమంది ఈ వయసులో క్లిప్పులు వేసుకోవడమా అని వెనకాడుతుంటారు. వీళ్లు తమ పళ్లను అందంగా చేసుకోడానికి స్మైల్ డిజైనింగ్ ప్రక్రియను అనుసరించవచ్చు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
బ్రాంకైటిస్ ఆస్తమాకు కారణం కావచ్చు
ఒక్క క్షణం శ్వాస తీసకోవడంలో ఇబ్బంది ఏర్పడితే విలవిల్లాడిపోతాం. కానీ చాలామంది పొగతాగే అలవాటుతో శ్వాససంబంధ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న శ్వాసకోశ వ్యాధులకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఊపిరితిత్తులు మరింత త్వరగా క్షీణిస్తాయి. సాధారణంగా పొగతాగే వారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అనేకం వస్తుంటా యి. పొగతాగే వారు వదిలే పొగలో సుమారు 43 రకాల క్యాన్సర్ పదార్థాలు, 30 రకాల లోహాలు, 4500 రకాల పదార్థాలు ఉంటాయి. వీటివలన శ్వాసనాళాలు కుచించుకుపోయి దీర్ఘకాలం పాటు దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యను క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అంటారు. లక్షణాలు: ఈ సమస్యతో బాధపడేవారికి కనిపించే ప్రధాన లక్షణం దగ్గు. దగ్గుతో పాటు శ్లేష్మం వస్తుంటుంది. పగటివేళ దగ్గు ఎక్కువగా ఉంటుంది. శ్వాసనాళాల్లో అడ్డు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. పొగతాగే వారిలో వయసు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువైనపుడు రాత్రుళ్ళు నిద్రపట్టదు. 40 ఏళ్ళు పైబడిన వారిలో ఇది కొంత ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో కనిపించదు. తీవ్రమైన దశ: దగ్గు, కళ్లె పడటం ఎక్కువగా ఉంటుంది. పగలైనా, రాత్రివేళయినా శ్వాసించడం కష్టమవుతుంది. మెట్లు ఎక్కడం, చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వస్తారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వల్ల కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. బరువు తగ్గిపోతారు. క్రానిక్ బ్రాంకైటిస్: ఒక ఏడాదిలో కనీసం మూడు నెలల చొప్పున వరుసగా రెండేళ్ళపాటు కళ్లెతో కూడిన దగ్గు ఉంటే దానిని క్రానిక్ బ్రాంకైటిస్‌గా అనుమానించాలి. దీనిలో కూడా శ్వాసనాళం ఇన్ఫెక్షన్ల వల్ల అవి దళసరిగా మారతాయి. ఫలితంగా గాలిని పీల్చుకోవడంలో, బయటకు విడవడంలో ఇబ్బందులు వస్తాయి. వాయునాళ పొరల్లో ఉండే గ్రంథులు కఫం (మ్యూకస్) అనే జిగురు స్రావాన్ని తయారుచేస్తాయి. ఇది గాలిలోని దుమ్ముకణాలను వడగొట్ట్టడానికి, హాని కలిగించే పదార్థాల తీవ్రతను తగ్గించడానికి, శ్వాసనాళాల్లో తగినంత తడి ఉండేలా చూడటానికి ఉపకరిస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌తో బాధపడే వారిలో ఆ గ్రంథులు పెద్దగా అవుతాయి. దానివలన కఫం అక్కడే ఎక్కువగా తయారయి ఊపిరితిత్తులలోకి చేరి తిష్ట వేస్తుంది. దీంతో తెరలు తెరలుగా దగ్గు వస్తూ ఉంటుంది. ఇది ఏళ్లతరబడి ఉండిపోయినప్పుడు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. జాగ్రత్తలు: ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, వాహనకాలుష్యం, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తుండాలి. నిత్యం వాకింగ్ చేయడంతో పాటు నిపుణుల పర్యవేక్షణలో కండర పటిష్టతను పెంచే వ్యాయామాలు చేస్తుండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తినాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. హోమియో చికిత్స: శ్వాస సంబంధ సమస్యలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఆర్సనిక్ ఆల్బం, ఆంటినమ్, ఇపికాక్ ఆంటినమ్ క్రూడ్ వంటి మందులు ఈ వ్యాధిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించాక చికిత్స అందించాల్సి ఉంటుంది. హోమియో మందులు సీఓపీడీ, క్రానిక్ బ్రాంకైటిస్ నుంచి చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. పైగా హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే శ్వాస సంబంధ వ్యాధులు ఇట్టే తగ్గిపోతాయి. హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922 -
ఇలా మడతపడితే...భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం ఉందా?
మా బాబు వయసు 12 సంవత్సరాలు. వాడికి ఒకవైపు వృషణంలో విపరీతమైన నొప్పి రావడం వల్ల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ‘వృషణం మడతపడింది. వెంటనే ఆపరేషన్ చేయాలి’ అని చెప్పారు. ఆపరేషన్ చేసిన తర్వాత వృషణాన్ని పూర్తిగా తీసివేశారు. రెండోవృషణం అలా కాకుండా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఒక వృషణమే ఉంది. వృషణం ఒక్కటే ఉండే మా బాబు పెద్దయ్యాక నార్మల్ సెక్స్ చేయడానికి, పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందా? అందరికీ తెలుస్తుందేమోనని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. - ఎమ్.ఎల్.ఎస్., మహబూబ్‌నగర్ యుక్తవయసు రాబోయే ముందు అకస్మాత్తుగా వృషణాల్లో నొప్పి వస్తే అది సాధారణంగా ఇన్ఫెక్షన్ (ఎపిడైడమో ఆర్కడైస్) కారణంగా గానీ, వృషణం మడత పడటం వల్ల గానీ (టెస్టిక్యులార్ టార్షన్) వల్లగాని కావచ్చు. విపరీతమైన నొప్పి వచ్చినప్పుడు కేవలం డాప్లర్ స్కాన్ ద్వారా వృషణాలకు రక్తప్రసరణ ఉందో లేదో చూసుకుని, ఒకవేళ వృషణం మడతపడి ఉంటే (టార్షన్ అయి ఉంటే) ఆరు గంటల లోపే ఆ మడతను విడదీయాలి. ఆర్కడైస్ ఉంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి. అందువల్ల సడన్‌గా వాపుతో వచ్చే వృషణం నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ఒక వృషణం తీసివేసినా దాదాపు చాలామందిలో సెక్స్ చేయడానికిగానీ, పిల్లలు పుట్టడానికి గానీ ఎలాంటి అవరోధం ఉండదు. కాబట్టి మీరు మీ బాబుకు తగిన వయసు వచ్చినప్పుడు నిర్భయంగా వివాహం చేయవచ్చు. నా వయస్సు 28 ఏళ్లు. నాకు హస్తప్రయోగం సమయంలో స్ఖలనం జరగగానే పురుషాంగంలో విపరీతంగా నొప్పి వస్తోంది. ఆ నొప్పిలోనే నాకు మరోసారి అంగస్తంభన అవుతోంది. ఆ టైమ్‌లో నరాలు లాగుతున్నట్లుగా ఉంటుంది. స్ఖలనం అయ్యాక దాదాపు గంటతర్వాత నొప్పి దానంతట అదే తగ్గిపోతోంది. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయలేనేమో అనిపిస్తోంది. నాకు మంచి సలహా ఇవ్వండి. - జె.వి.ఆర్., ఒంగోలు వీర్యస్ఖలనం తర్వాత పురుషాంగంలో, మూత్రనాళంలో నొప్పి, కాస్తంత డిస్‌కంఫర్ట్‌గా ఉండటం కొందరిలో సాధారణం. కాకపోతే అది కొద్ది నిమిషాలే ఉంటుంది. మీకు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వీర్యం, మూత్రం పరీక్షలు చేయించుకుని, అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో చూడాలి. చాలావరకు ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి తీవ్రమైన లేదా ప్రమాదకరమైన కారణాలేవీ ఉండవు. ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గుతుంది. మీ సమస్య వల్ల భవిష్యత్తులో సెక్స్ చేయలేని పరిస్థితి ఏమీ రాదు. మీరు ఆందోళన పడకుండా ఒకసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 32 ఏళ్లు. నేను సెక్స్‌లో పాల్గొన్న వెంటనే స్ఖలనం అయిపోతోంది. సెక్స్‌లో పాల్గొనే సవుయుంలో శీఘ్రస్ఖలనాన్ని నివారించడానికి డీ-సెన్సిటైజర్ క్రీమ్స్, లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ దొరుకుతాయుని విన్నాను. వాటి విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎస్‌కెబి., గుంటూరు మీరు శీఘ్రస్ఖలనం అనే సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణ సమస్య. మీ వయసులో ఉన్నవారు చాలామంది ఈ కంప్లయింట్ చేస్తుంటారు. శీఘ్రస్ఖలనాన్ని నివారించేందుకు మీరు చెప్పినట్లే కొన్ని లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఉంటాయి. అయితే మీకు ఉన్న సమస్యకు అదే చికిత్స కాదు. సెక్స్ చేస్తున్నప్పుడు పురుషాంగం మీద ఉండే నరాలు త్వరగా స్పందించడం (స్టిమ్యులేట్ అవడం) వల్ల మీకు స్ఖలనం త్వరగా అయిపోతుంది. మీరు చెబుతున్న ఆ లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఆ నరాలను మొద్దుబారేలా చేస్తాయి. కాబట్టి స్ఖలనం ఆలస్యమవుతుంది. అయితే దీనివల్ల సెక్స్‌లో సుఖం కూడా తగ్గుతుంది. మీరు చెప్పే డీ-సెన్సిటైజర్లు కూడా ఇదే పని చేస్తాయి . ఈ క్రీమ్స్, డీ-సెన్సిటైజర్స్ కంటే స్ఖలనం అయ్యే సమయంలో పురుషాంగం చివరను చేతి వేళ్లతో బిగించి పట్టుకుని, మళ్లీ ఆ ఫీలింగ్ తగ్గిన వెంటనే సెక్స్ కొనసాగించే పించ్ టెక్నిక్, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ వంటి వాటిని అనుసరించండి. మీ ఉద్వేగాలను అదుపు చేసే టెక్నిక్స్ వంటివి స్ఖలనం రిఫ్లక్స్పై నియంత్రణ సాధించేలా చేసి మీకు దీర్ఘకాలికంగా మేలు చేస్తాయి. నాకు 27 ఏళ్లు. ఇటీవలే పెళ్లయ్యింది. సెక్స్ చేస్తున్నప్పుడు పురుషాంగం ముందు చర్మం వెనక్కు పోయి తీవ్రమైన నొప్పి వచ్చింది. అప్పట్నుంచి సెక్స్ చేయడం లేదు. డాక్టర్‌కు చూపించుకుందామంటే సిగ్గుగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - జి.వి.ఎస్., కర్నూలు సాధారణంగా పురుషాంగం మీద చివరిభాగంలో ఉన్న చర్మం ఫ్రీగా ముందుకు-వెనక్కు కదలాలి. ఒకవేళ అలా కదలకపోతే దాన్ని ఫైమోసిస్ అంటారు. ఈ పరిస్థితుల్లో అంగస్తంభన జరిగినప్పుడు చర్మం బలం (ఫోర్సిబుల్) గా వెనక్కువెళ్లి తిరిగి ముందుకు రాకపోతే తీవ్రమైన వాపు, నొప్పి వస్తుంది. ఈ కండిషన్‌ను పారాఫైమోసిస్ అంటారు. దీనికి సున్తీ ఒక్కటే మార్గం. సున్తీ చేయించుకున్న తర్వాత సెక్స్‌లైఫ్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా ఉంటుంది. ఇందులో మీరు బిడియపడాల్సిందేమీ లేదు. దగ్గర్లోని డాక్టర్‌ను కలవండి. డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
మధుమేహానికి హోమియోలో చక్కని పరిష్కారం
నవీనయుగంలో వయస్సు, లింగ - విచక్షణ లేకుండా రానురాను మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో, అందునా ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ‘మధుమేహం’ లేదా ‘డయాబెటిస్’ వ్యాధికి కారణాలు అనేకం ఉన్నా కానీ మానసిక ఒత్తిడి, ఆందోళన, మనోవ్యాధులు వంటి కారణాలు ప్రధానంగా ఉండడమే గణనీయంగా పెరిగిపోతున్న వ్యాధిగ్రస్తులకు సూచనగా ఉంది. కచ్చితంగా చెప్పాలంటే ‘డయాబెటిస్’ ఒక వ్యాధి కాదు. ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్, అంటే శరీరంలో జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వలన రక్తంలో, మూత్రంలో చక్కెర శాతం పెరిగిపోవడం వలన ఏర్పడే స్థితి మాత్రమే. డయాబెటిక్ లక్షణాలైన అధికమూత్రం, తీవ్రమైన దాహం, ఆకలి, శారీరక దౌర్బల్యం అన్నీ కూడా జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వలన వచ్చేవే. దీనికి కారణం శరీరంలో ‘పాంక్రియాస్’ అనే గ్రంథి నుండి వెలువడే ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా దానిని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోవడమే. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆధారం చేసుకొని డయాబెటిస్‌ను రెండు ప్రధాన రకాలుగా విభజించుతారు. డయాబెటిస్ 1లో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీనికి కారణం పాంక్రియాటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ వలన లేదా ఆటోఇమ్యూనిటీ వలన పాంక్రియాస్ గ్రంథిలో బీటాకణాలు పూర్తిగా నాశనం అవడమే. ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోవడం వలన శరీరంలో కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్ దెబ్బతిని మనిషి స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందువలన వీరిలోకి బయటనుండి ఇన్సులిన్ని ఇంజక్షన్ రూపంలో ప్రవేశపెడతారు. అందుకే ఈ రకం డయాబెటిస్‌ని ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటన్’ (IDDM) అంటారు. డయాబెటిస్ 2 లో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగానే ఉన్నప్పటికి శరీరం దానిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది సాధారణంగా ఊబకాయం ఉన్నవారిలో, మద్యం సేవించేవారిలో, శారీర శ్రమలేకుండా స్థిరంగా ఉండేవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీరికి ఇన్సులిన్ బయటి నుండి ఇచ్చే అవసరం ఉండదు. కానీ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే మందులను (యాంటీ-హైపర్ గ్లైసీమిక్ డ్రగ్స్) సూచిస్తారు. అయితే వీరిలో కూడా షుగర్ లెవెల్స్ టాబ్లెట్ల ద్వారా నియంత్రించ లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సిఫారసు చేస్తారు. స్త్రీలలో గర్భధారణ సమయంలో వచ్చి ఆ తర్వాత కూడా ఉండే డయాబెటిస్‌ని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. డయాబెటిస్ వలన వచ్చే లక్షణాలే ఇబ్బందికరంగా ఉంటే దానివలన తలెత్తే కాంప్లికేషన్లు పేషెంట్‌ను మరింత కృంగదీస్తాయి. కొన్నిరకాల కాంప్లికేషన్లు అకస్మాత్తుగా, తీవ్రంగా వస్తాయి. షుగర్ లెవెల్స్‌ని సరిగ్గా నియంత్రించకపోతే ‘డయాబెటిక్ కీటోఎసిడోసిస్’ అనే సమస్య తలెత్తుతుంది. మందులు వేసుకొంటూ ఆహారం సరిగా తీసుకోకపోతే చక్కెరస్థాయి తగ్గిపోయి ‘హైపోగ్లైసీమెయా’ తలెత్తుంది. శరీరమంతా చమట పట్టడం, వణుకురావడం, విపరీతమైన నీరసానికి గురై కళ్ళు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు ‘హైపోగ్లైసీమెయా’ కి గురైన వ్యక్తిలో కన్పిస్తాయి. కొన్నిరకాల దుష్ర్పభావాలు దీర్ఘకాలంగా వేధిస్తుంటాయి. గ్లూకోజ్ లెవెల్స్ సాధారణంగా భోజనం తర్వాత 160... కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. క్రమంగా వ్యాయామం చేస్తూ మందులు, ఆహారం సమయానికి తీసుకొంటూ, చిన్నచిన్న జాగ్రత్తలు పాటించవలసిందే. డయాబెటిస్తో పాటు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారిలో దుష్ర్పభాలు త్వరగా వస్తాయి గనుక రక్తపోటును, కొలస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవాలి. మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకొని మనస్సును సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. హోమియోపతిలో ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా కేవలం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చెయ్యడమే కాకుండా కాంప్లికేషన్స్‌ను నివారించడం, ఉన్నవారిలో కాంప్లికేషన్స్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. హోమియోపతి అనగానే డయాబెటిస్‌కి యాసిడ్ ఫాస్, యురేనియమ్ నైట్ వంటి మందులే ఉన్నాయని అనుకుంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. జన్యుపరమైన, మానసికపరమైన కారణాలను పరిగణిస్తూ, వ్యక్తిగత లక్షణాలపై కేంద్రీకరిస్తూ ఇచ్చే కాన్స్టిట్యూషనల్ రెమెడీ ద్వారా రోగికి చక్కని ఫలితం లభిస్తుంది. సరియైన మందును, సరిపడే మోతాదులో నిర్ణీతకాలం దాకా వాడితే. 1. రోగుల్లో ఇన్సులిన్ డోసేజ్ని తక్కువ చేయడం 2. రోగుల్లో యాంటీ హైరప్గ్లైసిమిక్ డ్రగ్స్ మోతాదుని క్రమంగా తక్కువ చేయడం, పూర్తిగా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. హోమియోపతి మందుల ద్వారా డయాబెటిక్ బాధితులు ఆరోగ్యమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. నా పేరు రాములు, నేను ఆటోమొబైల్ కంపెనీలో ఫోర్ ఇన్‌ఛార్జ్‌గా చేస్తాను. నేను చాలా సంవత్సరాలపాటు డయాబెటిస్తో బాధపడ్డాను. విపరీతమైన ఆకలి, దాహం, నీరసం మొదలైన సమస్యలతో ఎంతో సతమతమయ్యేవాడిని. ఎన్నోరకాల మందులు, వ్యాయామాలు, డైటింగ్, వాకింగ్ ఎన్నో చేశాను. కాని ఫలితం కన్పించలేదు. హోమియోపతి మందుల వల్ల డయాబెటిస్ కంట్రోల్‌కి వస్తుందని ఎంతోమంది చెబితే విని పాజిటివ్ హోమియోపతికి వెళ్ళాను. వీరిచ్చిన ట్రీట్మెంట్ వలన, సలహాల వలన ఇప్పుడు నా డయాబెటిస్ చాలా కంట్రోల్కొచ్చింది. నా సంతోషానికి కారణమైన పాజిటివ్ హోమియోపతికి చాలా థ్యాంక్స్. హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922 -
యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువగా పోతోంది... బాబుకు కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉందా?
మా బాబుకు ఐదేళ్లు. వాడికి ఇటీవల రెండుమూడు సార్లు జ్వరం వచ్చింది. మందులు ఇచ్చిన వెంటనే తగ్గింది. ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అయితే డాక్టర్‌గారు అతడికి మూత్రంలో ఇన్ఫెక్షన్ అని చెప్పారు. మా బాబు కొద్దిగా నీరసంగా కూడా ఉన్నాడు. ఇటీవల మూత్రపరీక్ష చేయిస్తే అతడికి యూరిన్‌లో కొద్దిగా ప్రోటీన్స్ పోతున్నట్లుగా రిపోర్టు వచ్చింది. మా దూరపు బంధువుల్లో ఒకరికి కిడ్నీ రుగ్మత ఉంది. ఆయనకు కూడా ఇలాగే ప్రోటీన్స్ పోతుంటాయి. దాంతో మావాడి విషయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇదేమైనా మావాడికి రాబోయే కిడ్నీ రుగ్మతకు సూచనా? దయచేసి వివరంగా చెప్పండి. - అవనిజ, నిజామాబాద్ మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి మీ అబ్బాయికి రెండుమూడు సార్లు మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం, అలాగే ఇటీవలికాలంలో మీ అబ్బాయికి మూత్రంలో ప్రోటీన్ పోవడం (ప్రోటీన్ యూరియా) ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. పిల్లల్లో పదిశాతం మందిలో ఎనిమిది, పదిహేనేళ్ల మధ్యవారిలో జీవితకాలంలోని ఏదో సమయంలో ఇలా మూత్రంలో ప్రోటీన్ పోవడం అన్నది చాలా సాధారణమైన విషయం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే... ఇలా పోతున్న ప్రోటీన్ అన్నది కిడ్నీకి సంబంధించినదా లేక తాత్కాలికంగా నష్టపోతున్నదా లేదా ఇతరత్రా హానికరం కాని కారణాల వల్ల పోతున్నదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు, అధికంగా వ్యాయామం చేసినప్పుడు, జలుబు చేసినప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, తాము ఉన్న స్థితి నుంచి మారడం (పొజిషనల్ వేరియేషన్) వంటి సాధారణమైన కారణాలు మొదలుకొని కిడ్నీజబ్బులు, ట్యూబ్యులార్ డిసీజెస్, పాలిసిస్టిక్ కిడ్నీ, రిఫ్లక్స్ నెఫ్రోపతి వంటి తీవ్రమైన, దీర్ఘకాలిక జబ్బుల వరకు ప్రోటీన్ పోవడం సంభవించవచ్చు. ప్రోటీన్ పోవడంలోని తీవ్రత ఆధారంగానే పేషెంట్ విషయంలో భవిష్యత్తులో తీసుకో వలసిన చర్యలను నిర్ణయించడం జరుగుతుంది. పిల్లల్లో యూరిన్‌లో ప్రోటీన్ పోవడంలోని తీవ్రత - నిత్యం, గుర్తించేంత మోతాదులో అంటే కన్సిస్టెంట్గా, సిగ్నిఫికెంట్‌గా పోతుంటే అప్పుడది ఏదైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులకు దారితీసే కండిషన్స్‌కు సూచికా అని తెలుసుకోవడం ముఖ్యం. అలాగే కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మూత్రంలో ప్రోటీన్స్ చాలా తక్కువ మోతాదులో పోతుంటాయి. దీన్నే మైక్రో ఆల్బ్యుమిన్ యూరియా అంటారు. ఈ అంశంలో తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్, 24గంటల్లో మూత్ర విసర్జన పరిమాణం, ఇమ్యునలాజికల్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ వంటి మరిన్ని అదనపు పరీక్షలు చేయించాలి. అవసరమైతే కిడ్నీ బయాప్సీ మొదలైన పరీక్షల ద్వారానే ఇదేమైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణమా అని తెలుసుకోవచ్చు. ఇక మీ అబ్బాయి విషయానికి వస్తే రెండు మూడు సార్లు జ్వరం తప్ప మరే ఇతర లక్షణాలూ కనిపించలేదు కాబట్టి అతడి విషయంలో కనిపిస్తున్న ప్రోటీన్ పోవడం అన్నది తీవ్రమైన, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణం కాకపోవచ్చు. అయినా మీ బంధువుల్లో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని రాశారు కాబట్టి పైన పేర్కొన్న పరీక్షలు చేయించడం వల్ల మీ అబ్బాయి సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉంది. మీరేమీ ఆందోళన చెందకుండా మీ అబ్బాయికి సంబంధించిన యూరిన్ టెస్ట్ రిపోర్టులు, ప్రోటీన్ పోతున్న రిపోర్టులతో మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు నెఫ్రాలజిస్టును కలిసి తగు సలహా తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటోంది..?
నా వయసు 35. ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటుంది. భోజనం చేసిన వెంటనే పుల్లలతో కుట్టుకుంటే తప్ప తృప్తిగా ఉండదు. పళ్ల మధ్య ఏర్పడిన జాగాలో ఫిల్లింగ్ చేయించవచ్చంటారా? సలహా ఇవ్వండి. - పరమేశ్, హైదరాబాద్ ఇది చాలామంది సమస్య. మనం ఏ హోటల్‌కెళ్లినా బిల్లుతోబాటు టూత్‌పిక్స్ కూడా ఇవ్వడం పరిపాటి. ప్రతి పదిమందిలో ఎనిమిదిమంది పుల్లలతో పళ్లసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం చూస్తుంటాం. అందరి దృష్టిలో ఇది సాధారణమైన పనే. ఇదేదో సాధారణమైన పనే అనే భావన అందరిలోనూ ఉంది. కాని, ఎవరైతే ఇలా టూత్‌పిక్ వాడాల్సి వస్తోందో, వీళ్లందరికీ కూడా చిగుళ్ల జబ్బులున్నట్టు లెక్క. ఏదోరకమైన చిగుళ్ల జబ్బు లేదా ఇన్ఫెక్షన్ వల్ల రెండు పళ్లమధ్య సందుల్లో ఉన్న చిగుళ్లు కిందకు జారిపోతాయి. దాంతో ఆహారం అక్కడికి చేరుతుంది. దాంతో అసౌకర్యంగా ఉండి అలా పళ్లు కుట్టుకుంటుంటారు. పుల్లలతో కానీ, పిన్నులతో కానీ పూర్తిస్థాయిలో క్లీన్ చేసుకోవడం సాధ్యం కాదు. ఇలా చేయడం మంచిది కూడా కాదు. అలాగే ఇట్లా కుట్టుకుంటున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం కూడా చూస్తుంటాం. అలా ఇరుక్కున్న ఆహారాన్ని తీసేటప్పుడు మనకు తెలీకుండానే సగం చిగుళ్ల లోపలికి తోసేస్తుంటాం. దాంతో ఇన్ఫెక్షన్లు పెరిగి, సమస్య మరింత తీవ్రమవుతుంటుంది. అలాంటప్పుడు తగిన చికిత్స చేయించుకోవడం ఒకటే మార్గం. చిత్రం ఏమిటంటే... పుల్లలతో కుట్టుకుంటున్న వారిని వారికి చిగుళ్ల జబ్బు ఉందంటే ఒప్పుకోరు. కారణం వారికి ఎటువంటి నొప్పి, బాధ లేకపోవడమే. డెంటిస్ట్‌ని కలిస్తే ఎక్స్‌రే తీసి చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఎంతుందో చూసి, ప్రత్యేకమైన చిగుళ్ల చికిత్స చేయడం ద్వారా సమస్యను దూరం చేస్తారు. సందులు కనుక మరీ పెద్దవిగా ఉంటే పంటికి తొడుగులు వేయడం ద్వారా కూడా సందును మూసేస్తారు. రెండు పళ్లమధ్య చేరుకున్న ఆహారాన్ని శుభ్రం చేసుకోవడానికి డెంటల్ ఫ్లాస్ అనబడే సన్నటి నైలాన్ దారాన్ని వాడాలి. ఇది అన్ని మెడికల్ షాపుల్లోనూ, సూపర్ బజార్లలో కూడా దొరుకుతుంది. భోజనం చేసిన తర్వాత ఈ డెంటల్ ఫ్లాస్ అన బడే దారాన్ని రెండు చేతుల వేళ్లతో పళ్లమధ్య పోనిచ్చి ఇటు, అటు లాగుతూ శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా మొత్తం పాచిని, ఆహారపదార్థాలను ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ లేకుండా చూసుకోవచ్చు. ఈ డెంటల్ ఫ్లాస్ సుమారు 5-6 మీటర్ల దూరం చిన్న బాక్స్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. ఎంతవరకైతే ఈ దారాన్ని వాడతామో, దాన్ని తుంచేసి, మిగిలిన దానిని తర్వాత వాడుకోవచ్చు. మీ పళ్లమధ్య సందులని డాక్టర్‌తో పరీక్ష చేయించుకుని, డెంటిస్ట్ సూచనల మేరకు చిగుళ్ల చికిత్స చేయించుకోవడం, సందును పూడ్చడానికి ఫిల్లింగ్ లేదా క్యాప్ చేయించడం ద్వారా మీ సమస్య నుంచి బయట పడవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
తరచూ తలనొప్పి, జలుబు, దగ్గు..!
మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. తరచు తలనొప్పి, జలుబు, దగ్గు వస్తున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గినా, మళ్లీ మామూలే. ఇలా తరచు తలనొప్పి ఎందుకు వస్తోందో తెలియడం లేదు. అలాగే చదువు ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటోందంటున్నాడు. మా బాబుకు ఉన్న సమస్య ఏమిటి? వాడి విషయంలో మేమేం చేయాలి? - సుదర్శన్, వరంగల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి తలనొప్పి కాస్త తీవ్రంగానే వస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలలో తలనొప్పికి ముఖ్యంగా సైనస్ ఇన్ఫ్లమేషన్ (సైనసైటిస్), కళ్లకు సంబంధించిన సమస్యలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్), వాస్క్యులార్ సమస్యలు (మైగ్రేన్), స్ట్రెస్ ఇండ్యూస్డ్ తలనొప్పి వంటి మానసిక సమస్యలు, కొన్ని న్యూరలాజికల్ సమస్యలను కారణాలుగా చెప్పవచ్చు. అయితే మీరు చెప్పిన లక్షణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సమీక్షించి చూస్తే మీ వాడికి రైనోసైనసైటిస్ అనే సమస్య ఉన్నట్లు చెప్పవచ్చు. దీన్ని సాధారణంగా ఏడేళ్లు పైబడిన పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇది అలర్జీ టెండెన్సీ (అలర్జిక్ రైనైటిస్) ఉన్నవారిలో లేదా తరచూ ఏదైనా కారణాల వల్ల శ్వాసనాళం పైభాగం (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్)లో ఇన్ఫెక్షన్ వచ్చే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ పిల్లల్లో నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ వాడిన సమయాల్లో తలనొప్పి కొద్దిగా తగ్గడం, ఆ తర్వాత మళ్లీ తిరగబెట్టడం చూస్తుంటాం. దీనికి కారణం తల ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్ స్పేసెస్‌లో ఇన్ఫెక్షన్ రావడంతో పాటు, ఆ ప్రదేశంలోని స్రావాలు చక్కగా ప్రవహించకపోవడం వల్ల ఇలాంటి పిల్లల్లో తలనొప్పి, తలభారంగా ఉండటం, ముక్కుదిబ్బడ, ముఖంలోని కొన్ని భాగాల్లో వాపు, దీర్ఘకాలం పాటు దగ్గు చూస్తుంటాం. శ్వాసనాళం పైభాగం (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్)లో ఇన్ఫెక్షన్, కాలుష్యం, పొగ, అడినాయిడ్ గ్రంథులు పెద్దవి కావడం, ముక్కుకు సంబంధించి నిర్మాణపరమైన మార్పులు (అనటామికల్ ఛేంజెస్ ఇన్ నోస్), డీఎన్ఎస్, ముక్కులో కండ పెరగడం (నేసల్ పాలిప్స్), కడుపులో స్రావాలు పైకి తన్నడం (జీఈఆర్డీ), ఈత వంటి అనేక ప్రేరేపించే కారణాల (ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్) వల్ల సైనస్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువవుతూ ఉంటుంది. సైనస్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అన్నది పీఎన్ఎస్ సీటీ స్కాన్ అనే పరీక్షతో కచ్చితంగా గుర్తించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ముక్కులో వేసే చుక్కలమందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీ హిస్టమైన్స్, స్టెరాయిడ్ నేసల్ స్ప్రే, కచ్చితమైన యాంటీబయాటిక్ థెరపీ (కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు), ఆవిరి పట్టడం (స్టీమ్ ఇన్హలేషన్) ద్వారా తప్పనిసరిగా వ్యాధి తీవ్రతను, వ్యాధి తరచూ తిరగబెట్టడాన్ని (ఫ్రీక్వెన్సీని) తగ్గించవచ్చు. అలాగే దీర్ఘకాలికంగా (క్రానిక్ సైనసైటిస్) కాంప్లికేషన్స్ వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స (సర్జికల్ ఇంటర్వెన్షన్) ద్వారా... ముఖ్యంగా ఎండోస్కోపిక్ ఎన్‌లార్జ్‌మెంట్ ఆఫ్ మియటల్ ఓపెనింగ్ వల్ల, అలాగే కొన్నిసార్లు ముక్కుకు సంబంధించిన నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ డిఫెక్ట్స్)ను చక్కదిద్దడం ద్వారా ఈ సమస్య నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. దాదాపు 40 శాతం కేసుల్లో అక్యూట్ సైనసైటిస్‌లు వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు మీ బాబు విషయంలో తలనొప్పికి ఇతర కారణాలేమీ లేవని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక పిల్లలకు చదువుల ఒత్తిడి కూడా తలనొప్పికి ఒక కారణం కాబట్టి వాళ్లకు కొద్దిపాటి నాణ్యమైన రిలాక్సేషన్ టైమ్ ఇచ్చి ఆ సమయంలో వాళ్లకు ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అందువల్ల టెన్షన్ సంబంధిత తలనొప్పులు తగ్గుతాయి. మీరు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుని మరోసారి మీ పిల్లల వైద్యుడితో చర్చించి మీ బాబుకు తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
సోరియాసిస్‌కు హోమియోలో పరిష్కారం
సోరియాసిస్ వ్యాధిగ్రస్తులలో చర్మంపై దురదతో కూడిన వెండి రంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవ్వవచ్చు... ఎందుకు వస్తుంది? వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం. వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మన శరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్తకణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఇవి సొంత కణజాలాన్నే దెబ్బదీస్తాయి. సోరియాసిన్ - వంశపారంపర్యత కొన్ని కుటుంబాలలో సోరియాసిన్ ఆనువంశికంగా వస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ప్రభావం: సోరియాసిస్‌ను ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణప్రమాదం జరుగదు. కాని వ్యాధి తీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధితీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో అలా వికటించిన వ్యాధినిరోధకశక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్ఫ్లమేటీ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్, రక్తపోటుకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. సోరియాసిస్‌లో రకాలు సోరియాసిన్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి 5 రకాలుగా వర్గీకరించారు. ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్‌లో ఎక్కువగా కనిపించే రకం ఎర్రని మచ్చలుగా మొదలయి పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం. ఎఠ్ట్ట్చ్ట్చ సోరియాసిస్: ఇది ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకుల్లా కనిపిస్తాయి. వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారు అవుతాయి. ఇన్వర్సివ్ సోరియాసిన్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి. Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రని వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి. సోరియాసిస్‌ను తీవ్రం చేసే అంశాలు: 1. చల్లని పొడి వాతావరణం 2. మానసిక ఒత్తిడి. 3. కొన్ని రకాల మందులు (మలేరియా మందులు, లితేలయ, బీటా, బ్లాకర్స్, మాంటి) 4. ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర వ్యాధులు. 5. అలవాట్లు 6. హార్మోన్ తేడాలు 7. ఆహార పదార్థాలు-ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం. కాన్స్టిట్యూషన్ పద్దతిలో సోరియాసిస్ నివారణ గురించి తెలుసుకుందాం కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం.తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలి అనేది ముఖ్యం. మైనమ్ (సోరిక్, సైకోటిక్, సిఫిలిటిక్)ను బట్టి పొటెన్సీనీ నిర్ణయించి మందులు ఇవ్వబడతాయి. కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిన్ నుండి తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అస్సలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలం నిర్థారించబడుతుంది. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922